నాతవరం/దేవరాపల్లి : జిల్లాలోని తాండవ, రైవాడ జలాశయాల నీటిని ఆయకట్టు భూములకు బుధవారం విడుదల చేశారు. రైవాడ నుం చి 250 క్యూసెక్కుల నీటిని మాడుగుల ఎమ్మె ల్యే బూడిముత్యాలనాయుడు విడుదల చేయ గా, తాండవ నుంచి 230 క్యూసెక్కులు డీఈ షణ్ముఖరావు వదిలారు. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఎన్.రాంబాబు రైవా డ జలాశయాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలు డీఈఈ ఎ.సునీతను అడిగి తెలుసుకున్నా రు.
అనంతరం రెగ్యులేటింగ్ గేట్లు, జనరేటర్ రూమ్‌లను పరిశీలించి వాటి సామర్థ్యాన్ని ఇంజినీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నా రు. తాండవ రిజర్వాయరు దిగువన ఉన్న వినాయక, శ్రీనల్లగోండమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం మూహర్తం ప్రకారం పూజలు చేసి ప్రధాన గే ట్లు ఎత్తి నీటిని విడుద ల చేశారు. డీఈ మాట్లాడుతూ విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు పరిధి ఆరు మండలాల్లోని 51,640 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు.
కుడికాలువ ద్వారా 50 క్యూసెక్కులు,ఎడమ కాలువు ద్వారా 180 క్యూసెక్కులు తాండవ కాలువులోకి విడుదల చేశామన్నారు. క్రమేపి రెండు కాలువుల ద్వారా 550 క్యూసెక్కులు నీటిని అయకట్టుకు విడుదలకు ఏర్పాట్లు చేశామన్నారు. గతేడాది తుఫాన్లప్పుడు కుడి, ఎడమ కాలువలకు 52 చోట్ల గండ్లు పడ్డాయని, వాటి మరమ్మతులకు రూ.3.5కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. నీరు వృథా కాకుండా సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్యేల్యే వేచలపు శ్రీరామమూర్తి, నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ చెర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు, నాతవరం ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేముడు, మండల టీడీపీ అధ్యక్షుడులాలం అచ్చిరాజు, ఎంపీటీసీ సభ్యుడు కాశపు నూకరాజు, జేఈ వేణుగోపాలనాయుడు పాల్గొన్నారు.
రైవాడ నుంచి....
మండలంలోని రైవాడ జలాశయం నుంచి ఆ యకట్టు భూములకు 250 క్యూసెక్కుల నీటిని బుధవారం సాయంత్రం మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడు విడుదల చేశారు. ఖరీఫ్ వరినాట్లుకు నీరు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని సాగునీటి సంఘా ల ప్రతినిధులు ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎడమకాలువ ద్వారా 175 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 75 క్యూసెక్కుల నీరు విడుదలకు అధికారులు అంగీకరించారు. దీంతో నీటి పారుదల శాఖ ఎస్‌ఈ ఎన్.రాంబాబు సమక్షంలో ఎమ్మెల్యే ముత్యాలునాయుడు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి ఆయకట్టు భూ ములకు సైతం సాగునీరు అందేలా సాగునీటి సంఘాల ప్రతినిధులు కృషిచేయాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.
జీవీఎంసీ బకాయిలు విడుదల చేయాలి: ఎమ్మెల్యే బూడి
తాగునీటి అవసరాల కోసం రైవాడ నుంచి నీటిని తీసుకుంటున్న జీవీఎంసీ సుమారు రూ.90 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఇందుకు ఇరిగేషన్ అధికారులు కృషిచేయాలని ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడు ఎస్‌ఈ ఎన్.రాంబాబును కోరారు. అలాగే జలాశయంలో పూడికతీత, విద్యుత్ పునరుద్ధరణ, పలు అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే ఎస్‌ఈకి వివరించారు. కార్యక్రమంలో డీఈఈ ఎ.సునీత, ఏఈ అర్జున్, జలాశయం చైర్మన్ బొడ్డు వెంకటరమణ, నీటిసంఘాల అధ్యక్షులు రెడ్డి బలరాం, తాతంనాయుడు, దొగ్గ భూషణం, కర్రి సత్యం, వి.రామునాయుడు, చలుమూరి చంద్రమోమన్, వంటాకు సింహాద్రప్పడు, మతల రాజునాయుడు, వల్లునాయుడు పాల్గొన్నారు.
తాండవ, రైవాడ నీరు విడుదల
Published Thu, Aug 7 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement
Advertisement