60 టీఎంసీలకు చేరిన నీటినిల్వ
బళ్లారి : తుంగభద్ర డ్యాంలో నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతోంది. శుక్రవారం డ్యాంలో నీటి నిల్వ 60 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల డ్యాంకు నది ద్వారా 23,603 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. గురువారంతో పోల్చితే డ్యాంలోకి వస్తున ్న ఇన్‌ఫ్లో తగ్గినప్పటికీ డ్యాంలో ఆయకట్టు కాలువలకు నీరు వదిలేందుకు తగినంత నీటి నిల్వ పెరుగుతుండటంతో రెండు రాష్ట్రాలకు చెందిన రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్దం అవుతున్నారు.
హెచ్‌ఎల్‌సీ కాలువకు కూడా శుక్రవారం నీరు విడుదల చేయడంతో బళ్లారి, అనంతపురం జిల్లాలకు చెందిన ఆయకట్టు రైతులతో పాటు పలు గ్రామాలు, పట్టణాల ప్రజలకు తాగునీటి కష్టాలు కూడా తీరనున్నాయని చెప్పవచ్చు. డ్యాంలో ప్రస్తుతం 60 టీఎంసీల మేర నీరు నిల్వ చేరడంతో మరో 40 టీఎంసీల నీరు చేరితే డ్యాం పూర్తి స్థాయిలో నిండుతుంది. డ్యాం నీటి నిల్వ సామర్ధ్యం 100 టీఎంసీలు కావడంతో తుంగభద్రకు మళ్లీ ఇన్‌ఫ్లో పెరిగితే త్వరలో డ్యాం నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం డ్యాంలో 1620.47 అడుగుల నీటిమట్టం ఉండగా, 59.507 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
గత ఏడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యాంలో 1607.34 అడుగుల నీటిమట్టం ఉండగా, 51.331 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 51818 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2333 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉండేదని బోర్డు అధికారులు పేర్కొన్నారు.
తుంగభద్ర డ్యాంలో పెరుగుతున్న నీటిమట్టం
Published Sat, Jul 25 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM
Advertisement
Advertisement