Railroad
-
రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి
Five dead, 21 injured in bus accident south of Moscow: రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 21 మంది గాయపడినట్లు రష్యా అధికారులు తెలిపారు. మాస్కోకు దక్షిణంగా 270 కిలోమీటర్ల (170 మైళ్లు) దూరంలో వోస్లెబోవో గ్రామ సమీపంలోని హైవేపై ఈ ప్రమాదం జరిగిందని రష్యా ఫెడరల్ రోడ్ ట్రాఫిక్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ తెలిపింది. (చదవండి: స్త్రీని బాధపెట్టడం అంటే దేవుడిని అవమానించడమే) పైగా భారత కాలమానం ప్రకారం తెల్లవారుఝామున 5.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఏజెన్సీ పేర్కొంది. అయితే బస్సు రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ పై ఉన్న పిల్లర్ని ఢీ కొట్టి ఉండవచ్చని ఏజెన్సీ తెలిపింది. అంతేకాదు ఈ బస్సులో మొత్తం 49 మంద ప్రయాణికులు ఉన్నారని అధికారులు అన్నారు. ఈ మేరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: అఫ్గాన్ వాసులకు ప్రాణాలను కాపాడే గొప్ప బహుమతిని ఇచ్చిన భారత్!!) -
మళ్లీ ఎక్కడికో..!
పునరావాస కాలనీల్లోంచే రైలుమార్గం ఆందోళనలో చింతలఠాణా, చీర్లవంచ, శివపార్వతులకాలనీవాసులు మళ్లీరోడ్డున పడనున్న 200కు పైగా కుటుంబాలు కొత్తపల్లి–మనోహారాబాద్ రైలుమార్గం తెచ్చిన తంటా మధ్యమానేరు ప్రాజెక్టు కోసం ఎవుసం పొలాలు వదిలి పెట్టారు.. పాడిగేదెలను కాదనుకున్నారు.. ఎండ, వాన, చలి నుంచి కాపాడిన గూడును విడ్చిపెట్టారు.. పెంచుకున్న అనుబంధాన్ని పక్కనబెట్టారు.. ప్రాజెక్టు కడితే తమలాంటోళ్లు లక్షలాదిమంది బాగుపడుతారని సర్వం ధారపోశారు.. పాలకుల మాటలు నమ్మి.. అధికారులు చెప్పినట్లు తలూపారు.. ఉన్న ఊరును ఖాళీ చేసి పునరావాసకాలనీల్లో తలదాచుకునేందుకు వచ్చారు.. ఇక్కడా విధి వక్రీకరించింది. కొత్తపల్లి– మనోహరాబాద్ రైలు మార్గం నిర్మాణం ద్వారా వారు మళ్లీ నిర్వాసితులు కాబోతున్నారని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు. చింతలఠాణా, చీర్లవంచ, శివపార్వతులకాలనీ పునరావాస ప్రాంతాల్లోంచే రైలుమార్గం నిర్మించేందుకు అధికారులు సర్వే ప్రారంభించడం వారిలో గుబులు రేపుతోంది. – వేములవాడ రూరల్