స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎగుముత్లో భారత్ రికార్డు సాధించింది. తొలిసారిగా ఎగుమతుల్లో 400 బిలియన్ డాలర్ల మార్క్‌ను రీచ్ అయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కావడానికి ఇంకా తొమ్మిది రోజులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించింది. తమ ప్రభుత్వ నినాదమైన ఆత్మ నిర్భర్ భారత్‌కి తాజాగా రికార్డు స్థాయిలో జరుగుతున్న ఎగుమతులు ఓ ఉదాహారణ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
కరోనా సంక్షోభం తీసుకొచ్చిన ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఎగిసిపడుతున్న ముడి చమురు ధరలు ఆందోళన కలిగిస్తున్నా.. ఈ స్థాయిలో ఎగుమతులు సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ప్రతీ నెల 33 బిలియన్ డాలర్లు ఎగుమతులను ఇండియా సాధిస్తూనే వస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక‌్షన్ లింకిండ్ ఇన్సెంటివ్ స్కీమ్‌తో పాటు ఇతర ప్రభుత్వ విధానాల కారణంగానే ఈ రికార్డు సాధ్యమైందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు మారుతున్న పరిస్థితుల్లో ఇండియా గ్లోబల్ సప్లై చెయిన్‌లో కీలకంగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment