రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Sun, Mar 26 2017 11:44 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
గడివేముల: గడివేముల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. తలముడిపికి చెందిన సయ్యద్ మహమ్మద్ హుసేన్(65) ఆదివారం తెల్లవారుజామున 5గంటల సమయంలో స్వగ్రామం నుంచి గోంగూర అమ్మేందుకు టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై వెళ్తుండగా గడివేముల రైలుమిల్లు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని పెద్దకుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. మృతునికి భార్య, మగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పంచనామ నిర్వహించి శవపరీక్షకై నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement