భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అక్టోబర్‌లో 27 టన్నుల పసిడిని జోడించింది. దీనితో దేశం మొత్తం పసిడి నిల్వ 882 టన్నులకు చేరింది. ఇందులో భారత్‌లో 510 టన్నుల బంగారం నిల్వ ఉండగా, మిగిలిన పరిమాణాన్ని న్యూయార్క్, లండన్‌సహా మరికొన్ని చోట్ల ఉన్న గోల్డ్ వాల్ట్‌లలో రిజర్వ్ చేసింది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఈ తాజా వివరాలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు అక్టోబర్‌లో 60 టన్నులు జోడించడం విశేషం. కాగా, జనవరి నుంచి అక్టోబర్ వరకూ భారత్ మొత్తం 77 టన్నుల బంగారాన్ని సమకూర్చుకుంది. 2023లో ఇదే కాలంతో పోలిస్తే ఆర్‌బీఐ బంగారం జోడింపు ఐదు రెట్లు పెరిగిందని డబ్ల్యూజీసీ తెలిపింది.
ఇదీ చదవండి: చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్!
భారత్ తర్వాత టర్కీ, పోలాండ్ సెంట్రల్ బ్యాంకులు అక్టోబర్‌లో వరుసగా 17, 8 టన్నుల బంగారాన్ని తమ నిల్వలకు జోడించాయి. జనవరి నుంచి అక్టోబర్ వరకూ ఈ రెండు దేశాలూ వరుసగా 72, 69 టన్నులను తమ బంగారు నిల్వలకు జోడించి మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగించాయని డబ్ల్యూజీసీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment