computers
-
‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నేషనల్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనలను సులభతరం చేసేందుకు రూ.130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే వాతావరణ పరిశోధనల కోసం రూ.850 కోట్లతో రూపొందించిన హై-పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను సైతం ప్రధాని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక అభివృద్దిలో భారత్ కొత్తపుంతలు తొక్కుతుందని తెలిపారు. ఈ రోజును శాస్త్ర, సాంకేతిక రంగంలో చాలా గొప్ప విజయాలు సాధించిన రోజుగా అభివర్ణించారు. సాంకేతికత, కంప్యూటింగ్ సామర్థ్యంపై ఆధారపడని రంగం ఏదీ లేదని ప్రధాని మోదీ అన్నారు. ఈ విప్లవంలో మన వాటా బిట్లు, బైట్లలో కాకుండా టెరాబైట్లు, పెటాబైట్లలో ఉండాలని తెలిపారు. మనం సరైన వేగంతో సరైన దిశలో పయనిస్తున్నామని ఈ ఘనత నిరూపిస్తోందని పేర్కొన్నారు.With Param Rudra Supercomputers and HPC system, India takes significant step towards self-reliance in computing and driving innovation in science and tech. https://t.co/ZUlM5EA3yw— Narendra Modi (@narendramodi) September 26, 2024 ‘2015లో జాతీయ సూపర్కంప్యూటింగ్ మిషన్‌ను ప్రారంభించాం. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ ముందంజలో ఉంది. ఇది ఐటీ, తయారీ, ఎమ్ఎస్ఎమ్ఈలు, స్టార్టప్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.టెక్నాలజీలో పరిశోధనలు సామాన్యులకు ఉపయోగపడేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశం పెద్ద విజన్ కలిగి ఉంటేనే ఉన్నత విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగలదు. పేదలకు సాధికారత కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలి’ అని పేర్కొన్నారు. -
BEALERT: మీ డేటా జరభద్రం!
సాక్షి, హైదరాబాద్: హ్యాకర్‌గా మారిన యూపీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థి జతిన్‌కుమార్ ఏకంగా పోలీసు వెబ్సైట్లు హ్యాక్ చేయడం ద్వారా ఆ విభాగానికే సవాల్ విసిరి ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఇలా ఇతనొక్కడే కాదు... ఆన్లైన్లో చాలామంది కేటుగాళ్లు అదను కోసం వేచి చూస్తున్నారు. కంప్యూటర్లకు తోడుగా ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత సైబర్ అటాక్స్ గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇలాంటి కొన్నింటిని నగర సైబర్‌క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు.జియో లొకేషన్‌ను ట్యాగ్ చేయొద్దు సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్, పోస్టింగ్స్ మామూలైపోయాయి. లైక్‌ల కోసం వ్యక్తిగత విషయాలను నెట్లో పడేస్తున్నారు. ఇది అనేక సందర్భాల్లో దుర్వినియోగం అవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాల్లో ఎక్కువగా పోస్ట్ చేసినప్పుడు జియో లొకేషన్‌ను ట్యాగ్ చేయకుండా ఉండాలి. వివిధ సర్వేల పేరుతో ఆన్లైన్లో వచ్చే ఫామ్స్ అనాలోచితంగా నింపొద్దు. ప్రధానంగా ఫోన్ నెంబర్లు, పూర్తి పేర్లు రాయకూడదు.అఆ ‘పాస్వర్డ్లు’ వద్దే వద్దు ఇటీవల అంతర్జాతీయంగా జరిగిన అనేక సర్వేలు పాస్వర్డ్స్ విషయంలో వినియోగదారుల వీక్నెస్ బయటపెట్టింది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ‘1234తో తమ పేరు/ఇంటి పేరు’, ‘పాస్వర్డ్స్ అనే పదం’తదితరాలు పెట్టుకుంటున్నారని, పిన్ల విషయంలో ‘1234’, ‘1111’, ‘0000’ వంటివే ఎక్కువగా వాడుతున్నారని గుర్తించింది. దీనికి భిన్నంగా ఊహించడం కష్టంగా ఉండే, డ్యూయల్ అథెంటికేషన్ తదితరాలను ఎంపిక చేసుకోవాలి. పాస్‌వర్డ్‌లో కచ్చితంగా క్యాపిటల్, సంఖ్య, గుర్తు (హ్యాష్‌ట్యాగ్, స్టార్, ఎట్ వంటివి) ఉండేలా చూసుకోవాలి.‘ఎక్స్టెన్షన్’లను తొలగించండి కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల్లో మీరు ఉపయోగించిన... తరచూ వినియోగించే యాప్‌లు, బ్రౌజర్లకు ఎక్స్టెన్షన్లను అనేక మంది అలానే ఉంచుకుంటారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం అవుతుంది. ఈ నేపథ్యంలో కచి్చతంగా ప్రతి ఒక్కరూ ఆయా ఎక్స్‌టెన్షన్స్‌ను తొలగించాలి. అ«దీకృత మినహా ప్రతి యాప్‌ను అనుమానించాల్సిందే. అనేక యాప్స్ వినియోగదారు డేటాను సేకరించి, విక్రయించడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అధికారిక యాప్ స్టోర్స్ మాత్రమే వినియోగించాలి.‘చరిత్ర’ను తుడిచేయాల్సిందే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న చిన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం నుంచి వ్యక్తిగత విషయాల కోసమూ వివిధ సెర్చ్ ఇంజన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే 95% మందికి సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలన్న విషయం తెలియట్లేదు. ఇలా చేయకపోతే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత డేటా ఇతరుల చేతికి చేరుతుంది. కొన్ని సెర్చ్ ఇంజన్లలో ఈ డిలీట్ ఆప్షన్ ఉండదు. అందుకే కచి్చతంగా సురక్షితమైన సెర్చ్ ఇంజన్, వెబ్సైట్లను మాత్రమే వినియోగించాలి.అదీకృత అప్డేట్స్ చేసుకోవాల్సిందే ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు వాడే యాప్స్ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. వీటిలో బగ్ లేదా లోపాలను గుర్తించడానికి తయారీదారులు నిత్యం పరిశోధన, అభివృద్ధి చేస్తూనే ఉంటారు. ఇలాంటివి గుర్తిస్తే ‘ప్యాచ్’ చేయడానికి సాఫ్ట్వేర్స్ అప్డేట్స్ విడుదల చేస్తుంటారు. ఇలా అధీకృత సంస్థ నుంచి వచ్చే అప్డేట్స్ను కచ్చితంగా వినియోగించుకోవాలి. అలా చేయకపోతే డేటాను యాక్సెస్ చేయడానికి సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచి్చనట్లే అవుతుంది.లాగిన్ వివరాలు వేరుగా ఉండాలిథర్డ్ పార్టీ యాప్‌ల వినియోగం వీలున్నంత వరకు తగ్గించాలి. అంటే... వేర్వేరు యాప్‌లను లాగిన్ చేయడానికి ఒకే ఖాతాను ఉపయోగించకూడదు. ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ ఖాతాలను లాగిన్ చేసేందుకు చాలా మంది ఫేస్బుక్ ఖాతాను వినియోగిస్తారు. అలాగే అనేక అంశాల్లో గూగుల్ వివరాలు పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఒక్క పాస్వర్డ్ సంగ్రహించే హ్యాకర్లు మిగిలిన అన్నింటినీ హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీటి లాగిన్స్ అన్నీ వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి. ‘పబ్లిక్’ని వాడుకోవడం ఇబ్బందికరమేఆన్లైన్లో బ్రౌజ్ చేసేప్పుడు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లను (వీపీఎన్) వినియోగించడం మంచిది. అత్యవసర సమయాల్లో పబ్లిక్ వైఫై వంటివి వినియోగించాల్సి వస్తే జాగ్రత్తగా వాడాలి. వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరకుండా చూసుకోవాల్సిందే. ఇలాంటి సురక్షితం కాని నెట్వర్క్స్ వాడుతున్నప్పుడు బ్యాంకు లావాదేవీలు వంటి ఆర్థిక కార్యకలాపాలు చేయొద్దు. అలాగే ఓటీపీలు, పాస్వర్డ్స్, పిన్ నంబర్లు తదితరాలు ఎంటర్ చేయొద్దు. -
నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
మే 20: అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నాట్స్ సహకారంతో అవని ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని బాపు నూతి ప్రారంభించారు. విద్యార్ధులు మల్టీ స్కిల్స్ నేర్చుకుంటే వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీ నైపుణ్యం ఎంతో కీలకమని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. బేసిక్స్, లాంగ్వేజస్ పై పట్టు సాధించి సరికొత్త టెక్నాలజీ కోర్సులు చేస్తే యువత ఉపాధి అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదని బాపు నూతి భరోసా ఇచ్చారు. గతంలో నాట్స్ సహకారంతో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందించారు.ఈ కార్యక్రమంలో బాపు నూతికి అలిశెట్టి ప్రభాకర్ కవిత పుస్తకాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ డల్లాస్ కో ఆర్డినేటర్ రవి తాండ్ర, రామానంద తీర్థ గ్రామీణ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషోర్ రెడ్డి , స్పర్శ ఫౌండేషన్ సిఇవో పంచముఖి, సీనియర్ జర్నలిస్ట్ కొండూరు వీరయ్య, తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, ఏఐటీయూసీ నాయకులు బాలకాశి తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉపయోగపడే ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన నాట్స్ నాయకులను నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.(చదవండి: మేడం టుస్సాడ్.. మన శిల్పసంపద కంటే ఎక్కువా?) -
కంప్యూటర్ మాయం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలికి సంబంధించి కీలకమైన డేటా ఉన్నట్టు భావిస్తున్న కంప్యూటర్ కనిపించకుండాపోయింది. 2014 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు యథాతథంగా ఉంచాలని సీఎస్ ఆదేశించిన రోజే ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని మండలి వైస్‌చైర్మన్(వీసీ) అహ్మద్ తెలిపారు. ఏం జరిగిందో పరిశీలిస్తున్నామని మండలి కార్యదర్శి శ్రీనివాస్ చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. వైస్ చైర్మన్ వెంకటరమణ బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జ్ వీసీగా కూడా ఉన్నారు. ఈ కారణంగా ఆయన మండలి కార్యాలయానికి వచ్చి పోతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. అందులో ఏముందో...? కీలకమైన ఫైళ్లు స్టోర్ చేసేందుకు అత్యాధునిక సాంకేతిక సామర్థ్యమున్న కంప్యూటర్ను 2017లో కొనుగోలు చేశారు. అయితే, గత ఏడాది నుంచి అది పనిచేయడం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే దీనిని స్క్రాప్‌గా నమోదు చేసి, స్టోర్ రూంలో ఉంచామంటున్నారు. దీని స్థానంలో వేరే కంప్యూటర్ కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే ఫైళ్లు భద్రపరచాలన్న ఆదేశాలొచ్చిన రోజు కంప్యూటర్ కనిపించడం లేదని అధికారులు వీసీ అహ్మద్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన హడావిడిగా సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలు అందులో ఏముంది? పనిచేయకపోయినా పాత డేటా హార్డ్ డిస్్కలో ఉండే అవకాశం లేదా? హార్డ్‌డిస్క్ ఎక్కడుంది? అందులో డేటాను ఏం చేశారు? పనికి రాని కంప్యూటర్ తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సిబ్బందిని కోరారు. అయితే, ఈ సమావేశానికి మండలి కార్యదర్శి హాజరుకాలేదని చెబుతున్నారు. దోస్త్ డేటా ఉన్నట్టేనా? ఆన్లైన్ ద్వారానే ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలను భర్తీ చేస్తుంది. ఈ డేటా అంతా కంప్యూటర్లో పొందుపరుస్తారు. దీంతోపాటు మండలి ఆదేశాలు, డిగ్రీ కాలేజీల అనుమతులు ఇందులో ఉంటాయి. ప్రొఫెసర్ లింబాద్రి వీసీ–1గా ఉన్నప్పుడు, వెంకటరమణ వీసీ–2గా ఉన్నారు. లింబాద్రి మండలి చైర్మన్ అయిన తర్వాత అహ్మద్‌ను మండలి వైస్‌చైర్మన్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో వెంకటరమణ వీసీ–2 నుంచి వీసీ–1 మారుస్తూ అప్పటి విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఇది మండలిలో తీవ్ర వివాదానికి దారి తీసింది. వీసీ–1, వీసీ–2 మధ్య రగడ తారస్థాయికి చేరింది. ఈ సమయంలోనే దోస్త్ వ్యవహారాలపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారడం, వీసీ–1గా ఉన్న వెంకటరమణను తీసేయడం, ఇదే సమయంలో దోస్త్‌కు సంబంధించిన కంప్యూటర్ మాయం కావడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ దోస్త్ మొదలైనప్పట్నుంచీ డేటా ఉందా? అనే సందేహం మండలివర్గాల నుంచే వినిపిస్తోంది. -
110 సంస్థలకు అనుమతులు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు 110 సంస్థలకు కేంద్రం అనుమతినిచి్చంది. యాపిల్, డెల్, లెనొవొ, హెచ్‌పీ ఇండియా సేల్స్, అసూస్ ఇండియా, ఐబీఎం ఇండియా, షావోమీ టెక్నాలజీ ఇండియా, శాంసంగ్ ఇండియా ఎల్రక్టానిక్స్ మొదలైనవి వీటిలో ఉన్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. అనుమతుల కోసం మొత్తం 111 దరఖాస్తులు వచి్చనట్లు వివరించారు. అయితే, ’నిరాకరణ జాబితా’లో ఉన్న ఒక హైదరాబాద్ సంస్థకు మాత్రం అనుమతి లభించలేదని పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్దిష్ట ఐటీ హార్డ్‌వేర్ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా అనుమతులకు లోబడి దిగుమతి చేసుకునే వెసులుబాటు కలి్పంచింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆథరైజేషన్ విధానం 2024 సెపె్టంబర్ వరకు అమల్లో ఉంటుంది. అక్టోబర్ 31న పరిశ్రమ వర్గాలతో సమావేశమైన డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) అనుమతుల ప్రక్రియ గురించి వివరించారు. ’నిరాకరణ జాబితా’లో ఉన్న సంస్థలకు అనుమతులు లభించవు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ ఎగుమతి నిబంధనలను పాటించని సంస్థలు, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) కేసులు ఎదుర్కొంటున్న కంపెనీలు ఈ జాబితాలో ఉంటాయి. ఐటీ హార్డ్‌వేర్ సంబంధ దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 8.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే ల్యాప్‌టాప్‌లు సహా పర్సనల్ కంప్యూటర్లు దిగుమతయ్యాయి. అత్యధికంగా చైనా (5.11 బిలియన్ డాలర్లు), సింగపూర్ (1.4 బిలియన్ డాలర్లు), హాంకాంగ్ (807 మిలియన్ డాలర్లు) నుంచి ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులు దిగుమతవుతున్నాయి. -
కంప్యూటర్ల దిగుమతి ఆంక్షలపై ఆందోళన
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపై దిగుమతి ఆంక్షలు విధించాలన్న భారత్ నిర్ణయంపై అమెరికా, చైనా, కొరియా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సమావేశంలో ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయని ఓ అధికారి తెలిపారు. నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత భారత్‌కు అమెరికా చేసే ఎగుమతులతో సహా ఈ ఉత్పత్తుల వాణిజ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా పేర్కొన్నట్టు జెనీవాకు చెందిన అధికారి వెల్లడించారు. భారత నిర్ణయం ఎగుమతిదారులు, అంతిమ వినియోగదా రులకు అనిశి్చతిని సృష్టిస్తోందని అమెరికా పేర్కొంది. అయితే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం గత వారం స్పష్టం చేసింది. దిగుమతులను కేవలం పర్యవేక్షిస్తామని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ వెల్లడించారు. ల్యాప్టాప్స్, టాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను నవంబర్ 1 నుండి లైసెన్సింగ్ విధానంలో ఉంచుతామని 2023 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ల్యాప్‌టాప్, కంప్యూటర్ దిగుమతులపై కేంద్రం మరో ముందడుగు!
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్, కంప్యూటర్ దిగుమతుల విషయంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక అడుగు ముందుకేసింది. దిగుమతిదారులకు లైసెన్సులను సజావుగా అందించడానికి కావాల్సిన ప్రమాణాల రూపకల్పనలో డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నిమగ్నమైంది. ల్యాప్‌టాప్, కంప్యూటర్లపై ప్రభుత్వం దిగుమతి ఆంక్షలు విధించడంతో దిగుమతిదారులు నవంబర్ 1 నుండి డీజీఎఫ్టీ నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. తయారీ కంపెనీ గత పనితీరును ప్రామాణికంగా తీసుకుని గతంలో లైసెన్సు జారీ చేసేవారు. దిగుమతుల ఆంక్షల కారణంగా భారత్‌కు ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై నిశితంగా నిఘా ఉంచేందుకు దోహదపడతాయి. భవిష్యత్ వృద్ధి ఆశయాల కోసం ఎలక్ట్రానిక్స్ తయారీని కీలక ప్రాధాన్యతగా భారత్ గుర్తించింది. చైనా వెలుపల తమ కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్న ప్రపంచ దిగ్గజ కంపెనీల నుండి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తున్న తరుణంలో ఈ నిర్ణ యం దేశీ య తయారీని ప్రోత్సహిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, పీసీలు, సర్వర్స్ తయారీ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఫాక్స్‌కాన్ గ్రూప్, హెచ్‌పీ, డెల్, లెనోవోతో సహా 38 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతుల విలువ 2022–23లో 8.8 బిలియన్ డాలర్లు. ఇందులో పీసీలు/ల్యాప్‌టాప్‌ల వాటా 5.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పీసీలు/ల్యాప్‌టాప్‌ల ఎగుమతులు 163 బిలియన్ డాలర్లు. ఇందులో చైనా ఏకంగా 81 శాతం వా టా దక్కించుకుంది. లెనోవో, యాపిల్, డెల్, హెచ్ పీ అత్యధికంగా చైనాలో తయారు చేస్తున్నాయి. -
మళ్ళీ లైసెన్స్ రాజ్యమా?
ఎప్పుడో వదిలేసిన పాత విధానాలను ఇప్పుడు మళ్ళీ తెస్తే... కొత్త ఫలితాలు వస్తాయా? కేంద్ర ప్రభుత్వం మాత్రం వస్తాయనే అనుకుంటున్నట్టు ఉంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై ప్రభుత్వం గత వారం హఠాత్తుగా షరతులు పెట్టడాన్ని చూస్తే, మళ్ళీ 1970ల నాటి ప్రభుత్వ విధానాలు గుర్తొస్తున్నాయి. జాతీయ భద్రత కారణంగా చైనా, కొరియాల నుంచి ఈ దిగుమతులను నియంత్రించాలని ప్రభుత్వ భావన. లైసెన్సు తీసుకుంటేనే అనుమతిస్తా మని సర్కార్ చెబుతోంది. అయితే, వెల్లువెత్తిన విమర్శలు, వ్యక్తమైన ఆందోళనలతో ప్రస్తుతానికి మూడు నెలల పాటు నవంబర్ 1 దాకా ఈ షరతులను వాయిదా వేసింది. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికే ఈ నిబంధనలని పాలకుల మాట. కానీ, షరతులతో అది సాధ్యమవుతుందా? చైనాను లక్ష్యంగా చేసు కొని పెడుతున్న ఈ నిషేధం తీరా భారతీయులకే నష్టం కలిగిస్తుందన్న విశ్లేషణలూ ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు ఏటా 6.25 శాతం వంతున పెరుగుతున్నాయి. 2022 – 23లో 533 కోట్ల డాలర్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను దిగుమతి చేసుకున్నాం. అందులో 75 శాతం చైనావే. ఇప్పుడు పౌరుల డిజిటల్ భద్రత రీత్యా ఈ దిగుమతులపై షరతులు పెడుతున్నామంటున్నారు. ఆ సాకు చూపడానికి కారణం ఒకటే! జాతీయ భద్రత కారణమైతేనే బహుళ పక్ష వాణిజ్య ఒప్పందాల్లో దిగుమతులపై షరతులు పెట్టే వీలుంటుంది. దేశీయ ఉత్పత్తులను కాపు కాసుకోవడం కారణమంటే రచ్చ తప్పదు. అయితే, ఎంత జాతీయ భద్రతను సాకుగా చూపినప్పటికీ, ఈ దిగుమతుల షరతులకు అవతలి వైపు నుంచి ట్యారిఫ్ల ప్రతిచర్యలు, దీర్ఘకాలిక వివాదాలు ఎలాగూ తప్పవు. పరిశ్రమతో ఎలాంటి సంప్రతింపులూ జరపకుండానే హడావిడి నిర్ణయం తీసుకొని, సుస్థిర వ్యవస్థను హఠాత్తుగా మార్చడంతో వచ్చిపడే ఇబ్బందులు సరేసరి. ప్రస్తుత నిబంధనల ప్రకారం మన దేశంలోని కంపెనీలు ల్యాప్‌టాప్‌లను యథేచ్ఛగా దిగుమతి చేసుకోవచ్చు. రానున్న కొత్త రూల్స్‌తో ప్రత్యేక లైసెన్స్ ఉంటే కానీ, దిగుమతి సాధ్యం కాదు. 2020లో కలర్ టీవీల దిగుమతి పైనా భారత్ ఇలాంటి షరతులే పెట్టడం గమనార్హం. అలాగే, మొబైల్‌ఫోన్లపైనా అధిక ట్యారిఫ్‌లు విధించింది. పలు స్మార్ట్‌ఫోన్ సంస్థలు భారత్‌లోనే విడిభాగా లను కూర్చి, తయారు చేస్తున్నాయి. కానీ, కంప్యూటర్ల సంగతలా కాదు. చైనా సంస్థ లెనోవా మినహా యాపిల్, డెల్, సామ్సంగ్, షియామీ తదితర ఉత్పత్తులన్నీ దిగుమతులే! కంప్యూటర్ల దిగుమతికి లైసెన్స్ దెబ్బతో ఈ సంస్థల గంపగుత్త ఆర్డర్లపై దెబ్బ పడుతుంది. కలర్ టీవీల్లా కాక కంప్యూటర్లు విద్య, పరిశోధన, పౌరసేవల్లో కీలకం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుకై ఈ మధ్యే రిలయన్స్ సంస్థ రూ. 20 వేల లోపలే లభించే జియోబుక్‌ను తెచ్చింది. అదీ చైనా తయారీయే! రిలయన్స్ ఇప్పుడిక పాలకుల నుంచి ప్రత్యేక లైసెన్స్ తెచ్చుకోకుంటే, దిగుమతి చేసుకోలేదు. షరతుల వార్తలతో ఈ వారం కంప్యూటర్ల అమ్మకాలు 25 శాతం పెరిగాయి. చివరకు కొరత ఏర్పడి, ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఇప్పటికే కోవిడ్ వల్ల సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు, సెమీ కండక్టర్ సంక్షోభం సతమతం చేస్తున్నాయి. షియామీ, రియల్‌మి, వన్‌ప్లస్ లాంటి కొత్త ఉత్పత్తులతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారతీయ ట్యాబ్ మార్కెట్ ఈ షరతులతో మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా, ఐటీ సేవల కేంద్రంగా పేరున్న దేశం కంప్యూటర్ల దిగుమతులపై షరతుల పాట పాడడం ఎలా చూసినా అనూహ్యమే! ప్రజలపై ప్రభావం చూపుతూ, దీర్ఘకాలిక ఆర్థిక పర్యవసానాలున్న నిర్ణయాలను తీసుకొనే ముందు పాలకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వంలోని ఆర్థిక శాస్త్రవేత్తలతో సంప్రతింపులు జరిపివుంటే పాలకులు ఈ హఠాన్నిర్ణయం తీసుకొనేవారు కాదు. దేశీయ ఉత్పత్తి పెంచడం, దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం, విశ్వసనీయ హార్డ్‌వేర్‌ను అందుబాటులో ఉంచడం మంచి లక్ష్యాలే. కానీ, వాటి కోసం పాత లైసెన్స్ రాజ్యానికి తిరోగమించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఫలానా చైనా ఉత్పత్తుల వల్ల భద్రతలో ముప్పుందని భావిస్తే, ఆ దేశ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేస్తే సరి. అలాకాక మొత్తం వ్యవస్థను లైసెన్సుల అగచాట్లలోకి నెట్టాల్సిన పని లేదు. అనేక కష్టాలు భరించాకే లైసెన్స్ రాజ్యబంధనాల్ని వదిలించుకున్నామని విస్మరించలేం. సులభంగా లైసెన్సులు ఇస్తామంటున్నా, ఆశ్రితపక్షపాతం సహా సమస్యలు మామూలే! ఇవాళ మనది సేవల రంగంతో పురోగమిస్తున్న ఆర్థికవ్యవస్థ. అందులో కీలకమైన కంప్యూటర్ హార్డ్వేర్ల కొరతతో దీర్ఘకాలిక నష్టమే. దేశీయోత్పత్తిని పెంచేందుకు ఉత్పత్తితో ముడిపడ్డ ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని 2020లో ప్రారంభించిన కేంద్రం వివిధ రంగాలకు దాన్ని విస్తరించినా, ఐటీ హార్డ్‌వేర్ రంగంలో ఆశించినంత భాగస్వామ్యం రావట్లేదు. కేటాయింపులు రెట్టింపు చేసినా అదే పరిస్థితి. అలాగని, దిగుమతులపై షరతులు, లైసెన్స్ రాజ్యం పెడితే దేశీయ ఉత్పత్తి పెరుగుతుందనుకోవడం అవివేకం. ఆ సంగతి గత చరిత్ర నిరూపించింది. అపార ఇంజనీరింగ్ ప్రతిభ, తక్కువ వేతనానికే మెరుగైన సేవలు ఇస్తున్నా మనం అంతర్జాతీయ ఉత్పత్తి సేవల భాగస్వామ్యంలో ఎందుకని, ఎక్కడ వెనుకబడిపోయామో మథనం సాగాలి. ఆ విధాన లోపాన్ని సరిచేసుకోవాలి. ప్రతి వెయ్యిలో 15 మందికే కంప్యూటర్ చేరిన దేశంలో షరతులతో ఆ లోటు పెరుగుతుందా, తరుగుతుందా? ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యపై సమగ్ర దృష్టి పెట్టాలి. సంబంధింత పక్షాలతో క్షుణ్ణంగా చర్చించాలి. అనివార్యమైతే తప్ప అనవసర షరతులతో నష్టమని గుర్తించాలి. లేదంటే భారత పురోగతి మరోసారి కుంటుపడుతుంది. -
నవంబర్ నుంచి కంప్యూటర్లపై ఆంక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీల దిగుమతులపై విధించిన ఆంక్షల అమలును మూడు నెలలు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దిగుమతులపై విధించిన ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) వెల్లడించింది. ఎల్రక్టానిక్స్ కంపెనీలు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీలను భారత్‌కు దిగుమతి చేసుకోవాలంటే నవంబర్ 1 నుంచి ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరి. కాగా, లైసెన్స్ కలిగిన కంపెనీలు మాత్రమే ఈ పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, ఉత్తర్వులు వెంటనే అమలులోకి తీసుకువస్తున్నట్టు ఆగస్ట్ 3న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కంప్యూటర్లలో అంతర్గత భద్రత లొసుగులతో కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తుల డేటాకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్న కారణంతో తప్పనిసరి లైసెన్స్ విధానానికి కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. -
దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకే కంప్యూటర్ల దిగుమతిపై ఆంక్షలు
న్యూఢిల్లీ: పర్సనల్ కంప్యూటర్లు (పీసీ), ల్యాప్‌టాప్‌ల దిగుమతి లైసెన్సు కోసం కంపెనీలు/ట్రేడర్లు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ప్రత్యేక పోర్టల్ రూపొందించింది. వివరాలన్నీ సక్రమంగా ఉంటే దరఖాస్తు చేసుకున్న 3–4 రోజుల్లోనే లైసెన్సును జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రవాణాలో ఉన్న కన్సైమెంట్స్ను లైసెన్సు లేకుండా అనుమతిస్తారని వివరించాయి. పీసీలు, ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్ డివైజ్‌లను తయారు చేసుకునేందుకు భారత్‌కు తగినంత సామర్ధ్యం ఉండటం వల్ల నియంత్రణల విధింపుతో కంప్యూటర్ల లభ్యతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భద్రత కోసమే నియంత్రణలు.. దిగుమతైన కంప్యూటర్లలోని హార్డ్‌వేర్‌లో ఏవైనా లొసుగులు ఉంటే, వాటి నుంచి కీలకమైన వ్యక్తిగత, సంస్థాగత డేటాకు ముప్పు కలగకుండా భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఇంటర్నెట్ విస్తృతి పెరుగుతుండటంతో ప్రజలు ఆన్లైన్ మోసాల బారిన పడే అవకాశాలూ మరింతగా పెరిగాయని చెప్పాయి. ఈ నేపథ్యంలోనే దేశం, దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతోనే ప్రభుత్వం తాజా నియంత్రణలు విధించిందని అధికారులు తెలిపారు. అలాగే, చైనాతో వాణిజ్య సమతౌల్యం సాధించేందుకు కూడా ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. టారిఫ్యేతర నియంత్రణలనేవి దిగుమతులపై నిషేధం కిందికి రావని, లైసెన్సు తీసుకున్న వారు దిగుమతి చేసుకోవచ్చని వివరించారు. అటు, హార్డ్‌వేర్.. సిస్టమ్స్ విశ్వసనీయమైనవిగా ఉండేలా చూసేందుకు, దిగుమతులను తగ్గించుకునేందుకు, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. 2022–23లో ల్యాప్‌టాప్‌లు, పీసీల దిగుమతులు 5.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య వ్యవధిలో పీసీలు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఎల్రక్టానిక్స్ దిగుమతుల విలువ 19.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి -
కంప్యూటర్ల దిగుమతిపై నియంత్రణ
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం గురువారం నియంత్రణలు విధించింది. చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇకపై ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు దిగుమతిదారులు ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నియంత్రణల విధింపునకు పలు కారణాలు ఉన్నప్పటికీ పౌరుల భద్రతను పరిరక్షించడం అన్నింటికన్నా ప్రధానమైనదని ఆయన వివరించారు. ఆంక్షలు విధించడమనేది దిగుమతులను పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో తీసుకున్నది కాదని, వాటిని నియంత్రించడం మాత్రమే లక్ష్యమని చెప్పారు. దీనివల్ల దేశీయంగా ధరలేమీ పెరగబోవని తెలిపారు. కొన్ని మినహాయింపులు ఉంటాయి.. ‘ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆల్–ఇన్–వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా చిన్న స్థాయి కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే నియంత్రణలు అమల్లోకి వస్తాయి‘ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. ఆగస్టు 3 కన్నా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసిన కన్సైన్మెంట్లను దిగుమతి చేసుకోవచ్చని వివరించింది. ఆగస్టు 4 నుంచి దిగుమతిదారు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఆర్అండ్డీ, టెస్టింగ్, రిపేర్ అండ్ రిటర్న్ తదితర అవసరాల కోసం కన్సైన్మెంట్కు 20 ఐటమ్‌ల వరకు దిగుమతి చేసుకునేందుకు లైసెన్సు తీసుకోనక్కర్లేదని వివరించింది. ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, పీసీ, లేదా అల్ట్రా స్మాల్ ఫారం ఫ్యాక్టర్ కంప్యూటర్లకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, వాటికి వర్తించే సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులపై ఆంక్షల వల్ల దేశీయంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బిలియన్ డాలర్ల కొద్దీ దిగుమతులు.. 2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. భారత్ ఈ తరహా ఉత్పత్తులను ఏటా 7–8 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 65 శాతం వాటా ఎల్రక్టానిక్స్, యంత్రాలు, ఆర్గానిక్ రసాయనాలు ఉంటున్నాయి. రోజువారీ ఉపయోగించే మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోలార్ సెల్ మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దీన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. -
ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులు: సంచలన నిర్ణయం
Restrictions on Imports కేంద్ర ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు కంప్యూటర్ల దిగుమతిపై తక్షణమే ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి నేడు (ఆగస్ట్ 3 న) వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. పరిమితులు విధించిన దిగుమతులకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో దిగుమతికి అనుమతి ఉంటుందని పేర్కొంది.బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై పరిమితులు వర్తించవు ఈ దిగుమతులపై ప్రభుత్వం తక్షణమే అమలయ్యేలా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్లు ,అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై హెచ్ఎస్ఎన్ 8741 కింద ఈ పరిమితులు విధిస్తున్నట్టు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో వెల్లడించింది. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై ఆంక్షలు వర్తించవని మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాగేజీ నియమాలు భారత సరిహద్దులోకి ప్రవేశించే లేదా బయటికి వచ్చే ప్రతి ప్రయాణీకుడు కస్టమ్స్ నిబంధనలు పాటించాలి. అలాగే పోస్ట్ లేదా కొరియర్. దిగుమతులు వర్తించే విధంగా సుంకం చెల్లింపునకు లోబడి ఉంటాయి. అలాగే విదేశాల్లో రిపేర్ అయిన వస్తువులను తిరిగి దిగుమతి చేసుకునేందుకు సంబంధించి, వాటి రిపేర్‌కి ఇవ్వడానికి, తిరిగి తీసుకోవడానికి సంబంధించిన దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) సెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, బెంచ్‌మార్కింగ్ ఇతర సమయాల్లో దిగుమతిదారులు దిగుమతి లైసెన్స్ అవసరం లేకుండా సరుకుకు 20 వస్తువులను తీసుకురావచ్చు. అయితే, ఈ ఐటెమ్‌లు తప్పనిసరిగా నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగింలాలి. తిరిగి విక్రయించడానికి లేదు. ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరిన తర్వాత, ఉత్పత్తులను నాశనం చేయాలి లేదా తిరిగి ఎగుమతి చేయాలి. -
‘నెట్’స్పీడైతే.. బోధన ‘వీఆర్’అవుద్ది!
సాక్షి, హైదరాబాద్: మనుషులుగానీ, వస్తువులుగానీ మనం దగ్గరుండి చూసినట్టుగా.. అంతా మన కళ్ల ముందే ఉన్నట్టుగా అనిపించే సాంకేతికతే ‘వర్చువల్ రియాలిటీ (వీఆర్)’. ప్రత్యేకమైన వీఆర్ హెడ్‌సెట్‌ను కంప్యూటర్‌కు అనుసంధానం చేసి, వీడియోలను ప్లే చేయడం ద్వారా అనుభూతిని పొందొచ్చు. ఈ సాంకేతికతతో విద్యా రంగంలో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఉదాహరణకు ఒక విత్తనం మొలకెత్తడం నుంచి పెద్ద చెట్టుగా ఎదిగేదాకా కీలకమైన దశలన్నింటినీ కొన్ని నిమిషాల్లోనే స్పష్టంగా అవగాహన కలిగేలా ‘వీఆర్’వీడియోలను విద్యార్థులకు చూపించవచ్చు. ఇందుకోసమే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘వీఆర్’బోధన చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. కానీ స్కూళ్లలో సరైన కంప్యూటర్లు, వేగవంతమైన ఇంటర్నెట్ లేకపోవడం సమస్యగా మారింది. పరిశోధనలపై ఆసక్తి కలిగేలా.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పాఠశాలల్లో ‘వర్చువల్ రియాలిటీ, త్రీడీ’పద్ధతుల్లో బోధన అందించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం 60%, రాష్ట్రాలు 40% నిధులు వెచ్చించేలా కార్యక్రమాన్ని రూపొందించింది. విద్యార్థుల్లో ఆలోచనను రేకెత్తించేలా, క్లిష్టమైన అంశాలు కూడా అత్యంత సులభంగా అర్థమయ్యేలా బోధన కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఇందుకు సంబంధించిన ప్రణాళికను కూడా రూపొందించింది. విద్యార్థి స్థాయిలోనే పరిశోధనల వైపు ఆసక్తి కలిగించేలా, పూర్తి అవగాహన వచ్చేలా అంశాలను ఎంపిక చేసింది. ఈ మేరకు 2023–24 నుంచే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని కొన్ని స్కూళ్లలో ‘వీఆర్’ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీని అమలుకు సంబంధించి ఇటీవల స్కూళ్లలో అధ్యయనం చేసింది. పాతకంప్యూటర్లు.. స్లో ఇంటర్నెట్.. ‘వీఆర్–త్రీడీ’వంటి ఆసక్తికర బోధన పద్ధతులను అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నా మౌలిక వసతుల కొరత ఇబ్బందిగా మారిందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రభుత్వ స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం అరకొరగా ఉందని.. వాడే కంప్యూటర్లు కూడా పాతవని, వాటితో వీఆర్ త్రీడీ పాఠాలు చెప్పడం కష్టమని అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. వాస్తవానికి ఒక్కో పాఠశాలకు 20 హెడ్సెట్ల చొప్పున ఐదు బడుల్లో దీన్ని తొలుత ప్రారంభించాలని అనుకున్నారు. కానీ బోధనకు సంబంధించిన వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలంటే సమస్య ఏర్పడుతోందని గుర్తించారు. చాలా స్కూళ్లలో ఇప్పటికీ కనీసం 4జీ నెట్ కూడా లేదు. పాత కంప్యూటర్లు ఎక్కువ పరిమాణంలో ఉండే వీఆర్–త్రీడీ వీడియోలను సరిగా ప్లే చేయలేకపోతున్నాయి. ఇది పిల్లల్లో విసుగు కలిగిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా సామాన్య, సాంఘిక శాస్త్రాల బోధనలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలినట్టు వివరిస్తున్నారు. ఎక్కువ సామర్థ్యమున్న, వేగంగా పనిచేసే కంప్యూటర్లు, వేగవంతమైన ఇంటర్నెట్ ఉంటే తప్ప ‘వీఆర్’బోధన అంశంలో ముందుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని.. సానుకూల స్పందన వస్తే విద్యార్థులకు అద్భుతమైన బోధన అందుతుందని అధికారులు చెప్తున్నారు. -
కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ జూమ్!
ముంబై: ప్రపంచ కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ వాటా మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) దాదాపు 11 శాతానికి పెరిగిందని ఆర్థిక సేవల దిగ్గజం– డీబీఎస్ ఒక విశ్లేషణలో తెలిపింది. సాఫ్ట్వేర్ ఎగుమతులు రికా ర్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరడం ఇందుకు దోహదపడినట్లు వివరించింది. 2021–22లో ఈ విలువ 255 బిలియన్ డాలర్లు. డీబీఎస్ సీనియ ర్ ఎకనమిస్ట్ రాధికా రావు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022–23 ట్రేడ్ డేటా విశ్లేషణ ప్రకారం, మొత్తం సేవల ఎగుమతి వాటాలో దేశం ఇప్పటికీ వెనుకబడి ఉంది. ఈ విభాగంలో మొత్తం భారత్ వాటా దాదాపు 4%మే. ► సేవల వాణిజ్యం పనితీరు పనితీరు పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ అంశాల్లో పటిష్టతకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా కలిసిన వచ్చే అంశం ఇది. కమోడిటీ ధరలు తగ్గడం కూడా భారత్‌కు విదేశీ మారకం పరంగా సానుకూలత కల్పిస్తోంది. ► 2022–23లో సాఫ్ట్వేర్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరగా, సర్వీసెస్ ట్రేడ్ మిగులు 142 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22తో పోల్చితే, ఈ విలువ 30 శాతం పెరిగింది. సర్వీసెస్ దిగుమతులు కూడా భారీగా పెరగడం దీనికి నేపథ్యం. ► వస్తు, సేవలు కలిపి 2022–23లో ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక మొత్తం దిగుమతులు 17 శాతం పెరిగి 892 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► కంప్యూటర్ సేవల ఎగుమతులు పటిష్ట స్థాయిలో ఉండడం కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2% లోపు (2022–23 జీడీపీలో) కట్టడిలో ఉండడానికి కారణం. ► బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కింద సేవల ట్రేడ్ వాటా 2019లో 3 శాతం (జీడీపీలో) ఉంటే, 2022 నాటికి ఇది 4.6 శాతానికి ఎగసింది. 2023లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ► సేవల ఎగుమతి పెరుగుదల్లో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికం సంబంధిత రంగాలు పటిష్టంగా ఉన్నాయి. మొత్తం సేవల ఎగుమతులలో వీటి వాటా దాదాపు సగం ఉంది ► సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అమెరికా 55.5% వాటాతో అగ్ర స్థానంలో ఉంటే, యూరప్ తరువాతి స్థానంలో ఉంది. ఇందులో బ్రిటన్‌ది మొదటి స్థానం. -
‘ఫోకస్’ తప్పుతోంది
కంచర్ల యాదగిరిరెడ్డి : అర నిమిషం తీరిక లేదు... అర్ధరూపాయి సంపాదన లేదు.. ఈ సామెత వింటుంటే ఈ తరం బడిపిల్లలు గుర్తుకు వస్తున్నారు. ఎప్పుడు చూసినా పుస్తకాల్లో తలమునకలై ఉంటారు. బాగా చదువుతున్నారే అని మురిసిపోయినా.. పరీక్షల్లో వచ్చిన మార్కులు చూస్తే అత్తెసరు. ఈ తరం పిల్లల్లో ఎక్కువ మంది ఫోకస్డ్గా లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అసలు పెద్దవారి ఏకాగ్రత కూడా బాగా తగ్గిపోతోందని.. స్మార్ట్ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలు, మాధ్యమాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్పష్టం చేస్తున్నారు. దృష్టి మళ్లే దారులెన్నో.. మునుపటితో పోలిస్తే పిల్లల దృష్టి మళ్లేందుకు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీలు ఇలా ఎన్నో కారణమవుతున్నాయి. నిత్యం ఎవరో ఒకరి నుంచో, ఏదో వాట్సాప్ గ్రూపులోనో మెసేజీలు రావడం, ఫేస్బుక్ నోటిఫికేషన్లు, స్మార్ట్ వాచ్ మెసేజ్.. ఇలా తరచూ మన దృష్టిని తప్పిస్తున్నాయని, దీనివల్ల తదేకంగా ఒక పనిని శ్రద్ధగా చేసే శక్తిని కోల్పోతున్నామని నిపుణులు చెప్తున్నారు. సెల్ఫోన్లు రాకముందు, సాంకేతిక విప్లవం లేనప్పుడు మనుషులు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారన్నదానిపై అమెరికాలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్’ఇటీవల ఓ అధ్యయనం చేసింది. 1946–1975 మధ్య కాలంలో పుట్టి, రకరకాల రంగాల్లో పనిచేస్తున్న వారిని, 1976–2000 మధ్య పుట్టి పలు రంగాల్లో ఉన్న వారిని, ప్రైమరీ స్కూల్, హైసూ్కల్, కాలేజీ విద్యార్థులను ప్రశ్నించి.. ఐక్యూ టెస్ట్ పెట్టింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో ఈ అధ్యయనం సాగింది. ఏ పనికైనా ఫోకస్ అవసరం! మనం ఏ పనిచేయాలన్నా ఫోకస్ అనేది చాలా అవసరం. లేకుంటే ఏ పని సరిగా, త్వరగా పూర్తి చేయలేం. తరాలు మారుతున్న కొద్దీ ఫోకస్ టైం మారుతూ వస్తోందని అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు బేబీ బూమర్లు అంటే 1946–1964 మధ్య పుట్టినవాళ్లకు ఫోకస్ టైం ఇరవై నిమిషాలు ఉండేది. తర్వాతి తరం జనరేషన్ ఎక్స్ అంటే 1965–1980 మధ్య పుట్టినవారి ఏకాగ్రత 12 నిమిషాలకు చేరింది. 1981, ఆ తర్వాత పుట్టినవారికి ఇది కేవలం ఎనిమిది నుంచి 12 నిమిషాలే.. ఫోకస్ పెట్టలేక పోయినప్పుడు అరగంటలో చేయాలనుకున్న పని గంట, గంటన్నర పడుతుంది. పైగా చేసే పనిలో నాణ్యత ఉండదని.. యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలూ వస్తాయని, మానసిక ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. నాలుగేళ్ల కితం జరిగిన ఒక పరిశోధన ప్రకారం.. ఇంటర్నెట్ వాడకం మన మెదడులోని పలు ప్రాంతాల్లో మార్పులకు కారణమవుతుందని తేలింది. ఇలా మారిపోయే విషయాల్లో మన జ్ఞాపకాలూ ఉన్నాయని వెల్లడైంది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్’అధ్యయనం ప్రకారం కూడా.. నిద్రకు ఉపక్రమించే ముందు స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర డిజిటల్ స్క్రీన్లను చూడటం వల్ల నిద్రకు చేటు కలుగుతుంది. అది కాస్తా వారి రోజువారీ కార్యక్రమాలపై ప్రభావం చూపుతుంది. వాటితో కేవలం పరధ్యానమే.. కంప్యూటర్ల వాడకంతో మనుషుల మానసిక స్థితిపై కలిగే ప్రభావంపై ఇంకో అధ్యయనం కూడా జరిగింది. ఆ్రస్టేలియాకు చెందిన డాక్టర్ షరోన్ హార్వుడ్ నిర్వహించిన ఆ అధ్యయనం ప్రకారం.. టెక్నాలజీ అనేది మన మేధో సామర్థ్యాన్ని వెంటనే మార్చేస్తుందనడం పూర్తిగా వాస్తవమేమీ కాదు. యుగాలుగా రకరకాల పరిస్థితు లను ఎదుర్కొని పరిణామం చెందిన మెదడు పనితీరు ఒక్క తరంలో మారిపోదని ఆమె చెప్తున్నా రు. కాకపోతే డిజిటల్ పరికరాలు మన మనసును పరధ్యానంలో పడేస్తాయని స్పష్టం చేస్తున్నారు. పక్కన ఉన్నా ప్రభావమే.. మన పరిసరాల్లో స్మార్ట్‌ఫోన్, ఇతర డిజిటల్ స్క్రీన్ డివైజ్ ఉంటే చాలు మన ఏకాగ్రత స్థాయి గణనీయంగా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. ఆలోచించడం, గుర్తుంచుకోవడం, భావోద్వేగాల నియంత్రణకు కారణమైన విషయాలపై దృష్టిపెట్టడం వంటివాటిపై స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్ల వంటివి ప్రభావం చూపగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలిందని స్పష్టం చేస్తున్నారు. చేతుల్లో, లేదా జేబులో, పక్కన టేబుల్‌పైనో స్మార్ట్‌ఫోన్ ఉంటే.. మన మనసు చేసే పనిపై కాకుండా ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్లు లేదా అది చేసే శబ్దాలపై పడుతుందని వెల్లడైందని వివరిస్తున్నారు. క్షణం విడిచి ఉండలేకుండా.. రోజులో గంటా రెండు గంటల పాటు స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేకపోయినా సరే నానా హైరానా పడే వారి సంఖ్య బాగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే పాశ్చాత్యదేశాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని.. మన దేశంలోనూ ఆ పరిస్థితి వస్తోందని హెచ్చరిస్తున్నారు. తక్షణ తృప్తి (ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్) కారణంగానే మనుషులు డిజిటల్ పరికరాలకు బానిసలవుతున్నట్టు వివరిస్తున్నారు. చాలా దేశాల్లో పిల్లలు నిపుణులు సూచించిన దాని కంటే ఎక్కువ సమయం డిజిటల్ తెరల ముందు గడుపుతుండటం ఆందోళనకరమని స్పష్టం చేస్తున్నారు. సమస్యను గుర్తించడం ఎలా? ♦ చేపట్టిన పనిని పూర్తి చేసేందుకు కష్టపడుతుంటే, కష్టం అనిపిస్తుంటే, అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతుంటే ఫోకస్ కోల్పోయామని అర్థం. ♦ అకారణంగా చిరాకు అనిపిస్తున్నా, మన దృష్టి సులువుగా పక్కదారి పడుతున్నా, రెస్ట్‌లెస్‌గా అనిపిస్తున్నా.. ఫోకస్ కోల్పోయామని స్పష్టంగా తెలుస్తుంది. ♦ ముఖ్యమైన అంశాలను అప్పటికప్పుడు మర్చిపోతుంటే ఫోకస్ పోతున్నట్టే. ఏమిటి పరిష్కారం? ♦ ఫోకస్ పెంచుకునేందుకు సులువైన మార్గాలెన్నో ఉన్నాయి. మన ఏకాగ్రతను దెబ్బతీస్తున్న మొబైల్ ఫోన్ నోటిఫికేషన్, కంప్యూటర్ నోటిఫికేషన్ వంటివి ఆఫ్ చేయాలి లేదా అత్యవసరమైనవే వచ్చేలా సెట్ చేసుకోవాలి. ♦ ఏ పని ముందు చేయాలి? ఏ పని తరువాత చేయాలి? దేనికి ప్రాధాన్యత ఎక్కువ? దేనిని నిర్ణీత సమయం (డెడ్‌లైన్)లోపు పూర్తి చేసుకోవాలన్న దానిపై కొంత వర్క్ చేసుకుని ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడం నేర్చుకుంటే ఫోకస్ పెరుగుతుంది. ♦ ప్రతిరోజు మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి. అంటే పూర్తిగా చేసే పనిపైనే ధ్యాస నిలిపాలి. ఉదాహరణకు.. ఉదయం లేవగానే బ్రష్ చేసేటప్పుడు ఆ బ్రషింగ్పై మాత్రమే, కాఫీ తాగేటప్పుడు దానిపై మాత్రమే ధ్యాస నిలిపేందుకు ప్రయత్నించాలి. ఇలా అన్ని పనులకూ వర్తింపజేయాలి. దీనిని రోజూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫోకస్ ఆటోమేటిగ్గా పెరుగుతుంది. –విశేష్ , సైకాలజిస్ట్ ఇంటర్నెట్కు బానిసవుతున్న జనం ప్రపంచవ్యాప్తంగా జనం ఇంటర్నెట్కు బానిసగా మారుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. వాటి ప్రకారం.. రోజులో ఒక్కొక్కరూ కనీసం 149 నిమిషాల పాటు స్మార్ట్‌ఫోన్‌ను చూస్తూ గడుపుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు రాత్రిళ్లు నిద్రలేచి మరీ సోషల్ మీడియా పోస్టులు చూసుకుంటున్నారు. వీడియో గేమ్స్ ఆడే యువకులు వారంలో వాటిపై గడిపే సమయం 8 గంటలకు పైనే.. అమెరికాలో ట్రాఫిక్ ప్రమాదాల్లో 26శాతం స్మార్ట్‌ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్లనే జరుగుతున్నాయి! -
చిప్‌ల వేడికి చిప్‌తోనే చెక్.. కంప్యూటర్లలో వేడి పెరిగితే సమస్య ఏమిటి?
మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ఉన్నట్టుండి ఆగిపోతోందా? విపరీతంగా వేడెక్కి సక్రమంగా పనిచేయడం లేదా? లోపలున్న ఫ్యాన్లు, హీట్ సింక్లతో ప్రయోజనం ఉండట్లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ మీరు అవునని జవాబు చెబుతుంటే ఈ కథనం మీ కోసమే. ఎందుకంటే.. ఫ్యాన్ల అవసరమే లేకుండా ఓ భారతీయ అమెరికన్... పీసీ, ల్యాప్‌టాప్‌లను చల్లబరిచేందుకు ఓ వినూత్న టెక్నాలజీని ఆవిష్కరించాడు కాబట్టి! కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకూ.. వేడికి అవినాభావ సంబంధం ఉంది. అవి పనిచేస్తుంటే ప్రాసెసర్ వేడెక్కుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ వేడిని తొలగించకపోతే పీసీ, ల్యాప్‌టాప్‌ల పని సామర్థ్యం తగ్గడమే కాకుండా కొన్ని సందర్భాల్లో లోపలి సర్క్యూట్లు కాలిపోవచ్చు. ఈ సమస్యలను అధిగమించేందుకు తొలినాళ్ల నుంచి ఫ్యాన్లు ఉపయోగిస్తుండగా ఇటీవలి కాలంలో హీట్ సింకు ల్లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. కానీ వాటితో ప్రయోజనం అంతంతగానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా స్టార్టప్ సంస్థ ఫ్రోర్ సిస్టమ్స్ గత నెలలో జరిగిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శించిన ఎయిర్‌జెట్ టెక్నాలజీ ఆధారిత పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కూడా ఒక చిప్లాంటిదే. కాకపోతే వేడిని తొలగించేందుకే ఉపయోగపడుతుంది. కొన్ని ఎయిర్‌జెట్ చిప్‌లను కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లలో ఏర్పాటు చేసుకుంటే అత్యంత సమర్థంగా వేడిని తొలగించుకోవచ్చని ఇండియన్–అమెరికన్, ఫ్రోర్ సంస్థ సీఈవో డాక్టర్ మాధవపెద్ది శేషు చెబుతున్నారు. డాక్టర్ సూర్య పి. గంటితో కలసి ఆయన ఫ్రోర్ సిస్టమ్స్‌ను స్థాపించారు. వేడి పెరిగితే సమస్య ఏమిటి? వేడిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే కంప్యూటర్ల సామర్థ్యం తగ్గిపోతుంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాల్లోనూ మైక్రోప్రాసెసర్లు ఉపయోగిస్తున్నాం. వాటి వేగం పెరిగిన ప్రతిసారీ అవి ఉత్పత్తి చేసే వేడి కూడా ఎక్కువ అవుతుంది. నిపుణుల అంచనాల ప్రకారం ఇది గరిష్టంగా 70 శాతం వరకూ ఉండవచ్చు. పైగా 13 అంగుళాల సైజుండే అత్యాధునిక 4.8 గిగాహెర్ట్ ్జప్రాసెసర్ నోట్‌బుక్ 56 వాట్ల విద్యు త్ ఖర్చు చేస్తుంది. దీనివల్ల ఎక్కువవుతున్న వేడిని ఫ్యాన్లు, హీట్‌సింక్, పైపుల్లాంటివి తొలగించలేవు. ఫలితంగా ప్రాసెసర్లు కాలిపోకుండా వాటి వేగాన్ని తగ్గించేలా కంపెనీలు ఏర్పాట్లు చేశాయి. ప్రత్యేకతలెన్నో.. ఎయిర్‌జెట్ టెక్నాలజీతో ఇప్పుడు రెండు చిప్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్‌జెట్ మినీ కేవలం 270 మిల్లీమీటర్ల వెడల్పు, 41.5 మిల్లీమీటర్ల పొడవు, 2.8 మిల్లీమీటర్ల ఎత్తు ఉంటుంది. కానీ ఒకే ఒక్క వాట్ విద్యుత్‌ను వాడుకుంటూ ఇది 5.25 వాట్లకు సరిపడా వేడిని తొలగించగలదు. కొంచెం పెద్దదైన ఎయిర్‌జెట్ ప్రో 31.5 మి.మీ. వెడల్పు, 71.5 మి.మీ. పొడవు ఉంటుంది. ఇది వాడే విద్యుత్ 1.75 వాట్లు కాగా.. తొలగించగల వేడి 10.75 వాట్లకు సరిపడా ఉంటుంది. ఈ రెండు చిప్‌ల నుంచి వెలువడే శబ్దం దాదాపుగా శూన్యమనే చెప్పాలి. ఎందుకంటే ఇవి గరిష్టంగా 24 డెసిబెల్స్ స్థాయిలోనే శబ్దం చేస్తాయి. వీటి బరువు 13 నుంచి 22 గ్రాముల మధ్యే ఉండటం విశేషం. 13 అంగుళాల నోట్‌బుక్‌లో 4 ఎయిర్‌జెట్ మినీలను ఉపయోగిస్తే మైక్రోప్రాసెసర్ సామర్థ్యం 100 %వరకూ పెరుగుతుందని, 15 అంగుళాల నోట్‌బుక్‌లో 3 ఎయిర్‌జెట్ ప్రోలను వాడటం ద్వారా సామర్థ్యం 50% పెంచవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ పరికరాలు డస్ట్ ప్రూఫ్ కావడం వీటి ప్రత్యేకత. క్యూ కడుతున్న దిగ్గజ సంస్థలు.. ఫ్రోర్ సిస్టమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మైక్రోపాసెసర్ల తయారీ సంస్థ ఇంటెల్... భవిష్యత్తులో తాము తయారు చేయబోయే ల్యాప్‌టాప్‌లలో ఎయిర్‌జెట్ సాంకేతికతను ఉపయోగిస్తామని ప్రకటించింది. క్వాల్‌కాం... ఫ్రోర్ సిస్టమ్స్‌లో పెట్టుబడులు పెట్టింది. ప్రపంచంలోని 10 చిప్ తయారీ సంస్థల్లో ఐదు సంస్థలు ఇప్పటికే ఫ్రోర్ సిస్టమ్స్‌తో జట్టుకట్టాయి. అయితే ఎయిర్‌జెట్ మినీ, ప్రో ఇంకా ఉత్పత్తి దశలోనే ఉన్నందున వాటి ధరల వివరాలు తెలియరాలేదు. – సాక్షి, హైదరాబాద్ ప్రపంచంలోనే తొలిసారి వినూత్న పరిష్కారం వేడి సమస్యను ఎదుర్కొనేందుకు ఫ్రోర్ సిస్టమ్స్ సిద్ధం చేసిన ఎయిర్‌జెట్ టెక్నాలజీ ప్రపంచంలోనే తొలి సాలిడ్ స్టేట్ కూలింగ్ టెక్నాలజీ. ఇందులో రెండు పొరలుంటాయి. పైనున్న పొరలో సూక్ష్మ రంధ్రాలు ఏర్పాటు చేశారు. కింద రాగితో చేసిన పొర ఉంటుంది. రెండింటికీ మధ్యలో కంపించే త్వచాల్లాంటివి ఉంటాయి. ఈ వైబ్రేటింగ్ మెంబ్రేన్స్ వేడిని గ్రహించినప్పుడు వేగంగా కంపిస్తాయి. ఫలితంగా అక్కడున్న వేడిగాలి ఒత్తిడికి గురై కిందనున్న రాగిపొర వద్దకు చేరుకుంటుంది. కొంత వేడిని ఈ రాగిపొర గ్రహిస్తుంది...మిగిలిన వేడిగాలి చిప్‌కు గొట్టంలాంటి ఏర్పాటు ద్వారా బయటకు ప్రయాణిస్తుంది. ఫ్యాన్లు చేసే పనే ఇక్కడ మెమ్స్ మెంబ్రేన్స్ చేస్తున్నాయన్నమాట. -
కణ కవలలపై పరిశోధనలు
అక్కినేని నాగార్జున ద్విపాత్రాభియనం చేసిన సినిమా ‘హలో బ్రదర్’ గుర్తుందా? 1994లో విడుదలైన ఈ సినిమా చూసుంటే.. ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతలు అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోనీ జీలింగర్‌లు చేసిన పరిశోధనలు అర్థం చేసుకోవడం సులువవుతుంది. కణస్థాయిలో జరిగే కొన్ని భౌతిక దృగ్విషయాలను నియంత్రించడం వీలవుతుందని వీరు వేర్వేరుగా జరిపిన పరిశోధనలు స్పష్టం చేశాయి. ఫలితంగా అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ మొదలుకొని హ్యాకింగ్‌కు అస్సలు చిక్కని సమాచార వ్యవస్థల రూపకల్పనకు మార్గం సుగమమైంది. ఇంతకీ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలేమిటి? హలో బ్రదర్ సినిమా చూసుంటే వాటిని అర్థం చేసుకోవడం ఎలా సులువు అవుతుంది? దూరంగా ఉన్నప్పటికీ ఒకేలా ప్రవర్తన ముందుగా చెప్పుకున్నట్లు హలో బ్రదర్ చిత్రంలో నాగార్జునది ద్విపాత్రాభినయం. పుట్టినప్పుడే వేరైన ఇద్దరు కవలల కథ. కవలలంటే చూసేందుకు ఒకేలా ఉండేవారు మాత్రమే అని అనుకునేరు. వీరిద్దరు కొంచెం దగ్గరగా వస్తే చాలు.. ఒకరిని కొడితే ఇంకొకరికి నొప్పి కలుగుతుంది. కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే ఒకరికి నవ్వు వచ్చినా, దుఃఖం కలిగినా అదే రకమైన భావనలు రెండో వ్యక్తిలోనూ కలుగుతూంటాయి! నిజ జీవితంలో ఇలాంటి కవలలు ఉండటం అసాధ్యమేమో గానీ భౌతిక శాస్త్రంలో మాత్రం సుసాధ్యమే. సూక్ష్మ కణాల మధ్య కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ అని పిలుస్తుంటారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ కణాల్లో ఒకదానిలో జరిగే మార్పు ప్రభావం ఇంకోదాంట్లోనూ కనిపిస్తుందన్నమాట! అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్ జీలింగర్‌లు పరిశోధనలు చేసింది ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్‌పైనే. దూరంగా ఉన్నా కూడా ఒక్కతీరుగా ప్రవర్తించే కాంతి కణాల (ఫోటాన్లు)పై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలూ వేర్వేరుగా పరిశోధనలు నిర్వహించారు. ఈ ప్రయోగాల ఫలితాల ఆధారంగా కొన్ని కొత్త, వినూత్నమైన టెక్నాలజీలు రూపుదిద్దుకున్నాయి. ఫలితంగా చాలాకాలంగా కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితమైన కొన్ని విషయాలు వాస్తవ రూపం దాల్చడం మొదలైంది. లెక్కకు చిక్కనంత వేగంగా పనిచేసే కంప్యూటర్లు, అతి సురక్షితమైన సమాచార వ్యవస్థలు వీటిల్లో మచ్చుకు కొన్ని మాత్రమే. చిరకాల శేష ప్రశ్నలు నిజానికి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్పై చాలాకాలంగా ఎన్నో శేష ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. రెండు కణాలు దూరంగా ఉన్నా ఒకేలా ప్రవర్తించడం వెనుక ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చాలానే జరిగాయి. 1960వ దశకంలో జాన్ స్టూవర్ట్ బెల్ అనే శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. గుర్తు తెలియని అంశాలు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సేకరించే కొలతల ఫలితాలు నిర్దిష్టమైన విలువకు మించి ఉండవని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఈ ‘‘బెల్స్ అసమానత’’లు నిర్దిష్ట ప్రయోగాల్లో చెల్లవని క్వాంటమ్ మెకానిక్స్ చెబుతుంది. ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతల్లో ఒకరైన జాన్ ఎఫ్ క్లాసర్ గతంలోని స్టూవర్ట్ బెల్ సిద్ధాంతాలను మరింత అభివృద్ధి చేయడమే కాకుండా.. లెక్కలకు మాత్రమే పరిమితం కాకుండా వాస్తవిక ప్రయోగాలు చేపట్టారు. క్వాంటమ్ మెకానిక్స్‌లో ‘‘బెల్స్ అసమానత’’లు పనిచేయవని స్పష్టమైంది. అలెన్ ఆస్పెక్ట్ ఈ విషయాలను మరింత ముందుకు తీసుకెళుతూ.. జాన్ క్లాసర్ ప్రయోగాల్లోని కొన్ని లోపాలను సరిదిద్దే వ్యవస్థను రూపొందించారు. వీరిద్దరి ప్రయోగాల ఫలితాల ఆధారంగా ఆంటోనీ జీలింగర్ ఎంటాంగిల్‌మెంట్ స్థితిలో ఉన్న కణాలను నియంత్రించవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పవర్ఫుల్ ఎం2 చిప్‌తో సరికొత్త రీడిజైన్డ్ యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ లాంచ్ (ఫోటోలు)
-
చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం..
బీజింగ్: ప్రధాన విభాగాల్లో విదేశీ సాంకేతికతలను పక్కనబెట్టే దిశగా చైనా ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది. విదేశీ బ్రాండ్ పర్సనల్ కంప్యూటర్ల వాడకం మానేసి దేశీయ సంస్థలవే కొనాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లలో ఈ ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలవుతాయని బ్లూమ్‌బర్గ్ వార్తాసంస్థ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ముందుగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని సుమారు 5 కోట్ల కంప్యూటర్లను పక్కనపడేయనున్నారు. వీటి స్థానంలో స్థానికంగా డిజైన్ చేసిన సాఫ్ట్‌వేర్‌తో కూడిన కంప్యూటర్ల వాడకం మొదలుకానుంది. చిప్స్, సర్వర్లు, ఫోన్లు మొదలుకొని ప్రతిదానిపై అమెరికా వంటి ప్రత్యర్థి దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలనే దశాబ్ద కాలంనాటి నిర్ణయం తాజా ఆదేశాలతో కార్యరూపం దాల్చనుంది. రెండేళ్ల కార్యాచరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలతో మొదలై ప్రొవిన్షియల్ ప్రభుత్వ విభాగాల్లోనూ స్థానిక సంస్థల తయారీ కంప్యూటర్ల వాడకం మొదలుకానుంది. ప్రస్తుతం చైనాలో దేశీయ సంస్థ లెనోవో తర్వాత హెచ్‌పీ, డెల్ కంపెనీల పర్సనల్ కంప్యూటర్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. నూతన విధానంతో అమెరికాకు చెందిన హెచ్‌పీ, డెల్ తదితర సంస్థలపై మరింత ఒత్తిడి పెరగనుంది. అయితే, పీసీ బ్రాండ్లు, సాఫ్ట్వేర్కే తప్ప ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్ల మార్పిడిపై ఎలాంటి ఆదేశాలు లేవని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. (భయపెట్టేలా రంగు మారిన ఆకాశం.. స్థానికుల్లో టెన్షన్) -
2022లో భూమికి పెనుముప్పు!
Nostradamus Predictions About World In 2022: కాలజ్ఞానం గురించి ప్రస్తావన వస్తే ప్రముఖంగా మనకు బ్రహ్మంగారు గుర్తుకు వస్తారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును ముందే చెప్పిన వ్యక్తిగా ‘మిచెల్ డి నోస్ట్రాడమ్’కు మంచిపేరు ఉన్న విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ప్రవక్త, జ్యోతిష్కుడైన నోస్ట్రాడమస్ సుమారు 465 ఏళ్ల క్రితం తన పుస్తకం ‘లెస్ ప్రొఫెటీస్’లో భవిష్యత్తుకు సంబంధించి పలు అంచనాలను రాశారు. భవిష్యత్తు గురించి ఆయన చెప్పినవి.. పలు దేశాల్లో కొన్ని సంఘటనలుగా నిజమయ్యాయి కూడా! అయితే మనం ప్రస్తుతం 2022వ ఏడాదిలోకి అడుగుపెట్టడానికి దగ్గర్లో ఉన్నాం. ఆయన రాసిన పుస్తకంలో 2022వ ఏడాదికి సంబంధించి కూడా పలు విపత్కర విషయాలు ఉన్నాయి. ఆయన చెప్పిన భవిష్యత్తు అంచనా విషయాలు వైరల్ అవుతున్నాయి. చదవండి: అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి 2022లో ప్రపంచం ఉల్కల వల్ల కలిగే నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని అంచనా వేశారు. వచ్చే ఏడాది భూమికి పెనుముప్పు ఏర్పడనున్నట్లు జోస్యం చెప్పారు. ఓ పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో వరదలు, మంటలు, కరువు, తుపాన్ల కారణంగా 2022లో ఫ్రాన్స్ దేశం సంక్షోభానికి గురవుతుందని తెలిపారు. 2022 నాటికి కృత్రిమ మేధస్సు ఆధిపత్యం టెక్నాలజీ రంగంలో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని, యూఎస్ డాలర్ విలువ కూడా పడిపోవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ అంచనాలు చాలా కాలం తర్వాత నిజం కావచ్చు! లేదా చాలా ముందుగానే జరగవచ్చు! అప్పటివరకు వేచి చూడాల్సిందే! ఆయన ప్రపంచ చరిత్రలో కొన్ని అతిపెద్ద సంఘటనలను ముందే చెప్పి మనల్ని ఆశ్చర్యపరిచారు. అడాల్ఫ్ హిట్లర్ పెరుగుదల గురించి గాని, మాజీ యూఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య, 9/11 ఉగ్రవాదుల దాడి లాంటి ఘటనలను నోస్ట్రాడమస్ అంచనా వేసిన తెలిసిందే. చదవండి: Snake In Christmas Tree: ఇంట్లో క్రిస్మస్ వేడుకలు.. ఎలా వచ్చిందో గానీ సడన్‌గా ప్రత్యక్షమైంది! -
ఆదిలాబాద్ రిమ్స్ కోవిడ్ సెంటర్ లో చోరీ
-
హ్యాకర్ల ఆటలు..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ పుణ్యమా అని ఇప్పుడు డిజిటల్ ప్రపంచానికి, వాస్తవానికి మధ్య అంతరం దాదాపుగా చెరిగిపోయింది. ఐటీ ఉద్యోగాలు ఇళ్లకు చేరిపోవడం, పాఠశాలలు నట్టింట్లోకి వచ్చేయడం, కొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తరచూ కొనేస్తుండటంతో మనకొచ్చిన సౌలభ్యమేమిటో తెలియదు గానీ.. సైబర్ నేరగాళ్ల పంట పండుతోంది.. ఈ కోవిడ్ కాలంలోనూ హ్యాకర్ల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ భద్రతపై ఇకనైనా కాసింత దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ ఐటీ భద్రత సంస్థ నార్టన్ జరిపిన ఒక సర్వే ప్రకారం ఇటీవలి కాలంలో సైబర్ నేరాల తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. డిజిటల్ వెల్నెస్ రిపోర్ట్ పేరుతో సిద్ధం చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.. కోవిడ్ మహమ్మారి కాలంలో హ్యాకర్లు కంపెనీల నెట్‌వర్క్‌లలోకి చొరబడటం, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ఎక్కువైంది. నార్టన్ లైఫ్‌లాక్ సైబర్ సేఫ్టీ ఇన్సైట్స్ 2019 నివేదిక ప్రకారం.. భారత్‌లో సర్వేలో పాల్గొన్న వారిలో కనీసం 39 శాతం మంది వ్యక్తిగత గుర్తింపు తస్కరణ బారినపడ్డారు. మాల్వేర్ల సాయంతో కంప్యూటర్లపై పట్టు సాధించి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించడం సాధారణమైపోతోంది. ఈ సమాచారాన్ని బ్రోకర్లకు అమ్ముకుని హ్యాకర్లు సొమ్ము చేసుకుంటున్నారు..సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ క్లుప్తంగా వీపీఎన్ చాలా ముఖ్యమని డిజిటల్ వెల్బీయింగ్ 2020 సర్వే ద్వారా స్పష్టమైంది. ఇంటి నుంచి పనిచేస్తున్న సిబ్బంది కంపెనీతో సురక్షిత పద్ధతిలో కనెక్టయ్యేందుకు వీపీఎన్ ఉపయోగపడుతుంది. సమాచారం మొత్తాన్ని రహస్య సంకేత భాషలోకి మార్చేయడం వల్ల హ్యాకర్ల పప్పులు ఉడకవు. వైర్లెస్ ఫిడిలిటీ లేదా వైఫై కనెక్షన్‌కూ భద్రత ఏర్పాట్లు ఉండేలా చూసుకోవడం ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడటం తక్కువవుతుందని, బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా లభించే వైఫై విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఈ సర్వే తెలిపింది. డిజిటల్ వెల్నెస్ రిపోర్ట్ కోసం సర్వే చేసిన వారిలో 24 శాతం మంది పబ్లిక్ వైఫై ఉపయోగిస్తున్నట్లు తెలపడం ఇక్కడ గమనించదగ్గ విషయం..లాక్డౌన్ సమయంలో కేవైసీ (నో యువర్ కస్టమర్) పేరుతో వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని దొంగిలించడం ఎక్కువైందని తేలింది. డార్క్‌వెబ్‌లో నిక్షిప్తమయ్యే ఈ సమాచారాన్ని తొలగించడం అంత సులువు కాదు. అందువల్లనే ఆన్లైన్లో ఎవరితోనైనా సమాచారం పంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. -
విలేజ్ లెర్నింగ్ సర్కిళ్లకు కంప్యూటర్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రం లోని గిరిజన, దళిత, పేద విద్యార్థులు ఆన్లైన్లో తమ చదువును కొనసాగించేందుకు మాజీ ఎంపీ కవిత అండగా నిలిచారు. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో ఏర్పడిన ‘విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్’కు తెలంగాణ జాగృతి ద్వారా శనివారం 50 కంప్యూటర్లు, 500 కుర్చీలు విరాళమిచ్చారు. పేద విద్యార్థులు కంప్యూటర్లు, ట్యాబ్‌లు కొనుగోలు చేసే పరిస్థితి లేక చదువుకు దూరం కావద్దన్న ఉద్దేశంతోనే విలేజ్ లెర్నింగ్ సర్కిళ్లకు కంప్యూటర్లు అందజేసినట్లు కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి ద్వారా భవిష్యత్తులోనూ పేద విద్యార్థులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. మాజీ ఎంపీ కవిత సహకారాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు మేడే విద్యాసాగర్ పాల్గొన్నారు. -
అంతగా స్క్రీన్లకు అతుక్కుపోకండి!
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ సందర్భంగా దేశంలో ఎక్కువ మంది ప్రజలు టీవీలు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. లాక్డౌన్ సందర్భంగానే కాకుండా అంతకుముందు కూడా స్క్రీన్లకు అతుక్కుపోయే అలవాటు పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఉంది. అధిక సమయం స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల కళ్లు లాగడం, తలనొప్పి లేవడం, ఒళ్లు లావెక్కడం, నిద్రరాక పోవడం, హింసాత్మక దోరణులు ప్రబలడం, పలు రకాల మానసిక రుగ్మతలకు గురవడం జరుగుతుందని మొదటి నుంచి వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మూడు నెలల వయస్సు నుంచి ప్రపంచంలో 40 శాతం పిల్లలు టెలివిజన్, డీవీడీలు, ఇతర వీడియోలు తరచుగా చూస్తున్నారని, అమెరికాలో వీరి సంఖ్య 90 శాతానికి చేరుకుందని సర్వేలు తెలియజేస్తున్నాయి. అమెరికాలో ఎనిమిదేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలు ప్రతి రోజు సరాసరి ఏడు గంటల 11 నిమిషాల సేపు పలు రకాల వినోద స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. బ్రిటన్‌లో పెద్ద వాళ్లు ప్రతి 12 నిమిషాలకోసారి తమ ఫోన్లను చెక్ చేస్తున్నారట. ముఖ్యంగా లాక్డౌన్ సందర్భంగా స్క్రీన్లకు దూరంగా ఉండేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వారానికోరోజు: టీవీ, లాప్టాప్, ట్యాబ్లెట్లు ఆఫ్ చేయండి. స్మార్ట్ ఫోన్లను పక్కకు పెట్టండి. ఇంట్లో గార్డెనింగ్ పనులు చేయండి లేదా కుటుంబ సభ్యుల కోసం వంట చేసి పెట్టండి. వాకింగ్, జాగింగ్ లేదా ప్రావీణ్యం ఇతర క్రీడల్లో పాల్గొనండి, క్యారమ్స్, ఇతర హాబీలతో బిజీగా ఉండండి. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్‌ను జేబులో పెట్టుకోరాదు. అలా పెట్టుకున్నట్లయితే డైనింగ్ టేబుల్‌పైనా, టాయ్లెట్లో, పడకమీద పోస్టింగ్‌ల కోసం తరచూ స్క్రీన్‌ను చూస్తుంటాం. స్క్రీన్లకు ఎక్కువసేపు చూడడం వల్ల మెదడులో డొపమైన్ అనే హార్మోన్ ఎక్కువ విడుదలవుతుంది. అది అలవాటును బానిసగా మారుస్తుంది. డొపమైన్ ఎక్కువ విడదలయితే నిద్రరాదు. స్క్రీన్లకు దూరంగా ఉండడం వల్ల బోర్ కొడుతుంది. అది చాలా మంచిది బోర్ కొట్టినప్పుడు మనం సాధించాల్సిన లక్ష్యాల గురించి, వాటì కి అనుసరించాల్సిన మార్గాల గురించి ఆలోచిస్తాం. ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. (కరోనా వేళ : సినిమా చూసొద్దాం మామా..) వారానికి కొన్ని రోజుల్లో కొంత సమయాన్ని కుటుంబ సభ్యుల కోసమే కేటాయించండి. ఆ సమయాల్లో స్క్రీన్లకు దూరంగా వారితోనే గడపండి. మొదట ఇబ్బందిగానే ఉంటుంది. ఆ తర్వాత అలవాటు అవుతుంది. ఆ తర్వాత అందులోనుంచి వచ్చే అనుభూతి ఆనందాన్ని ఇస్తుంది. ప్రొఫెషన్లో భాగంగా ఇంటి వద్ద స్క్రీన్ మీద పని చేయాల్సి వచ్చినప్పుడు గంటకోసారి లేవండి. పది నిమిషాలు అలా ఇల్లు చుట్టి రండి. టీ చేసుకొని తాగండి, ఇంటి ప్రహారాలోపల ఖాళీ స్థలంలో ఉంటే లేదంటే మేడ మీద అడ్డదిడ్డంగా వేగంగా పరుగెత్తండి. తెలిసిన వ్యాయామాలు చేయండి. వొళ్లు విరుచుకోండి. స్క్రీన్‌పై చేయాల్సిన పని పూర్తయ్యాక కాసేపు అటు, ఇటు నడిచి వేళకు భోజనం చేసి, నిద్రవేళకు పడక ఎక్కండి. వినోదం కోసం రోజుకు రెండు గంటలకు మించి స్క్రీన్లకు అతుక్కుపోతే అది మెదడు మీద ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరిని స్క్రీన్లకు అతుక్కుపోయే సమయాన్ని తగ్గించాలని వారు కోరుతున్నారు. -
కోడెల అడ్డంగా దొరికిపోయిన దొంగ..
సాక్షి, తాడేపల్లి: మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆరోపణలను ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. తానేదో కుట్ర చేసినట్లు అవాస్తవాలు మాట్లాడటం సరికాదని, కోడెలే పెద్ద గజదొంగ అని ఆయన విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. కోడెల ఇంట్లో దొంగతనం జరిగితే తానే చేయించానని దుష్ర్పచారం జరుగుతుందని... పెద్ద దొంగతనం కప్పిపుచ్చుకునేందుకు చిన్న దొంగతనం డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. కోడెల చెబుతున్న అర్జున్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆరా తీస్తే అతడు మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా తేలిందన్నారు. చోరీ చేసిన సొత్తును తిరిగి ఇచ్చినంత మాత్రాన నేరం కాకుండా పోదని, కోడెల శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. ఎవరు దొంగలో తేలిపోతారని హెచ్చరించారు. కోడెల శివప్రసాద్ దొరికిపోయిన దొంగ అన్నారు. తాను చిత్తశుద్ధితో ఉన్నానని, దొంగతనాలు చేయించడానికి సిద్ధంగా లేనని పేర్కొన్నారు. కోడెలకు సంబంధించిన హీరో హోండా షోరూమ్‌ను ఆ కంపెనీ సీజ్ చేసిందని, అక్కడ అసెంబ్లీ ఫర్నీచర్ ఉందని అధికారులు గుర్తించినట్లు తెలిపారు. షోరూమ్ తన క్యాంపు ఆఫీస్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఫర్నిచర్ దొంగతనం చేసి కోడెల కార్యాలయంలో దాచుకున్నారని, అసెంబ్లీకి సంబంధించిన 30 కంప్యూటర్లు కోడెల శివప్రసాదరావు కొడుకు, కూతురు కలిసి అమ్ముకున్నారన్న ప్రచారం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై స్కిల్ డెవలప్మెంట్ అధికారికి ఈ నెల 9వ తేదీన ఫిర్యాదు చేశానని చెప్పారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని లేఖ రాసినట్లు చెప్పారు. దొంగతనం కోడెల ప్రమేయంతోనే జరిగిందన్నారు. తానేదో కుట్ర చేసి దొంగతనం చేయించినట్లు దుష్ర్పచారం జరుగుతుందన్నారు. ఇది ఒక కంప్యూటర్ కొత్త కుంభకోణమని అభివర్ణించారు. కోడెల సరికొత్త డ్రామా... కాగా సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో కంప్యూటర్ల చోరీతో డ్రామా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కోడెల ఇంట్లో చోరికి గురైనట్టుగా చెబుతున్న కంప్యూటర్లు ప్రభుత్వానివి. విద్యార్థుల శిక్షణకు ఉపయోగించాల్సిన వీటిని సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి గతంలో తన ఇంటికి తెప్పించుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి కంప్యూటర్లు మాయమైన విషయాన్ని ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల విచారణ వేగవంతం కావడంతో చోరీ నాటకానికి కోడెల తెర తీశారు. శుక్రవారం ఉదయం స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది కోడెల నివాసం నుంచి కంప్యూటర్లను తీసుకెళ్లారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ అధికారి... ఎమ్మెల్యే అంబటి రాంబాబు దగ్గరికి వెళ్లి పోయిన కంప్యూటర్లు దొరికాయని చెప్పగా.... ‘నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరెందుకు కంపూటర్లు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తును రికవరీ చేయాల్సింది పోలీసులు కదా’ అని అంబటి ప్రశ్నించగా సదరు అధికారి జవాబు చెప్పలేకపోయారు. దీంతో ఇదంతా కోడెల శివప్రసాదరావు ఆడించిన నాటకమని పక్కాగా తేలిపోయింది. -
మరోసారి బట్టబయలైన కోడెల పన్నాగం
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుడు, శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. శాసనసభలోని వస్తువులను గంపగుత్తగా సొంతానికి వాడుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన విద్యార్థుల కంప్యూటర్లనూ వదల్లేదని తాజాగా వెల్లడైంది. సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో కంప్యూటర్ల చోరీతో ఈ డ్రామా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ కంప్యూటర్లను ఇంట్లో పెట్టుకుని సొంతానికి వాడుకున్నట్టు తేలింది. అసలు కథ ఇదీ... కోడెల ఇంట్లో చోరికి గురైనట్టుగా చెబుతున్న కంప్యూటర్లు ప్రభుత్వానివి. విద్యార్థుల శిక్షణకు ఉపయోగించాల్సిన వీటిని సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి గతంలో తన ఇంటికి తెప్పించుకున్నారు కోడెల. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి కంప్యూటర్లు మాయమైన విషయాన్ని ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసుల విచారణ వేగవంతం కావడంతో చోరీ నాటకానికి కోడెల తెర తీశారు. ఈ రోజు ఉదయం స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది కోడెల నివాసం నుంచి కంప్యూటర్లను తీసుకెళ్లారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎమ్మెల్యే అంబటి రాంబాబు దగ్గరికి వెళ్లి అప్పుడు పోయిన కంప్యూటర్లు దొరికాయని చెప్పారు. ‘నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరెందుకు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తును రికవరీ చేయాల్సింది పోలీసులు కదా’ అని అంబటి ప్రశ్నించగా సదరు అధికారి జవాబు చెప్పలేకపోయారు. దీంతో ఇదంతా కోడెల శివప్రసాదరావు ఆడించిన నాటకమని అర్ధమైంది. అసెంబ్లీ ఫర్నీచర్‌నే కాదు విద్యార్థుల కంప్యూటర్లను సొంతానికి వాడుకున్న కోడెలపై స్థానికులు మండిపడుతున్నారు. (చదవండి: ‘కే’ మాయ) -
కోడెల కక్కుర్తి కేసు; మరో ట్విస్ట్
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు రెండు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ దొంగతనం జరిగిందని అక్కడున్న వాచ్‌మన్ తెలిపారు. కరెంటు పనిచేయాలంటూ రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తమను తోసేసి కంప్యూటర్లతో పరారైయ్యారని చెప్పారు. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నట్టు కోడెల శివప్రసాదరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చోరీ జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల నివాసంలోని ఫర్నీచర్‌ను పరిశీలించేందుకు నేడు అసెంబ్లీ అధికారులు రాబోతున్న సమయంలో దొంగతనం జరగడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కంప్యూటర్లల్లో నిక్షిప్తమైన కీలక సమాచారాన్ని మాయం చేసేందుకే వీటిని ఎత్తుకెళ్లి ఉంటారన్న ఊహాగానాలు రేగుతున్నాయి. దుండగులు పడేసిన కంప్యూటర్ మానిటర్‌ను సెక్యురిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే సమాచారం నిక్షిప్తమైవుండే సీపీలను దుండగులు ఎత్తుకెళ్లడం చూస్తుంటే ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగినట్టుగా ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ నుంచి విలువైన వస్తువులను సత్తెనపల్లిలోని తన ఇంటికి తెచ్చి పెట్టుకున్నట్టు కోడెల ఇప్పటికే ఒప్పుకున్నారు. ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని, లేకుంటే ఆ ఫర్నీచర్ ధర ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానంటూ వితండ వాదనకు దిగారు. కోడెల కక్కుర్తిపై ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టారు. (చదవండి: ‘కే’ మాయ) -
తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు!
న్యూయార్క్: కళాశాలకు చెందిన కంప్యూటర్లకు భారీగా నష్టం కల్గించినందుకు తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు శిక్ష పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్ ఆకుతోట(27) స్టూడెంట్ వీసాపై 2015లో అమెరికా వెళ్లాడు. అల్బనీ సిటీలో సెయింట్ రోజ్ కాలేజీలో 2017లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఫిబ్రవరిలో ‘యూఎస్బీ కిల్లర్’ అనే పెన్‌డ్రైవ్ సాయంతో కాలేజీలోని 66 కంప్యూటర్లను పాడుచేశాడు. ఈ పనిని మొబైల్లో షూట్‌చేశాడు. అధికారుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన నార్త్ కరోలినా పోలీసులు విశ్వనాథ్‌ను అరెస్ట్‌చేశారు. కావాలనే ఈ పనికి పూనుకున్నట్లు ఒప్పుకున్న అతడు జరిగిన నష్టం రూ.40 లక్షలు చెల్లించేందుకు కూడా అంగీకరించాడు. ఆగస్టులో కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. -
అనుమతి తీసుకున్నాకే పౌరులపై నిఘా
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేదా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకున్నాకే పౌరుల కంప్యూటర్లపై నిఘా పెట్టాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంలో ఏ విచారణ సంస్థకూ సంపూర్ణ అధికారాలు అప్పగించలేదన్నారు. 2009లో తెచ్చిన నిబంధనల మేరకే ఈ నిఘా కొనసాగుతోందనీ, వీటిలో చిన్నమార్పు కూడా చేయలేదన్నారు. పౌరుల కంప్యూటర్లలోని సమాచారంపై నిఘాతో పాటు డీక్రిప్ట్ చేసే అధికారాన్ని 10 ప్రభుత్వ సంస్థలకు అప్పగించడంపై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. -
నెట్టింట్లో పోలీస్!
-
కంప్యూటర్లపై దర్యాప్తు సంస్థల నిఘా కన్ను
-
నిఘాపై అట్టుడికిన రాజ్యసభ
న్యూఢిల్లీ: కంప్యూటర్లపై నిఘా పెట్టేందుకు పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులకు అధికారాలిస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల అంశంపై రాజ్యసభ అట్టుడికింది. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధింపుపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. సభ ప్రారంభం కాగానే ఈ అంశాలపై విపక్షాలు ఆందోళన చేపట్టడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. తిరిగి 2.30 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కంప్యూటర్ సమాచారంపై నిఘా అంశాన్ని లేవనెత్తారు. దేశంలో అప్రకటిత అత్యయిక స్థితి తుదిరూపు దిద్దుకుందని ఆయన ఆరోపించారు. వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. 2009లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన నిబంధనలపైనే దొంగ ఏడుపు ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని, రానురాను పోలీసుల రాజ్యంగా మారుతోందని మండిపడ్డారు. ఉత్తర్వుల్లో ఎక్కడ కూడా జాతీయ భద్రత, రక్షణ అనే పదం లేదని ఆజాద్ పేర్కొన్నారు. కావేరీ సమస్యపై రాజ్యసభలో అన్నా డీఎంకే సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలనపై పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరగకపోవడం దారుణం అని ఆజాద్ పేర్కొన్నారు. స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి.. ప్రజా ప్రతినిధులకు స్వీయ క్రమశిక్షణ ఉండాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా నడిచేలా చూసే బాధ్యత వారిపై ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. కాగా, శుక్రవారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే రఫేల్ వివాదంపై కాంగ్రెస్, కావేరీ డ్యాం వివాదంపై అన్నా డీఎంకే పార్టీల సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేపట్టారు. ఇకపై లోక్‌సభ వెల్‌లోకి దూసుకెళ్లి సభా కార్యకలాపాలకు భంగం కలిగించే ఎంపీలు ఆటోమేటిక్‌గా సస్పెండ్ కానున్నారు. ఉద్దేశపూర్వకంగా వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనలు చేపట్టే ఎంపీలపై ఆటోమేటిక్‌గా వేటు పడేలా నిబంధనను సవరించాలని నిబంధనల కమిటీ సిఫార్సు చేసింది. -
కంప్యూటర్లపై కేంద్రం నిఘా
న్యూఢిల్లీ: కంప్యూటర్లలోని సమాచారంపై నిఘా నేత్రం పెట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దేశంలోని ఏ కంప్యూటర్లోకి అయినా చొరబడి, అందులోని సమాచారాన్ని విశ్లేషించేందుకు, డీక్రిప్ట్(సంకేత భాష నుంచి సాధారణ భాషలోకి మార్చడం) చేయడానికి పది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధికారాలిచ్చింది. ఇందులో దర్యాప్తు, నిఘా, భద్రత, పోలీసు విభాగాలున్నాయి. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి దాటాక నోటిఫికేషన్ జారీ అయింది. నిఘా సంస్థలకు కొత్తగా ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని, 2009 నుంచి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే తాజా ఆదేశాలు జారీ చేశామని కేంద్రం ప్రకటించింది. మరోవైపు, తాజా నోటిఫికేషన్ పౌరుల ప్రాథమిక హక్కులను ప్రమాదంలోకి నెడుతుందని, దేశాన్ని నిఘా రాజ్యంగా మారుస్తుందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ప్రభుత్వ చర్య చట్టబద్ధమేనని, ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా సమాచార సాంకేతిక చట్టంలో పలు రక్షణలున్నాయని కేంద్రం సమర్థించుకుంది. విపక్షాలు గుడ్డిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని తిప్పికొట్టింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ ఈ నిబంధనల్ని రూపొందించింది. ప్రయోజనాలు ఇవే.. ‘ఏవైనా కంప్యూటర్లలో భద్రపరచిన, రూపొందించిన, అక్కడి నుంచి వేరే చోటికి పంపిన, వేరేచోటి నుంచి స్వీకరించిన సమాచారాన్ని అడ్డగించి, పర్యవేక్షించి, డిక్రిప్ట్ చేయడానికి ఈ పది సంస్థలకు అధికారాలు ఇస్తున్నాం’ అని హోం శాఖ ప్రకటనలో తెలిపింది. టెలిగ్రాఫ్ చట్టంలో మాదిరిగానే ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌తో మూడు ముఖ్య ప్రయోజనాలున్నట్లు తెలిపింది. అందులో మొదటిది..సమాచార విశ్లేషణ, పర్యవేక్షణ చట్ట పరిధికి లోబడి జరుగుతుంది. రెండోది..ఈ అధికారాల్ని కొన్ని సంస్థలకే కట్టబెట్టడం ద్వారా అవి ఇతర సంస్థలు, వ్యక్తుల చేతుల్లో దుర్వినియోగం కాకుండా నిరోధించవచ్చు. మూడోది.. దేశ సార్వభౌమత్వం, రక్షణ, ఇతర ప్రయోజనాల రీత్యా అనుమానాస్పద సమాచార మార్పిడిపై ఓ కన్నేసేందుకు వీలవుతుంది. హోం శాఖ కార్యదర్శి అనుమతితోనే.. కంప్యూటర్లపై నిఘా పెట్టే ముందు కంపీటెంట్ అథారిటీగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. ఐటీ చట్టంలోని సెక్షన్ 69లోని ఉప సెక్షన్1లో పేర్కొన్న అవసరం మేరకు పలానా కంప్యూటర్లలోని సమాచారంపై నిఘా ఉంచాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జాబితాలోని సంస్థను కోరొచ్చు. టెలిగ్రాఫ్ చట్టం మాదిరిగానే ఇక్కడ కూడా సమీక్ష కమిటీకి లోబడికి ఈ మొత్తం ప్రక్రియ జరుగుతుంది. కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ఈ కమిటీ కనీసం రెండు నెలలకోసారి సమావేశమై తమ ముందుకొచ్చిన ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రాల స్థాయిలో సమీక్ష కమిటీ సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతుంది. నిఘా సంస్థలు కోరితే సర్వీస్ ప్రొవైడర్లు, కంప్యూటర్ వినియోగదారులు, చివరికి వ్యక్తిగత కంప్యూటర్ల వినియోగదారులు కూడా అవసరమైన సహకారం అందించాలి. లేని పక్షంలో ఏడేళ్ల జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం.. పలానా ఫోన్‌కాల్స్‌ను ట్యాపింగ్ చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి నిఘా, భద్రతా సంస్థల్ని ఆదేశించేందుకు ఇది వరకే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. పాత నిబంధనలు అమలుచేసేందుకే: జైట్లీ హోం శాఖ తాజా నోటిఫికేషన్ రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిఘా రాజ్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు మూకుమ్మడిగా దుమ్మెత్తిపోశాయి. కంప్యూటర్లలోని సమాచారాన్ని అడ్డగించి, విశ్లేషించేందుకు యూపీఏ హయంలో 2009లోనే నిబంధనలు రూపొందించారని, వాటిని అమలుచేసే సంస్థల్నే తాజాగా ప్రకటించామని కేంద్రం తన చర్యను సమర్థించుకుంది. దేశాన్ని పోలీసు రాజ్యంగా మారిస్తే ప్రధాని మోదీ సమస్యలు పరిష్కారం కావని, నిఘా పెంచే ప్రయత్నాలు ఆయన ఓ అభద్ర నిరంకుశ పాలకుడని సూచిస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా, ఇదే వ్యవహారం పార్లమెంట్‌ను కూడా కుదిపేసింది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి తుది దశకు చేరుకుందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. పూర్తి వివరాలు తెలుసుకుని ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తితే బాగుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. పుట్టలు కూడా లేనిచోట శిఖరాలు ఉన్నట్లు విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కంప్యూటర్లపై నిఘా ఉంచేందుకు కేంద్రం అధికారాలిచ్చిన సంస్థలు ఇవే.. 1.ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) 2. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 3.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 4.ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) 5.డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) 6. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 7. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) 8. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) 9. డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్(కశ్మీర్, ఈశాన్య రాష్ట్రా ల్లో సేవల నిమిత్తం) 10. ఢిల్లీ పోలిస్ కమిషనర్. దేశ భద్రత కోసమే ‘దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ ఉత్తర్వులు జారీచేశాం. పౌరుల కంప్యూటర్లపై నిఘాకు 10 సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు మార్గదర్శకాలు ఉన్నాయి’ – ఐటీ మంత్రి రవిశంకర్ కాంగ్రెస్‌ది తప్పుడు ప్రచారం ‘పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తున్నామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఇది అబద్ధం. ఈ టెక్నాలజీని వాడకుంటే ఉగ్రవాదుల్ని ఎలా పట్టుకోగలం?’ – ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మోదీ గురించి తెలుస్తుంది ‘మోదీజీ.. భారత్‌ను పోలీస్ రాజ్యంగా మార్చేస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోవు. అది కేవలం మీరు ఎంత అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్న నియంతో దేశంలోని 100 కోట్ల మందికిపైగా ఉన్న భారతీయులకు తెలియజేస్తో్తంది’ – కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కొత్త ఉత్తర్వులెందుకు? 2009 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉంటే కొత్తగా ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరం ఏముంది? మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఓటమితో బీజేపీకి భయం పట్టుకుంది. దీంతో నిఘా పెట్టడం, సమాచార చౌర్యం ద్వారా ప్రజలను బెదిరించాలని చూస్తోంది. ప్రజా వ్యతిరేకతను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది’ –కాంగ్రెస్ నేత జయ్‌వీర్ షేర్గిల్ -
స్టెమ్.. నంబర్ వన్!
గణితం.. పేరు వింటేనే భయపడి పారిపోయేవారున్నారు! అంతగా భయపెడుతుంది. అర్థం చేసుకుని ఆడుకునేవారూ ఉన్నారు! అంతలా కిక్కిస్తుందీ సబ్జెక్ట్. అయితే అత్యధిక ఉద్యోగాల్లో గణిత నైపుణ్యాలే కీలకమవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులు ఆ సబ్జెక్టునే ఎంచుకుంటున్నారు. ఈ విషయమై భారత్, చైనా, అమెరికా సహా పది దేశాలపై ‘కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్’ఓ అధ్యయనం జరిపింది. అధ్యయనాన్ని విశ్లేషించి ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ సెన్సెస్ రిపోర్ట్’ను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. 88% మంది మేథమెటిక్స్ కోర్సులు చేస్తున్నారు. కెమిస్ట్రీ (65%) ఫిజిక్స్ (63%) కోర్సులు చేస్తున్న వారూ ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా సైన్స్–టెక్నాలజీ– ఇంజనీరింగ్– మేథమెటిక్స్ (స్టెమ్) కోర్సుల్లో చేరిన వారి సంఖ్య పెరిగినట్లు ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. గణితం తర్వాత స్థానాన్ని ఆంగ్లం ఆక్రమించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 84% మంది ఆంగ్ల కోర్సుల్లో చేరుతున్నారు. ప్రాంతాల వారీగా చూసుకున్నప్పుడు ఈ గణాంకా ల్లో కొద్దిపాటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. అర్జెంటీనా, అమెరికా విద్యార్థులు గణితం, ఆంగ్లం తర్వాత చరిత్రను ఎక్కువగా ఎంపి క చేసుకుంటున్నారు. చైనా, స్పెయిన్, దక్షిణాఫ్రికా విద్యార్థులు హ్యుమానిటీస్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆంగ్లేతర లాంగ్వేజ్ కోర్సులకు ఈ మూడు చోట్లా మూడో స్థానం లభిస్తోంది. స్మార్ట్ స్టడీ.. చదువులో భాగంగా.. 42 శాతం మంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. 48 శాతం మంది విద్యార్థులు డెస్క్‌టాప్ కంప్యూటర్లు వాడుతున్నారు. 35 శాతం మంది తమ తరగతి గదుల్లో ఇప్పటికీ బ్లాక్ బోర్డులు వినియోగిస్తున్నట్టు తెలిపారు. పాఠ్యేతర కార్యకలాపాల్లో మన దేశ విద్యార్థులు (72%) మరింత చురుగ్గా పాల్గొంటున్నారు. డిబేట్ (36%) సైన్స్ క్లబ్ (28శాతం) బుక్ క్లబ్ (22%) కళలు (25%) పాలుపంచుకుంటుండగా.. 74% మంది క్రమం తప్పకుండా ఆటలాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో 9 మంది ఉన్నత విద్యా సంస్థల్లో చేరాలనుకుంటున్నారు. అయితే వారి ప్రణాళికలు ఆచరణరూపం దాల్చడం లేదంటూ, ‘ది ఎకనామిస్ట్’పరిశోధనను కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఉటంకించింది. ఈ పరిశోధన ప్రకారం– 2012 నాటికి ముగిసిన రెండు దశాబ్దాల్లో ఉన్నత విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులు కేవలం 32 శాతమే! విద్యార్థులు చదువు కొనసాగించేందుకు అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయనే విషయాన్ని కూడా ఈ గణాంకాలు రుజువు చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇష్టమైంది చదవడం లేదు.. సంగీత సంబంధమైన కోర్సులు ఇష్టపడతామని 22% మంది విద్యార్థులు చెబుతున్నారు. కానీ, వీరితో సహా ఎక్కువ మంది విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్టులు చదివే పరిస్థితి లేదని నివేదిక చెబుతోంది. దీన్ని బట్టి ఉపాధి సంబంధిత ఒత్తిళ్లు విద్యార్థులను వారి ఇష్టాల వైపు మొగ్గు చూపకుండా అడ్డుకుంటున్నాయని భావించవచ్చు. ఆర్ట్ అండ్ డిజైన్ (21%) నాటకం (17%) ఆంగ్ల సాహిత్యం (13%) చరిత్ర (12 శాతం) కంప్యూటర్ సైన్స్ (11%) కోర్సులంటే ఇష్టమని చెబుతున్నారు పలువురు విద్యార్థులు. కాగా, ప్రైవేటు ట్యూషన్లు చదవడమనేది ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణమైపోయింది. చైనాలో ఇంచుమించు 57% మంది విద్యార్థులు ట్యూషన్లకు వెళుతున్నారు. మన దేశంలో ఇలాంటి విద్యార్థులు 55% మంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 66% మంది గణిత విద్యార్థులు ట్యూషన్లను ఆశ్రయిస్తున్నారు. 43 శాతం మంది ఫిజిక్స్ పాఠాలు చెప్పించుకుంటున్నారు. -
గాడ్జెట్ల వాడకంతో కంటి సమస్యలు
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు లాంటి గాడ్జెట్ల వాడకంతో పట్టణ ప్రాంతాల్లో కంటి సమస్యలు మరింత పెరిగాయని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. కాబట్టి పట్టణాల్లోనూ కంటి సమస్యలను తగ్గించాల్సిన అవసరం ఉందని, దీనిపై ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి దృష్టి సారించాలన్నారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సామాజిక నేత్ర సంరక్షణ విభాగం ‘గుళ్లపల్లి ప్రతిభారావు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ ఐ కేర్’20వ వార్షికోత్సవం శనివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ.. చాలా మంది ఆరోగ్య పరీక్షలపై దృష్టి సారించడం లేదని, కంటి సమస్యలను ముందే గుర్తించకపోతే తర్వాత మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. 55 కోట్ల మందికి గోల్డ్ ఆరోగ్య కార్డులు: నడ్డా దేశవ్యాప్తంగా 55 కోట్ల మంది కోసం ఈ నెల 23న ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. పథకాన్ని అమలుకు 29 రాష్ట్రాలూ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయన్నారు. పథకంలో భాగంగా ప్రజలకు గోల్డ్ ఆరోగ్య కార్డులు ఇస్తామని, కార్డులున్న వారికి ఏడాదికి రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజీ ఉంటుందన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య కవరేజీ కార్యక్రమమన్నారు. 1,350 రకాల వ్యాధులకు అవసరమైన చికిత్సలు, శస్త్ర చికిత్సలు దీని ద్వారా చేయించుకోవచ్చని చెప్పారు. ఇందులో కంటి శస్త్రచికిత్సలూ ఉన్నాయన్నారు. 2022 నాటికి అన్నీ వెల్నెస్ సెంటర్లే కేంద్ర ప్రభుత్వం 2017లో సమగ్ర ఆరోగ్య విధానాన్ని ప్రకటించిందని, కొత్త విధానం ద్వారా వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశామని నడ్డా చెప్పారు. దేశ ప్రజలంతా జీవితాంతం ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చామన్నారు. దేశంలోని లక్షన్నర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), ఉప కేంద్రాలన్నింటినీ వెల్నెస్ సెంటర్లుగా మారుస్తామన్నారు. గతేడాది 4 వేలు, ఈ ఏడాది 5 వేలు.. ఇలా 2022 నాటికి అన్ని కేంద్రాలనూ మార్చేస్తామని చెప్పారు. మహిళలకు సర్వైకల్ కేన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు మొదలు అన్ని రకాల సమగ్ర పరీక్షలు వెల్నెస్ సెంటర్లలో చేస్తారని చెప్పారు. ఎల్వీ ప్రసాద్ సేవలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలని, అందుకు కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనం ఖేత్రపాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
‘చుక్కలు’ చూపిస్తున్నాయి!
రోజూ లక్షల్లో మనదేశంలో స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోతున్నాయి. అయితే అదే సమయంలో కంట్లో వేసే చుక్కల మందులు కూడా భారీ సంఖ్యలోనే అమ్ముడుపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈ మందుల అమ్మకాలు 54 శాతం పెరిగాయి. ఇదేంటి సెల్ఫోన్లకు, చుక్కల మందుకు ఉన్న సంబంధం ఏంటనుకుంటున్నారా?.. స్మార్ట్ ఫోన్లే మన కళ్లలో నీళ్లను ఆవిరి చేసేస్తున్నాయి.. ఐ డ్రాప్స్ కంపెనీల లాభాలు పెంచుతున్నాయి. స్మార్ట్ ప్రపంచంలో సమస్త సమాచారం చేతికందే దూరంలోనే ఉంటుంది. కాలు కదపకుండా మనకు కావాల్సిన సమాచారం, ఇతర అవసరాలను తీర్చుకునే వెసులుబాటు కలిగింది. మన అవసరాలు తీర్చడంతోపాటు అవే గ్యాడ్జెట్స్ మన ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతున్నాయి. అతిగా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లు వాడటం వల్ల మన కళ్లలో ఉండే నీరు ఇంకిపోయి కళ్లు పొడిబారిపోతున్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగినట్లుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నా యి. 70% మంది కళ్లు పొడిబారిన సమస్యతో బాధపడుతుండగా వారిలో సగం మంది 20 నుంచి 30 మధ్య వయస్సు వారు ఉన్నారు. ఈ సమస్య కారణంగా కంటికి అవసరమైన నీళ్లు ఉత్పత్తి కావడం లే దని ఎయిమ్స్ గతేడాది చేపట్టిన సర్వేలో తేలింది. పదిమందిలో ఏడుగురికి ఇదే సమస్య కంటి సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చే ప్రతి పదిమందిలో ఏడుగురు ‘డిజిటల్ విజన్ సిండ్రోమ్’తో బాధ పడుతున్నట్లుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా గడిచిన నాలుగేళ్లలో 54 శాతం కంటి చుక్కల మందుల వ్యాపారం పెరిగింది. కంటికి చేటును తెస్తున్న ‘స్మార్ట్ ’డివైజెస్ మనదేశంలో ఒక వ్యక్తి సగటున రెండు గంటల 39 నిమిషాలపాటు మొబైల్ ఫోన్‌ను వాడుతున్నట్లుగా ఈ ఏడాది చేపట్టిన ఓ సర్వేలో వెల్లడైంది. ఆఫీసులో ఉద్యోగి రోజుకు ఆరున్నర గంటలపాటు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ను వాడుతున్నట్లుగా మరో సంస్థ వెల్లడించింది. ప్రింట్ అయిన పేజీని చదవడానికి, కంప్యూటర్ లేదా డిజిటల్ స్క్రీన్‌ను చూడటానికి చాలా తేడా ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ పేర్కొంది. కంప్యూటర్ స్క్రీన్‌పై వెలుతురులో అక్షరాలను చదవడంలో ఇబ్బందులు ఉంటాయి. గ్లేరింగ్, రిఫ్లెక్షన్, స్క్రీన్‌ను పైకీ కిందకి కదిలించడం వల్ల కంటి సమస్యలు పెరుగుతాయని వెల్లడించింది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్ల వాడకంతోపాటు ఎక్కువ సేపు ఏసీ గదుల్లో ఉండటం, వాతావరణ కాలుష్యం, ముఖ సౌందర్య సామగ్రి కళ్లు పొడిబారిపోవడానికి మరో కారణమని ఎయిమ్స్‌లోని ఆప్తమాలజీ విభాగానికి చెందిన ఓ ప్రొఫెసర్ తెలిపారు. ఏటా పెరుగుతున్న ఐ డ్రాప్స్ బిజినెస్ కళ్లు పొడిబారిన సమస్యకు సాధారణంగా రిఫ్రెష్ టియర్స్ వాడుతుంటారు. 2014 జూలై నుంచి 2018 జూలై మధ్య ఈ రిఫ్రెష్ టియర్స్ అమ్మకాలు 73 శాతం పెరిగాయి. ఓ కంపెనీ అమ్మకాలు 4,71,000 యూనిట్ల నుంచి 8,15,700 యూనిట్ల వరకు అమ్ముడయ్యాయి. మరో బ్రాండ్‌కు చెందిన అమ్మకాలు ఏకంగా 800 శాతం పెరిగాయి. 2014లో ఆ బ్రాండ్ 82,600 యూనిట్లు అమ్మగా, 2018లో 7,45,000 యూనిట్లు అమ్ముడైనట్లు లెక్కలు చెబుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో కంటి చుక్కల మందుల విభాగంలో 284 కొత్త ఉత్పత్తులను మందుల కంపెనీలు ప్రారంభించాయి. అందులో 45 ఉత్పత్తులు అంటే 15 శాతం కేవలం కళ్లు పొడిబారిన సమస్యకు సంబంధించినవే కావడం గమనార్హం. మిగిలినవి ఐ ఇన్ఫెక్షన్, కంటి చూపు మందగించిన సమస్యలకు వాడే డ్రాప్స్ ఉన్నాయి. -
కంప్యూటర్‌తో పరీక్షలు
న్యూఢిల్లీ: 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో దివ్యాంగ విద్యార్థులు (ప్రత్యేక అవసరాలున్నవారు) కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వాడుకోవడానికి సీబీఎస్ఈ అనుమతించింది. ఈ ఏడాది నుంచే ఈ వెసులుబాటు అమల్లోకి రానున్నట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది.పరీక్షా కేంద్రంలో సదరు విద్యార్థి కంప్యూటర్ వినియోగించుకోవచ్చని సిఫార్సు చేస్తూ అర్హుడైన వైద్యుడు సర్టిఫికేట్ జారీచేయాల్సి ఉంటుంది. అలా సిఫార్సు చేయడానికి తగిన కారణాలను అందులో పేర్కొనాలి. విద్యార్థి ఈ సర్టిఫికేట్‌ను పరీక్షా సమయంలో సమర్పించాలి. సమాధానాలు టైప్ చేయడానికి, ప్రశ్నలను వినడానికి, వాటిని పెద్ద అక్షరాల్లో చూడటానికి మాత్రమే కంప్యూటర్ వినియోగాన్ని పరిమితం చేయాలని సీబీఎస్ఈ పేర్కొంది. విద్యార్థి ఫార్మాట్ చేసిన కంప్యూటర్/ల్యాప్‌టాప్‌ను తానే సొంతం గా వెంట తెచ్చుకోవాలని వెల్లడించింది. కంప్యూటర్ టీచర్ ఆ కంప్యూటర్ను పరీక్షించిన తరువాతే పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ దాన్ని అనుమతించాలని తెలిపింది. ఆ కంప్యూటర్‌కు ఇంటర్నెట్ ఉండొద్దని షరతు విధించింది. పరీక్ష రాసే సహాయకుడి బదులు ప్రశ్నా పత్రం చదివి వినిపించే రీడర్ కావాలన్నా తీసుకునే ప్రతిపాదనకూ సీబీఎస్ఈ అంగీకరించింది. -
ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నా పట్టించుకోరా?
ఖమ్మంజెడ్పీసెంటర్: ప్రభుత్వ ఆస్తులు దొంగల పాలవుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. మూడేళ్లల్లో 34 పాఠశాలల్లో 372 కంప్యూటర్లు చోరీ అయినా ఎవరూ స్పందించడంలేదు. ఎస్పీ, కలెక్టర్, డీఈఓలు, జేడీలు మారినా కేసులు లేవు, రికవరీలు లేవంటూ పాఠశాల స్వచ్ఛంద సేవకుడు కలెక్టర్ లోకేష్‌కుమార్ ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశాడు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్ లోకేష్‌కుమార్, జేసీ వినయ్‌కృష్ణారెడ్డి, డీఆర్ఓ శివశ్రీనివాస్‌లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా రఘునాథపాలెం మండలం చిమ్మపుడి గ్రామానికి చెందిన కోటేరు నాగిరెడ్డి పాఠశాలలో కంప్యూటర్లు చోరీ సంఘటనలను కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన కోటి రూపాయలు చోరీ జరిగినా గంటలోనే మన పోలీస్ అధికారులు పట్టుకొని రికవరీ చూపిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలపై ఎందుకు ఈ నిర్లక్ష్యం అంటూ ప్రశ్నించారు. చోరీకి గురైన చోట ఏఏ సెల్‌టవర్లు ఉన్నాయో వివరాలు తెలియజేయాలని పోలీస్ అధికారులు అడిగారని, ఆ వివరాలు సైతం అందించినా నేటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని అసహనం వ్యక్తం చేశారు. నాగిరెడ్డి మాటలు విన్న కొందరు అధికారులు కొద్దిసేపు మిన్నకుండిపోయారు. ఖమ్మం నగరంలోని సరిత క్లీనిక్ ప్రాంతానికి చెందిన కొప్పుల ఈదమ్మ తన కుమారుడు రామారావు తన పేరుతో ఉన్న ఇంటి పట్టా, ఆస్తులు మొత్తం తీసుకున్నాడని, వృద్ధాప్యంలో ఉన్న తనకు పట్టెడన్నం పెట్టేందుకు వెనుకాడుతున్నాడని, నెలకు 2 వేలు భృతి కల్పించాలని కలెక్టర్ ఎదుట విలపించింది. దీంతో కలెక్టర్, జేసీలు ఆర్డీఓను కలవాలని అక్కడకు ఆటోలో పంపించేలా ఏర్పాటు చేశారు. ఆర్డీఓను ఆమెకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా పిల్లల ఆశ్రమం నిర్వహిస్తున్నారన్నారు. ఈ ఆశ్రమంలో నూకలతో అన్నం వండిపెట్టడంతో పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని, సీడబ్ల్యూసీ కమిటీ సైతం నిర్వాహకులను అనర్హులుగా ప్రకటించి లైసెన్స్ జారీ చేయలేదని, అయినా పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని శ్యామ్‌డేవిడ్ ఫిర్యాదు చేశారు. కొత్తకలెక్టరేట్ ప్రతిపాదనను విరమించుకొని పాత కలెక్టరేట్లోనే పరిపాలన కొనసాగించాలని, కార్యాలయాలన్ని ఒకే చోట అందుబాటులో ఉంచాలనే పేరుతో కలెక్టరేట్ కోసం స్థల సేకరణ చేయడం తగదని, గతంలో పది నియోజకవర్గాలు, 46 మండలాలు ఉన్నాయని, ప్రస్తుతం జిల్లాల విభజనతో 5 నియోజకవర్గాలు మాత్రమే మిగిలాయని, కొత్త కలెక్టరేట్ భవనం అవసరం లేదని, కోట్లాది రూపాయలతో భూములు కొనుగోలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని రాజకీయ పార్టీల నేతలు పొన్నం వెంకటేశ్వర్లు, బాగం హేమంతరావు, ఆవుల వెంకటేశ్వర్లు, తోటకూరి శివయ్య, బాలగంగాధర్ తిలక్, కోలేటి నాగేశ్వరరావు, మోడెం వెంకన్న, ప్ర జా సంఘాల నాయకులు క్రిష్ణారావు, పాపారావు, జ్వలిత, లింగాల రవికుమార్ తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. చిమ్మపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లిష్ టీచర్‌ను కేటాయించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వండి: కలెక్టర్ లోకేష్‌కుమార్ గ్రీవెన్స్ అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తమ పరిధిలో పరిష్కారం అయ్యే సమస్యను వెంటనే పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. సంబంధిత సమస్య మండల స్థాయిలో లేదా డివిజన్ స్థాయిలో లేకుంటే ఉన్నతాధికారుల స్థాయిలో ఉంటే సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపాలన్నారు. ఒకే సమస్యపై పలుమార్లు దరఖాస్తులు రాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి సత్వరమే పరిష్కరించాలన్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
వీటితో కంటికి చేటు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిన టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు వంటివి కంటిచూపును దెబ్బతీస్తున్నాయి. టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లకు ఉండే చిన్న చిన్న తెరలపై ఎక్కువ సమయం దృశ్యాలను చూస్తుండటం వల్ల చాలామంది చిన్న వయసులోనే దృష్టిలోపాల బారినపడుతున్నారు. ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా, ఈ పరిస్థితిని నిరోధించలేకపోతోంది. దృష్టిలోపాలను నయం చేయడంలో ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి సాధించినా, అధునాతన సాంకేతిక పరికరాల వల్ల తలెత్తే దృష్టి లోపాలను నివారించలేకపోతోంది. అది వైద్యశాస్త్రం పొరపాటు కాదు. సాంకేతిక పరికరాలు వాడే మనుషులే కొంత ముందుచూపుతో మసలుకుంటే, కంటిచూపును పదికాలాల పాటు పదిలంగా కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. టీవీలు రాక మునుపు మన దేశంలో ఎక్కువగా నలభయ్యేళ్ల వయసు దాటిన వారే కళ్లద్దాలతో కనిపించేవారు. కళ్లద్దాలతో కనిపించే చిన్నారులు చాలా అరుదుగా ఉండేవారు. టీవీలు వచ్చాక కళ్లద్దాలతో కనిపించే చిన్నారుల సంఖ్య క్రమంగా పెరగడం మొదలైంది. ఇక కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు విరివిగా వాడుకలోకి వచ్చాక చిన్నారుల్లో కంటిచూపు సమస్యలు మరింతగా ఎక్కువయ్యాయి. విపరీతంగా వీడియో గేమ్స్‌కు అలవాటు పడటం, గంటల తరబడి స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఉపయోగించడం వల్ల పిల్లల కంటిచూపు తీవ్రంగా దెబ్బతింటోంది. ఫలితంగా చిన్నవయసులోనే కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి అనివార్యంగా మారుతోంది. చిన్నారుల్లో జన్యు లోపాల వల్ల, పోషకాహార లోపాల వల్ల కంటిచూపు సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే, జన్యు లోపాల కంటే టీవీ, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు వంటి వాటి వాడుక వల్ల చూపు దెబ్బతింటున్న చిన్నారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. చిన్న వయసులోనే దృష్టి లోపాలను ఎదుర్కొనే పిల్లలు చదువు సంధ్యల్లో కూడా వెనుకబడుతున్నట్లు పలు అంతర్జాతీయ అధ్యయనాల్లో వెల్లడైంది. పిల్లల్లో తలెత్తే దృష్టి లోపాలను సాధ్యమైనంత త్వరగా గుర్తించి, వైద్యుల సలహాపై తగిన కళ్లద్దాలు వాడటం, కాంటాక్ట్ లెన్స్ వాడటం లేదా లేజర్ చికిత్స వంటి ఆధునిక చికిత్స పద్ధతుల్లో కంటిచూపు సరిదిద్దడం వంటి చర్యలు చేపట్టినట్లయితే వారు చదువు సంధ్యల్లో వెనుకబడకుండా ఉంటారని బాలల మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కంటిచూపు లోపాలను ఎదుర్కొంటున్న చిన్నారుల్లో దాదాపు పదిశాతం మందికి పైగా చిన్నారులు చదువు సంధ్యల్లో వెనుకబడిపోతున్నారని, ఆటల్లో కూడా వారు రాణించలేకపోతున్నారని ‘మయో క్లినిక్’ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. రిఫ్రాక్టివ్ సమస్యలు మనం ఏ వస్తువునైనా చూసేటప్పుడు దాని పైనుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి వెనుక రెటీనాపై పడేలా కార్నియా, లెన్స్.. ఈ రెండూ రిఫ్రాక్ట్ చేస్తాయి. వాటిలో ఏవైనా తేడాలున్నప్పుడు రిఫ్రాక్టివ్ సమస్యలు వస్తాయి. ప్రీస్కూల్ వయసు పిల్లల్లో 5 శాతం మంది, స్కూలుకు వెళ్లే పిల్లల్లో 20 శాతం మంది రిఫ్రాక్టివ్ సమస్యలతో బాధపడుతున్నారు. రిఫ్రాక్టివ్ సమస్యల్లో మూడు రకాలు ఉన్నాయి. అవి: దగ్గరి దృష్టి (మయోపియా), దూరపు దృష్టి (హైపరోపియా), వక్రదృష్టి (ఆస్టిగ్మాటిజం). మయోపియా: సాధారణంగా 8–12 ఏళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా మయోపియా సమస్య కనిపిస్తుంది. మయోపియాకు గురైన వారు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేరు. దగ్గరగా ఉన్నవాటిని మాత్రమే స్పష్టంగా చూడగలరు. మయోపియా బారిన పడ్డ పిల్లలు తరచుగా తలనొప్పితో బాధపడుతుంటారు. వారిలో కనుగుడ్లు రెండూ ఒకేలా లేకుండా ఉండవచ్చు. ఈ సమస్యను సరైన కళ్లద్దాలతో లేదా కాంటాక్ట్ లెన్స్‌తో సరిదిద్దవచ్చు. హైపరోపియా: ఈ సమస్యకు గురైన వారికి దూరంగా ఉన్న వస్తువులే స్పష్టంగా కనిపిస్తాయి. దగ్గరగా ఉన్నవి మసక మసగ్గా కనిపిస్తాయి. కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్ వంటి వాటితో ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. అయితే, ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే, మెల్లకన్ను వంటి మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆస్టిగ్మాటిజం: ఈ సమస్యతో బాధపడే వారికి ఇటు దగ్గరి వస్తువులను, అటు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేరు. కార్నియా ఒంపు సరిగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది. ఆస్టిగ్మాటిజంతో బాధపడేవారికి రాత్రివేళ వస్తువులను చూడటం మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యను కూడా కళ్లద్దాలతో, కాంటాక్ట్ లెన్స్‌తో సరిచేయవచ్చు. ఆంబ్లోపియా: మన రెండు కళ్ల నుంచి రెండు రెటీనాలపై పడే ప్రతిబింబాలను ఆప్టిక్ నెర్వ్ సాయంతో మెదడు గ్రహిస్తుంది. ఒక కంటిలో ఏదైనా సమస్య తలెత్తి ఆ కంటి నుంచి సరైన ప్రతిబింబం లభించకపోతే, మెదడు ఆ కంటి నుంచి వచ్చే సమాచారాన్ని తిరస్కరిస్తూ, స్పష్టంగా కనిపించే కంటి నుంచి వచ్చే సమాచారాన్నే గ్రహిస్తుంది. ఈ సమస్యనే ‘లేజీ ఐ’ అని కూడా అంటారు. దీంతో రెండు కళ్లనూ సమానంగా ఫోకస్ చేయలేకపోవడం, కనుగుడ్ల అలైన్మెంట్ సరిగా లేకపోవడం వల్ల మెల్లకన్ను వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆంబ్లోపియా సమస్య ఉన్నవారికి ఒక్కోసారి ఒకే వస్తువు రెండుగా కనిపిస్తుంటుంది. వస్తువులను సరిగా చూడలేక వాటిని ఢీకొంటుంటారు. చిన్న వయసులోనే ఈ సమస్య తలెత్తుతుంది. ప్రీస్కూల్ వయసులోనే ఈ సమస్యను గుర్తించి తగిన కళ్లద్దాలను ఉపయోగించడంతో పాటు బలహీనమైన కంటికి వైద్యుల సూచన మేరకు వ్యాయామాలు చేయించడం వల్ల ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. సమస్యను గుర్తించడం ఆలస్యమైతే చికిత్స కష్టమవుతుంది. స్ట్రాబిస్మస్: కనుగుడ్లు రెండూ ఒకే అలైన్మెంట్లో లేకపోవడాన్ని స్ట్రాబిస్మస్ అంటారు. ఒకవేళ రెండు కనుగుడ్లూ లోపలకు చూస్తూ ఉన్నట్లయితే దాన్ని ఈసోట్రోపియా అంటారు. కనుగుడ్లు రెండూ బయటకు చూస్తూ ఉన్నట్లయితే ఆ సమస్యను ఎక్సోట్రోపియా అంటారు. ఒకవేళ పైకి చూస్తుంటే హైపర్ ట్రోపియా అని, కిందకు చూస్తూ ఉన్నట్లయితే హైపోట్రోపియా అని అంటారు. ఏదైనా వస్తువును బాగా దగ్గర నుంచి మాత్రమే పిల్లలు స్పష్టంగా డగలుగుతున్నారంటే... పెద్దలు వెంటనే సమస్యను గుర్తించి, నేత్రవైద్య నిపుణులను సంప్రదించాలి. స్ట్రాబిస్మస్ సమస్య దీర్ఘకాలం కొనసాగితే పిల్లలు ‘త్రీడీ విజన్’... అంటే ఎత్తు పల్లాలను, దూరాలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతారు. సాధారణంగా ఈ సమస్య ఏడాది నుంచి నాలుగేళ్ల లోపు చిన్నారుల్లో బయటపడుతుంది. నేత్రవైద్య నిపుణులను, న్యూరాలజిస్టులను సంప్రదిస్తే, సమస్యకు దారితీసిన కారణాలకు తగిన చికిత్స అందిస్తారు. చిన్నారుల్లో దృష్టి లోపాలను ఎలా గుర్తించాలి? కాస్త ఎదిగిన చిన్నారులైతే కంటి చూపులో తేడా వస్తే తల్లిదండ్రులకు తమ సమస్యను చెప్పుకోగలరు గాని, ఐదారేళ్ల లోపు వయసు ఉన్న చిన్నారులు తమ చూపులో తేడాలను చెప్పుకోలేరు. వారిని నిశితంగా గమనించినట్లయితే, వారి కంటిచూపులో లోపాలను తల్లిదండ్రులు కనిపెట్టి, వైద్యులను సంప్రదించవచ్చు. చిన్నారుల్లో కంటి చూపు లోపాలు ఉన్నట్లయితే, వారిలో తరచుగా కనిపించే లక్షణాలు... మాటిమాటికీ కళ్లు రుద్దుకోవడం ∙కళ్లలోంచి తరచుగా నీరుకారడంఎక్కువగా రెప్పలల్లార్చడం టీవీ, కంప్యూటర్లు చూసేటప్పుడు వాటికి దగ్గరగా తల ముందుకు చాచడం ∙పుస్తకాలు చదివేటప్పుడు కళ్లు చికిలించడం ∙కళ్లు మండటం, ఎర్రబడటం, తలనొప్పిచిన్నారుల్లో ఇలాంటి లక్షణాలను గమనించినట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేత్రవైద్యులను సంప్రదించాలి. వారి సలహా సూచనల మేరకు మందులు, కళ్లద్దాలు వాడాల్సి ఉంటుంది. టీవీలు రాక మునుపు మన దేశంలో ఎక్కువగా నలభయ్యేళ్ల వయసు దాటిన వారే కళ్లద్దాలతో కనిపించేవారు. కళ్లద్దాలతో కనిపించే చిన్నారులు చాలా అరుదుగా ఉండేవారు. టీవీలు వచ్చాక కళ్లద్దాలతో కనిపించే చిన్నారుల సంఖ్య క్రమంగా పెరగడం మొదలైంది. ఇక కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు విరివిగా వాడుకలోకి వచ్చాక చిన్నారుల్లో కంటిచూపు సమస్యలు మరింతగా ఎక్కువయ్యాయి. విపరీతంగా వీడియో గేమ్స్‌కు అలవాటు పడటం, గంటల తరబడి స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఉపయోగించడం వల్ల పిల్లల కంటిచూపు తీవ్రంగా దెబ్బతింటోంది. ఫలితంగా చిన్నవయసులోనే కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి అనివార్యంగా మారుతోంది. చిన్నారుల్లో జన్యు లోపాల వల్ల, పోషకాహార లోపాల వల్ల కంటిచూపు సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే, జన్యు లోపాల కంటే టీవీ, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు వంటి వాటి వాడుక వల్ల చూపు దెబ్బతింటున్న చిన్నారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. చిన్న వయసులోనే దృష్టి లోపాలను ఎదుర్కొనే పిల్లలు చదువు సంధ్యల్లో కూడా వెనుకబడుతున్నట్లు పలు అంతర్జాతీయ అధ్యయనాల్లో వెల్లడైంది. పిల్లల్లో తలెత్తే దృష్టి లోపాలను సాధ్యమైనంత త్వరగా గుర్తించి, వైద్యుల సలహాపై తగిన కళ్లద్దాలు వాడటం, కాంటాక్ట్ లెన్స్ వాడటం లేదా లేజర్ చికిత్స వంటి ఆధునిక చికిత్స పద్ధతుల్లో కంటిచూపు సరిదిద్దడం వంటి చర్యలు చేపట్టినట్లయితే వారు చదువు సంధ్యల్లో వెనుకబడకుండా ఉంటారని బాలల మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కంటిచూపు లోపాలను ఎదుర్కొంటున్న చిన్నారుల్లో దాదాపు పదిశాతం మందికి పైగా చిన్నారులు చదువు సంధ్యల్లో వెనుకబడిపోతున్నారని, ఆటల్లో కూడా వారు రాణించలేకపోతున్నారని ‘మయో క్లినిక్’ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. రిఫ్రాక్టివ్ సమస్యలు మనం ఏ వస్తువునైనా చూసేటప్పుడు దాని పైనుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి వెనుక రెటీనాపై పడేలా కార్నియా, లెన్స్.. ఈ రెండూ రిఫ్రాక్ట్ చేస్తాయి. వాటిలో ఏవైనా తేడాలున్నప్పుడు రిఫ్రాక్టివ్ సమస్యలు వస్తాయి. ప్రీస్కూల్ వయసు పిల్లల్లో 5 శాతం మంది, స్కూలుకు వెళ్లే పిల్లల్లో 20 శాతం మంది రిఫ్రాక్టివ్ సమస్యలతో బాధపడుతున్నారు. రిఫ్రాక్టివ్ సమస్యల్లో మూడు రకాలు ఉన్నాయి. అవి: దగ్గరి దృష్టి (మయోపియా), దూరపు దృష్టి (హైపరోపియా), వక్రదృష్టి (ఆస్టిగ్మాటిజం). మయోపియా: సాధారణంగా 8–12 ఏళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా మయోపియా సమస్య కనిపిస్తుంది. మయోపియాకు గురైన వారు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేరు. దగ్గరగా ఉన్నవాటిని మాత్రమే స్పష్టంగా చూడగలరు. మయోపియా బారిన పడ్డ పిల్లలు తరచుగా తలనొప్పితో బాధపడుతుంటారు. వారిలో కనుగుడ్లు రెండూ ఒకేలా లేకుండా ఉండవచ్చు. ఈ సమస్యను సరైన కళ్లద్దాలతో లేదా కాంటాక్ట్ లెన్స్‌తో సరిదిద్దవచ్చు. హైపరోపియా: ఈ సమస్యకు గురైన వారికి దూరంగా ఉన్న వస్తువులే స్పష్టంగా కనిపిస్తాయి. దగ్గరగా ఉన్నవి మసక మసగ్గా కనిపిస్తాయి. కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్ వంటి వాటితో ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. అయితే, ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే, మెల్లకన్ను వంటి మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆస్టిగ్మాటిజం: ఈ సమస్యతో బాధపడే వారికి ఇటు దగ్గరి వస్తువులను, అటు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేరు. కార్నియా ఒంపు సరిగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది. ఆస్టిగ్మాటిజంతో బాధపడేవారికి రాత్రివేళ వస్తువులను చూడటం మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యను కూడా కళ్లద్దాలతో, కాంటాక్ట్ లెన్స్‌తో సరిచేయవచ్చు. ఆంబ్లోపియా: మన రెండు కళ్ల నుంచి రెండు రెటీనాలపై పడే ప్రతిబింబాలను ఆప్టిక్ నెర్వ్ సాయంతో మెదడు గ్రహిస్తుంది. ఒక కంటిలో ఏదైనా సమస్య తలెత్తి ఆ కంటి నుంచి సరైన ప్రతిబింబం లభించకపోతే, మెదడు ఆ కంటి నుంచి వచ్చే సమాచారాన్ని తిరస్కరిస్తూ, స్పష్టంగా కనిపించే కంటి నుంచి వచ్చే సమాచారాన్నే గ్రహిస్తుంది. ఈ సమస్యనే ‘లేజీ ఐ’ అని కూడా అంటారు. దీంతో రెండు కళ్లనూ సమానంగా ఫోకస్ చేయలేకపోవడం, కనుగుడ్ల అలైన్మెంట్ సరిగా లేకపోవడం వల్ల మెల్లకన్ను వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆంబ్లోపియా సమస్య ఉన్నవారికి ఒక్కోసారి ఒకే వస్తువు రెండుగా కనిపిస్తుంటుంది. వస్తువులను సరిగా చూడలేక వాటిని ఢీకొంటుంటారు. చిన్న వయసులోనే ఈ సమస్య తలెత్తుతుంది. ప్రీస్కూల్ వయసులోనే ఈ సమస్యను గుర్తించి తగిన కళ్లద్దాలను ఉపయోగించడంతో పాటు బలహీనమైన కంటికి వైద్యుల సూచన మేరకు వ్యాయామాలు చేయించడం వల్ల ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. సమస్యను గుర్తించడం ఆలస్యమైతే చికిత్స కష్టమవుతుంది.స్ట్రాబిస్మస్: కనుగుడ్లు రెండూ ఒకే అలైన్మెంట్లో లేకపోవడాన్ని స్ట్రాబిస్మస్ అంటారు. ఒకవేళ రెండు కనుగుడ్లూ లోపలకు చూస్తూ ఉన్నట్లయితే దాన్ని ఈసోట్రోపియా అంటారు. కనుగుడ్లు రెండూ బయటకు చూస్తూ ఉన్నట్లయితే ఆ సమస్యను ఎక్సోట్రోపియా అంటారు. ఒకవేళ పైకి చూస్తుంటే హైపర్ ట్రోపియా అని, కిందకు చూస్తూ ఉన్నట్లయితే హైపోట్రోపియా అని అంటారు. ఏదైనా వస్తువును బాగా దగ్గర నుంచి మాత్రమే పిల్లలు స్పష్టంగా చూడగలుగుతున్నారంటే... పెద్దలు వెంటనే సమస్యను గుర్తించి, నేత్రవైద్య నిపుణులను సంప్రదించాలి. స్ట్రాబిస్మస్ సమస్య దీర్ఘకాలం కొనసాగితే పిల్లలు ‘త్రీడీ విజన్’... అంటే ఎత్తు పల్లాలను, దూరాలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతారు. సాధారణంగా ఈ సమస్య ఏడాది నుంచి నాలుగేళ్ల లోపు చిన్నారుల్లో బయటపడుతుంది. నేత్రవైద్య నిపుణులను, న్యూరాలజిస్టులను సంప్రదిస్తే, సమస్యకు దారితీసిన కారణాలకు తగిన చికిత్స అందిస్తారు. చిన్నారుల్లో మరికొన్ని కంటి సమస్యలు కాటరాక్ట్ సాధారణంగా వయసు మళ్లే వారిలో కనిపించే సమస్యే అయినా, అరుదుగా కొందరు చిన్నారులు కూడా కాటరాక్ట్ బారిన పడుతుంటారు. కొందరు చిన్నారుల్లో గ్లకోమా (కళ్లలో నీటికాసులు) ఏర్పడవచ్చు. ఇవే కాకుండా, కళ్లలోంచి తరచు నీరుకారడం, కనుగుడ్లు రెండూ వేగంగా అటూ ఇటూ కదులుతుండటం వంటి సమస్యలు కనిపించవచ్చు. ఈ సమస్యలను గుర్తించిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేత్ర వైద్య నిపుణులను సంప్రదించాలి. కొన్ని అరుదైన కంటి సమస్యలు సాధారణంగా కనిపించే రిఫ్రాక్టివ్ సమస్యలు, కాటరాక్ట్, గ్లకోమా వంటి కంటి సమస్యలు అందరికీ తెలిసినవే. ఇలాంటి సాధారణ సమస్యలే కాకుండా కొన్ని అరుదైన కంటి సమస్యలు చూపును దెబ్బతీస్తాయి. చాలా సందర్భాల్లో కంటి సమస్యల కారణంగా చూపు క్రమక్రమంగా దెబ్బతింటుంది. అరుదుగా ఒక్కోసారి ఆకస్మికంగా చూపు కోల్పోయే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. కంటి వెనుక ఉండే రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడటం వల్ల ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండానే చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని ‘రెటీనల్ వీన్ అండ్ ఆర్టరీ అక్కల్షన్’ అంటారు. కంటి లోపల జరిగే అంతర్గత రక్తస్రావం వల్ల కూడా ఆకస్మికంగా చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిని ‘విట్రియస్ హెమరేజ్’ అంటారు. తలలోను, మెడలోను ఉండే రక్తనాళాల్లో వాపు ఏర్పడటం వల్ల కూడా చూపు ఆకస్మికంగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. తలలోను, మెడలోను ఉండే రక్తనాళాల్లో వాపు ఏర్పడటం వల్ల కంటిలోని ఆప్టిక్ నెర్వ్‌కు పోషకాలు అందకుండాపోతాయి. ఫలితంగా చూపు దెబ్బతింటుంది. పక్షవాతం, మైగ్రేన్ తలనొప్పి వంటి కారణాల వల్ల కూడా ఒక్కోసారి ఆకస్మికంగా చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. మైగ్రేన్ కారణంగా చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పక్షవాతం కారణంగా మెదడులో రక్తం గడ్డకడితే ఒక్కోసారి తాత్కాలికంగా, ఒక్కోసారి శాశ్వతంగా చూపు కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయి. కంటి నల్లగుడ్డుపై ఉండే పొర మీద, రెటీనా మీద ఇన్ఫెక్షన్లు, వాపులు ఏర్పడినప్పుడు చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిని ‘కోరియో రెటీనైటిస్’ అంటారు. క్షయ, లైమ్ డిసీజ్, సిఫిలిస్ వంటి వ్యాధులతో బాధపడే వారిలోను, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడే వారిలోను ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉంటాయి. డయాబెటిస్ వల్ల, జన్యులోపాల కారణంగా వచ్చే రెటినో పిగ్మెంటోసా, రెటీనల్ డిస్ట్రోఫీ వంటి వ్యాధుల వల్ల, కంటి కండరాల క్షీణత వల్ల, కంటిలోను, మెదడులోను ఏర్పడే ట్యూమర్ల వల్ల కూడా కంటిచూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అంధుల సంఖ్యలో మనదే అగ్రస్థానం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అంధులు భారత్‌లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.9 కోట్ల మంది అంధులు ఉంటే, వారిలో 1.2 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. దేశంలో ఉన్న అంధుల్లో దాదాపు 26 శాతం మంది 15 ఏళ్ల లోపు చిన్నారులే కావడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), వివిధ దేశాల ప్రభుత్వాలు, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలు చేపడుతున్న చర్యల వల్ల అంధత్వ సమస్య, కంటిచూపు సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. కంటిచూపు సమస్యల్లో దాదాపు 80 శాతం సమస్యలను తగిన ముందు జాగ్రత్తలతో నివారించవచ్చు లేదా వైద్య చికిత్సతో నయం చేయవచ్చు. భారత్, బ్రెజిల్, మొరాకో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు గడచిన రెండు దశాబ్దాల్లో కంటిచూపు సమస్యలను నివారించడంలో గణనీయమైన పురోగతిని సాధించాయి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో 2019 నాటికి కంటిచూపు సమస్యలతో బాధపడేవారి సంఖ్యను కనీసం 25 శాతం మేరకు తగ్గించాలని 2013లో సమావేశమైన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం మేరకు 2014–19 కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కార్యాచరణ ప్రణాళిక మేరకు డబ్ల్యూహెచ్ఓ వివిధ దేశాల ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలతో కలసి కంటిచూపు సమస్యల నివారణ దిశగా కృషి కొనసాగిస్తోంది. – ఫన్డే డెస్క్ -
డిజిటల్.. డీలా
♦ అలంకార ప్రాయంగా కంప్యూటర్లు ♦ 80 గ్రామపంచాయతీల్లో నిరుపయోగం ♦ పల్లె ప్రజలకు అందని సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామపంచాయతీలకు కంప్యూటర్లు మంజూరు చేసింది. ఆపరేటర్లు లేకపోవడం.. కొన్ని పంచాయతీల భవనాలు శిథిలావస్థకు చేరడం.. అధికారుల పర్యవేక్షణ లోపం.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. నర్సంపేట : జిల్లాలో 15 మండలాల పరిధి 160 క్లస్టర్ల కింద 269 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు ఉన్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వం 185 గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు మంజూరు చేసింది. రెండో విడతలో 80 గ్రామ పంచాయతీలకు అందజేసిన కంప్యూటర్లకు ఇంటర్నెట్ సౌకర్యం, ఆపరేటర్లు లేకపోవడంతో పాటు భవనాలు శిథిలావస్థలో ఉండడం వల్ల కంప్యూటర్లు పనిచేయడంలేదని జిల్లా అధికారులు వెల్లడించారు. కొన్ని మండలాల్లో సరైన భవనాలు లేక కంప్యూటర్లను ఇతరచోట్ల దాచిపెడుతున్నా రు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలకు డిజిటల్ సేవలు కలగానే మిగులుతున్నాయి. పలు సేవలకు దోహదం డిజిటల్ వ్యవస్థలో ప్రజలకు సత్వర సేవలు అందించాల్సి ఉంటుంది. ఇంటి పన్నుల వసూళ్లు, ఖర్చుల వివరాలు, సిబ్బంది జీతభత్యాలు, జనన, మరణ వివరాలు, భవన నిర్మాణాల అనుమతులు, ఇళ్ల నిర్మాణాలు, భూములకు మంజూరి అనుమతుల వివరాలు, ధ్రువీకరణ పత్రాలు, ఫిర్యాదు, గ్రామ భౌగోళిక వివరాలు, తాగునీటి వసతుల వంటి వాటిని పూర్తి స్థాయిలో కంప్యూటర్లో పొందుపర్చాలి. వీటితో పాటు పంచాయతీలో ఉన్న వనరులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, తాగునీటి వసతులు, చెరువులు, ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల వివరాలు, తదితర విషయాలను పక్కాగా నమోదు చేస్తారు. పూర్తిస్థాయిలో కంప్యూటర్లను వినియోగిస్తే అన్ని ఆన్లైన్ ద్వారానే పొందేందుకు వీలవుతుంది. పాలనలో పారదర్శకత పెరుగుతుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందజేసే అవకాశం ఉంటుంది. కనీస వసతులు కల్పించాలి పంచాయతీల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ముదస్తుగా కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. పక్కా భవనాలు ఉన్న పంచాయతీల్లో సత్వరమే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి కంప్యూటర్ ఆపరేటర్లను నియిమించాలి. భవనాలు లేని పంచాయతీల్లో తాత్కాలిక భవనాల్లోనైనా ఏర్పాట్లు చేసి కంప్యూటర్లను వినియోగింలోకి తేవాలి. ఇలా చేస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఎలాంటి ఆదేశాలు లేవు గ్రామ పంచాయతీలో డిజిటల్ సేవల కోసం ఏడాది క్రితం కంప్యూటర్ అందించారు. కంప్యూటర్ నిర్వహణ కోసం ప్రత్యేక ఆపరేటర్‌ను నియమించుకోవడానికి, పంచాయతీ కార్యదర్శే ఆపరేట్ చేయాలనే ఆదేశాలు లేవు. గ్రామ పంచాయతీలో కంప్యూటర్‌కు భద్రత ఉండదనే మా ఇంట్లోనే దాచాను. ఇప్పటికైనా ప్రభుత్వం కంప్యూటర్ నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. – అనంతుల రేవతి, శనిగరం సర్పంచ్ -
వెంకన్న ఐటీకీ వన్నా క్రై వైరస్
తిరుమల : ప్రపంచాన్ని వణికిస్తున్నవాన్నక్రై వైరస్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తాకింది. సుమారు 30 కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడ్డాయి. భక్తులకు సమాచారం అందించే వ్యవస్థపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేదు. కంప్యూటర్లలోని కేవలం పరిపాలనా పరమైన కొన్ని అంశాలకు వైరస్ సోకడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సాఫ్ట్‌వేర్‌ను టీటీడీ వినియోగిస్తున్నప్పటికీ.. కిందిస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియకుండా పైరేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ ఐటీ విభాగం అధికారులు వైరస్ సోకిన కంప్యూటర్లను తొలగించారు. ఇతర వ్యవస్థకు ఇబ్బందుల్లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వానక్రై వైరస్ వల్ల 30 కంప్యూటర్లకు వైరస్ సోకిన మాట వస్తావమేనని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం మీడియాతో చెప్పారు. దీనితో పాలనాపరమైన పనులకు కొంత విఘాతం కలిగిందని, ఐటీ అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. -
వనా క్రైమ్..!
-
మనిషిని అధిగమించిపోనున్న కృత్రిమ మేధస్సు
అవలోకనం రాబోయే 25 ఏళ్లలో అన్ని విధాలా మనిషిని మించిన మేధస్సు గల కంప్యూటర్లు ప్రవేశిస్తాయని అంచనా. ప్రస్తుతం, కంప్యూటర్ మేధస్సు మనిషి కంటే వేగంగా తనను తాను మెరుగుపరు చుకుంటోంది. ఆ తర్వాత దాని మెరుగుదల వేగం విస్ఫోటనాత్మకమైనదిగానే ఉంటుంది. ఆవిర్భవించనున్న ఆ మహా మేధస్సు ఏ విధంగా పురోగమిస్తుందో మనకు ఎలాంటి అంచనా లేదు. కాకపోతే అది ఉద్దేశపూర్వకంగా మనకు హాని చేయాలనుకోకపోవచ్చని ఊహిస్తున్నారు. కానీ, తనను తాను మెరుగుపరుచుకునే క్రమంలో అది మనల్ని విస్మరిస్తుంది. అలా జరిగితే ఎలా? ప్రపంచంలోకెల్లా అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన అమెరికా విచిత్రమైన ఒక సమస్య గురించి చర్చిస్తోంది. దాని గురించి పుస్తకాలు రాస్తున్నారు, ఉపన్య సిస్తున్నారు (యూట్యూబ్ ద్వారా అవి అందుబాటులో ఉన్నాయి). కానీ ఆ సమస్యకు సంబంధించి ఎలాంటి చర్యా తీసుకోలేదు. త్వరలోనే తగు చర్యను చేపడతారని ఆశిస్తున్నారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మనిషి కంటే తెలివైనదిగా మారుతుండటమే ఆ సమస్య. భారత్‌లోని మనకు అదేమీ అంతగా ఆలోచిం చాల్సిన సమస్య కాదనిపిస్తోంది. మనకు కంప్యూటర్లంటే మన అదుపులో ఉండే ఉపకరణాలు. ల్యాప్‌టాప్ లేదా మొబైల్‌ఫోన్ మన చేతిలోని పనిముట్టు, మన సేవకుడు. అంతేగానీ అది మన యజమాని కాదు. అయితే అమెరికాలో సాంకేతిక పరిజ్ఞాన రంగంలో కృషిచేస్తున్న అత్యంత బుద్ధిశాలురైన కొందరు మాత్రం... కృత్రిమ మేధస్సు, అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు మానవుని ఆలోచనా శక్తిని అధిగమించిపోతే ఏమి జరుగుతుందని యోచిస్తున్నారు. రెండు కారణాల రీత్యా వారు ఈ సమస్యను గురించి ఆలోచిస్తున్నారు. ఒకటి, ‘మేధస్సు’ అంటే ఏమిటనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది. మనిషి మెదడు పని చేసే తీరుకు సంబంధించి అంతుబట్టనిది ఏదీ లేదు. శాస్త్రీయ, జీవ శాస్త్ర సంబంధ పదజాలంతో ఆలోచనను అతి కచ్చితంగా వివరించవచ్చు. మేధస్సు అంటే సమాచారమూ, దానితో ఏమి చేయగలమో తెలుసుకోగల శక్తి. గత 20 ఏళ్లలో, ప్రత్యేకించి గత మూడేళ్లలో మేధస్సు విషయంలో కంప్యూటర్లు బాగా మెరుగుపడ్డాయి. అమెరికాలోని స్వయం చోదక కార్లను అందుకు అత్యంత ప్రాథమిక స్థాయి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పూర్తి స్వతంత్రమైన కారు ఆవిష్కరణకు రెండేళ్లకు మించి పట్టకపోవచ్చని అంచనా. అంటే, కార్లో కూర్చున్నాక మీరు హాయిగా నిద్రపోవచ్చు లేదా పేపర్ చదువుకోవచ్చు. కారే మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తుంది. మనం చేయగల అన్ని పనులను... ఇంజన్‌ను స్టార్ట్ చేయడం, గేర్లను మార్చడం, అవసరమైతే బ్రేక్ వేయడం, వేగం పెంచడం అదే చేసేస్తుంది. అంతే కాదు, మనం చేయలేని పనులను కూడా చేస్తుంది. మానవులకు సాధ్యంకాని స్థాయిలో అది ముందు, వెనుక, పక్కల ఉన్న ముప్పులను కనిపెట్టగలుగుతుంది. ఇంధన వినియోగం అత్యుత్తమంగా ఉండేలా కారు వేగాన్ని అభిలషణీయంగా నియంత్రించగలుగుతుంది. ఇతర కార్లతో అనుసంధానం కావడం ద్వారా రోడ్డుకు వందల కిలోమీటర్ల ముందూ, వెనుకా ఉన్న రహదారి పరిస్థితులను అది తెలుసు కోగలుగుతుంది. ఇది నేను ముందే చెప్పినట్టుగా అత్యంత ప్రాథమిక స్థాయిలోని కంప్యూటర్ మేధ ఇప్పటికే చేయగలుగుతున్న పనులకు ఉదాహరణ. కృత్రిమ మేధస్సు మెరుగుపడుతూనే ఉంటుంది, మరింత వేగంగా మెరుగు పడుతుంది. ఎందుకు? మనషులమైన మనకు చాలా సమస్యలను పరిష్కరించ డానికి సాంకేతికత అవసరం. వ్యాధులకు చికిత్సను కనిపెట్టడం నుంచి వ్యాపార వ్యవస్థల అభివృద్ధి వరకు సాంకేతికత సహాయం మనకు అవసరం. ఆధునిక ప్రపంచంలో ప్రతి దానికీ కంప్యూటర్ మేధస్సును ఉపయోగించడం అవసరమౌ తోంది. ఈ పరిస్థితి మారబోవడమూ లేదు. ఈ కంప్యూటర్ మేధో విస్పోటన వేగంతో సమానంగా మానవ మే«ధ విక సించలేకపోతుందని అంగీకరించడం మొదలైంది. ఎందువల్ల? మన మెదడు పరి మాణం స్థిరమైనది, మనకు గుర్తుంచుకునే, ఆలోచించే శక్తినిచ్చే మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్, సహాయక పదార్ధాలు పరిమిత మొత్తంలోనే ఉంటాయి. కృత్రిమ మేధస్సుకు అలాంటి పరిమితులేవీ లేవు. పెద్ద భవనం అంతటి కంప్యూటర్ మేధస్సును నిర్మించడం సాధ్యమే. కాకపోతే దానివల్ల మనం వూహిం చని ప్రమాదాలు ముంచుకు రావచ్చని భావిస్తున్నారు. అలాంటి అంత పెద్ద లేదా శక్తివంతమైన కంప్యూటర్ను ఎవరైనా ఎందుకు నిర్మిస్తారనేదే ప్రశ్న. సాంకేతిక పురోగతి విషయంలోనే కంపెనీలు, సైన్యాలు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతు న్నాయి అనేదే అందుకు సమాధానం. కొంత కాలం క్రితమే ప్రారంభమైన ఈ పోటీ విరామం లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. మరింత తెలివైన, మరింత శక్తివంతమైన, మరింత మేధోశక్తి కలిగిన కంప్యూటర్లను, కంప్యూటర్ ప్రోగ్రామ్ లను కార్పొరేషన్లు, సైన్యాలు నిర్మిస్తూనే ఉంటాయి. మనిషి ఈ కృత్రిమ మేధ స్సుతో సమానంగా సాగలేడు కాబట్టి దానికి స్వయం ప్రతిపత్తిని ఇవ్వాల్సి వస్తుంది. ఇరవై ఏళ్ల క్రితం, ప్రపంచంలోని అత్యుత్తమ చదరంగం క్రీడాకారుడు గారీ కాస్పరోవ్ ఒక కంప్యూటర్ చేతిలో ఓడిపోయాడు. గత రెండు దశాబ్దాలలో కంప్యూటర్లు చాలా చాలా ఎక్కువ రెట్లు తెలివైనవిగా మారాయి. ఇంచుమించు రాబోయే 25 ఏళ్ల కాలంలో అన్ని విధాలా మనిషిని మించిన మేధస్సు గల కంప్యూటర్లు అందుబాటులోకి వస్తాయని అంచనా. ప్రస్తుతం, కంప్యూటర్ మేధస్సు మనిషి కంటే వేగంగా తనను తాను మెరుగుపరచుకుం టోంది. ఆ తర్వాత దాని మెరుగుదల వేగం విస్ఫోటనాత్మకమైనదిగా ఉంటుంది. మానవులకు ఉండే జీవ–రసాయనిక ప్రక్రియల పరమైన పరిమితులు కంçప్యూ టర్లకు లేవు. కాబట్టి అవి మనకంటే వేగంగా సమాచారాన్ని విశ్లేషిస్తాయి. ఆ మహా మేధస్సు ఆవిర్భవించాక అది ఏ విధంగా పురోగమిస్తుందనే విష యంపై మనకు ఎలాంటి అంచనా లేదు. కాకపోతే ఆవిర్భవించనున్న ఆ మహా మేధస్సు దుర్మార్గమైనది కాకపోవచ్చునని ఊహిస్తున్నారు. అంటే అది ఉద్దేశ పూర్వకంగా మనకు హాని చేయాలని కోరుకోకపోవచ్చునని అర్థం. కానీ, తనను తాను మెరుగుపరుచుకునే క్రమంలో అది మనల్ని విస్మరిస్తుంది. అలా జరగడం గురించే అమెరికాలో వాళ్లు ఆలోచిస్తున్నది. అది మనం సైతం ఎంతో కాలం విస్మ రించలేని సమస్య. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
హ్యాకింగ్.. షాకింగ్!
- హ్యాకింగ్ ఎన్నో విధాలు.. మరెన్నో కోణాలు - ఇది పూర్తి తప్పూ కాదు.. హ్యాకర్లంతా మోసగాళ్లూ కాదు కంప్యూటర్ కీబోర్డుపై ఓ వ్యక్తి వేళ్లు వేగంగా కదులుతున్నాయి.. చల్లటి ఏసీ గదిలోనూ నుదుటిపై చెమట బిందువులు కనిపిస్తున్నాయి.. తెరపై అక్షరాలు, అంకెలు గజిబిజిగా ప్రత్యక్షమవుతున్నాయి.. అంతలోనే మాయమవుతున్నాయి. ఇంకోవైపు అమెరికాలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి.. కంపెనీల వెబ్సైట్లపై సమాచారం గజిబిజిగా మారిపోతోంది.. ఐసిస్, అల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థల బినామీ బ్యాంకు అకౌంట్లలోకి కోట్లకు కోట్ల సొమ్ము వచ్చి పడుతోంది.. ఇంకోవైపు దేశాల రక్షణ స్థావరాల్లోని మిస్సైళ్లు వాటంతట అవే పేలడానికి కౌంట్‌డౌన్ మొదలైపోతోంది. అంతటా అల్లకల్లోలం.. ఇంతలో ఓ హీరో ప్రత్యక్షమయ్యాడు. ఆఖరి సెకనులో ‘ఆ వ్యక్తి’ ఆటలు కట్టించాడు... హ్యాకింగ్, హ్యాకర్ వంటి పదాలకు హాలీవుడ్ సినిమాలు ఇచ్చే వర్ణన దాదాపు ఇలాగే ఉంటుంది. కొన్ని లక్షల కంప్యూటర్లను, ఇంటర్నెట్ ఆధారిత ఎలక్ట్రానిక్ పరికరాలను తన అదుపులో ఉంచుకున్నాడన్న ఆరోపణపై రష్యన్ ఒకరిని అరెస్ట్ చేయడంతో హ్యాకింగ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నిజంగానే హ్యాకర్లు అంతటి శక్తిమంతులా? ప్రపంచాన్ని తల్లకిందులు చేసేయగలరా? అసలు ఈ హ్యాకింగ్ అంటే ఏమిటి? ఎందుకు, ఎలా చేస్తారు?... ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. దేశంలో నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న దృష్ట్యా హ్యాకింగ్ గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఈ అంశంపై ఈ వారం ‘ఫోకస్’.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ హ్యాక్.. హ్యాక్.. హ్యాక్.. అవి ఆరో దశకం చివరి రోజులు.. మనుషుల కంటే వేగంగా లెక్కలు వేయగల కంప్యూటర్లు అప్పుడప్పుడే కనిపిస్తున్నాయి. కంప్యూటర్లో ఉన్న సర్క్యూట్లలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కొంతమంది ఇంజనీర్లు వాటిని మరింత వేగంగా, సమర్థంగా పనిచేసేలా మార్చేవారు. అలా సర్క్యూట్లను తమ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవడాన్ని హ్యాక్ అనేవాళ్లు. కాలం మారుతున్న కొద్దీ దాని స్థానంలో హ్యాకర్లు అన్న పేరు వాడకంలోకి వచ్చింది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లతోపాటు నెట్వర్కింగ్లోనూ మంచి ప్రతిభ కలిగిన ఇంజనీర్లను హ్యాకర్లు అనేవారు. ఆ సమయంలో వచ్చిన అనేక హాలీవుడ్ సినిమాలు హ్యాకర్లను పూర్తిగా నెగటివ్ కోణంలో చూపించాయి. హ్యాకర్లు చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవారని, డబ్బు కోసం కంప్యూటర్ నెట్‌వర్క్‌లను హైజాక్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారని.. ఇలా రకరకాల ఇతివృత్తాలతో వచ్చిన సినిమాలు వారిపై సాధారణ ప్రజలకు ఉండే అభిప్రాయాన్ని మార్చేశాయి. మరి హ్యాకింగ్ గురించి వింటున్నది అంతా తప్పేనా? అంటే కాదనే చెప్పాలి. నెట్వర్కింగ్ రంగంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం హ్యాకింగ్‌కు పాల్పడేవారు చాలామంది ఉన్నారు. కేవలం డబ్బు కోసం ఇతరుల కంప్యూటర్లలోకి చొరబడి బ్లాక్మెయిల్ చేసేవాళ్లు.. సమాచారాన్ని తస్కరించి, ఇతరులకు అమ్ముకునేవాళ్లు.. ఇలా ఎన్నో రకాల హ్యాకర్లు ఉన్నారు. 6,00,000 రోజూ హ్యాక్ అయ్యే ఫేస్బుక్ అకౌంట్ల సంఖ్య ఇది బ్లాక్ హ్యాట్.. వైట్ హ్యాట్.. రెడ్ హ్యాట్! హ్యాకింగ్ గురించి మాట్లాడుతూ ఈ టోపీల గోల ఎందుకని అనుకోవద్దు. ఇవన్నీ హ్యాకర్లలో రకరకాల వాళ్లకున్న పేర్లు. వీరంతా దాదాపు ప్రొఫెషనల్స్.. వీరికితోడు హ్యాకర్ల ప్రపంచంలో సాధారణ స్థాయి వారైన స్క్రిప్ట్ కిడ్డీస్ కూడా ఉంటారు. వీరు సరదా కోసం అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్ కోడ్ సాయంతో వైరస్ లాంటివి తయారు చేసి వదులుతుంటారు. కంప్యూటర్ల ఐపీలకు వేలకొద్దీ రిక్వెస్ట్‌లు పంపి అవి క్రాష్ అయ్యేలా చేస్తారు. ఇక ప్రధాన హ్యాకర్లలో వైట్‌హ్యాట్ లేదా ఎథికల్ హ్యాకర్ల గురించి చూస్తే... హ్యాకర్ల ప్రపంచంలో సైడ్ హీరోల్లాంటి వారు వీరు. కంప్యూటర్లలోంచి వైరస్లు తొలగించడం.. హ్యాకర్లు నెట్‌వర్క్‌లోకి చొరబడేందుకు ఉన్న అవకాశాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటికి విరుగుడు సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయడం వీళ్లు చేసే పని. సాధారణంగా వైట్ హ్యాట్ హ్యాకర్లంతా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పెద్ద చదువులు చదివిన వారే. ఈ వైట్హ్యాకర్లకు పూర్తిగా వ్యతిరేక దిశలో పనిచేసే వాళ్లు బ్లాక్‌హ్యాట్ హ్యాకర్లు. వీరిని క్రాకర్స్ అని కూడా అంటారు. బ్యాంకులు, కంపెనీల నెట్‌వర్క్‌ల్లోకి చొరబడి డబ్బు, సమాచారం దొంగిలించడం వంటివి చేస్తారు. ఇక డబ్బు కోసం కాకుండా, నెగెటివ్ ఆలోచనలతో వెబ్సైట్లను ధ్వంసం చేసే వాళ్లను గ్రేహ్యాట్స్గా, స్క్రిప్ట్ కిడ్డీలుగా చెబుతారు. తమకు కోపం తెప్పించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటే బ్లూహ్యాట్గా పేర్కొంటారు. చివరగా రెడ్హ్యాట్స్.. వీరు హీరోల్లాంటి వారు. విలన్లు విధ్వంసం సృష్టిస్తుంటే, మంచి వారిని కాపాడటంతోపాటు.. అవసరమైతే వైరస్‌లతో హ్యాకర్లపై ప్రతిదాడులు చేస్తారు. హ్యాకర్ల కంప్యూటర్లను పనికిరాకుండా చేసేందుకు అన్ని రకాల టెక్నాలజీలనూ వాడుతారు. వేలిముద్రలూ సురక్షితం కాదు.. డిసెంబర్, 2014:జర్మనీలో హ్యాకర్ల వార్షిక సమావేశం ‘కియాస్ కమ్యూనికేషన్స్’సదస్సు జరుగుతోంది. పాస్వర్డ్స్ కంటే వేలిముద్రలు ఎంతో సురక్షితమైనవన్న అంచనాలు ఈ సందర్భంగా పటాపంచలయ్యాయి. జాన్క్రిస్లర్ అలియాస్ స్టార్బగ్ అనే హ్యాకర్ కేవలం కొన్ని ఫొటోల ఆధారంగా అందులోని వ్యక్తి తాలూకు వేలిముద్రలను సునాయాసంగా సేకరించి చూపారు. ఆ ఫొటోల్లోని వ్యక్తి ఎవరో తెలుసా.. జర్మనీ రక్షణ మంత్రి ఉర్సులా వాండెర్ లయన్. ఈమధ్య కాలంలో మన స్మార్ట్ఫోన్లలోనూ హైరిజల్యూషన్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటికి మార్కెట్లో దొరికే వెరిఫింగర్ అనే సాఫ్ట్వేర్ సాయంతో క్రిస్లర్ ఈ పనిచేయగలిగాడు. ఎథికల్ హ్యాకర్ కాబట్టి సరిపోయిందిగానీ.. అదే పని ఓ తీవ్రవాద భావాలున్న బ్లాక్‌హ్యాట్ చేసుంటే..? ప్రపంచవ్యాప్తంగా మైడూమ్ వైరస్ కారణంగా జరిగిన నష్టం 3,850 కోట్ల డాలర్లు హ్యాకింగ్ కారణంగా ఏటా కంపెనీలు కోల్పోతున్న మొత్తం 40,000 కోట్ల డాలర్లు మన దేశంలో ప్రభావం ఎంత? మన దేశంలో కంప్యూటర్ల వాడకం తక్కువ.. క్రెడిట్కార్డులూ తక్కువే కాబట్టి హ్యాకింగ్ బెడద మనకు పెద్దగా ఉండదు అనుకునేవారికి గత ఏడాది అక్టోబరులో ఓ షాక్ తగిలింది. ఎవరు చేశారో స్పష్టంగా తెలియలేదుగానీ.. హిటాచీ పేమెంట్ సర్వీసెస్ తాలూకూ కంప్యూటర్ నెట్వర్క్ నుంచి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 32 లక్షల క్రెడిట్ కార్డు వినియోగదారుల వివరాలు తస్కరణకు గురయ్యాయి. వీరిలో ఐసీఐసీఐ, యస్, యాక్సి స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు. హ్యాకింగ్ జరిగిన కొన్ని వా రాలకు గానీ ఆ విషయం బయటపడకపోవడం గమనార్హం. ఆ తరువాత బ్యాంకు అధికారులు ఖాతాదారులను హెచ్చరించడంతోపాటు చాలా క్రెడిట్ కార్డులను బ్లాక్ చేశారు. కొన్నింటికి కొత్త కార్డు లు జారీ చేశారు. బెంగళూరుకు చెందిన సెక్యూరిటీ సంస్థ ఎస్ఐఎస్ఏ ఈ కేసును విచారిస్తోంది. పెద్దల వెబ్సైట్ల గురించి మీరు వినే ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం సమాజం హర్షించే పనేమీ కాదుకదా.. అందుకే ఇలాంటి సైట్లలో సభ్యత్వం తీసుకునే వారు తమ వివరాలు అత్యంత గోప్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ.. హ్యాకర్ల పుణ్యమా అని గత ఏడాది ఈ గుట్టు రట్టయిపోయింది. అంతర్జాతీయంగా పేరొందిన ఓ పెద్దల వెబ్సైట్ ఖాతాదారులు దాదాపు 41 కోట్ల మంది వివరాలను హ్యాకర్లు సేకరించగలిగారు. చాలా సాధారణమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం ఈ హ్యాకింగ్ సక్సెస్ అయ్యేందుకు ఒక కారణంగా చెబుతున్నారు. ఈమెయిల్ ఐడీలు, వయసు, ప్రాంతం బ్యాంకు అకౌంట్ల వివరాలు సైతం బయటకు పొక్కిపోవడం.. ఖాతాదారుల్లో చాలామంది హాలీవుడ్ తారలు, సెలబ్రిటీలు ఉన్నారన్న వదంతులు వ్యాపించడంతో ఈ హ్యాకింగ్ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాగ్రత్తలు ఇవీ.. ► సంబంధం లేని ఈ–మెయిళ్లకు అస్సలు స్పందించవద్దు. ► వీలైనంత వరకూ పాస్వర్డ్స్ తరచూ మారుస్తూ ఉండాలి. వేర్వేరు అకౌంట్ల కు వాడిన పాస్‌వర్డ్స్‌ను గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుంది అనుకుంటే పాస్వర్డ్ మేనేజర్ అప్లికేషన్ వాడవచ్చు. ► ఫలానా లాటరీ తగిలిందని.. ఫలానా వ్యక్తి కోట్లు వదిలిపెట్టి చనిపోయాడని వచ్చే ఈమెయిళ్లు, సందేశాలు ఫక్తు మోసం. అత్యాశకు పోయి బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలు ఎవరికీ వెల్లడించవద్దు ► కంప్యూటర్, స్మార్ట్ఫోన్లలో తప్పనిసరిగా మంచి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ► ఉచితంగా లభిస్తోంది కదా అని పబ్లిక్ వైఫైలను వాడక పోవడం శ్రేయస్కరం. ఎత్తుకు.. పైఎత్తులు.. హ్యాకర్లు తమ లక్ష్యాలను సాధించుకునేందుకు అనేక పద్ధతులను ఉపయోగిస్తుంటారు. స్థూలంగా చూస్తే ఈ టెక్నిక్‌లు దాదాపు పది వరకు ఉన్నాయి. ► మీరు మీ బ్యాంకు ఖాతాలోకి లాగిన్ అవుతున్నప్పుడు ‘వర్చువల్ కీబోర్డ్’అన్న పదం చూసే ఉంటారు. అది కీలాగింగ్ అనే హ్యాకింగ్ టెక్నిక్ బారిన పడకుండా ఉండేందుకు పనికొస్తుంది. కీలాగర్ సాఫ్ట్వేర్ మన కంప్యూటర్లోకి జొరబడితే కీబోర్డుపై మనం టైప్ చేసే అక్షరాలు అదే క్రమంలో ఒక లాగ్ఫైల్లో నిక్షిప్తమవుతూ ఉంటాయి. వాటిలో మన మెయిల్ఐడీలు, పాస్వర్డ్లు, బ్యాంకు వివరాలు కూడా ఉంటాయి. హ్యాకర్లు వాటి సాయంతో మన అకౌంట్లలోకి జొరబడి డబ్బు కాజేసే అవకాశం ఉంటుంది. ► ఇక మీకు పడని ఏ వ్యక్తి తాలూకు వెబ్‌సైట్‌నైనా పనిచేయకుండా చేయాలంటే హ్యాకర్లు వాడే టెక్నిక్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్! సాఫ్ట్వేర్ సాయంతో వందల వేల డమ్మీ కంప్యూటర్లు సృష్టించి.. వాటి ద్వారా సర్వర్, సైట్‌కు పెద్ద ఎత్తున రిక్వెస్ట్‌లు పంపడం ద్వారా అది పనిచేయకుండా చేసేయడం ఈ టెక్నిక్. ► తీవ్రవాదులు నిర్వహించే రెక్కీ గురించి మీకు తెలుసుగా.. హ్యాకర్ ప్రపంచంలోనూ ఇలాంటి టెక్నిక్ ఒకటి ఉంది. వాటర్హోల్ టెక్నిక్ అని దానికి పేరు. హ్యాక్ చేయాలనుకున్న కంప్యూటర్ ఓనర్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుని, బహిరంగ ప్రదేశాల్లో కృత్రిమ వైఫైను సృష్టిస్తారు. దాని ద్వారా ఆ కంప్యూటర్లోకి జొరబడటం వాటర్ హోల్ టెక్నిక్ పనిచేసే విధానం. తెలిసో తెలియకో అలాంటి కృత్రిమ వైఫైలకు కనెక్ట్ అయితే.. హ్యాకర్లు మీ కంప్యూటర్, స్మార్ట్ఫోన్లలోని సమాచారాన్ని తస్కరించవచ్చు. ► ఇక మీ సమాచారం జోలికి వెళ్లకుండా.. మీ కంప్యూటర్‌తో ఏం చేస్తున్నారు, ఎలాంటి వెబ్సైట్లు చూస్తున్నారు? వంటి వివరాలు సేకరించేందుకు ఈవ్స్ డ్రాపింగ్ అనే టెక్నిక్‌ను వాడతారు. ► ఫిషింగ్ టెక్నిక్.. మీరు తరచూ చూసే వెబ్సైట్ హోం పేజీ నకలును సిద్ధం చేసి.. దాని ద్వారా వివరాలు సేకరించడం దీని ఉద్దేశం. ఒకసారి మనం వివరాలు అందిస్తే చాలు.. తర్వాత హ్యాకర్లు ట్రోజన్ హార్స్ వంటి దురుద్దేశపూర్వక సాఫ్ట్వేర్లను మన కంప్యూటర్లోకి జొప్పించి విధ్వంసం సృష్టిస్తారన్నమాట. ట్రోజాన్ హార్స్, వైరస్లు ఉన్న పీసీల ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు హ్యాకర్‌ను చేరుతూంటుంది. ► డెస్క్టాప్పై ఉన్న క్రోమ్ బ్రౌజర్‌ను నొక్కితే.. ఏదో మీకు సంబంధం లేని వెబ్సైట్ ఓపెన్ అయిందనుకోండి. మీరు క్లిక్జాకింగ్ హ్యాకింగ్ బారిన పడినట్లు లెక్క. హ్యాకర్లు తమకు అవసరమైన వెబ్సైట్లకు ట్రాఫిక్‌ను మళ్లించేందుకు దీన్ని వాడుతూంటారు. ► ఇక బ్రౌజర్ కుకీస్‌ను తస్కరించి మీ సమాచారాన్ని సేకరించడం, ఓ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టి దాని ద్వారా మీ కంప్యూటర్ను నియంత్రించడం వంటివెన్నో హ్యాకింగ్ టెక్నిక్స్‌లో ఉన్నాయి. 5,000 కోట్లు చోరీ..! మన పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో గతేడాది జరిగిన హ్యాకింగ్ ఉదంతం ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. అంతర్జాతీయ లావాదేవీల కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఉపయోగించే స్విఫ్ట్ నెట్‌వర్క్‌ను కొంతమంది హ్యాక్ చేశారు. విడతల వారీగా 95 కోట్ల డాలర్లు (రూ.5,000 కోట్లు) ట్రాన్స్ఫర్ చేయాలని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు పేరుతో ఆదేశాలు పంపించారు. ఆ సొమ్ములో కొంత మొత్తం శ్రీలంక, ఫిలిప్పీన్స్ దేశాల్లోని అకౌంట్లలోకి తరలిపోగా.. మిగతా మొత్తం ట్రాన్స్ఫర్ కాకుండా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు చివరి క్షణంలో అడ్డుకుంది. శ్రీలంక, ఫిలిప్పీన్స్ అకౌంట్లకు మళ్లిన నిధుల్లో దర్యాప్తు సంస్థలు దాదాపు 90 శాతం మేరకు రికవరీ చేయగలిగాయి. ఈ ఉదంతంలో బంగ్లాదేశ్ రిజర్వుబ్యాంకు సిబ్బంది చేతివాటం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. మీ బ్యాంకు ఖాతా వివరాలు పది పైసలే! ‘‘రండి బాబు రండి.. ఒక్కో బ్యాంకు ఖాతాదారుడి వివరాలు పది పైసలు మాత్రమే. కొనుక్కోండి.. జనాల డబ్బులు దండుకోండి..’’ కొద్ది రోజుల క్రితం వరకూ ఢిల్లీ వాసి పూరన్గుప్తా చేసిన వ్యాపారం ఇదే. ఆ బ్యాంకు ఖాతాలు/క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలతో ఏం లాభం అనుకోవద్దు. వాటితోనే కొన్ని ఫేక్ కాల్ సెంటర్లు బతికేస్తున్నాయి! ఇదీ ఒక రకంగా హ్యాకింగే. మోసగాళ్లు ఖాతాదారులకు ఫోన్ చేసి.. ఫలానా బ్యాంకు/కార్డు సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ.. ఖాతాలు, కార్డుల వివరాలు చెబుతారు. వాటిని సరిచూసుకోవడానికి, లేదా బ్లాక్ చేయకుండా ఉండడానికి ఫోన్ చేశామని నమ్మబలుకుతారు. ‘‘మీకిప్పుడో పాస్వర్డ్ వస్తుంది. అదేంటో చెప్పండి’’ అంటూ.. ఆన్లైన్లో బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము తస్కరిస్తున్నారు.. పూరన్గుప్తా వద్ద కోటి మంది భారతీయుల బ్యాంకు, క్రెడిట్, డెబిట్‌కార్డు వివరాలు ఉన్నాయి. వయసు, నెలవారీ జీతాలు, క్రెడిట్ కార్డు పరిమితులు వంటి వివరాల వారీగా వర్గీకరించిన సమాచారం ఉంది. ఒకప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసిన పూరన్.. తను పనిచేస్తున్న కంపెనీ నుంచి ఈ సమాచారాన్ని తస్కరించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అలా తస్కరించిన సమాచారాన్ని ఫేక్ కాల్ సెంటర్ల వారికి అమ్ముతున్నాడు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడికి ఒక ఫేక్ కాల్ సెంటర్ రూ.1.46 లక్షలకు టోపీ పెట్టింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా పూరన్గుప్తా వ్యవహారం బయటపడింది. డిజిటల్ ఎకానమీ వైపు మళ్లండి.. అని కేంద్రం పదే పదే కోరుతున్న ఈ తరుణంలో ఇలాంటివి వెలుగులోకి రావడం ఆ వ్యవస్థపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. -
స్మార్ట్ ఫోన్లతో చిన్నారుల్లో కంటి సమస్యలు
సియోల్: స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లను ఎక్కు వగా ఉపయోగించే చిన్నారులకు కళ్లు పొడి బారతాయని తాజా అధ్యయనంలో తేలింది. దక్షిణ కొరియాలోని చుంగ్ ఆంగ్ యూని వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వ హించారు. దీని కోసం 916మంది చిన్నారులను పరీక్షించారు. స్మార్ట్ ఫోన్ల స్క్రీన్లను ఎక్కువ సేపు చూడటం వల్ల పిల్లల్లో కళ్లు పొడిబారుతున్నట్లు (డీఈడీ వ్యాధి) గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారు లతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తేల్చారు. బయట ఆటలకు ఎక్కువ సమయాన్ని వెచ్చించడం ద్వారా దీని బారి నుంచి బయటపడగలరన్నారు. పట్టణాల్లోని చిన్నారుల్లో 8.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారుల్లో 2.8 శాతం మంది డీఈడీ బారిన పడినట్లు గుర్తించారు. -
స్మార్ట్ టీవీలకూ వైరస్!
కేవలం కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు మాత్రమే వైరస్ సోకుతుందని భావిస్తున్నారా?. అయితే మీరు తెలుసుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది. స్మార్ట్ టీవీలకు కూడా వైరస్ సోకుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇంటర్నెట్ కనెక్షన్‌తో టీవీలోనే అన్ని రకాల యాప్‌లు తదితర సర్వీసులు వినియోగించే అవకాశం స్మార్ట్ టీవీల ద్వారా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని వల్ల ఇంతకుముందు ఉన్న టీవీల కంటే కూడా అధికంగా స్మార్ట్ టీవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ టీవీలకు వైరస్ సోకడం వినియోగదారులకు మరింత ఆందోళన కలిగిస్తోంది. యూరప్‌లోని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబానికి చెందిన ఓ స్మార్ట్ టీవీకి ఇటీవల వైరస్ సోకింది. ఓ యాప్‌ను డౌన్లోడ్ చేసిన కుటుంబసభ్యులు సినిమా చూస్తుండగా మధ్యలో హఠాత్తుగా టీవీ ఆగిపోయిందట. ఆ తర్వాత స్క్రీన్‌పై వైరస్ సోకినట్లు చూపుతున్న ఓ ఫొటో తప్ప మరేమి కనపడలేదట. దీంతో ఆందోళన చెందిన సదరు ఇంజనీరు ఆ టీవీని రీసెట్ చేయడానికి యత్నించినా అది కుదరలేదు. దీంతో చేసేదేమీలేక టీవీ సంస్థను సంప్రదించగా.. ఇంటికి వచ్చిన టెక్నీషియన్ రీసెట్ చేయడానికి రూ.23,170/, సోకిన వైరస్ ను తొలగించడానికి రూ.11 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. అయితే, టీవీ యజమాని సదరు యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేశారా? లేదా వేరే సైట్ల నుంచి డౌన్ లోడ్ చేశారా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు. సో టీవీలను జాగ్రత్తగా వాడాలన్నమాట. -
కొనసాగుతున్న స్క్రీనింగ్ టెస్ట్
కర్నూలు: కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు కొనసాగుతోంది. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో ఆరో రోజు శనివారం కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన 713 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ముందుగా హాల్‌టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం బరువు, ఛాతీ, ఎత్తు కొలతలలో అర్హత సాధించినవారికి 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. ఆధునిక పద్ధతిలోని కంప్యూటరీకరణ యంత్రాల ద్వారా పరీక్షలను నిర్వహించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి పరుగు పందెం నిర్వహించగా 431 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు 128 మంది తీసుకురాకపోవడంతో క్రీడామైదానంలోకి వారిని అనుమతించకుండా వెనక్కు పంపించారు. తహసీల్దార్లు జారీ చేసిన క్రిమిలేయర్, ఓబీసీ సర్టిఫికెట్లు, ఇతర అర్హత కల్గిన ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీ సెక్రటేరియట్ తరలింపునకు కౌంట్ డౌన్!
హైదరాబాద్: ఏపీ సెక్రటేరియట్ తరలింపునకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వెలగపూడి సచివాలయం నుంచి పనిచేయడానికి ఇక పది రోజులు మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో సచివాలయంలోని అన్ని శాఖలు కంప్యూటర్లు, ఫర్నీచర్ ప్యాకింగ్‌ల్లో నిమగ్నమయ్యాయి. ఈ విషయంలో మున్సిపల్. ఆర్థిక శాఖ ముందంజలో ఉన్నాయి. సచివాలయంలోని మున్సిపల్ శాఖ మంత్రి కార్యాలయంతో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులకు చెందిన కంప్యూటర్లను ఇప్పటికే వెలగపూడికి తరలించేశారు. మరో పక్క కంప్యూటర్లు, ఫర్నీచర్, ఫైళ్ల ప్యాకింగ్‌ను ఆర్థిక శాఖ శుక్రవారమే పూర్తి చేసింది. శని, ఆదివారాల్లో కంప్యూటర్లను వెలగపూడి సచివాలయానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఫర్నీచర్‌తో పాటు కొన్ని రకాల ఫైళ్లను శాఖాధిపతులు కార్యాలయాలున్న ఇబ్రహీంపట్నం తరలించేందుకు ఆర్థిక శాఖ ఏర్పాటు చేసింది. శుక్రవారం ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర కంప్యూటర్లు, ఫర్నీచర్ ప్యాకింగ్ ప్రక్రియను స్వయంగా సెక్షన్లకు వెళ్లి పర్యవేక్షించారు. వెలగపూడిలో ఆర్థిక శాఖకు కేటాయించిన భవనాల్లో ఇంటర్నెట్ కనక్షన్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సచివాలయం నుంచి వెలగపూడి తరలివెళ్లే కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను అక్కడ దింపుకుని, ఎవరి కంప్యూటర్లను వారి స్థానాల్లో అమర్చే బాధ్యతలను ఉద్యోగులకు అప్పగిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెక్షన్లు వారీగా కంప్యూటర్లు వారి వారి స్థానాల్లో అమర్చే బాధ్యతలను ఆయా ఉద్యోగులకు అప్పగించారు. కంప్యూటర్లను, ఫర్నీచర్ ప్యాకింగ్ పూర్తి చేయడంతో ఆర్థిక శాఖకు చెందిన కార్యకలాపాలు శనివారం నుంచి హైదరాబాద్ సచివాలయంలో నిలిచిపోనున్నాయి. మరో పక్క ఉద్యోగులు, అధికారులు శనివారం నుంచి కుటంబాలను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకునేందుకు సెలవులు తీసుకోనున్నారు. ఈ తరలింపునకు ప్రత్యేకంగా సెలవులను పరిగణించనున్నారు. -
పనులన్నీ రోబోలు చేస్తే.. మనమేం చేయాలి?
ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ రేపటి రోజున రోబోలు, కంప్యూటర్లే చేయగలగితే... అప్పుడు మనమేం చేయాలి? రానున్న కాలంలో ఎలాంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి? ఎంతో మందిలో తొలుస్తున్న ప్రశ్న ఇది. ఈ విషయంలో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ దీనిపై కొంత అధ్యయనం చేసింది. మరో యాభై ఏళ్లలో ఈ ప్రపంచం ఎంతగానో మారిపోనుంది. కాలానుగుణంగా ఇప్పుడు మనం చేస్తున్న పనిలో యాభై శాతం పనిని రోబోలు, కంప్యూటర్లే చేస్తాయని అమెరికాలోని ముప్పావుశాతం ప్రజలు నమ్ముతున్నారు. రానున్న కాలంలో ఆటోమేషన్ వల్ల 50 లక్షల ఉద్యోగాలు పోవచ్చని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ‘ఫ్యూచర్ ఫర్ జాబ్స్’ తాజా నివేదికలో పేర్కొంది. అంత మంది ఉద్యోగాలకు ఎసరొస్తే... అప్పుడేం చేయాలి? పయనం ఎటువైపు? దానికి సమాధానమేంటంటే... అప్పటికి కొత్త రంగాలు ఆవిర్భవిస్తాయి. అందులో ఉపాధి అవకాశాలు కొత్తగా వస్తాయి. కానీ ఎంత శాతం కొత్త ఉద్యోగాలు వస్తాయన్నది ప్రస్తుతానికి అంతుచిక్కని ప్రశ్న. అందుకని ఏయే రంగాలు అభివృద్ధి చెందుతాయో ఇప్పటి నుంచే అంచనావేసి ఆ రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం మంచిదని అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్ఎస్) నివేదిక చెబుతోంది. యాభై ఏళ్లలో ఉద్యోగ రంగంలో వచ్చే మార్పుల ప్రభావం ప్రత్యక్షంగా కొన్ని రంగాలపై లేకపోయినప్పటీకీ ఆయా రంగాల వారు కూడా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం మాత్రం తప్పదని ఆ నివేదిక స్పష్టం చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని రకాల ఉద్యోగాలు తెరమరుగైనప్పటికీ కొత్తగా వచ్చే మార్పులకు అనుగుణంగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను వెల్లడించింది. ఆటోమేషన్ కు సంబంధం లేని ఉద్యోగాల్లో అది కూడా నైపుణ్యం బాగా పెంచుకోగలగితే తప్ప భవిష్యత్తు ఉండదని అంచనా. సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న వారు కూడా తమలో నైపుణ్యత మరింత పెరగాల్సిన అవసరం ఉంటుంది. * ఇప్పటి నుంచి 2014 నాటికి సాఫ్ట్ వేర్ డెవలపర్, కంప్యూటర్ సిస్టమ్స్ అనలిస్ట్, మార్కెట్ రీసెర్చ్, మార్కెటింగ్ స్పెషలిస్ట్ జాబ్స్ ఐదింతలు పెరుగుతాయని బీఎల్ఎస్ అంచనావేసింది. * మెడికల్ టెక్నిషియన్స్, ఫిజికల్ థెరపిస్టులు, వర్కప్లేస్ ఎర్గోనమిక్స్ ఎక్స్పర్ట్ జాబ్‌లు గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది. * సేల్స్ అండ్ మార్కెటింగ్ స్పెషలిస్టులు, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ జాబ్‌లు పెరుగుతాయని, పెరుగుదల కనిపించే ఐదు రంగాల్లో ముఖ్యంగా సేల్స్ సంబంధిత ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయని ‘ఫ్యూచర్ జాబ్’ నివేదిక తెలిపింది. ఈ రంగంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ అవసరమవుతాయని, రోబోలు ఈ పనులను చేయలేవు కనుక ఈ రంగంలో ఉద్యోగాలకు కొదవ ఉండదని నివేదిక పేర్కొంది. * వేగంగా మారుతున్న ప్రపంచంలో విద్యా, ఉద్యోగ శిక్షణా కార్యక్రమాలు కూడా ముఖ్యమే. అందుకనే అభివృద్ధి చెందే రంగాల్లో ఈ రంగం ఆరో స్థానంలో నిలిచినట్లు ‘ఫ్యూచర్ జాబ్స్’ నివేదిక తెలిపింది. * మేనేజ్మెంట్ అనలిస్ట్‌లు, అకౌంటెంట్లు, ఆడిటర్లు పురోభివృద్ధి రెండంకెల్లో ఉంటుందని, నేడున్న ఉద్యోగ నైపుణ్యాన్ని 2020 నాటికి మూడింతలు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా ఆ నివేదిక వివరించింది. -
బాలింతల కోసం యాప్స్
కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు - జీవితంలో ఒక భాగమైపోయిన రోజులివి. సినిమా టికెట్ నుంచి బయటకు వెళ్ళడానికి కారు బుక్ చేసుకోవడం దాకా అన్నీ స్మార్ట్ఫోన్లు, వాటిలోని రకరకాల అప్లికేషన్స్ (యాప్స్)తో జరిగిపోతున్నాయి. ఇంటా, బయటా చేతి నిండా పనులతో ఆకాశంలో సగంగా మారిన ఆడవారికి ఉపయోగంగా ఉండడం కోసం చాలా యాప్స్ వచ్చాయి. ముఖ్యంగా, ఒకవైపు ఇంటి పని, మరోవైపు పసిపాప పని చూసుకోవాల్సిన చంటిపిల్లల తల్లులను దృష్టిలో పెట్టుకొని, ప్రత్యేక యాప్స్ కూడా తయారయ్యాయి. అలాంటి వాటిలో కొన్నిటి గురించి... బేబీ ట్రాకర్: క్షణం తీరిక లేకుండా గడిపే బిజీ బిజీ తల్లితండ్రులు తమ కోసం తాము తయారుచేసుకున్న యాప్ - ‘బేబీ ట్రాకర్’. ఈ యాప్ వల్ల చంటిపాప రోజువారీ అలవాట్లు, ఆరోగ్యం, మొదటిసారిగా పాపాయి బోర్లాపడిన సంగతులు అన్నీ నమోదు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఈ యాప్‌లో పాపకు పాలు పట్టిన వేళలు, పొత్తిగుడ్డలు మార్చిన సమయం, నిద్ర అలవాట్ల లాంటివన్నీ నమోదు చేస్తూ, ఫోటోలు కూడా చేర్చడం వల్ల ఉపయోగాలున్నాయి. డాక్టర్ల దగ్గరకు వెళ్ళినప్పుడు, లేదంటే ఆఫీసు వేళల్లో శిశు సంరక్షకుల దగ్గర బిడ్డను కొద్దిగంటలు వదిలివెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ యాప్‌లో నమోదు చేసిన సంగతులన్నీ టైమ్‌కి పనికొస్తాయి. అలాగే, చంటిపాపకు సంబంధించిన ఆ తొలినాళ్ళ తీపి జ్ఞాపకాలన్నీ చుట్టాలకూ పక్కాలకూ చూపించి, ఆనందించవచ్చు. అలాగే, ఈ యాప్‌లో పెట్టుకున్న సమాచారం ద్వారా పసిబిడ్డ అలవాట్లు ఏ వారానికి ఆ వారం, ఏ నెలకు ఆ నెల ఎలా మారుతున్నాయో బాలింతరాలైన అమ్మకు ఇట్టే అర్థమవుతుంది. పెప్పెర్ ట్యాప్: ఇంట్లో చంటిపాపను చూసుకోవాలి, బజారు నుంచి ఇంటికి సామాన్లూ తెచ్చుకోవాలి. ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు లేక ఇబ్బందిపడుతున్నారా? మీ ఇబ్బంది ఇప్పుడు మటుమాయం. ఈ సరికొత్త యాప్ ద్వారా మీకు కావాల్సిన పచారీ కొట్టు సామాన్లన్నీ తెప్పించుకోవచ్చు. మీకు కావాల్సిన టైమ్‌కి, కావాల్సిన చోటుకు సరుకులు వచ్చేలా చూసుకోవచ్చు. ప్లస్స్: ఈ యాప్ సర్వీస్ ద్వారా కావాల్సిన మందులు, పర్సనల్ కేర్ వస్తువులు, బేబీ కేర్ ప్రొడక్ట్‌లు, పెంపుడు జంతువులకు కావాల్సినవి - అన్నీ ఇంటికే తెప్పించుకోవచ్చు. మందుల ప్రిస్క్రిప్షన్‌ను ముందుగా ఈ యాప్ ద్వారా ఫోటో తీసి, ఆర్డర్ చేస్తే చాలు. కావాల్సిన మందులన్నీ ఇంటి ముంగిటకే వచ్చేస్తాయి. మై బేబీ టుడే: చంటిపిల్లలున్న తల్లితండ్రుల కోసం రూపొందించిన ఇన్ఫర్మేటివ్ గైడ్ లాంటిది ఈ ‘మై బేబీ టుడే’ యాప్. శిశువుల పెంపకం, సంరక్షణకు సంబంధించిన సమాచారం ఇందులో ఇస్తారు. చంటిపాపకు చనుబాలు ఇవ్వడం ఎలా, పోతపాలు పట్టడం ఎలా, నిద్రపుచ్చడం ఎలా వగైరా అన్నీ చెబుతారు. అలాగే, చంటిపిల్లల ఫీడింగ్ గైడ్, ఫోటో ఆల్బమ్, చెక్‌లిస్ట్‌లు, గుర్తుపెట్టుకొని వేయించాల్సిన టీకాల గురించి ఇందులో వివరంగా చూపిస్తారు. బేబీ స్లీప్ ఇన్స్టంట్ యాప్: పాలు పట్టడం అయిపోతుంది. పొత్తి గుడ్డలు శుభ్రంగానే ఉంటాయి. కానీ, పాప నిద్రపోకుండా ఏడుస్తుంటుంది. ఇలా చాలాసార్లు జరుగుతుంటుంది. అలాంటి సమయంలో జోలపాడి, నిద్రపుచ్చడానికి ‘బేబీ స్లీప్ ఇన్స్టంట్’ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో తరతరాలుగా మన ముత్తవ్వలు, నాయనమ్మలు పాడుతూ, పసిపాపల్ని నిద్రపుచ్చిన లాలి పాటలు, జోలపాటలు ఉంటాయి. కావాలంటే, మన సొంత జోల పాటలు కూడా ఇందులో రికార్డు చేసుకోవచ్చు. పిల్లల్ని హాయిగా నిద్ర పుచ్చే ఈ లాలిపాటలతో పిల్లల తల్లులకు భలే ఉపయోగం. క్వికీ: ఇంట్లో కొత్త మెంబర్‌గా పసిపాప పుట్టినప్పుడు, ఇవాళ్టి స్మార్ట్‌ఫోన్ యుగంలో ఆ బిడ్డ ఎదిగే ప్రతి క్షణాన్నీ ఫోటో తీయడం చేతిలో పని. మరి బోలెడన్ని ఫోటోలు తరచూ తీస్తూ వెళుతుంటే, వాటిని క్రమపద్ధతిలో పెట్టుకొనేదెలా? ఈ ‘క్వికీ’ యాప్ పెట్టుకొంటే, మంచి ఫోటోల్ని అదే ఎంచుకొని, వాటిని షార్ట్ ఫిల్మ్స్‌గా మార్చుకోవచ్చు. అలాగే, ‘డే వన్ 2’ అనే మరో యాప్ కూడా ఉంది. దాని ద్వారా మీ చిన్నారి జీవితంలోని ఆనంద క్షణాల్ని ఎప్పుడూ మీ గుప్పెట్లోని ఫోన్లో పెట్టుకోవచ్చు. బంధు మిత్రులు చంటిబిడ్డ గురించి ఎప్పుడు అడిగినా, అవి చూపించవచ్చు. ఫోటోలతో పాటు సమయం, సందర్భాలను వివరించే వ్యాఖ్యలు జోడించవచ్చు. కావాల్సిన ఫోటోను వెతుక్కోవడానికి వీలుగా ట్యాగ్లు, కీ వర్డ్స్ కూడా వాటికి చేర్చవచ్చు. ఆ తరువాత ఈ ఎంట్రీలన్నిటినీ పి.డి.ఎఫ్.గా మార్చి, అవసరమైతే పుస్తకంగా కూడా ప్రింట్ చేసి, ఆ తీపి జ్ఞాపకాల్ని అందరితో పంచుకోవచ్చు. -
విద్యార్థులకు హెచ్‌పీ బంపర్ ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : టెక్నాలజీ దిగ్గజం హెచ్‌పీ, విద్యార్థులు సులభపద్ధతిలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను కొనుగోలు చేసేలా రుణసౌకర్యాన్ని కల్పిస్తోంది. 'బ్యాక్ టూ కాలేజ్' కార్యక్రమంలో భాగంగా సులభవాయిదా పద్ధతిలో ఈ వెసులుబాటును అందిస్తోంది. ఈ రుణసౌకర్యంలో విద్యార్థులు ఎటువంటి వడ్డీ చెల్లించాల్సినవసరం ఉండదు. ముందస్తుగా ఎటువంటి చెల్లింపులూ చేయాల్సిన అవసరం లేకుండా.. 6, 9, 12 నెలల వాయిదాల పద్ధతిలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లకు తీసుకున్న రుణాన్ని విద్యార్థులు తిరిగి చెల్లించవచ్చు. సిబిల్ స్కోర్ ఆధారంగా బజాజ్ ఫైనాన్స్ ఈ రుణాన్ని సమకూరుస్తుంది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.11,998 వరకు ప్రయోజనాలను అందుకోవచ్చని... ప్రయోజనాల కింద మూడేళ్ల వరకు వారంటీ, బీమా, బ్లూటూత్ స్పీకర్, హెడ్సెట్, హార్డ్ డిస్క్ వంటివి అందుకోవచ్చని హెచ్‌పీ పేర్కొంటోంది. కంప్యూటర్ కొనుగోలు చేయాలని ఉన్నా డబ్బులు లేక ఎంతో మంది తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఉంటారని, వారికి ఈ రుణ సౌకర్యం ఎంతో ఊరటనిస్తుందని హెచ్‌పీ ఇండియా కన్సూమర్ పర్సనల్ సిస్టమ్స్ కేటగిరీ హెడ్ అనురాగ్ అరోరా తెలిపారు. కమ్యూనికేషన్స్ ప్రతినిధి దినేష్ జోషితో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. లక్ష మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందుతారని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 500ల పైచిలుకు హెచ్‌పీ విక్రయశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. కాగా హెచ్‌పీ పీసీల ప్రారంభ ధర రూ.23 వేలు. -
పాఠశాలలో మూడు కంప్యూటర్లు చోరీ
కాజీపేట : కాజీపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల(డంకెన్‌బాబా)లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి మూడు కంప్యూటర్లను అపహరించినట్లు సీఐ రమేష్‌కుమార్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం పాఠశాలకు తాళం వేసి సిబ్బందితో కలిసి ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో సరస్వతిమాత విగ్రహం పక్కనున్న ఇనుప గ్రిల్ గేట్ తాళంను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు.ప్రత్యేక గదిలో పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన మూడు కంప్యూటర్లను చోరీ చేశారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది తాళం పగులగొట్టి ఉండటంతో ఆందోళనకు గురై వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రధానోపాధ్యాయురాలు కె.పుష్పాంజలి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. క్లూస్‌టీం సీఐ రఘు, ఎస్సైలు భీమేష్, నాగరాజు సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. అనుమానితులను గుర్తించడానికి సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కంప్యూటర్ల విలువ లక్షకుపైగా ఉంటుందని నిందితుల సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
యాపిల్ కు మరో బ్యాడ్ న్యూస్
శాన్ ఫ్రాన్సిస్కో : ఇప్పటికే ఐఫోన్ అమ్మకాల పడిపోయి నిరాశలో ఉన్న యాపిల్ కు మరో బ్యాడ్ న్యూస్. గ్లోబల్ గా యాపిల్ ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ కంప్యూటర్ల అమ్మకాలు పడిపోయాయట. గతేడాదితో పోలిస్తే 2016 రెండో త్రైమాసికంలో మ్యాక్ కంప్యూటర్ల అమ్మకాలు 4 నుంచి 8శాతం క్షీణించాయని రీసెర్చ్ సంస్థలు వెల్లడించాయి. అదేవిధంగా యాపిల్ మేజర్ ప్రత్యర్థులు మాత్రం పీసీ వ్యాపారాల్లో వృద్ధిని బాగానే నమోదుచేశాయని తెలిపాయి. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ల జోరుతో పీసీ మార్కెట్ పడిపోతున్నప్పటికీ, 2014-15 కాలంలో యాపిల్ తన మ్యాక్ కంప్యూటర్ అమ్మకాలను స్థిరమైన పెరుగుదలను సాధిస్తూ మార్కెట్ ను ఎంజాయ్ చేసింది. కానీ గతేడాది చివరి నుంచి మ్యాక్ యూనిట్ల అమ్మకాలు తిరోగమనంలో పడిపోయాయి. ఈ విషయాన్ని యాపిల్ ఇంకే స్వయంగా తన రిపోర్టులో పేర్కొంది. జూన్ త్రైమాసికం ముగింపు వరకు మ్యాక్ అమ్మకాలు 44లక్షల నుంచి 46 లక్షల వరకు పడిపోయాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ గా స్మార్ట్ ఫోన్, గాడ్జెట్ ల జోరుతో, పీసీ వ్యాపారాలు గత నాలుగేళ్లుగా పతనమవుతూ వస్తున్నాయి. గ్లోబల్ గా గత త్రైమాసికంలో పీసీల సరుకు రవాణా 624 లక్షల వరకు పడిపోయింది. ఈ పతనం గతేడాదితో పోలిస్తే 4.5శాతం అధికమని ఇంటర్ నేషనల్ డేటా కార్పొరేషన్ విశ్లేషకులు పేర్కొన్నారు. పీసీ తయారీ దిగ్గజంగా ఉన్న లెనోవా కూడా తన సరుకు రవాణాను 2శాతం కోల్పోయింది. అయితే హెచ్ పీ, డెల్, ఏస్ యూఎస్ మాత్రం గత త్రైమాసికంలో తమ సరుకు రవాణా వృద్ధిని పెంచుకున్నాయని రీసెర్చ్ సంస్థలు వెల్లడించాయి. ఆరోగ్యకరమైన అమెరికా మార్కెట్, గూగుల్ క్రోమ్ సాప్ట్ వేర్ తో నడిచే కొత్త ల్యాప్ టాప్ లపై వినియోగదారుల ఆసక్తి, సీజనల్ కొనుగోలులు వాటి పీసీ మార్కెట్ల వృద్దికి దోహదం చేశాయని వెల్లడించాయి. ఎనిమిది వరుస త్రైమాసికాల్లో మ్యాక్ కంప్యూటర్ల జోరును కొనసాగించిన యాపిల్ కు, ఐఫోన్ల దెబ్బ, పీసీ ల దెబ్బ రెండూ తలనొప్పులుగా మారుతున్నాయి. -
మానవతను పెంపొందించే పరిజ్ఞానం అవసరం
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల శాన్ఫ్రాన్సిస్కో: మానవతను పెంపొందించే గౌరవప్రదమైన పరిజ్ఞానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ యాన్యువల్ బిల్డ్ 2016 కాన్ఫరెన్స్ బుధవారం ఇక్కడ జరిగింది. ఇందులో వేలాదిమంది డెవలపర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో కంప్యూటర్లు మనిషి భాషలను నేర్వగలవని, మనుషులతో మాట్లాడగలవని అన్నారు. అయితే మనిషికి వ్యతిరేకంగా నిలిచే కంప్యూటర్లను కాకుండా మనిషితో పనిచేసే కంప్యూటర్లను తయారుచేయాలని అన్నారు. మనిషి సామర్థ్యాలను, అనుభవాన్ని మరింత పెంపొందించే పరిజ్ఞానాన్ని రూపొందించాలన్నారు. డెవలపర్లంతా తమ మేధస్సును ఉపయోగించి అప్లికేషన్లు రూపొందించాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఇది సమాజ పురోగమనానికి తోడ్పడుతుందన్నారు. -
1,00,000 టన్నులు
మరో ఐదేళ్లలో ఏటా పేరుకుపోనున్న ఈ-వ్యర్థాలు ఐటీ రంగంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మహానగరం.. అంతే మొత్తంలో ఈ-వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే డ్రైనేజీ, కాలుష్యం, నీటి ఎద్దడితో సతమతమవుతున్న భాగ్యనగరికి ఈ-సమస్య గుదిబండలా మారింది. ఐటీ ఆధారిత పరిశ్రమలు, కంప్యూటర్లు, గృహోపకరణాలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు భాగ్యనగరాన్ని ఈ-వేస్ట్‌కు అడ్డాగా మార్చేస్తున్నాయి. ఈ వ్యర్థాల ఉత్పత్తిలో దేశంలోనే ముంబై అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ, బెంగళూర్, చెన్నై తర్వాత ఐదో స్థానంలో మన మహానగరమే నిలవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 12.5 లక్షల టన్నుల ఈ-వేస్ట్ పోగవుతుండగా.. గ్రేటర్లో 45 వేల టన్నులు పేరుకుపోతోంది. ఇందులో సుమారు 55 శాతం పర్యావరణానికి హాని కలిగించేవి ఉన్నాయని, సాధారణ చెత్తతో పాటే వీటినీ పడేస్తుండడంతో అనర్థాలు జరుగుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో ఐదేళ్లలో నగరంలో ఈ-వ్యర్థాలు ఏటా లక్ష టన్నులు పోగయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నగరంలో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు విరివిగా వినియోగిస్తున్న ఇళ్ల నుంచి ఏటా సగటున 5 కిలోల ఈ-వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయని ‘గైడ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. సిటీలో టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ప్రింటర్లకు సంబంధించి ఏటా 12 వేల టన్నుల వ్యర్థాలు విడుదలవుతుండగా.. టెలిఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్లు.. తదితర ఈ-వ్యర్థాలు మరో 33 వేల టన్నులు ఉత్పత్తవుతున్నాయి. - సాక్షి, సిటీబ్యూరో -
మెసేజ్‌ల స్టోరేజీ తప్పనిసరి
కొత్త ముసాయిదాలో కేంద్రం సూచన న్యూఢిల్లీ: మొబైల్, కంప్యూటర్ల ద్వారా సందేశాలను పంపే వినియోగదారులు, సంస్థలు తప్పనిసరిగా 90 రోజులపాటు ఆ సందేశాలను నిక్షిప్తంచేయాలంటూ కొత్తగా సిద్ధంచేసిన ‘సంకేత నిక్షిప్త సందేశాల పాలసీ’ ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది. కొత్త ముసాయిదా ప్రకారం... వాట్సప్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేదా మరే ఇతర సేవల ద్వారా మొబైల్, కంప్యూటర్లో వచ్చే సందేశాలను మూల వాక్యాల రూపం(ప్లేన్ టెక్ట్స్ ఫార్మాట్)లో దాచి ఉంచాలి. పరిశీలన, అధ్యయనం నిమిత్తం భద్రతా సంస్థలు అడిగినపుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. నిక్షిప్తం చేయడంలోగానీ, అందివ్వడంలోగానీ విఫలమైతే చట్టపరంగా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. సంకేత నిక్షిప్త సందేశాల సాధనాలను ఆపరేటర్లు ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు, పౌరులు తమ అధికార, అనధికార సమాచారాన్ని మొత్తం అందివ్వాల్సి ఉంటుంది. చట్టబద్ధ సంస్థలు, కార్యనిర్వాహక సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలను ‘బి’ కేటగిరీగా విభజించారు. పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులను ‘సి’ కేటగిరీగా విభజించారు. ఈ కేటగరీల్లోని వారంతా మెసేజ్‌లు పంపిన రోజు నుంచి 90 రోజులపాటు వాటిని భద్రపరచాలి. విదేశాల్లో ఉండే వారితో, సంస్థలతో జరిపిన సంప్రదింపుల సందేశాలనూ అందివ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న వారిదే. వాట్సప్, వైబర్, లైన్, గూగుల్ చాట్, యాహూ మెసెంజర్ ఇలా అధునాతన మెసేజింగ్ సర్వీసుల్లో అత్యంత స్థాయి భద్రతతో సంకేత సందేశాలు నిక్షిప్తంచేస్తారు. ఇలాంటి వాటిలోని సమాచారాన్ని సేకరించడం భద్రతా సంస్థలకు కష్టంగా మారడంతో కొత్తగా ఈ తరహా పాలసీని తెస్తున్నారు. అసలు గోప్యత అనేదే లేకుండా తెస్తున్న ఈ పాలసీపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ వారు తయారుచేసిన ఈ ముసాయిదాపై ప్రజలు తమ అభిప్రాయాలను అక్టోబర్ 15లోగా కేంద్రానికి తెలపాల్సి ఉంటుంది. -
రీచ్‌ల్లో చెల్లెమ్మల వాటా చిల్లరే!
టీడీపీ ప్రభుత్వం చెబుతున్నదొకటి... చేస్తున్నదొకటి... ఇసుక రీచ్‌ల వ్యవహారం చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. పొదుపు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఇసుక రీచ్‌లు వారికి కేటాయించామని సీఎం ఘనంగా ప్రకటనలిచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ‘సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్నట్లుగా ఉంది. రీచ్‌ల వద్ద పొదుపుసభ్యుల కష్టపడుతోంటే ఆదాయం మాత్రం ప్రభుత్వానికి వెళ్తోంది. సైదాపురం: మండలంలోని తూర్పుపూండ్ల గ్రామ సమీపంలో ఉన్న కైవల్యానది రీచ్‌లో ఎనిమిది నెలల కాలంలో సుమారు 16,816 క్యూబిక్ మీటర్లు ఇసుకను తవ్వి విక్రయించారు. ఒక క్యూబిక్ మీటరు రూ.600 వంతున 16,816 క్యూబిక్ మీటర్లకు రూ.కోటి 60వేల వరకు ప్రభుత్వానికి రాబడి వచ్చింది. రీచ్ వద్ద పనిచేసే కంప్యూటరు అపరేటర్‌కు నెలకు రూ.4,500, అకౌంటెంట్‌కు రూ.4,500, రీచ్ ఇన్చార్జ్కు రూ.4,500 ఇవ్వాలని నిర్ణయించారు. ఎనిమిది నెలలకు ప్రభుత్వం ముగ్గురు ఉద్యోగులకు రూ.1.8లక్షలు ఇచ్చారు. అయితే రీచ్‌లు పర్యవేక్షణ చేసిన పొదుపు మహిళలకు రోజుకు కేవలం రూ.100 ఇచ్చారు. ఇలా ఎనిమిది నెలలకు వీరికి ప్రభుత్వం రూ.96 వేల అందించింది. వెట్టిచాకిరే... తూర్పుపూండ్లలో 45 పొదుపు సంఘాలున్నాయి. వాటిలోని 12 మంది సభ్యులను మాత్రమే ఇసుక రీచ్‌ను పర్యవే క్షణ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది .ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఉన్నందుకు వారికి దక్కింది కేవలం రూ.100. బయట పనులకు వెళ్తే వారికి రూ.300 వస్తోంది. ఇలా మహిళల చేత ప్రభుత్వం వెట్టిచాకి రి చేయించుకుంది. దక్కింది రూ.56 మాత్రమే.. రీచ్ ప్రారంభమయ్యాక ఇన్సెంటివ్ పేరుతో రూ.50,350ను ప్రభుత్వం విడుదల చేసింది. వాటిలో నిర్వహణకు రూ. 25 వేలు వెచ్చించారు. మిగిలిన రూ.25,350ను పొదుపు సంఘాల మహిళలు పంచుకోవాలని చెప్పారు. గ్రామంలోని 45 పొదుపు సంఘాల్లో సుమారు 450 మంది సభ్యులున్నారు. ఆ డబ్బును వాళ్లు పంచుకోగా ఒక్కొక్కరికీ రూ.56 మాత్రమే వచ్చింది. ఇసుక రీచ్ వల్ల ప్రభుత్వానికి రూ. ఒక కోటి 60 వేలు వచ్చింది. సుమారు రూ.10,12,350లను ఖర్చుచేశారు. మిగిలిన రూ.89,87,650లు ప్రభుత్వ ఖజానాకు జమైంది. రీచ్‌ల ద్వారా పొదుపు మహిళలకు ఎంతో చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం రూ. 56 మాత్రమే ఇస్తుండటంతో సదరు మహిళలు విస్తుపోతున్నారు. వంద రూపాయలే ఇస్తున్నారు: ఇసుకరీచ్ వద్ద పనిచేస్తున్నాం. రోజుకు వంద రూపాయల వంతున నెలకు ఒక్కసారి ఇస్తున్నారు. ఉదయం 6 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తున్నాం. ఊళ్లో పని కావడంతో ఆపనికి వెళ్లుతున్నాం.-ముత్తూకూరు వెంకటరత్నమ్మ కష్టం ఎక్కువ.. వచ్చేది తక్కువ ఇసుక రీచ్ వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటున్నాం. మాకు వందరూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అదనంగా మరో వందరూపాయలు ఇస్తే చాలు. అన్ని పనులు చూసుకుంటాం.-తక్కెళ్ల అంకమ్మ -
కంప్యూటర్ విద్య.. మిథ్యే!
విడవలూరు: పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందే పరిస్థితి కనిపించడం లేదు. మారుమూల గ్రామాల్లో విద్యనభ్యసిస్తున్న పిల్లలకు కంప్యూటర్‌పై కనీస అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న కంప్యూటర్ విద్యా మిధ్యాగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో 5,000 స్కూల్, ,1300 స్కూల్ పథకాలు కింద కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించే విధంగా ఒక్కొక్క పాఠశాలకు ఇద్దరు చొప్పున ఫ్యాకల్టీలను నియమించారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మరణాంతరం రాష్ట్రంలో కంప్యూటర్ విద్య అటకెక్కింది. మన జిల్లాలో 2008లో 5,000 స్కూల్ పథకం కింద, 2009లో 1,300 స్కూల్ పథకం కింద సుమారు 250 ప్రభుత్వ పాఠశాల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. వీటిలో నిట్ ద్వారా ప్రభుత్వం కంప్యూటర్ విద్యను అమలుచేస్తుంది. నిట్ ద్వారా ఒక్కొక్క పాఠశాలలో 10 అధునాతన కంప్యూటర్లు, వాటికి సంబంధించి టేబుల్స్, కుర్చీలను అందించారు. పాఠశాలకు ఇద్దరు చొప్పున ప్యాకల్టీ(ఉపాధ్యాయులు)లను ఏర్పాటు చేశారు. అయితే 5,000 స్కూల్ పథకం కింద ప్యాకల్టీలు కుదుర్చుకున్న ఒప్పందం గతేడాదితో పూర్తయ్యంది. దీంతో జిల్లాలోని 200 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య విద్యార్థులకు దూరమైంది. ఈ కారణంగా ఆయా పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆ పాఠశాల్లోనే ఉన్న ఉపాధ్యాయులే కంప్యూటర్ తరగతులను కూడా నిర్వహించాల్సి వచ్చింది. అయితే వారికి ఈ కంప్యూటర్ విద్యపై అవగాహన లేకపోవటంతో పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్లు మూలనపడ్డాయి. రూ. 500 కోట్లు వృథా.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం సుమారు రూ.500 కోట్లతో ఈ పథకాన్ని అమలుపరచింది. ప్రస్తుతం అది అటకెక్కడంతో దాదాపు ఆ నిధులు వృథా కానున్నాయి. ఒక్కొక్క పాఠశాలకు రూ.2 లక్షలు విలువ చేసే కంప్యూటర్లు వాటి సంబంధిత పరికరాలు, జనరేటర్‌తో పాటు ఒక ఫ్యాకల్టీకి నెలకు రూ.2,600 వేతనాన్ని అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం కంప్యూటర్ విద్య నడుస్తున్న పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్యాకల్టీలకు ఇప్పటికి 4 నెలలు జీతాలు అందలేదు. దీంతో వారు అవస్థలు పడుతున్నారు. నేటితో ముగిసిన ఒప్పందం కాగా జిల్లాలో 1,300 స్కూల్ పథకం ఉన్న సుమారు 23 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య నడుస్తోంది. అయితే ఇవి కూడా జులై 4 వరకు మాత్రమే నడవనున్నాయి. తర్వాత నిట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పదం రద్దుకానుంది. దీంతో జిల్లా మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ఇక మిధ్యగా మారనుంది. ఇప్పటికే చాలా పాఠశాలల్లో కంప్యూటర్లు మరమ్మతులకు గురైతే మాత్రం వాటిని పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఇప్పటికైన పాఠశాలల్లో కంప్యూటర్ విద్య నిర్వహణను చేపట్టిన సంబంధిత సంస్థ వారు కంప్యూటర్లను సకాలంలో విద్యార్థులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి. -
పాఠశాలలకు రక్షణ కరువు!
ఘట్కేసర్ టౌన్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్న సర్కారు వాటి రక్షణకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. నాలుగు రోజుల్లో బడులకు సెలవులు రానున్న నేపథ్యంలో కోట్లాది రూపాయలను ఖర్చుచేసి అందజేసిన విలువైన కంప్యూటర్లు, ఇతర సామాగ్రి రక్షణ గురించి ఇసుమంత కూడా ప్రభుత్వం ఆలోచించకపోవడంతో వాటి రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2500లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 423 ఉన్నత పాఠశాలలుండగా 270 సక్సెస్ పాఠశాలలున్నాయి. ఇందులో లక్షలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా సుమారుగా 40 పాఠశాలల్లో మాత్రమే రాత్రి కాపలాదారులు ఉన్నారు. గాలికొదిలేసిన సర్కారు.. జిల్లాలోని ఒక్కొక్క సక్సెస్ పాఠశాలకు 10 నుంచి 12 వరకు కంప్యూటర్లు, వాటి నిర్వాహణకు అవసరమైన కుర్చీలు, టేబుళ్లతో కలిపి కోట్లాది రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రభుత్వం సమకూర్చింది. సక్సెస్ పాఠశాలలకే కాకుండా ఇతర పాఠశాలల్లో కూడా కంప్యూటర్లు, ఇతర విలువైన ఫర్నీచర్ ఉన్నాయి. మధ్యాహ్నభోజన పథకం ప్రారంభం అయ్యాక బియ్యం, వంట సామాగ్రి ఇతర వస్తువులకు రక్షణ లేకుండా పోతోంది. దీంతో జిల్లాలో అనేక చోరీ సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా పట్టణంలోని బాలుర పాఠశాలలో శుక్రవారం రాత్రి ఆటల గది తలుపులు విరగ్గొట్టి పలు ఆట వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇన్ని ఆస్తులున్నా పాఠశాలలను కాపాడడానికి కాపలాదారుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కాపలాదారులు లేని కారణంగానే ఏటా జిల్లావ్యాప్తంగా లక్షల రూపాయలను విద్యాశాఖ నష్టపోతోందని తెలుస్తోంది. గతంలో జిల్లాలోని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగులుండేవారు. దశాబ్ద కాలానికి పైగా జిల్లాలో కింది స్థాయి ఉద్యోగుల భర్తీపై సర్కారు సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించిన అనంతరం గద్దెనెక్కిన నూతన సర్కారు, విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా ఇప్పటివరకు దీనిపై దృష్ట సారించలేదు. వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. రక్షణ లేకుండా పోతోంది... సర్కారు బడులకు రక్షణ లేకుండా పోతోంది. గతంలోను మా పాఠశాలలో తలుపులు విరగ్గొట్టి ఫ్యాన్లు, బెంచీలను విరగ్గొట్టారు. తాజాగా శుక్రవారం రాత్రి ఆటల గది డోర్‌ను విరగ్గొట్టి ఆట వస్తువులను దొంగిలించారు. గతంలో విరగ్గొట్టిన డోర్లు బాగు చేయించాం, కొత్త తాళాలను కొనుగోలు చేశాం. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ప్రభుత్వం పాఠశాలల రక్షణపై దృష్టి సారించి కాపలాదారుల నియామకానికి కృషి చేయాలి. -వినోద్‌కుమార్, ఫిజికల్ డెరైక్టర్, జెడ్పీ బాలుర పాఠశాల ఇన్చార్జి ఘట్‌కేసర్‌టౌన్ -
స్కూల్లో కంప్యూటర్లు చోరీ
కృష్ణా: ప్రభుత్వ పాఠశాలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాలు... తిరువూరు మండలంలోని మునుకుళ్ల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని ఎత్తుకెళ్లారు. ప్రధానోపాధ్యాయాయుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (తిరువూరు) -
ఉండీ..లేనట్టే
బోట్‌క్లబ్ (కాకినాడ) :లక్ష్యం మంచిదే అయినా అమలులో చిత్తశుద్ధి లోపించి ఈ-పంచాయతీ పథకం అటకెక్కింది. గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల సర్టిఫికెట్ల జారీని పారదర్శకంగా చేయాలనే సంకల్పంతో లక్షల రూపాయల వ్యయంతో ప్రవేశపెట్టిన ఈ పథకం కంప్యూటర్లు మూలనపడ్డాయి. పంచాయతీల్లో జనన, మరణ ధృవపత్రాలు సకాలంలో అందించాలని ఆరు నెలల క్రితం ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అన్ని పంచాయతీలకూ కంప్యూటర్లు, స్కానర్లు అందించిన అధికారులు కొన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించలేదు. ఫలితంగా కంప్యూటర్ ఆపరేటర్లు చేసే పనిలేక గోళ్లు గిల్లుకుంటున్నారు. పంచాయతీల ద్వారా ధృవపత్రాలు జారీకి కావల్సిన సాఫ్ట్వేర్ ఇంతవరకూ రూపొందించకపోవడం పథకంపై యంత్రాంగానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. ఒక్కో పంచాయతీకి రూ.లక్ష వెచ్చించి కంప్యూటర్, స్కానర్, ప్రింటర్, జిరాక్స్, యూపీఎస్ వంటి సౌకర్యాలు కల్పించారు. ఇవన్నీ ఉన్నా బ్రాడ్‌బ్రాండ్ లేకపోవడంతో కంప్యూటర్లకు పని లేక మూలనపడ్డాయి. బాడ్ బ్రాండ్ ఇక్కట్లు... సాంకేతిక పరిజ్ఙానం ద్వారా ప్రజలకు మేలైన పాలన అందించాలనే ఉద్దేశంతో గత జూన్‌లో ఈ- పంచాయతీని ప్రారంభించారు. జిల్లాలో వెయ్యికి పైగా పంచాయతీలుండగా వాటిని క్లస్టర్లుగా మార్చి, 729 పంచాయతీలుగా విభజించారు. ప్రాథమికంగా 549 పంచాయతీల్లో ఈ-పంచాయతీని అమలు చేశారు. వీటిలో 363 పంచాయతీలకు బీఎస్ఎన్ఎల్ నెట్ కనెక్షన్ అందచేశారు. మిగిలిన వాటికి ఆ కనెక్షన్ ఇవ్వకపోవడంతో కంప్యూటర్లు మూలన పడ్డాయి. వీటి నిర్వహణ కార్వే అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించగా గత జూన్ నుంచి నెలకు రూ.7000 చొప్పున వేతనంతో ఆపరేటర్లను నియమించారు. అప్పటి నుంచి వారు వేతనాలు పొందుతున్నారే తప్ప చేసే పనిలేక ఖాళీగా ఉంటున్నారు. ఈ-పంచాయితీకు ఇంటర్నెట్ బ్రాడ్ బ్రాండ్ సౌకర్యం అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకున్నా క్షేత్రస్థాయిలో ఇబ్బందులతో ఇవ్వలేకపోతోంది. కొన్ని చోట్ల లైన్లు లేకపోవడంతో ఇంటర్నెట్ సౌకర్యం ఇవ్వలేకపోతున్నామని, ఇందులో తమ తప్పేమీ లేదని బీఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు. సామర్లకోట మండలం చంద్రంపాలెం, ఉండూరు పంచాయితీలకు కంప్యూటర్లు సమకూర్చినా.. నెట్ సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. ఆ ప్రాంతాలకు లైన్లు వేయడానికి రైల్వే ట్రాక్ అడ్డురావడంతో బీఎస్ఎన్ఎల్ చేతులెత్తేసింది. ధృవీకరణ పత్రాల సాఫ్ట్వేర్ ఏదీ? ఈ-పంచాయతీల నిర్వహణకు పంచాయతీరాజ్‌శాఖ ఇనిస్టిట్యూట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ సమకూర్చింది. పంచాయతీల్లో నిర్వహణ, జమా ఖర్చులు, బిల్లుల వంటివి కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. దీని ద్వారా ఏ పంచాయతీలకు ఏ పనికి ఎంత బిల్లు చెల్లించాలో ఆన్లైన్ ద్వారా తెలుస్తుంది. ఈ-పంచాయతీల ద్వారా జనన, మరణ పత్రాలు, ఆస్తి విలువలు, ఆస్తిపన్ను, ఇంటి పన్ను వసూలు వంటి వివరాలన్నీ నమోదు చేయాలి. నాలుగు నెలలు దాటినా ఈ తరహా సేవలు జిల్లాలో ఎక్కడా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
‘ఒకేషనల్’.. సమస్యలు ఫుల్
తొగుట :మండలంలోని రాంపూర్ శివారులో ఏర్పాటు చేసిన మోడల్ ఒకేషనల్, జూనియల్ కళాశాల (ఒకేషనల్) కళాశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఈ కళాశాలల్లో 285 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 58 మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్సీ), స్పెక్టరు క్వైరీ ల్యాంగ్వేజీ (ఎస్‌క్యూఎల్) కోర్సులను చదువుతున్నారు. వీరు పరీక్షల్లో పాస్ కావాలంటే 100 మార్కులకు గాను 50 మార్కులు ప్రాక్టికల్స్‌కు, మరో 50 మార్కులు థియరీకి కేటాయించారు. ఈ రెండు కోర్సులను చేసిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు దొక్కపోయినా ప్రైవేటు ఉద్యోగాల్లోనైనా స్థిరపడవచ్చు. ఈ రెండు కోర్సుల్లో విద్యార్థులకు రోజుకు సుమారు గంట పాటు కంప్యూటర్లో ప్రాక్టికల్స్‌ను చేయాల్సి ఉంటుంది. కానీ ఒకేషనల్ కోర్సుల్లో సీఎస్సీ, ఎస్‌క్యూఎల్ చదివే విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లను మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో గతేడాది (అప్పటి ఎమ్మెల్యే) ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి ఎలాగోలా విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానానికి దూరం కావద్దని భావించి దాతల సాయంతో 8 కంప్యూటర్లు సమకూర్చారు. కానీ అవి పాతమోడల్ కావడంతో మాటిమాటికి మరమ్మతులకు గురి అవుతుండడంతో చాలా కంప్యూటర్లు మూలనపడ్డాయి. ఈక్రమంలో ఒకే కంప్యూటర్‌పై ఒకానొక సందర్భాల్లో 5 నుంచి 10 మంది విద్యార్థులచే ప్రాక్టికల్స్‌ను చేయించాల్సి పరిస్థితులు నెలకొంది. ముఖ్యంగా కళాశాలకు నెట్ కనెక్షన్ సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ కాకుండా ఫ్యాకెల్టీలు పడరాని పాట్లు పడుతున్నారు. కాగా కంప్యూటర్లు పాతవి కావడంతో విద్యార్థులచే ప్రాక్టికల్స్‌ను పూర్తి స్థాయిలో చేయించలేపోతున్నామని కళాశాల ప్రిన్సిపాల్ సలీం పేర్కొన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి కళాశాలకు నూతన కంప్యూటర్లు, నెట్ కనెక్షన్ సదుపాయాలను కల్పించాలని లెక్చరర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
వాట్ ఎన్ ఐడియా!
పాఠశాలలో కంప్యూటర్లు చోరీ ‘ఆధార్’ వెలిముద్ర లతో పట్టుకుంటామని దండోరా భయంతో కంప్యూటర్లను పాఠశాలలో ఉంచిన దొంగలు లింగంపేట : దొంగిలించిన కంప్యూటర్లను ఎలా రప్పించాలనీ ఆలోచించారు మండలంలోని మెంగారం గ్రామస్తులు. ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగా వేలిముద్రలనుసేకరించి దొంగతనాన్ని బయట పె డతామనీ పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ కుంటరాజు దండోరా వేయించడంతో భయపడ్డ దొం గలు తాము దొంగిలించిన కంప్యూటర్లను తిరిగి పాఠశాలలో వదిలిపెట్టి వెళ్లిన ఘటన గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ఈనెల 3న గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల తరగతి గది తాళం పగుల గొట్టి నాలుగు కంప్యూటర్లను, ఒక సీపీఎస్‌ను, స్పీకర్బాక్స్లను దొంగిలించారు. 4వ తేదీన పాఠశాల తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు పాఠశాలలో కంప్యూటర్లు చోరీకి గురైన విషయాన్ని ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందించారు. ఎస్ఎంసీ చైర్మన్‌తో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. అంతటితో ఆగకుండా చైర్మన్ రాజు గ్రామస్తులతో చర్చిం చారు. దొంగతనం జరిగినందున తలుపులు,కంప్యూటర్ డెస్క్‌లపై గల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. మరి ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగా గ్రామస్తులందరి వేలిముద్రలను సేకరిస్తామనీ, దాంతో కంప్యూటర్లు దొంగిలించిన వ్యక్తులను ఈజీ గా పట్టుకోవచ్చని భావించి ఈనెల 6న రాత్రి గ్రామంలో దండోరా వేయించారు. దాంతో భయాం దోళనకు గురై కంప్యూటర్ల చోరీకి పాల్పడిన వారు వాటిని పాఠశాల ఆవరణలో పెట్టివెళ్లిపోయారు. నాలుగు కంప్యూటర్లు చోరీకి గురికాగా దొంగలు మూడు కంప్యూటర్లను మాత్రమే పాఠశాలలో పెట్టారు. మరో కంప్యూటర్, సీపీఎస్,స్పీకర్ బాక్స్‌లు దొంగల వద్దనే ఉన్నాయి. పాఠశాలలో కంప్యూటర్లు ఉన్నట్లు గమనించిన ఓ రైతు విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకున్నా రు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
జోరుగా జీరో
అనధికారికంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల విక్రయం ఏటా రూ.10 కోట్ల పన్ను ఎగవేత నిద్రావస్థలో వాణిజ్యపన్నుల శాఖ విజయవాడ : జిల్లాలోని పలు పట్టణాల్లో కుప్పలు తెప్పలుగా అనధికారికంగా కంప్యూటర్ల అమ్మకాలు సాగుతున్నాయి. ఇళ్లల్లో, అపార్టుమెంట్లలో కంప్యూటర్లు అసెంబ్లింగ్ చేసి కోట్లలో జీరో వ్యాపారం చేస్తున్నారు. సంవత్సర కాలంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల విక్రయం ముమ్మరమైంది. వ్యాపారులు జీరో వ్యాపారం చేసి ఏటా రూ. 10 కోట్ల వరకు ప్రభుత్వానికి పన్ను ఎగనామం పెడుతున్నారు. కస్టమర్లు బిల్లు కావాలంటే ఒక రేటు, అక్కర్లేదంటే మరో రేటుకు కంప్యూటర్లు అమ్ముతున్నారు. విషయాలన్నీ తెలిసినా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరానికి రూ.వంద కోట్ల విలువైన కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు జీరో వ్యాపారంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గానూ ఐదు శాతం వ్యాట్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఏడాదికి రూ.10 కోట్లపైనే ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న జీరో వ్యాపారం లాభసాటిగా ఉండడంతో నగరంలో కంప్యూటర్లు విక్రయించే డీలర్ల సంఖ్య గ ణనీయంగా పెరుగుతోంది. వాడవాడలా కంప్యూటర్ల అమ్మకాలు సాగుతున్నాయి. అత్యధిక శాతం మంది అనామతుగా ఈ వ్యాపారాన్ని సాగించేస్తున్నారు. రైల్వేపార్శిల్, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుల ద్వారా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు బిల్లులు లేకుండా వచ్చేస్తున్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల నుంచి యథేచ్ఛగా కంప్యూటర్ల స్పేర్స్ దిగుమతి అవుతున్నాయి. ఇళ్లలో, అపార్టు మెంట్లలో అక్రమంగా నిల్వచేసి, అసెంబ్లింగ్ చేస్తున్నారు. చెలరేగిపోతున్న డీలర్లు... ఇటీవల కాలంలో జిల్లాలో ఈ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అన్ని రంగాల్లో కంప్యూటర్ల వాడకం పెరగటంతో లక్షలాది మంది కొనుగోలు చేస్తున్నారు. డీలర్లలో కొందరు జీరో వ్యాపారం చేస్తుండగా, మరి కొందరు నామమాత్రంగా పన్ను చెల్లిస్తున్నారు. ఈ తరహా వ్యాపారం చేసే వారు ఎందరున్నారు? నెలకు ఎంత మొత్తం అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం వాణిజ్యపన్నుల శాఖ అధికారుల వద్ద లేకపోవటం గమనార్హం. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం... కంప్యూటర్ల జీరో వ్యాపారం విషయమై వాణిజ్యపన్నుల శాఖ -2డివిజన్ డెప్యూటీ కమిషనర్ ఎస్. శేఖర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. త్వరలోనే స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని చెప్పారు. దొంగ రవాణాను అరికట్టేందుకు పలు చోట్ల తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. అమ్మకాలు సాగిస్తూ పట్టుపడినవారి నుంచి భారీగా జరిమానా వసూలు చేస్తామని ఆయన హెచ్చరించారు. -
కలెక్టరేట్లో భద్రత కరువు!
ప్రగతినగర్: నిత్యం కలెక్టరేట్లో, ప్రాంగణంలో ఏదో ఒక చోరీ, లేదా ఒక సమస్య ఉత్పన్నమవడం సర్వసాధారణమైంది. కనీసం తమ సమస్యలను చెప్పుకుందామని అక్కడి పోలీసులను ఆశ్రయించినా బాధితులకు న్యాయం జరగడంలేదు. మొత్తం మీద కలెక్టరేట్ ప్రాంతంలో ఉద్యోగులు అభద్రతా భావంతో మెలుగుతున్నారు. గంటకోసారి టీ తాగుదామనే వంకతో బయటకు వచ్చి బైక్‌లను చూసుకుంటున్నారు. హమ్మయ్యా..! బైక్ ఉందిరా బాబు అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే బైక్‌లే కాకుండా కంప్యూటర్లు కూడా మాయమైపోతున్నాయి.రాత్రి కల్లా కనబడ్డ కంప్యూట ర్ పొద్దున్నకల్లా మాయమైపోతోంది. దీంతో ఉద్యోగులు కలెక్టరేట్లో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టరేట్లోని అన్ని శాఖల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తే, ఈ బాధ ఉండదని, దొంగిలించిన వారిని పోలీసులు పట్టుకోవచ్చని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. మూత్రశాలలు లేక ఇబ్బందులు కలెక్టరేట్లో మూత్రశాలలు లేక ఉద్యోగులతో పాటు సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీటి వసతి కూడా లేదు. హౌసింగ్ కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసిన ఫ్రిజ్ చెడిపోవడంతో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కలెక్టరేట్లోని పలు కార్యాలయ గోడల్లో నుంచి మొక్కలు మొలవడంతో గోడలన్నీ పగుళ్లు ఏర్పడి బీటలు వారాయి. హౌసింగ్ కార్పొరేషన్లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేసే వెంకటేష్ ఆదరబాదరాగా కలెక్టరేట్‌కు బైక్‌పై వచ్చాడు. వచ్చిరాగానే అక్షరభవన్లో ఉన్నా హౌసింగ్ కార్యాలయంలో తన పైఅధికారులను కలవడానికి వెళ్లాడు. వారితో మాట్లాడి కిందికి వచ్చే చూసుకునే సరికి తాను మూడునెలల క్రితం జీతం పొగేసి కొనుకున్న కొత్త గ్లామర్ బైక్ కనబడలేదు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఆనంద్ కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణికి హాజరయ్యాడు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళదామనుకొని బైక్ దగ్గరికి వచ్చేసరికి బైక్ మాయమైంది. ఆధార్ సీడింగ్ చేయడానికి ఓ ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ స్థానిక రెవెన్యూ భవన్ ముందు బైక్ పెట్టి బంగ్లాపైకి వెళ్ళాడు. రోజు మాదిరిగానేపని ముగిసి న అనంతరం కిందికి వచ్చి చూడగా తన బైక్ కనబడలేదు. తమ సమస్యలను చెప్పుకోవడానికి ఇటీవల కలెక్టరేట్‌కు వచ్చిన ఓ గ్రామం నుంచి వచ్చిన వారి బైక్ చోరీకి గురైంది. -
భలే ఆప్స్
డిజిఫై... ఇదో ఫైల్ షేరింగ్ అప్లికేషన్. డ్రాప్బాక్స్తో కలిసి పనిచేస్తుంది. మామూలుగానైతే డ్రాప్‌బాక్స్‌లోకి ఫైల్స్ వేసిన తరువాత వాటిని నియంత్రించలేము. డిజిఫైతో ఈ ఇబ్బంది ఉండదు. ఎవరెవరు ఫైల్స్ చూశారు... ఎవరు మార్పులు చేర్పులు చేశారు. ఎంతకాలంపాటు ఫైల్స్ డ్రాప్‌బాక్స్‌లో అందరికీ కనిపించేలా ఉంచాలి? వంటి ఫీచర్లను మీరు కంట్రోల్ చేయవచ్చు. వీటితోపాటు ఫైల్‌ను కొంతకాలం తరువాత తనంతట తానే నాశనమై పోయేలా కూడా చేయవచ్చు. అన్ క్లౌడెడ్... స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లలోని మెమరీతోపాటు క్లౌడ్ మెమరీ వాడకం కూడా పెరిగిపోతున్న రోజులివి. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల మెమరీ మాదిరిగానే క్లౌడ్ మెమరీని కూడా శుభ్రం చేసుకునేందుకు ఒక అప్లికేషన్ కావాలి. అన్ క్లౌడెడ్ అచ్చంగా ఇదే పని చేస్తుంది. క్లౌడ్ మెమరీలో ఎక్కువ మోతాదు ఉపయోగిస్తున్న ఫైల్స్ ఏవి? ఫోల్డర్లు ఎన్ని ఉన్నాయి? వాటిలోని ఫైళ్ల పరిస్థితి ఏమిటన్నది తెలుసుకునేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్లౌడ్ మెమరీకి సంబంధించినంతవరకూ ఇదో సెర్చ్ ఇంజిన్‌లా, ఫైల్స్ మేనేజర్లా, ఎక్స్ప్లోరర్లానూ పనికొస్తుంది ఈ అన్ క్లౌడెడ్ అప్లికేషన్. ‘డ్రాప్‌బాక్స్’ అప్డేట్ అయ్యింది..! ఐ డివైజ్‌ల రూపురేఖలను మార్చేసిన ఐఓఎస్8కి అనుగుణంగా అప్లికేషన్లు కూడా అప్డేట్ అవుతున్నాయి. ఐ డివైజ్‌లను వాడే వారికి ఎంతో సౌకర్యమైన డ్రాప్‌బాక్స్ అప్లికేషన్‌తో ఈ అప్డేషన్ మొదలైంది. ఫైల్‌షేరింగ్ విషయంలో సౌకర్యంగా ఉండే డ్రాప్‌బాక్స్ అప్లికేషన్‌ను ఐఓఎస్8 ఫీచర్లకు అనుగుణంగా మార్చారు. తాజాగా ఈ అప్లికేషన్లో కొత్త సదుపాయాలు రావడంతో పాటు నోటిఫికేషన్ల ఫీచర్‌ను కూడా మొదలు పెట్టారు. ఈ నోటిఫికేషన్ ఫీచర్ ద్వారా డ్రాప్బాక్స్కు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్‌లోని మార్పునకు అనుగుణంగా అప్లికేషన్లను కూడా అప్డేట్ చేసుకోవాలని భావించే వారు ఈ మార్పును స్వాగతించవచ్చు. -
పాఠశాలలో కంప్యూటర్ల చోరీ
మోటూరులో ఘటన 11 కంప్యూటర్లు మాయం విలువ రూ.1.50 లక్షలు గుడివాడ రూరల్ : మండలంలోని మోటూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి కంప్యూటర్ల దొంగతనం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం సిబ్బంది పాఠశాలలో అన్ని గదులకు తాళాలు వేశారు. రెండో శనివారం సెలవు కావడంతో ఉదయం అక్కడ ఆడుకునేందుకు పిల్లలు వచ్చారు. కంప్యూటర్ ల్యాబ్ తెరిచి ఉండటాన్ని చూసి లోనికి వెళ్లారు. అక్కడ కంప్యూటర్లు కనిపించలేదు. దీంతో ప్రధానోపాధ్యాయురాలు సుగుణకు ఫోన్ చేశారు. ఆమెతోపాటు సిబ్బంది హుటాహుటిన వచ్చి కం ప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. అందులోని 11 మాని టర్లు, రెండు సీపీయూలు, రెండు కీప్యాడ్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. వీటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుం దని అంచనా. గదిలోని బీరువా, సొరుగులు తెరిచి ఉండటాన్ని కూడా గుర్తించారు. వాటిలో ఏమీ లేకపోవడంతో కంప్యూటర్లను అపహరించుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. పాఠశాల సిబ్బంది అందించిన సమాచారం మేర కు రూరల్ ఏఎస్సై దుర్గాప్రసాద్ సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామన్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. ‘పాఠశాలకు రక్షణ కరువు’ శీర్షికతో గత మే నెలలో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనతో ఈ విషయం రుజువైంది. ప్రభుత్వ పాఠశాలలో అటెండరు, నైట్ వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయకపోవటంతో విలువైన సామాగ్రికి రక్షణ లేదని హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. -
ట్యాబ్స్దే.. హవా..
ఎంతో సులభంగా... కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ట్యాబ్‌ల్లో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి. మారుతున్న ప్రజల అవసరాలు, యువత అమితంగా ఇష్టపడడంతో ఏటా ట్యాప్‌ల అమ్మకాలను పరుగుపెట్టిస్తున్నాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్లు, లాప్‌టాప్‌లతో పోల్చితే ధర తక్కువగా ఉండడం ట్యాబ్స్ దృష్టిమరల్చడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీనికితోడు అరచేతిలో ఇమిడిపోయే సౌలభ్యం, ఎక్కడైనా వాడుకోవడానికి వీలు ఉండడంతో ట్యాబ్స్‌పై క్రేజీని మరింత పెంచుతూ ప్రజల జీవన విధానాన్ని సులభతరం చేస్తున్నాయి. అందరికీ అందుబాటులో.. ట్యాబ్‌లు వివిధ కంపెనీల వారీగా దాదాపు రూ.6వేల నుంచి రూ.20 వేల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ వాడకం.. గేమ్స్ ఆడుకోవడమే కాకుండా సిమ్ వేసుకుని ఫోన్ తరహాలో ఉపయోగించుకునే సౌకర్యం అందుబాటులో ఉండడంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మ్యూజిక్, వీడియో లోడింగ్, ఇంటర్నెట్ సెర్చింగ్, ఈ మెయిల్ పంపుకోవడం, ఈ బుక్స్ చదవడం, పత్రికలు చదవడం, వ్యాపారులకు ఆన్లైన్ పర్చేసింగ్, బిల్లింగ్, ట్రేడింగ్‌కు ట్యాబ్‌లు ఉపయోగపడుతున్నాయి. యువత సోషల్ నెట్‌వర్క్‌ను అంటిపెట్టుకుంటున్న తరుణంలో ట్యాబ్‌ను మించిన ప్రత్యామ్నాయం లేకపోవడంతో అవి మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. పెరుగుతున్న బిజినెస్ జిల్లాలో ట్యాబ్స్ బిజినెస్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల, హుజూరాబాద్, కోరుట్ల ప్రాంతాల్లో ట్యాబ్స్ బిజినెస్ ఊపందుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఐదు వేల ట్యాబ్స్ వరకు అమ్మడవగా.. ఇందులో నగరంలోనే 2500 వరకు అమ్ముడవుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. పిల్లలకు బహుమతులుగా.. చాలామంది పిల్లలకు బహుమతులుగా ఇస్తుంటారు. పుట్టిన రోజు, ఇతర శుభకార్యాలకు కూడా ట్యాబ్స్ బహుమతులుగా ఇవ్వడం లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. దీంతో ట్యాబ్స్ ఎక్కువ స్థాయిలో పిల్లలే వాడుతున్నారు. ట్యాబ్స్ మిగతా మొబైల్స్‌తో పోల్చితే గేమ్స్ ఆడుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటున్నాయంటున్నారు తల్లిదండ్రులు. -
కంప్యూటర్ విద్యకు ‘వైరస్’
ఘట్కేసర్ టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు స్కూళ్లల్లో చదువుకునే విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్యకు వైరస్ సోకింది. చదువుతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య నీరుగారుతోంది. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు, ఫర్నిచర్ ఎందుకూ పనికి రాకుం డా పోతున్నాయి. 2014లోనైనా కంప్యూటర్ విద్యకు మోక్షం కలుగుతుందనుకున్న విద్యార్థుల ఆశలు అడియాశలవుతున్నాయి. సర్కారు అనాలోచిత నిర్ణయాలవల్ల జిల్లాలో సుమారు 190 ఉన్నత పాఠశాలల్లో వేలాది విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు.ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలనే సంకల్పంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సక్సెస్ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఐదేళ్లపాటు కంప్యూటర్ విద్యను బోధించడానికి ప్రైవేటు ఏజన్సీలతో రాజీవ్ విద్యామిషన్ ఒప్పందం కుదుర్చుకుంది. పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లను నియమించిన రెండు, మూడు సంవత్సరాల అనంతరం నిర్వహణను గాలికొదిలేయడంతో కంప్యూటర్ విద్య అందని ద్రాక్షలా తయారయింది. ఏజన్సీల గడువు గతేడాది సెప్టెంబర్‌తో ముగియడంతో కంప్యూటర్ విద్య అటకెక్కింది. ఫాకల్టీని నియమించకపోవడం, పనిచేసిన వారికి సక్రమంగా వేతనాలను చెల్లించకపోవడంతో విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందుకోలేకపోయారు. మూలనపడ్డ కంప్యూటర్లు.. వేతనాలను సక్రమంగా చెల్లించపోవడంతో ఇన్స్ట్రక్టర్లు విధులకు రావడం మానేశారు. దీంతో కోట్లాది రూపాయలను వెచ్చించి కొనుగోలుచేసిన కంప్యూటర్లు పాడయిపోయి మూలనపడ్డాయి. దీంతో నిర్వాహణ లేక కంప్యూటర్ గదులన్నీ దుమ్ము, ధూళితో నిండిపోయాయి. ఆశయం మంచిదైనా.. నిర్వహణ, పర్యవేక్షణ కొరవడి కోట్లాది రూపాయలు బూడిదలో పోసి న పన్నీరవుతోంది. మొదట ఇచ్చిన ఏజ న్సీల కాలపరిమితి ముగిసిందని, పాఠశాలల్లో సాంకేతిక విద్యపై అవగాహన ఉన్న ఇతర ఉపాధ్యాయులతో బోధిం చాలని జిల్లాలోని ప్రధానోపాధ్యయులందరికీ తెలిపినట్లు జిల్లా డిప్యూటీ విద్యాధికారిని ఉషారాణి తెలిపారు. -
అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య
తిమ్మాపూర్ : అప్పుల బాధతో కంప్యూటర్ల షాపు య జమాని అనుమాండ్ల తిరుపతిరెడ్డి క్రిమి సం హారక మందు తాగి మండల కేంద్రం శివారు లో కాకతీయ కాలువ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలం సీతారాంపూర్‌కు చెందిన తిరుపతిరెడ్డికి వీణవంక మండలం మల్లారెడ్డిపల్లెకు చెందిన శైలజసంగీతతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి తన్విత(6) కూతురు ఉంది. తిరుపతిరెడ్డి కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నెట్ ఇండియా కంప్యూటర్ల షాపు ఉంది. భగత్‌నగర్‌లో నివాసముంటూ వ్యాపారపరంగా అప్పు చేసి స్వగ్రామంలో భూములు కొన్నా డు. అప్పులు పెరిగిపోవడంతో డబ్బులిచ్చిన వారు పలుమార్లు పంచాయితీ పెట్టారు. దీం తో హుస్నాబాద్‌లోని ఎకరా భూమిని, సీతారాంపూర్‌లో ఉన్న భూమిని అప్పు ఇచ్చిన కొం దరు జీపీఏ చేయించుకున్నారు. మరికొందరు వేధిస్తున్నారు. ఉన్న భూమిని విక్రయిద్దామంటే తండ్రి అంగీకరించలేదు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వారు గురువారం కరీంనగర్‌లోని ఓ ఇంట్లో పంచాయితీ పెట్టారు. అక్కడ స్వగ్రామానికి చెందిన ముస్కు వేణుగోపాల్‌రెడ్డి, పచ్చునూర్‌కు చెందిన కసిరెడ్డి దేవేందర్‌రెడ్డి భూమి జీపీఏ చేయాలని, లేదంటే అప్పు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. అప్పటికే మానసికంగా కుంగిపోయిన తిరుపతిరెడ్డిని మల్లారెడ్డిపల్లెకు తీసుకెళ్దామని అత్తింటివారు కరీంనగర్ చేరుకున్నారు. కూతురు చాక్లెట్ కావాలని అనడంతో బయటకు వెళ్లిన తిరుపతిరెడ్డి తిరిగి రాలేదు. శుక్రవారం కాకతీయ కాలువ వద్ద పడిపోయి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సైలు దామోదర్‌రెడ్డి, అంజయ్య పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. మృతదేహం వద్ద లభించిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. 12 మందిపై కేసు మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు అత్త రాజమ్మ, మామ శ్రీనివాసరెడ్డి, మరిది సతీష్‌రెడ్డి, తోడి కోడలు పద్మ, ఆడబిడ్డ సుజాత, ఆడబిడ్డ భర్త తిరుపతిరెడ్డి, ముస్కుల వేణుగోపాల్‌రెడ్డి, ముస్కుల మాధవరెడ్డి, కసిరెడ్డి దేవేందర్‌రెడ్డి, కాసం రవీందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎల్ఎండీ ఎస్సై దామోదర్‌రెడ్డి తెలిపారు. -
నాన్న ఆశయం నెరవేర్చకనే..
ప్రొద్దుటూరు క్రైం : అతనో చిరుద్యోగి.. తనకొచ్చే కొద్దిపాటి జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తూ.. మరోవైపు పిల్లలను ప్రయోజకులు చేయాలని ఆశించారు. పిల్లలు కూడా తండ్రి పెట్టే ప్రతిపైసాకు న్యాయం చేయాలని భావించి పట్టుదలతో చదువుతున్నారు. కుమారుడు అంకయ్య అలియాస్ వినోద్ బీఎస్సీ కంప్యూటర్స్ ఇటీవలే పూర్తి చేశాడు. కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. డిగ్రీ పాసైన ఆనందంలో ‘అమ్మా.. ఇక మనకు భయం లేదులే.. ఏదో ఒక ఉద్యోగం సాధిస్తా. మన కష్టాలన్నీ తీరిపోతాయ్’ అని చెప్పాడు. అమ్మ ఓబుళమ్మకు ఇచ్చిన మాట నిజం కాకనే.. నాన్న తలారి మత్తయ్య(మున్సిపాలిటీలో డ్వాక్రా వర్కర్) ఆశయం నెరవేరకనే అంకయ్య రోడ్డు ప్రమాదానికి గురై.. ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్ర్కమించాడు. దీన్ని ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు పగిలే లా రోదిస్తున్నారు. ఈ తీరు చూసిన వారి హృదయాలను బరువెక్కించింది. ఎన్సీసీ సర్టిఫికెట్ కోసం వెళ్తూ.. అంకయ్యకు చదువు మీద ఎంత శ్రద్ధో.. ఎన్సీసీపైనా అంతే శ్రద్ధ. మూడేళ్ల నుంచి అతను ఎన్సీసీలో కొనసాగేవాడు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ కోసం తన మిత్రుడితో కలసి బైక్‌లో కడపకు బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను అకాల మృత్యువాతపడ్డాడు. ఈ విషయం తెలియడంతో రామేశ్వరం వాసులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. అంకయ్య మృతదేహాన్ని చూసి అతని మిత్రులు, అధ్యాపకులు కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు ప్రముఖులు సైతం విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
నాన్న ఆశయం నెరవేర్చకనే..
ప్రొద్దుటూరు క్రైం : అతనో చిరుద్యోగి.. తనకొచ్చే కొద్దిపాటి జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తూ.. మరోవైపు పిల్లలను ప్రయోజకులు చేయాలని ఆశించారు. పిల్లలు కూడా తండ్రి పెట్టే ప్రతిపైసాకు న్యాయం చేయాలని భావించి పట్టుదలతో చదువుతున్నారు. కుమారుడు అంకయ్య అలియాస్ వినోద్ బీఎస్సీ కంప్యూటర్స్ ఇటీవలే పూర్తి చేశాడు. కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. డిగ్రీ పాసైన ఆనందంలో ‘అమ్మా.. ఇక మనకు భయం లేదులే.. ఏదో ఒక ఉద్యోగం సాధిస్తా. మన కష్టాలన్నీ తీరిపోతాయ్’ అని చెప్పాడు. అమ్మ ఓబుళమ్మకు ఇచ్చిన మాట నిజం కాకనే.. నాన్న తలారి మత్తయ్య(మున్సిపాలిటీలో డ్వాక్రా వర్కర్) ఆశయం నెరవేరకనే అంకయ్య రోడ్డు ప్రమాదానికి గురై.. ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్ర్కమించాడు. దీన్ని ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు పగిలే లా రోదిస్తున్నారు. ఈ తీరు చూసిన వారి హృదయాలను బరువెక్కించింది. ఎన్సీసీ సర్టిఫికెట్ కోసం వెళ్తూ.. అంకయ్యకు చదువు మీద ఎంత శ్రద్ధో.. ఎన్సీసీపైనా అంతే శ్రద్ధ. మూడేళ్ల నుంచి అతను ఎన్సీసీలో కొనసాగేవాడు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ కోసం తన మిత్రుడితో కలసి బైక్‌లో కడపకు బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను అకాల మృత్యువాతపడ్డాడు. ఈ విషయం తెలియడంతో రామేశ్వరం వాసులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. అంకయ్య మృతదేహాన్ని చూసి అతని మిత్రులు, అధ్యాపకులు కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు ప్రముఖులు సైతం విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
కృష్ణా వర్సిటీ కౌన్సెలింగ్‌లో 354 సీట్లు భర్తీ
విజయవాడ, న్యూస్‌లైన్ : కేఆర్యూసెట్-2014కు సంబంధించి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ రెండో రోజు 354 సీట్లు భర్తీ అయ్యాయని కృష్ణా యూనివర్సిటీ డెరైక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య మండవ వెంకటబసవేశ్వరరావు తెలిపారు. కేబీఎన్ కళాశాలలో రెండో రోజైన గురువారం కూడా కౌన్సెలింగ్ కొనసాగింది. ఎంఏ (ఎకనామిక్స్), ఎంఎస్సీ (కంప్యూటర్స్), ఎంఎస్సీ (కెమిస్ట్రీ) తదితర కోర్సులకు సంబంధించి సీట్ల కేటాయింపు చేపట్టారు. రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరి శీలన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండవ మాట్లాడుతూ కౌన్సిలింగ్ రెండో రోజు పలు కళాశాలలకు సంబంధించి సీట్లు కేటాయించామని తెలిపారు. శక్రవారం కూడా కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి విద్యార్థులను పంపించివేస్తున్నామన్నారు. ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) విభాగానికి సంబంధించి అత్యధికంగా 231 సీట్ల కేటాయించామని తెలిపారు. కౌన్సెలిం గ్లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కృష్ణమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణ రావు, పీజీ డెరైక్టర్ డాక్టర్ వై.నరసింహారావు, విశ్వవిద్యాలయం పక్షాన డాక్టర్ ఉషా తదితరులు పాల్గొన్నారు. -
e-పంచాయతీలు
ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు గ్రామపంచాయతీలను ఈ- పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తద్వారా గ్రామపంచాయతీ ద్వారా అందే అన్ని సేవలు ఆన్లైన్ ద్వారా అందనున్నాయి. పంచాయతీ ఆదాయ, వ్యయాలు, మంజూరయ్యే నిధులు, చేపట్టే పనులన్నింటినీ కంప్యూటరీకరిస్తారు. ఇందుకోసం జిల్లాలో 474 క్లస్టర్లకు కంప్యూటర్లు మంజూరుచేసింది. - పంచాయతీల కంప్యూటరీకరణ క్లస్టర్లకు కంప్యూటర్లు - రెండు కంప్యూటర్లకు ఒక ఆపరేటర్ - 15 రోజుల్లో ప్రజల్లోకి ఆన్లైన్ సేవలు జోగిపేట, న్యూస్‌లైన్: కాలం మారుతోంది. పాలనలో సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా గ్రామపంచాయతీలు ఈ-పంచాయతీలుగా మారుతున్నాయి. ఇక సేవలన్నీ ఆన్‌లైన్‌గా అందనున్నాయి. గ్రామాల్లో పాలనను మెరుగు పర్చేందుకు ఈ పంచాయతీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. జిల్లాలో 514 క్లస్టర్లకు 474 క్లస్టర్లకు ఇప్పటి వరకు కంప్యూటర్లను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాల సమాచారం. మండలంలో డాకూర్, అన్నాసాగర్, చింతకుంట, అక్సాన్‌పల్లి, అల్మాయిపేట, కొడెకల్, కన్సాన్పల్లి, రాంసానిపల్లి, నేరడిగుంట, పోతిరెడ్డిపల్లి క్లస్టర్లకు కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో చేపట్టే ప్రతి పనిని ఆన్లైన్లో పొందుపర్చి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మంజూరైన కంప్యూటర్లను ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అమర్చే పనులను కర్వే టెక్నికల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాంట్రాక్టుకు ప్రభుత్వం అప్పగించింది. గ్రామ పంచాయతీల్లో సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో 15 రోజుల్లో సేవలు అందుబాటులోకి రానున్నాయి. రెండు క్లస్టర్లకు కలిపి ఒక్కరిని ఆపరేటర్‌గా ప్రభుత్వం నియమిస్తుంది. ప్రయోజనాలు - గ్రామ పంచాయితీలను ఈ పంచాయతీలుగా మార్చడం వల్ల పాలనకు పారదర్శకత చేకూరుతుంది. - పంచాయితీ కార్యాలయం నుంచి చేపట్టే ప్రతి పనిని కంప్యూటర్లో పొందుపరచి ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. - జనన మరణ ధ్రువీకరణ పత్రాలు చేతి రాతతో కాకుండా కంప్యూటర్ ద్వారా జారీ చేస్తారు. - గ్రామ పంచాయతీ నుంచి జారీ చేసే ప్రతీ సర్టిఫికెట్ వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తారు. - గ్రామ పంచాయతీ వచ్చే ఆదాయ, వ్యయాలు సైతం ఆన్లైన్లోనే ఉంచుతారు. - గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థిర, చర ఆస్తుల వివరాలు కూడా ఆన్లైన్లోనే ఉంచుతారు. -
వ్యాపార నైపుణ్యాలు నేర్పించాలి!!
గెస్ట్ కాలమ్ సేనాపతి గోపాలకృష్ణన్.. అంటే గుర్తుపట్టడం కొంత కష్టమే. క్రిస్ గోపాలకృష్ణన్.. అంటే అందరికీ సుపరిచితమైన పేరు. ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన సాఫ్ట్వేర్ సంస్థ ‘ఇన్ఫోసిస్’ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1979లో పట్ని కంప్యూటర్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రస్థానాన్ని ప్రారంభించి.. 1981లో ఇన్ఫోసిస్ స్థాపనలో చేయి కలిపిన గోపాలకృష్ణన్.. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ స్థాయికి ఎదిగారు. మరోవైపు ట్రిపుల్ ఐటీ బెంగళూరు చైర్మన్‌గా, ఐఐఎం-బెంగళూరు గవర్నింగ్ బోర్డ్ సభ్యుడిగా విద్యారంగ అభివృద్ధిలోనూ తనవంతు తోడ్పాటును అందిస్తున్నారు. విద్యార్థులు తమను తాము ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దుకోవాలి, కాలేజీ స్థాయిలోనే విద్యార్థులకు వ్యాపార నైపుణ్యాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పిస్తే కెరీర్ ఆశాజనకంగా ఉంటుంది అంటున్న ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ గోపాలకృష్ణన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ... దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థపై మీ అభిప్రాయం? నాణ్యమైన విద్య అనేది మన దేశ విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశం. చక్కటి విద్యను అందించి తద్వారా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను సంసిద్ధులను చేయాలంటే.. నిపుణులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు అవసరం. అదేవిధంగా నిరంతరం పరిశోధనలు కొనసాగించేందుకు వీలుగా సరిపడ నిధులు అందుబాటులో ఉండేలా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి నుంచే సంస్కరణలు తేవాలి. ఇందులో అత్యంత ముఖ్యమైనది మౌలిక సదుపాయాల కల్పన. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఆడియో-విజువల్ సౌకర్యాలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి ఆధునిక వనరులను వినియోగించి నాణ్యమైన విద్యను అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కేవలం కుర్చీలు, బల్లలు ఉన్న సాధారణ తరగతి గదులే ఉంటున్నాయి. ఈ పరిస్థితికి వీలైనంత త్వరగా స్వస్తి పలికి, బోధనలో ఆధునికతవైపు అడుగులు వేయాలి. అదే విధంగా విద్యార్థినుల నమోదు శాతం పెరిగేలా స్కూళ్లలో వారి కోసం టాయిలెట్లు వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. మన దేశంలో ఉన్నత విద్య, ఉద్యోగాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.. ప్రాథమిక స్థాయిలో వారికి ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే. మన విద్యావ్యవస్థలో ఎలాంటి మార్పులు తేవాల్సిన అవసరముంది? విద్యార్థులకు రెగ్యులర్ కరిక్యులంను బోధిస్తూనే.. ఇంటర్నెట్ ఆధారిత అధునాతన శిక్షణ అందించాలి. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఎడ్యుకేషనల్ టూల్స్ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలు మరింతగా మెరుగుపరచుకునేలా వారిని ప్రోత్సహించాలి. తద్వారా విద్యార్థికి సాంకేతిక నైపుణ్యాలతోపాటు విస్తృతమైన పరిజ్ఞానం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా వేల మంది విద్యార్థులు కళాశాల విద్యకు, ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి వారు తమ స్వశక్తిపై జీవించేలా, సదరు రంగంలో ఉపాధి పొందేలా పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్య నైపుణ్యాలు అందించాలి. విద్యార్థులకు జాబ్ మార్కెట్ సంబంధిత నైపుణ్యాలు అందించేందుకు ఒకేషనల్ ఎడ్యుకేషన్‌కు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కంపెనీలు అభ్యర్థుల్లో ఎలాంటి లక్షణాలను కోరుకుంటున్నాయి? పరిశ్రమ వర్గాలు ప్రధానంగా విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, సమస్య సాధన నైపుణ్యాలు (ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్) ఉండాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే.. పరిశ్రమలలో టెక్నాలజీ పరంగా మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. నేర్చుకునే తత్వం లేకుంటే వెనకబడిపోవడం ఖాయం. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కలిగిన వ్యక్తులు సమస్యల్లోనే అవకాశాలను గుర్తిస్తారు. ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొంటారు. వీటితోపాటు విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, బృందంలో కలిసి పనిచేయగలిగే నేర్పు, నిర్వహణా నైపుణ్యాలు ఉండాలని కంపెనీలు కోరుతున్నాయి. పరిశ్రమ అవసరాలకు, అకడెమిక్ నైపుణ్యాలకు మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా కంపెనీలకు, కాలేజీలకు మధ్య పరస్పర సంబంధాలు కొనసాగించాలి. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్షిప్స్, ఇండస్ట్రీ విజిట్స్ వంటి మార్గాల ద్వారా ఈ సమస్యకు సులువుగా పరిష్కారం లభిస్తుంది. ఇందుకోసం ఇన్ఫోసిస్ తనవంతు కృషి చేస్తోంది. విద్యార్థుల్లో ఇండస్ట్రీకి తగిన నైపుణ్యాలు అందించేందుకు ప్రస్తుతం ఇన్ఫోసిస్.. క్యాంపస్ కనెక్ట్, క్యాచ్ దెమ్ యంగ్ (సీటీవై); స్పార్క్ (్కఅఖఓ) అనే మూడు ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తోంది. క్యాంపస్ కనెక్ట్ ప్రోగ్రామ్‌ను తొలుత 2004లో 60 కళాశాలలతో ప్రారంభించాం. ఇండస్ట్రీ-అకడెమిక్స్ మధ్య దూరం తగ్గించడం క్యాంపస్ కనెక్ట్ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు ఐటీ పరిశ్రమ అవసరాలకు సరితూగేలా నిపుణులను తయారు చేయడంపై ఈ క్యాంపస్ కనెక్ట్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందుకోసం క్యాంపస్ కనెక్ట్ పోర్టల్‌లో ఇన్ఫోసిస్ కోర్స్వేర్ను, ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్, కేస్ స్టడీస్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. అదే విధంగా పలు సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహించి పరిశ్రమ అవసరాలు విద్యార్థులకు తెలిసేలా చేస్తున్నాం. అలాగే రెండు వారాల వ్యవధి ఉండే సీటీవై ప్రోగ్రామ్ ద్వారా పాఠశాల విద్యార్థులకు ఐటీపై అవగాహన కల్పిస్తాం. విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తాం. ఎంట్రెన్స్‌లో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు ఇన్ఫోసిస్ సంస్థలో అనుభవజ్ఞులతో కలిసి ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నాం. దీనివల్ల విద్యార్థులకు చిన్నతనం నుంచే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అలవడుతుంది. 2008లో ప్రారంభించిన ్కఅఖఓ ప్రోగ్రామ్ ప్రధానంగా ఐటీ రంగంలో ఆధునిక మార్పులు, ఐటీ రంగ పురోభివృద్ధిలో ఇన్ఫోసిస్ పాత్ర అనే అంశాలపై ఉంటుంది. ఇన్ఫోసిస్‌లోని వేల మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని.. ఐటీ రంగానికి అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా ఆలోచించడంపై మీ అభిప్రాయం? దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితుల కోణంలో ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు, స్టార్ట్-అప్స్కు ఎంతో ప్రాధాన్యం ఉంది. విద్యార్థులు దీన్ని గుర్తించి వ్యాపార నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాల ద్వారా సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలు చూపించాలి. దానివల్ల సమాజంలో కొత్త వ్యాపారాలు, నూతన ఉత్పత్తులు, కొత్త ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చాలా అవసరం. దీనివల్ల వ్యక్తి అభివృద్ధితోపాటు, సమాజ అవసరాలు తీరుతాయి. ఫలితంగా ఆర్థిక ప్రగతికి మార్గం ఏర్పడుతుంది. ఇంతటి ప్రాముఖ్యమున్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను అకడెమిక్ స్థాయిలోనే పెంపొందించాలంటే? ఎంటర్ప్రెన్యూరియల్ నైపుణ్యాలపై కాలేజీ స్థాయిలోనే శిక్షణ ఇవ్వడం అవసరం. ఇందుకోసం ఇంక్యుబేషన్ సెంటర్స్, ఈ-సెల్స్ వంటివి ఏర్పాటు చేయాలి. విద్యార్థులు వాటిలో పాల్పంచుకునేలా ప్రోత్సహించాలి. డిగ్రీ అంటే క్యాంపస్ సెలక్షన్స్- అయిదంకెల జీతం అనే చట్రం నుంచి విద్యార్థులను బయటకు తీసుకురావాలి. వారిని స్వయం ఉపాధి దిశగా ఆలోచించేలా చేయాలి. ఆ నైపుణ్యాలున్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ సదుపాయాలు కల్పించాలి. తద్వారా భవిష్యత్తులో ఎన్నో స్టార్ట్-అప్స్‌ను, మరెందరో ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను సమాజానికి అందించడానికి వీలవుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు అవసరం? ప్రభుత్వం చొరవ తీసుకొని విధాన నిర్ణయాల ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను, స్టార్ట్అప్లను ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఆర్థిక తోడ్పాటునందించేలా ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందించాలి. దేశంలో ఎంటర్ప్రెన్యూరియల్ ఎకోసిస్టమ్‌కు దోహదపడేలా రోడ్ మ్యాప్‌ను తయారు చేయాలి. ఇలా చేయడం ద్వారా దేశ పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోతుంది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఎంటర్ప్రెన్యూర్ ఔత్సాహికులకు మీ సలహా? ఏ దశలోనూ నిర్దిష్ట లక్ష్యం నుంచి దృష్టిని మళ్లించకూడదు. జీవితంలో సవాళ్లు ఎదురవడం సాధారణం. ప్రతి సవాల్‌ను ఒక పాఠంగా భావించాలి. సవాళ్లు-సమస్యలు లేని విజయాలు చాలా తక్కువ. ఈ విషయాన్ని గ్రహిస్తే ఉద్యోగం, ఉపాధి ఏదైనా సరే.. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయం! -
నాటక రంగానికి ప్రోత్సాహం కరువు
భెల్, న్యూస్‌లైన్: సినిమాలు, కంప్యూటర్లు, టీవీల ప్రభావంతో ప్రస్తుతం నాటక రంగానికి ప్రోత్సాహం కరువైందని భెల్ పరిశ్రమ జనరల్ మేనేజర్ ఆర్.ల క్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. కమ్యూనిటీ సెంటర్ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో 40వ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు-2014 శుక్రవారం రాత్రి భెల్‌లోని కమ్యూనిటీ సెంటర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను లక్ష్మీనారాయణ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కమ్యూనిటీ సెంటర్ అధ్యక్షుడు, మరో జీఎం వీసీ కృష్ణన్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రోజురోజుకూ నాటకరంగం అంతరించిపోతుందని పేర్కొన్నారు. దీనిని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కమ్యూనిటీ సెంటర్ అధ్యక్షుడు కృష్ణన్ మాట్లాడుతూ కళాభిమానుల్లో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంచేందుకు ఈరాష్ట్రస్థాయి నాటికల పోటీలు దోహదపడతాయని తెలిపారు. ఏజిఎం. ధనుంజయరావు ప్రసంగిస్తూ నాటక రంగం పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సెంటర్ ప్రధాన కార్యదర్శి సిహెచ్.సునీల్, సాంసృ ్కతిక విభాగం కార్యదర్శి డి. నరేందర్‌రెడ్డి, సాహిత్య కార్యదర్శి ఎం.సతీష్‌కుమార్‌తోపాటు పలువురు అధికారులు, కళాకారులు పాల్గొన్నారు. తొలుత భెల్‌టౌన్‌షిప్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి కమ్యూనిటీ సెంటర్ వరకు క ళాజ్యోతి ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా నటరాజస్వామి విగ్రహాన్ని ప్రదర్శనగా తీసుకువచ్చారు. ఆకట్టుకున్న అగ్నిపుష్పం నాటిక రాష్ట్రస్థాయి నాటికల పోటీల్లో శుక్రవారం రాత్రి తొలుత ప్రదర్శించిన అగ్నిపుష్పం నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుంటూరు సద్గురు కళానిలయం ఆధ్వర్యంలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. దేశంలో బాలికల బాల్యం ప్రమాదంలో పడింది. అత్యాచారాలకు గురవుతున్న బాలికలు, యువతులు పతితతు కాదు....పావనులు...అగ్నిపుష్పాలు అనే ఇతివృత్తంతో ఈనాటిక సాగింది. దీనికి కావూరి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. -
క్లౌడ్, మొబైల్స్... నాణేనికి చెరోవైపు
న్యూయార్క్: మొబైల్, క్లౌడ్ టెక్నాలజీ అనేవి నాణేనికి రెండు పార్శ్వాల్లాంటివని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. తద్వారా కంపెనీ భవిష్యత్తులో దేనిపై అత్యధికంగా దృష్టిసారించనుందనే సంకేతాలిచ్చారు. భారత్‌కు చెందిన సత్య... మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా చేసిన బహిరంగ ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘క్లౌడ్, మొబైల్ అనేవి రెండూ విభిన్నమైనవని నేను భావించడం లేదు. ఒకే నాణేనికి ఇవి రెండు పార్శ్వాలు. మనం ఎక్కడున్నా సమాచారాన్ని(డేటా) తగినట్లుగా వాడుకోవడానికి క్లౌడ్ ఆవిర్భవించింది. క్లౌడ్ సదుపాయం లేని మొబైల్స్ కచ్చితంగా ఆనాసక్తికరంగానే ఉంటాయి. మొబైల్స్‌లో క్లౌడ్ లేకపోవడం అంటే కొంత పరిమితి కిందకు వస్తుంది. అదే మొబల్స్ లేకుండా క్లౌడ్ అనేది సామర్థ్యాన్ని వినియోగించుకోకపోవడం కిందే లెక్క. అందుకే ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉందనేది నా అభిప్రాయం’ అని సత్య వ్యాఖ్యానించారు. ఒకచోట నిక్షిప్తంచేసిన సర్వర్లలోని ఫొటోలు, ఇతరత్రా డేటాను మనం ఎక్కడున్నాసరే మొబైల్స్, ట్యాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను ఉపయోగించుకొని వాడుకునేలా(యాక్సెస్) వీలుకల్పించేదే క్లౌడ్ నెట్వర్క్ టెక్నాలజీ. ప్రతి డివైజ్‌లో కూడా అత్యుత్తమ క్లౌడ్ కనెక్టివిటీని అందించడంపై మేం పూర్తిగా దృష్టికేంద్రీకరించామని కూడా నాదెళ్ల పేర్కొన్నారు. మొబైల్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీ ఇలా డివైజ్‌లు ఏవైనా సరే అవలీలగా కనెక్ట్ అయ్యేందుకు, సమాచారాన్ని పంచుకునేందుకు క్లౌడ్ దోహదం చేస్తుందని హైదరాబాదీ సత్య నాదెళ్ల వివరించారు. కౌడ్ ద్వారా ఈ డివైజ్‌లన్నీ జీవితంలో భాగమవుతున్నాయని, ప్రజలను అనుసంధానం చేస్తోందన్నారు. ట్యాబ్లెట్లు మరింత ఉపయోగకర, శక్తిమంతమైన డివైజ్‌లుగా మారేందుకు కూడా క్లౌడే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. యాపిల్ ట్యాబ్లెట్లకు ఆఫీస్ సూట్... యాపిల్ ఐప్యాడ్ ట్యాబ్లెట్ పీసీల కోసం రూపొందించిన ఆఫీస్ సూట్‌ను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. ఆఫీస్ 375 సాఫ్ట్వేర్ సబ్స్క్రయిబర్లు తమ యాపిల్ ఐప్యాడ్లలో కూడా ఇకపై వర్డ్, పవర్‌పాయింట్, ఎక్సెల్‌లను వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. మొబైల్ యాప్స్‌పై మైక్రోసాఫ్ట్ మరింత దృష్టిసారిస్తోందనడానికి ఇదే నిదర్శనం. యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఆఫీస్ యాప్స్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కాగా, సీఈఓగా సత్య నాదెళ్ల ప్రవేశపెట్టిన తొలి ప్రధాన ప్రొడక్ట్‌గా ఇది నిలిచింది. అదేవిధంగా ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కోసం ఉచిత ఆఫీస్ మొబైల్‌ను కూడా అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. -
హైటెక్ ప్రచారం
ఎన్నికల ప్రచారం గతానికి భిన్నంగా సాగుతోంది. జెండాలు, వాల్‌పోస్టర్లు, వాల్ రైటింగ్, కరపత్రాలు, భారీ కటౌట్ల స్థానంలో తాజాగా కంప్యూటర్లు, సెల్ఫోన్లు హల్చల్ చేస్తున్నాయి. కనీస కంప్యూటర్ పరిజ్ఞానం లేని నేతలు సైతం ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రసంగ పాఠాలతో సోషల్ మీడియా (సెల్‌ఫోన్, ఇంటర్నెట్) ద్వారా విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల పరిధిలోని కాలనీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యోగులు, వ్యాపారులు, యువజన, కుల, ఉద్యోగ సంఘాల నేతల పేర్లు, ఫోన్ నెంబర్లను సేకరించి అభ్యర్థులే స్వయంగా ఓటర్లతో మాట్లాడుతున్నారు. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. ఓటు ఎందుకు వేయాలో, ఎవరికి వేయాలో సూచిస్తూ ప్రతి రోజూ ఓటర్ల ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. కంప్యూటర్, సెల్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ రంగాల్లో విశేష అనుభవం ఉన్న వారిని ఉద్యోగులుగా నియమించుకుని వారి సేవలను వినియోగించుకుంటున్నారు. హైటెక్ హంగులతో ఎంఐఎం ప్రచారం .. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీకి దీటుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎంఐఎం ప్రచారంలో హైటెక్ హంగులు చోటు చేసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు గుర్తింపు, పనితనంపై కూడళ్లలో భారీ హోర్డింగులతో ప్రచారాస్త్రాన్ని సందిస్తోంది. హోర్డింగ్‌లపై చారిత్రక ప్రదేశాలతో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీల ఫొటోలను ముద్రించారు. సాంస్కృతిక బృందాలు.. కంప్యూటర్ పరిజ్ఞానం లేని, చదువు రాని ఓటర్లను ఆకర్షించేందకు వారికి అర్థమయ్యే రీతిలో అభ్యర్థి గురించి ప్రచారం చేసేందుకు అభ్యర్థులు ఎవరికి వారే స్వతహాగా ప్రత్యేక సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థి గొప్పతనం, ఆయన జీవన శైలి, ఇప్పటి వరకు ఆయన చేసిన సేవ, తదితర అంశాలే ఇతివృత్తంగా చేసుకుని సుప్రసిద్ధ రచయితలతో పాటలు రాయించి, ప్రముఖ గాయకులతో పాడిస్తున్నారు. స్టూడియోల్లో వీటిని రికార్డ్ చేయిస్తున్నారు. మైక్‌ల ద్వారా ప్రచారాన్ని ఊదరగొడుతుండటం విశేషం. ఓటరు దృష్టిని ఆకర్షించేందుకు పార్టీగుర్తు, జెండా రంగులో ప్రత్యేకంగా టీ-షర్టులు, చీరలు తయారు చేయించి కార్యకర్తలకు పంచుతున్నారు. బిజీగా ఫ్లెక్సీ సెంటర్లు.. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతుండటంతో వాటిని ముద్రించే ఫ్లెక్సీ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. నిన్నమొన్నటి వరకూ పనిలేక ఖాళీగా కనిపించిన ఆర్టిస్టులు, పెయింటర్లు ప్రచార రథాలు, బ్యానర్లు, జెండాల తయారీలో బిజీగా మారిపోయారు. ప్రచారానికి భారీ కాన్వాయ్‌తో బయలు దేరుతున్నారు. ఇందు కోసం వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. వివాహాలు, పుట్టిన రోజు వేడుకలకు నెలవైన ఫంక్షన్ హాళ్లు తాజాగా ఎన్నికల ప్రచారానికి వేదికలవుతున్నాయి. సోషల్ మీడియాదే హవా ... ఐరిస్ నాలెడ్జ్ ఫౌండేషన్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల సంయుక్తంగా సోషల్ మీడియాపై ఓ సర్వే నిర్వహించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాల్లో 160 సీట్లను ఫేస్బుక్, ఆర్కూట్, ట్విట్టర్ల వంటి సోషల్ మీడియా డామినేట్ చేయబోతున్నాయని తేల్చింది. యువతరం మొత్తం సోషల్ మీడియాకే అతుక్కుపోయినట్ట పేర్కొంది. దేశవ్యాప్తంగా దాదాపు 7.5 కోట్లున్న ఈ సంఖ్య, ఎన్నికల సమయంలో 11 కోట్లు దాటిపోతుందనేది అంచనా. వీరిలో దాదాపు 97 శాతం ఫేస్బుక్ ఖాతాదారులే. సమయం దొరికితే చాలు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, బ్లాగ్స్, వెబ్‌సైట్స్, వెబ్‌టీవీ...ఏదో ఒకదానికి కనెక్ట్ అవ్వడం సర్వసాధారణమని వెల్లడించింది. రంగంలోకి పీఆర్ ఏజెన్సీలు .. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు తమ ప్రచార బాధ్యతలను పీఆర్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. గెలుపోటములపై ముందే ఓ అభిప్రాయానికి వచ్చేందుకు అంతర్గత సర్వేలు చేయిస్తున్నారు. ఓటరు నాడి తెలుసుకుని వారికి ఏం కావాలో వాటినే ఎన్నికల ఎజెండాలో రూపొందిస్తున్నారు. అంతేకాకుండా ఏ బస్తీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి. ఏ రోజు ఏ కాలనీలో ప్రచారం చేయాలి. ఏ ఏ అంశాలపై మాట్లాడాలి. ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి. తదితర అంశాలపై ముందే ఓ అవగాహనకు వచ్చి కాలనీల వారిగా ఎన్నికల ఎజెండాలను రూపొందించి అభ్యర్థులకు అందిస్తున్నాయి. -
బోసిపోయిన సచివాలయం
సాక్షి, హైదరాబాద్: నిత్యం పైరవీకారులతో పాటు వివిధ పనులపై వచ్చే జనంతో సందడిగా ఉండే సచివాలయం ఒక్కసారిగా శనివారం బోసిపోయింది. మొన్నటివరకు వాహనాలు పార్కింగ్‌కే స్థలం దొరకని పరిస్థితి నెలకొంటే ఇప్పుడు వాహనాల పార్కింగ్‌కు ఎక్కడపడితే అక్కడ స్థలం దొరుకుతోంది. సీఎం పేషీతోపాటు మంత్రుల పేషీలన్నీ ఖాళీ కావడంతో సచివాలయానికి వచ్చే జనం కూడా తగ్గిపోయారు. రాష్ట్రపతి పాలన రావడంతో ఇక ఏ పని జరిగే పరిస్థితి లేకపోవడంతో బయట నుంచి పనులు కోసం వచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇక అధికారులు, ఉద్యోగులు మాత్రమే సచివాలయానికి వస్తున్నారు. సీఎం, మంత్రుల పేషీల్లో సామాగ్రి, టేబుల్స్, జిరాక్స్‌లు, కంప్యూటర్లను శనివారం సచివాలయ భవనాల విభాగం లెక్కించింది. ఆయా పేషీలకు ఎన్ని టేబుల్స్ ఎన్ని కుర్చీలు, ఎన్ని కంప్యూటర్లు ఇచ్చారో అన్నీ ఉన్నాయా లేదా అని లెక్కకట్టి ఆ విభాగం స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. మంత్రుల పేషీల్లో మిగిలిపోయిన ఫైళ్లను ఆయా శాఖలకు వెనక్కు తిప్పి పంపించే పనిని పేషీల సిబ్బంది శనివారం పూర్తి చేశారు. సిబ్బంది కూడా ఆ పేషీలను ఖాళీ చేసి సొంత శాఖలకు సోమవారం వెళ్లిపోనున్నారు. సీఎం పేషీ, మంత్రుల పేషీల్లో సిబ్బంది వారి సొంత శాఖలకు పంపిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి. -
‘కంప్యూటర్లు వద్దు..పాలే ముద్దు’
సాఫ్ట్వేర్ రూపొందించిన చేతులు పేడ పిసుకుతున్నాయి కీబోర్డ్‌ను రఫ్ ఆడించిన వేళ్లు తౌడు కలుపుతున్నాయి మౌస్తో కబుర్లు చెప్పిన హస్తాలు గేదెలను నిమురుతున్నాయి నిన్నటిదాకా సూటూ.. బూటు.. సెంటు ఇప్పుడు దాణ.. గోబర్ గ్యాస్.. పాల సేకరణ మొన్నటి దాకా అమెరికాలో ఏసీ గదుల్లో కొలువు ప్రస్తుతం రేకుల షెడ్డులో.. చల్లని పిల్ల గాలులతో సావాసం ఇంతకీ వీరెవరు? సాఫ్ట్వేర్ రంగం వదిలి డెయిరీ రంగంలోకి ఎందుకు వచ్చారు? ద్రోణాదుల(మార్టూరు),న్యూస్‌లైన్: ‘ఎంఏలు చేశాం.. ఎంబీఏలు చేశాం.. బీటెక్..సీఏలు చేశాం.. బీఈడీలు పూర్తి చేశాం. అయినా మా చదువుకు తగ్గ ఉద్యోగం లభించలేదు. గవర్నమెంటు ఉద్యోగాల సంగతి పక్కన పెడితే, కనీసం ప్రైవేటు ఉద్యోగాలు కూడా దొరకలేదు. కన్నవారికి..నమ్ముకున్నవారికి ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నాం’.. ఇలా నేటి రోజుల్లో చాలామంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉన్నత చదువులు చదివి.. ఆ చట్రం నుంచి బయటపడలేకపోతున్నారు. ఫలితంగా విలువైన సమయాన్ని వృథా చేసుకుంటూ.. పరనిందలతో కాలం గడుపుతున్నారు. ఇలాంటివారు ద్రోణాదులకు చెందిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల కథ చదవాల్సిందే.. చదివిన చదువుకు చేస్తున్న పనికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఉపాధి ఎలా కల్పించుకోవచ్చో తెలుసుకోవాల్సిందే.. ... ... ... పెంట్యాల రామారావు ఎంసీఏ పూర్తి చేసి.. 1997లో అమెరికా పయనమయ్యారు. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి.. సైబర్సాఫ్ట్ అనే సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ ప్రారంభించారు. 2008 వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకొని అక్కడ నుంచి వ్యాపార లావాదేవీలు ప్రారంభించారు. అవసరమైనప్పుడు అమెరికా వెళ్లి వస్తుండేవారు. ఈ నేపథ్యంలో స్వగ్రామం నిత్యం ఆయనకు గుర్తుకొస్తుండేది. ‘నేను ఎక్కడ పుట్టాను.. ఏం చేస్తున్నాను’ అన్న ఆలోచన వచ్చిన వెంటనే తన స్వగ్రామానికి ఏదైనా చేయాలనుకున్నారు. వ్యవసాయ కుటుంబం కావడంతో దానికి సంబంధించిన పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తమ్ముడు పెంట్యాల ఉమామహ్వేరరావుని పిలిపించారు. తన ఆలోచన చెప్పారు. ఇద్దరూ కలిసి డెయిరీ ఫాం ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. దీనికి వారి తండ్రి మదన్మోహనరావు కూడా అంగీకరించడంతో మూడు నెలల క్రితం ఆ ఏర్పాట్లు ప్రారంభించారు. నిర్మాణం ఇలా.. ఫాం కోసం 4 ఎకరాలు సేకరించారు. రూ. 60 లక్షలతో షెడ్డు నిర్మించారు. హర్యానా, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి 250 గేదలను గ్రామానికి తరలించారు. ఒక్కో గేదకు రూ. 70 వేలు ఖర్చు చేశారు. వాటిలో నలభై పాడి గేదలు కాగా.. మిగిలినవి సూడు గేదెలు. పూటకు 160 లీటర్లు సేకరిస్తూ గ్రామస్తులకే విక్రయిస్తున్నారు. సాంకేతిక పద్ధతులు పెద్ద సంఖ్యలో ఉన్న పశువులను సంరక్షించేందుకు ఎక్కువమంది కూలీలు కావాలి. పైగా బోలెడంత సమయం వృథా అవుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు *12 లక్షలతో మేత మిక్చర్‌ను కొనుగోలు చేశారు. ఈ యంత్రమే మేతను సిద్ధం చేస్తుంది. రకరకాల దాణాలను కూడా తయారు చేస్తుంది. అలాగే పాలు పిండే యంత్రాన్నీ కొనుగోలు చేశారు. ప్రస్తుతానికి15 మంది కూలీలు డెయిరీ ఫాంలో పనిచేస్తున్నారు. గేదెలన్నీ పాడి దశకు చేరుకుంటే మరికొంతమందికి ఉపాధి దొరుకుతుంది. విద్యుత్ ఉత్పత్తి కూడా.. గేదెల నుంచి వస్తున్న పేడను కూడా ఈ సోదరులు వృథా కానివ్వడంలేదు. గోబర్ గ్యాస్ ప్లాంట్ నిర్మించి.. దాని ద్వారా ఫాంకు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. స్వచ్ఛమైన పాలు అందించటమే లక్ష్యం : రామారావు గ్రామీణులకు స్వచ్ఛమైన పాలు అందించడమే మా లక్ష్యం. సాఫ్ట్వేర్ రంగంలో దొరకని తృప్తి ఇక్కడ లభిస్తోంది. 1000 గేదలతో ఫాం అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇండస్‌ఫ్రెష్ అనే పేరుతో పాలను ప్యాకింగ్ చేసి ఎలాంటి రసాయనాలు కలపని, నిల్వలేని పాలను త్వరలో అందిస్తాం. వ్యవసాయ రంగమే ఇష్టం : ఉమామహేశ్వరరావు మాది వ్యవసాయాధారిత కుటుంబం. సొంత గ్రామంలో వ్యవసాయ అనుబంధ రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాం. ఉన్నత చదువులు చదివి వ్యవసాయం చేయడం తప్పు ఎలా అవుతుంది? కొడుకుల నిర్ణయం భేష్ : మదనమోహనరావు నేలతల్లిని నమ్ముకుని ఇద్దరి కొడుకుల్ని కష్టపడి చదివించా. వారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత సొంత పొలంలో డెయిరీ ఫాం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. చదువంటే పక్కనున్న వాళ్లకీ బువ్వ పెట్టగలగాలి.