న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) భారీగా కుదించింది. 2019 సంవత్సరానికి 2.6 శాతం ఉంటుందని గత ఏప్రిల్‌లో ఈ సంస్థ అంచనా వేయగా, తాజాగా దీన్ని 1.2 శాతానికి కుదించింది. ఇది భారత్‌కు రుచించని విషయమే. ఎందుకంటే ఎగుమతులను పెంచుకునేందుకు మన దేశం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం గమనార్హం. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిదానిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు 2019, 2020 సంవత్సరాలకు వాణిజ్య వృద్ధి అంచనాలను కుదించడానికి కారణమని డబ్ల్యూటీవో తెలిపింది. 2020 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య వృద్ధి 2.7 శాతం ఉంటుందని అంచనా వేయడం కాస్త ఉపశమనం కల్పించేదే. గతంలో వేసిన 3 శాతంతో పోలిస్తే కాస్త తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment