చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్‌! | Worlds Largest Gold Deposit Found In China Valued At Rs 7 Lakh Crore | Sakshi
Sakshi News home page

చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్‌!

Published Fri, Nov 29 2024 10:15 AM | Last Updated on Fri, Nov 29 2024 10:46 AM

Worlds Largest Gold Deposit Found In China Valued At Rs 7 Lakh Crore

చైనాలో భారీ బంగారు నిక్షేపం బయటపడింది. సుమారు 1,000 మెట్రిక్ టన్నుల అత్యంత నాణ్యమైన ఖనిజం ఉన్నట్లు భావిస్తున్న ఈ బంగారు నిక్షేపాన్ని సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న పింగ్జియాంగ్ కౌంటీలో కనుగొన్నట్లు జియోలాజికల్ బ్యూరో ఆఫ్‌ హునాన్ ప్రావిన్స్ ధ్రవీకరించింది.

చైనీస్ స్టేట్ మీడియా ప్రకారం.. ఈ నిక్షేపంలోని బంగారు అంచనా విలువ 600 బిలియన్ యువాన్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 6,91,473 కోట్లు. ఇది దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ మైన్‌లో లభించిన 930 మెట్రిక్ టన్నులను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వగా ఉండవచ్చు.

ఈ నిక్షేపం వెలికితీతకు మైనింగ్‌ కార్మికులు, యంత్రాంగం తీవ్రంగా కష్టపడ్డారు. ప్రాథమిక అన్వేషణలో 2 కిలోమీటర్ల లోతులో 300 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉన్న 40 బంగారు సొరంగాలు సిరలు బయటపడ్డాయి. అధునాతన 3డీ మోడలింగ్ టెక్నాలజీని వినియోగించి మరింత ఎక్కువ లోతుకు వెళ్లి నిక్షేపాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు.

మైనింగ్ టెక్నాలజీ ప్రకారం.. చైనాలో ఈ బంగారు నిక్షేపం బయటపడటానికి ముందు ప్రపంచంలోని అతిపెద్ద బంగారు నిక్షేపాలు ఇవే..
1. సౌత్ డీప్ గోల్డ్ మైన్ - సౌత్ ఆఫ్రికా  
2. గ్రాస్‌బర్గ్ గోల్డ్ మైన్ - ఇండోనేషియా  
3. ఒలింపియాడా గోల్డ్ మైన్ - రష్యా  
4. లిహిర్ గోల్డ్ మైన్ - పాపువా న్యూ గినియా  
5. నోర్టే అబియర్టో గోల్డ్ మైన్ - చిలీ  
6. కార్లిన్ ట్రెండ్ గోల్డ్ మైన్ - యూఎస్‌ఏ 
7. బోడింగ్టన్ గోల్డ్ మైన్ - వెస్ట్రన్ ఆస్ట్రేలియా  
8. ఎంపోనెంగ్ గోల్డ్ మైన్ - సౌత్ ఆఫ్రికా  
9. ప్యూబ్లో వీజో గోల్డ్ మైన్ - డొమినికన్ రిపబ్లిక్  
10. కోర్టెజ్ గోల్డ్ మైన్ - యూఎస్‌ఏ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement