న్యూఢిల్లీ: దేశ బంగారం దిగుమతులు 2021–22 సంవత్సరంలో 33 శాతం పెరిగాయి. మొత్తం 46.14 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.45 లక్షల కోట్లు) విలువైన బంగారం (842 టన్నులు) దిగుమతి అయినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020–21లో బంగారం దిగుమతుల విలువ 34.62 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం బంగారం దిగుమతులు పెరిగిపోవడంతో వాణిజ్యలోటు 192 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవ త్సరంలో 103 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.
బంగారం వినియోగంలో చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారత్ ఉంది. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2021–22లో 50 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లకు చేరాయి. కరెంటు ఖాతా లోటు గత ఆర్థిక సంవత్సరానికి 23 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ఇది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం జీడీపీలో 2.7 శాతానికి సమానం.
Comments
Please login to add a commentAdd a comment