the project
-
మళ్లీ ఎక్కడికో..!
పునరావాస కాలనీల్లోంచే రైలుమార్గం ఆందోళనలో చింతలఠాణా, చీర్లవంచ, శివపార్వతులకాలనీవాసులు మళ్లీరోడ్డున పడనున్న 200కు పైగా కుటుంబాలు కొత్తపల్లి–మనోహారాబాద్ రైలుమార్గం తెచ్చిన తంటా మధ్యమానేరు ప్రాజెక్టు కోసం ఎవుసం పొలాలు వదిలి పెట్టారు.. పాడిగేదెలను కాదనుకున్నారు.. ఎండ, వాన, చలి నుంచి కాపాడిన గూడును విడ్చిపెట్టారు.. పెంచుకున్న అనుబంధాన్ని పక్కనబెట్టారు.. ప్రాజెక్టు కడితే తమలాంటోళ్లు లక్షలాదిమంది బాగుపడుతారని సర్వం ధారపోశారు.. పాలకుల మాటలు నమ్మి.. అధికారులు చెప్పినట్లు తలూపారు.. ఉన్న ఊరును ఖాళీ చేసి పునరావాసకాలనీల్లో తలదాచుకునేందుకు వచ్చారు.. ఇక్కడా విధి వక్రీకరించింది. కొత్తపల్లి– మనోహరాబాద్ రైలు మార్గం నిర్మాణం ద్వారా వారు మళ్లీ నిర్వాసితులు కాబోతున్నారని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు. చింతలఠాణా, చీర్లవంచ, శివపార్వతులకాలనీ పునరావాస ప్రాంతాల్లోంచే రైలుమార్గం నిర్మించేందుకు అధికారులు సర్వే ప్రారంభించడం వారిలో గుబులు రేపుతోంది. – వేములవాడ రూరల్ -
జలం జన‘సాగరం’
-
నిజాంసాగర్ గేట్ల ఎత్తివేత
10 గేట్ల ద్వారా 60 వేల క్యూసెక్కుల నీటి విడుదల ప్రాజెక్టులోకి 1.95 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నిజాంసాగర్ : మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వస్తుండడంతో ఆదివారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టు వరదగేట్లను ఎత్తారు. ప్రాజెక్టు 10 వరద గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టుతో పాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టుల ద్వారా 1.95 లక్షల క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. దీంతో అప్రమత్తమైన నీటిపారుదలశాఖ అధికారులు ముందస్తుగానే ప్రాజెక్టు వరదగేట్లను ఎత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1,400 అడుగుల(11 టీఎంసీలు) నీరుంది. ప్రమాదకరస్థాయిలో ఇన్‌ఫ్లో వస్తుండడంతో నీటిని విడుదల చేయాలని నిర్ణయించామని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆనందంగా ఉంది.. చాలా ఏళ్ల తర్వాత నిజాంసాగర్ ప్రాజెక్టు నిండిందని, వరద గేట్ల ద్వారా నీటిని వదులుతున్నందుకు ఆనందంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు వరదగేట్లను ఎత్తిన సందర్భంగా మంత్రి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు, హల్దీ వాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టుల ద్వారా సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు నిజాంసాగర్‌లోకి వస్తోందన్నారు. ప్రాజెక్టులోకి వరదనీరు ప్రమాదకర స్థాయిలో వస్తుండడంతో ముందుజాగ్రత్తగా దిగువకు నీటిని వదులుతున్నామన్నారు. వర్షాకాలం ఇంకా పూర్తికాలేదని, మున్ముందు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండగానే వస్తానని ముఖ్య మంత్రి చెప్పారన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే సీఎం పర్యటన ఉంటుందన్నారు. -
‘సింగూరు’ కళకళ...‘సాగర్’ వెలవెల
సింగూర్ ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు తప్ప మిగితా ప్రధాన జలాశయాలు వరదనీటì తో కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్టులోకి శుక్రవారం 21 వేల క్యూ సెక్కుల వరద నీ రు వచ్చిచేరుతోంది. నాలుగు రోజుల నుంచి కుండపోతగా కురిసిన వర్షాలకు వరదనీటి ఉధృతి మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో సింగూరు జలాశయంలో జళకళ సంతరించు కుంటోంది. డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూరు ప్రాజెక్టు నీటి మట్టం డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరింది. వేసవి కాలం ముగింపు, వర్షాకాలం ఆరంభం నాటికి సింగూరు ప్రాజెక్టులో 1.5 టీఎంసీలతో డెడ్‌స్టోరేజీ నీరు నిల్వ ఉంది. కాగా ఇటీవల వర్షాకాలంలో కురిసిన వర్షానికి సింగూరు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 7.5 టీఎంసీల నీరు వచ్చిచేరింది. ప్రస్తుతం 21 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరగ నుంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్తాయి నీటిమట్టం 525.2 మీటర్లకు గాను 29 టీఎంసీలకు గాను ప్రస్తుతం 517.5 మీటర్లతో 8.5 టీఎంసీల నీరు చేరింది. ‘సాగర్’ వెల వెల జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు చేరకపోవడంతో డెడ్స్టోరేజీతో వెలవెలబోయింది. ప్రాజెక్టుకు ఎగువన క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నా వాగులు, వంకల్లో నీటి నిల్వలు చేరుకున్నాయి. కాగా ప్రాజెక్టులోకి స్వల్పంగా వరదనీరు వస్తున్నా డెడ్ స్టోరేజీకి దిగువన పడిపోయిన నీటిమట్టం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాజెక్టు ఎగువన మెదక్ జిల్లాలోని పాపన్నపేట, శంకరంపేట, మండలాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి చేరుతున్న తరుణంలో వర్షాలు నిలిచిపోవ డంతో వరదలకు బ్రేకులు పడ్డాయి. -
‘సింగూరు’ కళకళ...‘సాగర్’ వెలవెల
సింగూర్ ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు తప్ప మిగితా ప్రధాన జలాశయాలు వరదనీటì తో కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్టులోకి శుక్రవారం 21 వేల క్యూ సెక్కుల వరద నీ రు వచ్చిచేరుతోంది. నాలుగు రోజుల నుంచి కుండపోతగా కురిసిన వర్షాలకు వరదనీటి ఉధృతి మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో సింగూరు జలాశయంలో జళకళ సంతరించు కుంటోంది. డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూరు ప్రాజెక్టు నీటి మట్టం డెడ్‌స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరింది. వేసవి కాలం ముగింపు, వర్షాకాలం ఆరంభం నాటికి సింగూరు ప్రాజెక్టులో 1.5 టీఎంసీలతో డెడ్‌స్టోరేజీ నీరు నిల్వ ఉంది. కాగా ఇటీవల వర్షాకాలంలో కురిసిన వర్షానికి సింగూరు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 7.5 టీఎంసీల నీరు వచ్చిచేరింది. ప్రస్తుతం 21 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరగ నుంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్తాయి నీటిమట్టం 525.2 మీటర్లకు గాను 29 టీఎంసీలకు గాను ప్రస్తుతం 517.5 మీటర్లతో 8.5 టీఎంసీల నీరు చేరింది. ‘సాగర్’ వెల వెల జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు చేరకపోవడంతో డెడ్స్టోరేజీతో వెలవెలబోయింది. ప్రాజెక్టుకు ఎగువన క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నా వాగులు, వంకల్లో నీటి నిల్వలు చేరుకున్నాయి. కాగా ప్రాజెక్టులోకి స్వల్పంగా వరదనీరు వస్తున్నా డెడ్ స్టోరేజీకి దిగువన పడిపోయిన నీటిమట్టం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాజెక్టు ఎగువన మెదక్ జిల్లాలోని పాపన్నపేట, శంకరంపేట, మండలాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి చేరుతున్న తరుణంలో వర్షాలు నిలిచిపోవ డంతో వరదలకు బ్రేకులు పడ్డాయి. -
నిండుకుండలా కౌలాస్ నాలా
జుక్కల్ : మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ నీటి పూర్తి నీటి మట్టం 458 మీటర్లు కాగా ప్రస్తుతం 457.80కు చేరింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్‌లోకి 100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్ట్ జేఈ గజానన్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టానికి కేవలం ఒక ఫీటు మాత్రం తక్కువగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండడంతో కౌలాస్ నాలా ఆయకట్టు కింద వరి పంట సాగు చేస్తున్న రైతులు ప్రాజెక్ట్ నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. -
చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలి
సీపీఎం రాష్ట్ర ప్లీనం డిమాండ్ హైదరాబాద్: రాష్ర్టంలో చేపట్టే ప్రాజెక్టులకు 2013 చట్టానికి అనుగుణంగానే భూసేకరణ జరుపుతామంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం రాష్ట్ర ప్లీనం డిమాండ్ చేసింది. వ్యవసాయ కార్మికులు, రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకమనే ముద్ర ప్రజల్లో పడకముందే ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళితే వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించింది. ముచ్చర్ల ఫార్మాసిటీ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 45పై హైకోర్టు స్టే ఇవ్వడం హర్షణీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. భూసేకరణ చట్టం పరిహార ప్యాకేజీని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు. బుధవారం పార్టీ నేతలు బి.వెంకట్, హైమావతి, టి.సాగర్, జె.వెంకటేశ్‌లతో కలసి ప్లీనంలో చేసిన తీర్మానాలను ఆయన మీడియాకు విడుదల చేశారు. సీఎంలకు తెలియకుండా జరుగుతుందా? గతంలోని సీఎంలతో పాటు, ప్రస్తుత సీఎంకు తెలియకుండా నయీమ్ వ్యవహారం సాగిందనుకుంటే పొరపాటేనని తమ్మినేని వ్యాఖ్యానించారు. వందల కోట్ల వ్యవహారాలు, కిరాతక హత్యలు, మంత్రులు, ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయం వంటివి సీఎంలకు తెలియకుండా ఉండదన్నారు. నయీమ్ కేసు ఆషామాషీది కాదని, న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలోనే ఈ కేసు దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని నియంత్రించాలని ప్లీనం డిమాండ్ చేసింది. ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వచ్చేనెల 2న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతునిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది. -
అమ్మా.. ఇంత దారుణమా..!
నిజాంసాగర్: నిండుగా నీటితో కళకళలాడాల్సిన నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు లేక బోసిపోవడంతో ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ ఆశ్చర్యపోయారు. జిల్లాకు సాగు, తాగు నీరు అందించే ప్రాజెక్టు ఆగస్టులో ఇంత దారుణంగా ఉండటం ఊహించలేదన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో నిర్వహించిన మల్లన్నసాగర్ సాధన సదస్సుకు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అమ్మా ఇంతదారుణమా అన్నారు. అంతకుముందు ప్రాజెక్టు వరదగేట్ల వద్ద అడుగంటిన నీటి మట్టాని ఆయన తెలుసుకున్నారు. ప్రాజెక్టు వరద గేట్లు, ఆయకట్టు, నీటి మట్టాలను ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జెడ్పీచైర్మన్ దఫేదార్ రాజును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు తదితరులున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి ఆలయాలు, ప్రభుత్వ స్థలాలతో పాటు ఖాళీ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టపై సిద్ధి వినాయక ఆలయంలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఆలయం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హరితహారం కార్యక్రమంలో జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామాల వారిగా నాటిన మొక్కల సంరక్షణపై అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. ఆలయాల వద్ద నాటిన మొక్కలను పూజారులు సంరక్షించాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంపగోవర్దన్, ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జెడ్పీచైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాజేశ్వర్, డీసీసీబీ చైర్మన్ ముజుబోద్దిన్, ఆలయపూజారి సంజీవ్రావ్శర్మ నాయకులు తదితరులున్నారు. -
నేడు మల్లన్నసాగర్ సాధన సదస్సు
ఎండిన నిజాంసాగర్ ప్రాజెక్టులోనే సదస్సు.... ప్రతిపక్షాలకు దీటైన సమాధానం చెప్పే యత్నం మంత్రి హరీశ్, పోచారం, ఎమ్మెల్యేల హాజరు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ భూగర్భంలో మల్లన్నసాగర్ సాధన సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రాజెక్టుల రీ డిజైన్, కాళేశ్వరం ఎత్తిపోతల, మల్లన్నసాగర్ ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు దీటైన సమాధానం చెప్పడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సును తలపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నా నిజాంసాగర్ ప్రాజెక్టు మాత్రం రాళ్లు రప్పలు తేలి ఎడారిని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటే భవిష్యత్‌లో ప్రాజెక్టులు నిజాంసాగర్లా మారుతాయన్న సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మూడు రోజులుగా నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖంలో మంగళవారం మల్లన్నసాగర్ సాధన సదస్సును భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించే ఈ సదస్సుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. మల్లన్నసాగర్ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. – ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం కోసమే జలాల మళ్లింపు : మంత్రి పోచారం ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి గోదావరి జలాల మళ్లింపు పనులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో మంజీరనది ఏడారిగా మారిందన్నారు. పక్క రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులతో శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు నీరు నిండని దుస్థితికి చేరాయన్నారు. ఉత్తర లె లంగాణ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావ్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలు రెండేళ్లల్లో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తాయని చెప్పారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. మల్లన్న సాగర్ సాధన సదస్సుకు నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద చేస్తున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజుతో కలిసి మంత్రి పరిశీలించి, మీడియాతో మాట్లాడారు. -
‘సాగర్’కు ‘మల్లన్న’తో జీవం
బాన్సువాడ : ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన నిజాంసాగర్ సమైక్య పాలకుల తీరుతో ఎడారిగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మల్లనసాగర్తోనే నిజాంసాగర్‌కు పూర్వవైభవం వస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడలోని తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ఈ వర్షాకాలంలో సగటు వర్షపాతం 402 మిల్లీమీటర్ల కాగా 17 శాతం అధికంగా 429 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, కానీ నిజాంసాగర్, పోచంపాడ్ ప్రాజెక్టుల్లో ఆశించినంత నీరు చేరలేదని పేర్కొన్నారు. ప్రాణహిత నదినుంచి వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు. ప్రాణహిత–ఇంద్రావతి నదుల నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్‌కు మళ్లిస్తే జిల్లా రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. కాళేశ్వరం ద్వారా ఉత్తర తెలంగాణాలోని 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ అవుతాయని, మరో 20 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు లభిస్తుందని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ఎల్తైన ప్రదేశంలో ఉన్నందున, ఎత్తిపోతల ద్వారా అక్కడి వరకు నీరును తీసుకువచ్చి, నేరుగా రోజు నిజామాబాద్ జిల్లాకు 3 టీఎంసీల చొప్పున నీరు అందించవచ్చన్నారు. ఇప్పటికే రూ. 13 వేల కోట్లతో టెండర్లను ఆహ్వానించామన్నారు. మల్లన్నసాగర్ నిర్మిస్తే కామారెడ్డి నియోజకవర్గంలో 80 వేల ఎకరాలు, ఎల్లారెడ్డిలో లక్ష, బాన్సువాడలో 30 వేలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో లక్ష, బాల్కొండలో 30 వేలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 10 వేల ఎకరాలకు సాగు నీర అందుతుందని పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యం గల మల్లన్నసాగర్‌ను నిర్మించకుండా, ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని, మల్లన్నసాగర్ నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులు భూములు అప్పగిస్తున్నారని, వారికి పాదాభివందనం తెలుపుతున్నానని పేర్కొన్నారు. ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ మంగళవారం రైతులతో చలో నిజాంసాగర్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు గర్భంలో నిర్వహించే కార్యక్రమంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారన్నారు. నిజాంసాగర్ దుస్థితిని ప్రపంచానికి చూపించేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీలకతీతంగా రైతులు పాల్గొనాలని కోరారు. అనంతరం నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో మంత్రి సమీక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మహ్మద్ ఎజాస్, భాస్కర్, సురేశ్, శ్రీనివాస్, స్వరూప, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బొగ్గు.. బుగ్గి
ఓసీపీల్లో కాలుతున్న కోల్ సింగరేణికి రూ.లక్షల్లో నష్టం ఆర్జీ-1 ఏరియూ పరిధి మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు పనిస్థలాల నుంచి వెలికితీసిన బొగ్గును రెండు నిల్వ కేంద్రాలలో డంప్ చేశా రు. గాలితో జరిగే రసాయన చర్య వల్ల బొగ్గుకు మంటలు అంటుకుని బూడిదవుతోంది. ప్రాజె క్టు నుంచి ప్రతీ రోజు 13వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి నిల్వ కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి సీహెచ్‌పీలకు లారీల ద్వారా రవాణా చేస్తారు. అయితే ఓసీపీ క్వారీలలో ఊటగా వచ్చే నీటిని మోటర్ల ద్వారా పైకి తీసుకువచ్చి కాలుతున్న బొగ్గుపై చల్లించే ప్రయత్నం చేస్తు న్నారు. నీళ్లు చల్లిన సమయం వరకే పొగలు రాకుండా ఉండి ఆ తర్వాత బొగ్గు కాలుతూనే ఉంటుంది. ఇలా రోజుకు సుమారు 15 టన్నుల బొగ్గు కాలి బూడిదవుతున్నట్లు అంచనా వేశా రు. ఇలా ఒక్క ఓసీపీ వద్దే రోజుకు రూ.30వేల చొప్పున నెలకు రూ.9లక్షల వరకు సింగరేణికి నష్టం కలుగుతోంది. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులోని ఊటనీరు డోజర్లు, డంపర్లు నడిచే మార్గంలో దుమ్ము లేవకుండా చల్లడానికే సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో కాలుతున్న బొగ్గుపై నీటిని చల్లించేందుకు యూజమాన్యం గోదావరినది నుంచి నేరుగా పైప్‌లైన్ వేసి నీటిని తీసుకువచ్చే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. చాలా ఓసీల్లో ఇదే పరిస్థితి.. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం కావడం తో యూజమాన్యం ఉత్పత్తిపై దృష్టి సారించిం ది. దీంతో రోజు వారీ లక్ష్యాని కన్నా అధికంగా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. అందుకు అనుగుణంగా డంప్ యూర్డుల నుంచి రవాణా కాకపోవడంతో సింగరేణి కంపెనీ వ్యాప్తంగా చాలా ఓసీపీల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. బెల్లంపల్లి రీజియన్ పరిధి ఖైరిగూడ, డోర్లి-1, 2 తోపాటు పలు ప్రాజెక్టుల ప్రాంతాల్లో బొగ్గు కాలుతున్న ట్లు తెలుస్తోంది. పేరుకుపోతున్న నిల్వలుబొగ్గును ముందుగా సీహెచ్‌పీలకు పంపించి అక్కడి నుంచి సిమెంట్, విద్యుత్ తదితర పరిశ్రమలకు రైలు వ్యాగన్ల ద్వారా తరలిస్తారు. విద్యుత్, సిమెంట్ పరిశ్రమలు సింగరేణి నుంచి బొగ్గు తీసుకోవడానికి జాప్యం చేస్తుండడంతో బొగ్గు నిల్వలు పేరుకుపోరుు అగ్నికి ఆహుతవుతున్నారుు. రోడ్డు మార్గం ద్వారా కూడా బొగ్గు సరఫరా చేయడానికి యాజమాన్యం ఇటీవల నిర్ణయం తీసుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. -
మరింత చేరువగా...
ఏడు జిల్లా కేంద్రాలను బెంగళూరుతో కలుపుతూ రైలు సౌకర్యం 23 పట్టణ, నగరాల మధ్య 105 రైల్వే స్టేషన్లు 15 లక్షల మందికి ప్రయోజనం {పాజెక్టు వ్యయం రూ.8 వేల కోట్లు బెంగళూరు : ప్రజారవాణా వ్యవస్థను పెంపొందించడంతో పాటు బస్సు సర్వీసులపై ఒత్తిడిని తగ్గిం చడానికి కర్ణాటక ప్రభుత్వం ృహత్ ప్రణాళికను చేపట్టనుంది. దాదాపు రూ.8వేల కోట్ల వ్యయం కాగల ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చే యనుంది. ఇందుకు సంబంధించిన నివేదికకు కేంద్రం నుంచి ప్రాథమిక అంగీకారం లభించినట్లు సమాచారం. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల నుంచి నిత్యం ఉద్యోగ, వ్యాపార, ఉపాధి నిమిత్తం 15 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్ల్లు పట్టణాభివృద్ధి శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీరు ప్రధానంగా సొంతవాహనాలు, లేదా బస్సుల ద్వారా బెంగళూరుకు వస్తుంటారు. రానున్న పదేళ్లలో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉం ది. అదే కనుక జరిగితే ఇప్పటికే బెంగళూరు వా సులకు తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్య రెట్టింపు అవుతుంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించే దిశగా బెంగళూరుకు వంద కిలోమీటర్ల పరిధిలోని ఏడు జిల్లా కేంద్రాలను వాటి మధ్య ఉన్న 23 చిన్ననగరాలు, పట్టణాలకు రైలు వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 440 కిలోమీటర్ల రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా నూతనంగా 43 రైల్వే స్టేషన్లతో పాటు మొత్తం 105 రైల్వే స్టేషన్లు ఏర్పడుతాయి. ఇందులో కొన్నింటిని గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్మించనున్నారు. ప్రతి స్టేషన్ నుంచి కనిష్టంగా 60 నిమిషాలు, గరిష్టంగా 90 నిమిషాల్లో బెంగళూరుకు చేరుకునేలా ప్రాజెక్టు రూపకల్పన జరి గింది. ఈ ప్రాజెక్టులో సగటున ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పు నా 24 గంటలూ రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రతి రైలులో 15 బోగీలు ఉండగా 3వేల ప్రయాణికులు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. రూ.3,400 కోట్లు ఖర్చుకాగల మొదటి దశలో బెంగళూరు-బంగారుపేట, రెండోవిడతలో రూ.2,300 కోట్ల నిధులతో బెంగళూరు-రామనగర, మండ్య, రూ.2,300 కోట్లు ఖర్చుతో మూడో విడతలో బెంగళూరు-చిక్కబళ్లాపుర,దొడ్డబళ్లాపుర మధ్యలో ఉన్న అన్ని చిన్నచిన్న నగరాలకు రైలు సౌకర్యం కల్పించబడుతుంది. ప్రస్తుతం ఉన్న ఫ్లాట్‌ఫామ్, రైల్వే స్టేషన్ల ఉన్నతీకరణతో పాటు సిగ్నల్ వ్యవస్థకు కూడా ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించనున్నారు. ఈ విషయమై రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ...‘మెట్రోతో పోలిస్తే ఈ నూతన ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు తక్కువ. మెట్రోకు కిలోమీటరుకు సగటున రూ.300 కోట్లు ఖర్చవుతుంది. అయితే నూతన ప్రాజెక్టులో కిలోమీటరుకు అయ్యే ఖర్చు రూ. 18 కోట్లు మాత్రమే. అంతేకాక మెట్రోకు భూ సేకరణ కూడా అవసరం. నూతన ప్రాజెక్టుకు కొత్తగా భూమిని సేకరించాల్సిన అవసరం లేదు. ఆధునికత సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవ వనరులను పెంచితే సరిపోతుంది. ఏడాది పాటు కృషిచేసి రూపొందించిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించింది.’ అని పేర్కొన్నారు. -
దేశాన్ని తప్పుదారి పట్టించొద్దు!
భూ బిల్లుపై సోనియా లేఖకు గడ్కారీ సమాధానం న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లు రైతు వ్యతిరేక మంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఘాటుగా రాసిన లేఖకు బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ సోమవారం అంతే తీవ్రంగా సమాధానమిచ్చారు. దేశాన్ని తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని సోని యాపై విమర్శలు సంధించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమేనన్నారు. యూపీఏ సర్కా రు తెచ్చిన భూసేకరణ చట్టం వల్ల మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం ఒక్క ఎకరం భూమినీ సేకరించడం సా ధ్యం కాలేదన్నారు. అందులోని నిబంధనల కారణంగా ప్రాజెక్టులు పూర్తికాక, తమ భూములకు సాగునీరందక, రైతులంతా వర్షాలకోసం ఎదురుచూసే పరిస్థితులే నేటికీ నెలకొని ఉన్నాయని దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వ విధానాల ఫలితంగా దేశంలో నిరుద్యోగిత, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆక్షేపించారు. -
బ్యారేజీలతో జల‘సిరి’
కృష్ణా, గోదావరి జలాల సద్వినియోగానికి బ్యారేజీలతో ప్రయోజనం రాష్ర్ట ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ నిపుణుల కమిటీ నివేదిక దుమ్ముగూడెం నుంచి ప్రాణహిత వరకు ఆరు బ్యారే జీలకు ప్రతిపాదన కృష్ణా పరిధిలోనూ నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన కమిటీ మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, కంతానపల్లి రిజర్వాయర్ల పూర్తికి సిఫారసు వాటితో 100 టీఎంసీల నీటి నిల్వకు ఆస్కారముందన్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలను వాటా మేరకు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే రాష్ర్టంలో మరిన్ని బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ నిపుణుల కమిటీ సూచించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలని కూడా పేర్కొంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని ఎంతగా పెంచుకుంటే అంతగా నీటిని సాగు ప్రయోజనాలకు మళ్లించుకోవచ్చని తేల్చింది. నదుల్లో వరద ఉండే కనిష్ట రోజుల్లో గరిష్ట నీటిని ఒడిసి పట్టుకునేందుకు బ్యారేజీల నిర్మాణం అత్యావశ్యకమని ఉద్ఘాటించింది. గోదావరి, కృష్ణా నదుల్లో లభ్యత నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రాజెక్టుల్లో రీ ఇంజనీరింగ్ జరపాలని నిర్ణయించిన రాష్ర్ట ప్రభుత్వం.. ఆ దిశగా అధ్యయనానికి రిటైర్డ్ ఇంజనీర్లతో నిపుణుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ రెండు రోజుల పాటు కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులను పరిశీలించి ప్రాథమిక నివేదికను రూపొందించింది. గోదావరి పరిధిలో మరో ఆరు బ్యారేజీలు, కృష్ణా పరిధిలోనూ పలు బ్యారేజీలను అదనంగా నిర్మించాల్సిన అవసరముందని కమిటీ నొక్కి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కమిటీ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి, ఇతర సభ్యులు బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలసి ప్రాథమిక నివేదికను అందజేశారు. ఈ సమావేశంలో సర్వే సంస్థ ‘వ్యాప్కోస్’ ప్రతినిధులు కూడా పాల్గొని ‘ప్రాణహిత’ ప్రత్యామ్నాయంపై వివరించినట్లు తెలిసింది. కృష్ణా పరిధిలోనూ మరిన్ని.. ఇక కృష్ణా నదిలో రాష్ట్రానికి 267 టీఎంసీల వరకు నీటిని వాడుకునే వెసలుబాటు ఉంది. ఇక్కడ ఇంకా 200 టీఎంసీల వరకు నీటిని వాడుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నా యి. ఇందుకోసం కల్వకుర్తి, భీమా, నెట్టెం పాడు, కోయిల్‌సాగర్‌తో పాటు కొత్తగా పాల మూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. వీటితో సుమారు 160 టీఎంసీల మేర నీటిని వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుల పరిశీలన జరిపిన నిపుణుల కమిటీ.. సర్కారుకు పలు సిఫార్సులు చేసింది. మొదట తుంగభద్ర నుంచి రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) వద్ద 16 టీఎంసీల మేర నీటిని వాడుకునే అవకాశమున్న దృష్ట్యా అక్కడ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని సూచించింది. దీని కోసం అవసరమైతే కర్ణాటకను ఒప్పించాలని సూచించింది. ఇక కల్వకుర్తి ప్రాజెక్టు పరి ధిలో 35 టీఎంసీల నీటి వినియోగం కోసం మరో రెండు బ్యారేజీలు నిర్మించాలని, జూరాల ప్రాజెక్టు రివర్ బ్యాంకులో గుర్రంగడ్డ వద్ద మరో బ్యారేజీని, నెట్టెంపాడులో మరో 2 బ్యారేజీలను నిర్మించాలని పేర్కొంది. బ్యారేజీల నిర్మాణం త్వరితగతిన జరగాలంటే భూసేకరణ, పునరావాస చర్యలను ముందు పూర్తి చేసి తర్వాతే టెండర్లకు వెళ్లాలని కమిటీ కీలక సూచన చేసింది. గోదావరి పరిధిలో అనువైన ప్రాంతాలు గోదావరిలో నికర, వరద జలాలు కలిపి లభ్యతగా ఉన్న 1,400 టీఎంసీల నీటిలో రాష్ట్రానికి 854.67 టీఎంసీల మేర వినియోగించుకునే అవకాశముంది. అయితే ప్రస్తుతం 400 టీఎంసీల మేరకే రాష్ర్టం వినియోగించుకుంటోంది. మిగతా వాటాను కూడా వాడుకలోకి తేవాలంటే బ్యారేజీల నిర్మాణం అవసరమని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. దుమ్ముగూడెం మొదలుకుని ప్రాణహిత వరకు కొత్తగా 6 బ్యారేజీలనైనా నిర్మించాలని ప్రతిపాదించింది. అప్పుడే గోదావరి బేసిన్లో ఎక్కడైనా నీటిని నిల్వ చేసుకుని వాడుకునే వెసలుబాటు ఉంటుందని పేర్కొంది. దుమ్ముగూడెం వద్ద ఒకటి, కంతనపల్లి-దుమ్ముగూడెం మధ్య, కంతానపల్లి, ఇచ్ఛంపల్లి, కాళేశ్వరంతో పాటు ప్రాణహితలో భాగంగా ఉన్న తుమ్మిడిహెట్టి బ్యారేజీకి 70 కిలోమీటర్ల దిగువన వేమునిపల్లి వద్ద బ్యారీజీల నిర్మాణానికి అనువైన స్థలాలు ఉన్నాయని కమిటీ తేల్చింది. అయితే వాటి సామర్థ్యం ఎంత ఉండాలన్న దానిపై మాత్రం కమిటీ ఇంకా నిర్ధారణకు రాలేదు. మేమునిపల్లి వద్ద మాత్రం 5 టీఎంసీల బ్యారేజీని నిర్మించవచ్చని పేర్కొంది. మూడు రిజర్వాయర్లతో 100 టీఎంసీల నిల్వ.. గోదావరి బేసిన్లో 350 టీఎంసీల నీటిని వాడుకునే ఉద్దేశంతో 7 భారీ ప్రాజెక్టులను చేపట్టినా అవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. ప్రధానంగా దేవాదుల, ఎల్లంపల్లి, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్, ప్రాణహిత-చేవెళ్ల, కంతానపల్లి, కాళేశ్వరం, ఎస్సారెస్పీ వర ద కాల్వ, మిడ్‌మానేరు ప్రాజెక్టులపై సర్కారు దృష్టి సారిం చింది. అయితే గోదావరి నీటిని నిల్వ చేసుకునేందుకు మిడ్‌మానేరు(25.87 టీఎంసీలు), కంతానపల్లి(50 టీఎంసీలు), ఎల్లంపల్లి(24 టీఎంసీలు) ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేయాలని కమిటీ అభిప్రాయపడింది. దీనివల్ల 100 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఏర్పడుతుం ది. ప్రభుత్వం మన సు పెడితే రిజర్వాయర్లను ఏడాదిలో పూర్తి చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. కంతానపల్లిని పూర్తి చేస్తే దేవాదుల ఎత్తిపోతలకు, ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2కు నిల్వ నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉం టుందని పేర్కొంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో స్టేజ్-2 పనులు పూర్తయినా, స్టేజ్-1 పనులు కొనసాగుతుండటంతో ఆ పనులను వెంటనే పూర్తి చేయాల్సి ఉంది. మిడ్‌మానేరులో పునరావాస సమస్యలను పరిష్కరిస్తే పనులు ముందుకు సాగే అవకాశముందని కమిటీ విశ్లేషించింది. -
ప్రమాద స్థాయిలో జోలాపుట్టు
ముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన, డుడుమ జలాశయాల్లో నీటి మట్టాలు సోమవారంనాటికి ప్రమాదస్థాయికి చేరాయి. ప్రాజెక్టు అధికారులు రెండు రోజులుగా జోలాపుట్టు రిజర్వాయర్ నుంచి డుడుమ (డైవర్షన్) డ్యామ్‌కు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో డుడుమ నుంచి దిగువన ఉన్న బలిమెల రిజర్వాయర్‌కు సోమవారం నుంచి 4500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో బలిమెల రిజర్వాయర్‌లో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగి ప్రమాద స్ధాయికి చేరింది. నీటి విడుదలను ఆపేయాలని బలిమెల అధికారులు కోరడంతో జోలాపుట్టు రిజర్వాయర్ నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని తగ్గించి రెండు వేల క్యూసెక్కులు మాత్రమే ప్రస్తుతం విడుదల చేస్తున్నట్టు ఈఈ(సివిల్) బి.ఎం.లిమా తెలిపారు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 2749.50 అడుగుల నీరు నిల్వ ఉండగా, ఇన్‌ఫ్లో రెండు వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోందన్నారు. డుడుమ డ్యాం నుంచి నీటి విడుదలను మంగళవారం నిలిపివేస్తామన్నారు. మూడు జలాశయాల్లో నీటి మట్టాలు ప్రమాద స్ధాయిలో ఉన్నాయి. ఇలాంటప్పుడు భారీ వర్షలు కురిస్తే మత్స్యగెడ్డ పరివాహాక ప్రాంతాల గ్రామాలకు, రిజర్వాయర్లకు ప్రమాదాలు వాటిల్లుతుందని ప్రాజెక్టు అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
విడుదల కాని ఆర్వీఎం నిధులు
విద్యారణ్యపురి : ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్(సర్వశిక్షా అభియాన్) జిల్లా ప్రాజెక్టుకు మంజూరైన నిధులు విడుదల కాలేదు. దీంతో ఆర్వీఎం పరిధిలో అమలు చేయాల్సిన వివి ధ పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. జిల్లా ప్రాజెక్టుకు మంజూరైన నిధులను విడుదల చేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం స్కూల్ గ్రాంట్‌తోపాటు నిర్వహణ, ఎమ్మార్పీ, స్కూల్ కాంప్లెక్స్ నిధులకు కటకట ఏర్పడుతోంది. స్కూల్ గ్రాంట్ కింద పీఎస్‌లకు రూ.5వేలు,యూపీఎస్‌లకు రూ.12వేలు, హై స్కూళ్లకు రూ.7వేల విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే, నిర్వహణ ఖర్చు ల కింద మూడు తరగతి గదులు ఉంటే రూ.5వేలు, అంత కంటే ఎక్కువ గదులు ఉన్న స్కూళ్లకు రూ.10 వేల చొప్పున ఇస్తారు. ఇక ఒక్కో మండల రిసోర్స్ సెంటర్‌కు రూ.80వేలు, స్కూల్ కాంప్లెక్స్‌కు రూ.22 వేల చొప్పున కేటాయించాల్సిన నిధులు విడుదల కాలేదు. ఇంకా ఆర్వీఎం పరిధిలో నిధుల లేమితో 135 తరగతి గదుల నిర్మాణం ప్రారంభం కాలేదు. నెలల క్రితమే ఆమోదం రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) జిల్లా ప్రాజెక్టు పరిధిలో జిల్లాకు వివిధ పనుల నిమిత్తం రూ. 150.52కోట్ల నిధులు కావాలని అధికారులు కొన్ని నెలల క్రితమే ప్రణాళికలను ఉన్నతాధికారులు పం పించారు. అయితే, ప్రణాళికలకు అప్పట్లోనే అనుమతి లభించింది. ఎస్ఎస్ఏ కింద రూ.112 కోట్ల 90 లక్షలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాల యాల్లో సివిల్ పనుల కోసం రూ.12కోట్ల 29లక్షలు, కేజీబీవీ ల నిర్వహణ కోసం రూ.25 కోట్ల 32లక్షల బడ్జెట్‌కు మంజూరు లభించగా, ప్రొసీడింగ్స్ కూడా అందా యి. ఈ నిధుల్లో కేంద్రప్రభుత్వం 65శాతం, రాష్ట్ర ప్రభుత్వం 35శాతం నిధులను కేటాయించి మూడు నెలలకోసారి విడుదల చేస్తారు. అయితే, ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు రూ. 11.23 కోట్లే మంజూరు చేయడం గమనార్హం. ఫలి తంగా చాలా కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇం కా కేజీబీవీల నిర్వహణతో పాటు ఐఈఆర్టీలు, సీ ఆర్పీలు, మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, మె స్సేంజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫిజియోథెరపిస్టులు, ఆర్వీఎంలోని వివిధ కేటగిరీల ఉద్యోగులు, పార్టటైం ఇన్స్ట్రక్టర్లకు వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయి. ఇటీవల రూ.కోటి విడుదల కాగా, వేతనాల్లో కొంత భాగం అందజేశారు. ఇక ప్రస్తుతం నిధులు విడుదల కాకపోతే అక్టోబర్ నెలకు సంబంధించి నవంబర్‌లో ఇవ్వాల్సిన వేతనాలకు ఇబ్బంది ఏర్పడుతుందని చెబుతున్నారు. అలాగే, ఉపాధ్యాయుల శిక్షణకు కూడా విఘాతం కలుగుతుందని భా విస్తున్నారు. ఇంకా మదర్సాల్లో విద్యావలంటీర్లను నియమించడం కష్టమేనని పేర్కొంటున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడ్డాక కేంద్రం నుంచి వచ్చే మొదటి క్వార్టర్ నిధులు ఏపీ అకౌంట్లోకి వెళ్లిపోయాయి. ఇందులో తెలంగాణ రాష్ర్ట వాటా ఉన్నా విషయాన్ని గుర్తించేలోగానే సమయం గడిచిపోయింది. ఈ నిధులను తిరిగి తెచ్చుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అలాగే, త్వరలో కేంద్రం నుంచి విడుదల కానున్న రెండో క్వార్టర్ నిధులనైనా తెలంగాణ రాష్ట్రం అకౌంట్లోకి తెచ్చుకుంటేనే ఫలితముంటుందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆర్వీఎంకు రావాల్సిన నిధుల విడుదలపై ప్రభుత్వం స్పందించకపోతే అభివృద్ధి పనులే కాకుం డా పలువురు ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కూడా కష్టమేనని తెలుస్తోంది. -
ప్రాజెక్టుల పర్యవేక్షణపై ఏమంటారు?
గోదావరి బోర్డు పరిధిలోకి తేవాల్సినవేవి? రెండు వారాల్లో తెలపాలని ఇరు రాష్ట్రాలను కోరిన కేంద్ర జలసంఘం మార్గదర్శకాలను సూచిస్తూ వేర్వేరుగా లేఖలు పర్యవేక్షణ అవసరం లేదంటున్న తెలంగాణ కుదరదంటున్న ఏపీ సర్కారు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టుల వివరాలను అందించాలని ఇరు రాష్ర్ట ప్రభుత్వాలను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) కోరింది. బోర్డు పరిధిలోకి తెచ్చే ప్రాజెక్టుల ఎంపిక విషయంలో నాలుగు మార్గదర్శకాలను కూడా సూచించింది. వీటిపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను తెలపాలని, రెండు వారాల్లో ప్రాజెక్టుల వివరాలను సమర్పించాలని పేర్కొంది. అక్టోబర్ 15లోగా కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాన్ని నిర్వహించి, వాటి పరిధిలోని ప్రాజెక్టుల అంశంతో పాటు, కార్యాలయాల కూర్పుపై ఓ అవగాహనకు రావాలని ఇరు రాష్ట్రాలకు సీడబ్ల్యూసీ సూచించినట్లు తెలిసింది. ప్రత్యేకంగా గోదావరి పరిధిలోని ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి ప్రాతిపదిక తీసుకోవాలన్న దానిపై ఇటీవలే లేఖలు కూడా రాసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు నీటిని అందించే ప్రాజెక్టులు, ఉమ్మడిగా నీరందించే కాలువలు ఉన్న ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి జరిగేవి, రెండు రాష్ట్రాల పర్యవేక్షణ అవసరమున్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఆ లేఖల్లో అభిప్రాయపడింది. దీనిపై ఇరు రాష్ర్ట ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను చెప్పాలని కోరింది. వివాదం లేనప్పుడు బోర్డు పర్యవేక్షణ అనవసరం: తెలంగాణ సర్కారు సీడబ్ల్యూసీ లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గోదావరిలో నీరు సమృద్ధిగా ఉండటం, ఎక్కడా వివాదం లేని కారణంగా బోర్డు పర్యవేక్షణలోకి తీసుకురావాల్సిన ప్రాజెక్టులేవీ ఉండవని రాష్ర్ట ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కాస్త వివాదం ఉన్నా, ముంపు ప్రాంతాలను పూర్తిగా ఆంధ్రాలో కలిపినందున ఇక సమస్య ఉండబోదని భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టుతో కృష్ణా బేసిన్‌లోకి వచ్చే 80 టీఎంసీల నీటిలో ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు పంపకాలు జరిగాయి. ఇందులో ఏపీకి కేటాయించిన 45 టీఎంసీల నీటిలో తెలంగాణ వాటా విషయాన్ని ట్రిబ్యునల్ మాత్రమే తేల్చుతుందని రాష్ర్ట వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే అంశాన్ని బోర్డుకు నివేదిక ద్వారా తెలియజేస్తామని, అయితే ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని పట్టుబడితే అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన కార్యాచరణపై బోర్డు సమావేశంలో చర్చిస్తామని నీటి పారుదల శాఖ ముఖ్యుడొకరు తెలిపారు. రెండు బోర్డులకు ఒకే విధానం: ఏపీ ఇక ఆంధ్రప్రదేశ్ మాత్రం గోదావరిపై ఎప్పుడో నిర్మితమైన నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూర్, లోయర్ మానేరు, కడెం, ఘనపూర్ మొదలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాణహిత, ఇచ్చంపల్లి తదితర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనని వాదిస్తోంది. వివాదాలు నెలకొన్న రెండు బేసిన్ల పరిధిలోని బోర్డులకు ఒకే మార్గదర్శకాలను పాటించాలని, వేర్వేరు మార్గదర్శకాలు సరికాదని అభిప్రాయపడుతోంది. సుంకేశుల, రాజోలిబండ, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ సర్కారు కోరుతున్నందున... గోదావరి ప్రాజెక్టులను కూడా బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనని ఏపీ అంటోంది. -
కనిష్టం.. ఎంత కష్టం!
కనిపించని కారుమేఘాలు 65 మి.మీ కనిష్ట వర్షపాతం నమోదు భీమునిపట్నంలో సాధారణ వర్షపాతం 25 మండలాల్లో కనిష్టం, 12 మండలాల్లో స్వల్పం నర్సీపట్నం రూరల్ : ఈ ఏడాదీ అనావృష్టి వెంటాడుతోంది. వర్షాకాలం వెక్కిరిస్తోంది. కారుమేఘం జాడకూడా కనిపించక అన్నదాత గుండె బరువెక్కుతోంది. కాలక్రమేణా పరిస్థితి అనుకూలిస్తుందని భావించిన రైతుకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వర్షం కురవకపోగా, ఎండలు మండిపోతూ ఉండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు తడిసిన భూములు సైతం ఎండలకు ఆరిపోయి, ఎండిపోతున్నాయి. ఆగస్టు ప్రారంభం నుంచి 18 వరకు పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా -65 మి.మీ వర్షపాతం కనిష్టంగా నమోదయ్యింది. ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 196.5 మి.మీ కాగా 68.5 మాత్రమే నమోదయ్యింది. ఈ విధంగా జిల్లాలోని 38 మండలాల్లో పరిస్థితిని చూస్తే 12 మండలాల్లో తక్కువ (-60మి.మీ వరకు), 25 మండలాల్లో కనిష్టంగా (-60 మి.మీకి మించి) నమోదయ్యింది. జిల్లాలో కేవలం భీమునిపట్నం మండలంలోనే సాధారణ వర్షపాతం నమోదు కావడం విశేషం. ఏజెన్సీలో 11 మండలాల్లో సైతం ఏడింటిలో కనిష్ట వర్షపాతం నమోదైంది. 90కి మించి 100 మి.మీ లోపు వర్షపాతం గల మండలాల జాబితాలో మాకవరపాలెం, సబ్బవరం, కోటవురట్ల, బుచ్చియ్యపేట ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం వల్ల ఖరీఫ్ వరి నాట్లు ఊపందుకోవడం లేదు. కేవలం నీటి సదుపాయం ఉన్న తాండవ, పెద్దేరు, రైవాడ వంటి ప్రాజెక్టులతో పాటు బోర్లు వసతి ఉన్న భూముల్లోనే నాట్లు వేస్తున్నారు. మిగిలిన వర్షాధార భూముల్లో ఇప్పటికే నారుమళ్లు వేసి అలానే వదిలేశారు. కొన్ని ప్రాంతాల్లో బిందెలు, ఇంజన్లతో నారు తడిపి బతికించుకుంటున్నారు. ఈ పరిస్థితుల వల్ల జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు తగ్గి, దీని ప్రభావం వచ్చే ఏడాదిపై పడుతుందని రైతులుఆందోళన చెందుతున్నారు. -
తాండవ, రైవాడ నీరు విడుదల
నాతవరం/దేవరాపల్లి : జిల్లాలోని తాండవ, రైవాడ జలాశయాల నీటిని ఆయకట్టు భూములకు బుధవారం విడుదల చేశారు. రైవాడ నుం చి 250 క్యూసెక్కుల నీటిని మాడుగుల ఎమ్మె ల్యే బూడిముత్యాలనాయుడు విడుదల చేయ గా, తాండవ నుంచి 230 క్యూసెక్కులు డీఈ షణ్ముఖరావు వదిలారు. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ ఎస్ఈ ఎన్.రాంబాబు రైవా డ జలాశయాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలు డీఈఈ ఎ.సునీతను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం రెగ్యులేటింగ్ గేట్లు, జనరేటర్ రూమ్‌లను పరిశీలించి వాటి సామర్థ్యాన్ని ఇంజినీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నా రు. తాండవ రిజర్వాయరు దిగువన ఉన్న వినాయక, శ్రీనల్లగోండమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం మూహర్తం ప్రకారం పూజలు చేసి ప్రధాన గే ట్లు ఎత్తి నీటిని విడుద ల చేశారు. డీఈ మాట్లాడుతూ విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు పరిధి ఆరు మండలాల్లోని 51,640 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. కుడికాలువ ద్వారా 50 క్యూసెక్కులు,ఎడమ కాలువు ద్వారా 180 క్యూసెక్కులు తాండవ కాలువులోకి విడుదల చేశామన్నారు. క్రమేపి రెండు కాలువుల ద్వారా 550 క్యూసెక్కులు నీటిని అయకట్టుకు విడుదలకు ఏర్పాట్లు చేశామన్నారు. గతేడాది తుఫాన్లప్పుడు కుడి, ఎడమ కాలువలకు 52 చోట్ల గండ్లు పడ్డాయని, వాటి మరమ్మతులకు రూ.3.5కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. నీరు వృథా కాకుండా సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్యేల్యే వేచలపు శ్రీరామమూర్తి, నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ చెర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు, నాతవరం ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేముడు, మండల టీడీపీ అధ్యక్షుడులాలం అచ్చిరాజు, ఎంపీటీసీ సభ్యుడు కాశపు నూకరాజు, జేఈ వేణుగోపాలనాయుడు పాల్గొన్నారు. రైవాడ నుంచి.... మండలంలోని రైవాడ జలాశయం నుంచి ఆ యకట్టు భూములకు 250 క్యూసెక్కుల నీటిని బుధవారం సాయంత్రం మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడు విడుదల చేశారు. ఖరీఫ్ వరినాట్లుకు నీరు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని సాగునీటి సంఘా ల ప్రతినిధులు ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎడమకాలువ ద్వారా 175 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 75 క్యూసెక్కుల నీరు విడుదలకు అధికారులు అంగీకరించారు. దీంతో నీటి పారుదల శాఖ ఎస్ఈ ఎన్.రాంబాబు సమక్షంలో ఎమ్మెల్యే ముత్యాలునాయుడు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి ఆయకట్టు భూ ములకు సైతం సాగునీరు అందేలా సాగునీటి సంఘాల ప్రతినిధులు కృషిచేయాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. జీవీఎంసీ బకాయిలు విడుదల చేయాలి: ఎమ్మెల్యే బూడి తాగునీటి అవసరాల కోసం రైవాడ నుంచి నీటిని తీసుకుంటున్న జీవీఎంసీ సుమారు రూ.90 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఇందుకు ఇరిగేషన్ అధికారులు కృషిచేయాలని ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడు ఎస్ఈ ఎన్.రాంబాబును కోరారు. అలాగే జలాశయంలో పూడికతీత, విద్యుత్ పునరుద్ధరణ, పలు అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే ఎస్ఈకి వివరించారు. కార్యక్రమంలో డీఈఈ ఎ.సునీత, ఏఈ అర్జున్, జలాశయం చైర్మన్ బొడ్డు వెంకటరమణ, నీటిసంఘాల అధ్యక్షులు రెడ్డి బలరాం, తాతంనాయుడు, దొగ్గ భూషణం, కర్రి సత్యం, వి.రామునాయుడు, చలుమూరి చంద్రమోమన్, వంటాకు సింహాద్రప్పడు, మతల రాజునాయుడు, వల్లునాయుడు పాల్గొన్నారు. -
‘పుంగనూరు జాతి’ పునరుత్పత్తి
తిరుపతి, పలమనేరు కేంద్రంగా పిండమార్పిడి ప్రయోగం ప్రాజెక్టుకు రూ.1.3 కోట్లు అవసరం కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్న వర్సిటీ అధికారులు అరుదైన పుంగనూరు రకం పశువుల పునరుత్పత్తికి శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు శ్రీకారం చుట్టారు. తిరుపతి, పలమనేరు ప్రాంతాలను పరిశోధనలకు కేంద్రంగా నిర్ణయించారు. రాష్ట్రంలో పుంగనూరు, ఒంగోలు జాతి పశువులను దేశ సంపదగా భావిస్తారు. వెటర్నరీ యూనివ ర్సిటీ : పుంగనూరు జాతి ఆవుల పునరు త్పత్తికి శ్రీకారం చుట్టారు. ఉన్న వనరులను అంది పుచుకుంటూ అందరిచేతా శభాష్ అనిపిం చుకుంటున్నారు తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు. అంతరించి పోతున్న వాటిల్లో పుంగూరు పశువుల జాతి మొదటి స్థానంలో ఉంది. వీటి పునరుత్పత్తికి ఇప్పటి వరకు వెటర్నరీ వర్సిటీ పెద్దగా చర్యలు చేపట్టలేదు. పలమనేరు సమీపంలోని క్యాటిల్ ఫారం వద్ద పరిశోధన కేంద్ర ఏర్పాటు చేశారు. ఇక్కడ 91 పుంగనూరు జాతి పశువులు మాత్రమే ఉన్నాయి. వీటిలో కూడా పునరుత్పత్తికి కేవలం 25 పశువులు మాత్రమే యోగ్యమైనవి. క్యాటిల్ఫాంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. పుంగనూరు జాతి పశువులు అంతరించిపోతున్న నేపథ్యంలో వెరట్నరీ వర్సిటీపై పలువిమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వెటర్నరీ డీన్ డాక్టర్ చంద్రశేఖర్‌రావు, ఇతర అధికారులు పుంగనూరు జాతి పశువుల పునరుత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఇందుకు కావాల్సిన పరికరాలు, పిండమార్పిడికి అవసరమయ్యే పశువు లు, పరిశోధకులు, గైనకాలజిస్ట్, ఇతర సిబ్బంది వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తిరుపతి వెటర్నరీ కళాశాలలో ల్యాబ్ అందుబాటులో ఉన్నా ఇక్కడ పుంగనూరు రకం పశువులు, ఇతర సిబ్బంది లేరు. పలమనేరు ల్యాబ్‌లో పిండమార్పిడికి అవసరమయ్యే ఇతర జాతి పశువులు, గైనకాలజిస్ట్, శాస్త్రవేత్త అవసరమని గుర్తించారు. ఇందుకోసం రెండు ప్రాంతాల్లో పరిశోధనలు జరగాలంటే రూ.1.3 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు నివేదికను సి ద్ధం చేశారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే పరిశోధనలు ప్రారంభమవుతాయని డీన్ ఆఫ్ వెటర్నరీ డాక్టర్ చంద్రశేఖర్‌రావు తెలిపారు. మేలైన పుంగనూరు జాతి పుంగనూరు జాతి పశువులను దేశ సంపదగా భావిస్తారు. అంతరించి పోతున్న 32 రకాల దేశవాళీ రకాల్లో ఈ జాతి మొదటి స్థానంలో ఉంది. 85-95 సెంటీ మీటర్ల ఎత్తు, 125- 210 కిలోల బరువు ఉండడం వీటి ప్రత్యేకత. తెలుపు, ఎరుపు, గోధుమ రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. విదేశీయులూ పుంగనూరు జాతి పశువుల కోసం ఎగబడుతుంటారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను ఈ పశువులు తట్టుకుని నిలబడగలవు. తక్కువ పోషణతో ఎక్కువ లాభాలు ఇవ్వడం వీటి ప్రత్యేకత. -
అటకెక్కనున్న కీలక ప్రాజెక్టులు
సాక్షి, ముంబై: జలరవాణా, ఠాణే మెట్రో, ట్రాన్స్ హార్బర్ సీలింకు వంటి కీలక ప్రాజెక్టులకు ఎన్నికల తర్వాతే మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుండడంతో దాదాపుగా ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంద ని, ఆ వెంటనే కోడ్ అమల్లోకి వస్తుందని, దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం వద్ద కీలక ప్రాజెక్టుల విషయమై నిర్ణయం తీసుకునేంత సమయం లేదని, కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వమే ఈ ప్రాజెక్టులకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెమ్మార్డీయే అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య తలెత్తిన విభేదాలు కూడా ఈ ప్రాజెక్టులు ఆలస్యమవడానికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. పెండింగులో ఉన్న ఈ ప్రాజెక్టుల భవిత ఎన్నికల తరువాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుదని చెబుతున్నారు. జలరవాణ, ఠాణేమెట్రో, ట్రాన్స్ హార్బర్ సీ లింకు వంటి అత్యంత కీలకమైన ప్రాజెక్టుల ప్రతిపాదనలు కొంతకాలంగా పెండింగులోనే ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫైళ్లు ఇటీవలే ముందుకు కది లాయి. దీంతో త్వరలో వీటికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుండవచ్చని ఎమ్మెమ్మార్డీయే భావించింది. కాని శాసనసభ ఎన్నికలు సమీపించడంతో అన్ని రాజకీయ పార్టీ లు అభ్యర్థుల ఎంపిక, జాబితా రూపొందించడం, సీట్ల పంపకం తదితర పనుల్లోనే బిజీగా ఉన్నాయి. అధికారంలో కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు కూడా మార్పులు, చేర్పులపైనే దృష్టి సారించారు. దీంతో వేలాది కోట్ల రూపాయల విలువచేసే ఈ కీలక ప్రాజెక్టుల విషయంలో ఇంత తక్కువ సమయంలో ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకొని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదని పలువురు చెబుతున్నారు. ఫలితంగా వీటికి ఎన్నికల ముందే ముహూర్తం లభిం చే అవకాశాలు సన్నగిల్లినట్లేనని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి. వీటికి గ్రీన్‌సిగ్నల్ లభించాలంటే కీలకమైన వ్యక్తులతో కూడిన ఓ కమిటీ ప్రత్యేకంగా ఏర్పా టు చేయాలని, ఆ తరువాత చర్చలు, ప్రణాళికలు రూపొందించాలని, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపు ఈ పనులన్ని పూర్తిచేయాలని చెబుతున్నారు. -
నీటి నిల్వకు ‘కడెం’ సన్నద్ధం
కడెం, న్యూస్‌లైన్ : వర్షాకాలంలో నీటి నిల్వ కోసం కడెం ప్రాజెక్టు సిద్ధమవుతోంది. నీటి నిల్వతోపాటు జలాశయంలోకి అదనంగా నీళ్లొస్తే.. బయటకు పంపేందుకు వినియోగించే వరద గేట్లను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. నాలుగైదు రోజుల నుంచి ప్రాజెక్టు యంత్రాలు, గేట్ల సామర్థ్య పరిశీలనలో అధికారులు నిమగ్నమ య్యారు. వారం క్రితం ఎస్సారెస్పీ ఎస్ఈ శ్యాంసుందర్, ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్లు కలిసి కడెం ప్రాజెక్టు గేట్లను పరిశీలించిన విషయం తెలిసిందే. గేట్లను పెకైత్తి వాటి పనితీరు, సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యుత్ సరఫరా లేని సమయంలో వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన 100 కేవీ సామర్థ్యం గల జనరేటర్ పనితీరును తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఖరీఫ్ సీజన్లో సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాలుగైదు రోజులుగా ప్రాజెక్టు వరదగేట్ల గదుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. వరద గేట్లను పైకి లేపేందుకు ఉపయోగించే గేరు బాక్సులు, యంత్రాలు, వైర్ రోప్‌లు తదితర యంత్రాలకు గ్రీసింగు పూస్తున్నారు. దీని తర్వాత కాడీ కంపౌండ్, ఆయిలింగు వంటి పనులు చేపడతారు. ప్రాజెక్ట్‌కు ఉన్న 18 గేట్లకు ఈ పనులు చేస్తున్నారు. ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్, జేఈ నరేందర్ పనులను పర్యవేక్షిస్తున్నారు. వరదగేట్లపై ఉన్న వీధిదీపాల మరమ్మతు కొనసాగుతోంది. రాత్రివేళ వరదగేట్లు ఎత్తే సమయంలో అవసరమైన వెలుతురు కోసం భారీ సామర్థ్యం గల లైట్లను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, కనిష్ట స్థాయి నీటిమట్టం 675 అడుగులు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 7 టీఎంసీలు. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 678 అడుగుల నీటిమట్టం ఉంది. -
భూగర్భ చమురు నిల్వ కేంద్రం రెడీ
దేశంలోనే తొలికేంద్రం వైజాగ్ డాల్ఫిన్ కొండగర్భంలో సిద్ధం జూన్‌లో జాతికి అంకితం ఐదు గుహల్లో పైపులైన్ల బిగింపు పూర్తి 1.33 మిలియన్ టన్నుల సామర్థ్యం.. రూ. 1037 కోట్ల పెట్టుబడి విశాఖపట్నం: విశాఖపట్నం సిగలో మరో ప్రతిష్టాత్మకమైన భారీ జాతీయ స్థాయి ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. రూ.1,037 కోట్ల పెట్టుబడితో నిర్మించిన 1.3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఈ కేంద్రం వచ్చేనెలలోసగర్వంగా జాతికి అంకితం కానుంది. చమురు అవసరాలకు విదేశాలపై ఆధారపడడం తగ్గించి అత్యవసర సమయాల్లో నిరంతరాయంగా దేశ అవసరాలను తీర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం విశాఖలో తలపెట్టిన భూగర్భ చమురు నిల్వ కేంద్రం పనులు దాదాపు పూర్తయ్యాయి. సముద్రతీరాన డాల్ఫిన్ కొండగర్భాన ఈ స్ట్రాటజిక్ క్రూడ్ స్టోరేజ్ కేవ్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించి జూన్‌లో జాతికి అంకితం చేయనున్నారు. మన దేశం చమురు అవసరాలకు పూర్తిగా విదేశా లపైనే ఆధారపడి దిగుమతి చేసుకుంటోంది. దిగుమతుల భారం పెరిగిపోతుండడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమంటూ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు, విపత్కర పరిస్థితుల్లో దిగుమతులు ఆగిపోయినా తట్టుకుని నిలబడేందుకు భారీగా చమురు నిల్వ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిం చింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పుడల్లా ఒకేసారి పెద్దమొత్తంలో కొనుగోలు చేసి ఆరు నెలలపాటు దేశ అవసరాలకు సరిపడేలా భూగర్భంలో చమురు నిల్వ చేయాలని నిర్ణయించింది. అలా రూపుదిద్దుకున్నదే స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ కేవ్. ప్రణాళికలో భాగంగా దేశంలో మంగుళూరు (1.5 మిలియన్ టన్నులు), పాడూరు (2.5 మిలియన్ టన్నులు)తోపాటు రాష్ట్రంలో విశాఖపట్నంతో కలిపి మొత్తం మూడు కేంద్రాలను 2008లో ఎంపిక చేసింది. విశాఖలో 1.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న నిల్వ కేంద్రానికి సురక్షిత ప్రాంతంగా డాల్ఫిన్ కొండను గుర్తించి 2011 నాటికి వినియోగంలోకి తేవాలని భావించారు. కానీ కొండగర్భాన సొరంగ మార్గంతోపాటు గుహలను తవ్వడం సవాల్‌గా మారింది. దీంతో 2009లో మొదలుపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయాయి. తిరిగి రెండేళ్ల కిందట దిగుమతి చేసుకున్న రిగ్గులతో ఈ గుహలను వినియోగానికి వీలుగా సిద్ధం చేశారు. ఆసియాలోనే మొదటి భూగర్భ ఎల్పీజీ స్టోరేజీ ట్యాంకు.. ఈ పనులు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఉండడంతో డ్రిల్లింగ్ పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. సొరంగం కోసం ఆరు కిలోమీటర్ల మేర గుహను తవ్వుతుంటే భారీ రాళ్లు ఎగిరిపడి తవ్విన గుహ పూడిపోయేది. అత్యంత క్లిష్టపరిస్థితుల మధ్య సాగిన పనులు ప్రస్తుతం చివరిదశలో ఉన్నాయి. ప్రాజెక్టులో భాగంగా చమురు నిల్వ కోసం ప్రస్తుతం కొండ అడుగుభాగాన ఆరుకిలోమీటర్ల పరిధిలో ఐదు గుహలు నిర్మించారు. వీటికి లోపలనుంచి ప్రత్యేక రక్షణ కవచాలు నిర్మించారు. వీటిలోనే చమురును నిల్వ చేసేలా ట్యాంకులు తయారుచేశారు. ఒక్కో ట్యాంకు 30 మీటర్ల ఎత్తు, 20 మీటర్ల వెడల్పుతో సిద్ధమయ్యాయి. ఇందులో మూడు గుహలను ‘డబ్ల్యూ’ ఆకారంలో, మిగిలిన వాటిని ‘యు’ ఆకారంలో మార్చారు. ఈ ఐదు ట్యాంకుల చుట్టూ 75 మీటర్ల లోతులో ప్రత్యేక బోర్లు తవ్వి చమురు నిల్వ కేంద్రాలకు అనుసంధానించి అగ్నిప్రమాదాలు ఏవిధంగా ఎదుర్కోవాలనేదానిపై ఇటీవల ట్రయల్ కూడా నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చే నౌకలు నేరుగా ఈ ట్యాంకులకు ముడిచమురును పంపింగ్ చేసేలా విశాఖపట్నం పోర్టు, తూర్పు నావికాదళం నుంచి సేకరించిన 68 ఎకరాల్లో నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ట్యాంకులకు, ఫిల్లింగ్ స్టేషన్‌కు మధ్య పైపుల పనితీరును నిపుణులు పరిశీలించి వినియోగానికి పచ్చజెండా ఊపారు. ఈ ట్యాంకులను హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ నిర్మిస్తోంది. ప్రస్తుతం వీటిపనులు 95 శాతానికిపైగా పూర్తయ్యాయి. మలేసియా, నైజీరియా నుంచి వచ్చే ముడి చమురు నౌకల నుంచి ఫిల్లింగ్ స్టేషన్‌కు క్రూడ్‌ను పంప్ చేయడం, అక్కడినుంచి హెచ్‌పీసీఎల్‌కు పైపులైను ద్వారా తరలించడం వంటి పనులకోసం చేపట్టిన పైపులైన్ల నిర్మాణం పూర్తయింది. ఐదు ట్యాంకులకు బిగించిన పైపులు, ఇతర యంత్రాల బిగింపు పనులు చివరి దశలో ఉన్నాయి. -
గుట్టుగా ‘ఈ’ లెర్నింగ్!
=వాడీవేడిగా జేఎన్టీయూహెచ్ పాలకమండలి సమావేశం =అజెండాలో కనిపించని కీలకాంశాలు సాక్షి, సిటీబ్యూరో: జేఎన్టీయూహెచ్ అభివృద్ధికి సంబంధించి కోట్లాది రూపాయలతో చేపడుతున్న ప్రాజెక్టుల్లో పారదర్శకత లోపిస్తోంది. ఆయా పనులను వివిధ సంస్థలకు కట్టబెట్టే విషయాలపై యాజమాన్యం గుట్టుగా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పాలకమండలి దృష్టికి తీసుకురాకుండానే సుమారు రూ.15 కోట్ల విలువైన ‘ఈ-లెర్నింగ్’ ప్రాజెక్టుకు సంబంధించి గ్లోబరీనా సంస్థతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టు అంశాన్ని గురువారం జరిగిన యూనివర్సిటీ పాలకమండలి సమావేశపు అజెండాలో పొందు పరచకపోవడమే ఇందుకు నిదర్శనం. గరంగరంగా సమావేశం.. వర్సిటీ ఉపకులపతి రామేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో వర్సిటీ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ఆమోదించిన సభ్యులు మరికొన్ని అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గత సమావేశాల్లో ఆమోదించిన అంశాలకు సంబంధించి ఏటీఆర్ తప్పుల తడకగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, అజెండాలో ముఖ్యమైన అంశాలను పెట్టకపోవడం వల్ల పాలకమండలి సభ్యుల్లో ఎక్కువమంది సమావేశానికి గైర్హాజరైనట్లు సమాచారం. యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న మంథని, జగిత్యాల ఇంజినీరింగ్ కళాశాలల్లో రూ.20 లక్షలతో లేబొరేటరి సామగ్రి కొనుగోలుకు, హైదరాబాద్ కళాశాలలో రూ.59 కోట్లతో విద్యార్థుల వసతిగృహాల నిర్మాణానికి పాలకమండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షరతులతో పదోన్నతులకు అనుమతి పదవీ విరమణకు దగ్గరలో ఉన్న కొంతమంది అధికారులకు షరతులతో కూడిన పదోన్నతులు (జేఆర్, డీఆర్) ఇచ్చేందుకు అనుమతించారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి కొత్తగా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల అమలుకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. అనంతపురం, కాకినాడ జేఎన్టీయూలకు చెందిన ఆచార్యుల జీపీఎఫ్ నిధుల పంపిణీ, ఆయా యూనివర్సిటీలకు చెందిన మరికొందరు ఆచార్యుల డిప్యుటేషన్లను మరో ఆరు నెలల పొడిగింపు.. తదితర అంశాలకు ఆమోదం లభించింది. సమావేశంలో రిజిస్ట్రార్ రమణరావు, రెక్టార్ సాయిబాబారెడ్డి, సభ్యులు అన్నపూర్ణ, అహ్మద్కమల్, ఏపూరి అనిల్‌కుమార్, అజయ్‌మిశ్రా, గోవర్ధన్, విజయ్‌కుమార్‌రెడ్డి, టీకేకేరెడ్డి తదితరులు పాల్గొన్నారు.