కరోనా కాలంలో చైనాపై కాసుల వర్షం కురిసింది. కరోనా మహమ్మారి కారణంగా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థ చితికిపోతే, కరోనా పుట్టిలైన చైనాలో మాత్రం కాసుల వర్షం కురవడం విశేషం. చైనా ఎగుమతులలో వృద్ధి రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా అత్యధిక స్థాయికి చేరుకుంది. అదే సమయంలో దిగుమతులు కూడా పెరిగినట్లు ఆ దేశం కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. కరోనా కాలంలో మాస్క్‌ల వంటి వ్యక్తిగత రక్షణ సామగ్రి, ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఎలక్ట్రానిక్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దింతో చైనా ఎగుమతులు భారీగా పెరిగాయి.
జనవరి-ఫిబ్రవరి కాలంలో ఎగుమతులు సంవత్సరానికి 60.6శాతం పెరిగితే, అలాగే విశ్లేషకుల అంచనాలకు మించి దిగుమతులు 22.2 శాతం పెరిగాయి. దీనికి సంబందించిన అధికారిక సమాచారం చైనా విడుదల చేసింది. తాజా కస్టమ్స్ గణాంకాలు గత ఏడాది ఇదే సమయంలో చైనా ఎగుమతులు 17 శాతం తగ్గిపోగా, దిగుమతులు 4 శాతం పడిపోవడం గమనార్హం. కరోనా కాలంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 54.1 శాతం, టెక్స్‌టైల్స్ ఎగుమతులు 50.2 శాతం మేర పెరిగినట్లు తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే, చైనా మొత్తం వాణిజ్య మిగులు 103.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment