World Trade Organization
-
డబ్ల్యూటీవో అంతర్థానానికి నాంది?
అబూ ధాబీలో ఇటీవల ముగిసిన ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రివర్గ సమావేశం (ఎంసీ 13) పెద్దగా సాఫల్యతలు లేకుండానే ముగిసింది. భారత్ లాంటి దేశాలకు ముఖ్యమైన మత్య్స రాయితీల అంశంలో, ప్రభుత్వాలు నిల్వచేసే ఆహార ధాన్యాల అంశంలో ఏ విధమైన పరిష్కారాలనూ కనుగొనలేదు. పైగా వివాదాల పరిష్కారం కోసం ఉద్దేశించిన అప్పిలేట్ బాడీ పునరుద్ధరణకు అమెరికా ససేమిరా అంది. అదే జరిగితే మళ్లీ ‘గాట్’ రోజులకు తిరిగి మరలాల్సి ఉంటుంది. ఇక, డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే ఆ దేశం ఏకంగా డబ్ల్యూటీవో నుంచే నిష్క్రమించినా ఆశ్చర్యం లేదు. 166 సభ్య దేశాలున్న ఈ సంస్థ ఉనికి ఇప్పటికే ప్రశ్నార్థకంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తన ఒప్పందాల విషయంలో త్వరపడాలి. అబూ ధాబీలో (ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 2 వరకు) జరిగిన మరో డబ్ల్యూటీవో (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) మంత్రివర్గ సమావేశం ఎలాంటి ఆసక్తిని రేకెత్తించకుండానే ముగిసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన విధులు,అంటే చర్చల పనివిధానం, వివాద పరిష్కార పనితీరు గత కొంత కాలంగా స్తంభించిపోయాయి. ఇప్పటికే సమస్యల్లో ఉన్న ఈసంస్థకు చెందిన 166 సభ్యదేశాల్లో బలమైన విభజనలు పెంచేలా, ఈ రెండింటినీ పునరుద్ధరించే ప్రయత్నాలు ఫలించలేదు.అబూ ధాబీలో జరిగిన 13వ మంత్రివర్గ సమావేశం (ఎంసీ 13)లో డబ్ల్యూటీఓ సభ్యులకు నాలుగు ప్రధాన సవాళ్లు ఎదుర య్యాయి. ఒకటి, మత్స్య రాయితీలపై అంతుచిక్కని బహుపాక్షిక ఒప్పందాన్ని ఎలా ముగించాలి? రెండు, అప్పీలేట్ బాడీని ఎలా పున రుద్ధరించాలి? తద్వారా వివాద పరిష్కార యంత్రాంగంగా డబ్ల్యూ టీఓ కిరీటంలో ఆభరణంగా ఉన్న దాని ఖ్యాతిని తిరిగి ఎలా పున రుద్ధరించాలి? మూడు, భారతదేశంతోపాటు అనేక ఇతర దేశాలు డిమాండ్ చేస్తున్న ఆహార భద్రతకు సంబంధించిన పబ్లిక్ స్టాక్‌హోల్డింగ్ (ఆహార భద్రత కోసం ధాన్యాన్ని ప్రభుత్వం నిల్వచేయడం) సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఎలా పొందాలి? చివరగా, పరిశ్రమ కోరుతున్న ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ లపై కస్టమ్స్ డ్యూటీకి సంబంధించిన మారటోరియం పొడిగింపును ఎలా నిర్ధారించాలి? ఇందులో ఉన్న ఆదాయ నష్టం కారణంగా కొన్ని ప్రభుత్వాలు (భారత్ వంటివి) దీన్ని ఇష్టపడలేదు. కొన్ని ఇతర సమస్యలు కూడా ఉన్నా, ఇవి ఎంసీ 13 కోసం ప్రధాన అజెండా అయ్యాయి. మత్స్యకారులకు సబ్సిడీలపై బహుపాక్షిక ఒప్పందం గత మంత్రి వర్గ సమావేశంలో పాక్షికంగా ముగిసింది. ఇది అమల్లోకి వచ్చేలా ఈ ఎంసీ 13లో పూర్తి చేయవలసి ఉంది. కానీ ఈ సందర్భంలో,సంధానకర్తలు ఏదీ సాధించలేకపోయారు. భారత్ సమానత్వంకోసం, న్యాయం కోసం పోరాడింది. దీనివల్లే యూరోపియన్ యూని యన్ సంధానకర్త ఒకే ఒక్క దేశం (భారత్) దీనికి తన సమ్మతిని నిలిపి వేసినట్లు చెప్పారు. ఇది నిజమే అయినప్పటికీ, భారత్ తన మత్స్య కారుల జీవనోపాధి కోసం మంజూరు చేస్తున్న సబ్సిడీలను యూరో పియన్ యూనియన్, జపాన్, చైనా, తైవాన్ లు ఇస్తున్న భారీ సబ్సి డీలతో సమానం చేయడం అసంబద్ధం. భారత్ 25 ఏళ్ల సమ యాన్ని కోరింది. ఇది కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ మన లాంటి సమాఖ్య నిర్మాణంలో, మనం నెమ్మదిగా మాత్రమే త్వర పడగలము! ఎన్నికల సంవత్సరం కూడా అయినందువల్ల మత్స్య కారుల ప్రయో జనాలను గట్టిగా కాపాడటం తప్ప, ఇంకేదీ ప్రభుత్వం చేయలేక పోయింది. మన రైతులకు కూడా ఇదే వర్తిస్తుంది. పబ్లిక్ స్టాక్‌హోల్డింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటామని భారత్ లాంటి దేశాలకు ప్రకటించిన నిబద్ధతను ప్రపంచ వాణిజ్య సంస్థ నిలుపు కోలేదు. సమస్యంతా మార్కెట్ ప్రాప్యతతో దీన్ని లింక్ చేయాలని పట్టుబట్టిన అభివృద్ధి చెందిన దేశాలతోనూ, కెయిర్న్స్ గ్రూప్ తోనూ (19 వ్యవసాయ సంబంధ ఎగుమతి దేశాల గ్రూప్) ఉంది. పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ అనేది తీవ్రమైన పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించే స్థిరమైన అభివృద్ధి లక్ష్యంతో ముడిపడిన ఒక తీవ్రమైన అంశం. దీనిని మార్కెట్ యాక్సెస్‌కు తాకట్టు పెట్టడం అన్యాయం, అధర్మం కూడా. అంతిమ పరిణామం ఏమిటంటే, ఎంసీ 13 ఈ సమస్యపై పురోగతి సాధించడంలో విఫలమైంది. అప్పిలేట్ బాడీ పునరుద్ధరణ గురించిన కథ సైతం భిన్నంగా ఏమీ లేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక్క సభ్యదేశం, అంటే అమెరికా మాత్రమే దానిపై అభ్యంతరం వ్యక్తం చేయడమే గాక, దానిమీదే భీష్మించుకుని కూర్చుంది. అమెరికన్ ఎన్నికల వల్ల దీనికి అదనపు అనిశ్చితి కూడా తోడైంది. డోనాల్డ్ ట్రంప్ గనక విజయం సాధిస్తే, అన్నీ ముగిసిపోతాయి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా అప్పీలేట్ బాడీ పునరుద్ధరణను అడ్డుకోవడమే కాకుండా ఏకంగా డబ్ల్యూటీఓ నుండే మొత్తంగా వైదొలిగినా ఆశ్చర్యం లేదు. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే. మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైన ఈ ఎంసీ 13 సమావేశం, ఎలక్ట్రానిక్ ప్రసారాలకు సంబంధించిన కస్టమ్స్ డ్యూటీ నిలుపుదలను కేవలం రెండేళ్లపాటు పొడిగించగలిగింది. అలా జరగకుండా అడ్డుకోవాలనే పట్టుదలతో ఉన్న భారత్... యూఏఈ వాణిజ్య మంత్రి నుంచి వచ్చిన వ్యక్తిగత అభ్యర్థన మేరకు చివరి నిమిషంలో అంగీకరించినట్లు భారత వాణిజ్య మంత్రి ద్వారా స్పష్టం చేసింది.ఎంసీ 13 ఎదుర్కొన్న ఇతర ప్రధాన సమస్య ఏమిటంటే, బహుపాక్షిక చర్చల కార్యక్రమాలతో ఎలా వ్యవహరించాలి అనేదే. ఒక విషయం చాలా ముఖ్యమైనది: అదేమిటంటే, 100 దేశాల మద్దతుతో జరిగిన చైనా నేతృత్వంలోని పెట్టుబడి సులభ తర అభివృద్ధి ఒప్పందం. కానీ ప్రతి డబ్ల్యూటీవో సభ్యదేశ ఏకాభిప్రాయాన్ని పొందనందున, దీన్ని సూత్రప్రాయంగా భారత్, దక్షిణాఫ్రికా వ్యతిరేకించాయి. చైనా ఈ పరిణామాన్నిఊహించి ఉండాల్సింది. దీంతో బహుపాక్షిక వేదికలలో చైనా–భారత సన్నిహిత సహకార యుగం ముగింపు దశకు చేరుకుందని నిర్ధారించవచ్చు. ‘బ్రిక్స్’ సమూహానికి ఇది ఎలాంటి చిక్కులను కలిగిస్తుందో చూడాలి.కాబట్టి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, ఎంసీ 13లో వచ్చిన ఫలితాలు స్వల్పం. కొన్ని తాత్కాలిక నిర్ధారణలుగా వీటిని తీసుకోవచ్చు: ఒకటి, ప్రపంచ వాణిజ్య సంస్థకు నిజమైన బహుపాక్షిక(మల్టీలేటెరల్) సంస్థగా ఉజ్వల భవిష్యత్తు లేదు. కాబట్టి, అది బహుముఖంగా(ప్లూరీలేటెరల్) మారుతుందా? అలా అయితే, భారత్ దాన్ని ఎలా చూస్తుంది? రెండు, యథాతథ స్థితిని సూచించే అప్పీలేట్ బాడీ పునరుద్ధరణకు అమెరికా అంగీకరించే అవకాశం కని పించడం లేదు. బదులుగా మనం కేవలం ఒకే–దశ ప్యానెల్ విధానంతో సాగిన ‘గాట్’ (పన్నులు, సుంకాలపై సాధారణ ఒప్పందం) తరహా పాత చెడ్డ రోజులకు తిరిగి మరలవచ్చు. అదే జరిగితే, భారత్ దానిని ఎలా ఎదుర్కొంటుంది? చివరగా, ప్రపంచ వాణిజ్య సంస్థను పునరుజ్జీవింపజేసే స్వల్ప అవకాశాలను దృష్టిలో ఉంచుకుని,ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్, గల్ఫ్ సహకార మండలి (జీసీసీ)తో తన కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల విష యంలో భారత్ త్వరపడాలి. ఈ విషయంలో సమయాన్ని వృథా చేసే ప్రసక్తే లేదు, మే నెలలో వచ్చే కొత్త ప్రభుత్వం దీన్నొక ప్రాధాన్యతగా దృష్టి సారించాల్సి ఉంది.భారత వ్యూహాత్మక/విదేశీ విధాన చర్చలకూ, దాని వాణిజ్య విధాన చర్చలకూ మధ్య కొంత వ్యత్యాసం కూడా ఉంది. మనం అనతి కాలంలోనే ఏడు లేదా పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారతాం అనే ఊహపై మన వ్యూహాత్మక చర్చలు ఆధారపడి ఉన్నాయి. అయితే ప్రస్తుత వాణిజ్య విధాన ప్రక్రియ కేవలం రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకే సరిపోతుంది! ఈ అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది. మే నెలలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం వ్యవసాయం, భూమి, కార్మికులు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో లోతైన, నిర్మాణాత్మకమైన సంస్కరణలను చేపట్టడం దీనికి ఒక మార్గం. ఇది భారత్‌ను పెద్ద ఆర్థిక కూటమిలోకి చేరేలా సాయపడుతుంది. - వ్యాసకర్త మాజీ రాయబారి, డబ్ల్యూటీవోలో భారత అనుసంధానకర్త (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) - మోహన్ కుమార్ -
మళ్లీ ‘ప్లస్’లోకి.. ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు అక్టోబర్‌లో (2022 ఇదే నెలతో పోల్చి) 6.21 శాతం పెరిగాయి. విలువలో 33.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెపె్టంబర్లో 2.6 శాతం క్షీణించాయి. తాజా సమీక్షా నెల అక్టోబర్‌లో మళ్లీ సానుకూల ఫలితం వెలువడింది. 2023లో ప్రపంచ వాణిజ్యవృద్ధి కేవలం 0.8 శాతంగా ఉంటుందన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిరాశాపూరిత వాతావరణం, భారత్ విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. వాణిజ్యలోటు 31.46 బిలియన్ డాలర్లు ఇక దేశ వస్తు దిగుమతుల విలువ ఎగువబాట పట్టింది. 2022 డిసెంబర్ నుంచి 2023 సెపె్టంబర్ వరకూ వరుసగా 10 నెలల క్షీణతలో ఉన్న దిగుమతుల విలువ అక్టోబర్‌లో 12.3 శాతం పెరిగి 65.03 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సమీక్షా నెల్లో 31.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది కొత్త రికార్డు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► అక్టోబర్‌లో పసిడి దిగుమతులు 95.5 శాతం పెరిగి 7.23 బిలియన్ డాలర్లకు చేరాయి. ► చమురు దిగుమతుల బిల్లు 8 శాతం ఎగసి 17.66 బిలియన్ డాలర్లుగా ఉంది. ► మొత్తం 30 కీలక రంగాల్లో 22 రంగాల్లో ఎగుమతులు సానుకూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. వీటిలో ముడి ఇనుము, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఫార్మా, ఎల్రక్టానిక్ గూడ్స్, కార్పెట్, ప్లాస్టిక్, మెరైన్, ఇంజనీరింగ్ గూడ్స్ ఉన్నాయి. ఏప్రిల్–అక్టోబర్ మధ్య క్షీణ గణాంకాలే.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 7% క్షీణించి 244.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.95% క్షీణించి 391.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు ఈ 7 నెలల్లో 147.07 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ కాలంలో పసిడి దిగుమతులు 23% పెరిగి 29.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ దిగుమతుల బిల్లు మాత్రం 18.72% తగ్గి 100 బిలియన్ డాలర్లకు చేరింది. -
కంప్యూటర్ల దిగుమతి ఆంక్షలపై ఆందోళన
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపై దిగుమతి ఆంక్షలు విధించాలన్న భారత్ నిర్ణయంపై అమెరికా, చైనా, కొరియా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సమావేశంలో ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయని ఓ అధికారి తెలిపారు. నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత భారత్‌కు అమెరికా చేసే ఎగుమతులతో సహా ఈ ఉత్పత్తుల వాణిజ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా పేర్కొన్నట్టు జెనీవాకు చెందిన అధికారి వెల్లడించారు. భారత నిర్ణయం ఎగుమతిదారులు, అంతిమ వినియోగదా రులకు అనిశి్చతిని సృష్టిస్తోందని అమెరికా పేర్కొంది. అయితే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం గత వారం స్పష్టం చేసింది. దిగుమతులను కేవలం పర్యవేక్షిస్తామని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ వెల్లడించారు. ల్యాప్టాప్స్, టాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను నవంబర్ 1 నుండి లైసెన్సింగ్ విధానంలో ఉంచుతామని 2023 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
G20 Summit: వృద్ధి విధానాలకు మద్దతు
న్యూఢిల్లీ: అందరికీ వృద్ధి, శ్రేయస్సు కారకాలుగా పనిచేయడానికి వాణిజ్యం, పెట్టుబడిని అనుమతించే విధానాలకు మద్దతు ఇవ్వాలని జీ–20 సభ్య దేశాలు అంగీకరించాయి. ‘ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కేంద్రంగా ఉన్న నిబంధనల ఆధారంగా వివక్షత లేని, న్యాయ, బహిరంగ, కలుపుకొని, సమాన, స్థిర, పారదర్శక బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థ అనివార్యం’ అని జీ–20 వేదికగా నాయకులు ప్రకటించారు. రక్షణవాదం, మార్కెట్‌ను వక్రీకరించే పద్ధతులను నిరుత్సాహపరచడం ద్వారా అందరికీ అనుకూల వాణిజ్యం, పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించడానికి న్యాయమైన పోటీ వాతావరణాన్ని సృష్టించాలన్న నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. 2024 నాటికి సభ్యులందరికీ అందుబాటులో ఉండేలా పూర్తి, మెరుగ్గా పనిచేసే వివాద పరిష్కార వ్యవస్థను కలిగి ఉండాలనే ఉద్దేశంతో చర్చలు నిర్వహించడానికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. వాణిజ్యం, పర్యావరణ విధానాలు ప్రపంచ వాణిజ్య సంస్థ, పర్యావరణ ఒప్పందాలకు అనుగుణంగా పరస్పరం మద్దతునిచ్చేవిగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
జన్యుమార్పిడి పంటలకు ఊతమా?
భారత్‌కు వ్యతిరేకంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో అమెరికా ఫిర్యాదు చేసింది. బియ్యం, ఆపిల్లతోపాటు అన్ని రకాల జన్యుమార్పిడి ఆహార దిగుమతు లపై భారత్ నియంత్రణలు విధించడాన్ని ప్రశ్నించింది. జన్యుమార్పిడి ఆవాల పంటకు ‘పర్యావరణ అనుమతులు’ మన దేశంలో ఇచ్చినప్పుడే ఈ పరిణామాలు జరగడం గమనార్హం. సురక్షితం కాని జన్యుమార్పిడి ఆహార దిగుమతులను అనుమతించేలా మన చట్టాలను మార్చుకోమని బలవంత పెట్టడం కంటే... తమ దేశ వ్యవసాయ రంగాన్ని అమెరికా ఎందుకు సరిచేసుకోదు? క్యాన్సర్ కారకమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్డిమందుల విషయంలోనూ అమెరికా వైఖరి ఇదే. తమకు జన్యుమార్పిడి మొక్కజొన్న వద్దని మెక్సికో కరాఖండీగా చెప్పింది. అంత స్పష్టత మన దేశానికీ ఉండాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు జన్యు మార్పిడి పంటల దిగుమతికి అనుమతిచ్చేలా అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆహారంపై ‘జన్యుమార్పిడి పంటలు కాదు’ అన్న లేబుల్ తగిలించాలని భారత్ డిమాండ్ చేస్తూండటం అమెరికా వ్యవసాయ ఎగుమతులకు నష్టం కలిగి స్తోందని అమెరికా ఫిర్యాదు. ఈ పరిణామాలన్నీ భారత పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జన్యుమార్పిడి ఆవాల పంటకు ‘పర్యావరణ అనుమతులు’ ఇచ్చినప్పుడే జరగడం గమనార్హం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో అమెరికా ఫిర్యాదు చేసింది ఒక్క భారతదేశంపై మాత్రమే కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు జన్యు మార్పిడి పంటలు, దిగుమతులు, టెక్నాలజీపై నిషేధం తొలగించేలా చేసేందుకు అమెరికా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. యూరో పియన్ యూనియన్‌తోపాటు ఇండియా, మెక్సికో, కెన్యా, ఇండోనేసి యాలను లక్ష్యంగా చేసుకుని పని చేస్తోంది. మెక్సికో అధ్యక్షుడు ఆడ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్పై అమెరికా పెట్టిన ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందంటే– తమకు జన్యు మార్పిడి మొక్కజొన్న అస్సలు వద్దు. స్వేచ్ఛాయుతమైన, సార్వభౌమ అధికారులున్న దేశం కావాలని కరాఖండీగా చెప్పేంత. గత ఏడాది మెక్సికో ఒక అధ్యక్ష ఉత్తర్వు జారీ చేస్తూ... జన్యుమార్పిడీ మొక్క జొన్నను దశలవారీగా తొలగిస్తామని స్పష్టం చేసింది. హానికారక గ్లైఫాసేట్ వాడకాన్ని కూడా 2024 నాటికి నిషేధిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయాల ప్రభావం అమెరికా నుంచి దిగుమతి అవుతున్న కోటీ డెబ్భై లక్షల టన్నుల మొక్కజొన్నలపై ఉంటుంది. మెక్సికో తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు మిగిలిన దేశాలు వ్యవహరించడం కష్టం. అశోకా యూనివర్సిటీ అసోసియేట్ అధ్యా పకుడు అనికేత్ ఆఘా ఇలాంటి వ్యవహారాన్ని వ్యవసాయ పెట్టుబడి దారీ విధానం అంటారు. కెన్యా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మోజెస్ కురియా చేసిన ప్రకటన అందరినీ నిర్ఘాంత పరిచింది. ‘‘ఈ దేశంలో ఉన్నామంటే చావుకు సిద్ధమైన వ్యక్తిగా ఉన్నట్లే. చావుకు పోటీ పడుతున్నవాటికి జన్యుమార్పిడి పంటలను కూడా చేర్చడం తప్పేమీ కాదు. అందుకే ఉద్దేశపూర్వకంగానే ఈ దేశంలోకి జన్యుమార్పిడి పంటలను అనుమతించాం’’ అన్నారు మోజెస్. ఆ తరువాత పదేళ్ల నిషేధాన్ని ఎత్తివేయడమే కాకుండా, ఆరు నెలలపాటు జీఎం మొక్క జొన్న, సాధారణ మొక్కజొన్నల దిగుమతులపై పన్నులను కూడా ఎత్తేశారు. ఈ ప్రకటన జరిగిన కొన్ని వారాల్లో 32 మంది సభ్యులున్న అమెరికా వాణిజ్య బృందం నైరోబీలో పర్యటించింది. మెక్సికో నిషేధం తరువాత అమెరికన్ రైతులపై ఉన్న జీఎం పంటల భారాన్ని కెన్యా కొంత భరిస్తుందని వారి నమ్మకం మరి. ఇండొనేసియా విషయానికొస్తే... అక్కడ వ్యవసాయ సంబంధిత సంఘాల తీవ్ర వ్యతిరేకత మధ్య అధ్యక్షుడు జోకో వైడోడో దేశంలో పడిపోతున్న సోయాబీన్ దిగుబడులు పెంచేందుకు జన్యుమార్పిడి పంటల సాగు చేపట్టాలనీ, అవసరమైతే జీఎం విత్తనాలను దిగుమతి చేసుకోవాలనీ అంటూండటం గమనార్హం. అసురక్షితమైన, ప్రమాదాలతో కూడిన జన్యుమార్పిడి ఆహారపు దిగుమతులను అనుమతించేలా మన చట్టాలను మార్చుకోమని అమెరికా బలవంత పెట్టడం కంటే... తమ దేశంలో వ్యవసాయ రంగాన్ని ఎందుకు సరిచేసుకోదు? అమెరికా తన ప్రజల కోసం జన్యుమార్పిడి పంటలను సాగు చేసుకోవాలనుకుంటే మనకేమీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ... ఎగుమతి అవసరాల కోసం సాధారణ బియ్యం, ఆపిల్లను సాగు చేయడం ఎందుకు మొదలుపెట్టదు? యూరోపియన్ యూనియన్, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు హానికారక జన్యుమార్పిడి పంటల నుంచి రక్షణకు చేసుకున్న ఏర్పాట్లను బలహీనపరచాలని అమెరికా ఎందుకు ఒత్తిడి చేస్తోంది? ఈ జన్యుమార్పిడి ఉత్పత్తులు గడ్డి మందులను తట్టుకోగలవు కాబట్టి. వీటిని వాడటం మొదలుపెడితే విషపూరిత మైన కీటకనాశినుల విక్రయాలు గణనీయంగా పెరుగుతాయి. భారత్‌లో 2002లో బీటీ కాటన్ ప్రవేశించింది మొదలు పత్తిపై చల్లే కీటకనాశినుల ఖర్చు హెక్టారుకు 37 శాతం పెరిగింది. సాధారణ మొక్కజొన్నల విషయంలో మెక్సికో డిమాండ్‌ను తాము తీర్చగలమని అమెరికాలోని రైతులు కొందరు ప్రకటించిన విషయాన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గుర్తుంచుకోవాలి. నిజానికి భారత్ కూడా అమెరికా నుంచి జన్యుమార్పిడి ఆహార దిగుమతులను అడ్డుకునే విషయంలో గట్టిగా నిలుస్తుందని భావిస్తున్నాను. అలా చేయగలిగితే సాధారణ పంటలవైపు మళ్లాల్సిందిగా అమెరికాలోని జీఎం రైతులకు ఒక స్పష్టమైన సందేశం పంపినట్లు అవుతుంది. ప్రపంచానికి కావాల్సింది కూడా అదే. పైగా అభివృద్ధి చెందుతున్న దేశాల భద్రత, ఆరోగ్యాన్ని కాపాడటం, ఆహార అవసరాలను తీర్చడం కంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు అమెరికా వాణిజ్య ప్రయో జనాలు తీర్చడం ముఖ్యం కాబోదు. తమకు ఏది అవసరం లేదో దాన్ని విస్పష్టంగా చెప్పే హక్కు ఆయా దేశాలకు ఉండాలి. ఈ అంశాల్లో బలహీనంగా ఉన్న కారణంగానే చాలా దేశాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు దూరంగా జరుగుతున్నాయి. అమెరికా ఈ వైఖరి ఒక్క జన్యుమార్పిడి ఆహారానికే పరిమితం కాదు. క్యాన్సర్ కారకమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్డి మందుల విషయంలో వందల కోట్ల డాలర్ల జరిమానాలు పడ్డా, వేల సంఖ్యలో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నా ఆ పరిశ్రమ ఎగుమతుల కోసం అతురతతో ఎదురు చూస్తోంది. ఈ కారణంగానే ఏమో... జీఎం టెక్నాలజీకి అనూహ్యంగా భారత్, కెన్యా, ఇండోనేసియాల్లో మంచి మద్దతు లభిస్తోంది. తక్కువ దిగుబడులిచ్చే జన్యుమార్పిడి ఆవాల విషయాన్నే తీసుకుందాం. భారత్‌లో ఇదో అర్థం లేని వంగడం. భారత్ తన వంటనూనె అవసరాల్లో దాదాపు 55 శాతాన్ని దిగుమతుల ద్వారా పూర్తి చేసుకుంటోంది. ఈ దిగుమతులు సుమారు కోటీ ముప్ఫై లక్షల టన్నుల వరకూ ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక వంటనూనె దిగుమతిదారుల్లో ఇటీవలే భారత్ రెండో స్థానానికి చేరింది. తగినంత వంటనూనె సొంతంగా ఉత్పత్తి చేసుకోలేక కాదు... ప్రభుత్వ ప్రాథమ్యాల్లో, విధానాల్లో తేడాలు ఇందుకు కారణం. చౌక దిగుమతులకు అనుమతులివ్వడం, దిగుమతి సుంకాలను తగ్గించడం సరేసరి. ఈ చర్యల ద్వారా వంటనూనెల విషయంలో స్వావలంబన సాధించేందుకు 1993 – 94లో మొదలుపెట్టిన పసుపు విప్లవం కాస్తా నిర్వీర్యమవుతోంది. తక్కువ దిగుబడినిచ్చే జన్యుమార్పిడి ఆవాల వంగడాన్ని డీఎంహెచ్–11 అని పిలుస్తున్నారు. దీంట్లో కీటకనాశినులను తట్టు కునే మూడు జన్యువులుంటాయి. దీని ద్వారా హెక్టారుకు 2,626 కిలోల దిగుబడి వస్తుందని అంచనా. దాదాపు 3,012 కిలోలతో ఇప్పటికే డీఎంహెచ్–4 వంగడం డీఎంహెచ్–11 కంటే 14.7 శాతం ఎక్కువ దిగుబడి ఇస్తోంది. ఇలాంటివే ఇంకో నాలుగు వంగడాలు ఉండటం గమనార్హం. విచిత్రమైన విషయం ఏమంటే– డీఎంహెచ్–11 వంగడాన్ని అతితక్కువ దిగుబడినిచ్చే వరుణ వంగ డంతో పోల్చి, తమది 25 – 30 శాతం ఎక్కువ దిగుబడి ఇస్తుందని చెప్పడం! ఇంకోపక్క అందుబాటులో ఉన్న వంగడాలతోనే కొన్ని కొత్త టెక్నాలజీల సాయం (సిస్టమ్ ఆఫ్ మస్టర్డ్ ఇంటెన్సిఫికేషన్)తో మధ్య ప్రదేశ్‌లో ఆవాల దిగుబడి హెక్టారుకు 4,693 కిలోల స్థాయికి తేగల మని ఇప్పటికే నిరూపితమైంది. ఎల్లో రివల్యూషన్‌ను మళ్లీ పట్టా లెక్కించేందుకు ఇలాంటి పద్ధతులను దేశవ్యాప్తంగా ప్రచారంలో పెట్టడం, సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించడం అవసరం. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
2022లో బెటరే కానీ, 2023 దారుణం!
న్యూఢిల్లీ: ప్రపంచ వస్తు వాణిజ్యం నడుస్తున్న 2022వ సంవత్సరంలో మెరుగ్గాఉన్నా.. 2023లో పరిస్థితి అస్సలు బాగోలేదని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తన తాజా నివేదికలో పేర్కొంది. 2022లో ప్రపంచ వస్తు వాణిజ్య వృద్ధి రేటును గత ఏప్రిల్ నాటి అంచనాలకన్నా ఎక్కువగా తాజాగా 3 శాతం నుంచి 3.5 శాతానికి సవరించింది. 2023లో వృద్ధి రేటు అంచనాను మాత్రం 3.4 శాతం నుంచి భారీగా ఒక శాతానికి తగ్గించింది. నివేదికలో సంస్థ ఆర్థికవేత్తల మరిన్ని అభిప్రాయాలను పరిశీలిస్తే.. ► అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు దేశాల మధ్య వాణిజ్యంపై తీవ్ర ప్రతికూలత చూపుతున్నాయి. ► 2022 అక్టోబర్ నుంచే ప్రపంచ వాణిజ్య మందగమనం తీవ్రమై, 2023లో తీవ్ర రూపం దాల్చుతుంది. ► పలు కారణాల వల్ల దిగ్గజ ఎకానమీలో దిగుమతుల డిమాండ్ కూడా మందగించే అవకాశం ఉంది. ► ప్రత్యేకించి యూరోప్‌ను చూస్తే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం గృహ వ్యయం, తయారీ వ్యయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ► అమెరికాలో వడ్డీరేట్ల పెంపు– గృహాలు, మోటార్ వాహనాల కొనుగోళ్లు, స్థిర ఇన్వెస్టమెంట్లకు విఘాతం కలిగిస్తోంది. ► ఇక చైనాలో కోవిడ్–19 సవాళ్లు కొనసాగుతున్నాయి. బలహీన అంతర్జాతీయ డిమాండ్, తగ్గిన ఉత్పత్తి వంటి సమస్యలు చైనాకు ఎదురవుతున్నాయి. ► ఇంధనం, ఆహారం, ఎరువుల కోసం పెరుగుతున్న దిగుమతి బిల్లులు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార అభద్రత, రుణ సవాళ్లకు దారితీసే వీలుంది. ► పలు ఆర్థిక వ్యవస్థల్లో అనుసరిస్తున్న వడ్డీరేట్ల పెంపు విధానం డిమాండ్ పరిస్థితులను దెబ్బతీసే అంశం. భారత్‌కు చేదువార్తే... ఎగుమతులను భారీగా పెంచుకోవాలని చూస్తున్న భారత్‌కు ఐఎంఎఫ్ తాజా అంచనాలు కొంత ప్రతికూలమైనవే కావడం గమనార్హం. 2021–22లో 400 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులను సాధించిన భారత్, 2022–23లో 450 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. నిజానికి ఎగుమతుల విషయంలో భారత్ గడచిన రెండు నెలల నుంచి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోంది. జూలై, ఆగస్టు నెలల్లో తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది. భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా స్వల్పంగా 1.15 శాతం మేర క్షీణించాయని (33 బిలియన్ డాలర్లు) ఆగస్టు తొలి గణాంకాలు తెలిపాయి. తరువాత గణాంకాల సవరణల్లో 1.6 శాతం వృద్ధికి ఎగుమతుల పరిమాణం మారింది. ఇక జూలై నెల్లో ఎగుమతులు 0.76 శాతం క్షీణించి 35.24 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు మొదట్లో వెలువడిన తొలి గణాంకాలు పేర్కొన్నాయి. అయితే అటు తర్వాత సవరించిన లెక్కల ప్రకారం, ఎగుమతులు జూలైలో 2.14 శాతం పెరిగి 36.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సెప్టెంబర్‌లో ఎగుమతులు ఏకంగా 3.5 శాతం క్షీణించి, 32.62 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, దిగుమతులుసైతం ఏడు నెలల్లో తొలిసారి 60 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి. మొత్తంమీద తాజా గణాంకాలతో 21 నెలలు వృద్ధి బాటన నడిచిన ఎగుమతులు తీవ్ర ఒడిదుడుకుల నడుమ 2022 సెప్టెంబర్‌లో క్షీణతలోకి జారిపోయినట్లయ్యింది. ఇక ఎగుమతులకన్నా, దిగుమతులు భారీగా ఉండడం పట్ల కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) భారీగా పెరగవచ్చన్న అంచనాలు ఉన్నాయి. భారత్ కరెంట్ అకౌంట్‌లోటు ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 2.8 శాతం (జీడీపీ విలువలో)గా నమోదయ్యింది. విలువలో ఇది 23.9 బిలియన్ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కరెంట్ అకౌంట్ 6.6 బిలియన్ డాలర్ల (జీడీపీలో 0.9 శాతం) మిగుల్లో ఉండడం గమనార్హం. ఆర్థిక సంవత్సరంలో 3 శాతం క్యాడ్ ఉంటుందని ఆర్బీఐ పాలసీ విధానం భావిస్తోంది. ఇక 2022 ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు, సెప్టెంబర్ 23 నాటికి 537.5 బిలియన్ డాలర్లకు చేరాయి. వరుసగా ఎనిమిది వారాలుగా తగ్గుతూ వస్తుండడం ఆందోళన కలిగిస్తున్న మరో అంశం. -
కొత్త సెజ్ చట్టంతో బహుళ ప్రయోజనాలు
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రతిపాదిత ప్రత్యేక ఆర్థిక జోన్ల (సెజ్) కొత్త చట్టం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ప్రత్యేక ఆర్థిక జోన్లకు సంబంధించి ప్రస్తుత చట్టం స్థానంలో తీసుకువస్తున్న కొత్త చట్టంతో వ్యవస్థలో అన్ని అనుమతులు, విధి విధానాలు, కార్యకలాపాలు సింగిల్ విండో కింద జరుగుతాయని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక రంగం పురోగతికి కొత్త చట్టం దోహదపడుతుందని ఆయన అన్నారు. సెజ్‌లను నియంత్రించే ప్రస్తుత చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం మంగళవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్(డీఈఎస్‌హెచ్)లో రాష్ట్రాలను భాగస్వాములు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత సెజ్ యాక్ట్‌ను 2006లో తీసుకువచ్చారు. ఎగుమతుల పెరుగుదల, మౌలిక రంగం పురోగతి, ఉపాధి కల్పన ఈ చట్టం ప్రధాన లక్ష్యం. అయితే కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు, పన్ను ప్రోత్సాహకాల తొలగింపు వంటి చర్యల తర్వాత ఈ జోన్ల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. కొత్త చట్టంతో తిరిగి సెస్‌లకు బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని, దేశాభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. సెజ్ 2.0 ముసాయిదా యాక్ట్ తయారీ పక్రియలో ఉందని, వచ్చే కొద్ది నెలల్లో ప్రస్తుత సెజ్ యాక్ట్ స్థాయిలో ఇది అమల్లోకి వచ్చే చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్ ఎగుమతుల్లో దాదాపు 20 శాతం సెజ్‌ల వాటా కావడం గమనార్హం. -
Omicron ఎఫెక్ట్.. కీలక భేటీ నిరవధిక వాయిదా!
ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త గుబులుతో ఉడికిపోతోంది. బీ.1.1.529 కరోనా వేరియంట్‌పై ప్రపంచ దేశాల ఆందోళన పెరిగిపోతోంది. వ్యాక్సిన్లకు సైతం తలొగ్గని ఒమిక్రాన్ మొండి వేరియంట్ కావడంతో పలు దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ప్రయాణాలపై నిషేధం, ఆంక్షలు తెర మీదకు వస్తున్నాయి. వచ్చే వారం జెనీవాలో డబ్ల్యూటీవో మినిస్టీరియల్(ఎంసీ12) కాన్ఫరెన్స్ జరగాల్సి ఉంది. అయితే కొత్త వేరియెంట్ ఠారెత్తిస్తున్న తరుణంలో ఈ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్లకొకసారి జరిగే ఎంసీ12 భేటీలో మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రపంచంలో 98 శాతం వాణిజ్యాన్ని సమీక్షించే డబ్ల్యూటీవోలో 164 మంది సభ్యులు ఉన్నారు. ఇక నవంబర్ 30 డిసెంబర్ 3 మధ్య వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎంసీ12 సమావేశం జరగాల్సి ఉంది. అయితే స్విస్ ప్రభుత్వం శుక్రవారం నుంచి అంతర్జాతీయంగా ట్రావెల్ బ్యాన్ ప్రకటించింది. ముఖ్యంగా సౌతాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం ఇతర దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలను నిషేధించింది. ఈ నేపథ్యంలోనే భేటీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది WTO. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు వెలుగుచూశాక.. త్వరలో జరగాల్సిన కీలక సమావేశాలు, అంతర్జాతీయ సదస్సులు చాలానే వాయిదా పడ్డాయి. చదవండి: ఆ మార్కెట్లో మళ్లీ కరోనా కలకలం -
చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు.. పాక్ పాత్ర కూడా!
China Ease of doing business index Scam: డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌ల విషయంలో చైనా భారీ అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు.. ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ర్యాంకింగ్‌లో పురోగతి అనేది దేశ ఆర్థిక పురోగతిని, అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడుల్ని ప్రభావితం చేసే అంశం. అయితే అంతటి బలమైన వ్యవస్థను.. చైనా అంతతేలికగా ఎలా ప్రభావితం చేయగలిగిందన్నది ఇప్పుడు ప్రధానంగా వ్యక్తం అవుతున్న అనుమానం. ఇక ఈ ఆరోపణలు వెలుగుచూడడంతో.. డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌ల విడుదలను నిలిపివేస్తూ(ఈ ఏడాదికి మాత్రమేనా? శాశ్వతంగానా?) ప్రపంచ బ్యాంక్ సంస్థ ప్రకటించడంతో అన్ని దేశాలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. డబ్ల్యూటీవో రూల్స్‌ను కాలి కింద తొక్కిపట్టి మరీ.. ప్రపంచ మార్కెట్‌ను శాసించాలనే అత్యాశ ఇప్పుడు పాముగా మారి డ్రాగన్ మెడకు చుట్టుకుంటోంది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్లో అవకతవకలు బయటపడడంతో అంతర్జాతీయ సమాజం చైనాపై దుమ్మెత్తిపోస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వీలుగా.. చైనా డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో పైరవీలు చేసి మెరుగైన ర్యాంకులు సంపాదించింది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్లో.. 2018 ఏడాదికి(హాంకాంగ్‌తో కలిసి ఐదవ స్థానం-వ్యక్తిగతంగా 78వ స్థానం, 2020లో హాంకాంగ్‌తో కలిసి మూడవ స్థానం-వ్యక్తిగతంగా 31వ స్థానానికి ఎగబాకింది. అయితే 2018, 2020తో పాటు మధ్యలో 2019లోనూ ఫేక్ ర్యాంక్ దక్కించుకుందనేది ప్రపంచ బ్యాంక్ అంతర్గత దర్యాప్తు వెల్లడించిన అంశం. ఉన్నత పదవుల్లో అవినీతి, నివేదికల్లో డేటాపరమైన అవకతవకలు, బ్యాంకు సిబ్బంది నైతిక విలువలు పాటించకపోవడం వంటి వ్యవహారాలు చైనా ర్యాంక్‌ను ప్రభావితం చేశాయని దర్యాప్తు వెల్లడించింది. ఇవేకాదు.. అంతర్గతంగా విచారణ ద్వారా మరిన్ని నిజాల్ని నిగ్గు తేలుస్తామని ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ప్రకటించుకుంది కూడా. గత రెండు దశాబ్దాలుగా ఐఎంఎఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలపై పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆరోపణలు నిజమని తేలితే.. చైనాపై కొంతకాలం కఠిన ఆంక్షలు విధించడంతో పాటు విదేశీ పెట్టుబడులకు అనుమతుల నిరాకరణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ మాజీ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్, సీఈవో(ప్రస్తుతం కూడా) క్రిస్టలీనా జార్జియేవా.. ఒత్తిళ్ల మేరకు చైనాకు మెరుగైన ర్యాంకింగ్ లభించేలా వరల్డ్ బ్యాంక్ సిబ్బంది డేటాను మార్చేశారని ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన న్యాయసేవల సంస్థ విల్మర్హేల్ నిర్ధారించింది. పాక్ పాత్ర కూడా.. ప్రస్తుతం డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్‌లో చైనా పైరవీల వ్యవహారంపై వరల్డ్ బ్యాంక్ ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ పాత్రను కూడా గుర్తించినట్లు సమాచారం. పాక్ లాంటి దేశాల వెన్నుదన్నుతోనే చైనా ఫేక్ ర్యాంకింగ్‌తో డూయింగ్ బిజినెస్ లిస్ట్‌లో ఎగబాకగలిగిందని ఎథిక్స్ కమిటీ సమర్పించిన 16 పేజీల నోట్లో ఓ ముఖ్యాంశంగా ఉంది. చైనాను హైలీ ప్రమోట్ చేయడం ద్వారా పాక్ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు అయ్యింది. అంతేకాదు గ్లోబల్ ఇన్వెస్టర్లను చైనాకు మళ్లించేలా ప్రభావితం చేయడంతో పాటు చైనాతో పరస్పర సహకారం భారీ ముడుపులు పాక్ అందుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైనాతో ఆర్థిక లావాదేవీల కొనసాగింపు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, ఇస్లామాబాద్-ఫైసలాబాద్-కరాచీలలో భారీ పెట్టుబడుల హామీతోనే చైనాకు పాక్ మద్దతుగా నిలుస్తోందనేది ఆ నివేదికలోని సారాంశం. మరో విషయం ఏంటంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థను సైతం ప్రభావితం చేస్తూ చైనా ఈ తతంగాన్ని నడిపించిందని. కావాలంటే ఎంక్వైరీ చేస్కోండి చైనా ఈ ఆరోపణలు తోసిపుచ్చుతోంది. ఇదంతా అమెరికా కుట్రలో భాగమని అంటోంది. అంతర్గత దర్యాప్తు కాదు.. అవసరమైతే నిఘా వర్గాలతోనూ దర్యాప్తు జరిపించుకోండంటూ ప్రపంచ బ్యాంకుకు సవాల్ విసురుతోంది. మరోవైపు, ప్రపంచ బ్యాంకు ఈ ఆరోపణలపై సమగ్రమైన విచారణ నిర్వహించాలని, విశ్వసనీయతను పాటించాలని చైనా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి డైరెక్టరుగా ఉన్న జార్జియేవా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. విచారణ నివేదికలో వెల్లడైన విషయాలతో విభేదిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఆ టైంలో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా పని చేసిన జిమ్ కిమ్ సైతం ఆరోపణల్ని తోసిపుచ్చారు. వరల్డ్ బ్యాంక్ ఎథిక్స్ కమిటీ.. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతోంది. సెప్టెంబర్ 15న ‘ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డేటా ఇర్రెగ్యులారిటీస్ ఇన్ డూయింగ్ బిజినెస్ 2018 అండ్ డూయింగ్స్ బిజినెస్ 2020.. ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ అండ్ రిపోర్ట్ టు ది బోర్డ్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్’ పేరుతో 16 పేజీల రిపోర్ట్‌ను తయారు చేసింది ఎథిక్స్ కమిటీ. . అవుట్‌డేటెడ్ మల్టీలాటెరల్ స్ట్రక్చర్స్, అవినీతి లాంటి చైనా ప్రయత్నాలపై ఈ నివేదిక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓవైపు ఆర్థికంగా వరుస దెబ్బలు.. తాజాగా డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఆరోపణలు చైనాను మరింత ఇరకాటంలోకి నెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: డూయింగ్ బిజినెస్ నివేదిక నిలిపివేత -
జనం ప్రాణాలకంటే లాభాలు మిన్నా?
భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బ్రిటన్.. ఇలా అన్ని చోట్లా వైరస్ కొత్తరకాలు పుట్టుకొస్తున్నందున కోవిడ్ వైరస్ ఇక ఏమాత్రం ఊహాత్మకమైన, అనిశ్చయకరమైన ప్రమాదం కానేకాదు. వ్యాక్సిన్ల విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ మేధో సంపత్తి నిబంధనలను వెంటనే మాఫీ చేయాలని వంద దేశాలు కోరుతున్నాయి. డబ్ల్యూటీఓ ఒప్పందంలోని ఈ అడ్డంకులను తాత్కాలికంగా నైనా తొలగిస్తే టీకాలు ఉత్పత్తికి, పంపిణీకి చట్టబద్ధ వెసులుబాటు కలుగుతుంది. టీకా తయారీదారులు తమ గుత్తాధిపత్యాన్ని, లాభాలను కొనసాగించడం వల్లనే వ్యాక్సిన్లకు కొరత ఏర్పడుతోంది. ప్రజల ప్రాణాలకంటే ఔషధ కంపెనీల లాభాలు ఎక్కువ కాదు, కాకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు కోవిడ్–19 వ్యాక్సిన్లను అభివృద్ధి చేశారు. వారికి ప్రాథమికంగా మద్దతు అందించిన ప్రభుత్వాలకు కృతజ్ఞత చెప్పాలి. అయితే వ్యాక్సిన్ ప్రయోజనాలు అందరికీ అందాలి. ప్రజల ప్రాణాల కంటే ఔషధ కంపెనీల లాభాలు ఎక్కువ కాదు. వైరస్ ఎక్కడ పుట్టుకొచ్చినా అంతటా వ్యాప్తి చెందుతుంది. కొత్త వ్యాప్తి వల్ల టీకాలను కూడా లెక్కచేయని ఎస్.ఏ.ఆర్.ఎస్ కోవిడ్–2 వేరియంట్ పుట్టుకొస్తుంది. మళ్ళీ మనందరినీ లాక్డౌన్లోకి నెట్టి వేస్తుంది. మహమ్మారి కోవిడ్–19ని అంతమొందించాలంటే ఏకైక మార్గం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ రోగ నిరోధకతను కల్పించడమే. అందరూ సురక్షితంగా ఉండనంతవరకు ఏ ఒక్కరూ సురక్షితంగా ఉండరు అనేది మన నినాదం కావాలి. ఇది నేడు మనం ఎదుర్కొంటున్న సాంక్రమిక కాల వాస్తవికత. వ్యాక్సిన్లను కూడా తట్టుకునేలా సార్స్ కోవిడ్–2 రకాలు ఎక్కడైనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటంతో మరోసారి మనం లాక్డౌన్ పాలబడాల్సి వస్తోంది. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బ్రిటన్ ఇలా అన్ని చోట్లా వైరస్ కొత్తరకాలు పుట్టుకొస్తున్నందున కోవిడ్ వైరస్ ఇక ఏమాత్రం ఊహాత్మకమైన, అనిశ్చయకరమైన ప్రమాదం కానేకాదు. ఏప్రిల్ చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా కేవలం 120 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను మాత్రమే ఉత్పత్తి చేశారు. అంటే ఈ లెక్కన 2023 నాటికి కానీ వాక్సిన్ ప్రపంచంలోని ప్రజలందరికీ అందుబాటులోకి రాదు. వ్యాక్సిన్ల విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ మేధో సంపత్తి నిబంధనలను వెంటనే మాఫీ చేయాలని వంద దేశాలు కోరుతున్నాయి. డబ్ల్యూటీఓ ఒప్పందంలోని ఈ అడ్డంకులను తాత్కాలికంగా నైనా తొలగిస్తే టీకాలు ఉత్పత్తికి, పంపిణీకి చట్టబద్ధ వెసులుబాటు కలుగుతుంది. ఇలాంటి మాఫీకి సంబంధించిన చర్చలను నిరోధించడానికి గతంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని ధనిక దేశాలను కూడగట్టాడు. దీనిని తిప్పి కొట్టడానికి నూతన అధ్యక్షుడు బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇలా ఒత్తిడి పెట్టేవారిలో 200 మంది నోబెల్ అవార్డు గ్రహీతలు, మాజీ దేశాధినేతలు, నూతన ఉదారవాదులు, అమెరికా ప్రతినిధుల సభలో 110 మంది సభ్యులు, 100 మంది సెనెట్ సభ్యులు, సెనెటర్లు, 400 మంది అమెరికా సివిల్ సొసైటీ గ్రూపు సభ్యులు, 400 మంది యూరోపియన్ పార్లమెంటు సభ్యులు కూడా ఉండటం విశేషం. అనవసరమైన సమస్య టీకా తయారీదారులు తమ గుత్తాధిపత్యాన్ని, లాభాలను కొనసాగించడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లకు కొరత ఏర్పడుతోంది. వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడానికి అర్హత కలిగిన అనేక ఔషధ తయారీ దారులు సాంకేతికతను బదిలీ చేయాలంటూ చేస్తున్న అభ్యర్థనలను అంగీకరించడానికి కానీ, స్పందించడానికి కానీ ఎమ్ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీదారులైన ఫైజర్, మోడెర్నా సిద్ధంగా లేవు. కరోనా టీకాలను అభివృద్ది చేసిన ఈ సంస్థలు ఆ టెక్నాలజీని పేదదేశాలతో పంచుకోవడానికి ఇష్టపడటంలేదు. కార్పొరేట్ ఔషధ సంస్థలు ప్రధానంగా ఆరోగ్య రంగంపై దృష్టి సారించాయి. అది సంపాదన కోసమే కానీ, ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ కోసం కాదు. లాభాలను పెంచుకోడానికి వీలైనంత దీర్ఘకాలం, వీలైనంత బలమైన మార్కెట్ శక్తిగా కొనసాగడమే వాటి ధ్యేయం. కోవిడ్–19 టీకాల పేటెంట్ హక్కుల రద్దును నిరోధించడం కోసం రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తేవటానికి ఔషధ సంస్థల మధ్యవర్తుల సైన్యం వాషింగ్టన్లో ఏర్పడింది. అయితే పేటెంట్ హక్కుల మాఫీని నిరోధించడానికి బదులు ఈ సంస్థలు టీకా ఉత్పత్తిని పెంచినట్టయితే సమస్య పరిష్కారమయ్యేది. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమ నిబంధనల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే అవకాశం ఉందని, ఈ చట్టం ఇతరులు చేసే ఉత్పత్తిని కూడా అనుమతించేంత సరళమైందని, అందుచేత పేటెంట్ హక్కుల మాఫీ అవసరం లేదని ఔషధ కంపెనీలు వాదిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలోనివారు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి సమర్థులు కారని, అందువల్ల మాఫీతో ఎలాంటి ఉపయోగం లేదని వారు పేర్కొంటున్నారు. పైగా ఎంతో శ్రమపడి చేసిన పరిశోధనకు ప్రోత్సాహకాలు కోల్పోతామని, అది లాభాలను తగ్గించి, కంపెనీల అభివృద్ధికి ఆటంకంగా తయారవుతుందని వీరు అంటున్నారు. తమ స్వప్రయోజనాల కోసం చేస్తున్న ఇలాంటి వాదనలు విఫలమైనప్పుడు వీరు మరొక కొత్త వాదనను తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా చైనా, రష్యాలను ఓడించడానికి, పశ్చిమ దేశాల భౌగోళిక రాజకీయాలకు ఇది ఉపయోగపడుతుందట! టీకాల పేటెంట్ మాఫీ చర్చల్లో బైడెన్ ప్రభుత్వం పాల్గొంటుందని ప్రకటించిన కొద్ది సేపటికే, షేర్ మార్కెట్లో వ్యాక్సిన్ ప్రధాన తయారీ దారుల వాటా ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. పేటెంట్ హక్కుల రద్దుతో మరిన్ని టీకాలు అందుబాటులోకి వస్తాయి, వాటి ధరలు తగ్గుతాయి. పైగా వారికి లాభాలు కూడా తగ్గుతాయి. ఇంగితజ్ఞానమే అసలైన పరిష్కారం కొత్త టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్లను తయారు చేసే నైపుణ్యం అభివృద్ధి చెందుతున్న దేశాలకు లేదన్నది ఎంతమాత్రం పసలేని వాదన. అమెరికా, యూరోపియన్ ఉత్పత్తిదారులు, విదేశీ ఉత్పత్తిదారులతో భాగస్వామ్యాలకు అంగీకరించినప్పుడు వాటికి చెప్పుకోదగ్గ ఉత్పాదక సమస్యలేమీ రాలేదు. ప్రపంచంలోని అతిపెద్ద టీకా ఉత్పత్తిదారులైన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో, దక్షిణాఫ్రికాలోని ఆస్పెన్ ఫార్మకేర్లతో అమెరికా, యూరోపియన్ ఉత్పత్తి దారులు భాగస్వామ్యాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. అదే సామర్థ్యంతో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి, సరఫరాను పెంచే సంస్థలు చాలా ఉన్నాయి. వారికి కావలసింది కేవలం నూతన పరిశోధనల సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే. టీకాలు తయారు చేయగల 250 కంపెనీలను నూతన ఆవిష్కరణల కూటమి గుర్తించింది. వాస్తవానికి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల వద్ద అధునాతన శాస్త్రీయ, సామర్థ్యాలు ఉన్నాయి. పేటెంట్ హక్కులున్న కంపెనీల వల్లనే టీకా ఉత్పత్తి, సరఫరాల కొరత ఏర్పడుతోంది. ఈ కంపెనీలు ప్రజల ప్రాణాలను కాపాడడం కన్నా, తమ గుత్తాధిపత్యం, లాభాలు పోగేసుకునే ఒప్పందాలను చేసుకుంటున్నాయి. మేధోపరమైన సంపత్తి దారులకు రావలసిన రాయల్టీలు, ఇతర పరిహారాలను, ఇతర జాతీయ చట్టపరమైన అవసరాలను ఈ పేటెంట్ హక్కుల మాఫీ ఎంతమాత్రం రద్దుచేయదు. కాగా, గుత్తాధిపతులకు ఉన్న.. ఉత్పత్తిని నిరోధించే ఎంపికను తొలగించడం ద్వారా ఔషధ సంస్థలు స్వచ్ఛంద ఏర్పాట్లలోకి ప్రవేశించడానికి ఇది ప్రోత్సహిస్తుంది. టీకా అసలు తయారీదారులు ధన సంపాదన పక్షాన్నే నిలబడతారు. కోవిడ్–19 వ్యాక్సిన్ తయారీ వల్ల 2021లో ఫైజర్ కంపెనీకి 1,500 కోట్ల డాలర్లు, మోడెర్నోకు 1,840 కోట్ల డాలర్లు ఆదాయం చేకూరుతుందని అంచనా. అయితే వాస్తవానికి, అక్కడి ప్రభుత్వాలు ఈ కంపెనీలకు ప్రాథమిక పరిశోధనకోసం నిధులు సమకూర్చాయి. వాక్సిన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి గణనీయంగా నిధులను అందించాయి. లాభాలకున్న విలువ జీవితాలకు లేదా? వాస్తవానికి కరోనా టీకా అమెరికా సృష్టి కాదు. భారత దేశంలో కోవిడ్ మహమ్మారి రెండవ దశ విజృంభించినప్పుడు అమెరికా తాను ఉపయోగించని అస్ట్రా జెనెకా విడుదల చేయాలని భావించింది. ఈ సమయంలో రష్యా, చైనా తమ టీకాలను అందుబాటులో ఉంచడమే కాకుండా, తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. వైవిధ్యంగల ప్రమాదకరమైన కొత్త వైరస్ వ్యాపిస్తున్న ఈ క్లిష్ట సమయంలో తమకు ఏ దేశాలు సహాయపడ్డాయో, ఏవి అడ్డం కులు సృష్టించాయో ప్రపంచం తప్పనిసరిగా గమనిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితాల కంటే లాభాలు ఎక్కువనే భావన ఔషధ కంపెనీలకు ఉండకూడదు. జోసెఫ్ ఇ స్టిగ్లిజ్, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత, కొలంబియా యూనివర్సిటీ లోరీ వాలక్, గ్లోబల్ ట్రేడ్ వాచ్ డైరెక్టర్ సంక్షిప్త అనువాదం : డాక్టర్ ఎస్. జతిన్ కుమార్ మొబైల్: 98498 06281 -
వాణిజ్య వారధి.. బైడెన్ మెచ్చిన లీడర్
ప్రపంచ వాణిజ్య సంస్థకు ఎవరు డైరెక్టర్ జనరల్ కాబోతున్నారు? పోటీలో ఉన్న ఇద్దరూ మహిళలే. పోటీ ఉన్నదీ ఆ ఇద్దరి మధ్యనే. నైజీరియా మాజీ ఆర్థిక మంత్రి ఒకాంజో అవేలా ఒకరు. దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యూ మింగ్హ్యీ ఇంకొకరు. ఒకాంజో బైడెన్ చెప్పిన పేరు. మింగ్హ్యీ ట్రంప్ చెప్పిన పేరు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవరికి డబ్లు్య.టి.ఓ. డైరెక్టర్ జనరల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో! వచ్చే నాలుగేళ్లలో ప్రపంచ దేశాల వాణిజ్య ప్రయోజనాలకు అవసరమైన వ్యూహాలను ఎవరు రూపొందించబోతున్నారో?! బైడెన్‌తో పాటు డబ్లు్య.టి.వో.లో సభ్యత్వం ఉన్న మొత్తం 164 దేశాలు మొగ్గు చూపుతున్నది ఒకాంజో వైపే. ట్రంప్ దాదాపుగా ప్రతి ప్రపంచ సంస్థతో, ప్రపంచంలోని ప్రతి దేశంతో ఏదో ఒక పంచాయితీ పెట్టుకుని వెళ్లినవారే. ట్రంప్ ఎంపిక చేసిన వ్యక్తుల సామర్థ్యాలు ఎంత శిఖరాగ్ర స్థాయిలో ఉన్నా, ట్రంప్ ఎంపిక చేశారు కాబట్టి బైడెన్ పాలనలో ఆ వ్యక్తులకు ప్రాముఖ్యం లేకపోవడమో, లేక ప్రాధాన్యం తగ్గిపోవడమో సహజమే. ఏమైనా ఒకాంజో డబ్లు్య.డి.వో. కొత్త డైరెక్టర్ జనరల్ కానున్నారన్నది స్పష్టం అయింది. మార్చి 1–2 తేదీల్లో సర్వసభ్య సమాజం ఉంది కనుక ఆ లోపే ఒకాంజో కొత్త సీట్లో కూర్చోవాలి. 66 ఏళ్ల ఒకాంజో ప్రస్తుతం ట్విట్టర్, స్టాండర్డ్–చార్టర్డ్ బ్యాంక్, గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్, ఆఫ్రికన్ రిస్కీ కెపాసిటీ సంస్థల డైరెక్టర్ల బోర్డులలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ఎంపిక ఖరారు అయితే కనుక ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ అయిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అవుతారు. ఆ సంస్థకు ఇప్పుడు అమెరికా అవసరం ఉంది కనుక, అమెరికా ఆమెను నామినేట్ చేసింది కనుక మరొకరు ఆ స్థానంలోకి వచ్చే అవకాశమే లేదు. అలాగని ఒకాంజో అవేనా ఎవరో వేసిన సోపానం పైకి ఎక్కడం లేదు. ఆమె ప్రతిభ ఆమెకు ఉంది. ఆమె అనుభవం ఆమెకు ఉంది. అవన్నీ ప్రపంచ వాణిజ్య సంస్థకు పూర్తి స్థాయి లో అవసరమైనవీ, అక్కరకు వచ్చేవే. ∙∙ ఇటీవలే 2019లో అమెరికన్ పౌరసత్వం తీసుకున్న ఒకాంజో వరల్డ్ బ్యాంకులో 25 ఏళ్లు పని చేశారు. అందులోనే మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగారు. ఇక తన స్వదేశం నైజీరియాకు రెండుసార్లు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థకు ఆమె డైరెక్టర్ జనరల్ కాబోతున్నారనే స్పష్టమైన సంకేతాలు రావడంతోనే.. ‘‘ఆర్థికవేత్తగా అమె నాలెడ్జ్ సాటి లేనిది’’ అని యు.ఎస్.టి.ఆర్. (యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్) సంస్థ కొనియాడింది. ‘‘అమెరికా ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు’’ అని ఒకాంజో కూడా స్పందించారు. ఆమె చదివిందంతా ఎకనమిక్సే. అందులోనే డిగ్రీలు, అందులోనే డాక్టరేట్ లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు. ఒకాంజో భర్త న్యూరో సర్జన్. నలుగురు పిల్లలు. వారిలో ఒకరు కూతురు. వాళ్లవీ పెద్ద చదువులే. కుటుంబ అనుబంధాలకు, మానవ సంబంధాలకు, దేశాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలకు క్రమశిక్షణ గల ‘ఎకానమీ’ ఇరుసు వంటిది అని అంటారామె. ఒకాంజో. -
భారత్‌కు అనుకూలించే విషయాలివే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంలో చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారతదేశం పక్షపాత ధోరణితో, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ యాప్స్‌ను నిషేధిందని చైనా ఆరోపించింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)ను సంప్రదిస్తామని చైనా భారత్‌ను హెచ్చరించింది. చైనా ఒకవేళ డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసినా భారత్ నిర్ణయాన్నే ప్రపంచ వాణిజ్య సంస్థ సమర్థిస్తుంది. దానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు చెప్పవచ్చు. 1. భారత్‌కు చైనాకు మధ్య ఈ యాప్స్ విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలు లేవు. ఇరు దేశాల మధ్య ఈ విషయంలో ఒప్పందాలు లేనప్పటికీ భారతదేశం అతిపెద్ద మార్కెట్ కావడంతో ఆ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. (చైనాకు చెక్ : మరోసారి మోదీ మార్క్) 2. దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందనుకున్నప్పుడు ఆ కంపెనీలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే హక్కు ఆయా దేశాలకు ఉంటుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలలో ఉన్న ఈ అంశం భారతదేశ నిర్ణయానికి అనుకూలంగా ఉంది. చట్టవిరుద్ధ, మోసపూరిత విధానాలు పాటించినందుకు భారతదేశం కావాలంటే చైనా మీదే డబ్ల్యూటీఓ లో ఫిర్యాదు చేయవచ్చు. ఎందుకంటే అధిక సుంకాలు తప్పించుకోవడానికి భారతదేశం ప్రాధ్యాన్యత వాణిజ్య ఒప్పందం కలిగిన సింగపూర్, హాంకాంగ్ దేశాల నుంచి చైనా తక్కువ ధరలకు ఇండియాకు వస్తువులను సరఫరా చేసేది. ఈ విషయంలో ఇండియా చైనా మీద ఫిర్యాదు చేయవచ్చు. (చైనాతో వాణిజ్య లోటు డౌన్) 3. చైనా దాదాపు అన్ని దేశాలలో పెట్టుబడులు పెట్టిన చాలా దేశాలను తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసింది. ఫేస్బుక్, వాట్సాప్‌లాంటి సోషల్‌మీడియా దిగ్గజలు అన్ని దేశాలలో ఉన్నా, చైనాలో మాత్రం వాటి ఊసే ఉండదు. టెక్ దిగ్గజాలు ఎన్నో కంపెనీల మీద చైనా ఆంక్షలు విధించింది. కానీ చైనా దేశానికి చెందిన చాలా సోషల్‌మీడియా సంస్థలు వివిధ దేశాలలో అధిక పెట్టుబడులు పెట్టాయి. చైనా కూడా భారత్‌కు న్యూస్ ఏజెన్సీని చైనాలో నిషేధించింది. పైన తెలిపిన ఈ విషయంలో భారత్‌కు సానుకూలంగా ఉన్నాయి. (‘బ్యాన్ టిక్‌టాక్’ అమెరికాలోనూ..!) -
ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనాలు కుదింపు
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) భారీగా కుదించింది. 2019 సంవత్సరానికి 2.6 శాతం ఉంటుందని గత ఏప్రిల్‌లో ఈ సంస్థ అంచనా వేయగా, తాజాగా దీన్ని 1.2 శాతానికి కుదించింది. ఇది భారత్‌కు రుచించని విషయమే. ఎందుకంటే ఎగుమతులను పెంచుకునేందుకు మన దేశం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం గమనార్హం. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిదానిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు 2019, 2020 సంవత్సరాలకు వాణిజ్య వృద్ధి అంచనాలను కుదించడానికి కారణమని డబ్ల్యూటీవో తెలిపింది. 2020 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య వృద్ధి 2.7 శాతం ఉంటుందని అంచనా వేయడం కాస్త ఉపశమనం కల్పించేదే. గతంలో వేసిన 3 శాతంతో పోలిస్తే కాస్త తగ్గించింది. -
100 రోజుల యాక్షన్ ప్లాన్
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర పన్నులు, సుంకాల రీఫండ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం ద్వారా ఎగుమతులకు తోడ్పాటునిచ్చే దిశగా ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయంగా కఠినతరమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎగుమతుల వృద్ధికి ఇది తోడ్పడగలదని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ మే 30న కొలువు తీరే కొత్త ప్రభుత్వానికి రూపొందించిన 100 రోజుల ఎజెండాలో ఈ మేరకు 10 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ అమలు చేస్తున్న ఎంఈఐఎస్ పథకం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో అమెరికా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కొత్త స్కీమ్ ప్రవేశపెట్టడం అవసరమవుతోందని వాణిజ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీన్ని కేంద్ర, రాష్ట్ర పన్నులు, సుంకాల పథకంగా వ్యవహరించే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రకారం.. ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో వినియోగించిన ముడివస్తువులపై విధించే అన్–రిబేటెడ్ పన్నులు, సుంకాల సత్వర రీఫండ్‌కు కొత్త స్కీమ్ ఉపయోగపడనుంది. రవాణాకు ఉపయోగించే ఇంధనంపై సెంట్రల్ ఎక్సై జ్ సుంకం/రాష్ట్ర వ్యాట్, మండీ పన్ను, ఎగుమతి పత్రాలపై స్టాంపు డ్యూటీ మొదలైనవి అన్–రిబేటెడ్ పన్నులు, సుంకాల పరిధిలోకి వస్తాయి. ఉత్పత్తి ఆధారిత మద్దతు పథకం.. ఉత్పత్తి ఆధారిత మద్దతు పథకాన్ని కూడా వాణిజ్య శాఖ ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్స్, టెలికం, హై–టెక్ ఇంజనీరింగ్, మెడికల్ డివైజ్‌లు, ఫార్మా తదితర రంగ సంస్థలతో దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ చర్చలు జరుపుతోంది. త్వరలోనే దీన్ని ఖరారు చేసే అవకాశం ఉందని అధికారి వివరించారు. సర్వీసుల రంగం నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ 1న కొత్తగా పంచవర్ష విదేశీ వాణిజ్య విధానాన్ని (2020–2025) కూడా ప్రకటించాలని పది సూత్రాల కార్యాచరణ ప్రణాళికలో వాణిజ్య శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుత పాలసీ గడువు మార్చి 2020 నాటికి ముగుస్తుంది. ఇటు ఆర్థిక వృద్ధి అటు ఉపాధి కల్పనకు ఊతమిచ్చేలా ఎగుమతులను ప్రోత్సహించేందుకు సంబంధించి ఈ విధానంలో మార్గదర్శకాలు ఉంటాయి. ఇప్పటికే అమల్లో ఉన్న కొన్ని కీలక పథకాలను కొనసాగించడంతో పాటు కొత్తగా కొన్ని ఎగుమతి పథకాలను కూడా కొత్త విధానంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారి వివరించారు. మరికొన్ని ప్రతిపాదనలు.. వ్యవసాయ రంగానికి సంబంధించి డబ్ల్యూటీవోతో వివాదాస్పద అంశాల పరిష్కారం, ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్ఈజెడ్)లను పునరుద్ధరించేందుకు చర్యలు, వ్యవసాయోత్పత్తుల ఎగుమతి విధానం అమలు, గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ పోర్టల్‌కు విస్తృత ప్రచారం కల్పించడం, జాతీయ లాజిస్టిక్స్ విధానం అమలు తదితర ప్రతిపాదనలు కూడా వాణిజ్య శాఖ చేసింది. సెజ్‌ల విషయానికొస్తే.. అన్ని సెజ్‌ల ఆర్థిక, పాలనాపరమైన విధానాల్లో ఏకరూపత తీసుకురావడం, కొత్త పెట్టుబడుల అభ్యర్థనల ప్రాసెసింగ్ కోసం సమీకృత ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయడం, నిబంధనలపరమైన వెసులుబాట్లు కల్పించడం వంటి అంశాలు ఉన్నాయి. సెజ్‌లలో పెట్టుబడులను ఆకర్షించడానికి, తయారీ.. ఎగుమతులను ప్రోత్సహించడానికి సాహసోపేతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారి పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలు, అంతర్జాతీయ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లకు అనుకూలంగా కొత్త సెజ్ విధానం ఉండాలని ఆయన తెలిపారు. విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహకాలు.. ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ ప్రకటించాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం వియత్నాంతో దీటుగా ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చిన పక్షంలో భారత్ ఏటా 100 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలదని అంచనాలు ఉన్నాయి. దీనితో పాటు చట్టపరమైన మార్పులతో ఉపాధి కల్పన వ్యూహాలను రూపొందించడం, సానుకూల పన్నుల విధానాలు, సముచితంగా సహజ వనరుల కేటాయింపులు, చిన్న వ్యాపార సంస్థలకు తోడ్పాటు, ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని డీపీఐఐటీ ప్రతిపాదించింది. ప్రతిపాదనల్లోని కొన్ని విశేషాలు.. సానుకూల పన్నుల విధానం అమలు దిశగా.. పెట్రోలియం ఉత్పత్తులు, సహజ వాయువు, విద్యుత్ వంటివాటిని కూడా వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)లోకి చేర్చాలని డిపార్ట్మెంట్ సిఫార్సు చేసింది. వ్యాపార సంస్థల విస్తరణ ప్రణాళికలకు పెద్ద అవరోధాలుగా ఉంటున్న కఠిన కార్మిక చట్టాలను సడలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పార్ట్‌టైమ్, ఫ్రీలాన్స్ ఉపాధి మార్గాలను కూడా కొత్త ఉద్యోగాల కేటగిరీలోకి చేర్చడం ద్వారా వ్యాపారాల నిబంధనలను సరళతరం చేయాలని డీపీఐఐటీ ప్రతిపాదించింది. 6.5 కోట్ల మంది చిన్న వ్యాపారస్తులకు తోడ్పాటునిచ్చేలా జాతీయ రిటైల్ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చిన్న సంస్థలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి, అవి మరింత పోటీతత్వంతో పనిచేయడానికి తోడ్పాటునిచ్చేందుకు చర్యలు ఉండాలని డీపీఐఐటీ పేర్కొంది. -
భారత్‌లో వ్యవసాయ సబ్సిడీలు తక్కువే
న్యూఢిల్లీ: సంపన్న పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో రైతులకిచ్చే సబ్సిడీలు చాలా తక్కువేనని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్ తెలిపారు. సంపన్న దేశాల్లో బిలియన్ల కొద్దీ డాలర్ల మేర రైతాంగానికి సబ్సిడీలు లభిస్తాయని చెప్పారు. భారత్‌లో ఏటా ఒకో రైతుకు సుమారు 250 డాలర్ల సబ్సిడీ మాత్రమే ప్రభుత్వం ఇస్తున్నా.. వ్యవస్థలో లోపాల కారణంగా ఈ కాస్త సబ్సిడీలు కూడా వివాదాలకు దారి తీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సబ్సిడీల అమలు తీరుతెన్నుల గురించి ఇతర దేశాల నుంచి మరింతగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వాధ్వాన్ చెప్పారు. భారత ప్రభుత్వం రైతులకు భారీగా సబ్సిడీలు ఇస్తోందంటూ అమెరికా, యూరోపియన్ యూనియన్‌లోని సంపన్న దేశాలు .. ఆరోపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీవో నిర్దేశిత 10 శాతం పరిమితికి లోబడే సబ్సిడీలు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఎగుమతి సబ్సిడీల వివాదంపై భారత్ మీద అమెరికా.. డబ్ల్యూటీవోకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే వాధ్వాన్ తాజా వివరణనిచ్చారు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆవులకి సంబంధించి ఇచ్చే సబ్సిడీ నిధులతో.. ఓ ఆవు ఖరీదైన విమానం బిజినెస్ తరగతిలో ప్రపంచం మొత్తం రెండు సార్లు చుట్టేసి రావొచ్చన్న జోక్‌ను ఈ సందర్భంగా ఉదహరించారు. అమెరికా, ఈయూ భారీగా సబ్సిడీలు ఇస్తుంటాయని, కానీ వాటిని తెలివిగా డబ్ల్యూటీవో నిర్దేశిత వివిధ పథకాల కింద సర్దేసి చూపించేస్తుంటాయని వాధ్వాన్ చెప్పారు. -
స్మార్ట్‌ఫోన్ పరికరాలపై మరింత బాదుడు
న్యూఢిల్లీ : ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉన్న భారత్, స్థానికతను మరింత పెంచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకుంటున్న కీలక స్మార్ట్‌ఫోన్ పరికరాలపై 10 శాతం పన్ను విధించింది. పాపులేటెడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు వంటి దిగుమతి చేసుకునే కీలక పరికరాలపై ఈ పన్ను విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. పీసీబీలపై 10 శాతం కస్టమ్స్ డ్యూటీని విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఓ నోటిఫికేషన్‌ను జారీచేసింది. పాపులేటెడ్ పీఎస్‌బీలు ఖర్చు స్మార్ట్‌ఫోన్ తయారీ ఖర్చులో సగం భాగముంటున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ డివైజ్‌ల తయారీలో స్థానికతను పెంచి, ఖర్చులను తగ్గించడానికి కీలక స్మార్ట్‌ఫోన్ పరికరాలపై దిగుమతి సుంకాన్ని విధించింది. ఫోన్ల కెమెరా మాడ్యుల్స్, కనెక్టర్స్ వంటి పరికరాలపై కూడా 10 శాతం కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం విధించింది. కాగ, ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ప్రధానమంత్రి దశల వారీ తయారీ ప్రొగ్రామ్‌లో భాగంగా విధిస్తున్నారు. ఈ ప్లాన్‌ను 2016లో ప్రభుత్వం ఆవిష్కరించింది. భారత్‌ను కూడా చైనా మాదిరి తయారీ రంగానికి పవర్‌హౌజ్‌గా మార్చాలని ప్రధాని భావిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాటరీలు, ఛార్జర్లు, ఇయర్ఫోన్లు తక్కువ విలువున్న పరికరాలపై కూడా మెల్లమెల్లగా దిగుమతి సుంకాలను ప్రభుత్వం పెంచుతోంది. అయితే భారత్ విధిస్తున్న ఈ దిగుమతి సుంకాలపై చైనా, కెనడా, అమెరికా దేశాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వద్ద తమ ఆందోళనను వెల్లబుచ్చుకుంటున్నాయి. -
రేటింగ్ సంస్థల లోపాలపై నిఘా!
విశ్లేషణ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చేసే శక్తి క్రెడిట్ రేటింగ్ సంస్థలకు ఉంది కాబట్టి సెబీ వంటి ఆర్థిక రెగ్యులేటరీ వ్యవస్థలు పరపతి సంస్థల అంచనాలపై పూర్తి నిఘా ఉంచి పరిశ్రమ ప్రమాణాలను అవి పాటించేలా చేయాలి. అసాధారణ రేటింగ్‌లు, ఉన్నట్టుండి రేటింగ్లను తగ్గించడంపై అప్రమత్తంగా ఉండాలి. ఒక వ్యక్తిని, ఒక సంస్థనూ, చివరకు ఒక దేశాన్ని కూడా కొలవడం అనేది యుగాలుగా జరగుతున్న ప్రక్రియ. ప్రాచీన చరిత్ర కారుడు హెరొడోటస్ సిరీన్ పండితుడు కల్లిమచుస్తో కలిసి ప్రపంచపు ఏడు వింతల జాబితాను రూపొందించాడు. వాటి విలువను అత్యద్భుతమైన శైలితో వర్ణించాడు. అయితే ఆధునిక క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఇటీవల కాలంలో మాత్రమే వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో 1837లో ఆర్థిక సంక్షోభం వెలుగులో ఇవి మొట్టమొదటి సారిగా ఉనికిలోకి వచ్చాయి. న్యూయార్క్‌లో 1841లో లెవిస్ టప్పన్ తొలి క్రెడిట్ రేటింగ్ సంస్థను నెలకొల్పాడు. వ్యాపారి రుణం చెల్లించే సామర్థ్యాన్ని కొలిచే అవసరంలో భాగంగా ఇవి పుట్టుకొచ్చాయి. అలాంటి డేటాను అప్పట్లో లెడ్జర్లలో పదిలపర్చేవారు. అచిరకాలంలోనే ఈక్విటీ వాటాలకు కూడా వీటిని వర్తింపజేశారు. తర్వాత స్వతంత్ర మార్కెట్ సమాచారం కోసం డిమాండ్ ఏర్పడింది. పరపతి విలువను నిజాయితీగా విశ్లేషించే కొలమానాలను ప్రతిపాదిస్తూ మూడీస్ రేటింగ్స్ సంస్థ ప్రచురణలు పారిశ్రామిక సంస్థలు, వాటి ప్రయోజనాలపై ఉత్తరాల రూపంలో రేటింగ్ ఇచ్చేవి. 1920 నాటికి ప్రపంచంలో మూడు అతిపెద్ద రేటింగ్ సంస్థలు (మూడీస్, ఫిచ్, స్టాండర్డ్ – పూర్) నెలకొన్నాయి. 1960ల నాటికి ఇలాంటి రేటింగ్‌లు వాణిజ్య పత్రాలు, బ్యాంక్ డిపాజిట్లు, గ్లోబల్ బ్యాండ్ మార్కెట్, సావరిన్ బాండ్లకు విస్తరించాయి. అయితే ప్రపంచ వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అనిర్దిష్టమైన, అసందర్భ రేటింగులతో విశ్వసనీయత విషయంలో విఫలమవుతూ వచ్చాయి. దీంతో అమెరికా న్యాయ విభాగం 1996లో మూడీస్ వంటి సంస్థల రేటింగ్ పద్ధతులపై విచారణకు పూనుకుంది. ప్రత్యేకించి ఎన్రాన్ పతనం, అమెరికాలో ఇటీవలి సబ్ ప్రైమ్ దివాళా సంక్షోభం తర్వాత అన్ని క్రెడిట్ రేటింగ్ సంస్థలూ న్యాయవివాదాల్లో చిక్కుకున్నాయి. మూడీస్ అయితే ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ప్రామాణిక రేటింగ్ విధివిధానాలను పాటించనుందుకు గాను అనేక జరిమానాల పాలబడింది. ఒక్క అమెరికాలోనే మూడీస్ సబ్ ప్రైమ్ సంక్షోభంలో దాని పాత్రకు గానూ 864 మిలియన్ల డాలర్ల మేరకు జరిమానా చెల్లించవలసి వచ్చింది. స్టాండర్డ్ – పూర్ కూడా అమెరికన్ ప్రభుత్వానికి 1.4 బిలియన్ డాలర్ల జరిమానాను చెల్లించాల్సి వచ్చింది. భారత్‌లో కూడా రేటింగ్ ఏజెన్సీలకు ద్వంద్వ రికార్డు ఉంది. ఆమ్టెక్ ఆటో, రికోహ్ ఇండియా వంటి కేసుల కారణంగా రేటింగ్ సంస్థలపై సెబీ దర్యాప్తు ప్రారంభించి నిబంధనలను కఠినతరం చేసింది. పరిశ్రమ ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా రేటింగ్ సంస్థలకు ముకుతాడు వేసేందుకు సెబీ రంగం సిద్ధం చేసింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే సరైన అంచనాలను ఇవ్వని రేటింగ్ సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. 1990లలో తూర్పు ఆసియా సంక్షోభం దీనికి తిరుగులేని ఉదాహరణ. అమెరికా, యూరోపియన్ సావరిన్ రుణాల సంక్షోభం, గ్రీస్, పోర్చుగల్, ఐర్లండ్ ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోవడం, యూరో జోన్ కనీవినీ ఎరుగని నిరుద్యోగ సంక్షోభంలో చిక్కుకుపోవడం వంటివి ఇటీవలి ఉదాహరణలు. రేటింగ్ సంస్థల వైఫల్యంతో విసిగిపోయిన రష్యా, చైనా దేశాలు తమ సొంత రేటింగ్ ఏజెన్సీలను ఏర్పర్చుకున్నాయి కూడా. వ్యవస్థాగత లోపాలు చాలా ఉన్నప్పటికీ, క్రెడిట్ రేటింగ్ సంస్థల నుంచి అధిక రేటింగ్ స్థాయిలను పొందడానికి దేశాలు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నాయి. దీన్ని సాకుగా తీసుకుని క్రెడిట్ రేటింగ్ సంస్థలు రేటింగేతర కార్యకలాపాల ద్వారా ఆదాయల సాధనకు పూనుకున్నాయి. ఇలా లాభార్జన కోసం రేటింగ్ సంస్థల పాట్లు అనేవి ప్రయోజనాల మధ్య వైరుధ్యాన్ని తీసుకువచ్చాయి. ఏమైనప్పటికీ మన పురోగమన గమ్యంలో రేటింగ్ సంస్థలను సమర్థంగా ఉపయోగించుకోవలసిన బాధ్యత ఆయా దేశాలపై ఉంది. ఈ క్రమంలో అసాధారణ రేటింగులు, ఉన్నట్లుండి రేటింగులను తగ్గించడం వంటి పరిణామాలపై సెబీ వంటి సంస్థలు నిఘా పెంచాల్సి ఉంది. దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చేసే శక్తి క్రెడిట్ రేటింగ్ సంస్థలకు ఉంది కాబట్టి సెబీ వంటి ఆర్థిక రెగ్యులేటరీ వ్యవస్థలు పరపతి సంస్థల అంచనాలపై పూర్తి నిఘా ఉంచి పరిశ్రమ ప్రమాణాలను అవి పాటించేలా చేయాలి. అలాగే ప్రభుత్వ స్థాయిలో కూడా త్రైమాసికం తర్వాత త్రైమాసికంలో మన పరపతి రేటింగును పెంచుకోవడానికి ప్రయత్నించడం బదులుగా, మన ఆర్థిక విధాన నిర్ణయాలు సంపూర్ణ ఉపాధి, సృజన, ఆవిష్కరణ వంటి ఆర్థిక వృద్ధి విధానాలకు ముందుకు తీసుకుపోయేలా ఉండాలి. - వరుణ్ గాంధీ వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు fvg001@gmail.com -
డబ్ల్యూటీవో సమావేశానికి పాక్ దూరం
ఇస్లామాబాద్: వచ్చే వారం ఢిల్లీలో జరిగే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సమావేశానికి తాము వెళ్లటం లేదని పాకిస్తాన్ తెలిపింది. తమ రాయబార కార్యాలయం అధికారులను భారత్ వేధిస్తున్నందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈనెల 19, 20వ తేదీల్లో ఢిల్లీలో డబ్ల్యూటీవో మంత్రుల స్థాయి అనధికారిక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అమెరికా, చైనా తదితర 50కి పైగా దేశాల ప్రతినిధులు హాజరై వ్యవసాయం, సేవల రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి వాణిజ్య మంత్రి పర్వేజ్ మాలిక్‌ను పంపరాదని నిర్ణయించినట్లు పాక్ తెలిపింది. దీంతోపాటు ఢిల్లీలోని రాయబారి సొహైల్ మహ్మూద్ను పాక్ వెనక్కి పిలిపించుకున్న విషయం తెలిసిందే. -
ఎగుమతులపై అమెరికా పేచీ..
వాషింగ్టన్: ఇటీవలే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలు విధించిన అమెరికా తాజాగా.. భారత్‌లో ఎగుమతి సంస్థలు పొందుతున్న రాయితీలపై దృష్టి సారించింది. భారత్ అమలు చేస్తున్న ఎగుమతి సబ్సిడీ పథకాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో సవాలు చేసింది. ఇవి తమ కార్మికులు, తయారీ సంస్థల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది. ఎగుమతి సంస్థలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా భారత్ కనీసం అరడజను పథకాలు అమలు చేస్తోందని అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్టీఆర్) రాబర్ట్ లైథిజర్ పేర్కొన్నారు. దీంతో ఆయా సంస్థలు అమెరికాలో తక్కువ రేట్లకు ఉత్పత్తులను అమ్ముతున్నాయని, ఫలితంగా సమాన స్థాయి అవకాశాలు లేక అమెరికా కార్మికులు, తయారీ సంస్థల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆయన తెలిపారు. వాణిజ్య ఒప్పందాల్లో తమ హక్కులను కాపాడుకోవడానికి అమెరికా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే .. అమెరికా పర్యటనలో ఉండగా ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇరు దేశాలు ముందుగా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకునేందుకు ప్రయత్నించనున్నాయి. అది కుదరని పక్షంలో డబ్ల్యూటీవో వివాద పరిష్కార కమిటీని అమెరికా ఆశ్రయించనుంది. భారత్ ఇప్పటికే పౌల్ట్రీ, సోలార్ రంగానికి సంబంధించిన కేసులను ఓడిపోయింది. 2016–17లో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 42.21 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. అదే సమయంలో అమెరికా నుంచి భారత్‌కు దిగమతులు 22.30 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏటా 7 బిలియన్ డాలర్ల లబ్ధి.. ఎగుమతి ఆధారిత సంస్థల పథకం, ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీము, స్పెషల్ ఎకనమిక్ జోన్స్ మొదలైనవి ఈ తరహా పథకాల్లో ఉన్నాయని రాబర్ట్ పేర్కొన్నారు. వీటి ద్వారా కొన్ని సుంకాలు, పన్నులు, ఫీజులు మొదలైన వాటి నుంచి ఫార్మా, ఐటీ, టెక్స్టైల్స్, కెమికల్స్ తదితర రంగాల సంస్థలకు భారత్ మినహాయింపులు ఇస్తోందని ఆయన తెలిపారు. తద్వారా వేల కొద్దీ భారతీయ కంపెనీలు.. వార్షికంగా 7 బిలియన్ డాలర్ల మేర లబ్ధి పొందుతున్నట్లు భారత ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 2015లోనే భారత్ ఈ ఎగుమతి సబ్సిడీ పథకాలను ఉపసంహరించాల్సి ఉన్నప్పటికీ.. ఇంకా కొనసాగిస్తోందని రాబర్ట్ ఆరోపించారు. వరుసగా మూడేళ్లుగా భారత్ 1,000 డాలర్ల స్థూల తలసరి జాతీయ ఆదాయ (జీఎన్ఐ) స్థాయి దాటిన నేపథ్యంలో ఎగుమతి సబ్సిడీలను ఇవ్వడానికి అర్హత ఉండదంటూ సంపన్న దేశాలు వాదిస్తున్నాయి. అమెరికాతో చర్చిస్తాం: భారత్ ఎగుమతి సబ్సిడీ పథకాల వివాదంపై అమెరికాతో చర్చలు జరుపుతామని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా తెలిపారు. అమెరికా ముందుగా చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కోరిందని, దానికి అనుగుణంగా ఈ విషయంలో భారత విధానం గురించి వివరిస్తామన్నారు. అమెరికా కూడా సానుకూలంగా స్పందించగలదని ఆశిస్తున్నట్లు రీటా పేర్కొన్నారు. ఆందోళనలో దేశీ సంస్థలు.. సబ్సిడీ పథకాలపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేయడంపై భారత ఎగుమతి సంస్థల్లో ఆందోళన నెలకొంది. ఎకాయెకిన వీటిని ఎత్తివేస్తే దేశీ వ్యాపార సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. ‘భారత ఎగుమతి సంస్థలకు ఇది చాలా ఆందోళనకరమైన విషయం. సదరు ఎగుమతి సబ్సిడీలను క్రమంగా ఉపసంహరించాలే తప్ప ఒకేసారి తొలగించడం తగదు‘ అని ఆయన తెలిపారు. దేశీ ఎగుమతిదారులకు అమెరికా చాలా పెద్ద మార్కెట్ అని, భారత్ మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 14 శాతం ఉంటుందని సహాయ్ వివరించారు. ఎగుమతులు 4.5 శాతం అప్ ఫిబ్రవరిలో 25.8 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: భారత ఎగుమతులు వృద్ధి బాటలో కొనసాగుతున్నాయి. ఫిబ్రవరిలో 4.5 శాతం పెరిగి 25.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మరోవైపు దిగుమతులు కూడా 10.4 శాతం పెరిగి 37.8 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 12 బిలియన్ డాలర్లకు చేరింది. కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా ఈ విషయాలు వెల్లడించారు. ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి సానుకూలంగా ఉంటోందని ఆమె వివరించారు. ప్రధానంగా రసాయనాలు, ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు మెరుగ్గా ఉంటున్నాయని తెలిపారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య కాలంలో భారత్ ఎగుమతులు 11 శాతం వృద్ధి చెంది 273.7 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 21 శాతం వృద్ధి చెంది 416.87 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో చమురు దిగుమతులు 32 శాతం పెరిగాయి. -
అమెరికా చికెన్ దిగుమతుల కేసులో భారత్ అప్పీలు!
న్యూఢిల్లీ: అమెరికా నుంచి చికెన్ ఇతరత్రా పౌల్ట్రీ దిగుమతులపై బ్యాన్ చెల్లదంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఇచ్చిన తీర్పును భారత్ సవాలు చేసే అవకాశం ఉంది. అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తులపై భారత్ విధించిన నిషేధం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని డబ్ల్యూటీఓ కమిటీ ఈ ఏడాది అక్టోబర్14న తీర్పునివ్వడం తెలిసిందే. కాగా, దీనిపై అప్పీలు చేసే అంశాన్ని కేంద్ర వాణిజ్య శాఖ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం పశుసంవర్ధన, డెయిరీ, ఫిషరీస్ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించాయి. డబ్యూటీఓ వివాదాల పరిష్కార కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అప్పీలేట్ విభాగం వద్ద సవాలు చేసేందుకు 60 రోజుల గడువు ఉంటుంది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ భయాలతో 2007లో భారత్ అమెరికా నుంచి పౌల్ట్రీ సహా పలు వ్యవసాయ ఉత్పత్తులపై నిషేధం విధించింది. అయితే, 2012 మార్చిలో దీనిపై డబ్ల్యూటీఓను అమెరికా ఆశ్రయిం చడం... భారత్‌కు వ్యతిరేకంగా ఇటీవలే తీర్పురావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
ఆహార భద్రతపై అంతర్జాతీయ ఒప్పందం
న్యూఢిల్లీ: దేశ ఆహార భద్రత అవసరాలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్య సంస్కరణల ఒప్పందానికి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) అంగీకారం తెలపడంలో భారత్ విజయం సాధించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పైగా ఎలాంటి షరతులు, రాయితీలు లేకుండానే ఈ ఒప్పందం కుదిరిందని నొక్కి చెప్పింది. ఈ మేరకు జెనీవాలో గురువారం రాత్రి చరిత్రాత్మక ఒప్పందం జరిగిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభకు తెలిపా రు. దీనిప్రకారం రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించే విధానాన్ని ఇకపైనా భారత్ కొనసాగించవచ్చని, దీనికి డబ్ల్యూటీవో ఆమోదం తెలిపిందన్నారు. -
‘ఆహార భద్రత’ ఇలాగేనా?!
మూడు నెలలక్రితం ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో ఏర్పడిన వివాదం సమసిపోయింది. వాణిజ్య సౌలభ్య ఒప్పందం(టీఎఫ్ఏ) విషయంలో ఎడ మొహం, పెడమొహంగా ఉన్న భారత్, అమెరికాల మధ్య గురువారం రాజీ కుదిరింది. టీఎఫ్‌ఏపై సంతకం చేయాలంటే... ఆహారభద్రతపై ఎలాంటి ఆంక్షలూ విధించరాదని జెనీవాలో మూడు నెలలక్రితం జరిగిన డబ్ల్యూటీఓ సాధారణ మండలి సమావేశంలో పట్టుబట్టిన మన దేశం వాదనకు అమెరికా పాక్షికంగా అంగీకరించింది. దాని ప్రకారం టీఎఫ్‌ఏపై భారత్ సంతకం చేస్తుంది. అందుకు ప్రతిగా మన ఆహార భద్రత కు సంబంధించిన అంశాలపై తుది పరిష్కారం లభించేవరకూ అగ్రరాజ్యాలు ఆంక్షలకు పట్టుబట్టవు. 2017 వరకూ ఆహారభద్రత జోలికి అగ్రరాజ్యాలు రాకుండా ఉంటే టీఎఫ్‌ఏపై సంతకం చేస్తామని నిరుడు బాలి సదస్సులో మన దేశం అంగీకరించింది. అదే సమయంలో టీఎఫ్‌ఏపై మరిన్ని తదుపరి చర్చలు అవసరమని చెప్పింది. అయితే, బాలి సదస్సు తర్వాత టీఎఫ్ఏ విషయంలోగానీ, మన ఆహారభద్రత విషయంలోగానీ అగ్రరాజ్యాలు కిమ్మనలేదు. చర్చలకు చొరవ తీసుకోలేదు. తీరా జెనీవా సమావేశం నాటికి తొలుత అంగీకరిం చినట్టు టీఎఫ్‌ఏపై సంతకం చేయాలని కోరాయి. దీన్ని మన దేశం తీవ్రంగా వ్యతిరేకించింది. పర్యవసానంగా అది కాస్తా ప్రతిష్టంభనతో ముగిసింది. టీఎఫ్ఏ విషయంలో ఇలా మన దేశం ఆఖరి నిమిషంలో అడ్డం తిరిగినందువల్ల ప్రపంచం లోనే ఏకాకులమయ్యామని ప్రముఖ ఆర్థికవేత్తలు నొచ్చుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో లక్ష కోట్ల డాలర్ల మేరకు విస్తరించే బంగారంలాంటి అవకాశాన్ని కాలరాస్తున్నామని విమర్శించారు. రెండున్నర దశాబ్దాల తర్వాత బాలి సదస్సు చరిత్రాత్మకమైన అంగీకారానికొస్తే మన దేశం జెనీవాలో దాన్ని కాస్తా నీరుగార్చిం దన్నారు. అసలు సంబంధమే లేని టీఎఫ్ఏ అంశంతో ఆహారభద్రతను ముడిపెట్ట డం తప్పని వాదించారు. అలాంటివారంతా ప్రస్తుత రాజీపై హర్షామోదాలు వ్యక్తంచేస్తున్నారు. ఇది మనకు దౌత్యపరమైన విజయమని అభివర్ణిస్తున్నారు. దేశ ప్రయోజనాల విషయంలో ఎన్డీయే సర్కారు రాజీపడని ధోరణిని ప్రదర్శించినందుకు మెచ్చుకున్నవారూ చాలామందే ఉన్నారు. టీఎఫ్ఏ వల్ల అగ్రరాజ్యాలు చెబుతున్నట్టు అంతర్జాతీయ వాణిజ్యం మరో లక్ష కోట్ల డాలర్ల మేర పెరగవచ్చు. పారిశ్రామిక ఉత్పత్తులు, ఇతర సరుకులు స్వేచ్ఛగా ఒక చోటునుంచి మరో చోటుకు కదులుతాయి. వాటిపై నిర్దిష్టమైన పరిమితులకు మించి సుంకాలు విధించడం దేశాలకు సాధ్యంకాదు. ఇదంతా ప్రధానంగా పారిశ్రామిక దేశాలకు ఉపయోగపడుతుంది. అంతేకాదు...వర్థమాన దేశాలు, బడుగు దేశాలు అమెరికా, యూరోప్ ప్రమాణాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. అందుకోసమని భారీ మొత్తాల్లో పెట్టుబడులను సమీకరించుకోక తప్పదు. మళ్లీ అందుకు అవసరమైన సాంకేతికతను అగ్రరాజ్యాలనుంచే కొనుగోలు చేయాలి. అంటే టీఎఫ్ఏ వల్ల అన్నివిధాలా బాగుపడేది అగ్రరాజ్యాలే. పైగా టీఎఫ్ఏలోని ఒక క్లాజు మొత్తం వ్యవసాయోత్పత్తుల విలువలో సబ్సిడీల శాతం 10 శాతానికి మించరాదని చెబుతున్నది. దీన్ని ఉల్లంఘించిన దేశంపై ఇతర దేశాలు వాణిజ్యపరమైన ఆంక్షలు విధించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే టీఎఫ్ఏ వర్థమాన దేశాలపాలిట యమపాశమవుతుంది. వర్థమాన దేశాలన్నీ ప్రధానంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడతాయి. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు వ్యవ సాయంతో ముడిపడి ఉంటాయి. అందువల్లే రైతులకు సబ్సిడీ ధరలపై ఎరువులు అందించాల్సి ఉంటుంది. అదే సమయంలో నిరుపేద వర్గాలవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీ ధరలకు తిండిగింజలు అందించాల్సి ఉంటుంది. అందు కోసమని ఎఫ్‌సీఐ ద్వారా ఆహార ధాన్యాల సేకరణ చేయాలి. వ్యవసాయ రంగానికి వర్థమాన దేశాలిచ్చే ఇలాంటి రక్షణల వల్ల స్వేచ్ఛా వాణిజ్య స్ఫూర్తి దెబ్బతిం టుందని అగ్రరాజ్యాలు వాదిస్తున్నాయి. వాస్తవానికి ఈ రక్షణలు లేకపోతే అటు వ్యవసాయరంగమూ దెబ్బతింటుంది...ఇటు నిరుపేదలకు తిండిగింజలు అందు బాటులో ఉండవు. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో పడుతుంది. టీఎఫ్ఏ విషయంలో గట్టిగా నిలబడినందుకు మోదీ సర్కారును అభినందించాల్సిందే. అయితే అదే సమయంలో దేశీయంగా తీసుకున్న కొన్ని చర్యలు వ్యవసాయరంగానికి తోడ్పడేవి కాదు. ఉదాహరణకు పంటలకిచ్చే కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విషయంలో ఈసారి కేంద్రం ఉదారంగా వ్యవహరించ లేదు. అటు వరికైనా, ఇటు గోధుమకైనా నిరుటితో పోలిస్తే క్వింటాల్‌కు పెంచిన ధర రూ. 50 మాత్రమే. అంతేకాదు...తాను ప్రకటించే ఎంఎస్పీపై రాష్ట్రాలు బోనస్ ఇచ్చే విధానాన్ని నిరుత్సాహపరచాలని మొన్నటి జూన్‌లో నిర్ణయించింది. ఇలాంటి నిర్ణయాలు పరోక్షంగా మన ఆహార భద్రతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. అంతర్జాతీయ వేదికలపై ఆహారభద్రతను సంరక్షించుకోవడానికి పోరాడుతూనే దాన్ని దెబ్బతీసే విధానాలను మనమే అమలు చేయబూనడం న్యాయం అనిపించుకోదు. ఇప్పటికే వ్యవసాయానికి చేసే వ్యయం భారీగా పెరిగిపోతుండగా, అందుకు అనుగుణంగా తన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించక రైతాంగం విలవిల్లాడుతున్నది. రైతులు ఎక్కువగా వినియోగించే డీఏపీ అయినా, పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల ధరలైనా ఈ రెండు మూడేళ్లలోనే ఎంతగా పెరిగాయో అందరికీ తెలుసు. అదునుకు వర్షాలు కురవక, అనువుగాని సమయంలో కుంభవృష్టి కురిసి అన్నివిధాలా నష్టపోతున్న రైతును ప్రభుత్వ విధానాలు కూడా చావుదెబ్బ తీయడం సరికాదు. డబ్ల్యూటీఓ వంటి అంతర్జాతీయ వేదికలపై పోరాడిన స్ఫూర్తినే ఇక్కడి విధానాల రూపకల్పనలో కూడా చూపి ఆహార భద్రత దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పాలకులు గ్రహించాలి. -
ప్రధాని వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) వద్ద పేదల ప్రయోజనాలను గత యూపీఏ ప్రభుత్వం పణంగా పెట్టిందన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యలపై సోమవారం రాజ్యసభ దద్ధరిల్లింది. ఈ వ్యాఖ్యపై ప్రధాని వివరణ ఇవ్వాలని, దీనిపై చర్చ కూడా జరగాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దీనికి సంబంధించి వాణిజ్య శాఖ సహాయమంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలకు, ప్రధాని వ్యాఖ్యలకు పొంతన లేదని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉండగా.. ప్రజలకు తప్పుడు సమాచారంఇచ్చి పార్లమెంటు ప్రతిష్టను ప్రధాని దిగజార్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళన వల్ల ప్రశ్నోత్తరాల సమయంలో సభ రెండు సార్లు వాయిదా పడింది. బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో శనివారం ప్రధాని ప్రసంగిస్తూ.. డబ్ల్యూటీవో ఒప్పందం పై సంతకం చేసి పేద రైతుల ప్రయోజనాలకు యూపీఏ దెబ్బతీసిందని విమర్శించిన విషయం తెలిసిందే. ‘ప్రధాని వ్యాఖ్యలకు విరుద్ధంగా.. డబ్ల్యూటీవో వద్ద యూపీఏ వైఖరినే కొనసాగిస్తున్నామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీనిపై ప్రధాని వివరణ కావాలి’ అని వాణిజ్య శాఖ మాజీ మంత్రి ఆనంద్‌శర్మ డిమాండ్ చేశారు. -
రైతు ప్రయోజనాలపై రాజీ లేదు: కేంద్రం
ప్రపంచ వాణిజ్య సంస్థకు ఇదే చెప్పాం కేంద్ర మంత్రి సీతారామన్ వెల్లడి న్యూఢిల్లీ: నిరుపేద రైతులు, వినియోగదారుల ప్రయోజనాల విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)తో రాజీ పడబోమని కేంద్రం చెప్పింది. ధాన్యాల భారీ నిల్వ అంశంపై పూర్తి తీర్మానాన్ని అందజేయూల్సిందిగా డబ్ల్యూటీవోను కోరామంది. దేశ ఆహార భద్రతా కార్యక్రమాన్ని అవరోధాలూ లేకుండా అమలు చేయడానికి ఇది అవశ్యకమని పేర్కొంది. అనిశ్చితి, అస్థిరత్వం కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార భద్రత అనేది మానవతా పరమైన అంశమని, వ్యాపారపరమైన సౌలభ్యాల కోసం దాన్ని పణంగా పెట్టలేమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు. ఇటీవలి డబ్ల్యూటీవో జెనీవా చర్చలు విఫలం కావడానికి కారణమైన ప్రభుత్వ వైఖరిని సమర్థించుకున్నారు. సంపన్న దేశాలకు ప్రీతిపాత్రమైన ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంటును (టీఎఫ్ఏ) అంగీకరించరాదని నిర్ణరుుంచినట్లు తెలిపారు. ఆహార సబ్సిడీ అనేది ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తి విలువలో 10 శాతం మేరకే ఉండాలని ప్రస్తుత డబ్ల్యూటీవో నిబంధనలు స్పష్టం చేస్తున్నారుు. అరుుతే ఎలాంటి జరిమానాలకు ఆస్కారం లేకుండా.. కనీస మద్దతు ధరకు ఆహారధాన్యాలు సేకరించి వాటిని చవక ధరలకు విక్రరుుంచేందుకు వీలు గా వ్యవసాయ సబ్సిడీల లెక్కింపు నిబంధనలు సవరించాలని మన దేశం డిమాండ్ చేస్తోంది. ప్రజలకు చేరవేయండి: బీజేపీ రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ప్రజలకు తెలియజేయూలని బీజేపీ తమ ఎంపీలను కోరింది. ఆహార భద్రత అంశంపై డబ్ల్యూటీవోతో జరిగిన చర్చల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు వివరించారు. ఇలావుండగా సీశాట్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయూన్ని కూడా ఆయన వెల్లడించారు. ఈ సమావేశం వివరాలను బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విలేకరులకు తెలియజేశారు. -
రైతు ప్రయోజనాలే ముఖ్యం
కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ స్పష్టీకరణ డబ్ల్యూటీవోలో సంపన్న దేశాల ఒత్తిడిని తట్టుకుంటాం ప్రజల పొదుపు మొత్తాలే దేశానికి పెట్టుబడి న్యూఢిల్లీ: రైతుల ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) చర్చల్లో అభివృద్ధి చెందిన దేశాల ఒత్తిడికి తలొగ్గి భారతీయ రైతులకు నష్టం కలిగేలా వ్యవహరించబోమని హామీ ఇచ్చారు. ‘ఈ విషయంలో ప్రపంచంలోని బలమైన దేశాలతో దృఢంగా వ్యవహరించాల్సి ఉంది’ అన్నారు. గత ప్రభుత్వ విధానాలనే తామూ కొనసాగిస్తే.. చిన్న రైతుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగేదని వ్యాఖ్యానించారు. బీజేపీ ఢిల్లీ శాఖ శనివారం ఏర్పాటు చేసిన బడ్జెట్‌పై చర్చ’ కార్యక్రమంలో జైట్లీ ప్రసంగించారు. ‘‘ఆహార భద్రత విషయంలో భారత్ దృఢంగా వ్యవహరించినందువల్ల ఇటీవల జెనీవాలో జరిగిన డబ్ల్యూటీవో చర్చలు విఫలమయ్యాయి. మాకు రైతుల ప్రయోజనాలే ముఖ్యం. మాపై చాలా ఒత్తిడి ఉంది. అయినా అన్ని చర్చల్లోనూ పాల్గొనాలి. పేద రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో వెనక్కుతగ్గొద్దని గట్టిగా నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు. భారత్‌లోని చిన్న, సన్నకారు రైతులు దారుణమైన కష్టాల్లో ఉన్నారని, వ్యవసాయం కోసం అప్పు తెచ్చి, ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొదుపే పెట్టుబడి.. ప్రజలు బ్యాంకుల్లో చేసే పొదుపు మొత్తాలు దేశానికి పెట్టుబడిలా ఉపయోగపడ్తాయని అరుణ్ జైట్లీ అన్నారు. ప్రజలందరికీ బ్యాంకు సేవలు అందించడం లక్ష్యంగా ‘ఫైనాన్స్ ఇన్‌క్లూజన్’ ప్రచార కార్యక్రమాన్ని ఈనెల 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించనున్నారని జైట్లీ వెల్లడించారు. డబ్ల్యూటీవోలో భారత్ వాదనేంటి? వ్యవసాయ సబ్సిడీలపై భారత్ అభ్యంతరాలను సంపన్న దేశాలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఇటీవల జెనీవాలో జరిగిన డబ్ల్యూటీవో చర్చలు విఫలమయ్యాయి. భారత్ లేవనెత్తుతున్న అంశాలను పట్టించుకోకుండా.. వాణిజ్య సౌలభ్య ఒప్పందం(ట్రేడ్ ఫెలిసిటేషన్ అగ్రిమెంట్-టీఎఫ్ఏ)ను ఉన్నదున్నట్లుగా భారత్ అంగీకరించాలని ఆ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఆహారోత్పత్తుల నిల్వ, ఆహార సబ్సిడీల లెక్కింపుకు సంబంధించి డబ్ల్యూటీవో నిబంధనల్లో సవరణలు కావాలని భారత్ కోరుతోంది. మొత్తం ఆహారోత్పత్తుల విలువలో సబ్సిడీలు 10 శాతంగా ఉండాలని ప్రస్తుత డబ్ల్యూటీవో నిబంధనలు చెబుతున్నాయి. అయితే, 20 ఏళ్ల కిందటి ధరల ఆధారంగా వాటిని లెక్కిస్తున్నారు. సబ్సీడీల విషయంలో 1986-87ను ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకోవద్దని, ప్రస్తుత ద్రవ్యోల్బణం, కరెన్సీ హెచ్చుతగ్గుల్ని పరిగణనలోకి తీసుకుని ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చాలని భారత్ కోరుతోంది. అలాగే, 10% ఆహార సబ్సిడీతో భారత్‌లో ఆహార భద్రత పథకాన్ని అమలు చేయడం సాధ్యంకాదు. అది 10% దాటితే.. భారత్‌పై జరిమానాలు, ఆంక్షలు విధించే అవకాశముంది.