కరోనా వైరస్ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేసింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నిర్వహించి మీడియా సమీక్షలో పలు కీలక చర్యల్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ నిర్ణయాన్ని ఆమె అభినందించారు. మరోవైపు నిబంధనలకు విరుద్దంగా ఏపీ సరిహద్దు వద్దకు వస్తున్నవారిని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. గురువారం చోటు చేసుకున్న మరిన్ని ఘటనలు తెలుసుకోవడం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment