విడుదల కాని ఆర్‌వీఎం నిధులు | But the release of the funds RVM | Sakshi
Sakshi News home page

విడుదల కాని ఆర్‌వీఎం నిధులు

Published Sun, Oct 26 2014 5:00 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

But the release of the funds RVM

విద్యారణ్యపురి : ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్(సర్వశిక్షా అభియాన్) జిల్లా ప్రాజెక్టుకు మంజూరైన నిధులు విడుదల కాలేదు. దీంతో ఆర్‌వీఎం పరిధిలో అమలు చేయాల్సిన వివి ధ పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. జిల్లా ప్రాజెక్టుకు మంజూరైన నిధులను విడుదల చేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం స్కూల్ గ్రాంట్‌తోపాటు నిర్వహణ, ఎమ్మార్పీ, స్కూల్ కాంప్లెక్స్ నిధులకు కటకట ఏర్పడుతోంది.

స్కూల్ గ్రాంట్ కింద పీఎస్‌లకు రూ.5వేలు,యూపీఎస్‌లకు రూ.12వేలు, హై స్కూళ్లకు రూ.7వేల విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే, నిర్వహణ ఖర్చు ల కింద మూడు తరగతి గదులు ఉంటే రూ.5వేలు, అంత కంటే ఎక్కువ గదులు ఉన్న స్కూళ్లకు రూ.10 వేల చొప్పున ఇస్తారు. ఇక ఒక్కో మండల రిసోర్స్ సెంటర్‌కు రూ.80వేలు, స్కూల్ కాంప్లెక్స్‌కు రూ.22 వేల చొప్పున కేటాయించాల్సిన నిధులు విడుదల కాలేదు. ఇంకా ఆర్‌వీఎం పరిధిలో నిధుల లేమితో 135 తరగతి గదుల నిర్మాణం ప్రారంభం కాలేదు.
 
నెలల క్రితమే ఆమోదం

రాజీవ్ విద్యామిషన్(ఆర్‌వీఎం) జిల్లా ప్రాజెక్టు పరిధిలో జిల్లాకు వివిధ పనుల నిమిత్తం రూ. 150.52కోట్ల నిధులు కావాలని అధికారులు కొన్ని నెలల క్రితమే ప్రణాళికలను ఉన్నతాధికారులు పం పించారు. అయితే, ప్రణాళికలకు అప్పట్లోనే అనుమతి లభించింది. ఎస్‌ఎస్‌ఏ కింద రూ.112 కోట్ల 90 లక్షలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాల యాల్లో సివిల్ పనుల కోసం రూ.12కోట్ల 29లక్షలు, కేజీబీవీ ల నిర్వహణ కోసం రూ.25 కోట్ల 32లక్షల బడ్జెట్‌కు మంజూరు లభించగా, ప్రొసీడింగ్స్ కూడా అందా యి.

ఈ నిధుల్లో కేంద్రప్రభుత్వం 65శాతం, రాష్ట్ర ప్రభుత్వం 35శాతం నిధులను కేటాయించి మూడు నెలలకోసారి విడుదల చేస్తారు. అయితే, ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు రూ. 11.23 కోట్లే మంజూరు చేయడం గమనార్హం. ఫలి తంగా చాలా కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇం కా కేజీబీవీల నిర్వహణతో పాటు ఐఈఆర్‌టీలు, సీ ఆర్‌పీలు, మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, మె స్సేంజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫిజియోథెరపిస్టులు, ఆర్‌వీఎంలోని వివిధ కేటగిరీల ఉద్యోగులు, పార్‌‌టటైం ఇన్‌స్ట్రక్టర్లకు వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయి.

ఇటీవల రూ.కోటి విడుదల కాగా, వేతనాల్లో కొంత భాగం అందజేశారు. ఇక ప్రస్తుతం నిధులు విడుదల కాకపోతే అక్టోబర్ నెలకు సంబంధించి నవంబర్‌లో ఇవ్వాల్సిన వేతనాలకు ఇబ్బంది ఏర్పడుతుందని చెబుతున్నారు. అలాగే, ఉపాధ్యాయుల శిక్షణకు కూడా విఘాతం కలుగుతుందని భా విస్తున్నారు. ఇంకా మదర్సాల్లో విద్యావలంటీర్లను నియమించడం కష్టమేనని పేర్కొంటున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడ్డాక కేంద్రం నుంచి వచ్చే మొదటి క్వార్టర్ నిధులు ఏపీ అకౌంట్‌లోకి వెళ్లిపోయాయి.

ఇందులో తెలంగాణ రాష్ర్ట వాటా ఉన్నా విషయాన్ని గుర్తించేలోగానే సమయం గడిచిపోయింది. ఈ నిధులను తిరిగి తెచ్చుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అలాగే, త్వరలో కేంద్రం నుంచి విడుదల కానున్న రెండో క్వార్టర్ నిధులనైనా తెలంగాణ రాష్ట్రం అకౌంట్‌లోకి తెచ్చుకుంటేనే ఫలితముంటుందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆర్‌వీఎంకు రావాల్సిన నిధుల విడుదలపై ప్రభుత్వం స్పందించకపోతే అభివృద్ధి పనులే కాకుం డా పలువురు ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కూడా కష్టమేనని తెలుస్తోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement