వీటితో కంటికి చేటు | Smartphone use can cause irreversible eye damage for children | Sakshi
Sakshi News home page

వీటితో కంటికి చేటు

Published Sun, Oct 8 2017 10:33 AM | Last Updated on Sun, Oct 8 2017 10:33 AM

Smartphone use can cause irreversible eye damage for children

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిన టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు వంటివి కంటిచూపును దెబ్బతీస్తున్నాయి. టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లకు ఉండే చిన్న చిన్న తెరలపై ఎక్కువ సమయం దృశ్యాలను చూస్తుండటం వల్ల చాలామంది చిన్న వయసులోనే దృష్టిలోపాల బారినపడుతున్నారు. ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా, ఈ పరిస్థితిని నిరోధించలేకపోతోంది. దృష్టిలోపాలను నయం చేయడంలో ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి సాధించినా, అధునాతన సాంకేతిక పరికరాల వల్ల తలెత్తే దృష్టి లోపాలను నివారించలేకపోతోంది. అది వైద్యశాస్త్రం పొరపాటు కాదు. సాంకేతిక పరికరాలు వాడే మనుషులే కొంత ముందుచూపుతో మసలుకుంటే, కంటిచూపును పదికాలాల పాటు పదిలంగా కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

టీవీలు రాక మునుపు మన దేశంలో ఎక్కువగా నలభయ్యేళ్ల వయసు దాటిన వారే కళ్లద్దాలతో కనిపించేవారు. కళ్లద్దాలతో కనిపించే చిన్నారులు చాలా అరుదుగా ఉండేవారు. టీవీలు వచ్చాక కళ్లద్దాలతో కనిపించే చిన్నారుల సంఖ్య క్రమంగా పెరగడం మొదలైంది. ఇక కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు విరివిగా వాడుకలోకి వచ్చాక చిన్నారుల్లో కంటిచూపు సమస్యలు మరింతగా ఎక్కువయ్యాయి. విపరీతంగా వీడియో గేమ్స్‌కు అలవాటు పడటం, గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఉపయోగించడం వల్ల పిల్లల కంటిచూపు తీవ్రంగా దెబ్బతింటోంది. ఫలితంగా చిన్నవయసులోనే కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి అనివార్యంగా మారుతోంది.

  చిన్నారుల్లో జన్యు లోపాల వల్ల, పోషకాహార లోపాల వల్ల కంటిచూపు సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే, జన్యు లోపాల కంటే టీవీ, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు వంటి వాటి వాడుక వల్ల చూపు దెబ్బతింటున్న చిన్నారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. చిన్న వయసులోనే దృష్టి లోపాలను ఎదుర్కొనే పిల్లలు చదువు సంధ్యల్లో కూడా వెనుకబడుతున్నట్లు పలు అంతర్జాతీయ అధ్యయనాల్లో వెల్లడైంది. పిల్లల్లో తలెత్తే దృష్టి లోపాలను సాధ్యమైనంత త్వరగా గుర్తించి, వైద్యుల సలహాపై తగిన కళ్లద్దాలు వాడటం, కాంటాక్ట్‌ లెన్స్‌ వాడటం లేదా లేజర్‌ చికిత్స వంటి ఆధునిక చికిత్స పద్ధతుల్లో కంటిచూపు సరిదిద్దడం వంటి చర్యలు చేపట్టినట్లయితే వారు చదువు సంధ్యల్లో వెనుకబడకుండా ఉంటారని బాలల మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కంటిచూపు లోపాలను ఎదుర్కొంటున్న చిన్నారుల్లో దాదాపు పదిశాతం మందికి పైగా చిన్నారులు చదువు సంధ్యల్లో వెనుకబడిపోతున్నారని, ఆటల్లో కూడా వారు రాణించలేకపోతున్నారని ‘మయో క్లినిక్‌’ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.

రిఫ్రాక్టివ్‌ సమస్యలు
మనం ఏ వస్తువునైనా చూసేటప్పుడు దాని పైనుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి వెనుక రెటీనాపై పడేలా కార్నియా, లెన్స్‌.. ఈ రెండూ రిఫ్రాక్ట్‌ చేస్తాయి. వాటిలో ఏవైనా తేడాలున్నప్పుడు రిఫ్రాక్టివ్‌ సమస్యలు వస్తాయి. ప్రీస్కూల్‌ వయసు పిల్లల్లో 5 శాతం మంది, స్కూలుకు వెళ్లే పిల్లల్లో 20 శాతం మంది రిఫ్రాక్టివ్‌ సమస్యలతో బాధపడుతున్నారు. రిఫ్రాక్టివ్‌ సమస్యల్లో మూడు రకాలు ఉన్నాయి. అవి: దగ్గరి దృష్టి (మయోపియా), దూరపు దృష్టి (హైపరోపియా), వక్రదృష్టి (ఆస్టిగ్మాటిజం).

మయోపియా: సాధారణంగా 8–12 ఏళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా మయోపియా సమస్య కనిపిస్తుంది. మయోపియాకు గురైన వారు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేరు. దగ్గరగా ఉన్నవాటిని మాత్రమే స్పష్టంగా చూడగలరు. మయోపియా బారిన పడ్డ పిల్లలు తరచుగా తలనొప్పితో బాధపడుతుంటారు. వారిలో కనుగుడ్లు రెండూ ఒకేలా లేకుండా ఉండవచ్చు. ఈ సమస్యను సరైన కళ్లద్దాలతో లేదా కాంటాక్ట్‌ లెన్స్‌తో సరిదిద్దవచ్చు.

హైపరోపియా: ఈ సమస్యకు గురైన వారికి దూరంగా ఉన్న వస్తువులే స్పష్టంగా కనిపిస్తాయి. దగ్గరగా ఉన్నవి మసక మసగ్గా కనిపిస్తాయి. కళ్లద్దాలు, కాంటాక్ట్‌ లెన్స్‌ వంటి వాటితో ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. అయితే, ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే, మెల్లకన్ను వంటి మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆస్టిగ్మాటిజం: ఈ సమస్యతో బాధపడే వారికి ఇటు దగ్గరి వస్తువులను, అటు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేరు. కార్నియా ఒంపు సరిగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది. ఆస్టిగ్మాటిజంతో బాధపడేవారికి రాత్రివేళ వస్తువులను చూడటం మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యను కూడా కళ్లద్దాలతో, కాంటాక్ట్‌ లెన్స్‌తో సరిచేయవచ్చు.

ఆంబ్లోపియా: మన రెండు కళ్ల నుంచి రెండు రెటీనాలపై పడే ప్రతిబింబాలను ఆప్టిక్‌ నెర్వ్‌ సాయంతో మెదడు గ్రహిస్తుంది. ఒక కంటిలో ఏదైనా సమస్య తలెత్తి ఆ కంటి నుంచి సరైన ప్రతిబింబం లభించకపోతే, మెదడు ఆ కంటి నుంచి వచ్చే సమాచారాన్ని తిరస్కరిస్తూ, స్పష్టంగా కనిపించే కంటి నుంచి వచ్చే సమాచారాన్నే గ్రహిస్తుంది. ఈ సమస్యనే ‘లేజీ ఐ’ అని కూడా అంటారు. దీంతో రెండు కళ్లనూ సమానంగా ఫోకస్‌ చేయలేకపోవడం, కనుగుడ్ల అలైన్‌మెంట్‌ సరిగా లేకపోవడం వల్ల మెల్లకన్ను వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆంబ్లోపియా సమస్య ఉన్నవారికి ఒక్కోసారి ఒకే వస్తువు రెండుగా కనిపిస్తుంటుంది. వస్తువులను సరిగా చూడలేక వాటిని ఢీకొంటుంటారు. చిన్న వయసులోనే ఈ సమస్య తలెత్తుతుంది. ప్రీస్కూల్‌ వయసులోనే ఈ సమస్యను గుర్తించి తగిన కళ్లద్దాలను ఉపయోగించడంతో పాటు బలహీనమైన కంటికి వైద్యుల సూచన మేరకు వ్యాయామాలు చేయించడం వల్ల ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. సమస్యను గుర్తించడం ఆలస్యమైతే చికిత్స కష్టమవుతుంది.

స్ట్రాబిస్మస్‌: కనుగుడ్లు రెండూ ఒకే అలైన్‌మెంట్‌లో లేకపోవడాన్ని స్ట్రాబిస్మస్‌ అంటారు. ఒకవేళ రెండు కనుగుడ్లూ లోపలకు చూస్తూ ఉన్నట్లయితే దాన్ని ఈసోట్రోపియా అంటారు. కనుగుడ్లు రెండూ బయటకు చూస్తూ ఉన్నట్లయితే ఆ సమస్యను ఎక్సోట్రోపియా అంటారు. ఒకవేళ పైకి చూస్తుంటే హైపర్‌ ట్రోపియా అని, కిందకు చూస్తూ ఉన్నట్లయితే హైపోట్రోపియా అని అంటారు. ఏదైనా వస్తువును బాగా దగ్గర నుంచి మాత్రమే పిల్లలు స్పష్టంగా డగలుగుతున్నారంటే... పెద్దలు వెంటనే సమస్యను గుర్తించి, నేత్రవైద్య నిపుణులను సంప్రదించాలి. స్ట్రాబిస్మస్‌ సమస్య దీర్ఘకాలం కొనసాగితే పిల్లలు ‘త్రీడీ విజన్‌’... అంటే ఎత్తు పల్లాలను, దూరాలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతారు. సాధారణంగా ఈ సమస్య ఏడాది నుంచి నాలుగేళ్ల లోపు చిన్నారుల్లో బయటపడుతుంది. నేత్రవైద్య నిపుణులను, న్యూరాలజిస్టులను సంప్రదిస్తే, సమస్యకు దారితీసిన కారణాలకు తగిన చికిత్స అందిస్తారు.

చిన్నారుల్లో దృష్టి లోపాలను ఎలా గుర్తించాలి?
కాస్త ఎదిగిన చిన్నారులైతే కంటి చూపులో తేడా వస్తే తల్లిదండ్రులకు తమ సమస్యను చెప్పుకోగలరు గాని, ఐదారేళ్ల లోపు వయసు ఉన్న చిన్నారులు తమ చూపులో తేడాలను చెప్పుకోలేరు. వారిని నిశితంగా గమనించినట్లయితే, వారి కంటిచూపులో లోపాలను తల్లిదండ్రులు కనిపెట్టి, వైద్యులను సంప్రదించవచ్చు. చిన్నారుల్లో కంటి చూపు లోపాలు ఉన్నట్లయితే, వారిలో తరచుగా కనిపించే లక్షణాలు...

మాటిమాటికీ కళ్లు రుద్దుకోవడం ∙కళ్లలోంచి తరచుగా నీరుకారడంఎక్కువగా రెప్పలల్లార్చడం టీవీ, కంప్యూటర్లు చూసేటప్పుడు వాటికి దగ్గరగా తల ముందుకు చాచడం ∙పుస్తకాలు చదివేటప్పుడు కళ్లు చికిలించడం ∙కళ్లు మండటం, ఎర్రబడటం, తలనొప్పిచిన్నారుల్లో ఇలాంటి లక్షణాలను గమనించినట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేత్రవైద్యులను సంప్రదించాలి. వారి సలహా సూచనల మేరకు మందులు, కళ్లద్దాలు వాడాల్సి ఉంటుంది.

టీవీలు రాక మునుపు మన దేశంలో ఎక్కువగా నలభయ్యేళ్ల వయసు దాటిన వారే కళ్లద్దాలతో కనిపించేవారు. కళ్లద్దాలతో కనిపించే చిన్నారులు చాలా అరుదుగా ఉండేవారు. టీవీలు వచ్చాక కళ్లద్దాలతో కనిపించే చిన్నారుల సంఖ్య క్రమంగా పెరగడం మొదలైంది. ఇక కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు విరివిగా వాడుకలోకి వచ్చాక చిన్నారుల్లో కంటిచూపు సమస్యలు మరింతగా ఎక్కువయ్యాయి. విపరీతంగా వీడియో గేమ్స్‌కు అలవాటు పడటం, గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఉపయోగించడం వల్ల పిల్లల కంటిచూపు తీవ్రంగా దెబ్బతింటోంది. ఫలితంగా చిన్నవయసులోనే కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి అనివార్యంగా మారుతోంది.

 చిన్నారుల్లో జన్యు లోపాల వల్ల, పోషకాహార లోపాల వల్ల కంటిచూపు సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే, జన్యు లోపాల కంటే టీవీ, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు వంటి వాటి వాడుక వల్ల చూపు దెబ్బతింటున్న చిన్నారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. చిన్న వయసులోనే దృష్టి లోపాలను ఎదుర్కొనే పిల్లలు చదువు సంధ్యల్లో కూడా వెనుకబడుతున్నట్లు పలు అంతర్జాతీయ అధ్యయనాల్లో వెల్లడైంది.

పిల్లల్లో తలెత్తే దృష్టి లోపాలను సాధ్యమైనంత త్వరగా గుర్తించి, వైద్యుల సలహాపై తగిన కళ్లద్దాలు వాడటం, కాంటాక్ట్‌ లెన్స్‌ వాడటం లేదా లేజర్‌ చికిత్స వంటి ఆధునిక చికిత్స పద్ధతుల్లో కంటిచూపు సరిదిద్దడం వంటి చర్యలు చేపట్టినట్లయితే వారు చదువు సంధ్యల్లో వెనుకబడకుండా ఉంటారని బాలల మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కంటిచూపు లోపాలను ఎదుర్కొంటున్న చిన్నారుల్లో దాదాపు పదిశాతం మందికి పైగా చిన్నారులు చదువు సంధ్యల్లో వెనుకబడిపోతున్నారని, ఆటల్లో కూడా వారు రాణించలేకపోతున్నారని ‘మయో క్లినిక్‌’ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.

రిఫ్రాక్టివ్‌ సమస్యలు
మనం ఏ వస్తువునైనా చూసేటప్పుడు దాని పైనుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి వెనుక రెటీనాపై పడేలా కార్నియా, లెన్స్‌.. ఈ రెండూ రిఫ్రాక్ట్‌ చేస్తాయి. వాటిలో ఏవైనా తేడాలున్నప్పుడు రిఫ్రాక్టివ్‌ సమస్యలు వస్తాయి. ప్రీస్కూల్‌ వయసు పిల్లల్లో 5 శాతం మంది, స్కూలుకు వెళ్లే పిల్లల్లో 20 శాతం మంది రిఫ్రాక్టివ్‌ సమస్యలతో బాధపడుతున్నారు. రిఫ్రాక్టివ్‌ సమస్యల్లో మూడు రకాలు ఉన్నాయి. అవి: దగ్గరి దృష్టి (మయోపియా), దూరపు దృష్టి (హైపరోపియా), వక్రదృష్టి (ఆస్టిగ్మాటిజం). మయోపియా: సాధారణంగా 8–12 ఏళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా మయోపియా సమస్య కనిపిస్తుంది. మయోపియాకు గురైన వారు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేరు. దగ్గరగా ఉన్నవాటిని మాత్రమే స్పష్టంగా చూడగలరు. మయోపియా బారిన పడ్డ పిల్లలు తరచుగా తలనొప్పితో బాధపడుతుంటారు. వారిలో కనుగుడ్లు రెండూ ఒకేలా లేకుండా ఉండవచ్చు. ఈ సమస్యను సరైన కళ్లద్దాలతో లేదా కాంటాక్ట్‌ లెన్స్‌తో సరిదిద్దవచ్చు.

హైపరోపియా: ఈ సమస్యకు గురైన వారికి దూరంగా ఉన్న వస్తువులే స్పష్టంగా కనిపిస్తాయి. దగ్గరగా ఉన్నవి మసక మసగ్గా కనిపిస్తాయి. కళ్లద్దాలు, కాంటాక్ట్‌ లెన్స్‌ వంటి వాటితో ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. అయితే, ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే, మెల్లకన్ను వంటి మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆస్టిగ్మాటిజం: ఈ సమస్యతో బాధపడే వారికి ఇటు దగ్గరి వస్తువులను, అటు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేరు. కార్నియా ఒంపు సరిగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది. ఆస్టిగ్మాటిజంతో బాధపడేవారికి రాత్రివేళ వస్తువులను చూడటం మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యను కూడా కళ్లద్దాలతో, కాంటాక్ట్‌ లెన్స్‌తో సరిచేయవచ్చు.

ఆంబ్లోపియా: మన రెండు కళ్ల నుంచి రెండు రెటీనాలపై పడే ప్రతిబింబాలను ఆప్టిక్‌ నెర్వ్‌ సాయంతో మెదడు గ్రహిస్తుంది. ఒక కంటిలో ఏదైనా సమస్య తలెత్తి ఆ కంటి నుంచి సరైన ప్రతిబింబం లభించకపోతే, మెదడు ఆ కంటి నుంచి వచ్చే సమాచారాన్ని తిరస్కరిస్తూ, స్పష్టంగా కనిపించే కంటి నుంచి వచ్చే సమాచారాన్నే గ్రహిస్తుంది. ఈ సమస్యనే ‘లేజీ ఐ’ అని కూడా అంటారు. దీంతో రెండు కళ్లనూ సమానంగా ఫోకస్‌ చేయలేకపోవడం, కనుగుడ్ల అలైన్‌మెంట్‌ సరిగా లేకపోవడం వల్ల మెల్లకన్ను వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆంబ్లోపియా సమస్య ఉన్నవారికి ఒక్కోసారి ఒకే వస్తువు రెండుగా కనిపిస్తుంటుంది. వస్తువులను సరిగా చూడలేక వాటిని ఢీకొంటుంటారు.

 చిన్న వయసులోనే ఈ సమస్య తలెత్తుతుంది. ప్రీస్కూల్‌ వయసులోనే ఈ సమస్యను గుర్తించి తగిన కళ్లద్దాలను ఉపయోగించడంతో పాటు బలహీనమైన కంటికి వైద్యుల సూచన మేరకు వ్యాయామాలు చేయించడం వల్ల ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. సమస్యను గుర్తించడం ఆలస్యమైతే చికిత్స కష్టమవుతుంది.స్ట్రాబిస్మస్‌: కనుగుడ్లు రెండూ ఒకే అలైన్‌మెంట్‌లో లేకపోవడాన్ని స్ట్రాబిస్మస్‌ అంటారు. ఒకవేళ రెండు కనుగుడ్లూ లోపలకు చూస్తూ ఉన్నట్లయితే దాన్ని ఈసోట్రోపియా అంటారు. కనుగుడ్లు రెండూ బయటకు చూస్తూ ఉన్నట్లయితే ఆ సమస్యను ఎక్సోట్రోపియా అంటారు. ఒకవేళ పైకి చూస్తుంటే హైపర్‌ ట్రోపియా అని, కిందకు చూస్తూ ఉన్నట్లయితే హైపోట్రోపియా అని అంటారు.

 ఏదైనా వస్తువును బాగా దగ్గర నుంచి మాత్రమే పిల్లలు స్పష్టంగా చూడగలుగుతున్నారంటే... పెద్దలు వెంటనే సమస్యను గుర్తించి, నేత్రవైద్య నిపుణులను సంప్రదించాలి. స్ట్రాబిస్మస్‌ సమస్య దీర్ఘకాలం కొనసాగితే పిల్లలు ‘త్రీడీ విజన్‌’... అంటే ఎత్తు పల్లాలను, దూరాలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతారు. సాధారణంగా ఈ సమస్య ఏడాది నుంచి నాలుగేళ్ల లోపు చిన్నారుల్లో బయటపడుతుంది. నేత్రవైద్య నిపుణులను, న్యూరాలజిస్టులను సంప్రదిస్తే, సమస్యకు దారితీసిన కారణాలకు తగిన చికిత్స అందిస్తారు.

చిన్నారుల్లో మరికొన్ని కంటి సమస్యలు
కాటరాక్ట్‌ సాధారణంగా వయసు మళ్లే వారిలో కనిపించే సమస్యే అయినా, అరుదుగా కొందరు చిన్నారులు కూడా కాటరాక్ట్‌ బారిన పడుతుంటారు. కొందరు చిన్నారుల్లో గ్లకోమా (కళ్లలో నీటికాసులు) ఏర్పడవచ్చు. ఇవే కాకుండా, కళ్లలోంచి తరచు నీరుకారడం, కనుగుడ్లు రెండూ వేగంగా అటూ ఇటూ కదులుతుండటం వంటి సమస్యలు కనిపించవచ్చు. ఈ సమస్యలను గుర్తించిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేత్ర వైద్య నిపుణులను సంప్రదించాలి.

కొన్ని అరుదైన కంటి సమస్యలు
సాధారణంగా కనిపించే రిఫ్రాక్టివ్‌ సమస్యలు, కాటరాక్ట్, గ్లకోమా వంటి కంటి సమస్యలు అందరికీ తెలిసినవే. ఇలాంటి సాధారణ సమస్యలే కాకుండా కొన్ని అరుదైన కంటి సమస్యలు చూపును దెబ్బతీస్తాయి. చాలా సందర్భాల్లో కంటి సమస్యల కారణంగా చూపు క్రమక్రమంగా దెబ్బతింటుంది. అరుదుగా ఒక్కోసారి ఆకస్మికంగా చూపు కోల్పోయే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు.

కంటి వెనుక ఉండే రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడటం వల్ల ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండానే చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని ‘రెటీనల్‌ వీన్‌ అండ్‌ ఆర్టరీ అక్కల్షన్‌’ అంటారు.

కంటి లోపల జరిగే అంతర్గత రక్తస్రావం వల్ల కూడా ఆకస్మికంగా చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిని ‘విట్రియస్‌ హెమరేజ్‌’ అంటారు.

తలలోను, మెడలోను ఉండే రక్తనాళాల్లో వాపు ఏర్పడటం వల్ల కూడా చూపు ఆకస్మికంగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. తలలోను, మెడలోను ఉండే రక్తనాళాల్లో వాపు ఏర్పడటం వల్ల కంటిలోని ఆప్టిక్‌ నెర్వ్‌కు పోషకాలు అందకుండాపోతాయి. ఫలితంగా చూపు దెబ్బతింటుంది.

పక్షవాతం, మైగ్రేన్‌ తలనొప్పి వంటి కారణాల వల్ల కూడా ఒక్కోసారి ఆకస్మికంగా చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. మైగ్రేన్‌ కారణంగా చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పక్షవాతం కారణంగా మెదడులో రక్తం గడ్డకడితే ఒక్కోసారి తాత్కాలికంగా, ఒక్కోసారి శాశ్వతంగా చూపు కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయి.

కంటి నల్లగుడ్డుపై ఉండే పొర మీద, రెటీనా మీద ఇన్ఫెక్షన్లు, వాపులు ఏర్పడినప్పుడు చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిని ‘కోరియో రెటీనైటిస్‌’ అంటారు. క్షయ, లైమ్‌ డిసీజ్, సిఫిలిస్‌ వంటి వ్యాధులతో బాధపడే వారిలోను, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్‌ వ్యాధులతో బాధపడే వారిలోను ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉంటాయి.

డయాబెటిస్‌ వల్ల, జన్యులోపాల కారణంగా వచ్చే రెటినో పిగ్మెంటోసా, రెటీనల్‌ డిస్ట్రోఫీ వంటి వ్యాధుల వల్ల, కంటి కండరాల క్షీణత వల్ల, కంటిలోను, మెదడులోను ఏర్పడే ట్యూమర్ల వల్ల కూడా కంటిచూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.

అంధుల సంఖ్యలో మనదే అగ్రస్థానం
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అంధులు భారత్‌లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.9 కోట్ల మంది అంధులు ఉంటే, వారిలో 1.2 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. దేశంలో ఉన్న అంధుల్లో దాదాపు 26 శాతం మంది 15 ఏళ్ల లోపు చిన్నారులే కావడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), వివిధ దేశాల ప్రభుత్వాలు, ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లయన్స్‌ క్లబ్‌ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలు చేపడుతున్న చర్యల వల్ల అంధత్వ సమస్య, కంటిచూపు సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. కంటిచూపు సమస్యల్లో దాదాపు 80 శాతం సమస్యలను తగిన ముందు జాగ్రత్తలతో నివారించవచ్చు లేదా వైద్య చికిత్సతో నయం చేయవచ్చు. భారత్, బ్రెజిల్, మొరాకో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు గడచిన రెండు దశాబ్దాల్లో కంటిచూపు సమస్యలను నివారించడంలో గణనీయమైన పురోగతిని సాధించాయి.

 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో 2019 నాటికి కంటిచూపు సమస్యలతో బాధపడేవారి సంఖ్యను కనీసం 25 శాతం మేరకు తగ్గించాలని 2013లో సమావేశమైన వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం మేరకు 2014–19 కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కార్యాచరణ ప్రణాళిక మేరకు డబ్ల్యూహెచ్‌ఓ వివిధ దేశాల ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలతో కలసి కంటిచూపు సమస్యల నివారణ దిశగా కృషి కొనసాగిస్తోంది.
 – ఫన్‌డే డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement