న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపై దిగుమతి ఆంక్షలు విధించాలన్న భారత్ నిర్ణయంపై అమెరికా, చైనా, కొరియా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సమావేశంలో ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయని ఓ అధికారి తెలిపారు. నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత భారత్‌కు అమెరికా చేసే ఎగుమతులతో సహా ఈ ఉత్పత్తుల వాణిజ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా పేర్కొన్నట్టు జెనీవాకు చెందిన అధికారి వెల్లడించారు.
భారత నిర్ణయం ఎగుమతిదారులు, అంతిమ వినియోగదా రులకు అనిశి్చతిని సృష్టిస్తోందని అమెరికా పేర్కొంది. అయితే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం గత వారం స్పష్టం చేసింది. దిగుమతులను కేవలం పర్యవేక్షిస్తామని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్‌వాల్ వెల్లడించారు. ల్యాప్‌టాప్స్, టాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను నవంబర్ 1 నుండి లైసెన్సింగ్ విధానంలో ఉంచుతామని 2023 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment