Ministerial conference
-
Omicron ఎఫెక్ట్.. కీలక భేటీ నిరవధిక వాయిదా!
ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త గుబులుతో ఉడికిపోతోంది. బీ.1.1.529 కరోనా వేరియంట్‌పై ప్రపంచ దేశాల ఆందోళన పెరిగిపోతోంది. వ్యాక్సిన్లకు సైతం తలొగ్గని ఒమిక్రాన్ మొండి వేరియంట్ కావడంతో పలు దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ప్రయాణాలపై నిషేధం, ఆంక్షలు తెర మీదకు వస్తున్నాయి. వచ్చే వారం జెనీవాలో డబ్ల్యూటీవో మినిస్టీరియల్(ఎంసీ12) కాన్ఫరెన్స్ జరగాల్సి ఉంది. అయితే కొత్త వేరియెంట్ ఠారెత్తిస్తున్న తరుణంలో ఈ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్లకొకసారి జరిగే ఎంసీ12 భేటీలో మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రపంచంలో 98 శాతం వాణిజ్యాన్ని సమీక్షించే డబ్ల్యూటీవోలో 164 మంది సభ్యులు ఉన్నారు. ఇక నవంబర్ 30 డిసెంబర్ 3 మధ్య వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎంసీ12 సమావేశం జరగాల్సి ఉంది. అయితే స్విస్ ప్రభుత్వం శుక్రవారం నుంచి అంతర్జాతీయంగా ట్రావెల్ బ్యాన్ ప్రకటించింది. ముఖ్యంగా సౌతాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం ఇతర దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలను నిషేధించింది. ఈ నేపథ్యంలోనే భేటీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది WTO. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు వెలుగుచూశాక.. త్వరలో జరగాల్సిన కీలక సమావేశాలు, అంతర్జాతీయ సదస్సులు చాలానే వాయిదా పడ్డాయి. చదవండి: ఆ మార్కెట్లో మళ్లీ కరోనా కలకలం -
జీఎస్టీ బిల్లుకు ఆమోదం
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం సాక్షి, అమరావతి: జీఎస్‌టీృ2017 ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వెలగపూడి సచివాలయంలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల వేతనాలను 50 శాతం పెంచాలని గతంలో మంత్రుల బృందం చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. 2010 పీఆర్సీ ప్రకారం ప్రస్తుతం జీతాలు అం దుకుంటూ రూ.12 వేల కంటె తక్కువ వేత నం పొందుతున్న వారికి ఈ పెంపు వర్తిస్తుం ది. ఈ విధానం ప్రకారం కనీస వేతనం రూ.12 వేలు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దీంతోపాటు పలు శాఖల్లో పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. -
ఆలన లేని పాలన!
♦ సొంత వ్యవహారాలపైనే జిల్లా మంత్రులకు శ్రద్ధ ♦ ఇన్చార్జి మంత్రి తీరూ అలాగే ఉంటే ఎలా? ♦ గంటా, అయన్నలతోపాటు యనమలపై సీఎం ఆగ్రహం ♦ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగించుకోలేదని చివాట్లు ♦ మంత్రివర్గ సమావేశంలోనే ముగ్గురికీ తలంటు ‘సొంత వ్యవహారాలే తప్ప.. పాలనను పట్టించుకోరు.. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ఏం లాభం?.. వారు సరే.. మరి ఇన్చార్జి మంత్రి ఏం చేస్తున్నట్లు??.. ఒక్కసారైనా జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారా!.. ఎమ్మెల్యేల కష్టసుఖాలు తెలుసుకున్నారా!!.. ఇలా అయితే కష్టం. తీరు మార్చుకోకపోతే.. నా నిర్ణయం నేను తీసుకుంటాను’.. ఇదీ మంత్రులు గంటా, అయ్యన్న, యనమలలకు సీఎం చంద్రబాబు తలంటిన విధం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చోటుచేసుకున్న ఈ సంఘటన చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘మీ సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారు. విశాఖ జిల్లా మంత్రులే కాదు ఇన్చార్జి మంత్రీ అలాగే ఉన్నారు. ఇలా అయితే కష్టం’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులతోపాటు ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజవాయడలో శనివారం నిర్వహించిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో సీఎం ఇలా సూటిగా మొట్టికాయలు చేయడం విశేషం. ప్రధానంగా ఉపాధి హామీ పథకం అమలు తీరు సక్రమంగా లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలు, ఇన్చార్జి మంత్రి యనమలను జిల్లా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అడ్డుకుంటున్న తీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకునే మంత్రివర్గ సమావేశంలో మంత్రులను సున్నితంగానైనా సూటిగా మందలించారు. ఉపాధి హామీ అమలు ఇలాగేనా! ఉపాధి హామీ పథకం నుంచి గరిష్ట ప్రయోజనం లభించేలా చూడటంలో మంత్రులు అయ్యన్న, గంటా, యనమల విఫలయమ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకంలో లేబర్, మెటీరియల్ కాంపోనెంట్లు 60 : 40 నిష్పత్తిలో ఉండొచ్చు. కానీ మెటీరియల్ కాంపోనెంట్‌ను అవకాశం ఉన్నంతవరకు ఉపయోగించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అంగన్వాడీ భవనాలు, సామాజిక భవనాలు, ఇతర పనులు చేపట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ మంత్రుల అశ్రద్ధ వల్ల సాధ్యం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు గంటా, అయ్యన్నలు జిల్లా పరిపాలనా వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని సూటిగానే వ్యాఖ్యానించారు. ‘మీరిద్దరూ మీ సొంత వ్యవహారాలే చూసుకుంటున్నారు. పాలనను పట్టించుకోవడం లేదు. దాంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే నా నిర్ణయం నేను తీసుకుంటాను’ అని స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్చార్జ్ మంత్రి ఏం చేస్తున్నట్లు!? జిల్లా మంత్రులే కాదు.. ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఏమీ పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు జిల్లాలో పాలనా వ్యవహారాలను ఇన్చార్జి మంత్రిగా ఎందుకు సమీక్షించ లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో సమన్వయం లేకపోవడాన్ని ప్రస్తావించారు. జిల్లా మంత్రులు ఎలాగూ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు.. ఇన్చార్జి మంత్రీ అలాగే ఉంటే ఎలా అని నిలదీశారు. మంత్రివర్గ సమావేశంలో ముగ్గురు మంత్రులపై సీఎం ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. -
‘హై-క’ అభివృద్ధే లక్ష్యంగా నేడు గుల్బర్గాలో అసెంబ్లీ
బెంగళూరు : హైదరాబాద్-కర్ణాటక ప్రాంత సమగ్ర అభివృద్ధే ముఖ్య అజెండాగా శుక్రవారం గుల్బర్గాలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతమైన హై-క అభివృద్ధిపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గుల్బర్గాలోని కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇక హై-క ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఇక్కడ సాగు, తాగునీటి వనరుల కల్పన, పరిశ్రమల ఏర్పాటుకు అందజేయాల్సిన సాయం తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. హై-క ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు గాను 371(జె) ప్రకారం ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించినప్పటికీ, ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అమల్లోకి రాకపోవడంతో ఇక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఇక హై-క అభివృద్ధి మండలికి రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో పాటు ఇప్పటికే విడుదలైన నిధులను సైతం సరిగ్గా వినియోగించలేదు. ఈ కారణంగా ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని పోగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక మంత్రి వర్గ సమావేశ నిర్వహణ కోసం గుల్బర్గాకు వస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఆయన మంత్రి వర్గ సహచరులకు ఘన స్వాగతం పలికేందుకు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. గుల్బర్గా నగరాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ జెండా లు, కాంగ్రెస్ నాయకుల కటౌట్లతో కాంగ్రెస్ శ్రేణులు నింపేశాయి. కాగా చెరుకు మద్దతు ధరకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రైతులు ఈ మంత్రి వర్గ సమావేశాన్ని అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గుల్బర్గాలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఇందుకు గాను బెంగళూరు నుంచి ప్రత్యేక బలగాలను రప్పించి గుల్బర్గాలో మోహరించారు. -
సమాచారం లేకుండానే కేబినెట్‌కు వస్తారా?
-
సమాచారం లేకుండానే కేబినెట్‌కు వస్తారా?
సాక్షి, హైదరాబాద్: సరైన సమాచారం లేకుండా మంత్రివర్గ సమావేశానికి ఎలా వస్తారంటూ వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆ శాఖ అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విశ్వసనీ యవర్గాల సమాచారం ప్రకారం.. మంగళవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రాథమిక మిషన్‌పై సీఎం సమీక్షించారు. గతంలో నిర్ణయించిన విధంగా ఏపీ ప్రభుత్వం, ఇక్రిశాట్ల మధ్య ఒప్పందం జరిగిందా అని మంత్రి పుల్లారావును, అధికారులను ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. ‘‘ఇక్రిశాట్ అంతర్జాతీయ సంస్థ. అది మన వద్దకు రాదు. మనమే వెళ్లాలి. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలవుతున్నా మీ శాఖలో ఏం జరుగుతోందో కూడా తెలుసుకోకపోతే ఎలా’’ అని ప్రశ్నించారు. వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించకపోవడాన్ని సీఎం ప్రశ్నించగా.. తాము పంపిన ప్రతిపాదనలకు ఆర్ధిక శాఖ అనుమతులు ఇవ్వలేదని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో సీఎం ఆర్థిక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తెలియకుండా ఇసుకను విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చిన అధికారిపై చర్య లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని అధికారులను సస్పెం డ్చేయాలని చెప్పారు. ఇసుక రీచ్‌లను డ్వాక్రా మహిళలకు కేటాయించినా వారికి తగినంత ఆదాయం రావడంలేదని పలువురు మంత్రులు చెప్పారు. డ్వాక్రా సంఘాలకు రీచ్‌ల కేటాయింపుపై పునరాలోచించాలని కోరారు. దీనికి సీఎం స్పందిస్తూ.. కొద్ది రోజుల క్రితమే రీచ్‌లను మహిళలకు కేటాయించినందున, మరికొన్ని రోజుల తరువాత సమీక్షించి, నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అర్హులైన వారికి అనేక మందికి పింఛన్లు రావడంలేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి కె.అచ్చన్నాయుడు తదితరులు ఫిర్యాదు చేశారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ.. పింఛన్లలో కోత విధించమని ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని చెప్పారు. నిబంధనలను మాత్రం మార్చేది లేదని స్పష్టం చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. -
కేబినెట్ భేటీలో ఎంపీలు, సలహాదార్లా!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశ నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో మం త్రులు కాని వారు ఎవరూ కూర్చోకూడదు. అంశాల చర్చ సమయంలోనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సైతం మంత్రివర్గ సమావేశంలోకి వె ళ్తారు. ఆ అంశంపై చర్చ అయిపోగానే వారు కూడా మంత్రివర్గ సమావేశం నుంచి వెళ్లిపోతారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి మాత్రమే మంత్రివర్గ సమావేశంలో అజెండా పూర్తయ్యేవరకు ఉంటారు. అయితే సీఎం చంద్రబాబు మంత్రులు కాని వారిని మంత్రివర్గ సమావేశంలో కూర్చోపెట్టి చర్చలు సాగిస్తున్నారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌తో పాటు మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ను కూడా మంత్రివర్గ సమావేశంలో కూర్చోపెడుతున్నారు. ఏదైనా అంశం వచ్చినప్పుడు సంబంధిత సలహాదారులను పిలిచి మాట్లాడటంలో తప్పులేదని, అలా కాకుండా మంత్రివర్గ సమావేశం ముగిసేవరకు ఎంపీలు, సలహాదారులు కూర్చోవడంపట్ల సీనియర్ ఐఏఎస్ అధికారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఎంపీలు, సలహాదారు లు చర్చల్లో పాల్గొనడం, జోక్యం చేసుకోవటంపై సీనియర్ మంత్రులు నిర్ఘాంతపోతున్నారు. ఈ విషయమై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎంపీలను, సలహాదారులను మంత్రివర్గ సమావేశానికి అనుమతించలేదని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు లేక్‌వ్యూ అతిథి గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఇకపై ప్రతి బుధ, గురువారాల్లో సీఎం జిల్లాల్లో పర్యటిస్తారని అధికారవర్గాలు పేర్కొ న్నాయి. ఈ పర్యటనకు 15, 16 తేదీల్లో ఆయన ఉభయగోదావరి జిల్లాల్లో శ్రీకారం చుట్టనున్నారు.