పునరావాస కాలనీల్లోంచే రైలుమార్గం
ఆందోళనలో చింతలఠాణా, చీర్లవంచ, శివపార్వతులకాలనీవాసులు
మళ్లీరోడ్డున పడనున్న 200కు పైగా కుటుంబాలు
కొత్తపల్లి–మనోహారాబాద్ రైలుమార్గం తెచ్చిన తంటా
మధ్యమానేరు ప్రాజెక్టు కోసం ఎవుసం పొలాలు వదిలి పెట్టారు.. పాడిగేదెలను కాదనుకున్నారు.. ఎండ, వాన, చలి నుంచి కాపాడిన గూడును విడ్చిపెట్టారు.. పెంచుకున్న అనుబంధాన్ని పక్కనబెట్టారు.. ప్రాజెక్టు కడితే తమలాంటోళ్లు లక్షలాదిమంది బాగుపడుతారని సర్వం ధారపోశారు.. పాలకుల మాటలు నమ్మి.. అధికారులు చెప్పినట్లు తలూపారు.. ఉన్న ఊరును ఖాళీ చేసి పునరావాసకాలనీల్లో తలదాచుకునేందుకు వచ్చారు.. ఇక్కడా విధి వక్రీకరించింది.
కొత్తపల్లి– మనోహరాబాద్ రైలు మార్గం నిర్మాణం ద్వారా వారు మళ్లీ నిర్వాసితులు కాబోతున్నారని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు. చింతలఠాణా, చీర్లవంచ, శివపార్వతులకాలనీ పునరావాస ప్రాంతాల్లోంచే రైలుమార్గం నిర్మించేందుకు అధికారులు సర్వే ప్రారంభించడం వారిలో గుబులు రేపుతోంది. – వేములవాడ రూరల్
మళ్లీ ఎక్కడికో..!
Published Sat, Dec 31 2016 3:30 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM
Advertisement