ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త గుబులుతో ఉడికిపోతోంది. బీ.1.1.529 కరోనా వేరియంట్‌పై ప్రపంచ దేశాల ఆందోళన పెరిగిపోతోంది. వ్యాక్సిన్‌లకు సైతం తలొగ్గని ఒమిక్రాన్ మొండి వేరియంట్ కావడంతో పలు దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ప్రయాణాలపై నిషేధం, ఆంక్షలు తెర మీదకు వస్తున్నాయి.
వచ్చే వారం జెనీవాలో డబ్ల్యూటీవో మినిస్టీరియల్(ఎంసీ12) కాన్ఫరెన్స్ జరగాల్సి ఉంది. అయితే కొత్త వేరియెంట్ ఠారెత్తిస్తున్న తరుణంలో ఈ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్లకొకసారి జరిగే ఎంసీ12 భేటీలో మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రపంచంలో 98 శాతం వాణిజ్యాన్ని సమీక్షించే డబ్ల్యూటీవోలో 164 మంది సభ్యులు ఉన్నారు.
ఇక నవంబర్ 30 డిసెంబర్ 3 మధ్య వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎంసీ12 సమావేశం జరగాల్సి ఉంది. అయితే స్విస్ ప్రభుత్వం శుక్రవారం నుంచి అంతర్జాతీయంగా ట్రావెల్ బ్యాన్ ప్రకటించింది. ముఖ్యంగా సౌతాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం ఇతర దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలను నిషేధించింది. ఈ నేపథ్యంలోనే భేటీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది WTO. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు వెలుగుచూశాక.. త్వరలో జరగాల్సిన కీలక సమావేశాలు, అంతర్జాతీయ సదస్సులు చాలానే వాయిదా పడ్డాయి.
చదవండి: ఆ మార్కెట్‌లో మళ్లీ కరోనా కలకలం
Comments
Please login to add a commentAdd a comment