gems
-
రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్
ముంబై: రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డిసెంబర్లో వార్షికంగా 8.14 శాతం తగ్గి రూ. 18,281.49 కోట్లకు ( 2,195.23 మిలియన్ డాలర్లు) చేరుకున్నాయని జెమ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) పేర్కొంది. గత ఏడాది ఇదే నెల్లో ఈ ఎగుమతుల విలువ రూ.19,901.55 కోట్లని (2,413.46 మిలియన్ డాలర్లు) వివరించింది. కీలక ఎగుమతి మార్కెట్లలో మందగమన పరిస్థితులు, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, భారత్, అమెరికాసహా 60 దేశాల్లో ఎన్నికల వంటి అంశాలు ఈ విభాగం ఎగుమతుల రంగంపై ప్రభావం చూపుతున్నట్లు మండలి చైర్మన్ విపుల్ షా చెప్పారు. ఇక కట్ అండ్ డైమండ్ మొత్తం ఎగుమతులు డిసెంబరులో 31.42 శాతం తగ్గి రూ. 7,182.53 కోట్లకు (862.48 మిలియన్ డాలర్లు) చేరాయి. గత సంవత్సరం ఇదే నెల్లో ఈ విలువ రూ. 10,472.93 కోట్లు ( 1,270.36 మిలియన్ డాలర్లు). అయితే డిసెంబర్లో బంగారు ఆభరణాల ఎగుమతులు 47.32 శాతం పెరిగి రూ.7,508.05 కోట్లకు ( 901.52 మిలియన్ డాలర్లు) చేరాయి. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ రూ. 5,096.25 కోట్లు ( 618.27 మిలియన్ డాలర్లు). -
Surat Diamond Bourse: ఇది ‘వజ్రాల వ్యాపార గని’
బెల్జియంలోని యాంట్వెర్ప్ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే. ప్రపంచంలోనే వజ్రాల వ్యాపారానికి చిరునామాగా చలామణి అవుతున్న నగరమది. ఇప్పుడు ఆ పేరుకు చెల్లుచీటి రాసేస్తూ గుజరాత్‌లోని సూరత్ పట్టణం కొత్త అధ్యయనం లిఖించింది. ఒకేసారి 65,000 మందికిపైగా వ్యాపారులు, పనివాళ్లు, పరిశ్రమ నిపుణులు వచ్చి పనిచేసుకునేందుకు వీలుగా సువిశాల అధునాతన భవంతి అందుబాటులోకి వచ్చింది. 71 లక్షల చదరపు అడుగులకుపైగా ఆఫీస్ స్పేస్‌తో నూతన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అమెరికా రక్షణ శాఖ ప్రధానకార్యాలయం (పెంటగాన్) పేరిట ఉన్న ఈ రికార్డును చెరిపేసిన అద్భుత భవంతి విశేషాలు ఇవీ.. రూ. 3,200 కోట్ల వ్యయంతో.. విశ్వవ్యాప్తంగా వెలికితీసిన వజ్రాల్లో దాదాపు 90 శాతం వజ్రాలను సానబట్టేది సూరత్‌లోనే. దాంతో భారత్‌లో జెమ్ క్యాపిటల్‌గా సూరత్ కీర్తిగడించింది. అందుకే సూరత్‌లో వజ్రాల వ్యాపార అవసరాలు తీర్చేందుకు అనువుగా ఈ భవనాన్ని నిర్మించారు. దీనికి ‘సూరత్ డైమండ్ బౌర్స్’ అని నామకరణం చేశారు. బౌర్స్ పేరుతో గతంలో ఫ్రాన్స్‌లో పారిస్ స్టాక్ఎక్సే్ఛంజ్ ఉండేది. అంటే వజ్రాల వ్యాపారానికి సిసలైన చిరునామా ఇదే అనేట్లు దీనికి ఆ పేరు పెట్టారు. వజ్రాలను సానబట్టే వారు, వ్యాపారులు, కట్టర్స్ ఇలా వజ్రాల విపణిలో కీలకమైన వ్యక్తులందరూ తమ పని మొత్తం ఇక్కడే పూర్తిచేసుకోవచ్చు. తొమ్మిది దీర్ఘచతురస్రాకార భవంతులను విడివిడిగా నిర్మించి అంతర్గతంగా వీటిని కలుపుతూ డిజైన్‌చేశారు. మొత్తంగా 35 ఎకరాల్లో ఈ కట్టడం రూపుదాల్చింది. అంటే 71 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌స్పేస్ అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ సమయంలో తప్పితే నాలుగేళ్లుగా విరామమెరుగక కొనసాగిన దీని నిర్మాణం ఇటీవలే పూర్తయింది. నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. దాదాపు రూ.3,200 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. మొత్తంగా 4,700 భారీ దుకాణాలు ఇందులో ఉన్నాయి. అన్నివైపులా ఎక్కడికక్కడ అనువుగా 131 ఎలివేటర్లను ఏర్పాటుచేశారు. అందరికీ భోజన సదుపాయం, రిటైల్ వర్తకులకు ప్రత్యేక సౌకర్యాలు, వెల్నెస్, కార్మికుల కోసం సమావేశ మందిరాలను కొలువుతీర్చారు. ‘150 మైళ్ల దూరంలోని ముంబై నుంచి వేలాది మంది వ్యాపారాలు రోజూ సూరత్‌కు వచ్చిపోతుంటారు. ఇలా ఇబ్బందిపడకుండా వారికి సకల సౌకర్యాలు కల్పించాం’ అని ప్రాజెక్టు సీఈవో మహేశ్ గధావీ చెప్పారు. ప్రజాస్వామ్య డిజైన్! ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు డిజైన్ చేయాల్సిందిగా అంతర్జాతీయంగా బిడ్డింగ్‌కు ఆహ్వానించగా భారత్‌కే చెందిన మోర్ఫోజెనిసిస్ ఆర్కిటెక్చర్ సంస్థ దీనిని కైవసం చేసుకుంది. డైమండ్లకు ఉన్న డిమాండ్ ఈ ప్రాజెక్టు పరిమాణాన్ని అమాంతం పెంచేసింది. ఇప్పటికే అన్ని దుకాణాలను డైమండ్ కంపెనీలు నిర్మాణానికి ముందే కొనుగోలుచేయడం విశేషం. ఎయిర్పోర్ట్ టెర్మినల్ తరహాలో అన్ని బిల్డింగ్‌లను కలుపుతూ ఒక్కటే భారీ సెంట్రల్ కారిడార్‌ను నిర్మించారు. ‘‘అందరికీ సమానంగా అన్ని సౌకర్యాలు అనే విధానంలో ‘ప్రజాస్వామ్య’ డిజైన్‌ను రూపొందించాం. సెంట్రల్ కారిడార్ ద్వారా అందరికీ అన్ని సౌకర్యాలు సమదూరంలో ఉంటాయి’’ అని మోర్ఫోజెనిసిస్ సహ వ్యవస్థాపకురాలు సోనాలీ రస్తోగీ చెప్పారు. అంటే ప్రధాన ద్వారాల్లో ఎటువైపు నుంచి లోపలికి వచ్చినా చివరి దుకాణానికి ఏడు నిమిషాల్లోపు చేరుకోవచ్చు. కాంక్రీట్ వనంగా కనిపించకుండా ఉండేందుకు 1.5 ఎకరాల విస్తీర్ణంలో పచ్చికబయళ్లను సిద్ధంచేశారు. ఇలాంటివి లోపల తొమ్మిది ఉన్నాయి. ప్లాటినమ్ రేటింగ్ సూరత్‌కు దక్షిణంగా 1,730 ఎకరాల్లో స్మార్ట్ సిటీని ఒకదానిని నిర్మిస్తే బాగుంటుందని ప్రధాని మోదీ గతంలో అభిలషించారు. ఆయన సంకల్పానికి బాటలు వేస్తూ ఇప్పుడు ఈ భవంతి నిర్మాణం పూర్తయ్యాక చుట్టూతా నూతన జనావాసాలు, వ్యాపార సముదాయాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఎండాకాలంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 110 డిగ్రీస్ ఫారన్‌హీట్‌ను దాటుతుంది. అయినాసరే భవంతిలో ఎక్కువ ఇంథనం వాడకుండా పర్యావరణహితంగా డిజైన్‌చేశారు. సాధారణ భవనాలతో పోలిస్తే ఈ భవంతి 50 శాతం తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. అందుకే దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ‘ప్లాటినమ్’ రేటింగ్‌ను కట్టబెట్టింది. మధ్యమధ్యలో వృత్తాకారంగా వదిలేసిన శ్లాబ్స్ కారణంగా గాలి ధారాళంగా దూసుకొచ్చి బిల్డింగ్ లోపలి భాగాలను చల్లబరుస్తుంది. దాదాపు సగం భవంతి సాధారణ వెంటిలేషన్ ద్వారానే చల్లగా ఉంటుంది. ఇక మిగతా కామన్ ఏరియాస్‌లో సౌర ఇంధనాన్ని వినియోగించనున్నారు. ఆకృతిపరంగానేకాదు పర్యావరణహిత, సుస్థిర డిజైన్‌గా ఈ భవంతి భాసిల్లనుంది. కట్టడం కథ లెక్కల్లో.. మొత్తం కట్టింది: 35 ఎకరాల్లో భారీ దుకాణాలు: 4,700 అందుబాటులోకొచ్చే ఆఫీస్ స్పేస్: 71 లక్షల చదరపు అడుగులు ఎలివేటర్లు: 131 బిల్డింగ్ రేటింగ్: ప్లాటినమ్ మొత్తం వ్యయం: రూ.3,200 కోట్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్లో 6.7 శాతం వృద్ధి!
ముంబై: భారత్ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఆగస్టులో 2021 ఇదే నెలతో పోల్చి 6.7శాతం పెరిగాయి. విలువలో రూ.26,419 కోట్లుగా (3,316 మిలియన్ డాలర్లు) నమోదయ్యాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఆగస్టులో ఒక్క కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ (సీపీడీ) ఎగుమతులు 0.84 శాతం తగ్గి రూ.14,956 (1,880 మిలియన్ డాలర్లు) కోట్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య మాత్రం స్వల్పంగా 1.59 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో ఇది రూ.78,697 కోట్లు (10,081 మిలియన్ డాలర్లు). చైనాలో కరోనా ప్రతికూల పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు గడచిన రెండు నెలలుగా కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ (సీపీడీ) ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. -
రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్లో 6 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి పది నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) 32.37 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు జరిగాయి. 2020–21 ఇదే కాలంతో పోలి్చతే (30.40 బిలియన్ డాలర్లు) ఈ విలువ 6.5 శాతం అధికం. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసిన ప్రకటన ఒకటి ఈ అంశాలను తెలిపింది. ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► భారత రత్నాలు, ఆభరణాల ఎగుమతుల రంగం కరోనా మహమ్మారి సవాళ్ల నుంచి వేగంగా కోలుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో రూపాయిల్లో ఎగుమతుల విలువ 12.28 శాతం పెరిగి రూ.2.4 లక్షల కోట్లకు చేరితే, డాలర్ల రూపంలో 6.5 శాతం ఎగసి 32.37 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి మధ్య ఈ విలువలు వరుసగా రూ.2.14 లక్షల కోట్లు, 30.40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► భారత్ ఎగుమతులకు తొలి మూడు ప్రధాన దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (41.50 శాతం), బెల్జియం (15.81 శాతం), జపాన్ (12.20 శాతం) ఉన్నాయి. ► యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)తో ఆ దేశానికి భారత్ నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మరింత పెరుగుతాయి. ► మ్తొతం మధ్యప్రాచ్యం మార్కెట్లోకి ప్రవేశించడానికి యూఏఈ ప్రధాన కేంద్రంగా (గేట్‌వే) ఉంది. ఈ నేపథ్యంలో భారత్–యూఏఈ మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం బహుళ ప్రయోజనాలను చేకూర్చుతుంది. సుంకాలు రద్దు చేయాలి భారతదేశం నుండి బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల ఎగుమతులపై యూఏఈలో 5 శాతం దిగుమతి సుంకాన్ని రద్దయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి ప్రకటన కోరింది. ప్రకటన ప్రకారం, సుంకాలు లేని పరిస్థితుల్లో భారత్ నుంచి యూఏఈకి ప్లెయిన్ గోల్డ్ జ్యూయలరీ, గోల్డ్ స్టడెడ్ జ్యూయలరీ ఎగుమతుల విలువ 2023 నాటికి 10 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.74,000 కోట్లు) చేరుతుంది. భారత్ ప్లెయిన్ గోల్డ్ ఆభరణాల ఎగుమతుల్లో యూఏఈ వాటా 80 శాతం. స్టడెడ్ జ్యూయలరీకి సంబంధించి ఈ వాటా 20 శాతంగా ఉంది. కాగా, బంగారం ఆభరణాల ఎగుమతుల విలువ 2021 ఏప్రిల్–2022 జనవరి మధ్య 24.24 శాతం క్షీణించి, 7.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్లెయిన్ గోల్డ్ జ్యూయలరీ ఎగుమతుల విలువ కూడా భారీగా 56 శాతం పడిపోయి 3.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. -
ఈ రత్నాలను మంత్రగాళ్లు, మంత్రగత్తెలు ధరించేవారు!
ప్రాచీన నాగరికతలలో రకరకాల రత్నాలు వినియోగంలో ఉండేవి. సాధారణంగా సానుకూల ఫలితాలను ఇస్తాయనే నమ్మకంతోనే ప్రాచీనులు రత్నాలను ధరించేవారు. దోషభరితమైన రత్నాలను ధరించినప్పుడే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయని నమ్మేవారు. దోషాలు లేకుండా ఎలాంటి రత్నమైనా ధరించదగ్గదేనని భావించేవారు. దోషాలతో నిమిత్తం లేకుండా ప్రాచీనులలో కొందరిని భయపెట్టిన రత్నం ఒకటి ఉండేది. అదే ‘ఓనిక్స్’. పురాతన సంస్కృత గ్రంథాలు దీనిని గోమేధకభేదంగా, శివధాతువుగా, పీతరత్నంగా పేర్కొన్నాయి. ‘ఓనిక్స్’ జాతికే చెందిన ‘హేసొనైట్ సార్డోనిక్స్’ను మన ప్రాచీనులు ‘గోమేధికం’గా నవరత్నాల జాబితాలో చేర్చారు. ‘ఓనిక్స్’ గోమేధికం కంటే కొంత భిన్నమైన రత్నం. అంతర్గతంగా సూక్ష్మస్ఫటికాలు కలిగిన క్వార్ట్, సిలికా, మోగనైట్ ఖనిజాలతో కూడిన ఖనిజ శిలల నుంచి ‘ఓనిక్స్’ రత్నాలు ఏర్పడతాయి. మోహ్స్ స్కేలుపై ‘ఓనిక్స్’ దారుఢ్యం 6.5–7.0 వరకు ఉంటుంది. ఇవి రకరకాల రంగుల్లో దొరుకుతాయి. అయితే, వీటిలో నలుపురంగులోనివి కొంత విరివిగా దొరుకుతాయి. ఓనిక్స్ రత్నాలను సానబెడితే చాలా నునుపుగా తయారవుతాయి. వీటిని కోణాలుగా తీర్చిదిద్ది సానబెట్టడం కొంత తక్కువే. ముడి ఖనిజం నుంచి కాస్త పెద్దసైజు రత్నాలుగా కూడా ఇవి దొరుకుతాయి. అందువల్ల శిల్పాలు చెక్కడానికి, వీటి ఉపరితలంపై చిత్రాలు చెక్కడానికి, తొలిచి పాత్రలు వంటి గృహోపకరణాలను తయారు చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ప్రాచీన గ్రీకు, రోమన్ నాగరికతల ప్రజలు వీటితో మలచిన శిల్పాలను, రకరకాల గృహోపకరణాలను తయారుచేసుకుని వినియోగించేవారు. ప్రాచీన చైనా ప్రజలు ‘ఓనిక్స్’ రత్నాలను దురదృష్టానికి సంకేతంగా భావించేవారు. ముఖ్యంగా గాఢమైన నలుపు రంగులోని ఓనిక్స్ రత్నాలను ధరించడానికి వెనుకాడేవారు. విశేషమేమిటంటే, విదేశాలకు నౌకలలో వెళ్లే చైనా వర్తకులు మిగిలిన రత్నాలతో పాటు ఓనిక్స్ రత్నాలతోనూ వ్యాపారం చేసేవారు. మిగిలిన రత్నాలను తిరిగి వచ్చేటప్పుడు స్వదేశానికి తీసుకొచ్చేవారు గాని, ఓనిక్స్ రత్నాలను స్వదేశానికి రాక ముందే అయినకాడికి అమ్మేసేవారు. నలుపు రంగు ఓనిక్స్కు అరబిక్ భాషలో ‘ఎల్ జజా’ అనే పేరు ఉంది. అంటే, విషాదం అని అర్థం. విక్టోరియన్ కాలంలో బ్రిటన్‌లో ప్రముఖుల అంత్యక్రియలకు హాజరయ్యేవారు జెట్‌తో పాటు నలుపు రంగు ఓనిక్స్తో తయారైన ఆభరణాలను సంతాప సూచకంగా ధరించేవారు. ప్రేమ తాపాన్ని ఉపశమింపజేసేందుకు ప్రాచీన భారతీయులు ఓనిక్స్ రత్నాలను ధరించేవారని పదహారో శతాబ్దికి చెందిన ఇటాలియన్ శాస్త్రవేత్త, బహుముఖ ప్రజ్ఞశాలి గిరొలామో కార్దానో తన గ్రంథంలో రాశాడు. విపరీతమైన భావోద్వేగాలను నియంత్రణలో ఉంచడానికి ఓనిక్స్ రత్నం బాగా పనిచేస్తుందని కొందరు ప్రాచీనులు నమ్మేవారు. అయితే, ఇది జీవనోత్సాహాన్ని కూడా తగ్గించి, దిగులు గుబులు పెంచుతుందని చాలామంది ఈ రత్నాన్ని ధరించడానికి భయపడేవారు. నల్లని ఓనిక్స్ రత్నాలకు ప్రేతాత్మలను ఆకర్షించే లక్షణం ఉందనే నమ్మకం కూడా అప్పట్లో బలంగా ఉండేది. ఓనిక్స్ రత్నాలకు సంబంధించి కొన్ని సానుకూల నమ్మకాలు కూడా ఉండేవి. ప్రాచీన రోమన్ సైనికులు ఓనిక్స్ రత్నాలపై యుద్ధాలకు అధిష్ఠాన దేవుడైన ‘మార్స్’ రూపాన్ని చెక్కించి, లాకెట్‌లా ధరించేవారు. దీనివల్ల యుద్ధంలో గెలుపు సాధించగలమని వారు నమ్మేవారు. నలుపురంగు ఓనిక్స్ రత్నాన్ని ధరించడం వల్ల మూర్ఛవ్యాధి తగ్గుతుందని పర్షియన్లు నమ్మేవారు. ప్రాచీనకాలం నుంచి వివిధ దేశాల్లో ఓనిక్స్ రత్నాలు వాడుకలో ఉన్నప్పటికీ, వీటి శిల్పాలు, గృహోపకరణాలతో పోల్చితే, ఆభరణాల్లో వీటి వినియోగం చాలా తక్కువగానే ఉండేది. నల్లని ఓనిక్స్ రత్నాలకు పూసల్లా రంధ్రాలు చేసి, వాటిని కూర్చిన దండలను ప్రాచీన, మధ్యయుగాల కాలంలో ఎక్కువగా మంత్రగాళ్లు, మంత్రగత్తెలు ధరించేవారు. ఆధునిక ఫ్యాషన్‌రంగంలో మార్పులు మొదలైన తర్వాతనే జనాలు ఓనిక్స్ రత్నాలను కాస్త ధైర్యంగా ఆభరణాల్లో ధరించడం మొదలైంది. చదవండి: పింక్‌బెల్ట్ మిషన్ ఏం చేస్తుందో తెలుసా? -
సెప్టెంబర్‌లో ఎగుమతుల పరుగు
• 4.62 శాతం వృద్ధి రెండు నెలల వరుస క్షీణతకు బ్రేక్ • 2.4 శాతం తగ్గిన దిగుమతులు • 9 నెలల గరిష్టానికి వాణిజ్య లోటు న్యూఢిల్లీ: ఎగుమతుల పరంగా రెండు నెలల క్షీణతకు సెప్టెంబర్‌లో బ్రేక్ పడింది. ఇంజనీరింగ్, జెమ్స్, జ్యుయలరీ, చేతి ఉత్పత్తులు, వస్త్రోత్పత్తి రంగాలు అందించిన తోడ్పాటుతో సెప్టెంబర్‌లో దేశీయ ఎగుమతులు 4.62 శాతం వృద్ధి చెందాయి. మొత్తం 22.9 బిలియన్ డాలర్ల విలువైన వస్తు, సేవల ఎగుమతులు జరిగాయి. ఇంజనీరింగ్ 6.51 శాతం, జెమ్స్ అండ్ జ్యుయలరీ 22.42 శాతం, హ్యాండిక్రాఫ్ట్స్ 23 శాతం, టెక్స్టైల్స్ 12.62 శాతం, కెమికల్స్ ఎగుమతులు 6 శాతం చొప్పున వృద్ధి చెందడం కలసివచ్చింది. అదే సమయంలో దిగుమతులు 2.54 శాతం క్షీణించి 31.22 బిలియన్ డాలర్ల స్థాయికి దిగివచ్చాయి. దీంతో సెప్టెంబర్‌లో వాణిజ్య లోటు 8.33 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది సెప్టెంబర్‌లో వాణిజ్య లోటు 10.16 బిలియన్ డాలర్లతో పోలిస్తే ప్రస్తుతం కొంత తగ్గింది. అయినప్పటికీ ఇది గత తొమ్మిది నెలల కాలంలోనే గరిష్ట స్థాయి కావడం గమనార్హం. గతేడాది డిసెంబర్లో వాణిజ్య లోటు గరిష్టంగా 11.66 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ⇒ విడిగా రంగాల వారీగా చూస్తే సెప్టెంబర్‌లో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 1.43 శాతం క్షీణించగా, ఆయిల్ దిగుమతులు మాత్రం 3.13 శాతం వృద్ధితో 6.88 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ⇒ ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య ఆరు నెలల కాలంలో ఎగుమతులు మొత్తం మీద చూస్తే 1.74 శాతం క్షీణించాయి. ఈ కాలంలో ఎగుమతుల విలువ 131.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇదే కాలంలో దిగుమతులు 13.77 శాతం క్షీణించి 174.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ⇒ తొలి ఆరు నెలల కాలంలో వాణిజ్య లోటు 43 బిలియన్ డాలర్లు. రానున్న నెలల్లో మంచి ఫలితాలు: ఈ ధోరణి ఇలానే కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశీయ ఎగుమతులు 280 బిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ స్థాయికే చేరతాయని ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన సహకారం తాలూకు సానుకూల ఫలితాలు రాబోయే నెలల్లో ఎగుమతుల గణాంకాల్లో మరింతగా ప్రతిఫలిస్తాయని వ్యాఖ్యానించింది. ⇒ ఎగుమతుల వృద్ధికి చర్యలు: నిర్మలా సీతారామన్ దేశం నుంచి ఎగుమతులను పెంచేందుకు ఉన్న అడ్డంకులను తొలగించే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సరుకుల రవాణా (లాజిస్టిక్స్) వ్యయం, పన్నుపరంగా ఉన్న సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఎగుమతుల పథకాల్లో అవసరమైతే మధ్య కాలిక సవరణలు చేసే లక్ష్యంతో విదేశీ వాణిజ్య విధానంపై తమ శాఖ ఇప్పటికే సమీక్ష ప్రారంభించినట్టు మంత్రి వెల్లడించారు. ‘ఎగుమతుల్లో రెండంకెల వృద్ధికి వ్యూహాలు’ అనే అంశంపై శుక్రవారం ఢిల్లీలో అసోచామ్ నిర్వహించిన సమావేశంలో మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. లాజిస్టిక్స్ వ్యయం అనేది అతి పెద్ద అంశాల్లో ఒకటని, ఇది ధరల పరంగా ఎగుమతిదారుడు పోటీపడేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. స్వల్ప కాలంలో ఈ అంశాల నుంచి బయటపడడం ఎలా అన్న దానిపై ఇప్పటికే కొన్ని సంప్రదింపులు జరిపినట్టు చెప్పారు. -
పాన్ నిబంధనలు మార్చండి..
► రూ.2 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచండి ► బంగారం దిగుమతి సుంకాన్ని 2 శాతం చేయాలి ► జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ అభ్యర్థన న్యూఢిల్లీ: ఆభరణాల కంపెనీల సమాఖ్య ఆల్ ఇండియా జెమ్స్, జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్)... కొత్తగా తెస్తున్న పాన్ నిబంధనలను తప్పుపట్టింది. రూ.2 లక్షలపై కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి అనే నిబంధనలు జ్యుయలరీ రంగానికి ప్రతికూలమని వ్యాఖ్యానించింది. దీనివల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందని, రూ.2 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని కోరింది. ‘‘పాన్ తప్పనిసరి చేయడం వల్ల జ్యుయలరీ విక్రయాలు తగ్గొచ్చు. ప్రత్యేకంగా గ్రామాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది’’ అని తెలియజేసింది. మెట్రో పట్టణాల్లో కూడా బంగారు ఆభరణాల విక్రయాలు 50% మేర తగ్గే అవకాశముందని పేర్కొంది. బంగారం దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 10% నుంచి 2%కి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇది ఒకేసారి సాధ్యపడకపోతే దశలవారీగా తగ్గించాలని సూచించింది. జనవరి 1 నుంచి రూ.2 లక్షలపై కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి చేస్తే.. జ్యుయలరీ పరిశ్రమ నాశనమయ్యే ప్రమాదముందని జీజేఎఫ్ చైర్మన్ జి.వి.శ్రీధర్ చెప్పారు. పాన్ తప్పనిసరి వల్ల బంగారం కొనుగోళ్లు వ్యవస్థీకృత మార్కెట్ నుంచి అవ్యవస్థీకృత మార్కెట్వైపునకు మళ్లే అవకాశం ఉందని, తద్వారా ప్రస్తుతం 20-25 శాతంగా ఉన్న వ్యవస్థీకృత మార్కెట్ వాటా తగ్గే ప్రమాదముందని చెప్పారు. తాజా నిబంధనలను గ్రామాల్లో అమలుచేయడం కష్టమన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంత జ్యుయలరీ మార్కెట్ వాటా 70 శాతంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటికీ పాన్ కార్డుల మంజూరు సంఖ్య స్వల్పంగానే ఉందని చెప్పారు. కొత్త నిబంధనలు జ్యుయలరీ పరిశ్రమను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని జెమ్స్ అండ్ జ్యుయలరీ ఫెడరేషన్ మాజీ చైర్మన్ అశోక్ మీనావాలా చెప్పారు. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 6 కోట్ల మంది ఆధారపడ్డారని తెలిపారు. రూ.10 లక్షలు దాటిన కొనుగోళ్లకే పాన్ తప్పనిసరి చేయాలన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్రం తీసుకున్న ఈ చర్యను తాము తప్పుపట్టడం లేదన్నారు. ‘‘ఇది ఆచరణాత్మకమైనదికాదు. దీనివల్ల పాన్ కార్డులు లేని, పన్ను పరిధిలోకి రాని కొనుగోలుదారులున్న 70% గ్రామాల్లో జ్యుయలరీ మార్కెట్‌ను వివక్షకు గురిచేసినట్లవుతుంది’’ అన్నారాయన. 1000 టన్నులకు పసిడి దిగుమతులు! న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు 2015లో వెయ్యి టన్నులకు చేరుతాయని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (ఏఐజీజేటీఎఫ్) అంచనావేసింది. ఇదే జరిగితే గతేడాది దిగుమతులకన్నా (900 టన్నులు) ఇది 11% అధికం. అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుతుండడం దీనికి కారణమని సమాఖ్య చైర్మన్ జీవీ శ్రీధర్ చెప్పారు. ఈ ఏడాది స్మగ్లింగ్ ద్వారా దాదాపు 100 టన్నుల పసిడి దిగుమతి జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య దేశం 850 టన్నుల పసిడి దిగుమతులు చేసుకుంది. గతేడాది ఇదే కాలంలో దిగుమతులు 650 టన్నులు. ధరల తగ్గుదల కారణంగా కొనుగోళ్లు భారీగా ఉండడంతో పసిడికి 2015 కలిసొస్తోందని చెప్పారు. -
పసిడిపై ఆంక్షలు సడలిస్తేనే మంచిది
న్యూఢిల్లీ: అక్రమ రవాణాకు దారితీస్తున్న పసిడి దిగుమతులపై ఆంక్షలను సడలిస్తేనే మంచిదన్న అభిప్రాయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వ్యక్తం చేశారు. బంగారంపై 10 శాతం ఉన్న దిగుమతుల సుంకం దేశీయ రత్నాలు, ఆభరణాల పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళనల నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘వాణిజ్య మంత్రిగా బంగారంపై ఆంక్షలు తొలగాలనే నేను కోరుకుంటాను. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతుండడమే దీనికి కారణం’ అని ఒక వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు. దేశం మొత్తం ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా దాదాపు 15 శాతం ఉన్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశం మొత్తం ఎగుమతుల విలువ ఆ యేడాది 312 బిలియన్లుకాగా, ఇందులో రత్నాలు, ఆభరణాల రంగం వాటా 39.5 బిలియన్ డాలర్లని అన్నారు. పరిశ్రమకే కాకుండా, అక్రమ రవాణా పెరగడానికి సైతం ఆంక్షలు దారితీస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. ఈ అంశాలన్నింటినీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పరిశీలనకు తీసుకువెళుతున్నట్లు వెల్లడించారు. ఆంక్షల వల్ల కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడి లక్ష్యం నెరవేరుతున్నప్పటికీ, ఈ మెటల్ అక్రమ రవాణా పెరిగి ఆందోళనకరమైన పాతరోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. -
మీరేంటో...మీ చేతి గడియారమూ చెబుతోంది!
సైకాలజీ మణికట్టును అంటిపెట్టుకొని సమయాన్ని సూచించడమే కాదు.. ఎంచుకున్న గడియారం మగువ మనస్తత్వమూ చెబుతోంది. అదెలాగంటే...!!! ఆభరణాలకు మ్యాచ్ అయ్యేలా వాచ్ ధరించేవారు ప్రతీ పనిని పక్కాగా చేయాలనుకుంటారు. అంకెల సమయాన్ని సూచించే గడియారాలను ఇష్టపడేవారు ముక్కుసూటి తత్త్వం గలవారు. త్వరగా పనులు పూర్తిచేయాలని తొందరపడిపోతుంటారు. ఫంకీ వాచీలను ధరించేవారు నలుగురి దృష్టీ తమపై ఉండాలనీ, గ్లామరస్‌గా కనిపించా లని ఆరాటపడతారు. రత్నాలు, రాళ్లు పొదిగిన గడియారాలను ఎంపిక చేసుకునేవారు విలాసంగా జీవితాన్ని గడపాలనుకుంటారు. అంకెలు లేని వాచ్‌లను ఎంపిక చేసుకునేవారు నిగూఢంగా ఉండాలనుకుంటారు. అంటే వీరు ఏ విషయాన్నీ ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరన్నమాట. లెదర్ బెల్ట్ గడియారాలను ఇష్టపడేవారు హుందాతనాన్ని కోరుకుంటారు బ్రాండెడ్ వాచ్‌లను ఇష్టపడేవారు కాన్ఫిడెంట్‌గా ఉండాలనుకుంటారు. పాతకాలం మోడల్ గడియారాలను ఇష్టపడేవారు తమ అభిప్రాయాలను మార్చుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడరు.