Jewellery Exporters
-
రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్లో 6.7 శాతం వృద్ధి!
ముంబై: భారత్ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఆగస్టులో 2021 ఇదే నెలతో పోల్చి 6.7శాతం పెరిగాయి. విలువలో రూ.26,419 కోట్లుగా (3,316 మిలియన్ డాలర్లు) నమోదయ్యాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఆగస్టులో ఒక్క కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ (సీపీడీ) ఎగుమతులు 0.84 శాతం తగ్గి రూ.14,956 (1,880 మిలియన్ డాలర్లు) కోట్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య మాత్రం స్వల్పంగా 1.59 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో ఇది రూ.78,697 కోట్లు (10,081 మిలియన్ డాలర్లు). చైనాలో కరోనా ప్రతికూల పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు గడచిన రెండు నెలలుగా కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ (సీపీడీ) ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. -
సెల్ఫీ విత్ బ్యూటీ
-
పసిడిపై దిగుమతి సుంకాన్ని తగ్గించండి
కేంద్రాన్ని కోరిన జీజేఈపీసీ న్యూఢిల్లీ: బంగారం, వెండి దిగుమతులపై విధిస్తున్న సుంకాన్ని 10 నుంచి 2 శాతానికి తగ్గించాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) కేంద్రాన్ని కోరింది. దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయాలన్న నిబంధన (80:20 ఫార్ములా)ను రద్దుచేయాలని కోరింది. జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా బుధవారం న్యూఢిల్లీలో మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం 10% దిగుమతి సుంకం విధిస్తుండడంతో బంగారం అక్రమ రవాణాయే లాభదాయకంగా మారిందని వ్యాఖ్యానించారు. దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా స్మగ్లింగ్‌ను నిరోధించవ్చని పేర్కొన్నారు. కరెంటు అకౌంటు లోటు అదుపులోకి వచ్చిన దృష్ట్యా 80:20 ఫార్ములా రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని గతేడాది ఆగస్టు నుంచి 10 శాతానికి పెంచడంతో 2013-14లో ఈ రెండు లోహాల దిగుమతులు 40% క్షీణించాయన్నారు.