బిట్రగుంట: బోగోలు మండలం చెంచులక్ష్మీపురంలోని శ్రీవెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్‌పై విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ముందస్తు సమాచారంతో దాడి తనిఖీ చేశారు. రైస్‌మిల్లులో 38 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రైస్‌మిల్లు యజమానిపై 6ఏ కింద కేసు నమోదు చేశారు. మిల్లు రికార్డులు పరిశీలించగా అవకతకవలను గుర్తించారు. కొనుగోలు కేంద్రం ద్వారా మిల్లుకు తరలించిన ధాన్యానికి రికార్డులు లేకపోవం, పరిమితికి మించి ధాన్యాన్ని నిల్వ ఉంచడాన్ని గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. రికార్డులు స్వాధీనం చేసుకుని సమగ్రంగా పరిశీలిస్తున్నారు. దాడుల్లో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ధనుంజయరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఎనిమిది నెలల్లో రెండోసారి
శ్రీవెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్‌పై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. రేషన్ డీలర్ల నుంచి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికే విక్రయించడం, దళారుల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రూ.లక్షలు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. గతేడాది సెప్టెంబర్ 21న విజిలెన్స్ అధికారులు మిల్లుపై దాడి చేసి రూ.10 లక్షలు విలువైన 659 క్వింటాళ్ల ధాన్యానికి రికార్డులు లేనట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని 6ఏ కింద కేసులు నమోదు చేశారు. తాజాగా మరో మారు దాడులు నిర్వహించి రేషన్ బియ్యంతో పాటు రికార్డులు లేని ధాన్యాన్ని గుర్తించారు.
రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు
Published Wed, May 18 2016 9:53 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM
Advertisement
Advertisement