ప్లాస్టిక్‌ నోట్లు వస్తున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం | No decision to introduce plastic notes MoS Finance | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ నోట్లు వస్తున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Published Thu, Feb 8 2024 9:16 AM | Last Updated on Thu, Feb 8 2024 10:44 AM

No decision to introduce plastic notes MoS Finance - Sakshi

Plastic Currency: దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? చాలా కాలంగా చర్చ సాగుతున్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 

ఈమేరకు పార్లమెంటులో ఎదురైన ఈ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ప్లాస్టిక్ నోట్ల జారీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే కరెన్సీ నోట్ల మన్నిక, నకిలీ నోట్లను అరికట్టడం నిరంతర ప్రక్రియ అని అన్నారు.

అలాగే పేపర్ కరెన్సీ , ప్లాస్టిక్‌ నోట్లు ప్రింటింగ్ ఖర్చుపైనా పంకజ్ చౌదరి స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2022-23 నివేదిక ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణకు మొత్తం రూ. 4682.80 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ కరెన్సీ ముద్రణకు ఎలాంటి ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అక్కడ మూతపడుతున్న బ్యాంకులు.. ఒక్క నెలలోనే 139 బ్రాంచ్‌లు క్లోజ్‌!

కాగా ప్లాస్టిక్‌ నోట్లను తీసుకొచ్చే ఆలోచనను సెంట్రల్‌ బ్యాంక్‌ కొన్నేళ్ల కిందటే చేసింది.  ఆర్బీఐ 2015-16 వార్షిక నివేదిక ప్రకారం.. రూ.10 ప్లాస్టిక్ నోట్లను విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. సుమారు పది లక్షల నోట్లను కొచ్చి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్‌ నగరాల్లో ప్రయోగాత్మకంగా విడుదల చేయాలని భావించారు. అయితే అధిక ఉష్ణోగ్రతల్లో ప్లాస్టిక్ నోట్లు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం ఉండటంతో ఆర్బీఐ ఈ ప్రాజెక్టును అటకెక్కించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement