రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి | 5 People Were killed In Russia Bus Accident | Sakshi
Sakshi News home page

Bus Accident: రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి

Published Sun, Jan 2 2022 2:25 PM | Last Updated on Sun, Jan 2 2022 2:33 PM

5 People Were killed In Russia Bus Accident - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Five dead, 21 injured in bus accident south of Moscow: రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 21 మంది గాయపడినట్లు రష్యా అధికారులు తెలిపారు. మాస్కోకు దక్షిణంగా 270 కిలోమీటర్ల (170 మైళ్లు) దూరంలో వోస్లెబోవో గ్రామ సమీపంలోని హైవేపై ఈ ప్రమాదం జరిగిందని రష్యా ఫెడరల్ రోడ్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్షన్ ఏజెన్సీ తెలిపింది.

(చదవండి: స్త్రీని బాధపెట్టడం అంటే దేవుడిని అవమానించడమే)

పైగా భారత కాలమానం ప్రకారం తెల్లవారుఝామున 5.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఏజెన్సీ పేర్కొంది. అయితే బస్సు రోడ్డు కమ్‌ రైల్వే బ్రిడ్జ్‌ పై ఉన్న పిల్లర్‌ని ఢీ కొట్టి ఉండవచ్చని ఏజెన్సీ తెలిపింది. అంతేకాదు ఈ బస్సులో మొత్తం 49 మంద ప్రయాణికులు ఉన్నారని అధికారులు అన్నారు. ఈ మేరకు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

(చదవండి:  అఫ్గాన్‌ వాసులకు ప్రాణాలను కాపాడే గొప్ప బహుమతిని ఇచ్చిన భారత్‌!!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement