WhatsApp Accounts Banned: మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) భారత్‌లో ఒక్క నెలలోనే ఏకంగా 74 లక్షల అకౌంట్లు బ్యాన్ చేసింది. ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఆగస్టు నెలలో 74 లక్షల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తాజాగా విడుదల చేసిన ఇండియా నెలవారీ నివేదిక పేర్కొంది.
ఆగస్టు నెలలో మొతం 74 లక్షల ఖాతాలను బ్యాన్ చేయగా వీటిలో 35 లక్షల అకౌంట్లపై యూజర్ల నుంచి ఫిర్యాదులు రాకముందే ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. సంబంధిత అకౌంట్లపై యూజర్ల నుంచి అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలతో పాటు ప్లాట్‌ఫామ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్ సొంతంగా తీసుకున్ననివారణ చర్యల వివరాలు 'యూజర్-సేఫ్టీ రిపోర్ట్'లో ఉన్నాయి.
ఆగస్టు 1 నుంచి ఆగస్ట్ 31 మధ్య, మొత్తం 74,20,748 వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేశామని, వీటిలో 3,506,905 ఖాతాలపై యూజర్ల నుంచి ఫిర్యాదుల రాకపోయినా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది.
జూన్‌లోనూ 66 లక్షలు
వాట్సాప్ గత జూన్ నెలలోనూ 66 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేసింది. 2023 జూన్ 1 నుంచి 30వ తేదీ మధ్య మొత్తం 6,611,700 వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. ఇందులో 2,434,200 అకౌంట్లను ఫిర్యాదులతో సంబంధం లేకుండా ముందస్తుగా నిషేధించింది.
Comments
Please login to add a commentAdd a comment