GST Bill
-
‘జీఎస్టీ లక్కీ డ్రా’ షురూ.. రెడీగా రూ. 30 కోట్లు!
GST reward scheme: జీఎస్టీ లక్కీ డ్రా 'మేరా బిల్ మేరా అధికార్'(Mera Bill Mera Adhikar) పథకం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శుక్రవారం (సెప్టెంబర్ 1) ప్రారంభమైంది. కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రివార్డ్ స్కీమ్ కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 30 కోట్ల కార్పస్‌ను కేటాయించాయి. ‘మేరా బిల్ మేరా అధికార్’ మొబైల్ యాప్‌ను ఇప్పటివరకు 50,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తెలిపారు. రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ 'మేరా బిల్ మేరా అధికార్' జీఎస్టీ లక్కీ డ్రాను ఆరు రాష్ట్రాల్లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభిస్తున్నామని, ప్రైజ్ మనీని కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమానంగా జమచేస్తాయని తెలిపారు. ఇదీ చదవండి: High Profit Farming Business: ఈ గడ్డి సాగుతో రూ. లక్షల రాబడి.. పెట్టుబడీ తక్కువే! అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సెప్టెంబర్ 1న ప్రయోగాత్మకంగా మేరా బిల్ మేరా అధికార్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి నెలా 810 లక్కీ డ్రాలు ఉంటాయి. అలాగే ప్రతి త్రైమాసికంలో రెండు బంపర్ లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. నెలవారీ డ్రాలలో ఒక్కో విజేతకు రూ.10,000 చొప్పున 800 మందికి అందిస్తారు. రూ. 10 లక్షల బహుమతితో 10 డ్రాలు ఉంటాయి. ఇక ప్రతి త్రైమాసికంలో రెండు బంపర్ డ్రాలలో ఒక్కో విజేతకు రూ.1 కోటి ఉంటుంది. -
జీఎస్టీ రివార్డ్ స్కీమ్.. సెప్టెంబర్ 1 నుంచే..
GST reward scheme: జీఎస్టీ బిల్లు అప్లోడ్ చేస్తే నగదు బహుమతులిచ్చే 'మేరా బిల్ మేరా అధికార్' (Mera Bill Mera Adhikaar Scheme) జీఎస్టీ రివార్డ్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. కొనుగోలుదారులు ప్రతి ఒక్కరూ బిల్లును అడిగి తీసుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకం తొలుత ఆరు రాష్ట్రాల్లో అమలు కానుంది. అమలయ్యే రాష్ట్రాలు ఇవే.. 'మేరా బిల్ మేరా అధికార్' జీఎస్టీ రివార్డ్ స్కీమ్‌ను మొదటి దశలో అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు, పుదుచ్చేరి, డామన్ & డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) తెలిపింది. ఈ మేరకు స్కీమ్ వివరాలతో ట్వీట్ చేసింది. అందుబాటులోకి మొబైల్ యాప్ 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ యాప్‌ను సీబీఐసీ ఇప్పటికే ఐవోఎస్, ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైన వస్తువు కొలుగోలు చేసినప్పుడు విక్రేత ఇచ్చిన బిల్లును ఈ యాప్‌లో అప్లోడ్ చేయడం ద్వారా నగదు బహుమతులు పొందవచ్చు. అప్లోడ్ చేసే బిల్లులో విక్రేత జీఎస్టీఐఎన్, ఇన్వాయిస్ నంబర్, చెల్లించిన మొత్తం, పన్ను మొత్తానికి సంబంధించిన వివరాలు ఉండాలి. రూ. కోటి వరకూ ప్రైజ్ మనీ జీఎస్టీ నమోదు చేసుకున్న దుకాణాలు, సంస్థలు ఇచ్చే బిల్లులను 'మేరా బిల్ మేరా అధికార్' యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. ఇలా అప్లోడ్ బిల్లులన్నీ నెలకోసారి, మూడు నెలలకోసారి లక్కీ డ్రా తీస్తారు. విజేతలకు రూ. 10 వేల నుంచి రూ. 1 కోటి వరకు నగదు బహుమతులు అందజేస్తారు. లక్కీ డ్రాకు అర్హత పొందేందుకు కనీస కొనుగోలు విలువ రూ. 200 ఉండాలి. ఒక నెలలో గరిష్టంగా 25 బిల్లులను అప్లోడ్ చేయవచ్చు. ఇదీ చదవండి: ‘జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయం పోతోంది’.. ఎవరన్నారీ మాట? Mera Bill Mera Adhikaar Scheme! 👉 Launch from States of Haryana, Assam, Gujarat & UTs of Dadra & Nagar Haveli, Daman & Diu & Puducherry on 01/09/23. 👉Invoice incentive scheme which allows you to earn cash prizes on upload of GST Invoices.#Mera_Bill_Mera_Adhikaar pic.twitter.com/imH9VkakiY — CBIC (@cbic_india) August 22, 2023 -
పైసా వసూల్, జీఎస్టీ పన్ను లక్షకోట్లను దాటేసింది!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత ఉత్తేజాన్ని ప్రతిబింబిస్తూ, వరుసగా రెండవనెల ఆగస్టులోనూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు లక్ష కోట్లకు అధిగమించాయి. రూ.1,12,020 కోట్లుగా నమోదయ్యాయి. 2020 ఆగస్టుతో (రూ.86,449 కోట్లు) పోల్చితే ఈ నిధులు 30 శాతం అధికం కావడం గమనార్హం. కోవిడ్ ముందస్తు స్థాయి ఆగస్టు 2019 (రూ.98,202 కోట్లు) కన్నా కూడా ఈ నిధులు 14 శాతం అధికం కావడం మరో విషయం. జులై, ఆగస్టు మాసాల్లో తిరిగి రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదవడం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సంకేతమని ఆర్థిక శాఖ విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతోపాటు ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడం వంటి కారణాలు కూడా జీఎస్టీ వసూళ్లలో పెరుగుదలకు కారణమైనట్లు తెలిపింది. ప్రభుత్వం ఈ మేరకు బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. వేర్వేరుగా ఇలా... ►సెంట్రల్ జీఎస్టీ రూ.20,522 కోట్లు ►స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (రాష్ట్రాల మధ్య వస్తు, సేవల రవాణాకు సంబంధించి వసూళ్లు– ఐజీఎస్టీ) రూ.56,247 కోట్లు. (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.26,884 కోట్లుసహా) ► సెస్ రూ.8,646 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.646 కోట్లుసహా). అప్పడానికి జీఎస్టీ వర్తించదు కాగా అప్పడానికి జీఎస్టీ వర్తించబోదని పరోక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాల కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) వివరణ ఇచ్చింది. పేరు లేదా ఆకారంతో సంబంధం లేకుండా.. పాపడ్‌కు జీఎస్టీ వర్తించబోదని స్పష్టం చేసింది. ‘‘గుండ్రంగా ఉన్న పాపడ్‌కు జీఎస్టీ నుండి మినహాయింపు ఉంది. చదరపు పాపడ్‌కు జీఎస్టీ వర్తిస్తుందని మీకు తెలుసా? నాకు ఈ లాజిక్ అర్థం అయ్యేలా మంచి చార్టర్డ్ అకౌంటెంట్ని ఎవరైనా సూచించగలరా?’’ అని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్షా గోయెంకా మంగళవారం చేసిన ట్వీట్ నేపథ్యంలో సీబీఐసీ తాజా వివరణ ఇచ్చింది. చదవండి: ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!? -
మండలిలో రెండు బిల్లులు పాస్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, వస్తు సేవల పన్ను సవరణ బిల్లులకు శాసనమండలి ఆమోదముద్ర వేసింది. సోమవారం మండలిలో పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసినందున.. దానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని భావించినా, ఆ అంశం న్యాయ పరిధిలో ఉన్నందున సాధ్యపడలేదని మంత్రి వివరణ ఇచ్చారు. బీసీలకు న్యాయం చేసింది కేసీఆర్ సర్కారేనని, వారి అభిమానంతోనే మరోసారి విజయం సాధించామన్నారు. బీసీలకు ఏదో చేసినట్లు మాట్లాడటం భావ్యం కాదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకపోవడం శోచనీయమని, మైనార్టీలు, బీసీలకు ఈ రిజర్వేషన్ల వల్ల అన్యాయం జరిగిందని వాపోయారు. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం మేరకు రిజర్వేషన్లు కల్పించినా.. మానవీయకోణంలో ఈ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిం చేందుకు ఉద్దేశించిన బీసీ(ఈ) వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ అంశాన్ని బిల్లులో ఎలా పొందుపరుస్తారని రామచంద్రరావు (బీజేపీ) ప్రశ్నించారు. 50 శాతం రిజర్వేషన్లలో వీటిని పరిగణనలోకి తీసుకోవడంపై సమీక్షించాలన్నారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు మజ్లిస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ జాఫ్రీ స్పష్టం చేశారు. జీఎస్టీ తగ్గింపుతో ఊరట రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితోనే వస్తు, సేవల పన్ను విధింపును కేంద్రం సరళీకరించిందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండలిలో జీఎస్టీ–2019 బిల్లును మండలిలో ప్రవేశపెట్టారు. పన్ను ఎక్కువగా ఉంటే.. ఎగవేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందనే తమ వాదనను కేంద్రం అంగీకరించిందన్నారు. బీడీలపై 28 శాతం జీఎస్టీ వసూలు చేయడం సరికాదని, ధూమపానం చేసేవారి సంఖ్య ను తగ్గించేందుకే భారీగా పన్ను వడ్డించామనే కేం ద్రం వాదన అర్థరహితమన్నారు. ఉత్తర తెలంగాణ లో సుమారు 5 లక్షల మంది పేదలు బీడీ తయారీపై ఆధారపడి జీవిస్తున్నారని, బీడీలపై భారీ పన్ను వల్ల వారంతా రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందంటూ సభ్యుడు రాజేశ్వర్‌రావు అడిగిన ప్రశ్నకు ఈటల సమాధానమిచ్చారు. పెట్రోలియం, మద్యం అమ్మకాలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, తద్వారా ధరల నియంత్రణ సాధ్యపడుతుందని మజ్లిస్ ఎమ్మెల్సీ జాఫ్రీ అభిప్రాయపడ్డారు. జీఎస్టీతో పన్ను ఎగవేతదారుల సంఖ్య తగ్గిందని, భారీగా ఆదాయం సమకూరుతుందని బీజేపీ సభ్యుడు రామచంద్రరావు అన్నారు. జీఎస్టీ అంటే గబ్బర్‌సింగ్ టాక్స్ అని, రైతులు, చిన్న, మధ్యతరగతి ప్రజలపై గుదిబండగా మారిందని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. -
ఛాతీ పెద్దదే, కానీ...
సాక్షి, న్యూఢిల్లీ : విశాలమైన ఛాతీ ఉందనే ప్రధాని నరేంద్ర మోదీకి చాలా చిన్న హృదయం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘భారతీయ దార్శనికతను అర్థం చేసుకుని, అభివృద్ధి చేసే సామర్థ్యం ఉన్నాయని ఆశించారని ప్రజలు ఆయన(మోదీ)కు పట్టం కట్టారు. నేడు అదంతా తలక్రిందులయ్యింది. ప్రతి వ్యక్తీ దొంగేనని ఆయన, ఆయన ప్రభుత్వం అనుకుంటున్నాయి’’ అని రాహుల్ ఆరోపించారు. గురువారం పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గురువారం నిర్వహించిన 112వ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. డబ్బంతా నల్లధనం కాదని, అలాగని నల్లధనమంతా నగదు కాబోదని అని మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఛలోక్తులు విసిరాడు. పాతనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని కానీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంతా సవ్యంగా ఉందన్న ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నాడు. ప్రధాని మోదీ ప్రజలపై ఒకదాని వెంట మరోక(నోట్ల రద్దు, జీఎస్టీ) దెబ్బలు వేశారు. అవి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయి అని రాహుల్ చెప్పారు. స్టార్టప్ ఇండియాకు తాను మద్ధతు తెలుపుతానని. కానీ, అది షట్ అప్ ఇండియా(మూసివేత)కు దారి తీసేలా ఉండకూడదని అన్నారు. నవంబరు 8న రూ.500, రూ.1,000 నోట్ల వర్థంతి దినం పాటిస్తామన్నారు. తాజ్ మహల్ వివాదంపై స్పందిస్తూ... ప్రజలంతా ఒకప్పుడు నేతల నుంచి నైతిక విలువలు కోరుకునేవారు. కానీ, ఇప్పుడు చారిత్రక కట్టడాలను భారతీయులు కట్టారా? వేరే వాళ్లు కట్టారా? అంటూ నేతలు చేస్తున్న వాదనలు చూసి ప్రపంచం మొత్తం నవ్వుకుంటుందని చెప్పారు. ఈ మూడేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘటనను ఎంఎండీ( మోదీ మేడ్ డిజాస్టర్- మోదీ చేసిన విధ్వంసం)గా రాహుల్ అభివర్ణించారు. నిరుద్యోగం పెరిగిపోయిందని.. చైనాలో రోజుకి 50,000 ఉద్యోగాల కల్పన అందిస్తుంటే.. ఇండియాలో కేవలం 458 మాత్రమే ఉందన్నారు. ఉద్యోగాల రూపకల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని ఆక్షేపించారు. అంతకు ముందు ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలకు రాహుల్ ట్విట్టర్ లో కౌంటర్ వేసిన విషయం తెలిసిందే. పాతనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఐసీయూలో ఉందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జైట్లీ మెడిసిన్లకు (ఆలోచనా శక్తికి) ఆర్థిక వ్యవస్థకు పట్టిన జబ్బును నయం చేసే శక్తి లేదని చురకలంటించారు. -
రైతు కోసం నిమిషం కేటాయించలేరా?
బన్స్వారా: జీఎస్టీ కోసం పార్లమెంట్‌ను అర్ధరాత్రి సమావేశపర్చిన కేంద్ర ప్రభుత్వం.. రైతు సమస్యలపై చర్చకు ఒక్క నిమిషం కూడా కేటాయించలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుపట్టారు. రాజస్తాన్‌లోని బన్స్వారాలో కిసాన్ ఆక్రోశ్ ర్యాలీని ఉద్దేశించి బుధవారం ప్రసంగిస్తూ.. చిన్న వ్యాపారుల ప్రయోజనాల్ని విస్మరిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం హడావుడిగా జీఎస్టీని అమల్లోకి తెచ్చిందని ఆరోపించారు. ‘ప్రపంచం, అమెరికా అధ్యక్షుడి ముందు గొప్ప కోసం జీఎస్టీ బిల్లును అర్ధరాత్రి అమల్లోకి తెచ్చారు. అయితే భారత్ రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారుల దేశం. అంతేకానీ అమెరికాది కాదు’ అని పేర్కొన్నారు. -
ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
జీఎస్టీకి నిరసనగా కాంగ్రెస్ ధర్నా
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనున్న జీఎస్టీకి నిరసనగా కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీకి నిరసనగా గురువారం ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ నేతలు వి. హనుమంతరావు ధర్నా చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా మాజీ విప్ జగ్గారెడ్డి కూడా ధర్నాలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
'కొత్త మార్పులకు జీఎస్టీ నాంది'
విశాఖపట్నం: దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు జీఎస్టీ ఉపయోగపడుతుంది. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే వ్యవస్థ జీఎస్టీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ రోజు ఆయన విశాఖలో మాట్లాడుతూ.. రకరకాల పన్నుల విధానం వల్ల అధికారులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. జీఎస్టీతో పన్ను ఎగవేత దారులకు చెక్ పెట్టొచ్చు. దేశంలో రాబోయే కొత్త మార్పులకు జీఎస్టీ నాంది పలుకుతుంది. వస్తుసేవల పన్ను విధానం పై అవగాహన కల్పించాలి తప్పితే వేధింపులకు గురిచేయవద్దు. వివిధ వర్తక వ్యాపార వర్గాల ప్రతినిధులు జీఎస్టీ వల్ల తాము ఎదుర్కొనే సమస్యల పై పీయూష్ గోయల్ కు రిప్రజంటేషన్స్ అందజేశారు. -
జీఎస్టీతో లాభమా ? నష్టమా ?
-
ఇండియా ఫస్ట్
సంస్కరణలతోనే విదేశీ పెట్టబడులను ఆకర్షించగలమని మోదీ ప్రభుత్వం విశ్వాసం. అందుకే దేశమంతటా ఒకే పన్ను విధానం ఉండాలనే దృఢ సంకల్పంతో... ఎన్ని అడ్డంకులు ఎదురైనా జీఎస్టి బిల్లు తెచ్చింది. రాష్ట్రాలను ఒప్పించి అమలు దశకు చేర్చింది. ఎఫ్‌డీఐలకు అనుమతులు, వ్యాపార అనుమతులను సరళతరం చేసింది.lమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... భారత్ పట్ల ప్రపంచదేశాల దృక్పథం బాగా మారింది. భారత్ బలమేమిటో, బలహీనతలేమిటో... మోదీకి స్పష్టంగా తెలుసు. అందుకే ‘మేకిన్ ఇండియా’ నినాదంతో విదేశీ పెట్టుబడులను, సాంకేతికతను ఆహ్వానించారు. అదే సమయంలో భారత ఉత్పత్తులకు మార్కెట్లను చూడటం అనేది కూడా భారత విదేశాంగ విధానంలో భాగమైంది. యాపిల్ లాంటి పెద్ద సంస్థ ఎంతగా ఒత్తిడి తెచ్చినా... మోదీ ప్రభుత్వం ఆ సంస్థ ఫోన్లను మరోచోటి నుంచి భారత్‌లోకి దిగుమతి చేసుకోవడానికి అంగీకరించలేదు. దాంతో భారత్‌లో ఫోన్ల తయారీ యూనిట్‌ను పెట్టడానికి యాపిల్ ముందుకు వచ్చింది. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 21 రంగాల్లో 87 ఎఫ్‌డీఐ నిబంధనలను మార్చారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 60 బిలియన్ డాలర్లు (3,93,000 కోట్ల రూపాయలు) ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇరుగుపొరుగుకు స్నేహహస్తం... పరస్పర సహకారం, భాగస్వామ్యంతో ప్రగతి సాధ్యమని భావించి భారత్... ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలకు ప్రాధాన్యమిచ్చింది. మోదీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలందరినీ ఆహ్వానించారు. చిన్న, పెద్ద దేశాలనే తేడా లేకుండా స్నేహహస్తం చాచింది. ప్రధానిగా మోదీ దేశాధినేతలతో నిరంతరం సంప్రదింపులు జరపడం, పర్యటనలు చేయడం మూలంగా ప్రాంతీయ సంబంధాలు బలపడ్డాయి. ఇటీవలే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు స్వాగతం పలకడానికి మోదీ ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లారు. బంగ్లాదేశ్‌తో మిత్రుత్వానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియచెప్పారు. దశాబ్దాలపాటు కొన్ని దేశాలకు భారత్ దూరంగా ఉంది. మోదీ ప్రధాని అయ్యాక అలాంటివేమీ లేకుండా... మనకు ప్రయోజనం అనుకున్న ప్రతి దేశంతోనూ సంబంధాలు నెరుపుతున్నారు. దక్షిణాసియా దేశాల కోసం 450 కోట్లు ఖర్చు పెట్టి రూపొందిన జీశాట్–9ను ఈ నెల 5న ప్రయోగించారు. 12 ఏళ్లపాటు సార్క్ దేశాలకు ఉచిత సేవలందించే ఈ ఉపగ్రహం ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయనుంది. అలాగే ఆఫ్గనిస్థాన్ పార్లమెంటు భవన నిర్మాణానికి భారత్ ఆర్థిక సహాయం చేసింది. ప్రపంచ సమస్యలపై... ప్రపంచం ముందున్న సవాళ్లపై చర్చల్లో భారత్ చొరవ తీసుకుంటోంది. బరువు బాధ్యతలు తీసుకుంటోంది. వివిధ అంశాలపై అగ్రరాజ్యాలతో, పలు ప్రపంచ, ప్రాంతీయ సంస్థలతో భారత్ కలిపి పనిచేస్తోంది. వాతావరణ మార్పు, సాంకేతిక సహకారం, తీవ్రవాదం, నైపుణ్య శిక్షణ, వాణిజ్య, సేవల ఒప్పందాలు, ఇంధన స్వాలంబన... అంతర్జాతీయ స్థాయిలో భారత్ చురుకుగా పనిచేస్తున్న రంగాలు. సాంస్కృతిక వారధి... ఆయా దేశాలతో మనకుగల సాంస్కృతిక సంబంధాలు, ఉమ్మడి విలువలు, సంప్రదాయాల గురించి తరచూ మాట్లాడటం ద్వారా మోదీ చారిత్రకంగా ఇరుదేశాల మధ్య అనుబంధం ఉందనేది గుర్తుచేస్తూ బంధాలను బలోపేతం చేస్తున్నారు. జపాన్, చైనా, మంగోలియా, బంగ్లాదేశ్, శ్రీలంకలకు వెళ్లినపుడు... మోదీ అక్కడి విఖ్యాత సాంస్కృతిక కేంద్రాలను సందర్శించారు. గత ఏడాది జూన్ 21న ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచదేశాలన్నీ యోగా డేను జరుపుకొన్నాయి. ఎన్ఆర్ఐలతో సన్నిహిత సంబంధాలు... మోదీ అధికారంలోకి వచ్చాక విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు (ఎన్ఆర్ఐలు) చేరువయ్యేందుకు, వారిలో విశ్వాసం పాదుకొల్పడానికి గట్టి ప్రయత్నమే చేశారు. అమెరికా, బ్రిటన్లలో పెద్ద స్టేడియాల్లో వేల సంఖ్యలో ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మాట్లాడటమే కాకుండా... వారు చేస్తున్న విజ్ఞప్తులపై విదేశాంగ శాఖ సత్వరం స్పందిస్తోంది. ఏ దేశానికి వెళ్లినా... అక్కడుండే భారతీయులను కలవడం మోదీ ఒక అలవాటుగా చేసుకొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి అజెండాలో భాగస్వాములయ్యేలా ఎన్ఆర్ఐలను ప్రొత్సహిస్తున్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని, ప్రభుత్వపరంగా నిబంధనలను సరళతరం చేస్తామని వారిని కోరుతున్నారు. (మరిన్ని వివరాలకు చదవండి) (కొంచెం మోదం! కొంచెం ఖేదం!!) (మోదీ మ్యానియా) (57 విదేశీ పర్యటనలు) (మోదీ ప్రజల ప్రధానే..!) -
రైతు సమస్యలపై దద్దరిల్లిన అసెంబ్లీ
-
రైతు సమస్యలపై దద్దరిల్లిన అసెంబ్లీ
- నిరసనల మధ్య జీఎస్టీ బిల్లుకు ఆమోదం - ఏకపక్షంగా మరో బిల్లుకూ ఆమోదముద్ర - రైతు సమస్యలపై చర్చకు విపక్షం పట్టు - పోడియంలో వైఎస్సార్ సీపీ ఆందోళన - గందరగోళం మధ్యే సీఎం చంద్రబాబు ప్రసంగం సాక్షి, అమరావతి: ఒకపక్క రోజురోజుకు పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు. మరోపక్క గిట్టుబాటు ధరకోసం రోడ్డెక్కుతున్న అన్నదాతలు. రాష్ట్రంలో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా అనిపించలేదు. అసెంబ్లీ చేరువలోని కృష్ణానదిలో దూకి ఇటీవలే మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నా కళ్లులేని కబోదిలానే ప్రభుత్వం వ్యవహరించింది. రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అసెంబ్లీలో గళమెత్తితే.. ఎప్పటిలాగే తమ అధికార బలంతో దానిని నొక్కేసింది. ప్రస్తుతం ధరల పతనంతో అల్లాడిపోతున్న తమను ఆదుకోవడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుపై ప్రకటన చేస్తారేమో నని ఆశగా ఎదురుచూసిన రైతులకు చివరకు నిరాశే మిగిలింది. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీని కేవలం 42 నిమిషాల్లోనే ప్రభుత్వం ముగించింది. జీఎస్టీ బిల్లుతో పాటు మరో బిల్లును ఆమోదించడానికి మాత్రమే పరిమితమైంది. మంగళ వారం ఉదయం స్పీకరు కోడెల శివప్రసాదరావు సభలోకి ప్రవేశించగానే రైతుల సమస్యలు, మిర్చి, పసుపు అమ్ముకోలేక రైతులు పడుతున్న కష్టాలు, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలపై అత్యవసరంగా చర్చకు అనుమతించాలంటూ వైఎస్సార్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు ప్రకటించారు. దీనికి నిరసనగా విపక్ష సభ్యులు పోడియంలోకి వెళ్లి రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ‘విహార యాత్రల్లో ముఖ్యమంత్రి.. ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు.., మిరప రైతులను ఆదుకోవాలి. పసుపు రైతుల బాధలు సర్కారుకు పట్టవా? వ్యవసాయం దండగన్న ముఖ్యమంత్రికి రైతుల బాధలెందుకు పడతాయి? మిర్చి రైతుల వ్యతిరేక సీఎం డౌన్‌డౌన్.. ఎన్నికల హామీని నెరవేర్చాలి. రూ. 5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి..’ అంటూ సభ నిరవధికంగా వాయిదా పడేవరకు ప్రతిపక్షసభ్యులు పోడియంలో నినాదాలు కొనసాగించారు. రైతు సమస్యలపై విపక్షసభ్యులు ఇంత ఆందోళన చేసినా ముఖ్యమంత్రి రెండుసార్లు సాగించిన ప్రసంగంలో ఎక్కడా అన్నదాతల విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. విప్లవాత్మక సంస్కరణ: సీఎం ఆర్థిక సంస్కరణల తర్వాత జీఎస్టీనే విప్లవాత్మక సంస్కరణని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించాలని విపక్ష ఆందోళన, నినాదాల మధ్యే సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రసంగం పూర్తికాగానే స్పీకరు సూచన మేరకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ‘ఆంధ్రప్రదేశ్ వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)’ బిల్లును ప్రతిపాదించారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాల హోరు మధ్యే బిల్లును సభ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. గందరగోళం మధ్యే బిల్లు పాసైంది. సింధుకు డిప్యూటీ కలెక్టరు కోసం చట్ట సవరణ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టరు పోస్టు ఇచ్చేందుకు వీలుగా చట్టసవరణకు అసెంబ్లీ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీసుల నియామకాల నియంత్రణ బిల్లును మంత్రి యనమల ప్రతిపాదించగా సభ ఆమోదించినట్లు స్పీకరు ప్రకటించారు. రైతుల ఇక్కట్లపై నోరు మెదపని పాలకపక్షం సభ ప్రారంభం నుంచి రైతు సమస్యలపై చర్చించాలని వైఎస్సార్ సీపీ సభ్యులు ఆందోళన చేస్తూనే వచ్చారు. రైతుల ఇక్కట్లపై ప్రకటన చేయడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీపై ఎదురుదాడికి మాత్రం సమయం కేటాయించడం గమనార్హం. విపక్షం విపరీత పోకడలు పోతోందని విమర్శించారు. సంతాప తీర్మానాలు, ఆ వెంటనే బిల్లులు ప్రవేశపెట్టడం, వాటిపై ఒకరిద్దరు మాట్లాడడం, మూజువాణి ఓటుతో ఆమోదించడం అసెంబ్లీలో చకచకా జరిగిపోయాయి. -
ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేకి సర్కార్
-
జీఎస్టీ బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
-
జీఎస్టీ బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
అమరావతి: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో జీఎస్టీ బిల్లును ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ బిల్లు వల్ల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఒకే దేశం...ఒకే పన్ను విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది మరో విప్లవాత్మక సంస్కరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పన్నులపై పన్నులు లేకుండా జీఎస్టీ బిల్లు ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు రైతులను ఆదుకోవాలని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఫ్లకార్డులతో ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే విపక్ష సభ్యుల నిరసనల మధ్యే జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది. జీఎస్టీ బిల్లు ఆమోదం అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అంతకు ముందు దేవినేని నెహ్రు, ఆరేటి కోటయ్య, రుక్మిణిదేవి, నారాయణరెడ్డి మృతికి సభ సంతాపం తెలిపింది. -
దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
-
రైతు సమస్యలపై వాయిదా తీర్మానం
అమరావతి: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే రూ.5వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం రాష్ట్ర శాసనసభతో పాటు శాసనమండలి ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాయి. ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ, ఉదయం 10.15 గంటలకు మండలి సమావేశాలు ఆరంభం కానున్నాయి. అంతకు ముందు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ నుంచి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. సమావేశాలను నాలుగు రోజులు జరపాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేయగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం జీఎస్టీ బిల్లును మాత్రమే ఆమోదించి ఒక్కరోజులోనే అసెంబ్లీ, మండలి సమావేశాలను ముగించాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్ఆర్ సీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ రైతు సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలపై కూడా చర్చించడానికి పట్టుబట్టనుంది. ప్రధానంగా మిర్చి రైతుల కష్టాలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సభలో ప్రస్తావించనున్నారు. -
నేడు అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశం
-
నేడు అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశం
- ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ, 10.15 గంటలకు మండలి సమావేశం - జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం భేటీ సాక్షి, అమరావతి: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం మంగళవారం రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ, ఉదయం 10.15 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందుగానే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే కేవలం జీఎస్టీ బిల్లును మాత్రమే ఆమోదించి అసెంబ్లీ, మండలి సమావేశాలను ముగించాలని నిర్ణయించింది. అయితే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలపై కూడా చర్చించడానికి పట్టుబట్టనుంది. ప్రధానంగా మిర్చి రైతులు పడుతున్న కష్టాలను సభలో ప్రస్తావించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. -
జీఎస్టీ బిల్లుకు ఆమోదం
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం సాక్షి, అమరావతి: జీఎస్‌టీృ2017 ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వెలగపూడి సచివాలయంలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల వేతనాలను 50 శాతం పెంచాలని గతంలో మంత్రుల బృందం చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. 2010 పీఆర్సీ ప్రకారం ప్రస్తుతం జీతాలు అం దుకుంటూ రూ.12 వేల కంటె తక్కువ వేత నం పొందుతున్న వారికి ఈ పెంపు వర్తిస్తుం ది. ఈ విధానం ప్రకారం కనీస వేతనం రూ.12 వేలు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దీంతోపాటు పలు శాఖల్లో పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. -
కలెక్టర్ల కాన్ఫరెన్స్ వాయిదా
అమరావతి: ఈనెల 17, 18వ తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ కార్యక్రమం వాయిదా పడింది. వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని తిరిగి 23, 24 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు జీఎస్టీపై అవగాహన కల్పించనున్నారు. -
16న అసెంబ్లీ సమావేశం
సాక్షి, అమరావతి: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును ఆమోదించేందుకు ఈనెల 16వ తేదీన అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు అసెంబ్లీ ఇంచార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ బుధవారం ప్రకటన జారీచేశారు. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాట్ స్థానంలో జీఎస్టీ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో జీఎస్టీ అమల్లోకి రావాలంటే శాసనసభ బిల్లును ఆమోదించాల్సి ఉంది. -
నేడు అసెంబ్లీ ప్రత్యేక భేటీ
-
14, 15 తేదీల్లో ‘ప్రత్యేక’ అసెంబ్లీ
స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడి తెనాలి: జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం మే నెల 14, 15 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. బుర్రిపాలెం రోడ్డులో రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు నివాసానికి శనివారం స్పీకర్ కోడెల, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో కోడెల మాట్లాడారు. -
నేడు అసెంబ్లీ ప్రత్యేక భేటీ
రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణల కోసం నిర్వహణ - ఉదయం 11 గంటలకు అసెంబ్లీ.. సాయంత్రం 3 గంటలకు మండలి భేటీ - బీఏసీలో నిర్ణయం.. సభ రెండు రోజులు జరపాలని కోరిన జానారెడ్డి - మిర్చి ధరలు, అన్నదాతల సమస్యలపై చర్చించాలని పట్టు - రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ - ఖమ్మం మార్కెట్ ఘటన ఓ కల్పిత ఆందోళన అని వ్యాఖ్య - బీజేపీ, టీడీపీలకు అందని బీఏసీ సమావేశం పిలుపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూసేకరణ చట్టానికి కేంద్రం సూచించిన మేరకు సవరణలు చేయడం కోసం శాసనసభ, శాసన మండలి ఆదివారం సమావేశం కానున్నాయి. శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షతన శనివారం సాయంత్రం జరిగిన బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, సీఎల్పీ నేత జానారెడ్డి తదితరులు హాజరైన ఈ భేటీలో ఆదివారం జరగనున్న ఉభయసభల ఎజెండాను ఖరారు చేశారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం మొదలుకానుంది. ఇక శాసన మండలిలో చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన బీఏసీ భేటీ జరిగింది. మండలి సమావేశం సాయంత్రం 3 గంటలకు జరపాలని అందులో నిర్ణయించారు. ఇక గత శాసనసభ సమావేశాల్లో సస్పెండైన టీడీపీ, బీజేపీ సభ్యులను బీఏసీకి ఆహ్వానించకపోవడంతో వారు హాజరుకాలేదు. కేసీఆర్, జానా మధ్య ఆసక్తికర చర్చ! బీఏసీ భేటీలో సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత జానారెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించలేదని... 2013 చట్టాన్ని సక్రమంగా వినియోగించుకుని ఉంటే కేంద్ర ప్రభుత్వం తిరిగి వెనక్కి పంపేది కాదని జానారెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఆ చట్టం కంటే ఉన్నతమైన చట్టాన్ని తెస్తున్నామని పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఆదివారాల్లో సమావేశాలు ఎందుకు పెడుతున్నారని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి ప్రశ్నించగా... మిగతా ఆరు రోజుల్లో పాలనాపరమైన అంశాలపై దృష్టి పెడుతున్నామని, అందుకే ఆదివారం సమావేశం పెడుతున్నామని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. కాగా ఏయే సవరణలు పెడుతున్నారనే దానిపై తమకు సమాచారం ఇవ్వలేదేమని జానారెడ్డి ప్రస్తావించగా.. శాసనసభ కార్యదర్శి ఆ వివరాల కాపీలను పంపిస్తారని తెలిపినట్లు సమాచారం. రైతులు సంతోషంగా ఉన్నారన్న సీఎం రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా మిర్చి ధరలపై చర్చించడానికైనా రెండు రోజులపాటు సభ జరపాలని భేటీలో జానారెడ్డి కోరారు. అయితే రాష్ట్రంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. ఇక మిర్చి ధరలు, ఖమ్మం మార్కెట్‌పై దాడి అంశాలు ప్రస్తావన వచ్చిందని సమాచారం. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. ‘‘అసలు రైతుల్లో ఎలాంటి ఆందోళనా లేదు. రాజకీయ పార్టీలే ఎక్కువగా ఆందోళన పడుతున్నాయి. మిర్చి రైతులు ఇప్పటికే 70 శాతం పంటను అమ్మేసుకున్నారు. ఖమ్మంలో జరిగినది ఫేక్ (కల్పిత) ఆందోళన. ఎవరెవరు దాడి చేశారో, దాని వెనక ఎవరున్నారో అన్నీ సీసీ కెమెరాల ఫుటేజీల్లో బయటపడతది. రైతులను అనవసరంగా రెచ్చగొడుతున్నారు..’’అని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. కనీసం మిర్చి రైతుకు బోనస్ అయినా ప్రకటించాలని జానా కోరినట్లు తెలిసింది. బోనస్ చెల్లింపు కేంద్రం చేతిలో ఉందని, అయినా ఇప్పటికే రూ.500 కోట్లు కావాలని కేంద్రాన్ని కోరామని, కేంద్రం ఇస్తే ఆలోచిస్తామని కేసీఆర్ వివరించినట్లు సమాచారం. బీఏసీ భేటీలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు, ఎంఐఎం పక్షాన ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, శాసనసభ కార్యదర్శి రాజ సదారాం తదితరులు పాల్గొన్నారు. మూడు సవరణలివీ.. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ చట్టాన్ని పరిశీలించిన కేంద్రం.. కొన్ని అభ్యంతరాలు తెలుపుతూ సవరణలు సూచించింది. ఆదివారం జరిగే అసెంబ్లీ సమావేశంలో ఈ మేరకు సవరణలు చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ మూడు సవరణలు ఇవే. చట్టం అమల్లోకి వచ్చే తేదీ (మొదటి సవరణ) రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టంలో 2014 జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఒకచోట, గెజిట్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి అమల్లోకి వస్తుందని మరోచోట పేర్కొన్నారు. దీనిపై కేంద్ర న్యాయ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకే చట్టంలో రెండు తేదీలు ఎలా ఉంటాయని ప్రశ్నించింది. దీంతో కేంద్ర సూచనకు మేరకు కేంద్ర భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చిన 2013 జనవరి నుంచే రాష్ట్ర చట్టం కూడా అమల్లోకి వస్తుందంటూ సవరణ ప్రతిపాదించారు. మార్కెట్ విలువ (రెండో సవరణ) భూసేకరణ సమయంలో స్థానిక మార్కెట్ విలువకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వ చట్టంలో ఉండగా.. దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందుగానే నిర్ధారించి ఉన్న మార్కెట్ విలువ కాకుండా.. భూసేకరణ సమయంలో మార్కెట్ విలువను సవరించి, పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు భూసేకరణకు ముందు ఆయా ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించేలా నిబంధన పొందుపర్చనున్నారు. మెరుగైన పరిహారం చెల్లింపు పదాల్లో మార్పులు (మూడో సవరణ) కేంద్ర చట్టం కంటే మెరుగైన పరిహారం అందిస్తామని రాష్ట్ర చట్టంలో పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు రెట్లు, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలని 2013 కేంద్ర భూసేకరణ చట్టంలో ఉంది. అంతకంటే మెరుగైన పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తన చట్టంలో పేర్కొంది. కానీ దానికి సంబంధించిన పదాల్లో మార్పులు, చేర్పులు చేయాలని కేంద్ర న్యాయ శాఖ సూచించింది. ఈ మేరకు సవరణలను ముసాయిదా బిల్లులో పొందుపర్చారు. ఆదివారం జరగనున్న శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాల్లో ఆమోదం కోసం భూసేకరణ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. -
మే రెండోవారం తర్వాత ప్రత్యేక అసెంబ్లీ
అమరావతి: ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మే రెండోవారం తర్వాత ఉండొచ్చని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ బిల్లు గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఇచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని కోడెల పేర్కొన్నారు. మహిళా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో డిక్లరేషన్‌ను రూపొందిస్తున్నామని, ఇందుకోసం కోర్ కమిటీ, సలహా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. జూన్ 30 నాటికి అమరావతి డిక్లరేషన్‌ను రూపొందిస్తామని స్పీకర్ తెలిపారు. కాగా స్పీకర్ కార్యాలయానికి రాజీనామాలు ఏమైనా వచ్చాయా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, స్పీకర్ మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేశారు. -
రెండు రోజుల పాటు అసెంబ్లీ: యనమల
సాక్షి, అమరావతి: వస్తు సేవా పన్ను (జీఎస్టీ) బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో గానీ రెండు రోజుల పాటు అసెంబ్లీ, మండలి సమావేశాలను నిర్వహిస్తామని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. జీఎస్టీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించగానే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని, అనంతరం రాష్ట్రం జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలో జీఎస్టీ సన్నద్ధత, గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ వ్యయంపై సమీక్ష నిర్వహించారు. -
జీఎస్టీకి పార్లమెంట్ ఓకే
-
జీఎస్టీకి పార్లమెంట్ ఓకే
♦ మూజువాణి ఓటుతో 4 జీఎస్టీ బిల్లులకు రాజ్యసభ ఆమోదం ♦ జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకు మార్గం సుగమం ♦ ఎస్జీఎస్టీని రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించడమే తరువాయి న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై 1 నుంచి ఒక దేశం– ఒక పన్ను పాలనకు మార్గం సుగమం చేస్తూ జీఎస్టీ బిల్లుల్ని పార్లమెంటు గురువారం ఆమోదించింది. కేంద్ర జీఎస్టీ బిల్లు(సీజీఎస్టీ)2017, సమీకృత జీఎస్టీ బిల్లు(ఐజీఎస్టీ) 2017, జీఎస్టీ(రాష్ట్రాలకు పరిహారం) బిల్లు 2017, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీ బిల్లు(యూటీజీఎస్టీ) 2017ను రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రతిపక్షాలు కొన్ని సవరణలు సూచించినా సభ వాటిని తిరస్కరించింది. కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ సవరణ ప్రతిపాదించినా.. మాజీ ప్రధాని మన్మోహన్æ సలహా మేరకు దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లుల్ని లోక్‌సభ ఆమోదించింది. రాష్ట్రాల జీఎస్టీ(ఎస్జీఎస్టీ) బిల్లును రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదిస్తే.. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుంది. ఆమోదం అందరి ఘనత: జైట్లీ రాజ్యసభలో జీఎస్టీపై సుదీర్ఘ చర్చకు ఆర్థిక మంత్రి జైట్లీ సమాధానమిస్తూ... జీఎస్టీ బిల్లులో యూపీఏ ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందన్నారు. ఇది అందరి ఘనతని ఒప్పుకునేందుకు తాను సంకోచించడం లేదన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదంలో రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, గత ప్రభుత్వాల భాగస్వామ్యం ఉందని చెప్పారు. శిక్షల తీవ్రత తగ్గించాలి: ప్రతిపక్ష సభ్యులు అంతకుముందు సీపీఎం నేత సీతారాం ఏచూరీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా జీఎస్టీ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకోలేదని, అలాంటప్పుడు రాష్ట్రాలకు ఇక ఏం హక్కులు ఉంటాయని ప్రశ్నించారు. జీఎస్టీ మొదటి సంవత్సరం ఏదైనా నేరానికి పాల్పడితే దానిని నాన్ బెయిలబుల్‌గా పరిగణించ వద్దంటూ బీఎస్పీ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా కోరారు. ఆమోదాన్ని ప్రశంసించిన మన్మోహన్ జీఎస్టీ బిల్లును ఆమోదించడాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ ప్రశంసించారు. బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేస్తుందని, అయితే అమలులో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎక్సైజ్ పన్ను రద్దు బిల్లుకు ఆమోదం పెట్రోలియం ఉత్పత్తులు మినహా మిగతా ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్ను, వివిధ సేవలపై సేవా పన్ను, వస్తువుల అమ్మకాలు, కొనుగోలుపై వ్యాట్‌ను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఎక్కువ శాతం ఉత్పత్తులకు పన్ను మినహాయింపు ఎక్కువ శాతం ఉత్పత్తులపై పన్ను ఉండదని, మిగతా వాటిని 5, 12, 18, 28 శాతాల శ్లాబుల్లో చేరుస్తామని జైట్లీ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్ని పన్ను పరిధి నుంచి మినహాయిస్తామని, అనుబంధ ఉత్పత్తుల్ని పన్ను పరిధి నుంచి తొలగిస్తామన్నారు. ప్రస్తుతం ఆహార వస్తువులపై పన్ను లేదని, జీఎస్టీలోనూ విధించమన్నారు. ఇతర నిత్యావసర వస్తువుల్ని తక్కువ పన్ను పరిధిలో ఉంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇక విలాస వస్తువులు, పొగాకు వంటి వాటిపై అదనపు పన్ను విధించి.. రాష్ట్రాలకు ఏర్పడే నష్టాల్ని భర్తీ చేస్తామన్నారు. జీఎస్టీ నెట్వర్క్(ఐటీ)పై పలువురు సభ్యులు ఆందోళనకు సమాధానమిస్తూ.. ప్రస్తుత జీఎస్టీ ఐటీ విభాగం అత్యుత్తమంగా ఉందని, ప్రతీ నెల వందల కోట్ల రసీదుల్ని పరిశీలించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. -
ఈ జీఎస్టీ అసమగ్రం
♦ 40 శాతం ఆదాయం జీఎస్టీకి బయటే ♦ రాజ్యసభలో విపక్షాల మండిపాటు ♦ ద్రవ్య బిల్లుగా తీసుకురావడంపై అభ్యంతరం ♦ నాలుగు జీఎస్టీ బిల్లులపై చర్చ ప్రారంభం న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన నాలుగు బిల్లులపై బుధవారం రాజ్యసభలో చర్చ మొదలైంది. కేంద్ర (సీజీఎస్టీ), సమీకృత (ఐజీఎస్టీ), రాష్ట్రాలకు పరిహార జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీ లపై కాంగ్రెస్ ఉప నేత ఆనంద్ శర్మ చర్చ ప్రారంభిస్తూ జీఎస్టీ అసమగ్రంగా ఉందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిం చారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పేర్కొన్న ఆదా యంలో 40శాతం జీఎస్టీకి బయటే ఉందని, అలాంటప్పుడు అది ఎలా ఆదర్శప్రాయమ వుతుందని ప్రశ్నించారు. మద్యం, పెట్రోలు, డీజిల్, రియల్ ఎస్టేట్ తదితరాలకు ఇచ్చిన మినహాయింపులు ఆందోళనకరంగా ఉన్నా యన్నారు. అక్రమ లావాదేవీలు, నల్లధనంపై పోరాడుతున్నా మన్న ప్రభుత్వం రియల్ ఎస్టే ట్ను ఎందుకు దీని పరిధిలోకి తీసుకు రాలేదని ప్రశ్నించారు. జీఎస్టీ అమలుకు ముం దు పన్ను చెల్లింపు దారులకు అధికారుల నుంచి వేధింపులు ఎదురుకాకుండా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచిం చారు. దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ (కాంగ్రెస్) మాట్లా డు తూ.. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీని వ్యతిరేకించా రని, ఫలితంగా ప్రభుత్వఖజనాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించారు. తాము ఈ బిల్లు లకు మద్దతిస్తూనే కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతు న్నామన్నారు. ‘జీఎస్టీ భావన మాజీ ప్రధాని వీపీ సింగ్ 1986లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే తెరపైకి వచ్చింది. ప్రస్తుత ప్రధా నికి ఎంత ఘనత దక్కాలో పాత ప్రధానులూ అంత ఘనతకు అర్హులు’ అని రమేశ్ అన్నారు. జీఎస్టీని ద్రవ్య బిల్లుగా తీసుకురావడాన్ని ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ తప్పుబట్టారు. రాజ్యసభ శాసన నిర్మాణ అధికారాల పునరు ద్ధరణకు ఆర్థిక మంత్రి జైట్లీ కృషి చేయాలని, రాజ్యాంగ సవరణ బిల్లు తేవాలని కోరారు. ‘హనుమంతునికి తన శక్తి గురించి ఇతరులు చెప్పాకే తెలిసింది. మీరు మా హనుమాన్. ఈ సభ నాయకులు’ అని అన్నారు. కార్మిక పరిహార బిల్లుకు ఆమోదం పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల్లో గాయపడే కార్మికులకు, వృత్తి సంబంధ వ్యాధులకు గురయ్యే కార్మికులకు రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు పరిహారాన్ని అందిం చేందుకు ఉద్దేశించిన ఉద్యోగుల పరిహార (సవరణ) బిల్లు–2016ను లోక్‌సభ సవరణలతో ఆమోదించింది. ఈ బిల్లును లోక్‌సభ గత ఏడాది ఆమోదించగా, రాజ్యసభ రెండు సవరణలతో ఆమోదించింది. దీంతో మళ్లీ లోక్‌సభ ముందుకొచ్చింది. సవరణలు ప్రతిపాదించవద్దు: సోనియా రాజ్యసభలో జీఎస్టీ బిల్లులకు ఎలాంటి సవరణలనూ ప్రతిపాదించకూడదని బుధవారం పార్టీ చీఫ్ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇతర విపక్షాలు తెచ్చే సవరణలకు మద్దతిచ్చే అవకాశముందని సమాచారం. దీనిపై గురువారం జరిగే సమావేశంలో పార్టీ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. ఈవీఎంలపై రాజ్యసభలో రగడ ఈవీఎంలను బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ట్యాంపర్ చేస్తున్నారని విపక్షాలు రాజ్యసభలో ఆరోపించాయి. వచ్చే ఎన్నికలను బ్యాలట్ పేపర్లతో నిర్వహించాలని డిమాండ్ చేశాయి. విపక్ష ఆరోపణలను ప్రభుత్వం గట్టిగా తోసిపుచ్చింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలతో సభ దద్దరిల్లింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి.. ప్రభుత్వం దగా చేస్తోందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ఈవీఎంలను పరీక్షిస్తున్నప్పుడు ఓట్లు ఎవరికి వేసినా బీజేపీకే పడ్డాయని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రస్తావించారు. సభాకార్యక్రమాలను నిలిపేసి ఈ అంశంపై చర్చించాలని కాంగ్రెస్, ఎస్పీ నాలుగు నోటీసులు ఇవ్వగా, అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం దగాకోరు అని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. దీనిపై అధికార సభ్యులు గొడవ చేశారు. ఆమె దేశ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని మంత్రి నక్వీ అన్నారు. బీజేపీ ఓడిన 2004, 2009 సార్వత్రిక ఎన్నికలు, ఇటీవలి బిహార్, పంజాబ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఈవీఎంలతోనే నిర్వహించారని, అప్పుడు కాంగ్రెస్‌కు ఏ అభ్యంతరమూ కనిపించలే దన్నారు. మాయావతి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. ఈ అంశాన్ని పరిశీలించాల్సింది ఈసీనే అంటూ సభను వాయిదా వేశారు. లోక్‌సభకు ‘ఓబీసీ’ బిల్లు వెనకబడిన వర్గాల కోసం రాజ్యాంగ బద్ధ అధికారాలతో సాధికారిక కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగ(123వ సవరణ) బిల్లును సామాజిక న్యాయ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత వెనకబడిన వర్గాల జాతీయ కమిషన్‌ను రద్దు చేసేందుకు మరో బిల్లునూ సభ ముందుంచారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) అధీకృత మూలధనాన్ని ఆరు రెట్లు పెంచి రూ.30వేల కోట్లుకు చేర్చేందుకు ప్రతిపాదించిన నాబార్డ్ సవరణ బిల్లును–2017ను ప్రభుత్వం సభ ముందుంచింది. -
సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఓకే
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లులకు చేసిన 5 సవరణలతోపాటుగా చట్టంలోని మిగిలిన 4 నిబంధనలకు జీఎస్టీ కౌన్సిల్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి 13వ సమావేశంలో.. జీఎస్టీ బిల్లులకు సంబంధించి లోక్‌సభ చేసిన సవరణలను ఆమోదించారు. జీఎస్టీకి సంబంధించిన ఇన్పుట్ టాక్స్ క్రెడిట్, వస్తువులు–సేవల సప్లై వాల్యుయేషన్, లెవీ విధింపుపై నిర్ణయం, మధ్యంతర నిబంధనలకు మండలి మౌలికంగా ఆమోదించారు. సర్టిఫికేషన్, రిజిస్ట్రేషన్లు సంబంధింత అధికారి డిజిటల్ సంతకంతోనే జరగాలని, ఏకీకృత గుర్తింపు నెంబరును ఇవ్వటం, రద్దు చేయటానికి సంబంధించిన విధివిధానాల సవరణకూ ఓకే చెప్పింది. కొన్ని కేటగిరీల్లోని వ్యక్తులు ప్రతిఏటా రిటర్స్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదని జైట్లీ అన్నారు. తుది ముసాయిదాను రూపొందించాక ఇండస్ట్రీ ముందుంచి సలహాలు స్వీకరించాలని నిర్ణయించించారు. -
ఐదేళ్ల తర్వాత నష్టాలు ఎవరు భర్తీ చేస్తారు?
జీఎస్టీ బిల్లుపై ఎంపీ వెలగపల్లి సాక్షి, న్యూఢిల్లీ: అనేక ప్రయోజనాలున్న జీఎస్టీ బిల్లును తేవడం ప్రశంసనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు చెప్పారు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయే ఆదాయాన్ని ఐదేళ్ల వరకు కేంద్రం భర్తీ చేస్తుందని చెప్పారని, ఐదేళ్ల తరువాత నష్టాలు కొనసాగితే ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ విషయంమై నిర్ణయం తీసుకోవాలని కోరారు. బుధవారం జీఎస్టీ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాల నష్టాలను భర్తీ చేసేందుకు కేంద్రం వివిధ వస్తువులపై సెస్ వేసి నిధిని తయారు చేయాలనుకుంటోందని, అయితే అది కేవలం స్వల్ప మొత్తమే అవుతుందని వరప్రసాదరావు పేర్కొన్నారు. అలాంటప్పుడు నష్టాలను ఎక్కడి నుంచి భర్తీచేస్తారని ప్రశ్నించారు. లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై సెస్ విధించాలనుకోవడంలో తప్పులేదని, అయితే ఆల్కహాలేతర శీతలపానీయాలపై కూడా సెస్ విధించాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చిన్న చిన్న రిఫ్రిజిరేటర్లు, ఏసీలపై అదనపు సెస్ విధించడం మధ్య తరగతి ప్రజలపై భారం మోపడమే అవుతుందని, ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని కోరారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమలును లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే అప్పటికి పరిశ్రమలు, అధికార యంత్రాంగం సంసిద్ధులై ఉండడం కష్టసాధ్యమైనందున ఈ అంశాన్ని కూడా పునః పరిశీలించాలని కోరారు. -
ఏకాభిప్రాయంతోనే జీఎస్టీ ఆమోదం
ఆర్థిక మంత్రి జైట్లీ ఆశాభావం న్యూఢిల్లీ: ఏకాభిప్రాయం ద్వారానే జీఎస్టీ బిల్లులు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సదస్సు తర్వాత పార్టీ ఎంపీల్ని ఉద్దేశించి మాట్లాడారు. అన్ని రాష్ట్రాలు భాగస్వాములుగా ఉన్న జీఎస్టీ మండలిలో సుదీర్ఘంగా చర్చించాకే బిల్లుల్ని రూపొందించామన్నారు. సవరణలు చేయాల్సిందే: కాంగ్రెస్ ప్రస్తుత రూపంలో జీఎస్టీ బిల్లుల్ని అంగీకరించమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు జీఎస్టీపై చర్చించారు. జీఎస్టీపై ప్రజల ఆందోళనల్ని సభలో లేవనెత్తాలని, తప్పకుండా అవసరమైన సవరణలు కోరాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. -
రుణమాఫీకి కేంద్రం నిధులివ్వదు!
-
రుణమాఫీకి కేంద్రం నిధులివ్వదు!
► రాజ్యసభలో ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టీకరణ ► రాష్ట్రాలే నిధులు సమకూర్చుకోవాలని సూచన ► ఈ సమావేశాల్లోనే జీఎస్టీ ఆమోదం పొందాలన్న జైట్లీ న్యూఢిల్లీ: రైతు రుణమాఫీకి రాష్ట్రాలకు కేంద్రం నిధులిచ్చే ఆలోచనే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో రాష్ట్రాలే నిధులు సమకూర్చుకోవాలని తేల్చిచెప్పారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ఒక రాష్ట్రానికి నిధులిచ్చి మరో రాష్ట్రానికి మొండిచేయి చూపే విధానాన్ని ఆవలంబించబోమని పేర్కొన్నారు. ‘పలు రాష్ట్రాలు రుణమాఫీ చేస్తున్నాయి. అందుకు ఆయా రాష్ట్రాలే నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయంపై కేంద్రం ఓ విధానంతో ముందుకెళ్తోంది. రైతు రుణాల వడ్డీలో కొంత భరిస్తున్నాం. దీన్ని కొనసాగిస్తాం’ అని జైట్లీ వెల్లడించారు. రుణమాఫీ చేయాల్సిందేనని సంకల్పిస్తే దానికి ఆయా రాష్ట్రాలే నిధులు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా.. అక్కడి రైతులకు యోగి సర్కారు రుణమాఫీ చేస్తుందని వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే.. 2006లో యూపీఏ సర్కారు అన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ చేసిందని ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా రుణమాఫీ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. లేదంటే పరోక్షపన్ను కోల్పోతాం! ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని జైట్లీ రాజ్యసభలో చెప్పారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 15 తర్వాత కేంద్రం, రాష్ట్రాలు పరోక్షపన్నును నష్టపోతాయని ఆయన తెలిపారు. జీఎస్టీకి అనుబంధంగా ఉన్న నాలుగు బిల్లులను తర్వలోనే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. యూఎస్ ‘అక్రమ’ జాబితా తిరస్కరణ అమెరికాలో 271 మంది అక్రమంగా నివాసం ఉంటున్నారంటూ ఆ దేశం ఇచ్చిన జాబితాను భారత్ తిరస్కరించింది. సరైన ధ్రువీకరణ జరిగేంతవరకు అమెరికా నుంచి భారతీయులను తరలించేది లేదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులడిగిన ప్రశ్నలకు సుష్మ సమాధానం ఇచ్చారు. ‘మేం ఆ జాబితాను అంగీకరించటం లేదు. అందుకే మరిన్ని వివరాలడిగాం. వాటిని ధ్రువీకరించుకున్నాకే వారిని తరలించేందుకు అత్యవసర సర్టిఫికెట్ జారీచేస్తాం’ అని సుష్మ స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం జరగలేదని కాంగ్రెస్ ఎంపీ పునియా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
జీఎస్టీ బిల్లు రేపు లోక్‌సభలో
న్యూఢిల్లీ: కీలకమైన వస్తు సేవలపన్ను(జీఎస్టీ) బిల్లు లోక్‌సభకు రానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) బిల్లును రేపు (శుక్రవారం)లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ ఈ సోమవారం ఈబిల్లుకు ఆమోద ముద్ర వేసింది. అంతకుముందు ఈ బిల్లులో కీలకమైన అయిదు ముసాయిదా చట్టాలకు జీఎస్ టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అనంతరం దీన్ని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. ఈ క్రమంలో లోక్‌సభ లో ఆమోదం కోసం రేపు సభముందు ఉంచనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ బిల్లుపై హాట్ హాట్ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. జీఎస్టీని సాధ్యమైనంత త్వరగా అమలులోకి త్వరగా అమల్లోకి తీసుకురావాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో జులై 1, 2017 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నసంగతి తెలిసిందే. -
జీఎస్టీ బిల్లు సవరించే వరకూ పోరాటం
మధురానగర్ : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బిల్లు సవరించే వరకు పోరాడతామని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలను నిరసిస్తూ స్థానిక విజయవాడ ధర్నా చౌక్‌లో గురువారం వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎక్తా డిప్యూటీ జనరల్ సెక్రటరీ తోట రాజశేఖర్ మాట్లాడుతూ వస్తు సేవల పన్ను చట్టాన్ని కేంద్రం అన్ని రాష్ట్రాలతో కలిసి అమలు చేయాలని కోరారు. కేంద్రం అధికారాలను తమ వద్దే ఉంచుకుని రాష్ట్రాలను బలహీన పరుస్తోందని విమర్శించారు. కేంద్రlప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో వాణిజ్య పన్నుల శాఖల అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్యూటీ కమిషనర్ శేఖర్, రఘునాథ్ మాట్లాడుతూ వస్తు సేవల చట్టవ్యవస్ధలో రాష్ట్రాల ఉద్యోగులకు కేంద్ర ఎకై ్సజ్ శాఖ సిబ్బందితో సమానంగా విధులు, అధికారాలు, జీతభత్యాలు ఇవ్వాలని కోరారు. అనంతరం విజయవాడ రెండో డివిజన్ కార్యదర్శి కే నాగరాజు, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆర్గనైజింగ్ సెక్రటరీ వీఎస్‌ఎస్‌ఎన్ ప్రసాద్‌బాబు, దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. విజయవాడ రెండో డివిజన్, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు పాల్గొన్నారు. -
జీఎస్టీ బిల్లు.. ఇక చట్టం!
-
జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రధాని మోదీ అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న వస్తు, సేవల పన్ను బిల్లు(జీఎస్టీ)కు మరో అడుగు ముందుకు పడింది. ఈ బిల్లు రాజ్యాంగ సవరణకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. కాగా, త్వరలో దీనిపై పన్ను రేటు, సెస్, సర్‌చార్జీలు నిర్ణయించనున్నారు. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, సేవల పన్ను, కేంద్ర అమ్మకం పన్ను, అదనపు కస్టమ్స్ సుంకం వంటి వివిధ పన్నులను కలిపి ఒకే పన్నుగా చేయడమే వస్తు, సేవల పన్ను. ఆగస్టు 8న ఈ బిల్లు ఆమోదానికి కేంద్రం అన్ని రాష్ట్రాల అంగీకారం కోరింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు కనీసం 50 శాతం రాష్ట్రాల మద్దతు అవసరం. కేంద్రం ఈ బిల్లును మొదట 17 రాష్ట్రాలకు పంపించగా, అస్సాం మొట్టమొదట అంగీకరించింది. అనంతరం ఏపీ, బిహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, నాగాలాండ్, మహారాష్ట్ర, హరియాణా, సిక్కిం, మిజోరం, తెలంగాణ, గోవా, ఒడిశా, రాజస్తాన్ ఆమోదించాయి. -
జీఎస్టీ బిల్లు.. ఇక చట్టం!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల బిల్లు (జీఎస్టీ బిల్లు) చట్టరూపం దాల్చింది. గత పదమూడేళ్లుగా ఆమోదానికి నోచుకోక చట్ట సభల్లోనే ఆగిపోయిన ఈ బిల్లును ఎట్టకేలకు పార్లమెంటు ఉభయ సభలతో పాటు ఇప్పటికే 16 రాష్ట్రాలు కూడా ఆమోదించడంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందింది. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా దీనిపై సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టరూపం దాల్చినట్లయింది. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో.. కనీసం సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్లే, 16 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. ఆగస్టు నెలలోనే లోక్‌సభ, రాజ్యసభ ఏకగ్రీవంగా జీఎస్టీ బిల్లును ఆమోదించాయి. -
నిరసన మధ్యే జీఎస్టీ బిల్లుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి.. తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తుండగానే నాలుగు ముఖ్యమైన బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. జీఎస్టీ బిల్లుతో పాటు అగ్రికల్చరల్, హార్టికల్చర్ రంగాల్లో ప్రైవేటు కాలేజీల బిల్లును ఆమోదించింది. హోటళ్లలో వ్యాన్ మినహాయింపు బిల్లును, డబుల్ రిజిస్ట్రేషన్లపై నిషేధం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి ప్రకటన చేయడానికి ముందే చర్చ జరగాలని వైఎస్ఆర్సీపీ గట్టిగా పట్టుబట్టింది. శాసనసభ కార్యకలాపాలను పూర్తిగా అడ్డుకుంది. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఈ ఆందోళన మధ్యే నాలుగు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. -
జీఎస్టీ బిల్లుకు ఏపీ కేబినేట్ ఆమోదం
-
జీఎస్టీ బిల్లుకు ఏపీ కేబినేట్ ఆమోదం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టాల్సిన నాలుగు బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది. విజయవాడలో మంగళవారం ఉదయం ఏపీ కేబినేట్ సమావేశం మూడు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో కేబినేట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో వస్తు సేవా పన్నుల(జీఎస్టీ) బిల్లును ప్రవేశపెట్టానున్నారు. కర్నూలులో ఇండ్రస్టీయల్ హబ్ కోసం ఏపీఐఐసీకి 7 వేల ఎకరాలు, విశాఖ జిల్లాలో పర్యాటక శాఖ, ట్రాన్స్‌కో, ఏపీఐఐసీకి కలిపి సుమారు 64 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్లు నిర్మించాలని కేబినేట్ నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ పాలసీ సవరణ, కార్మిక సంస్కరణలు, కాకినాడలో గెయిల్ గ్యాస్ స్టోరేజ్ ఫెసిలిటీని పెంచే ప్రతిపాదనలకు కేబినేట్ అంగీకరించింది. ఇక ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేసే వరకు స్పందించకూడదని ఏపీ కేబినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్‌లో గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న విషయం తెలిసిందే. కేబినేట్ ఆమోదించిన బిల్లుల వివరాలు ► జీఎస్టీ బిల్లు ► ఎన్జీ రంగా వర్శిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల బిల్లు ► రిజిస్ట్రేషన్ శాఖలో డబుల్ రిజిస్ట్రేషన్లను నియంత్రించే బిల్లు ► కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోని వ్యాట్ సవరణ బిల్లు. -
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం
విజయవాడ : ఈ నెల నుంచి 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం ఉదయం విజయవాడలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో శాసనసభ సమావేశాలు, రాయలసీమ కరువు, పుష్కరాలు తదితర అంశాలపై చర్చినున్నారు. జీఎస్టీ సవరణ బిల్లును మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించనుంది. అలాగే ‘ఓటుకు కోట్లు’ కేసును ప్రతిపక్షం లేవనెత్తితే ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపైనా కేబినెట్ చర్చించనుంది. మంత్రివర్గ సమావేశం అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. ఇక సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ వ్యూహ కమిటీ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. -
మూడు రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-తొలిరోజు జీఎస్టీ బిల్లు ఆమోదం -మిగిలిన రెండు రోజులు కరవుపై ప్రత్యేక చర్చ -ఇతర అంశాలు చర్చకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎత్తుగడ సాక్షి, అమరావతి ఈ నెల ఎనిమిది నుంచి మూడు రోజులపాటు జరిగే శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేకంగా కరవుపై చర్చించాలని ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ శాసనసభ వ్యూహ కమిటీ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఎనిమిదో తేదీన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ప్రభుత్వం తరపున ఇదే ప్రతిపాదన చేయనున్నారు. ఆదివారం టీడీఎల్పీ వ్యూహ కమిటీ సమావేశం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిషోర్‌బాబు, చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, విప్‌లు కూన రవికుమార్, యామినీబాల, ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ టీడీ జనార్ధనరావు, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాపితంగా కరవు తొండవిస్తున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని ప్రతిపక్షం కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నందున ఎనిమిదో తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జరిగే శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో చర్చను ప్రభుత్వం ప్రతిపాదించనుంది. దీంతో కృష్ణా జలాల వివాదం, మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రెయిన్స్గన్స్తో పంటలను కాపాడటం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఓటుకు కోట్లు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని సమావేశంలో భావించారు. జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లే ఆలోచన తెలుగుదేశం అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుకు కేసుల నుంచి బైట పడేందుకు మేనేజ్ చేసుకోవటం అలవాటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గతంలో జగన్మోహన్రెడ్డి శాసనసభలో కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారని ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ న్యాయవ్యవస్థను కించ పరిచే విధంగా జగన్మోహన్రెడ్డి హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా కోర్టును ఆశ్రయించాలని వ్యూహ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. పార్టీ ఎమ్మెల్యే లేదా నేతతో కోర్టులో కేసు వేయించనున్నారు. సమావేశం అనంతరం విప్ కూన రవి విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. మంత్రులు బొజ్జల, రావెల, చీఫ్‌విప్ కాలువ విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయకల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, అభివృద్ధి ఆయనకు ఇష్టం లేదని అన్నారు. శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చించేలా సహకరించాలన్నారు. -
మరో మైలు రాయిని అధికమించిన GST
-
జీఎస్టీకి మండలి ఆమోదం
♦ బిల్లు ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ♦ మద్దతు తెలిపిన అన్ని పక్షాలు ♦ అనుమానాలు నివృత్తి చేయాలి: కాంగ్రెస్, ఎంఐఎం ♦ ధరలు తగ్గుతాయి.. ఆదాయం పెరుగుతుంది: బీజేపీ సాక్షి, హైదరాబాద్: వస్తు సేవా పన్ను (జీఎస్టీ) బిల్లును రాష్ట్ర శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం ఉదయం మండలిలో బిల్లును ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభ ప్రారంభం కాగానే కరువు, రైతు సమస్యలపై చర్చించాల్సిందిగా కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. జీఎస్టీ బిల్లు తర్వాత బీఏసీ సమావేశంలో ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటారని చైర్మన్ స్వామి గౌడ్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఒప్పించడంతో వారు శాంతించారు. అనంతరం జీఎస్టీ బిల్లుపై సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, అల్తాఫ్ హైదర్ రజ్వీ, ఎస్.రామచందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పూల రవీందర్, కె.యాదవరెడ్డి, భానుప్రసాద రావు తదితరులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. రాష్ట్రానికి ఎంత ప్రయోజనమో చెప్పాలి: పొంగులేటి(కాంగ్రెస్) జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలుపుతోంది. అదే సమయంలో జీఎస్టీతో రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏంటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. బిల్లును ఆమోదిస్తూనే ప్రజ ల్లో నెలకొన్న అనుమానాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. ఆర్ఎన్ఆర్ 18 శాతం మించకుండా కేంద్రం తీసుకునే నిర్ణయంపై కూడా స్పష్టత రావాలి. మన వాటా ఎంత?: అల్తాఫ్ హైదర్ రజ్వీ (ఎంఐఎం) జీఎస్టీలో వసూలయ్యే మొత్తంలో రాష్ట్రానికి ఎంత వాటా వస్తుందో చెప్పాలి. జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి వచ్చే అనేక రకాల పన్నుల ఆదాయాన్ని కోల్పోతాం. దీన్ని పరిహారం రూపంలో ఐదేళ్ల పాటు ఇస్తామంటున్నారు. దీనిపై స్పష్టత రావాలి. పన్ను ఎగవేతలు తగ్గుతాయి: ఎస్.రాంచందర్ రావు (బీజేపీ) జీఎస్టీ వల్ల దేశమంతా ఒకే పన్ను విధానంతోపాటు పన్ను ఎగవేతలకు కళ్లెం పడుతుంది. ధరలు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశీ పెట్టుబడుల కారణంగా నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. సేవారంగం వృద్ధి చెందుతుంది: పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్) జీఎస్టీతో ఉత్పత్తి రంగంతో పాటు సేవారంగం కూడా వృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు ఉత్పత్తి అయిన ప్రతి వస్తువు మీద పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. జీఎస్టీలో ఉత్పత్తి అయిన వస్తువును ఉపయోగించినప్పుడు, సేవ పొందినప్పుడే పన్ను చెల్లించడం జరుగుతుంది. పన్ను శాతం ఎంత?: యాదవరెడ్డి (టీఆర్ఎస్) జీఎస్టీ అమలులోకి వస్తే వినియోగించే వస్తువుపై ఎంత శాతం పన్ను పడుతుందనే విషయంలో స్పష్టత లేదు. 22 శాతం, 18 శాతం అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలి. రాష్ట్రానికి లాభమో, నష్టమో ఇప్పుడే చెప్పలేం: కడియం జీఎస్టీ వల్ల తెలంగాణకు లాభమో, నష్టమో ప్రస్తుత పరిస్థితుల్లో తేల్చి చెప్పడం కష్టమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నా రు. ‘‘జీఎస్టీ బిల్లును పార్లమెంటులో ఉభయసభలు ఆమోదించాయి. దేశంలోని 50 శాతం రాష్ట్రాలు ఆమోదిస్తే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. 2015-16లో రూ.31,117 కోట్ల పన్ను వసూలైతే... అందులో పెట్రోల్, మద్యంపై వచ్చిన ఆదాయం రూ.14,654 కోట్లు. భవిష్యత్తులో కూడా ఇది రాష్ట్రం పరిధిలోనే ఉంటుంది. వృత్తి పన్ను మినహాయిస్తే.. మిగతా రూ.16,077 కోట్లు జీఎస్టీ పరిధిలోకి వెళ్తుంది. రెవెన్యూ న్యూట్రల్ రేషియో (ఆర్ఎన్ఆర్)ను కూడా ఇప్పుడే నిర్ణయించలేం. జీఎస్టీ వల్ల నష్టపోతామన్న రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు నష్టపరిహారం ఇస్తామని కేంద్రం చెప్పింది. సేవారంగం ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలో జీఎస్టీ వల్ల లాభమే జరుగుతుంది. సర్వీస్ టాక్స్‌లో 50 శాతం మేర రూ.4 వేల కోట్లు రాష్ట్రానికి సమకూరుతుంది. ఆహార ధాన్యాలపై పన్ను ఎత్తివేసే అవకాశం ఉన్నందున రాష్ట్రానికి మంచే జరుగుతుంది’’ అని కడియం అన్నారు. -
జీఎస్టీ బిల్లుపై అవగాహన పెంచుకోవాలి
కోదాడఅర్బన్ : దేశంలో ఒకే రకమైన పన్ను విధానాన్ని అవలంబించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లుపై కామర్స్ విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని రిటైర్డ్ అధ్యాపకులు మంత్రిప్రగడ భరతారావు, ప్రముఖ అకౌంటెంట్ శేషుప్రసాద్లు కోరారు. జీఎస్టీ బిల్లుపై మంగళవారం కోదాడ పట్టణంలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో కామర్స్ విద్యార్థులకు నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. వస్తు సేవల పన్నులకు సంబంధించిన విషయాలను శేషుప్రసాద్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సైదేశ్వరరావు, ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. -
పన్నుల ఎగవేత నివారణకే జీఎస్టీ
-
పన్నుల ఎగవేత నివారణకే జీఎస్టీ: కేసీఆర్
హైదరాబాద్: జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. పార్టీలకు అతీతంగా ఇప్పటికే 9 రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాయని తెలిపారు. ఈ బిల్లును ఆమోదించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో జీఎస్టీ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పన్నుల ఎగవేతను తగ్గించడానికే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చినట్టు చెప్పారు. జీఎస్టీ వల్ల ఏ రాష్ట్రానికైనా ఇబ్బంది కలిగితే ఐదేళ్లు ఆ నష్టాన్ని భరిస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పిందని వెల్లడించారు. పెట్రో ఉత్పత్తులు, ఎక్సైజ్ పై జీఎస్టీ ప్రభావం ఉందన్నారు. -
'అసెంబ్లీని 15 రోజులపాటు నిర్వహించాలి'
హైదరాబాద్: ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో చర్చించాల్సిన సమస్యలు ఎక్కువగా ఉన్నందున సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కోరారు. సోమవారం హైదరాబాద్‌లో మూడున్నర గంటల పాటు తెలంగాణ సీఎల్పీ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు సమస్యలపై పార్టీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని సంపత్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు కూడా చర్చకు రానున్న సందర్భంగా.. అసెంబ్లీ కేవలం జీఎస్టీ బిల్లు కోసమే అంటే సరికాదన్నారు. సభను ఎక్కువ రోజులు నిర్వహించే అంశంపై అధికారపక్షాన్ని ప్రశ్నిస్తామని ఎమ్మెల్యే సంపత్ తెలిపారు. -
ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 5 గంటలకు సచివాలయంలోని సీ బ్లాక్‌లో మంత్రివర్గం భేటీ అయ్యింది. మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సమావేశాల ప్రాధాన్యం, ఆమోదించాల్సిన కీలక అంశాలను భేటీలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బిల్లు ప్రాధాన్యాన్ని చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఈ సమావేశంలో ఆమోదం తెలుపనుంది. అలాగే గతంలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను, సైబరాబాద్ కమిషనరేట్ విభజనకు సంబంధించిన ఆర్డినెన్స్‌నూ చట్టంగా మార్చేందుకు ఈ సమావేశంలోనే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మంత్రి వర్గ భేటీలో ప్రధానంగా ఈ మూడు అంశాలను ఎజెండాగా చేర్చినట్లు సమాచారం. -
అసెంబ్లీ సమావేశాలు మూడ్రోజులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడ్రోజులపాటు జరగనున్నాయి. అసెంబ్లీ అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు సమావేశాలను ఈ నెల 30, 31, సెప్టెంబర్ 1న జరపనున్నారు. జీఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపేందుకు ఒక రోజు అసెంబ్లీ, మండలి సమావేశం కావాలని ప్రభుత్వం తొలుత పేర్కొన్నప్పటికీ మరో రెండ్రోజులు కూడా సమావేశాలు జరపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశాల తొలి రోజైన 30న జీఎస్టీ బిల్లుపై, 31న కొత్త జిల్లాల ఏర్పాటుపై, సెప్టెంబర్ 1న గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై ఉభయ సభలు చర్చిస్తాయని సమాచారం. -
30నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
30నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 3వ తేదీ వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను బిల్లు(జీఎస్టీ)కు సవరణ బిల్లును ఆమోదించనుంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. జీఎస్టీ బిల్లను ఆమోదించడానికి ఈ నెల 30న శాసనసభను సమావేశపరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం అసెంబ్లీ వ్యవహారాల శాఖమంత్రి హరీశ్ రావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి తదితరులతో సీఎం సమావేశం అయ్యారు. రాజ్యాంగాన్ని సవరిస్తూ ఇటీవల పార్లమెంట్ జీఎస్టీ చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం అమల్లోకి రావడానికి దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లుపై చర్చించడానికి ఈనెల 30న ఉదయం 11 గంటలకు అసెంబ్లీని సమావేశపర్చాలని స్పీకర్ మధుసూదనాచారిని సీఎం కోరారు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు కాబట్టి సభ్యులకు పూర్తి వివరణ ఇవ్వడానికి అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవాలని కూడా స్పీకర్ ను ఈ సందర్భంగా సీఎం కోరారు. -
30న అసెంబ్లీ!
* అదే రోజున శాసన మండలి భేటీ కూడా.. * ఒకే రోజు సమావేశం.. జీఎస్టీ ఆమోదమే ఎజెండా * సభలను సమావేశపర్చాలని మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ను కోరిన సీఎం సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ఈనెల 30న శాసనసభ, శాసనమండలిని సమావేశపరచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు సమావేశాలు నిర్వహించాలని శుక్రవారం మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారిలను కోరారు. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరిస్తూ ఇటీవల జీఎస్టీ చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. ఆ చట్టం అమల్లోకి రావాలంటే దేశంలో సగానికిపైగా రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ప్రత్యేకంగా ఒక్కరోజే సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారం, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి తదితరులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం జీఎస్టీ బిల్లుపై చర్చించడానికి ఈనెల 30న ఉదయం 11 గంటలకు సభలను సమావేశపరచాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారిలకు సీఎం విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం కావడంతో సభ్యులకు పూర్తి వివరణ ఇవ్వడానికి ఏజీ రామకృష్ణారెడ్డిని సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవాలని కోరారు. ఇక ప్రతిపక్షాలు కోరితే వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించే అవకాశముంది. బీఏసీ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనేది ఖరారవుతుందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. -
నెలాఖరు నుంచి అసెంబ్లీ
* లేదా సెప్టెంబర్ 17 నుంచి సమావేశాలు * గణేశ్ నవరాత్రుల దృష్ట్యా సర్కారు మల్లగుల్లాలు సాక్షి, హైదరాబాద్: గణేశ్ నవరాత్రుల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నెల 30 నుంచి లేదా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. జీఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించేందుకు వీలైనంత త్వరగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు సన్నాహాలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఏపీ కంటే ముందే జీఎస్టీ బిల్లును ఆమోదించి పంపేందుకు వీలుగా ఈ నెలాఖరునే సమావేశాలు ప్రారంభించాలనే ప్రతిపాదన వచ్చింది. కేవలం మూడు రోజుల పాటు సమావేశాలు జరిపి, తొలి రోజునే జీఎస్టీ బిల్లును ఆమోదించాలని యోచిస్తోంది. మరోవైపు గణేశ్ నవరాత్రుల దృష్యా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు ఇబ్బందులు తలెత్తకుండా... నిమజ్జనోత్సవం ముగిశాక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయాన్ని కూడా సర్కారు పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి పోలీసు విభాగం నుంచి అందిన సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ నెల 30వ తేదీ నుంచిగానీ లేదా సెప్టెంబర్ 17వ తేదీ నుంచిగానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి తీసుకునే తుది నిర్ణయం మేరకు తేదీ ఖరారవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును ఆమోదించాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సెప్టెంబర్ తొలివారంలో బిల్లును ఆమోదించి పంపిస్తామని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు సమాచారమిచ్చాయి. జీఎస్టీ బిల్లుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వీలైనంత తొందరగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ శాసనసభ సమావేశాల్లోనే దేవాదాయ శాఖ చట్ట సవరణ బిల్లు, ఎస్టీ, మైనారిటీల స్థితిగతులపై సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ ఇచ్చిన నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. -
నెలాఖరు నుంచి అసెంబ్లీ
-
తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలా?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కనీసం మూడు నుంచి నాలుగు వారాల పాటు నిర్వహించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించాలని చూస్తోందన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదానికే ఈ సమావేశాలని ప్రభుత్వం మాట్లాడటం దురదృష్టకరమని ఉమ్మారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు అనేక కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. కీలకమైన ప్రజా సమస్యలు చర్చించాల్సి ఉన్నందున సమావేశాలను వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించాలని ఆయన సూచించారు. కాగా శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 8న ప్రారంభమవుతాయని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలు నాలుగైదు రోజులపాటు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. -
తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలా?
-
8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- నాలుగైదు రోజులపాటు నిర్వహించే అవకాశం - జీఎస్టీ ఫోకస్ పాయింట్ గా సమావేశాలు - సభలో చర్చించే సమస్యలు పెద్దగా లేవు - ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి యనమల అమలాపురం రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 8న ప్రారంభమై, నాలుగైదు రోజులపాటు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఆర్థిక, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం ఆయన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ తొలుత అసెంబ్లీ సమావేశాలను అమరావతిలో నిర్వహించాలనుకున్నామని, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బిల్లును వచ్చే నెల 8 తేదీ నాటికి ఆమోదించి పంపాల్సిందిగా కోరడంతో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామన్నారు. జీఎస్టీ బిల్లును మన శాసన మండలి, శాసనసభలు ర్యాటిఫై చేయాల్సి ఉందన్నారు. ‘రాజ్యాంగం ప్రకారం సగం రాష్ట్రాలు జీఎస్టీని మండలి, శాసనసభల్లో ఆమోదించాల్సి ఉందని, 2017 ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని నిర్ణయించిన కేంద్రం రోడ్డు మ్యాప్ తయారు చేసింది’ అని యనమల చెప్పారు. దీనిలో భాగంగా వచ్చేనెల 8వ తేదీలోపు జీఎస్టీని ర్యాటీఫై చేయాలని సూచించిందన్నారు. జేఎస్టీ ఆమోదానికి ప్రతిపక్షం కూడా సహకరించాల్సిన అవసరముందన్నారు. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఏఏ సబ్జెక్టులు చర్చించాలనేది తొలి రోజున బీఏసీ సమావేశం నిర్వహించి ప్రకటిస్తామన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి చైర్మన్‌గా ఉన్న హైపర్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఈ నెల 30న న్యూఢిల్లీలో సమావేశమై జీఎస్టీ పరిహారం కేటాయింపులపై చర్చిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.935 కోట్లు బకాయి రావాల్సి ఉందన్నారు. -
జీఎస్టీ బిల్లు ఆమోదానికి త్వరలో అసెంబ్లీ : కేటీఆర్
హైదరాబాద్ : జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం త్వరలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...జీఎస్టీ వల్ల నష్టపోయే రెవెన్యూను ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. జీఎస్టీ సవరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదిస్తామని కేటీఆర్ అన్నారు. -
జీఎస్టీ బిల్లుకు జార్ఖండ్ ఆమోదం
రాంచి: అస్సాం, బిహార్ తర్వాత జీఎస్టీ బిల్లును ఆమోదించిన మూడో రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది. బుధవారం ప్రత్యేకంగా నిర్వహించిన శాసనసభ సమావేశంలో జీఎస్టీ బిల్లును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు తెలిపినందుకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జీఎస్టీని అమల్లోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పంపాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్రాలకు లేఖలు రాశారు. అస్సాం ముందుగా జిఎస్టీ బిల్లును ఆమోదించింది. జీఎస్టీని ఆమోదించిన రెండో రాష్ట్రంగా, తొలి ఎన్డీయేయేతర పార్టీల పాలిత రాష్ట్రంగా బిహార్ నిలిచింది. బిహార్ అసెంబ్లీలో మూజువాణి ఓటుతో మంగళవారం దీన్ని ఆమోదించారు. కనీసం 15 రాష్ట్రాలు ఆమోదిస్తేనే ఈ బిల్లును రాష్ట్రపతికి పంపిస్తారు. -
జీఎస్టీపై టీ.అసెంబ్లీ సమావేశం
హైదరాబాద్: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం తెలంగాణ అసెంబ్లీ త్వరలో సమావేశం కానుంది. ఈ నెలలోనే రాష్ట్ర అసెంబ్లీ సెషన్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పీటీఐకి చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారని తెలిపారు. ఈ సమావేశం సాధ్యమైనంత త్వరలోనే అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చి అత్యవసరంగా బిల్లును ఆమోదానికి పెట్టాలని నిర్ణయించిందనీ రాజేందర్ చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు బిల్లుకు మద్దతిచ్చారనీ, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా గజ్వేల్ బహిరంగ సభలో బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారని మంత్రి గుర్తుచేసుకున్నారు. కాగా ఆగస్టు 8న పార్లమెంటు ఆమోదం లభించిన జీఎస్ టీ బిల్లును బీహార్ అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. దీంతో ఈబిల్లును ఆమోదించిన తొలి ఎన్డీయేతర రాష్ట్రంగా బీహార్ అవతరించిన సంగతి తెలిసిందే. -
జీఎస్టీ బిల్లును ఆమోదించండి
సీఎంకు అరుణ్‌జైట్లీ లేఖ సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపాలని కేంద్ర విత్త మంత్రి అరుణ్‌జైట్లీ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జీఎస్టీని అమల్లోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాష్ట్రపతికి పంపించే ముందు 122వ రాజ్యాంగ సవరణ బిల్లును సగం రాష్ట్రాలు తమ చట్ట సభల్లో ఆమోదించాలి. అస్సాం, బిహార్‌లు తమ చట్ట సభల్లో జీఎస్టీని ఆమోదించాయి. -
‘జీఎస్టీ’ని ఆమోదించిన తొలి రాష్ట్రం అస్సాం
గువాహటీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును అస్సాం అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఇటీవలి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జీఎస్టీ బిల్లును రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ బిల్లును రాష్ట్రాల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ సవరణ బిల్లును అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వకర్మ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘‘పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లును అస్సాం అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది’’ అని స్పీకర్ రంజిత్‌కుమార్ దాస్ సభలో ప్రకటించారు. ప్రతిపక్షాలు కూడా బిల్లుకు మద్దతు తెలిపాయి. -
ఏపీకి ప్రత్యేక హోదా అత్యవసరం
* వెంటనే ఏపీకి హోదా ఇవ్వాలని వామపక్షాల డిమాండ్ * హోదా కోసం పోరాటం కొనసాగిస్తాం: ఏచూరి * ఫిరాయింపుదారులపై అనర్హత విధించే అధికారం స్వతంత్ర సంస్థ చేతుల్లో ఉండాలి * వామపక్షాల నేతలతో వైఎస్ జగన్ భేటీ * హోదా సహా పలు అంశాలపై చర్చ.. మద్దతు కోసం వినతి * జీఎస్టీ బిల్లు తర్వాత హోదా మరింత అవసరం: వైఎస్ జగన్ * అది మన హక్కు.. హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు * సాధించేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా తక్షణావసరమని, కుంటిసాకులు చెప్పకుండా వెంటనే హోదాను ప్రకటించాలని సీపీఐ రాజ్యసభ పక్ష నేత డి.రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. హోదా సాధనకోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని.. ప్రజా ఉద్యమాల ద్వారా, పార్లమెంటులో ఆందోళన ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఏపీకి హోదాతో పాటు ఇతర అంశాలపై చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం వారిరువురిని విడివిడిగా కలిశారు. ఉదయం 10 గంటలకు డి.రాజాను ఆయన నివాసంలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, విజయసాయి రెడ్డి, బుట్టా రేణుక, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి భేటీ అయ్యారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సీపీఎం కార్యాలయంలో సీతారాం ఏచూరిని కలిశారు. ఈ సమావేశంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.ఎ.బేబీ కూడా పాల్గొన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మూడు పేజీల వినతిపత్రాన్ని వారిరువురికీ అందజేశారు. ప్రత్యేక హోదా సాధనలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని, క్షేత్రస్థాయిలో తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదా అంశంతోపాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వై.ఎస్.జగన్ ఈ సమావేశంలో వారి దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ పోరాటాలకు వామపక్షాల మద్దతు ఉంటుందని వారు హామీ ఇచ్చారు. సమావేశాల అనంతరం రాజా, సీతారాం ఏచూరి, జగన్ విలేకరులతో మాట్లాడారు. హోదా కోసం కార్యాచరణ: డి.రాజా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధాని, ప్రభుత్వం హామీలు ఇస్తే.. తదుపరి ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలుచేయాలి. రాజ్యసభలో విభజన బిల్లు వచ్చినప్పుడు వాళ్లు కూడా పట్టుపట్టారు. నేను కూడా అక్కడే ఉన్నాను. వెంకయ్య నాయుడు ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలన్నారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు. అరుణ్ జైట్లీ ఆనాడు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. నేడు రాజ్యసభ సభా నాయకుడిగా, ఆర్థిక మంత్రిగా ఉన్నారు. బీజేపీ ఈ అంశాన్ని ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది. మోదీ తిరుపతిలో ఈమేరకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదాను తిరస్కరిస్తూ నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఈ విషయంలో వారు చెబుతున్న కారణాలు ప్రజలు అంగీకరించేలా లేవు. దీనిపై ఇతర వామపక్షాలతో సంప్రదింపులు జరుపుతాం. హోదా సాధనకోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడుతాం. నేను జగన్మోహన్రెడ్డికి ఇదే హామీ ఇచ్చాను. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీ విషయంలో సామరస్యపూర్వక పరిష్కారం కనుక్కోవాలి. దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలి. ఉద్యమాలతో ఒత్తిడి తెస్తాం: ఏచూరి ప్రత్యేక హోదా ఏపీకి తక్షణావసరం. ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలా లేదా? దాని వల్ల ఏపీకి ఇవ్వలేమన్నది అర్థం లేని వాదన. ప్రత్యేక హోదాపై ప్రభుత్వ వైఖరి స్పష్టంగా అర్థమవుతోంది. చేసిన వాగ్దానాలను అమలుచేయరని స్పష్టమవుతోంది. తిరిగి ఈ అంశాన్ని పార్లమెంటు ముందుకు, ప్రజల ముందుకు తీసుకొస్తాం. ప్రజా ఉద్యమాల ద్వారా, పార్లమెంటులో ఆందోళన ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. పోరాటాన్ని భవిష్యత్తులో ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై ఈ సమావేశంలో చర్చించాం. నీటి పంపకం రాష్ట్రాల మధ్య ఎలా ఉండాలన్న అంశంపై చర్చించాం. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యమాత్రమే కాదు. అన్ని రాష్ట్రాల మధ్య సమస్య ఏర్పడుతోంది. జాతీయస్థాయిలో ఎలా చేయాలో చర్చించాలి. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ నుంచి ఎన్నికల సంఘంలోకి రావాలన్న ప్రతిపాదన చేశారు. దీనిని ఇతర పార్టీలతో చర్చిస్తాం. ఆ అధికారం ఒక స్వతంత్ర సంస్థ చేతుల్లో ఉండడం అవసరం. రాజీ పడితే చరిత్ర హీనులుగా మిగులుతారు: జగన్ జీఎస్టీ బిల్లు ఆమోదం పొందాక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం అన్నది అతి ముఖ్యమైన అంశంగా మారింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో సేల్స్‌టాక్స్ అంశం ఉండేది. కొత్త పరిశ్రమలను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు సేల్స్ టా క్స్ రాయితీలు ఇచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సేల్స్ టాక్స్ అన్న అంశం కూడా జీఎస్టీ రావడం వల్ల కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయింది. సేల్స్ టాక్స్‌పై ఇక రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయింపు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అలాంటి మినహాయింపులు లేనప్పుడు ఎవరైనా కూడా కొత్త రాష్ట్రం, ఏ మౌలిక వసతులు లేని ఏపీకి రావడానికి ఏ పారిశ్రామికవేత్తయినా ఎందుకు ఉత్సాహం చూపుతారు? ఇప్పటికే మౌలిక వసతులు ఉన్న చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్‌కో పోవడానికి ఉత్సాహం చూపుతారు. ఒకవైపు హైదరాబాద్ పోయింది.. ఇతర రాష్ట్రాలతో సమాన బలం లేకుండా పోయిం ది.. సేల్స్‌టాక్స్ మినహాయింపులు ఇచ్చే అవకాశం పోయింది. కాబట్టి ఇప్పుడు జీఎస్టీ వచ్చిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా రావడం తప్పనిసరి అయింది. హోదా కలిగిన రాష్ట్రాలకే జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. మిగిలిన రాష్ట్రాలకు ఉండదు. రూ. లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రానికి రావాల్సినవన్నింటినీ మూటకట్టి ప్యాకేజీగా చూపిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. వందేళ్లు పోరాటం చేస్తేనే స్వాతంత్య్రం వచ్చింది. ఏదైనా పోరాడితేనే సాధిస్తాం. రాజీపడకుండా గట్టిగా పోరాటం చేస్తేనే హోదాను మరిచిపోలేరు. హోదా మన హక్కు. హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయి. లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్రం తన కాళ్ల మీద తాను నిలబడాలంటే హోదా తప్పనిసరి. ఎవరైనా కూడా రాజీ పడకూడదు. పడితే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ప్రత్యేక హోదా అన్న అంశంపై అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అంశం. ఈ అంశం జాతీయస్థాయిలో కూడా చర్చించదగ్గ అంశం. పార్లమెంటు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే... ప్రజల్లో ప్రజాస్వామ్య విశ్వసనీయతను కాపాడాలంటే... ప్రతిఒక్కరు అడగాల్సిన అంశం. ఈ విషయంలో ఏచూరి ఇంతవరకు మద్దతు ఇస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై రాష్ట్రంలోనూ, పార్లమెంటులో కలిసికట్టుగా ఒక్కటై పోరాటం చేయాలి. ఇతర పార్టీలను కూడా కలుపుకుని హోదా సాధించే దిశగా అడుగులు వేస్తాం. సాధించేవరకు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని ఘంటాపథంగా చెబుతున్నాం. నేడు రిషికేష్‌కు వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రిషికేష్‌కు వెళుతున్నారు. అక్కడ విశాఖ శారదాపీఠం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులను ఆయన తీసుకుంటారు. ఏపీకి హోదా ఇచ్చేలా కేం ద్రం మనసు మారాలని, రాష్ట్రం సుభిక్షం గా ఉండాలనే ఆకాంక్షతో జగన్ అక్కడికి వెళుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
వినియోగదారులకు లబ్ధి చేకూరాలి : ఎంపీ మేకపాటి
జీఎస్టీ బిల్లుపై చర్చలో వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ వల్ల అంతిమంగా వినియోగదారులకు లబ్ధి చేకూరాలని ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి చెప్పారు. సోమవారం లోక్‌సభలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ‘సిద్ధాంతపరంగా ఈ బిల్లు పన్నుల మీద పన్నులను తొలగించి వినియోగదారులకు మేలు చేకూర్చేలా కనిపిస్తోంది. అయితే ఇది జీఎస్టీ రేటుపై ఆధారపడి ఉంది. కేంద్రం తన ఎక్సైజ్, సర్వీసు పన్నుల వసూళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా కోల్పోకుండా ఉండాలని భావిస్తూ, రాష్ట్రాలు కూడా తమ ఆదాయాన్ని కోల్పోరాదని భావిస్తే జీఎస్టీ అమలుకు ముందు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. అప్పుడు జీఎస్టీ వల్ల వినియోగదారుడు ఏరకంగా ప్రయోజనం పొందుతాడు? అమలైతే తమపై పన్ను భారం తగ్గుతుందని సామాన్యుడు ఆశిస్తున్నాడు. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి..’ అని మేకపాటి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మేకపాటి ఈ సందర్భంగా మరోసారి ప్రస్తావించారు. ‘అప్పటి ప్రధానమంత్రి హామీ అమలు కోసం ఐదు కోట్ల మంది ఆంధ్రులు నిరీక్షిస్తున్నారు. కేంద్రం హోదాను ఇవ్వాలి..’ అని కోరారు. జీఎస్టీకి మద్దతిస్తున్నాం: రవీంద్రబాబు జీఎస్టీ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నామని, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని టీడీపీ ఎంపీ పి.రవీంద్రబాబు కోరారు. జీఎస్టీ బిల్లుపై చర్చలో పాల్గొంటూ.. ‘తాము జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇస్తున్నందున, తాము అడుగుతున్నది కూడా ఇవ్వాలని, తాము ఎప్పటికీ క్రమశిక్షణ కలిగిన సైనికుల వంటి వాళ్లమే..’నని రవీంద్రబాబు పేర్కొన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రం కోల్పోయే నష్టాన్ని కేంద్రం పూర్తిగా భర్తీ చేయాలన్నారు. -
'ఇక ట్యాక్స్ టెర్రరిజం నుంచి విముక్తి'
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు ప్రజాస్వామ్య విజయం అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బిల్లుకు సహకరించిన అన్ని పార్టీలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. సోమవారం జీఎస్టీ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జీఎస్టీ బిల్లు ద్వారా ట్యాక్స్ టెర్రరిజం నుంచి స్వేచ్ఛ లభించిందని చెప్పారు. టీమిండియా దిశగా ముందడుగు పడిందని అన్నారు. జీఎస్టీ బిల్లు తీసుకురావడమనేది భారత్ తీసుకున్న అతిగొప్ప నిర్ణయమని, పెద్ద ముందడుగు అని మోదీ అన్నారు. ఈ బిల్లు పాసచేయడం ద్వారా 'వినియోగదారుడే రాజు' అనే సందేశం పంపిన వాళ్లం అవుతామని చెప్పారు. క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆనాడు పోరాడిన భారత స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుంటూ మోదీ జీఎస్టీ బిల్లుపై ప్రసంగాన్ని ప్రారంభించారు. -
నేడు లోక్‌సభకు జీఎస్టీ బిల్లు
-
జీఎస్టీ బిల్లుకు ఓటేయండి: టీఆర్ఎస్
హైదరాబాద్: జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ ఎంపీలు జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని కోరింది. ఈ మేరకు విప్ జారీ చేసింది. కాగా సోమవారం లోక్ సభలో జీఎస్టీ బిల్లు ఆమోదానికి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ తొలి పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ జీఎస్టీకు అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
నేడు లోక్‌సభకు జీఎస్టీ బిల్లు
చర్చలో పాల్గొననున్న ప్రధాని మోదీ న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును ఆమోదం కోసం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఒకట్రెండు మినహా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలపడంతో ఏ ఇబ్బందీ లేకుండా బిల్లుసభ ఆమోదం పొందనుంది. నేడు బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. గతేడాదే బిల్లును లోక్‌సభ ఆమోదించినా... రాజ్యసభలో కొన్ని సవరణలు చేయడంతో మళ్లీ దిగువసభలో ప్రవేశపెడుతున్నారు. జీఎస్టీకి కాంగ్రెస్ మద్దతిస్తుందని, నేడు సభకు అందరూ ఎంపీలు హాజరుకావాలంటూ విప్ జారీచేశామని ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇప్పటికే బీజేపీతో పాటు పలు పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీచేశాయి. -
ముందున్నది మహా కష్ట కాలం
అవలోకనం జీఎస్టీ తదుపరి ఇంకా ఆశించదగిన మహా విస్ఫోటక ఆర్థిక సంస్కరణలు ఏమీ లేవని ప్రధాని స్పష్టంగా వివరించాలి. రాబోయే పదేళ్లలో ఆరు లేదా ఏడు శాతం వృద్ధి రేటును అధిగమించలేం. కాలం గడిచేకొద్దీ ఈ వృద్ధి రేటును కొనసాగించడం సైతం మరింత కష్టం అవుతుంది. భారీ మార్పులు ఏవీ వచ్చే అవకాశం లేదు కాబట్టి పది శాతం వృద్ధిని ఆశించలేం. బయటి ప్రపంచంలోని ఆర్థిక వృద్ధి పరిస్థితి సైతం మన దేశానికి అనుకూ లంగా లేదు. ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తున్నాయి, చరిత్రలో ఎన్నడూ ఎరుగ నంతగా ఉద్యోగాలు మటుమాయమైపోతున్నాయి. వస్తు తయారీ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుందని మనం చాలా కాలంగానే అంచనా వేస్తున్నాం. ఇప్పుడది జరుగుతోంది. డ బ్బును రుణంగా తీసుకోడానికి అయ్యే వ్యయం కంటే శ్రమకు అయ్యే వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల శ్రమకు ప్రత్యామ్నాయంగా యాంత్రీకరణను చేపడుతున్నారు. ఆటోమేషన్ (యాంత్రీకరణ) సేవారంగంలోని ఉద్యోగాలను సైతం దెబ్బతీస్తోంది.‘‘ఐటీ రంగంలో పెరగాల్సిన ఉద్యోగాలలో 10 శాతం అదృశ్యమౌతాయి. అంటే ఐటీ రంగం ఏటా 2 నుంచి 2.5 లక్షల ఉద్యో గాలను సృష్టించేట్టయితే వాటిలో 25,000 నుంచి 50,000 వరకు ఉద్యోగాలు మాయమౌతాయి’’ అని ఇన్ఫోసిస్ మాజీ డెరైక్టర్ మోహన్ దాస్ పాయ్ అన్నారు. దేశంలోని 45 లక్షల మంది ఐటీ రంగ ఉద్యోగులలో 4,50,000 మంది మధ్యస్త స్థాయి మేనేజర్లు. వారి పనిని యాంత్రీకరించడం వల్ల వారిలో సగం మంది (2,25,000) వచ్చే దశాబ్ద కాలంలో ఉద్యోగాలను కోల్పోతారు. ‘‘నేడు చాలా మంది (మధ్యస్త స్థాయి మేనేజర్లు) ఏడాదికి రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వారిలో సగం మంది వచ్చే పదేళ్లలో ఉద్యోగాలను కోల్పోతారు’’ అని పాయ్ చెప్పారు. బెంగళూరు, ముంబై, గుర్గావ్, పూణె, హైదరాబాద్ వంటి మన నగరాలకు ఇది చాలా పెద్ద దుర్వార్త. ఈ నగరాల వృద్ధికి సేవారంగ ఉద్యోగాలు వెన్నెముకగా ఉన్నాయి. సేవారంగ ఉద్యోగాల యాంత్రీకరణ అంటే ఈ పనిని ఇక భారత్‌కు పంపరని అర్థం. మన పట్టణ మధ్యతరగతి యువత ఉపాధిని కొనసాగించడానికి మనం కొత్త మార్గాలను కనిపెట్టాల్సిన అవసరం ఉంది. గత రెండు దశాబ్దాలుగా లేని కొత్త సమస్య ఇది. ఇంగ్లిష్ భాష ద్వారా లభించే సేవారంగ ఉద్యోగాలు పేదలు, మధ్యతరగతిలో చేరడానికి ఉన్న తేలిక మార్గం. ప్రవేశస్థాయిలోని ఈ ఉద్యోగాలే మటుమాయం కావడం అంటే సామాజిక గమనశీలత ముగిసిపోవడమే. ప్రసుత్తం చిన్న చిన్న నగరాలలో సామాజిక అశాంతి పెరుగుతోంది. గుజరాత్ పాటిదార్ల ఆందోళన, హరియాణా జాట్ల ఆందోళన వంటివి ముందు ముందు తీవ్రతరమౌతాయని భావించాలి. ఈ వాస్తవాలను ఎదుర్కోడానికి ప్రభుత్వం ప్రజలను సంసిద్ధం చేస్తున్నదని నేను అనుకోవడం లేదు. అది చూపుతున్న భవిష్యత్ చిత్రం అసాధారణమైనంతటి ఆశావహమైనదిగా ఉంటోంది. వివిధ సామాజిక అసంతృప్తులను పెంపొందుతున్న ఒక జాతీయ సంక్షోభంగా గాక స్థానికమైనవిగా వివరిస్తున్నారు. గత రెండు దశాబ్దాలలోకెల్లా అత్యంత ముఖ్యమైనదిగా పలువురు భావిస్తున్న ఆర్థిక సంస్కరణ క్రమాన్ని భారత్ ఇప్పుడే ప్రారంభించింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) దేశంలోని పరోక్ష పన్నుల విధానాన్ని సులభతరం చేస్తుంది. కేవలం ఈ సంస్కరణే దేశ ఆర్థిక వృద్ధి రేటుకు మరో రెండు పాయింట్లను చేర్చగలదని సైతం కొందరు భావిస్తున్నారు. ఇతరులు దాన్ని అంగీకరించకపోవచ్చునేమో గానీ, అందరూ ఈ సంస్కరణ కీలకమైనదని విశ్వసిస్తున్నారు. ఇంకా ఏ సంస్క రణలను ప్రవేశపెడతారని మనం ఆశించవచ్చు? ఎన్నో ఏం లేవు, జీఎస్టీ స్థాయి సంస్కరణలు అసలుకే లేవు. నరేంద్ర మోదీ ప్రభుత్వం నాటకీయమైన మార్పును సాధించే దిశగా పలు చట్టాలను చే స్తుందని ఆశించి ఉంటే... ఆయన ఆ ఆశలను నిలబెట్టలేకపోయారు. పెద్ద సంస్కరణగా ముందుకు తెచ్చిన జీఎస్టీ బిల్లు సైతం మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. నిజానికి, ఒక ముఖ్యమంత్రిగా మోదీ దాన్ని వ్యతిరేకించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాక ఆయన తన వైఖ రిని మార్చుకున్నారు. ఇది చాలా మంచి, తెలివైన రాజకీయమని అనుకుంటాను. కొంత కాలం క్రితం ‘వాస్స్ట్రీట్ జర్నల్’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ... చట్టాలు చేయాల్సి ఉన్న పెద్ద సంస్కరణలు ఇంకా ఏమున్నాయో తనకు తెలియ దని అన్నారు. ‘‘నేను ప్రభుత్వంలోకి వచ్చాక నిపుణులందరితో కలసి కూచుని, ‘‘మహా విస్ఫోటనం’’ (భారీ ఆర్థిక సంస్కరణల వెల్లువ) అంటే వారి దృష్టిలో ఏమిటో నిర్వచించమని కోరేవాడిని. అవేమిటో ఎవ్వరూ చెప్ప గలిగేవారు కారు’’ అని తెలిపారాయన. ఇంకా తేవాల్సి ఉన్న సంస్కరణలలో అత్యధిక భాగం రాష్ట్రా లకు సంబంధించినవ నీ, కీలకమైన, వివాదాస్పదమైన కార్మిక చట్టాలను రాష్ట్రాలు మరింతగా సరళీకరిస్తాయని ఎదురు చూస్తున్నానని అన్నారు. ‘‘కార్మిక సంస్కరణ లంటే పారిశ్రామికరంగ ప్రయోజనాలేనని అర్థం కాదు. అవి కార్మికుల ప్రయోజ నాల కోసం కూడా ఉద్దేశించినవి’’ అని ఆయన తెలిపారు. మోదీ ఈ విషయంలో చాలా జాగ్రత ్తతో వ్యవహరిస్తున్నారని ఈ మాటలు సూచిస్తున్నాయి. ప్రధాని చెప్పింది పూర్తిగా సరైనదని భావిస్తున్నాను. ఇకనెంత మాత్రమూ సోషలిస్టు దేశంగా లేని దేశంలో ఇంకా తేవాల్సిన మహా సంస్కరణలు ఏము న్నాయి? అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఆర్థిక సరళీకరణకు అనుకూలమైనవే. పరిస్థితి ఇదైనప్పుడు చట్టపరమైన మార్పులు పెద్దగా జరుగుతాయని ఆశించ జాలం. మన ఆర్థిక వృద్ధిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? మధ్యస్త కాలికంగా, అంటే దాదాపుగా వచ్చే దశాబ్ద కాలంలో ప్రస్తుతం ఉన్న ఆరు లేదా ఏడు శాతం ఆర్థిక వృద్ధి రేటును మనం అధిగమించలేమని నా నమ్మకం. కాలం గడిచేకొద్దీ ఈ వృద్ధి రేటును కొనసాగించడం సైతం మరింత కష్టంగా మారుతుంది. భారీ మార్పులు ఏవీ వచ్చే అవకాశం లేదు కాబట్టి 10 శాతం వృద్ధిని ఆశించలేం. పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయి. చట్టపరంగా తన ప్రభుత్వం చేయగలగినది ఇంకా ఏమి మిగిలి ఉన్నదనే దాని స్వభావాన్ని మోదీ చక్కగానే వివరిస్తారు. అయితే, ఆశించదగిన మహా విస్ఫోటక ఆర్థిక సంస్కరణలు ఏవీ లేవని, ఏదైనా మార్పంటూ వస్తే అది బహిర్గత పరిస్థితులు భారత్‌పై కలుగజేసేదే కావాలనే విషయాన్ని ఆయన మరింత స్పష్టంగా వివరించాలి. మన ముందున్నది మహా కష్ట కాలం. అదృష్టవశాత్తూ మనల్ని విశ్వాసంతో ముందుకు తీసుకుపోగల ప్రజామోదం గల ప్రభుత్వమూ ఉంది, ప్రజాదరణ గల నాయకుడూ ఉన్నారు. ( వ్యాసకర్త : ఆకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ) -
ఓకే దేశం .. ఒకే పన్ను..
-
జీఎస్టీతో విద్యారంగంపై ప్రభావం
దోమలగూడ: నాణ్యమైన విద్యను అందించాలనే ప్రజల అకాంక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గత విద్యా విధానాన్నే అవలంబిస్తే తెలంగాణ సాధించుకుని ఏం లాభమని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రభుత్వ బడుల మూసివేతను వ్యతిరేకిస్తూ, ‘రేషనలైజేషన్‌ను అడ్డుకుందాం.. విశ్వవిద్యాలయాలను కాపాడుకుందాం’ పేరుతో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యావిధానం కార్పొరేట్, సామ్రాజ్యవాద శక్తులకు ఊడిగం చేసేలా ఉందన్నారు. తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక టాక్స్ విధించి విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఎస్టీ బిల్లు విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వ విద్యా బోధన సరిగా జరగదని కార్పొరేట్, మార్కెట్ శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. వీసీలను నియమించకుండా, నిధులు ఇవ్వకుండా యూనివర్సిటీలను ధ్వంసం చేస్తున్నారని, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 12 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రొఫెసర్ కె చక్రధరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ప్రైవేట్ విద్యా సంస్థలను పోషిస్తుందన్నారు. ప్రభుత్వం ఆర్ధిక లావాదేవీలు జరిగే రంగాలనే ప్రోత్సాహిస్తుందని, విద్యరంగం బలోపేతం పట్ల నిబద్దత లేదని అన్నారు. కేంధ్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరుతో ప్రైవేటీకరణను, విదేశీ సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు హిందూత్వ ఆలోచనలను రుద్దాలని చూస్తుందన్నారు. ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, కామన్ స్కూలు విధానాన్ని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
జీఎస్టీ.. ఎవరిలెక్కలేంటి?
♦ సందేహాలున్నాయి: నాస్కామ్ ♦ బిల్లింగ్, రివర్స్ చార్జీపై స్పష్టతకు డిమాండ్ న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు 2017 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో... క్లిష్టమైన బిల్లింగ్, ఇన్వాయిస్ అవసరాలు సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని సాఫ్ట్వేర్ కంపెనీల సమాఖ్య నాస్కామ్ ప్రకటించింది. దిగుమతి చేసుకునే సేవలపై విధించే రివర్స్ చార్జీ... ఎగుమతుల్ని దెబ్బతీసేలా ఉండరాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే సమయంలో జీఎస్టీ ఆమోదంపై హర్షం ప్రకటిస్తూ... నూతన బిల్లు పన్నుల వ్యవస్థను గాడిలో పెడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అయితే, దీన్ని మరింత పారదర్శకంగా మార్చాలని కోరింది. నాస్కామ్ అభ్యంతరాలు ⇔ దేశవ్యాప్తంగా సేవల రంగంలో ఉన్న కంపెనీలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్రం వద్ద నమోదు చేసుకోవాల్సి రావడం ఇబ్బందికరం. ⇔ క్లిష్టమైన బిల్లింగ్, ఇన్వాయిస్ అవసరాల కారణంగా ఐటీ రంగం ఎగుమతి పోటీతత్వంపై ప్రభావం పడుతుంది. ⇔ ఎగమతి చేసే సేవల కోసం దిగుమతి చేసుకునే సర్వీసులపై విధించే రివర్స్ చార్జీపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. పన్ను రూపంలో చెల్లింపులతో మూలధనం వినియోగించుకునే వీలు లేకుండా పోతుంది. బిల్లులో ఏమున్నదో చూడాలి ‘ఎగుమతి ఆధారిత కంపెనీలు దిగుమతి చేసుకునే సేవలపై (ఈఆర్పీ లెసైన్స్, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ) సేవాపన్ను పడుతుంది. అయితే, తర్వాత ఈ పన్ను రిఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. కానీ ఇది సమయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు రివర్స్ చార్జీ కేవలం సేవలపైనే ఉంది. జీఎస్టీతో ఇది సరుకులకూ విస్తరిస్తుంది. అయితే, ఏవి సరుకులు, ఏవి సేవలు అనే దానిపై ఏం చెప్పారో చూడాల్సి ఉంది’ - సలోనీ రాయ్, డెలాయిట్ సీనియర్ డెరైక్టర్ వినియోగదారుడు.. పరిశ్రమకూ మేలే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల మాట న్యూఢిల్లీ: జీఎస్టీతో సరఫరా వ్యవస్థ స్థీరీకరణ చెందుతుందని, సరుకుల రవాణా భారం తగ్గుతుందని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీదారులు పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణ మరింత సులభంగా మారుతుందని ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ తయారీదారుల సంఘం (సీమ) తెలిపింది. లావాదేవీల ఖర్చు, రవాణా వ్యయం తగ్గడం ద్వారా స్థానిక తయారీ రంగం మరింత వృద్ధి చెందుతుందని పేర్కొంది. పెద్ద ఎత్తున ప్రయోజనం.. పన్ను రేటు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. దీని వల్ల పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. ఇది క్రమంగా వినియోగదారుడికి బదిలీ అవుతుంది. సరఫరా వ్వవస్థ్థీరీకరణకు, రవాణా భారాన్ని తగ్గించుకునేందుకు మా వంటి బ్రాండెడ్ కంపెనీలకు అవకాశం లభిస్తుంది. - మనీష్ శర్మ, పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ వినియోగదారుడికి లాభం.. ధరల పరంగా వినియోగదారుడికి ప్రయోజనం. పరిశ్రమకు సానుకూల పరిణామం. - ఎరిక్ బ్రగాంజా, హెయర్ ఇండియా ప్రెసిడెంట్ వృద్ధి పెరుగుతుంది: మూడిస్ న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు దేశ ఆర్థిక వృద్ధికి అనుకూలమని, ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. అయితే, రెవెన్యూ న్యూట్రల్ శ్రేణికి అనుగుణంగా పన్ను రేట్లున్నపుడే ఇది సాధ్యమని స్పష్టం చేసింది. రెవెన్యూ న్యూట్రల్ శ్రేణి అంటే... కొత్త పన్ను వ్యవస్థను అమలు చేసినా కేంద్రం, రాష్ట్రాలు ప్రస్తుతం వస్తున్న ఆదాయం కోల్పోకుండా ఉండేంత స్థాయి. అదే సమయంలో ఇతర వివాదాస్పద సంస్కరణల్లో ప్రగతి నిదానంగా ఉండవచ్చని మూడీస్ అంచనా వేసింది. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడం... సంస్కరణల్లో ప్రగతి... కాస్త నిదానంగా రాజకీయ సహకారంపై ఆధారపడి ఉంటుందన్న తమ అంచనాల ప్రకారమే జరుగుతున్నట్లు మూడీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మారీ డిరోన్ అన్నారు. . ఒకే పన్నుతో ‘ఆటో’ జోరు... స్వాగతమన్న ఆటోమొబైల్స్ జీఎస్టీ విషయంలో ఆటోమొబైల్ రంగం యావత్తూ సానుకూలంగా స్పందిం చింది. ప్రస్తుత భిన్న రకాల పన్నుల వ్యవస్థ స్థిరీకరణ చెందుతుందని ఈ రంగం అభిప్రాయపడింది. ఆటోమోటివ్ పరిశ్రమ ఒకే దేశం, ఒకే పన్ను విధానంతో లబ్ధి పొందుతుందని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనుగాగ్ మెహ్రోత్రా చెప్పారు. ప్రస్తుతం వాహనం కొలతలు, ఇంజన్ సామర్థ్యం ఆధారంగా ఆటో పరిశ్రమపై నాలుగు శ్లాబుల ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. చిన్న కార్లపై (నాలుగు మీటర్లలోపు పొడవు ఉన్నవి) 12 శాతం ఎక్సైజ్ పన్నుంటే... అంతకు మించిన పొడవున్న పెద్ద కార్లపై 24 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. ఇవన్నీ 1500 సీసీ సామర్థ్యంలోపున్నవే. ఈ సామర్థ్యం దాటిన వాటిపై పన్ను ఇంకా అధికంగా ఉంది. ఆటోమొబైల్ రంగానికి చక్కని అవకాశం... జీడీపీలో తయారీ రంగం నుంచి 45 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతమున్న భిన్న రకాల పన్నుల వ్యవస్థను స్థిరీకరణ చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. - యోచిరో యునో, హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్ పన్నుల భారం తగ్గుతుంది... వాహన పరిశ్రమపై అధిక పన్నులు విధిస్తున్నారు. జీఎస్టీతో ఈ భారం తగ్గి, సులభతరమైన, పారదర్శక విధానం వస్తుంది. సామర్థ్యం, ఉత్పాదకత పెరుగుదలతో పోటీపడగల అతిపెద్ద ఏకైక మార్కెట్‌గా అవతరిస్తుంది. - రాకేష్ శ్రీవాత్సవ, వైస్ ప్రెసిడెంట్, హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత్‌ను మరింత బలోపేతం చేస్తుంది దేశ ఆర్థిక రంగాన్ని మరింత బలమైన, ఓపెన్ మార్కెట్‌గా జీఎస్టీ చేయగలదు. అంతర్జాతీయంగా మరింత పోటీపడేలా చేస్తుంది. - పవన్ ముంజాల్, చైర్మన్, ఎండీ, హీరోమోటోకార్ప్ ఈ- కామర్స్ వృద్ధికి విఘాతం: పరిశ్రమ మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) జీఎస్టీ నిబంధన ఈ కామర్స్ పోర్టళ్ల (మార్కెట్ ప్లేస్ మోడల్) అభివృద్ధికి పెద్ద విఘాతమని, చిన్న వర్తకులకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఎదురవుతుందని ఈ రంగం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కామర్స్ సంస్థలు తమ వేదిక ద్వారా... వినియోగదారులు ఏదైనా వస్తువు లేదా సేవను కొనుగోలు చేసినప్పుడు చెల్లించే మొత్తం నుంచి టీసీఎస్ రూపంలో కొంత మినహాయించాల్సి ఉంటుంది. విక్రయదారులు తమ పన్నులో ఇది సర్దుబాటు చేసుకోవచ్చు. అయితే, దీని కారణంగా తక్కువ లాభంపై పనిచేసే చిన్న వ్యాపారస్తులకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఎదురవుతుందని విశ్లేషకుల అంచనా. దీంతో ఈ కామర్స్ పోర్టళ్ల ద్వారా వ్యాపారం చేసే వారిని నిరుత్సాహపరిచినట్టు అవుతుందని అంటున్నారు. అయితే, ఈ కామర్స్ రంగానికి జీఎస్టీ మంచి ఉత్ప్రేరకమని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. టీసీఎస్‌పై పునఃపరిశీలన అవసరం ఈ అంశాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది. జీఎస్టీ సంస్కరణల స్ఫూర్తి అమలులో కనిపించాలి. ప్రస్తుత చిక్కుముళ్ల స్థానంలో కొత్త అడ్డంకులను సృష్టించరాదు. - కునాల్ భాయ్, సీఈవో, స్నాప్‌డీల్ సంస్కరణలకు జోష్: ఫిచ్ న్యూఢిల్లీ: ‘వాణిజ్య పరంగా ఉన్న అడ్డంకులను జీఎస్టీ తొలగిస్తుంది. ఇదొక కీలక సంస్కరణ. ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. దీర్ఘకాలంలో అభివృద్ధికి తోడ్పడుతుంది’ అని రేటింగ్ సంస్థ ఫిచ్ తెలిపింది. అయితే, స్వల్ప కాలంలో ద్రవ్యలోటు పరంగా ఏమంత ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. బిల్లు ఆమోదం పొందడంతో కీలక సంస్కరణల విషయంలో ప్రభుత్వ సామర్థ్య పరంగా సానుకూల సంకేతాలను ఇచ్చినట్టయిందని అభివర్ణించింది. జీఎస్టీ అమలుతో ప్రభుత్వానికి అధిక పన్ను ఆదాయం సమకూరుతుందా అన్నది వేచి చూడాల్సి ఉందని పేర్కొంది. పన్ను రేటును ఎంత నిర్ణయిస్తారు వంటి ఎన్నో అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని తన నివేదికలో ఫిచ్ తెలిపింది. -
జీఎస్టీపై బి-టౌన్ టాక్
ముంబై: సుదీర్ఘ కాలంగా ఆసక్తికర చర్చ నడుస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్లుకు బుధవారం పెద్దల సభ ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ పరిణామాలపై హిందీ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, దర్శకులు, ఇతర నటులు సోషల్ మీడియాలో స్పందించారు. బాలీవుడ్ కు చెందిన ఆయుష్మాన్ ఖురానా, బాలాజీ టెలీ మాజీ సీఈఓ తనూజ్ గార్గ్ తదితరులు ట్విట్టర్ లో తమ అభప్రాయాలను పోస్ట్ చేశారు. నటుడు పూరబ్ కోహ్లీ దీనిపై స్పందిస్తూ తాము ఇంకా జిఎస్టి బిల్లు తరువాత స్వచ్ఛ్ భారత్ పన్ను చెల్లించవలసి ఉంటుందా తెలుసుకోవాలని ఉందన్నారు. జీఎస్ టీ బిల్లు విప్లవాత్మక సాహసోపేతమైన అడుగు అని ఆయుష్మాన్ ట్విట్ చేశారు. 1992 నుంచి అత్యంత ముఖ్యమైన ఆర్థిక సంస్కరణ అనీ, ఇదొక "వీర విప్లవ అడుగు" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక దేశం... ఒకపన్ను స్వాతంత్ర్యం అనంతరం ఇది అతిపెద్ద సంస్కరణ అంటూ తనూజ్ గూర్గ్ ప్రశంసించారు. జీఎస్టీ ఫైనల్లీ.. ఆహ్వానించ దగిన పరిణామమని దర్శకుడు కునాల్ కోహ్లీ తన సంతోషాన్ని షేర్ చేశారు. అయితే హాస్యనటుడు అశ్విన్ ముష్రాన్ తనకు సంబంధించి జీఎస్టీలో ప్రధాన లోపం అధిక సేవా పన్ను కావచ్చన్నారు. కానీ మిగతా అంతా ప్రామాణీకరింబడిందని ట్విట్ చేశార. అటు బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. పెద్దగా ఏమీ తెలియకపోయినా... చాలా ఉత్సాహంగా అనిపించిందని ట్విట్ చేశారు. కాగా రాజ్యసభ అమోదంతో జీఎస్టీ బిల్లు చట్టం రూపం దాల్చడానికి ఒక ప్రధాన అడుగు ముందుకు పడినట్టు అయింది. ఇక ఇది బిల్లుగా మారడానికి లోకసభలో గ్రీన్ సిగ్నల్ పడడమే తరువాయి. -
స్వామిగారు ఎందుకు సైలెంటయ్యారంటే!
న్యూఢిల్లీ: దేశ రాజకీయ, ఆర్థిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. దుమారం రేపే బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. చరిత్రాత్మకమైన జీఎస్టీ బిల్లుపై మాత్రం మౌనం దాల్చారు. బుధవారం రాజ్యసభ ఆమోదించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు యోగ్యతాయోగ్యతల గురించి తనకు మాట్లాడాలని ఉన్నా... తన ఆర్థిక ప్రావీణ్యం, పార్టీ విధేయత మధ్య ఇది ఘర్షణకు దారితీసే అవకాశముండటంతో తాను మౌనంగా ఉన్నట్టు స్వామి ట్విట్టర్లో పేర్కొన్నారు. ' జీఎస్టీ పాత్ర, అవసరం ఎంతవరకు ఉందనే అంశంపై దేశభక్తులైన నెటిజన్లు ఎవరైనా సమగ్రంగా అధ్యయనం చేశారా?' అంటూ ఆయన ట్విట్టర్లో అడిగారు. ఓ ఫాలోవర్ స్పందిస్తూ ఆర్థిక వ్యవస్థపై ఈ బిల్లు ప్రభావం గురించి మీ అభిప్రాయాలను మీడియాకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. స్వామి స్పందిస్తూ.. 'నా ఆర్థికశాస్త్ర ప్రావీణ్యం, పార్టీ విధేయత పట్ల ఘర్షణకు దారితీస్తుందనే నేను మౌనంగా ఉన్నాను' అని స్వామి చెప్పారు. తన అభిప్రాయాలు చెప్పడం వల్ల సొంత పార్టీ బీజేపీ ఎక్కడ నొచ్చుకుంటుందోనన్న అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తంచేశారు. అంతేకాకుండా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరుగాలంటే అందుకు అధిక పెట్టుబడులు, మూలధనం, అధిక కార్మిక ఉత్పాదకత మాత్రమే మార్గమని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
జీఎస్టీ గ్రేటే కానీ,.. మాకేం తెలియదు!!
భారత ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన గొప్ప బిల్లు జీఎస్టీ... దేశమంతా ఒకే పన్ను ఉండేలా రూపొందిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును రాజ్యసభ బుధవారం ఆమోదించింది. అతిపెద్ద పన్నుల సంస్కరణగా భావిస్తున్న ఈ బిల్లుపై రాజకీయ నాయకులే కాదు.. చాలామంది ప్రముఖులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. కానీ, 2007లో యూపీఏ ప్రభుత్వం తీర్చిదిద్దిన ఈ బిల్లు గురించి బాలీవుడ్ టాప్ హీరోలకు అసలేమీ ఏమీ తెలియదంట. వాళ్లే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. ఓవైపు జీఎస్టీ బిల్లును రాజ్యసభ ఆమోదించడాన్ని కీరిస్తూనే.. అబ్బే ఈ బిల్లు గురించి మాకేం తెలియదండి అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. 'ఆర్థిక విషయాల గురించి నాకు పరిమిత జ్ఞానమే ఉంది. అయినప్పటికీ జీఎస్టీ బిల్లు దేశ బలోపేతానికి గొప్ప ముందడుగు. కాబట్టి అందరికీ అభినందనలు' అని షారుఖ్ ట్వీట్ చేయగా.. ఇటూ బిగ్ బీ కూడా తనకు ఆ బిల్లు గురించి ఏమీ తెలియదంటూ సెలవిచ్చాడు. 'జీఎస్టీ బిల్లు గురించి సుదీర్ఘంగా చర్చించి ఎట్టకేలకు ఆమోదించారు. ఈ బిల్లు ఏమిటో నాకు తెలియదు. కానీ అందరిలాగే ఎక్సైట్ అయ్యాను' అని బిగ్ బీ ట్వీటారు. -
జీఎస్టీతో తెలంగాణకు నష్టం ఏంతంటే !
-
అమ్మో! అప్పుడేనా!!
• జీఎస్టీ అమలుకు సిద్ధంగా లేని కంపెనీలు • దాదాపు 20 శాతమే రెడీ అంటున్న నిపుణులు • పన్నుల అమలుకు భారీ ఐటీ వ్యవస్థ కావాలి • చిన్న కంపెనీల్లో ఆందోళనలు కూడా తొలగాలి • వచ్చే ఏప్రిల్ నుంచి అమలు కష్టమనే వ్యాఖ్యలు • 2017 జూలై లేదా అక్టోబర్ నుంచి అమలు!! • పూర్తి అమలుకు మరో రెండేళ్లు పట్టే అవకాశం రెండు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దాదాపు 130 కోట్ల మంది జనాభా 29 రాష్ట్రాలు... 7 కేంద్రపాలిత ప్రాంతాలు అధికారికంగా గుర్తించిన 22 భాషలు... తొలిసారిగా దీన్నంతటినీ కలిపే ఏకైక మార్కెట్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా అన్నిచోట్లా ఒక వస్తువుకు ఒకే పన్నును ప్రతిపాదిస్తున్న ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్’ బిల్లును సుదీర్ఘ రాజకీయ వ్యూహాల అనంతరం బుధవారం రాత్రి రాజ్యసభ కొన్ని సవరణలతో ఆమోదించింది. ఇంకా సమయం పడుతుందిలే... అని కాస్త పట్టనట్లుగా ఉన్న కంపెనీలు దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయా? ‘‘అసలు పని ఇప్పుడే మొదలైంది’’ అన్న రెవెన్యూ కార్యదర్శి శక్తికాంతదాస్ మాటల్ని చూస్తే కంపెనీలు సిద్ధంగా లేవనే అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రం, రాష్ట్రం వేరువేరుగా విధించే సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీలను ఒకేసారి ఉత్పత్తులపై విధించడానికి, ప్రభుత్వం చెబుతున్నట్లు అన్నిటినీ ఆన్‌లైన్‌లోకి తేవటానికి భారీ ఐటీ వ్యవస్థ కావాలి. పన్ను వసూలుదార్లకు శిక్షణా ఇవ్వాలి. మొదట చిన్న కంపెనీలకు దీనిపై ఉన్న ఆందోళనలు పోవాలి. వస్తువును బట్టి పన్ను రేట్లు ఉంటాయి కనక తాము పెద్ద కంపెనీలతో పోటీ పడలేమన్న వాటి భయాలకు తగిన భరోసా కావాలి. నిజానికి జీఎస్టీని అమలు చేసిన పలు దేశాలు... దాని ఫలితాలు అందుకునే ముందు ఆర్థిక మందగమనాన్ని అనుభవించినవే. ‘‘భారత వృద్ధి రేటు మార్చి త్రైమాసికంలో 7.9 శాతంగా ఉంది. జీఎస్టీ అమలుతో వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో 0.8 శాతం పెరిగే అవకాశం ఉంది’’ అని హెచ్ఎస్బీసీ ఆర్థికవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు. 20 శాతం కంపెనీలే సిద్ధం? పన్ను నిపుణుల అంచనాల ప్రకారం ప్రస్తుతం 20 శాతం కంపెనీలే జీఎస్టీ అమలుకు సిద్ధంగా ఉన్నాయి. తరచూ మారే పన్నులకు అలవాటు పడిన మిగతా కంపెనీలు ఇంకా దీనిగురించి ఆలోచించటంలేదు. మెజారిటీ రాష్ట్రాలు దీన్ని ఆమోదించిన తరవాత జీఎస్టీ మండలి అమల్లోకి వస్తుంది కనక... ఎప్పటి నుంచి దీన్ని అమలు చేయాలన్నది అదే నిర్ణయిస్తుంది కనక తమకింకా కొంత సమయం ఉందన్నది వాటి ఉద్దేశం. అయితే ఇదంతా జరగటానికి నవంబర్ వరకూ సమయం పట్టొచ్చు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో... వాస్తవంగా అమలుకాబోయే జీఎస్టీ బిల్లు రావచ్చు. ‘‘వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అది కాస్త కష్టమే కావచ్చు. బహుశా!! వచ్చే ఏడాది జూలై లేదా అక్టోబర్ నుంచి అమలయ్యే అవకాశాలైతే ఉన్నాయి’’ అనేది నిపుణుల మాట. అయితే దీన్ని ఎప్పటి నుంచి అమలు చేసినా... పూర్తి స్థాయిలో దేశం మొత్తం దీన్ని అర్థం చేసుకుని అమల్లోకి తేవటానికి, దాని ఫలితాలు అందటానికి రెండేళ్లు పడు తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆందోళనలో ఐటీ పరిశ్రమ..: నాస్కాం జీఎస్టీ బిల్లును ఆహ్వానిస్తున్నట్టు నాస్కాం తెలిపింది. అయితే సర్వీసు, ఐటీ రంగం ఆందోళన చెందుతోదని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలిపామని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ అన్నారు. ‘ప్రస్తుతం ఐటీ రంగానికి ఉన్న పన్నుల విధానం సులభంగా ఉంది. సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్, సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్, ఒకే ఇన్వాయిస్. అలాగే రిఫండ్‌కు ఒకేచోటకు వెళితే చాలు. అదే జీఎస్టీ విధానంలో సెంట్రల్ జీఎస్టీ, ఇంటర్‌స్టేట్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ వంటివి ఉంటాయి. ఈ పరిణామం పరిశ్రమకు సవాల్‌గా నిలుస్తుంది. ఐటీ సేవల రంగానికి జీఎస్టీ కాలరాత్రిగా ఉండరాదు’ అని అన్నారు. సెంట్రల్ జీఎస్టీ, ఇంటర్‌స్టేట్ జీఎస్టీని ఒకే పన్ను కిందకు తీసుకు రావాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. కీలకమైన చట్టానికి ప్రతిపక్షం అందించిన సహకారంతో దేశంలో సంస్కరణల ప్రగతిపై పరిశ్రమ రంగానికి ఎన్నో ఆశలు చిగురించాయి. - హర్షవర్దన్ నియోతియా, ఫిక్కి ప్రెసిడెంట్ వేగంగా అమలుపైనే విజయం.. ఆటోమొబైల్ పరిశ్రమ హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది. పన్నుల వ్యవస్థను విస్తృతం చేస్తుంది. వ్యవస్థ అంతటా సమర్థతను పెంచుతుంది. మార్కెట్‌ను ఏకం చేస్తుంది. విజయం సాధించడంలో వేగంగా అమలు అన్నది కీలకం అవుతుంది. - కెనిచి అయుకువ, ఎండీ, మారుతి సుజుకి ఇండియా పెట్టుబడులు వస్తాయి..: సెల్కాన్ ‘‘టెలికం ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా 5 శాతం మాత్రమే పన్ను ఉంచాలని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ప్రధానంగా మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు దీనిని వర్తింపజేయాలి. మేక్ ఇన్ ఇండియా కాని పక్షంలో ఎక్కువ పన్ను వసూలు చేయాలి. ఇక జీఎస్టీ అమలైతే రవాణాతో ముడి పడిన వ్యయాలు తగ్గుతాయి. పన్ను సమస్యలుండవు. ఈ రంగంలోకి విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది’’ - సెల్కాన్ మొబైల్స్ సీఎండీ వై.గురు వినియోగదారులకే లాభం • ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గుతాయి • ‘సాక్షి’తో ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోడీ జీఎస్టీ అమలు కోసం కంపెనీలు, వర్తకులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నారని ఫ్యాప్సీ తెలిపింది. పన్నుల విషయంలో స్వాతంత్రం అనంతరం జరిగిన అతిపెద్ద సంస్కరణగా జీఎస్టీని అభివర్ణించింది. ప్రస్తుతం పన్నులు సగటున 25-30 శాతం ఉన్నాయని, జీఎస్టీతో ఇది 17-18 శాతానికి దిగొస్తుందని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోడీ చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ‘‘పన్ను సంస్కరణలు చేపట్టింది కస్టమర్ల కోసమే. జీఎస్టీ అమలైతే అంతిమంగా లాభపడేదీ వారే. దేశవ్యాప్తంగా ఒకే ధర ఉంటుంది కనక వ్యాపారులు తమ విస్తృతి పెంచుతారు. ఎక్కువ వెరైటీలు అందుబాటులోకి వస్తాయి. ఎంచుకోవడానికి కస్టమర్లకు ఆస్కారం ఉంటుంది. ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గుతాయి. అయితే సెంట్రల్ జీఎస్టీ, ఇంటర్‌స్టేట్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ కోసం వర్తకులు వేర్వేరు రిటర్నులు దాఖలు చేయాలి. చిన్న, మధ్యతరహా కంపెనీలు, చిన్న వర్తకులు ఈ విషయంలో ఆందోళనగా ఉన్నమాట వాస్తవమే. వేర్వేరు రిటర్నులు దాఖలు చేయాలంటే చాలా ఇబ్బందే. ఏమాత్రం తప్పు దొర్లినా కఠిన శిక్షలున్నాయి. రిటర్నులు ఎలక్ట్రానిక్ రూపంలో దాఖలు చేయాలి. అత్యధికులకు దీనిపై అవగాహన లేదు. కాబట్టి సీఏల సేవలు వినియోగించుకోవాలి. ఇదంతా వ్యయప్రయాసలతో కూడినదని వర్తకులు అంటున్నారు. నిజానికి జీఎస్టీతో ప్రభుత్వానికి పన్ను ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. జీడీపీ 1.5-2 శాతం అధికమవుతుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ రూపంలో పన్నులు చెల్లించాలి కాబట్టి అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి. సర్వీస్ కేంద్రాల వంటివి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. పొరపాటున ఏవైనా తప్పులు దొర్లినా కఠిన శిక్షలు వేయకూడదు’’. -
రూ.5 వేల కోట్లు!
► జీఎస్టీతో తెలంగాణకు ఏటా వాటిల్లే నష్టం ఇది ► ఐదేళ్లపాటు తామే భరిస్తామంటున్న కేంద్రం ► ఆ తర్వాత అయినా నష్టం తప్పదంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతో తెలంగాణ ఏటా రూ.5 వేల కోట్లకుపైగా నష్టపోనుంది. అయితే అంతమేర నష్ట పరిహారాన్ని చెల్లించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అయిదేళ్ల పాటు ఈ నష్ట పరిహారాన్ని చెల్లించనుంది. అయితే అయిదేళ్ల తర్వాతైనా రాష్ట్ర ప్రభుత్వం అంత మేరకు నష్టపోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.32 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.36 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల మేరకు ఆదాయం వస్తుందని అంచనా వేసింది. తాజాగా జీఎస్టీ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించటంతో వచ్చే ఏప్రిల్ నుంచి జీఎస్టీ చట్టం అమల్లోకి రానుంది. దీంతో వచ్చే ఏడాది నుంచి వ్యాట్‌కు బదులు రాష్ట్రంలో స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ మాత్రమే వసూలు చేస్తారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా నష్టపోనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులపై పన్నుల వసూలు నిలిచిపోతుంది. దీంతోపాటు అంతర్రాష్ట్ర సీఎస్టీ వసూలు ఒక శాతానికి తగ్గిపోతుంది. అలాగే కేంద్ర పన్నుల వాటాలో 12.5 శాతం పన్నులున్న కొన్ని ఉత్పత్తులకు కేవలం 5 శాతం పన్ను విధిస్తారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.5,000 కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. అంతమేరకు నష్టపరిహారం ఇస్తామని కేంద్రం చెప్పినా.. నిధుల కోసం రాష్ట్రం ఎదురుచూడక తప్పదు. కానీ జీఎస్టీతో రాష్ట్రాలు నష్టపోయే మొత్తం సామాన్యులకు లాభంగా మారుతుందనే విశ్లేషణలున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను మినహాయించటంతో అంతమేరకు వినియోగదారులకు లాభం చేకూరాలి. ఇతర పన్నుల ద్వారా నష్టపోతున్న మొత్తం కూడా నేరుగా వినియోగదారులకు లాభంగా మారాలి. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
లాభాల స్వీకరణతో మార్కెట్ పతనం
♦ బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు ♦ 284 పాయింట్ల నష్టంతో 27,698కు సెన్సెక్స్ ♦ 78 పాయింట్ల నష్టంతో 8,545కు నిఫ్టీ రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై చర్చ జరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. అంతర్జాతీయ సంకేతాలు కూడా సానుకూలంగా లేకపోవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. ఇటీవల బాగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ సూచీలు నష్టాలపాలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 27,700 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 284 పాయింట్లు నష్టపోయి 27,698 పాయింట్ల వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 8,545 పాయింట్ల వద్ద ముగిశాయి. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, వాహన షేర్లు నష్టపోయాయి. భవిష్యత్తులో మరింత పతనం..!! సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, పావుగంటలోనే నష్టాల్లోకి జారిపోయింది. జీఎస్టీ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందగలదన్న విషయాన్ని స్టాక్ మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి సెన్సెక్స్ 22% లాభపడటంతో సమీప భవిష్యత్తులో కొంత కరెక్షన్ ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఐటీసీ 3 శాతం డౌన్: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ 3% క్షీణించి రూ.253 వద్ద ముగిసింది. కంపెనీ ఆదాయంలో 60% సిగరెట్ల నుంచే వస్తోంది. జీఎస్టీ కారణంగా సిగరెట్లపై అధిక పన్నులు విధించే అవకాశముందన్న అంచనాల కారణంగా ఈ షేర్ క్షీణించింది. సెన్సెక్స్‌లో బాగా పతనమైన షేర్ ఇదే. సిప్లా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ షేర్లు 1-2% రేంజ్లో పెరిగాయి. జీఎస్టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో బుధవారం నాడు ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 50 పాయింట్లకు పైగా ట్రేడయింది. రేపు కూడా ఈ ఎస్‌జీఎక్స్ నిఫ్టీ బాగానే లాభపడుతుందని అంచనా. దీంతో నేడు స్టాక్ సూచీలు భారీ గ్యాపప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే లాభాల స్వీకరణ కారణంగా నష్టాలు వచ్చే అవకాశాలూ ఉన్నాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులంటున్నారు. -
బోలెడు లాభాలు..
♦ నల్లధనానికి కళ్లెం.. సమర్థ పన్నుల వ్యవస్థ ♦ జీడీపీ వృద్ధి పెరుగుతుంది ♦ 2017 ఏప్రిల్ నుంచి అమలు సవాలే ♦ పన్ను రేటు అధికంగా ఉండకూడదు ♦ పరిశ్రమ వర్గాల అభిప్రాయం న్యూఢిల్లీ : వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడం పట్ల పరిశ్రమ వర్గాలు, పన్ను నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. జీడీపీపై సానుకూల ప్రభావం ఉంటుందని, ఆర్థిక రంగ వృద్ధికి ఎంతో తోడ్పడుతుందని, వస్తు, సేవల వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, నల్లధనానికి కళ్లెం వేస్తుందని అభిప్రాయపడ్డారు. సమర్థవంతమైన పన్నుల వ్యవస్థ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే, 2017 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడమన్నది సవాల్ అని అబిప్రాయపడ్డాయి. జీఎస్టీతో అంతర్జాతీయ మార్కెట్లో తయారీ పరంగా భారత్ మరింత పోటీపడగలుగుతుందని కేపీఎంజీ పరోక్ష పన్నుల హెడ్ సచిన్ మీనన్ చెప్పారు. 2017 ఏప్రిల్ నుంచి జీఎస్టీ అమలు కష్టమేగానీ, అసాధ్యం కాదని పీడబ్ల్యూసీ (ఇండియా) పార్ట్నర్ అనితా రస్తోగి అన్నారు. జూన్ లేదా జూలై నుంచి అయితే సులభంగానే అమలు చేయొచ్చన్నారు. పలువురి అభిప్రాయాలివీ... ఉత్పాదకత పెరుగుతుంది 1991 తర్వాత అతి పెద్ద సంస్కరణ ఇదే. భారత్‌ను విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుస్తుం ది. ప్రస్తుతం ఎన్నో ముక్కలుగా ఉన్న దేశీ మార్కెట్ ఒకటిగా అవతరిస్తుండడంతో తయారీ అనేది మరింత పోటీదాయకంగా మారుతుంది. జీడీపీతో తక్కువగా ఉన్న పన్ను నిష్పత్తి పెరుగుతుంది. ఉత్పాదకత, పారదర్శకతను పెంచుతుంది. అయితే, 18-22ు పన్నురేటు అన్నది చాలా ఎక్కువ. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. - అశోక్ హిందూజా, (హిందుజా గ్రూప్) నిజమైన నల్లధన చట్టం... జీఎస్టీ ప్రతీ లావాదేవీ సమాచారాన్ని జీఎస్టీ విభాగానికి తెలియజేయడం తప్పనిసరి. ఉత్పత్తి దగ్గర్నుంచి వినియోగమైన చోటు వరకు అన్ని లావాదేవీలనూ జీఎస్టీ విభాగం పరిశీలిస్తుంది. దీంతో గొలుసుకట్టు లావాదేవీల ముసుగులో నల్లధనం సమకూర్చుకునే అవకాశం ఉండదు. వాస్తవికంగా చూస్తే జీఎస్టీ నిజమైన నల్లధన చట్టం. - సచిన్ మీనన్, కేపీఎంజీ ఇండెరైక్ట్ ట్యాక్స్ హెడ్ మరిన్ని పెట్టుబడులతో జీడీపీ వృద్ధి దేశ పన్నుల వ్యవస్థలో పెద్ద సంస్కరణ. వస్తు, సేవలపై ఉన్న ఎన్నో రకాల పన్నుల భారాన్ని తొలగిస్తుంది. కేంద్ర, రాష్ట్రాల పరిధిలో ఉన్న ఎన్నో రకాల పన్నులను ఏకం చేసి, దేశాన్ని ఏకైక మార్కెట్‌గా మారుస్తుంది. మరింత పారదర్శకతను, రానున్న సంవత్సరాల్లో దేశంలోకి మరిన్ని పెట్టుబడులను తీసుకొస్తుంది. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్ -
జీఎస్టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. జీఎస్టీ బిల్లులో నాలుగు కీలక సవరణలు చేస్తూ పెద్దల సభ ఆమోదించింది. జీఎస్టీ చట్టం అయితే దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి అన్నాడీఎంకే వాకౌట్ చేసింది. డివిజన్‌కు కాంగ్రెస్ పట్టుబట్టడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అంగీకరించారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ నాలుగు సవరణలను ప్రతిపాదించింది. చివరగా, ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలపై రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించారు. జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా 197 ఓట్లు వచ్చాయి. దాంతో బిల్లులో పలు సవరణలపై కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జీఎస్టీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. -
'మేం కాదు.. నాడు మీరే వద్దన్నారు'
న్యూఢిల్లీ: తాము రాజకీయ పరంగా జీఎస్టీ బిల్లుకు వ్యతిరేకంకాదని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ అన్నారు. అయితే, ఈ బిల్లు విషయంలో తమ ఆందోళనలను, లేవనెత్తే అంశాలను ప్రభుత్వం పట్టించుకోవాలని ఆయన చెప్పారు. బుధవారం రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై ఆయన ప్రసంగిస్తూ పదేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు ప్రస్తావన తెచ్చినప్పుడు అది రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడేస్తుందని అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఆరోపించిందని గుర్తు చేశారు. అసలు ఆ బిల్లే రాజ్యాంగానికి వ్యతిరేకం అని వ్యాఖ్యానించిందని చెప్పారు. కానీ, ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక ఈ బిల్లుపై ఆలోచనలు మారాయని చెప్పారు. అయితే, పదేళ్ల కిందట కాంగ్రెస్ తీసుకున్న చారిత్రాత్మక అడుగు ఈ జీఎస్టీ బిల్లేనని చెప్పారు. ఇది అత్యంత ముఖ్యమైనదని అన్నారు. దేశ ప్రయోజనాలకోసం కాంగ్రెస్ పార్టీ ఏవైతే అంశాలను ఈ బిల్లు విషయంలో చెబుతుందో వాటని కేంద్రం పట్టించుకుంటే చాలా బాగుంటుందని అన్నారు. ప్రజలపై అదనపు పన్నుల భారం పడటం తమకు ఏమాత్రం ఇష్టం లేదని, పరోక్ష పన్నులు తగ్గు ముఖం పట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
జీఎస్టీ లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తుంది
ముంబై: భారతదేశంలోని వ్యాపార దిగ్గజాలు జీఎస్టీ బిల్లు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ గా పేర్కొంటున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) బిల్లు ఆమోదంకోసం వేచి చూస్తున్నాయి. వివిధ పరోక్ష పన్నులు, పన్నుశాతాల తొలగింపు, ఒకే పన్ను ఒకే దేశం పద్ధతిద్వారా పారదర్శకత నెలకొంటుందని భావిస్తున్నాయి. ఇది ఆర్థికవృద్ధికి మంచి ఊతమిస్తుందని అభిప్రాయపడుతున్నాయి. బుధవారం రాజ్యసభలో వాడి వేడి చర్చల నేపథ్యంలో ప్రముఖ కంపెనీల పెద్దలు స్పందించారు. ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు. భారీ ఉత్పాదకతో పాటు లక్షల ఉద్యోగాలకు సృష్టించే సామర్ధ్యం జీఎస్టీ బిల్లుకు ఉందని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ట్విట్ చేశారు. జీఎస్ టీ బిల్లులేని భారత ఆర్థిక వ్యవస్థ లేదని ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రాఅన్నారు. జీఎస్టీ లేకుండా ఆర్థిక వ్యవస్థ నియంత్రణ సాద్యంకాదని లేకుండా కోటక్ ఆటో మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్ ట్విట్ చేశారు. ఈ బిల్లు పాస్ కావాలని ప్రార్ధిస్తున్నాన్నారు. బీజేపీ పాపులర్ స్లోగన్ అచ్చే దిన్ తీసుకొచ్చే సత్తా ఉందన్నారు. సంస్కరణల ప్రక్రియలో జీఎస్ టీ బిల్లు ఒక "మైలురాయి" లాంటిదని జెఎస్ డబ్ల్యు స్టీల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. దీనికి అన్ని పార్టీలు ప్రభుత్వానికి అభినందనలు తెలపాలన్నారు. సాధారణ ప్రజలకు జీఎస్టీ ఉపయోగపడుతుందని బయోకాన్ ఎండీ కిరణ మజుందార్ షా ఇటీవల తన ట్విట్ లో పేర్కొన్నారు. As #GST enters the last mile,all political parties must be congratulated 4 what will be a landmark event in #India's economic reform process — Sajjan Jindal (@sajjanjindal59) August 1, 2016 #GSTBill will not only unlock huge productivity but also create millions of formal sector jobs - #repost https://t.co/viPt9orDtz — Sachin Bansal (@_sachinbansal) August 3, 2016 -
జీఎస్టీ బిల్లుపై సూచనలు చేసిన విజయ సాయిరెడ్డి
న్యూఢిల్లీ : ఆల్కహాల్‌ను జీఎస్టీ బిల్లు నుంచి మినహాయించినట్లే విద్యుత్ రంగాన్ని కూడా మినహాయించాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో కోరారు. జీఎస్టీ బిల్లులో పాల్గొన్న ఆయన కొన్ని సూచనలు చేశారు. జీఎస్టీ బిల్లు వల్ల రాష్ట్రాలకు కలిగే ఆర్థిక నష్టాన్ని అయిదేళ్ల పాటు కేంద్రమే భరిస్తుందన్న ప్రతిపాదనను విజయ సాయిరెడ్డి స్వాగతించారు. అలాగే ఆరో సంవత్సరం నుంచి 50 శాతం, ఏడో సంవత్సరం నుంచి 25 శాతం నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
జీఎస్టీ బిల్లుపై సూచనలు చేసిన విజయ సాయిరెడ్డి
-
జీఎస్టీతో మనకొచ్చే లాభమేమిటంటే?
చరిత్రాత్మక వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టం సాకారం అయ్యేదిశగా మరో ముందడుగు పడింది. జీఎస్టీ బిల్లును కేంద్రప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అత్యంత కీలకమైన ఈ బిల్లుపై అధికార, విపక్ష సభ్యులు సావధానంగా చర్చలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా జీఎస్టీ బిల్లును భావిస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో రూపొందిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ ఒకేవిధంగా పన్నుశాతం ఉంటుంది. దేశమంతా ఒకే మార్కెట్‌గా పరిగణించబడుతుంది. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించడంతోపాట దేశంలోని 50శాతం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలిపితే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. జీఎస్టీ అమల్లోకి వస్తే తయారీ రంగానికి (మాన్యుఫాక్చరింగ్‌కు) ఊతం లభించనుంది. దేశీయ ఉత్పత్తులు మరింత తక్కువ ధరకు లభించే అవకాశముంది. అదేసమయంలో సేవలు మాత్రం మరింత ప్రియంకానున్నాయి. జీఎస్టీ వల్ల వీటి ధరలు తగ్గే అవకాశం - ఆటో మోబైలింగ్ రంగానికి చెందిన కార్లు, బైకులు, ఎస్యూవీ లగ్జరీ వాహనాలు - కారు బ్యాటరీలు - ఇళ్లకు వేసే రంగులు, సిమెంట్ - కూలర్లు, ఫ్యాన్లు, బల్బులు, వాటర్ హీటర్లు తదితర ఎలక్రానిక్ వస్తువులు వీటి ధరలు పెరిగే అవకాశం - సిగరెట్లు ధరలు మరింత ప్రియం అవుతాయి. ప్రస్తుతమున్న పన్నుల కన్నా పొగాకుకు జీఎస్టీ రేటు అధికంగా ఉండటమే ఇందుకు కారణం - సర్వీసు ట్యాక్స్ పెరిగిపోవడంతో మొబైల్ ఫోన్లు మరింత ప్రియం అవుతాయి - వస్త్రాలు, బ్రాండెడ్ నగల ధరలు పెరిగే చాన్స్ లాభమా? నష్టమా? జీఎస్టీ అమల్లోకి వస్తే పన్నుల భారం తగ్గి వ స్తువు ధర తగ్గుతుంది. సేల్స్ ట్యాక్స్ ఉండకపోవడంతో ప్రతి రాష్ట్రంలో పన్ను చెల్లించక్కర్లేదు. ఇకపై పన్నుపై పన్ను ఉండదు. పన్నులు తగ్గి కంపెనీల ఏర్పాటు పెరగవచ్చు. ద్రవ్యోల్బణం దిగొస్తుందని, పన్ను ఎగవేతలు తగ్గుతాయని నిపుణులంటున్నారు. రవాణా వ్యయాలు, పేపర్ పని తగ్గి వ్యాపార వాణిజ్యాలు సమర్థంగా జరుగుతాయి. జీడీపీ 2% పెరుగుతుందని అంచనా. -
18శాతం పన్ను ప్రామాణికంగా ఉండాలి: చిదంబరం
-
18శాతం పన్ను ప్రామాణికంగా ఉండాలి: చిదంబరం
న్యూఢిల్లీ : జీఎస్టీ బిల్లును తాము ఎన్నడూ వ్యతిరేకించలేదని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి చిదంబరం తెలిపారు. బుధవారం రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వంలో జీఎస్టీ బిల్లును బీజేపీ వ్యతిరేకించిందన్నారు. సభలో ఏకాభిప్రాయంతోనే బిల్లు ఆమోదం పొందాలన్నారు. తమ అంగీకారం లేకుండా బిల్లును ఆమోదించుకోవాలని ఎన్డీయే సర్కార్ ప్రయత్నించి విఫలమైందన్నారు. మూడు, నాలుగు నెలల్లో ప్రభుత్వ వైఖరిలో మార్పు రావటం హర్షణీయమన్నారు. జీఎస్టీ బిల్లులో సవరణలు అవసరమని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. ఎట్టకేలకు జీఎస్టీ సవరణల బిల్లును స్వాగతిస్తున్నామని చిదంబరం తెలిపారు. బిల్లులో ఎలాంటి లోపాలు లేవని, ప్రభుత్వం అనడం సరికాదన్నారు. సభ్యుల సంఖ్య ఆధారంగా కాకుండా చర్చల ద్వారా బిల్లును ఆమోదిస్తారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. బిల్లులో మరో మూడు సవరణలు చేయాల్సి ఉందని, 18 శాతం పన్ను ప్రామాణికంగా ఉండాలన్నారు. పన్నురేటులో కేబినెట్ తలదూర్చకూడదని చిదంబరం వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఆమోదిస్తేనే పన్ను రేట్లు మారాలన్నారు. జీఎస్టీ పరోక్ష పన్నుల రేట్లు తక్కువగా ఉండాలన్నారు. ప్రత్యక్ష పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయం పొందాలని, కేంద్ర రాష్ట్రాల రెవెన్యూలో లోటు రాకూడదని చిదంబరం పేర్కొన్నారు. -
ఒకే దేశం..ఒకే పన్ను విధానం: జైట్లీ
-
ఒకే దేశం..ఒకే పన్ను విధానం: జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాజ్యసభలో జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జీఎస్టీ బిల్లుపై ఆయన మాట్లాడుతూ బిల్లుపై విస్తృత సంప్రదింపులు జరిపామన్నారు. జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు మేలు జరుగుతుందని జైట్లీ తెలిపారు. బిల్లుపై ఎంపిక కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఒకే దేశం..ఒకే పన్ను విధానం ఉండాలని, దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణల బిల్లు జీఎస్టీయేనని జైట్లీ అభివర్ణించారు. జీఎస్టీ బిల్లు వల్లే పన్నుల సంస్కరణలు సాధ్యం అవుతాయన్నారు. ఈ బిల్లుకు రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని ఆయన సూచించారు. జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. -
నేడే రాజ్యసభకు జీఎస్టీ బిల్లు
-
నేడే రాజ్యసభకు జీఎస్టీ బిల్లు
సభ్యులకు సవరణల ప్రతుల పంపిణీ * కాంగ్రెస్ కీలక డిమాండ్లకు కేంద్రం అంగీకారం * బిల్లు ఆమోదానికి కేంద్రం కసరత్తు * కాంగ్రెస్‌సహా ముఖ్య పార్టీలతో జైట్లీ చర్చలు * బిల్లు ఆమోదం పొందుతుందని సర్కారు ధీమా న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రతిష్టాత్మక వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో దీనికి ప్రతిపాదించిన అధికారిక సవరణల ప్రతులను సభ్యులకు పంపిణీ చేసింది. జీఎస్టీ బిల్లు ఆమోదానికి ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్‌తోపాటు సమాజ్‌వాదీ, బీజేడీ, తృణమూల్, ఆర్జేడీతో మంగళవారం మరోసారి సంప్రదింపులు జరిపారు. రాజ్యసభలో జీఎస్టీ ప్రతులు తమకు అందలేదంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు నరేష్ అగర్వాల్ నిరసన వ్యక్తంచేశారు. ఈ ప్రతులను రెండు రోజుల క్రితమే రాజ్యసభ సెక్రటేరియట్‌కు అందజేశామని జైట్లీ చెప్పారు. ఈ పరోక్ష పన్ను సంస్కరణ బిల్లు గత ఏడాది ఆగస్టు నుంచి రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది.కాంగ్రెస్ డిమాండ్లు-సవరణలు కొన్ని సవరణలను ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ఈ బిల్లును రాజ్యసభలో అడ్డుకుంటుండటంతో ప్రభుత్వం దిగివచ్చి ఆ పార్టీ డిమాండ్లకు దాదాపు అంగీకరించి సవరణలు చేపట్టింది. కాంగ్రెస్ చేసిన డిమాండ్లలో ఒకటైన ఒక శాతం అదనపు తయారీ పన్నును తొలగించింది. సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో జీఎస్టీ వివాదాల పరిష్కారానికి కమిటీని నియమించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా.. దీనికి జీఎస్టీ కౌన్సిల్ వివాదాల పరిష్కార వ్యవస్థను నియమిస్తుందని ప్రభుత్వం సవరణను ప్రతిపాదించింది. అలాగే రాజ్యాంగంలో జీఎస్టీ రేటుపై పరిమితి విధించాలన్న మరో డిమాండ్‌కు మాత్రం ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి సవరణను చూపలేదు. ఆమోదంపై ప్రభుత్వం ధీమా.. బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం అన్ని ముఖ్య పార్టీలతో వరుస భేటీలు నిర్వహిస్తూ ముమ్మర కసరత్తు చేసింది. ఏకాభిప్రాయ సాధనకు అటు ఆర్థిక మంత్రి జైట్లీ, ప్రధాని మోదీ కూడా విపక్ష నాయకులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో బిల్లుకు కాంగ్రెస్ సహా ఇతర ముఖ్య రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలుపుతాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ బీజేపీ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, బిల్లు ఏకాభిప్రాయంతో ఆమోదం పొందుతుందని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ వ్యూహం.. జీఎస్టీ సవరణల ప్రతులను పంపిణీ చేసిన తర్వాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ సీనియర్ నేతలతో పార్లమెంటు హౌస్‌లో సమావేశమయ్యారు. బుధవారం రాజ్యసభలో ఎలా వ్యవహరించాలో అవసరమైన వ్యూహంపై చర్చించారు. అయితే, తాము బుధవారం సభలో తమ వ్యూహం ఎలా ఉంటుందో చెప్పడానికి సీపీఎం నిరాకరించింది. దీనికి మద్దతిస్తారా అన్న ప్రశ్నకు సభలో ఏం జరుగుతుందో మీరే చూస్తారుగా అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి బదులిచ్చారు. జీఎస్టీ గురించి మరికొన్ని... * ఈ రాజ్యాంగ (122వ సవరణ) బిల్లు-2014 రాజ్యసభ ఆమోదం పొందితే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్/సేల్స్ ట్యాక్స్ లాంటి అన్ని పరోక్ష పన్నులు దేశవ్యాప్తంగా ఏకీకృతమవుతాయి. * రాజ్యాంగ సవరణ చేపట్టాలంటే సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు తెలపాలి. ఆ తర్వాత ఈ సవరణను దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాలి. * గత ఏడాది మేలో లోక్‌సభ ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుకు ప్రభుత్వం ఇప్పుడు కొన్ని సవరణలను ప్రతిపాదించింది. * వాస్తవంగా జీఎస్టీని కాంగ్రెస్ 2006లో తీసుకొచ్చింది. రాజ్యాంగ సవరణ బిల్లును 2011 మార్చిలో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే 15వ లోక్‌సభ రద్దవడంతో ఈ బిల్లు వీగిపోయింది. ఒకే పన్ను.. ఒక్కసారే న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చట్టం భారతదేశంలోని పన్ను సంస్కరణల్లో అత్యంత కీలకమైంది. ప్రస్తుత పన్ను విధానాల్ని సరళీకరించి దేశమంతా ఏకీకృత పన్ను ఉండేలా దీన్ని రూపొందించారు. సెంట్రల్ ఎక్సైజ్, రాష్ట్రాల వ్యాట్, వినోదపు పన్ను, ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్, వినోదపు పన్ను, అమ్మకపు పన్నుల స్థానంలో వస్తు సేవల పన్ను వసూలు చేస్తారు. విద్యుత్తు, ఆల్కహాల్, పెట్రోలియం వంటి కొన్ని ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుంది. జీఎస్టీ ఎందుకు?: మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు బిల్లు గమనిస్తే ఎమ్మార్పీ ధరతో పాటు వ్యాట్, ఇతర పన్నుల కింద భారీగా వసూలును చూడొచ్చు. ఎమ్మార్పీలోనే ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేసేస్తున్నారు. పరోక్ష పన్నుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ వసూలు చేయడంతో చిక్కులతో పాటు కొన్నిసార్లు ఒకే పన్ను రెండు సార్లు కట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం వినియోగదారుడు వస్తువు ధరలో 25 నుంచి 30 శాతం పన్ను రూపంలో చెల్లిస్తున్నాడు. ఈ భారాన్ని ముందుగానే గ్రహించిన కేంద్రం 1994లో వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై ఆలోచన చేసింది. అమలుకు అనేక అడ్డంకులుండడంతో మొదటిగా 1994లో సేవల పన్ను అమల్లోకి తెచ్చింది. 1, ఏప్రిల్ 2005లో వ్యాట్‌ను అమలు చేశారు. ఇవన్నీ గుదిబండగా మారడంతో జీఎస్టీ అమలు వాదన 2010లో విస్తృతమైంది. చివరకు డిసెంబర్ 19, 2014న జీఎస్టీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మే 6, 2015 లోక్‌సభ బిల్లును ఆమోదించింది. మే 12, 2015న సెలక్ట్ కమిటీకి పంపగా... జూలై 22, 2015న కమిటీ నివేదిక ఇచ్చింది. రాష్ట్రాల ఆందోళన: జీఎస్టీ అమలుతో ఆదాయం కోల్పోతామని కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వస్తువును ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఆదాయం కోల్పోయే అవకాశముంది. ఇందుకోసం ఒక శాతం పన్నును ఉత్పత్తి రాష్ట్రం కోసం వసూలు చేయాలని భావించినా.. సవరణ బిల్లు నుంచి దాన్ని తొలగించారు. నష్టాల్ని భర్తీ చేస్తామన్న కేంద్రం హామీతో ఒకట్రెండు మినహా అన్ని రాష్ట్రాలూ మద్దతిచ్చాయి. మొదటి ఏడాది 100 శాతం, రెండో ఏడాది 75 శాతం, మూడో ఏడాది 50 శాతం నష్టాల్ని భర్తీ చేస్తామని కేంద్రం హామీనిచ్చింది. లాభమా? నష్టమా? జీఎస్టీ అమల్లోకి వస్తే పన్నుల భారం తగ్గి వ స్తువు ధర తగ్గుతుంది. సేల్స్ ట్యాక్స్ ఉండకపోవడంతో ప్రతి రాష్ట్రంలో పన్ను చెల్లించక్కర్లేదు. ఇకపై పన్నుపై పన్ను ఉండదు. పన్నులు తగ్గి కంపెనీల ఏర్పాటు పెరగవచ్చు. ద్రవ్యోల్బణం దిగొస్తుందని, పన్ను ఎగవేతలు తగ్గుతాయని నిపుణులంటున్నారు. రవాణా వ్యయాలు, పేపర్ పని తగ్గి వ్యాపార వాణిజ్యాలు సమర్థంగా జరుగుతాయి. జీడీపీ 2% పెరుగుతుందని అంచనా. బిల్లు ఆమోదం లాంఛనమే! న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యసభలో మూడింట రెండొంతుల మద్దతు కావాలి. అంటే ఓటింగ్‌లో 163 మంది అనుకూలంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బిల్లు గట్టెక్కేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇప్పటివరకు 131 మంది సభ్యులు సానుకూలంగా ఉండగా, కాంగ్రెస్ (60) మద్దతిస్తే ఇక అడ్డే ఉండదు. కాంగ్రెస్ డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నందున ఆ పార్టీ మద్దతిచ్చే అవకాశముంది. లోక్‌సభలో జీఎస్టీ బిల్లును వ్యతిరేకించిన అన్నాడీఎంకే (13) ఇప్పుడు తన వైఖరిని మార్చుకునే అవకాశముంది. ఎన్సీపీ(5), డీఎంకే (4)లు మాత్రం బిల్లుపై వ్యతిరేకంగా ఉన్నాయి. సీపీఎం (8) తన వైఖరిని స్పష్టంచేయలేదు. వీరుకాకుండా ఇతర పార్టీలు (22) కూడా బిల్లుకు మద్దతిచ్చే అవకాశముంది. -
జీఎస్టీ బిల్లుపై ఇన్వెస్టర్ల దృష్టి...
♦ కంపెనీల ఆర్థిక ఫలితాలు కీలకమే ♦ ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల ఉవాచ న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లుపై పురోగతి, ఈ వారం కంపెనీలు వెల్లడించే ఆర్థిక ఫలితాలపై ఈ వారం స్టాక్ మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని నిపుణులంటున్నారు. వీటితో పాటు నైరుతి రుతుపవనాల విస్తరణ, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం.. తదితర అంశాలు తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. స్వాతంత్య్రానంతరం అతి పెద్ద పరోక్ష పన్నుల సంస్కరణగా భావించే జీఎస్టీ బిల్లుపై చర్చకోసం ఈ వారం రాజ్యసభ ఎజెండాలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఇన్వెస్టర్ల కళ్లన్నీ జీఎస్టీ బిల్లుకు సంబంధించిన పార్లమెంట్ పరిణామాలపైనే ఉన్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ప్రతిపాదిత బిల్లులో ప్రభుత్వ కొన్ని మార్పులు, చేర్పులు చేయడంతో ఈ బిల్లు ఆమోదం పొందగలదన్న అంచనాలు పెరిగాయి. జూలై నెల అమ్మకాల గణాంకాలను వాహన కంపెనీలు వెల్లడిస్తాయని, ఈ కారణంగా వాహన షేర్లు వెలుగులోకి రావచ్చని సింఘానియా పేర్కొన్నారు. ఈ వారంలో వెలువడే తయారీ, సేవల రంగానికి చెందిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని వివరించారు. సోమవారం మార్కెట్ ఎకనామిక్స్ సంస్థ తయారీ రంగానికి సంబంధించి పీఎంఐ గణాంకాలను, బుధవారం(3వ తేదీన) నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ గణాంకాలను వెల్లడిస్తాయి. ఈ నెల 9న ఆర్బీఐ పాలసీని ప్రకటించనున్న నేపథ్యంలో ఈ గణాంకాలు కీలకమని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన ఆనంద్ జేమ్స్ వివరించారు. లాభాల స్వీకరణ అవకాశాలు.. రానున్న సెషన్లలో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగే అవకాశమున్నందున స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని ట్రేడ్‌బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ పేర్కొన్నారు. ముడి చమురు ధరలు తగ్గడంతో విమానయాన కంపెనీలు లాభపడవచ్చని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినందున ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి. 4 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) ఈక్విటీ నికర పెట్టుబడులు జూలై నెలలో రూ.12,600 కోట్లను దాటాయి. ఇది 4 నెలల గరిష్ట స్థాయి. జీఎస్టీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందగలదన్న అంచనాలు, కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉండటం, వర్షాలు కూడా సంతృప్తికరంగా కురియడం వంటి సానుకూలతల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల జోరును కొనసాగిస్తున్నారని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు గత నెలలో స్టాక్ మార్కెట్లో రూ.12,612 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.6,845 కోట్లు చొప్పున నికర పెట్టుబడులు పెట్టారు. దీంతో వీరి మొత్తం పెట్టుబడులు రూ.19,457 కోట్లకు పెరిగాయి. మార్చి తర్వాత అధికంగా పెట్టుబడులు వచ్చింది గత నెలలోనే. మార్చిలో విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు రూ.21,143 కోట్లుగా ఉన్నాయి. ఒక శాతం అదనపు పన్ను తొలగింపుతో సానుకూలం: నిపుణులు రాష్ట్రాల మధ్య సరుకుల రవాణాపై అదనంగా ఒక శాతం పన్ను విధించాలన్న నిబంధన నుంచి కేంద్రం వెనక్కి తగ్గడంతో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై నెలకొన్న కారు మబ్బులు తొలగిపోయినట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నిర్ణయాన్ని పలు వర్గాలు స్వాగతించాయి. బిల్లు ఆమోదంతో జీడీపీ 2 పాయింట్ల మేర వృద్ధి చెందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వారం రాజ్యసభ ముందుకు జీఎస్టీ బిల్లును తీసుకొచ్చి ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న కేంద్ర సర్కారు.... ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్లలో ఒకటైన అంతర్రాష్ట్ర సరుకుల రవాణాపై ఒక శాతం అదనపు పన్నును తొలగించేందుకు నిర్ణయించింది. అలాగే, జీఎస్టీ కారణంగా రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని ఐదేళ్ల పాటు సర్దుబాటు చేసేందుకు కూడా అంగీకరించింది. పన్ను రేటు రాష్ట్రం పరిధిలో ఉండరాదు.. అంతర్రాష్ట్ర సరుకుల సరఫరాపై ప్రభావం చూపే ఒక శాతం అదనపు పన్ను తొలగింపుతో జీఎస్టీ బిల్లులో పన్ను విధానం సర ళంగా మారింది. అయితే, పన్ను శ్రేణిని నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకు ఇస్తే.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పన్ను రేటు ఉంటుంది. ఒకే పన్ను రేటుతో దేశం మొత్తం ఏకీకృత మార్కెట్‌గా ఉండాలన్న ఉద్దేశాన్ని ఇది దెబ్బతీస్తుంది. 2017 ఏప్రిల్ నుంచే బిల్లును అమలు చేయాలన్నది దూకుడుగా ఉంది. సేవా రంగం ఇంకా ఈ బిల్లును పూర్తిగా అర్థం చేసుకోలేదు. అర్థవంతమైన అమలుకు తదుపరి చర్యలు అవసరం. - మహేశ్ జైసింగ్, బీఎమ్ఆర్ అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ ఎంపీలు బాధ్యతగా వ్యవహరిస్తారని... జీఎస్టీ బిల్లులో మార్పులు ప్రభుత్వ అంకితభావాన్ని తెలియజేస్తోంది. ప్రజాప్రతినిధులు దేశ ప్రయోజనాల దృష్ట్యా బిల్లుకు ఆమోదం తెలిపే విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. - సచిన్మీనన్, కేపీఎంజీ పార్ట్నర్ జీఎస్టీలోకి లిక్కర్, పెట్రోల్.. అదనంగా1% పన్ను విధింపుతో మొత్తం సరఫరా వ్యవస్థ వ్యయం పెరిగి పోతుంది. దీన్ని తొలగించడం మంచి నిర్ణయం. లిక్కర్, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడం రాష్ట్రాల ప్రయోజనాల కోణంలో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. సమీప భవిష్యత్తులో ఇవీ జీఎస్టీలోకి వచ్చి చేరతాయి. - అనితా రస్తోగి, పీడబ్ల్యూసీ పార్ట్నర్ -
15 నెలల గరిష్ట స్థాయికి నిఫ్టీ
♦ సెన్సెక్స్ 184 పాయింట్లు అప్ ♦ నిఫ్టీ 50 పాయింట్ల ర్యాలీ ♦ జీఎస్టీ బిల్లు ఆమోదం ♦ పొందుతుందన్న అంచనాలు ముంబై : జీఎస్టీ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందుతుందన్న అంచనాలతో గురువారం భారత్ స్టాక్ సూచీలు వరుసగా రెండోరోజు ర్యాలీ జరిపాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 184 పాయింట్ల పెరుగుదలతో దాదాపు ఏడాది గరిష్టస్థాయి వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లకుపైగా పెరిగి 15 నెలల గరిష్టస్థాయి 8,666 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. గతేడాది ఏప్రిల్ 16 తర్వాత నిఫ్టీ ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రధమం. జులై డెరివేటివ్ కాంట్రాక్టులకు గురువారం చివరిరోజుకావడంతో ట్రేడర్లు వారి షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకోవడం కూడా మార్కెట్ పెరగడానికి దోహదపడింది. వచ్చేవారం రాజ్యసభలో జీఎస్టీ బిల్లు చర్చకు రానున్న సందర్భంగా షార్ట్ కవరింగ్ జరిగిందని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. అయితే వచ్చే నెలకు ఎఫ్ అండ్ ఓ రోలోవర్స్ తక్కువగా జరిగాయని, ఇటీవల ఈక్విటీలు జోరుగా పెరగడం, వచ్చే పక్షం రోజుల్లోగా రిజర్వుబ్యాంక్ పరపతి సమీక్ష, జీఎస్టీ బిల్లుపై చర్చలు వుండటంతో ఆగస్టు నెలకు రోలోవర్స్ జోరు లేదని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. మారుతి స్పీడు...: ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో క్రితం రోజు 1.5 శాతం పెరిగిన మారుతి సుజుకి తాజాగా మరో 4.47 శాతం ఎగిసి రూ. 4,763 వద్ద ముగిసింది. అలాగే మంచి ఫలితాలతో ఇన్వెస్టర్లను ఆకట్టుకున్న ఆసియన్ పెయింట్స్ 6 శాతంపైగా ర్యాలీ జరిపి రికార్డుస్థాయి రూ. 1,127 వద్ద క్లోజయ్యింది. ఐటీసీ 2.5 శాతం, సన్ ఫార్మా 2 శాతం, పవర్‌గ్రిడ్ 1.7 శాతం, టీసీఎస్ 1.5 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.3 శాతం, కోల్ ఇండియా, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలు 1 శాతం చొప్పున పెరిగాయి. -
జీఎస్టీ నుంచి అదనపు పన్ను తొలగింపు
-
జీఎస్టీ నుంచి 1శాతం అదనపు పన్ను తొలగింపు
బిల్లులో కీలక మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదం - రాష్ట్రాలకు పరిహారంపైనా అంగీకారం - కాంగ్రెస్ మూడు డిమాండ్లలో ఒకదానికి ఆమోదం న్యూఢిల్లీ : తయారీ పన్ను 1 శాతాన్ని తొలగించటంతోపాటు పరోక్ష పన్నుల విధానంలో నష్టపోయే రాష్ట్రాలకు పరిహారం అందించేలా జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేబినెట్ వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తినపుడు జీఎస్టీ కౌన్సిల్ మధ్యవర్తిత్వం వహించే ప్రతిపాదనలను రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చింది. ఈ జీఎస్టీ కౌన్సిల్లో కేంద్రం, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. గతేడాది మేలో లోక్‌సభ ఆమోదించిన సవరణలను కేబినెట్ ఆమోదించి ఈ బిల్లులో చేర్చింది. మంగళవారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ భేటీలో చర్చకు వచ్చిన అంశాలను, ఐదేళ్ల పాటు పరోక్షపన్నుల విధానంతో నష్టపోయే రాష్ట్రాలకు పరిహారం ఇవ్వటాన్ని(చట్టం అమల్లోకి వచ్చిన తొలి ఐదేళ్లవరకు) చర్చించిన కేబినెట్ వీటిని సవరణల బిల్లులో చేర్చేందుకు అంగీకరించింది. దీంతో రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కేంద్రం రాజ్యాంగపరమైన హామీ ఇచ్చినట్లయింది. 1 శాతం అంతర్రాష్ట్ర పన్నును తొలగింపు ద్వారా.. 3 కాంగ్రెస్ కీలక డిమాండ్లలో ఒకదాన్ని ప్రభుత్వం ఆమోదించినట్లయింది. చట్టంలో జీఎస్టీ రేటు పరిమితి నిర్ధారణ, వివాదాల పరిష్కారానికి సుప్రీం కోర్టు జడ్జి నేతృత్వంలో ఓ వ్యవస్థ ఉండాలన్న మరో రెండు కాంగ్రెస్ డిమాండ్లకు అంగీకరించలేదు. ఈ ఐదేళ్ల తర్వాత జీఎస్టీ రేటు ఎంతుండాలనేది (ప్రస్తుతానికంటే తక్కువే) జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుందని కేంద్రం భరోసా ఇచ్చింది. ఈ మార్పులతో జీఎస్టీ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందుతుందని కేంద్రం భావిస్తోంది. ఒక్కసారి రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందితే సవరణల బిల్లు మళ్లీ లోక్‌సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. 2017, ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తేవాలని భావిస్తున్న కేంద్రం ఈ సమావేశాల్లో ఏకాభిప్రాయం కోసం శ్రమిస్తోంది. రాజ్యాంగ సవరణలను పార్లమెంటు ఆమోదించాక రాష్ట్రాలు (కనీసం 50శాతం రాష్ట్రాలు) ఈ చట్టానికి తమ అంగీకారాన్ని పంపాలి. -
సెన్సెక్స్ తిరిగి 28,000పైకి..
• జీఎస్టీ బిల్లుపై ఏకాభిప్రాయంతో జోష్ • 12 నెలల గరిష్ట స్థాయిని తాకిన నిఫ్టీ ముంబై : జీఎస్టీ బిల్లుకు సంబంధించిన కీలక అంశాల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో బుధవారం మార్కెట్ స్వల్పంగా కోలుకుంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ నుంచి ఉద్దీపన ప్యాకేజీ వుంటుందన్న అంచనాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు పెరగడం కూడా ఇక్కడి సెంటిమెంట్‌ను బలపర్చింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ సమావేశం వచ్చే శుక్రవారం జరుగుతుంది. ఈ సమావేశానికి ముందే 265 బిలియన్ డాలర్ల ఉద్దీపనను జపాన్ ప్రధాని షింజో అబే ప్రతిపాదించడం మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. అయితే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ బుధవారం రాత్రి వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారని, దాంతో ఇతర పాజిటివ్ వార్తలున్నా, మార్కెట్ భారీగా పెరగలేదని విశ్లేషకులు చెప్పారు. 8,665 పాయింట్ల వద్దకు నిఫ్టీ... బీఎస్ఈ సెన్సెక్స్ 28,210-27,900 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనై, చివరకు 48 పాయింట్ల లాభంతో 28,024 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 నెలల గరిష్టస్థాయి 8,665 పాయింట్ల స్థాయిని తాకడం విశేషం. గతేడాది జులై తర్వాత ఈ స్థాయిని నిఫ్టీ చేరడం ఇదే ప్రధమం. ఈ సూచి చివరకు 25 పాయింట్ల లాభంతో 8,616 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. జులై డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం ముగియనున్నందున, షార్ట్ కవరింగ్ ఫలితంగా ఇంట్రాడేలో సూచీల గరిష్టస్థాయికి పెరిగాయని ట్రేడర్లు చెప్పారు. హెచ్డీఎఫ్సీ అప్.. తాజాగా ఆర్థిక ఫలితాలు వెల్లడించిన హెచ్డీఎఫ్సీ 1.5 శాతం పెరిగి, దాదాపు 52 వారాల గరిష్టస్థాయి రూ. 1,388 వద్ద ముగిసింది. క్రితం రోజు నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ లాబ్ మరో 10 శాతం పతనమై రూ. 2,988 వద్ద క్లోజయ్యింది. -
జీఎస్టీ బిల్లులో మార్పులకు కేబినెట్ ఆమోదం!
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. బుధవారం ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశంలో జీఎస్టీ బిల్లులో మార్పులపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో జీఎస్టీ బిల్లులో మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక శాతం అదనపు పన్ను తొలగించాలన్న రాష్ట్రాల ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది. ఐదేళ్లపాటు అన్ని రాష్ట్రాలకు వంద శాతం పరిహారం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. రాష్ట్రాల్లో తయారీ రంగంపై ఒక శాతం పన్నును కేంద్రం తొలగించింది. స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల పరిమితి 15 శాతానికి పెంచుతున్నట్టు పేర్కొంది. -
బిచ్చమెత్తుకునేలా చేయకండి
- జీఎస్టీపై కేంద్రానికి స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం - ఆర్థిక మంత్రుల సమావేశంలో మంత్రి ఈటల సాక్షి, న్యూఢిల్లీ : వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతో రాష్ట్రాల ఆస్తులు కేంద్రం చేతిలో పెట్టినట్టు అవుతోందని, నిధుల కోసం రాష్ట్రాలు బిచ్చమెత్తుకునే పరిస్థితులు కల్పించకుండా కేంద్రం వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం ఇక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం సమావేశ వివరాలను ఈటల ఏపీ భవన్లో మీడియాకు వివరించారు. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదానికి రానుండడంతో దీనిపై అభ్యంతరాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు ఈటల తెలిపారు. వాటిని పరిగణనలోకి తీసుకుంటేనే జీఎస్టీకి మద్దతు ఇస్తామని చెప్పినట్టు తెలిపారు. జీఎస్టీ ఒకే పన్ను విధానంలో రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఉండాలని, ఆ నిధులపై రాష్ర్ట ప్రభుత్వానికే పూర్తి అధికారాలు ఉండాలని, జీఎస్టీ అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఏర్పడే న ష్టపరిహారాన్ని నాలుగు, ఐదు ఏళ్లకు కాకుండా, మూడు, ఆరు నెలలకు ఒకసారి ఇచ్చేలా చట్టంలో పొందుపరచాలని, పన్ను ఎగవేతదారులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జీఎస్టీని పారదర్శకంగా అమలు చేయాలని, జీఎస్టీ అమలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే జరిగేలా చూడాలని చేసిన ప్రతిపాదనలకు సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరిందని ఈటల వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించకుండా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమలు చేస్తుందని ఆశిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. జీఎస్టీ వల్ల తెలంగాణకు కొన్ని రంగాల్లో ఉపయోగం, మరికొన్నింటిలో నష్టాలు వచ్చే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఈటల కొట్టిపారేశారు. తెలంగాణ రాష్ట్రం రూ. 70 వేల కోట్ల అప్పుతో ఏర్పడిందని, అప్పులు ఎంతపడితే అంతా తెచ్చుకొనే అధికారం రాష్ట్రప్రభుత్వాలకు ఉండదన్న విషయాన్ని గుర్తించాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రాల అప్పులు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ) నిబంధనలకు లోబడి ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీఎస్డీపీలో కేంద్ర ప్రభుత్వ చట్టప్రకారంగా ఎఫ్ఆర్బీఎం 3 శాతంగా ఉందని, 14వ ఫైనాన్స్ కమిషన్ కూడా దీనిని మరో 0.25 శాతం పెంచాలని కేంద్రానికి ప్రతిపాదనలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పడితే అప్పుడు వేలకోట్లు అప్పులు చేసే పరిస్థితిలేదని చెప్పారు. ప్రతిపక్షాలు ఈ విషయాలను అర్థంచేసుకొని విమర్శలు చేయాలన్నారు. -
'బిల్లుతో తెలంగాణకు కొంత నష్టం, కొంత లాభం'
ఢిల్లీ: జీఎస్టీ బిల్లుకు షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నామని తెలంగాణ ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ జీఎస్టీ బిల్లుతో తెలంగాణ రాష్ట్రానికి కొంత నష్టం, కొంత లాభం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు జరిగే నష్టాన్ని పూడ్చిలే చట్టంలో రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. రూ. 70 వేల కోట్ల అప్పుతో తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలని పదేపదే కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు. కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల సీఎస్సీ బకాయిలు రావాలని ఈటల డిమాండ్ చేశారు. -
ప్రారంభమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారమిక్కడ ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నేతలు, పలువురు కేంద్రమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పార్లమెంట్ సమావేశాలపై చర్చించనున్నారు. ఈ వారంలోనే వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్లు రాజ్యసభకు రానుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లును రాజ్యసభలో గట్టేక్కించేందుకు ఎన్డీయే యత్నాలు చేస్తోంది. మరోవైపు జీఎస్టీపై ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీతో భేటీ కానున్నారు. లోక్‌సభ ఆమోదించిన బిల్లుకు ప్రతిపాదించిన సవరణలపై వారితో చర్చించనున్నారు. ఆ తర్వాత బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా జీఎస్టీ రేట్లను చట్టంలో చేర్చాలని, ఉత్పత్తి ఆధారిత రాష్ట్రాలకు కల్పించిన ఒకశాతం అదనపు పన్ను విధింపు అధికారాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది. -
ఒడిదుడుకుల వారం..
జీఎస్టీ బిల్లు ఆమోదంపై అంచనాలు ♦ డెరివేటివ్‌ల ముగింపు కారణంగా హెచ్చుతగ్గులు ♦ కీలక కంపెనీల క్యూ1 ఫలితాల ప్రభావం ♦ ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అభిప్రాయం న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్ , హెచ్డీఎఫ్సీ, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, జీఎస్టీ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో జరిగే పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నాయని నిపుణులంటున్నారు. జూలై నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారమే(ఈ నెల 28న) ముగియనున్నందున ఒడిదుడుకులు తప్పవని వారంటున్నారు. వీటితో పాటు వర్షపాతం, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, రూపాయి మారకం గమనం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి.. తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ... పార్లమెంట్లో ఆమోదం పొందాల్సిన బిల్లులు క్యూలో ఉన్నాయని, ఇవి ఆమోదం పొందితే మార్కెట్ మరింతగా పెరుగుతుందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. అలా కాని పక్షంలో స్వల్పకాలానికి మార్కెట్ పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుందని వివరించారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే సెంటిమెంట్‌కు మరింత జోష్ వస్తుందని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్ పంకజ్ శర్మ పేర్కొన్నారు. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగే అవకాశముందని, ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ట్రేడ్‌బుల్స్ సీఓఓ ధ్రువ్ దేశాయ్ చెప్పారు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఈ నెల 26-27), బ్యాంక్ ఆఫ్ జపాన్ల(ఈ నెల 28-29) సమావేశాలు ఈ వారంలోనే జరగనున్నాయి. రేట్ల విషయమై ఈబ్యాంక్లు యథాతథ స్థితిని కొనసాగించవచ్చని అంచనాలున్నాయి. -
జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు చాలా లాభం: వెంకయ్య
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లుపై అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలో పార్లమెంట్‌లోని ప్రధాని చాంబర్లో సీనియర్ మంత్రులతో వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ఏకాభిప్రాయంతో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందాలని కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు చాలా లాభం చేకూరుతుందని వెంకయ్య నాయుడు తెలిపారు.ఈ భేటీలో రాజనాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితర కేంద్రమంత్రులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఎంపీలకు వెంకయ్య అభ్యర్థన
-
వైఎస్సార్సీపీ ఎంపీలకు వెంకయ్య అభ్యర్థన
న్యూఢిల్లీ: తాను ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న జీఎస్టీ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం వైఎస్సార్ సీపీ ఎంపీలతో మాట్లాడారు. జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. దీనికి వైఎస్సార్ సీపీ ఎంపీలు కూడా సానుకూలంగా స్పందించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బరెడ్డిలు వెంకయ్యతో మాట్లాడిన విషయాన్ని మీడియాకు తెలిపారు. జీఎస్టీ బిల్లుకు వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుచేసిన ఎంపీలు 20న పార్లమెంట్ ముందుకు రానున్న ప్రైవేట్ బిల్లుకు కూడా బేషరతుగా మద్దతు పలకుతామన్నారు. తాము కూడా పలు మార్లు హోదా అంశాన్ని లేవనెత్తామని, 20న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇస్తామని, బిల్లు ఎవరు పెట్టారనేదానికంటే హోదా రావడమే తమకు ముఖ్యమని ఎంపీలు మేకపాటి, వైవీ సుబ్బారెడ్డిలు తెలిపారు. -
జీఎస్టీ బిల్లుకు మద్దతివ్వండి
-
జీఎస్టీ బిల్లుకు మద్దతివ్వండి
అఖిలపక్ష భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి - ఎన్ని సమస్యలున్నా జాతీయ ప్రయోజనాలే మిన్న - పార్టీల సూచనలు, సలహాలు స్వీకరిస్తామన్న ప్రధానమంత్రి - లిఖిత పూర్వక వివరణ అందితేనే జీఎస్టీ బిల్లుకు మద్దతు: కాంగ్రెస్ - నేటి నుంచి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు సాక్షి, న్యూఢిల్లీ : ‘అన్ని సమస్యలను పక్కనపెట్టండి.. జాతీయ ప్రయోజనాలనే మిన్నగా భావించండి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు మద్దతివ్వాలని ఆయన అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశారు. ‘‘మనం ప్రజలకు, రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం.అందువల్ల మిగిలినవన్నీ పక్కనపెట్టి జాతీయప్రయోజనాలే మిన్నగా భావించాలి’’ అని ప్రధాని సూచించారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఇక్కడ జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోదీ ప్రసంగించారు. జీఎస్టీ బిల్లు సహా పలు కీలకబిల్లులు ఈ సమావేశాలలో ఆమోదం పొందాల్సిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు ప్రధాని స్వయంగా విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అర్థవంతమైన చర్చలు జరగాలి జీఎస్టీ బిల్లుతో పాటు అనేక ముఖ్యమైన బిల్లులను ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని, ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరిగి సమావేశాలు ఫలప్రదమవుతాయని ఆశిస్తున్నానని ప్రధాని చెప్పారు. జీఎస్టీ బిల్లు గురించి ప్రధాని ప్రస్తావిస్తూ ‘ఏ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందన్నది ప్రధానం కాదు. కానీ బిల్లు పాసవడం ముఖ్యం..’ అని పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలకు సంబంధించి వివిధ పార్టీలు చేసిన సూచనలను, సలహాలను స్వీకరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కశ్మీర్లో ఇటీవలి పరిణామాలపై రాజకీయ పార్టీలు స్పందించిన తీరును మోదీ అభినందించారు. ‘కశ్మీర్ సంఘటనలపై విభిన్న రాజకీయ పార్టీలు ఒక్కతాటిపై నిలిచి చేసిన ప్రకటనలు దేశానికి వన్నె తెచ్చాయి. ఈ ప్రకటనలు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చాయి. అన్ని పార్టీలకూ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. కశ్మీర్లో ఉద్రిక్తతలపై పార్లమెంట్లో చర్చించాలని, ప్రభుత్వం దీనికి సమాధానం ఇవ్వాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. గవర్నర్ల పాత్ర అంశంపైనా చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు, సమావేశాల తొలిరోజు లోక్‌సభ మధ్యప్రదేశ్ ఎంపీ దల్పత్ సింగ్ అకాల మృతికి సంతాపం తర్వాత వెంటనే వాయిదా పడే అవకాశం ఉంది. వివరణలు అందితేనే: కాంగ్రెస్ ‘ప్రాధాన్యతా క్రమంలో బిల్లులకు మద్దతిస్తాం కానీ జీఎస్టీ బిల్లుపై హామీ ఇవ్వలేం’ అని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. జీఎస్టీ బిల్లుకు సంబంధించి తాము లేవనెత్తిన ఆందోళనలపై లిఖితపూర్వకమైన వివరణ ఇచ్చిన తర్వాత మాత్రమే దీనిపై తాము ఒక వైఖరి తీసుకోగలుగుతామని ఆ పార్టీ పేర్కొంది. ఇతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలను అస్థిరపరచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదంటూ ఆజాద్ అరుణాచల్ పరిణామాలను ఉదహరించారు. తాము అన్ని బిల్లులకు ప్రాధాన్యతా క్రమంలో మద్దతిస్తామని ఆజాద్ చెప్పారు. అన్ని పార్టీలతో చర్చించాలి: సీపీఎం, ఎస్పీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ నేత నరేశ్ అగర్వాల్ ఆరోపించారు. ప్రభుత్వం అన్ని పార్టీలతోనూ చర్చించాలని డిమాండ్ చేశారు. మరికొందరు ప్రతిపక్ష నేతలు పార్లమెంట్ సమావేశాలను పొడిగించాలని కోరారు. అఖిలపక్షం సఫలం: అనంత్‌కుమార్ ‘సమావేశం ఫలప్రదమైంది. పార్లమెంటు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరాం’ అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ అన్నారు. అఖిలపక్ష సమావేశాం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ బిల్లుల్లోని అంశాలను బట్టి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చింది. ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. జీఎస్టీపై అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతాం’ అని అన్నారు. భేటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు ముక్తార్ అబ్బాస్ నక్వీ, ఎస్ఎస్ అహ్లూవాలియా ఇంకా 30 పార్టీల నుంచి 45 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. జీఎస్టీపై ఏకాభిప్రాయం: వెంకయ్య జీఎస్టీ బిల్లుపై అఖిలపక్షంలో ఏకాభిప్రాయం వచ్చిందని, ఈ సమావేశాల్లో బిల్లును ఆమోదించాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. పన్నురేటుకు పరిమితి ఉండాలన్న కాంగ్రెస్ డిమాండ్ అమలుచేయదగినది కాదన్నారు. అస్త్రశస్త్రాలతో విపక్షం సిద్ధం సాక్షి, న్యూఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి.అరుణాచల్ ప్రదేశ్ పరిణామాలు, కశ్మీర్లో అశాంతి, రాష్ట్రాలలో వరదలు, ఉగ్రవాద సమస్య, విదేశాంగవిధానం తదితర అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. అణు సరఫరాదేశాల కూటమిలో సభ్యత్వం సంపాదించడంలో విఫలం కావడంపైనా చర్చకు పట్టుబట్టనున్నాయి. సమావేశాలు ఈనెల 18 నుంచి ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 20 రోజుల పాటు పార్లమెంటు సమావేశమవనుంది. భారత వైద్య మండలి (సవరణ) ఆర్డినెన్స్, 2016, బాలకార్మికుల (నిషేధం, నియంత్రణ) సవరణ బిల్లు సహా మొత్తం 16 బిల్లులు పార్లమెంటు ముందుకు రానున్నాయి. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే విషయంపై యూపీఏ తెచ్చిన బిల్లును మార్పులతో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. జీఎస్టీ అంటే..? వస్తు సేవల పన్ను (జీఎస్టీ).. రెండేళ్లుగా పార్లమెంట్ సమావేశాలు వచ్చిన ప్రతిసారీ తెరపైకి వస్తోంది. దేశవ్యాప్తంగా వస్తువులు, సేవలకు ఒకే పన్ను విధించడంతో పాటు పన్నుపై పన్ను విధించే పద్ధతికి స్వస్తి పలికేందుకు కేంద్రం ఈ బిల్లును తెచ్చింది. కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను(వ్యాట్), వినోద, విలాస, ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్ మొదలైన వాటి స్థానంలో జీఎస్టీ ఒక్కటే ఉంటుంది. జీఎస్టీ పరిధి నుంచి మద్యాన్ని పూర్తిగా తప్పించారు. పెట్రోల్, డీజిల్ లాంటి పెట్రోలియం ఉత్పత్తులు వ్యవస్థలో భాగంగా ఉంటాయి. జీఎస్టీ అమలయ్యే క్రమంలో రాష్ట్రాలు రాబడి కోల్పోయే సూచనలు ఉంటే... నష్ట పరిహారంగా మొదటి మూడేళ్లలో వంద శాతం, నాలుగో ఏట 75 శాతం, ఐదో ఏట 50 శాతం చెల్లించనుంది. పెట్రోలియం ఉత్పత్తులు బిల్లులో భాగంగా ఉన్నా వాటిపై ఎలాంటి పన్నులు విధించరు. దీంతో రాష్ట్రాలు వాటిపై వ్యాట్ కొనసాగించవచ్చు. -
జీఎస్టీ బిల్లుకు మద్దతిస్తాం: ఎంపీ వినోద్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిస్తుందని ఎంపీ వినోద్ వెల్లడించారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆదివారం టీఆర్ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం వినోద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అపరిష్కృత సమస్యలపై సోమవారం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుస్తారని తెలిపారు. పార్లమెంట్లో హైకోర్టు విభజన అంశంపై పోరాడుతామని మరో ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. అంశాలవారిగా కేంద్రానికి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు
న్యూఢిల్లీ : జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 12 వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. బుధవారం న్యూఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... వర్షాకాల సమావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు లెవనేత్తిన ప్రతి అంశంపై చర్చకు సిద్ధమని వెంకయ్య స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలతో మరో దఫా చర్చిస్తామన్నారు. అవసరమైతే అన్ని పార్టీల నేతలతో వ్యక్తిగతం మాట్లాడతానని చెప్పారు. రాజ్యసభలో 45, లోక్‌సభలో 25 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. -
18 నుంచి పార్లమెంట్ భేటీ!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై మూడో వారంలో ప్రారంభమై ఆగస్ట్ మధ్య వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు ఈ నెల 29న భేటీ కానుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం జూలై 18న వర్షాకాల సమావేశాలు ప్రారంభమై.. ఆగస్ట్ 13 వరకూ కొనసాగనున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. -
జీఎస్టీకి ఇక లైన్ క్లియర్!
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)... అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి రాజ్యసభలో తగిన మెజారిటీ లేని కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ బిల్లుకు ఇక లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడానికి కావలసిన మూడింట రెండొంతుల మెజారిటీ కంటే ఎక్కువగానే ప్రభుత్వం చేతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాట అధికారం చేపట్టిన అన్నాడీఎంకే తో కలిపితే మొత్తం 163 మంది రాజ్యసభ సభ్యులు జీఎస్టీ బిల్లుకు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. ప్రతిపక్ష కాంగ్రెస్ కు చెందిన 65 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కాగా, వామపక్షాలకు చెందిన 10 మంది సభ్యులు జీఎస్టీపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ప్రభుత్వం వీరితో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బిల్లును వ్యతిరేకించడానికి కావలసిన మెజారిటీ లేకపోయినా సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ కు తగిన బలం ఉండటంతో కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న 18 శాతం పన్ను తగ్గింపుపై ప్రభుత్వం పునరాలోచిస్తోంది. -
మనం చౌక వడ్డీరేట్ల జమానాలోకి వెళ్లాల్సిందే..
♦ పొదుపు పథకాల రేట్ల తగ్గింపుపై ♦ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్య న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి వడ్డీరేట్లను భారీగా తగ్గించడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ఈ చర్యలను సమర్థించుకున్నారు. ఆర్థిక వ్యవస్థను మరింతగా పుంజుకునేలా చేయాలంటే భారత్ చౌక వడ్డీరేట్ల జమానాలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారమిక్కడ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌తో పాటు ఇతర పథకాలకు వడ్డీరేట్ల కోత విధించడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ‘పొదుపు పథకాలపై వడ్డీరేట్ల ఖరారుకు ఒక విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. వడ్డీరేట్లను మార్కెట్ నిర్ధేశిస్తుంది. వీటితో పోలిస్తే పొదుపు స్కీమ్‌లకు అధిక వడ్డీనిచ్చేందుకు ప్రభుత్వం తన నిధులను ఉపయోగిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో కూడా ఇదే విధమైన ఫార్ములాను అమలు చేశారు. ఇది మా ప్రభుత్వం ఖరారు చేసిందేమీకాదు. అయితే, అప్పుడు ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటంతో ఈ వడ్డీరేట్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇవి క్రమంగా దిగొస్తున్నాయంతే. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను పరిశీలిస్తే.. ఒకపక్క రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతున్నాయి. ఇదే క్రమంలో డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు అధికంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కాకుండా వృద్ధి బాటన పయనించాలంటే రుణ, డిపాజిట్ రేట్లు రెండూ తగ్గాల్సిందే’ అని జైట్లీ పేర్కొన్నారు. పీపీఎఫ్‌పై 8.1 శాతం(తగ్గించిన తర్వాత) వడ్డీరేటు అనేది మంచి రాబడి కిందే లెక్కఅని కూడా ఆర్థిక మంత్రి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి స్కీమ్‌కు అధిక వడ్డీరేట్లు లేవన్నారు. ఈ పథకానికి పన్ను మినహాయింపు ఉన్న నేపథ్యంలో వాస్తవ రాబడి 11.12 శాతంమేర ఉంటుందన్నారు. జీఎస్టీ బిల్లుకు త్వరలో మోక్షం! రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ); దివాళా కోడ్ బిల్లులకు ఆమోదం లభించగలదన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. వీటికి సంబంధించి నెలకొన్న విభేధాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని... ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను ఒప్పించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు తన ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారని కూడా ఆర్థిక మంత్రి చెప్పారు. మరోపక్క, జువెలరీ వర్తకులపై విధించిన 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని కూడా జైట్లీ సమర్థించుకున్నారు. జీఎస్టీ వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో విలాసవంత ఉత్పత్తులన్నింటినీ పన్నుల పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పన్ను అధికారులు తమను వేధిస్తారని జువెలర్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలపై మాట్లాడుతూ.. అలాంటివి జరగడానికి వీల్లేదని జైట్లీ వ్యాఖ్యానించారు. -
మోదీ ప్రభుత్వం... 12 వైఫల్యాలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నో హామీలతో ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తిస్తూ 2014, మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. 2015లోనన్నా తమ బతుకులకు కొత్త మెరుగులు దిద్దుతుందని ఆశించిన ప్రజలు భారీ మెజారిటీతో బీజేపీకి పట్టంగట్టారు. ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్క హామీని కూడా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇప్పటికీ నెరవేర్చలేక పోయింది. గడిచిందీ ఏడాదిన్నరేగదా! ఇంకా మూడున్నర ఏళ్ల గడువుందంటూ గొంతు విప్పేవాళ్లు, వాదించే వాళ్లు ఉండొచ్చు. కానీ హామీలను అమలుచేసే దిశగా చిత్తశుద్ధితో చర్యలైతే మొదలు పెట్టాలిగా. మరది కనిపించదేం. ముఖ్యంగా 12 రంగాల్లో ఘోరంగా విఫలమైంది. కనీసం నెలకో అంశం మీద దృష్టి పెట్టినా ఈ రంగాల్లో విజయం సాధించి ఉండేది. 1.ధరల పెరుగుదల: ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరకుల ధరలను అరికట్టడంలో, ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో గత యూపీఏ ఘోరంగా విఫలమైందని బీజేపీ ఎండగట్టింది. ఆహార ద్రవ్యోల్బణంపై నరేంద్ర మోదీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ 2011లో సమర్పించిన సిఫార్సులను అమలు చేసినట్లయితే ఈ పరిస్థితి దాపురించేది కాదని కూడా కూతలేసింది. మోదీ ప్రభుత్వం వచ్చాక ఈ రంగంలో పరిస్థితి ఏమైనా మారిందా? సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన ఉల్లి, పప్పు దినుసుల ధరలు నేడెక్కడున్నాయో అందరికి తెల్సిన విషయమే. తాము అధికారంలోకి వస్తే సరకు అక్రమ నిల్వదారుల భరతం పడతామని, వారిని సత్వరం విచారించి శిక్షలు విధించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. 2. చమురు ధరలు: యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లీటరు పెట్రోలు ధర 75 రూపాయలు ఉండింది. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బారెల్ ధర 100 డాలర్లకు పైనే. చమురు ధరలు చంపేస్తున్నాయని, వీటిని ఎందుకు అరికట్టడం లేదంటూ అప్పుడు ప్రతిపక్షంలోవున్న బీజేపీ మంట పుట్టించింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బారెల్ ధర 50 డాలర్లుకు దిగువకు పడిపోయినా దేశంలో లీటరు పెట్రోలు ధర 61 రూపాయలకు పైనే ఎందుకున్నది. యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే పెట్రోలు ధర లీటరు 38 రూపాయలకు దాటకూడదు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలు నిర్ణయించేందుకు చమురు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని గొప్పగా చెబుతూ వస్తోన్న మోదీ ప్రభుత్వం అంతర్జాతీయంగా పడిపోతున్న ధరలకు అనుగుణంగా చేకూరే లబ్ధిని ఎందుకు వినియోగదారులకు బట్వాడా చేయడం లేదు? 3. ఉద్యోగావకాలు: దేశంలో ఉద్యోగావకాశాలను మెరుగుపర్చడంలో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోదీ నాలుకకు తడారిపోయేలాగా ప్రతిచోట విమర్శిస్తూ వచ్చారు. ఆయన్నే స్వయంగా ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నప్పుడు ప్రభుత్వరంగంలో ఉద్యోగావకాశాలపరంగా ఆయన తీసుకున్న చర్యలేమిటీ? ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలను దండిగా కల్పిస్తామంటూ ‘మేక్ ఇన్ ఇండియా’ అనే నినాదాన్ని పట్టుకొని దేశ దేశాలు తిరుగుతున్నారే తప్పా తెచ్చిందేమీ లేదు. 4. నల్లడబ్బు సంగతేమిటీ?: విదేశాల్లో మూల్గుతున్న 70లక్షల కోట్ల రూపాయల డబ్బును వంద రోజుల్లోగా దీశంలోకి తీసుకొస్తామని శపథం చేసిన ప్రభుత్వం 19 నెలలవుతున్నా నెరవేర్చలేదు. ఇప్పుడిది మాట్లాడడం కూడా పెద్ద జోక్‌గా మారింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పదే పదే ప్రస్తావించి మోదీ ప్రభుత్వం పరవుతీశారు. 5. ప్రభుత్వ సేవల్లో వైఫల్యం: ప్రభుత్వ సేవల రంగంలో కూడా అప్పటికీ ఇప్పటికీ ఏమీ మార్పు రాలేదు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు కావాలంటే చెప్పులరిగేలా తిరగాల్సిందే. అంత ఓపిక లేనివారు చేతులు తడిపి పనులు చేయించుకుంటున్నారు. రెడ్ టేపిజానికి బూజులు దులుపుతున్న దాఖలాలు లేవు. వివిధ విభాగాలను సమన్వయం చేసి సామాన్యులకు సైతం సులభంగా పనులయ్యేలా చేస్తామన్న ప్రభుత్వం అసలు ఆ దిశగానే ఆలోచించడం లేదంటే ఆశ్చర్యం వేస్తోంది. 6. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు: ఈ అంశంలోనూ పురోగతి పెద్దగా ఏమీ కనిపించడం లేదు. టీమ్ ఇండియా స్ఫూర్తి గురించి ఇప్పటికీ చెప్పే మోదీ మరి ఎందుకు ఇందులో విఫలమవుతున్నారు. తమ పాలిత రాష్ట్రాల పట్ల మోదీ శీతకన్నేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుండగా, తమ ప్రభుత్వం పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎందుకు గోల చేస్తున్నారు? ఇక ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వంతోని నిత్త తగువేనాయే! 7. మహిళల కోసం ఏం చేశారు?: మహిళల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని బీజేపీ ప్రకటించింది. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పునరుద్ఘాటించింది. ఇది ఈజీగా ఇట్టే అమలు చేయవచ్చు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించన బిల్లును యూపీఏ హ యాంలోనే రాజ్యసభ ఆమోదించింది. ఇప్పుడు లోక్‌సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. తల్చుకోవడమే తరువాయి. 8. జమ్మూ కాశ్మీర్ : కాశ్మీర్ పండిట్లకు గౌరవప్రదంగా పునరావాసం కల్పిస్తామని, వారి పూర్వికుల ఆస్తులను వారికి అప్పగిస్తామని, ఉపాధి కూడా కల్పిస్తామని బీజేపీ పదే పదే హామీ ఇచ్చింది. ఇది పార్టీ ఎజెండాలోని ప్రధాన అంశం అయినప్పటికీ ఇప్పటికీ దీన్ని నెరవేర్చలేదు. పండిట్టు స్వదేశంలో పరాయి బతుకు బతుకుతున్నారు. 9. జుడిషియల్, పోలీసు, ఎన్నికల సంస్కరణలు: న్యాయం జరగడంలో ఆలస్యమైతే అసలు న్యాయం జరగని కిందకే లెక్కన్న మాట ఇప్పటికీ అక్షరాల నిజమే. ఇందులో గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏమీ లేదు. ఇప్పటికీ లక్షల కేసులు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లోనే ఉన్నాయి. సత్వర విచారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడంగానీ, అధికారాలు పెంచడంగానీ చేయలేదు. అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేస్తామని చెప్పారు. ఆ మాట దేవుడెరుగు, వారి ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు కూడా నిధులివ్వడం లేదు. ఎన్నికల బరిలోకి నేరస్థులను అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల వ్యయాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అదీ అతీగతీ లేదు. 10. మైనారిటీలకు చేసిందేమీ లేదు?: వారిని మరింత దూరం చేసుకోవడం తప్పా మైనారిటీల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. కనీసం ప్రభుత్వం పదవుల్లో కూడా వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించలేక పోయింది. 11. ఉమ్మడి పౌరస్మృతి: బీజేపీ ప్రధాన ఎజెండాలో ఇదో అంశం. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో చెప్పినట్లు ఉమ్మడి పౌరస్మృతిని తీసుకరాకపోతే ప్రజల మధ్య సమానత్వం సాధించడం అసాధ్యమని చెప్పే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ కనీసం బిల్లును కూడా రూపొందించలేదు. 12. జీఎస్టీ బిల్లు: ఇది ఎందో కీలకమైన బిల్లుగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం ప్రతిఘటనా వైఖరితో బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొందలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ కలసిరాకపోవడం వల్లనే సాధ్యంకాక పోవచ్చు. ప్రతిపక్షాల వైఖరి అలాగే ఉంటుంది. సర్దుబాటు ధోరణితో వ్యవహారాన్ని చక్చబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. -
ధరల బాదుడుకు రాచబాట
విశ్లేషణ జీఎస్టీ సంస్కరణ భారాన్ని వినియోగదారులపైకి నెట్టకుండా ఉండడం ముఖ్యం. పార్లమెంటులోనూ, ఇప్పుడు సన్నద్ధం చేస్తున్న జీఎస్టీ నమూనా చట్టంలోనూ ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి. సర్వీస్ ట్యాక్స్‌పై గరిష్టపరిమితికి అవధిని నిర్ణయించి తీరాలి. సర్వీస్ ట్యాక్స్‌ను కనిష్ట స్థాయి రేటైన 12 శాతానికి పరిమితం చేయాలని నా సూచన. కార్పొరేట్ రంగానికి ఏటా ఇంచుమించు జీడీపీలో 2.7 శాతం మేరకు పన్ను మినహాయింపులను ఇస్తున్నారు. వాటికి స్వస్తి పలకడం ద్వారా ప్రభుత్వం పన్నుల పునాదిని విస్తరింపజేసుకోవాలి. మా పొరుగింటాయన తన ఇంటిని కూలగొట్టి, అత్యాధునికంగా పునర్నిర్మించుకొని ఆ నిర్మాణ వ్యయం బిల్లులను నాకు పంపితే ఎలా ఉంటుంది? ‘వినూత్నమైనది’, ‘చరిత్రాత్మకమైనది’, ‘నేటి పరిస్థితిని పూర్తిగా మార్చేసేది’ అంటున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) పై జరుగుతున్న చర్చ సరిగ్గా దీన్నే విస్మరిస్తోంది. భారత కార్పొరేట్ రంగానికి సంబంధించి జీఎస్టీ సమూల మార్పును తెస్తుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పదేపదే చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వాట్), లగ్జరీ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వగైరాలన్నిటి స్థానంలో జీఎస్టీ అమల్లోకి వస్తుంది. పన్నుల దొంతర ఫలితంగా వృద్ధి కుంటు పడడాన్ని ఇది చాలా వరకు తగ్గిస్తుందని ఆశిస్తున్నారు. తద్వారా స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 0.9 నుంచి 1.7 శాతం పెరుగుతుందని భావిస్తు న్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థలో రకరకాల పన్నులను లేదా కొందరు అనేట్టు పన్ను మీద పన్ను విధించడం మాత్రమేగాక, ఇది పన్నుల వసూలులోని ప్రతి దశలోనూ విచ్చలవిడి అవినీతిని అనుమతించింది. అందుకు కారణాలు ఏవైనా, చివరికి రిటైల్ ధరలను చెల్లించే కొనుగోలు దారులే ఈ అధిక పన్నుల భారాన్నంతా మోయాల్సి వస్తోంది. కార్పొరేట్ల సౌఖ్యానికి సామాన్యునిపై భారం జీఎస్టీ, వస్తుసేవల ఉత్పత్తిదారులకు ఏ ప్రయాసాలేని పన్నుల వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది. పలు చోట్ల పలు రకాల పన్నులను చెల్లించాల్సి రావడానికి బదులుగా వారు ఇప్పుడు ఒకే ఒక్క పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఇంతా చేసి అది వృద్ధి రేటును పెంపొందింపజేస్తుందా, లేదా? అనే విషయాన్ని పక్కన పెడదాం. అంతకంటే ముఖ్యంగా అది వ్యాపారం సులువుగా సాగే అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. బాగానే ఉంది గానీ, చివరికి ఈ సంస్కరణకు అయ్యే వ్యయ భారాన్ని వినియోగదారులు ఎందుకు భరించాలో అంతుబట్టడం లేదు. జీఎస్టీ సరిగ్గా మా పొరుగింటాయన కథ లాంటిదే. ఇంటి పునర్నిర్మాణం చేపట్టినవారే ఆ వ్యయాన్ని భరించాలి. అలాగే ఈ పన్నుల సంస్కరణ ఎవరి కోసమో వారే దీని భారాన్ని భరించాలి. దీనివల్ల లబ్ధి పొందేది మన కార్పొరేట్ రంగమే. ఆ వ్యయాన్ని చెల్లించాలని వారినే అడగాల్సింది పోయి, దాన్ని వినియోగదారులపైకి నెట్టారు. ఈ అధిక జీఎస్టీ రేటు వినియోగదారులకు మింగుడుపడేలా చేయాలనే అరుణ్ జైట్లీ 2015 బడ్జెట్లో సర్వీసు ట్యాక్స్‌ను 12.36 నుంచి 14 శాతా నికి పెంచారు. 2015-16లో సామాన్యుల జేబుల నుంచి ఇలా ఎంత గుం జారో 2016 బడ్జెట్ నాటికిగానీ తెలియదు. అయితే గత ఏడాది సర్వీస్ ట్యాక్స్ ద్వారా మాత్రమే ప్రభుత్వానికి రూ. 50,000 కోట్లు అదనపు రాబడి వచ్చిందనే దాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు. సర్వీసు ట్యాక్స్ క్రమంగా పెరుగుతూ పోవడాన్ని బట్టి రేపు 18 శాతం ప్రామాణిక రేటు చొప్పున జీఎస్టీ అమల్లోకి వచ్చాక అమాయక ప్రజాబాహుళ్యం దాదాపు రూ. 2.5 లక్షల కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని నా అంచనా. మరోవిధంగా చెప్పాలంటే, జీఎస్టీ సంస్కరణలకు అయ్యే వ్యయ భారాన్నంతటినీ భరించాల్సింది వినియోగదారులే. కాగా, దాని ఏకైక లబ్ధిదారైన కార్పొరేట్ రంగం మాత్రం ఏమీ చెల్లించదు. జీఎస్టీ అంటే ఒకే పన్ను రేటు కాబట్టి సర్వీసు ట్యాక్స్ కూడా అందులోనే కలిసిపోయి ఉంటుంది. కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న ‘రెవెన్యూ న్యూట్రల్ రేట్’ (ఆర్ఎన్ఆర్) పద్ధతిలోనే పన్నుల వసూలు జరగడానికి హామీ ఉండ టం, అది ఇప్పటికంటే పడిపోకుండా ఉండటం ఆవశ్యకం కావచ్చు. ప్రస్తుతం ఉన్న పలు దొంతరల పన్నుల విధానంలో కంటే జీఎస్టీ వల్ల ప్రభుత్వ రాబడి పడిపోతుంది. ఆ లోటును భర్తీచేసుకునే ఉత్తమ మార్గం సామాన్యుల పైన భారాన్ని మరింత పెంచడమేనని ప్రభుత్వం భావిస్తోంది. ‘రెవెన్యూ న్యూట్రల్ రేట్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ రేట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్’పై నియమించిన అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ ఉద్దేశపూర్వకంగానే పన్నుల వసూళ్ళు అధిక రేటులో ఉండేందుకు కృషి చేసిందని దాని నివేదికే తెలిపింది. అది సగటున 15-15.5 శాతం ఆర్ఎన్ఆర్ రేటునూ, రెండు రకాల పన్నుల విధానాన్నీ సూచించింది. కొన్ని వస్తువులకు 12 శాతాన్ని, మిగతా వాటికి 17-18% ప్రామాణిక రేటును సూచించింది. పదాల గారడీయే ధరల తగ్గుదలా? వ్యాట్ కూడా ఒక విధమైన జీఎస్టీనే. వ్యాట్‌ను ప్రవేశపెట్టిన 165 దేశాల్లో చాలా వరకు పలు సమస్యలను ఎదుర్కొన్నాయని కూడా అది చెప్పింది. ఒకే జీఎస్టీ రేటును లేదా రెండు రేట్లను ప్రవేశపెట్టినాగానీ ప్రవేశపెట్టినాగానీ అది ఒక సవాలే. ఫెడరల్ వ్యవస్థను కలిగిన పెద్ద ఆర్థికవ్యవస్థలు ఉన్న యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేసియా వంటి దేశాలు సైతం ఈ పన్నుల విధానం అమలులో తీవ్ర సమస్యలను ఎదు ర్కోవాల్సి వచ్చింది. ఆ సాధకబాధకాలను గురించి నేను మాట్లాడటం లేదు. దానివల్ల సామాన్యునిపై పడుతున్న అదనపు భారాన్ని గురించి మాత్రమే చర్చిస్తున్నా. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లలో జీఎస్టీ అమలు ఫలితంగా ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగిందని ఆ నివేదికే పేర్కొంది. ఆ దేశాలలో జరిగి నట్లుగానే ఇక్కడ కూడా మొదట ధరలు పెరిగినా, తరువాత తగ్గుతాయనడం ఆర్థిక పద మాయాజాలంతప్ప మరేం కాదు. పప్పుల ధరలనే తీసుకుందాం. జూన్-అక్టోబర్ మధ్య సామాన్యులు వాడే కందిపప్పు ధర రూ.70 నుంచి రూ.170-200కు పెరిగింది. ప్రస్తుతం అది రూ. 120 కి తగ్గిందనుకుంటే, మూల ధర రూ. 70 స్థాయి నుంచి చూస్తే కచ్చితంగా ద్రవ్యోల్బణం తగ్గినట్టే. కానీ వాస్తవంలో ధర రూ.70 నుంచి పెరిగి రూ. 120 వద్ద నిలిచినట్టే. వచ్చే ఏడాది తిరిగి పప్పుధర పెరిగితే ఆ పెరుగుదలను కిలోకు రూ. 70 నుంచి గాక, రూ.120 ప్రాతిపదికన లెక్కగడతారు. దీనికితోడు సర్వీస్ ట్యాక్స్ పెరగడం ఒక్కదానివల్లనే ధరలు గణనీయంగా పెరుగుతాయని ఆశించ వచ్చు. 24 సేవలను ఈ జాబితాలో చేర్చారు. ఈ పన్నుల భారానికి తోడు పెరిగే ద్రవ్యోల్బణం ప్రజలపై అదనంగా మోపే పరోక్ష పన్ను అవుతుంది. అంటే ఆచరణలో మీపై రెండుసార్లు పన్ను విధిస్తారు. కట్టెకు నూనె రాసి కొట్టడం అంటే ఇదే పెట్రోలియం (తొలి కొన్నేళ్లు మాత్రమే), విద్యుత్తు, రియల్ ఎస్టేట్, ఆల్క హాల్ జీఎస్టీ పరిధికి వెలుపలే ఉన్నాయి. పెట్రోలియం, ఆల్కహాల్ రాష్ట్రా లకు అతిపెద్ద రాబడి వనరనీ, వాటి మొత్తం పరోక్షపన్నుల రాబడిలో 29 శాతమనీ, రాష్ట్రాల మొత్తం రాబడిలో 41.8 శాతం జీఎస్టీలో కలిసిపో తుందనీ ఆ నివేదికే తెలిపింది. జీఎస్టీ రెండంతస్తుల పన్నుల వ్యవస్థ. కేంద్రం (సీజీఎస్టీ), రాష్ట్రాలు (ఎస్జీఎస్టీ) ఇలా రెండుసార్లు పన్ను విధిం చడం వల్లనే జీఎస్టీ వల్ల కలుగుతుందంటున్న ప్రయోజనంలో అత్యధిక భాగం హరించుకుపోతుంది. ప్రామాణికమైన పన్ను స్లాబు గరిష్టంగా 18 శాతం ఉంటుందని ఇంత వరకు చెబుతున్నారు. కానీ దాన్ని రాజ్యాంగబద్ధమైన పరిమితిగా చేయ డానికి ఆర్థికమంత్రి అంగీకరించడం లేదు. అంటే గరిష్ట పరిమితి పెంచడానికి అవకాశాన్ని తెరచి ఉంచినట్టే. జీఎస్టీ రేటుకు రెండు అంతస్తుల రేట్లతో పూర్తి పొందికను సాధించాక, కనిష్ట రేటును 12 శాతంగా, గరిష్ట రేటును 22 శాతంగా నిర్ణయిస్తారని నిపుణుల విశ్వాసం. అంటే సర్వీస్ ట్యాక్స్‌ను 22 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్టే. అందుకే గరిష్ట పరిమితిపై అవధి విధింపునకు అంగీకరించడం లేదు. సర్వీసు ట్యాక్స్‌ను 12.36 నుంచి 14 శాతానికి ఈ ఏడాది పెంచినప్పుడు ఎవరూ గగ్గోలు పెట్టలేదు. పైగా దానిపైన 0.5 శాతం స్వచ్ఛ భారత్ సెస్‌ను కూడా విధించారు. ఈ విధంగా క్రమక్రమంగా, దశలవారీ పద్ధతిలో ఎప్పటికప్పుడు సర్వీస్ ట్యాక్స్‌ను పెంచ డం వల్ల అదనపు పన్నుల భారం వినియోగదారులకు తేలికగా మింగుడు పడుతుంది. కట్టెకి నూనె రాసి కొట్టడం అంటే ఇదే. అందువలన జీఎస్టీ సంస్కరణ భారాన్ని వినియోగదారులపైకి నెట్ట కుండా ఉండడం ముఖ్యం. పార్లమెంటులోనూ, ఇప్పుడు సన్నద్ధం చేస్తున్న జీఎస్టీ నమూనా చట్టంలోనూ ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాల్సి ఉంది. సర్వీస్ ట్యాక్స్‌పై గరిష్టపరిమితికి అవధిని నిర్ణయించడం మాత్రమే అందుకు మార్గం. మన దేశం రెండు రేట్ల విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది కాబట్టి, సర్వీస్ ట్యాక్స్‌ను కనిష్ట స్థాయి రేటైన 12 శాతానికి పరిమితం చేయాలని నా సూచన. ప్రామాణిక రేటు 18 శాతం, బహుశా హెచ్చుతగ్గులకు వీలైనది. కానీ దాని కనిష్ట స్థాయి 12 శాతానికి మించి పెరగడాన్ని అనుమతించరాదు. కార్పొరేట్ రంగానికి ఏటా ఇంచుమించు జీడీపీలో 2.7 శాతం మేరకు పన్ను మినహాయింపులను ఇస్తున్నారు. వాటి కి స్వస్తి పలకడం ద్వారా ప్రభుత్వం పన్నుల పునాదిని విస్తరింపజేసుకోవాలి. వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు : దేవిందర్ శర్మ(hunger55@gmail.com) -
బ్యాంక్, లోహ షేర్ల జోరు
217 పాయింట్ల లాభంతో 25,736 పాయింట్లకు సెన్సెక్స్ పటిష్టమైన అంతర్జాతీయం సంకేతాలతో, బ్యాంక్, లోహ షేర్ల ర్యాలీతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,800 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 217 పాయింట్లు లాభపడి 25,736 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 7,834 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, లోహ, ఎఫ్ఎంసీజీ షేర్లు పెరిగాయి. నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ లాభాల స్వీకరణ, జీఎస్టీ బిల్లుపై అనిశ్చితి కారణంగా మరింత నష్టాల్లోకి జారిపోయింది. ఆ తర్వాత అమ్మకాలు పుంజుకోవడంతో కోలుకొని 217 పాయింట్ల లాభంతో 25,736 పాయింట్ల వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండడం, యూరోప్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడం, దివాలా బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయన్న అంచనాలు, ఇతర పలు కీలక బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందగలవన్న ఆశలు, రూపాయి వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లోనూ బలపడడం.. ఫెడ్ నిర్ణయంపై తొలగిన అనిశ్చితి ఇవన్నీ సెంటిమెంట్‌కు ఊపునిచ్చాయి. నారాయణ హృదయాలయ ఐపీఓకు 8 రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్.. ఆరోగ్య సేవలందించే నారాయణ హృదయాలయ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 8.67 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.613 కోట్లు సమీకరించనున్నది. 1.71 కోట్ల ఈక్విటీ షేర్లకు గాను 14 కోట్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్స్) కేటాయించినవాటా 24 రెట్లు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐలు)కు కేటాయించిన వాటా 3.6 రెట్ల చొప్పున సబ్‌స్క్రైబ్ అయింది. అయితే రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా1.7 రెట్లు మాత్రమే ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. కాగా 15 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.184 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.245-250గా ఉంది. ఈ ఐపీఓకు యాక్సిస్ క్యాపిటల్, ఐడీఎఫ్సీ సెక్యూరిటీస్, జెఫరీస్ ఇండియాలు లీడ్మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
ఒడిదుడుకుల వారం..!
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా * క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం సెలవు * ట్రేడింగ్ నాలుగు రోజులే న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ఈ వారం ఒడిదుడుకులమయంగా సాగుతుందని నిపుణులంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల కదలికలు కీలకం కానున్నాయి. జీఎస్టీ బిల్లు ఆమోదంపై అనిశ్చితి వంటి దేశీయ అంశాల కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగాసాగుతుందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ముడి చమురు ధరల పతనం కొనసాగుతున్న నేపథ్యంలో మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్(రీసెర్చ్) వివేక్ గుప్తా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో సెంటిమెంట్లు, రూపాయి కదలికలు, ముడి చమురు ధరలు కూడా ఈ వారం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. కాగా గత వారంలో సెన్సెక్స్ 478 పాయింట్లు లాభపడి 25,519 పాయింట్ల వద్ద ముగిసింది. అటకెక్కిన జీఎస్టీ బిల్లు..! జీఎస్టీ బిల్లు ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందగలదని అందరూ భావించారు. ఇప్పుడు ఆమోదం పొందితేనే అనుకున్న ప్రకారం ఈ జీఎస్టీ చట్టం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ బుధవారంతో ముగుస్తాయి. నేషనల్ హెరాల్డ్ విషయమై కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును స్తంభింపజేస్లుండటంతో ఈ బిల్లు ఆమోదంపై నీలినీడలు కమ్ముకున్నాయి.మరోవైపు జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడం కష్టమేనని ఆర్థిక మంత్రి జైట్లీ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. వర్థమాన దేశాల ఈక్విటీల పట్ల జాగ్రత్త న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని షేర్ల ధరలు తక్కువ స్థాయిల్లో ఉండి అంతర్జాతీయ ఫండ్ మేనేజర్లను ట్రాప్‌లో పడేస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్ఏ) తాజా సర్వే పేర్కొంది. అయితే వీటి భవిష్యత్తు ఆర్జన అవకాశాలు బలహీనంగా ఉన్నాయని హెచ్చరించింది. చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుండడం, డాలర్ బలపడుతుండడం, బాండ్‌ఈల్డ్స్ పెరుగుతుండడం వర్థమాన దేశాల స్టాక్మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. చైనా జీడీపీ వృద్ధి 2018 కల్లా 5.5 శాతానికి పడిపోతుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని తెలిపింది. కాగా అందరూ అంచనా వేసినట్లుగానే దాదాపు పదేళ్త తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచింది. ఈ రేట్ల పెంపు కారణంగా భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి విదేశీ నిధులు తరలిపోతాయనే ఆందోళన నెలకొన్నది. -
త్రిమూర్తులు దిగివచ్చినా అది సాధ్యం కాదు!
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)బిల్లును నిర్దేశిత గడువు ఏప్రిల్ 1లోపు అమల్లోకి తేవడం.. బ్రహ్మ, హరిహరాది త్రిమూర్తులు దిగివచ్చినా సాధ్యం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ పేర్కొన్నారు. 'ప్రధానమంత్రి ముందుకొచ్చి ప్రతిపక్ష నేతతో ఓ యుగళగీతాన్ని పాడినా, మేమంతా కలిసి అధిక సమయం పనిచేసినా గడువు అయినా ఏప్రిల్ 1 (2016)ను అందుకోలేం' అని ఆయన పరిశ్రమల సంస్థ ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నారు. 'మన పురాణాలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి మనం మాట్లాడుకుంటాం. వాళ్లు ముగ్గురు ఒకచోటకు వచ్చినా 50శాతం రాష్ట్రాల సమ్మతి, మూడు చట్టాలు (కేంద్ర జీఎస్టీ, రాష్ట్రాల జీఎస్టీ, ఐజీఎస్టీ) ఆమోదం సాధ్యపడదు' అని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుతం రాజ్యసభలో ఆగిపోయింది. పెద్దలసభలో అధికార ఎన్డీయేకు మెజారిటీ లేకపోవడంతో ఆమోదం కోసం ఎదురుచూపులు చూస్తున్నది. స్వాతంత్ర్యానంతరం పరోక్ష పన్నుల విధానంలో సమగ్ర సంస్కరణలతో తీసుకొస్తున్న బిల్లుగా జీఎస్టీ పేరొందింది. -
జీఎస్టీ బిల్లు వాయిదా!
సంకేతాలిచ్చిన ఆర్థికమంత్రి జైట్లీ ఈ సమావేశాల్లోనే ‘దివాళా’ బిల్లు తీసుకువస్తామని వెల్లడి న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును ప్రవేశపెట్టకపోవచ్చని ఆర్థికమంత్రి జైట్లీ సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ ఈ బిల్లుకు కొర్రీలు వేస్తూ అట్టుకుంటోందని ఆరోపించారు. దేశ అభివృద్ధి మందగమనంలో ఉంటే చూసి కొందరు పైశాచిక ఆనందం పొందుతారని మండిపడ్డారు. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ప్రస్తుత సమావేశాల్లోనే దివాళా బిల్లు తీసుకువస్తామని చెప్పారు. శనివారమిక్కడ ఫిక్కీ ఏజీఎం సమావేశంలో జైట్లీ ప్రసంగించారు. ‘‘లోపాలతో కూడిన జీఎస్టీ బిల్లు తెచ్చే కన్నా.. ఆలస్యం అయినా సరే ఎలాంటి లోపాలు లేకుండా బిల్లు తెస్తేనే మంచిది. అయినా విపక్షంతో సంప్రదింపులు కొనసాగిస్తాం’’ అని అన్నారు. మరోవైపు, జీఎస్టీ బిల్లు ఈసారి కార్యరూపం దాల్చబోదని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ చెప్పారు. తాము ఈ బిల్లుపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని అయితే అందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచే బిల్లును కచ్చితంగా అమలు చేయాలన్న అగత్యమేమీ లేదన్నారు. జీఎస్టీ బిల్లును తామే రూపొందించామని, అది తప్పకుండా కార్యరూపం దాలుస్తుందని పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లు.. త్రిమూర్తులు భువికి దిగొచ్చినా.. 2016 ఏప్రిల్ 1 వరకు ఆమోదం పొందటం కష్టమని వ్యాఖ్యానించారు. ప్రధాని, విపక్షనేతలు డ్యూయెట్ పాడుకున్నా, అందరూ కలిసి ఓవర్‌టైమ్ శ్రమించినా.. ఈ బిల్లును గట్టెక్కించలేరన్నారు. సగం రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉందని.. రాష్ట్ర జీఎస్టీ, కేంద్ర జీఎస్టీ, ఐజీఎస్టీ వంటి మూడు చట్టాలను పరిశీలించాల్సి ఉందన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత పరోక్షపన్నుల విధానంలో భారీ సంస్కరణలకు బాటలు వేస్తున్నట్లుగా భావిస్తున్న జీఎస్టీని రాజ్యసభలో ఇతర పక్షాలు మద్దతిస్తున్నా.. కాంగ్రెస్ మోకాలడ్డుతున్న విషయం తెలిసిందే. -
జీఎస్టీపై విందు భేటీ
ఇంకా తొలగని ప్రతిష్టంభన... కాంగ్రెస్ నేతలు ఆజాద్, శర్మలతో జైట్లీ, వెంకయ్య చర్చలు వెంకయ్య కార్యాలయంలో ప్రతిపక్ష నేతలకు ఆంధ్రా విందు ♦ ఖర్గే లేనందున మళ్లీ చర్చిద్దామన్న కాంగ్రెస్.. సరేనన్న సర్కారు ♦ తమ హయాంలో జీఎస్టీ బిల్లు మోదీ వల్లే ఆగిందని కాంగ్రెస్ ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదు. పార్లమెంటు ప్రస్తుత శీతాకాల సమావేశాలు ఈ నెల 23తో ముగియనున్నాయి. మంగళవారం నుంచి కేవలం ఆరు రోజుల సమయమే ఉండటంతో.. ఈ భేటీల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు తగ్గిపోతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ భేటీల్లో బిల్లు ఆమోదం పొందితే.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జీఎస్టీ అమలుకు అవకాశం ఏర్పడుతుంది. రాజ్యసభ సమావేశాలు కాంగ్రెస్ ఆందోళనతతో సక్రమంగా కొనసాగకపోతుండటంతో.. జీఎస్టీ సహా పలు చట్టాలను ప్రభుత్వం ముందుకు తేలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో బిల్లుపై ఉన్న విభేదాలను పరిష్కరించుకునే నిమిత్తం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడులు సోమవారం కాం గ్రెస్ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీఆజాద్, ఉప నేత ఆనంద్‌శర్మలతో పార్లమెంటు ఆవరణలోని వెంకయ్య కార్యాలయంలో విందు భేటీ నిర్వహించారు. ఆంధ్రా వంటలు వడ్డించిన ఈ భేటీలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సిధియాలు కూడా తరువాత వచ్చి చేరారు. జీఎస్టీ బిల్లుపై ఇరుపక్షాల మధ్య ఉన్న విభేదాలు, పరిష్కారాలపై చర్చించారు. అయితే.. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఢిల్లీలో లేనందున.. మళ్లీ సమావేశమై చర్చిద్దామని ఆ పార్టీ నేతలు ప్రతిపాదించటంతో ప్రభుత్వం అంగీకరించింది. మరోవైపు.. ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య చర్చలు కేవలం ఒక అంశానికే పరిమితం చేయరాదని కాంగ్రెస్ స్పష్టంచేసింది. జీఎస్టీ బిల్లుపై ఇంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లను తేనీటి విందుకు ఆహ్వానించి చర్చించడం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నేతలతో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపినప్పటికీ.. ఇరు పక్షాల మధ్యా ఘర్షణ వైఖరి ఏమాత్రం తగ్గలేదని ఈ భేటీ అనంతరం ఆనంద్‌శర్మ, జైట్లీలు చేసిన వ్యాఖ్యలు స్పష్టంచేస్తున్నాయి. ఒక్క బిల్లుకే పరిమితం చేయొద్దు: కాంగ్రెస్ ఈ చర్చల్లో ఫలితమేదీ రాలేదని.. దీనిపై కసరత్తు కొనసాగుతోందని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ భేటీ అనంతరం మీడియాతో పేర్కొన్నారు. ‘ఏడాదిన్నర పాటు ప్రతిపక్షంతో మాట్లాడని ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం ఒకే ఒక్క బిల్లుపై మాతో చర్చలు జరపాలని తహతహలాడుతోంది. ముందు.. వాళ్లు (ప్రభుత్వం) ఒకే బిల్లు విషయమై అతిగా పట్టించుకోరాదు.. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులూ ముఖ్యమైనవే’ అని అన్నారు. నాడు గుజరాత్ సీఎంగాగా ఉన్న మోదీ వ్యతిరేకించటం వల్లనే యూపీఏ-2 హయాంలో ఐదేళ్లపాటూ జీఎస్టీ బిల్లును అమలులోకి తేలేకపోయామని విమర్శించారు. ఇవీ తుడిచిపెట్టుకుపోతాయేమో: జైట్లీ ‘పార్లమెంటు గత సమావేశాలు జరగలేదు. ప్రస్తుత సమావేశాలు కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముంది. ఇందుకు కారణాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి’ అని జైట్లీ ప్రతిపక్ష నేతలతో భేటీ అనంతరం తన ఫేస్బుక్లో పేర్కొన్నారు. తొలి లోక్‌సభ చివరి రోజైన 1957 మార్చి 28న పండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ చేసిన ప్రసంగాన్ని మనమందరం తప్పక చదవాలంటూ.. ‘ఈ దేశంలో నివసించే అసంఖ్యాక మానవుల భవిష్యత్తుకు బాధ్యతవహించే ఈ సార్వభౌమాధికార సంస్థలో సభ్యులుగా ఉండటం కన్నా మరింత ఉన్నతమైన బాధ్యత, గొప్ప విశేషాధికారం మరేదీ ఉండబోదు. ఈ ఐదేళ్లూ మనం చరిత్ర అంచునే కాదు.. కొన్నిసార్లు చరిత్ర సృష్టించే ప్రక్రియల్లోనూ పనిచేశాం’ అన్న నెహ్రూ వ్యాఖ్యలను ప్రస్తావించారు. నెహ్రూ వారసులమని చెప్పుకునే వారు.. తాము ఎటువంటి చరిత్రను లిఖిస్తున్నారన్న ప్రశ్న వేసుకోవాలని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలతో మంగళవారం తిరిగి సమావేశం కొనసాగుతుందని వెంకయ్య చెప్పారు. -
మార్కెట్లకు ‘ఫెడ్’ ఫీవర్!
- అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయంపై దృష్టి... - జీఎస్టీ బిల్లుపై ముందడుగు కూడా కీలకమే... - ఈ వారం మార్కెట్ గమనంపై విశ్లేషకులు... న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నిర్ణయం, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నాయని నిపుణులంటున్నారు. ఈ రెండు అంశాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల పోకడ, జీఎస్టీ తదితర మరికొన్ని అంశాల కారణంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఒడిదుడుకులమయంగా సాగుతుందని వారంటున్నారు. నేడు (సోమవారం) నవంబర్ నెలకు సంబంధించి టోకు ధరల, వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు కూడా మార్కెట్ స్పందిస్తుందని విశ్లేషకులంటున్నారు. అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే. క్షీణత కొనసాగుతుంది.. భారత స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతుందన్న అంచనాలున్నాయని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్ క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయం, ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పోకడ ఈ వారం మన స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్న ఉత్కంఠ ఇన్వెస్టర్లలో నెలకొన్నదని పేర్కొన్నారు. ఫెడ్ నిర్ణయం కీలకం కానుండడం, జీఎస్టీ బిల్లు ఆమోదంపై నీలినీడలు కమ్ముకోవడం నిఫ్టీపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, కొత్త గరిష్ట స్థాయిలకు ఒడిదుడుకులు చేరతాయని ఆయన అంచనా వేస్తున్నారు. విదేశీ నిధులు తరలిపోతాయ్ ! బుధ, గురు ఈ రెండు రోజుల్లో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ ఫలితంపైననే ఇన్వెస్టర్ల కళ్లన్నీ ఉన్నాయని సింఘానియా చెప్పారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచడం ప్రారంభిస్తే, భారత్ వంటి వర్ధమాన దేశాల నుంచి భారీగా నిధులు తరలిపోతాయని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. కాగా గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 594 పాయింట్లు(2.3 శాతం), ఎన్ఎస్ఈ నిఫ్టీ 172 పాయింట్లు(2.2 శాతం)చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ 25,044 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7,610 పాయింట్ల వద్ద ముగిశాయి. కొనసాగుతున్న విదేశీ విక్రయాలు... విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ అమ్మకాలను కొనసాగిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచుతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.5,500 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. డెట్ మార్కెట్ నుంచి రూ.368 కోట్లు నికర పెట్టుబడులు ఉపసంహరించారు. గత నెలలో స్టాక్‌మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,074 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అక్టోబర్‌లో మాత్రం విదేశీ ఇన్వెస్టర్లు రూ.6,650 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. కాగా, ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.15,136 కోట్లు, డెట్ మార్కెట్లో 50,976 కోట్ల చొప్పున నికర పెట్టుబడులు పెట్టారు. దేశీ ఫండ్స్ షేర్ల కొనుగోళ్ల జోరు.. న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులను వెనక్కి ఉపసంహరించుకుంటున్నప్పటికీ.. దేశీ మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు మాత్రం ఈ ఏడాదిలో ఇప్పటి దాకా దాదాపు రూ.69,000 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఇదే సమయంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నికర పెట్టుబడులు రూ.15,136 కోట్లుగా ఉన్నాయి. గడచిన మూడేళ్లలో విదేశీ ఫండ్ సంస్థలు సగటున భారతీయ స్టాక్ మార్కెట్లో 20 బిలియన్ డాలర్లమేర ఇన్వెస్ట్ చేశాయి. తాజా సెబీ గణాంకాల ప్రకారం.. మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రూ.68,924 కోట్లను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. గతేడాది నికర మొత్తం రూ.23,842 కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌తో సహా ఈక్విటీ ఎంఎఫ్‌లలోకి వచ్చిన నికర పెట్టుబడులు ఈ ఏడాది నవంబర్ నాటికి రూ.87,000 కోట్లుగా ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పెరగడం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశీ మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు స్టాక్ మార్కెట్‌పై ఆశావహంగా ఉండటం వంటి అంశాలు ఈక్విటీ షేర్ల కొనుగోళ్ల జోరుకు కారణంగా కనిపిస్తున్నాయని క్వాంటమ్ ఏఎంసీ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఐ.వి.సుబ్రమణియన్ తెలిపారు. -
ఆయన ఏం చెప్తారో చెప్పనివ్వండి!
న్యూఢిల్లీ: ఏ ఒక్కరి ఇష్టానుసారం ప్రజాస్వామ్యం పనిచేయబోదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరోక్షంగా చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. 'ఆయన ఏం చెప్తారో చెప్పనివ్వండి' అంటూ మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుండటంతో ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొందరు తమకు ఇష్టం వచ్చింది, తోచింది చేయాలనుకుంటున్నారని, ఇలాగైతే దేశం నడుస్తుందా? అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మోదీ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలపై సోనియా ప్రతిస్పందన వ్యక్తమైంది. ప్రతిపక్షాల నుంచి ప్రధాని ఏం కోరుకుంటున్నారో చెప్పాలని ఆమె అభిప్రాయపడ్డారు. మరాఠా రాజకీయ యోధుడు శరద్‌పవార్ 75వ పుట్టినరోజు వేడుకలో సోనియా, మోదీ ఒకే వేదిక పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌తో మోదీ కరచాలనం చేశారు. సోనియాతో కూడా మర్యాదపూర్వకంగా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సోనియా ప్రతిస్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బిల్లును రాజ్యసభలో ఆమోదించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతును మోదీ ప్రభుత్వం కోరుతున్న సంగతి తెలిసిందే. -
ఆరో రోజూ అదే తీరు..
కొనసాగుతున్న పతనం 274 పాయింట్ల నష్టంతో 25,036కు సెన్సెక్స్ 89 పాయింట్ల నష్టంతో 7,612కు నిఫ్టీ స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతోంది. జీఎస్టీ బిల్లు ఆమోదంపై నీలినీడలు కమ్ముకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతుండడంతో బుధవారం రోజు స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ సూచీలు క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 274 పాయింటు నష్టపోయి 25,036 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 89 పాయింట్లునష్టపోయి 7,612 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, వాహన, ఫార్మా, బ్యాంక్, ఆర్థిక సేవల రంగ షేర్లకు అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నేషనల్ హెరాల్డ్ వివాదం కారణంగా పార్లమెంట్లో రగడ జరగడంతో జీఎస్టీ బిల్లు ఆమోదం కష్టమేనని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని, అందుకే వారు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచనున్నదన్న అంచనాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకు పాల్పడుతుండడం ప్రతికూల ప్రభావం చూపిస్తోందని నిపుణులంటున్నారు. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,133 పాయింట్లు నష్టపోయింది. ఈ ఆరు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ సూచీలు 4 శాతం చొప్పున నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో వాటా విక్రయానికి ఎస్బీఐ రెడీ! నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తనకున్న 15 శాతం వరకూ వాటాను విక్రయించే ప్రక్రియను మొదలుపెట్టింది. ఎన్ఎస్ఈలో తమకున్న వాటాకు సరైన ధర కోసం చూస్తున్నామని ఎన్ఎస్ఈ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. వీలైనంత త్వరగా ఎన్ఎస్ఈ లిస్ట్ కావాలని కోరుకుంటున్నట్లు ఆమె ఎకనామిక్ టైమ్స్ పత్రికకు తెలిపారు. ఈ వాటా విక్రయం వల్ల ఎస్బీఐకు రూ.17,500 కోట్ల నిధులు లభిస్తాయని బ్యాంకు అధికారుల అంచనా. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా తమ పెట్టుబడులను పెంచుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో భాగంగానే ఎన్ఎస్ఈలో తన వాటాను విక్రయించాలని ఎస్బీఐ ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఎన్ఎస్ఈ లిస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఇటీవలనే ఎస్బీఐ ఒక సమావేశాన్ని నిర్వహించింది. -
3 నెలల కనిష్టానికి సెన్సెక్స్
జీఎస్టీ బిల్లు ఆమోదంపై అనుమానమేఘాలు ముసురుకోవడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 5 శాతం పతనమై ఏడేళ్ల కనిష్టానికి క్షీణించడం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతుండడం, రూపాయి పతనం కూడా ప్రభావం చూపడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 220 పాయింట్లు క్షీణించి 25,310 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 64 పాయింట్లు నష్టంతో 7,702 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇది సెన్సెక్స్‌కు 3 నెలల కనిష్ట స్థాయి. బ్యాంక్, ఆర్థిక సంస్థలు, లోహ, ఇన్ఫ్రా, ఆయిల్, ఫార్మ షేర్లు నష్టపోయాయి. గత 5 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 860 పాయింట్లు కోల్పోయింది. మూడు కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం కాగా సెబీ తాజాగా ఎస్‌ఎస్‌ఐపీఎల్ రిటైల్, పరాంజపే స్కీమ్స్, భారత్ వైర్ రోప్స్ల ఐపీఓలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. క్రౌడ్‌ఫండింగ్‌కు త్వరలో మార్గదర్శకాలు: ఔత్సాహిక వ్యాపారవేత్తలు ‘క్రౌడ్‌ఫండింగ్’ మార్గంలో సులభతరంగా నిధులు సమీకరించుకునేందుకు వీలుగా త్వరలో మార్గదర్శకాలు ప్రవేశపెట్టనున్నట్లు సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు.. -
సోనియాతో మోదీ 'చాయ్ పె చర్చా'..
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులు 'ఆమోదం' గట్టెక్కకుండా 'పెండింగ్'లోనే మగ్గిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ముందడుగు వేశారు. ప్రస్తుత సమావేశాల్లో ప్రధానాంశమైన వస్తు సేవల పన్ను (జీఎస్ టీ) బిల్లు సహా ఇతర కీలక బిల్లుల ఆమోదానికి ప్రధాన విపక్ష పార్టీతో చర్చలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోయినా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లను శుక్రవారం తేనీటి విందుకు ఆహ్వానించారు. నేటి పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఈ 'చాయ్ పె చర్చా' ప్రారంభమవుతుందని, ఇరు పక్షాల మధ్య వివిధ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ తోపాటు విపక్షాలన్నింటితో మాట్లాడుతూనే ఉన్నామని, ఈ సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభిస్తుందనే నమ్మకముందన్నారు. రాజ్యాంగం అమలుపై జరుగుతున్న ప్రత్యేక చర్చలో భాగంగా నేడు లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారని, మరో మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. -
20న జీఎస్టీపై ఆర్థిక మంత్రుల భేటీ
న్యూఢిల్లీ: వస్తుసేవల పన్ను(జీఎస్టీ) చట్టాల ముసాయిదాపై చర్చించేందుకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు నవంబర్ 20న ఢిల్లీలో భేటీ కానున్నారు. కేంద్ర జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ, అంతరాష్ట్ర వస్తుసేవలకు సంబంధించిన ఏకీకృత జీఎస్టీ(ఇంటిగ్రేటెడ్)ల ముసాయిదాలను కేంద్రం ఈ నెల మొదట్లో అభిప్రాయాల కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రులకు పంపింది. ఆదర్శ జీఎస్టీ చట్టం ఆధారంగా కేంద్ర జీఎస్టీని రూపొందిస్తారని, రాష్ట్రాలూ దాని ఆధారంగా తమ మినహాయింపుల తగ్గట్టు చిన్నచిన్న మార్పులతో తమ జీఎస్టీలను రూపొందించుంటాయి. -
‘జీఎస్టీ’ కోసం మళ్లీ భేటీ
పార్లమెంటు వర్షాకాల భేటీపై వెంకయ్య సంకేతాలు * వివిధ రాజకీయ పార్టీల నేతలతో ప్రభుత్వం మంతనాలు * కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత ఖర్గేతో భేటీ అయిన వెంకయ్య * అవసరమైతే సోనియా, రాహుల్‌లను కలిసేందుకూ సిద్ధం న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు వర్షాకాల భేటీని త్వరలో మళ్లీ సమావేశపరచే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది. తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ.. వచ్చే నెల (సెప్టెంబర్)లో సమావేశాలు జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బిల్లు ఆమోదం కోసం సహకరించాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించింది. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 13వ తేదీన నిరవధిక వాయిదా పడిన అనంతరం.. ఆ సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా (పూర్తిగా ముగించకుండా) ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గేను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుపై తాను ఇప్పటికే పలు పార్టీల నేతలను కలిశానని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైతే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను కూడా కలిసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలూ జాతీయ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ‘‘పార్లమెంటు పనిచేయాలి. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యవంతమైన చర్చకు ప్రత్యామ్నాయం లేదు. జీఎస్టీ, రియల్ ఎస్టేట్ నియంత్రణ, భూసేకరణ బిల్లులు చాలా ముఖ్యమైనవి. జీఎస్టీ బిల్లు ఆమోదంలో జాప్యం జరిగితే.. భారత ప్రజలు, ప్రత్యేకించి యువత ఆకాంక్షలను అది దెబ్బతీస్తుంది’’ అని పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లుకు ఎప్పుడు ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోందని ప్రశ్నించగా.. ‘‘సాధ్యమైనంత త్వరలో’’ అని బదులిచ్చారు. ఆ బిల్లుకు కాంగ్రెస్ సహా పలు పార్టీలు కోరుతున్న సవరణల గురించి ప్రస్తావించగా.. పార్లమెంటు ప్రారంభమైతే వాటిని పరిష్కరించగలమని.. ప్రభుత్వం వాటిని పరిశీలించే ఆలోచనతోనే ఉందని, అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ‘‘ఆగస్టు 31వ తేదీ వరకూ సమయం ఉంది. గడువులోగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భూసేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయకపోతే.. భూసేకరణకు సంబంధించి మరో 13 చట్టాలు కూడా చెల్లకుండాపోతాయి’’ అని వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న భూసేకరణ ఆర్డినెన్స్ గడువు ఈ నెల 31వ తేదీతో ముగుస్తున్నందున ఈ లోగా దాని స్థానంలో చట్టం తెచ్చే అవకాశం లేకపోవటంతో.. నాలుగోసారి భూ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశముందని వెంకయ్య పరోక్షంగా సూచించారు. తుది బిల్లును చూశాకే: కాంగ్రెస్ న్యూఢిల్లీ/లక్నో: ప్రభుత్వం తుదిగా రూపొందించిన జీఎస్టీ బిల్లును పరిశీలించే వరకూ ఆ బిల్లుకు తాము మద్దతు ఇచ్చేదీ లేనిదీ చెప్పలేమని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు తనను కలసిన అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో వేర్వేరుగా ఆమోదించాల్సి ఉందని.. రెండు సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించరాదని పేర్కొన్నారు. సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలంటే 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఉద్ఘాటించారు. అది రాజ్యసభ ఆమోదం పొందాలంటే.. 4 సవరణలు ప్రతిపాదించిన కాంగ్రెస్ మద్దతు కీలకమని లక్నోలో అన్నారు. ‘‘జీఎస్టీ దేశ ప్రయోజనానికి సంబంధించినదే. కానీ.. 2011లో (యూపీఏ హయాంలో) ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు ఒక్క వ్యక్తి కారణంగా - నాటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీ కారణంగా బీజేపీ దానిని వ్యతిరేకించింది. ఇప్పుడు అదే వ్యక్తి జీఎస్టీ ప్రాధాన్యం గురించి ప్రచారం చేస్తున్నారు.. ఆ బిల్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌కు దక్కరాదని భావిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుత రూపంలోని బిల్లులో చాలా లోపాలు ఉన్నాయన్నారు. పన్ను రేటు నిర్ణయించటం, పురపాలక సంఘాలు, పంచాయతీలకు పరిహారం, వివాదాల పరిష్కారానికి స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు వంటివి అందులో ఉన్నాయని చెప్పారు. -
పార్లమెంటు సమావేశాల పొడిగింపు లేనట్లే!
న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సమావేశాలు పొడిగింపుపై చర్చించేందుకు భేటీ అయినా... పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఏర్పాటుపై నిర్ణయం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలతో ముగియనున్నట్లు సమాచారం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించన తర్వాతే ప్రభుత్వం నిర్ణయచం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం ముగిసింది. మధ్యాహ్నం మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. -
పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ : పార్లమెంట్ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ గురువారమిక్కడ సమావేశమైంది. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పార్లమెంట్ సమావేశాల పొడిగింపు అంశంపై చర్చ జరుపుతున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు హాజరయ్యారు. కాగా వస్తు సేవల బిల్లు (జీఎస్టీ)ను ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాల ఆఖరి రోజైన ఇవాళ జీఎస్టీ బిల్లు రాజ్యసభలో గట్టెక్కకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశమే మార్గమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. -
‘జీఎస్టీ’పై చర్చను అడ్డుకున్న కాంగ్రెస్
రాజ్యసభలో కొనసాగిన నిరసనల పర్వం న్యూఢిల్లీ: రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై చర్చను బుధవారం ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు, జేడీయూ సభ్యులు ఐక్యంగా నిరసన గళం వినిపించి, సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. గందరగోళం మధ్య మధ్యాహ్న భోజన విరామం లోపే సభను రెండుసార్లు వాయిదా వేసిన డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, ఆ తరువాతా పరిస్థితి కుదుటపడకపోవడంతో గురువారానికి వాయిదా వేశారు. గురువారంతో వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. పార్లమెంటు కార్యక్రమాలను అడ్డుకోవద్దని, సభలో చర్చలు జరిగి, చట్టాలు రూపొందించాలని ఎంపీలకు విజ్ఞప్తి చేస్తూ పలువురు పారిశ్రామికవేత్తలు సహా దాదాపు 18వేల మంది ఆన్లైన్ సంతకాల సేకరణను చేపట్టడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ ప్రభుత్వం క్యాపిటలిస్టుల ప్రభుత్వమనడానికి ఇదే రుజువని, రోపించాయి. దీనిపై ‘సామాన్యులు సభ జరగాలని కోరుకోవడం లేదంటారా?’ అంటూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించడంతో విపక్ష సభ్యులు ఆగ్రహంగా పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేయటంతో మధ్యాహ్నం 12గంటల వరకు సభను వాయిదా వేశారు. పారిశ్రామికవేత్తల ఆన్లైన్ ఉద్యమంపై స్పందిస్తూ.. ‘ఇది పార్లమెంటు ప్రతిష్టకు సంబంధించిన విషయం. సభను ఎలా నడపాలో కొందరు పారిశ్రామికవేత్తలు మనకు నేర్పించాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌పై దాడికి ఈ ప్రభుత్వం మీడియాను, వ్యాపారవేత్తలను ఉపయోగించుకుంటోంది, తమకు అనుకూలంగా లేని వార్తాచానెళ్లను భయపెట్టినట్లుగా ఈ ప్రభుత్వం ఎంపీలను భయపెట్టలేదు’ అని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. ఎంపీల విధుల్లో ఇండస్ట్రియలిస్టులు జోక్యం చేసుకోవడం తగదని సీపీఎం నేత సీతారాం యేచూరి వ్యాఖ్యానించారు. లోక్‌సభలో జరిగినట్లే రాజ్యసభలోనూ లలిత్‌మోదీ వ్యవహారంపై ఓటింగ్‌కు వీలైన నిబంధన కింద చర్చ జరగాలన్నారు. మధ్యాహ్నం సభ మరోసారి ప్రారంభమైన తరువాత విపక్ష సభ్యులు వెల్ వద్ద తమ నిరసనను కొనసాగించారు. నినాదాలతో హోరెత్తించారు. మళ్లీ సమావేశమయ్యా క .. జీఎస్టీ బిల్లుపై చర్చను ప్రారంభించాలని అరుణ్ జైట్లీని డిప్యూటీ చైర్మన్ కోరారు. జైట్లీ మాట్లాడబోతుండగా.. వెల్ వద్దకు మరోసారి దూసుకువచ్చిన కాంగ్రెస్‌సభ్యులు ‘నో’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దాంతో కాంగ్రెస్ సభ్యులను సముదాయించేందుకు పీజే కురియన్ ప్రయత్నించారు. ‘ఇది (జీఎస్టీ) మీ బిల్లు. ఇది కాంగ్రెస్ పార్టీ బిడ్డ. గతంలో ఒకసారి మీ(యూపీఏ) హయాంలోనే దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయండి. మిమ్మల్నెవరూ ఆపబోరు’ అన్నారు. విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించటంతో సభను గురువారానికి వాయిదా వేశారు. 5రాజ్యసభలో నేడు జీఎస్టీ గట్టెక్కకపోతే... ఉభయసభల సంయుక్త సమావేశం! న్యూఢిల్లీ: వస్తు సేవల బిల్లు (జీఎస్టీ)ను ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాలసమావేశాల ఆఖరి రోజైన గురువారం జీఎస్టీ బిల్లు రాజ్యసభలో గట్టెక్కకపోతే... ఉభయసభల సంయుక్త సమావేశమే మార్గమని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్కమిటీ సమావేశం జరుగనుంది. సంయుక్త సమావేశానికి సంబంధించి దీంట్లో ఒక నిర్ణయానికి రావొచ్చని భావిస్తున్నారు. సమావేశాలు ముగిశాక సభలను నిరవధికంగా వాయిదావేస్తే... సంయుక్త సమావేశాన్ని పిలవడం సులభం. కానీ వచ్చిన చిక్కేమిటంటే భూసేకరణ బిల్లుపై జారీచేసిన ఆర్డినెన్స్ గడువు ఈనెల 31తో ముగియనుంది. కాబట్టి ఆర్డినెన్స్‌ను మళ్లీ (ఇది నాలుగోసారి అవుతుంది) జారీ చేయాల్సిందే. ఎందుకంటే భూసేకరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జేపీసీ కి నివేదిక ఇచ్చేందుకు గడువును శీతాకాల సమావేశాల దాకా పొడిగించారు.ఉభయసభల్లో ఏదో ఒకదానిని ప్రొరోగ్ చేస్తే తప్ప ఆర్డినెన్స్ జారీచేయడానికి వీల్లేదు. జీఎస్టీ బిల్లుకు తాజాగా తృణమూల్ బాహాటంగా మద్దతు ప్రకటించింది. అలాగే ఎన్సీపీ తదితర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోగలిగితే... గురువారం జీఎస్టీ బిల్లు ఆమోదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. లేకుంటే సంయుక్త సమావేశం మార్గాన్ని ఎంచుకోక తప్పదు. -
రాజ్యసభలో జీఎస్టీ బిల్లు
ప్రవేశపెట్టిన జైట్లీ - చర్చను అడ్డుకున్న కాంగ్రెస్ * బీఏసీలో చర్చించకుండా సభలో చర్చకు వీల్లేదని కాంగ్రెస్ ఆందోళన * గతంలోనే బీఏసీలో చర్చించి సమయం కేటాయించారన్న ఆర్థికమంత్రి * ఆ సమయం గడిచిపోయిందన్న కాంగ్రెస్.. వెల్‌లో సభ్యుల నినాదాలు * గందరగోళంలో బిల్లును చేపట్టలేనన్న ఉపసభాపతి.. సభ వాయిదా న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజులే మిగిలివున్న పరిస్థితుల్లో.. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే.. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పలు విధానపర అభ్యంతరాలు లేవనెత్తుతూ చర్చను అడ్డుకుంది. సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిలుచోగానే.. అప్పటివరకూ మౌనంగా ఉన్న కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా వెల్‌లోకి దూసుకెళ్లారు. దీనిపై జైట్లీ మండిపడుతూ.. దేశ అభివృద్ధిని అడ్డుకోవటం కోసమే కాంగ్రెస్ ఏదో ఒక వంకతో అవరోధాలు కల్పిస్తోందని, ముఖ్యమైన జీఎస్టీ చట్టాన్ని నిలువరించటం కోసమే లలిత్ మోదీ - సుష్మ వివాదాన్ని వాడుకుంటోందని విమర్శించారు. బిల్లుపై సభా కార్యక్రమాల సలహా సంఘం(బీఏసీ)లో చర్చించలేదని, ఆ బిల్లుపై సభలో చర్చ కోసం సమయం కేటాయించలేదని.. కాబట్టి దానిపై సభలో చర్చ చేపట్టరాదని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ అన్నారు. సభ్యుల అంగీకారం లేకుండా సభా కార్యక్రమాల్లో ఆ బిల్లును చేర్చడాన్ని తప్పుబట్టారు. జైట్లీ బదులిస్తూ.. ‘బిల్లు ఇదివరకు సభ ముందుకొచ్చినపుడు.. దానిపై చర్చ కోసం బీఏసీ 4 గంటలు కేటాయించింది. ఆ తర్వాత బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కొందరు సభ్యులు కోరారు. ఆ కమిటీ ఆ బిల్లును, సవరించిన బిల్లుతో సహా సభకు తిప్పిపంపించింది. దాన్ని ఇప్పుడు పరిశీలనకు తీసుకోవాలి’అని చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీ జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇస్తోందని.. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రతి సమావేశాన్నీ స్తంభింపచేస్తోందని పేర్కొన్నారు. జైట్లీ వివరణతో ఆనంద్ శర్మ విభేదించారు. ‘ఈ రోజు ఉదయం బులెటిన్‌ను పరిశీలించాం. ఎటువంటి సమయం కేటాయించలేదు. ఆ బిల్లును చేపట్టజాలరు. దీనిపై రూలింగ్ ఇవ్వాలి. బిల్లుపై బీఏసీలో చర్చించలేదు. అంతకుముందు కేటాయించిన 4 గంటల సమయం ముగిసిపోయింది’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులు ఆవేశంగా నినాదాలు చేస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో.. జీఎస్టీ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున.. గందరగోళ పరిస్థితుల్లో దానిని చర్చకు చేపట్టలేనని ఉప సభాపతి పి.జె.కురియన్ పేర్కొన్నారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓట్ల విభజన చేపట్టాల్సి ఉంటుంది. వినియోగాధికార బిల్లులకు ఆమోదం... అంతకుముందు.. లోక్‌సభ ఆమోదం పొందిన ఆర్థిక శాఖ, రైల్వే శాఖ వినియోగాధికార బిల్లులను సభ చర్చ లేకుండా ఆమోదించింది. తర్వాత కాంగ్రెస్ సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య.. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళ, బిహార్ రాష్ట్రాలకు చెందిన పలువురు సభ్యులు తమ తమ రాష్ట్రాలకు చెందిన వివిధ అంశాలను ప్రస్తావించారు. జార్ఖండ్‌లో సోమవారం ఒక ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట మృతుల అంశాన్ని లేవనెత్తిన జేఎంఎం సభ్యుడు సంజయ్‌కుమార్.. మృతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచాలని కోరారు. ఓటమిని జీర్ణించుకోలేకే సోనియా, రాహుల్‌ల అవరోధాలు: జైట్లీ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని.. దేశ ప్రగతిని అడ్డుకునేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారని అరుణ్‌జైట్లీ ధ్వజమెత్తారు. రాజ్యసభ వాయిదా పడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అనుసరించిన విధానాల వల్లే దేశ ఆర్థిక ప్రగతి మందగించిందని.. ఆ పార్టీ చేసిన పొరపాట్లను రాజకీయంగా, రాజ్యాంగపరంగానూ సరిదిద్దాల్సి ఉందని పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున.. దానిని ఆమోదించాలంటూ మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్దతు అవసరం. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో కాంగ్రెస్‌కు గణనీయంగా 68 మంది సభ్యుల బలం ఉంది. అధికార బీజేపీకి 48 మంది సభ్యులు ఉండగా.. మొత్తం 120 మంది సభ్యుల మద్దతు ఉంది. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 165 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే ఇంకా 45 మంది సభ్యుల మద్దతును కూడగట్టాల్సి ఉంటుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇక రెండు రోజులే మిగిలివున్న నేపథ్యంలో.. జీఎస్టీ బిల్లును వివిధ పార్టీల మద్దతుతో ఆమోదింపచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులను తక్కువగా చూస్తున్నారు... రాజ్యసభలో ఎస్పీ సభ్యుడు నరేశ్ అగర్వాల్ ప్రొటోకాల్ అంశాన్ని లేవనెత్తారు. లోక్‌సభ సభ్యులకన్నా రాజ్యసభ సభ్యులను తక్కువగా పరిగణిస్తున్నారని.. జిల్లాల్లో విజిలెన్స్ కమిటీలకు రాజ్యసభ సభ్యులు ఎవరినీ ప్రభుత్వం చైర్మన్‌గా నియమించలేదని చెప్పారు. రాజ్యసభ సభ్యుల విదేశీ పర్యటనల విషయంలోనూ లోక్‌సభే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ‘ప్రొటోకాల్ ప్రకారం రాజ్యసభ చైర్మన్.. లోక్‌సభ స్పీకర్ కన్నా ఉన్నతం. ప్రధానమంత్రి కన్నా ఉన్నత హోదా. ఈ సభ సభ్యులను అవమానిస్తారా? దీనిపై స్పీకర్ రూలింగ్ ఇవ్వాలి’అని కోరారు. దీనిపై కురియన్ ప్రభుత్వాన్ని వివరణ కోరగా.. జిల్లాల విజిలెన్స్ కమిటీ నియామకాల విషయంలో తాము కొత్తగా చేసిన ఏర్పాటు కాదని.. గత ప్రభుత్వ విధానాలే అనుసరించటం జరిగిందని.. సభ్యుల మనోభావాలను గౌరవిస్తున్నామని మంత్రి నక్వీ బదులిచ్చారు. కె.సి.త్యాగి(జేడీయూ), మధుసూదన్ మిస్త్రీ(కాంగ్రెస్) కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంటులో రాయితీ ఆహారం వంటి విషయాల్లో రాజకీయ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎంపీలను ఉగ్రవాదులుగా కూడా అభివర్ణిస్తున్నారని అగర్వాల్ ప్రస్తావిస్తాంచారు. -
ఇద్దరు అగ్ర నేతల వల్లే...
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును అడ్డుకోవడానికే సుష్మ స్వరాజ్ రాజీనామా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయడాన్ని ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నా... ఇద్దరు అగ్ర నేతలు సభా కార్యకలాపాలను అడ్డుకోవాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. దేశ అభివృద్దికి కాంగ్రెస్ పార్టీ ఆటంకం కలిగిస్తోందని జైట్లీ విమర్శించారు. -
కాంగ్రెస్ తీరు సరికాదు
జీఎస్టీ బిల్లుపై అరుణ్ జైట్లీ * రాజకీయ కారణాలతోనే బిల్లుకు అడ్డుపడుతోంది న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని పరోక్ష పన్నుల స్థానంలో ప్రవేశపెట్టాలనుకుంటున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విషయంలో అడ్డుపడుతూ కాంగ్రెస్ అభివృద్ధి నిరోధక వైఖరి కనబరుస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. తమ ప్రభుత్వంపై రాజకీయ కారణాలతో కలవరపడుతూ జీఎస్టీ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. ఈ విధానం దేశానికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరుస్తుందనే విషయాన్ని ఆ పార్టీ ఇప్పటికైనా అంగీకరించి ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం తన ఫేస్బుక్ పేజీలో ‘డిసెంట్ ఆర్ డిస్ప్ష్రన్: కాంగ్రెస్ పార్టీస్ పొజిషన్ ఆన్ జీఎస్టీ’ పేరిట జైట్లీ తన అభిప్రాయాలను నెటిజన్ల ముందుంచారు. ఆ పార్టీ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన జీఎస్టీ బిల్లులో తమ ప్రభుత్వం కీలక మార్పులేవీ చేయలేదని, ఈ బిల్లుకు కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలు కూడా మద్దతు తెలిపాయన్నారు. బిల్లులోని అంశాలను కాంగ్రెస్ ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నా గత యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలు రూపొందించిన జీఎస్టీ బిల్లుల్లో ఈ ప్రతిపాదనలేవీ లేవని జైట్లీ గుర్తుచేశారు. జీఎస్టీ రేటు 18 శాతంగా ఉండాలంటూ కాంగ్రెస్ చేసిన డిమాండ్ సహేతుకమైనదే అయినప్పటికీ దీనిపై జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జీఎస్టీ మండలిలో రాష్ట్రాల ఓటింగ్ అధికారాలను మూడొంతులకు పెంచాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను కూడా జైట్లీ తోసిపుచ్చారు. -
జీఎస్టీ బిల్లుకు సెలెక్ట్ కమిటీ మద్దతు
భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన కాంగ్రెస్, అన్నాడీఎంకే, లెఫ్ట్ పార్టీలు న్యూఢిల్లీ: దేశ పరోక్ష పన్ను వ్యవస్థలో భారీ సంస్కరణలకు ఉద్దేశించిన ‘వస్తు సేవల పన్ను(జీఎస్టీ) రాజ్యాంగ సవరణ’ బిల్లుకు రాజ్యసభ సెలెక్ట్ కమిటీలో మెజారిటీ సభ్యుల మద్దతు లభించింది. జీఎస్టీ బిల్లును అధ్యయనం చేసేం దుకు బీజేపీ సభ్యుడు భూపేందర్ యాద వ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన 21 మంది సభ్యు ల కమిటీ బుధవారం రాజ్యసభకు తన నివేదికను సమర్పించింది. జీఎస్టీ అమలు వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు మొత్తం నష్టా న్ని పరిహారంగా ఇవ్వాలన్న ప్రతిపాదన సహా బిల్లులోని దాదాపు అన్ని ప్రతిపాదనలను కమిటీ ఆమోదించిది. జీఎస్టీ వల్ల రాష్ట్రాలు గణనీయంగా ఆదాయాన్ని కోల్పోతాయని, ఆ మేరకు కేంద్రం పరిహారం అందించాలని టీఎంసీ సహా పలు పార్టీలు డిమాండ్ చేసిన విషయంతెలిసిందే.అంతర్రాష్ట్ర సరుకు రవాణా విషయంలో రాష్ట్రాలకు అదనంగా 1 శాతం లెవీ విధించుకునే అధికారానికి సంబంధించి కూడా కమిటీ ఒక సవరణ చేసింది. అమ్మిన వస్తువులపైననే ఆ 1% అదనపు పన్ను విధిం చాలని, కంపెనీల మధ్య జరిగే వస్తు నిల్వల అంతర్రాష్ట్ర రవాణాపై ఆ అదనపు భారం వేయకూడదని సూచించింది. ఈ విషయాన్ని బిల్లులో వివరించాలంది. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్,అన్నాడీఎంకే, లెఫ్ట్ సభ్యు లు నివేదికలో తమ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును యథాతథంగా అంగీకరించబోమన్నారు. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం లభించ గా.. రాజ్యసభలో మెజారిటీ ఉన్న విపక్షాల ఒత్తిడిపై ఎంపికసంఘానికి పంపించారు. 2016, ఏప్రిల్ 1నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. కమిటీచేసిన సూచనలు.. -అదనపుపన్ను విధింపు అధికారాన్ని ఇప్పుడు బిల్లులో పేర్కొన్న విధంగా రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల.. పన్ను భారంపెరుగుతుంది. బిల్లులో పేర్కొన్న అన్ని రకాల సరఫరా’ అనే పదంలో ‘సరఫరా’ అనేపదాన్ని స్పష్టంగా నిర్వచించాలి. * పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను విధింపు నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుందన్న నిర్ణయం హర్షణీయం. * రాష్ట్రాల ఆదాయ వనరులు పెంచేందుకు ‘బ్యాండ్ రేట్’ నిర్వచనాన్ని చట్టంలోనే పొందుపర్చాలి. స్థానిక అవసరాల కోసం ఎంపిక చేసిన వస్తు, సేవలపై రాష్ట్రాలు అదనపు పన్ను విధించుకోవచ్చు. అయితే, అది బ్యాండ్ రేట్ పరిధి లోపలే ఉండాలి. -
ఫుడ్ పార్కు ఏర్పాటుపై లోక్ సభలో దుమారం
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథీలో ఫుడ్ పార్కు ఏర్పాటు ఉపసంహరణపై లోక్ సభలో మంగళవారం దుమారం చెలరేగింది. దీంతో స్పీకర్ సభను రెండు సార్లు వాయిదావేశారు. ఇటు రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యవహారం ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సభను అదుపులోకి తెచ్చే క్రమంలో చైర్మన్ రాజ్యసభను ముడుసార్లు వాయిదావేశారు. కాగా వివాదాస్పద భూ సేకరణ చట్టం సవరణ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. 30 మంది సభ్యులతో ఏర్పాటయిన ఈ కమిటీకి డార్జిలింగ్ బీజేపీ ఎంపీ ఎస్ ఎస్ అహ్లువాలియా నేతృత్వం వహిస్తారు. కమిటీ సభ్యుల్లో 20 మంది లోక్‌సభకు చెందినవారు కాగా, 10 మంది రాజ్యసభ సభ్యులు. కమిటీ ఏర్పాటును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. ఏఐడీఎంకే పార్టీ తప్ప మిగతా పక్షాలన్నీ అంగీకరించడంతో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు రాజ్యసభ సెలెక్షన్ కమిటీ ముందుకు వెళ్లనుంది. గతంలో రూపొందించిన భూ సేకరణ బిల్లుకు ఎన్డీఏ చేసిన సవరణలు రైతులకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అంగీకరించబోమని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్డీఏకు అంతగా బలంలేని రాజ్యసభలో భూ బిల్లు వీగిపోవడంతో మరోసారి ఆర్డినెన్స్ తీసుకువచ్చిన ప్రభుత్వం ఎలాగైనా సరే బిల్లును ఆమోదింపజేయాలని పట్టుదలతో ఉంది. 15 లేదా 21 మంది సభ్యులతో కూడిన రాజ్యసభ సెలెక్షన్ కమిటీ జీఎస్టీ బిల్లును పరిశీలించనుంది. -
జీఎస్టీకి లోక్‌సభ ఆమోదం
-
జీఎస్టీకి లోక్‌సభ ఆమోదం
బిల్లుకు రేపు రాజ్యసభలో పరీక్ష బిల్లును స్థాయీ సంఘానికి పంపాలన్న డిమాండ్‌కు సర్కారు తిరస్కరణ న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తువులు, సేవల పన్ను బిల్లు (జీఎస్టీ) బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లును పార్లమెంటు స్థాయీ సంఘానికి పంపించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్‌లో టీఎంసీ, బీజేడీ తదితర పార్టీల మద్దతుతో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 352 ఓట్లు పోలవగా.. వ్యతిరేకంగా 37 ఓట్లు పోలయ్యాయి. జీఎస్టీ అమలు వల్ల ఆదాయం నష్టపోయే రాష్ట్రాలకు కేంద్రం తొలి ఐదేళ్ల పాటు పరిహారం చెల్లిస్తుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఏకరూప పరోక్ష పన్ను రేటు.. నిపుణుల కమిటీ సిఫారసు చేసిన పన్ను రేటు 27 శాతం కంటే ఇంకా తక్కువగా ఉంటుందని హామీ ఇచ్చింది. ఓటింగ్ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలో లేరు. జీఎస్టీని అమలులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఈ రాజ్యాంగ సవరణ బిల్లు.. నిబంధనల మేరకు లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదం పొందినా.. రాజ్యసభలో ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు రాజ్యసభలో సాధారణ మెజారిటీ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో పెద్దల సభ పరీక్షలో బిల్లు పాసవుతుందా? లేదా? అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. లోక్‌సభలో కాంగ్రెస్ వాకౌట్ చేయటానికి ముందు.. జీఎస్టీ బిల్లుపై చర్చకు ఆర్థికమంత్రి సమాధానం ఇచ్చారు. పరోక్ష పన్నులను సంస్కరించాలన్న ప్రతిపాదన గత 12 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండిపోయిందని.. తనకన్నా ముందు ఆర్థికమంత్రిగా పనిచేసిన పి.చిదంబరం కూడా యూపీఏ హయాంలో జీఎస్టీని ముందుకు తెచ్చారని పేర్కొన్నారు. ఎర్ర మీట నొక్కేశారు! జీఎస్టీ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ సందర్భంగా కేంద్రం ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. బిల్లులోని రెండవ క్లాజుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ కోరగా.. అధికార బీజేపీ సభ్యులు 12 మంది.. ఎర్ర మీట నొక్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో అరుణ్‌జైట్లీ అసంతృప్తికి లోనయ్యారు. వెంటనే మరో మంత్రి రూడీ.. వ్యతిరేకంగా ఓటేసిన సభ్యుల వద్దకు వెళ్లి మాట్లాడారు. మళ్లీ ఓటింగ్ నిర్వహించగా వారంతా సరైన మీటలు నొక్కారు. -
జీఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదముద్ర వేసింది. విపక్షాల అభ్యంతరల నడుమ బిల్లు ఆమోదం పొందింది. జీఎస్టీ బిల్లులో మార్పులు చేసినందున తాజా బిల్లును మళ్లీ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రతిపక్షం డిమాండ్ ను ప్రభుత్వం తిరస్కరించింది. జీఎస్టీ బిల్లుతో భవిష్యత్ లో ధరలు తగ్గుతాయని, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఒక స్థాయీ సంఘం నుంచి మరో స్థాయీ సంఘానికి దూకడానికి బిల్లులు అనేవి నృత్య వస్తువులు కాదని ఆయన మండిపడ్డారు. జీఎస్టీ బిల్లు కారణంగా ఏ రాష్ట్రం కూడా ఆదాయం కోల్పోదని భరోసాయిచ్చారు. -
జీఎస్టీ.. మళ్లీ మొదటికి?!
- బిల్లును స్థాయీ సంఘానికి పంపాలని లోక్‌సభలో ప్రతిపక్షాల పట్టు - స్పీకర్ తిరస్కరణ.. జీఎస్టీ బిల్లుపై లోక్‌సభలో చర్చ షురూ - స్థాయీ సంఘానికి పంపితే మరో ఏడాది అలస్యమవుతుంది: జైట్లీ - బిల్లుకు మద్దతు తెలిపిన తృణమూల్.. వ్యతిరేకించిన అన్నాడీఎంకే న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఎట్టకేలకు మంగళవారం లోక్‌సభ ముందుకు వచ్చింది. యూపీఏ తెచ్చిన జీఎస్టీ బిల్లులో మార్పులు చేసినందున తాజా బిల్లును మళ్లీ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేయగా.. స్పీకర్ నిరాకరించారు. అనంతరం ఆర్థిక మంత్రి జైట్లీ విజ్ఞప్తితో ఎట్టకేలకు సభలో బిల్లుపై చర్చచేపట్టారు. లోక్‌సభలో మెజారిటీ ఉన్న ప్రభుత్వం.. ఈ సభలో బిల్లును ఆమోదించుకునే పరిస్థితి ఉన్నప్పటికీ.. రాజ్యసభలో ఆధిక్యం లేకపోవటంతో అక్కడ బిల్లు పరిస్థితి ఏమవుతుంది, మళ్లీ మొదటికి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అంతకుముందు.. ప్రభుత్వం పలు బిల్లులను పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు పంపించకుండా పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్, బీజేడీ, అన్నాడీఎంకే, సీపీఎం ధ్వజమెత్తాయి. ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన 51 బిల్లుల్లో 44 బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించటం కోసం స్థాయీ సంఘాలకు పంపించలేదని మహతాబ్(బీజేడీ) విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ల పాలన ద్వారా సభావ్యవహారాల నిబంధనలను అతిక్రమిస్తోందని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే దుయ్యబట్టారు. జీఎస్టీ బిల్లును స్థాయీ సంఘానికి పంపించినట్లయితే మరొక ఆర్థిక సంవత్సరం పాటు రాష్ట్రాలకు ప్రయోజనాలు దక్కవని.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి అమలులోకి తీసుకురావాలన్న లక్ష్యం నెరవేరదని జైట్లీ అన్నారు. స్థాయీ సంఘం జీఎస్టీపై ఇప్పటికే రెండున్నరేళ్లు అధ్యయనం చేసిందని.. కొన్ని అంశాలు మినహా రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీలో విస్తృత ఏకాభిప్రాయమూ వ్యక్తమయిందని చెప్పారు. ఈ కీలక బిల్లు ఆమోదంలో జాప్యం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని.. పార్టీలు విభేదాలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురై మాట్లాడుతూ.. దేశంలో పన్ను విధానాన్ని మార్చి కొత్తగా జీఎస్టీని అమలు లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఈ 122వ రాజ్యాంగ సవరణ బిల్లును స్థాయీ సంఘానికి పంపించాలని మహతాబ్(బీజేడీ).. స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు విజ్ఞప్తి చేశారని, అయితే అలా పంపించరాదని జైట్లీ స్పీకర్‌ను కోరారని.. జైట్లీ విజ్ఞప్తిని స్పీకర్ ఆమోదించారన్నారు. అనంతరం బిల్లుపై చర్చ చేపట్టగా.. కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ చర్చను ప్రారంభిస్తూ.. బిల్లును విస్తృత సంప్రదింపుల కోసం స్థాయీ సంఘానికి పింపించాలని పునరుద్ఘాటించారు. బిల్లుకు మద్దతు ప్రకటించిన టీడీపీ ఎంపీ పి.రవీంద్రబాబు.. అప్పిలేట్ అథారిటీ అంశంపై స్పష్టతనివ్వాలని కోరారు. జీఎస్టీ వల్ల పంపిణీ వరుసక్రమం బలపడుతుందని టీఆర్ఎస్ సభ్యుడు కె.వి.రెడ్డి అభిప్రాయపడ్డారు. బిల్లుక మద్దతు ఇస్తున్నామని టీఎంసీ పేర్కొంది. బిల్లు తమిళనాడుకు చేటు చేస్తాయని.. కాబట్టి వ్యతిరేకిస్తున్నామని అన్నాడీఎంకే సభ్యుడు పి.వేణుగోపాల్ చెప్పారు. సీపీఎం సభ్యుడు పి.కరుణాకరన్ దాన్ని స్థాయీ సంఘానికి పంపాలన్నారు. జీఎస్టీ అసలు లక్ష్యం నెరవేరుతుందా? లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వెలగపల్లి ప్రశ్న వినియోగదారులపై పన్ను భారం తగ్గించాలన్న అసలు ఉద్దేశం జీఎస్టీ పన్ను రేటుతో నెరవేరుతుందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు ప్రశ్నించారు. జలమార్గాల బిల్లు... కేంద్రం జాతీయ జలమార్గాల బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రోడ్లపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు, చౌక రవాణా మార్గాలను అందించేందుకు ప్రస్తుతమున్న ఐదు జలమార్గాలకు కొత్తగా 101 జలమార్గాలను ఏర్పాటు చేయటానికి ఉద్దేశించిన ఈ బిల్లును నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారీ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రోడ్డు రవాణా ధర కి.మీకి రూ. 1.50గా, రైలు రవాణా ధర రూ. 1గా ఉందని.. జల రవాణా ధర 50 పైసలే ఉంటుందని పేర్కొన్నారు. రాజ్యసభలో జీఎస్టీకి అవరోధం?! జీఎస్టీ బిల్లును పరిశీలన కోసం స్థాయీ సంఘానికి పంపించాలని విపక్షాలు పట్టుపడుతున్న నే పథ్యంలో.. ఈ అంశంపై అధికార - విపక్షాలకు మధ్య ఘర్షణ తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోక్‌సభలో బిల్లుకు ఆమోదానికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం లోక్‌సభ, రాజ్యసభల్లోని ఎన్డీఏ మిత్రపక్షాల సభాపక్షాల నేతలతో సమావేశమయ్యారు. బిల్లు సాఫీగా ఆమోదం పొందేందుకు ఆయా పక్షాల సభ్యులందరూ బుధవారం సభలో ఉండేలా చూడాలని కోరారు. శివసేన, టీడీపీ, ఎల్జేపీ, ఎస్ఏడీ, ఎన్పీపీ, ఎస్డీఎఫ్, ఆర్పీఐ తదితర పక్షాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఒకవేళ మిత్రపక్షాలతో పాటు తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీల సాయంతో లోక్‌సభలో బిల్లును గట్టెక్కించినప్పటికీ రాజ్యసభలో ఇబ్బందులు తప్పేలా లేవు. స్థిరాస్తి బిల్లు సెలక్ట్ కమిటీకి.. వివాదాస్పద స్థిరాస్తి బిల్లును పార్లమెంటరీ ఎంపిక కమిటీకి పంపించాలని రాజ్యసభలో విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేయడంతో ప్రభుత్వం అందుకు సమ్మతించింది. 21 మంది సభ్యులతో కూడిన ఎంపిక కమిటీకి బిల్లును సిఫార్సు చేయనుంది. ఈమేరకు మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ సీఎం రమేశ్ ఈ కమిటీలో ఉన్నారు. కమిటీ వచ్చే పార్లమెంట్ సమావేశాల తొలి వారంలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరనుంది. స్థిరాస్తి వ్యాపారాన్ని నియంత్రించేందుకు కేంద్రం తీసుకువచ్చిన స్థిరాస్తి(సవరణ) బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ.. ప్రభుత్వం మైనారిటీలో ఉన్న రాజ్యసభలో విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో చర్చకు పెట్టాల్సి ఉండగా.. విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. గత నెల 26వ తేదీన కూడా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించగా.. దానిని ముందు ఎంపిక కమిటీకి పంపించాలని విపక్షాలు పట్టుబట్టటంతో అప్పుడూ బిల్లును వాయిదా వేయాల్సి వచ్చింది. మోగా ఘటనపై ఉభయసభలు వాయిదా పంజాబ్‌లోని మోగాలో మైనర్ బాలికపై అత్యాచారం, ఆమె మృతి ఘటన మంగళవారం పార్లమెంట్ ఉభయసభలను కాసేపు స్తంభింపచేసింది. ఈ ఘటనపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయగా.. ఉభయసభల్లోనూ గందరగోళం తలెత్తి పలుమార్లు వాయిదా పడ్డాయి. రాజ్యసభ మొదలవగానే. కాంగ్రెస్ నేత అంబికాసోనీ మాట్లాడుతూ.. పంజాబ్‌లో శాంతిభద్రతలు మృగ్యమయ్యాయని, కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. ఘటన జరిగిన బస్సు యజమానులు రాష్ట్ర పాలకులని, ఇది తీవ్రమైన అంశమని విపక్ష నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. చర్చ జరగాలంటే నోటీసు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. లోక్‌సభలో అమరీందర్‌సింగ్(కాంగ్రెస్) మాట్లాడుతూ ఆర్బిట్ బస్సుల్లో ఇటువంటి ఘటనలు జరగటం ఇదే తొలిసారి కాదన్నారు. అకాలీదళ్ సభ్యులు నిరసన తెలపడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగటంతో లోక్‌సభ రెండు సార్లు వాయిదా పడింది. మంగళవారం పార్లమెంటులో చర్చకు వచ్చిన మరికొన్ని అంశాలు - నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులపై ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలపై దర్యాపు జరిపించాలని ప్రభుత్వం యోచించడం లేదని హరిభాయ్ చౌధురి లోక్‌సభకు వెల్లడించారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్రస్థాయి హోదా ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. కశ్మీరీ పండిట్లకు ప్రత్యేక టౌన్‌షిప్‌ల ఏర్పాటు ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. దీంతో ఈ టౌన్‌షిప్‌లపై రగులుతున్న వివాదానికి తెరపడినట్లయింది. - దేశంలో స్మగ్లింగ్ అవుతున్న వాటిలో గంధపు చెక్కలు, ఎర్రచందనం వాటానే ఎక్కువని పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ లోక్‌సభకు తెలిపారు. ఈ చెట్ల వివరాలను రాష్ట్రాల వారీగా ప్రభుత్వం సేకరించనుందన్నారు. - మరిన్ని ఔషధాలను ధరల నియంత్రణలోకి తేవడానికి జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను సవరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, దీని కోసం కమిటీని నియమించామని ఎరువులు, రసాయనాల మంత్రి అనంత్‌కుమార్ లోక్‌సభకు తెలిపారు. - స్విట్జర్లాండ్, బ్రిటన్, స్పెయిన్ ప్రభుత్వాలు నల్లధన ఖాతాలకు సంబంధించి భారత్‌కు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభకు తెలిపారు. అయితే భారత్‌తో పన్ను సమాచార ఒప్పందం కుదర్చుకున్న దేశాలు నిర్దిష్ట కేసుల్లో అవసరమైన సమాచారం ఇచ్చాయని వెల్లడించారు. - ఎలాంటి వివక్షా లేకుండా పౌరలందరికీ ఇంటర్నెట్ను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటామని ఐటీ, టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో హామీ ఇచ్చారు. ఇంటర్నెట్ సమానత్వంపై సావధాన తీర్మానానికి ఆయన సమాధానమిచ్చారు. ఇంటర్నెట్ సమానత్వం ఉండాలని సభ్యులు పార్టీలకతీతంగా కోరారు. ఈ అంశంపై ‘ట్రాయ్’ సంప్రదింపుల పత్రానికి సంబంధించి సూచనలు ఇచ్చిన పది లక్షల మంది మెయిల్ ఐడీలను ఆ సంస్థ బయటపెట్టడాన్ని తప్పుబట్టారు. -
'వేడుకుంటున్నా.. దయచేసి సహకరించండి'
ఢిల్లీ: 'నేను వేడుకుంటున్నా.. దయచేసి సహకరించండి'. ఇది పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ కు చేసిన అభ్యర్థన . కీలకమైన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) బిల్లు మంగళవారం లోక్ సభకు వచ్చిన సందర్భంగా జైట్లీ ఈ మేరకు కాంగ్రెస్ కు విన్నవించారు. అప్పటివరకూ ఆ బిల్లుపై కాస్త వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ మెత్తబడింది. దీంతో పార్లమెంట్ లో జీఎస్టీ బిల్లుకు మూడింట రెండొంతల మెజార్టీ లభించి బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలైతే రాష్ట్రాలు ముందడుగు వేస్తాయని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ మద్దతు తెలపడానికి కారణం ఇది తమ ప్రభుత్వ ఆలోచనేనని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ తెలిపారు. -
లోక్‌సభలో జీఎస్టీ బిల్లు
విపక్ష నిరసనల మధ్య సభ ఆమోదం కోరిన ఆర్థికమంత్రి ఆదాయం విషయంలో ఆందోళన వద్దని రాష్ట్రాలకు హామీ స్థాయీసంఘానికి పంపాలని ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ తోసిపుచ్చిన ప్రభుత్వం; కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, లెఫ్ట్ వాకౌట్ న్యూఢిల్లీ: దేశంలోని పన్ను వ్యవస్థ రూపురేఖల్ని మార్చే సంస్కరాణత్మక ‘వస్తు, సేవల పన్ను(గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్- జీఎస్టీ)’కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు శుక్రవారం లోక్‌సభ ముందుకు వచ్చింది. సమగ్ర అధ్యయనం కోసం బిల్లును స్థాయీసంఘం పరిశీలనకు పంపించాలన్న విపక్ష పార్టీల డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చడంతో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, వామపక్షాల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బీజేడీ, అన్నాడీఎంకే సభ్యులు బిల్లును వ్యతిరేకించారు కానీ వాకౌట్ చేయలేదు. బిల్లును సభ ముందుకు తెస్తూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బిల్లుకు సంబంధించి రాష్ట్రాల భయాందోళనలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ పన్ను వ్యవస్థ అమల్లోకి వస్తే రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందన్న వాదన సరికాదని, ఇది అందరికీ ప్రయోజనం చేకూరుస్తుందని హామీ ఇచ్చారు. బిల్లుపై ప్రభుత్వం తొందరపాటుతో వ్యవహరిస్తోందని, బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించి, ఈ లోపు బడ్జెట్ వ్యవహారాలు పూర్తి చేస్తే మంచిదన్నాయి. అంతకుముందు, బిల్లును సభ ముందుకు తెచ్చేందుకు ఉద్దేశించిన నిబంధనల విషయంలో ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల మధ్య గంటపాటు వాగ్వాదం జరిగింది. అనంతరం, ఇది ముఖ్యమైన బిల్లు కావడంతో సభలోకి బిల్లును అనుమతిస్తున్నానని స్పీకర్ సుమిత్ర మహాజన్ స్పష్టం చేశారు. తర్వాత సభ ఆమోదం కోసం వస్తు, సేవల పన్ను(రాజ్యాంగ సవరణ) బిల్లును జైట్లీ సభ ముందుంచారు. జీఎస్టీతో వాణిజ్యం విస్తృతమవుతుందని, భారత్ ఆదాయం, జీడీపీ పెరుగుతుందని, రాష్ట్రాలకు, కేంద్రానికి.. రెండింటికీ ఇది ప్రయోజనకరమేనని వివరించారు. దీనిద్వారా వస్తుసేవలపై పన్ను విధించే అధికారం కేంద్రం, రాష్ట్రాలు రెండింటికీ లభిస్తుందన్నారు. ఇంకా జైట్లీ ఏమన్నారంటే.. 2003లో ఎన్డీఏ హయాంలోనే ఈ బిల్లు రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాతి యూపీఏ ప్రభుత్వమూ సానుకూలంగా ఉంది. బిల్లును స్థాయీ సంఘానికి పంపింది. రెండున్నరేళ్లు స్థాయీసంఘం అధ్యయనం చేసింది. ఇంత విస్తృతంగా చర్చ జరిగిన బిల్లు బహుశా ఇదొక్కటే. మీరు(యూపీఏ) చేసిన మంచి పనిని మేం పూర్తి చేస్తున్నాం. అడ్డుకుంటున్నారెందుకు? విలువ ఆధారిత పన్ను(వ్యాట్) విధించినప్పుడు తాము కోల్పోతున్న ఆదాయానికి సంబంధించి ఐదేళ్లే పరిహారం ఇస్తే కుదరదని, ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఇవ్వాలని రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. కానీ ఐదేళ్లు పూర్తయిన తరువాత ఒక్క రాష్ట్రం కూడా పరిహారం డిమాండ్ చేయలేదు. జీఎస్టీతో రాష్ట్రాలు తమ ఆదాయం కోల్పోతే.. వాటికి మొదటి మూడేళ్లు 100%, నాలుగో ఏడు 75%, ఐదో ఏడు 50% పరిహారం అందుతుంది. ఆరో ఏడాది నుంచి పరిహారం అడగడం మానేస్తారు. జీఎస్టీ మండలి సభ్యుల్లో రాష్ట్రాల మెజారిటీనే ఎక్కువ. కొన్ని రాష్ట్రాలు కలిసి కూడా మండలి నిర్ణయాల్ని వ్యతిరేకించవచ్చు. మా ప్రభుత్వం అనుసరిస్తున్న సహకార సమాఖ్య విధానానికి ఇదొక మచ్చుతునక. సమగ్ర అధ్యయనం జరగాలి ప్రభుత్వ చర్యను విపక్ష సభ్యులు తీవ్రంగా నిరసించారు. జీఎస్టీ బిల్లును పరిశీలనలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ సభ్యుడు, లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ ప్రతిపాదనకు తాము వ్యతిరేకం కాదని, అయితే, ముందు దానిపై స్టాండింగ్ కమిటీలో సమగ్ర అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. దానికి చర్చ ప్రారంభమయ్యే లోపు అధ్యయనం చేయొచ్చని జైట్లీ జవాబిచ్చారు. గత సంవత్సరం సభలో బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా స్టాండింగ్ కమిటీకి పంపించకూడదని నిర్ణయం తీసుకున్నారని స్పీకర్ సుమిత్ర మహాజన్ గుర్తుచేశారు. బీజేడీ, టీఎంసీ, సీపీఐ సభ్యులు ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వివరాలు.. దేశంలో పన్ను సంస్కరణలకు సంబంధించి కీలకమైన ఈ బిల్లును గత సంవత్సరం డిసెంబర్ 19న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జీఎస్టీ అమల్లోకి వస్తే.. సెంట్రల్ ఎక్సైజ్, రాష్ట్రాల వ్యాట్, వినోదపు పన్ను, ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, పర్చేజ్ ట్యాక్స్‌ల స్థానంలో ఏకీకృత పన్నుగా వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఉంటుంది. మద్యం జీఎస్టీ పరిధిలో ఉండదు. పెట్రోలు, డీజిలు తదతర పెట్రోలియం ఉత్పత్తులను భవిష్యత్తులో దీని పరిధిలోకి తీసుకువస్తారు. భవిష్యత్తులో ఎప్పుడనేది జీఎస్టీ మండలి నిర్ణయిస్తుంది. జీఎస్టీ మండలిలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు రాష్ట్రాల నుంచే ఉంటారు. ఇందులో రాష్ట్రాలకు వీటో అధికారం ఉంటుంది. మండలి తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని కనీసం 75% సభ్యులు ఆమోదించాల్సి ఉంటుంది. -
జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతం
జాతీయం భారత్‌కు అమెరికా రాయబారిగా రిచర్డ్ ప్రమాణం భారత్‌కు అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా మేధావి వర్గంలో ప్రముఖుడుగా చెప్పదగిన రాహుల్ వర్మ నాన్సీ పోవెల్ స్థానంలో అమెరికా రాయబారిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆయన నియామకాన్ని అమెరికా సెనేట్ గతంలో మూజువాణి ఓటుతో ఆమోదించింది. భారత్‌కు అమెరికా రాయబారిగా నియమితుడైన తొలి భారతీయ అమెరికన్‌గా రిచర్డ గుర్తింపు పొందారు. రా, సీఆర్పీఎఫ్లకు కొత్త సారథులు భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధిపతిగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 19న రాజిందర్ ఖన్నాను నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రివర్గ ఎంపికల కమిటీ ఖన్నా నియామకానికి ఆమోదం తెలిపింది. ఖన్నా డిసెంబర్ 31 నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఆర్ఏఎస్ కేడర్‌కు చెందిన ఖన్నా 1978 బ్యాచ్ అధికారి. హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత) ప్రకాశ్మిశ్రాను సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది. లోక్‌సభలో జీఎస్టీ బిల్లు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ డిసెంబర్ 20న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రవేశపన్ను, ఆక్ట్రాయ్, సేవా పన్ను వంటి అనేక పన్నులు ప్రత్యేకంగా లేకుండా ఒకటే పన్ను విధానాన్ని 2016, ఏప్రిల్ నుంచి అమలు చేసే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించారు. 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీన్ని తీసుకొచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్ 18న చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి ప్రయోగం చేపట్టారు. ఈ రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ అట్మాస్పియరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ (కేర్)ను ప్రయోగించారు. భూమికి 126 కి.మీ. ఎత్తులో రాకెట్ నుంచి క్రూ మాడ్యూల్ (వ్యోమగాముల గది) విడిపోయింది. తర్వాత పారాచూట్ సహాయంతో బంగాళాఖాతంలో దిగింది. ఈ ప్రయోగం మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు, బరువైన ఉపగ్రహాలను సొంతంగా ప్రయోగించేందుకు తోడ్పడుతుంది. జీఎస్ఎల్వీ మార్క్ 3 (ఎల్వీఎం 3) రాకెట్ ఎత్తు 43.43 మీటర్లు, బరువు 630.58 టన్నులు. సూపర్ ఎర్త్‌ను గుర్తించిన నాసా కెప్లర్ మిషన్ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ సూపర్ ఎర్త్‌ను గుర్తించినట్లు డిసెంబర్ 19న శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది భూమికి దాదాపు 180 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీనికి హెచ్ఐపీ116454బిగా పేరు పెట్టారు. ఇది వ్యాసంలో భూమి కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. గ్లైడ్ బాంబును పరీక్షించిన భారత్ భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన వెయ్యి కిలోల గ్లైడ్ బాంబును డిసెంబర్ 19న పరీక్షించారు. ఇది విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. వాయుసేనకు చెందిన విమానం ద్వారా బాంబును తీసుకెళ్లి ఒడిశా తీరంలోని బంగాళాఖాతంలో జారవిడిచారు. రాష్ట్రీయం చంద్రశేఖరరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగు రచయిత, విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన తెలుగులో రాసిన ‘మన నవలలు, మన కథానికలు’ అనే పుస్తకానికి ఉత్తమ విమర్శకుడిగా ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రానికి ప్రధాన బాధ్యులుగా సేవలందిస్తున్నారు. 22 భాషలకు చెందిన వారికి సాహిత్య అకాడమీ డిసెంబర్ 19న పురస్కారాలు ప్రకటించింది. పురస్కారం కింద తామ్ర పత్రం, లక్ష రూపాయలు ప్రదానం చేస్తారు. నూతన వరి వంగడం ఎంటీయూ-1156 పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎంటీయూ-1156 పేరిట కొత్త వరి వంగడాన్ని డిసెంబర్ 16న విడుదల చేసింది. వరిలో ఐదు నుంచి పది శాతం అదనంగా దిగుబడి పెంచాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు ఈ వంగడాన్ని రూపొందించారు. ఇది దాళ్వాకు అనువుగా ఉంటుందని, 120 రోజుల కాల పరిమితిలో కోతకు వస్తుందని పరిశోధకులు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తొలి చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి డిసెంబర్ 18న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గతంలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త సర్వీస్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్, సభ్యులు ఆరేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారు. ఏపీ సీఆర్డీఏ బిల్లుకు శాసన సభ ఆమోదం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ 22న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ప్రస్తుతమున్న విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి పట్టణాభివృద్ధి సంస్థ రద్దవుతుంది. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే రాజధాని ప్రణాళిక, నిర్మాణం, పాలనకు సంబంధించి సీఆర్డీఏ ఏర్పాటవుతుంది. రాజదాని ప్రాంత పరిధిలో భూ సమీకరణ పథకం, పట్టణ ప్రణాళిక పథకం, ప్రత్యేక ప్రాంత అభివృద్ధి పథకం పర్యవేక్షణ అధికారం సీఆర్డీఏకి ఉంటుంది. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు ‘తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి’ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 18న ఉత్తర్వులు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఎక్స్అఫీషియో వైస్‌చైర్మన్‌గా ఆర్థికమంత్రి వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకొని, సమగ్రాభివృద్ధి సాధించేందుకు వీలుగా ప్రణాళిక మండలి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తుంది. అంతర్జాతీయం పాక్‌లో ఉగ్రవాదుల దాడిలో 148 మంది మృతి పాకిస్తాన్‌లోని పెషావర్‌లో సైనిక పాఠశాలపై డిసెంబర్ 16న ఆత్మాహుతి దళ తాలిబన్లు జరిపిన దాడిలో 148 మంది మరణించారు. వీరిలో 132 మంది విద్యార్థులున్నారు. పాక్ సైన్యం జరిపిన ఎదురుదాడిలో ముగ్గురు తాలిబన్లు మరణించగా, నలుగురు తమను తాము పేల్చుకున్నారు. ఉత్తర వజీరిస్తాన్‌లో పాక్ సైన్యం దాడులకు ప్రతీకారంగా సైనిక పాఠశాలపై దాడి చేసినట్లు తెహ్రీక్ ఇ తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అత్యంత అధిక స్థాయికి ఇై2 ఉద్గారాలు శిలాజ ఇంధనాలను మండించడం, పారిశ్రామిక కార్యకలాపాల కారణంగా 2013లో ప్రపంచంలో అత్యధికంగా 35.3 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు విడుదలయ్యాయి. ఇది 2012 కంటే 0.7 బిలియన్ టన్నులు అధికం. డిసెంబర్ 17న ‘పీబీఎల్ నెదర్లాండ్స్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ, ఐరోపా కమిషన్ జాయింట్ రీసెర్చ్ సెంటర్’.. ‘ట్రెండ్స్ ఇన్ గ్లోబల్ ఇై2 ఎమిషన్స్-2014’ నివేదికను విడుదల చేసింది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల ఇంధన అవసరాలు పెరుగుతుండటం ఉద్గారాల పెరుగుదలకు కారణమని నివేదిక తెలిపింది. ఉద్గారాల విడుదలలో చైనా (29 శాతం), అమెరికా (15 శాతం), ఐరోపా యూనియన్ (11 శాతం), భారత్ (6 శాతం) ముందున్నాయి. వ్యాపారానికి అత్యంత అనుకూలం డెన్మార్క్ వ్యాపారానికి అనుకూల దేశాలకు సంబంధించి ఫోర్బ్స్ విడుదల చేసిన 9వ వార్షిక ర్యాంకింగ్స్‌లో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. హాంకాంగ్, న్యూజిలాండ్‌లు వరుసగా రెండు, మూడో స్థానాలను దక్కించుకున్నాయి. 146 దేశాల జాబితాలో భారత్ 93వ స్థానంలో నిలిచింది. గినియా చివరి స్థానంలో నిలిచింది. ఆస్తి హక్కులు, ఆవిష్కరణలు, పన్నులు, సాంకేతిక పరిజ్ఞానం, అవినీతి తదితర 11 కారకాల ఆధారంగా ఏటా ఫోర్బ్స్ ర్యాంకులు ఇస్తోంది. అమెరికా సర్జన్ జనరల్‌గా భారతీయ అమెరికన్ అమెరికా 19వ సర్జన్ జనరల్‌గా 37 ఏళ్ల భారతీయ అమెరికన్ వివేక్‌మూర్తి నియామకాన్ని సెనేట్ డిసెంబర్ 15న ఆమోదించింది. దీంతో పిన్న వయసులోనే సర్జన్ జనరల్ అయిన వ్యక్తిగా మూర్తి రికార్డు సృష్టించారు. ఈ నియామకం పొందిన తొలి భారతీయ సంతతి వ్యక్తి కూడా ఆయనే. బోస్టన్‌లో వైద్య వృత్తిలో స్థిరపడిన మూర్తి కర్ణాటకలో జన్మించారు. ప్రజారోగ్య విషయాలకు సంబంధించిన పాలనలో సర్జన్ జనరల్ అత్యున్నత పదవి. క్రీడలు ప్రపంచకప్ ప్రచారకర్తగా సచిన్ 2015 వన్డే క్రికెట్ ప్రపంచకప్ ప్రచారకర్తగా సచిన్ టెండూల్కర్ వ్యవహరించనున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డిసెంబర్ 22న ప్రకటించింది. 2011 ప్రపంచకప్‌నకు కూడా సచిన్ ప్రచార కర్తగా పనిచేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రపంచకప్ టోర్నమెంట్ జరగనుంది. లార్డ్స్‌లో 2019 ప్రపంచకప్ ఫైనల్ 2019 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచ కప్ ఫైనల్‌కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వనున్నట్లు డిసెంబర్ 17న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్.. 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్ ఫైనల్స్‌కు ఆతిథ్యమిచ్చింది. 2017లో జరిగే మహిళల ప్రపంచకప్ ఫైనల్ కూడా లార్డ్స్ మైదానంలో జరగనుంది. వరల్డ్ చాంపియన్స్‌గా జొకోవిచ్, సెరెనా 2014 సంవత్సరానికి పురుషుల విభాగంలో సెర్బియాకు చెందిన నొవాక్ జొకోవిచ్, మహిళల విభాగంలో అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్‌లను వరల్డ్ చాంపియన్స్‌గా ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) డిసెంబర్ 18న ప్రకటించింది. జొకోవిచ్ ఈ అవార్డును దక్కించుకోవడం ఇది నాలుగోసారి కాగా, సెరెనాకు ఐదోసారి. బాక్సర్ సరితపై ఏడాది నిషేధం ఆసియా క్రీడల్లో పతకం స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) డిసెంబర్ 17న ఏడాదిపాటు నిషేధం విధించింది. దాంతోపాటు వెయ్యి స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా వేసింది. నిషేధం 2015, అక్టోబర్ 1 వరకు అమల్లో ఉంటుంది. పతకం తిరస్కరించిన సందర్భంలో సరితకు మద్దతుగా నిలిచిన కోచ్ ఫెర్నాండెజ్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. భారత్‌కు కబడ్డీలో డబుల్ ప్రపంచకప్ రికార్డు స్థాయిలో భారత పురుషుల జట్టు వరుసగా ఐదోసారి, మహిళల జట్టు నాలుగోసారి కబడ్డీ ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నాయి. డిసెంబర్ 20న పంజాబ్‌లోని గురుగోబింద్ సింగ్ స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో పురుషుల జట్టు, పాకిస్థాన్ జట్టును ఓడించింది. మహిళల జట్టు న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. ‘కోల్‌కతా’కు ఐఎస్ఎల్ టైటిల్ తొలి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టైటిల్‌ను అట్లెటికో డి కోల్‌కతా గెలుచుకుంది. డిసెంబర్ 20న ముంబైలో డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీను ఓడించింది. విజేతగా నిలిచిన కోల్‌కతాకు రూ.8 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్ కేరళ బ్లాస్టర్స్‌కు రూ. 4 కోట్లు అందాయి. ‘గోల్డెన్ బూట్’ అవార్డును ఎలనో(చెన్నైయిన్) అందుకున్నాడు. కోల్‌కత, కేరళ జట్లకు గంగూలీ, సచిన్ టెండూల్కర్లు సహ యజమానులుగా ఉన్నారు. చాంపియన్ చెన్‌లాంగ్ బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’లో చెన్ లాంగ్ (చైనా), తాయ్ జు యింగ్ (చైనీస్ తైపీ) వరుసగా పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. డిసెంబర్ 21న జరిగిన ఫైనల్స్‌లో చెన్ లాంగ్.. విటిన్‌గస్ (డెన్మార్క్)పై గెలుపొందగా, తాయ్ జు యింగ్.. సుంగ్ జీ హున్ (కొరియా)ను ఓడించింది. విజేతగా నిలిచిన చెన్ లాంగ్, తాయ్ జు యింగ్‌లకు 80 వేల డాలర్ల (రూ. 50 లక్షల 68 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
జీఎస్టీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రతిపాదిత వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య సోమవారం ఏకాభిప్రాయం కుదిరింది. జీఎస్టీ నుంచి పెట్రోలియంను మినహాయించేందుకు కేంద్రం అంగీకరించడంతో రాష్ట్రాలు దిగివచ్చి.. జీఎస్టీకి మద్దతు తెలిపాయి. ప్రవేశ పన్నును జీఎస్టీలో కొనసాగించేందుకు అంగీకరించాయి. జీఎస్టీ అమలులోకి రావడం వల్ల రాష్ట్రాలకు కలిగే రెవెన్యూ నష్టాలను మూడేళ్ల పాటు భర్తీ చేసేందుకు, ఆ తర్వాత రెండేళ్ల కాలానికి కొంత మొత్తాన్ని పరిహారంగా చెల్లించేందు కేంద్రం ఒప్పుకుంది. కొత్త పన్నుల విధానం 2016 ఏప్రిల్ నుంచి అమలులోకి రానుంది. -
జీఎస్టీ బిల్లుపై ఏకాభిప్రాయం
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభనకు తెర జీఎస్టీ నుంచి పెట్రోలియం ఉత్పత్తులకు మినహాయింపు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు న్యూఢిల్లీ: ప్రతిపాదిత వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. సోమవారం నాటి చర్చల్లో జీఎస్టీ నుంచి పెట్రోలియంను మినహాయించేందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఈ అంశంలోనే బిల్లును వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు దిగివచ్చి.. జీఎస్టీకి మద్దతు తెలిపాయి. ప్రవేశ పన్నును జీఎస్టీలో కొనసాగించేందుకు అంగీకరించాయి. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లు పార్లమెంట్ ముందుకు రావడానికి మార్గం సుగమమైంది. అయితే ఈ బిల్లును మొదట కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంది. కొత్త పన్నుల విధానం 2016 ఏప్రిల్ నుంచి అమలులోకి రానుంది.సోమవారం పంజాబ్, హరియాణా, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చర్చలు జరిపారు. జీఎస్టీ బిల్లుపై ఏకాభిప్రాయం కుదిరింది. పెట్రోలియం ఉత్పత్తులను కొన్నేళ్ల పాటు జీఎస్టీ బిల్లు నుంచి మినహాయించడానికి ఏకాభిప్రాయం కుదిరిందని, కొత్త పన్నుల విధానంలో దీన్ని చేర్చే అంశంపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జీఎస్టీ అమలులోకి రావడం వల్ల రాష్ట్రాలకు కలిగే రెవెన్యూ నష్టాలను మూడేళ్ల పాటు భర్తీ చేసేందుకు, ఆ తర్వాత రెండేళ్ల కాలానికి కొంత మొత్తాన్ని పరిహారంగా చెల్లించేందు కేంద్రం అంగీకరించినట్టు తెలిపాయి. -
ఏకతాటిపైకి ఎన్డీఏయేతర పక్షాలు..!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలే వేదికగా వ్యూహం ⇒ జీఎస్టీ, బీమా వంటి కీలక బిల్లులు అడ్డుకునే దిశగా విపక్షాలు ⇒ బీమా బిల్లుపై ప్రతిపక్షాలకు మద్దతు తెలిపిన శివసేన సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలే వేదికగా ఎన్డీఏయేతర పక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార పక్షానికిమూకుమ్మడిగా చెక్ పెట్టాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. సాధారణ ఎన్నికలు మొదలుకుని ఇటీవల ముగిసిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకూ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనంతో మిగిలిన రాజకీయ పార్టీలన్నీ దిక్కుతోచని పరిస్థితిలోపడ్డాయి. దీంతో బీజేపీ, ఎన్డీఏయేతర పక్షాలన్నీ ఒక్కతాటిపై నిలిచి పార్లమెంట్లో అందివచ్చిన సందర్భాల్లో బీజేపీని ముప్పుతిప్పలు పెట్టాలని యోచిస్తున్నాయి. మరోవైపు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న శివసేన బీమా బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలకు మద్దతు తెలపడం గమనార్హం. ఇప్పటికే రాజ్యసభలో 59, లోక్‌సభలో 8 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు బీమా చట్టం(సవరణ)బిల్లు-2008, కార్మిక చట్టం(ఫ్యాక్టరీస్యాక్ట్ అండ్అప్రెంటిస్ యాక్ట్), కోల్ మైన్స్ నేషనలైజేషన్ యాక్ట్, ఎన్ఆర్ఈజీఏ, భూసేకరణ చట్టం-2013 సవరణ.. వంటి కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టాలనుకుంటోంది. వీటిని సులభంగా పార్లమెంట్ గట్టెక్కించేందుకు ఎన్డీఏయేతర పక్షాలు సిద్ధంగా లేవు. బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు రాజ్యసభను అస్త్రంగా మలుచుకోవాలని విపక్షాలు భావిస్తున్నాయి. రాజ్యసభలో బీజేపీ బలం అంతంతే.. మొత్తం 250 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి 43 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ, ఎన్డీఏ సభ్యుల బలం 56 మాత్రమే. ఎన్డీఏయేతర పక్షాలన్నీ కలిస్తే వాటి బలం 128. వీటిలో కాంగ్రెస్‌కు 67 సీట్లు ఉండగా.. బీఎస్పీ(14), ఎస్పీ(10), ఐఎన్ఎల్డీ(1), జేడీ(యూ) (12), జేడీ(ఎస్)(1), టీఎంసీ(12), సీపీఐ(2), సీపీఎం(9) ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఏ బిల్లయినా విపక్షాలను కాదని నెగ్గడం ఆషామాషీ కాదు. బీమా బిల్లు ముఖ్యంగా కాంగ్రెస్ వైఖరిపై ఆధారపడి ఉంది. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభ సెలక్ట్ కమిటీ వద్ద పరిశీలనలో ఉంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. మరో కీలకమైన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) బిల్లు రాజ్యాంగ సవరణతో కూడుకున్నందున దీనికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. దీన్ని కూడా విపక్షాలు అడ్డుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏఐఏడీఎంకే, ఎన్సీపీ,బీజేడీలకుదగ్గరయ్యేఅవకాశాలున్నాయి. బ్లాంక్ చెక్ ఇవ్వబోం: కాంగ్రెస్ బీమా బిల్లు, జీఎస్టీ బిల్లులపై ప్రభుత్వానికి బ్లాంక్ చెక్ మాదిరిగా మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ సోమవారం స్పష్టం చేసింది. జీఎస్టీ బిల్లు యూపీఏ హయాంలో తీసుకొచ్చిందే అని, దానికి మార్పులు చేసినట్లయితే తాము మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ స్పష్టం చేశారు. బీమా బిల్లుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. జేడీయూ, తృణమూల్ కూడా బీమా బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం తాము సూచించిన సవరణలను అంగీకరిస్తే బీమా బిల్లును వ్యతిరేకించబోమన్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామి శివసేన బీజేపీకి షాక్ ఇచ్చింది. తమ సవరణలు అంగీకరించనట్లయితే బీమా బిల్లును వ్యతిరేకిస్తామని శివసేన తెలిపింది. సజావుగా సాగేందుకు సహకరించండి: మోదీ న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఫలవంతంగా సాగుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రతిపక్షాలు తగిన సహకారం అందిస్తాయని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా పార్లమెంటు బయట ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడారు. ‘దేశ ప్రజలు మాకు ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను అప్పగించారు. అదే సమయంలో పార్లమెంటు సభ్యులందరికీ దేశాన్ని నడిపించే బాధ్యతను అప్పగించారు..’ అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలుసజావుగా సాగడంలో ప్రతిపక్షాలు బాగా సహకరించాయని మోదీ ప్రశంసించారు. అదే తరహాలో ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.