అమ్మా.. ఇంత దారుణమా..!
అమ్మా.. ఇంత దారుణమా..!
Published Tue, Aug 9 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
నిజాంసాగర్: నిండుగా నీటితో కళకళలాడాల్సిన నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు లేక బోసిపోవడంతో ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ ఆశ్చర్యపోయారు. జిల్లాకు సాగు, తాగు నీరు అందించే ప్రాజెక్టు ఆగస్టులో ఇంత దారుణంగా ఉండటం ఊహించలేదన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో నిర్వహించిన మల్లన్నసాగర్ సాధన సదస్సుకు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అమ్మా ఇంతదారుణమా అన్నారు. అంతకుముందు ప్రాజెక్టు వరదగేట్ల వద్ద అడుగంటిన నీటి మట్టాని ఆయన తెలుసుకున్నారు. ప్రాజెక్టు వరద గేట్లు, ఆయకట్టు, నీటి మట్టాలను ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జెడ్పీచైర్మన్ దఫేదార్ రాజును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు తదితరులున్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
ఆలయాలు, ప్రభుత్వ స్థలాలతో పాటు ఖాళీ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టపై సిద్ధి వినాయక ఆలయంలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఆలయం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హరితహారం కార్యక్రమంలో జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామాల వారిగా నాటిన మొక్కల సంరక్షణపై అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. ఆలయాల వద్ద నాటిన మొక్కలను పూజారులు సంరక్షించాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంపగోవర్దన్, ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జెడ్పీచైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాజేశ్వర్, డీసీసీబీ చైర్మన్ ముజుబోద్దిన్, ఆలయపూజారి సంజీవ్‌రావ్‌శర్మ నాయకులు తదితరులున్నారు.
Advertisement