జీఎస్‌టీృ2017 ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వెలగపూడి సచివాలయంలో సోమవారం
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
సాక్షి, అమరావతి: జీఎస్‌టీృ2017 ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వెలగపూడి సచివాలయంలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల వేతనాలను 50 శాతం పెంచాలని గతంలో మంత్రుల బృందం చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది.
2010 పీఆర్సీ ప్రకారం ప్రస్తుతం జీతాలు అం దుకుంటూ రూ.12 వేల కంటె తక్కువ వేత నం పొందుతున్న వారికి ఈ పెంపు వర్తిస్తుం ది. ఈ విధానం ప్రకారం కనీస వేతనం రూ.12 వేలు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దీంతోపాటు పలు శాఖల్లో పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.