![Remission Of Duties And Taxes On Exported Pharma Products - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/8/Pharma%20and%20indian%20currency.jpg.webp?itok=OlC3Dlkf)
న్యూఢిల్లీ: ఫార్మా తదితర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పన్ను రీఫండ్ స్కీము ఆర్‌వోడీటీఈపీని రసాయనాలు, ఫార్మా, ఇనుము .. ఉక్కు ఉత్పత్తులకు కూడా నిర్దిష్ట కాలం పాటు వర్తింపచేయాలని నిర్ణయించింది.
ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకూ ఈ రంగాలకు ఆర్‌వోడీటీఈపీ వర్తిస్తుంది. కొత్తగా చేర్చినవి కూడా కలిపితే పన్ను రీఫండ్ ప్రయోజనాలు దక్కే ఎగుమతి ఐటమ్‌ల సంఖ్య 8,731 నుంచి 10,342కి చేరుతుంది.
స్కీమును విస్తరించడం వల్ల రూ. 1,000 కోట్ల మేర ఆర్థిక భారం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌లో ఎగుమతుల వృద్ధి 16.65 శాతం మేర మందగించిన నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment