wip
-
జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులకి అండగా నిలిచింది : ఏపీ చీఫ్ విప్ ప్రసాద రాజు
-
ధర.. దడ...
న్యూఢిల్లీ: ఇంధనం, ఆహార పదార్ధాల రేట్లు పెరగడంతో అక్టోబర్‌లో టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) ఆరు నెలల గరిష్టానికి ఎగిసి 3.59 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్‌లో ఇది 2.60 శాతంగా ఉండగా, గతేడాది అక్టోబర్‌లో 1.27 శాతంగానే నమోదయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 3.85 శాతం స్థాయి అనంతరం ఆరు నెలల తర్వాత అక్టోబర్‌లో నమోదైనదే అత్యధికం కావడం గమనార్హం. కేంద్ర గణాంకాల శాఖ మంగళవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రెట్టింపై 4.30 శాతానికి చేరింది. ఉల్లి రేట్లు ఏకంగా 127.04 శాతం ఎగియగా, కూరగాయల ధరలు 36.61 శాతం, గుడ్లు..మాంసం.. చేపల విభాగం 5.76 శాతం మేర పెరిగాయి. ఇక మిగతా విభాగాల సంగతి చూస్తే.. ♦ తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి 2.6%గా నమోదైంది. సెప్టెంబర్‌లో 2.7%. ♦ ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 9.01% ఉండగా.. అక్టోబర్‌లో 10.52%కి పెరిగింది. పప్పు ధాన్యాలు 31%, బంగాళదుంప 44%, గోధుమలు 2% ప్రతికూల ద్రవ్యోల్బణం నమోదు చేశాయి. యథాతథంగానే వడ్డీ రేట్లు.. డబ్ల్యూపీఐలోని కూరగాయలు, పండ్లు, ముడిచమురు, సహజ వాయువు, ఇంధనాలు, ఖనిజాలు, విద్యుత్ మొదలైన అన్ని విభాగాలు భారీగానే పెరిగినట్లు కన్సల్టెన్సీ సంస్థ ఇక్రా ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. డబ్ల్యూపీఐ ఊహించిన దానికన్నా అధికంగానే పెరిగిన నేపథ్యంలో రాబోయే పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచే అవకాశాలు ఉన్నాయని నాయర్ తెలిపారు. డిసెంబర్ 6న ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్వహించనుంది. ఆహార పదార్ధాల రేట్ల పెరుగుదలతో రిటైల్ ద్రవ్యోల్బణం 7 నెలల గరిష్టమైన 3.58%కి ఎగిసిన సంగతి తెలిసిందే. అటు తయారీ రంగం అంతంత మాత్రం పనితీరుతో పాటు కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి తగ్గుదలతో పారిశ్రామికోత్పత్తి సెప్టెం బర్లో 3.8% మాత్రమే వృద్ధి నమోదు చేసింది. కాగా, ఇటీవలే 200 ఉత్పత్తులపై వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ)ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆహార, పానీయాల రేట్లు తగ్గొచ్చని ఆర్థిక సేవల సంస్థ నొమురా ఒక నివేదికలో పేర్కొంది. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం సైతం ప్రస్తుత స్థాయి నుంచి 20 బేసిస్ పాయింట్ల (0.2 శాతం) మేర తగ్గొచ్చని తెలిపింది. -
రెండేళ్ల గరిష్ట స్థాయికి టోకు ధరలు
• ఆగస్టులో 3.74 శాతం • ఆహార ధరలు 8.23 శాతం అప్ న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ధరల పెరుగుదల రేటు ఆగస్టులో 3.74 శాతంగా నమోదయ్యింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. సూచీలో దాదాపు 60 శాతంపైగా వాటా కలిగిన తయారీ విభాగంలో కొన్ని వస్తువులు, అలాగే పప్పు దినుసుల ధరల పెరుగుదల మొత్తం సూచీపై ప్రభావం చూపింది. అదీకాక గత ఆర్థిక సంవత్సరం ఇదే నెల (ఆగస్టు) ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా క్షీణతలో -5.06% వద్ద ఉండడం(బేస్ ఎఫెక్ట్) కూడా తాజా పెరుగుదలకు కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జూలైలో కూడా టోకు ద్రవ్యోల్బణం 3.55%గా నమోదయ్యింది. 2014 నవంబర్ నుంచి 2016 మార్చి వరకూ క్షీణతలో ఉన్న టోకు ద్రవ్యోల్బణం వరుసగా 7 నెలల నుంచీ ప్లస్‌లోకి మారింది. మూడు ప్రధాన విభాగాలను చూస్తే... - ఆహార, ఆహారేతర ఉత్పత్తులకు సంబంధించిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 7.47 శాతంగా నమోదయ్యింది. 2015 ఆగస్టులో ఈ రేటు - 4.21 శాతంగా ఉంది. ఇక ఇందులో భాగంగా ఉన్న ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం వార్షికంగా -1.02 శాతం క్షీణత నుంచి 8.23 శాతానికి ఎగసింది. నాన్-ఫుడ్ ఆర్టికల్స్ రేటు -0.45 శాతం నుంచి 8.44 శాతానికి చేరింది. నిత్యావసరాలకు సంబంధించి కూరగాయల ధరలు వార్షికంగా జూలైలో 28.05 శాతం పెరిగితే ఆగస్టులో ఈ రేటు 0.17 శాతంగానే ఉంది. పప్పుల ధర లు మాత్రం భారీగా 34.55 శాతం పెరిగినట్లు తాజా వాణిజ్య మంత్రిత్వశాఖ నివేదిక తెలిపింది. తయారీ రంగం వాటా -1.99% నుంచి 2.42 శాతానికి చేరింది. -
శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పంపిణీ
మంచిర్యాల రూరల్ : నేడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించకుండా స్వయం ఉపాధితో కూడా ముందుకు సాగి అభివృద్ధి పథంలో నడవాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. గురువారం మంచిర్యాల ఈజీఎస్ ఏపీడీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో డ్రైవింగ్ కోర్సులో ఉచిత శిక్షణ, భోజన, వసతి సౌకర్యాలు కల్పించి నెలరోజుల పాటు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం కలిపించే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పనలో ముందుందన్నారు. మంచిర్యాల ఈజీఎస్ ఏపీడీ మల్లేశ్ మాట్లాడుతూ, జాబ్‌కార్డు ఉన్న కుటుంబాల్లో వంద రోజులు పని చేసిన ఆయా కుటుంబాల్లోని యువతకు డ్రైవింగ్ కోర్సు ద్వారా 35 మంది శిక్షణ పొందారని, త్వరలోనే మరో 45 మందికి డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం 1228 మంది యువత ఉండగా ఇందులో 30 మంది ఫ్యాషన్ డిజైన్, 45 కంప్యూటర్ కోర్సు, 20 మంది వైండింగ్, 25 మంది హౌజ్ వైరింగ్, 30 మంది టైలరింగ్‌లో శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, ఎంపీపీ బేర సత్యనారాయణ, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, మున్సిపల్ కౌన్సిలర్ దెబ్బటి శ్రీనివాస్, ఏపీఓ నవీణ్, డ్రైవింగ్ శిక్షణ కోర్సు డైరైక్టర్ సత్యనారాయణ, ఎస్బీహెచ్ ఆర్ఎస్ఈటీఐ డిప్యూటీ డైరైక్టర్ ఆశన్న, స్థానికులు, శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు. -
అమ్మా.. ఇంత దారుణమా..!
నిజాంసాగర్: నిండుగా నీటితో కళకళలాడాల్సిన నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు లేక బోసిపోవడంతో ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ ఆశ్చర్యపోయారు. జిల్లాకు సాగు, తాగు నీరు అందించే ప్రాజెక్టు ఆగస్టులో ఇంత దారుణంగా ఉండటం ఊహించలేదన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో నిర్వహించిన మల్లన్నసాగర్ సాధన సదస్సుకు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అమ్మా ఇంతదారుణమా అన్నారు. అంతకుముందు ప్రాజెక్టు వరదగేట్ల వద్ద అడుగంటిన నీటి మట్టాని ఆయన తెలుసుకున్నారు. ప్రాజెక్టు వరద గేట్లు, ఆయకట్టు, నీటి మట్టాలను ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జెడ్పీచైర్మన్ దఫేదార్ రాజును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు తదితరులున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి ఆలయాలు, ప్రభుత్వ స్థలాలతో పాటు ఖాళీ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టపై సిద్ధి వినాయక ఆలయంలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఆలయం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హరితహారం కార్యక్రమంలో జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామాల వారిగా నాటిన మొక్కల సంరక్షణపై అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. ఆలయాల వద్ద నాటిన మొక్కలను పూజారులు సంరక్షించాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంపగోవర్దన్, ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జెడ్పీచైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాజేశ్వర్, డీసీసీబీ చైర్మన్ ముజుబోద్దిన్, ఆలయపూజారి సంజీవ్రావ్శర్మ నాయకులు తదితరులున్నారు. -
జీఎస్టీ బిల్లుకు ఓటేయండి: టీఆర్ఎస్
హైదరాబాద్: జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ ఎంపీలు జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని కోరింది. ఈ మేరకు విప్ జారీ చేసింది. కాగా సోమవారం లోక్ సభలో జీఎస్టీ బిల్లు ఆమోదానికి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ తొలి పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ జీఎస్టీకు అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
అసెంబ్లీలో విప్‌లు ఏరీ..?!