Merchandise
-
ఎగుమతులు రికార్డ్
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు ఫిబ్రవరిలో రికార్డు సృష్టించాయి. 11 నెలల గరిష్ట స్థాయిలో 41.40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2023 ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో ఎగుమతుల వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్, ఫార్మా ఎగుమతులు పెరగడం మొత్తం సానుకూల గణాంకాలకు దారితీసింది. ఇక ఇదే కాలంలో దిగుమతులు 12.16 శాతం పెరిగి 60.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 18.70 బిలియన్ డాలర్లు. ► పసిడి దిగుమతులు ఫిబ్రవరిలో గణనీయంగా 133.82% పెరిగి, 6.15 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో 39% పెరిగి 44 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు ఫిబ్రవరిలో 15.9 శాతం పెరిగి 9.94 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు 55 శాతం ఎగసి 3 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకూ ఎగుమతుల (వస్తువులు, సేవలు) విలువ 0.83 శాతం వృద్ధితో 709.81 బిలియన్ డాలర్లు. ఇదే కాలంలో దిగుమతుల విలువ 782.05 బిలియన్ డాలర్లు. ► 2021–22లో ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లయితే, దిగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లు. 2022–23లో వస్తు ఎగుమతులు 450 బిలియన్ డాలర్లు. దిగుమతులు 714 బిలియన్ డాలర్లు. -
మళ్లీ ‘ప్లస్’లోకి.. ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు అక్టోబర్‌లో (2022 ఇదే నెలతో పోల్చి) 6.21 శాతం పెరిగాయి. విలువలో 33.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెపె్టంబర్లో 2.6 శాతం క్షీణించాయి. తాజా సమీక్షా నెల అక్టోబర్‌లో మళ్లీ సానుకూల ఫలితం వెలువడింది. 2023లో ప్రపంచ వాణిజ్యవృద్ధి కేవలం 0.8 శాతంగా ఉంటుందన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిరాశాపూరిత వాతావరణం, భారత్ విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. వాణిజ్యలోటు 31.46 బిలియన్ డాలర్లు ఇక దేశ వస్తు దిగుమతుల విలువ ఎగువబాట పట్టింది. 2022 డిసెంబర్ నుంచి 2023 సెపె్టంబర్ వరకూ వరుసగా 10 నెలల క్షీణతలో ఉన్న దిగుమతుల విలువ అక్టోబర్‌లో 12.3 శాతం పెరిగి 65.03 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సమీక్షా నెల్లో 31.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది కొత్త రికార్డు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► అక్టోబర్‌లో పసిడి దిగుమతులు 95.5 శాతం పెరిగి 7.23 బిలియన్ డాలర్లకు చేరాయి. ► చమురు దిగుమతుల బిల్లు 8 శాతం ఎగసి 17.66 బిలియన్ డాలర్లుగా ఉంది. ► మొత్తం 30 కీలక రంగాల్లో 22 రంగాల్లో ఎగుమతులు సానుకూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. వీటిలో ముడి ఇనుము, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఫార్మా, ఎల్రక్టానిక్ గూడ్స్, కార్పెట్, ప్లాస్టిక్, మెరైన్, ఇంజనీరింగ్ గూడ్స్ ఉన్నాయి. ఏప్రిల్–అక్టోబర్ మధ్య క్షీణ గణాంకాలే.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 7% క్షీణించి 244.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.95% క్షీణించి 391.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు ఈ 7 నెలల్లో 147.07 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ కాలంలో పసిడి దిగుమతులు 23% పెరిగి 29.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ దిగుమతుల బిల్లు మాత్రం 18.72% తగ్గి 100 బిలియన్ డాలర్లకు చేరింది. -
రవాణా ఖర్చుల భారం..తక్కువ డిమాండ్.. ఇబ్బందుల్లో ఎంఎస్ఎఈలు
న్యూఢిల్లీ: ఒకవైపు డిమాండ్ తగ్గడం, మరోవైపు అధిక రవాణా చార్జీల కారణంగా పెరిగిపోయిన తయారీ వ్యయాల భారం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలుగా ఓ సర్వే తెలిపింది. ఈ సర్వే నివేదికను భారతీయ యువశక్తి ట్రస్ట్ (బీవైఎస్టీ) విడుదల చేసింది. మార్కెట్ స్థిరపడినప్పటికీ, 57 శాతం ఎంఎస్ఎంఈలు తాము కొత్త ఆర్డర్లను పొందడంలో సమస్యలు చవిచూస్తున్నట్టు చెప్పాయి. వినియోగదారుల తక్కువ కొనుగోలు శక్తి డిమాండ్ తగ్గేందుకు దారితీసినట్టు బీవైఎస్టీ మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ పేర్కొన్నారు. ఈ సర్వేలో 5,600 మంది ఎంఎస్ఎంఈలు పాల్గొన్నాయి. ‘‘కరోనా ప్రభావం క్రమంగా సమసిపోతోంది. అయినప్పటికీ ఎన్నో అంశాల వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఇంకా కుదురుకోవాల్సి ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది. రుణ వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోతున్నామని 27 శాతం ఎంఎస్ఎంఈలు చెప్పాయి. కరోనా ముందు నాటితో పోలిస్తే కొన్ని అంశాల్లో మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు 53 శాతం తెలిపాయి. -
ఫుట్‌బాల్ ఆటగాడి మెడకు బిగుస్తున్న ఉచ్చు..
మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఫుట్‌బాలర్ మాసన్ గ్రీన్వుడ్ మెడకు ఉచ్చు మరింత బిగుస్తుంది.సెక్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాసన్ గ్రీన్‌వుడ్‌ను గత ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై బలవంతగా లైంగిక వేధింపులకు దిగినట్లు వచ్చిన వార్తలు నిజమా కాదా అనేది నిర్థారించాల్సి ఉంది. అయితే మాంచెస్టర్ యునైటెడ్ మొదట మాసన్ గ్రీన్వుడ్ విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు. చదవండి: ఫుట్‌బాల్ ఆటగాడిపై ఆరోపణలు.. సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్ తాజాగా అతనిపై వచ్చిన సెక్స్ ఆరోపణలు నిజమేనని తెలియడంతో ఫుట్‌బాల్ క్లబ్ కూడా గ్రీన్‌వుడ్‌పై కఠిన చర్యలు తీసుకుంది. తక్షణమే గ్రీన్‌వుడ్‌ను క్లబ్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. తన తప్పు లేదని నిరూపించుకునేవరకు గ్రీన్వుడ్ ఏ క్లబ్ తరపున ఫుట్‌బాల్ ఆడకుండా ఫుట్‌బాల్ సమాఖ్యకు సిఫార్సు చేసినట్లు పేర్కొంది. దీనికి తోడూ అన్ని ఎండార్స్మెంట్ల నుంచి గ్రీన్‌వుడ్‌ను తొలగిస్తున్నామంటూ తమ అధికారిక వెబ్సైట్లో అతని పేరు తొలగించిన పేజ్‌ను విడుదల చేసింది. ఇక గ్రీన్‌వుడ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న నైక్ కంపెనీ తమ స్పాన్సర్సిప్ను రద్దు చేసుకుంటున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ''మాసన్ గ్రీన్‌వుడ్‌పై వస్తున్న ఆరోపణలు మమ్మల్ని ఆలోచనలో పడేశాయి. అందుకే తాత్కాలింకగా అతనితో స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసుకుంటున్నాం. పరిస్థితిని గమనిస్తున్నాం.'' అంటూ తెలిపింది. ఇక హారిట్ రాబ్సన్ అనే యువతి మాసన్ గ్రీన్‌వుడ్‌కు మాజీ గర్ల్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకుంటూ గత ఆదివారం కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. తనతో శృంగారంలో పాల్గొనాలని చెప్పాడని.. మాట విననందుకు తన శరీర భాగాలపై దాడి చేశాడంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ తర్వాత హారిట్- గ్రీన్‌వుడ్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపును కూడా రిలీజ్ చేయడం సంచలనం రేపింది. -
'బాహుబలి 2' కోసం వినూత్న ప్రచారం
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి.. మరిన్ని సంచలనాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొలి భాగంతో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న బాహుబలి టీం, ఇప్పుడు రెండో భాగం కోసం మరింత భారీగా రెడీ అవుతోంది. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. తొలి భాగం ఘనవిజయం సాధించటంతో బాహుబలి పార్ట్ 2 మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అయితే సినిమా విడుదలకు ఏడాది సమయం ఉండటంతో ఈ హైప్ ఇలాగే కంటిన్యూ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా. అందుకే హాలీవుడ్ తరహాలో సినిమా క్యారెక్టర్స్‌తో బొమ్మలు, వీడియో గేమ్‌లు రూపొందించి మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ జరుపుకుంటోంది. హలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలయ్యేనా ?
ఢిల్లీలో నేడు 14వ ఆర్థిక సంఘంతో ఆర్థికమంత్రుల భేటీ హక్కు కోల్పోతామంటున్న రాష్ట్రాలు హైదరాబాద్:దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను ల విధానం తీసుకొచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కసరత్తు కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాలు విడివిడిగా అమలు చేస్తున్న సర్వీస్టాక్స్, సేల్స్టాక్స్లను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి కేంద్రం ద్వారానే ‘సరుకు, సేవా పన్ను (జీఎస్టీ)’ను దేశవ్యాప్తం గా అన్ని రాష్ట్రాల్లో వర్తింపజేయాలని మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ జీఎస్టీ విధానాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలే వ్యతిరేకించినందున ప్రస్తుతం అన్ని రాష్ట్రాలను నయానో, భయానో ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. మోడీ హయాంలో గత జూలై 3న, ఆగస్టు 20న అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కేంద్రం సమావేశమైంది. మూడోవిడతగా బుధవారం నాడు 14వ ఆర్థిక సంఘం ద్వారా ఢిల్లీలో ఆర్థికమంత్రుల సాధికారిక కమిటీ సమావేశమవుతోంది. సమావేశంలో జీఎస్టీపై కీలక నిర్ణ యం తీసుకోవాలన్న యోచనలో కేంద్రం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రాల వ్యతిరేకతకు కారణం ఇదే.. అమ్మకం పన్నుల విధింపు అధికారం రాజ్యాం గం ద్వారా రాష్ట్రాలకు సంక్రమించింది. దీని ప్రకారం వస్తు తయారీ మొదలు వినియోగదారుడికి చేరే వరకు అమ్మకం పన్నులు ఆయా రాష్ట్రాలే నిర్ణయించి విధిస్తాయి. ప్రస్తుతం అమలులో ఉన్న సీఎస్టీ (కేంద్ర అమ్మకపు పన్ను) 2004 వరకు 4 శాతం ఉండేది. దీనిలో వాటా మాత్రమే కేంద్రానికి దక్కేది. 2005లో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను కేంద్రం తీసుకొచ్చిన తర్వాత సీఎస్టీ 2 శాతానికి పడిపోయింది. అదే సమయంలో వ్యాట్ ద్వారా కేంద్రానికి ఆదాయం సమకూరింది. వ్యాట్ వల్ల కోల్పోయిన నష్టాన్ని పూడుస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లలో జీఎస్టీని తీసుకురావాలని చేసిన ప్రయత్నాలు రాష్ట్రాల సహాయ నిరాకరణ వల్ల అమలు కాలేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు ఇవ్వడానికి ముందుకొస్తోంది. జీఎస్టీ వల్ల ఏం జరగబోతుంది..? ► సేవా రంగంలో పన్నులు వేసే అధికారం రా ష్ట్రాలకు సంక్రమిస్తుంది. వాణిజ్య, వ్యాపార పన్నుల అధికారం కేంద్రం చేతిలోకి వె ళ్తుంది. ► దేశమంతా ఒకే పన్నుల విధానం అమలు. ► రాష్ట్రాల మధ్య పన్నుల రేట్లలో ఉన్న తేడాలు తొలగిపోతాయి. ► దేశమంతా సింగిల్మార్కెట్గా మారుతుంది. ► విదేశీ మార్కెట్లో దేశానికి ప్రాధాన్యం పెరుగుతుంది. ► వ్యాట్ వల్ల ధరలు దేశవ్యాప్తంగా ఏకీకృతమయినట్టే పన్నుల విధానంలో గణనీయమైన మార్పు వస్తుంది. ► అదే సమయంలో ఒకే వ్యాపారి/ ఉత్పత్తిదారుడుపై కేంద్రం, రాష్ట్రం పెత్తనం(డ్యుయల్ కంట్రోల్) ఉంటుంది. ► చట్టాన్ని అమలుపై కేంద్ర, రాష్ట్ర పన్నుల శాఖల మధ్య వివాదాలు ఏర్పడే ఆస్కారం. ► జీఎస్టీ అమలైతే రాష్ట్రాల పన్నుల విధానంలో సమూల మార్పులకు అవకాశం, వాణిజ్య పన్నుల శాఖలు నిర్వీర్యం. ► రాష్ట్రాల్లోని వాణిజ్య పన్నుల శాఖల్లోని ఉద్యోగుల హోదాల్లో మార్పులకు అవకాశం. జీఎస్టీ పరిహారానికి రాజ్యాంగబద్ధత కల్పించాలి: యనమల వస్తు అమ్మకం పన్ను (జీఎస్టీ) అమలు చేయ డంలో అభ్యంతరం లేదని, అయితే వ్యాట్‌కు బ దులు జీఎస్టీని అమల్లోకి తేవడం ద్వారా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో తగ్గుదలను కేంద్ర ప్రభుత్వం పరిహారంగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరనుంది. జీఎస్టీ అమలుపై కేంద్ర సాధికారిక కమిటీ బుధవారం ఢిల్లీల్లో నిర్వహించే సమావేశానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరు కానున్నారు. జీఎస్టీ రాజ్యాంగబద్ధత కల్పించాలని మంత్రి యనమల సాధికారిక కమిటీకి స్పష్టం చేయనున్నారు. జీఎస్టీ అమలైతే... గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) పేరుతో ఏకీకృత పన్నుల విధానం అమలైతే దేశంలో అన్నిరాష్ట్రాల్లో ఒకే పన్నుల విధానం అమలులోకి వస్తుంది. రాష్ట్రాలు సొంతగా పన్నులు విధించే హక్కును కోల్పోతాయి. దీంతో సేవాపన్నుల విధానాన్ని కేంద్రం రాష్ట్రాలకు దఖలు పరిచేందుకు సిద్ధమైంది. గుజరాత్ రాష్ట్ర ఆర్థికమంత్రి గత నెల 20న జరిగిన ఆర్థిక మంత్రుల సమావేశంలో జీఎస్టీ విధానంపై పెదవి విరిచారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుజరాత్‌పై కేంద్రం పన్నుల పెత్తనాన్ని తీసుకోవడాన్ని ఆయన వ్యతిరేకించినట్టు తెలిసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు గతంలో వ్యాట్‌నే వ్యతిరేకించాయి. ఇప్పుడు ఈ కొత్త విధానం ద్వారా తమ హక్కులను కేంద్రం హరిస్తోందన్న అనుమానాలను వ్యక్తం చేశాయి. జీఎస్టీ అమలైతే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏంటనే అనుమానాన్ని సగం రాష్ట్రాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తమకు రాజకీయ హామీలు కాకుండా చట్టపరమైన హామీ కావాలని రాష్ట్రాలు కోరుతున్నాయి.