ముంబై: భారత్ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఆగస్టులో 2021 ఇదే నెలతో పోల్చి 6.7శాతం పెరిగాయి. విలువలో రూ.26,419 కోట్లుగా (3,316 మిలియన్ డాలర్లు) నమోదయ్యాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఈ మేరకు ఒక ప్రకటన చేసింది.
ఆగస్టులో ఒక్క కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ (సీపీడీ) ఎగుమతులు 0.84 శాతం తగ్గి రూ.14,956 (1,880 మిలియన్ డాలర్లు) కోట్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య మాత్రం స్వల్పంగా 1.59 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో ఇది రూ.78,697 కోట్లు (10,081 మిలియన్ డాలర్లు). చైనాలో కరోనా ప్రతికూల పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు గడచిన రెండు నెలలుగా కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ (సీపీడీ) ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
Comments
Please login to add a commentAdd a comment