ముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన, డుడుమ జలాశయాల్లో నీటి మట్టాలు సోమవారంనాటికి ప్రమాదస్థాయికి చేరాయి. ప్రాజెక్టు అధికారులు రెండు రోజులుగా జోలాపుట్టు రిజర్వాయర్ నుంచి డుడుమ (డైవర్షన్) డ్యామ్‌కు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో డుడుమ నుంచి దిగువన ఉన్న బలిమెల రిజర్వాయర్‌కు సోమవారం నుంచి 4500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
దీంతో బలిమెల రిజర్వాయర్‌లో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగి ప్రమాద స్ధాయికి
చేరింది. నీటి విడుదలను ఆపేయాలని బలిమెల అధికారులు కోరడంతో జోలాపుట్టు రిజర్వాయర్ నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని తగ్గించి రెండు వేల క్యూసెక్కులు మాత్రమే ప్రస్తుతం విడుదల చేస్తున్నట్టు ఈఈ(సివిల్) బి.ఎం.లిమా తెలిపారు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 2749.50 అడుగుల నీరు నిల్వ ఉండగా, ఇన్‌ఫ్లో రెండు వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోందన్నారు.
డుడుమ డ్యాం నుంచి నీటి విడుదలను మంగళవారం నిలిపివేస్తామన్నారు. మూడు జలాశయాల్లో నీటి మట్టాలు ప్రమాద స్ధాయిలో ఉన్నాయి. ఇలాంటప్పుడు భారీ వర్షలు కురిస్తే మత్స్యగెడ్డ పరివాహాక ప్రాంతాల గ్రామాలకు, రిజర్వాయర్లకు ప్రమాదాలు వాటిల్లుతుందని ప్రాజెక్టు అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రమాద స్థాయిలో జోలాపుట్టు
Published Tue, Oct 28 2014 12:36 AM | Last Updated on Sat, Aug 18 2018 4:35 PM
Advertisement
Advertisement