‘సింగూరు’ కళకళ...‘సాగర్’ వెలవెల
-
సింగూర్ ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో
-
డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం
నిజాంసాగర్:
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు తప్ప మిగితా ప్రధాన జలాశయాలు వరదనీటì తో కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్టులోకి శుక్రవారం 21 వేల క్యూ సెక్కుల వరద నీ రు వచ్చిచేరుతోంది. నాలుగు రోజుల నుంచి కుండపోతగా కురిసిన వర్షాలకు వరదనీటి ఉధృతి మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో సింగూరు జలాశయంలో జళకళ సంతరించు కుంటోంది.
డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం
నిజాంసాగర్ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూరు ప్రాజెక్టు నీటి మట్టం డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరింది. వేసవి కాలం ముగింపు, వర్షాకాలం ఆరంభం నాటికి సింగూరు ప్రాజెక్టులో 1.5 టీఎంసీలతో డెడ్‌స్టోరేజీ నీరు నిల్వ ఉంది. కాగా ఇటీవల వర్షాకాలంలో కురిసిన వర్షానికి సింగూరు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 7.5 టీఎంసీల నీరు వచ్చిచేరింది. ప్రస్తుతం 21 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరగ నుంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్తాయి నీటిమట్టం 525.2 మీటర్లకు గాను 29 టీఎంసీలకు గాను ప్రస్తుతం 517.5 మీటర్లతో 8.5 టీఎంసీల నీరు చేరింది.
‘సాగర్’ వెల వెల
జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు చేరకపోవడంతో డెడ్‌స్టోరేజీతో వెలవెలబోయింది. ప్రాజెక్టుకు ఎగువన క్యాచ్‌మెంట్ ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నా వాగులు, వంకల్లో నీటి నిల్వలు చేరుకున్నాయి. కాగా ప్రాజెక్టులోకి స్వల్పంగా వరదనీరు వస్తున్నా డెడ్ స్టోరేజీకి దిగువన పడిపోయిన నీటిమట్టం
పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాజెక్టు ఎగువన మెదక్ జిల్లాలోని పాపన్నపేట, శంకరంపేట, మండలాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి చేరుతున్న తరుణంలో వర్షాలు నిలిచిపోవ డంతో వరదలకు బ్రేకులు పడ్డాయి.