TVs
-
హైదరాబాద్ : అర్జున్ టీవియస్ షోరూంను ప్రారంభించిన హరీశ్‌రావు (ఫొటోలు)
-
స్మార్ట్ఫోన్లు, టీవీల ధరలు ఏ మాత్రం తగ్గుతాయి?
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2025-26లో కీలకమైన ఎలక్ట్రానిక్ విడి భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (BCD) తగ్గింపును ప్రకటించింది. దీంతో స్మార్ట్ఫోన్లు, టీవీల ధరలు తగ్గే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్‌ను సమర్పిస్తూ.. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచడం, దిగుమతి పరికరాలపై ధరల భారాన్ని తగ్గించడం లక్ష్యంగా అనేక చర్యలను వివరించారు.ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమైన బడ్జెట్ నిర్ణయాల్లో మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీస్ (PCBA)పై ప్రాథమిక కస్టమ్ సుంకాన్ని 20 శాతం నుండి 15 శాతానికి తగ్గించడం ఒకటి. ఈ చర్య భారతదేశంలో ఇంకా తయారు చేయని కొన్ని హై-ఎండ్ ఐఫోన్ మోడల్‌లతో సహా దిగుమతి చేసుకునే స్మార్ట్ఫోన్లు, ఉపకరణాల ధరను తగ్గిస్తుంది. స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గతంలో 2018లో ఈ సుంకాన్ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. ఇప్పుడు తాజా తగ్గింపు ఇంపోర్టెడ్ స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఒక అడుగుగా పరిగణించవచ్చు.దేశ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను మెరుగుపరచగలదంటూ పరిశ్రమ నాయకులు ఈ చర్యను స్వాగతించారు. మొబైల్ ఫోన్లు, పీసీబీఏ, ఛార్జర్లపై ప్రాథమిక కస్టమ్ సుంకాన్ని తగ్గించడంతోపాటు స్మార్ట్‌ఫోన్ తయారీకి అవసరమయ్యే ఇన్పుట్లు, ముడి పదార్థాలపై మినహాయింపులను ఇస్తే దేశీయ ఉత్పత్తి వాతావరణం మెరుగుపడుతుందని షావోమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ బి పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లో స్మార్ట్ఫోన్లను మరింత చవకగా మార్చడానికి ఇది సానుకూల దశ అని ట్రాన్షన్ ఇండియా సీఈవో అరిజీత్ తలపత్రా ప్రశంసించారు.పెద్ద తగ్గింపు ఉండకపోవచ్చు..కస్టమ్స్ సుంకం తగ్గింపు కచ్చికంగా తయారీదారులకు ఖర్చులను తగ్గించగలదు. అయితే రిటైల్ ధరలపై దాని ప్రత్యక్ష ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధరలో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అభిప్రాయపడుతున్నారు. సుంకం తగ్గింపు స్మార్ట్‌ఫోన్ ధరలలో 1-2 శాతం స్వల్ప తగ్గుదలకు దారితీయవచ్చు అంటున్నారు. అయితే వినియోగదారులకు అందించే ప్రయోజనం ఎంతనేది ఆయా తయారీదారులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పైపెచ్చు తక్కువ ధర స్మార్ట్ఫోన్లపై ఇప్పటికే తక్కువ మార్జిన్లు ఉంటున్నాయని, కాబట్టి ధరలో చెప్పుకోదగ్గ తగ్గింపు కనిపించకపోవచ్చు అంటున్నారు. -
పాపం కంటిపాపలు
తల్లిదండ్రులకు కంటిపాపలైన చిన్నారుల్లో కంటిచూపు క్రమంగా క్షీణిస్తోంది. సగటున ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు హ్రస్వదృష్టి (దూరంలోని వస్తువులు సరిగా కని్పంచని) సమస్యతో బాధపడుతున్నట్టు అంతర్జాతీయ విశ్లేషణ ఒకటి హెచ్చరించింది. ఆసియాలోనైతే సమస్య మరీ దారుణంగా ఉంది. జపాన్‌లో ఏకంగా 85 శాతం, కొరియాలో 73 శాతం మంది బాలలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆఫ్తల్మాలజీలో తాజాగా ప్రచురితమైన అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల పరిధిలోని 50కి పైగా దేశాల్లో విస్తృతంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆందోళనకర గణాంకాలు వెలుగులోకి వచి్చనట్టు పేర్కొంది. అధ్యయనంలో భాగంగా 50 లక్షలమందికి పైగా బాలలు, టీనేజర్లను పరీక్షించారు. స్కూలు పుస్తకాలతో కుస్తీకి తోడు స్క్రీన్ సమయం విపరీతంగా పెరగడం, ఆరుబయట గడిపే సమయం తగ్గడం పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2050 నాటికి కోట్లాది మంది పిల్లల కంటిచూపు బాగా ప్రభావితం అవుతుందని హెచ్చరించారు. హ్రస్వదృష్టి సాధారణంగా స్కూలుకు వెళ్లడం మొదలు పెట్టే దశలోనే మొదలవుతుంది. కళ్ల ఎదుగుదల ఆగిపోయేదాకా, అంటే 20 ఏళ్లొచ్చేదాకా సమస్య తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. సగం యువతకు సమస్యే → ప్రపంచవ్యాప్తంగా 36 శాతం మంది బాలలు హ్రస్వదృష్టితో బాధపడుతున్నారు. → 1990 నుంచి 2023 మధ్యకాలంలోనే సమస్య ఏకంగా మూడు రెట్లు పెరిగింది. → పిల్లల్లో హ్రస్వదృష్టి ఆసియా దేశాలతో పోలిస్తే ఆఫ్రికా దేశాల్లో ఏకంగా ఏడు రెట్లు తక్కువగా ఉండటం విశేషం. → ఉగాండాలో అతి తక్కువగా కేవలం ఒక్క శాతం మంది పిల్లల్లో మాత్రమే హ్రస్వదృష్టి నమోదైంది. → ఆఫ్రికా దేశాల్లో పాఠశాల విద్య ఆరు నుంచి ఎనిమిదేళ్ల వయస్సులో ప్రారంభమ తుంది. పైగా పిల్లలు ఆరుబయట ఎక్కువగా గడుపుతున్నారు. దాంతో అక్క డ బాలలు, యువకుల్లో సమస్య తక్కువగా ఉంది. → జపాన్‌లో ఏకంగా 85%, దక్షిణ కొరియాలో 73% పిల్లలకు హ్రస్వదృష్టి ఉంది. → చైనా, రష్యాల్లో 40 % కంటే ఎక్కువగా, యూకే, ఐర్లాండ్, అమెరికాల్లో 15 శాతానికి పైగా పిల్లల్లో సమస్య ఉంది. → మిగతా ఖండాలతో పోలిస్తే ఆసియాలో 2050 నాటికి ఏకంగా 69 శాతం మంది హ్రస్వదృష్టి బారిన పడతారు. → అప్పటికి ప్రపంచ యువతలో కనీసం సగానికి సగం ఈ సమస్యను ఎదుర్కొంటారు. → వర్ధమాన దేశాల్లో 2050 నాటికి 40% మంది దీని బారిన పడే అవకాశముంది. → పిల్లలను రెండేళ్ల వయసులోనే బడిబాట పట్టించే సింగపూర్, హాంకాంగ్ వంటిచోట్ల సమస్య విస్తరిస్తోంది. → కోవిడ్ లాక్డౌన్ సమయంలో బాలల్లో హ్రస్వదృష్టి సమస్య బాగా పెరిగింది. → కోట్లాది మంది ఇళ్లకే పరిమితమై స్మార్ట్ ఫోన్లు, టీవీలు విపరీతంగా చూడటం దీనికి ప్రధాన కారణం. అమ్మాయిల్లోనే ఎక్కువ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే హ్రస్వదృష్టి ఎక్కువగా కని్పస్తున్నట్టు అధ్యయనం తేలి్చంది. ‘‘అబ్బాయిలతో పోలిస్తే ఎదిగేక్రమంలో వాళ్లు ఇంట్లో గానీ, స్కూల్లో గానీ ఆటలపై, ఆరుబయట, గడిపే సమయం తక్కువ. వీటికితోడు ఆహారపు అలవాట్లు తదితరాల వల్ల చాలా చిన్నవయసులోనే రజస్వల అవుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారిలో చాలావరకు టీనేజ్లోనే హ్రస్వదృష్టి బారిన పడుతున్నారు’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ స్కూటర్‌ను 8 లక్షల కంటే ఎక్కువ మంది కొనేశారు
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. గత దశాబ్ద కాలంలో 10 మిలియన్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో జుపీటర్, జుపీటర్ 125 అమ్మకాలు మాత్రం 63 శాతం ఉన్నట్లు సమాచారం.భారతీయ స్కూటర్ మార్కెట్లో జుపీటర్, జుపీటర్ 125 వాటా 25 శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. జుపీటర్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 844863 యూనిట్లు. గడిచిన 10 ఆర్ధిక సంవత్సరాల్లో జుపీటర్ పొందిన అత్యుత్తమ అమ్మకాలు ఇవే అని స్పష్టమవుతోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో జుపీటర్ అమ్మకాలు కేవలం 98937 యూనిట్లు మాత్రమే.110సీసీ, 125సీసీ వేరియంట్లలో అమ్ముడవుతున్న ఈ స్కూటర్ ప్రస్తుతం టీవీఎస్ బెస్ట్ సెల్లింగ్ వెహికల్3. కాగా టీవీఎస్ కంపెనీకి చెందిన రైడర్ 125 (478443 యూనిట్లు), ఎక్స్ఎల్ (481803 యూనిట్లు), అపాచీ (378112 యూనిట్లు), ఎన్‌టార్క్ 125 (331865 యూనిట్లు) వేహనాలు ఉత్తమ అమ్మకాలను పొందగలిగాయి. -
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చంటే సామాన్యుల కాలు కదలకుండా ఉంటుందా..? మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఇలాంటి ఆఫరే ఇస్తున్నారు. మూడో దశలో భాగంగా ఈ నెల 7న భోపాల్‌లో పోలింగ్ జరుగుతోంది. ఆ రోజున ఓటేసే వారి పేర్లనుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీయనున్నారు. విజేతలకు వజ్రపు ఉంగరాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర కానుకలిస్తారట! ‘‘నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10, మధ్యాహ్నం 3, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులిస్తం. పోలింగ్ మర్నాడు మెగా డ్రా తీసి విజేతలకు మరింత పెద్ద బహమతులిస్తాం’’అని జిల్లా ఎన్నికల అధికారి కౌసలేంద్ర విక్రమ్ సింగ్ ప్రకటించారు. ఓటింగ్ పెంచేందుకే.. మధ్యప్రదేశ్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల్లో పోలింగ్ 2019తో పోలిస్తే సగటున 8.5 శాతం తగ్గింది. 2019లో భోపాల్‌లో 65.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నందున ఓటర్లు పెద్దగా ఇల్లు కదలకపోవచ్చన్న ఆందోళనలున్నాయి. దీంతో ఎలాగైనా ఓటింగ్‌ను పెంచాలని ఈసీ కృత నిశ్చయంతో ఉంది. భోపాల్ నియోజకవర్గంలో 3,097 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి బూత్ వద్ద ఒక బీఎల్వో, వలంటీర్‌ను లక్కీ డ్రా కోసం నియమించారు. ఓటేశాక అక్కడి కూపన్ బుక్‌లెట్‌లో పేరు, మొబైల్ నంబర్ రాసి రసీదు తీసుకోవాలి. బహమతుల ఖర్చును కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీలు భరిస్తున్నాయి. మెగా డ్రా కోసం డైమండ్ ఉంగరాలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు ఎనిమిది డిన్నర్ సెట్లు, రెండు మొబైల్ ఫోన్లు రెడీగా ఉన్నాయి. దీంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో తొలి ఓటర్ను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Samsung : రూ.10,000 కోట్ల వ్యాపార లక్ష్యం
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీ దిగ్గజం శామ్సంగ్ టీవీల అమ్మకాల ద్వారా 2024లో భారత మార్కెట్లో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా చేసుకుంది. రూ.10 వేల కోట్ల మైలురాయిని చేరుకోవడం ఇప్పటి వరకు ఏ కంపెనీ సాధించలేదని కంపెనీ వెల్లడించింది. మధ్య స్థాయి, ప్రీమియం టీవీల విభాగంలో పరిమాణం పరంగా వృద్ధిలో ఉన్నట్టు శామ్సంగ్ ఇండియా విజువల్ డిస్ప్లే బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ తెలిపారు. ‘ప్రీమియం టీవీలపై పెద్ద ఎత్తున ఫోకస్ చేశాం. కంపెనీ విక్రయాల్లో ఈ విభాగం వాటా 40%. యూహెచ్డీ, పెద్ద స్క్రీన్ టీవీల విక్రయాలతో ఈ ఏడాది వృద్ధి ఉంటుంది. ప్రీమియం ఉత్పత్తులకు మెట్రోలు, చిన్న పట్టణాల నుంచీ డిమాండ్ ఉంది’ అని వివరించారు. సంస్థకు 21 శాతం వాటా.. శామ్సంగ్ భారత్‌లో 2022–23లో రూ.98,924 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఇందులో 70 శాతం మొబైల్స్ అమ్మకాల ద్వారా కాగా మిగిలినది టీవీలు, ఇతర ఉపకరణాల ద్వారా సమకూరింది. దేశీయ టీవీల విపణిలో పరిమాణం పరంగా సంస్థకు 21 శాతం వాటా ఉంది. శామ్సంగ్ తాజాగా ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ టీవీలను భారత్‌లో ప్రవేశపెట్టింది. పిక్చర్ స్పష్టంగా, సహజత్వం ఉట్టిపడేలా ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటి ప్రారంభ ధర రూ.1.39 లక్షలు. ఓఎల్ఈడీ టీవీల ప్రారంభ ధర రూ.1.64 లక్షలు. కాగా, శామ్సంగ్ దేశీ విక్రయ టీవీల్లో 90% భారత్‌లో తయారైనవే. దేశంలో ఏటా అన్ని బ్రాండ్లలో కలిపి 1.2 కోట్ల యూనిట్ల టీవీలు అమ్ముడవుతున్నాయని అంచనా. -
భారత్‌కు జపాన్ కంపెనీ.. పక్కా ప్లాన్‌తో వచ్చేస్తోంది
ఒకప్పుడు భారతదేశంలో లాన్సర్, పజెరో వంటి మోడల్స్ విక్రయించిన మిత్సుబిషి 2016లో తమ ఉత్పత్తుల అమ్మకాలను పూర్తిగా నిలిపివేసింది. ఆ తరువాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సర్వత్రా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ కార్ డీలర్‌షిప్‌లను నిర్వహిస్తున్న టీవీఎస్ మొబిలిటీలో 30 శాతం కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేసినట్లు సమాచారం. మిత్సుబిషి కంపెనీ భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి 33 మిలియన్ డాలర్ల నుంచి 66 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. టీవీఎస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని 30శాతం వాటాను కొనుగోలు చేయడంతో.. ప్రస్తుత నెట్‌వర్క్‌లో దాదాపు 150 అవుట్లెట్లను ఉపయోగించుకుని, ప్రతి కార్ బ్రాండ్‌కు ప్రత్యేక స్టోర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ పూర్తయిన తరువాత మిత్సుబిషి భారతదేశంలో అతిపెద్ద స్వతంత్ర కార్ డీలర్‌షిప్‌లలో ఒకటిగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కంపెనీ దేశీయ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. వాహన విక్రయాలతో పాటు, స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా నిర్వహణ అపాయింట్మెంట్లు, ఇన్సూరెన్స్ వంటివి సులభతరం చేయడం వంటి వినూత్న సేవలను ప్రవేశపెట్టాలని మిత్సుబిషి యోచిస్తోంది. భారత ఆటోమోటివ్ మార్కెట్లో పోటీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అమ్మకాలను పెంపొందించుకోవడమే లక్ష్యంగా సంస్థ యోచిస్తోంది. ఇదీ చదవండి: హాలీవుడ్ హీరో కాదు.. ఫేమస్ బిజినెస్ మ్యాన్ - గుర్తుపట్టారా? -
ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఐక్యూబ్’ అదుర్స్.. యూరప్ మార్కెట్లోకి టీవీఎస్
ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో తయారీ సంస్థల మధ్య పోటీ మొదలైంది. పెట్రోల్ ధరలు అధికంగా ఉండడంతో విద్యుత్ వాహనాలవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. విక్రయాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఈవీ మార్కెట్‌ను విస్తరించేందుకు ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ టీవీఎస్ సిద్ధమైంది ఎలక్ట్రిక్ వెహికల్ విభాగాన్ని మరింత విస్తరించేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా వివిధ ధరల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. చెన్నై కేంద్రంగా టీవీఎస్ ప్రస్తుతం రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్ముతుంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్‌కు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని ఆ సంస్థ సీఈఓ కేఎన్.రాధకృష్ణన్.. వచ్చే ఏడాది వ్యవధిలో 5- 25 కిలోవాట్ల మధ్య శ్రేణిలో వరుస స్కూటర్లను విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం, ఐక్యూబ్ డిమాండ్ దృష్ట్యా నెలవారీ సామార్ధ్యాన్ని మరింత పెంచనున్నట్లు తెలిపారు. మరోవైపు రానున్న రెండు, మూడు త్రైమాసికాల్లో మార్కెట్లో ఐక్యూబ్‌ను యూరప్ మార్కెట్లోకి ప్రవేశిస్తామన్నారు.దశలవారీగా ఇతర మార్కెట్లకూ విస్తరిస్తామని టీవీఎస్ సీఈఓ రాధకృష్ణన్ చెప్పారు. -
48 గంటల్లో 9.5 కోట్ల మంది విజిటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత సీజన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన తొలి 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9.5 కోట్ల మంది పైచిలుకు కస్టమర్లు తమ పోర్టల్‌ను సందర్శించినట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డైరెక్టర్ (స్మార్ట్ఫోన్లు, టీవీలు) రంజిత్ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, టీవీల విక్రయాలకు సంబంధించి తమ టాప్ 3 మార్కెట్లలో రాష్ట్రాలపరంగా తెలంగాణ, నగరాలవారీగా హైదరాబాద్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్లో తెలంగాణలో టీవీలకు రెండు రెట్లు డిమాండ్ కనిపించగా, 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు 60 శాతం పెరిగాయని రంజిత్ బాబు చెప్పారు. ఎక్కువగా ప్రీమియం స్మార్ట్ఫోన్లు, పెద్ద స్క్రీన్ టీవీలవైపు కస్టమర్లు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తమ ప్లాట్‌ఫాంపై 50,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని గురువారమిక్కడ ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన అమెజాన్ ఎక్స్పీరియన్స్ ఎరీనా (ఏఎక్స్ఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో వివిధ ఉత్పత్తులను ప్రదర్శించే జోన్లను ఏర్పాటు చేశారు. మరికొన్నాళ్లు కొనసాగే ఫెస్టివల్లో బ్యాంకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఎక్సే్చంజ్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తున్నట్లు రంజిత్ బాబు వివరించారు. -
టీవీఎస్–బీఎండబ్ల్యూ తొలి ఎలక్ట్రిక్ బైక్ తయారీ ప్రారంభం
హోసూరు: బీఎండబ్ల్యూ మోటోరాడ్ సహకారంతో టీవీఎస్ మోటార్ కంపెనీ, తొలి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ‘సీఈ 2’ తయారీని శుక్రవారం హోసూరు ప్లాంట్‌లో ప్రారంభించింది. బీఎండబ్ల్యూ, టీవీఎస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ఈ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. ఈ సందర్భంగా బీఎండబ్ల్యూ జీ310 సీసీ మోటారు సైకిల్ లక్షన్నర వాహనాన్ని విడుదల చేశారు. టీవీఎస్ మోటార్, బీఎండబ్ల్యూ మోటార్ సంయక్తంగా బీఎండబ్ల్యూ జీ310ఆర్, బీఎండబ్ల్యూ 310 జీఎస్, బీఎండబ్ల్యూ జీ310ఆర్ఆర్, టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310, టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 310 వాహనాలను విక్రయిస్తున్నాయి. ఇరు కంపెనీలు అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ బైక్ సీఈ02ను తొలుత యూరప్ మార్కెట్లో విక్రయించనున్నారు. తర్వాత భారత్ మార్కెట్లో విడుదల చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. సీఈ2 తయారీ, 310 సీసీ బైక్ 1,50,000 యూనిట్‌ను ఒకే రోజు ఉత్పత్తి చేయడం ప్రత్యేక సందర్భంగా కంపెనీ సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ గ్రూప్ విక్రయాల్లో టీవీఎస్ మోటార్ వాటా 12 శాతంగా ఉంటుందని తెలిపారు. రెండు గ్రూపుల మధ్య బంధం మరిన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఈ స్కూటర్ కొనే డబ్బుతో 'హిమాలయన్' బైక్ కొనేయొచ్చు! ధర ఎంతో తెలుసా?
TVS X Electric Scooter: చాలా రోజుల తరువాత టీవీఎస్ కంపెనీ ఎట్టకేలకు తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎక్స్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.50 లక్షలు కావడం గమనార్హం. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ ఛార్జ్‌తో 140 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది కేవలం 50 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం (హోమ్ ర్యాపిడ్ ఛార్జర్), 4 గంటల 30 నిమిషాల్లో 950 వాల్స్ పోరాటబుల్ ఛార్జర్ సాయంతో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. పోర్టబుల్ ఛార్జర్ ధర రూ. 16,275. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లోని పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (PMSM) 11 kW పీక్ పవర్, 40 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ స్కూటర్ ముందువైపు 220 మిమీ డిస్క్, వెనుకవైపు 195 మిమీ డిస్క్ ఉంటుంది. 12 ఇంచెస్ చక్రాలమీద 100 సెక్షన్ టైర్స్ ఉంటాయి. కావున మంచి రైడింగ్ అనుభూతిని అందించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఫీచర్స్.. టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ XLETON ప్లాట్‌ఫారమ్‌పై తయారై 770 మిమీ ఎత్తుగల సీట్ పొందుతుంది. ఇది కేవలం 2.6 సెకన్లలో 40 కిమీ/గంట వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటాకు 105 కిమీ కావడం గమనార్హం. ఇందులో Xtealth, Xtride, Xonic అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అంతే కాకుండా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఇందులో లభిస్తుంది. ఇదీ చదవండి: ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు 'రన్నరప్' కాదు.. ఈ లేటెస్ట్ బైక్ 10.25 ఇంచెస్ TFT డ్యాష్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీతో మ్యూజిక్ ప్లేబ్యాక్ అండ్ నావిగేషన్ అలర్ట్‌లను ఎనేబుల్ చేసే ఫీచర్లను పొందుతుంది. వీటితో పాటు రివర్స్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, హిల్-హోల్డ్ ఫంక్షన్ వంటివి ఉంటాయి. అండర్ సీట్ స్టోరేజ్19 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ రోజు రాత్రి నుంచి బుక్ చేసుకోవచ్చు. అయితే దీనిపైన ఎలాంటి ఫేమ్ 2 సబ్సిడీ లభించదు.డెలివరీలు నవంబర్ నెలలో (బెంగళూరులో) ప్రారంభమవుతాయి. 2024 మార్చి తరువాత దేశవ్యాప్తంగా ప్రారంభమవుటాయి. కాగా మొదటి 2000 మంది కస్టమర్లకు స్మార్ట్‌వాచ్ అండ్ రూ. 18,000 విలువైన 'క్యూరేటెడ్ కన్సైర్జ్' ప్యాకేజీ ఉచితంగా లభిస్తుంది. -
టీవీఎస్ నుంచి కొత్త బైక్.. పేరేంటో తెలుసా?
అనేక ఆధునిక వాహనాలు భారతీయ మార్కెట్లో అడుగుపెడుతున్న తరుణంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' (TVS Motor) దేశీయ విఫణిలో ఓ కొత్త బైక్ విడుదల చేయడానికి ట్రేడ్ మార్క్ దాఖలు చేసింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. కంపెనీ 'అపాచీ ఆర్టీఎక్స్' (Apache RTX) అనే నేమ్‌ప్లేట్‌ను ట్రేడ్‌మార్క్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ బైక్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అపాచీ విభాగంలో 160సీసీ, 180సీసీ, 200సీసీ, 310సీసీ బైకులు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. కాగా ఈ సెగ్మెంట్లో మరో కొత్త మోడల్ చేరటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!) అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్‌పై టీవీఎస్ కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో కంపెనీ ఇప్పటి వరకు ఒక బైక్ కూడా విడుదల చేయలేదు. రాబోయే కొత్త బైక్ టీవీఎస్ ఆర్టీఆర్ కంటే భిన్నంగా ఉండే అవకాశం ఉందనిపిస్తోంది. అంతే కాకుండా చాలా మంది వాహన ప్రియులు అడ్వెంచర్ బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఈ బైకులు ఆల్ ఇన్ వన్ బైకులుగా ఉపయోగపడుతున్నట్లు చెబుతున్నారు. (ఇదీ చదవండి: స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్‌పై ఇంకా అనుమానం ఉందా? ఇదిగో క్లారిటీ!) కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త బైక్ తప్పకుండా ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగి పనితీరు పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తగ్గకుండా ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ బైక్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వంటి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఓలా టెక్నాలజీ అదిరింది..హెల్మెట్ లేకపోతే బండి స్టార్ట్ కాదు!
జుట్టు ఊడిపోతుందని, సిగ్నల్ జంప్ చేసినా ఎవరూ పట్టించుకోరనే ధీమాతో హెల్మెట్ పెట్టుకోకుండా ఎలక్ట్రిక్ బైక్‌లను నడుపుతున్నారా? కానీ రానున్న రోజుల్లో అలా సాధ్యం కాదు. ఎందుకంటే? హద్దులు చెరిపేస్తున్న టెక్నాలజీ!! హెల్మెట్ పెట్టుకోకుండా వాహననాన్ని నడిపే వాళ్ల భరతం పట్టనుంది. ఎలా అంటారా? దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ ఓలా కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నట్లు తెలిపింది. హెల్మెట్ లేని కారణంగా రోజురోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల్ని నివారించేలా అధునాతమైన సాంకేతికతను ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లలో ఉపయోగించనుంది. ఇందుకోసం వాహనదారులు హెల్మెట్ పెట్టుకున్నారా? హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నారా? అని గుర్తించేలా కెమెరాలను అమర్చనుంది. ఈ కెమెరాలు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్న వాహనదారుల సమాచారాన్ని వెహికల్ కంట్రోల్ యూనిట్ (వీసీయూ)కు అందిస్తుంది. వెంటనే వీసీయూ విభాగం మోటర్ కంట్రోల్ యూనిట్‌కు చేరవేస్తుంది. అప్పుడు మోటర్ కంట్రోల్ యూనిట్ మీరు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటే ఆటోమెటిగ్గా బండి ఆగిపోనుందంటూ ప్రముఖ ఆటోమొబైల్ బ్లాగ్ ఆటోకార్ కార్ ఇండియా నివేదికను విడుదల చేసింది. ఈ విధంగా, రైడర్ హెల్మెట్ ధరించలేదని సిస్టమ్ గుర్తిస్తే, ఓలా స్కూటర్లు ఆటోమేటిక్‌గా పార్క్ మోడ్‌కి మారుతాయి. పార్క్ మోడ్‌లో ఒకసారి, హెల్మెట్ ధరించమని రైడర్‌కు గుర్తు చేయడానికి డాష్‌పై నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత, రైడర్ హెల్మెట్ ధరించినట్లు గుర్తిస్తేనే స్కూటర్ రైడ్ మోడ్‌కి మారుతుంది. తరువాత, సిస్టమ్ రైడర్‌ను పర్యవేక్షించడాన్ని కొనసాగిస్తుందని నివేదికలో పేర్కొంది. ఈ సాంకేతికతను వినియోగిస్తున్న ఆటోమొబైల్ సంస్థల్లో ఓలాతో పాటు, కెమెరా ఆధారిత హెల్మెట్ రిమైండర్ సిస్టమ్‌ను రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు టీవీఎస్ ఇటీవల ప్రకటించింది. అయితే, హెల్మెట్ లేకుండా వాహనదారుడు ప్రయాణించకుండా ఆపేలా టెక్నాలజీని వినియోగంలో ఓలా మరో అడుగు ముందుకు వేసింది. టీవీఎస్ హెల్మెట్ ధరించమని గుర్తుచేసే హెచ్చరిక సందేశం మాత్రమే రైడర్లకు కనిపిస్తుందని, డ్రైవర్ హెల్మెట్ ధరించని సందర్భాల్లో స్కూటర్‌ను పార్క్ మోడ్‌లో ఉంచడం గురించి టీవీఎస్ పనిచేస్తుందా? లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదని ఏసీఐ వెల్లడించింది. చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’! -
టీవీ, రేడియోల్లోనూ వాతావరణ హెచ్చరికలు
న్యూఢిల్లీ: తీవ్ర వాతావరణ హెచ్చరికలను ఇకపై టీవీలు, రేడియోల్లోనూ ప్రసారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ వర్షాలు, తుపాన్లు, వడగాలుల గురించి మొబైల్ ఫోన్లకు మెసేజీలు పంపే ప్రక్రియను ఇప్పటికే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ప్రారంభించింది. రెండో దశలో టీవీ, రేడియో తదితర మాధ్యమాల ద్వారా కూడా హెచ్చరికల మెసేజీలను పంపే ప్రక్రియ ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని ఎన్డీఎంఏ అధికారి ఒకరు చెప్పారు. -
సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా దినేశ్‌కు బాధ్యతలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2023–24) భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా టీవీఎస్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్ దినేశ్ బాధ్యతలు స్వీకరించారు. బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. అలాగే, ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఇండియా చైర్మన్ రాజీవ్ మెమాని సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన సీఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో 2023–24కు గాను కొత్త ఆఫీస్–బేరర్లను ఎన్నుకున్నారు. -
మళ్లీ ఐపీవోకు టీవీఎస్ సప్లై చైన్
న్యూఢిల్లీ: టీవీఎస్ మొబిలిటీ గ్రూప్ కంపెనీ టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయడంతోపాటు.. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 2 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ఇంతక్రితం 2022 ఫిబ్రవరిలో ప్రాథమిక పత్రాలను దాఖలు చేయడం ద్వారా సెబీ నుంచి అదే ఏడాది మే నెలలో లిస్టింగ్‌కు అనుమతి పొందింది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. అయితే మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఐపీవో యోచనకు స్వస్తి పలికింది. నిబంధనల ప్రకారం అనుమతి పొందాక గడువు(ఏడాది)లోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టకుంటే తిరిగి తాజాగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. -
ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర రూ.50వేలు లోపే .. అస్సలు మిస్ అవ్వొద్దు!
రద్దీగా ఉండే రోడ్లు, భారీ ట్రాఫిక్ జామ్ సమయాల్లో కార్లలో ప్రయాణించడం చాలా కష్టం. అందుకే అలాంటి క్లిష్ట సమయాల్లో ప్రయాణం సాఫిగా జరిగేలా స్కూటర్లను కొనుగోలు చేసేందుకు వాహనదారులు మొగ్గు చూపుతుంటారు. మీరూ అలా తక్కువ బడ్జెట్లో అంటే రూ.50 వేలకే స్కూటర్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ధరల్లో స్కూటర్లను అందించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు పోటీపడుతున్నాయి. అందుకే ఇప్పుడు మనం ధర తక్కువ, మైలేజ్, నిర్వహణ ఖర్చుల్ని తగ్గిస్తూ ప్రయాణానికి సౌకర్యంగా ఉండే స్కూటర్ల గురించి తెలుసుకుందాం. టీవీఎస్ ఎక్స్ఎల్ 100 ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ ‘టీవీఎస్ ఎక్స్ఎల్ 100 (TVS XL100)’ పేరుతో 6 మోడళ్లు, 15 రకాల రంగులతో రూ.46,671 నుంచి రూ.57,790 ధరతో స్కూటర్లను అందిస్తుంది. 99పీపీ బీఎస్6 ఇంజిన్‌తో 4.4 హార్స్ పవర్, 6.5 ఎన్ఎం టారిక్ను ఉత్పత్తి చేస్తుంది. వెహికల్ ముందు, వెనుక రెండు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. దీని బరువు 89 కిలోలు, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 4 లీటర్లు.సైలెంట్ స్టార్టర్, ఇంజిన్ కిల్‌స్విచ్, యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ (డీఆర్ఎల్)తో వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన వెహికల్స్‌లో ఇదొకటి. కొమాకి ఎక్స్‌జీటీ కేఎం Komaki XGT KM ఎలక్ట్రిక్ స్కూటర్. ఢిల్లీ కేంద్రంగా 35ఏళ్ల నుంచి ఆటోమొబైల్ రంగంలో రాణిస్తున్న కేఐబీ కొమాకి సంస్థకు చెందిన ఈ స్కూటర్లో అండర్‌సీట్ స్టోరేజ్ కంపార్ట్మెంట్, డిటాచబుల్ బ్యాటరీ ఉంటుంది. హెల్మెట్ పెట్టుకునేందుకు వీలుగా స్థలం ఉంది. అదనంగా Komaki XGT KM డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ లాక్ ఇలా అనేక ఫీచర్లు ఉన్నాయి. అదనపు భద్రత కోసం ముందు చక్రం డిస్క్ బ్రేకులు అమర్చబడ్డాయి. పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు, XGT KM 130-150కిమీల పరిధిని కవర్ చేయగలదు. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 6-8 గంటలు పడుతుంది. అవాన్ ఇ లైట్ Avon E Lite దేశీయంగా అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇదికొటి. కేవలం రూ. 28,000కి కొనుగోలు చేయొచ్చు. పూర్తి ఛార్జ్ తర్వాత, E లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 50 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఫుల్ ఛార్జింగ్ చేసేందుకు 4-8 గంటలు పడుతుంది. లోహియా ఓమా స్టార్ Lohia Oma Star దేశీయంగా తయారు చేసింది. క్లచ్ తక్కువ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్, సీటు కింద స్టోరేజ్ బాక్స్‌ను కలిగి ఉంది. స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 60 కిమీ/ఛార్జ్ వరకు ప్రయాణించగలదు. దీని ప్రారంభం ధర రూ.41,444 ఉండగా.. ఖరీదైన వేరియంట్ ధర రూ.51,750కే కొనుగోలు చేయొచ్చు. ఎవాన్ ఈ స్కూట్ Avon E Scoot 65 కిమీ/ఛార్జ్ పరిధితో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ.45,000 నుంచి రూ. 50,000 లోపు అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. టెక్కో ఎలక్ట్రా నియో Techo Electra Neo భారత్‌లో తయారైంది. రూ. 41,919 ధరతో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్. నాలుగు విభిన్న రంగులలో లభిస్తుంది. టెక్కో ఎలెక్ట్రా నియో మోటారు 250 డబ్ల్యూ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ ముందు, వెనుక రెండు డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది, బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్ సుమారు 5-7 గంటలు పడుతుంది.సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, డిజిటల్ స్పీడోమీటర్, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్,విశాలమైన స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటి ఇతర సదుపాయాలు ఉన్నాయి. -
60కిపైగా దేశాల్లో రయ్.. రయ్, అపాచీ సరికొత్త రికార్డులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ మరో రికార్డు నమోదు చేసింది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా 50 లక్షల యూనిట్ల అపాచీ ప్రీమియం మోటార్ సైకిళ్లను విక్రయించి కొత్త మైలురాయిని అధిగమించింది. 2005లో అపాచీ మోటార్ సైకిల్ తొలిసారిగా రోడ్డెక్కింది. 60కిపైగా దేశాల్లో ఈ బైక్స్ పరుగెడుతున్నాయి. అంతర్జాతీయంగా వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్లలో అపాచీ ఒకటిగా నిలివడం విశేషం. సెగ్మెంట్లో తొలిసారిగా, అలాగే వినూత్న ఫీచర్లతో ఈ బైక్ అప్‌గ్రేడ్ అవుతూ వస్తోందని కంపెనీ తెలిపింది. రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, రైడ్ మోడ్స్, డ్యూయల్ చానెల్ఏబీఎస్, రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్ వంటివి వీటిలో ఉన్నాయి. అపాచీ సిరీస్‌లో ఆర్టీఆర్ 160, 160 4వీ, 180, 200 4వీ, ఆర్ఆర్ 310 మోడళ్లు ఉన్నాయి. అత్యుత్తమ పనితీరు, సాంకేతికత, శైలితో ప్రీమియం మోటార్‌సైకిల్స్ విభాగంలో అపాచీ కొత్త ప్రమాణాలను సృష్టిస్తోందని టీవీఎస్ మోటార్ తెలిపింది. -
‘ప్రీమియం ఉత్పత్తులకు’ సై!
న్యూఢిల్లీ: పండుగల విక్రయాలు జోరుగా సాగాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీల అంచనాలను మించి అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రీమియం (ఖరీదైన), మధ్య శ్రేణి ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ కనిపించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు విక్రయాలకు అడ్డుపడకపోవడం వాటిని ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఈ ఏడాది పండుగల సీజన్లో విక్రయాలు విలువ పరంగా 30 శాతం, సంఖ్యా పరంగా 20 శాతం వృద్ధిని చూసినట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రకటించింది. ‘‘ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు మంచిగా సాగాయి. మధ్యశ్రేణి నుంచి ఖరీదైన ఉత్పత్తుల వరకే చూస్తే అమ్మకాల్లో 30 శాతం, విలువలో 40–50 శాతం వృద్ధి నమోదైంది. ముఖ్యంగా పండుగల చివరి మూడు రోజుల్లో ఎక్కువ డిమాండ్ కనిపించింది’’అని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. కానీ, ఆరంభ ధరల్లోని ఉత్పత్తుల అమ్మకాలు ఈ పండుగల సీజన్లో 10–15 శాతం తగ్గినట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒత్తిళ్లు ఒక కారణం అయితే, కొందరు వినియోగదారులు ఆరంభ స్థాయి నుంచి తదుపరి గ్రేడ్ ఉత్పత్తులకు మారిపోవడం మరో కారణమని వివరించారు. ఖరీదైన వాటికి ఆదరణ.. ఖరీదైన గృహోపకరణాలకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్యానాసోనిక్ మార్కెటింగ్ ఇండియా ఎండీ ఫుమియసు ఫుజిమోరి తెలిపారు. ఈ పండుగ సీజన్లో ఏసీలు, పెద్ద తెరల టీవీలు, హోమ్ అప్లయన్సెస్ విక్రయాలు డబులు డిజిట్లో పెరుగుతాయన్న అంచనాతో ఉన్నట్టు చెప్పారు. ‘‘విలువ పరంగా చూస్తే ఇన్వెస్టర్ ఏసీల అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదైంది. ఎల్ఈడీ టీవీల అమ్మకాలు 10 శాతం పెరిగాయి. 4కే టీవీల అమ్మకాల్లో అయితే ఏకగా 34 శాతం వృద్ధి కనిపించింది. టాప్లోడ్ వాషింగ్ మెషిన్లలో 13 శాతం అధిక వృద్ధి నమోదైంది’’అని ఫుజిమోరి వివరించారు. విద్యుత్‌ను ఆదా చేసే ఏసీలు, వినియోగం సులభంగా ఉండే ఉత్పత్తులకు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ వృద్ధి ఇలాగే స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికంలో అధిక వృద్ధి ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హెచ్‌యూఎల్ ఎండీ సంజీవ్ మెహతా స్పందిస్తూ.. సెప్టెంబర్ త్రైమాసికంలో విక్రయాలు ఇటీవలి కాలంలోనే ఎక్కువగా నమోదైనట్టు చెప్పారు. దీపావళి తర్వాత విక్రయాల తీరును కూడా గమనించాల్సి ఉంటుందన్నారు. తక్కువ ధరల వాటితో పోలిస్తే ప్రీమియం ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు పాపులర్ బ్రాండ్ల కంటే మించి ఉన్నాయి. అలాగే, చౌక ఉత్పత్తులతో పోలిస్తే పాపులర్ ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి’’అని సంజీవ్ మెహతా వివరించారు. ప్రీమియం విభాగంలో వృద్ధి ఎక్కువగా ఉండడం ప్రజల వద్ద ఖర్చు పెట్టే ఆదాయం పెరిగిందనడానికి సూచనగా పేర్కొన్నారు. -
వన్‌ప్లస్ దివాలీ సేల్.. కళ్లు చెదిరే డీల్స్
సాక్షి,ముంబై: ఫెస్టివ్ సీజన్లో కస్టమర్లను ఆఫర్ల వర్షం రారమ్మని పిలుస్తోంది. ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబర్ 23 నుంచి డిస్కౌంట్‌సేల్‌కు తెరలేవనుంది. మరోవైపు చైనీస్ స్మార్ట్‌ఫోన్ మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో సెప్టెంబర్ 22 నుంచి దివాలీ సేల్‌ను ప్రారంభిస్తోంది. స్మార్ట్ఫోన్లు, టీవీఎస్ ఇయర్‌బడ్‌లు, టీవీలు, మరిన్నింటిపై డిస్కౌంట్లులభ్యం. అదనంగా, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డ్ హోల్డర్లు 6వేల వరకు తక్షణ తగ్గింపును పొందగలరు. 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్‌కూడా అందిస్తోంది. అంతేకాకుండా, దీపావళి హెడ్ స్టార్ట్ సేల్ 2022 వన్‌ప్లస్ ఉత్పత్తుల కోసం రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కూపన్లను కూడా అందిస్తుంది. అలాగే వన్‌ప్లస్ ఇండియా వెబ్సైట్లో ప్రస్తుతం ఫ్లిప్ అండ్ విన్ ఛాలెంజ్ కూడా ఉంది. ఈ సేల్‌లో ముఖ్యంగా వన్‌ప్లస్ 10 ప్రొను రూ 55,999 కి విక్రయిస్తోంది. దీని లాంచింగ్ ధర రూ 66,999. అంటే రూ 11,000 డిస్కౌంట్ ధరతో అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో పాటు డిస్కౌంట్లతో కలిపి ఈ మొత్తం తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తోంది. అలాగే వన్‌ప్లస్ 10ఆర్ 5జీ 29,999లకే అందించనుంది. ఎంఆర్పీ ధర 34,999. అలాగే వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ ఫోన్నరెండవేల తగ్గింపుతో రూ. 26,999కే విక్రయించ నుంది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో స్మార్ట్ఫోన్లు, అలాగే టీవీలు ఇతర ఉత్పత్తులను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22 నుంచి ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. -
లక్ష రూపాయల లోపు లభించే సూపర్‌బైక్స్ ఇవే!
సాక్షి, ముంబై: 190 మిలియన్లకు పైగా వాహనాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా నిలస్తోంది ఇండియా. ముఖ్యంగా హోండా,హీరో, బజాజ్, టీవీఎస్ లాంటి కంపెనీలతోపాటు బీఎండబ్ల్యూ లాంటి లగ్జరీ బైక్‌లో మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఎక్కువ మైలేజీ, స్మార్ట్ ఫీచరలతో లభించే ట్రెండీలుక్స్తో సరసమైన ధరలో లభించే బైక్స్‌పై కొనుగోలుదారులు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్ష రూపాయలలోపు ధరలో అందుబాటులోఉన్న బైక్‌లపై ఓ లుక్కేద్దాం. హోండా ఎస్పీ125 బీఎస్-6 నిబంధనలకుఅనుగుణంగా వచ్చిన హోండా తొలి బైక్ హోండా ఎస్పీ 125. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన BS6 కంప్లైంట్ 125cc ఇంజన్‌తో10.5bhp గరిష్ట శక్తిని 10.3Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈబైక్ రెండు వేరియంట్లలో, 5 కలర్స్‌లో లభిస్తోంది. ప్రారంభ ధర రూ. 82,243 (ఎక్స్-షోరూమ్) హీరో గ్లామర్ హీరోకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి హీరో గ్లామర్ ..124.7cc ఇంజన్‌తో పనిచేస్తుంది.ఇది 10.72 bhp శక్తిని, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బీఎస్-6 కంప్లైంట్ మోడల్‌తో చిన్న మార్పులతో మేక్ఓవర్ అయిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.78,753 హీరో గ్లామర్ 12 వేరియంట్లు,13 కలర్ ఆప్షన్లలో లభ్యం. హోండా షైన్ హోండా షైన్ కూడా ఈ సెగ్మెంట్లో చాలా పాపులర్ బైక్. 124cc సింగిల్ సిలిండర్ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 10 bhp , 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 కలర్ ఆప్షన్లలో లభ్యమవుతున్న హోండా షైన్ ధర రూ.77,338 (ఎక్స్-షోరూమ్) హీరో సూపర్ స్ప్లెండర్ హీరో ఐకానిక్ బైక్ స్ప్లెండర్ ప్రీమియం వెర్షన్ హీరో సూపర్ స్ప్లెండర్. ఇది 124.7సీసీ ఇంజన్ 10.72 bhp, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రారంభ ధర రూ. 77,939 . టీవీఎస్ రైడర్ 125 టీవీఎస్ రైడర్ 125 124.8cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, త్రీ-వాల్వ్ ఇంజన్‌తో 11.2 bhp శక్తిని , 11.2 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 4 కలర్స్, 3 వేరియంట్లలో లభ్యం. అద్భుతమైన డిజైన్‌తో ఆకట్టుకునే ఈ బైక్ ప్రారంభ ధర రూ. 88,078(ఎక్స్-షోరూమ్) బజాజ్ పల్సర్ 125 బజాజ్ పల్సర్ 125 ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న పల్సర్ మోనికర్‌తో అత్యంత సరసమైన బైక్. రూ. 82,712 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర. 4 వేరియంట్లు 3 కలర్ ఆప్షన్లలో లభ్యం.ఈ బైక్‌లోని 124.4 సీసీ, ఎయిర్-కూల్డ్, DTSI ఇంజన్‌తో 1.64 bhp , 10.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. -
అదరగొట్టేస్తున్న టీవీఎస్ కొత్త బైక్ ,ధర ఎంతంటే!
పంజిమ్ (గోవా): ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటర్ బుధవారం ప్రీమియం లైఫ్‌స్టయిల్ 225 సీసీ బైక్ ’రోనిన్’ను ఆవిష్కరించింది. మూడు వేరియంట్లలో లభించే ఈ బైక్ ధర రూ. 1.49 లక్షలు, రూ. 1.56 లక్షలు, రూ. 1.69 లక్షలుగా (ఎక్స్–షోరూమ్) ఉంటుంది. డ్యుయల్ చానల్ ఏబీఎస్, వాయిస్ అసిస్టెన్స్, అలాయ్ వీల్స్, ఎల్ఈడీ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ఎంపిక చేసిన డీలర్ల దగ్గర ఈ నెల నుంచి రోనిన్ అందుబాటులో ఉంటుందని టీవీఎస్ మోటర్ కంపెనీ ఎండీ సుదర్శన్ వేణు తెలిపారు. రోనిన్ ఆవిష్కరణ తమ సంస్థకు ఒక మైలురాయిలాంటిదని ఆయన పేర్కొన్నారు. గడ్డుకాలం గట్టెక్కినట్లే.. దేశీ టూ–వీలర్ పరిశ్రమకు గడ్డు కాలం తొలగిపోయినట్లేనని, రాబోయే రోజుల్లో రెండంకెల స్థాయికి తిరిగి రాగలదని అంచనా వేస్తున్నట్లు వేణు వివరించారు. చిప్‌ల లభ్యత క్రమంగా మెరుగుపడుతోందని వేణు చెప్పారు. మెరుగైన వర్షపాతాల అంచనాలతో ఈ ఆర్థిక సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పుంజుకోగలవని భావిస్తున్నట్లు టీవీఎస్ డైరెక్టర్ కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. కమోడిటీల ధరలు కొంత మేర సవాళ్లు విసిరే అవకాశం ఉందని చెప్పారు. ప్రీమియం బైక్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటున్న ఆసియా, లాటిన్ అమెరికా తదితర ప్రాంతాలకు కూడా రోనిన్ బైక్‌ను ఎగుమతి చేయనున్నట్లు రాధాకృష్ణన్ వివరించారు. ప్రస్తుతం మోటర్‌సైకిల్ స్పోర్ట్స్ సెగ్మెంట్ (150 సీసీ పైబడి) నెలకు దాదాపు 1.5 లక్షల యూనిట్లుగా ఉంటోందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని సంస్థ ప్రీమి యం బిజినెస్ హెడ్ విమల్ సంబ్లీ తెలిపారు. -
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మరోసారి జట్టుకట్టిన టీసీఎల్..!
హైదరాబాద్: మన దేశంలో ఇండియన్ క్రికెట్ ఫీవర్ ఎంతగానో ప్రఖ్యాతి చెందింది. ప్రతీ గ్రాండ్ టోర్నమెంట్ సందర్భంగా అది బయట పడుతూనే ఉంటుంది. క్రికెట్'ను లైవ్'గా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులు టికెట్లు కొంటూనే ఉంటారు. వారికి మరెన్నో రెట్ల సంఖ్యలో అభిమానులు హై రిజల్యూషన్'లో ఈ ఆటను చూసేందుకు టీవీలకు అతుక్కుపోతారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా రెండు ప్రముఖ టీవీ బ్రాండ్లలో అగ్రగామి అయిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన టీసీఎల్ వరుసగా మూడోసారి సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) జట్టుతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ కాంట్రాక్టులో భాగంగా టీసీఎల్ బ్రాండ్ లోగో ఆటగాళ్ల జెర్సీపై కుడివైపున పై భాగంలో కనిపించనుంది. టీసీఎల్ అనేది వేగంగా వృద్ధి చెందుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్. 2021 మొదటి మూడు త్రైమాసికాల్లో సుమారుగా 30 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. 2022లో ఈ బ్రాండ్ డిస్ ప్లే సాంకేతికతలు, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా తన ఆర్ & డీ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టడాన్ని కొనసాగించనుంది. నూతన ఉత్పాదనలు ఆవిష్కరించడంపై, టీసీఎల్ ఉత్పాదన శ్రేణిని విస్తరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. విస్తరణ వ్యూహంలో భాగంగా, అంతర్జాతీయ వ్యాపారాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఈ బ్రాండ్ తన అతిపెద్ద ఓవర్ సీస్ ప్యానెల్ ఫ్యాక్టరీని ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నెలకొంది. ఈ ఏడాది మే నాటికి ఎల్ఈడీ ప్యానెల్స్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. హై- ఆక్టేన్, లైఫ్ లైక్ క్రికెట్ వాచింగ్ అనుభూతిని అందించడాన్ని ఈ అంతర్జాతీయ టీవీ సంస్థ లక్ష్యంగా చేసుకుంది. దాంతో వీక్షకులు ఆన్ ఫీల్డ్ ఎమోషన్ లేదా బాల్ ఫ్లిక్'లలో ఏ ఒక్క దాన్ని కూడా మిస్ కాకుండా ఉంటారు. ఎస్ఆర్హెచ్'తో భాగస్వామ్యం కొనసాగింపులో భాగంగా టీసీఎల్ వినియోగదారులతో, క్రికెట్ కమ్యూనిటీతో తన అనుబంధాన్ని పటిష్ఠం చేసుకుంది. క్రీడల్లో తన ప్రగతిశీలక దృక్పథాన్ని సుస్థిరం చేసుకుంది. హైదరాబాద్ అనేది టీసీఎల్'కు భారీ మార్కెట్. టీసీఎల్, ఎస్ఆర్హెచ్ ఈ అనుబంధం టీసీఎల్ ఈ నగరంలో తన మూలాల్నిమరింత పటిష్ఠం చేసుకునేందుకు తోడ్పడుతుంది. ఈ సందర్భంగా టీసీఎల్ ఇండియా మార్కెటింగ్ హెడ్ విజయ్ కుమార్ మిక్కిలినేని మాట్లాడుతూ.. ‘‘ఎస్ఆర్హెచ్ జట్టు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో, శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడంలో, కఠోర పరిశ్రమ చేయడంలో, అత్యుత్తమ ఫలితాలను అందించడంలో కట్టుబాటును ప్రదర్శించడంలో నిలకడను కనబరుస్తోంది. ఈ ఏడాది ఎస్ఆర్హెచ్ భువనేశ్వర్ కుమార్, నికోలస్ పూరన్ వంటి యువ, డైనమిక్ ఆటగాళ్లను కలిగిఉంది. మరో ఐపీఎల్ టైటిల్ గెలుపొందాలన్న దాహార్తిని వారు తీర్చుకోగలుగుతారు. జట్టులో యువరక్తంతో పాటుగా అనుభవం కలిగిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. వారంతా కలసి భారతీయ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించనున్నారు. ఎస్ఆర్హెచ్తో మా అనుబంధం క్రికెట్ పట్ల మాకు గల మక్కువను కొనసాగించేందుకు, వినియోగ దారులకు అత్యంత అధునాతన టీవీలను అందించేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో వారు మ్యాచ్‌లో చోటు చేసుకునే ప్రతీ మూమెంట్'ను కూడా మిస్ కాకుండా ఉంటారు. హైదరాబాద్ మాకెంతో పెద్ద మార్కెట్. ఎస్ఆర్హెచ్ జట్టు ఎంతో బాగా ఆడుతుందని మేం విశ్వసిస్తున్నాం. అది మా పేరుప్రఖ్యాతులను క్రీడాభిమానుల్లో మాత్రమే గాకుండా, యావత్ నగర ప్రజానీకంలోనూ పెంచనుంది’’ అని అన్నారు. ఈ భాగస్వామ్యంపై సన్ రైజర్స్ సీఈఓ శ్రీ.కె.షణ్ముఖం మాట్లాడుతూ.. ‘‘మూడో ఏడాది టీసీఎల్ వంటి అంతర్జాతీయ బ్రాండ్'తో అనుబంధం మాకెంతో ఆనందాన్ని అందిస్తోంది. ఈ అనుబంధం అటు ఆ బ్రాండ్'కు, ఇటు ఎస్ఆర్హెచ్ జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. మేం మా భాగస్వామ్యాన్ని మరింత శక్తివంతం చేయదల్చుకున్నాం. ఒక బ్రాండ్'గా టీసీఎల్ తమ ఉత్పత్తులతో వినియోగదారులకు సంతృప్తిని అందించేందుకు గాను హద్దులు అధిగమించి మరీ ముందుకెళ్తున్నది’’ అని అన్నారు. టీవీ వీక్షణాన్ని మరింత నిజమైందిగా, ఎంగేజింగ్ దిగా చేసేందుకు టీసీఎల్ నిరంతరం వినూత్నతలను ఆవిష్క రిస్తూ, తన ఉత్పాదన శ్రేణిని బలోపేతం చేస్తోంది. టీసీఎల్ ఇటీవలే యాన్యువల్ కన్య్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్) లో పాల్గొంది. అత్యంత పలుచటి 8కె మినీఎల్ఈడీ టీవీ ప్రొటొటైప్ తో పాటుగా ఇతర క్యూఎల్ఈఢీ టీవీ లు, మొబైల్ ఉపకరణాలు, స్మార్ట్ హోమ్ అప్లియెన్సెస్ ను ప్రదర్శించింది. టీసీఎల్ టీవీ వీక్షణాన్ని మరీ ము ఖ్యంగా వేగంగా జరిగే క్రీడలు, మూవీలు చూడడాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. టీసీఎల్ టీవీలు వినియోగదారుల టీవీ వీక్షణ అనుభూతులను మెరుగుపరిచేందుకు సంచలనాత్మక వినూత్నతలను అందిస్తు న్నాయి. టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ గురించి: టీసీఎల్ ఎలక్ట్రానిక్స్(1070.HK) అనేది వేగంగా వృద్ధి చెందుతున్నఎలక్ట్రానిక్స్ కంపెనీ. ప్రపంచ టీవీ పరిశ్రమలో అగ్రగామి సంస్థ. 1981లో ప్రారంభించబడిన ఈ సంస్థ ఇప్పుడు అంతర్జాతీయంగా 160 మార్కెట్లలో కార్యకలాపా లు కొనసాగిస్తున్నది. ఒఎండిఐఏ ప్రకారం 2020 ఎల్ సిడి టీవీ షిప్ మెంట్'లో టీసీఎల్ రెండో స్థానం పొందింది. టీవీలు, ఆడియో, స్మార్ట్ హోమ్ అప్లియెన్సెస్ వంటి వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పాదనల పరిశోధన, అభివృద్ధి, తయారీలో టీసీఎల్ నైపుణ్యం సాధించింది. (చదవండి: అంబానీ మనవడా మజాకా.. 15 నెలలకే బడి బాట పట్టిన పృథ్వీ అంబానీ!) -
అదిరిపోయే ఫీచర్లతో టీవీఎస్ జూపిటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ స్మార్ట్ ఫీచర్స్‌తో జూపిటర్ జడ్ఎక్స్ను ప్రవేశపెట్టింది. బ్లూటూత్, వాయిస్ అసిస్ట్, డిజిటల్ కన్సోల్, నావిగేషన్ అసిస్ట్, ఎస్ఎంఎస్, కాల్ అలర్ట్ ఫీచర్లను జోడించింది. 110 సీసీ స్కూటర్స్ విభాగంలో వాయిస్ అసిస్ట్ పొందుపర్చడం ఇదే తొలిసారి అని కంపెనీ ప్రకటించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.80,973 ఉంది. డ్యూయల్ టోన్ సీట్, బ్యాక్‌రెస్ట్, 7,500 ఆర్పీఎంతో 5.8 కిలోవాట్ అవర్ పవర్, 5,500 ఆర్పీఎంతో 8.8 ఎన్ఎం టార్క్, ఇంటెలిగో టెక్నాలజీ, ఐ–టచ్‌స్టార్ట్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, మొబైల్ చార్జర్, 21 లీటర్ స్టోరేజ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి హంగులు ఉన్నాయి. -
వచ్చేస్తోంది..అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్ తో ముందుకు వచ్చింది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లపై డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ జనవరి 17నుండి ప్రారంభం కానుండగా..ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందు అంటే జనవరి 16 నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక ప్రత్యేకంగా ఇప్పటికే కొన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌పై అమెజాన్ డిస్కౌంట్లు అందిస్తుండగా..రెడ్మీ,వన్ ప్లస్, శాంసంగ్, ఐక్యూ, టెక్నోవంటి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. వీటితో పాటు ఇతర స్మార్ట్ ఫోన్ లపై గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' లో ఆఫర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. అమెజాన్ త్వరలో ప్రారంభించనున్నగ్రేట్ రిపబ్లిక్ డే సేల్' ఈ బ్రాండ్ ఫోన్లపై డిస్కౌంట్లను అందించనుంది. వీటితో పాటు అదనంగా మరికొన్ని ఫోన్లను డిస్కౌంట్లో సొంతం చేసుకోవచ్చు. ►రెడ్మీ నోట్ 10ఎస్ ధర రూ. 16,999 కంటే తక్కువ ►వన్‌ప్లస్ నార్డ్ 2పై డిస్కౌంట్లతో ►రెడ్ మీ 9ఏ స్పోర్ట్స్ రూ. 8,499 కంటే తక్కువ ►రెడ్మీ 9 యాక్టీవ్ రూ.రూ. 10,999 కంటే తక్కువ ►వన్ ప్లస్ నార్డ్ సీఈ ఫోన్ పై డిస్కౌంట్లతో ►శాంసంగ్ గెలాక్సీ ఎం 32 ధర రూ. 23,999లోపు ►శాంసంగ్ గెలాక్సీ ఎం 12 ధర రూ.12,999 కంటే తక్కువ ►డిస్కౌంట్లో రెడ్ మీ నోట్ 11టీ ►టెక్నో స్పార్క్ 8టీ ధర రూ.12,999లోపు ►శాంసంగ్ గెలాక్సీ ఎం 32 5జీ ధర రూ.10,999 నుంచి రూ. 15,999 మధ్యలో ఉంది ►ఐక్యూ జెడ్ 5 ధర రూ. 29,990 కంటే తక్కువ ►రెడ్మి 10 ప్రైమ్ రూ. 10,999 నుంచి రూ. 13,999 వరకు ఉంది ►వన్ ప్లస్ 9ఆర్ పై డిస్కౌంట్లు ►ఐక్యూ జెడ్ 3 రూ. 22,990 కంటే తక్కువ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. ఉదాహరణకు..ల్యాప్‌టాప్‌లు, హెడ్సెట్,స్మార్ట్‌వాచ్‌లు 70 శాతం డిస్కౌంట్లో పొందవచ్చు. శాంసంగ్, ఎల్జీ, షావోమీ టీవీలు, ఇతర ఉపకరణాలపై గరిష్టంగా 60 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఆఫర్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో షాపింగ్ చేసే కస్టమర్లు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ సౌకర్యంతో పాటు అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ కార్డ్,అమెజాన్ పే, ఐసీఐసీఐ కార్డ్‌లపై నో కాస్ట్ ఈఎంఐ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులపై ఎక్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్లో రూ.16,000 వరకు తగ్గింపు పొందవచ్చని అమెజాన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్..! -
ఇయర్ ఎండ్ సేల్: సోనీ ఉత్పత్తులపై 60 శాతం మేర తగ్గింపు..!
ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ తయారీదారు సోనీ ఇయర్ ఎండ్ సేల్‌ను గురువారం (డిసెంబర్ 16) నుంచి ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, టీవీలపై భారీ ఆఫర్లను సోనీ ప్రకటించింది. సోనీ ఇయర్ ఎండ్ సేల్ 2022 జనవరి 3 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ఆఫ్‌లైన్, పలు ఎలక్ట్రానిక్ స్టోర్స్, సోనీ ఆన్లైన్ స్టోర్స్‌తో పాటుగా ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా అందుబాటులో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. సోనీ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా పలు బ్రావియా టీవీలపై 30 శాతం మేర తగ్గింపు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను , రెండేళ్ల వారంటీని కొనుగోలుదారులకు సోనీ అందిస్తోంది. వీటితో పాటుగా వైర్లెస్ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్‌పై 60 శాతం మేర తగ్గింపును ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా సోనీ అందిస్తోన్న పలు ఆఫర్లు..! ►Sony Bravia XR-65A8OJ టీవీ కొనుగోలుదారులకు రూ. 2,65,990 కే రానుంది. దీని రిటైల్ ధర రూ. 3,39,900. Sony Bravia KD-55X8OJ మోడల్ టీవీ ధర రూ. 87,390కు రానుంది. దీని అసలు ధర రూ. 1,09,900 గా ఉంది. ►సోనీ WH-1000XM4 హెడ్‌ఫోన్స్‌ను కొనుగోలుదారులు రూ. 24,990 కే సొంతం చేసుకోవచ్చును. దీని అసలు ధర రూ. 29,990. సోనీ WH-H910N హెడ్‌ఫోన్స్‌పై ఏకంగా 60 శాతం తగ్గింపుతో రూ. 9,990కు రానుంది. దీని అసలు ధర రూ. 24,990 ►సోనీ WH-CH710N హెడ్‌ఫోన్స్ ధర రూ. 7,990కు, సోనీ WH-XB900N ధర రూ. 9,990 కే కొనుగోలుదారులకు లభ్యమవుతోంది. ►సోనీ వైర్లెస్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌పై కూడా భారీ తగ్గింపులను అందిస్తోంది, సోనీ WF-1000XM3 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ రూ. 9,990 ధరకు, సోనీ WF-SP800N TWS ఇయర్‌బడ్స్ ధర రూ. 10,990కు, సోనీ WF-XB700 ధర రూ. 6,990 కు రానున్నాయి. ►సోనీ SRS-XB13 వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్‌పై రూ. 3,590 కు రానుంది. కంపెనీ వైర్లెస్ బ్లూటూత్ హెడ్ఫోన్లపై కూడా తగ్గింపులను అందిస్తోంది, సోనీ WH-CH510 , WI-XB400 మోడల్స్ వరుసగా రూ. 2,990, రూ. 2,790 కే రానుంది. చదవండి: ఏసర్ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..! -
టీవీఎస్ లాజిస్టిక్స్‌లో కోటక్ పెట్టుబడి
ముంబై: ఆటో రంగ దిగ్గజం టీవీఎస్ కుటుంబ కంపెనీలో కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. టీవీఎస్ కుటుంబం ప్రమోట్ చేసిన థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్(3పీఎల్)లో అనుబంధ సంస్థ కోటక్ స్పెషల్ సిట్యుయేషన్స్ ఫండ్ ద్వారా పెట్టుబడులకు దిగుతోంది. టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్‌లో రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అంతేకాకుండా టీఎస్ రాజమ్ రబ్బర్స్ ప్రయివేట్ లిమిటెడ్‌కు రూ. 800 కోట్ల రుణ సౌకర్యాలను కలి్పంచింది. ఇందుకు మార్పిడిరహిత డిబెంచర్ల మార్గాన్ని కోటక్ స్పెషల్ ఎంచుకుంది. ఈ రుణం సహాయంతో టీవీఎస్ సప్లై చైన్‌లో కెనడియన్ పెన్షన్ ఫండ్కుగల వాటాను టీవీఎస్ ఎస్సీఎస్ ప్రమోటర్ ఆర్.దినేష్ సొంతం చేసుకోనున్నారు. తద్వారా టీవీఎస్ సప్లై చైన్‌లో టీవీఎస్ కుటుంబ వాటా బలపడనుంది. కోటక్ స్పెషల్ సిట్యుయేషన్స్.. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ విభాగంలో రిజస్టరైంది. బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,400 కోట్లు) పెట్టుబడులను నిర్వహిస్తోంది. -
World EV Day 2021: దూసుకొస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు
-
దూసుకొస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్
సాక్షి, ముంబై: దేశంలో ఒక వైపు 100 రూపాయల దాటేసిన పెట్రోలు ధర వాహనదారులను భయపెడుతోంది. మరోవైపు బయో, సాంప్రదాయ ఇంధన వాహనాలను మార్కెట్లోకి తీసుకు రావాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పలు ఆటో కంపెనీలకు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న పెట్రో వాతల నుంచి విముక్తి కలిగించే ఎలక్ట్రిక్ వాహనాలు శరవేగంగా దూసుకొస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, సమర్థత, ఉపాధి కల్పన అంటూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓలా, టీవీఎస్, అథెర్స్ లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న జరుపుకుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ మార్కెట్‌గా చైనా ఉండగా, రెండవ ఈవీ మార్కెట్ హబ్‌గా ఇండియా అవతరించనుంది. ఈ సందర్బంగా మార్కెట్లోకి హల్చల్ చేయనున్న వాహనాలపై స్పెషల్ స్టోరీ మీ కోసం.. -
అమెజాన్ మరో సేల్..! ఈసారి ల్యాప్‌ట్యాప్, టీవీలపై భారీ తగ్గింపు...!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్లకోసం మరో సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ ఇండియా 'గ్రాండ్ గేమింగ్ డేస్' సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 22 నుంచి ఆగస్టు 24 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. గ్రాండ్ గేమింగ్ సేల్స్‌లో భాగంగా ల్యాప్టాప్స్, టీవీలు డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, అధునాతన హెడ్ఫోన్లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్ కార్డులు, లెనోవో, ఏసర్, ఆసూస్, ఎల్జీ, హెచ్‌పీ, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్ టీవీలకు ఆఫర్లు, డీల్స్‌ను అమెజాన్ తన కస్టమర్లకు ఆఫర్ చేయనుంది. చదవండి: China Stands With Taliban: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..! డెల్, కోర్సెయిర్, కాస్మిక్ బైట్, జేబీఎల్ మరిన్ని కంపెనీల ఉత్పత్తులపై సుమారు 30 శాతం మేర తగ్గింపును ప్రకటించాయి. అధిక ర్యామ్, అధిక రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీలపై కూడా 30 శాతం తగ్గింపును అమెజాన్ తన కస్టమర్లకు అందిస్తోంది. అదనంగా కొనుగోలుదారలు ఎంచుకున్న మోడళ్లపై తగ్గింపుతో పాటు నో-కాస్ట్ ఈఎమ్ఐ, ఎక్సేఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చును. పలు ల్యాప్‌టాప్‌లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు హెచ్‌పీ కంపెనీకి చెందిన విక్టస్ 15.6-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ గేమింగ్ ల్యాప్‌టాప్ రూ. 66,990 కి అందుబాటులో ఉంది. ఏసర్ కంపెనీకి చెందిన నైట్రో 5 ఏఎన్515-56 గేమింగ్ ల్యాప్‌టాప్ రూ. 69,990 అందుబాటులో ఉంది . ఎమ్ఎస్ఐ కంపెనీకి చెందిన బ్రావో 15 ఎఫ్‌హెచ్‌డీ మోడల్‌ను రూ. 74,990 అందుబాటులో ఉంది. లెనోవా ఐడియా ప్యాడ్ ల్యాప్‌టాప్‌ను రూ . 67, 557 కు లభించనుంది. పలు టీవీలపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు.. సోనీ బ్రావీయా 55 ఇంచ్ 4కే అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ గూగుల్ టీవీ రూ. 83,990కు అందుబాటులో ఉండనుంది. రెడ్మీ 55 ఇంచ్ 4కే అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీను రూ . 45,999కు అందుబాటులో ఉండనుంది. చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...! -
మార్కెట్లో ఉన్న అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
ప్రస్తుతం పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటిన సంగతి తెలిసిందే. బండి బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఈవీ స్కూటర్లపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే మార్కెట్లో లభ్యం అవుతున్నప్పటికీ, మరికొన్ని ఈ సంవత్సరం చివరినాటికి కస్టమర్ల చేతికి అందనున్నాయి. దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఇటీవల కొత్తగా కొన్ని స్కూటర్లు వచ్చాయి. ఈ స్కూటర్లు వస్తూ వస్తూనే ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయని చెప్పుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ, ఏథర్ ఎనర్జీ, బజాజ్, టీవీఎస్ వంటి కంపెనీలు దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ పడుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది అత్యుత్తమం అనేది ప్రజలు తెలుసుకోలేక పోతున్నారు. మేము ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని మంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను మీకు తెలియజేస్తున్నాము.(చదవండి: ఎంజీ ఎస్టర్ ఎస్యూవీ.... కీ ఫీచర్లు ఇవే!) ఓలా ఎస్1, ఎస్1 ప్రో ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1ను ఆగస్టు 15న రూ.99,999(ఎక్స్ షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రో అనే పేరుతో రెండు స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.99,999, ఎస్1 ప్రో స్కూటర్ ధర రూ.1,29,999గా ఉంది. ఓలా ఎస్1 సెప్టెంబర్ 8 నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ నుంచి 1,000 నగరాలు, పట్టణాల్లో డెలివరీల సేవలను ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 8 వరకు కంపెనీ బుకింగ్స్ కోసం రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో ఐడీసీ మోడ్ లో 181 కి.మీ దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. గంటకు 115 కిలోమీటర్ల గరిష్ట వేగం, హైపర్ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో 40 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ తో వచ్చే పోర్టబుల్ ఛార్జర్ ద్వారా చార్జ్ చేయడానికి సుమారు 6 గం. సమయం పడుతుంది. ఇందులో రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ ఫంక్షన్, డ్రైవింగ్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. 0-40 కిలోమీటర్లు వేగాన్ని 3 సెకండ్లలో అందుకుటుంది. ఇది కీలెస్ లాక్, అన్ లాక్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్ సిస్టమ్, జియో ఫెన్సింగ్ వంటి భద్రతా ఫీచర్లతో వస్తుంది. ఈ స్కూటర్లో 3.97 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 రంగుల్లో లభిస్తుంది. ఓలా తమిళనాడులో 500 ఎకరాల్లో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. సింపుల్ వన్ సింప్లీ ఎనర్జీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ ను ఆగస్టు 15 నాడు లాంఛ్ చేసింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ప్రీ ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది. మీరు సింపుల్ వన్ బుక్ చేసుకోవాలంటే రూ.1,947 చెల్లించాల్సి ఉంటుంది. సింపుల్ వన్ ను రూ.1,09,999 (ఎక్స్ షోరూమ్ ధర)కు లాంఛ్ చేశారు. సింపుల్ వన్ బ్రెంజ్ బ్లాక్, అజ్యూరే బ్లూ, గ్రేస్ వైట్, నమ్మ రెడ్ రంగులలో లభిస్తుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను చార్జ్ చేస్తే ఐడీసీ మోడ్ లో 236 కిలోమీటర్ల దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. అలాగే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లు. దీనిలో 4.8కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ(కంబైన్డ్ ఫిక్సిడ్, పోర్టబుల్), 7 కెడబ్ల్యు మోటార్ ఉన్నాయి. దీనిలో టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. అథర్ 450ఎక్స్ అథర్ 450ఎక్స్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. 3.3 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అథర్ 450ఎక్స్ ఐడీసీ మోడ్ లో 116 కి.మీ దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. బ్యాటరీ వాటర్ రెసిస్టెంట్ ఐపీ 67 రేటెడ్ ప్రజర్ డై కాస్ట్ అల్యూమినియం బ్యాటరీ ప్యాక్, ఫ్రంట్ అండ్ రియర్ కోసం రెండు డిస్క్ బ్రేకులు, 22ఎల్ స్టోరేజీ, 7 అంగుళాల ఎల్ సిడి డిస్ ప్లేతో ఈ స్కూటర్ వస్తుంది. అథర్ 450ఎక్స్ ధర రూ.1,44,500. ఈ స్కూటర్లో 2.61 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ ఈ ఏడాది జూన్ లో టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ అర్బన్ స్కూటర్ ను రూ.115,218 ధరకు విడుదల చేసింది. టీవీఎస్ ఐక్యూబ్ లో 2.25 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 4.4 కిలోవాట్లు కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 78 కి.మీ. దీని ఫుల్ ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ఫ్రంట్ టెలిస్కోపిక్, రియర్ హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ తో వస్తుంది. 118 కిలోల బరువున్న ఈ స్కూటర్ 140 ఎన్ఎమ్ టార్క్ ఉతపతి చేస్తుంది. బజాజ్ చేతక్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.8 కిలోవాట్ మోటార్ చేత పనిచేస్తుంది. దీనిలో 3కేడబ్ల్యుఐపీ 67 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అనే రెండు మోడ్స్ ఉన్నాయి. 5 ఆంపియర్ పవర్ సాకెట్ ద్వారా స్కూటర్ ని ఇంటి వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ బేస్డ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫీచర్స్ ఉన్నాయి. బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. అర్బన్ ధర ₹1.42 లక్షలు కాగా, ప్రీమియం రిటైల్స్ ₹1.44 లక్షలు(ఎక్స్ షోరూమ్, పూణే). -
ఈవీ జర్నీ.. రయ్!
దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) డిమాండ్‌ను సొమ్ము చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే పర్యావరణ అనుకూల ప్రయోజనాలకు తోడు, చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడం లక్ష్యాలుగా.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహక విధానాలతో ముందుకు వస్తుండడాన్ని చూస్తూనే ఉన్నాము. దీంతో సంప్రదాయ ఆటోమొబైల్ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ మోడళ్లతో కస్టమర్ల ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అనుకూల వ్యవస్థల (ఎకోసిస్టమ్) అభివృద్ధికి గతేడాది కరోనా మహమ్మారి తాత్కాలికంగా బ్రేకులు వేసింది. అయినప్పటికీ లాక్డౌన్, ఆంక్షలను క్రమంగా సడలిస్తూ రావడంతో తిరిగి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) డిమాండ్ కొన్ని నెలల నుంచి మెరుగుపడుతోంది. కాకపోతే మన దేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. ప్రధానంగా పట్టణాలు, కొన్ని వాహన విభాగాల్లోనే విక్రయాలు నమోదవుతున్నాయి. అయినా సరే భవిష్యత్తుపై అంచనాలతో ద్విచక్ర ఈవీ మార్కెట్లోకి కొత్త సంస్థలు ఉత్సాహంగా ప్రవేశిస్తుంటే.. కార్ల విభాగంలో టాటా మోటార్స్ దూసుకుపోయే వ్యూహాలను అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్రాల సబ్సిడీ, రాయితీ పథకాలు ఇందుకు కొంత మేర సాయపడుతున్నాయని చెప్పుకోవాలి. రంగంలోకి కొత్త సంస్థలు దేశీయ ఈవీ మార్కెట్లో దూకుడుగా వెళ్లే వ్యూహాలతో కొత్త సంస్థలు అడుగుపెడుతుంటే.. మరోవైపు ఆటోమొబైల్ రంగంలో స్థిరపడిన ప్రముఖ కంపెనీలు కూడా పోటీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కార్లు, ద్విచక్ర, త్రిచక్ర ఈవీ విభాగంలో అవకాశాలను సొంతం చేసుకుని, వృద్ధి చెందేందుకు వేటికవే భిన్నమైన వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మహీంద్రా లీడర్‌గా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆచితూచి అన్నట్టుగా అడుగులు వేస్తోంది. రెవా ఎలక్ట్రిక్ కార్ కంపెనీని మహీంద్రా సొంతం చేసుకుని ఈ విభాగంలో ముందు నుంచి ఉన్న సంస్థగా పేరు సొంతం చేసుకున్నప్పటికీ.. త్రిచక్ర వాహనాలపైనే ప్రస్తుతం ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, ‘బోర్న్ ఈవీ’ విధానంతో రానున్న 4–5 ఏళ్ల కాలంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మరింతగా చొచ్చుకుపోయే వ్యూహంతో మహీంద్రా ఉంది. ఆకర్షణీయంగా లేని ఫేమ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో పదుల సంఖ్యలో కంపెనీలు వందకు పైగా మోడళ్లను ఆఫర్ చేస్తుండగా.. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఉన్న మోడళ్లను వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. దీనికి కారణం ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఈవీ) పథకం ఎలక్ట్రిక్ కార్లకు ఆకర్షణీయంగా లేకపోవడమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో కేవలం 35,000 వాణిజ్య కార్లకే రాయితీలు రావడం పరిస్థితిని తెలియజేస్తోంది. డిమాండ్ తగినంత లేని పరిస్థితుల్లో పెట్టుబడులతో ప్రయోజనం ఉండదని కార్ల తయారీ సంస్థలు భావిస్తున్నాయి. అతి తక్కువ విక్రయాల కారణంగా భారతీయ కార్ల తయారీ సంస్థలు ఈవీలకు అవసరమైన కీలక విడిభాగాలను.. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ నుంచి పొందడం కష్టమవుతుందని ఐహెచ్ఎస్ మార్కిట్‌కు చెందిన దక్షిణాసియా ప్రధాన అనలిస్ట్ సూరజ్ ఘోష్ అన్నారు. మెట్రోలకే పరిమితమైన ఈవీ టూవీలర్లు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు ప్రధానంగా మెట్రోలు, పట్టణాలకే పరిమితమయ్యాయి. ఎన్నో సంస్థలు డీలర్ల ద్వారా తమ ఉత్పత్తులను పట్టణాల్లో విక్రయిస్తున్నాయి. మరోవైపు సంప్రదాయ కంపెనీలైన టీవీఎస్, బజాజ్‌లు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఒక్కొక్క మోడల్‌నే మార్కెట్లోకి తీసుకొచ్చాయి. బెంగళూరులో ఏడాది క్రితం టీవీఎస్ ఐక్యూబ్ పేరుతో ఈవీ స్కూటర్‌ను ప్రవేశపెట్టగా.. ఇటీవలే ఢిల్లీ మార్కెట్లోకి ఈ ఉత్పత్తిని విడుదల చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని మార్కెట్లోకి దీన్ని విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. అంటే ప్రస్తుతానికి ఐ క్యూబ్ బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లకే పరిమితం. బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ కూడా ఇంతే. గ్రీవ్స్కాటన్కు చెందిన యాంపియర్ ఎలక్ట్రిక్ మాత్రం ద్విచక్ర, త్రిచక్ర ఈవీ విభాగంలో చాలా మోడళ్లను తీసుకొస్తోంది. నెట్‌వర్క్‌నూ విస్తరిస్తోంది. తన ఈవీ వ్యాపార బాధ్యతలను చూసేందుకు యమహా ఇండియా మాజీ మార్కెటింగ్ హెడ్ రాయ్ కురియన్ను నియమించుకుంది. ఈ సంస్థకు 230 ప్రాంతాల్లో 300 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. టాటా మోటార్స్ దూకుడు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో వేగంగా అడుగులు వేస్తోంది. భిన్నమైన విధానంతో ఈవీ కార్ల మార్కెట్లో ప్రముఖ స్థానాన్ని ఇప్పటికే సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి రెండు ఎలక్ట్రిక్ కార్లు టాటా మోటార్స్ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఉండగా, మరిన్ని కార్లను ప్రవేశపెట్టే ప్రణాళికతో సంస్థ ఉంది. దేశవ్యాప్తంగా ప్రముఖ రహదారుల్లో ఇప్పటికే 300కు పైగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ప్రముఖ పట్టణాలు, జాతీయ రహదారులపై 2021 మార్చి నాటికి చార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 700కు చేర్చాలన్న లక్ష్యంతో ఉంది. ‘‘భారత్ వైవిధ్యమైన మార్కెట్. ఈవీ విలువ ఆధారిత చైన్‌లో ఉత్పత్తులు, సేవల పరంగా అపారమైన వృద్ధి అవకాశాలున్నాయి. ఓఈఎమ్ (ఎక్విప్మెంట్ తయారీ సంస్థలు) కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తుల తయారీ, సదుపాయాలపై పెట్టుబడులను ప్రారంభించాయి. సరైన విధానం, ప్రామాణిక టెక్నాలజీ, నియంత్రణ చర్యలు అన్నవి దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు తోడ్పడతాయి’’ అని ఈవై ఇండియా ఆటోమోటివ్ రంగ పార్ట్నర్ వినయ్ రఘునాథ్ తెలిపారు. -
ఈజీ టు ఇన్స్టాల్ : శాంసంగ్ బిజినెస్ టీవీలు
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. రెస్టారెంట్లు, రిటైల్ దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్సులు, సెలూన్లు వంటి స్టోర్లకోసం శాంసంగ్ ప్రత్యేకంగా అల్ట్రా హై డెఫినిషన్ (యూహెచ్డీ) బిజినెస్ టీవీలను భారత మార్కెట్లో శుక్రవారం విడుదల చేసింది. ఈ స్మార్ట్‌టీవీలు 43, 50, 55, 70 అంగుళాల వేరియంట్లలో లభిస్తాయి. వీటి ధరలు 75,000 - 175,000 రూపాయల వరకు ఉంటాయనీ, మూడేళ్ల వారంటీతో వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (చైనాలో కాదు చెన్నైలో) తమ కొత్త శాంసంగ్ బిజినెస్ టీవీల ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారాల అవసరాలను తీర్చాలని భావిస్తున్నామనీ, పని ప్రదేశంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, సమర్థవంతంగా వినియోగించుకునేలా వీటిని తయారు చేశామని శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పునీత్ సేథీ వెల్లడించారు. సొంత కంటెంట్‌ను సృష్టించేందుకు వీలుగా 100 ఉచిత టెంప్లేట్లతో టీవీలు ప్రీలోడెడ్‌గా అందిస్తున్నట్టు చెప్పారు. ఇన్స్టాల్ చేయడం సులభం శాంసంగ్ బిజినెస్ టీవీలను సులభంగా ఇన్స్టాలేషన్ చేసేలా ఒక 3 దశల గైడ్‌తో వస్తుందనీ, తద్వారా ఇన్‌స్టాలేషన్‌కు అదనపు చార్జీల బెడద లేకుండానే టీవీని ఆన్ చేసినప్పుడు స్వయంచాలకంగా ప్రారంభమవుతుందని శాంసంగ్ వెల్లడించింది. -
కస్టమర్ ఈజ్ కింగ్ : విజయరాఘవన్ ఇక లేరు
సాక్షి, చెన్నై: టీవీఎస్ శ్రీచక్రా లిమిటెడ్ (టీవీఎస్ టైర్స్) డైరెక్టర్ పీ విజయరాఘవన్ (72) గుండెపోటుతో నిన్న(బుధవారం) తెల్లవారుజామున కన్నుమూశారు. ఐదు దశాబ్దాలుగా టీవీఎస్ గ్రూప్ కంపెనీలకు విశేష సేవలందించారు. టీవీఎస్ శ్రీచక్రా కంపెనీ స్థాపించినప్పటి నుంచీ కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, తుది శ్వాసవరకు బోర్డులో డైరెక్టర్‌గా చురుకుగా ఉన్నారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 21 సంవత్సరాల వయస్సులో 1969లో సుందరం ఇండస్ట్రీస్‌లో చేరిన విజయరాఘవన్ ఐదు దశాబ్దాలకు పైగా టీవీఎస్ గ్రూపునకు సేవలందించారు. ఖరగ్‌పూర్ ఐఐటి నుంచి కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్, రబ్బరు టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన విజయరాఘవన్ రబ్బరు పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని గడించారు. అనేక పరిశ్రమ సంస్థలలో చురుకైన సభ్యుడిగా, ఈ రంగ వృద్ధికి కీలక భూమికను నిర్వహించారు. విజయరాఘవన్ కు భార్య, కుమారుడు ఉన్నారు. ‘కస్టమర్ ఈజ్ కింగ్ ’ అనే నినాదంతో భారీ మార్కెట్ ను క్రియేట్ చేశారనీ. 1980, 1990ల నాటి కస్టమర్లు ఇప్పటికీ తమతోనే ఉన్నారని కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు. కాగా టీవీఎస్ గ్రూపులో భాగమైన టీవీఎస్ శ్రీచక్రా లిమిటెడ్ టూ, త్రీవీలర్ల టైర్లు, ఆఫ్-హైవే టైర్ల తయారీలో ప్రముఖమైనది. మదురై, ఉత్తరాఖండ్‌లో ఉన్న రెండు ఉత్పాదక ప్లాంట్ల ద్వారా ప్రతి నెలా మూడు మిలియన్ల టైర్లను ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు టైర్లను ఎగుమతి చేస్తుంది. -
మార్కెట్లోకి ‘కొడాక్ సీఏ సిరీస్’ టీవీలు
న్యూఢిల్లీ: గూగుల్ సర్టిఫికేట్ పొందిన అండ్రాయిడ్ టెలివిజన్లలో అత్యంత చౌక ధరలకే కొడాక్ తన కొత్త తరం టీవీలను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో ఈ బ్రాండ్ విక్రయానికి లైసెన్సు కలిగి ఉన్న సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్పీపీఎల్).. ‘కొడాక్ సీఏ సిరీస్’ పేరిట వీటిని సోమవారం మార్కెట్లోకి విడుదలచేసింది. డాల్బీ విజన్, 4కే హెచ్డీఆర్10, ఆండ్రాయిడ్ 9.0 ఇంటర్ఫేస్, డీటీఎస్ ట్రూసరౌండ్ కలిగిన డాల్బీ డిజిటల్ ప్లస్, యుఎస్బీ 3.0, బ్లూటూత్ వీ5.0 (తాజా వెర్షన్), అమెజాన్ ప్రైమ్ వంటి ఆప్షన్లు కలిగిన యూజర్ ఫ్రెండ్లీ రిమోట్ వంటి అధునాతన ఫీచర్లు కొత్త సిరీస్‌లో ఉన్నాయి. 43, 50, 55, 65 అంగుళాల సైజుల్లో టీవీలు లభిస్తుండగా.. ప్రారంభ ధర రూ. 23,999, హై ఎండ్ రూ. 49,999కే లభిస్తున్నట్లు ఎస్పీపీఎల్ డైరెక్టర్, సీఈఓ అవనీత్ సింగ్ మార్వ్ ప్రకటించారు. మార్చి 19 నుంచి ఈ సీరిస్ టీవీలు ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉండనున్నాయి. -
హైదరాబాద్‌లో అంతర్జాతీయ బ్రాండ్ల టీవీల అసెంబ్లింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల తయారీలో ఉన్న మోటరోలా, నోకియా, వన్‌ప్లస్ వంటి దిగ్గజ సంస్థలు ఎల్ఈడీ టీవీల రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. విశేషమేమంటే ఈ కంపెనీల టీవీలు హైదరాబాద్‌లో రూపుదిద్దు కుంటున్నాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న స్కైక్వాడ్ ఇప్పటికే ప్యానాసోనిక్, లాయిడ్ వంటి ఏడు బ్రాండ్ల టీవీలను అసెంబుల్ చేస్తోంది. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్, శంషాబాద్ వద్ద ప్లాంట్లున్నాయి. ఏటా 30 లక్షల ఎల్ఈడీ టీవీలను రూపొందించే సామర్థ్యం ఉంది. 3,000 మంది ఉద్యోగులు ఉన్నారని కంపెనీ ఎండీ రమీందర్ సింగ్ సోయిన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. అంతర్జాతీయ కంపెనీలకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో నాలుగు కొత్త బ్రాండ్లు తోడవనున్నాయని వివరించారు. రెండో దశలో రూ.1,400 కోట్లు.. స్కైక్వాడ్ భాగస్వామ్యంతో చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ స్కైవర్త్ శంషాబాద్ వద్ద 50 ఎకరాల్లో ప్లాంటును నెలకొల్పుతోంది. తొలి దశలో రూ.700 కోట్లు పెట్టుబడి చేస్తున్నారు. ఇరు సంస్థలు కలిసి టీవీలతోపాటు వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లను అసెంబుల్ చేస్తాయని రమీందర్ వెల్లడించారు. ‘ఆరు నెలల్లో ఈ ఉత్పత్తుల తయారీ మొదలవుతుంది. కొత్త ప్లాంటు ద్వారా 5,000 మందికి ఉపాధి లభించనుంది. 15–20 శాతం విడిభాగాలు స్థానికంగా తయారవుతున్నాయి. దీనిని 50 శాతానికి తీసుకువెళతాం. మరో 20 దాకా అనుబంధ సంస్థలు రానున్నాయి. వీటి ద్వారా 3,000 ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నాం. రెండవ దశలో ఇరు సంస్థలు కలిసి రూ.1,400 కోట్ల పెట్టుబడి చేయాలని భావిస్తున్నాం’అన్నారు. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్, ఆఫర్లు
సాక్షి, ముంబై: ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. బిగ్ షాపింగ్ డేస్ సేల్ -2019 లో భాగంగా స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు , ఇతర ఆఫర్లను అందించడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 1 ఆదివారం నుండి ప్రారంభమయ్యే డిసెంబర్ 5 వరకు ఐదు రోజుల పాటుకొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు నవంబర్ 30, శనివారం రాత్రి 8 గంటల నుండే కొనుగోళ్లకు ముందస్తు అనుమతి లభిస్తుంది. ముఖ్యంగా రియల్‌మి, శాంసంగ్ గెలాకసీ, ఆపిల్ ఐ ఫోన్లపై ఆఫర్లను తీసుకొస్తోంది. టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ల్యాప్‌టాప్‌లు, కెమెరాలపై 80 శాతం తగ్గింపు లభ్యం. డిఎస్ఎల్ఆర్, డిజిటల్ కెమెరాలపై రూ.10,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్. దీంతోపాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు ద్వారా చేసిన కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ప్రధానంగా బిగ్ షాపింగ్ డేస్ అమ్మకం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ "బ్లాక్ బస్టర్ డీల్స్" కూడా అందించనుంది. ఉదయం 12, 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు అదేవిధంగా తెల్లవారుజామున 2 గంటలకు "రష్ అవర్స్" లో స్పెషల్ సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో ప్రధానంగా రియల్‌మి 5, రియల్మే ఎక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9, గెలాక్సీ ఎస్ 9 ప్లస్, గూగుల్ పిక్సెల్ 3 ఎ, ఆపిల్ ఐఫోన్ 7, ఆసుస్ 5 జెడ్ వంటి స్మార్ట్ఫోన్లపై తగ్గింపును అందించనుంది. మొబైల్ ఫోన్లపై ఆఫర్లు రియల్‌మి5 : అసలు ధర రూ. 9,999 డిస్కౌంట్ ధర రూ. 8,999 రియల్‌మి ఎక్స్: అసలు ధర రూ. 16,999 ఆఫర్ ధర రూ. 15,999 శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 : అసలు ధర రూ. 29,999 డిస్కౌంట్ ధర రూ. 27,999 గెలాక్సీ ఎస్ 9 ప్లస్ : అసలు ధర రూ. 37,999 డిస్కౌంట్ ధర రూ. 34,999 గూగుల్ పిక్సెల్ 3 ఎ : అసలు ధర రూ. 34,999 ఆఫర్ ధర రూ. 29,999 ఆపిల్ ఐఫోన్ 7: అసలు ధర రూ. 27,999 ఆఫర్ ధర రూ. 24,999 ఆసుస్ 5 జెడ్ : అసలు ధర రూ. 16,999 ఆఫర్ ధర రూ. 15,999 -
వన్‌ప్లస్ టీవీలపై రిలయన్స్ ఆఫర్
సాక్షి, ముంబై : చైనా సంస్థ వన్‌ప్లస్ దేశీయ నెంబర్ వన్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ రిలయన్స్ డిజిటల్ తో మరోసారి కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న టీవీ మార్కెట్‌పై కన్నేసిన వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలను రూపొందించింది. ఈ మేరకు వన్ ప్లస్ టీవీలను నేడు (శనివారం, 19) రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో ఆవిష్కరించింది. వన్‌ప్లస్ టీవీ 55 క్యూ 1, వన్‌ప్లస్ టీవీ 55 క్యూ 1 ప్రో టీవీలు రెండింటినీ ప్రత్యేకంగా విక్రయిస్తుంది. ఆఫర్లు వన్‌ప్లస్ టీవీలను కొనుగోలు చేసిన వినియోగదారులకు,హెచ్డీఎఫ్సీ కార్డులపై రూ .7వేల వరకు క్యాష్‌బ్యాక్ నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్టెండెడ్ వారంటీతోపాటు మల్టీబ్యాంక్ క్యాష్‌బ్యాక్ వంటి ప్రత్యేకమైన ఆఫర్లను రిలయన్స్ డిజిటల్ అందిస్తోంది. రెండు వెర్షన్లు దేశవ్యాప్తంగా ఉన్న వందకు పైగా రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్స్‌లో లభిస్తాయి. ప్రభాదేవిలో జరిగిన ఈ లాంచింగ్ కార్యక్రమానికి రిలయన్స్ డిజిటల్ సీఈవో బ్రియాన్ బడే అధ్యక్షత వహించగా, రిలయన్స్ డిజిటల్, ఈవిపి అండ్ సిఎంఓ కౌషల్ నెవ్రేకర్, వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ (జీఎం) వికాస్ అగర్వాల్ పాల్గొన్నారు. బాలీవుడ్ నటి తారా సుతారియా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లయన్స్ డిజిటల్ తన అభిమాన టెక్నాలజీ స్టోర్ అనీ, భారతదేశమంతా ఈ కొత్త తరం టీవీని అనుభవించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. గత ఏడాది నవంబరునుంచి రిలయన్స్ డిజిటల్‌తో కలిసి పనిచేస్తున్నామని, స్పందన అద్భుతంగా వుందని వికాస్ అగర్వాల్ వెల్లడించారు. తాజాగా వన్‌ప్లస్ టీవీలతో తమ ఈ భాగస్వామ్యం మరింత బలపడిందన్నారు. బ్రియాన్ బాడే మాట్లాడుతూ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రారంభించిన నెంబర్ వన్ సంస్థగా తమ ట్రాక్ రికార్డ్‌ను దృష్టిలోఉంచుకుని, రిలయన్స్ డిజిటల్ కుటుంబానికి వన్‌ప్లస్ టీవీని స్వాగతిస్తున్నందుకు గర్వంగా ఉందనీ, భారత వినియోగదారునికి, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన తాజా టెక్నాలజీ బ్రాండ్ల మధ్య వారధిగా కొనసాగుతామని వ్యాఖ్యానించారు. -
ఆధార్ ప్రింట్ చేసినట్టు కాదు..!
న్యూఢిల్లీ: త్రిచక్ర వాహనాలను 2023 నుంచి, ద్విచక్ర వాహనాలను 2025 నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలోనే అనుమతించాలన్న నీతి ఆయోగ్ ప్రతిపాదనపై అగ్రశ్రేణి ఆటో కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. ఇదేమీ ఆధార్ కార్డును ప్రింట్ చేసింత ఈజీ కాదని టీవీఎస్, బజాజ్ ఆటో వ్యాఖ్యానించాయి. ఈ ప్రతిపాదనల వెనక తగినంత అధ్యయనం, సంప్రదింపులు లేవని పేర్కొన్నాయి. ‘‘ఇది ఆధార్ కార్డు కాదు. సాఫ్ట్వేర్, ప్రింట్ కార్డులు కాదు. మొత్తం సరఫరా చెయిన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రస్తుత వ్యవస్థ నుంచి దానికి మళ్లాల్సి ఉంటుంది’’ అని టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ పేర్కొన్నారు. తమ ప్రతిపాదనలపై రెండు వారాల్లో ఆటో మొబైల్ పరిశ్రమ స్పందించాలని నీతి ఆయోగ్ కోరిన నేపథ్యంలో వేణు శ్రీనివాసన్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. నాలుగు నెలల సమయం కోరాం... ‘‘ఓ ప్రణాళికతో ముందుకు రావడానికి మాకు నాలుగు నెలల సమయం పడుతుందని తెలియజేశాం. ప్రణాళిక ఓ నగరంతో (అత్యధిక ద్విచక్ర వాహనాలు కలిగిన నగరం) మొదలవుతుంది. ఆ తర్వాత బదిలీ అన్నది కొంత కాలానికి జరుగుతుంది’’ అని వేణు శ్రీనివాసన్ తెలిపారు. 2 కోట్ల వాహనాలు, 15 బిలియన్ డాలర్ల అమ్మకాలు, 10 లక్షల మంది ఉపాధితో కూడిన ఈ రంగంలో ఒకేసారి పూర్తిగా మార్పు అన్నది సాధ్యం కాదని చెప్పారాయన. థర్మల్ (బొగ్గు ఆధారిత) విద్యుత్‌తో నడిచే బ్యాటరీలకు మళ్లడం కాలుష్యాన్ని తగ్గించదని స్పష్టంచేశారు. కాలుష్యంలో వాహనాల పాత్ర 20 శాతం అయితే, ఇందులో ద్విచక్ర వాహనాల నుంచి వెలువడే కాలుష్యం 20 శాతమేనని, అంటే కేవలం 4 శాతం కాలుష్యం గురించి ఇదంతా చేస్తున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కాగా పూర్తిగా 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం అన్నది అవసరం లేదని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. కార్లు తదితర వాహనాలను వదిలేసి, కేవలం ద్వి, త్రిచక్ర వాహనాలనే లక్ష్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం: హీరో మోటోకార్ప్ 150సీసీ సామర్థ్యం వరకు, ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్లతో కూడిన ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించాలన్న నీతి ఆయోగ్ విధానంతో తలెత్తబోయే పరిణామాలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఈ విధానంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. 150సీసీ సామర్థ్యంలోపు ముఖ్యంగా 100సీసీ, 110సీసీ, 125సీసీ విభాగంలో విక్రయమయ్యే అత్యధిక వాహనాలు ఈ కంపెనీవే. భాగస్వాములు అందరి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని కంపెనీ సూచించింది. ఎలక్ట్రిక్ వాహనాల అమలును బలవంతంగా రుద్దడానికి బదులు, మార్కెట్ పరిస్థితులు, కస్టమర్ల వైపు నుంచి ఆమోదం వంటి అంశాలతో ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం అనేది ఆధారపడి ఉండాలని సూచించింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రంగంపై ప్రతిపాదిత నిషేధం తీవ్ర ప్రభావం చూపుతుందని హీరో మోటోకార్ప్ ఆందోళన వ్యక్తం చేసింది. -
షావోమీ టీవీ ధరలు తగ్గాయ్!
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారత్‌లో టాప్ నిలిచిన చైనా కంపెనీ టీవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంఐ స్మార్ట్‌టీవీల పేరుతోబడ్జెట్ ధరల్లో వీటిని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చి స్మార్ట్‌టీవీల్లో కూడా నెం.1 బ్రాండ్‌గా నిలిచింది. తాజాగా షావోమి తన కస్టమర్లకు నూతన సంవత్సర కానుకను అందించింది. ఎంఐ టీవీలపై ధరలను తగ్గించినట్టు ప్రకటించింది. ఎంఐ టీవీల ధరలను తగ్గించినట్టు షావోమి వెల్లడింది. వెయ్యి నుంచి 2వేల రూపాయల దాకా ఈ తగ్గింపు ఉండనుంది. 32 అంగుళాల ఎంఐ టీవీ 4ఏ ధర రూ.1500 తగ్గింపుతో ప్రస్తుతం రూ.12,499లకు అందుబాటులో ఉంది. 32 అంగుళాల ఎంఐ టీవీ 4సీ ప్రొ ధర. రూ.13,999గా ఉంది. రూ.2 వేలను తగ్గించింది. 49 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఏ ప్రొ రూ.1000తగ్గి రూ. 30,999లకే అందుబాటులో ఉంది. Mi fans! There couldn't be a better beginning. Get your hands on TVs from India's #1 Smart TV Brand at an unbeatable price, starting today. How's this for a New Year gift? RT to spread happiness. pic.twitter.com/9ZWb2dYlyw — Mi India (@XiaomiIndia) January 1, 2019 -
జీఎస్టీ తగ్గింపు ఎఫెక్ట్... నేటి నుంచి ఇవన్నీ చౌక!
న్యూఢిల్లీ: జనవరి ఒకటి నుంచి 23 వస్తుసేవలపై తగ్గించిన జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. డిసెంబర్ 22న జరిగిన జీఎస్టీ కౌన్సిల్లో 23 రకాల వస్తు సేవలపై జీఎస్టీ శ్లాబులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తగ్గింపుతో సామాన్యుడికి అవసరమైన పలు వస్తు సేవల ఖరీదు తగ్గనుంది. పన్ను తగ్గింపుతో సినిమా టికెట్లు, టీవీలు, మానిటర్లు, పవర్‌బ్యాంకులు, నిల్వచేసిన కూరగాయలు ఇకపై చౌకగా లభిస్తాయి.పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన జాబితాలో కప్పీలు, ట్రాన్స్మిషన్ షాఫ్ట్, పునర్వినియోగ టైర్లు, లిథియం అయాన్ పవర్ బ్యాంకులు, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్లు, వీడియో గేమ్ పరికరాలున్నాయి. దివ్యాంగుల ఉపకరణాలపై ప్రస్తుతం అమలవుతున్న పన్నును 28 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. సరకు రవాణా వాహనాల థర్డ్ పార్టీ బీమా ప్రీమియాన్ని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అత్యల్ప పన్ను శాతమైన 5 శాతం శ్లాబులోఊత కర్ర, ఫ్లైయాష్ ఇటుకలు, సహజ బెరడు, చలువరాళ్లను చేర్చారు. పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వం సమకూర్చే నాన్–షెడ్యూల్డ్, చార్టర్డ్ విమానాల సేవలపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. పునర్వినియోగ ఇంధన ఉపకరణాలు, వాటి తయారీపై కూడా 5 శాతం పన్ను విధించారు. శీతలీకరించిన, ప్యాక్ చేసిన కూరగాయలతో పాటు రసాయనాలతో భద్రపరచిన, తక్షణం తినడానికి సిద్ధంగా లేని కూరగాయలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. జన్‌ధన్ యోజన ఖాతాదారులకు బ్యాంకులు అందించే సేవలను కూడా పన్ను పరిధి నుంచి తప్పించారు. -
వాయిస్ ఆదేశాలతో టీవీ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీవీ పనిచేయాలంటే రిమోట్ వాడాలి. అసలు రిమోట్‌ను ఆపరేట్ చేసే అవసరం లేకుండా మాటలతోనే పనిచేస్తే..! ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్జీ భారత్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఆధారంగా వాయిస్ కమాండ్‌తో పనిచేసే థింక్యూ టీవీలను ప్రవేశపెట్టింది. చానెల్, పాటలు, వీడియోలు, గేమ్స్, ఫొటోలు.. ఇలా ఏది కావాలన్నా వాయిస్‌తో ఆదేశిస్తే చాలు. టీవీ పనిచేస్తుంది. ఇంట్లో ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేకపోవడం మరో విశేషం. 32–77 అంగుళాల సైజులో మొత్తం 25 మోడళ్లను మంగళవారమిక్కడ ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.30 వేలతో ప్రారంభమై రూ.30 లక్షల వరకు ఉన్నాయి. యూహెచ్డీ 40 శాతం.. దేశవ్యాప్తంగా 2017లో ఒక కోటి ఫ్లాట్ ప్యానెల్ టీవీలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఈ సంఖ్య 1.3 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. పరిశ్రమలో తమ కంపెనీకి 25 శాతం వాటా ఉందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోమ్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ యూంచుల్ పార్క్ ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది పండుగల సీజన్లో జరిగిన కంపెనీ అమ్మకాల్లో అల్ట్రా హెచ్డీ టీవీల వాటా 14 శాతం. ఈ సీజన్లో ఇది 40 శాతానికి చేరుకుంటుందని ధీమాగా చెప్పారు. కస్టమర్లు తమ చిన్న టీవీల స్థానంలో పెద్ద స్క్రీన్లతో రీప్లేస్ చేస్తుండడం అధికంగా జరుగుతోందని వెల్లడించారు. -
టీవీఎస్ నుంచి రేడియాన్ మోటార్‌బైక్
చెన్నై: టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్తగా రేడియాన్ బైక్‌ను ఆవిష్కరించింది. 110 సీసీ సామర్ధ్యం గల ఈ బైక్ ధర రూ. 48,400 (ఎక్స్‌షోరూం ఢిల్లీ)గా ఉంటుంది. కార్ తరహా స్పీడోమీటర్, పెద్ద సీటు, క్రోమ్ సైలెన్సర్, స్మార్ట్ ఫోన్ చార్జర్, ట్యూబ్‌లెస్ టైర్లు, లీటరుకు 69.3 కిలోమీటర్ల మైలేజి వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. త్వరలోనే విక్రయాలు ప్రారంభించనున్నట్లు, తొలి ఏడాదిలో రెండు లక్షల వాహనాల అమ్మకాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కంపెనీ జాయింట్ ఎండీ సుదర్శన్ వేణు గురువారం విలేకరులకు తెలిపారు. టీవీఎస్ ఇప్పటికే స్పోర్ట్, స్టార్ సిటీ, విక్టర్ బైక్స్ విక్రయిస్తోంది. రేడియాన్‌లో మరికొన్ని వేరియంట్స్ కూడా ప్రవేశపెడతామని, ఈ శ్రేణిని అభివృద్ధి చేసేందుకు సుమారు రూ. 60 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని సంస్థ ప్రెసిడెంట్ కేఎన్ రాధాకృష్ణన్ చెప్పారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై గతేడాది రూ. 550 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. ఈసారి రూ. 700 కోట్లు మేర వెచ్చించనున్నట్లు ఆయన వివరించారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన అపాచీ ఆర్ఆర్ 310, అపాచీ ఆర్టీఆర్ 160–4వి, ఎన్‌టార్క్ బైక్‌లకు మంచి స్పందన లభించిందని రాధాకృష్ణన్ చెప్పారు. -
ఫ్లిప్‌కార్ట్ ‘సూపర్ర్ సేల్’ : ఆకర్షణీయమైన డీల్స్
బెంగళూరు : బిగ్ ఫ్రీడం సేల్ ముగిసిన రెండు వారాల్లోనే దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో సేల్కు తెరలేపబోతుంది. ‘సూపర్ర్ సేల్’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ దీన్ని నిర్వహిస్తోంది. లోయల్టి ప్రొగ్రామ్ ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్’ లాంచ్ చేసిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సేల్ ఇదే. ప్లస్ సభ్యులకు ఈ సేల్ త్వరగా అందుబాటులోకి రానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సేల్ లైవ్‌లోకి వస్తుండగా.. ప్లస్ సభ్యులకు ఆగస్టు 24వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై, టీవీలపై, ల్యాప్‌టాప్‌లపై, రిఫ్రిజిరేటర్లపై ఆకర్షణీయమైన డీల్స్‌ను ప్రకటిస్తుంది. రెడ్మి 5ఏ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు సేల్కు వస్తుంది. టెలివిజన్ సెట్లపై, హెచ్‌పీ, ఆసుస్, డెల్, ఏసర్ వంటి ల్యాప్‌టాప్ బ్రాండ్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లపై కొనుగోలుదారుడు అదనంగా 2వేల రూపాయల తగ్గింపును పొందవచ్చు. శాంసంగ్, ఎల్జీ, వర్పూల్ బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్లపై 30 శాతం తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీతో ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారులకు 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఈఎంఐ ద్వారా జరిపే పేమెంట్లకు మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్యాషన్, ఫర్నీచర్ వస్తువులపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు కాస్త ముందుగా ఈ సేల్ అందుబాటులోకి రావడమే కాకుండా.. ఉచితంగా, త్వరగా డెలివరీ చేసే సామర్థ్యం, ప్రియారిటీ కస్టమర్ సపోర్టు లభించనున్నాయి. తన వెబ్‌సైట్‌పై వెచ్చించే ప్రతి 250 రూపాయలకు ఒక కాయిన్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేయనుంది. ఒక్క లావాదేవీల్లోనే 2500 రూపాయల వరకు డిస్కౌంట్ పొందడానికి ఫ్లిప్‌కార్ట్ సభ్యులు ఈ 10 కాయిన్లను వాడుకోవచ్చు. ప్లస్ సభ్యులకు పలు ఉచిత ఆఫర్లను కూడా కంపెనీ అందిస్తుంది. ఈ ఆఫర్లలో గానా ప్లస్‌కు 6 నెలల సబ్స్క్రిప్షన్, ఐక్సిగోలో విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి రూ.550 ఇన్స్టాంట్ డిస్కౌంట్, బుక్‌మైషో ద్వారా సినిమా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి వంద రూపాయల తగ్గింపు ఉన్నాయి. -
మరోసారి ధరలు తగ్గించిన శాంసంగ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తమ కస్టమర్లకు అపుడే పండుగ కానుక ఇచ్చేసింది. శాంసంగ్ టీవీల రేట్లను మళ్లీ తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. తన టాప్ సెల్లింగ్ మోడల్ టీవీలపై డిస్కౌంట్‌ను ప్రకటించింది. వివిధ మోడళ్ల టీవీలపై 5 నుంచి 15శాతం తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం 32-43 అంగుళాల టీవీలపై వెయ్యి నుంచి రూ .2,500 వరకు ఈ తగ్గింపు ఉండనుంది. 75 ఇంచెస్ టీవీలపై రూ45వేల రూపాయల దాకా (15 శాతం) తగ్గింపును అందివ్వనుంది. టిసిఎల్, షావోమి బిపిఎల్, వూ, కోడాక్ మార్కెట్ ప్రత్యర్థులపోటీని అధిగమించేలా ఈ తగ్గింపు ధరలను వెల్లడించింది. అంతేకాదు రానున్న పండుగసీజన్‌లో క్యాష్‌బ్యాక్‌లు, ఇతర బహుమతులను వినియోగదారులకు అందించనుందట. కాగా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ దాని టెలివిజన్ సెట్లపై రేట్లు తగ్గించడం వరుసగా ఇది రెండవసారి. ఈ ఏడాది జూన్‌లో 10-20 శాతం ధరలు తగ్గించింది. -
గోద్రేజ్, శాంసంగ్ బంపర్ బొనాంజా
ముంబై: పండుగ సీజన్ కంటే ముందుగానే గృహోపకరణాల కంపెనీలు కస్టమర్లకు బంపర్ ఆఫర్లు తీసుకొచ్చాయి. గోద్రేజ్ అప్లియెన్సెస్ పలు ఉత్పత్తులపై 8 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. శుక్రవారం (27 జూలై, 2018) నుంచి వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, చెస్ట్ ఫ్రీజర్స్ (ఫ్రిజ్)లపై డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు గోద్రేజ్ అప్లియెన్సెస్ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది ప్రకటించారు. గడిచిన వారంలో 15 రకాల గృహోపకరణాలపై జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించనున్నట్లు వివరించారు. శాంసంగ్ డిస్కౌండ్ సందడి... ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కూడా జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందిస్తోంది. టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్‌ల ధరలు 7.81 శాతం మేర తగ్గినట్లు శాంసంగ్ ఇండియా కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భుటానీ ప్రకటించారు. ‘తగ్గిన జీఎస్టీ రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందిస్తున్నాం. ఈ నిర్ణయం వల్ల పండుగ సీజన్లో అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. -
రిలయన్స్ మరో సంచలనం : షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్
న్యూఢిల్లీ : ఇప్పటికే టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించి బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో తన పాగా వేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, మరో వినూత్న ఆవిష్కరణకు తెరతీస్తుంది. సొంతంగా ప్రొడక్షన్ హౌజ్‌ను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని ద్వారా షార్ట్‌ఫిల్మ్స్, సీరియల్స్‌ను నిర్మించాలని ఆర్ఐఎల్ భావిస్తోంది. అయితే ఈ షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్ కేవలం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ సబ్స్క్రైబర్లకు మాత్రమే అందించనుందట. కేవలం రిలయన్స్ జియో సబ్స్క్రైబర్స్ మాత్రమే వెబ్ సీరిస్‌లో వీటిని వీక్షించవచ్చని తెలిసింది. టెలికాం మార్కెట్లో పోటీని తట్టుకుని అగ్రస్థానాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ప్రకటించింది. దీంతో తనకున్న 215 మిలియన్ వైర్లెస్ యూజర్ బేస్‌కు మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి వైర్డ్ బ్రాడ్‌బాండ్ సర్వీసులను ప్రారంభించాలనే లక్ష్యంతో కంపెనీ వుంది. జియో సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే కంటెంట్ అందించే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. వచ్చే 6 నెలల్లో కొన్ని వెబ్‌సిరీస్‌లను రిలీజ్ చేసే అంచనాతో ఉన్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. టారిఫ్‌లు భారీగా తగ్గడంతో మొబైల్ డేటా వినియోగం అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో వీడియో స్ట్రీమింగ్ సర్వీసులైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియాలను వీక్షించే సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ ప్లాట్‌ఫామ్‌లపై పలు షోలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి. దీంతో సొంత ప్రొడక్షన్ హౌజ్‌ను ఏర్పాటు చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది. దీని కోసం రిలయన్స్ కంటెంట్ క్రియేటర్స్, స్క్రిప్‌రైటర్స్‌ను నియమించుకుంది. ఈ ప్రక్రియలోనే రిలయన్స్ అతిపెద్ద ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించబోతుందని ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి చెప్పారు. ఎరోస్ గ్రూప్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్యోతి దేశ్ పాండేను రిలయన్స్ ఇండస్ట్రీస్ తన మీడియా, ఎంటర్టైన్మెంట్కు అధిపతిగా నియమించుకుందని తెలిసింది. తాజాగా 20 నుంచి 25 మంది క్రియేటివ్ వ్యక్తులు కూడా బోర్డులో జాయిన్ అయ్యారు. మీడియా ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ విజ్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్‌తో జియో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. రిలయన్స్ త్వరలో కంటెంట్ ఆఫరింగ్ కోసం మరికొన్ని టేకోవర్లు చేసే యోచనలో ఉందని తెలిసింది. -
మోసాలు.. మోపెడు
అధికార పార్టీ అండ ఉంది. ఏంచేసినా చెల్లుతుందనే నమ్మకముంది. ఇంకేముంది మోపెడ్‌పై సైతం వందలాది క్వింటాళ్ల ధాన్యం తరలించేసినట్లు బిల్లులు సృష్టించి దోచేసుకునే ధైర్యం వారికుంది. పౌర సరఫరాల శాఖలో తప్పుడు రవాణా బిల్లులు సైతం ‘పాస్’ చేయించుకొనే ‘ప్రసన్నాంజనేయుడి’ పవర్ అది. నందిగామ మార్కెట్‌యార్డులో ధాన్యం దోపిడీ తీరు ఇది. సాక్షి, అమరావతిబ్యూరో : టీవీఎస్–ఎక్స్ఎల్ మోపెడ్ వాహనంపై ఎన్ని బస్తాలు తీసుకెళ్లవచ్చు? మహా అయితే 10 బస్తాల వరకు సాధ్యపడవచ్చు. అదే ఆటో రిక్షాలో ఓ 20 బస్తాలు.. ఇక ఇండికా కారు అనుకోండి 30 బస్తాలు సరే. కానీ.. నందిగామ మార్కెట్‌యార్డు నుంచి ఓ టీవీఎస్ మోపెడ్ వాహనంపై ఏకంగా 713 బస్తాలు, టాటా ఇండికా కారులో 463 బస్తాలు, ఆటో రిక్షాలో 537 బస్తాలు సరఫరా చేసినట్లు నిసిగ్గుగా రికార్డులు రాసేశారు. ఇదొక్కటే కాదు ఒక లారీలో ఏకంగా 1203 బస్తాలు సరఫరా చేయడం ఒక్క ‘ప్రసన్నాంజనేయ’ గ్రామైక్య సంఘానికే చెల్లింది. అధికార పార్టీ నాయకుల అండదండలతో పీపీసీ కమిటీ సభ్యురాలు ధాన్యం రవాణా పేరిట చేసిన అడ్డగోలు దోపిడీని చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ఇంత జరిగినా, ప్రభుత్వ సొమ్మును అక్రమంగా లూటీ చేసినా పౌరసరఫరాల శాఖాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లో వెళితే.. రవాణా చేశారిలా.. మార్కెట్ యార్డుల్లో పీపీసీ కమిటీల ద్వారా సేకరించిన చేసిన ధాన్యాన్ని సాధారణంగా పౌరసరఫరాల సంస్థ టెండర్ల ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న ట్రాన్స్పోర్టర్లు సరఫరా చేస్తుంటారు. కాగా, నందిగామ మార్కెట్‌యార్డులో ప్రసన్నాంజనేయ గ్రామైక్య సంఘం పేరిట సేకరించిన ధాన్యాన్ని కూడా టెండరు దక్కించుకున్న అన్నపూర్ణ లారీ ట్రాన్స్‌పోర్టు సరఫరా చేసినట్లు రికార్డుల్లో చూపెట్టారు. కానీ ఇక్కడ ధాన్యం సరఫరా చేసేందుకు లారీలను ఉపయోగించకపోగా నిబంధనలకు విరుద్ధంగా టీవీఎస్ మోపెడ్, ఆటో రిక్షాలు, ఇండికా కారు, రవాణాశాఖ కార్యాలయ చరిత్రలో లేని సీరిస్ నంబర్ల పేరిట ఉన్న లారీల్లో సరఫరా చేసేశారు. ఆ వాహనాల నంబర్ల మీదే బిల్లులురూపొందించారు. లారీల్లో సరఫరా చేసిన ధాన్యం కన్నా ఇతర వాహనాల్లో సరఫరా చేసిన ధాన్యమే ఎక్కువగా ఉండటం గమనార్హం. అయితే ఇవేవీ పౌరసరఫరాల సంస్థ అధికారులకు పట్టలేదు. పైగా వారు రూపొందించిన తప్పుడు రవాణా బిల్లులకు ఆమోదం తెలిపి పరోక్షంగా ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి సహకరించారు. రూ. 33.81లక్షల దోపిడీ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు స్థానికంగా ఉండే పౌరసరఫరాల గోదాములకు తరలిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం లారీల ద్వారానే జరుగుతుంది. కానీ నందిగామ మార్కెట్ యార్డు నుంచి తరలించిన ధాన్యం మాత్రం అధిక భాగం లారీల్లో కాకుండా సాధారణ వాహనాల్లో అది కూడా టీవీఎస్–50, ఆటో రిక్షా, టాటా ఇండికా కారు, ట్రాక్టర్ లాంటి వాటిపై వేలాది బస్తాలను తరలించినట్లు చూపెట్టారు. 1992 మోడల్‌కు చెందిన టీవీఎస్–50ఎక్స్ఎల్( అ్క07 8544) పై 13 ్ర టిప్పులు చొప్పున ∙Ðð ¬త ్తం 7000 బస్తాలను సరఫరా చే సిన ట్లు రి కారు ్డల్లో ^è ప గా.. రవాణా శా ఖ రి కారు ్డల్లో లేని అ్క20 6770 నంబరు గల లారీ ద్వారా 15 ట్రిప్పులు చొప్పున సుమారు 9వేల బస్తాలు, ఏపీఎస్టీ 1234 లారీ ద్వారా 2,500 బస్తాలు సరఫరా చేసినట్లు ప్రసన్నాంజనేయ సంఘం రికార్డుల్లో చూపింది. ఈ రెండు లారీల నంబర్లు రవాణా శాఖ రికార్డుల్లోనే లేకపోవడం విశేషం. ఇలా లేని లారీలు ఉన్నట్లుగా.. రైతుల వద్ద సేకరించని ధాన్యాన్ని సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించి నాలుగేళ్ల వ్యవధిలో రవాణా చార్జీల పేరిట రూ. 33.81 లక్షలు దోచుకున్నారు. గన్నీ బ్యాగ్‌ల డబ్బును వదల్లేదు నందిగామ మార్కెట్‌యార్డు కమిటీలో నాలుగేళ్ల కాలంలో ‘ప్రసన్నాంజనేయ’ పరపతి సంఘం చెబుతున్నవన్నీ దొంగ లెక్కలేనని తేలింది. వారు ధాన్యాన్ని సరఫరా చేసినట్లు చూపుతున్న వాహనాలు కొన్ని లేకపోవడం.కొన్నింటిలో సరఫరా చేయడానికి సాధ్యం కాని వాహనాలు ఉండటం చూస్తే 90 శాతం వరకు ధాన్యాన్ని రైతుల వద్ద కొనుగోలు చేయనేలేదని సుస్పష్టమవుతోంది. అయితే వారు ధాన్యం సేకరించినట్లుగా.. వాటికి కొత్త బ్యాగుల్లో నింపినట్లుగా చూపెట్టారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఒక్కో బ్యాగ్‌కు రూ. 15ల చొప్పున వసూలు చేశారు. వారు చెబుతున్న లెక్కల ప్రకారం మొత్తం 1.53,705.6 క్వింటాళ్లకు గానూ 3,84,262 బ్యాగులు(50 కేజీల బస్తా బ్యాగులు) కొనుగోలు చేయడానికి రూ. 57.63 లక్షల వరకు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపారు. కానీ వారు ఎలాంటి బ్యాగులు కొనకుండా ఆ డబ్బునూ నిసిగ్గుగా నొక్కేశారు. -
టీవీ మార్కెట్లో సంచలనానికి షావోమి రె‘ఢీ’
కోల్‌కతా : టెలివిజన్ మార్కెట్‌ను ఓ కుదుపు కుదిపేయడానికి షావోమి సిద్ధమైంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన సత్తా చాటుతున్న షావోమి, భారత్‌లో టెలివిజన్ సెట్లు తయారుచేయడానికి రంగం సిద్ధం చేసింది. దీని కోసం తైవనీస్ కాంట్రాక్ట్ మానుఫ్రాక్ట్ర్చర్ ఫాక్స్‌కాన్‌తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. వచ్చే పండుగ సీజన్ కల్లా ఆన్లైన్ అమ్మకాల్లో తాను ఆధిపత్య స్థానంలో ఉండాలని షావోమి ప్లాన్ చేస్తోందని ముగ్గురు సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. భారత్‌లోనే టీవీ సెట్లను రూపొందిస్తుండటంతో, కంపెనీ పన్ను ప్రయోజనాలను కూడా పొందనుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. అయితే టీవీల ధరలను మాత్రం షావోమి తగ్గించకపోవచ్చని, ఇప్పటికే ఎలాంటి మార్జిన్లు లేకుండా వీటిని తక్కువ ధరలకు వినియోగదారులకు అందిస్తుందని తెలిపారు. భారత్‌లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ విక్రయదారిగా ఇప్పటికే షావోమికి పేరుంది. ప్రస్తుతం భారత్‌లో టెలివిజన్లను తయారు చేయడానికి ఫాక్స్‌కాన్‌తో జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. జూన్-ఆగస్టు నుంచి వీటి అమ్మకాలు ప్రారంభమవుతాయని, పండుగ సీజన్-దివాళి విక్రయాల్లో ఎక్కువగా మేడిన్ ఇండియా మోడల్సే ఉండనున్నాయని పేర్కొన్నాయి. అయితే షావోమి తొలుత అతిపెద్ద ఆన్లైన్ టెలివిజన్ బ్రాండ్‌గా నిలువాలని టార్గెట్ పెట్టుకుంది. అనంతరం మల్టి బ్రాండ్ స్టోర్లలోకి విస్తరించాలని చూస్తోంది. స్థానికంగా టెలివిజన్ సెట్లు తయారు చేస్తుండటంతో, కంపెనీకి పన్ను ప్రయోజనాలు లభించడమే కాకుండా... మార్జిన్లు కూడా పెరగనున్నాయి. ఇది సప్లై చెయిన్‌ను నియంత్రించడానికి సహకరిస్తుంది. భారత్‌లో టెలివిజన్లను తయారుచేయడం షావోమి ప్రారంభిస్తుందని, ఈ ఏడాదిలో ఈ ప్రక్రియ ప్రారంభం కావొచ్చని షావోమి ఇండియా అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే ఫాక్స్‌కాన్ మాత్రం దీనిపై స్పందించలేదు. దిగుమతి పన్నుల్లో మార్పులు, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో షావోమి గత నెలలో తన 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధరను పెంచిన సంగతి తెలిసిందే. పన్నులు పెరుగుతుండటంతో ఆన్లైన్ ఎక్స్‌క్లూజివ్, ఫోకస్డ్ టెలివిజన్ బ్రాండ్లు స్థానిక ఉత్పత్తిని పెంచడంపై ఎక్కువగా దృష్టిసారించాయి. షావోమి స్మార్ట్ఫోన్లను భారత్‌లో తయారు చేయడంలో ఫాక్స్‌కాన్ అతిపెద్ద తయారీదారి. స్మార్ట్ఫోన్లను అసెంబుల్ చేయడానికి షావోమి ఇప్పటికీ ఆరు థర్డ్ పార్టీ ప్లాంట్లను కలిగి ఉంది. -
బ్రాండెడ్ చీటింగ్..!
గచ్చిబౌలి: ఢిల్లీలో తయారైన నాసిరకం టీవీలను నగరానికి తరలించి.. సోనీ బ్రాండ్ పేరుతో స్టిక్కర్లు తగిలించి.. నేరుగా, ఆన్లైన్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 51 టీవీలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో వివరాలు వెల్లడించారు. ఢిల్లీలోని ద్వారక సెక్టార్‌కు చెందిన గౌరవ్ సింగ్ నగరానికి వలసవచ్చి చైతన్యపురిలో నివసిస్తున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన బుడిగెల సంతోష్ ఇతడి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గౌరవ్‌సింగ్ ఢిలీలో తయారైన వివిధ మోడల్స్‌కు చెందిన టీవీలను ఖరీదు చేసి తీసుకు వచ్చేవాడు. వీటికి సోనీ బ్రాండ్ లేబుల్స్ అతికించి తన దుకాణంలో విక్రయిస్తున్నాడు. ఇందులో సంతోష్ సేల్స్మెన్గానూ పని చేస్తున్నాడు. సోనీలోని వివిధ మోడల్స్‌తో పాటు సామ్సాంగ్ పేరుతోనూ లేబుల్స్ తగిలిస్తున్న గౌరవ్‌సింగ్ వీటి ఫొటోలను ఈ–కామర్స్ సైట్ ఓఎల్ఎక్స్లోనూ పొందుపరిచి మార్కెట్ ధరకంటే తక్కువకే విక్రయిస్తానంటూ నమ్మించి మోసాలు చేస్తున్నాడు. మలేషియాకు చెందిన టెలిరాక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి వీటిని ఖరీదు చేసి, దిగుమతి చేసుకుంటున్నట్లు నకిలీ బిల్లులు సైతం సృష్టించాడు. జీఎస్టీ లేకుండా 20 నుంచి 30 శాతం తక్కువ ధరకు అందిస్తున్నమంటూ ప్రచారం చేసుకుని వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు. 65 ఇంచుల సోనీ టీవీ ధర రూ.2.8 లక్షలు ఉండగా... గౌరవ్ సింగ్ మాత్రం ‘మేడిన్ ఢిల్లీ’ టీవీని కేవలం రూ.80 వేలకు ఖరీదు చేస్తున్నాడు. దీనిని సిటీకి తరలించి బ్రాండెడ్ కంపెనీకి చెందిన లేబుల్‌తో రూ.80 వేల డిస్కౌంట్ అంటూ రూ.2 లక్షలకు అమ్ముతున్నాడు. దీనిపై సమాచారం అందడంతో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు గురువారం దాడి చేశారు. గౌరవ్ సింగ్‌తో పాటు సంతోష్‌ను పట్టుకుని వీరి నుంచి 51 నాసిరకం టీవీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు సీపీ తెలిపారు. ఇందుకుగాను ఢిల్లీకి ప్రత్యేక బృందాన్ని పంపనున్నామన్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ తరహా మోసాలు సైతం పెరిగాయని, వినియోగదారు లు కేవలం అధీకృత డీలర్ల వద్ద మాత్రమే వస్తు వులను ఖరీదు చేసుకోవాలని సూచించారు. -
ఫ్లిప్‌కార్ట్ ఉగాది స్పెషల్: భారీ డిస్కౌంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి పండుగ ఆఫర్లకు తెరతీసింది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌టీవీలు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. వీటితో పాటు ఎక్సేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులోఉంచింది. రాయితీ ధరల్లో హెచ్డీ ఎల్ఈడీ టీవీలు కొనుక్కోవాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా మైక్రోమ్యాక్స్, శాంసంగ్, వియూ, పానసోనిక్ , ఎల్జీ లకుచెందిన హై ఎండ్ బ్రాండ్ టీవీలపై డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేస్తోంది. మార్చి 16-18 దాకా 70శాతం డిస్కౌంట్స్. ఐసీఐసీఐ కార్డు ద్వారా కొనుగోళ్లపై 10శాతం డిస్కౌంట్అదనం. 32 అంగుళాల మైక్రోమ్యాక్స్ హెచ్డీ ఎల్ఈడీ దాదాపు 3వేలనుంచి డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ టీవీని ప్రస్తుత ఆఫర్లో12,499 రూపాయల వరకు పొందవచ్చు, ఈ టీవీ అసలు ధర రూ. 19,990. కోడాక్ హెచ్డీ స్మార్ట్ర్ట్ టీవీ ధర రూ .14,999. దీని అసలు ధర రూ .20,990. రూ. 16వేల వియూ హెచ్డీ టీవీని రూ. 13,499కే పొందవచ్చు. దీంతోపాటు శాంసంగ్ 40 అంగుళాల టీవీలపై 24శాతం డిస్కౌంట్. రూ. 47,999 విలువ చేసే శాంసంగ్ ఎల్ఈడీ టీవీ రూ.35,999లకే లభ్యం. ఎల్జీ 32ఇంచెస్ టీవీ రూ.18,4999 లకు అందిస్తోంది. దీని అసలు ధర రూ.23,990గా ఉంది. అలాగే టీవీల కొనుగోళ్ల సందర్భంగా రూ. 8వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్ కూడా కస్టమర్లకు అందిస్తోంది. వీటితోపాటు ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్లుకూడా అందుబాటులో ఉన్నాయి. సూపర్ వాల్యూ వీక్ మార్చి 18-24 మధ్య స్మార్ట్ఫోన్లపై మరిన్ని ఆఫర్లతో మొబైల్ ప్రేమికులను ఆకట్టుకునేందుకు సిద్ధమౌతోంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్వ్యాలూ వీక్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. మీ డ్రీమ్ ఫోన్‌ను సొంతం చేసుకోమంటూ ఊరిస్తోంది. -
టీవీఎస్ ‘అపాచీ 160 4వీ’లో కొత్త ఎడిషన్
న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ ‘టీవీఎస్ మోటార్’ తాజాగా తన ‘అపాచీ 160 4వీ’లో 2018 ఎడిషన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.81,490 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ఇది మూడు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా ఈ బైక్‌ను తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 160 సీసీ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చినట్లు పేర్కొంది. ‘టీవీఎస్ అపాచీ వినియోగదారులకు బాగా చేరువవుతోంది. అపాచీ సిరీస్‌లో ఈ ఏడాది ఐదు లక్షల యూనిట్ల బైక్స్‌ను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని టీవీఎస్ మోటార్ ప్రెసిడెంట్, సీఈవో కె.ఎన్.రా«ధాకృష్ణన్ తెలిపారు. వచ్చే 10–15 రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ ఔట్‌లెట్స్‌లో తాజా అపాచీ వేరియంట్లు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి నెల 33,000 యూనిట్ల అపాచీ బైక్స్ విక్రయమౌతున్నాయని తెలిపారు. 160 సీసీ అపాచీ బేస్ వేరియంట్ ధర రూ.81,490గా, టాప్–ఎండ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ వేరియంట్ ధర రూ.89,990గా ఉందని పేర్కొన్నారు. -
పేటీఎం మాల్తో టీవీఎస్ ఆటో అసిస్ట్ జట్టు
చెన్నై: కార్లు, బైకులు ఏదైనా సమస్య వచ్చి రోడ్డు మధ్యలో ఆగిపోయిన పక్షంలో బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ సేవలందించే దిశగా పేటీఎం మాల్తో టీవీఎస్ ఆటో అసిస్ట్ చేతులు కలిపింది. ఈ ఒప్పందం కింద రోడ్ అసిస్టెన్స్ సర్వీస్ ప్యాకేజీలను పేటీఎం తమ ప్లాట్‌ఫాంపై విక్రయించనుంది. ఆటో అసిస్ట్‌లో సభ్యత్వానికి సంబంధించి గోల్డ్ మెంబర్ షిప్ ఫీజు రూ.1,499గా, ప్లాటినం మెంబర్‌షిప్‌కి రూ.2,999గా ఉంటుంది. వినియోగాన్ని బట్టి చార్జీలు చెల్లించే ప్రాతిపదికన టీవీఎస్ ఆటో అసిస్ట్‌లో సభ్యులు కాని వారికి కూడా సర్వీసులు అందిస్తామని టీవీఎస్ ఆటోమొబైల్ సొల్యూషన్స్ ఈడీ జి. శ్రీనివాస రాఘవన్ తెలిపారు. రాత్రి 8 గం. నుంచి తెల్లవారుఝాము 5 గం.ల మధ్య ప్రయాణించే మహిళా ప్యాసింజర్స్‌కి కూడా సేవలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ తరహా ప్రయోగాన్ని హైదరాబాద్‌తో పాటు న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులో అందించనున్నట్లు తెలియజేశారు. -
ఇప్పుడు స్పోర్టీ స్కూటర్ల వంతు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహనాల్లో స్కూటర్లు సౌకర్యవంతంగా ఉంటాయన్నది వాస్తవం. ఇప్పుడు ఈ స్కూటర్ మార్కెట్ కాస్తా స్పోర్టీ, స్మార్ట్ వైపు దూసుకెళ్తోంది. సాధారణ స్కూటర్లతో పోలిస్తే ఈ స్పోర్టీ వేరియంట్ల అమ్మకాలు రెండింతల మేర వృద్ధి చెందుతున్నాయంటే ట్రెండ్‌ను అర్థం చేసుకోవచ్చు. మెట్రోలు, పెద్ద పట్టణాలే కాకుండా చిన్న పట్టణాల్లోనూ యువత వీటికి దాసోహం అంటున్నారు. అటు తయారీ కంపెనీలు సైతం వినూత్న డిజైన్లతో ఒకదాని వెంట ఒకటి పోటీపడుతున్నాయి. ఈ ఏడాది మరిన్ని మోడళ్లు కస్టమర్ల కోసం రెడీ అవుతున్నాయి. స్పోర్టీ మోడళ్లకు సై.. విభిన్న డిజైన్లు, మల్టీ కలర్, స్పోర్టీ లుక్ స్కూటర్లకు యువత సై అంటున్నారు. స్కూటర్ల విభాగం ఏటా 18 శాతం వృద్ధి చెందితే, స్పోర్టీ మోడళ్లు 35 శాతం వృద్ధి నమోదవుతున్నాయని టీవీఎస్ సేల్స్ జీఎం బినయ్ ఆంథోని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ‘‘స్కూటర్లలో స్పోర్టీ మోడళ్ల వాటా 10 శాతం దాకా ఉంది. 18 నుంచి 24 ఏళ్ల కుర్రకారే ఈ విభాగాన్ని నడిపిస్తున్నారు’’ అని ఆథోని వివరించారు. ద్విచక్ర వాహన రంగంలో అధిక మైలేజీ ఇచ్చే ఇంజన్ల అభివృద్ధికి కంపెనీలు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. ఒకప్పుడు మైలేజీ లీటరు పెట్రోలుకు 30 లోపే ఉండేది. ఇప్పుడు 55 కిలోమీటర్ల దాకా ఇచ్చే మోడళ్లూ వచ్చాయి. బైక్‌ల మైలేజీ కూడా ఇదే స్థాయిలో ఉండటంతో స్కూటర్ల అమ్మకాలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పోటాపోటీగా మోడళ్లు.. ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు పోటాపోటీగా స్పోర్టీ మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. హోండా నుంచి గ్రేజియా, డియో. హీరో మోటోకార్ప్ నుంచి మాయెస్ట్రో ఎడ్జ్. యమహా నుంచి రే–జడ్ఆర్, రే–జడ్, ఆల్ఫా. అప్రీలియా నుంచి ఎస్ఆర్ 150 రేస్, ఎస్ఆర్ 150 వంటివి ఇప్పటికే మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. మహీంద్రా తన గస్టో మోడల్‌ను స్పోర్టీ లుక్‌తో తీర్చిదిద్దింది. వీటికి పోటీ ఇచ్చేందుకు తాజాగా టీవీఎస్ మోటార్ కంపెనీ ఎన్‌టార్క్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇతర కంపెనీలకు భిన్నంగా కనెక్టెడ్ స్కూటర్‌గా దీనిని అభివర్ణిస్తోంది. సుజుకీ ఈ ఏడాదే బ్రౌనీ 125, బర్గ్‌మన్ స్ట్రీట్ 125 మోడల్స్‌ను తీసుకొస్తోంది. ఇక కంపెనీలన్నీ రెగ్యులర్ మోడళ్లను సైతం మల్టీ కలర్, స్పోర్టీ లుక్ వచ్చే విధంగా రీలాంచ్ చేస్తుండటం ప్రస్తుత ట్రెండ్‌కు అద్దం పడుతోంది. మూడింట ఒకటి స్కూటర్.. దేశవ్యాప్తంగా 2016–17లో 1.75 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం నెలకు అమ్ముడవుతున్న యూనిట్లలో 34 శాతం వాటా స్కూటర్లు చేజిక్కించుకున్నాయి. అంటే మూడు వాహనాల్లో ఒకటి స్కూటర్ అన్నమాట. గేర్లు మార్చాల్సిన అవసరం లేకపోవడం, స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఉపయోగపడే విధంగా వాహన డిజైన్ ఉండటం, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతి వంటి కారణాలతో స్కూటర్లు పాపులర్ అవుతున్నాయి. స్కూటర్ల విభాగం అయిదేళ్లుగా ఏటా 18 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. 2012–13లో దేశీయంగా 1.38 కోట్ల యూనిట్ల టూవీలర్లు విక్రయమయ్యాయి. ఇందులో స్కూటర్ల వాటా 20 శాతం లోపే ఉంది. కాగా, భారత్‌లో ఈ ఏడాది అన్ని కంపెనీల నుంచి 150 సీసీ స్కూటర్లు మార్కెట్లో అడుగు పెడతాయని సమాచారం. -
టీవీ ప్రియులకు పెనుముప్పు
వాషింగ్టన్: గంటల కొద్దీ టీవీల ముందు కూర్చునేవారి సిరల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. టీవీలు చూస్తూ కూర్చోవటం వల్ల కాళ్లకు రక్తప్రసరణ పూర్తిస్థాయిలో జరగక సిరల్లో రక్తం గడ్డలు(వీన్స్ థ్రోమ్బోంబోలిజం–వీటీఈ) ఏర్పడే అవకాశముందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసొటా శాస్త్రవేత్తలు తేల్చారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తులు సైతం టీవీ చూడడం, కదలకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం వంటివాటికి దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు. -
ఫ్లిప్‌కార్ట్ మరో సేల్, డిస్కౌంట్ ఆఫర్స్
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో సేల్కు తెరలేపింది. శాంసంగ్ కార్నివల్(ఉత్సవం) పేరుతో ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, వేరియబుల్స్, హెడ్ఫోన్లు, మొబైల్ యాక్ససరీస్, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్స్, మైక్రోవేవ్స్, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మిషన్లు వంటి వాటిపై డిస్కౌంట్లను అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్ 9వ తారీఖుతో ముగుస్తుంది. ఈ సేల్‌లో భాగంగా రూ.46వేల ధర కలిగిన శాంసంగ్ గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్ రూ.22,990కు అందుబాటులోకి వచ్చింది. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.35,900కు విక్రయిస్తోంది. దీని ఎంఆర్పీ రూ.41,900గా ఉంది. మిడ్-రేంజ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్ 64జీబీ ఫోన్ ధర రూ.17,900 నుంచి రూ.11,900కి దిగొచ్చింది. గెలాక్సీ ఆన్ నెక్ట్స్ 16జీబీ స్మార్ట్‌ఫోన్ రూ.10,999 నుంచి రూ.9,999కు తగ్గింది. గెలాక్సీ ఆన్ మ్యాక్స్ 32జీబీ స్మార్ట్‌ఫోన్ రూ.13,900కే అందుబాటులో ఉంది. అంతేకాక ఈ ఫెస్టివల్లో భాగంగా టాబ్లెట్ రేంజ్ రూ.8,999 నుంచే ప్రారంభమైంది. శాంసంగ్ గేర్ ఫిట్2 ప్రొ రూ.13,590కే లభ్యమవుతోంది. ప్రీఆర్డర్లకు 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. శాంసంగ్ హెడ్ఫోన్లు, స్పీకర్లపై 25 శాతం వరకు డిస్కౌంట్లు, మెమరీ కార్డులు, హార్డ్ డ్రైవ్‌లు, మొబైల్ ఛార్జర్లు వంటి వాటిపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. శాంసంగ్ 49 అంగుళాల కర్వ్డ్ స్మార్ట్ టీవీ ధర రూ.91,900 నుంచి రూ.59,999కు దిగొచ్చింది. మరో బేసిక్ స్మార్ట్ టీవీ ఈ ఫెస్టివల్లో భాగంగా రూ.23,999కే లభ్యమవుతోంది. శాంసంగ్ హెచ్డీ రెడీ టీవీ ధర కూడా రూ.11,499 నుంచే ప్రారంభమవుతోంది. మానిటర్స్ 35 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్రొడక్ట్‌లపై హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఫోన్‌పే ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులతో చేసే చెల్లింపులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు. -
హైదరాబాద్‌లో టీవీఎస్ నకిలీ పార్ట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉప్పు, పప్పులే కాదండోయ్.. వాహన విడిభాగాల్లోనూ నకిలీలున్నాయ్! అవి కూడా హైదరాబాద్‌లో. ఇటీవల వాహన తయారీ సంస్థ టీవీఎస్ కంపెనీ జరిపిన దాడిలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్ రాంకోఠికి చెందిన ఓ ప్రముఖ విక్రయశాలలో రూ.6 లక్షల విలువ చేసే ద్విచక్ర, త్రిచక్ర వాహనాల నకిలీ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నామని.. సంబంధిత స్టోర్ యజమాని మీద కేసులు కూడా నమోదు చేశామని టీవీఎస్ మోటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (పార్ట్స్ బిజినెస్) కె.వెంకటేశ్వర్లు గురువారమిక్కడ చెప్పారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... నకిలీ బ్రేకులు, క్లచ్‌లు.. మూడు నెలలుగా హైదరాబాద్‌తో సహా బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, కోయంబత్తూరు నగరాల్లోని 55 ప్రాంతాల్లో దాడులు నిర్వహించాం. వీటిలో రూ.55 లక్షల విలువ చేసే నకిలీ విడిభాగాల్ని గుర్తించాం. బ్రేకులు, చెయిన్, కేబుల్స్, క్లచ్ ప్యాడ్స్ వంటి ఎక్కువ విక్రయాలు జరిగే విడిభాగాలే నకిలీలున్నాయి. ఇవి బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతాల్లోని 8 కేంద్రాల్లో తయారవుతున్నాయి. అక్కడి నుంచే దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు సరఫరా అవుతున్నాయి. సంబంధిత తయారీ కేంద్రాలు, యాజమాన్యం మీద కాపీ రైట్స్ చట్టం కింద కేసులు నమోదు చేశాం. హైదరాబాద్‌లో మాత్రం తయారీ కేంద్రం ఉన్నట్లు గుర్తించలేదు. అయితే దాడులింకా పూర్తవ్వలేదు. ఈ ఏడాదంతా కొనసాగుతాయి. నకిలీ విడిభాగాలను గుర్తించేందుకు, దాడులు చేసేందుకు 12 ప్రైవేట్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నాం. అవి గుర్తించిన ఉత్పత్తులను కంపెనీ పరిశోధన బృందం పరీక్షించి అవి నకిలీ ఉత్పత్తులేనని తేలాక.. సంబంధిత ప్రాంతాల్లో పోలీసు, ఏజెన్సీలతో కలసి దాడులు చేస్తాం. ఏప్రిల్‌లో హెచ్‌అండ్‌ఎస్ కేంద్రాలు.. హబ్ అండ్ స్పోక్ (హెచ్‌అండ్‌ఎస్) విధానంలో విడిభాగాలను విక్రయించాలని నిర్ణయించాం. ఈ కేంద్రాలేం చేస్తాయంటే.. కంపెనీ నుంచి హబ్‌కు బల్క్‌లో టీవీఎస్ ఉత్పత్తులను పంపిస్తాం. అక్కడి నుంచి 150 కి.మీ. పరిధిలోని డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు చేరుతాయి. ప్రతి హబ్ 2 నెలలకొకసారి ప్రతి రిటైలర్లతో సంప్రతించడం, పర్యవేక్షించడం వంటివి చేయాలి. ఇదంతా టెక్నాలజీతో కలిసి ఉంటుంది. ప్రతి రిటైల్ స్టోర్, ఉత్పత్తులు ట్రాక్ అవుతాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద ఏడాదిన్నర క్రితం నుంచి తమిళనాడులో 10 హెచ్‌అండ్‌ఎస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 9 మంది గుర్తింపు పొందిన డిస్ట్రిబ్యూషన్లున్నాయి. వీటినే హెచ్‌అండ్‌ఎస్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఏప్రిల్‌లో అధికారికంగా ప్రారంభిస్తాం. ఏడాది ముగిసే నాటికి మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఈ విధానాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించాం. విపణిలోకి అదనపు ఫీచర్లతో ఉత్పత్తులు.. ప్రతి విడిభాగం గరిష్ట అమ్మకం ధర (ఎంఆర్పీ) మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే అది నకిలీనా? ఒరిజినలా? అన్నది తెలిసిపోతుంది. అయితే ఈ క్యూఆర్ కోడ్‌ను ఒకసారి స్కాన్ చేస్తే రెండోసారి చేసేటప్పుడు గతంలో వినియోగించారని వస్తోంది. అందుకే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న విడిభాగాల్లో అదనపు ఫీచర్లను జోడిస్తున్నాం. ప్రతి ఉత్పత్తి మీద సూక్ష్మ అక్షరాలతో టీవీఎస్ అని ఉంటుంది. ఇది చూసేందుకు రంగుతో ఉంటుంది కానీ, పరీక్ష చేస్తే కంపెనీ పేరు కనిపిస్తుంది. ఇలాంటి ఫీచర్లతో కూడిన ఉత్పత్తులను విపణిలోకి ప్రవేశపెడుతున్నాం. -
టీవీ మార్కెట్‌పై కన్ను
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో, చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి జట్టు కట్టనున్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో లీడర్‌గా ఉన్న షావోమి టీవీ మార్కెట్లో కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే ఇండియాలోకి తీసుకురానున్న షావోమి టీవీలను జియో రీటైల్ దుకాణాల్లో లాంచ్ చేసేందుకు యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య భాగస్వామ్య చర్చలు నడుస్తున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఆన్లైన్ స్టోర్ల ద్వారా తన ఉత్పత్తులను విక్రయిస్తున్న షావోమి ఆఫ్‌లైన్ విక్రయాలపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో భాగస్వాముల కోసం చూస్తోంది. అలాగే వినియోగదారుల ఉత్పత్తులు మాత్రమే కాకుండా, బీ టూ బీ ఉత్పత్తులను కూడా ఇండియాకు తీసుకురావాలని ఆశ పడుతోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం జియో, షావోమి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల మధ్య ఈ మేరకు పలుమార్లు చర్చలు జరిపాయి. చర్చలు ఒక కొలిక్కి వచ్చి..ఈ ఒప్పందం అమల్లోకి వస్తే.. ఈ ఏడాది నుంచే రిలయన్స్ జియో డిజిటల్ స్టోర్స్ ద్వారా ఎంఐ, రెడ్ మీ బ్రాండ్లను విక్రయించనుంది. అలాగే షావోమీ టీవీలను కూడా విక్రయించనుంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ఉపయోగించిన ఎత్తుగడలనే టీవీ మార్కెట్‌పై కూడా ప్రయోగించనుంది. శాంసంగ్, ఎల్జీ, సోనీ లాంటి ఇతర దిగ్గజ సంస్థల ధరలతో పోలిస్తే సరసమైన ధరలకు ఫీచర్, రిచ్, హై ఎండ్ టీవీలను అందుబాటులోకి తేవాలనే వ్యూహాన్ని అనుసరిస్తోంది. కాగా పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ ప్రకారం భారతదేశంలో నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా అవతరించిన షావోమి 2018 లో తన ఆన్లైన్ వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. -
పెరుగనున్న టీవీలు, మైక్రోవేవ్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : టీవీలు, మైక్రోవేవ్, ఎల్ఈడీ ల్యాంప్స్ లాంటి ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిందే. స్థానిక తయారీకి ఊతమివ్వడానికి ఇటీవల ప్రభుత్వం కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని పెంచిన ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటిపై ఇక కస్టమర్లు ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత నోటిఫికేషన్ ప్రకారం టెలివిజన్ సెట్లపై కస్టమ్స్ డ్యూటీని 20 శాతానికి పెంచినట్టు తెలిసింది. అదేవిధంగా స్మార్ట్ఫోన్లపై ఈ డ్యూటీని 15 శాతానికి పెంచారు. ఎల్ఈడీ పంప్స్‌పై కూడా ప్రస్తుతం 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించనున్నారు. మైక్రోవేవ్లపై కూడా ఈ డ్యూటీని రెండింతలు చేసి, 20 శాతంగా నిర్ణయించారు. దీంతో ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలన్నీ పెరిగిపోనున్నాయి. పూర్తిగా దిగుమతి చేసుకున్న టీవీలపై 20 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని భరించాల్సి ఉంటుందని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ మనీష్ శర్మ చెప్పారు. స్క్రీన్ సైజు బట్టి సగటున ఎల్ఈడీ టీవీల ధరలు రూ.2000 నుంచి రూ.10వేల మేరకు పెరగబోతున్నట్టు సంబంధిత ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం స్థానిక తయారీదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని శర్మ చెప్పారు. శర్మ, పానాసోనిక్ ఇండియా, దక్షిణాసియాకు సీఈవో, ప్రెసిడెంట్. ఈ నిర్ణయం కేవలం స్థానిక తయారీదారులను ప్రోత్సహించడమే కాకుండా.. మేకిన్ ఇండియా ఉత్పత్తులకు డిమాండ్‌ను ఏర్పరుస్తుందని కూడా శర్మ పేర్కొన్నారు. అదేవిధంగా దిగుమతి సుంకాలను పెంచడం విదేశీ తయారీదారులు భారత్‌లో ఉత్పత్తులు తయారు చేసేలా ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యంగా టెలివిజన్ సెట్లపైనే ధరలు ఎక్కువగా పెరుగనున్నట్టు అంచనావేస్తున్నారు. మైక్రోవేవ్లపై విధించిన 20 శాతం దిగుమతి సుంకంతో, మొత్తంగా మైక్రోవేవ్ కేటగిరీలో ధరల పెరుగుదల రూ.400 నుంచి రూ.500 వరకు ఉండొచ్చని గోద్రెజ్ అప్లియెన్స్ బిజినెస్ హెడ్, ఈవీపీ కమల్ నండి తెలిపారు. ఇప్పటికే ఆపిల్, తన ఐఫోన్ మోడల్స్ అన్నింటిపై భారత్‌లో రూ.3,720 వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. -
వీటితో కంటికి చేటు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిన టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు వంటివి కంటిచూపును దెబ్బతీస్తున్నాయి. టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లకు ఉండే చిన్న చిన్న తెరలపై ఎక్కువ సమయం దృశ్యాలను చూస్తుండటం వల్ల చాలామంది చిన్న వయసులోనే దృష్టిలోపాల బారినపడుతున్నారు. ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా, ఈ పరిస్థితిని నిరోధించలేకపోతోంది. దృష్టిలోపాలను నయం చేయడంలో ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి సాధించినా, అధునాతన సాంకేతిక పరికరాల వల్ల తలెత్తే దృష్టి లోపాలను నివారించలేకపోతోంది. అది వైద్యశాస్త్రం పొరపాటు కాదు. సాంకేతిక పరికరాలు వాడే మనుషులే కొంత ముందుచూపుతో మసలుకుంటే, కంటిచూపును పదికాలాల పాటు పదిలంగా కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. టీవీలు రాక మునుపు మన దేశంలో ఎక్కువగా నలభయ్యేళ్ల వయసు దాటిన వారే కళ్లద్దాలతో కనిపించేవారు. కళ్లద్దాలతో కనిపించే చిన్నారులు చాలా అరుదుగా ఉండేవారు. టీవీలు వచ్చాక కళ్లద్దాలతో కనిపించే చిన్నారుల సంఖ్య క్రమంగా పెరగడం మొదలైంది. ఇక కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు విరివిగా వాడుకలోకి వచ్చాక చిన్నారుల్లో కంటిచూపు సమస్యలు మరింతగా ఎక్కువయ్యాయి. విపరీతంగా వీడియో గేమ్స్‌కు అలవాటు పడటం, గంటల తరబడి స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఉపయోగించడం వల్ల పిల్లల కంటిచూపు తీవ్రంగా దెబ్బతింటోంది. ఫలితంగా చిన్నవయసులోనే కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి అనివార్యంగా మారుతోంది. చిన్నారుల్లో జన్యు లోపాల వల్ల, పోషకాహార లోపాల వల్ల కంటిచూపు సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే, జన్యు లోపాల కంటే టీవీ, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు వంటి వాటి వాడుక వల్ల చూపు దెబ్బతింటున్న చిన్నారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. చిన్న వయసులోనే దృష్టి లోపాలను ఎదుర్కొనే పిల్లలు చదువు సంధ్యల్లో కూడా వెనుకబడుతున్నట్లు పలు అంతర్జాతీయ అధ్యయనాల్లో వెల్లడైంది. పిల్లల్లో తలెత్తే దృష్టి లోపాలను సాధ్యమైనంత త్వరగా గుర్తించి, వైద్యుల సలహాపై తగిన కళ్లద్దాలు వాడటం, కాంటాక్ట్ లెన్స్ వాడటం లేదా లేజర్ చికిత్స వంటి ఆధునిక చికిత్స పద్ధతుల్లో కంటిచూపు సరిదిద్దడం వంటి చర్యలు చేపట్టినట్లయితే వారు చదువు సంధ్యల్లో వెనుకబడకుండా ఉంటారని బాలల మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కంటిచూపు లోపాలను ఎదుర్కొంటున్న చిన్నారుల్లో దాదాపు పదిశాతం మందికి పైగా చిన్నారులు చదువు సంధ్యల్లో వెనుకబడిపోతున్నారని, ఆటల్లో కూడా వారు రాణించలేకపోతున్నారని ‘మయో క్లినిక్’ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. రిఫ్రాక్టివ్ సమస్యలు మనం ఏ వస్తువునైనా చూసేటప్పుడు దాని పైనుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి వెనుక రెటీనాపై పడేలా కార్నియా, లెన్స్.. ఈ రెండూ రిఫ్రాక్ట్ చేస్తాయి. వాటిలో ఏవైనా తేడాలున్నప్పుడు రిఫ్రాక్టివ్ సమస్యలు వస్తాయి. ప్రీస్కూల్ వయసు పిల్లల్లో 5 శాతం మంది, స్కూలుకు వెళ్లే పిల్లల్లో 20 శాతం మంది రిఫ్రాక్టివ్ సమస్యలతో బాధపడుతున్నారు. రిఫ్రాక్టివ్ సమస్యల్లో మూడు రకాలు ఉన్నాయి. అవి: దగ్గరి దృష్టి (మయోపియా), దూరపు దృష్టి (హైపరోపియా), వక్రదృష్టి (ఆస్టిగ్మాటిజం). మయోపియా: సాధారణంగా 8–12 ఏళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా మయోపియా సమస్య కనిపిస్తుంది. మయోపియాకు గురైన వారు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేరు. దగ్గరగా ఉన్నవాటిని మాత్రమే స్పష్టంగా చూడగలరు. మయోపియా బారిన పడ్డ పిల్లలు తరచుగా తలనొప్పితో బాధపడుతుంటారు. వారిలో కనుగుడ్లు రెండూ ఒకేలా లేకుండా ఉండవచ్చు. ఈ సమస్యను సరైన కళ్లద్దాలతో లేదా కాంటాక్ట్ లెన్స్‌తో సరిదిద్దవచ్చు. హైపరోపియా: ఈ సమస్యకు గురైన వారికి దూరంగా ఉన్న వస్తువులే స్పష్టంగా కనిపిస్తాయి. దగ్గరగా ఉన్నవి మసక మసగ్గా కనిపిస్తాయి. కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్ వంటి వాటితో ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. అయితే, ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే, మెల్లకన్ను వంటి మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆస్టిగ్మాటిజం: ఈ సమస్యతో బాధపడే వారికి ఇటు దగ్గరి వస్తువులను, అటు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేరు. కార్నియా ఒంపు సరిగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది. ఆస్టిగ్మాటిజంతో బాధపడేవారికి రాత్రివేళ వస్తువులను చూడటం మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యను కూడా కళ్లద్దాలతో, కాంటాక్ట్ లెన్స్‌తో సరిచేయవచ్చు. ఆంబ్లోపియా: మన రెండు కళ్ల నుంచి రెండు రెటీనాలపై పడే ప్రతిబింబాలను ఆప్టిక్ నెర్వ్ సాయంతో మెదడు గ్రహిస్తుంది. ఒక కంటిలో ఏదైనా సమస్య తలెత్తి ఆ కంటి నుంచి సరైన ప్రతిబింబం లభించకపోతే, మెదడు ఆ కంటి నుంచి వచ్చే సమాచారాన్ని తిరస్కరిస్తూ, స్పష్టంగా కనిపించే కంటి నుంచి వచ్చే సమాచారాన్నే గ్రహిస్తుంది. ఈ సమస్యనే ‘లేజీ ఐ’ అని కూడా అంటారు. దీంతో రెండు కళ్లనూ సమానంగా ఫోకస్ చేయలేకపోవడం, కనుగుడ్ల అలైన్మెంట్ సరిగా లేకపోవడం వల్ల మెల్లకన్ను వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆంబ్లోపియా సమస్య ఉన్నవారికి ఒక్కోసారి ఒకే వస్తువు రెండుగా కనిపిస్తుంటుంది. వస్తువులను సరిగా చూడలేక వాటిని ఢీకొంటుంటారు. చిన్న వయసులోనే ఈ సమస్య తలెత్తుతుంది. ప్రీస్కూల్ వయసులోనే ఈ సమస్యను గుర్తించి తగిన కళ్లద్దాలను ఉపయోగించడంతో పాటు బలహీనమైన కంటికి వైద్యుల సూచన మేరకు వ్యాయామాలు చేయించడం వల్ల ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. సమస్యను గుర్తించడం ఆలస్యమైతే చికిత్స కష్టమవుతుంది. స్ట్రాబిస్మస్: కనుగుడ్లు రెండూ ఒకే అలైన్మెంట్లో లేకపోవడాన్ని స్ట్రాబిస్మస్ అంటారు. ఒకవేళ రెండు కనుగుడ్లూ లోపలకు చూస్తూ ఉన్నట్లయితే దాన్ని ఈసోట్రోపియా అంటారు. కనుగుడ్లు రెండూ బయటకు చూస్తూ ఉన్నట్లయితే ఆ సమస్యను ఎక్సోట్రోపియా అంటారు. ఒకవేళ పైకి చూస్తుంటే హైపర్ ట్రోపియా అని, కిందకు చూస్తూ ఉన్నట్లయితే హైపోట్రోపియా అని అంటారు. ఏదైనా వస్తువును బాగా దగ్గర నుంచి మాత్రమే పిల్లలు స్పష్టంగా డగలుగుతున్నారంటే... పెద్దలు వెంటనే సమస్యను గుర్తించి, నేత్రవైద్య నిపుణులను సంప్రదించాలి. స్ట్రాబిస్మస్ సమస్య దీర్ఘకాలం కొనసాగితే పిల్లలు ‘త్రీడీ విజన్’... అంటే ఎత్తు పల్లాలను, దూరాలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతారు. సాధారణంగా ఈ సమస్య ఏడాది నుంచి నాలుగేళ్ల లోపు చిన్నారుల్లో బయటపడుతుంది. నేత్రవైద్య నిపుణులను, న్యూరాలజిస్టులను సంప్రదిస్తే, సమస్యకు దారితీసిన కారణాలకు తగిన చికిత్స అందిస్తారు. చిన్నారుల్లో దృష్టి లోపాలను ఎలా గుర్తించాలి? కాస్త ఎదిగిన చిన్నారులైతే కంటి చూపులో తేడా వస్తే తల్లిదండ్రులకు తమ సమస్యను చెప్పుకోగలరు గాని, ఐదారేళ్ల లోపు వయసు ఉన్న చిన్నారులు తమ చూపులో తేడాలను చెప్పుకోలేరు. వారిని నిశితంగా గమనించినట్లయితే, వారి కంటిచూపులో లోపాలను తల్లిదండ్రులు కనిపెట్టి, వైద్యులను సంప్రదించవచ్చు. చిన్నారుల్లో కంటి చూపు లోపాలు ఉన్నట్లయితే, వారిలో తరచుగా కనిపించే లక్షణాలు... మాటిమాటికీ కళ్లు రుద్దుకోవడం ∙కళ్లలోంచి తరచుగా నీరుకారడంఎక్కువగా రెప్పలల్లార్చడం టీవీ, కంప్యూటర్లు చూసేటప్పుడు వాటికి దగ్గరగా తల ముందుకు చాచడం ∙పుస్తకాలు చదివేటప్పుడు కళ్లు చికిలించడం ∙కళ్లు మండటం, ఎర్రబడటం, తలనొప్పిచిన్నారుల్లో ఇలాంటి లక్షణాలను గమనించినట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేత్రవైద్యులను సంప్రదించాలి. వారి సలహా సూచనల మేరకు మందులు, కళ్లద్దాలు వాడాల్సి ఉంటుంది. టీవీలు రాక మునుపు మన దేశంలో ఎక్కువగా నలభయ్యేళ్ల వయసు దాటిన వారే కళ్లద్దాలతో కనిపించేవారు. కళ్లద్దాలతో కనిపించే చిన్నారులు చాలా అరుదుగా ఉండేవారు. టీవీలు వచ్చాక కళ్లద్దాలతో కనిపించే చిన్నారుల సంఖ్య క్రమంగా పెరగడం మొదలైంది. ఇక కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు విరివిగా వాడుకలోకి వచ్చాక చిన్నారుల్లో కంటిచూపు సమస్యలు మరింతగా ఎక్కువయ్యాయి. విపరీతంగా వీడియో గేమ్స్‌కు అలవాటు పడటం, గంటల తరబడి స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఉపయోగించడం వల్ల పిల్లల కంటిచూపు తీవ్రంగా దెబ్బతింటోంది. ఫలితంగా చిన్నవయసులోనే కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి అనివార్యంగా మారుతోంది. చిన్నారుల్లో జన్యు లోపాల వల్ల, పోషకాహార లోపాల వల్ల కంటిచూపు సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే, జన్యు లోపాల కంటే టీవీ, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు వంటి వాటి వాడుక వల్ల చూపు దెబ్బతింటున్న చిన్నారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. చిన్న వయసులోనే దృష్టి లోపాలను ఎదుర్కొనే పిల్లలు చదువు సంధ్యల్లో కూడా వెనుకబడుతున్నట్లు పలు అంతర్జాతీయ అధ్యయనాల్లో వెల్లడైంది. పిల్లల్లో తలెత్తే దృష్టి లోపాలను సాధ్యమైనంత త్వరగా గుర్తించి, వైద్యుల సలహాపై తగిన కళ్లద్దాలు వాడటం, కాంటాక్ట్ లెన్స్ వాడటం లేదా లేజర్ చికిత్స వంటి ఆధునిక చికిత్స పద్ధతుల్లో కంటిచూపు సరిదిద్దడం వంటి చర్యలు చేపట్టినట్లయితే వారు చదువు సంధ్యల్లో వెనుకబడకుండా ఉంటారని బాలల మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కంటిచూపు లోపాలను ఎదుర్కొంటున్న చిన్నారుల్లో దాదాపు పదిశాతం మందికి పైగా చిన్నారులు చదువు సంధ్యల్లో వెనుకబడిపోతున్నారని, ఆటల్లో కూడా వారు రాణించలేకపోతున్నారని ‘మయో క్లినిక్’ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. రిఫ్రాక్టివ్ సమస్యలు మనం ఏ వస్తువునైనా చూసేటప్పుడు దాని పైనుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి వెనుక రెటీనాపై పడేలా కార్నియా, లెన్స్.. ఈ రెండూ రిఫ్రాక్ట్ చేస్తాయి. వాటిలో ఏవైనా తేడాలున్నప్పుడు రిఫ్రాక్టివ్ సమస్యలు వస్తాయి. ప్రీస్కూల్ వయసు పిల్లల్లో 5 శాతం మంది, స్కూలుకు వెళ్లే పిల్లల్లో 20 శాతం మంది రిఫ్రాక్టివ్ సమస్యలతో బాధపడుతున్నారు. రిఫ్రాక్టివ్ సమస్యల్లో మూడు రకాలు ఉన్నాయి. అవి: దగ్గరి దృష్టి (మయోపియా), దూరపు దృష్టి (హైపరోపియా), వక్రదృష్టి (ఆస్టిగ్మాటిజం). మయోపియా: సాధారణంగా 8–12 ఏళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా మయోపియా సమస్య కనిపిస్తుంది. మయోపియాకు గురైన వారు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేరు. దగ్గరగా ఉన్నవాటిని మాత్రమే స్పష్టంగా చూడగలరు. మయోపియా బారిన పడ్డ పిల్లలు తరచుగా తలనొప్పితో బాధపడుతుంటారు. వారిలో కనుగుడ్లు రెండూ ఒకేలా లేకుండా ఉండవచ్చు. ఈ సమస్యను సరైన కళ్లద్దాలతో లేదా కాంటాక్ట్ లెన్స్‌తో సరిదిద్దవచ్చు. హైపరోపియా: ఈ సమస్యకు గురైన వారికి దూరంగా ఉన్న వస్తువులే స్పష్టంగా కనిపిస్తాయి. దగ్గరగా ఉన్నవి మసక మసగ్గా కనిపిస్తాయి. కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్ వంటి వాటితో ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. అయితే, ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే, మెల్లకన్ను వంటి మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆస్టిగ్మాటిజం: ఈ సమస్యతో బాధపడే వారికి ఇటు దగ్గరి వస్తువులను, అటు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేరు. కార్నియా ఒంపు సరిగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది. ఆస్టిగ్మాటిజంతో బాధపడేవారికి రాత్రివేళ వస్తువులను చూడటం మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యను కూడా కళ్లద్దాలతో, కాంటాక్ట్ లెన్స్‌తో సరిచేయవచ్చు. ఆంబ్లోపియా: మన రెండు కళ్ల నుంచి రెండు రెటీనాలపై పడే ప్రతిబింబాలను ఆప్టిక్ నెర్వ్ సాయంతో మెదడు గ్రహిస్తుంది. ఒక కంటిలో ఏదైనా సమస్య తలెత్తి ఆ కంటి నుంచి సరైన ప్రతిబింబం లభించకపోతే, మెదడు ఆ కంటి నుంచి వచ్చే సమాచారాన్ని తిరస్కరిస్తూ, స్పష్టంగా కనిపించే కంటి నుంచి వచ్చే సమాచారాన్నే గ్రహిస్తుంది. ఈ సమస్యనే ‘లేజీ ఐ’ అని కూడా అంటారు. దీంతో రెండు కళ్లనూ సమానంగా ఫోకస్ చేయలేకపోవడం, కనుగుడ్ల అలైన్మెంట్ సరిగా లేకపోవడం వల్ల మెల్లకన్ను వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆంబ్లోపియా సమస్య ఉన్నవారికి ఒక్కోసారి ఒకే వస్తువు రెండుగా కనిపిస్తుంటుంది. వస్తువులను సరిగా చూడలేక వాటిని ఢీకొంటుంటారు. చిన్న వయసులోనే ఈ సమస్య తలెత్తుతుంది. ప్రీస్కూల్ వయసులోనే ఈ సమస్యను గుర్తించి తగిన కళ్లద్దాలను ఉపయోగించడంతో పాటు బలహీనమైన కంటికి వైద్యుల సూచన మేరకు వ్యాయామాలు చేయించడం వల్ల ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. సమస్యను గుర్తించడం ఆలస్యమైతే చికిత్స కష్టమవుతుంది.స్ట్రాబిస్మస్: కనుగుడ్లు రెండూ ఒకే అలైన్మెంట్లో లేకపోవడాన్ని స్ట్రాబిస్మస్ అంటారు. ఒకవేళ రెండు కనుగుడ్లూ లోపలకు చూస్తూ ఉన్నట్లయితే దాన్ని ఈసోట్రోపియా అంటారు. కనుగుడ్లు రెండూ బయటకు చూస్తూ ఉన్నట్లయితే ఆ సమస్యను ఎక్సోట్రోపియా అంటారు. ఒకవేళ పైకి చూస్తుంటే హైపర్ ట్రోపియా అని, కిందకు చూస్తూ ఉన్నట్లయితే హైపోట్రోపియా అని అంటారు. ఏదైనా వస్తువును బాగా దగ్గర నుంచి మాత్రమే పిల్లలు స్పష్టంగా చూడగలుగుతున్నారంటే... పెద్దలు వెంటనే సమస్యను గుర్తించి, నేత్రవైద్య నిపుణులను సంప్రదించాలి. స్ట్రాబిస్మస్ సమస్య దీర్ఘకాలం కొనసాగితే పిల్లలు ‘త్రీడీ విజన్’... అంటే ఎత్తు పల్లాలను, దూరాలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతారు. సాధారణంగా ఈ సమస్య ఏడాది నుంచి నాలుగేళ్ల లోపు చిన్నారుల్లో బయటపడుతుంది. నేత్రవైద్య నిపుణులను, న్యూరాలజిస్టులను సంప్రదిస్తే, సమస్యకు దారితీసిన కారణాలకు తగిన చికిత్స అందిస్తారు. చిన్నారుల్లో మరికొన్ని కంటి సమస్యలు కాటరాక్ట్ సాధారణంగా వయసు మళ్లే వారిలో కనిపించే సమస్యే అయినా, అరుదుగా కొందరు చిన్నారులు కూడా కాటరాక్ట్ బారిన పడుతుంటారు. కొందరు చిన్నారుల్లో గ్లకోమా (కళ్లలో నీటికాసులు) ఏర్పడవచ్చు. ఇవే కాకుండా, కళ్లలోంచి తరచు నీరుకారడం, కనుగుడ్లు రెండూ వేగంగా అటూ ఇటూ కదులుతుండటం వంటి సమస్యలు కనిపించవచ్చు. ఈ సమస్యలను గుర్తించిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేత్ర వైద్య నిపుణులను సంప్రదించాలి. కొన్ని అరుదైన కంటి సమస్యలు సాధారణంగా కనిపించే రిఫ్రాక్టివ్ సమస్యలు, కాటరాక్ట్, గ్లకోమా వంటి కంటి సమస్యలు అందరికీ తెలిసినవే. ఇలాంటి సాధారణ సమస్యలే కాకుండా కొన్ని అరుదైన కంటి సమస్యలు చూపును దెబ్బతీస్తాయి. చాలా సందర్భాల్లో కంటి సమస్యల కారణంగా చూపు క్రమక్రమంగా దెబ్బతింటుంది. అరుదుగా ఒక్కోసారి ఆకస్మికంగా చూపు కోల్పోయే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. కంటి వెనుక ఉండే రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడటం వల్ల ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండానే చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని ‘రెటీనల్ వీన్ అండ్ ఆర్టరీ అక్కల్షన్’ అంటారు. కంటి లోపల జరిగే అంతర్గత రక్తస్రావం వల్ల కూడా ఆకస్మికంగా చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిని ‘విట్రియస్ హెమరేజ్’ అంటారు. తలలోను, మెడలోను ఉండే రక్తనాళాల్లో వాపు ఏర్పడటం వల్ల కూడా చూపు ఆకస్మికంగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. తలలోను, మెడలోను ఉండే రక్తనాళాల్లో వాపు ఏర్పడటం వల్ల కంటిలోని ఆప్టిక్ నెర్వ్‌కు పోషకాలు అందకుండాపోతాయి. ఫలితంగా చూపు దెబ్బతింటుంది. పక్షవాతం, మైగ్రేన్ తలనొప్పి వంటి కారణాల వల్ల కూడా ఒక్కోసారి ఆకస్మికంగా చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. మైగ్రేన్ కారణంగా చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పక్షవాతం కారణంగా మెదడులో రక్తం గడ్డకడితే ఒక్కోసారి తాత్కాలికంగా, ఒక్కోసారి శాశ్వతంగా చూపు కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయి. కంటి నల్లగుడ్డుపై ఉండే పొర మీద, రెటీనా మీద ఇన్ఫెక్షన్లు, వాపులు ఏర్పడినప్పుడు చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిని ‘కోరియో రెటీనైటిస్’ అంటారు. క్షయ, లైమ్ డిసీజ్, సిఫిలిస్ వంటి వ్యాధులతో బాధపడే వారిలోను, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడే వారిలోను ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉంటాయి. డయాబెటిస్ వల్ల, జన్యులోపాల కారణంగా వచ్చే రెటినో పిగ్మెంటోసా, రెటీనల్ డిస్ట్రోఫీ వంటి వ్యాధుల వల్ల, కంటి కండరాల క్షీణత వల్ల, కంటిలోను, మెదడులోను ఏర్పడే ట్యూమర్ల వల్ల కూడా కంటిచూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అంధుల సంఖ్యలో మనదే అగ్రస్థానం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అంధులు భారత్‌లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.9 కోట్ల మంది అంధులు ఉంటే, వారిలో 1.2 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. దేశంలో ఉన్న అంధుల్లో దాదాపు 26 శాతం మంది 15 ఏళ్ల లోపు చిన్నారులే కావడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), వివిధ దేశాల ప్రభుత్వాలు, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలు చేపడుతున్న చర్యల వల్ల అంధత్వ సమస్య, కంటిచూపు సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. కంటిచూపు సమస్యల్లో దాదాపు 80 శాతం సమస్యలను తగిన ముందు జాగ్రత్తలతో నివారించవచ్చు లేదా వైద్య చికిత్సతో నయం చేయవచ్చు. భారత్, బ్రెజిల్, మొరాకో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు గడచిన రెండు దశాబ్దాల్లో కంటిచూపు సమస్యలను నివారించడంలో గణనీయమైన పురోగతిని సాధించాయి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో 2019 నాటికి కంటిచూపు సమస్యలతో బాధపడేవారి సంఖ్యను కనీసం 25 శాతం మేరకు తగ్గించాలని 2013లో సమావేశమైన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం మేరకు 2014–19 కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కార్యాచరణ ప్రణాళిక మేరకు డబ్ల్యూహెచ్ఓ వివిధ దేశాల ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలతో కలసి కంటిచూపు సమస్యల నివారణ దిశగా కృషి కొనసాగిస్తోంది. – ఫన్డే డెస్క్ -
టీవీఎస్ మోటార్స్ లాభం 7 శాతం అప్
న్యూఢిల్లీ: వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ జూన్ త్రైమాసికంలో రూ. 129 కోట్ల నికర లాభం ప్రకటించింది. ప్రీ–జీఎస్టీ వాహన నిల్వలకు సంబంధించి డీలర్లకు అదనపు డిస్కౌంటు కోసం రూ. 16.50 కోట్లు కేటాయించిన అనంతరం ఈ లాభాలు నమోదు చేసినట్లు సంస్థ పేర్కొంది. ఇది క్రితం క్యూ1లో నమోదైన రూ. 121 కోట్లతో పోలిస్తే సుమారు 7 శాతం అధికం. అటు క్యూ1లో ఆదాయం రూ. 3,188 కోట్ల నుంచి రూ. 3,800 కోట్లకు పెరిగింది. ఉత్పత్తుల రేట్లు తగు రీతిలో తగ్గించడం ద్వారా వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించినట్లు సంస్థ తెలిపింది. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడం సేల్: బంపర్ డీల్స్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ సేల్'ను ప్రకటించిన ఐదు రోజుల్లోనే మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా ఇండిపెండెన్స్ డే సేల్‌ను ప్రకటించింది. 'బిగ్ ఫ్రీడం సేల్' పేరుతో ఫ్లిప్‌కార్ట్ దీన్ని నిర్వహిస్తోంది. ఈ సేల్ ఆగస్టు 9న ప్రారంభమై, ఆగస్టు 11తో ముగుస్తోంది. బిగ్ ఫ్రీడం సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, హెడ్ఫోన్లు, కెమెరాలు, యాక్ససరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ బంపర్ డిస్కౌంట్లను అందించనున్నట్టు తెలిపింది. షావోమి ఫ్యాన్స్‌కు కోసం రెడ్మి నోట్ 4 సేల్‌ను 72 గంటల పాటు నిర్వహించనున్నట్టు కూడా పేర్కొంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు అదనంగా తక్షణ డిస్కౌంట్లను అందించనున్నట్టు చెప్పింది. మొబైల్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్స్... బిగ్ ఫ్రీడం సేల్ కోసం ముందస్తుగానే ఫ్లిప్‌కార్ట్ తన వెబ్సైట్లో పలు డిస్కౌంట్లను ఆవిష్కరించింది. రూ.16,999గా ఉన్న మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కి అందించనున్నట్టు తెలిపింది. అదేవిధంగా రూ.15,999గా ఉన్న మోటో ఎం స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,999కే విక్రయించనున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 12,499 రూపాయలుగా గల లెనోవో కే5 నోట్‌ను 9,999 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్ విక్రయించనుంది. కే6 పవర్ స్మార్ట్‌ఫోన్‌పై 1000 రూపాయల డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. దీంతో 9999 రూపాయలుగా ఉన్న కే 6 పవర్ స్మార్ట్‌ఫోన్ రూ.8999కే లభ్యం కానుంది. గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ ధర 67వేల రూపాయల నుంచి 48,999 రూపాయలకు తగ్గించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అదేవిధంగా ఐఫోన్ 6, 32జీబీ మోడల్ ధరను కూడా తగ్గించినట్టు చెప్పింది. రెడ్మి నోట్ 4ను మూడు రోజుల పాటు 1000 రూపాయల తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ విక్రయించనుంది. కేవలం మొబైల్ ఫోన్లపైనే కాక ల్యాప్‌టాప్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై బంపర్ డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. స్మార్ట్‌వాచ్‌లపై ఫ్లాట్‌పై 50 శాతం తగ్గింపును ఇవ్వనుంది. ఈ సేల్‌లో కనీసం 71 శాతం వరకు డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్‌లను ఆఫర్ చేస్తోంది. కాగ, అమెజాన్ కూడా ఆగస్టు 9వ తేదీ అర్థరాత్రి నుంచే గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహిస్తోంది. ఈ దిగ్గజం ఆగస్టు 12 వరకు ఈ సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా 100 మిలియన్ ప్రొడక్ట్‌లను అందుబాటులో ఉంచుతుంది. ఎక్స్‌క్లూజివ్‌గా ప్రైమ్ ఓన్లీ డీల్స్‌ను అమెజాన్ అందిస్తోంది. -
స్టంట్ షో
-
టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్ వాహన రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో తాజాగా టీవీఎస్ మోటార్ కంపెనీ, రాయల్ ఎన్ఫీల్డ్ తమ వాహనాల రేట్లు తగ్గించాయి. రాయల్ ఎన్ఫీల్డ్ తమ మోడల్స్ రేట్ల తగ్గుదల రూ. 1,600– రూ. 2,300 మధ్య (చెన్నై ఆన్ రోడ్) ఉంటుందని పేర్కొంది. మరోవైపు, « ఎంత మేర తగ్గిస్తున్నది టీవీఎస్ మోటార్స్ వెల్లడించలేదు. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందజేస్తామని సంస్థ ప్రెసిడెంట్ కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చాకా చాలా మటుకు మోటార్‌సైకిల్స్‌పై పన్నుల భారం ప్రస్తుతమున్న 30% నుంచి 28 శాతానికి తగ్గనుంది. ఇప్పటికే బజాజ్ ఆటో తమ వాహనాల రేట్లను రూ. 4,500 దాకా తగ్గించింది. -
రండి బాబూ.. రండి!
⇔ ప్రీ జీఎస్టీ క్లియరెన్స్ సేల్.. ⇔ జీఎస్టీ అమలుపై గ్రేటర్ వ్యాపారుల్లో గందరగోళం ⇔ మిగిలి ఉన్న స్టాకుపై పన్ను వేస్తారని ఆందోళన ⇔ ప్రీ జీఎస్టీ క్లియరెన్స్ సేల్ పేరిట తగ్గింపుతో అమ్మకాలు ⇔ ఆందోళన వద్దంటున్న వాణిజ్య పన్నుల శాఖ ⇔ జీఎస్టీతో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల ధరలు పెరిగే చాన్స్ సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను(జీఎస్టీ).. కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలులోకి తీసుకురానున్న దేశమంతా ఒకే పన్ను విధానం.. జీఎస్టీతో కొన్ని వస్తువులు, సేవల ధరలు తగ్గుతాయని, మరికొన్ని పెరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో గ్రేటర్‌లోని వ్యాపారుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే తమ వద్ద మిగిలి ఉన్న ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు తదితరాల స్టాకుపై జీఎస్టీ అధికంగా విధిస్తారన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. గతంలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు, కూలర్లు, వాషింగ్ మెషిన్లు, ఓవెన్స్, వాచీలు, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలకు సంబంధించి ఇప్పటికే వ్యాపారుల వద్ద చాలా స్టాకు మిగిలింది. జీఎస్టీ అమలులోకి వస్తే పన్ను అధికంగా వేస్తారన్న భయంతో కొందరు వ్యాపారులు ఆయా వస్తువుల ధరలపై ఐదు నుంచి పది శాతం తగ్గింపుతో విక్రయించేస్తున్నారు. దీంతో వినియోగదారులు కూడా ధరలు పెరుగుతాయనే భయంతో ఇప్పుడే వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వ్యాపార వర్గాల్లో జీఎస్టీపై ఆందోళన అవసరం లేదని, పెద్ద మొత్తంలో స్టాకు కొనుగోలు చేసి విక్రయించకుండా తమ వద్ద ఉన్నవారు గతంలో అధిక పన్నులు చెల్లించిన పక్షంలో జీఎస్టీలో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, జీఎస్టీ అమలుతో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల ధరలు సుమారు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. దిగిరానున్న నిత్యావసరాల ధరలు.. గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది. ఇందులో 70 శాతానికిపైగా అల్పాదాయ, మధ్యాదాయ వర్గాల వారే. ప్రతినెలా వీరంతా ఇంటి అవస రాలకు బియ్యం, గోధుమలు, పాలు, పప్పులు వంటి ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తారు. వీటిపై జీఎస్టీ తగ్గించడంతో ఆయా ధాన్యాలపై కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు ధర తగ్గే అవకాశాలున్నాయి. వంటనూ నెలపైనా పన్ను తగ్గడంతో లీటర్ నూనెపై ఇదే స్థాయిలో ధర తగ్గుముఖం పడతాయి. తలనూనె, సబ్బులు, టూత్‌పేస్టులపైనా పన్ను 24 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో వీటి ధరలు రూ.5 నుంచి రూ.8 వరకూ తగ్గే అవకాశాలున్నాయి. దీంతో వేతనజీవులు, నిరు పేదల నెల బడ్జెట్ తగ్గుతుంది. వేతనజీవులు నెలవారీగా నిత్యా వసరా లకు రూ.5 వేలు ఖర్చు చేస్తుంటే.. జూలై నుంచి వారికి నెలకు రూ.500–1,000 వరకు మిగులు ఉండే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. విలాస వస్తువులపైనే అధికం.. జీఎస్టీ విలాస వస్తువు లపైనే అధికంగా ఉంది. నిత్యావసరాలపై తక్కువగా ఉంది. ఈ పన్ను పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటగానే ఉంది. న్యాయంగా వ్యాపారం చేసేవారికి జీఎస్ టీ బాగానే ఉంటుంది. దొంగ వ్యాపారులకే ఇబ్బందికరం. – జి.గోపాల్, వ్యాపారి 5 శాతానికి పరిమితం చేయాలి నాన్ ఏసీ హోటల్స్‌కు12%, ఏసీ హోటల్స్‌కు 18% జీఎస్టీ విధించడంతో భోజన ప్రియులు హోటళ్లకు దూరమయ్యే పరిస్థితి ఉంది. జీఎస్టీ వల్ల హోటళ్ల గిరాకీపై తీవ్ర ప్రభావం పడ నుంది. హోటళ్లపై జీఎస్టీని 5 శాతానికే పరిమితం చేయాలి. – కిషన్‌యాదవ్, నందిని గ్రూప్ ఆఫ్ హోటల్స్ మిగిలిన స్టాకుపై పన్ను వద్దు రెడీమేడ్ దుస్తులపై 23 శాతం జీఎస్టీ వి«ధించడం సబబుగాలేదు.గతంలో వీటిపై పన్ను చాలా తక్కువగా ఉండే ది. ప్రస్తుతం మా వద్ద ఉన్న స్టాక్ పై పన్ను విధించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని తెలిసింది. దీనిని తక్షణం ఉపసంహరించు కోవాలి. – ప్రసాద్, వ్యాపారి, బడీచౌడీ -
ఫ్లిప్ కార్ట్: 1 బిలియన్ డాలర్ల టార్గెట్
కోల్ కత్తా : ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భారీ టార్గెట్ నిర్దేశించుకుంది. టెలివిజన్, వైట్ గూడ్స్ ఉత్పత్తుల విక్రయాల్లో 2018 మార్చి వరకు 1 బిలియన్ డాలర్ల టార్గెట్ ను అంటే 6700 కోట్ల అమ్మకాలను చేధించాలని ఫ్లిప్ కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే మూడింతలు ఎక్కువ వృద్ధి. ''టెలివిజన్, అప్లియన్స్ ఫ్లిప్ కార్ట్ లో చాలా త్వరగా వృద్ధి చెందుతున్న కేటగిరీ. ఈ ఏడాది బిగ్ బిలియన్ డే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం ఇండస్ట్రీ విక్రయాలు 60వేల కోట్లలో 10 శాతానికి పైగా అంటే 6700 కోట్ల విక్రయ టార్గెట్ ను మేము నిర్దేశించుకున్నాం. దేశంలో ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతున్న వాటిలో రెండో అతిపెద్ద విక్రయదారిమి మేమే'' అని ఫ్లిప్ కార్ట్ అతిపెద్ద ఉపకరణాల అధినేత సందీప్ కర్వా తెలిపారు. కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, వైట్ హౌజ్ వేర్ హౌజింగ్ ను విస్తరిస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతమున్న ఆన్ లైన్ టెలివిజన్ 8 శాతం విక్రయాలను 18 శాతానికి పెంచుకోవాలని కూడా ఫ్లిప్ కార్ట్ భావిస్తోంది. ఎయిర్ కండీషన్లను 8-9 శాతం, వాషింగ్ మిషన్లను, రిఫ్రిజిరేటర్లను 6-7 శాతం పెంచుకోనున్నట్టు తెలిపింది. వచ్చే వేసవి వరకు సొంత లేబల్ పై ఫ్లిప్ కార్ట్ ఎయిర్-కండీషనర్లను కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. కొన్ని చిన్న ఉపకరణలపై ప్రైవేట్ లేబల్ ను ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లాంచ్ చేసింది. స్మార్ట్ బై బ్రాండు కింద మిక్స్డ్ గ్రైండర్, జ్యూసర్స్, ఇండక్షన్ కుక్ టాప్స్, శాండ్విచ్ కేటగిరీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గడివేముల: గడివేముల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. తలముడిపికి చెందిన సయ్యద్ మహమ్మద్ హుసేన్(65) ఆదివారం తెల్లవారుజామున 5గంటల సమయంలో స్వగ్రామం నుంచి గోంగూర అమ్మేందుకు టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై వెళ్తుండగా గడివేముల రైలుమిల్లు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని పెద్దకుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. మృతునికి భార్య, మగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పంచనామ నిర్వహించి శవపరీక్షకై నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సేఫ్టీ ఫీచర్స్‌తో కొత్త టీవీఎస్ స్కూటర్..ధర ఎంత?
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు టీవీఎస్ కొత్త స్కూటర్‌ను మంగళవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. పాపులర్ 110 సీసీ స్కూటర్ ఉత్పత్తి సంస్థ అయిన టీసీఎస్ జూపిటర్ కొత్త అప్డేటెడ్ వెర్షన్ ను లాంచ్ చేసింది. జూపిటర్ వేరియంట్లో బీఎస్(భారత్ స్టాండర్డ్స్)-4 ప్రమాణాలతో కొత్త వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బీఎస్-4 జూపిటర్ మోడల్ ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ. 49,666 గా కంపెనీ నిర్ణయించింది. అలాగే ఇప్పటికే అందుబాటులో ఉన్న రంగులతోపాటు అదనంగా జేడ్ గ్రీన్.. మిస్టిక్ గోల్డ్ కలర్స్‌లో ఈ టూ వీలర్ అందుబాటులో ఉండనుంది. ఇతర 110 సిసి సిబ్లింగ్స్తోపాటు ఈ రీమోడల్ చేసిన ఈ స్కూటర్ కొత్త సేఫ్టీ పద్ధతుల్లోలాంచ్ అయింది. ముఖ్యంగా హెడ్‌లైట్ ఆటోమేటిక్‌గా ఆన్‌లోనే ఉండనుంది. అలాగే సింక్రొనైజ్జ్ బ్రేకింగ్ సిస్టంను అమర్చింది. గతంలో జెడ్ఎక్స్ రేంజ్‌లోనే ఈ బ్రేకింగ్ సిస్టం (డిస్క్ బ్రేక్) అందుబాటులో ఉండగా.. ఇప్పుడు బేస్ వేరియంట్లో కూడా అమర్చడం విశేషం. కాగా టీవీఎస్ బిఎస్-4 కంప్లైంట్ ఇంజీన్ తో లాంచ్ చేసిన స్కూటర్లలో వెగో తరువాత జూపిటర్ రెండవది. అయితే బిఎస్-4 కంప్లైంట్ ఇంజన్ తో డిస్క్ బ్రేక్ తో టాప్ ఆఫ్ ది లైన్ జెట్ ఎక్స్ వేరియంట్ రూ. 53.666 (అన్ని ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరలో ఎలాంటి మార్పుఉండదని టీవీఎస్ ప్రకటించింది. -
నోట్ల రద్దు దెబ్బతో ఆ విక్రయాలన్నీ ఢమాల్
-
నోట్ల రద్దు దెబ్బతో ఆ విక్రయాలన్నీ ఢమాల్
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు దెబ్బకు దాదాపు విక్రయాలన్నీ డౌన్ అయ్యాయి. ఈ నోట్ల రద్దుతో పాటు, నగదు విత్‌డ్రాలో పరిమితులు విధించడం వినియోగదారుల తయారీ వస్తువులకు భారీగా గండికొట్టనుందని తెలుస్తోంది. వచ్చే ఆరునెలల వరకు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల విక్రయాలు గడ్డుపరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వైట్ గూడ్స్‌గా పేరున్న టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల అమ్మకాలు 70 శాతం క్షీణించనున్నాయని, మార్కెట్లో ఈ గూడ్స్ ఎక్కువగా నగదు అమ్మకాలే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. '' వచ్చే ఆరు నెలల వరకు ఈ క్షీణతను కంపెనీలు భరించాల్సి ఉంటుంది. ప్రజానీకానికి అవసరమైన మేరకు కొత్త కరెన్సీలు చలామణిలోకి వచ్చే వరకు ఈ పరిస్థితి ఎదురవుతుంది'' అని పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. మంగళవారం రాత్రి 500, 1000 నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయంతో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్, సినిమా హాల్స్ వెలవెలపోయాయని, దీంతో ఫుడ్ అవుట్ లెట్స్ బిజినెస్‌లు 40 శాతం పతనమయ్యాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రియాజ్ అమ్లానీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బుధవారం విక్రయాలన్నీ పడిపోయినట్టు వీడియోకాన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీఎం సింగ్ తెలిపారు. నెలవారీ వాయిదాల ప్రకారం ప్రీమియం అప్లియన్స్, టెలివిజన్ కొనుగోళ్లు పట్టణ ప్రాంతాల్లో 60 శాతం వరకు జరుగుతాయని, మిగతా 40 శాతం కొనుగోళ్లు నగదు చెల్లింపులతోనే జరుగుతున్నాయని రియాజ్ తెలిపారు. దీంతో నగదు చెల్లింపులతో చేసే కొనుగోళ్లన్నీ భారీగా దెబ్బతిన్ననున్నాయని వివరించారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్తగా 500, 2000 నోట్లను ప్రజల్లోకి తీసుకొస్తున్నా.. వాటిపై పరిమితులు విధించడం వ్యాపారాలకు ప్రతికూలతేనని చెప్పారు. అయితే మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సంచలన నిర్ణయం సెల్‌ఫోన్ విక్రయాలకు బాగా కలిసివచ్చిందట. ఈ రద్దును కొంతమంది వినియోగదారులు వారికి అవకాశంగా మరలుచుకుని, వెంటనే సెల్‌ఫోన్ రిటైల్ షాపులకు పరుగెత్తారు. దీంతో సెల్‌ఫోన్ రిటైలర్లు బిజెనెస్‌లు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ వంటి స్మార్ట్ఫోన్లను వినియోగదారులు భారీగా డిమండ్ పెరిగినట్టు తెలుస్తోంది. కొంతమంది కస్టమర్లు ఒక్కొక్కరూ ఐదు నుంచి ఆరు హ్యాండ్సెట్లు కొనుగోలు కూడా చేశారని ఓ లీడింగ్ సెల్‌ఫోన్ రిటైలర్ సీఈవో తెలిపారు. -
శ్రీసిటీ సమీపంలో టీవీఎస్ నైపుణ్య శిక్షణాకేంద్రం
శ్రీసిటీ(వరదయ్యుపాళెం): శ్రీసిటీ పరి శ్రమల అవసరాలకు అనుగుణంగా టీవీఎస్ వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం పని చేస్తుందని ఆ సంస్థ ప్రత్యేక డెరైక్టర్ వి.రఘు పేర్కొన్నారు. శ్రీసిటీ సమీపంలోని తడ ఐటిఐ కళాశాల ఆవరణలో టీవీఎస్ శిక్షణ-సేవా కేంద్రం ఏర్పాటు చేయునున్నట్లు తెలి పారు. ఈసందర్భంగా గురువారం శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీవీఎస్ సంస్థ ప్రత్యేక డెరైక్టర్ వి.రఘు వూట్లాడుతూ ప్రాధమికంగా కొన్ని ఐటిఐ శిక్షణా కోర్సులతో మొదలు పెట్టి అంచెలంచెలుగా కేంద్రాన్ని విస్తరింపజేయునున్నట్లు వివరించారు. టీవీఎస్ గ్రూప్ వూర్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ శ్రీనివాసరాఘవన్ వూట్లాడుతూ తవు సంస్థ గత 20ఏళ్ళుగా ఈ తరహా సేవలు అందిస్తున్నదన్నారు.శ్రీసిటీ సెజ్గ్రావూలలో నిరుద్యోగ యుువతకయ్యే నైపుణ్య శిక్షణ ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి తెలిపారు. -
టీవీ రంగంలో స్మార్ట్ ఫోన్ కంపెనీల దూకుడు..!
కోల్ కత్తా : ఇప్పటివరకూ ధరల పోటీ కేవలం స్మార్ట్ ఫోన్లకే అనుకున్నాం.. కానీ టెలివిజన్ రంగంలోనూ ఈ పోటీ తెరలేవబోతోంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తమదైన శైలిలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో, చైనా లీ ఎకోలు భారత టెలివిజన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయట. చౌకైన ధరలకే ఈ టీవీలను మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే టీవీ మార్కెట్లో టాప్ బ్రాండ్లగా ఉన్న శామ్ సంగ్, ఎల్ జీ, సోనీలకు పోటీగా.. వారికి సీరియస్ చాలెంజ్ లా ఈ దీపావళి కంటే ముందే మార్కెట్లోకి రావాలని రిలయన్స్ జియో, లీఎకో ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. లైఫ్ బ్రాండ్ కింద వివిధ స్క్రీన్ సైజుల్లో స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను రిలయన్స్ జియో త్వరలోనే ఆవిష్కరించబోతుందట. ప్రస్తుతం ఆ కంపెనీ 4జీ-ఎల్ టీఈ స్మార్ట్ ఫోన్లను కలిగిఉంది. మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లో ఇవి అందుబాటులో ఉండనున్నాయని తెలుస్తోంది. మూడు స్క్రీన్ సైజులు 43 అంగుళాలు, 50 అంగుళాలు, 65 అంగుళాలను టీవీ సెట్లకు రిలయెన్స్ మార్గనిర్దేశనం చేస్తుందట. హై డెఫినేషన్ 4కే స్క్రీన్లతో టీవీలను ప్రవేశపెట్టడంతో, జియో అప్ కమింగ్ 4జీ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులను కూడా జోడించనుంది. 4జీ సర్వీసులతో టీవీలను వినియోగదారుల ముందుకు తీసుకురావడం అత్యంత ముఖ్యమైన మార్గమని... మార్కెట్లో అగ్రస్థానంలో నిలవడానికి చౌకైన ధరలను ఆఫర్ చేస్తామని కంపెనీకి చెందిన ఓ ప్రతినిధి పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో దూసుకుపోతున్న మరో బ్రాండ్ లీఎకో.. చౌకైన ధరల్లో వచ్చే నెల టీవీ మార్కెట్లోకి రాబోతుందట. ఎలాంటి లాభాలను ఆశించకుండా.. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో అనుసరించిన వ్యూహంతోనే టీవీలనూ ప్రవేశపెడుతుందని సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్స్ తెలిపారు. మన్నిక, ప్రత్యేకతలు దగ్గర అసలు రాజీ పడకుండా టీవీ సెట్లను ప్రవేశపెడతామని చైనీస్ కంపెనీ తెలుపుతోంది. -
ఏ బైక్ కొందాం?
ఏ బైక్ కొందాం? బైక్ కొనాలనుకున్న ప్రతి ఒక్కరి మనసులోనూ మొదట మెదిలే ప్రశ్న ఇదే. కొందరైతే తమ స్నేహితుల్ని అడుగుతారు. ఇంకొందరైతే బంధువుల్ని అడుగుతారు. మరికొందరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తారు. సమీక్షలు చదువుతారు... వివిధ బైక్‌ల ప్రకటనలు చూస్తారు. కాకపోతే విచిత్రమేంటంటే ఎంత ఎక్కువ చూస్తే అంత ఎక్కువగా అయోమయంలో పడతారు. ఎందుకంటే అన్ని బైక్‌లూ బాగానే ఉంటాయి. ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. మరేం చెయ్యాలి? బైక్ కొనేటపుడు చూడాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. ధర... మైలేజీ... ఫీచర్స్... లుక్. వీటిలో కూడా ఎవరి అవసరాలు వారివి. బడ్జెట్లో కొనాలనుకున్న వారు ధర చూస్తారు. ఎక్కువ తిరిగేవారు మైలేజీ చూస్తారు. కాస్త స్టైల్ కోరుకునే కుర్రకారు లుక్, ఫీచర్లు చూస్తారు. ఇక్కడ ఎవరి చాయిస్ వారిదే. అందుకే ఇపుడు దేశంలో అత్యధిక మైలేజీతో జనాదరణ పొందిన బైక్‌లపై ఈ ప్రత్యేక కథనం... ♦ మైలేజీయే ప్రధానాస్త్రంగా మార్కెట్లోకి కొత్త బైక్‌లు ♦ హీరో, బజాజ్, టీవీఎస్... అన్ని కంపెనీలదీ ఇదే రూటు ♦ స్ల్పెండర్ ఐస్మార్ట్ నుంచి ప్యాషన్ ప్రొ వరకూ అన్నీ దీన్లో కింగ్లే ♦ తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ బైక్‌లతో బజాజ్ పోటీ ♦ డిజైన్, ధరతో కూడా ఆకట్టుకుంటున్న టీవీఎస్ ♦ మైలేజీ, ధర, ఫీచర్లు, లుక్‌లో దేనికదే సాటి... హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 102.5 కిలోమీటర్లు/లీటర్ ధర - 52,008 దేశంలో అత్యధిక మైలేజ్‌ను ఇచ్చే బైక్ ఇది. లీటరుకు 102.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్న ఈ బైక్... దేశీ టూవీలర్ మార్కెట్ దిగ్గజం ‘హీరో మోటోకార్ప్’ ఉత్పాదన. కంపెనీ ఈ బైక్‌లో వినూత్న ఐ3ఎస్ టెక్నాలజీని ఉపయోగించింది. అంతేకాదు!! క్లచ్ పట్టుకుంటే చాలు. బైక్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ బటన్, కిక్రాడ్తో పని లేదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సిటీ ప్రాంతాలకిది అనువుగా ఉంటుంది. ఎయిర్‌కూల్డ్ 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్ వాడటం వల్ల ఈ మైలేజీ ఇస్తోంది. గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. ట్యాంక్‌లో 8.7 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. బజాజ్ సీటీ 100 ఇంజిన్ - 99.27 సీసీ మైలేజ్ - 99.1 కిలోమీటర్లు/లీటర్ ధర - 39,389 తక్కువ ధరలోనే దేశీ దిగ్గజ టూవీలర్ కంపెనీ ‘బజాజ్ ఆటో’ అందిస్తున్న మైలేజ్ బైక్ ఇది. ఐస్మార్ట్ రాక ముందువరకూ దేశంలో అత్యధిక మైలేజీ బైక్ ట్యాగ్ దీనిదే. ఇపుడు మైలేజీలో రెండో స్థానానికి చేరింది. ఇందులో 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్‌కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ బైక్... ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్ 8.2 పీఎస్-7,500 ఆర్పీఎం. టార్క్ 8.05 ఎన్ఎం-4,500 ఆర్పీఎం. బజాజ్ ప్లాటినా ఈఎస్ ఇంజిన్ - 102 సీసీ మైలేజ్ - 96.9 కిలోమీటర్లు/లీటర్ ధర - 46,230 బజాజ్ ఆటో బైక్‌ల శ్రేణిలో మైలేజీలో రెండో స్థానంలో ఉన్న బైక్ ఇది. లీటరుకు 96.9 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇచ్చే ఈ బైక్‌లో అడ్వాన్స్డ్ సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ డీటీఎస్ -ఐ ఇంజిన్‌ను అమర్చారు. గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ప్లాటినా ఫ్యూయెల్ ట్యాంక్‌లో 11 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్ 8.2 పీఎస్-7,500 ఆర్పీఎం. టార్క్ 8.6 ఎన్ఎం-5,000 ఆర్పీఎం. టీవీఎస్ స్పోర్ట్ ఇంజిన్ - 99.77 సీసీ మైలేజ్ - 95 కిలోమీటర్లు/లీటర్ ధర - 44,140 ‘టీవీఎస్ మోటార్’ కంపెనీ అందిస్తున్న బైకుల్లో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్ ఇదే. లీటరుకు 95 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కంపెనీ ఈ బైక్‌లో 4 స్ట్రోక్ డ్యూరాలైఫ్ ఇంజిన్‌ను పొందుపరిచింది. ఇంజిన్ పవర్ 7.8 పీఎస్-7,500 ఆర్పీఎం. టార్క్ 7.8 ఎన్ఎం-5,500 ఆర్పీఎం. ఆకట్టుకునే డిజైన్ ఈ బైక్ సొంతం. స్పోర్ట్ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 12 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో స్ల్పెండర్ ప్రొ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 93.21 కిలోమీటర్లు/లీటర్ ధర - 50,500 హీరో మోటొకార్ప్ తయారీ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది దగ్గర ఈ బైక్‌ను మనం గమనిస్తూనే ఉంటాం. అధిక సంఖ్యాక ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న బైక్... బహుశా ఇదే అనొచ్చేమో. లీటరుకు 93.21 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 11 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఎకో ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్ ధర - 48,336 హీరో మోటోకార్ప్ ఉత్పాదన ఇది. లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను వాడారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో స్ల్పెండర్ ప్రొ క్లాసిక్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 93.21 కిలోమీటర్లు/లీటర్ ధర - 51,300 హీరో మోటోకార్ప్ అందిస్తోన్న మరో మైలేజీ బైక్ స్ల్పెండర్ ప్రొ క్లాసిక్. ఇది లీటరుకు 93.21 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 11లీటర్ల పెట్రోల్ పడుతుంది. ప్రత్యేకమైన డిజైన్ ఈ బైక్ సొంతం. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్ ధర - 46,318 హీరో మోటొకార్ప్ ఉత్పాదన ఇది. లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్యూ-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో ప్యాషన్ ప్రొ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 87.37 కిలోమీటర్లు/లీటర్ ధర - 52,400 హీరో మోటొకార్ప్ నుంచి వచ్చిన మరో బైక్ ఇది. లీటరుకు 87.37 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 12.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో హెచ్ఎఫ్ డాన్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్ ధర - 40,070 ఇది కూడా దేశీ దిగ్గజం హీరో మోటొకార్ప్ ఉత్పాదనే. ఇది లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. గమనిక పైన పేర్కొన్న మైలేజీలు... సెంట్రల్ మోటార్ వె హికల్ రూల్స్(సీఎంవీఆర్)ను అనుసరించి ప్రత్యేక పరీక్షల్లో నిర్ధారించినవి. రోడ్డుపై వాస్తవంగా వచ్చే మైలేజీకి కొంత తేడా ఉంటుంది. ఈ తేడా మామూలు ట్రాఫిక్‌లో 20% వరకూ తక్కువ ఉండే అవకాశము ఉంటుంది.అమ్మకాల్లో టాప్-10 స్కూటర్లు... నిజానికి దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో బైక్‌ల వాటాయే ఎక్కువ. కాకపోతే ఐదేళ్లుగా స్కూటర్ల వాటా మెల్లగా పెరుగుతూ వస్తోంది. 2015-16లో స్కూటర్ల విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారిగా 50 లక్షల యూనిట్ల మార్కును దాటి 50,31,675 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటిలో 24.66 లక్షల యూనిట్ల విక్రయాలతో హోండా యాక్టివా టాప్‌లో నిలిచింది. ఇక టీవీఎస్ జూపిటర్ అనూహ్యంగా హీరో మాస్ట్రోను ఓవర్ టేక్ చేసి 5.37 లక్షల యూనిట్లతో రెండో స్థానానికి చేరింది. మాస్ట్రో 4.98 లక్షల యూనిట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో హోండా డియో, హీరో ప్లెజర్, సుజుకి యాక్సెస్, యమహా ఫాసినో, హీరో డ్యూయట్, హోండా ఏవియేటర్, యమహా రే టాప్-10 జాబితాలో చోటు సంపాదించాయి. 2015 మే నెలలో ఆవిష్కరించిన ఫాసినో నాలుగు నెలల్లోనే 1 లక్ష యూనిట్ల మార్కును దాటి.. యమహాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. భారత్‌లో కార్ల మార్కెట్ అంతకంతకూ పుంజుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని కార్ల కంపెనీలూ కొత్తకొత్త మోడల్స్‌ను విడుదల చేసేందుకు పోటీపడుతున్నాయి. మరి ఇన్నిరకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారతీయ కస్టమర్లు కారు కొనే ముందు మైలేజీ, డిజైన్, కంపెనీ బ్రాండ్ ఇలా దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ కార్లు.. వాటి ప్రత్యేకతలు ఏంటి? అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కార్ల ప్రియులను కట్టిపడేస్తున్న లగ్జరీ కార్ల విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? వచ్చే వారం ప్రాఫిట్ ప్లస్‌లో ఇవన్నీ మీ కోసం ప్రత్యేకం. సో.. గెట్ సెట్.. వెయిట్! -
ఐవైఆర్ సార్.. ఆదుకోండి..!
ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్‌తో ముఖాముఖి నేడు వేదిక.. ఫ్యాన్సీగూడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ హాలు ఒంగోలు కల్చరల్: ఆర్థికంగా చితికిపోయి ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాలు పొందేందుకు అలమటిస్తున్న బ్రాహ్మణ సామాజిక వర్గం.. రాష్ట్ర మాజీ సీఎస్, రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై కోటి ఆశలు పెట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా పేరుపోరుున తమ సమస్యల పరిష్కారానికి, అభ్యున్నతికి సానుకూల చర్యలు తీసుకుంటారని బ్రాహ్మణ సంఘాల నిర్వాహకులు ఆశాభావంతో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక రంగారాయుడు చెరువువద్దగల ఫ్యాన్సీగూడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో బ్రాహ్మణ సంఘాల నిర్వాహకులతో, విద్యార్థులు, యువతతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ సమావేశానికి ఐవైఆర్ ముఖ్యఅతిథిగా హాజరై బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరిస్తారు. ఆయనతోపాటు క్రెడిట్ సొసైటీ సీఈవో అభిజిత్కూడా పాల్గొంటారు. ఆహ్వాన కమిటీ సభ్యులు, ఏపీ బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఆలూరు జైశంకర్ తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. తొలిసారి చైర్మన్ హోదాలో ఒంగోలుకు విచ్చేస్తున్న ఐవైఆర్‌కు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. చాణక్య స్కీంకు గురువారంతో దరఖాస్తు గడువు ముగిసిందని అరుుతే మరో వారంపాటు పొడిగించాలని పలువురు ఐవైఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల ఆధ్వర్యంలో అమలుజరుగుతున్న పలు పథకాల గురించి పుస్తకాల రూపంలో, టీవీలు, పత్రికలద్వారా మరింత విస్తృత ప్రచారం చేపట్టాలనికూడా కోరుతున్నారు. జిల్లాలోని బ్రాహ్మణ సంఘాల వారు, యువత , విద్యార్థులు తప్పనిసరిగా ముఖాముఖి కార్యక్రమానికి హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. -
ఇక టీవీల్లో ఎవరికి నచ్చే యాడ్స్ వారికి మాత్రమే!
లండన్: మొన్నటి తరానికి బ్లాక్ అండ్ వైట్ టీవీలు, వాటిలో చూసిన ఒకటి, రెండు ఛానెళ్లే గుర్తు. నిన్నటి తరానికి కలర్ టీవీలు, వాటిలో చూసిన 30, 40 ఛానళ్లు గుర్తు. మరి అదే నేటి తరానికి వస్తే వందల ఛానళ్లే కాదు, యూట్యూబ్, నెట్ఫిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ, బీటీ విజన్, స్కై....ఇలా ఎన్నో చూస్తున్నారు. తరాల సంగతి పక్కనపెట్టి ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయబద్ధంగా టీవీల్లో కొన్ని నచ్చిన ఛానళ్ల వీక్షణకు పరిమితమవుతున్న వారి సంఖ్య సరాసరిగా యాభై శాతానికి మించిలేదు. ఇలాంటి పోటీ ప్రపంచంలో టీవీ ఛానళ్లు తమ మనుగడను కొనసాగించాలంటే వాణిజ్య ప్రకటనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకరావాల్సిందే. ప్రస్తుతం భారత్ సహా పలు దేశాల్లో టీఆర్పీ రేటింగ్‌ల ప్రకారం వాణిజ్య ప్రకటనలు ఛానళ్లలో ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు ‘సెట్ టాప్’ బాక్సుల పుణ్యమా అని రేటింగ్స్‌లో కచ్చితత్వం రావడమే కాకుండా ఛానళ్లలో వచ్చే మనకిష్టమైన కార్యక్రమాన్ని ముందుగానే రికార్డు చేసుకొని కోరుకున్నప్పుడు చూసుకునే అవకాశం వచ్చింది. కానీ చూస్తున్న కార్యక్రమం మధ్యలో వచ్చే యాడ్స్ చీకాకు కలిగిస్తున్నాయి. ఛానళ్లు మనుగడ సాగించాలి కనుక యాడ్స్ ఎలాగు తప్పవు. అదే మనకు నచ్చే యాడ్స్ మాత్రమే వస్తే బాగుంటుంది కదా! మన ఇంట్లో పిల్లీ లేదు, కుక్కా లేదనుకోండీ! మరి పిల్లి, కుక్కల ఫుడ్‌కు సంబంధించిన యాడ్ మనకెందుకు? మన అభిరుచులకు తగ్గ దుస్తుల డిజైన్స్ గురించో, నగల గురించో యాడ్స్ ఇస్తే బాగుంటుందికదా! లోకోభిన్నరుచులు ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న సహజంగా వస్తుంది. నిజంగా అభిరుచులకు తగ్గ యాడ్స్‌ను వీక్షించే అవకాశం త్వరలోనే సాకారం కాబోతోన్నది. అప్పుడు మన ఇంట్లో వచ్చే యాడ్ పక్కింట్లో రాదు, అలాగే పక్కింట్లో వచ్చే యాడ్ మనకు రాదు. ఇప్పటికే దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దానికి ‘డైనమిక్ యాడ్ ఇన్సర్షన్’ అని పేరు కూడా పెట్టారు. మన పేరు, వయస్సు, అభిరుచులు తెలుసుకోవడానికి సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి కూడా. మనం ఏ టీవీ ఛానళ్లు చూస్తున్నామో, వాటిలో ఏ కార్యక్రమాన్ని ఎంతసేపు చూస్తున్నామో సెట్‌టాప్ బాక్సులు ఇప్పటికే రికార్డు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ డేటా నేరుగా యాడ్ ఏజెన్సీలకు వెళుతుంది. వారు వారి పద్ధతిలో వీక్షకుల అభిరుచులను అంచనా వేస్తారు. ఇదో పద్ధతి. ప్రజల వయస్సు తదితర వివరాలతోపాటు అభిరుచులను నేరుగా తెలుసుకునేందుకు ఆన్లైన్ ప్లేయర్లు, సర్వీసులు ఉన్నాయి. దీనికోసమే ఆన్లైన్ ‘ఐటీవీ’ ప్లేయర్ గత నవంబర్ నెలలో ‘ఐటీవీ హబ్’గా మారింది. ఇప్పుడు ఈ హబ్ వద్ద కోటీ పాతిక లక్షల మంది రిజిస్టర్ చేసుకున్న యూజర్లు ఉన్నారు. ఇదే మాదిరిగా లండన్‌కు చెందిన ఛానెల్ 4 తన ‘40 డీ’ ఫ్లాట్ ఫామ్‌ను ‘ఆల్ 4’గా మార్చుకుంది. దీని ద్వారా అది యూజర్ల అభిరుచులను సేకరిస్తోంది. ఇలా సేకరించిన సమస్త సమాచారాన్ని యాడ్ ఏజెన్సీలు పంచుకుంటాయి. వాటిని విశ్లేషించి వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా యాడ్స్‌ను రూపొందిస్తాయి. వివిధ రకాల యాడ్స్‌ను వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రసారం చేయడానికి ‘డైనమిక్ యాడ్ ఇన్సర్షన్’ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. ప్రజల అభిరుచులకు తగిన విధంగా ఒక్క ‘డోవ్’ సబ్బు యాడ్‌ను 25 రకాలుగా తీయగలమని యూనిలివర్ యాడ్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల ఇక్కడ జరిగిన ప్రపంచ సదస్సులో వెల్లడించారు. ఈ సదస్సులో ప్రపంచ నలుమూలల నుంచి యాడ్ ఏజెన్సీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. వారిలో ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్ ప్రతినిధులు కూడా ఉన్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో పరికరాలు దగ్ధం
మెదక్ రూరల్ :దొంగ కరెంట్ వాడుతున్న క్ర మంలో గ్రామంలో షార్ట్ సర్క్యూట్ సంభవించి సుమారు 40 ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికీలాల్లో తగలబడి పోయాయి. ఈ సంఘటన మండలంలోని గంగాపూర్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రా మంలోని 3, 4వ వార్డుల్లో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ఘటనలో ఇళ్లలోని బల్పులు, టీవీలు, కుక్కర్లతో పాటు ప్లగ్గులో పెట్టి ఉంచిన సెల్‌ఫోన్ చార్జర్లు కాలిపోయాయి. దొడ్లె కిరణ్ ఇంట్లో టీవీ కి మంటలు అంటుకుని పెద్దగా మం టలు లేచి ఇంట్లో నిలువ ఉంచిన ధాన్యం బస్తాలు, తలుపులకు మంటలు అంటుకుని ఇతర వస్తువులు కాలిపోయాయి. దీంతో ఆయా ఇళ్లను వదిలిన బాధితులు బయటకు పరుగులు పెట్టారు. అయితే.. ఈ రెండు వార్డులకు విద్యుత్ సరఫరా చేస్తున్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ కావడంతో భారీ నష్టం తగ్గింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు రూ. లక్ష మేర నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో లైన్‌మన్ యూసుఫ్ గ్రామానికి చేరుకుని కాలిన వైర్లను సరి చేశాడు. అయితే మీ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని లైన్‌మన్‌ను నిలదీశాడు. అక్రమంగా విద్యుత్‌ను వాడే వారిపై చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని, ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. -
టూవీలర్ల అమ్మకాలు ఓకే
న్యూఢిల్లీ: టూవీలర్ల అమ్మకాలు డిసెంబర్ నెలలో ఫర్వాలేదనిపించాయి. యమహా, హోండా మోటార్ సైకిల్, టీవీఎస్ మోటార్ కంపెనీల అమ్మకాలు పెరిగాయి. హీరో మోటోకార్ప్ అమ్మకాలు తగ్గాయి. అయితే గత ఏడాది మొత్తం మీద ఈ కంపెనీ రికార్డ్‌స్థాయి అమ్మకాలు (61,83,784) సాధించింది. ఇక లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్, హోండా కార్ల కంపెనీల విక్రయాలు పెరగ్గా, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, ఎస్కార్ట్స్ అమ్మకాలు తగ్గాయి. గత ఏడాది మొత్తం 61,83,784 టూవీలర్లను విక్రయించామని హీరో మోటో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ దువా పేర్కొన్నారు. 2012 అమ్మకాల(61,20,259)తో పోల్చితే 1% వృద్ధి సాధించామని వివరించారు. ఈ ఏడాది మరిన్ని కొత్త బైక్‌లను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. హోండా మోటార్ సైకిల్ కంపెనీ బైక్‌ల అమ్మకాలు 18%, స్కూటర్ల అమ్మకాలు 54% చొప్పున పెరిగాయి. దేశీయ అమ్మకాలు 58%, ఎగుమతులు 13% చొప్పున వృద్ధి సాధించాయని యమహా పేర్కొంది. మొత్తంమీద గతేడాది అమ్మకాలు 34% పెరిగాయని తెలిపింది. టీవీఎస్ మోటార్ స్కూటర్ల అమ్మకాలు 36%, త్రీ వీలర్ల అమ్మకాలు 37%, ఎగుమతులు 27% చొప్పున పెరిగాయి. -
పురుషుల కోసం టివిఎస్ జూపిటర్