ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై టెక్నాలజీ ఇండస్ట్రీలో కూటమిగా ఉన్న ప్రముఖ టెక్ కంపెనీలు అసంతప్తిని వ్యక్తం చేస్తున్నాయి. మ్యానిఫ్యాక్చరింగ్‌లో అగ్రగామిగా నిలవాలనుకుంటున్న భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని అంటున్నాయి. దేశ ఆశయాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.
ఇందులో భాగంగా ఎనిమిది టెక్నాలజీ వ్యాపార భాగస్వాముల కూటమి అమెరికా ప్రభుత్వానికి లేఖ రాశాయి. భారత్ నిబంధనల అమలుపై పునరాలోచించేలా చర్చలు జరపాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరాయి. మరి ఈ లేఖతో భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని టెక్నాలజీ పరిశ్రమ వర్గాలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి.
నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు
కేంద్రం ఇటీవల దిగుమతి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్, పీసీలు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులు చేసేందుకు లేదంటూ కొత్త నిబంధనలు తెచ్చింది. ఈ నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) తెలిపింది. ఈ చర్య వ్యాపారాన్ని గణనీయంగా దెబ్బతీస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా స్లపయ్ చైన్ విభాగంలో ఎదగాలని చూస్తున్న భారత్ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుందంటూ బ్లూమ్ బెర్గ్ నివేదించింది.
అభ్యంతాలు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్, సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్‌తో సహా యూఎస్ వ్యాపార సంఘాలు కొత్త లైసెన్స్ నిబంధనలపై అనేక అభ్యంతరాలను లేవనెత్తాయి. భారత్‌లో యూఎస్ తయారు చేసిన కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువల రవాణాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీని వల్ల దేశంలో అమెరికా సంస్థలు వ్యాపారాలు చేసుకోవడం మరింత కష్టతరం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment