Exports of goods
-
2030 నాటికి రూ.8 లక్షలకోట్ల ఎగుమతులు..?
ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నాయి. భారత్ మాత్రం ఎగుమతుల జోరుతో ముందుకు సాగుతోంది. గత ఏడాదికన్నా ప్రస్తుత సంవత్సరంలో అధిక ఎగుమతులు సాధించింది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఇండియా ఎగుమతుల్లో ముందడుగు వేయడం కీలక పరిణామం. దేశీయ వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు రానున్న రోజుల్లో రెట్టింపు అవుతాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్తావాల్ చెప్పారు. ఇటీవల జరిగిన ‘ఇండస్‌ఫుడ్ షో 2024’ కార్యక్రమంలో భర్తావాల్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం రూ.4 లక్షలకోట్లుగా ఉన్న వ్యవసాయ ఎగుమతులు 2030 సంవత్సరానికల్లా దాదాపు రూ.8 లక్షలకోట్లకు చేరుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. రెడీ-టూ-ఈట్ ఫుడ్ తదితర విభాగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, దిగుమతి దేశాల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక ప్రమాణాల్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమలకు సూచించారు. ఈ షోను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ బియ్యం, గోధుమ, చక్కెర తదితర ఎగుమతులపై నియంత్రణలు విధించినప్పటికీ, వాటి ఎగుమతి పెరిగిందన్నారు. ఇదీ చదవండి: రాష్ట్రంలో పన్ను ఎగవేస్తున్న సంస్థలు ఎన్నంటే.. ప్రపంచ దేశాల్లో భారత్ ఎనిమిదో అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దేశంగా ఉంది. 2022-23 మొదటి మూడు త్రైమాసికాల్లో ప్రధాన వ్యవసాయ దిగుబడులు, శుద్ధి చేసిన ఉత్పత్తుల ఎగుమతుల్లో 12శాతం వృద్ధి నమోదైంది. వీటి ఎగుమతుల్లో అమెరికా, యూఏఈ, చైనా మొదటి వరుసలో ఉన్నాయి. ప్రపంచ దేశాలు బియ్యం దిగుమతుల కోసం భారత్ నుంచి వివరాలు సేకరిస్తున్న సమయంలో కొత్తగా యూరప్ దేశాలతోపాటు ఈజిప్టు ఈ జాబితాలో చేరింది. ఈజిప్టు ఇప్పటి వరకు 25 వేల టన్నుల బియ్యం కోసం భారత్‌ను టెండరు కోరింది. -
మళ్లీ ‘ప్లస్’లోకి.. ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు అక్టోబర్‌లో (2022 ఇదే నెలతో పోల్చి) 6.21 శాతం పెరిగాయి. విలువలో 33.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెపె్టంబర్లో 2.6 శాతం క్షీణించాయి. తాజా సమీక్షా నెల అక్టోబర్‌లో మళ్లీ సానుకూల ఫలితం వెలువడింది. 2023లో ప్రపంచ వాణిజ్యవృద్ధి కేవలం 0.8 శాతంగా ఉంటుందన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిరాశాపూరిత వాతావరణం, భారత్ విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. వాణిజ్యలోటు 31.46 బిలియన్ డాలర్లు ఇక దేశ వస్తు దిగుమతుల విలువ ఎగువబాట పట్టింది. 2022 డిసెంబర్ నుంచి 2023 సెపె్టంబర్ వరకూ వరుసగా 10 నెలల క్షీణతలో ఉన్న దిగుమతుల విలువ అక్టోబర్‌లో 12.3 శాతం పెరిగి 65.03 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సమీక్షా నెల్లో 31.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది కొత్త రికార్డు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► అక్టోబర్‌లో పసిడి దిగుమతులు 95.5 శాతం పెరిగి 7.23 బిలియన్ డాలర్లకు చేరాయి. ► చమురు దిగుమతుల బిల్లు 8 శాతం ఎగసి 17.66 బిలియన్ డాలర్లుగా ఉంది. ► మొత్తం 30 కీలక రంగాల్లో 22 రంగాల్లో ఎగుమతులు సానుకూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. వీటిలో ముడి ఇనుము, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఫార్మా, ఎల్రక్టానిక్ గూడ్స్, కార్పెట్, ప్లాస్టిక్, మెరైన్, ఇంజనీరింగ్ గూడ్స్ ఉన్నాయి. ఏప్రిల్–అక్టోబర్ మధ్య క్షీణ గణాంకాలే.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 7% క్షీణించి 244.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.95% క్షీణించి 391.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు ఈ 7 నెలల్లో 147.07 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ కాలంలో పసిడి దిగుమతులు 23% పెరిగి 29.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ దిగుమతుల బిల్లు మాత్రం 18.72% తగ్గి 100 బిలియన్ డాలర్లకు చేరింది. -
2 లక్షల కోట్ల డాలర్లకు ఎగుమతులు
న్యూఢిల్లీ: 2030 నాటికి వస్తు, సేవల ఎగుమతులను 2 లక్షల కోట్ల డాలర్లకు పెంచుకోవాలన్న లక్ష్యం ఆచరణ సాధ్యమేనని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఎస్సీ అగర్వాల్ తెలిపారు. సులభంగా వాణిజ్య రుణాల లభ్యత ఇందుకు కీలకంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ఎగుమతుల్లో పోటీపడేందుకు ఇది తోడ్పడగలదని అగర్వాల్ వివరించారు. ఇటు దేశీయ వ్యాపారాలతో పాటు అటు సీమాంతర వాణిజ్యానికి కూడా సులభంగా రుణాలు లభించేలా చూడటంపై ప్రభుత్వం, ట్రేడర్లు కలిసి పని చేయాలని ఆయన సూచించారు. (ఆన్లైన్ ఫ్రాడ్: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్ డైరెక్టర్ లబోదిబో) ‘సీమాంతర వాణిజ్యంతో పోలిస్తే దేశీయంగా వ్యాపారాల కోసం రుణాలను పొందడం సులభతరంగా ఉంటుందని నాకు చెబుతుంటారు. సీమాంతర వాణిజ్యం చాలా రిస్కులతో కూడుకున్నదనే అభిప్రాయమే దీనికి కారణం కావచ్చు. మనం ప్రపంచ మార్కెట్లో పోటీపడాలంటే దీన్ని సరిదిద్దాలి. ఇందులో రుణాల లభ్యత కీలక పాత్ర పోషిస్తుంది‘ అని అగర్వాల్ చెప్పారు. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2021–22తో పోలిస్తే 2022–23లో వస్తు, సేవల ఎగుమతులు 14.68 శాతం పెరిగి 676.53 బిలియన్ డాలర్ల నుంచి 775.87 బిలియన్ డాలర్లకు చేరాయి. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) ఈ నేపథ్యంలో 2030 నాటికి వీటిని 2 ట్రిలియన్ డాలర్ల (లక్షల కోట్లు)కు పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది. మరోవైపు, ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలతో వాణిజ్య నిర్వహణ తీరుతెన్నుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయని నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు సంజీత్ సింగ్ తెలిపారు. కార్మిక శక్తి, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, పర్యావరణ అభివృద్ధి మొదలైనవి వ్యాపారాల్లో కీలకంగా మారాయని, పలు దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. వాణిజ్యం విషయంలో భారత్‌ను ఏ దేశమూ వదులుకునే పరిస్థితి లేదని, మన ప్రయోజనాలను కాపాడుకునేందుకు తగు రక్షణాత్మక చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని సింగ్ చెప్పారు. -
ఎగుమతులు 900 బిలియన్ డాలర్ల పైనే..!
న్యూఢిల్లీ: భారత్ వస్తు, సేవల ఎగుమతులు ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 900 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని ఎగుమతిదారులు అంచనావేస్తున్నారు. అమెరికాసహా కీలక ప్రపంచ మార్కెట్లలో దేశీయ వస్తువులకు పటిష్ట డిమాండ్, అలాగే వాణిజ్య ఒప్పందాల వల్ల కలిగే ప్రయోజనాలు ఇందుకు దోహదపడతాయన్నది వారి విశ్లేషణ. రష్యా వంటి ఇతర దేశాల్లో డిమాండ్ కూడా భారత్ ఎగుమతులకు దోహదపడే అంశమని వారు పేర్కొంటున్నారు. ఆయా దేశాలకు ముఖ్యంగా వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో భారీ ఎగుమతులకు అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. 2023–24లో 500 నుంచి 510 బిలియన్ డాలర్ల మేర వస్తు ఎగుమతులు జరిగే అవకాశం ఉందని భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. దీనితోపాటు సేవల ఎగుమతులు సైతం 2022–23తో పోల్చితే (322.72 బిలియన్ డాలర్లు) భారీగా 390 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2021–22లో భారత్ వస్తు ఎగుమతులు 422 బిలియన్ డాలర్లు ఉంటే, 2022–23లో 6 శాతం పెరిగి 447.5 బిలియన్ డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. అంచనాలు ఇలా... ► అంతర్జాతీయ వాణిజ్యంలో మన రూపాయికి కూడా తగిన స్థాయిని కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం... ఎగుమతులకు సంబంధించి లావాదేవీల వ్యయాలను తగ్గిస్తుంది. ► పర్యాటకం, రవాణా, వైద్యం, ఆతిథ్యం సహా పలు రంగాలు గతేడాది వృద్ధికి దోహదం చేశాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులు బలంగా సాగుతున్నాయి. యాత్రల రంగం త్వరలో వృద్ధి బాట పట్టనుంది. ► కరోనా అనంతర ఆర్థిక పునరుద్ధరణ విదేశీ మార్కెట్ల నుండి వస్తువులు, సేవలకు పెరుగు తున్న డిమాండ్‌ను సృష్టించింది. సరుకు రవాణా ఛార్జీల స్థిరీకరణ, సరఫరా వ్యవస్థ సాధారణీకరణ రవాణా రంగానికి సానుకూల పరిణామాలు. ► ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లీగల్, అకౌంటింగ్ సేవలు, పరిశోధన, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ వంటి వ్యాపార సేవలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందించిన అవకాశాలను సద్వినియో గం చేసుకోవడంలో ప్రయోజనం పొందుతాయి. ► ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధికి గణనీయమైన అవకాశం ఉంది. ఎగుమతి గమ్యస్థానాల వైవిధ్యం సంప్రదాయ మార్కెట్లపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, ఎగుమతులకు కొత్త అవకాశాలను తెరవడానికి సాయపడుతుంది. ► ఎగుమతుల పురోగతే లక్ష్యంగా దేశం ఇటీవల ఆవిష్కరించిన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్‌ను ఈ రంగంలో వృద్ధి బాటన నడుపుతుంది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీ దోహదపడుతుందన్న విశ్వాసం ఉంది. ► వృద్ధి రేటును మరింత పెంచేందుకు కొన్ని ప్రో త్సాహకాలు అవసరం ఎంతైనా ఉంది. ప్రభు త్వం సరైన సహాయంతో గేమింగ్, ఎంటర్టైన్మెంట్లు చాలా బాగా పని చేస్తాయి. మిగిలిన రంగాలకూ తగిన సహాయ సహకారాలు అందాలి. ఎఫ్‌టీఏల దన్ను... వస్తు, సేవల ఎగుమతులు రెండూ కలిసి 2023–24లో విలువ 900 బిలియన్ డాలర్లుగా ఉండే వీలుంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) ఆ మార్కెట్లలో ఎగుమతులను పెంచడానికి భారీ వేదికను అందిస్తాయి. ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా భారత్ ఎగుమతులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఎందుకంటే ప్రోత్సా హకాల కారణంగా దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది. – అజయ్ సహాయ్, ఎఫ్ఐఈఓ డైరెక్టర్ జనరల్ ఆర్డర్ బుక్ పటిష్టం అమెరికా ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందన్న సంకేతాలు ఉన్నాయి. భారత్ ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ వాటా దాదాపు 18 శాతం. ఎగుమతులకు సంబంధించి ఆర్డర్ బుక్ బాగుంది. ఇదే ట్రెండ్ 2023–24 అంతా కొనసాగుతుందని భావిస్తున్నాం. దీనితో వస్తు ఎగుమతులు 500 బిలియన్ డాలర్లు దాటతాయని భావిస్తున్నాం. – ఎస్సి రాల్హాన్, హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యుద్ధ ప్రభావం తగ్గుతోంది 2022–23 కంటే 2023–24 ఆర్థిక సంవత్సరం ఎగుమతులుకు బాగుంటుందని భావిస్తున్నాం. మన పరిశ్రమపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తగ్గిపోతోంది. ఎందుకంటే వాణిజ్యం–ఇంధన వనరులకు పరిశ్రమ ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నది. భారతదేశంలో మౌలిక సదుపాయాలలో గణనీయమైన మెరుగుదల ఉంది. అది ఎగుమతిదారులకు గట్టి మద్దతునిస్తుంది. – శారదా కుమార్ సరాఫ్, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ చైర్మన్ 2022–23కంటే బెటర్... గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు పటిష్టంగా ఉంటాయని విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా... కార్మికరంగం ఆవశ్యకత ఉన్న రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది ఎగుమతులకు దోహపదడే అంశాల్లో ఒకటి. – ఖలీద్ ఖాన్, జికో ట్రేడింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ -
ఎగుమతుల ‘రికార్డు’ కొనసాగుతుంది
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతుల రికార్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) కూడా కొనసాగుతుందని భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) ప్రెసిడెంట్ ఏ శక్తివేల్ స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే, 2021–22లో ఎగుమతులు 422 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. 2022–23లో 3 నుంచి 5 శాతం వృద్ధితో 435–445 బిలియన్ డాలర్లకు చేరుతాయన్న విశ్వాసాన్ని తాజాగా శక్తివేల్ వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చితి, డిమాండ్ మందగమనం ఉన్నప్పటికీ భారత్ ఆల్‌టైమ్ రికార్డు కొనసాగుతందని విశ్లేషించారు. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం, భారత్ వస్తు ఎగుమతులు వరుసగా రెండోనెల జనవరిలోనూ క్షీణతను నమోదుచేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) వస్తు ఎగుమతులు 8.51 శాతం పెరిగి 369.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఘనంగా 58వ వ్యవస్థపక దినోత్సవాలు కాగా, ఎఫ్ఐఈఓ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శక్తివేల్ ఈ సందర్భంగా తెలిపారు. మూడు వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా– మార్చి 9 నుంచి 11 మధ్య ‘సోర్సెక్స్ ఇండియా’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహారం, ఫార్మా, ఆయుర్వేదం, హస్త కళలు, ఎఫ్ఎంసీజీ, జౌళి వంటి రంగాల్లో అవకాశాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. సూపర్ మార్కెట్లు, హైపర్మార్కెట్లు, రిటైల్ చైన్లు, దిగుమతిదారులుసహా దాదాపు 35 దేశాలు నుంచి ప్రతినిధులు ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు తమ ఆసక్తిని కనబరిచినట్లు తెలిపారు. -
ఫార్మాకు ఎగుమతి ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఫార్మా తదితర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పన్ను రీఫండ్ స్కీము ఆర్వోడీటీఈపీని రసాయనాలు, ఫార్మా, ఇనుము .. ఉక్కు ఉత్పత్తులకు కూడా నిర్దిష్ట కాలం పాటు వర్తింపచేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకూ ఈ రంగాలకు ఆర్వోడీటీఈపీ వర్తిస్తుంది. కొత్తగా చేర్చినవి కూడా కలిపితే పన్ను రీఫండ్ ప్రయోజనాలు దక్కే ఎగుమతి ఐటమ్‌ల సంఖ్య 8,731 నుంచి 10,342కి చేరుతుంది. స్కీమును విస్తరించడం వల్ల రూ. 1,000 కోట్ల మేర ఆర్థిక భారం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌లో ఎగుమతుల వృద్ధి 16.65 శాతం మేర మందగించిన నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
3టీ విధానంతో జర్మనీ, నార్వేకు ఎగుమతులు
సాక్షి, అమరావతి: ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా జర్మనీ, నార్వే దేశ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ దేశాలతో టూరిజం, ట్రేడ్ (వ్యాపారం), టెక్నాలజీ ‘3టీ’ల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఏపీఐఐసీ కార్యాలయంలో నార్వే, జర్మనీ దేశాల ఎగుమతి, దిగుమతిదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి నార్వే, జర్మ నీ దేశాల్లోని భారత రాయబారులు బి.బాలభాస్కర్, పి.హరిష్ హాజరుకానున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన తెలిపారు. రాష్ట్రం నుంచి ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులు, సులభతర వాణిజ్యం కోసం అమలు చేస్తున్న ప్రణాళికలను జర్మనీ, నార్వే దేశ రాయబారులకు వివరించనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఉద్యాన ఉత్పత్తులు, మత్స్య సంపద, చేనేత, టెక్స్టైల్తోపాటు టూరిజం వంటి రంగాలపై దృష్టి సారించామని, మంగళవారం సమావేశానికి ఆయా రంగాల భాగస్వాములు హాజరవుతారని తెలిపారు. అలాగే ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా ఆయా జిల్లాలకు చెందిన ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలను వివరిస్తామని, ఇందులో భాగంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కాకినాడ జిల్లా ఉత్పత్తులను ఆయా జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా వివరించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్యర్యంలో అమలవుతున్న అమృత్ సరోవర్ కార్యక్రమం వివరాలను కూడా వివరిస్తారు. రాష్ట్రం నుంచి 2021–22లో రూ.1,43,843.19 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇది దేశీయ మొత్తం ఎగుమతుల్లో 5.5 శాతం. దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగానే దేశంలోఎక్కడా లేనివిధంగా ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రూ.25,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. దీంతోపాటు భావనపాడు, రామాయపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, మచిలీపట్నం వద్ద పోర్టు ఆధారిత భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇవన్నీ పూర్తయి, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. -
రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్లో 6.7 శాతం వృద్ధి!
ముంబై: భారత్ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఆగస్టులో 2021 ఇదే నెలతో పోల్చి 6.7శాతం పెరిగాయి. విలువలో రూ.26,419 కోట్లుగా (3,316 మిలియన్ డాలర్లు) నమోదయ్యాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఆగస్టులో ఒక్క కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ (సీపీడీ) ఎగుమతులు 0.84 శాతం తగ్గి రూ.14,956 (1,880 మిలియన్ డాలర్లు) కోట్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య మాత్రం స్వల్పంగా 1.59 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో ఇది రూ.78,697 కోట్లు (10,081 మిలియన్ డాలర్లు). చైనాలో కరోనా ప్రతికూల పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు గడచిన రెండు నెలలుగా కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ (సీపీడీ) ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. -
రెండు ట్రిలియన్ డాలర్ల అంతర్జాతీయ వాణిజ్యం లక్ష్యం
శాన్ఫ్రాన్సిస్కో: భారత్ వస్తు, సేవల ఎగుమతులు గత సంవత్సరం ముగిసే నాటికి 675 బిలియన్ డాలర్లు దాటాయని, 2030 నాటికి అంతర్జాతీయ వాణిజ్యాన్ని 2 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని దేశం ఆకాంక్షిస్తున్నదని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇక్కడి స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోని అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులతో సంభాషించిన గోయల్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, భారతదేశం తన స్వాతంత్య్ర 100వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సమయానికి, 30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఉద్ఘాటించారు. ప్రభుత్వ ప్రణాళికలు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ విలువ 35 నుంచి 45 ట్రిలియన్ల స్థాయినీ అందుకోగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం 3.3 ట్రిలియన్ల ఎకానమీతో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. భారత్ ముందు వరుసలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు ఉన్నాయి. దశాబ్దం క్రితం భారత్ 11వ స్థానంలో ఉండేది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధితో బ్రిటన్ను భారత్ ఎకానమీ ఆరవ స్థానంలోకి నెట్టింది. తక్షణం ఇబ్బందులే... కాగా, అంతర్జాతీయంగా డిమాండ్ మందగమనం, అనిశ్చితి వంటి పరిస్థితుల్లో భారత్ ఎగుమతులు కష్టకాలాన్ని ఎదుర్కొన తప్పదని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాలు వంటి రంగాలు ప్రతికూలతను ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, రష్యా–ఉక్రెయిన్, చైనా–తైవాన్ మధ్య ఉద్రిక్తతలు, సరఫరాల సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి వేగానికి, డిమాండ్ బలహీనతకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా స్వల్పంగా 1.15 శాతం మేర క్షీణించాయి. విలువలో 33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతుల్లో క్షీణత నమోదుకావడం 20 నెలల్లో ఇదే తొలిసారి. ఎగుమతుల క్షీణత–భారీ దిగుమతులపై ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు కూడా ఇటీవలి కాలంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఎగుమతులు 17.12 శాతం పెరిగి 192.59 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు ఇదే ఐదు నెలల కాలంలో 45.64 శాతం పెరిగి 317.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు భారీగా 53.78 బిలియన్ డాలర్ల నుంచి 125.22 బిలియన్ డాలర్లకు చేరింది. 2021–22లో భారత్ వస్తు ఎగుమతుల విలువ ఎగుమతులు 400 బిలియన్ డాలర్లు. యూఎస్ ఇన్వెస్టర్లతో స్టార్టప్స్ అనుసంధానం భారత స్టార్టప్స్‌ను యూఎస్ ఇన్వెస్టర్లతో అనుసంధానించేందుకు.. సపోర్టింగ్ ఎంట్రప్రెన్యూర్స్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అప్‌స్కిల్లింగ్ (సేతు) పేరుతో కార్యక్రమానికి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ శ్రీకారం చుట్టారు. భారత్‌లో వ్యవస్థాపకత, వృద్ధి దశలో ఉన్న స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న యూఎస్‌లోని ఇన్వెస్టర్ల మధ్య భౌగోళిక అడ్డంకులను అధిగమించడానికి సేతు రూపొందించారు. నిధుల సమీకరణ, ఉత్పత్తుల విక్రయం, వాణిజ్యీకరణకై ఇన్వెస్టర్లు మార్గదర్శకత్వం వహిస్తారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లోని స్టార్టప్స్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు భారత్‌లో అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్టు గోయల్ తెలిపారు. స్టార్టప్స్‌లో 90 శాతం, అలాగే నిధులు అందుకున్న స్టార్టప్స్‌లో సగం ప్రారంభ దశలోనే విఫలం అవుతున్నాయని గుర్తు చేశారు. వ్యాపారాన్ని నిర్వహించడంలో అనుభవం లేకపోవడం ఒక కీలక సమస్య అని అన్నారు. నిర్ణయం తీసుకోవడానికి, నైతిక మద్దతు కోసం వ్యవస్థాపకులకు సరైన మార్గదర్శకత్వం అవసరమని వివరించారు. స్టార్టప్స్‌కు అండగా నిలిచేందుకు మార్గ్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 200 పైచిలుకు మెంటార్స్ పేర్లు నమోదు చేసుకున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోని అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులతో మాట్లాడుతున్న గోయల్ -
ఎగుమతుల్లో 15 శాతం వృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. 2020–21లో రూ.1,24,744.46 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల విలువ 2021–22 నాటికి 15.31 శాతం పెరిగి రూ.1,43,843.19 కోట్లకు చేరుకుంది. 2030 నాటికి దేశ ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడమే కాకుండా.. అందుకు అనుగుణంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక సత్ఫలితాలను ఇస్తోంది. పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్(ఎగుమతులు) జీఎస్ రావు మాట్లాడుతూ.. ఎగుమతులను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఎగుమతులు వేగంగా వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఆక్వా, ఫార్మా, రసాయనాలు, బియ్యం, ఉక్కు తదితర రంగాల్లో ఎగుమతుల వృద్ధికి మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కొత్త జిల్లాల వారీగా ఎగుమతుల వృద్ధికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎగుమతికి అవకాశమున్న ఉత్పత్తులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దీనిపై అధికారులు ఉత్పత్తుల సమాచారాన్ని సేకరిస్తున్నారని పేర్కొన్నారు. దీని తర్వాత తుది కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని చెప్పారు. జిల్లాల వారీగా ఉత్పత్తులను గుర్తించి.. వాటికి బ్రాండింగ్ కల్పిస్తామన్నారు. ఎగుమతుల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలపై పరిశ్రమల శాఖ అధికారులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
భారత్ నుంచి ఎగుమతుల్లో సముచిత వృద్ధి!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్యపరంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఎగుమతులు ‘సముచిత స్థాయిలో‘ వృద్ధి చెందే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. బడా ఎగుమతిదారులు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిళ్లతో సమాలోచనలు జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు పరిణామాలను సమీక్షిస్తున్నామని ఆయన వివరించారు. ‘ధర, నాణ్యతపరంగా మన ఎగుమతులకు ప్రత్యేకత ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి ఎగుమతుల అంచనాలు ఉంటాయి‘ అని గోయల్ చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో 2022–23లో 450–500 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేయడం సాధ్యపడేదేనా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యమేదీ విధించుకోలేదని ఆయన పేర్కొన్నారు. నూతన విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ)పై స్పందిస్తూ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడంతో ప్రస్తుత పాలసీని ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో ఉత్పత్తుల ఎగుమతులు 17 శాతం పెరిగి 37.94 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి, క్రూడాయిల్ దిగుమతులు భారీగా పెరగడంతో కరెంటు అకౌంటు లోటు 25.63 బిలియన్ డాలర్లకు ఎగిసింది. -
చిన్న సంస్థల ఎగుమతులకు ప్రభుత్వ సహకారం
న్యూఢిల్లీ: చిన్న వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈలు మరిన్ని ఎగుమతులు చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగం తన సామర్థ్యం మేరకు ఎగుమతులు చేసేందుకు నూతన విధానాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. ‘ఉద్యమి భారత్’ కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ, ఎంఎస్ఎంఈ రంగానికి పలు చర్యలను ప్రకటించారు. భారత దేశ ఎగుమతులు పెరిగేందుకు, మరిన్ని మార్కెట్లకు భారత ఉత్పత్తులు చేరుకునేందుకు ఎంఎస్ఎంఈ రంగం బలంగా ఉండడం అవసరమని చెప్పారు. ‘‘మీ సామర్థ్యాలు, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త విధానాలను రూపొందిస్తోంది. ఇవన్నీ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం, వాటి నాణ్యతను పెంచడం కోసమే. భారత ఎంఎస్ఎంఈల ఎగుమతులు పెంచాలి. ఈ దిశగా పనిచేయాలని విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు చెప్పాం. భారత మిషన్స్.. వాణిజ్యం, టెక్నాలజీ, టూరిజం అనే మూడు అంశాల ఆధారంగా పనిచేస్తుంది’’అని ప్రధాని వివరించారు. రుణాలకు సమస్యలు.. గ్యారంటీలు లేకుండా రుణాలు పొందలేని విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఇది సంస్థలను స్థాపించాలని భావించే బలహీన వర్గాల ఆకాంక్షలకు అతిపెద్ద అవరోధంగా పేర్కొన్నారు. అందుకనే తాము ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. దీని కింద ప్రతి భారతీయుడు సులభంగా వ్యాపారం ప్రారంభించొచ్చన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే రూ.19 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలా రుణ సాయాన్ని పొందిన వారి నుంచి ఏడు కోట్ల మంది మొదటిసారి వ్యాపారులుగా మారినట్టు వివరించారు. ముద్రాయోజన కింద 36 కోట్ల రుణ ఖాతాలను మంజూరు చేయగా, అందులో 70% మహిళలకు ఇచ్చినవే ఉన్నాయని చెప్పారు. ఎంఎస్ఎంఈల పనితీరును పెంచే పథకం ‘ఆర్‌ఏఎంపీ’, మొదటిసారి ఎగుమతి చేసే ఎంఎస్ఎంఈల సామర్థ్య నిర్మాణం కోసం ‘సీబీఎఫ్‌టీఈ’ పథకాలను ప్రధాని ప్రారంభించారు. -
అమ్మో..బంగారం దిగుమతులు ఇన్ని లక్షల కోట్లా!
న్యూఢిల్లీ: దేశ బంగారం దిగుమతులు 2021–22 సంవత్సరంలో 33 శాతం పెరిగాయి. మొత్తం 46.14 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.45 లక్షల కోట్లు) విలువైన బంగారం (842 టన్నులు) దిగుమతి అయినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020–21లో బంగారం దిగుమతుల విలువ 34.62 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం బంగారం దిగుమతులు పెరిగిపోవడంతో వాణిజ్యలోటు 192 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవ త్సరంలో 103 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. బంగారం వినియోగంలో చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారత్ ఉంది. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2021–22లో 50 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లకు చేరాయి. కరెంటు ఖాతా లోటు గత ఆర్థిక సంవత్సరానికి 23 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ఇది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం జీడీపీలో 2.7 శాతానికి సమానం. -
అరటి రైతులకు శుభవార్త ! ఆ దేశంతో కుదిరిన ఒప్పందం
భారత్, కెనడా దేశాల మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత్ నుంచి అరటి, బేబీ కార్న్‌లను దిగుమతి చేసుకునేందుకు కెనడా అంగీకరించింది. కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహూజా, కెనడా హైకమిషనర్ కెమరాన్ మెక్‌కేల మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భారత్, కెనడాల మధ్య తాజాగా కుదిరిన ఒప్పందంతో తాజా అరటి పళ్లను తక్షణమే దిగుమతి చేసుకునేందుకు కెనడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా సాంకేతిక అంశాల కారణంగా బేబీకార్న్ దిగుమతికి కొంత సమయం కావాలని కెనడా కోరింది. దాదాపు 2022 ఏప్రిల్ చివరి నాటికి భారత్ నుంచి కెనడాకి బేబీకార్న్ ఎగుమతులు ప్రారంభం కావొచ్చు. మన దేశంలో అరటి పంటను భారీ ఎత్తున సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ , తెలంగాణలో వేలాది ఎకరాల్లో అరటి సాగవుతోంది. తాజాగా అరటి దిగుమతికి కెనడా అంగీకరించడంతో రైతులకు, వ్యాపారులకు కొత్త మార్కెట్ అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. -
సరుకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ పోర్ట్ అథారిటీ (వీపీఏ) 2021–22 ఆర్థిక సంవత్సరంలో 69.03 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసి మూడో అత్యధిక రికార్డును నమోదు చేసినట్లు వీపీఏ చైర్మన్ కె.రామమోహనరావు వెల్లడించారు. శుక్రవారం సిరిపురం ప్రాంతంలో ఉన్న పోర్టు అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 89 ఏళ్ల పోర్టు చరిత్రలో రెండేళ్ల క్రితం 72.72 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసి రికార్డు సృష్టించగా.. ఈ ఏడాది కాస్త తగ్గినట్లు వివరించారు. ఈ సంవత్సరం థర్మల్ కోల్లో 100 శాతం, స్టీమ్ కోల్లో 38 శాతం, కంటైనర్స్‌లో 0.05 శాతం వృద్ధి ఉన్నప్పటికీ.. కోవిడ్, హెచ్‌పీసీఎల్ ఆధునీకరణ వంటి కారణాల వల్ల ఆయిల్ 11 శాతం తగ్గినట్లు చెప్పారు. అలాగే ఐరన్ ఓర్ 23 శాతం, కోకింగ్ కోల్లో 18 శాతం క్షీణత ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 160, 170 డాలర్లకు వెళ్లిన టన్ను ఐరన్ ఓర్ ధర 90 డాలర్లకు పడిపోయిందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 5 ఏళ్లలో 78 మెట్రిక్ టన్నులు లక్ష్యం, వీపీఏ వచ్చే ఐదేళ్లలో 78 మెట్రిక్ టన్నుల కార్గో హాండ్లింగ్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా అన్‌రాక్, ఎన్ఎండీసీ, తమిళనాడుకు చెందిన టాన్జెన్కోతో ఒప్పందం చేసుకున్నామన్నారు. మరో ఏడాదిలో క్రూయిజ్ టెర్మినల్.. ఇక్కడ నుంచి దేశంలో ముంబై, గోవా వంటి ప్రాంతాలకే కాకుండా ఇతర దేశాలకు క్రూయిజ్‌లో వెళ్లే సౌకర్యం మరో ఏడాదిలో అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. 2 వేల మంది ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్లుగా దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయిలో ఫిషింగ్ హార్బర్.. సాగరమాల కార్యక్రమంలో కమ్యూనిటీ డెవలప్మెంట్లో భాగంగా విశాఖలో రూ.150 కోట్లతో ప్రపంచ స్థాయి ఫిషింగ్ హార్బర్‌ను వచ్చే ఏడాదిలోగా తయారు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సాగరమాల ద్వారా రూ.3,769 కోట్లతో 23 ప్రాజెక్టులు.. సాగరమాల ప్రాజెక్టు కింద విశాఖ పోర్ట్ అథారిటీ పరిధిలో రూ.3,769 కోట్లతో 23 ప్రాజెక్టులు, పనులు చేపట్టినట్లు చెప్పారు.వీటిలో కొన్ని నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. సీహార్స్ జంక్షన్ నుంచి డాక్ ఏరియాకు ఫ్లైఓవర్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇన్నర్ హార్బర్లో ఓఆర్–1, ఓఆర్–2 బెర్తులు 366 మీటర్ల నుంచి 606 మీటర్లకు పొడవు పెంపు పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తవుతాయన్నారు. వీటితో పాటు 38 కిలోమీటర్లు రైల్వేలైన్ ఎలక్ట్రిఫికేషన్ పనులు చేపట్టినట్లు తెలిపారు. పోర్టు బొగ్గు, ఇనుప ధాతువుల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్న నేపథ్యంలో దుమ్ము, ధూళి పైకి లేవకుండా కవర్‌షెడ్ల నిర్మాణానికి టెండర్లు ఇచ్చినట్లు చెప్పారు. డబ్ల్యూక్యూ–7, 8 బెర్తుల్లో బొగ్గు, ఇనుప ఖనిజాలను హ్యాండిల్ చేస్తున్నపుడు వచ్చే దుమ్ము, ధూళిని నియంత్రించేందుకు పీపీపీ పద్ధతిన యాంత్రీకరణ పనులు చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ పోర్టులతో పోటీ.. ప్రైవేట్ పోర్టులతో పోటీ ఉన్న మాట వాస్తవమే. అదానీ గ్రూప్‌తో ఎటువంటి వివాదం లేదు. అందుకే మంచి ధరలు, వేగవంతమైన సేవలు, రోడ్, రైల్ నెట్వర్కులు కలిగిన విశాఖ పోర్టు సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరణ వైపు వేగంగా అడుగులు వస్తోంది. గతంలో పోర్టులో నిర్వహించిన కార్యకలాపాలు సక్రమంగా లేకపోవడంతో సంబంధిత సిబ్బందిని టెర్మినేట్ చేశాం. వారికి చెల్లించాల్సిన నిధులను చెల్లించాం. ప్రస్తుతం ఆర్బిట్రేషన్ కొనసాగుతుంది. – కె.రామమోహనరావు, వీపీఏ చైర్మన్ -
ఎగుమతుల్లో భారత్ రికార్డ్.. చరిత్రలో తొలిసారిగా
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎగుముత్లో భారత్ రికార్డు సాధించింది. తొలిసారిగా ఎగుమతుల్లో 400 బిలియన్ డాలర్ల మార్క్‌ను రీచ్ అయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కావడానికి ఇంకా తొమ్మిది రోజులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించింది. తమ ప్రభుత్వ నినాదమైన ఆత్మ నిర్భర్ భారత్‌కి తాజాగా రికార్డు స్థాయిలో జరుగుతున్న ఎగుమతులు ఓ ఉదాహారణ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా సంక్షోభం తీసుకొచ్చిన ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఎగిసిపడుతున్న ముడి చమురు ధరలు ఆందోళన కలిగిస్తున్నా.. ఈ స్థాయిలో ఎగుమతులు సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ప్రతీ నెల 33 బిలియన్ డాలర్లు ఎగుమతులను ఇండియా సాధిస్తూనే వస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింకిండ్ ఇన్సెంటివ్ స్కీమ్‌తో పాటు ఇతర ప్రభుత్వ విధానాల కారణంగానే ఈ రికార్డు సాధ్యమైందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు మారుతున్న పరిస్థితుల్లో ఇండియా గ్లోబల్ సప్లై చెయిన్‌లో కీలకంగా మారుతోంది. -
400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యానికి చేరువ
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్–2022 మార్చి) 400 బిలియన్ డాలర్ల తన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించనుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మార్చి 14వ తేదీ నాటికి భారత్ ఎగుమతుల విలువ 390 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపారు. ఆటో విడిభాగాల పరిశ్రమ మొట్టమొదటిసారి 600 మిలియన్ డాలర్ల మిగులు రికార్డును సాధించినట్లు వెల్లడించారు. ఆటో తయారీదారులు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, దిగుమతుల ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ఆటోమోటివ్ కాంపోనెంట్ రంగానికి సంబంధించి జరిగిన ఒక కార్యక్రమంలో కోరారు. అలాగే పరిశోధనా అభివృద్దిపై (ఆర్అండ్డీ) దృష్టి సారించాలని ఈ రంగానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి ఇందుకు సంబంధించి ఈ–మొబిలిటీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జీఐ ట్యాగ్ ఉత్పత్తుల ఎగుమతులు పెరగాలి... కాగా, స్థానికంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ) ట్యాగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరగాల్సిన అవసరం ఉందని వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దిశలో ప్రభుత్వం కొన్ని కొత్త ఉత్పత్తులను, వాటిని ఎగుమతి చేయాల్సిన దేశాలను గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో జీఐ ట్యాగ్ ఉన్న పలు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, ఆయా ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో ‘ఉత్సుకత’ ఉన్న కొనుగోలుదారులను చేరలేకపోతున్నాయని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) ద్వారా ప్రభుత్వం పలు చర్యలకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించింది. జీఐ ఉత్పత్తులంటే... జీఐ ట్యాగ్ ఉత్పత్తుల్లో తిరుపతి లడ్డూసహా కాలా నమక్ బియ్యం, నాగా మిర్చా, బెంగళూరు రోజ్ ఆనియన్, షాహి లిచ్చి, భలియా గోధుమలు, దహ ను ఘోల్వాడ్ సపోటా, జల్గావ్ అరటి, వజ కులం పైనాపిల్, మరయూర్ బెల్లం, డార్జిలింగ్ టీ, బాస్మ తీ రైస్. మహాబలేశ్వర్ స్ట్రాబెర్రీ, బ్లూ పాటరీ ఆఫ్ జైపూర్, బనారసి చీర వంటివి ఉన్నాయి. ఇప్ప టివరకు 417 నమోదిత జీఐ ఉత్పత్తులు ఉన్నాయి. అందులో దాదాపు 150 వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు. 2021లో జీఐ ఉత్పత్తులు భారీగా ఎగుమతులు జరిగిన విభాగాలను పరిశీలిస్తే.. నాగాలాండ్ నుండి బ్రిటన్‌కు నాగా మిర్చా (కింగ్ చిల్లీ) ఒకటి. మణిపూర్, అస్సాం నుండి బ్రిటన్‌కు బ్లాక్‌రైస్ ఎగుమతులు జరిగాయి. అస్సాం నుంచి బ్రిటన్, ఇటలీలకు నిమ్మకాయల ఎగుమతులు జరిగాయి. జీఐ అనేది నిర్దిష్ట భౌగోళిక మూలాన్ని కలిగి ఉన్న ఉత్పత్తులపై వినియోగించే ఒక బ్రాండ్ సంకేతం. ఆ మూలం కారణంగా ఉన్న నిర్దిష్ట లక్షణాలను లేదా ఖ్యాతిని సంబంధిత ఉత్పత్తి కలిగి ఉంటుంది. అటువంటి పేరు ప్రఖ్యాతలు ఉత్పత్తి నాణ్యత, విశిష్టతలకు సంబంధించిన హామీని వినియోగదారులకు అందిస్తుంది. -
భారత్ సరికొత్త రికార్డు..! ‘చరిత్రలోనే తొలిసారిగా..! ఎన్నడూ లేని విధంగా..’
డిసెంబర్ 2021 గాను భారత్ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. గత నెలలో భారత్ అత్యధికంగా 37 బిలియన్ డాలర్ల ఎగుమతులను సాధించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయాల్ ట్విటర్లో తెలిపారు. ఇది 2020 డిసెంబర్‌తో పోల్చుకుంటే 37 శాతం అధిక వృద్ధిని సాధించిందని ఆయన అన్నారు. 400 బిలియన్ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా..! వస్తు, సేవల ఎగుమతుల్లో చారిత్రక గరిష్ట స్థాయిలను సాధించే దిశగా దేశం పురోగమిస్తోందని పీయూష్ గోయాల్ ట్విటర్లో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. 2020 డిసెంబర్‌తో పోలిస్తే ఎగుమతుల్లో 80శాతంలోని టాప్ 10 ప్రధాన కమోడిటీ గ్రూప్స్ 41% వృద్ధిని సాధించాయని గోయల్ చెప్పారు. జనవరి 3 న విడుదల చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం...2021 (ఏప్రిల్-డిసెంబర్)లో అవుట్‌బౌండ్ షిప్‌మెంట్స్ గత ఆర్థిక సంవత్సరాన్ని మించాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 300 బిలియన్ల డాలర్ల ఎగుమతులు దాటినట్లు తెలుస్తోంది. జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని పీయూష్ గోయల్ అన్నారు. Highest ever goods exports in the history of India in Dec’21! 💰Exports over $37 Billion 📈 37% jump over Dec’20 Govt. led by PM @NarendraModi ji is providing a boost to manufacturing sector for building an #AatmanirbharBharat. pic.twitter.com/Uwxdll63Wz — Piyush Goyal (@PiyushGoyal) January 3, 2022 చదవండి: 2022–23 అంచనా..వ్యవసాయ రంగానికి రుణ లక్ష్యం రూ.18 లక్షల కోట్లు! -
ఎగుమతుల్లో కొత్త రికార్డులు సాధిస్తాం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లోనూ పుంజుకుంటోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వస్తు, సేవల ఎగుమతుల్లో చారిత్రక గరిష్ట స్థాయులను సాధించే దిశగా దేశం పురోగమిస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. అలాగే సర్వీసుల ఎగుమతులకు సంబంధించి 150 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించగలమని ఆయన పేర్కొన్నారు. వెరసి ఇటు వస్తువులు, అటు ఉత్పత్తుల విషయంలో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదు చేయగలమని గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో దేశంలోకి 27 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని మంత్రి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 62 శాతం ఎగిశాయని వివరించారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగిందని, లాక్డౌన్ విధించిన ప్రతికూల పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ వ్యవస్థకు ఎటువంటి అంతరాయాలూ ఏర్పడకుండా సేవలు అందించిందని మంత్రి చెప్పారు. దేశ ఎకానమీ వేగంగా కోలుకుంటోందనడానికి అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 1.3 లక్షల పైగా నమోదు కావడం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారత్‌కి ఉన్న సానుకూల అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ ఇటీవలే భారత సార్వభౌమ రేటింగ్‌ను నెగెటివ్ నుంచి స్టేబుల్ స్థాయికి మార్చిందని మంత్రి చెప్పారు. మెరుగైన ఇన్ఫ్రా, వృద్ధిలో వైవిధ్యం, అభివృద్ధికి డిమాండ్ తదితర అంశాలు ఆర్థిక పునరుజ్జీవనానికి దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. -
చక్కెర ఎగుమతులపై తాలిబన్ ఎఫెక్ట్ ?
ఇరవై ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల రాకతో మరోసారి అలజడి రేగింది. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను కొత్తగా అధికార పీఠం కైవసం చేసుకున్న తాలిబన్లు గౌరవిస్తారా ? లేదా ? అసలు ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై వ్యాపార వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ముఖ్యంగా ఎగుమతి దారులు అఫ్గన్‌లో సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నారు. మంచి సంబంధాలు ఆఫ్ఘనిస్తాన్ , ఇండియాల మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికారంలో నిరంకుశ తాలిబన్లు ఉన్నా, అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వం ఉన్నా ఎగుమతులు, దిగుమతులు బాగానే జరిగాయి. ముఖ్యంగా అఫ్గన్ నుంచి ఇండియాకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా దిగుమతి అవుతుండగా ఇండియా నుంచి అఫ్గన్‌కి చక్కెర, తృణధాన్యాలు, టీ, సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. 826 మిలియన్ డాలర్ల ఎగుమతులు గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం అఫ్గన్ నుంచి ఇండియాకు జరిగిన దిగుమతుల విలువ 509 మిలియన్ డాలర్లు ఉండగా ఇండియా నుంచి జరిగిన ఎగుమతుల విలువ 826 మిలియన్ డాలర్లుగా నమోదు అయ్యింది. ఎగుమతులు వన్ బిలియన్కి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండగా ఒక్కసారిగా అఫ్గన్‌లో సంక్షోభం తలెత్తింది ఇబ్బందులు తప్పవా ? ఇండియా నుంచి అఫ్గన్‌కి జరుగుతున్న ఎగుమతుల్లో ప్రధానమైంది చక్కెర. అఫ్గన్‌లో ఇండియా చక్కెరను భారీగా ఉపయోగిస్తారు. ఇండియా నుంచి సముద్ర మార్గంలో కరాచీ పోర్టుకు చేరకున్న చక్కెర అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అఫ్గన్ చేరుకుంటుంది. గతేడాది 6.24 లక్షల టన్నుల చక్కెర అఫ్గనిస్తాన్‌కి ఎగుమతి అయ్యిందని ఆలిండియా సుగర్ ట్రేడ్ అసోసియేషన్ తెలిపింది. ప్రస్తుత సంక్షోభంతో ఈ ఎగుమతి డోలాయమానంలో పడిందంటూ వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అఫ్గన్ లాంటి పెద్ద మార్కెట్‌ను కోల్పోతే ఇబ్బందులు తప్పవంటున్నారు. పరిస్థితులు చక్కబడతాయి మరోవైపు తాలిబన్లు అత్యవసర వస్తువులపై ఎక్కువగా దిగుమతి సుంకం విధించని, గతంలో 1996 నుంచి 2001 వరకు వారితో వ్యాపారం సజావుగానే జరిగిందంటున్నాడు పాతకాలం వర్తకులు. అధికార పీఠం గురించి జరిగే వివాదాలు సద్దుమణిగితే పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బంగారం రుణాల్లోకి షావోమీ ! -
ఎగుమతుల రంగానికి ఊతం ఇస్తూ కేంద్రం కీలక నిర్ణయం..!
న్యూఢిల్లీ: ఎగుమతుల రంగానికి ఊతం ఇస్తూ, మంగళవారం కేంద్రం (ఆర్ఓడీటీఈపీ – రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్‌పోర్టెడ్ ప్రొడక్ట్స్) పన్ను, సుంకాల రిఫండ్ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రూ.12,454 కోట్లు కేటాయించింది. 8,555 ఉత్పత్తులకు వర్తించే విధంగా ఆర్‌ఓడీటీఈపీకి ఈ నిధులను కేటాయించింది. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై విధించిన సుంకాలు, పన్నుల రిఫండ్‌కు ఉద్ధేశించిన ఈ పథకం కింద పన్ను రిఫండ్ రేట్లను కూడా కేంద్రం నోటిఫై చేసింది. వివిధ రంగాలకు సంబంధించి పన్ను రిఫండ్ రేట్లు 0.5 శాతం నుంచి 4.3 శాతం శ్రేణిలో ఉన్నాయి. విద్యుత్ చార్జీలపై సుంకాలు, రవాణా ఇంధనంపై వ్యాట్, వ్యవసాయం, సొంత అవసరాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి, మండీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఇంధనంపై సెంట్రల్ ఎక్సైజ్‌పన్ను వంటి విభాగాల్లో రిఫండ్స్ జరుగుతాయి. రిఫండ్ జరిగే 8,555 ఉత్పత్తుల్లో సముద్ర ప్రాంత ఉత్పత్తులు, దారం, డెయిరీ ప్రొడక్టులు, వ్యవసాయం, తోలు, రత్నాలు–ఆభరణాలు, ఆటోమొబైల్, ప్లాస్టిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ ఉన్నాయి. ఈ పథకం కింద వివిధ ప్రొడక్టులపై విధించిన వివిధ కేంద్ర, రాష్ట్ర సుంకాలు, పన్నులు, లెవీలను ఎగుమతిదారులకు రిఫండ్ జరుగుతుంది. (చదవండి: Apple: ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్..!) రెండు కీలక పథకాలకు రూ.19,400 కోట్లు ఆర్ఓడీటీఈపీతోపాటు, ఆర్ఓఎస్సీటీఎల్ (రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.19,400 కోట్లు అందుబాటులో ఉంటాయని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. వస్త్రాలు, దుస్తుల ఎగుమతులపై రాయితీలకు సంబంధించిన ఆర్ఓఎస్సీటీఎల్ పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం కేటాయించిన రూ.19,400 కోట్ల నిధుల్లో రూ.12,454 కోట్లు ఆర్‌ఓడీటీఈపీకి ఉద్దేశించినదికాగా, మిగిలిన రూ. 6,946 కోట్లు ఆర్ఓఎస్సీటీఎల్కు కేటాయించినది. ఆర్ఓడీటీఈపీ స్కీమ్ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దాదాపు 95 శాతం వస్తువులు, ఎగుమతులకు ఈ రెండు పథకాలు వర్తిస్తాయని సుబ్రమణ్యం తెలిపారు. స్టీల్, రసాయనాలు, ఔషధ రంగాలకు మాత్రం ఆర్ఓడీటీఈపీ పథకం వర్తించదని ఆయన తెలిపారు. ఎటువంటి ప్రోత్సాహకాలూ లేకుండా ఈ రంగాలు కార్యకలాపాలు నిర్వహించడమే దీనికి కారణమని ఆయన తెలిపారు. భారత్ ఎగుమతులుకు ఈ పథకాలు ప్రతిష్టాత్మకమైనవని, అంతర్జాతీయ పోటీలో భారత్ ఉత్పత్తులు నిలదొక్కుకోడానికి ఈ పథకాలు దోహదపడతాయని వివరించారు. జౌళి ఎగుమతిదారులకు భరోసా కల్పిస్తూ కేంద్రం ఇటీవలే ఆర్ఓఎస్సీటీఎల్ స్కీమ్‌ను పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, దుస్తుల ఎగుమతిదారులు 2024 మార్చి వరకూ తమ ఎగుమతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పన్నులపై రాయితీలను పొందగలుగుతారు. ఈ స్కీమ్ కింద వస్త్రాలపై గరిష్టంగా 6.05 శాతం వరకూ రాయితీ అందుతుంది. రెడీమేడ్స్‌పై ఈ రేటు 8.2 శాతం వరకూ ఉంది. సానుకూల చర్య... అంతర్జాతీయంగా ఈ రంగంలో పోటీని ఎదుర్కొనడానికి ఎగుమతిదారులకు తాజా నిర్ణయం దోహదపడుతుందని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) చైర్మన్ ఏ శక్తివేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. ముఖ్యంగా బంగ్లాదేశ్, వియత్నాం, మియన్మార్, కాంబోడియా, శ్రీలంక వంటి దేశాల నుంచి పోటీని ఎగుమతిదారులు తట్టుకోగలుగుతారని వివరించారు. స్థిరమైన పన్ను రేట్ల వల్ల ఈ రంగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరపాలన్న లక్ష్యంలో వేసిన తొలి అడుగుగా దీనిని అభివర్ణించారు. ఎగుమతుల పురోభివృద్ధికే కాకుండా ఈ రంగంలో స్టార్టప్స్ ఏర్పాటుకు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు కూడా ఈ చర్య పరోక్షంగా దోహపడుతుందని విశ్లేషించారు. (చదవండి: ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం...!) -
భారత్ ఎగుమతులు ట్రిలియన్ డాలర్లకు చేరడం ఖాయం
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2027–28 ఆర్థిక సంవత్సరం నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– సీఐఐ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు ఎగుమతుల భారీ వృద్ధికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలన్న పథకం ఇందులో ఒకటని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 419 బిలియన్ డాలర్లు భారత్ ఎగుమతుల లక్ష్యమని తెలిపారు. గడచిన పదేళ్లలో ఎగుమతులు దాదాపు 290 బిలియన్ డాలర్లు– 330 బిలియన్ డాలర్ల మధ్య నమోదవుతున్నట్లు ఆయన తెలిపారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతులు 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో ఈ విలువ 313.36 బిలియన్ డాలర్లు. ప్రపంచ దేశాలతో సహకారాన్ని (అనుసంధానం) భారత్ విస్తృతం చేసుకోవాల్సిన అవసరాన్ని వాణిజ్య శాఖ కార్యదర్శి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అది లేకుంటే ప్రపంచంతో విడిపోయినట్టుగానే ఉంటుందన్నారు. గత 20 ఏళ్లలో ప్రపంచ వాణిజ్య సంస్థ చెప్పుకోతగ్గ సాధించిందేమీ లేదంటూ.. అంతర్గత సమస్యల కారణంగా ఇంతకుమించి ఆశించడానికి కూడా ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. దీని కారణంగానే ప్రపంచ దేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకార ఒప్పందాల దిశగా అడుగులు వేసినట్టు చెప్పారు. ‘‘ప్రాంతీయంగా మనకు ఎటువంటి సహకార ఒప్పందాలు లేవు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని భారత్ కోరుకునేట్టు అయితే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కలిగి ఉండాలి’’ అంటూ సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా సుబ్రమణ్యం తన అభిప్రాయాలను వెల్లడించారు. భారీ పన్ను వసూళ్ల అంచనా: రెవెన్యూ కార్యదర్శి బజాజ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) భారీ పన్ను వసూళ్లు జరుగుతాయని విశ్వసిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శ తరుణ్ బజాజ్ సీఐఐ సమావేశంలో పేర్కొన్నారు. కార్పొరేట్ రంగం పనితీరు ఊహించినదానికన్నా బాగుండడమే తమ ఈ అంచనాలకు కారణమని వివరించారు. ఆటో రంగంపై అధిక జీఎస్టీ రేట్లు ఉన్నాయన్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్ పరిశీలన జరుగుతుందని, అధికంగా ఉన్న రేట్లను అవసరమైతే తగ్గిస్తుందని తెలిపారు. పన్ను పరిధిని పెంచడం ద్వారా స్థూల దేశీయోత్పత్తిలో పన్నుల నిష్పత్తి పెంపునకు మదింపు జరుగుతుందని ఈ సందర్భంగా వివరించారు. భారత్‌లో పన్ను వసూళ్లు జీడీపీలో దాదాపు 10 శాతంగా ఉంటే, అభివృద్ధి చెందని దేశాల్లో దాదాపు 25 నుంచి 28 శాతం శ్రేణి ఉందని అన్నారు. చదవండి: ఈ కంపెనీ ఒక్కనెలలో ఎన్ని కార్లు తయారు చేసిందో తెలుసా? -
చైనాకు కలిసొస్తున్న కరోనా..!
అమెరికాసహా పలు దేశాల్లో రికవరీ, డిమాండ్ పటిష్టంగా ఉండడంతో ప్రపంచ పటంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ– చైనా దీనిని తనకు పూర్తి అనుకూలంగా మార్చుకుంటోంది. చైనాతో పోటీ పడుతున్న పలు దేశాలు కరోనా సెకండ్ వేవ్ సవాళ్లలో కూరుకుపోవడం దీనికి నేపథ్యం. చైనా ప్రపంచ ఎగుమతులు ఏప్రిల్‌లో (2021 ఇదే కాలంతో పోల్చి) ఏకంగా 32.3 శాతం పెరిగాయి. విలువలో 263.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు సైతం 43.1 శాతం పెరిగి 221.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ ఎగుమతులు 24.1 శాతం అంచనాలకు మించి పెరగడం గమనార్హం. మార్చిలో వృద్ధి రేటు 30.6 శాతం. ఇక దిగుమతుల విషయానిక వస్తే, మార్చిలో పెరుగుదల రేటు 38.1 శాతం. అమెరికా, ఈయూలతో వాణిజ్యం ఇలా... ఇక ఒక్క అమెరికాకు ఏప్రిల్‌లో చైనా ఎగుమతుల విలువ 38.8 శాతం పెరిగి 42 బిలియన్ డాలర్లకు చేరాయి. అమెరికా గూడ్స్ దిగుమతుల విలువ 23.5 శాతం పెరిగి 13.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 27 దేశాల యూరోపియన్ యూనియన్‌కు ఎగుమతులు 23.9 శాతం పెరిగి 39.9 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతుల విలువ 43.3 శాతం పెరిగి 26.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. చైనా ప్రపంచ వాణిజ్య మిగులు 42.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే చైనా వస్తు డిమాండ్ మెరుగుపడిందని తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. ముడి ఇనుము, ఇతర కమోడిటీ ధరలు అంతర్జాతీయంగా పెరగడం కూడా చైనా ఎగ్జిమ్ (ఎగుమతులు–దిగుమతులు) డిమాండ్‌కు సానుకూలత చేకూర్చినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే కోవిడ్–19 నేపథ్యంలో ఇతర దేశాలతో పోల్చితే చైనా ఎకానమీ ముందే ప్రారంభంకావడం గమనార్హం. మాస్కులు, ఇతర వైద్య సంబంధ ఎగుమతులు చైనా నుంచి భారీగా పెరిగాయి. కంటైనర్లకు అదనపు ప్రీమియంలు తమ దేశం నుంచి ప్రపంచ దేశాలకు భారీగా ఎగుమతులు పెరగడానికి చైనా వినూత్న విధానాలను చేపడుతోందన్న వార్తలు కూడా ఉన్నాయి. ఈ వార్తల ప్రకారం భారత్ వంటి పలు దేశాలఎగుమతుల్లో స్వల్ప వృద్ధి మాత్రమే నమోదుకావడానికి కంటైనర్ల కొరతే ప్రధాన కారణం. ఫిబ్రవరి చివరి వారంలో విపరీతమైన కంటైనర్ల కొరత ఏర్పడింది. ‘‘ఈ ప్రాంతంలో కంటైనర్ల కొరత ఉండడం ఇక్కడ ఒక సమస్య. చైనా నుంచి భారీ ఎగుమతుల కోసం ఖాళీ కంటైనర్లు ఆ దేశానికి పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయి. ఇలా ఖాళీ కంటైనర్లు చైనాకు తిరిగి వెళ్లడానికి షిప్పింగ్ లైన్స్, కంటైనర్ కంపెనీలకు చైనా అధిక ప్రీమియంలనూ చెల్లిస్తోంది’’ అని ఎఫ్ఐఈఓ (భారత ఎగుమతి సంఘాల సమాఖ్య) ప్రెసిడెంట్ ఎస్కే షరాఫ్ ఇటీవల పేర్కొనడం గమనార్హం. ఏప్రిల్‌లో భారత్ ఎగుమతి–దిగుమతులు... భారత్ ఎగుమతులు 2021 ఏప్రిల్‌లో 30.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే కాలంలో దిగుమతుల విలువ 45.45 బిలియన్ డాలర్లుగా ఉంది. వృద్ధి బాటన అడుగులు.. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన, వర్థమాన, పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు కరోనా వైరస్ సవాళ్లతో అతలాకుతలం అవుతుంటే, వైరెస్ సృష్టికి కారణమైన చైనా మాత్రం పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. 2020 తొలి త్రైమాసికం మినహా మిగిలిన మూడు త్రైమాసికాల్లోనూ వృద్ధిని నమోదుచేసుకోవడం గమనార్హం. కరోనా సవాళ్లతో మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు (2019 ఇదే కాలంతో పోల్చి) జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్ మధ్యా ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారీగా 6.5 శాతం వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 2.3 శాతం వృద్ధి రేటును (జీడీపీ విలువ 15.42 ట్రిలియన్ డాలర్లు) నమోదుచేసుకుంది. అయితే గడచిన 45 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత తక్కువ స్థాయిలో దేశం వృద్ధి రేటు నమోదుకాలేదు. ఇక 2021 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) అమెరికా తరువాత రెండవ అతిపెద్ద ఎకానమీ అయిన చైనా, ఏకంగా 18.3 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. విలువలో 24.93 ట్రిలియన్ యువాన్ (దాదాపు 3.82 ట్రిలియన్ డాలర్లు)లుగా నమోదయ్యింది. 1993లో చైనా జీడీపీ గణాంకాల ప్రచురణ ప్రారంభమైంది. అటు తర్వాత ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో వృద్ధి రేటు (18.3 శాతం) నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక 2021లో దేశ ఎకానమీ పదేళ్ల గరిష్ట స్థాయిలో 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని ఈ నెల మొదట్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. చైనా ప్రభుత్వం మాత్రం 6 శాతం వృద్ధి లక్ష్యంతో పనిచేస్తోంది. మరోవైపు సెకండ్‌వేవ్ సవాళ్లలో పీకల్లోతు కూరుకుపోయిన భారత్ 2021, 2021–22 వృద్ధి అంచనాలకు భారీగా కోత పడుతోంది. 10 శాతం దిగువకే వృద్ధి రేటు పరిమితం అవుతుందని ఇప్పటికే దిగ్గజ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. దీనికీ బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నాయి. -
మార్చిలో రికార్డు స్థాయిలో ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మార్చిలో రికార్డు సృష్టించాయి. 58.23 శాతం పెరుగుదలతో 34 బిలియన్ డాలర్లుకు చేరాయి. ఒక నెల్లో ఎగుమతులు 34 బిలియన్ డాలర్లుగా నమోదుకావడం భారత్ ఎగుమతుల చరిత్రలోనే ఇదే తొలిసారి. ఎగుమతుల పురోగతికి కేంద్రం తీసుకున్న పలు చర్యల ఫలితాలు మార్చిలో కనబడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక దిగుమతులు సైతం 52.89 శాతం పెరుగుదలతో 48.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 14.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2020 మార్చి నెలలో ఎగుమతులు, దిగుమతులు అసలు వృద్ధి లేకుండా క్షీణతలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి అతి తక్కువ గణాంకాలే తాజా సమీక్షా నెలలో వృద్ధి పెరుగుదల శాతాల్లో ‘భారీ’గా కనబడ్డానికి కారణం. దీనినే బేస్ ఎఫెక్ట్‌గా పరిగణిస్తారు. కరోనా సవాళ్ల నేపథ్యంలో 2020 మార్చి నెలలో ఎగుమతుల విలువ 34 శాతం క్షీణించి (2019 మార్చితో పోల్చి) 21.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల విలువ 2020 మార్చిలో 31.47 బిలియన్ డాలర్లుగా ఉంది. అప్పట్లో వాణిజ్యలోటు 9.98 బిలియన్ డాలర్లు. వాణిజ్యమంత్రిత్వశాఖ తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే, తాజా సమీక్షా నెలలో ఇంజనీరింగ్, రత్నాలు-ఆభరణాలు, ఔషధ రంగాల నుంచి ఎగుమతులు సానుకూల వృద్దిని నమోదుచేశాయి. పసిడి దిగుమతులు సమీక్షా నెలలో 7.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం 7.4 శాతం క్షీణత కాగా 2020-21 ఏప్రిల్ నుంచి మార్చి వరకూ చూస్తే, ఎగుమతులు 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019-20లో ఈ విలువ 313.36 బిలియన్ డాలర్లు. ఇక ఇదే కాలంలో దిగుమతులు 18 శాతం క్షీణించి 474.71 బిలియన్ డాలర్ల నుంచి 388.92 బిలియన్ డాలర్లకు పడ్డాయి. చమురు దిగుమతుల విలువలు... మార్చిలో చమురు దిగుమతుల విలువ 1.22 శాతం పెరిగి 10.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 37 శాతం పడిపోయి 82.25 బిలియన్ డాలర్లుగా ఈ విలువ నమోదయ్యింది. చమురుయేతర దిగుమతుల విలువ మార్చిలో ఏకంగా 777.12 శాతం పెరిగి 37.95 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతుల బాట... కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో 2020 మార్చి నుంచి వరుసగా ఆరు నెలలు ఆగస్టు వరకూ ఎగుమతులు క్షీణతను చూశాయి. అయితే సెప్టెంబర్‌లో వృద్ధిబాటలోకి (5.99 శాతం వృద్ధితో 27.58 బిలియన్ డాలర్లు) వచ్చినా, మళ్లీ మరుసటి రెండు నెలలూ (అక్టోబర్-నవంబర్) క్షీణతలోకి జారిపోయాయి. తిరిగి 2020 డిసెంబర్లో స్వల్పంగా 0.14 శాతం వృద్ధి నమోదయ్యింది. వరుసగా రెండవనెలా 2021 జనవరిలోనూ వృద్ధిబాటలో పయనించాయి. 6.16 శాతం వృద్ధితో 27.45 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఫిబ్రవరి నెలలోనూ భారత్ ఎగుమతులు వరుసగా మూడవనెలా పురోగతి బాటనే నడిచాయి. 0.67 శాతం వృద్ధితో 27.93 బిలియన్ డాలర్లుగా ఎగుమతులు నమోదయ్యాయి. కరోనా సవాళ్ల నేపథ్యంలో భారత్ మార్చి 31వరకూ అనుసరించిన విదేశీ వాణిజ్య విధానాన్ని (ఎఫ్టీపీ) మరో ఆరు నెలలు (సెప్టెంబర్ వరకూ) పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2015-20 మధ్య అనుసరించిన విదేశీ వాణిజ్య విధానాన్ని 2020 మార్చి 31వ తేదీన కేంద్రం 2021 మార్చి 31వ తేదీ వరకూ పొడిగించింది. కొత్త పాలసీ విధాన రూపకల్పన పక్రియ ఇంకా చర్చల దశలోనే ఉందని, ఈ నేపథ్యంలో మరికొద్ది నెలలు ఇందుకు సంబంధించి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించవచ్చని ఇప్పటికే వచ్చిన వార్తలకు అనుగుణంగా బుధవారం ఎఫ్టీపీ పొడిగింపు (సెప్టెంబర్ వరకూ) అధికారిక నిర్ణయం వెలువడింది. ప్రస్తుత అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితి అనిశ్చితిగా ఉందని, పరిస్థితి మెరుగుపడిన తర్వాత తాజా విధాన రూపకల్పన, అమలు మంచి ఫలితాలను అందిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వాణిజ్య వర్గాలు సమర్థిస్తున్నాయి. చదవండి: మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్ లీవ్ ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పైపైకి! -
కరోనా కాలంలో చైనాపై కాసుల వర్షం
కరోనా కాలంలో చైనాపై కాసుల వర్షం కురిసింది. కరోనా మహమ్మారి కారణంగా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థ చితికిపోతే, కరోనా పుట్టిలైన చైనాలో మాత్రం కాసుల వర్షం కురవడం విశేషం. చైనా ఎగుమతులలో వృద్ధి రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా అత్యధిక స్థాయికి చేరుకుంది. అదే సమయంలో దిగుమతులు కూడా పెరిగినట్లు ఆ దేశం కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. కరోనా కాలంలో మాస్క్‌ల వంటి వ్యక్తిగత రక్షణ సామగ్రి, ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఎలక్ట్రానిక్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దింతో చైనా ఎగుమతులు భారీగా పెరిగాయి. జనవరి-ఫిబ్రవరి కాలంలో ఎగుమతులు సంవత్సరానికి 60.6శాతం పెరిగితే, అలాగే విశ్లేషకుల అంచనాలకు మించి దిగుమతులు 22.2 శాతం పెరిగాయి. దీనికి సంబందించిన అధికారిక సమాచారం చైనా విడుదల చేసింది. తాజా కస్టమ్స్ గణాంకాలు గత ఏడాది ఇదే సమయంలో చైనా ఎగుమతులు 17 శాతం తగ్గిపోగా, దిగుమతులు 4 శాతం పడిపోవడం గమనార్హం. కరోనా కాలంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 54.1 శాతం, టెక్స్టైల్స్ ఎగుమతులు 50.2 శాతం మేర పెరిగినట్లు తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే, చైనా మొత్తం వాణిజ్య మిగులు 103.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. చదవండి: రూ.1.97లక్షల కోట్ల ఎలాన్ మస్క్ సంపద ఆవిరి కరోనాతో ప్రజలకు రూ.13లక్షల కోట్ల నష్టం