rice mill
-
అధికార మదం.. ఆర్యవైశ్యులపై ప్రతాపం డబ్బులివ్వలేదని మూసేశారు
తిరుపతి రూరల్: టీడీపీ కూటమి నేతల దృష్టి ఆర్యవైశ్యుల వ్యాపారాలపై పడింది. కష్టనష్టాలకోర్చి వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయాని్నవ్వడమే కాకుండా, పది మందికి ఉపాధి చూపిస్తున్న ఆర్యవైశ్యులను టీడీపీ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే అధికారులతో వ్యాపారాలను సీజ్ చేయిస్తున్నారు. వ్యాపారులతో పాటు వందలాది కార్మికుల జీవితాలను రోడ్డు పాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లావ్యాప్తంగా పలువురు వ్యాపారులను బెదిరించి, డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.తాజాగా చంద్రగిరి నియోజకవర్గం కుంట్రపాకంలో ఆర్యవైశ్యుల సంఘం నాయకుడు కిషోర్‌కు చెందిన ఎల్.వి.ఎం రైస్ మిల్లును మూసివేయించారు. గత 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ మిల్లులో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి ఎంతో మంది రైతులు ధాన్యాన్ని ఈ మిల్లులో బియ్యం చేసుకుని వెళుతుంటారు. ఇటు కార్మికులకు, అటు అన్నదాతలకు బాసటగా నిలిచిన ఈ రైస్ మిల్లుపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కన్ను పడింది.తన బంధువులు, తిరుపతి రూరల్ మండలానికి చెందిన టీడీపీ నేతలు అమిలినేని మధు, చెరుకూరి మధు, శ్రీధర్ నాయుడును రైస్ మిల్లు యజమాని కిషోర్ వద్దకు పంపినట్లు సమాచారం. వారు ముగ్గురూ కిషోర్ దగ్గరకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అంత ఇవ్వలేనని, కొంత ఇస్తానని చెప్పినప్పటికీ వారు అంగీకరించలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే అధికారులను రంగంలోకి దించి, అన్ని రకాల అనుమతులతో నడుస్తున్న రైస్ మిల్లుకు బుధవారం అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిపివేయించి, సీజ్ చేయించినట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.దీంతో రైసు మిల్లు మూతపడింది. 200 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మిల్లు యజమాని కిషోర్ రెండుసార్లు ఎమ్మెల్యే పులివర్తి నాని వద్దకు వెళ్లి వేడుకోగా, ఆయన తీవ్రంగా దుర్భాషలాడినట్లు తెలిసింది. తాను లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడినని, తన మాట వినకుంటే జిల్లాలో ఎక్కడా నిన్ను వ్యాపారం చేయనీయను అంటూ కిషోర్‌ను భయపెట్టినట్లు సమాచారం. దీంతో కిషోర్ కంట నీరు పెట్టుకొని బయటకు వచ్చినట్లు వ్యాపారవర్గాలు తెలిపాయి.వ్యాపారుల ఆగ్రహంవ్యాపారుల్లో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఆర్యవైశ్యుల సంక్షేమ సంఘం నాయకుడు, చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్, తిరుపతి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన కిషోర్‌నే వేధించి, ఆయన మిల్లును మూసివేయించడంపై వ్యాపారవర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకొనేందుకు వ్యాపారులంతా సంఘటితమవుతున్నారు.తమ నేత కిషోర్‌కు న్యాయం జరిగేంత వరకు బాసటగా నిలుస్తామని చెబుతున్నారు. వ్యాపార సంస్థలను మూసివేయిస్తే ఎంత మంది జీవితాలు రోడ్డున పడతాయన్నది ఆలోచించని ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన బంధువుల తీరును ప్రజలకు వివరించడంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకై వారు నిర్ణయించినట్లు సమాచారం.అధికారుల అత్యుత్సాహంఅధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన బంధువుల ఒత్తిడితో ఎల్.వి.ఎం రైస్ మిల్లును మూసివేయించడంలో అధికారులు అత్యుత్సాహం చూపించారు. సాధారణంగా ఏ వ్యాపార సంస్థనైనా సీజ్ చేయాల్సి వస్తే ముందుగా నోటీసు ఇచ్చి, మూడు నెలలు సమయం ఇవ్వాలి. నోటీసుకు యజమాని నుంచి వచ్చే సమాధానంతో పాటు మరికొన్ని నియమాలు పాటించాలి. ఈ నిబంధనలేమీ పాటించకుండానే విద్యుత్తు సరఫరా నిలిపివేసి, మిల్లును సీజ్ చేసేశారు. అందులో పనిచేసే కార్మికుల జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపించాలి్సన కనీస బాధ్యతను కూడా విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. -
30 లక్షలు విలువచేసే సైకిళ్ళు పంపిణీకి సిద్ధం చేసిన టీడీపీ అభ్యర్థి
-
ధాన్యం దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లుల్లో ఏడాది కాలంగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఆ ధాన్యాన్ని తక్కువ ధరకు పొందడం ద్వారా సర్కారు ఖజానాకు రూ. వందల కోట్ల నష్టం కలిగించేలా వ్యాపారులు, మిల్లర్లు చక్రం తిప్పుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ కనుసన్నల్లో సిండికేట్ అయి తమ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని 12 లాట్లుగా విభజించి బిడ్లు ఆహ్వానించగా క్వింటాల్ ధాన్యం సగటున రూ. 1,950కన్నా తక్కువ మొత్తానికి దక్కించుకునేలా 27 బిడ్లు మాత్రమే దాఖలు కావడం వ్యాపారుల కుమ్మక్కును స్పష్టం చేస్తోంది. కాగా, ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం బిడ్డర్లకు ధాన్యాన్ని అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న పౌరసరఫరాల సంస్థకు దాదాపు రూ. 1,500 కోట్లకుపైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ప్రక్రియకు పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులతోపాటు ఇతర ఉన్నతాధికారులు సహకారాన్ని అందించారనే ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. యాసంగిలో 66.84 ఎల్ఎంటీల సేకరణ రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ చేయించి ఎఫ్‌సీఐకి అప్పగించడం... ఎఫ్‌సీఐ నుంచి ధాన్యం సొమ్మును రీయింబర్స్ చేసుకోవడం అనే ప్రక్రియ గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ అప్పులు చేయడం... ఎఫ్‌సీఐ నుంచి డబ్బు తీసుకొని ఆ అప్పులు తిరిగి చెల్లించడం ఈ ప్రక్రియలో భాగమే. ఈ క్రమంలోనే 2022–23 రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి సుమారు 7 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 66.84 ఎల్ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధర కింద రూ. 13,760 కోట్లకుపైగా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేసింది. సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించింది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా..లెక్క చూపకుండా.. యాసంగి సీజన్లో క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 67 కిలోల ముడి బియ్యం (రా రైస్) ఎఫ్‌సీఐకి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి నిర్ణీత లెక్క ప్రకారం 67 కిలోల బియ్యం రావని, అందువల్ల బాయిల్డ్ రైస్‌గా అయితేనే మిల్లింగ్ చేస్తామని మిల్లర్లు తేల్చిచెప్పారు. యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటు మేరకు సుమారు 12 ఎల్ఎంటీల వరకు బాయిల్డ్ రైస్‌గా ఎఫ్‌సీఐకి ఇచ్చారు. మిగతా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు లెక్కలు చూపారు. అయితే నిల్వ ఉన్న ధాన్యంలో మేలు రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద ఇవ్వకుండా ఎక్కడికక్కడ బియ్యాన్ని మిల్లర్లు విక్రయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. సర్కార్ లెక్కల ప్రకారం ప్రస్తుతం మిల్లుల్లో కనీసం 50 ఎల్ఎంటీల ధాన్యమైనా నిల్వ ఉండాలి. కానీ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో టాస్‌్కఫోర్స్, విజిలెన్స్ జరిపిన తనిఖీల్లో ఈ మొత్తంలో ధాన్యం కాగితాల మీదే తప్ప భౌతికంగా లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తప్పిన వేలం మిల్లర్లు నిల్వ ఉంచిన ధాన్యాన్ని వేలం వేయాలని గత ఆగస్టులోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ మేరకు 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచగా 54 బిడ్లు దాఖలయ్యాయి. అప్పట్లో క్వింటాల్‌కు కనిష్టంగా రూ. 1,618, గరిష్టంగా రూ. 1,732, సగటున రూ. 1,670 ధర పలికింది. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ క్వింటాల్‌కు రూ. 2,060 కాగా రవాణా ఖర్చులు, నిల్వ వల్ల రుణాలపై పెరిగిన వడ్డీ కలిపి క్వింటాల్ ధాన్యానికి రూ. 2,300 వరకు అవుతుందని అప్పటి పౌరసరఫరాల కమిషనర్ అంచనా వేశారు. వేలంలో వచ్చే ధరతో పోల్చుకుంటే నష్టం వస్తుందనే కారణంతో ఆ టెండర్లను రద్దు చేశారు. నిబంధనలు మార్చి మరోసారి అక్టోబర్‌లో టెండర్లను ఆహ్వానించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ టెండర్లను నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించి మరోసారి ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జనవరి 25న ఐదుగురు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచి ఇటీవల ఫైనాన్షియల్ బిడ్లను తెరిచారు. బిడ్ల కనిష్ట ధర రూ. 1,920గా ఉన్నట్లు తెలిసింది. చక్రం తిప్పిన మాజీ సహకార సంస్థ చైర్మన్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినప్పటికీ వేలంలో రాష్ట్రంలో పలుకుబడిగల మిల్లర్లు, కొందరు వ్యాపారులే పాల్గొన్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ వేలం ప్రక్రియలో చక్రం తిప్పినట్టుగా పౌరసరఫరాల శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పలుకుబడి గల ఆయన కొత్త ప్రభుత్వంలోనూ తనదైన రీతిలో సిండికేట్ నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. క్వింటాల్ ధాన్యం రూ. 2 వేలలోపే ఉండేలా బిడ్డర్లతో రింగ్ అయినట్లు సమాచారం. వాస్తవానికి మిల్లుల్లో ఎంత యాసంగి ధాన్యం ఉందో కూడా సరిగ్గా తెలియదు. ఈ పరిస్థితుల్లోనే గత ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యం వేలం వేసేందుకు ప్రయత్నించింది. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 35 ఎల్ఎంటీలు విక్రయించేందుకు సిద్ధమైంది. విజిలెన్స్, టాస్‌్కఫోర్స్ తనిఖీల నేపథ్యంలో వీలైనంత తక్కువ ధరకు ధాన్యాన్ని దక్కించుకొని ప్రభుత్వానికి ఆ మేరకు డబ్బు చెల్లించడం ద్వారా గండం గట్కెక్కాలనే ధోరణిలో మిల్లర్లు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్ ధాన్యం రూ. 2,300 వరకు పలికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకుంటే..వేలం ప్రక్రియలో ముందుకెళ్లడం వల్ల సర్కారు ఖజానాకు రూ. 1,500 కోట్లకుపైగానే నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా టెండర్లపై ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. -
నేటితో ధాన్యం వేలం బిడ్ల దాఖలుకు గడువు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న 2022–23 రబీ సీజన్‌కు సంబంధించిన 35 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ)ల ధాన్యం వేలం బిడ్ల దాఖలుకు గడువు శుక్రవారంతో ముగియనుంది. గత రబీలో సేకరించిన ధాన్యాన్ని రా రైస్‌గా మిల్లింగ్ చేయడానికి మిల్లర్లు ఆసక్తి చూపని విషయం తెలిసిందే. రబీలో సేకరించిన 66.84 ఎల్ఎంటీల ధాన్యం నుంచి బాయిల్డ్ రైస్‌కు సంబంధించి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఇచ్చిన టార్గెట్ ప్రకారం సుమారు 20 ఎల్ఎంటీల ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్ చేసి కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) కింద ఎఫ్సీఐకు అప్పగించాలని నిర్ణయించారు. మిగతా ధాన్యాన్ని ముడి బియ్యంగా ఇవ్వాల్సి ఉండటంతో వారు ససేమిరా అన్నారు. దీంతో గత ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యం కోసం బిడ్లు ఆహ్వానించినప్పటికీ, ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియ రద్దయింది. దీంతో గత నెలలో గ్లోబల్ టెండర్ నోటీస్ జారీ చేశారు. ఈ మేరకు వేలంలో పాల్గొనే బిడ్డర్లతో ఇటీవల సమావేశం జరగగా, వేలం నిబంధనల్లో కొన్ని సవరణలను సూచించారు. ఈ మేరకు నిబంధనలను మారుస్తూ బిడ్లు దాఖలు చేసేందుకు గడువును శుక్రవారం వరకు పొడిగించారు. -
ధాన్యమేదీ.. వేలం ఎట్లా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా మార్చడం కోసం మిల్లులకు పంపిన లక్షల టన్నుల ధాన్యం మాయమైంది. రైస్‌మిల్లుల నిర్వాహకులు చాలా వరకు ధాన్యాన్ని ఎప్పుడో మర ఆడించి, బియ్యాన్ని అమ్మేసుకున్నా.. సర్కారుకు మాత్రం తమవద్దే ఉన్నట్టు లెక్కలు చూపుతూ వస్తున్నారు. దీనితో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని భావించిన సర్కారు.. గ్లోబల్ టెండర్లను ఆహ్వానించి విక్రయించాలని నిర్ణయించింది. ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా మరో నలుగురు సభ్యులతో కమిటీని కూడా నియమించింది. మిల్లుల్లో యాసంగి ధాన్యం ఎంత నిల్వ ఉందో తేల్చేందుకు అధికారులు తనిఖీలు చేపట్టగా.. మిల్లర్ల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మిల్లుల్లో గత యాసంగి ధాన్యాన్ని చడీచప్పుడు కాకుండా అమ్ముకున్నారని తేలడంతో.. నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్ని మిల్లుల్లో ఎంత యాసంగి ధాన్యం నిల్వ ఉందో లెక్క తేల్చే పనిలో పడ్డారు. రాష్ట్ర సర్కారుపై భారం 2022–23లో రాష్ట్ర సర్కారు సేకరించిన 66.84 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని మిల్లులకు పంపింది. మిల్లులు దాన్ని మర ఆడించి 45.07 ఎల్ఎంటీ బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా ఎఫ్‌సీఐకి పంపాలి. అయితే యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువగా వస్తాయని, సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యం తగ్గుతుందని మిల్లర్లు కొర్రీపెట్టారు. కేంద్రం సుమారు 16 ఎంఎల్టీ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్)గా మిల్లింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వడంతో.. ఆ మేరకు మర ఆడించి, 10.27 ఎల్ఎంటీ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇదిపోగా సుమారు 50లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లోనే ఉండాలి. దాన్ని మిల్లింగ్ చేసి 35 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. మిల్లులు బియ్యాన్ని అప్పగించని కారణంగా ఎఫ్‌సీఐ నుంచి నిధులు రాక.. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.18వేల కోట్ల భారం పడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆగిపోయి.. దీన్ని రికవరీ చేసుకునేందుకు మిల్లుల్లోని ధాన్యాన్ని విక్రయించాలని నిర్ణయించిన గత ప్రభుత్వం.. ఆగస్టులో 25 ఎల్ఎంటీ ధాన్యం విక్రయానికి గ్లోబల్ టెండర్లు పిలిచింది. ఆ టెండర్లలో 10 సంస్థలు అర్హత పొందినా.. క్వింటాల్ ధాన్యాన్ని సగటున రూ.1,865 ధరకే కొంటామంటూ బిడ్లు దాఖలు చేశాయి. ధర తక్కువకావడంతో ప్రభుత్వం ఆ టెండర్లను రద్దుచేసి.. పలు నిబంధనలను సడలిస్తూ అక్టోబర్ 7న మళ్లీ టెండర్లను ఆహ్వానించింది. ఎక్కువమంది బిడ్ వేసేందుకు వీలుగా.. ధాన్యం లాట్ల పరిమాణాన్ని, టర్నోవర్ అర్హతను తగ్గించింది. కొంత మంది కలసి జాయింట్ వెంచర్‌గా బిడ్డింగ్ దాఖలు చేసే అవకాశమూ ఇచ్చింది. దీనితో పెద్ద ఎత్తున టెండర్లు దాఖలయ్యాయి. మిల్లర్లు కూడా సిండికేట్ అయి ఎవరి మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని వారే కొనుగోలు చేసుకునేలా గ్రూప్ టెండర్లు వేశారు. కానీ అప్పటికి ఎన్నికల షెడ్యూల్ రావడంతో.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం టెండర్ల ప్రక్రియను నిలిపేసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత టెండర్ల ప్రక్రియను రద్దు చేసి.. కొత్తగా గ్లోబల్ టెండర్ల కోసం కమిటీని ఏర్పాటు చేసింది. మిల్లుల్లో ఉన్నట్టు లెక్క చూపించిన ధాన్యానికే ధరకట్టాలనుకున్న మిల్లర్ల ప్లాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు మిల్లుల్లో ధాన్యం నిల్వలపై ప్రభుత్వం తనిఖీలు చేపట్టడంతో.. అసలు సంగతి బయటపడింది. తనిఖీలు.. క్రిమినల్ కేసులు.. అధికారిక లెక్కప్రకారం 2022–23 యాసంగి ధాన్యమే 50లక్షల మెట్రిక్ టన్నుల మేర మిల్లుల్లో నిల్వ ఉండాలి. దానికి ముందు ఖరీఫ్ (వానాకాలం)కు సంబంధించిన ధాన్యం 8 లక్షల టన్నులు.. ఇటీవల సేకరించిన 2023–24 వానాకాలం ధాన్యం 45 లక్షల టన్నులు కూడా ఉండాలి. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలోని 3,300 రైస్‌మిల్లుల్లో కలిపి కోటి టన్నులకుపైగా ధాన్యం నిల్వలు ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన అధికారులకు ఎక్కడా తగినస్థాయిలో ధాన్యం కనిపించడం లేదు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్ డీఎస్ చౌహాన్‌ల ఆదేశాల మేరకు.. అదనపు కలెక్టర్ల నేతృత్వంలోని డీఎస్ఓలు, డీఎంల బృందాలు మిల్లుల్లో 2022–23 ఖరీఫ్, రబీ ధాన్యం లెక్కలను పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నాయి. ► ఇటీవల పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మిల్లర్లు ఏకంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికే ‘సీఎంఆర్’బియ్యాన్ని విక్రయించినట్టు తేలింది. దీనిపై కేసులు నమోదు చేస్తున్నారు. ► కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరులోని ఓ రైస్‌మిల్లుకు 38 టన్నుల ధాన్యం కేటాయించగా.. 23,504 క్వింటాళ్లు మాయమైనట్టు గుర్తించారు. రూ.7.18 కోట్లు జరిమానా చెల్లించాలని నోటీసులిచ్చి, మిల్లు నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ► మెదక్ జిల్లాలోని హవేలీ ఘన్‌పూర్‌లోని ఓ మిల్లులో రూ.4.75 కోట్ల విలువైన 1,422 టన్నుల ధాన్యం మాయమైనట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. ఇక్కడి డూర్గుపల్లిలోని ఓ మిల్లులో రూ.2 కోట్ల విలువైన బియ్యం మాయమైంది. ► సూర్యాపేట జిల్లాలో ధాన్యాన్ని పక్కదారి పట్టించిన 12 మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ► జోగులాంబ గద్వాల జిల్లాలోని 3 రైస్‌మిల్లులపై క్రిమినల్ కేసులు పెట్టారు. వనపర్తిలోని 5 మిల్లుల్లో స్టాక్‌లో భారీ తేడాలు ఉన్నట్టు గుర్తించారు. ► సిద్దిపేట జిల్లాలో 20 మిల్లులు వడ్లను అమ్మేసుకున్నట్టు తేల్చారు. ► నిజామాబాద్ జిల్లాలో 8 మిల్లుల్లోని స్టాక్‌లో రూ.33 కోట్ల మేర తేడాలు ఉన్నట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. అత్యధికంగా గంగారైస్ మిల్ నుంచి రూ.8.09 కోట్లు, రాయల్ ట్రేడింగ్ కంపెనీ రూ.6.48 కోట్లు, ఎంఎస్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ రూ.5.05 కోట్ల బకాయిలు ఉన్నట్టు గుర్తించారు. రెండు మిల్లుల్లోనే రూ.100 కోట్ల ధాన్యం తేడా! కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో భారీగా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పక్కదారి పట్టింది. ప్రభుత్వం సీఎంఆర్ కోసం కోదాడ మండలం కాపుగల్లులోని శ్రీ ఉషస్విని రైస్ ఇండస్ట్రీస్‌కు రూ.32 కోట్ల విలువైన ధాన్యం పంపగా.. మిల్లర్ ఒక్క బియ్యం గింజ కూడా తిరిగి పంపలేదు. అధికారులు ఈ మిల్లులో ఒక్క బస్తా ధాన్యం కూడా లేకపోవడాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఇక కోదాడ పట్టణంలోని ఓ రైస్‌మిల్లుకు వానాకాలం, యాసంగికి సంబంధించి మొత్తం 38,660 టన్నుల ధాన్యం పంపగా.. 26,036 టన్నుల బియ్యం రావాలి. కానీ మిల్లు యజమాని ఇప్పటివరకు 5,564 టన్నుల బియ్యమే తిరిగిచ్చారు. ఇంకా రూ.70 కోట్ల విలువైన 20,472 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. -
ధాన్యం టెండర్లకు ఈసీ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం రెండో దఫా పిలిచిన టెండర్లకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. గతేడాది యాసంగికి సంబంధించిన సుమారు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో మూలుగుతోంది. ఈ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. దీంతోపాటు గత వానాకాలం ధాన్యం కూడా మిల్లుల్లో సీఎంఆర్ కింద మిల్లింగ్ జరు గుతోంది. మరోవారంలో కొత్త పంట మళ్లీ మార్కె ట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మిల్లుల్లోని ధాన్యా న్ని వదిలించుకునేందుకు ప్రభుత్వం తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించాలని నిర్ణయించింది. ఆగస్టులో పిలిచిన టెండర్లకు తక్కువ మొత్తంతో బిడ్లు రావడంతో వాటిని రద్దు చేసిన సర్కార్ ఈనెల 7న నిబంధనలు సడలిస్తూ రెండోసారి బిడ్లను ఆహ్వానించింది. ఈనెల 17తో గడువు ముగిసినప్పటికీ 21వ తేదీ వరకు గడువు పెంచారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్పుడు, టెండర్ల ప్రక్రియ ఎలా జరుపుతారని కాంగ్రెస్ సీనియర్ నేత జి.నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు టెండర్లను పిలవొద్దని ఆదేశించింది. -
పౌరసరఫరాల సంస్థలో విభేదాలు.. ‘సార్’ X ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థలో ఆధిపత్య పోరు నడుస్తోంది. సంస్థలో కీలక హోదా ల్లో ఉన్న ఉన్నతాధికారులకు, సంస్థ బాధ్యతలు చూసేందుకు నియమితులైన ‘సార్’కు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. తాను ప్రతిపాదించి న పనులేవీ సంస్థలో జరగడం లేదని, ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నారని ‘సార్’ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోమంటే ఎలా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రైస్‌మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్, సీ ఎంఆర్ అప్పగింత మొదలు మిల్లులు, ఎంఎల్ఎస్ పాయింట్లపై విజిలెన్స్ దాడులు, రేషన్ దుకాణా లకు బియ్యం సరఫరాలో అవకత వకల వరకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం మొద లు అధికారుల బదిలీల వరకు పలు అంశాలపై విభేదా లు సంస్థ సిబ్బందిలో హాట్‌టాపిక్‌గా మారాయి. మిల్లుల్లో తనిఖీలు .. విజిలెన్స్ దాడులు రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో రైస్‌మిల్లుల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయి, సీఎంఆర్ నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం లేదు. దీంతో కొన్ని నెలల క్రితం మిల్లర్ల అక్రమాలను నిగ్గు తేల్చే పేరుతో ప్రభుత్వ ప్రతినిధిగా ‘సార్’ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో స్థానిక విజిలెన్స్, జిల్లా అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. అయితే ఏ మిల్లులో ఎంత లోటు ఉంది, ఏ మేరకు అక్రమాలకు పాల్పడ్డాయనే అంశాలను మీడియాకు వెల్లడించేందుకు తాను చేసిన ప్రయత్నాలను ఉన్నత స్థాయిలో అధికారులు అడ్డుకున్నారని ఆయ న ఆరోపిస్తున్నారు. అయితే ఎండీకి గానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ సమాచారం ఇవ్వకుండా ‘రహస్య ఎజెండా’తో ‘సార్’ తనిఖీలు చేశారని సంస్థ అధికారులు కౌంటర్ ఇస్తున్నారు. తనిఖీల పేరుతో దందాలు సాగుతున్నాయనే అనుమానాలే దీనికి కారణమని కొందరు చెబుతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో రేషన్ బియ్యం పంపిణీ జరిగే ఎంఎల్ఎస్ పాయింట్లకు విజిలెన్స్ సిబ్బందిని పంపిస్తూ దాడుల పేరుతో భయపెడుతున్నారని, తనను ప్రసన్నం చేసుకున్న వారిని వదిలేసి, లేదంటే బెదిరిస్తున్నారనే ఆరోప ణలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సీఆర్ఓ భవనానికి బ్రేక్ సికింద్రాబాద్‌లోని చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్ఓ) భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించాల ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సార్’ భావించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మిల్లర్ల ‘సహకారం’తో రూ.2 కోట్లతో నిర్మించాలని ఆయన ప్రయత్నించారు. ఈ మేరకు సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న డీఈఈని ప్రతిపాదనలు అడిగితే, ఆయన కేవలం రూ.70 లక్షల అంచనాతో ప్రతిపాదనలు ఇచ్చారు. తర్వాత సదరు డీఈఈ డిప్యుటేషన్ రద్దు చేసుకొని వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కరీంనగర్లో పనిచేసిన ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను డీఈఈగా తెచ్చేందుకు ‘సార్’ చేసిన ప్రయత్నం విఫలమైంది. దీన్ని కూడా ప్రభుత్వ పెద్దల ద్వారా ఉన్నతాధికారులు అడ్డుకున్నారనే వాదన విన్పిస్తుండగా, మిల్లర్ల ‘సహకారం’తో భవన నిర్మాణం చేపట్టడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. 11 మంది సిబ్బంది ఆరుకు కుదింపు కీలక పదవిలో చేరిన తర్వాత ‘సార్’ తన పేషీలో 11 మంది సిబ్బందిని నియమించుకున్నారు. అయి తే సంస్థ ఎండీ.. వారి సంఖ్యను ఏకంగా ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ మేరకు ఆదేశాలు వచ్చినా సిబ్బందిని తగ్గించే నిర్ణయం అమలుకాకపోవడంపై సంస్థలో చర్చ జరుగుతోంది. ఔట్సోర్సింగ్ నియామకాలకు నో రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేనివిధంగా పౌరసరఫరాల సంస్థలో 800 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ‘సార్’ చేసిన సిఫారసులను అధికారులు ఆమోదించడం లేదని సమాచారం. ప్రధాన కార్యాలయంలో ఉండే లీగల్ అడ్వయిజర్ తరహాలో జిల్లాకో లీగల్ అడ్వయిజర్‌ను పెట్టాలని ప్రతిపాదించినప్పటికీ ఉన్నతాధికారి అంగీకరించలేదని తెలుస్తోంది. మూడు జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ముగ్గురికి అవకాశం ఇవ్వగా, మరి కొందరి కోసం చేస్తున్న ప్రయత్నాలకు కూడా అడ్డు పడుతున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనిచేస్తున్న డీఎంలు, ఇతర ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా తన ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని ‘సార్’ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వసూళ్ల ఆరోపణలు ఇదే సమయంలో ‘సార్’పై పలు ఆరోపణలు సంస్థలో విన్పిస్తుండటం గమనార్హం. త్వరలో డిప్యుటేషన్ పూర్తయ్యే డీజీఎం–అడ్మిన్, డీజీఎం – ఫైనాన్స్ పోస్టుల నియామకం కోసం బేరసారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్ కింద పంపించి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిని మళ్లీ అదే పోస్టులో నియమించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఈ విషయంలో నలుగురు రైస్ మిల్లర్లు బేరం కుదిర్చారనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. -
27 మిల్లులు రూ.2వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిల్లింగ్ సమస్యను పరిష్కరించేందుకు సర్కారీ రైస్ మిల్లుల నిర్మాణం ఈ సంవత్సరంలోనే ప్రారంభం కానుంది. సోమవారం సీఎం కేసీఆర్ పౌరసరఫరాల శాఖకు సంబంధించి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే ఏడాదికల్లా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారానే జిల్లాకో మిల్లును ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లో ప్రతి జిల్లాకూ ఒకటి చొప్పున 27 మిల్లును ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం సుమా రు రూ. 2వేల కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గంటకు 60 నుంచి 120 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మరాడించే కెపాసిటీతో ఈ మిల్లులను ఏర్పాటు కానున్నాయి. ప్రైవేటు మిల్లులపై భారాన్ని తగ్గించడంతో పాటు మిల్లర్లపై బాధ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా... రాష్ట్రంలో ధాన్యం దిగుబడి అనూహ్యంగా పెరిగింది. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 3 కోట్ల టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మిల్లింగ్ ప్రధాన సమస్యగా మారింది. రైతుల నుంచి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, బియ్యం(సీఎంఆర్)గా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించాలి. ఎఫ్‌సీఐ సెంట్రల్ పూల్ కింద బియ్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తుంది. ఈ క్రమంలో ఎక్కడ ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావలసిన డబ్బులు ఆగిపోతాయి. గత మూడేళ్లుగా ప్రతి ఏటా సకాలంలో మిల్లింగ్ ప్రక్రియ పూర్తికాక కేంద్రం నుంచి సహకారం అందక రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. గత యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇప్పటికి కూడా మిల్లర్లు మర పట్టించి ఇవ్వలేని పరిస్థితి. రాష్ట్రంలో 1,773 మిల్లులు... రాష్ట్రంలో ప్రస్తుతం 1,773 మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్ జరుగుతోంది. ఇందులో రా మిల్లులు 859 కాగా, బాయిల్డ్ మిల్లులు 914. ఒక్కో మిల్లులో ప్రస్తుతం గంటకు 8 నుంచి 10 మెట్రిక్ టన్నుల ధాన్యం చొప్పున ప్రతి రోజు రెండు షిఫ్టుల్లో 100 నుంచి 150 మెట్రిక్ టన్నుల వరకు మిల్లింగ్ కెపాసిటీ మాత్రమే ఉంది. అంటే రాష్ట్రంలోని అన్ని మిల్లుల్లో పూర్తిస్థాయిలో మిల్లింగ్ జరిగితే రోజుకు లక్ష నుంచి 2 లక్షల టన్నులకు పైగా ధాన్యం మిల్లింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే మిల్లర్లు తమ ప్రైవేటు దందాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో సర్కారుకు ఇచ్చే సీఎంఆర్ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గంటకు 60 నుంచి 120 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరాడించే భారీ మిల్లులను పౌరసరఫరాల సంస్థ ద్వారా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం గమనార్హం. మిల్లులతో పాటు బియ్యం ఆధారిత పరిశ్రమలను కూడా అక్కడే ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం ఆదేశించారు. సీఎం సూచన మేరకు నిర్మాణాలు: మంత్రి గంగుల సీఎం సూచన మేరకు ప్రభుత్వమే పౌరసరఫరాల సంస్థ ద్వారా రైస్ మిల్లులను నిర్మించాలని నిర్ణయించింది. గంటకు 60 నుంచి 120 టన్నుల కెపాసిటీ గల మిల్లులను తీసుకొస్తాం. వచ్చే ఏడాది కల్లా నిర్మాణాలు పూర్తి చేయాలనేది ఆలోచన. మిల్లులతో పాటు బియ్యం ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను కూడా కార్పొరేషన్ ద్వారా నిర్వహించే ఆలోచనలో ఉన్నాం. -
చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే గంప గోవర్థన్.. అసలు వివాదం ఏంటి?
సాక్షి, కామారెడ్డి: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ వివాదంలో చిక్కుకున్నారు. రైస్‌మిల్లు సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నారు. బిక్నూర్ మండలం పెద్దమల్లారెడ్డిలో ఘటన జరిగింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే రైస్‌మిల్లుకు వెళ్లారు. రైస్ మిల్లు సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో గంప గోవర్థన్ చెంప చెల్లుమనిపించారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే వీడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా మిల్లులో మిల్లర్లు లోడింగ్ నిలిపివేశారు. మిల్లరతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. రైస్ మిల్లర్లకు క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్ చేశారు. చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. పొంగులేటి కొత్త పార్టీ? -
వివాదంలో కామా రెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్
-
కుప్పకూలిన మూడంతస్తుల రైస్ మిల్లు.. నలుగురు కార్మికులు మృతి
హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. మూడు అంతస్తుల రైస్ మిల్లు భవనం కుప్పకూలడంతో నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటన కర్నాల్ జిల్లాల నితారోరిలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. కార్మికులు తమ షిఫ్టులు ముగిసిన తర్వాత రైస్‌మిల్లులో పడుకునేవారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి రైస్ మిల్లులో దాదాపు 150 మంది కార్మికులు నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో అర్థరాత్రి ఒక్కసారిగా భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మరణించగా.. మరో 24 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ యంత్రాల ద్వారా భవన శిథిలాలను తొలగిస్తున్నారు. మొత్తం ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారో తెలియలేదు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సరైన కారణాలు తెలియాల్సి ఉంది. భవనంలో కొన్ని లోపాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని, రైలు మిల్లు యాజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనపై విచారణకు కమిటీ వేయనున్నట్లు డీసీ కర్నాల్ అనీష్ యాదవ్ తెలిపారు. #WATCH | Haryana: Several rice mill workers feared being trapped under debris after a three-storeyed rice mill building collapsed in Karnal. Workers used to sleep inside the building. Fire brigade, police and ambulance have reached the spot. Rescue operations underway. pic.twitter.com/AFzN9HDPYw — ANI (@ANI) April 18, 2023 -
మినీ రైస్ మిల్లు.. గట్టి మేలు!
మూడు అడుగుల ఎత్తు ఉండే చిన్న రైస్ మిల్లు గ్రామీణ యువతకు ఉపాధి మార్గంగా మార్గం చూపుతోంది. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తన శ్రీకాకుళం జిల్లా మారుమూల గ్రామంలోని తన సోదరికి ఈ మిల్లును కొని ఇచ్చారు. ఆమె ఈ మిల్లు ద్వారా ధాన్యాన్ని స్వయంగా మరపట్టి బియ్యం విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లాకు చెందిన యువ రైతు కూడా దీని ద్వారా ఉపాధి పొందుతుండటం విశేషం. సన్న, చిన్న రైతులకు, దేశీ వంగడాలను సాగు చేసే రైతులకు, గ్రామీణ యువతకు ఈ చిట్టి రైస్ మిల్లు ఉపయోగకరమని చెబుతున్నారు. మినీ రైస్ మిల్లులో వడ్లను పోస్తున్న శ్రీధర్.. బియ్యం దేశీ వరి రైతులకూ ఉపయోగకరం నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామానికి చెందిన ఎలిశెట్టి శ్రీధర్ సోషల్ వర్క్‌లో ఎమ్మే చదివారు. వ్యవసాయంపైనే ఆధారపడిన కుటుంబం కావడంతో తనకూ చిన్నప్పటి నుంచి సాగుపైనే ఆసక్తి. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో సాగుకు సంబంధించిన కొత్త విషయాల గురించి వెదుకుతూ ఉంటారు. రెండు నెలల క్రితం ఫేస్బుక్లో ఎక్కడికైనా తీసుకెళ్లదగిన అతి చిన్న రైస్ మిల్లుకు సంబంధించిన పోస్టు శ్రీధర్‌ను ఆకట్టుకుంది. ‘పల్లెసృజన’ సంస్థలో గతంలో వలంటీర్‌గా పనిచేసిన అనుభవం ఉండటం వల్ల దీని ప్రత్యేకతను చప్పున గుర్తించారు. తమ వంటి సన్న, చిన్న రైతులకు ఈ మినీ రైస్‌మిల్లు చాలా ఉపయోగపడుతుందనిపించింది. ఆ పోస్టు పెట్టిన శ్రీకాకుళం జిల్లా వాసితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఛత్తిస్ఘడ్లోని రాయ్‌పూర్‌లో తయారైన ఈ మినీ రైస్ మిల్లును కొద్ది రోజుల్లోనే తానూ కొనుగోలు చేశారు శ్రీధర్. ఎత్తు మూడు అడుగులు. బరువు 65 కిలోలు. అడుగున నాలుగు వైపులా చక్రాలున్నాయి. ఎక్కడికంటే అక్కడికి సులువుగా తీసుకెళ్లవచ్చు. దీన్ని ఇంటి దగ్గరే పెట్టుకొని గంటకు 100–150 కిలోల ధాన్యాన్ని మరపడుతూ ఉపాధి పొందుతున్నారు శ్రీధర్. 5 గంటల పాటు నిరంతరాయంగా మర ఆడించవచ్చు. వంద కిలోల ధాన్యానికి 55–60 కిలోల బియ్యం పొందుతున్నానని, వడ్ల నాణ్యతను బట్టి హెచ్చు తగ్గులు ఉంటాయన్నారు. ఇందులో ఒకేసారి ఎనిమిది కిలోల వడ్లను పోయొచ్చు. 3 హెచ్‌పీ మోటార్‌తో పనిచేస్తోంది. సింగిల్ ఫేజ్ విద్యుత్ కనెక్షన్ ఉన్నా సరిపోతుంది. విద్యుత్ ఖర్చు బాగా తక్కువేనన్నారు. కాబట్టి, మారుమూల గ్రామంలో కూడా దీనితో ధాన్యం మరపట్టుకోవచ్చని శ్రీధర్ చెబుతున్నారు. 3 రకాల జాలీలు ఉంటాయి. వడ్లు పొడవు, లావును బట్టి జాలీని మార్చి సెట్ చేసుకోవాలి. సాధారణ రకాలు సాగు చేసే రైతులతో పాటు.. రకరకాల సైజుల్లో ఉండే దేశీ వరి రకాలను చిన్న మడుల్లో సాగు చేసే తన వంటి రైతుల మిల్లింగ్ కష్టాలు తొలగిపోయినట్లేనని ఆయన సంతోషపడుతున్నారు. దీన్ని రూ. 39 వేలకు కొన్నానని, రూ. 3 వేలు రవాణా ఖర్చులు అయ్యాయని శ్రీధర్ తెలిపారు. ధాన్యం మరపట్టించుకున్న వారు తవుడు తనకే వదిలేస్తే ఉచితంగా మర పడుతున్నానని, లేదంటే కిలో వడ్లకు రూ.2 చొప్పున తీసుకుంటున్నానని తెలిపారు. అర కిలో ధాన్యం ఉన్నా దీనితో మర పట్టుకోవచ్చని, దీన్ని నిర్వహించడానికి నైపుణ్యం పెద్దగా అవసరం లేదని శ్రీధర్ (98480 88428) అంటున్నారు. – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ ఫొటో జర్నలిస్ట్ : బాతూరి కైలాష్ సోదరికి అన్నయ్య కానుక.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం వేములవాడకు చెందిన బొడ్డ గంగాధర్ సరిహద్దు భద్రతా దళంలో బంగ్లాదేశ్–పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో పనిచేస్తున్నారు. అమ్మమ్మ, తల్లితోపాటు వేములవాడలో ఉంటున్న ఆయన చెల్లెలు లావణ్య ఇంటర్ పూర్తి చేశారు. చెల్లెలికి ఏదైనా ఉపాధి మార్గం చూపదగిన యంత్ర పరికరాల కోసం ఇంటర్నెట్లో వెదుకుతున్న గంగాధర్‌కు ఓ మినీ రైస్ మిల్లు కనిపించింది. దీన్ని తయారు చేసిన చత్తిస్ఘఢ్లోని కంపెనీని సంప్రదించారు. మూడు అడుగుల ఎత్తులో ఉన్న చిన్న మిల్లుకు కొన్ని సవరణలు సూచించారు. అవసరమైతే ఎక్కడికైనా తీసుకెళ్లడానికి వీలుగా చక్రాలు కూడా పెట్టించి ఏడాది క్రితం రూ. 40 వేలకు కొనుగోలు చేశారు. వేములవాడలోనే లావణ్య చిన్న రేకుల షెడ్డులో ఈ మినీ రైస్ మిల్లును, దానితోపాటు చిన్న పిండి మరను కూడా ఏర్పాటు చేసుకొని, తల్లి తోడ్పాటుతో తానే నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. 80 కిలోల సాంబ మసూరి ధాన్యం మరపడితే 51 కిలోల బియ్యం వస్తున్నాయని, 3 హెచ్‌పి మోటారు కావడంతో విద్యుత్తు ఖర్చు కూడా తక్కువగానే ఉందని లావణ్య తెలిపారు. తొలుత సింగిల్ ఫేజ్ విద్యుత్తుతో సమస్యలు రావటంతో టూ ఫేజ్ విద్యుత్ వాడుతున్నామన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంతో మరపట్టించిన బియ్యాన్ని కిలో రూ. 40కి అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నానని లావణ్య ‘సాక్షి’తో సంతోషంగా చెప్పారు. వేరే ఊళ్లో దూరాన ఉండే పెద్ద రైస్ మిల్లు దగ్గరకు వ్యయప్రయాసలకు ఓర్చి వెళ్లాల్సిన అవసరం ఇక లేదని, గ్రామంలోనే కొన్ని కిలోల ధాన్యాన్ని సైతం మరపట్టుకోవచ్చని ఈ మినీ మిల్లు చూశాక అర్థమైందన్నారు. చిన్న రైతులు, గ్రామాల్లో మహిళలు, యువతులు ఈ మిల్లు ద్వారా తన మాదిరిగా ఉపాధి పొందవచ్చని లావణ్య (70325 65474) సూచిస్తున్నారు. – లింగూడు వెంకట రమణ, సాక్షి, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా -
ఈ ధాన్యం ఎవరిది?
వనపర్తి క్రైం: వనపర్తి జిల్లా కేంద్రంలోని కేదార్నాథ్ రైస్ మిల్లులో భారీ మొత్తంలో వరి ధాన్యం బస్తాలు అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. వనపర్తి తహసీల్దార్ రాజేందర్‌గౌడ్, పౌరసరఫరాల శాఖ డీఎం అశ్విన్‌కుమార్ గురువారం వనపర్తి పట్టణంలోని కేదార్నాథ్ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. వీరి పరిశీలనలో పెద్ద మొత్తంలో వరి ధాన్యం బస్తాల నిల్వలు గుర్తించారు. అలాగే 200 క్వింటాళ్లకు పైగా బియ్యం అక్రమంగా ఉన్నట్టు కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని మిల్లుకు సీల్ వేశారు. ఆరా తీస్తున్న అధికారులు ఈ మిల్లుకు గత ఖరీఫ్ సీజన్లో 21వేల బస్తాల వరి ధాన్యం అప్పగించారు. కాగా ఈ మిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా 300 బస్తాల (150 క్వింటాళ్ల) బియ్యం మాత్రమే అప్పగించాల్సి ఉంది. అయితే మిల్లులో భారీగా నిల్వ ఉన్న వరి ధాన్యం, 150 క్వింటాళ్ల బియ్యం ఎక్కడిదని అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో అక్రమ దందాకు పాల్పడిన వారే ఇక్కడ నిల్వ చేశారా.. లేదా మిల్లు యాజమాన్యమే నిల్వ చేసిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. లెక్కల్లో చూపని దాదాపు లక్ష వరి బస్తాల ధాన్యం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై డీఎస్ఓ రేవతిని వివరణ కోరగా కేదార్నాథ్ మిల్లు 150 క్వింటాళ్ల బియ్యం అప్పగించాల్సి ఉందన్నారు. అయితే ఇంత భారీగా ఉన్న వరి ధాన్యం నిల్వలు ఎవరివో విచారణ చేస్తున్నామన్నారు. అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
హమ్మయ్య.. హమాలీలొచ్చారు
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్న తరుణంలో రాష్ట్రంలో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి హమాలీల రాక మొదలైంది.ప్రస్తుతం వారి కొరతతో అల్లాడుతున్న రైతులకు ఇది పెద్ద ఊరటగా భావించాలి.ఇలా రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో పనిచేయడానికి బీహార్‌లోని ఖగారియా జిల్లా నుంచి దాదాపు 300 మంది హమాలీలు శుక్రవారం ప్రత్యేక రైలులో హైదరాబాద్ చేరుకున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి హమాలీలకు పూలతో స్వాగతం పలికారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ పి.సత్యనారాయణ రెడ్డి. ఫైనాన్స్ సెక్రటరీ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్‌లు హమాలీలకు కోవిడ్ వైద్య పరీక్షలు, రవాణాను పర్యవేక్షించారు. రైస్‌మిల్లుల్లో వారి పాత్ర కీలకం... ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసేందుకు 7వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, కరోనా వల్ల హమాలీల సమస్య ఏర్పడింది. రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో అధిక శాతం బీహార్ నుంచి వచ్చిన హమాలీలే పనిచేస్తున్నారు. హోళీ పండుగకు వారు తమ స్వరాష్టానికి వెళ్లిపోయారు. ప్రయాణ సమయంలో లౌక్‌డౌన్ కావడం తో అక్కడే చిక్కుకుపోయారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, రైస్‌మిల్లుల్లో లోడింగ్, అన్లోడింగ్ సమస్య లు ఏర్పడ్డాయి. హమాలీల కొరతతో ఎఫ్‌సీఐ కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అప్పగిం చడానికి ఆటంకాలు ఏర్పడు తున్నాయి. దీంతో ప్రభుత్వం బిహార్ ప్రభుత్వానికి లేఖ రాసింది. బిహార్ నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న జాబితాను రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్, జిల్లా అసోసియేషన్ పౌరసరఫరాల సంస్థ అధికారులు బిహార్ ప్రభుత్వానికి అందించారు. తెలంగాణకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న హామాలీలను పంపేందుకు బిహార్ ప్రభుత్వం ఓకే చెప్పడంతో తొలి విడతలో బీహార్ నుంచి హమాలీలు రైలులో లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం వారిని జిల్లాల రైస్ మిల్లుల్లో పనిచేయడానికి ఒక్కో ఆర్టీసీ బస్సులో 20 మంది వంతున తరలించారు. -
రైసు మిల్లులో అగ్ని ప్రమాదం
తూర్పుగోదావరి, కొప్పవరం (అనపర్తి): కొప్పవరం గ్రామ పరిధిలో గల సూర్యశ్రీ రైసు మిల్లులో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. అనపర్తి అగ్నిమాపక కేంద్రం ఇన్చార్జి అధికారి ఏసుబాబు కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం నేలటూరుకు చెందిన నాగరాజు, గంగాధర్, గుమ్మిలేరుకు చెందిన ఫృథ్వీరాజ్, మండపేటకు చెందిన శ్రీనులు సూర్యశ్రీ రైసుమిల్లులో కాంట్రాక్టు పద్ధతిన వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్నారు. గోదాము పైభాగంలో పాడైన ఐరన్ పైపులకు గంగాధర్, ఫృథ్వీరాజ్‌లు వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా శ్రీను, నాగరాజులు హెల్పర్స్‌గా వారికి సహాయపడుతున్నారు. వెల్డింగ్ చేస్తున్నప్పుడు నిప్పురవ్వలు కింద ఉన్న తవుడు బస్తాలపై పడడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్క సారిగా మంటలు చెలరేగి, దట్టంగా పొగ వ్యాపించడంతో భీతిల్లిన గంగాధర్, ఫృథ్వీరాజ్‌లు ఏమి చేయాలో తోచని స్థితిలో పై నుంచి మంటల్లోకి దూకారు. ఈ ప్రమాదంలో వీరిరువురికి చర్మం కాలి తీవ్ర గాయాల బారిన పడ్డారు. శ్రీను, నాగరాజులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అనపర్తి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుజేశారు. ఈ ప్రమాదంలో గాయ పడిన నలుగురు వ్యక్తులను అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం వీరికి ప్రథమ చికిత్స నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం నిమిత్తం వీరిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులకు పరామర్శించిన అనపర్తి సీఐ పి.శ్రీనివాస్, ఎస్సై రజనీకుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు. నిర్లక్ష్యమే కారణమా? రైసు మిల్లులో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని పలువురు అంటున్నారు. వెల్డింగ్ పనులు నిమిత్తం ఉపయోగిస్తున్న గ్యాస్ సిలిండర్‌కు మంటలు వ్యాపించడంతో సిలిండర్ కూడా పేలినట్టు తెలుస్తోంది. దీంతో మంటలు మరింత ఉధృతంగా ఎగిసినట్టు సమాచారం. అయితే ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు గాను వినియోగించే అగ్ని నిరోధక సాధనాలు అందుబాటులో లేకపోవడంతో అగ్నిమాపక వాహనం వచ్చే వరకు మంటలు అదుపుజేసే పరిస్థితులు లేక ప్రమాద తీవ్రత పెరిగిందని పలువురు పేర్కొంటున్నారు. -
రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడులు
విజయనగరం,చీపురుపల్లి: పట్టణ శివారు రావివలస రోడ్లో గల సాయిలక్ష్మి ట్రేడింగ్ కంపెనీ (రైస్‌మిల్లు)తో పాటు అదే రైస్‌మిల్లుకు ప్రజాపంపిణీ బియ్యం (పీడీఎస్) సరఫరా చేస్తున్న ఆటోపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రజాపంపిణీ బియ్యం ఆ మిల్లులో ఉన్నాయన్న అనుమానంతో దాడులు చేపట్టగా.. వారు ఊహించిన విధంగా వందల క్వింటాల బియ్యం పట్టుబడ్డాయి. దీంతో పాటు రికార్డులు పరిశీలించగా అందులో ఉన్న లెక్కలకు, మిల్లులో ఉన్న స్టాకు సంబంధం లేకపోవడంతో దాదాపు రూ.40 లక్షలు విలువైన స్టాకు సీజ్ చేసి మిల్లు యజమానిపై 6ఏ కేసు నమోదు చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ 30వై 2405 ఆటోలో పది బస్తాల పీడీఎస్ బియ్యం తరలిపోతున్న విషయం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చీపురుపల్లి – లావేరు రోడ్డులో కనకమహాలక్ష్మి ఆలయం వద్ద పట్టుకున్నారు. బియ్యాన్ని సాయిలక్ష్మి ట్రేడింగ్ కంపెనీకి తరలిస్తున్నట్లు చీపురుపల్లి మండలంలోని దేవరపొదిలాం గ్రామానికి చెందిన కిల్లంశెట్టి గణపతిరావు తెలిపారు. దీంతో విజిలెన్స్ ఎస్పీ హరికృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది సాయిలక్ష్మి రైస్‌మిల్లుపై దాడి చేపట్టారు. అదే సమయంలో రైస్ మిల్లులో అన్లోడింగ్ జరుగుతున్న 19.5 క్వింటాళ్ల (39 బస్తాలు) ప్రజాపంపిణీ బియ్యాన్ని పట్టుకున్నారు. అంతేకాకుండా రైస్ మిల్లులో 25.5 క్వింటాళ్ల (51 బస్తాలు) ప్రజాపంపిణీ బియ్యం నిల్వలు కూడా గుర్తించారు. అలాగే రైస్‌మిల్లు రికార్డుల్లో బియ్యం 1237 క్వింటాళ్లు... బ్రోకెన్ రైస్ 48.05 క్వింటాళ్లు.. బ్రౌన్ రైస్ 23.05 క్వింటాళ్లు ఉన్నట్లు రాసి ఉండగా నిల్వ ఉన్న స్టాకులో తేడాలున్నట్లు నిర్ధారించారు. దీంతో సుమారు 40 లక్షల రూపాయల విలువైన స్టాక్‌ను సీజ్ చేసి పౌరసరఫరాల శాఖకు అప్పగించినట్లు ఎస్పీ హరికృష్ణ తెలిపారు. భారీ స్థాయిలో అక్రమ రవాణా.... ప్రజాపంపిణీ బియ్యం భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతోందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ హరికృష్ణ తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మిల్లుల్లో పాలిష్ చేపట్టి అనంతరం సన్నబియ్యంగా మార్కెట్‌కు తరలిస్తున్నారని చెప్పారు. చీపురుపల్లి కేంద్రంగా ఈ దందా ఎక్కువగా కొనసాగుతోందన్నారు. బియ్యాన్ని రవాణా చేస్తున్న వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసేలా రవాణాశాఖాధికారులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో డీఎస్పీ భార్గవనాయుడు, సీఐలు చంద్ర, కృష్ణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎస్.త్రినాథ్, సీఎస్‌డీటీ బి.ఈశ్వరరావు, వీఆర్ఓ రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి మృతిపై వీడని మిస్టరీ
రామవరప్పాడు(గన్నవరం): ఎనికేపాడు పల్లవి రైస్ మిల్లులో ఆదివారం వెలుగు చూసిన యువకుడి అనుమానాస్పద మృతి ఘటన మిస్టరీగా మారింది. తాపీ పని చేసుకునే మహేష్‌కు మూసివేసిన మిల్లులో పనేంటని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే మహేష్‌కు మద్యం పోయించి మిల్లులోకి తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. షాక్‌తో మృతి అని పోలీసులు.. విద్యుత్ షాక్‌తో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యుత్ బకాయిలు ఉండటంతో 4 నెలల క్రితమే మిల్లుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మిల్లులో విద్యుత్ సరఫరా లేనప్పుడు షాక్‌తో ఎలా మృతి చెందాడని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాగా మహేష్ కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమారుడిని కచ్చితంగా హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పంపకాల మధ్య విభేదాలే హత్యకు... మృతుడు మహేష్ దళితవాడలోని పలువురు యువకులు, రైస్ మిల్లులోని డ్రైవర్లు ముఠాగా ఏర్పడి మిల్లుల్లో చోరీలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మూసివేసిన మిల్లులోని మోటార్లు, తదితర వస్తువులను వీరు రాత్రిళ్లు చోరీ చేసి పక్క జిల్లాలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. దొంగ సొత్తు పంపకాల్లో తేడా వచ్చి మిగిలిన వారే తీవ్రంగా కొట్టి హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరఫరా ఆపేశాం గ్రామంలోని పల్లవి రైస్ మిల్లు విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో మార్చిలో విద్యుత్ సరఫరా నిలిపి సీల్ కూడా వేశాం. ఎట్టిపరిస్థితుల్లో మిల్లులో విద్యుత్ సరఫరాకు అవకాశం లేదు. మిల్లు పక్కన గృహ సముదాయాల నుంచి విద్యుత్ పునరుద్ధరించడానికి అవకాశం లేదు. –గోవిందరాజులు, విద్యుత్ ఏఈ పోస్ట్‌మార్టం నివేదికఆధారంగా చర్యలు మహేష్ మృతదేహన్ని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం. ప్రాథమిక విచారణలో భాగంగా విద్యుత్ షాక్‌తో మరణించినట్లు సమాచారం. మృతుడి చేతిలో కూడా విద్యుత్ వైర్లు ఉన్నాయి. మిల్లులో మోటార్లు, వైర్లు దొంగతనం జరుగుతున్నాయని మా విచారణలో తెలిసింది.–ఉమామహేశ్వరరావు, సీఐ పటమట -
పొట్టకూటికొచ్చి ప్రాణాలొదిలారు
ఇబ్రహీంపట్నంరూరల్ : కుటుంబాలను పోషించాల్సిన కుటుంబ పెద్దలు రైస్‌మిల్ యాజమానుల నిర్లక్ష్యానికి ఇద్దరు కూలీలు బలయ్యారు. పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు. రైస్‌మిల్లులో గోడ కూలిన ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ప్రమాదానికి సం బంధించి ప్రత్యక్షసాక్షుల, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామా నికి చెందిన గిరమోని శ్రీనివాస్(40), కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన గౌర బీరప్ప(42). వీరిద్దరూ ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్‌పల్లి రెవెన్యూ పరిధిలో గల శ్రీలక్ష్మీ గణపతి రైస్‌మిల్లులో హమాలీలుగా పని చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. రోజుమాదిరిగానే శుక్రవారం ఉదయం పనికోసం రైస్‌మిల్ వద్దకు వచ్చారు. సాయంత్రం 6 గంటల సమయంలో మిల్లోంచి వస్తున్న బియ్యాన్ని తొ క్కుతుండగా బియ్యం ఆపేందుకు అడ్డంగా కట్టిన గోడ కూలిపోయింది. గోడ కూలడంతో శ్రీనివాస్, బీరప్పలు బియ్యంలో మునిగిపోయారు. దీంతో గమనించిన తోటివారు ఆరగంట పాటు శ్రమించి బియ్యంలో కూరుకుపోయిన ఇద్దరిని బయటకు తీశారు. అప్పటికే వీరిద్దరి పరిస్థితి విషమించడం తో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించా రు. గోడ కూలి బియ్యంలో పడి ప్రమాదానికి గురయ్యారనే సమాచారం యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు. మృతులిద్దరికీ భార్య, పిల్లలున్నారు. మృతుల కుటుంబాలను యాజమాన్యం ఆదుకోవాలని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, సీపీఎం నాయకులు పగడాల యాదయ్య, సీఐటీయూ నాయకులు బడ్డు నర్సింహా, జగదీష్‌లు డిమాండ్ చేశారు. సాగర్‌రోడ్డుపై రాస్తారోకో.. ఇద్దరు హమాలీల కుటుంబాలకు న్యాయం చేయాలని శనివారం ఉదయం రైస్‌మిల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. మధ్యాహ్నం వరకు యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు ఒక్కసారిగా సాగర్‌రోడ్డుపై మండుటెండలో రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల సీఐలు స్వామి, గోవింద్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని సర్ధిచెప్పే సమయంలో కూలీలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి కలగజేసుకొని ఇరువర్గాలను శాంతిపరిచారు. సాగర్రహదారిపై రాస్తారోకో చేస్తున్న కూలీలు -
పాత రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని సాయికృష్ణ బిన్ని రైస్‌మిల్లులో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లు ప్రస్తుతం పనిచేయకపోవడంతో అందులో నిల్వ ఉంచిన మిర్చి, పత్తి, కందులు, అపరాలు కాలిబూడిదయ్యాయి. ఉదయం 7 గంటలకు మిల్లు నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు, అందులో సరుకులు నిల్వ ఉంచిన వ్యాపారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని అగ్నిమాపకదళం, పోలీస్ అధికారులకు ప్రమాదం విషయాన్ని తెలియజేశారు. మహబూబాబాద్ అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండటంతో ఇల్లందు, నర్సంపేట, మరిపెడ, వరంగల్ ప్రాంతాల నుంచి అదనపు అగ్నిమాపక వాహనాలను రప్పించారు. టౌన్ సీఐ జబ్బార్ పొక్లెయిన్ తెప్పించి మిల్లు గోడలు పగులగొట్టించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటి విలువైన సరుకులు కాలిపోగా, రూ.కోటి విలువైన భవనం కూలిపోయింది. -
పౌరసరఫరాల శాఖలో...అవినీతి ‘మోహన’రాగం!
ఎల్ఎన్ పేట పరిసరాల్లోని ఓ రైస్‌మిల్లు... ఇటీవల పౌరసరఫరాల శాఖలో తనిఖీల బృందం అక్కడికి వెళ్లింది! ముమ్మరంగా సోదాలు చేసింది! రూ.54 లక్షల విలువైన ధాన్యం, బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్లు కనుగొన్నారు! ఆ సరుకును సీజ్ కూడా చేశారు! సహజంగా ఇలాంటి వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై కేసు నమోదు చేయాలి. అక్రమం ఎంతో తేల్చిన సరుకును ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి!! కానీ కేవలం రూ.22 వేలు బ్యాంకు గ్యారెంటీతో ఆ మొత్తం సరుకును విడుదల చేయించడానికి పౌరసరపరాల శాఖలో ఓ ఉన్నతాధికారి బాధ్యత తీసుకున్నారు! ఓ ఫైల్ తయారు చేసి జిల్లా కలెక్టరు పరిశీలనకు పంపించారు! ఈ గూడుపుఠాణిని గ్రహించిన ఆయన సంబంధిత అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఆ ఫైల్నుఆమోదించాలని కలెక్టరుపై జిల్లాకు చెందిన మంత్రితో పాటు గుంటూరుకు చెందిన మరో మంత్రి నుంచి ఒత్తిళ్లు తెచ్చారంటే ఈ అక్రమ వ్యవహారం ఏ స్థాయికి వెళ్లిందో ఊహించవచ్చు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. ఖరీఫ్‌లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనేది జిల్లా యంత్రాంగం లక్ష్యం. దీనికోసం 130 ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీల)ను ప్రారంభించారు. ఈ పీపీసీలను స్థానిక రైస్‌మిల్లులతో అనుసంధానం చేశారు. కానీ కొనుగోలు ప్రక్రియనుసకాలంలోనే ప్రారంభించినప్పటికీ ఆశించిన స్థాయిలో జరగలేదు. అయితే కొంతమంది రైస్‌మిల్లర్లు నేరుగా కొనుగోలు చేసుకొచ్చి అక్రమంగా నిల్వలు ఉంచుకున్నారనేది బహిరంగ రహస్యం. ఏదోలా వ్యాపారం నడవాలనే ఉద్దేశంతో కొంతమంది రైస్‌మిల్లర్లు లోపాలకు ఆస్కారం ఇస్తున్నారు. ఇదే పౌరసరఫరాల శాఖలో ఆ ఉన్నతాధికారికి వరంగా మారింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలోని 307 రైస్‌మిల్లులకు ధాన్యం కొనుగోలు (ప్రొక్యూర్మెంట్), మిల్లింగ్‌కు అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు వారికి సీఎంఆర్ ధాన్యం సరఫరా చేశారు. అయితే గడిచిన సంవత్సరం నుంచి సీఎంఆర్ పెండింగ్‌లో ఉంచిన 10 రైస్‌మిల్లులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుత సీజన్లోనూ సీఎంఆర్ డెలివరీ 20 శాతం కంటే తక్కువగా మిల్లింగ్ చేసిన రైస్‌మిల్లులు 30 వరకూ ఉన్నాయని తేలింది. ఇలాంటి నిల్వలు ఉంచిన రైస్‌మిల్లులపై దాడులు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇదే అవకాశంగా తీసుకున్న పౌరసరఫరాల శాఖలోని సదరు ఉన్నతాధికారి తన అనుయాయులతో మంత్రాంగం రచించారు. లోపాలే ఆయన ఆయుధం... రైస్‌మిల్లుల్లో అక్రమాలు వెలుగులోకి తెచ్చేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు డిప్యూటీ తహశీల్దారు కేడరు వారితో ఇటీవల రెండు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. వారు మిల్లుల్లో తనిఖీలు చేసి, నిల్వల సమాచారం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేయాలి. ధాన్యం, బియ్యం నిల్వల్లో వ్యత్యాసాలు ఉంటే కేసులు నమోదు చేయాలి. అయితే ఇటీవల కాలంలో రైస్మిల్లర్లపై ఈ దాడులు జరుగుతున్నాయి. కానీ కేసులు మాత్రం ఆ స్థాయిలో లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైస్‌మిల్లర్ల నుంచి మామూళ్లకు ఆశపడి నిబంధనలకు నీళ్లొదులుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యవహారంలో డిప్యూటీ తహసీల్దారు స్థాయి అధికారులు ఇద్దరితో పాటు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఒకరు కీలక పాత్ర పోషిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమారు 20 మిల్లుల్లో తనిఖీలు నిర్వహించినా పూర్తిస్థాయిలో ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడానికి మామూళ్ల వ్యవహారమేననే ఆరోపణలు వస్తున్నాయి. ఆ తనిఖీలేమయ్యాయో... సరుబుజ్జిలి, పక్కివలస, నరసన్నపేట పరిసర ప్రాంతాల్లోని రైస్‌మిల్లుల్లో ఇటీవల పౌరసరఫరాల శాఖ తనిఖీ బృందాలు సోదాలు నిర్వహించాయి. కొన్ని మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వల్లో భారీగా వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా మిల్లులపై కేసు నమోదుకు సిఫారసు కూడా ఆ బృందాలు చేశాయి. కానీ ఆ ఉన్నతాధికారి అనుయాయుడైన డిప్యూటీ తహశీల్దారు మంతనాలు చేసి కేసులు లేకుండా మాఫీ చేశారని తెలిసింది. గత నెల 15వ తేదీ నుంచి రెండ్రోజుల పాటు పౌరసరఫరాల శాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందం వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాల్లోని పలు రైస్‌మిల్లుల్లో తనిఖీ చేసింది. కొన్ని మిల్లులపై కేసులు నమోదు చేయాలని పౌరసరఫరాల శాఖకు సిఫారసు కూడా చేశారు. కానీ ఇప్పటివరకూ కేసులు పెట్టిన దాఖలాలు లేవు. వస్తు రూపంలోనూ మామూళ్లు... పౌరసరఫరాల శాఖలో సదరు ఉన్నతాధికారి ఒత్తిళ్లకు తట్టుకోలేపోతున్నామని కొంతమంది రైస్‌మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. వారే గాకుండా వస్తురూపంలో మామూళ్లు సమర్పించుకోలేక దిగువస్థాయి ఉద్యోగులు కూడా ఒత్తిడికి గురవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానుకల కోసం జీతంలో కొంత ఇచ్చేస్తే తాము ఎలా బతకాలని డీటీ స్థాయి ఉద్యోగి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారంటే అవినీతి స్థాయిని ఊహించవచ్చు. పాలకొండ డివిజన్‌కు చెందిన ఓ డీటీ సదరు ఉన్నతాధికారికి ఒక పెద్ద మంచం ఇటీవలే సమర్పించుకున్నారు. దివాన్ కాట్ కూడా తయారుచేయిస్తున్నారని తెలిసింది. అలాగే శ్రీకాకుళం డివిజన్‌కు చెందిన ఓ డీటీ ప్రతి నెలా ఎక్కడో నివాసం ఉంటున్న సదరు ఉన్నతాధికారి కుటుంబానికి బియ్యం పంపిస్తూనే ఉన్నారట. కొంతమంది రైస్‌మిల్లర్లు పెద్ద ప్లాస్మా టీ వీ, సోఫాసెట్, కుర్చీలు ఇటీవలే కానుకగా సమర్పించుకున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా జిల్లా కార్యాలయంలోని ఓ అధికారిని రూ.10 వేలు ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఇచ్చి పంపించాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
విషాదం: తలపాగ మెషిన్లో ఇరుక్కుని..
సాక్షి, ములుగు (గజ్వేల్): తలకు చుట్టుకున్న గుడ్డ యంత్రంలో ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చిన్నతిమ్మాపూర్‌కు చెందిన నాగమణి (35) వంటిమామిడిలోని జయలక్ష్మి రైస్ మిల్లులో పనిచేస్తోంది. ఆమె తలకు గుడ్డ చుట్టుకుని బియ్యం పట్టే యంత్రం వద్ద మట్టి పెళ్లలను వేరు చేస్తోంది. ఆమె తలగుడ్డ ప్రమాదవశాత్తూ యంత్రంలో ఇరుక్కుపోయి మెడకు బిగుసుకుపోయింది. యంత్రానికి తల బలంగా తాకడంతో అపస్మారక స్థితిలోకి జారుకుంది. అదేమిల్లులో పనిచేస్తున్న భర్త శంకర్ ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
-
రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం.. కోట్ల ఆస్తి నష్టం
సాక్షి, పెద్దాపురం: రైస్ మిల్లు గోనేసంచుల గోదాములో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం రోడ్డులో ఉన్న శ్రీ లలిత రైస్ మిల్లులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారుగా రూ. 4 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు ఆరు ఆగ్ని మాపట శకటాలు 3 గంటలుగా శ్రమిస్తున్నాయి. రైస్ మిల్లు అగ్ని ప్రమాద ప్రదేశాన్ని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప పరిశీలించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాపు చేయాలని మంత్రి పోలీసులకు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం.. తొమ్మిది ఇళ్లు దగ్ధం విజయనగరం జిల్లాలోని మక్కువ మండలం తూరు మామిడి గిరిజన గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది ఇల్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ. 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఓ పూరిల్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని అగ్ని మాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇళ్లన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మరోవైపు ఆ మంటల్లో ఇళ్లలోని పత్తి, బియ్యం మొత్తం బూడిదవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. దీంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ఆదోనిలో అన్నదమ్ముల హత్య
- వివాహేతర సంబంధమే కారణం - ఆదివారం రాత్రి అన్న కిడ్నాప్ - అడ్డుకోబోయిన అతని తమ్ముడిపై వేటకొడవళ్లతో దాడి - చికిత్స పొందుతూ మృతి - కిడ్నాప్ అయిన వ్యక్తి దారుణ హత్య - ఎమ్మిగనూరు సమీపంలో చంపేసి, శవాన్ని తగులబెట్టిన దుండగులు - ముగ్గురు నిందితుల గుర్తింపు ఆదోని టౌన్/ఎమ్మిగనూరు రూరల్: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన ఆదోనిలో చోటు చేసుకుంది. సోమవారం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు జంట హత్యల వివరాలను వెల్లడించారు. ఆదోని పట్టణంలోని విక్టోరియ పేటలో నివాసముంటున్న రాజు, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు నాగేంద్ర (38) రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. రెండో కుమారుడు నాగరాజు (34) బెంగళూరు ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. మూడో కుమారుడు నరేష్(32) ఇంటి పట్టునే ఉంటున్నాడు. నాగేంద్రకు భార్య, కుమార్తె ఉన్నారు. ఇతనికి అదే కాలనీకి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి భార్య శిరీషను మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో 2016లో అతనిపై వేధింపుల కేసు నమోదైంది. వివాహేతర సంబంధం మానుకోవాలని భార్య, బంధువులు చెబుతున్నా పెడచెవినా పెడుతూ వచ్చాడు. ఈ విషయం మహిళ ఇంట్లో తెలియడంతో నాగేంద్రను చంపేందుకు కుట్ర పన్నారు. అడ్డొచ్చిన తమ్ముడిని కడతేర్చారు.. ఆదివారం రాత్రి నాగేంద్ర భోజనం ముగించుకుని ఇంటి ముందు కూర్చున్నాడు. తూపాన్ వాహనంలో తెల్ల దుస్తులు ధరించిన కొందరు గుర్తు తెలియని అక్కడికి వచ్చి అతడిని బలవంతంగా వాహనంలోకి ఎక్కిస్తుండగా కేకలు వేశాడు. కొంత దూరంలో ఉన్న అతని తమ్ముడు నరేష్ అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి వాహనానికి అడ్డుగా నిలిచాడు. తమ అన్నను ఎక్కడికి తీసుకెళ్తారని ప్రశ్నించేలోగా దుండగులు కత్తులతో దాడి చేయడంతో కుప్పకూలి పోయాడు. వాహనం మాధవరం రోడ్డువైపు వేగంగా వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన నరేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఇతనికి వివాహం కాలేదు. చేతి కడియంతో మృతదేహం గుర్తింపు ఆదివారం రాత్రి కిడ్నాప్‌నకు గురైన బోయ నాగేంద్రను దుండగులు ఎమ్మిగనూరు మండల బనవాసి ఫారం ఎల్లెల్సీ కాల్వ దగ్గరకు తీసుకువచ్చి హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తించకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. శరీర భాగాలు పూర్తిగా కాలిపోయాయి, అయితే కుడిచేయి మాత్రం కాలలేదు. సోమవారం ఉదయం కాలువ గట్టుపై నుంచి పొలాలకు వెళ్తున్న రైతులు మృతదేహాన్ని గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సీఐ జీ.ప్రసాద్, రూరల్ ఎస్ఐ వేణుగోపాల్‌లు సంఘటన స్థలానికి చేరుకొని çపరిశీలించారు. ఆదివారం రాత్రి ఆదోనిలో కిడ్నాప్ ఘటనపై వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు కావటం, పత్రికల్లో కథనాలు రావటంతో ఆదోని పోలీసులకు, బంధువులకు ఎమ్మిగనూరు పోలీసులు సమాచారం అందించారు. ఈ మేరకు ఆదోని త్రీ టౌన్ సీఐ చంద్రశేఖర్, వన్‌టౌన్ ఎస్ఐ మన్మధవిజయ్ మృతుడి బంధువులను సంఘటన స్థలం దగ్గరకు తీసుకువచ్చారు. కుడిచేయి కాలిపోకుండా ఉండటం, చేతికి వెండి కడియం, దారం ఉండటంతో గుర్తించారు. అనంతరం ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హత్యకు గల కారణాలు వివాహేతర సంబంధం అని అనుమానాలను బంధువులు వ్యక్తం చేస్తున్నారన్నారు. అదే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. కేసును త్వరలోనే ఛేదిస్తాం: డీఎస్పీ అన్నదమ్ముల హత్య కేసును త్వరలో ఛేదిస్తాం. నిందితులను అరెస్ట్ చేసేందుకు 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాం. మృతుడు నాగేంద్ర భార్య, మామ ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో ఈరన్న, రవి, సత్యనారాయణపై కేసు నమోదు చేశాం. ఈ ఘటనలో పది మంది నిందితుల వరకు పాల్గొని ఉండవచ్చు. -
మూటలు మోసిన కవిత
ధర్మపురి: టీఆర్ఎస్ కూలీ దినాల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కవిత కూలీ పని చేశారు. ఓ రైస్ మిల్లో మూటలు మోశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కవితలు మంగళవారం వచ్చారు. వీరు ముందుగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న రైస్ మిల్లుల్లో బియ్యం మూటలు మోసారు. ఇందుకు తలసాని, కవిత రూ. 50 వేలు సంపాదించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గడివేముల: గడివేముల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. తలముడిపికి చెందిన సయ్యద్ మహమ్మద్ హుసేన్(65) ఆదివారం తెల్లవారుజామున 5గంటల సమయంలో స్వగ్రామం నుంచి గోంగూర అమ్మేందుకు టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై వెళ్తుండగా గడివేముల రైలుమిల్లు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని పెద్దకుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. మృతునికి భార్య, మగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పంచనామ నిర్వహించి శవపరీక్షకై నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఎమ్మెల్యే చెప్పారని...వచ్చేశారు!
ఎల్.ఎన్.పేట: ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అదేశించారు. జిల్లాస్థాయి అధికారి చెప్పారుకదాని ఓ రైస్ మిల్లు తనిఖీకి వెళ్లిన అధికారులకు అక్కడ పరిస్థితి విస్మయం కలిగించింది. ఓ మాటలో చెప్పాలంటే చేదు అనుభవం ఎదురైనట్టే.. వివరాల్లోకి వెళితే ఎల్.ఎన్.పేట మండల ప్రత్యేక అధికారి ధనుంజయరావు, తహసీల్దార్ నారాయణమూర్తి, ఆర్ఐ గోవిందరాజులుతో పాటు పలువురు అధికారులు స్కాట్‌పేట వద్ద అలికాం–బత్తిలి రోడ్డు పక్కన ఉన్న శ్రీమాణిక్యాంబ రైస్‌మిల్లు తనిఖీ కోసం సోమవారం సాయంత్రం చేరుకున్నారు. మిల్లులోకి వెళ్లే సరికి సంబంధిత యజమాని లేరు. అక్కడ పనిచేస్తున్న కలాసీలు, రైస్‌మిల్లు గుమస్తాలతో అధికారులు మాట్లాడారు. రికార్డులు చూపించాలని గుమస్తాను అడిగారు. రికార్డులు బీరువాలో ఉంటాయని, తాళాలు యజమాని వద్ద ఉన్నాయని గుమస్తా చెప్పారు. యజమాని ఫోన్ నంబర్ తీసుకుని తహసీల్దార్ ఫోన్ చేశారు. ఎమ్మెల్యే వద్ద ఉన్నాను..తరువాత రండి తహసీల్దార్ నారాయణరావు ఫోన్ లిఫ్టు చేసిన రైస్ మిల్లు యజమాని చెప్పిన సమాధానం సంబంధిత అధికారిని కంగుతీనిపించింది. తాను స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వద్ద ఉన్నానని.. మరోసారి రావాలని అధికారికి స్పష్టం చేశారు. చేసేదిలేక తహస్ల్దారు ఫోన్ కట్‌చేశారు. తరువాత ఏం జరిగిందంటే.. తరువాత తహసీల్దార్ నారాయణమూర్తి ఫోన్ రింగయింది. ఫోన్ లిఫ్ట్‌చేసి ఎవరు అని ప్రశ్నించారు. నైను మాణిక్యాంబ రైస్‌మిల్లు యజమానినని, ఎమ్మెల్యే మాట్లాడుతారు లైన్లో ఉండండి అని ఫోన్ ఇచ్చారు. తహసీల్దార్‌తో ఎమ్మెల్యే ఏం మాట్లాడారో సీక్రెట్. అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఏమి జరిగింది సార్ అని అధికారులను అక్కడే ఉన్న విలేకర్లు అడగ్గా ఏమి చేస్తాం ఒకవైపు జిల్లా అధికారుల ఆదేశాలు... మరో వైపు అధికార పార్టీ నాయకుల అడ్డుకట్టలు అంటూ పెదవి విరిశారు. అక్రమాలు జరిగినట్టు అనుమానం! ధాన్యం కొనుగోలులో మాణిక్యాంబ రైస్‌మిల్లు యజమాని అధికారం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. మిల్లు యజమాని కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన రికార్డులను ఐకేపీ, పీఏసీఎస్‌ల్లో పరిశీలించారు. సంబంధిత మిల్లు యజమాని పీఏసీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 24 మంది రైతుల నుంచి 1655 క్వింటాలు (2060 బస్తాలు, బస్తా 80కిలోలు చెప్పున్న) కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంది. వాస్తవానికి మిల్లులో ఉన్న ధాన్యం నిల్వలు పరిశీలించి..తక్కువగా లెక్కవేసుకున్న 10 వేల బస్తాలు (80కిలోలు) పైనే ఉంటాయని అధికారులే అంచనాలు వేసుకున్నారు. మిల్లు యజమాని ప్రభుత్వానికి ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీ రూ.24 లక్షలు మాత్రమే. అంటే ఆయన ఇచ్చిన గ్యారంటీకి సబంధించిన ధాన్యం 24 మంది రైతుల నుంచి కొనుగోలు జరిగిపోయింది. మిగిలిన ధాన్యం ఎక్కడి నుంచి వచ్చాయి? లెక్కల పరిస్థితి ఏమిటి? చిక్కుముడులు జిల్లా కలెక్టర్, విజిలెన్స్ అధికారులు విప్పుతారో? అధికార పార్టీ నాయకులకు తలొగ్గుతారో వేచిచూడాలి. అందరికీ హడలే..! శ్రీమాణì క్యాంబ రైస్‌మిల్లు అంటే రైతులకు, మిగిలిన మిల్లర్లకు, అధికారులకు అందరికీ హడలే. మిల్లు యజమానికి ఉన్న రాజకీయ పలుకుబడి అలాంటిది. తనను ఎవరేమీ చేయలేరన్న ధీమాతో తన ఇష్టం వచ్చినట్లు వ్యపారం చేస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోయిన చేసినట్లు అధికారులు రికార్డులు తయారు చేస్తారు. ఒడిశా నుంచి యథేచ్ఛగా ధాన్యం వస్తున్న అడ్డుకట్టు వేసే అధికారే లేరు. రైస్‌మిల్లు నుంచి వచ్చిన ఊక రోడ్డుమీద వెళుతున్న ప్రయాణికుల కంట్లో పడుతున్న పట్టించుకునేవారేలేరు. దీనిపై అధికారులు స్పందించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
వెలుగోడు: పట్టణంలోని జగదాంబ రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం విజిలెన్స్ ఎస్ఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రైస్ మిల్లులో 495 ప్యాకెట్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని బియ్యాన్ని స్టాక్ పాయింట్‌కు తరలించారు. దాడుల్లో విజిలెన్స్ సిబ్బంది నాగభూషణం, ఈశ్వర్‌రెడ్డి, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రైతు చేతికి రద్దునోట్లు
► ధాన్యం కొనకముందే చెల్లింపులు ► పెద్దపల్లి జిల్లాలో రూ.100 కోట్ల పంపిణీ పెద్దపల్లి : వ్యాపారులు, మిల్లర్లు తమ వద్ద ఉన్న రద్దు నోట్లతో వరిధాన్యం కొనుగోలు చేసి సర్కారు నిఘా నుంచి తప్పించుకున్నారు. రైతులు మార్కెట్‌కు వెళ్లి ధాన్యం విక్రరుుంచడం కంటే, తమ వద్దకు వచ్చిన వ్యాపారి వద్ద రద్దు నోట్లు తీసుకుని విక్రయాలను పూర్తి చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో 15 రోజుల్లో వ్యాపారుల నుంచి రైతులకు సుమారు రూ.100 కోట్ల రద్దు నోట్లు ముట్టినట్లు సమాచారం. కరీంనగర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, సిద్దిపేట, మానకొండూర్ తదితర ప్రాంతాలకు చెందిన రైస్‌మిల్లుల యజమానులు రైతుల నుంచి ఈ ప్రాం తంలో పెద్ద మొత్తంలో వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. అరుుతే రైతులకు గతంలోకంటే ఈసారి వేగవంతంగా డబ్బులు చేతికందారుు. ధాన్యం మిల్లుకు చేరిన 15 రోజుల నుంచి 20 రోజుల్లోపు ధాన్యం డబ్బులు రైతుకు అందేవి. అలాగే ప్రభుత్వం సేకరిస్తున్న ఐకేపీ కేంద్రాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. చెక్కులు తీసుకుని బ్యాంకులో జమ చేసుకోవడం, ఆ తర్వాత బ్యాంకు ద్వారా విత్‌డ్రా చేసుకోవడం ప్రహాసనంగా మారింది. దీనికంటే వ్యాపారి నుంచి వస్తున్న రద్దు నోట్లు తీసుకోవడం, కొంత అవసరాల కోసం చలామణి చేసుకోవడం, మిగిలిన సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేసుకుంటున్నారు. నమ్మకస్తులకు ముందే డబ్బు.. గ్రామాల్లో ఉన్న నమ్మకమైన రైతులకు వ్యాపారులు ముందే డబ్బును ముట్టజెబుతున్నారు. తూకం వేయడం కంటే ముందే డబ్బు ఇచ్చి, ఆ తర్వాత మిల్లర్ ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. ఇదే పద్ధతిలో ప్రతి గ్రామంలో రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మేరకు చలామణీ అయ్యా రుు. ఇటు రద్దు నోట్లు మార్పిడి చేసుకోవడం వ్యాపారికి ఇబ్బంది కాగా.. అనుకున్న సమయంకంటే ముందే తమచేతికి ఏదో ఒక నోటు రావడం రైతుకు కూడా సంతోషంగానే మారిం ది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా రద్దు నోట్ల న్నీ రైతుల జేబుల్లోకి చేరుకున్నారుు. అలాగే వ్యాపారి సైతం తాను ఎలాంటి కష్టం లేకుం డానే నోట్లన్నీ రైతులకు పంపిణీ చేసి పని పూర్తి చేసుకున్నారు. దీంతో వడ్ల సేకరణ కూడా వేగవంతంగా జరుగుతోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండానే నోట్ల పంపిణీ కూడా పూర్తరుుంది. మిల్లులకు చేరిన వరిధాన్యం పెద్దపల్లి జిల్లాతోపాటు పొరుగు జిల్లాలకు కూ డా ఈ ప్రాంతం నుంచి ధాన్యం తరలిపోరుుం ది. ఉద్దెర, ఇబ్బంది లేకుండానే ధాన్యం కొనుగోళ్లన్నీ పూర్తయ్యారుు. కొన్ని చోట్ల రైతులకు అడ్వాన్స ముట్టినట్లు సమాచారం. ఆరోపణలు, అనుమానాలు లేకుండా పూర్తరుున కొనుగోళ్ల పై ఇటు అధికారుల దృష్టి కూడా పడలేదు. రైతులు నోట్ల గొడవలో అంతా తమకు మంచే జరిగిందని సంతోషం వ్యక్తం చేసినా మళ్లీ డబ్బులు పొందేందుకు మాత్రం బ్యాంకుల చుట్టూ తిరిగే ఇబ్బంది తప్పడం లేదు. -
రైస్ మిల్లుపై అధికారుల దాడి
త్రిపురారం మండల కేంద్రంలోని లక్ష్మి ట్రెడర్స్ రైస్ మిల్లులో జిల్లా పౌర సరఫరాల, రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. మండల కేంద్రంలోని బాబుసాయిపేట రోడ్డు సమీపంలో ఉన్న శ్రీనివాస మోడరన్ రైస్ మిల్లులో పొట్టుముత్తు నర్సింహ అనే వ్యా పారి లక్ష్మి ట్రెడర్స్ రైస్ మిల్లు పేరుతో రేషన్ బి య్యాన్ని కొనుగోలు చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం, నూకలు నిల్వ ఉన్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు దానిపై దాడి చేసి అక్రమం గా నిల్వ చేసిన 216 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 80 క్వింటాళ్ల నూకలు పట్టుకున్నారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 105 బస్తాల ధాన్యాన్ని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న 216 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 80 క్వింటాళ్ల నూకలు, తుంగపాడులోని వంశీసాయి రైస్ మిల్లు యజమానికి అప్పగించారు. నర్సింహపైకేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో పౌరసరఫరాల శాఖ ఏఎస్ఓ శేషన్న, తహసీల్దార్ ఆనంద్‌కుమార్, డీటీసీఎస్ రంగారావు, లక్ష్మణ్‌బాబు, ఎస్ఐ యాలాద్రి, ఆర్ఐ దీపక్ కుమార్, వీఆర్వోలు పల్లె శ్రీనివాస్, శంకర్, ప్రశాంత్, నాగయ్య, వీఆర్ఏ శ్రీనివాస్ పాల్గొన్నారు. పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసినా, అమ్మినా కేసు : డీఎస్ఓ ఉదయ్‌కుమార్ ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా అయ్యే బియ్యాన్ని కొనుగోలు చేసినా, అమ్మినా కేసులు నమోదు చేస్తామని డీఎస్ఓ ఉదయ్ కుమార్ హెచ్చరించారు. పౌర సరఫరాల అధికారులు లక్ష్మి ట్రెడర్స్ రైస్ మిల్లుపై దాడులు నిర్వహించి పట్టుకున్న బియ్యాన్ని ఆయన మంగళవా రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎస్‌టీడీఎస్ 2016 యాక్టు ప్రకారం రేషన్ బియ్యాన్ని విక్రయిస్తే కార్డును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ మూడుసార్లు పట్టుబడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోట సంపత్‌కుమార్!
పోటీలో ఎవరూ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం న్యూశాయంపేట : జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోట సంపత్‌కుమార్ మూడోసారి ఎన్నికవనున్నారు. ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శిగా ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, కోశాధికారిగా దుబ్బ రమేష్ ఎన్నికయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఎన్నిక లాంఛనం కానుంది. కాగా, సోమవారం తోట సంపత్‌కుమార్ ప్యానల్ హంటర్‌రోడ్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించింది. నామినేషన్ల స్వీకరణకు సోమవారం 4 గంటల వరకు అవకాశం ఉండగా, మూడు పదవులకు ముగ్గురు అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న తోట సంపత్‌కుమార్ పేరును బుద్ధా ప్రభాకర్‌రావు, తోట సాంబయ్య ప్రతిపాదించారు. ప్రధాన కార్యదర్శిగా పోటీచేస్తున్న ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు పేరును చిదురాల వేణుగోపాల్, ఎర్రబెల్లి రాంగోపాల్‌రావు ప్రతిపాదించారు. కోశాధికారిగా పోటీ చేసిన దుబ్బ రమేష్ పేరును టి.యుగంధర్, కృష్ణమూర్తి ప్రతిపాదించారు. అసోసియేషన్ ఎన్నికల కోసం గత నెల 27న నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ నెల 2,3 తేదీల్లో నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణకు గత బుధవారంతో గడువు ముగిసింది. ఈనెల 8న ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ పోటీలో ఎవరూ లేకపోవడంతో తోట సంపత్‌కుమార్ ప్యానల్‌ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బుధవారం(ఈనెల 5న) అధికారికంగా ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారి ఆర్.రాజగోపాల్రావు తెలిపారు. మిగతా గవర్నింగ్ బాడీ పదవులకు ప్రాంతాలవారీగా నామినేటెడ్ పద్ధతిలో ఎన్నిక జరుగుతుందన్నారు. రైస్‌మిల్లర్ల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటా : సంపత్ రైస్ మిల్లర్ల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని తోట సంపత్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ ఇండస్ట్రీ అభివృద్ధికి తన శాయశక్తులా కృషిచేస్తానన్నారు. అందరి సహకారంతో అసోసియేషన్‌ను ప్రగతి పథంలో నడిపిస్తానన్నారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ది వెంకట్‌నారాయణగౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు దేవునూరి అంజయ్య, గోనె రవీందర్, మాధవ శంకర్ ప్రభాకర్, తోట చంద్రయ్య, ఇరుకుల్ల రమేష్ పాల్గొన్నారు. డబ్ల్యూజీఎల్ 401 : నామినేషన్లు పత్రాలు అందజేస్తున్న తోట సంపత్‌కుమార్, తదితరులు -
30 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
సుల్తానాబాద్ : పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా రైస్ మిల్లుకు తరలిస్తున్నారని వచ్చిన పక్కా సమాచారంతో సుల్తానాబాద్ పోలీసులు గురువారం తెల్లవారు జామున ఓ లారీని వెంబడించారు. కరీంనగర్‌కు వచ్చిన లారీ రైస్ మిల్లులు బియ్యం అన్లోడ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఎస్సై జీవన్ తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్, పెద్దపల్లి మండలాల సరిహద్దుల్లో ఉన్న దేవునిపల్లి, నిట్టూరు నుంచి లారీలో పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు అనుమానం వచ్చిన లారీని వెంబడించారు. అది కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో ఉన్న శ్రీమన్నారాయణ అలియాస్ రామలింగేశ్వర ఎంఆర్ఎం రైస్‌మిల్‌కు చేరుకుంది. అక్కడ బియ్యం అన్లోడ్ చేస్తుండగా తనిఖీ చేశారు. అందులో ఉన్నవి రేషన్ బియ్యమే అని తేలడంతో లారీలో ఉన్న మోటం దుర్గయ్య, వారణాసి వీరస్వామి, కుమార్‌ను విచారణ చేశారు. రేషన్ బియ్యం తెచ్చినట్లు వారు అంగీకరించారు. దీంతో రైస్‌మిల్లును కూడా తనిఖీ చేశారు. లారీతోపాటు, మిల్లులో ఉన్న 30 టన్నుల బియ్యం ఉన్నట్లు గుర్తించి సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. సివిల్సప్లై ఏజీపీవో కాశీవిశ్వనాథం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పరిశీలన చేపట్టింది. బృందంలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం డీటీసీఎస్‌లు కిష్టయ్య, అంజయ్య, శ్రీనివాస్, మల్లికార్జున్‌రెడ్డి, ఎఫ్ఐలు తిరుపతి, వరప్రసాద్, రమేశ్ ఉన్నారు. మెుత్తం 300 క్వింటాళ్లపైనే ఉన్నట్టు నిర్ధారించారు. ఈమేరకు నివేదికను కలెక్టర్‌కు అందిస్తామని తెలిపారు. దుర్గయ్య, వీరస్వామి, కుమారును పోలీసులు ఠాణాకు తరలించారు. -
రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం
రూ.6 లక్షల వరకు నష్టం కొరుటూరు (ఇందుకూరుపేట): షార్ట్ సర్క్యూట్ కారణంగా రైస్‌మిల్లులో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కొరుటూరులో ఉన్న ఆంజనేయస్వామి రైస్‌మిల్లు గోడౌన్లో ధాన్యాన్ని నిల్వ చేసి ఉన్నారు. గోడౌన్ గురువారం నుంచి పొగలు రావడంతో పని చేస్తున్న కూలీలు గమనించారు. తలుపులు తీసి చూసే సరికి మంటలు చెలరేగుతున్నాయి. వెంటనే చుట్టుపక్కల వాళ్లు మంటలు ఆర్పేందకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు ఎగబాకి సుమారు 800 బస్తాల ధాన్యం కాలిపోయింది. రూ.6 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైస్‌మిల్లు యజమాని ఆంజనేయలు తెలిపారు. -
రూ.15 కోట్ల విలువైన రేషన్ బియ్యం పట్టివేత
బిక్కవోలు: కాపవరం శివారు రైస్‌మిల్లులో జరిగిన విజిలెన్స్ దాడుల్లో సుమారు రూ.15 కోట్ల,73 లక్షల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్టు విజిలెన్స్ ఎస్పీ టి.రాంప్రసాదరావు శనివారం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బి.ప్రత్తిపాడు నుంచి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న మినీ వ్యాన్‌ను వెంబడించగా ఆ వ్యాన్ అదే మండలంలోని కాపవరం పంచాయతీ పరిధిలోని శ్రీరాజరాజేశ్వరి రైస్‌మిల్లుకు తరలించినట్టు గుర్తించామన్నారు. ఈ మేరకు మిల్లు యాజమాన్యాన్ని విచారించగా కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధించి ప్రభుత్వానికి సరఫరా చేయవలసిన బియ్యానికి బదులుగా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. మిల్లు యాజమాన్యం ఇంకా 12 వందల క్వింటాళ్ళ బియ్యాన్ని సివిల్ సప్లైస్‌కు సరఫరా చేయాల్సి ఉందని విజిలెన్స్ ఎస్పీ రాంప్రసాద్ తెలిపారు. తదుపరి తనిఖీలలో అనపర్తి మండలం దుప్పలపూడిలో వీరికి సంబంధించిన గోడౌన్లో, శ్రీధనలక్ష్మీ రైస్‌మిల్లుల్లో వారి సొంత ధాన్యంతోపాటు కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధించిన ప్రభుత్వ ధాన్యం కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు నిర్వహించిన ఈ దాడుల్లో రూ.15.72 కోట్ల విలువైన ధాన్యం, రేషన్ బియ్యంతోపాటు వాహనాలు, రైస్‌మిల్లు, గోడౌన్లు తదితరు ఆస్తులను సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ మేరకు వ్యాన్ డ్రైవర్ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించనున్నట్లు ఎస్పీ రాంప్రసాద్ తెలిపారు. -
రైస్‌మిల్లులో టాస్క్‌ఫోర్స్‌దాడులు
మిర్యాలగూడ అర్బన్: రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అధికారుల బృదం మిర్యాలగూడలోని ఓ రైస్ మిల్లుపై శుక్రవారం ఆకస్మిక దాడులు చేసింది. అక్రమంగా నిల్వ చేసిన ధాన్యం బస్తాలను సీజ్ చేసింది. టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యాద్గార్పల్లి రోడ్డులో ఉన్న శ్రీ సాయి పవన్ రైస్‌మిల్లులో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విశ్వసనీయ సమచారంతో దాడులు నిర్వహించినట్లు రాష్ట్ర సివిల్ సప్లయ్ టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక అధికారులు జి.విద్యాసాగర్‌రెడ్డి, బి.రాజేషం తెలిపారు. శ్రీ సాయి పవన్ రైస్‌మిల్లుకు సీఎంఆర్ మిల్లింగ్ చేసి ఇచ్చేందుకు ప్రభుత్వం 40 కేజీల బస్తాలను 6 వేలు ఇచ్చిందన్నారు. కానీ ఆ బస్తాల లెక్కలను చూపకుండా బియ్యాన్ని బయటి మార్కెట్లో అమ్ముకున్నట్లు దాడుల్లో నిర్ధారించినట్లు తెలిపారు. ఏప్రిల్ 5, 2016 నుంచి ఆగస్టు 8వరకు రికార్డులు చూపిన రైస్‌మిల్లు యాజమాన్యం కస్టమ్స్ మిల్లింగ్ బియ్యం సంబంధించిన రికార్డులను ఏప్రిల్ 28వ తేది నుంచి నేటి వరకు ఎలాంటి రికార్డులు నమోదు చేయలేదని చెప్పారు. దీంతో సుమారు రూ.40 లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వానికి 6205.95 క్వింటాళ్ల సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సి ఉండగా.. 4590 క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వం అందించిన ధాన్యం నిల్వలు చూపకపోవడంతో మిల్లు యాజమాన్యం అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయిందన్నారు. 20 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని అక్రమంగా దాచి ఉంచినట్లు గుర్తించిన టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆ ధాన్యం మొత్తాన్ని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిబంధనల ప్రకారం బియ్యం సరఫరా చేయని ఈ మిల్లుపై ప్రభుత్వానికి నివేధికను పంపించి అనంతరం యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీజ్ చేసిన ధాన్యం బస్తాలకు పంచనామా నిర్వహించి, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో సివిల్ సప్లై నల్లగొండ, పెద్దవూర, డిప్యూటీ తహసీల్దార్లు సంగమిత్ర, లక్ష్మణ్, పీఆర్ఐ దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
రైస్ మిల్లుపై విజిలెన్సు దాడులు
రెండు ఆటోలు రూ. 24 లక్షల విలువైన బియ్యం, ధాన్యం సీజ్ కాపవరం (కోరుకొండ ) : మండలంలోని కాపవరంలోని సూర్య మహాలక్ష్మి మోడ్రన్ రైస్ మిల్లుపై విజిలెన్సు అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రూ. 24 లక్షల విలువ చేసే బియ్యం, ధాన్యం, రెండు ఆటోలు, రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని, 6ఏ కేసు నమోదు చేశారు. ఈ మిల్లుపై విజిలెన్సు దాడులు జరగడంతో కోరుకొండ మండలంలోని పలువురు తమ మిల్లులను, షాపులను మూసివేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ డీఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్, సీఐ ఎన్వీ భాస్కరరావు, విజిలెన్సు తహసీల్దార్ జి. గోపాలరావు, రాజమహేంద్రవరం ఏఎస్ఓ ప్రసాద్, ఎంఎస్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజేంద్రకుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఈ దాడిలో రెండు ఆటోలతో పాటు 650 కేజీల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామన్నారు. మిల్లులో ఉన్న 33 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నట్టు తెలిపారు. ఎటువంటి బిల్లులూ లేని 1640 క్వింటాళ్ల ధాన్యం, 31 క్వింటాళ్ల పీఎల్ బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు . -
రైస్‌మిల్లులో వ్యక్తి ఆత్మహత్య
దుగ్గొండి మండలం మధిరలోని ఓ రైస్‌మిల్లులో రాజు(30) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ దొంగతనం కేసులో రైస్‌మిల్లు యాజమాని వేధింపులవల్లే రాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చట్టం.. బాబు చుట్టమా?
కలెక్టరేట్ ఎదుట రైస్‌మిల్లు కార్మికుల ధర్నా నెల్లూరు(పొగతోట): కార్మికుల చట్టాలు అమలు చేయడంలో చట్టం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చుట్టంలా మారిందని సీఐటీయూ నాయకులు అజయ్‌కుమార్, మాదాల వెంకటేశ్వర్లు అన్నారు. రైస్ మిల్లుల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదు ట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో జా ప్యం జరగడంతో ఈనెల 16 నుంచి సమ్మె చేస్తున్నామన్నారు. కార్మికులకు కేటాయించిన అగ్గిపెట్టె ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా కట్ చేశారన్నారు. కార్మికులకు దినసరి వేతనం రూ.315 ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించినా అమలు కావ డం లేదన్నారు. వేతనాలు, కూలీరేట్లు 50 శాతం పెంచాలని, మహిళా కార్మికులకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం జేసీ ఏఎండీ ఇంతియాజ్‌కు వినతి పత్రం సమర్పించారు. సీఐటీయూ నాయకులు కత్తి శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా రైస్ మిల్లు వర్కర్స్ యూనియన్ నాయకులు ఆంజనేయులు,రఫీ పాల్గొన్నారు. -
రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం: భారీగా ఆస్తి నష్టం
నెల్లూరు : నెల్లూరు జిల్లా కోవూరు శాంతినగర్‌లోని ఓ రైస్‌మిల్లులో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లులోని ధాన్యం, యంత్ర పరికరాలు దగ్ధమవుతున్నాయి. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో భద్రత సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... మంటలార్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ. 70 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని రైస్ మిల్లు యాజమానులు వెల్లడించారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రైస్ మిల్లు వద్దకు చేరుకుని... భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. -
రియల్ దందా !
► అచ్చంపేటలో అక్రమ లేవుట్లు ► అనుమతులు లేకుండానే 300 ఎకరాల్లో వెంచర్లు ► రూ.30లక్షల ప్రభుత్వ ఆదాయానికి గండి అచ్చంపేట : రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ లేవుట్లతో దందా సాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వెంచర్లు వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రావల్సిన 10శాతం ఆదాయం రాకపోగా, గ్రామపంచాయతీకి కేటాయించాల్సిన 10శాతం స్థలం కూడా వారు ఇవ్వడంలేదు. వెంచర్ల గురించి భారీగా ప్రచారం చేస్తుండటంతో ప్రజలు మోసపోయి వాటిని కొనుగోలు చేస్తున్నారు. రియల్ వ్యాపారులకు రాజకీయనాయకులతో సంబంధాలు ఉండటంతో అధికారులు వీరిపై చర్య తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. అచ్చంపేట- నాగర్‌కర్నూల్ ప్రధాన రోడ్డులోని పోలిశెట్టిపల్లి శివారులో 56/ఈ సర్వేనం.లో రియల్ వ్యాపారులు లేవుట్లు అనమతులు లేకుండానే ప్లాట్లుగా మార్చి వ్యాపారం సాగిస్తున్నారు. పట్టణానికి అనుచరించి ఉన్న పొలిశెట్టిపల్లి గ్రామ పంచాయతీకి వస్తుండటంతో నగరపంచాయతీ వారు జోక్యం చేసుకోవడం లేదు. సాయినగర్ కాలనీలో రైస్‌మిల్లు వద్ద వ్యాపార సమూదాయం, గజావానికుంట, దాని వెనకభాగంలో ఇటీవల వెంచర్లు వెలిచాయి. నిబంధనల ప్రకారం లేవుట్లు లేకపోయినా అనుమతులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇవీ నిబంధనలు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని కమర్షియల్ భూమిగా మార్చేందుకు తప్పనిసరిగా లేవుట్ చేయించాలి. మొదట లేవుట్ కోసం ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం రికార్డులను గ్రామపంచాయతీకి అప్పగించాలి. రెండున్నర ఎకరాలకు జిల్లా స్థాయి, ఐదు ఎకరాలలోపు రీజియన్‌స్థాయి, ఆపై దాటితే రాష్ట్రస్థాయి టౌన్ ప్లానింగ్ అధికారుల సర్వే చేస్తారు. దరఖాస్తుదారులు 10శాతం భూమిని ప్రజాప్రయోజనాల కోసం ఖాళీగా వదలాలి. వ్యవసాయ భూమిని కమర్షియల్ భూమిగా మార్చేందుకు మార్కెట్ విలువ ప్రకారం (రిజిస్టేషన్ లెక్కప్రకారం) ఎకరా లక్ష ఉంటే అందులో రూ.10వేల ఫీజు చెల్లించిన తర్వాత లేవుట్ మంజూరు ఇస్తారు. 30ఎకరాలు.. రూ.30లక్షలు గండి లేఅవుట్లు తీసుకోని కారణాంగా నియోజకవర్గంలోని 300 ఎకరాల్లో పంచాయతీలకు దక్కాల్సిన 30 ఎకరాల భూమిని రియల్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి అందాల్సిన 10శాతం డబ్బు సుమారు రూ.30లక్షల ఆదాయం అందలేదు. అక్రమ లే అవుట్ల గురించి అధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. ఎక్కడా వారికి నోటీసులు ఇచ్చిన దాఖ లాలు లేవు. ఎక్కడెక్కడ చేశారంటే... అచ్చంపేట 2013లో నగరపంచాయతీగా మారింది. పాత తేదీల్లో సర్పంచు సంతకాలతో లేవుట్ అనుతమలు చూయించి అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం టౌన్‌ప్లానింగ్ అనుమతితో కార్యదర్శి సంతకం ఉంటేనే లేవుట్ చెల్లుతుంది. పట్టణంలో సుమారు 100ఎకరాల్లో అనుమతులు లే కుండా 20కిపైగా వెంచర్లు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లి, అచ్చంపేట మండలం పులిజాల, నడింపల్లి, హాజీపూర్, చౌటపల్లిరోడ్డు, సింగారం, బ్రహ్మణపల్లి, ఉప్పునుంతల మండలం వెల్టూర్, లత్తీపూర్లో మరో 200ఎకరాల్లో వెంచర్లు చేశారు. వీటికి పంచాయతీల అనుమతులు లేవు. -
రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు
బిట్రగుంట: బోగోలు మండలం చెంచులక్ష్మీపురంలోని శ్రీవెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్‌పై విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ముందస్తు సమాచారంతో దాడి తనిఖీ చేశారు. రైస్‌మిల్లులో 38 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రైస్‌మిల్లు యజమానిపై 6ఏ కింద కేసు నమోదు చేశారు. మిల్లు రికార్డులు పరిశీలించగా అవకతకవలను గుర్తించారు. కొనుగోలు కేంద్రం ద్వారా మిల్లుకు తరలించిన ధాన్యానికి రికార్డులు లేకపోవం, పరిమితికి మించి ధాన్యాన్ని నిల్వ ఉంచడాన్ని గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. రికార్డులు స్వాధీనం చేసుకుని సమగ్రంగా పరిశీలిస్తున్నారు. దాడుల్లో ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ధనుంజయరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఎనిమిది నెలల్లో రెండోసారి శ్రీవెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్‌పై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. రేషన్ డీలర్ల నుంచి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికే విక్రయించడం, దళారుల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రూ.లక్షలు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. గతేడాది సెప్టెంబర్ 21న విజిలెన్స్ అధికారులు మిల్లుపై దాడి చేసి రూ.10 లక్షలు విలువైన 659 క్వింటాళ్ల ధాన్యానికి రికార్డులు లేనట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని 6ఏ కింద కేసులు నమోదు చేశారు. తాజాగా మరో మారు దాడులు నిర్వహించి రేషన్ బియ్యంతో పాటు రికార్డులు లేని ధాన్యాన్ని గుర్తించారు. -
బియ్యం మాయా జాలం
► రేషన్ బియ్యానికి పాలిష్ సన్నాల పేరుతో మార్కెట్లోకి ► సీఎంఆర్ బియ్యం కూడా రేషన్వే తమిళనాడు రేషన్ ► బియ్యానికి సోకులు కర్ణాటక, తమిళనాడు,ఆంధ్రలో విక్రయాలు రేషన్ బియ్యానికి సోకులు చేసి సన్నాలు పేరుతో మార్కెట్లో అమ్మేస్తున్నారు. విషయం తెలియని జనం వ్యాపారులపై నమ్మకంతో కొనుగోలు చేసి మోసపోతున్నారు. బియ్యం మాయాజాలంలో కొందరు మిల్లర్లు, మరి కొందరు రేషన్ డీలర్ల పాత్ర ఉందని అధికారులు చెబుతున్నారు. వెంకటాచలం మండల పరిధిలో ఆదివారం పట్టుబడిన బియ్యం ఈ కోవకు చెందినవేనని తెలిసింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలోని బాయిల్డ్ రైస్‌మిల్లుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదివారం దాడి చేసి సుమారు రూ.కోటి విలువచేసే బియ్యాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. దాడుల్లో పట్టుబడిన బియ్యంలో తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన రేషన్ బియ్యం ఉండటం గమనార్హం. తమిళనాడులో ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని జిల్లాకు చెందిన మిల్లర్లు కొందరు కొనుగోలు చేసుకుంటున్నారు. అక్కడి డీలర్ల నుంచి కిలో రూ.5 నుంచి రూ.7 మధ్యలో కొనుగోలు చేసి జిల్లాకు తీసుకొస్తున్నారు. మరి కొందరు రేషన్ లబ్ధిదారులు సైతం బియ్యాన్ని డీలర్‌కే ఇచ్చి డబ్బులు తీసుకెళ్తున్నట్లు సమాచారం. అదేవిధంగా జిల్లాలోనూ రేషన్ బియ్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా లక్షకుపైగా బోగస్ కార్డులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటికి కేటాయించిన బియ్యాన్ని డీలర్లు మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. మరి కొందరు లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని డీలర్లకే అప్పగించి కిలో రూ.7 చొప్పున తీసుకుంటున్నారు. రేషన్ డీలర్లు అదే బియ్యాన్ని మిల్లర్లకు కిలో రూ.12 నుంచి రూ.15 మధ్యలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ బియ్యానికి సన్నబియ్యంగా పాలిష్ తమిళనాడు, మన రాష్ట్రంలో రేషన్ డీలర్ల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని మిల్లర్లు పాలిష్ చేస్తున్నారు. ఒకటి రెండు పర్యాయాలు పాలిష్‌చేసి సన్నబియ్యంగా సోకులు అద్దుతారు. ఆ బియ్యాన్ని కొత్త సంచుల్లో నింపి నెల్లూరు సోనా పేరుతో మార్కెట్లో కిలో రూ.30కి విక్రయిస్తున్నారు. అదే బియ్యాన్ని తిరిగి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు లారీల ద్వారా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. సీఎంఆర్ కింద ఇచ్చే బియ్యం కూడా రేషన్వేనని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం 100కుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వ 1.25 లక్షల మెట్రికుటన్నుల ధాన్యాన్ని సేకరించింది. అలా సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించి నిల్వచేశారు. మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని బియ్యంగా చేసి (సీఎంఆర్) ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది. ధాన్యాన్ని బియ్యంగా మార్చి గత ఏడాది నవంబర్ నెలలోపు ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంది. అందులో 79 వేల మెట్రికుటన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పారు. అయితే ఆ బియ్యం ఎక్కువశాతం రేషన్ బియ్యమేనని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంకటాచలంలో తాజాగా పట్టుబడ్డ బియ్యమే ఇందకు నిదర్శనమని విజిలెన్స్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. రేషన్ బియ్యాన్ని పాలిష్‌చేసి సన్నాల రూపంలో విక్రయిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవటంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖలో విజిలెన్స్ విచారణ నెల్లూరు(అగ్రికల్చర్) : వ్యవసాయ శాఖలో విజిలెన్స్ అధికారులు భూసార పరీక్షల ల్యాబ్‌లో చోటుచేసుకున్న అంశాలపై సోమవారం విచారణ చేపట్టినట్లు సమాచారం. నగరంలోని మినీబైపాస్ రోడ్డులో ఉన్న జేడీఏ కార్యలయంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేయడంతో ఒక్కసారిగా ఆ శాఖలో కలకలం రేగింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీన మహిళా ఏఓను ఏడీఏ గయాజ్ అహ్మద్ లైంగికంగా వేధిస్తున్నాడని ఆశాఖ జేడీఏకు ఫిర్యాదు చేసింది. అనంతరం కలెక్టర్ జానకి, ఎస్పీకి బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఏడీఏపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ, లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఏడీఏ కీచకపర్వంపై సాక్షిలో వరుస కథనాలు ప్రచురించడంతో స్పందించిన కలెక్టర్ ఏడీఏను ఆశాఖ కమిషనరేట్‌కు మార్చి 17వతేదీన సరెండర్ చేశారు. భూసార పరీక్షల కేంద్రం ఏడీఏగా బాధ్యతలు తప్పించిన విషయం విదితమే. అట్రాసిటీ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి తోడు విజిలెన్స్ అధికారులు ల్యాబ్‌లో విచారణ చేపట్టం చర్చనీయాంశంగా మారింది. -
రేషన్ బియ్యం పట్టివేత
► అక్రమంగా తరలిస్తున్న 126 బస్తాల బియ్యం స్వాధీనం ఎమ్మిగనూరురూరల్: ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను ఆదివారం సాయంత్రం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఏపీ 21 టీయూ 2619, ఏపీ 21 టీఎక్స్ 2149 నంబర్ గల రెండు బొలెరో జీపులను పట్టణంలోని అన్నమయ్య సర్కిల్ దగ్గర విజిలెన్స్ కానిస్టేబుల్ మధు తనిఖీ చేశారు. వాటిలో 126 బస్తాలలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా వాటిని తరలిస్తుండడంతో జిల్లా విజిలెన్స్ అధికారులకు కానిస్టేబుల్ సమాచారం అందించారు. వెంటనే కర్నూలు నుంచి విజిలెన్స్ సీఐ శ్రీనివాసరెడ్డి, స్పెషల్ తహసీల్దార్ రామకృష్ణ ఆదోనికి చేరుకున్నారు. వారు మాట్లాడుతూ ఆదోని నుంచి పట్టణంలో ముగతి రోడ్డులో ఉండే లక్ష్మీనరసింహ స్వామి రైస్ మిల్లుకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు చెప్పారు. పట్టుకున్న బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించామని తెలిపారు. ఈ బియ్యం ఏ రేషన్ షాప్ నుంచి వచ్చాయి.. ఎన్ని రోజులుగా ఈ తతంగం సాగుతోంది అనే విషయంపై విచారణ చేపట్టినట్లు చెప్పారు. విజిలెన్స్ అధికారులతో పాటు సీఎస్‌డీటీ మల్లేష్, వీఆర్వో స్నేహలత, కానిస్టేబుల్ శేఖర్ తదితరులు ఉన్నారు. -
కిలాడీ మహిళ..
మహిళతో పాటు మరో ముగ్గురు అరెస్ట్ రూ.50 లక్షలు విలువ చేసే 1761 గ్రాముల బంగారు స్వాధీనం బంగారు బిస్కెట్లు ఇస్తానని రైస్ మిల్లు యజమానికి రూ.2.36 కోట్ల టోకరా ప్రొద్దుటూరు క్రైం: గల్ఫ్ దేశం నుంచి బంగారు బిస్కట్లను తెప్పించి మార్కెట్ ధర కంటే రూ. 20 వేలకు తక్కువకు ఇస్తానని ఓ కిలాడీ మహిళ రైస్ మిల్లు ఓనర్‌ను మోసం చేసింది. ఆమె మాటలను నమ్మి రూ. 2.36 కోట్ల మేర బంగారు, డబ్బు ఇచ్చిన రైస్ మిల్లు యజమాని మోసపోయాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచారు. బుధవారం సాయంత్రం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ పీవీజీ విజయ్‌కుమార్ వివరాలను వెల్లడించారు. స్థానిక నడింపల్లెకు చెందిన విజయ 9వ తరగతి వరకు చదువుకుంది. పెళ్లైన తర్వాత కొన్నేళ్లకే భర్తను వదిలేసింది. తర్వాత కొందరి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకొని విలాస వంతమైన జీవితాన్ని గడిపేది. ఈ క్రమంలోనే ఆమె 2008లో కువైట్‌కు వెళ్లింది. ఇలా రెండు, మూడు సార్లు వెళ్లొచ్చింది. 2013లో ఇండియాకు వచ్చిన ఆమె ఇక తిరిగి కువైట్‌కు వెళ్లలేదు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆమె డబ్బు కోసం చాపాడు మండలం, చిన్నగురవలూరుకు చెందిన చంద్రఓబుళరెడ్డితో పరిచయం ఏర్పరచుకుంది. అతని ద్వారా పట్టణంలోని రైస్‌మిల్లు యజమాని కొండయ్యను పరిచయం చేసుకుంది. బంగారు బిస్కెట్లను తక్కువ రేటుకు ఇస్తానని.. కువైట్ నుంచి బంగారు బిస్కెట్లను తెప్పించి ఇక్కడి మార్కెట్ రేటు కంటే బిస్కెట్‌ను రూ.20 వేలు తక్కువకు ఇస్తానని ఆమె కొండయ్యతో చెప్పింది. దీంతో ఆశ పడిన కొండయ్య ఆమెకు డబ్బు ఇవ్వడం ప్రారంభించాడు. అయితే ఆమె స్థానికంగానే బంగారు వ్యాపారుల వద్ద స్వచ్ఛత కలిగిన బంగారు బిస్కెట్లు కొని కొండయ్యకు ఇస్తూ వచ్చింది. దీంతో అతను విజయను పూర్తిగా నమ్మాడు. ఆ నమ్మకంతోనే కొండయ్య ఆమె అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాడు. తనకు బంగారు ఆభరణాలు ఇస్తే వాటికి బదులుగా అంతే తూకం గల 9999 ముద్రగల 24 క్యారెట్ల బంగారం బిస్కెట్లు ఇస్తానని ఆమె నమ్మబలికింది. అయితే ఆభరణాల బదులు బిస్కెట్లు తీసుకుంటే లక్షల్లో లాభం గడించవచ్చని అతను ఆశపడ్డాడు. దీంతో కొండయ్య కొన్ని రోజుల క్రితం 3 కిలోల మేర బంగారు నగలను తనకు తెలిసిన వ్యాపారుల వద్ద కొని ఆమెకు ఇచ్చాడు. ఇలా అతని వద్ద తీసుకున్న బంగారు నగలను మణప్పురం ఫైనాన్స్, ఇండియా ఇన్ఫో లైన్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలలో తనఖా పెట్టి డబ్బు తీసుకుంది. ఆ డబ్బుతో అప్పుడప్పుడు ఆమె కొన్ని బంగారు బిస్కెట్లను అతనికి ఇస్తూ వచ్చింది. మిగతా బిస్కెట్ల గురించి అతను అడగగా ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారని, కువైట్ నుంచి తన మనుషులు ఇంకా రాలేదని ఇలా పలు కారణాలు చెప్పేది. అనేక సార్లు బిస్కెట్లు ఇవ్వకుండా సాకులు చెబుతుండటంతో అతనికి అనుమానం వచ్చింది. ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అతను విజయపై ఈ నెల 1న టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. డబ్బు, బంగారు నగల రూపంలో సుమారు రూ. 2.36 కోట్లు నష్టపోయానని కొండయ్య ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. కొండయ్య ఫిర్యాదుతో రూరల్ సీఐ ఓబులేసు, ఎస్ఐ మంజునాథరెడ్డిలు రంగంలోకి దిగారు. విజయకు ఎవరితో సంబంధాలు ఉన్నాయన్నదానిపై పోలీసులు కూపి లాగారు. ఈ క్రమంలోనే చిన్నగురువలూరుకు చెందిన చంద్ర ఓబుళరెడ్డితో ఆమెకు పరిచయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. విజయ ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న రెడ్డి బాష కూడా ఆమెకు సహకరిస్తుండేవాడు. ఇతనికి ఆమె నెల నెలా జీతం కూడా ఇస్తుండేది. ఆమెకు సమీప బంధువైన రవీంద్రారెడ్డి కూడా ఆమె వ్యవహారాల్లో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో ప్రధాన నిందితురాలు విజయతోపాటు ఆమె అనుచరులు చంద్ర ఓబుళరెడ్డి, ప్రొద్దుటూరుకు చరెందిన రెడ్డి బాషా, రవీంద్రారెడ్డిలను బుధవారం నడింపల్లెలోని ఆమె ఇంటి వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి రూ.50లక్షలు విలువ చేసే 1761 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలకపాత్ర పోషించిన సీఐ ఓబులేసు, ఎస్ఐ మంజునాథరెడ్డి, చాపాడు ఎస్ఐ శివశంకర్, సిబ్బందిని అడిషనల్ ఎస్పీ పీవీజీ విజయ్‌కుమార్ అభినందించారు. -
3 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం విక్రమపురం రైస్‌మిల్లుపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని భారీగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రైస్ మిల్లు యజమానిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైస్ మిల్లును సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం 3 క్వింటాళ్ల వరకు ఉంటాయని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. -
మిల్లింగ్ మాయ
► కస్టమ్ మిల్లింగ్ పేరిట సర్కారుకు టోకరా ► కరెంట్ లేని మిల్లుకు ధాన్యం కేటాయింపు ► మర ఆడించకుండానే అమ్ముకున్న యజమాని ► పీడీఎస్ బియ్యంరీసైక్లింగ్.. సీఎంఆర్‌గా అప్పగింత ► రూ.1.33 కోట్ల లాభార్జన ► ఫిర్యాదు అందినా మొక్కుబడిగా విచారణ ► రూ.50 లక్షలు చేతులు మారిన వైనం.. ముకరంపుర : జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) వ్యవహారంలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోతోంది. అదే వరుసలో తాజాగా మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. పౌరసరఫరాల శాఖ అధికారులు విద్యుత్ కనెక్షన్ లేని రైస్‌మిల్లుకు ధాన్యం అప్పగించారు. దీంతో సదరు మిల్లు నిర్వాహకుడు అంతే తెలివిగా వ్యవహరించాడు. సర్కారు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రరుుంచాడు. దొంగచాటుగా పీడీఎస్ బియ్యూన్నే తక్కువ ధరకు సేకరించి తిరిగి సీఎమ్మార్ కింద అప్పగించాడు. తద్వారా దాదాపు రూ.1.33 కోట్ల దాకా లాభపడ్డాడు. దీనిపై ఫిర్యాదులు అందగా ఇటీవల సదరు మిల్లులో సివిల్ సప్లై, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. బేరం కుదరడంతో మొక్కుబడిగా నివేదికలతో మమ అనిపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 17వేల క్వింటాళ్ల ధాన్యం అప్పగింత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం పౌరసరఫరాల శాఖ అధికారులు జగిత్యాల మండలం మందపల్లిలోని సురభి రైస్‌మిల్లుకు అప్పగించారు. 170 లారీలు అంటే 1700 క్వింటాళ్ల ధాన్యాన్ని గతేడాది నవంబర్‌లో కేటాయించారు. ధాన్యాన్ని మరపట్టించి కస్టమ్ మిల్లింగ్ రైస్‌గా ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంది. క్వింటాలు ధాన్యాన్ని మరపట్టించి 67 కిలోల బియ్యంగా ఇస్తే ప్రభుత్వం మిల్లింగ్ చార్జీ కింద రూ.30 చెల్లిస్తుంది. కానీ మిల్లు నిర్వాహకుడు సదరు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాలుకు రూ.1400, ఆపైన విక్రయించి రూ.2.46 కోట్లు సొమ్ము చేసుకున్నాడు. కేటాయించిన 170 లారీల ధాన్యాన్ని మరపట్టించి 113 లారీలు అంటే 13వేల క్వింటాళ్ల బియ్యూన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం రైస్‌మిల్లర్ పీడీఎస్ బియ్యంతోపాటు ఇతర మిల్లుల్లో ముక్కిపోయిన, రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని కిలో రూ.8 నుంచి రూ.10 చొప్పున రూ.1.13 కోట్లతో సేకరించి పౌరసరఫరాల సంస్థకు అప్పజెప్పడం విశేషం. మిల్లింగ్ చార్జీలు అదనంగా ప్రభుత్వం రూ.5లక్షలు చెల్లిస్తుంది. ఇలా మొత్తంగా రూ.1.18 కోట్ల కుంభకోణం జరిగింది. అందరి అండదండలతోనే... సురభి రైస్‌మిల్లుకు గత మూడేళ్లుగా సీజన్లలో రైతుల నుంచి ఐకేపీ సేకరించిన ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. అధికార నేతలు, రాష్ట్రస్థాయిలో ఓ ఉన్నతాధికారి, జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం ముఖ్య నాయకులు, జిల్లా పౌరసరఫరాల, విజిలెన్స్ అధికారుల అండదండలతో ఈ దందా సాగుతోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఆ మిల్లుకు కరెంట్ లేకున్నా... నవంబర్‌లో ధాన్యాన్ని కేటాయించారు. కరెంట్ లేకుండా, దాదాపుగా బంద్ అరుున మిల్లుకు ధాన్యాన్ని ఎలా కేటారుుంచారో అధికారులకే తెలియూలి. సాధారణంగా విచారణకు వెళ్లామంటున్న సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారులు జాయింట్ కలెక్టర్‌కు ఇచ్చిన నివేదిక చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. సురభి రైస్‌మిల్లుకు కరెంట్ లేకపోయినప్పటికీ వేరే మిల్లులో ధాన్యాన్ని మరపట్టించి సీఎంఆర్ అప్పగించారంటూ నివేదిక ఇచ్చారు. కానీ ఏ మిల్లుకు ధాన్యం కేటాయించారో అదే మిల్లులో మర ఆడించి సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర మిల్లులు తాము ఇవ్వాల్సిన సీఎమ్మార్నే ఇంత వరకు పూర్తిస్థారుులో అప్పగించలేదు. ఇక మరో మిల్లుకు కేటారుుంచిన ధాన్యాన్ని మరపట్టి ఇచ్చేంత సమయం ఎక్కడుందో అధికారులే చెప్పాలి. రైస్‌మిల్లర్ల సంఘం నేతతోపాటు అధికారులు అండదండలతోనే సదరు మిల్లుకు ధాన్యం కేటారుుంచినట్లు ఆరోపణలున్నారుు. అలాగే ఈ అక్రమ వ్యవహారంపై విచారణలో రూ.50 లక్షల దాకా చేతులు మారినట్లు తెలిసింది. చర్యలు తీసుకుంటాం : డీఎస్వో నాగేశ్వర్రావు సురభి రైస్‌మిల్లుకు కరెంట్ లేక మిల్లు నడవడం లేదనే ఫిర్యాదు మేరకు విచారణ చేసిన విషయం వాస్తవమే. సదరు మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని వేరే మిల్లులో మర ఆడించి సీఎమ్మార్ అప్పగించారని నివేదిక అందింది. అధికారులను తప్పుదోవ పట్టించినందుకు మిల్లు యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నాం. అనంతరం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. -
సీసీ టీవీ రికార్డర్ని కూడా ఎత్తుకుపోయారు..
మెదక్: మెదక్ జిల్లాలో దొంగలు తెలివి మిరిపోయారు. దొంగతనం చేయడంతో పాటు ఏకంగా సీసీ టీవీ రికార్డర్ని కూడా ఎత్తుకుపోయిన ఘటన పెద్దశంకరంపేట మండలం శివాయిపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక మల్లిఖార్జున రైస్‌మిల్‌లో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. నగదుతో పాటు సీసీ టీవీ కెమెరాలను, రికార్డర్ని ఎత్తుకుపోయారు. రైస్‌మిల్లు యజమాని సోమవారం రాత్రి తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం వచ్చి చూడగా షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. టేబుల్‌ను ధ్వంసం చేసిన దుండగులు, బీరువాలోని రూ.1.42 లక్షల నగదును ఎత్తుకుపోయారు. వెళ్తూవెళ్తూ సీసీ టీవీ కెమెరాలను, రికార్డర్ని ఎత్తుకుపోయారు. మిల్లు యజమాని ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
రైస్ మిల్ సీజ్
అక్రమంగా రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు 620 లీటర్ల కిరోసిన్‌తో పాటు భారీగా రేషన్ బియ్యం నిల్వలను గుర్తించి రైస్ మిల్లును సీజ్ చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలోని హనుమాన్ సాయి రైస్‌మిల్లులో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు భారీగా రేషన్ బియ్యం నిల్వలను గుర్తించారు. దీంతో రైస్ మిల్లును సీజ్ చేశారు. -
రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారుల దాడి
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోలని రైస్ మిల్లుపై మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా 26 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం రైస్ మిల్లు యజమానిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాల్సిన బియ్యం బస్తాలు సదరు మిల్లులో ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు ఆగంతకులు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. -
డ్రైవర్ మృతితో బంధువుల ఆందోళన
వేములపల్లి: ఓ రైస్ మిల్లు డ్రైవర్ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వేములపల్లి మండలం కనకమహాలక్ష్మి రైస్‌మిల్లులో దూదిమెట్ల సైదులు(28) రైస్‌మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వైద్యులు గుండెపోటుతో మృతిచెందాడని చెప్పారు. దీంతో అతని బంధువులు మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట ఆందోళనకు దిగి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. -
రైస్‌మిల్‌లో అగ్నిప్రమాదం
కరీంనగర్ : ప్రమాదవశాత్తు రైస్‌మిల్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామంలోని సాయి శ్రీలక్ష్మి రైస్‌మిల్‌లో నేటీ మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన రైస్‌మిల్ యజమాని అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సహా ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 ల క్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని వెల్లడించారు. పోలీసులు రైస్‌మిల్ వద్దకు చేరుకుని అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
‘కస్టం’మిల్లింగ్
మిర్యాలగూడ : ప్రభుత్వ బియ్యంతో వ్యాపారం చేసుకోవడం మిల్లర్లకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. రైతులనుంచి మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం కస్టం మిల్లింగ్ పేరుతో మిల్లర్ల పాలవుతోంది. గడువుల మీద గడువులు విధిస్తూ మిల్లర్ల నుంచి బియ్యం సేకరించడం, చివరికి కేసులు నమోదు చేయడం ప్రతి ఏటా సాగుతున్న తంతు. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు కనీసం 50 శాతం బియ్యం కూడా మిల్లర్లు ప్రభుత్వానికి అందజేయలేదు. కస్టమ్ మిల్లింగ్ బియ్యం తో మిల్లర్లు దర్జాగా వ్యాపారం సాగిస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో ప్రభుత్వం ఐకేపీ, సివిల్ సప్లయీస్, పీఏసీఎస్ కేం ద్రాల ద్వారా 4.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కాగా కస్టమ్ మిల్లింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 220 రైస్‌మిల్లులకు ధాన్యం ఇచ్చారు. మిల్లర్ల నుంచి 2.84 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 1.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. కాగా మిగతా బియ్యాన్ని సెప్టెంబర్‌లోగా మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది రెండు మిల్లులపై కేసులు గత ఏడాది కస్టమ్ మిల్లింగ్ బియ్యానికి సంబంధించి 5,800 మెట్రిక్ టన్నులు పది రైస్‌మిల్లుల నుంచి రావాల్సి ఉంది. దీంతో రెండు రైస్‌మిల్లుల్లో బియ్యం లేకపోవడంతో సివిల్‌సప్లయీస్ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది కస్టమ్ మిల్లింగ్ బియ్యం గడువులోగా సేకరించడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. గోదాముల కొరత మిల్లర్ల నుంచి ప్రభుత్వం తీసుకునే కస్టమ్ మిల్లింగ్ బియ్యానికి గోదాముల కొరత ఏర్పడింది. జిల్లాలోని బీబీనగర్‌లోని ప్రైవేటు గోదాములు, చిలుకమర్రి, మిర్యాలగూడలోని వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ గోదాములు లీజుకు తీసుకోవాలని ఇటీవల జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ సివిల్ సప్లయీస్ అధికారులను ఆదేశించారు. దీంతో మిల్లర్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లో కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో సేకరించాలని అధికార యంత్రాంగం కసరత్తు నిర్వహిస్తోంది. బియ్యం సేకరణపై దృష్టి కస్టమ్ మిల్లింగ్‌పై దృష్టి సారించాం. ప్రతిఏటా కూడా మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారు. దీంతో చివరికి కొన్ని రైస్ మిల్లులకు గడువు కూడా పెట్టాం. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరించడానికి చర్యలు చేపట్టాం. - వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ -
200 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు(కావలి): బియ్యం మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో తహశీల్దార్ సాంబశివరావు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు..స్థానిక కేవీఆర్ మిల్లుపై అధికారులు బుధవారం వేకువజామున తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 200 బస్తాల రేషన్ బియ్యం బస్తాలు బయటపడ్డాయి. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. -
రైస్ మిల్‌పై విజిలెన్స్ దాడి
- రూ.1.53 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం స్వాధీనం చినపాండ్రాక(బంటుమిల్లి): పెడన మండలం నందమూరు గ్రామానికి చెందిన ఓ వ్యాపారి తనవద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని రైస్‌మిల్లులో అమ్మేందుకు వెళుతున్నాడని విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు నిఘా ఉంచి, బియ్యం లోడుతో వెళుతున్న ఆటోను వెంబడించారు. ఆటో జయలక్ష్మి రైస్‌మిల్‌లోకి వెళ్లడంతో వారు కూడా లోనికి వెళ్లారు. మిల్లులోని సరుకులను తనిఖీ చేశారు. ఎఫ్‌సిఐకి వెళ్లే లారీల్లోని బియ్యం బస్తాలను అధికారులు కిందకు దింపించారు. మిల్లులో ధాన్యం, బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వాటితోపాటు ఆటోను అందులో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రైస్‌మిల్లు యజమాని జల్లేపల్లి రవికిషోర్, ఆటోలో రేషన్ బియ్యం తీసుకువచ్చిన వ్యాపారి, ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ధాన్యం, బియ్యం స్వాధీనం చేసుకున్నాం : విజిలెన్స్ డీఎస్పీ చినపాండ్రాక శ్రీ జయలక్ష్మి మోడరన్ రైస్‌మిల్లులో నిర్వహించిన దాడుల్లో అక్రమంగా ఉన్న సుమారు రూ.1.53కోట్లు విలువ చేసే ధాన్యం, బియ్యం స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. తనిఖీల అనంతరం విలేరులతో మాట్లాడుతూ మిల్లులో రేషన్ బియ్యం కొంటున్నారని అందిన ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. ఈ మేరకు ఆటోలో దాదాపు 20 బస్తాల్లో ఉన్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం, మిల్లులో ఉన్న దాదాపు 3800 క్వింటాళ్ల ధాన్యం తదితర సరుకులను స్వాధీనం చేసుకుని బందోబస్తు కోసం స్థానిక రైస్‌మిల్లు యజమానులకు అప్పగించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో నివేదిక అందజేస్తామన్నారు. అరెస్టయిన వారిని, ఆటోను పోలీస్‌స్టేషన్‌లో అప్పగిస్తామన్నారు. పథకం ప్రకారం దాడి చేశారు అధికారులు కావాలనే తమను అల్లరి చేయడానికి ఆటోలో బియ్యం తెచ్చి దాడులు చేశారని శ్రీ జయలక్ష్మి మోడరన్ రైస్‌మిల్లు యజమాని జిల్లేపల్లి రవికిషోర్ ఆరోపించారు. సుమారు ఉదయం 6.30గంటల సమయంలో లారీ కాటా వేసుకునేందుకు ఆటో వచ్చిందన్నారు. ఆటో వెనుక వచ్చిన విజిలెన్స్ పోలీసులు ఆటోలో ఉన్న బస్తాలను దించారన్నారు. ఏంటని అడిగితే సమాధానం చెప్పకుండా ఏంలేదని మా అధికారులు వచ్చి కేసు పరిష్కరిస్తారని చెప్పారన్నారు. తాము లెవీ బియ్యం ఆడుతుండగా రేషన్ బియ్యం కొనే వీలు లేదన్నారు. అధికారులు, కొంత మంది వ్యక్తులు కలసి తమని కేసులో ఇరికించడానికి పథకం వేశారని రవి ఆరోపించారు. ఈ ఆరోపణలను డీఎస్పీ పూర్ణచంద్రరావు ఖండించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వ్యాపారి అబద్ధం చెబుతున్నారని తెలిపారు. -
రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడి
సంగెం(వరంగల్): వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని వెంకటేశ్వర రైస్‌మిల్లుపై శుక్రవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. -
చౌకబియ్యం సీజ్
కల్వకుర్తి: కల్వకుర్తిలో రేషన్‌బియ్యం రీసైక్లింగ్ చేస్తున్న రైస్‌మిల్లులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేసి స్వాధీనం చేసుకున్న చౌకబియ్యాన్ని సీజ్‌చేశారు. బియ్యం విలువ రూ. 76.40లక్షలుగా నిర్ణయించారు. బుధవారం హైదరాబాద్ సిటీ-2 విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి సీజ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఏఎస్ఓ వనజాత, షాద్‌నగర్ ఎన్ఫోర్స్మెంట్ డీటీ రమాదేవి, భూత్పూర్ డీటీ కృష్ణ, కల్వకుర్తి డీటీ అజ ంఅలీ గణేష్ ట్రేడర్స్, రాధాకృష్ణ, రాజ్యలక్ష్మి, వాసవి మిల్లులో సీజ్చేసిన బియ్యం విలువ తేల్చారు. దీంతో ఆయా మిల్లుల్లో 1649 క్వింటాళ్ల బియ్యానికి రూ. 76.40లక్షలుగా విలువ లెక్కగట్టారు. వాసవి మిల్లులో 419 క్వింటాళ్లు, గణేష్ ట్రేడర్స్‌లో 82 క్వింటాళ్లకు రూ.1.60లక్షలు, రాధకృష్ణ మిల్లులో 895క్వింటాళ్లకు రూ.36,21,620, రాజ్యలక్ష్మి మిల్లులో 253 క్వింటాళ్లకు రూ.26,87,480గా లెక్కగట్టారు. ఈ బియ్యాన్ని ఇతర వ్యాపారులకు బాధ్యత అప్పగించారు. గతంలో పట్టణంలోని గణేష్ ట్రేడర్స్‌లో 220 క్వింటాళ్ల బియ్యం సీజ్‌చేసి ఓ వ్యాపారికి బాధ్యత అప్పగిస్తే మాయమయ్యాయి. తిరిగి అదే మిల్లులో 82 క్వింటాళ్ల రేషన్ బియ్యం ల భ్యమయ్యాయి. పాత బియ్యం 220 క్వింటాళ్లకు గురువారం రూ.2.20 లక్షల చలాన్ తీశారు. నాలుగు మిల్లుల్లో స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించామని ఏఎస్ఓ వ నజాత తెలిపారు. కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని చెప్పారు. -
రైస్ మిల్లులో అగ్నిప్రమాదం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లి గ్రామంలోని రైస్ మిల్లులో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. రైస్ మిల్లు సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సహ ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో మిల్లులోని ధాన్యం, గన్నీ బ్యాగులు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ. 50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 5 లక్షల రేషన్ బియ్యం స్వాధీనం
కీసర: నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా రీసైక్లింగ్ చేస్తున్న రైస్‌మిల్లుపై సోమవారం రాత్రి విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. సువూరు రూ.5 లక్షల విలువ చేసే బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ డీఎస్పీ శ్రీనివాస్, కీసర తహసీల్దార్ రవీందర్‌రెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం.. మండ లంలోని అహ్మద్‌గూడ ప్రధాన ర హదారి సమీపంలోని దత్తసాయి ైరె స్మిల్లు యాజమాన్యం నిరుపేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని దళారుల ద్వారా కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అధికారులకు సవూచారం అందింది. ఈ మేరకు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో అహ్మద్‌గూడ గ్రామంలోని దత్తసాయి రైస్‌మిల్లుపై దాడి చేసి సుమారు రూ. 5 లక్షల విలువైన రేషన్ బియ్యూన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం రైస్‌మిల్లులో రైతులు పండించిన ధా న్యం మాత్రమే ఉండాలన్నారు. ఒకవేళ ఆ బియ్యుం రైతులనుంచే కొనుగోలు చేసిందైతే సంబంధిత రశీదులుండాలన్నారు. ఇవేమీ లేకపోవడంతో రేషన్ బియ్యాన్ని అక్రవుంగా రీసైక్లింగ్ చేస్తున్నట్లు విచారణలో తెలిందన్నారు. ఈ మేరకు బియ్యాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా గతంలో కుడా ఈ రైస్‌మిల్లులో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ యూజవూన్యం పట్టుబడింది. అరుునా రైస్‌మిల్లులో అక్రమ దందా మాత్రం ఆగడం లేదని స్థానికులు వాపోతున్నారు. -
సూక్ష్మ సేద్యానికి రూ. 450 కోట్లు
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మోర్తాడ్ : వ్యవసాయానికి అండదండగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ సేద్యానికి రూ. 450 కోట్లు కేటాయించిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు సూక్ష్మ సేద్యానికి రూ. 150 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం పది జిల్లాలకు భారీగా నిధులను కేటాయించి రైతు ప్రభుత్వంగా పేరు సంపాదించిందన్నారు. శనివారం మోర్తాడ్ మండలం తాళ్లరాంపూర్‌లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన రైస్‌మిల్లు, గోదాంల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సూక్ష్మ సేద్యంతో సాగునీటి కొరతను అధిగమించవచ్చన్నారు. వరి మినహా ఇతర వాణిజ్య, ఆహార పంటలకు సూక్ష్మ సేద్యం మేలైందన్నారు. రైతుల కష్టాలను తీర్చడానికి మన సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. రైతులకు అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను సృష్టించడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు.సహకార సంఘాల ఆధ్వర్యంలో గిడ్డంగులను నిర్మించి రైతులు పండించిన పంటలను నిలువ చేసుకునే వసతులను కల్పించడానికి సహకార శాఖ అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తాను జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌గా ఉన్నప్పుడు తాళ్లరాంపూర్‌లో గిడ్డంగి నిర్మాణానికి భూమి పూజ చేయడానికి వచ్చానన్నారు. అప్పటి చైర్మన్ క్యాతం నర్సింలును వేదికపైకి పిలిపించిన మంత్రి పాత స్మృతులను గుర్తు చేసుకున్నారు. గ్రామస్తులు స్థలం కేటాయిస్తే కోల్డ్ స్టోరేజీని నిర్మించి రైతులు పండించిన పంటలను నిలువ చేసుకునే వీలు కల్పిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ..మారుమూల గ్రామంలోని ఒక చిన్న సహకార సంఘం రైస్‌మిల్లును నిర్మించి కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ఆసరా పింఛన్ గురించి అర్హులు ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పట్వారి గంగాధర్‌రావు, డెరైక్టర్ సోమచిన్న గంగారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు అమిత, ఎంపీపీ కల్లెడ చిన్నయ్య పాల్గొన్నారు. -
రైస్‌మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు
నెల్లూరు: నెల్లూరు జిల్లా సంగంలోని పద్మావతి రైస్‌మిల్లుపై శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మిల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.15 లక్షల విలువ చేసే బియ్యం బస్తాలను అధికారులు గుర్తించి ... సీజ్ చేశారు. అనంతరం మిల్లు యాజమాన్యంపై అధికారులు కేసు నమోదు చేశారు. మిల్లులో బియ్యం బస్తాలు అక్రమంగా నిల్వ ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు దాడులు నిర్వహించారు. -
జీరో.. మారో!
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో జీరోదందా జోరుగా సాగుతోంది. రైతులు పండించిన వరిధాన్యాన్ని మార్కెట్‌యార్డుకు రాకుండా నేరుగా రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. తద్వారా కొందరు వ్యాపారులు భారీగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. రైతులకు మాయమాటలు చెప్పి తూకం విషయంలో మోసం చేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా మార్కెటింగ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో మౌనం దాల్చుతున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో వరి 1,00,170 హెక్టార్లలో సాగుచేయగా.. ఇప్పుడిప్పుడే నూర్పిళ్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం వరి దాదా పు ఎనిమిది లక్షల టన్నుల దిగుబడి వ చ్చే అవకాశముంది. ధాన్యం ఇప్పుడిప్పు డే మార్కెట్లకు రావడం ఆరంభమైం ది. వరికి ప్రభుత్వం రూ.1310 మద్దతు ధర ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో 18 మార్కెట్‌యార్డులు ఉన్నా యి. ఇవే కాకుండా వరి కొనుగోళ్ల కోసం ప్రభుత్వం 72 చోట్ల ఐకేపీ, ఇతర చోట్ల పీ ఏసీఎస్, హాకా వంటి సంస్థలు కొనుగో లు చేసేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిపి కూడా ఇప్పటివరకు కేవలం 18వేల క్వింటాళ్లు మాత్ర మే కొనుగోలు చేశారు. అదే ప్రైవేట్ మి ల్లర్లు మాత్రం మార్కెట్‌తో సంబంధం లేకుండా రెండు లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీన్నిబట్టి జి ల్లాలో ఏమేర వరిధాన్యం పక్కదారిపడుతుందో అర్థమవుతుంది. ధాన్యం మార్కె ట్ పరిసరాల్లోకి రాకపోవడంతో మార్కె ట్ కేంద్రంగా పనిచేస్తున్న హమాలీలు, ద డవాయిలు ఉపాధి కోల్పోతున్నారు. జిల్లాలోని 18 మార్కెట్ యార్డుల్లో కలిసి 1914 మంది హమాలీలు పనిచేస్తున్నారు. రైతులకు టోకరా జిల్లాలో మొత్తం 236 రైస్ మిల్లులు ఉన్నాయి. వీరు మార్కెట్‌యార్డుల్లో చేస్తు న్న కొనుగోళ్లు కేవలం 5శాతం కూడా మించడంలేదు. వీరంతా ప్రధానంగా గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. అందుకు రైతులను రకరకాల మాయ మాటలతో పక్కదారి పట్టిస్తున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్తే, హమాలీ, కాంట తదితర ఖర్చులు వస్తాయని, అదే తమకు అమ్మకాలు చేస్తే ఇ వేం ఖర్చులు ఉండవని ఆశ పుట్టిస్తున్నా రు. ఇందుకోసం రైస్‌మిల్లర్లు గ్రామాల్లో ప్రత్యేకంగా ఏజెంట్ల ద్వారా వారికి క్వింటాలుకు కమీషన్ ఇస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు దళారులు పెద్దఎత్తున దందా మొదలుపెట్టారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ తూకం విషయంలో మోసం చేస్తున్నారు. ధాన్యాన్ని నేరుగా వేబ్రిడ్జిల వద్దకు తీసుకె ళ్లి అక్కడ వారికి ముందే పరిచయమున్న వారితో కనుసైగ చేస్తారు. అంతే..ఇక తూకంలో తేడాలు చోటుచేసుకుంటున్నా యి. ఈ విషయం తెలియక రైతులు మో సపోతున్నారు. అలాగే రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి మరో విధంగా కూడా టోకరా పెడుతున్నారు. రైతుల నుంచి కొనుగోళ్ల కు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాం టి రికార్డు ఉండకపోవడంతో ఆ ధాన్యా న్ని బియ్యంగా మార్చి బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ అధికారుల అండదండలు ఉండటంతో జిల్లా లో జీరోదందా పెద్దఎత్తున సాగుతోంది. ఈ తతంగం బయటపడకుండా ఉండేం దుకు రైస్‌మిల్లులు మరో ఎత్తుగడ పన్నుతున్నాయి. మార్కెట్ యార్డుల నుంచి కేవలం 5 నుంచి 10 శాతం కొనుగోలు చే సి అధికారుల ముందు ఉంచుతున్నారు. వ్యాపారులకు అండా దండా.. జీరోదందా సాగిస్తున్న రైస్ మిల్లర్లకు ఓవైపు నుంచి అధికారులు, మరోవైపు నుంచి రాజకీయ నాయకుల అండ పుష్కలంగా ఉంది. దీంతో వారి దందా మూ డుపూలు, ఆరుకాయలు అన్న చందంగా సాగుతోంది. జిల్లాలో అక్రమదందాను అరికట్టేందుకు ప్రభుత్వం 22 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. అయితే ఇవన్నీ కూడా కేవలం నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. అధికారులు మామూళ్లకు అలవాటుపడి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. వీరికి రాజకీయ నాయకులు అండదండలు ఉండడంతో వారిని ఎవరేమీ చేయలేకపోతున్నారు. అడ్డుకట్టకు ఒకటే మార్గం.. ఈ అక్రమ దందాకు చెక్ పెట్టాలంటే ఉన్న ఏకైక మార్గం.. జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం) గూగుల్ మ్యాప్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశముంది. జీఐఎస్ పరిజ్ఞానంతో అన్ని రైస్ మిల్లులను ఈ సాంకేతిక పరిజ్ఞానం కిందకు తీసుకొస్తే రైస్ మిల్లులకు వచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రికార్డు చేసుకునే వీలుంది. ఈ విషయంలో కలెక్టర్ చొరవతీసుకొని సీసీ కెమెరాలు, లేదా జీఐఎస్ విధానానికి శ్రీకారం చుడితే ఈ అక్రమాలకు తెరపడే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా ప్రభుత్వం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో మార్కెట్‌యార్డులు 18 మార్కెటింగ్ చెక్‌పోస్టులు 22 రైస్ మిల్లులు 236 మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న హమాలీలు 1914 ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన కొనుగోళ్లు 18,024 క్వింటాళ్లు రైస్ మిల్లులు కొనుగోలు చేసిన ధాన్యం 2 లక్షల క్వింటాళ్లు -
పేదల బియ్యం పెద్దల భోజ్యం
సంక్షేమ లక్ష్యం చెదిరిపోతోంది. బడుగుల కడుపులు నింపాల్సిన బియ్యం బడా బాబుల గోడౌన్లు చేరుతున్నాయి. తెల్లకార్డులపై కిలో రూపాయకు అందిస్తున్న బియ్యం నల్లబజారుకు తరలిపోతోంది. కొద్దిగా పాలిష్ పట్టించి తిరిగి బహిరంగ మార్కెట్లో అధిక దరలకు విక్రయిస్తున్నారు. సత్తెనపల్లి/తెనాలి అర్బన్: పల్నాడులోని పలు రైస్‌మిల్లుల్లో కొద్ది రోజులుగా రేషన్ బియ్యం పట్టుబడుతున్నాయి. ఈ వ్యవహారంలో రైస్‌మిల్లుల యజమానులతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులు కుమ్మక్కు అయ్యారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేసి, మిల్లింగ్ చేసి బియ్యం విక్రయిస్తే వచ్చే లాభాల కన్నా రేషన్ బియ్యాన్ని అడ్డదారుల్లో సేకరించి కాస్త పాలిష్ పెట్టి అమ్మితే వచ్చే లాభాలు ఎన్నో రెట్లు ఎక్కువ. జిల్లాలో పల్నాడును కేంద్రంగా చేసుకుని ఈ అక్రమ వ్యాపారం చేపడుతున్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట, పెదకూరపాడు,గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో తెల్లకార్డుదారులకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని డీలర్ల ద్వారా సేకరిస్తున్నారు. చాలా మంది రేషన్‌కార్డుదారులు బియ్యాన్ని తీసుకోవడం లేదు. కొంత మంది తీసుకున్నా వ్యాపారులకు అమ్మేస్తున్నారు. రేషన్ డిపో డీలర్లు కూడా మిగిలిపోయిన బియ్యాన్ని దళారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దళారులు క్వింటా రూ. 1200 నుంచి రూ. 1400లకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని మరోసారి మరపట్టించి వివిధ బ్రాండ్ల పేరుతో అమ్ముకుంటున్నారు. క్వింటాకు రూ. 1500 నుంచి రూ. 2వేల వరకు లాభాలను ఆర్జిస్తున్నారు. ఈనెల 8న అర్ధరాత్రి సత్తెనపల్లిలో ఆటోలో తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 14న సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని శ్రీ విఘ్నేశ్వర రైస్‌మిల్లు నుంచి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు తరలించేందుకు సిద్ధం చేసిన 220 క్వింటాళ్ల రేషన్ బియ్యం లారీని సత్తెనపల్లి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 15న రాజుపాలెం మండలం కొండమోడులోని విఘ్నేశ్వర సప్లయర్స్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 45 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వెల్దుర్తి మండలంలోని కండ్లకుంట - గుండ్లపాడు గ్రామాల మధ్య రెండు లారీల్లో తరలిస్తున్న 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 19 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురజాల రూరల్ సీఐ పట్టుకున్నారు. అధికారపార్టీ నేతల అండతో... రేషన్ బియ్యం అక్రమ మార్గంలో తరలించేందుకు అధికార పార్టీనేతల అండ ఎక్కువగా ఉంది. ఒక్కో నియోజకవర్గంలో ఇరువురు వ్యాపారులు రెండు జట్లుగా ఏర్పడి నరసరావుపేటకు చెందిన అధికార పార్టీ చోటామోటా నేతల సహకారంతో ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు పంపుతున్నారు. -
రైస్‌మిల్లుల్లో నల్లబెల్లం డంప్‌లు
జోరుగా చీకటి వ్యాపారం * బియ్యం చాటున బెల్లం, పటిక విక్రయాలు * రోజు రూ.5 లక్షల వ్యాపారం * పోలీసుల సహకారంతోనే బిజినెస్ భీమారం : రైస్‌మిల్లులు, పాడుబడిన గోదాంలు, జనావాసం లేని భవనాల్లో చీకటి వ్యాపారం సాగుతోంది. హసన్‌పర్తి కేంద్రంగా బెల్లం, పటిక వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. శనివారం ఎక్సైజ్ అధికారులు సీతంపేట క్రాస్‌లోని ఓ రైస్‌మిల్లులో దాడులు నిర్వహించగా భారీగా బెల్లం నిల్వలు పట్టుబడిన విషయం తెలిసిందే. 15 ఏళ్లుగా ఎక్సైజ్ అధికారులు ఇంత పెద్దమొత్తంలో బెల్లం, పట్టికను స్వాధీనం చేసుకోలేదని ఎక్సైజ్ అధికారులే చెప్పడం గమనార్హం. జిల్లాలో నల్లబెల్లం వ్యాపారులు సిండికేట్‌గా మారినట్లు తెలుస్తోంది. పరకాలకు చెందిన బెల్లం వ్యాపారి సదాశివుడు నగరానికి చెందిన మరో వ్యాపారితో కలిసి.. రెండున్నర ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో వెల్లడైంది. సదాశివుడికి పరకాలలో బెల్లం షాపు ఉంది. ఇందులో అతడు ప్రజల అవసరాలకు బెల్లం విక్రయించాల్సి ఉండగా.. గుడుంబా తయూరీ కోసం నల్లబెల్లం, పటిక విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. హసన్‌పర్తి పరిసర ప్రాంతాలకు రవాణా పరకాల నుంచి ప్రతి రోజు వివిధ ప్రాంతాలకు బెల్లం, పటిక దిగుమతి చేయడానికి ఇబ్బందవుతుందనే ఉద్దేశంతో సీతంపేట క్రాస్ వద్ద ఉన్న ఓ రైస్‌మిల్లును లీజుకు తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే రైస్‌మిల్లులో పెద్దఎత్తున బెల్లం, పటిక నిల్వ చేశాడు. ఇక్కడి నుంచి ట్రాలీ, ఆటోల ద్వారా నగర పరిధిలోని కోమటిపల్లి, హరిశ్చంద్రనాయక్ తండా, సిద్దాపురం, గుండ్లసింగారం, సీతంపేట, మడికొండ, కడికొండకు బెల్లం సరఫరా చేస్తుండేవారు. ఈ ప్రాంతాలకు రోజూ సుమారు రూ.5 లక్షల వ్యాపారం చేస్తున్నారంటే గుడుంబా తయూరీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే గుట్టుచప్పుడు కాకుండా చేసిన వ్యాపారం.. మూడు నెలలకే రట్టయిపోయింది. -
రీసైక్లింగ్ దందా
రైస్ మిల్లులకు చేరుతున్న రూ.కిలో బియ్యం మరపట్టి.. బహిరంగ మార్కెట్లో విక్రయం మిల్లుల్లో అక్రమంగా బియ్యం నిల్వలు మామూళ్ల మత్తులో పౌరసరఫరాల శాఖ సాక్షి, మంచిర్యాల: పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం అక్రమం గా రైస్ మిల్లులకు తరలుతోంది. కొంత మంది డీలర్లు, దళారులు రూ.కిలో రేషన్ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లర్లకు రూ.5 నుంచి రూ.10కి కిలో చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మిల్లర్లు ఆ బియ్యాన్ని మరపట్టి.. రీ సైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో కిలోకు రూ. 25 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. మంచిర్యాల డివిజన్ కేంద్రంలోని ఎంసీసీ సమీపంలో ఉన్న ఓ రైస్‌మిల్ ఈ అక్రమ దందాకు కేరాఫ్‌గా మారింది. సదరు యజమాని అండ.. పలుకుబడితో తూర్పు జిల్లాలో చాలా మంది మిల్ల ర్లు ప్రజా పంపిణీ బియ్యాన్ని తమ మిల్లులకు తరలించుకుని.. రీ సైక్లింగ్ చేసి వాటిని బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ దందా జిల్లాలో జోరు గా సాగుతున్నా పౌరసరఫరాల అధికారులు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అన్నపూర్ణ, అం త్యోదయ, తెలుపు రేషన్‌కార్డులు 6.72 లక్షల వరకు ఉన్నా యి. ప్రతినెలా 94,117 క్వింటాళ్ల బియ్యం కోటా విడుదల అవుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,444 రేషన్ షాపుల ద్వా రా బియ్యం వినియోగదారులకు అందుతుంది. రేషన్ డీల ర్లు.. ముందస్తుగానే తమకు కావాల్సిన కోటాకు సంబంధిం చి డీడీ తీసి అధికారులకు అందజేస్తారు. ఆ మేరకు బియ్యం కోటా మంజూరవుతుంది. అయితే.. చాలా చోట్ల వినియోగదారులు బియ్యం తీసుకోకున్నా.. డీలర్లు మాత్రం వారి పేరి టా కోటా మంజూరు చేయించుకుని దాన్ని డీలర్లు, హోటల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రతినెలా డీలర్లు వేలాది క్వింటాళ్ల బియ్యాన్ని పక్కదారి పట్టించి.. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. మామూళ్ల మత్తులో నిఘా వ్యవస్థ ! తరుచూ రేషన్ షాపులు తనిఖీ చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగా పనిచేస్తుందా.. లేదా.. అని తెలుసుకోవాల్సిన అధికారులు, నిఘా వ్యవస్థ జిల్లాలో మొద్దునిద్రపోయింది. పేదల కు ఇవ్వాల్సిన బియ్యాన్ని డీలర్లు దాచిపెట్టుకుని మిల్లులకు అక్రమంగా తరలిస్తున్నా అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం మంచిర్యాల పట్టణంలోని పలు బియ్యం షాపులకు చేరుతుంది. అక్కడి నుంచి బడా వ్యాపారులు పెద్ద ఎత్తున రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఏవైనా ఫిర్యాదులొచ్చి.. గ్రామస్తులు అక్రమ రవాణాను అడ్డుకున్నప్పుడే అధికారులు ఆ వాహనాల్లో తరలుతోన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఆ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకుని చర్యలు తీసుకోవడంలో మాత్రం సాహసించడం లేదు. మిల్లుల్లో అక్రమ నిల్వలు కరెంట్ కోతలు.. వర్షాభావ పరిస్థితులతో గత రబీ.. ప్రస్తుత ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం.. పంట దిగుబడి భారీగా తగ్గింది. త్వరలో ప్రారంభం కానున్న రబీకీ కరెంట్ ఇవ్వలేమన్న ప్రభుత్వ ప్రకటనతో చాలా మంది రైతులు వరి సాగు ఆలోచనను విరమించుకున్నారు. దీంతో దిగుబడి త గ్గే అవకాశాలున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న మిల్లర్లు ఇప్పట్నుంచే అక్రమంగా తరలించుకున్న రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వాటిని సన్నరకాలుగా మార్చి తర్వాత బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేట్లకు విక్రయించాలని చూస్తున్నారు. భవిష్యత్తులో ఈ బియ్యం కిలోకు రూ.30 నుంచి రూ.40కు అమ్మే ఆలోచనలో మిల్లర్లు ఉన్నారు. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి వసంత్‌రావు దేశ్‌పాండే వివరణ ఇస్తూ.. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే డీలర్ల షాపును రద్దు చేస్తామని చెప్పారు. -
బియ్యం నిల్వల స్వాధీనం
సోమల: సోమల మండలం కందూరులోని ఒక రైస్ మిల్లులో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన 500 బస్తాల బియ్యాన్ని తహశీల్దార్ నరసింహులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తి ఉద యం తొమ్మిది గంటల సమయంలో కందూరులోని ఓ రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచుతున్నట్లు ఎస్ఐ చిన్నరెడ్డెప్పకు సమాచారం అందింది. వివరాలు సేకరించిన ఆయన తహశీల్దార్ నరసింహులు, సివిల్ సప్లై డీటీ పద్మావతి, డీటీ కోటిరెడ్డి, ఆర్ఐ కోదండరామయ్యను అక్కడికి పంపారు. తనిఖీలు నిర్వహించగా అనుమతి లేకుండా ఉంచిన 500 (25 కేజీలు బరువుగల) బస్తాలు బియ్యం, 50 బస్తాల వడ్లు స్వాధీ నం చేసుకున్నారు. రికార్డులు పరిశీలించగా రైస్ మిల్లుకు 2011వరకే బియ్యం విక్రయానికి అనుమతులున్నాయని, ఆపై రెన్యువల్ చేసుకోలేదని తేలింది. రైస్ మిల్లు యజమానిపై చర్యలకు సిఫారసు చేస్తూ తహశీల్దార్ నివేదిక పంపారు. స్వాధీ నం చేసుకున్న బియ్యాన్ని ప్రభుత్వ గోడౌన్‌కు తరలించారు. మూడు నెలల క్రితం కందూరు గ్రామ సమీపంలో 245 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. నిమ్మనపల్లె, కలికిరి, కలకడ, రాయచోటి, వాల్మీకిపురం, పీలేరు మండలాల నుంచి వ్యాపారులు రేషన్ బియ్యం కొనుగోలు చేసి, కందూరు, సోమల, పెద్ద ఉప్పరపల్లె ప్రాంతాల్లో పాలిష్ చేసి అమ్ముతున్నట్లు సమాచారం. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని అన్నారు. -
గుట్టుగా రేషన్ బియ్యం రీసైక్లింగ్
కీసర: రేషన్ బియ్యం రీసైక్లింగ్ గుట్టును అధికారులు రట్టు చేశారు. ఓ రైస్‌మిల్లుపై దాడి చేసి 650 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండల పరిధిలోని అహ్మద్‌గూడలో శుక్రవారం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా బొమ్మలరామారం నివాసి చంద్రమౌళి నిరుపేదలకు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని కొన్నేళ్లుగా గ్రామాల నుంచి దళారుల ద్వారా సేకరిస్తున్నాడు. కీసర మండల పరిధిలోని అహ్మద్‌గూడలో ఉన్న ఓ రైస్‌మిల్లులో గుట్టుగా రీసైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యాన్ని గురువారం లారీలో బహిరంగ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధమవుతుండగా విశ్వసనీయ సమాచారంతో రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు దాడులు చేశారు. రైస్‌మిల్లులో నిల్వ ఉంచిన బియ్యం, మార్కెట్‌కు తరలించేందుకు లారీలో ఉన్న బియ్యంను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్‌జోన్ సివిల్ సప్లై అధికారి సురేష్ విలేకరులతో మాట్లాడుతూ పరీక్షల నిమిత్తం బియ్యాన్ని ల్యాబ్ పంపినట్లు తెలిపారు. రైస్‌మిల్లును సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు కీసర తహసీల్దార్ రవీందర్‌రెడ్డి తెలిపారు. -
దొరికితేనే దొంగలు..
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: ప్రజాపంపిణీపై పర్యవేక్షణ కొరవడింది. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మార్కెట్లో యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. డీలర్ల నుంచి అక్రమార్కులు కేజీ రూ.10 కొని వాటిని రీ సైక్లింగ్ చేసి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. దీంతో వేల టన్నుల బియ్యం నల్లబజారుకు తరలిపోతున్నాయి. రేషన్ డీలర్లపై నిఘా పెట్టాల్సిన రెవెన్యూ అధికారులు మొక్కుబడి తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. రైస్ మిల్లర్లు కూడా అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారు. డీలర్లు, రైస్‌మిల్లుల యజమానులు దొరికితేనే దొంగలు..లేకపోతే దొరల్లా తిరుగుతున్నారు. జిల్లాలో 2,085 చౌకధరల దుకాణాలుండగా 8,90,507 రేషన్‌కార్డులున్నా యి. వాటిలో 6,73,999 తెల్లకార్డులు, 52,140 అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులు వెయ్యివరకు ఉన్నాయి. ప్రతినెలా పది వేల టన్నుల బియ్యం సరఫరా అవుతుంటాయి. కిలో రూపాయికే ఇస్తున్న ఈ బియ్యాన్ని డీలర్లు కిలో పది రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిందిలా... ప్రతినెలా డీలర్లు డీడీలు చెల్లించిన అనంతరం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్‌షాపులకు లారీల ద్వారా బియ్యం సరఫరా చేస్తుంటారు. సరుకులు తీసుకెళ్లే లారీ వెంట రూట్ ఆఫీసర్ ఉండాలి. షాపులో సరుకు దించిన వెంటనే స్టాక్ రిజిస్టర్లో సంతకం చేయాలి. బియ్యం పక్కదారి పట్టకుండా రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా పెట్టాలి. అవసరమైతే తనిఖీలు చేయాలి. స్టాక్‌బోర్డు సక్రమంగా నిర్వహిస్తోందీ లేనిదీ చూడాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే 6ఏ కేసులు నమోదు చేసి డీలర్లపై చర్యలు తీసుకోవాలి. జరుగుతోందిలా... రెవెన్యూ అధికారులు మొక్కుబడి తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఒక్కో రేషన్‌డీలరు నెలకు రూ.700 చొప్పున మండలంలో ఎంతమంది డీలర్లుంటే అంతమందీ వసూలు చేసి తహసీల్దార్ కార్యాలయానికి పంపిస్తుంటారన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా తనిఖీలు మొక్కుబడిగా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల మేల్కొన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు బియ్యం మాఫియాపై నిఘా పెట్టింది. ఒక్క మార్చి నెలలోనే టన్నులకొద్దీ బియ్యాన్ని స్వాధీనం చేసుకుందంటే డీలర్లు ఎంత అవినీతికి పాల్పడుతున్నారో తేటతెల్లమవుతోంది. కంభం పట్టణంలో మార్చి 5న ఒక ఆటోలో తరలిస్తున్న ప్రజాపంపిణీ బియ్యాన్ని స్థానికంగా ఉన్న ఒక పార్టీ నాయకులు చూసి పట్టుకున్నారు. ఇవి మధ్యాహ్న భోజన పథకం బియ్యం అని ఆటోడ్రైవర్ తెలపడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మార్చి 17న సంతమాగులూరు మండలం ఏల్చూరు పరిసర ప్రాంతమైన కొండ మలుపుల్లో దాడులు చేసి 300 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పర్చూరులో మార్చి 14న రేషన్‌షాపులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన దాడుల్లో స్థానిక 49వ వార్డులో ఉన్న షాపులో రికార్డులు సక్రమంగాలేవని తేలింది. డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 21న గుడ్లూరులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 54 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. అదే నెలలో మార్టూరులోని ధాన్యం మిల్లుల్లో అక్రమ నిల్వల్ని కనుగొన్నారు. సరుకు వివరాలు లేనందున రూ.14 లక్షల విలువ చేసే 200 క్వింటాళ్ల ధాన్యం, 300 క్వింటాళ్ల బియ్యం, 100 క్వింటాళ్ల నూకలను సీజ్ చేశారు. అదేవిధంగా ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు సమీపంలో ఉన్న లక్ష్మీ నరసింహ రైస్‌మిల్లుపై దాడిచేసి 3,590 బస్తాల ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చీరాల ప్రాంతంలో కూడా పేదల బియ్యానికి రెక్కలొచ్చాయి. అనేకసార్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో పలువురు బియ్యం మాఫియాదారులు దొరికిపోయిన సందర్భాలున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు బుద్ధిపుట్టినప్పుడు తనిఖీలు చేస్తేనే ఇలా టన్నుల కొద్దీ బియ్యం పట్టుబడుతున్నాయి. ఈ లెక్కన ఏడాదంతా ప్రజా పంపిణీ బియ్యాన్ని నిరంతరం డీలర్లు నల్లబజారుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారో స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
తండ్రి ఆశయం నెరవేర్చిన తనయుడు
డోన్ రూరల్, న్యూస్‌లైన్: తల్లి, తండ్రి పనిచేస్తే పూట గడస్తుంది.. లేదంటే పస్తులే.. అలాంటి పేద కుటుంబలో పుట్టిన ఓ విద్యార్థి కష్టాలను అధిగమించాడు. తండ్రిని కోల్పోయిన బాధలోనూ పదో తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడు. గురువారం వెలువడిన ఫలితాల్లో ఆ విద్యార్థికి 9.3 పాయింట్లు వచ్చాయి. డోన్ పట్టణానికి చెందిన మధుసూదన్ నాయుడి విషాదంతో కూడిన విజయగాథ ఇది. పట్టణంలోని తారకరామనగర్‌కు చెందిన శ్రీనివాసులు నాయుడు రైసు మిల్లులో పని చేసేవాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుటుంబ పోషణ కోసం భార్య మల్లేశ్వరితోపాటు కుమారులు గోపి, శివ కూలీ పనికి వెళ్లేవారు. పెద్ద కుమార్తె వరలక్ష్మికి పెళ్లి కాగా, రెండో కుమార్తె శిరీష ఆరో తరగతి చదువుతోంది. ఇంకో కుమారుడు మధుసూదన్ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదివాడు. బాగా చదువుకోవాలని.. మంచి మార్కులు తెచ్చుకోవాలని తండ్రి చెప్పేవాడు. ఆ మేరకు చదువులో ఆ విద్యార్థి చురుగ్గా ఉండేవాడు. అయితే మార్చి నెలలో పదో తరగతి గణితం పరీక్ష రోజున అనారోగ్యంతో శ్రీనివాసులు నాయుడు చనిపోయాడు. తండ్రి ఆశయం నెరవేర్చేందుకు పుట్టెడు దుఃఖంలోనూ బాధను దిగమింగుకొని ఆ విద్యార్థి పరీక్షలకు హాజరయ్యాడు. గురువారం వెలువడిన ఫలితాల్లో అత్యధిక పాయింట్లతో పాఠశాలలోనే ప్రథమ స్థాయిలో నిలిచాడు. తన కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలనుకున్న తండ్రి కలలు నిజం చేస్తూ మంచి ఫలితం సాధించడంతో కుటుంబ సభ్యులు, పాఠశాల యాజమాన్యం ఆ విద్యార్థిని అభినందించారు. కష్టపడి చదివి ఇంజినీర్ కావాలన్నదే తన లక్ష్యమని మధుసూదన్ నాయుడు తెలిపాడు. -
పట్టుకున్నారు కానీ..
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్ : ప్రభుత్వ అనుమతి కూడా పొందని రైసుమిల్లులో వేలాది బస్తాల ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. మిల్లులోని ధాన్యం బస్తాల లెక్కింపునకు మూడు రోజులు పడుతుందని మొదట ప్రకటించిన విజిలెన్స్ అధికారులు, నాలుగు గంటలు గడవకముందే 73 వేల బస్తాలను లెక్కించామని ప్రకటించారు. అయితే బస్తాల లెక్కింపులో అనుమానాలు ఉన్నాయని, లోపల ఇంకా పెద్దసంఖ్యలో బస్తాలు ఉన్నాయని పరిసర ప్రాంతాల రైతులు ఆరోపిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పెనుబల్లి సమీపంలో ఉన్న శ్రీరాజరాజేశ్వరి రైసుమిల్లులో ఏడాదిగా ధాన్యం నిల్వ చేస్తున్నారు. అయితే ఈ నెల 19న మిల్లుకు లెసైన్స్ మంజూరు చేయాలని కోరుతూ యజమాని దరఖాస్తు చేసుకున్నారు. ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని భావించిన సివిల్ సప్లయిస్ అధికారులు మంగళవారం రాత్రి విద్యుత్ సరఫరా లేని సమయంలో మిల్లును పరిశీలించేందుకు వచ్చారు. ఆ శాఖ డిప్యూటీ తహశీల్దార్ మల్లీశ్వరి మిల్లుకు వచ్చిన సమయంలో యజమాని లేరు. అప్పటికే బుచ్చిరెడ్డిపాళెంలోని రెండు రైసుమిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడి చేసి రూ.80 లక్షల విలువైన నిల్వలను సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు శ్రీరాజరాజేశ్వరి మిల్లుకు వచ్చారు. యల్లాయపాళెం తదితర ప్రాంతాల నుంచి కొందరు రైతులు వచ్చి మిల్లులో తమ ధాన్యం కూడా ఉందంటూ రైతులు, విజిలెన్స్ అధికారులతో వాదనకు దిగారు. మాటమార్చిన విజిలెన్స్ డీఎస్పీ : మిల్లులోని బస్తాలను లెక్కించేందుకు మూడు రోజుల సమయం పడుతుందని మొదట విజిలెన్స్ డీఎస్పీ రమేష్‌బాబు విలేకరులకు తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దాడులు చేసి రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని సీజ్ చేసి సివిల్ సప్లయిస్ అధికారులకు అప్పగించామని చెప్పారు. మళ్లీ ఆయనే సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ శ్రీరాజరాజేశ్వరి మిల్లులో ధాన్యం బస్తాల లెక్కింపు పూర్తయిందని ప్రకటించారు. సమొత్తం 28 వేల క్వింటాళ్ల బరువైన 73 వేల బస్తాలు ఉన్నాయని వెల్లడించారు. వీటి విలువ రూ.3.76 కోట్లకు పైగా ఉంటుందన్నారు. బస్తాల లెక్కింపుకు మూడు రోజుల సమయం పడుతుందని చెప్పిన నాలుగు గంటల్లోనే ఎలా లెక్కించారని ఓ విలేకరి ప్రశ్నించగా విజిలెన్స్ డీఎస్పీ రుసరుసలాడారు. డీఎస్పీ మాటమార్చడంతో విలేకరులు విజిలెన్స్ ఎస్పీ శశిధర్‌రాజును సంప్రదించారు. ఆయన మాట్లాడుతూ మిల్లులో అక్రమంగా ధాన్యం నిల్వ చేయడం నేరం కావడంతో సీజ్ చేసి సివిల్ సప్లయిస్ అధికారులకు అప్పగిస్తున్నామన్నారు. లెక్కింపు తదితరాలు ఆ శాఖ అధికారులు చూస్తారని తెలిపారు. -
‘ఆటో’ ఆయిలింజిన్
శాయంపేట, న్యూస్‌లైన్ : రైతుల కష్టాన్ని కళ్లారా చూసిన ఓ ఆటో మెకానిక్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఆటో ఇంజిన్‌తో ఆయిల్ ఇంజిన్‌ను తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు. లీటర్ డీజిల్‌తో ఇంజిన్ రెండు గంటలపాటు నడిచేలా తీర్చిదిద్దాడు. రూ.22వేలు ఖర్చయ్యే మోటర్ ఆర్డర్ ఇస్తే తయారు చేస్తానని చెబుతున్నాడు రామ శివప్రసాద్. మండల కేంద్రానికి చెందిన రామ శివప్రసాద్ ఏడో తరగతి వరకు చదివాడు. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేశాడు. అక్కడే రైస్ మిల్లులో డ్రైవర్‌గా చేరాడు. పదిహేనేళ్లపాటు పనిచేశాక కొత్తగా ఆటో మెకానిక్ పని నేర్చుకున్నాడు. పూర్తిగా తర్ఫీదు పొందాక చెట్టు కింద ఆటో బాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అంతేకాక రైతులకు సంబంధించి పెట్రోల్ పంపులు, చైనా మోటర్లను సైతం బాగు చేసేవాడు. ఇలా రైతులు ప్రతిసారి రిపేరుకు తెచ్చే చైనా మోటర్లను చూసి బాధపడేవాడు. విద్యుత్ కోతలు, రైతుల ఇబ్బందులను గమనించిన శివప్రసాద్ ఒక నిర్ణయానికొచ్చాడు. గత వేసవి నుంచి ఆటో ఇంజిన్‌తో కొత్తగా మోటరు తయారు చేయాలని ఆలోచనలో మునిగిపోయాడు. ప్రతీ నెల మోటరు తయారు చేయడం.. అందులోని లోపాలను సరిదిద్దుకోవడం ఇలా ఆరు నెలల సమయం పట్టింది. చివరకు అతడి చేతిలో రూపుదిద్దుకున్న మోటరు లీటరు డీజిల్‌తో రెండు గంటలపాటు 7.5 హెచ్‌పీ కంటే అధికంగా నీరు పోస్తోంది. మోటర్‌కు సెల్ఫ్‌స్టార్ట్, 12 ఓల్టేజి బ్యాటరీ, ఆటో ఇంజిన్‌ను ఏర్పాటు చేసి విజయం సాధించాడు. ఇప్పటికే సుమారు పది మంది రైతులు దీనిని వినియోగించారు. మోటర్ తయారీకి ఇప్పటికీ రూ.22వేలు ఖర్చయినట్లు తెలిపాడు. బాధలు చూడలేకే.. రైతులు పడే బాధను చూడలేక కొత్తగా ఆయిల్ ఇంజిన్ తయారు చేశా. ఆటోలో 5 నుంచి పది మంది వరకు ఎక్కించుకున్నా ఇంజిన్ లాగుతుంది. ఇదే ఇంజిన్ బావిలోనుంచి నీటిని లాగలేదా అనే అంశాన్నే ప్రయోగం చేసి విజయం సాధించా. ఇప్పటికే చింతల రవిపాల్తోపాటు మరి కొందరు రైతులు దీనిని వాడి చూసి బాగుందన్నారు. రైతులు కావాలంటే ఇలాంటి మోటర్లను ఇంకా తయారు చేస్తా. - రామ శివప్రసాద్, మెకానిక్ ఖర్చు తగ్గుతాంది చైనా మోటర్లకంటే ఖర్చు చాలా తగ్గుతాంది. గంటకు అర లీటర్ డీజిల్‌తో ఏకంగా 120 పైపుల గుండా నీళ్లను తోడుతాంది. మామూలు మోటరు కంటే ఎక్కువగా నీళ్లు పోస్తాంది. 24 గంటలు నడిచిన ఇంజిన్ వేడెక్కుతలేదు. ఇలా ఉంటే రైతులు ఉంటే సిరులు పండించొ చ్చు. - కోల మచ్చయ్య, రైతు -
ప్రభుత్వం దిగి వచ్చే వరకు రైస్ మిల్లులు బంద్ చేస్తాం
= 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చేందుకు సిద్ధం = జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బసవరాజప్ప సాక్షి, బళ్లారి : ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రైస్ మిల్లర్ల నుంచి అధిక లెవీ రూపంలో బియ్యాన్ని తీసుకోవాలని నిర్ణయించడం సరైన చర్య కాదని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉప సంహరించుకునేంత వరకు రైస్ మిల్లులను బంద్ చేస్తామని రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బసవరాజప్ప స్పష్టం చేశారు. ఆయన సోమవారం జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఏపీఎంసీ ఆవరణం నుంచి నగరంలోని ప్రముఖ వీధుల గుండా ర్యాలీగా వచ్చి జిల్లాధికారి కార్యాలయంలో హెచ్‌క్యూకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బసవరాజప్ప మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ప్రతి ఏటా లెవీ రూపంలో 1.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేదని, అయితే ఉన్న ఫళంగా ఈసారి 13.5 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని కేబినేట్లో నిర్ణయించడం ఎంతవరకు సబబన్నారు. ఈ మార్చిలోపు కనీసం 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాలని డిమాండ్ చేసిందని, అయితే గతంలో ఇచ్చే 2 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఒక క్వింటాల్ కూడా అదనంగా ఇచ్చేందుకు వీలుకాదన్నారు. పంట పండించడానికి అధిక పెట్టుబడి వస్తోందని, వరి రేటు మార్కెట్లో క్వింటాల్ రూ.2650 ఉండగా తాము రూ. 2400 ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోకపోతే తమ బంద్‌ను నిరవధికంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. నగర రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌గౌడ మాట్లాడుతూ బళ్లారి నగరం, జిల్లాలో దాదాపు 250 రైస్ మిల్లులు ఉన్నాయని, జిల్లాలో విస్తారంగా వరి సాగు చేస్తున్నందున రైస్‌మిల్లులు బంద్ చేయడం వల్ల తమతోపాటు రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుతం రైతుల నుంచి క్వింటాల్‌కు రూ.1600తో వరి కొనుగోలు చేసి ప్రభుత్వానికి క్వింటాల్‌కు రూ. 2400కు లెవీ రూపంలో ఇవ్వాలనడం సరైన నిర్ణయం కాదన్నారు. ప్రస్తుతం అన్నభాగ్య పథకం కోసం తక్కువ ధరకే బియ్యం సేకరించాలని అనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నాయకులు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల బియ్యం పెద్దల భోజ్యం
సాక్షి, ఒంగోలు : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పెద్దలు బొక్కేస్తున్నారు. డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తూ టన్నుల కొద్దీ బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దళారులు ఈ బియ్యాన్ని సేకరించి ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. కొందరు రైస్ మిల్లర్లు సైతం వాటిని కొనుగోలు చేస్తూ మేలురకం బియ్యాన్ని కల్తీ చేసేందుకు, వాటిని కాస్త పాలిష్‌పట్టి తిరిగి లెవీ కింద ప్రభుత్వానికే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగం నిత్యం జరిగేదే అయినా..నిఘా విభాగాలు అప్పుడప్పుడూ దాడులు చేసి మమ అనిపిస్తున్నారు. గత నెల 11వ తేదీ టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేసిన దాడిలో 219 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది. అదే నెల 27వ తేదీన జిల్లాలోని కందుకూరు మండలం మాచవరంలో రైస్‌మిల్లులో 264 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత సోమవారం సాయంత్రం -
కాసులిస్తే కేసుల్లేవ్!
సాక్షి, సంగారెడ్డి: విద్యుత్ చౌర్యంపై ‘నిఘా’ సామాన్యలపైనే కేంద్రీకృతమైంది. ఈ ఏడాది విద్యుత్ శాఖ, విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా దాడులు చేసి భారీ సంఖ్యలో కేసులు నమోదు చేయగా.. అధిక శాతం కేసుల్లో పేద వినియోగదారులే ఉన్నారు. ఈ ఏడాది జిల్లాలో నమోదైన 6,184 విద్యుత్ చౌర్యం కేసుల్లో 5,892 కేసులు గృహలకు సంబంధించినవే ఉన్నాయి. ఇటీవల కాలంలో విద్యుత్ శాఖ ఓ అడుగు ముందుకేసి అరెస్టులను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 15 మందిని కటకటాల వెనక్కి పంపగా అందులో అందరూ పేద వినియోగదారులే ఉన్నారు. జిల్లాలో పలు భారీ పరిశ్రమలు, పౌల్ట్రీ ఫారాలు, రైసు మిల్లులు, స్టోన్ క్రషర్లు, ఇటుక బట్టీలు, ఫిల్టర్ ఇసుక క్వారీల యాజమాన్యాలకు కొదవ లేదు. ఈ వినియోగదారులు నిత్యం భారీగా విద్యుత్‌ను తస్కరిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కేసులు గృహ వినియోగదారులకే పరిమితం చేయడం వెనక మతలబు ఉందని ఆరోపణలు వస్తున్నాయి. మామూళ్లు ఇస్తే సరి ! మూడు రకాలుగా విద్యుత్ చౌర్యం జరుగుతోంది. విద్యుత్ మీటర్ ట్యాంపరింగ్ ద్వారా రీడింగ్ వేగాన్ని నియంత్రించడం, మీటర్‌ను బైపాస్ చేసి విద్యుత్‌ను వినియోగించడం, విద్యుత్ లైన్లపై నేరుగా తీగలు వేసి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో కొందరు లైన్మెన్లు, ఏఈలు పారిశ్రామిక, వాణిజ్య వర్గాల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తూ విద్యుత్ చౌర్యాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమ ఇసుక ఫిల్టర్లు, ఇటుక బట్టీలు, స్టోన్ క్రషర్లు సైతం విద్యుత్‌ను తస్కరిస్తూ క్షేత్రస్థాయి సిబ్బంది చేతులు బాగానే తడుపుతున్నాయి. గృహ వినియోగదారులతో పోలిస్తే పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం తస్కరిస్తున్న విద్యుత్ పరిమాణం చాలా ఎక్కువే. కానీ, పారిశ్రామిక వినియోగదారులు విద్యుత్ చౌర్యం చేసే అవకాశాలు ఏమాత్రం లేవని అధికారులు కొట్టి పారేస్తున్నారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసే హెచ్‌టీ లైన్లకు ప్రత్యేక మీటర్లు పెట్టి ప్రతి నెలా ఆ ప్రాంతంలో జరిగిన విద్యుత్ సరఫరా, బిల్లింగ్ మధ్య వ్యత్యాసాన్ని సమీక్షిస్తున్నమని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో గృహ వినియోగదారులపై మాత్రమే దృష్టి సారించి భారీగా సంఖ్యలో కేసులు నమోదు చేసిన విద్యుత్ శాఖ.. ఇప్పుడు అరెస్టులు ముమ్మరం చేయడంతో బాధితుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది ఇచ్చే సమాచారం ఆధారంగానే దాడులు జరుపుతున్నామని విజిలెన్స్ విభాగం అధికారులు సమాధానమిస్తున్నారు. నిందితులపై విద్యుత్ చౌర్యం కేసుల నమోదుతో పాటు రూ.1.10 కోట్లకు పైగా జరిమానాలను విద్యుత్ శాఖ విధించింది. దీనికి అదనంగా విజిలెన్స్ విభాగం మరో రూ.47.22 లక్షల జరిమానాలు వేసింది. ఈ జరిమానాలు చెల్లించని పక్షంలో అరెస్టులు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, రెండోసారి విద్యుత్ చౌర్యానికి పాల్పడినందుకే అరుస్టులు చేస్తున్నట్లు అధికారులు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారమిస్తే ఎవరినీ వదలం పరిశ్రమలు, వాణిజ్య అవసరాల కోసం ఎవరు విద్యుత్ చౌర్యం చేసినా .. సమచారమిస్తే దాడులు చేసి కేసులు నమోదు చేస్తాం. ఎవరు విద్యుత్ చౌర్యం చేసినా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. - మురళీధర్ రావు, చీఫ్ విజిలెన్స్ అధికారి, విద్యుత్ శాఖ ఈ ఏడాది కేటగిరీల వారీగా వినియోగదారులపై నమోదైన కేసుల వివరాలు... కేటగిరీలు.. కేసులు గృహ 5,892 వ్యాపార 253 పరిశ్రమ 17 వ్యవసాయ 22 మొత్తం 6,184 -
22 నుంచి పాదయాత్ర
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు డిసెంబరు 22 నుంచి సోమశిల నుంచి పాదయాత్ర ప్రారంభించి అన్ని మండలాలు తిరుగుతానని నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. అనుమసముద్రంపేట లోని వీజీఆర్ రైస్ మిల్లు సమీపంలో శుక్రవారం మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, ఆ పార్టీ యువ నాయకులు పందిళ్లపల్లి గోపిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల పరిచయ సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఆత్మకూరు తమ సొంత నియోజకవర్గమని, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు. జిల్లాలో ఆత్మకూరును రోల్‌మోడల్ నియోజకవర్గంగా చేస్తానన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి తన గెలుపునకు కృషి చేయాలని కోరారు. -
వివాహితపై ఇద్దరి లైంగిక దాడి
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: రైస్‌మిల్లులోని ఓ కూలీపై తోటి కూలీలు ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. ఇబ్రహీంపట్నం సీఐ మహ్మద్‌గౌస్ కథనం ప్రకారం వివరాలు.. సాగర్ రహదారిపై మంగల్‌పల్లి గేట్ సమీపంలోని క్వార్టర్స్‌లో బీహార్‌కు చెందిన దినేశ్(27), బజన్లాల్(25) ఉంటున్నారు. వీరు స్థానికంగా ఉన్న ఓ రైస్‌మిల్లులో కూలీలుగా పనిచేస్తున్నారు. అదే రైస్‌మిల్లులో చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఓ వివాహిత కూడా పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆమె బహిర్భూమికి వెళ్తుండగా దినేశ్, బజన్లాల్ ఆమెను అటకాయించి సమీపంలోని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. వివాహిత విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. శనివారం సాయంత్రం బాధితురాలు తన కుటుంబీకులతో ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ మహ్మద్‌గౌస్ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారు. -
రైస్‌మిల్లులపై విజిలెన్స్ దాడులు
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: నగరంలోని పలు రైస్‌మిల్లులపై పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్ అధికారులు, డిప్యూటీ తహశీల్దార్లు సోమవారం దాడులు నిర్వహించారు. ‘ఎల్లలు దాటుతున్న మన బియ్యం’ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన వార్తకు జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం స్పందించారు. జిల్లావ్యాప్తంగా రైస్‌మిల్లులపై దాడులకు ఆదేశాలు జారీచేశారు. స్టోన్‌హౌస్‌పేటలోని లక్ష్మీప్రసన్న, కో ఆపరేటివ్ సొసైటీ మిల్లులపై అధికారులు దాడులు చేశారు. దీంతోపాటు శ్రీలక్ష్మీపద్మావతీ రైస్‌మిల్లులో కూడా తనిఖీలు నిర్వహించి బియ్యం శాంపిళ్లు సేకరించారు. నివేదికలను జేసీకి అందజేస్తామని అధికారులు తెలిపారు. జేసీ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ శాంపిళ్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెట్రోలు, కిరోసిన్ బంకులపై కూడా దాడులు జిల్లాలో ఒక పెట్రోల్, 11 కిరోసిన్ హోల్‌సేల్ బంకులతోపాటు ఆరు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలపై దాడులు నిర్వహించామని జేసీ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన గ్యాస్ ఏజెన్సీలకు రూ.1.55 లక్షలు, ఆయిల్ ట్రేడర్లకు రూ.60 వేలు జరిమానా విధించామని చెప్పారు. కోవూరు కిరోసిన్ బంకు (జ్యోతి ఏజెన్సీ) లెసైన్సు రద్దుచేశామన్నారు. మిల్లులకు రూ.46,342 జరిమానా విధించినట్లు తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ, కావలి ఏఎస్వో శ్రీహరి, సీఎస్ డీటీలు లాజరస్, కాయల సతీష్‌కుమార్ పాల్గొన్నారు. -
మామూళ్లపైనే నజర్
హుజూరాబాద్, న్యూస్‌లైన్ : ‘నా మిల్లులో ఉన్న తాలు బియ్యాన్ని చూసి ఇవి రేషన్ బియ్యమని, సీజైన మిల్లులో బియ్యమెలా ఉంటాయని బ్లాక్మెయిల్ చేస్తే రూ.36 వేలు ఇచ్చా. మళ్లీ అవే బియ్యాన్ని కారణంగా చూపిస్తూ ప్రతీసారి మామూళ్లు అడిగితే కాదన్నా... అందుకే నా మిల్లులో తనిఖీలు చేయించారు.’ - హుజూరాబాద్‌లోని శోభ రైస్‌మిల్లు యజమాని శీల శ్రీనివాస్ ఆవేదన ఇది. హుజూరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేందర్ తనను ప్రతీసారి బ్లాక్మెయిల్ చేస్తూ మిల్లులో సోదాలు జరిపిస్తామని బెదిరిస్తూ వేధిస్తున్నాడని మిల్లులో మంగళవారం తనిఖీల సమయంలో బహిరంగంగానే ఆరోపించారు. జిల్లాలో అంతటా ఇదే పరిస్థితి ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మిల్లర్లు గుట్టుచప్పుడు కాకుండా అక్రమాలు చేస్తుండగా పసిగడుతున్న అధికారులు ములాఖత్ అవుతున్నారే తప్ప వాటి గుట్టు విప్పడం లేదు. మామూళ్లు ఇచ్చినప్పుడు చూసీ చూడనట్లు వ్యవహరించడం... ఇవ్వకపోతే తనిఖీలు చేసి కేసులు పెట్టడం సాధారణమైపోయిందని పలువురు మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు ఈ పనిని చక్కగా నెరవేరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాను డబ్బులు ఇవ్వనందుకే తహశీల్దార్‌ను పిలిపించి తనిఖీలు చేయించారని, ఈ వ్యవహారం వెనక ఆర్ఐ సురేందర్ ఉన్నారని, న్యాయం తనవైపే ఉందని, ఏ విచారణకైనా సిద్ధమని, కలెక్టర్, జేసీ, ఏసీబీ డీఎస్పీలకు ఫిర్యాదు చేస్తానని శోభ మిల్లు యజమాని శ్రీనివాస్ అందరిముందే చెబుతున్నాడంటే అధికారుల తీరు ఎలా ఉందో తెలుస్తోంది. కొందరు మిల్లర్లు మాత్రం తమకొందుకొచ్చిన గొడవలే అన్నట్లు అధికారులను మచ్చిక చేసుకుంటున్నారు. ఇలాంటి అధికారులపై ఫిర్యాదు చేస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించి వారికి ఆమ్యామ్యాలు ముట్టజెప్పి తమ అక్రమాలు సాగిస్తున్నారు. అందుకే తనిఖీలు... కేసుల నమోదు నామమాత్రంగా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీజైన బియ్యం తరలింపు హుజూరాబాద్ మండలం బోర్నపల్లి శివారులోని శోభ ఇండస్ట్రీస్‌లో మంగళవారం రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి పట్టుకున్న 116.5 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు శ్రీరామ రైస్‌మిల్లుకు తరలించారు. మిల్లు యజమాని శ్రీనివాస్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. బుధవారం తహశీల్దార్ సురేశ్, సివిల్ సప్లయ్ డెప్యూటీ తహశీల్దార్ ఎలమంద, ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పంచనామా నిర్వహించి ఈ బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించి మరో మిల్లుకు తరలించారు. -
మిల్లర్ల అక్రమాలకు చెక్!
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రైస్ మిల్లర్ల ఆధిపత్యానికి, అక్రమాలకు చెక్ పడనుంది. అందు కు అనుగుణంగా పౌరసరఫరాల శాఖ అధికారులు లెవీ సేకరణలో నూతన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కొంత మంది మిల్లర్లు తమకున్న పలుకుబడిని అడ్డంగా పెట్టుకొని లెవీలో అక్రమాలకు పాల్పడుతున్నారు. మరికొందరు దొడ్డిదారిన బియ్యా న్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నూతన విధానంతో వాటికి చెక్ పడనుంది. ప్రతి మిల్లరు తాను కొనుగోలు చేసే ధాన్యంలో 75 శాతం లెవీకి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏటా ప్రజా అవసరాల కోసం పౌరసరఫరాల శాఖ ఇప్పటి వరకూ జిల్లా యూ నిట్‌గా లెవీ సేకరణ చేస్తోంది. కొత్త విధానం ఈ అక్టోబర్ నుంచి అమలు కానుంది. ఈ మేర కు జీఓ నంబర్ 18ని జారీచేశారు. ఈ విధానం ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అమలు కానుంది. 75 శాతం బియ్యం లెవీకి... ప్రతి రైస్‌మిల్లులో తయారైన బియ్యంలో 75 శాతం ప్రభుత్వానికి లెవీ రూపంలో అందించవలసి ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నా...రైస్‌మిల్లుల యజ మానులు నిబంధనలను సక్రమంగా పాటించ డం లేదు. 60 నుంచి 70 శాతం మాత్రమే లెవీ ఇస్తున్నారు. నూతన విధానంతో తప్పని సరిగా 75 శాతం లెవీకి అందజేయాలి. జిల్లాలో 102 మిల్లులున్నాయి. వాటిలో మిల్లుల వారీగా ధాన్యం కొనుగోలు రికార్డులను సివిల్ సప్లయ్ అధికారులకు అందించవలసి ఉంది. రికార్డులను పరిశీలించి ధాన్యం కొనుగోళ్ల ఆధారంగా లెవీ లక్ష్యాన్ని నిర్ధారించి బియ్యం సేకరిస్తారు. ఈ నూతన విధానంతో ప్రతి మిల్లర్ తప్పనిసరిగా లక్ష్యం మేరకు లెవీకి బియ్యం ఇవ్వాలి. లెవీకి ఇస్తేనే పర్మిట్లు... ప్రతి రైస్‌మిల్లులో తయారైన బియ్యంలో 75శాతం లెవీకి ఇస్తే నే మిగతా 25 శాతం బియ్యం ఎగుమతులు చేసుకోవటానికి పౌరసరఫరాల శాఖ అనుమతులు ఇస్తుంది. గతంలో కూడా ఒకసారి ఇలాగే లెవీ సేకరణలో జిల్లా యూనిట్ విధానాన్ని రద్దు చేశారు. ఆ సమయంలో సేకరణ వేగంగా జరిగింది. నూతన విధానంతో బియ్యం ఇవ్వని వారికి మాత్రమే పర్మిట్లు నిలిపి వేస్తారు. దీంతో అటు మిల్లర్లకు, ఇటు అధికారులకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది. ఖరీఫ్ లెవీ సేకరణ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఖరీఫ్ ధాన్యం మార్కెట్లోకి రావడం అక్టోబర్‌లోనే ప్రారంభమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లక్ష్యాన్ని నిర్ణయిస్తున్నారు. 2012-13లో లక్షా 58 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించవలసి ఉండగా ఇప్పటి వరకూ లక్షా 40 వేల మెట్రిక్ టన్నులను సేకరించారు. ఏడు వేల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించవలసి ఉండగా నాలుగు వేల మెట్రిక్ టన్నులు సేకరించారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ నెలాఖరు నాటికి లెవీ నూరుశాతం పూర్తి కావలసి ఉంది. ఈ నూతన విధానం వల్ల మిల్లర్లందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉంది.