ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల బిల్లు (జీఎస్టీ బిల్లు) చట్టరూపం దాల్చింది. గత పదమూడేళ్లుగా ఆమోదానికి నోచుకోక చట్ట సభల్లోనే ఆగిపోయిన ఈ బిల్లును ఎట్టకేలకు పార్లమెంటు ఉభయ సభలతో పాటు ఇప్పటికే 16 రాష్ట్రాలు కూడా ఆమోదించడంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందింది.