These 5 Rules Going To Change From Aug 1, Check Inside - Sakshi
Sakshi News home page

Changes From 1st August: ఆగస్ట్‌ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్‌..! ఇవే..!

Published Sun, Jul 31 2022 3:19 PM | Last Updated on Sun, Jul 31 2022 4:01 PM

This Are The List Changes To Several Rules From August 1st - Sakshi

ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపేలా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఆగస్ట్‌ 1 నుంచి మారబోయే అంశాలేంటో తెలుసుకుందాం. 

బ్యాంక్ ఆఫ్ బరోడా : ఆగస్ట్‌ 1నుంచి ఆర్బీఐ సూచనల మేరకు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం 'పాజిటివ్ పే సిస్టమ్'ని అమలు చేస్తుంది. తద్వారా చెక్కు ఇచ్చి డబ్బులు తీసుకున్న ఖాతాదారుడి వివరాలు, సంబంధిత వ్యక్తికి చెక్కు ఇచ్చిన సంస్థ లేదంటే వ్యక్తుల వివరాల్ని ధృవీకరించాల్సి ఉంటుంది. 

పీఎం కిసాన్‌ కేవైసీ : రైతుల సౌలభ్యం కోసం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎంకేఎస్‌ఎన్‌వై) కోసం ఈ-కేవైసీ గడువు మే 31 నుండి జూలై 31 వరకు పొడిగించింది. రేపటి నుండి కేవైసీ అప్‌డేట్‌ చేసుకునే సౌకర్యం లేదు. 

పీఎంఎఫ్‌బీవై రిజిస్ట్రేషన్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు జులై 31తో ముగుస్తాయి. రిజిస్ట్రేషన్‌లను కోల్పోయిన వారు ఈ స్కీంలో లబ్ధి పొందలేరు. కాగా ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్‌లైన్‌లోనైనా చేసుకోనే సదుపాయం కేంద్రం కల్పించింది. 

ఎల్‌పీజీ గ్యాస్‌ రేట్లు: ప్రతి నెల మొదటి తేదీన, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) ధరలు సవరించబడతాయి. ఏప్రిల్‌ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గగా, డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరిగాయి.   

ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్: 2021-22 ఆర్థిక సంవత్సరం, 2022-23 విద్యా సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించడానికి జూలై 31 చివరి తేదీ. గడువు తేదీని ప్రభుత్వం పొడిగిస్తే తప్ప, ఐటీఆర్‌లను ఆలస్యంగా దాఖలు చేసినందుకు ఆగస్టు 1 నుంచి జరిమానా, ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement