
జీఎస్టీ బిల్లుకు ఓటేయండి: టీఆర్ఎస్
హైదరాబాద్: జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ ఎంపీలు జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని కోరింది. ఈ మేరకు విప్ జారీ చేసింది. కాగా సోమవారం లోక్ సభలో జీఎస్టీ బిల్లు ఆమోదానికి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ తొలి పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ జీఎస్టీకు అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.