The water level
-
‘సింగూరు’ కళకళ...‘సాగర్’ వెలవెల
సింగూర్ ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు తప్ప మిగితా ప్రధాన జలాశయాలు వరదనీటì తో కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్టులోకి శుక్రవారం 21 వేల క్యూ సెక్కుల వరద నీ రు వచ్చిచేరుతోంది. నాలుగు రోజుల నుంచి కుండపోతగా కురిసిన వర్షాలకు వరదనీటి ఉధృతి మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో సింగూరు జలాశయంలో జళకళ సంతరించు కుంటోంది. డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూరు ప్రాజెక్టు నీటి మట్టం డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరింది. వేసవి కాలం ముగింపు, వర్షాకాలం ఆరంభం నాటికి సింగూరు ప్రాజెక్టులో 1.5 టీఎంసీలతో డెడ్‌స్టోరేజీ నీరు నిల్వ ఉంది. కాగా ఇటీవల వర్షాకాలంలో కురిసిన వర్షానికి సింగూరు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 7.5 టీఎంసీల నీరు వచ్చిచేరింది. ప్రస్తుతం 21 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరగ నుంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్తాయి నీటిమట్టం 525.2 మీటర్లకు గాను 29 టీఎంసీలకు గాను ప్రస్తుతం 517.5 మీటర్లతో 8.5 టీఎంసీల నీరు చేరింది. ‘సాగర్’ వెల వెల జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు చేరకపోవడంతో డెడ్స్టోరేజీతో వెలవెలబోయింది. ప్రాజెక్టుకు ఎగువన క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నా వాగులు, వంకల్లో నీటి నిల్వలు చేరుకున్నాయి. కాగా ప్రాజెక్టులోకి స్వల్పంగా వరదనీరు వస్తున్నా డెడ్ స్టోరేజీకి దిగువన పడిపోయిన నీటిమట్టం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాజెక్టు ఎగువన మెదక్ జిల్లాలోని పాపన్నపేట, శంకరంపేట, మండలాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి చేరుతున్న తరుణంలో వర్షాలు నిలిచిపోవ డంతో వరదలకు బ్రేకులు పడ్డాయి. -
‘సింగూరు’ కళకళ...‘సాగర్’ వెలవెల
సింగూర్ ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు తప్ప మిగితా ప్రధాన జలాశయాలు వరదనీటì తో కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్టులోకి శుక్రవారం 21 వేల క్యూ సెక్కుల వరద నీ రు వచ్చిచేరుతోంది. నాలుగు రోజుల నుంచి కుండపోతగా కురిసిన వర్షాలకు వరదనీటి ఉధృతి మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో సింగూరు జలాశయంలో జళకళ సంతరించు కుంటోంది. డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూరు ప్రాజెక్టు నీటి మట్టం డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరింది. వేసవి కాలం ముగింపు, వర్షాకాలం ఆరంభం నాటికి సింగూరు ప్రాజెక్టులో 1.5 టీఎంసీలతో డెడ్‌స్టోరేజీ నీరు నిల్వ ఉంది. కాగా ఇటీవల వర్షాకాలంలో కురిసిన వర్షానికి సింగూరు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 7.5 టీఎంసీల నీరు వచ్చిచేరింది. ప్రస్తుతం 21 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరగ నుంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్తాయి నీటిమట్టం 525.2 మీటర్లకు గాను 29 టీఎంసీలకు గాను ప్రస్తుతం 517.5 మీటర్లతో 8.5 టీఎంసీల నీరు చేరింది. ‘సాగర్’ వెల వెల జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు చేరకపోవడంతో డెడ్స్టోరేజీతో వెలవెలబోయింది. ప్రాజెక్టుకు ఎగువన క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నా వాగులు, వంకల్లో నీటి నిల్వలు చేరుకున్నాయి. కాగా ప్రాజెక్టులోకి స్వల్పంగా వరదనీరు వస్తున్నా డెడ్ స్టోరేజీకి దిగువన పడిపోయిన నీటిమట్టం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాజెక్టు ఎగువన మెదక్ జిల్లాలోని పాపన్నపేట, శంకరంపేట, మండలాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి చేరుతున్న తరుణంలో వర్షాలు నిలిచిపోవ డంతో వరదలకు బ్రేకులు పడ్డాయి. -
తుంగభద్ర డ్యాంలో పెరుగుతున్న నీటిమట్టం
60 టీఎంసీలకు చేరిన నీటినిల్వ బళ్లారి : తుంగభద్ర డ్యాంలో నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతోంది. శుక్రవారం డ్యాంలో నీటి నిల్వ 60 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల డ్యాంకు నది ద్వారా 23,603 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. గురువారంతో పోల్చితే డ్యాంలోకి వస్తున ్న ఇన్‌ఫ్లో తగ్గినప్పటికీ డ్యాంలో ఆయకట్టు కాలువలకు నీరు వదిలేందుకు తగినంత నీటి నిల్వ పెరుగుతుండటంతో రెండు రాష్ట్రాలకు చెందిన రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్దం అవుతున్నారు. హెచ్ఎల్సీ కాలువకు కూడా శుక్రవారం నీరు విడుదల చేయడంతో బళ్లారి, అనంతపురం జిల్లాలకు చెందిన ఆయకట్టు రైతులతో పాటు పలు గ్రామాలు, పట్టణాల ప్రజలకు తాగునీటి కష్టాలు కూడా తీరనున్నాయని చెప్పవచ్చు. డ్యాంలో ప్రస్తుతం 60 టీఎంసీల మేర నీరు నిల్వ చేరడంతో మరో 40 టీఎంసీల నీరు చేరితే డ్యాం పూర్తి స్థాయిలో నిండుతుంది. డ్యాం నీటి నిల్వ సామర్ధ్యం 100 టీఎంసీలు కావడంతో తుంగభద్రకు మళ్లీ ఇన్‌ఫ్లో పెరిగితే త్వరలో డ్యాం నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం డ్యాంలో 1620.47 అడుగుల నీటిమట్టం ఉండగా, 59.507 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యాంలో 1607.34 అడుగుల నీటిమట్టం ఉండగా, 51.331 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 51818 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2333 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉండేదని బోర్డు అధికారులు పేర్కొన్నారు. -
గోదావరిలో ‘కౌట‘ వద్ద అడ్డుకట్ట
బాసర, కందకుర్తిల వద్ద గోదావరి నీటి మట్టం పెంచే ప్రయత్నం సర్వే చేసిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పుష్కరాలకు ఆరు రోజులే గడువు {పత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి ఆదిలాబాద్: గోదావరి పుష్కరాలకు కేవలం ఆరు రోజులే గడువుంది. కానీ, వరుణుడి జాడ లేకపోవడం.. మహారాష్ట్ర ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం కౌట గ్రామం వద్ద గోదావరి నదిలో రాళ్లు, మట్టితో కలిపి అడ్డుకట్ట కట్టాలని యోచిస్తున్నారు. అడ్డుకట్ట నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మంగళవారం నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శంకర్ నేతృత్వంలో అధికారుల బృందం ముథోల్ మండల పరిధిలోని గోదావరి నదిని పరిశీలించింది. కౌట గ్రామం వద్ద గోదావరిలో ఎత్తుగడ్డ వద్ద అడ్డుకట్ట కట్టేందుకు వీలవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు. రాళ్లు, మట్టితో కూడిన మూడు మీటర్ల ఎత్తులో అడ్డుకట్ట కట్టడం ద్వారా బాసరతో పాటు, ఎగువన ఉన్న కొన్ని పుష్కర ఘాట్ల వద్ద నీటి మట్టాన్ని కొంతమేరకు పెంచవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం బాసర వద్ద మోకాళ్ల మట్టుకు నీళ్లున్నాయి. కొన్ని రోజులుగా ఎండల తీవ్రత ముదురుతుండటంతో పుష్కరాల సమయానికి నీటిమట్టం మరింత తగ్గే అవకాశాలున్నాయి. ఈక్రమంలో అడ్డుకట్ట వేయాలనే యోచనలో ఉన్నారు. అడ్డుకట్ట వేసేందుకు సర్వే చేపట్టామని నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ భగవంత్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ కట్ట నిర్మాణంతో బాసరతో పాటు, నిజామాబాద్ జిల్లా కందకుర్తి (త్రివేణి సంగమం) వంటి పుష్కర ఘాట్ల వద్ద నీటిమట్టం కొంత పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. అయితే, గడువు తక్కువగా ఉండడంతో పుష్కరాల లోపు పనులు పూర్తిచేయగలమా.. లేదా అన్నదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. షవర్ల కోసం ఏర్పాట్లు.. నదిలో నీళ్లు లేకపోవడంతో షవర్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. బాసరలోని అన్ని ఘాట్ల వద్ద కలిపి 150 షవర్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ పనులను వేగవంతం చేయాలని భావిస్తున్నారు. అయితే, బాసరలోని ఒక్క వీఐపీ ఘాట్ వద్ద మాత్రమే పైపుల బిగింపు జరిగింది. ఇంకా నల్లాల ఫిట్టింగ్ కాలేదు. మిగిలిన ఘాట్ల వద్ద ఈ మేరకు కూడా పనులు జరగలేదు. ఈనెల 10వ తేదీ వరకు ఈ షవర్ల పనులు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి పేర్కొన్నారు. -
కళ తగ్గిన కృష్ణమ్మ
తాడేపల్లి రూరల్ : కృష్ణానది నీటి మట్టం 12 అడుగులు ఉండాల్సి ఉండగా, ఒక్కసారిగా 8 అడుగులకు తగ్గిపోయింది. అసలే ఎండాకాలం ఆపై రబీ పంట కాలం కావడంతో రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. నదిలో నీరు మరింత తగ్గితే పరిస్థితి ఏంటని భ యాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా నీటి మట్టం తగ్గడంతో రబీ రైతులు ఆలోచనలో పడిపోయారు. ఇప్పటికే మొక్కజొన్న పంటకు ఒక తడి అందించగా, పంట కొంత ఊరట చెందింది. మరో తడి తగిలితే గానీ, పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. 12 అడుగుల నీటి మట్టంతో నిశ్చలంగా ఉండాల్సిన కృష్ణమ్మ తగ్గిపోవడంతో, విద్యుత్ సరఫరాకు సంబంధించి వీటీపీఎస్ సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గుంటూరు,విజయవాడ నగరపాలక సంస్థలకు సైతం ఇక్కడి నుంచే నీటి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం గుంటూరు చానల్ పరిధిలోని 27 గ్రామాలతో పాటు ఒక మున్సిపాలిటీ, ఇతర ప్రాంతాలకు సైతం నీరు నిలిచిపోయింది. పూర్తి స్థాయిలో నీరు అందితేనే మంచినీరు సక్రమంగా దొరకడం లేదు. ఇక ఎండా కాలం కృష్ణానదిలో నిల్వ తగ్గుతుంటే ఆ ప్రాంతాలు చుక్కనీటికి కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఇదిలావుంటే, కొండవీటి వాగుకు బ్యాక్ వాటర్ ప్రతి సంవత్సరం తాడికొండ వరకు వెళుతోంది. ఈ ఏడాది ఉండవల్లి బ్రిడ్జి వరకే పరిమితమైంది. దీంతో ఆ ప్రాంతంలోని కూరగాయల సాగు,పూలతోటలకు ఇబ్బంది ఏర్పడుతోంది.ఇదిలా ఉంటే బకింగ్‌హామ్ కాలువ (మద్రాస్ కాలువ) అనుసంధానంగా ఉండే కాలువలన్నీ అడుగంటాయి. దీంతో రబీ రైతులు నష్ట పోయే ప్రమాదం లేకపోలేదు. -
భారీగా రొయ్యలు, చేపలు లభ్యం
భారీగా రొయ్యలు, చేపలు లభ్యం ఇతర ప్రాంతాలకు జోరుగా రవాణా నాతవరం: తాండవ రిజర్వాయరులో చేపలు, రొయ్యల లభ్యత ఆశాజనకంగా ఉంది. ఇక్కడి చేపలు, రొయ్యలకు గిరాకీ ఉండడంతో మత్స్యకారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది అనుకూల వాతావరణంతో తాండవలో రెండు నెలలుగా చేపలు వేట జోరుగా సాగుతోంది. గత ఏడాది తుపాన్ల సమయంలో రిజర్వాయరులోకి అధికంగా నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం బాగుంది. ఇది చేపలు ఏపుగా పెరగటానికి దోహదపడింది. ప్రస్తుతం అడపాదడపా వర్షలు కురవడంతో అయకట్టు భూములకు నీరు విడుదల చేస్తున్నా రిజర్వాయరులో నీటిమట్టం తగ్గలేదు. నెల రోజులుగా జలాశయంలోకి ఇన్‌ఫ్లో వస్తుండడంతో ఆ ఎర్ర నీటికి రిజర్వాయరు అడుగు భాగాన ఉన్న చేపలు బయటకు వస్తున్నాయి. ఫలితంగా వేటాడుతున్న మత్స్యకారులకు చేపలు ఆశించినంతంగా దొరుకుతున్నాయి. రోజూ తాండవలో 150 పైగా బోట్ల ద్వారా చేపల వేట జరుగుతోంది. ఇక్కడ చేపలకు రంగు రుచి బాగుండడం, ధర కూడా ఇతర మార్కెట్ల కంటే తక్కువగా ఉండడం వల్ల కొనుగోలుదార్లు పోటీపడుతుంటారు. ఇక్కడ దొరికే టైగర్ రొయ్యలు రుచిగా ఉండడంతో గిరాకీ ఉంటుంది. ఇక్కడ నుంచి రోజూ పెద్ద సంఖ్యలో వాహనాల్లో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు రవాణా చేస్తున్నారు. కొందరు బడా వ్యాపారులు ఇక్కడ మత్యకారులకు ముందుగా పెట్టుబడి పెట్టి వారి ద్వారా వేటాడించి చేపలు రొయ్యలు కొనుగోలు చేసి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అధిక ధరలకు విక్రయిస్తారు. ఈ ఏడాది తాండవ రిజర్వాయరులో పెద్ద చేపలు కూడా బాగా లభిస్తున్నాయి. ఈ రిజర్వాయరులో చేపలు, రొయ్యలు ఊహించని విధంగా లభ్యం కావడం, ధర కూడా బాగుండడంతో మత్స్యకారులు ఆనంద పరవశులవుతున్నారు. -
నిండు కుండలా జలాశయాలు
తగ్గిన వరద ఉధృతి.. పెరిగిన సందర్శకుల తాకిడి తెరుచుకోని గేట్లు సాక్షి,సిటీబ్యూరో,రాజేంద్రనగర్/మణికొండ: కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరడంతో నిండు కుండలా తొణికిస లాడుతున్న హిమాయత్‌సాగర్ జలాశయానికి సోమవారం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజులుగా నిత్యం 11,500 క్యూసెక్కుల వరదనీరు జలాశయంలోకి చేరగా.. సోమవారం వరద ప్రవాహం 1100 క్యూసెక్కులకు తగ్గిందని జలమండలి ట్రాన్స్మిషన్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ విజయ్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తాండూరు, పరిగి ప్రాంతాల్లో వర్షపాతం తగ్గడంతోనే వరద తగ్గిందని చెప్పారు. దీంతో గేట్లు ఎత్తాలన్న యోచనను విరమించుకున్నామన్నారు. ఈసీ వాగు నీటి చేరికతో సాగర్ నీటిమట్టం 11 అడుగుల మేర పెరిగిందని తెలిపారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 1763.500 అడుగులకు గాను సోమవారం నాటికి 1755 అడుగులకు చేరిందన్నారు. గండిపేట్‌కు మూడు అడుగులు.. ఉస్మాన్‌సాగర్ (గండిపేట్) జలాశయం గరిష్ట నీటి మట్టం 1790 అడుగులకు కాగా, సోమవారం నాటికి 1772 అడుగులకు చేరింది. మూడు రోజులుగా ఈ జలాశయంలో మూసీ వాగు నీరు చేరుతుండటంతో నీటి మట్టం మూడు అడుగుల మేర పెరిగింది. చేవేళ్ల, వికారాబాద్ పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో ఈ జలాశయానికి వరద అంతగా లేదు. కాగా గండిపేట్ జలాశయం ఎగువన అక్రమార్కులు ఇసుక ఫిల్టర్ల ఏర్పాటు, కందకాలు తవ్వడం, ఫాంహౌస్‌లు, కళాశాలల రక్షణ గోడలు ఏర్పాటు కారణంగా వరద ఉధృతి తగ్గినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సింగూరు, మంజీరాకూ జలకళ కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న మెదక్ జిల్లాలోని సింగూరు, మంజీరా జలాశయాలు సైతం జలకళ సంతరించుకున్నాయి. గ తేడాదితో పోలిస్తే జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా పెరిగాయి. సింగూరులో 1717.932 అడుగులకు గాను సోమవారం నాటికి 1703.167 అడుగుల మేర నీరు చేరింది. మంజీరా గరిష్ట మట్టం 1651.750 అడుగులకు గాను 1646.400 అడుగుల మేర నిల్వలున్నాయి. అక్కంపల్లి (కృష్ణా) జలాశయంలో 245 మీటర్ల గరిష్ట మట్టానికి 243.100 మీటర్ల మేర నిల్వలున్నాయి. నాగార్జున సాగర్ (నల్లగొండ) జలాశయంలో 590 అడుగుల నీటి మట్టానికి 552.700 అడుగుల మేర ఉన్నాయని జలమండలి తెలిపింది. భారీగా పెరిగిన సందర్శకులు జంట జలాశయాల గేట్లు తెరుస్తారన్న సమాచారంతో సోమవారం జంట నగరాల నుంచి భారీగా సందర్శకులు తరలి వచ్చారు. నిండు కుండల్లా మారిన జలాశయాల వద్ద సోమవారం ఆట విడుపుతో సందడి చేశారు. హిమాయత్ సాగర్‌లో సందర్శకులు పెరగటంతో కట్టపైకి వాహనాలను అనుమతించకుండా గేట్ల వద్దనే నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నడుచుకుంటూ వెళ్లి జలాశయం అందాలను వీక్షించారు. -
శ్రీశైలంలో పూర్తి స్థాయి విద్యుదుత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం డ్యామ్‌లో నీటిమట్టం బుధవారం నాటికి 871 అడుగులకు చేరింది. జలాశయానికి కృష్ణ (జూరాల), తుంగభద్ర (రోజా గేజింగ్ పాయింట్) నదుల నుంచి 2,92,167 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇప్పటికే జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 146 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 871.10 అడుగులుగా నమోదైంది. మంగళవారం నుంచి బుధవారం వరకు 21.91 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం జలాశయం నుంచి 44,048 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. బుధవారం సాయంత్రం విద్యుత్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రెండు జలవిద్యుత్ కేంద్రాలలో 13 జనరేటర్లతో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. జూరాలకు పెరిగిన ఇన్‌ఫ్లో హొస్పేట (కర్ణాటక), ధరూరు: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురిసిన వర్షాల ఆధారంగా వస్తున్న ఇన్‌ఫ్లో బుధవారం కాస్త పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,70,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 1,66,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 518.30 మీటర్లుగా ఉంది. ఈ ప్రాజెక్టుకు లక్షా 23వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా లక్షా 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 491.110 మీటర్లుగా ఉంది. జలాశయంలోకి లక్షా 34వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 88,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
కళకళలాడుతున్న జలాశయాలు
సాక్షి, ముంబై : నగరానికి మంచినీటి సరఫరా చేసే జలాశయాలు కళకళలాడుతున్నాయి. గతకొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పటిదాకా జలాశయాల్లో నీటి నిలువలు సరిపడా లేకపోవడంతో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నీటి కోతలు విధించడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీన్ని అధిగమించేందుకు హెలికాప్టర్ల ద్వారా కృత్రిమ వర్షాల కోసం రూ.15 కోట్లు మం జూరుచేసి ఉంచారు. కానీ వర్షాల పుణ్యమా... అని బీఎంసీకి ఆదా అయ్యాయి. ఇక నగరంలో కృత్రిమ వర్షాల ప్రయోగం చేయాల్సిన అవసరం లేదని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) కమిషనర్ సీతారాం కుంటే స్పష్టం చేశారు. తక్కువ రోజుల్లో ఊహించిన దానికంటే ఎక్కువే నీటి మట్టం పెరి గిందని, ప్రజలకు నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆయన వెల్లడించారు. ఆలస్యంగా వర్షాలు.. ఈ ఏడాది వర్షాలు చాలా ఆలస్యంగా కురిశాయి. జలాశయాల్లో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. చేసేదిలేక రిజర్వు నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత్యంతరం లేక ముంబైకర్లకు 25 శాతం నీటి కోత విధించాల్సిన దుస్థితి వచ్చింది. అదనంగా మరో 10 శాతం కోత విధించాలనే యోచనలో ఉండగా వరుణ దేవుడు కరుణించాడు. అదనంగా విధించే 10 శాతం నీటి కోతను విరమించుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 25 శాతం నీటి కోతలో నుంచి 10 శాతాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గత పక్షం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగిపోవడంతో బీఎంసీ నీటి సరఫరా శాఖ ఊపిరి పీల్చుకుంది. ఇటీవల కురిసిన వర్షానికి జలాశయాల్లో 9,54,679 లీటర్ల నీరు వచ్చి చేరింది.