ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. యితే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు లేకుండా ఏకపక్షంగా ఈ ఎన్నికలను వాయిదా వేయడమంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆయన ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. ఇదిలా ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక మేరకు కరోనా వైరస్ 135 దేశాల్లో విస్తరించింది. ఆదివారం ఉదయం నాటికి లక్షా యాభై రెండు వేలకుపైగా కరోనా బారిన పడ్డారు. కరోనా వ్యాప్తి చెందకుండా అనేక దేశాలు అత్యవసర పరిస్థితులను ప్రకటించి చర్యలు చేపట్టాయి. ఆదివారం చోటు చేసుకున్నమరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment