imports ban
-
కంప్యూటర్ల దిగుమతి ఆంక్షలపై ఆందోళన
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపై దిగుమతి ఆంక్షలు విధించాలన్న భారత్ నిర్ణయంపై అమెరికా, చైనా, కొరియా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సమావేశంలో ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయని ఓ అధికారి తెలిపారు. నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత భారత్‌కు అమెరికా చేసే ఎగుమతులతో సహా ఈ ఉత్పత్తుల వాణిజ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా పేర్కొన్నట్టు జెనీవాకు చెందిన అధికారి వెల్లడించారు. భారత నిర్ణయం ఎగుమతిదారులు, అంతిమ వినియోగదా రులకు అనిశి్చతిని సృష్టిస్తోందని అమెరికా పేర్కొంది. అయితే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం గత వారం స్పష్టం చేసింది. దిగుమతులను కేవలం పర్యవేక్షిస్తామని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ వెల్లడించారు. ల్యాప్టాప్స్, టాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను నవంబర్ 1 నుండి లైసెన్సింగ్ విధానంలో ఉంచుతామని 2023 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అసంతృప్తిలో గూగుల్, యాపిల్.. భారత్ నిర్ణయంపై ఉత్కంఠ
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై టెక్నాలజీ ఇండస్ట్రీలో కూటమిగా ఉన్న ప్రముఖ టెక్ కంపెనీలు అసంతప్తిని వ్యక్తం చేస్తున్నాయి. మ్యానిఫ్యాక్చరింగ్లో అగ్రగామిగా నిలవాలనుకుంటున్న భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని అంటున్నాయి. దేశ ఆశయాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిది టెక్నాలజీ వ్యాపార భాగస్వాముల కూటమి అమెరికా ప్రభుత్వానికి లేఖ రాశాయి. భారత్ నిబంధనల అమలుపై పునరాలోచించేలా చర్చలు జరపాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరాయి. మరి ఈ లేఖతో భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని టెక్నాలజీ పరిశ్రమ వర్గాలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు కేంద్రం ఇటీవల దిగుమతి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్, పీసీలు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులు చేసేందుకు లేదంటూ కొత్త నిబంధనలు తెచ్చింది. ఈ నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) తెలిపింది. ఈ చర్య వ్యాపారాన్ని గణనీయంగా దెబ్బతీస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా స్లపయ్ చైన్ విభాగంలో ఎదగాలని చూస్తున్న భారత్ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుందంటూ బ్లూమ్ బెర్గ్ నివేదించింది. అభ్యంతాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్, సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్‌తో సహా యూఎస్ వ్యాపార సంఘాలు కొత్త లైసెన్స్ నిబంధనలపై అనేక అభ్యంతరాలను లేవనెత్తాయి. భారత్‌లో యూఎస్ తయారు చేసిన కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువల రవాణాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీని వల్ల దేశంలో అమెరికా సంస్థలు వ్యాపారాలు చేసుకోవడం మరింత కష్టతరం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
నవంబర్ నుంచి కంప్యూటర్లపై ఆంక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీల దిగుమతులపై విధించిన ఆంక్షల అమలును మూడు నెలలు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దిగుమతులపై విధించిన ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) వెల్లడించింది. ఎల్రక్టానిక్స్ కంపెనీలు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీలను భారత్‌కు దిగుమతి చేసుకోవాలంటే నవంబర్ 1 నుంచి ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరి. కాగా, లైసెన్స్ కలిగిన కంపెనీలు మాత్రమే ఈ పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, ఉత్తర్వులు వెంటనే అమలులోకి తీసుకువస్తున్నట్టు ఆగస్ట్ 3న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కంప్యూటర్లలో అంతర్గత భద్రత లొసుగులతో కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తుల డేటాకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్న కారణంతో తప్పనిసరి లైసెన్స్ విధానానికి కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. -
దురాక్రమణదారు చైనా నుంచి దిగుమతులా?
న్యూఢిల్లీ: భారత్‌పై దురాక్రమణలకు పాల్పడుతున్న చైనా నుంచి దిగుమతులకు కేంద్రం ఎందుకు అనుమతిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల గౌరవాన్ని ప్రభుత్వం కాపాడాలన్నారు. ధైర్యంగా చైనా దిగుమతులను నిలిపివేసి మత సత్తా చాటాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చౌకగా దొరికేవే అయినా చైనా వస్తువులను మానేసి, ఖరీదైనా దేశీయంగా తయారైన వాటినే కొనాలని కోరారు. ఎద్దు నుంచి పాలు పితికాం గుజరాత్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకోవడంపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ఆవు నుంచి పాలు ఎవరైనా పితుకుతారు. కానీ, గుజరాత్లో మేం ఎద్దు నుంచి పాలు పితికాం. అతికష్టమ్మీద 5 సీట్లు గెలుచుకున్నాం’ అని అన్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. డ్రోన్ల దిగుమతిపై నిషేధం.. కారణం ఇదే
పెళ్లిళ్లు ఫంక్షన్లలో వీడియో షూటింగ్‌లతో ఊపందుకున్న డ్రోన్ల వినియోగం ఈ రోజు అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, మెడికల్, డిఫెన్స్ ఇలా అనేక సెక్టార్లకు విస్తరిస్తోంది. డ్రోన్ల వినియోగం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడంతో వీటిపై నియంత్రణ కట్టుదిట్టం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఏవియేషన్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిఫెన్స్ వినియోగాలకు మినహాయించి మిగిలిన రంగాలకు సంబంధించి డ్రోన్ల దిగుమతిపై నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టఱ జనరనల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, కేంద్ర వాణిజ్య శాఖకు ఆదేశాలు అందాయి. దీని ప్రకారం ఇకపై విదేశాల్లో పూర్తిగా తయారైన డ్రోన్లు (కంప్లీట్లీ బిల్డప్), కంప్లీట్లీ నాకెడ్ డౌన్ (సీకేడీ), సెమీ నాకెడ్ డౌన్ (ఎస్కేడీ) డ్రోన్లను దిగుమతిపై ఆంక్షలు వర్తిస్తాయి. అంటే ఇకపై అగ్రికల్చర్, మెడిసిన్, వీడియో షూటింగ్ వంటి అవసరాల కోసం డ్రోన్లను దిగుమతి చేసుకునే అవకాశం లేదు. అయితే వీరు దేశీయంగా తయారైన డ్రోన్లను ఉపయోగించుకోవచ్చు. రక్షణ అవసరాలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన విద్యాసంస్థలకు కొత్తగా అమల్లోకి వచ్చిన డ్రోన్ దిగుమతి ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. దీని ప్రకారం వీరు విదేశాల నుంచి డ్రోన్లు దిగుమతి చేసుకోవచ్చు. అయితే అంతకు ముందు కేంద్రం పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుంది. ఇటీవల పంజాబ్‌లో పాకిస్తాన్ సరిహద్దులో ఓ డ్రోన్ అనుమానస్పదంగా రక్షణ అధికారులకు లభించింది. ఆ మరుసటి రోజే డ్రోన్ల దిగుమతిపై ఆంక్షలు వచ్చాయి. అయితే ఈ ఆంక్షల వల్ల దేశీ డ్రోన్ల తయారీ పరిశ్రమకు మేలు జరుగుతుందని ప్రభుత్వం అంటోంది. -
రక్షణ దిగుమతుల నిషేధం : చారిత్రక ప్రకటన ఇదేనా!
సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం విరుచుకుపడ్డారు. రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం గురించి రాజ్‌నాథ్ ఆడంబర వ్యాఖ్యలు చేసి ఆపై నీరుగార్చే ప్రకటన చేశారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఉదయం మెరుపులు ఉంటాయని హామీ ఇచ్చిన రక్షణ మంత్రి ఆపై నిట్టూర్పుతో ముగించారని వరుస ట్వీట్లలో చిదంబరం పేర్కొన్నారు. రక్షణ పరికరాలను కేవలం రక్షణ మంత్రిత్వ శాఖే దిగుమతి చేసుకుంటోందని దిగుమతి ఆంక్షలు ఏమైనా కేవలం ఆ ఒక్క శాఖకే వాటి ప్రభావం పరిమితమని చిదంబరం వ్యాఖ్యానించారు. దిగుమతి ఆంక్షలనేది పెద్ద మాటని అన్నారు. చదవండి : ‘అలా చేస్తే.. చైనా ఆక్రమణలు తొలగిస్తారా? తాము ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న పరికరాలను ఇక్కడే తయారుచేసేందుకు ప్రయత్నించి రెండు నుంచి నాలుగేళ్లలో దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని రక్షణ మంత్రి చెప్పుకొచ్చారని అన్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం వెల్లడించిన చారిత్రక ప్రకటనలో పసఏమీ లేదని, ఇది కేవలం మంత్రి తన కార్యదర్శులకు జారీ చేసే శాఖాపరమైన ఉత్తర్వు మాత్రమేనని చిదంబరం ఎద్దేవా చేశారు. కాగా, 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ట్విటర్ ద్వారా తెలిపారు. 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేందుకే రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఆయుధాలతో పాటు ఇతర రక్షణ వస్తువులు ఇక మీదట దేశీయంగానే తయారవనున్నాయి. ఇది భారత రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజనాథ్ తెలిపారు. -
ఉల్లి లొల్లి : కేంద్రం కీలక చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ : చుక్కలు తాకుతున్న ధరలతో కంటనీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో ఉల్లి సరఫరాలను పెంచేందుకు టర్కీ నుంచి 11,000 టన్నుల ఉల్లి దిగుమతులకు ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ ఆర్డర్ ఇచ్చింది. ఈ సంస్థ ఇప్పటికే ఈజిప్ట్ నుంచి 6090 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంటుండగా తాజా ఆర్డర్‌తో పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఉల్లి ధరలను సమీక్షించేందుకు హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి, వినియోగదారుల వ్యవహరాల మంత్రి, వ్యవసాయ, రవాణా శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో రూ 75 నుంచి రూ 120 వరకూ ఉల్లి ధరలు పలకడంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి దిగుమతులకు ప్రాధాన్యత ఇస్తోంది. ఉల్లి ఎగమతులపై నిషేధం విధించిన కేంద్ర కేబినెట్ 1.2 లక్షల టన్నుల ఉల్లి దిగుమతులకు ఆమోదం తెలిపింది. ఇక దిగుమతి చేసుకున్న ఉల్లిని ఆయా రాష్ట్రాలకు కిలో రూ 50 నుంచి 60లకు అందచేస్తారు. -
అమెరికా, ఈయూలకు పుతిన్ చెప్పుదెబ్బ సమాధానం
''తమలపాకుతో మీరొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా'' అంటూ తమ మీద ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ దీటుగా సమాధానం ఇచ్చారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ నుంచి తమ దేశంలోకి మొత్తం అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆహార దిగుమతులను నిషేధించారు. అటు అమెరికాకు, ఇటు యూరోపియన్ దేశాలకు కూడా రష్యాయే అతిపెద్ద ఆహార పదార్థాల కొనుగోలుదారు. దాంతో ఇప్పుడు ఆ దేశాలన్నింటికి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయ్యింది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రచ్ఛన్నయుద్ధం నాటి పరిస్థితులు దాదాపుగా మళ్లీ ఏర్పడేలా ఉన్నాయి. తమ దేశం మీద ఆంక్షలు విధించిన దేశాల నుంచి ఆహార, వ్యవసాయోత్పత్తుల దిగుమతులను నిషేధించే డిక్రీ మీద పుతిన్ బుధవారం నాడు సంతకం చేశారు. ఏడాది పాటు ఈ నిషేధం కొనసాగుతుంది. యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే కూరగాయల్లో 21.5 శాతం, పండ్లలో 28 శాతం రష్యాయే దిగుమతి చేసుకుంటుంది. ఇది అతిపెద్ద మార్కెట్ కావడంతో అదంతా ఆగిపోతే ఇప్పుడు ఆ దేశాల ఆర్థిక పరిస్థితే అతలాకుతలం అవుతుంది. అలాగే, అమెరికా నుంచి ఎగుమతి అయ్యే చికెన్‌లో 8శాతం ఒక్క రష్యాకే వెళ్తుంది. దాంతో అమెరికా ఆదాయానికి కూడా బాగానే గండిపడుతుంది.