న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు అక్టోబర్‌లో (2022 ఇదే నెలతో పోల్చి) 6.21 శాతం పెరిగాయి. విలువలో 33.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెపె్టంబర్‌లో 2.6 శాతం క్షీణించాయి. తాజా సమీక్షా నెల అక్టోబర్‌లో మళ్లీ సానుకూల ఫలితం వెలువడింది. 2023లో ప్రపంచ వాణిజ్యవృద్ధి కేవలం 0.8 శాతంగా ఉంటుందన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిరాశాపూరిత వాతావరణం, భారత్ విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
వాణిజ్యలోటు 31.46 బిలియన్ డాలర్లు
ఇక దేశ వస్తు దిగుమతుల విలువ ఎగువబాట పట్టింది. 2022 డిసెంబర్ నుంచి 2023 సెపె్టంబర్ వరకూ వరుసగా 10 నెలల క్షీణతలో ఉన్న దిగుమతుల విలువ అక్టోబర్‌లో 12.3 శాతం పెరిగి 65.03 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సమీక్షా నెల్లో 31.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది కొత్త రికార్డు.
కొన్ని ముఖ్యాంశాలు చూస్తే..
► అక్టోబర్‌లో పసిడి దిగుమతులు 95.5 శాతం పెరిగి 7.23 బిలియన్ డాలర్లకు చేరాయి.
► చమురు దిగుమతుల బిల్లు 8 శాతం ఎగసి 17.66 బిలియన్ డాలర్లుగా ఉంది.
► మొత్తం 30 కీలక రంగాల్లో 22 రంగాల్లో ఎగుమతులు సానుకూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. వీటిలో ముడి ఇనుము, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఫార్మా, ఎల్రక్టానిక్ గూడ్స్, కార్పెట్, ప్లాస్టిక్, మెరైన్, ఇంజనీరింగ్ గూడ్స్ ఉన్నాయి.
ఏప్రిల్–అక్టోబర్ మధ్య క్షీణ గణాంకాలే..
ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 7% క్షీణించి 244.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.95% క్షీణించి 391.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు ఈ 7 నెలల్లో 147.07 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ కాలంలో పసిడి దిగుమతులు 23% పెరిగి 29.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ దిగుమతుల బిల్లు మాత్రం 18.72% తగ్గి 100 బిలియన్ డాలర్లకు చేరింది.
మళ్లీ ‘ప్లస్’లోకి.. ఎగుమతులు
Published Thu, Nov 16 2023 4:55 AM | Last Updated on Thu, Nov 16 2023 4:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment