Vigilance raids
-
గుట్టల గుట్టలుగా నోట్ల కట్టలు
-
నకిలీ సర్టిఫికెట్ల పై విజిలెన్స్ దృష్టి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికెట్ల కుంభకోణంపై అధికారులు మళ్లీ దృష్టి సారించారు. పింఛన్లు, పన్ను మినహాయింపులు, ఇతర సౌకర్యాలు పొందేందుకు కొందరు అనర్హులు అక్రమంగా వైకల్య సర్టిఫికెట్లు పొందినట్లు ‘సాక్షి’2022 జనవరిలోనే బయటపెట్టింది. నాడు అధికారులు కొద్దిరోజులు హడావిడి చేసి.. ఆ తర్వాత మిన్నకుండిపోయారు. ఏసీబీ విచారణ జరిపినా దోషులను తేల్చలేకపోయింది. తాజాగా విజిలెన్స్ విభాగం నాటి ఏసీబీ నివేదిక దుమ్ము దులిపింది. లోతుగా దర్యాప్తు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికెట్ల దందాను నాడు సాక్షి బయటపెట్టింది. ఒక్క ఇల్లందకుంట మండలంలోనే 1,086 వైకల్య పింఛన్లలో అనేకం అనుమానాస్పదంగా ఉన్నాయన్న విషయా న్ని వెలుగులోకి తెచి్చంది. దీనిపై ఆ సమయంలో డీఆర్డీఏ, కరీంనగర్ సివిల్ ఆసుపత్రి వర్గాలు పరస్పరం నిందించుకుని ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. ఈ అంశంపై నిర్వహించిన ఏసీబీ విచా రణ కూడా డీఆర్డీఏ, సివిల్ ఆసుపత్రి కనుసన్నల్లోనే జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు లో ఇంతవరకూ దోషులను తేల్చకపోవటం ఆ ఆరోపణలకు బలాన్నిచి్చంది. తాజాగా ఈ కుంభకోణంపై దృష్టిపెట్టిన విజిలెన్స్ అధికారులు.. విష యాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దృష్టికి తీసుకెళ్లారు. ఆవిడ ఆదేశాలతో రంగంలోకి దిగి.. అనుమానాస్పద సర్టిఫికెట్లు అన్నీ 2011 నుంచి 2021 మధ్య జారీ చేసినట్లు తేల్చారు. ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులను ప్రశ్నించినా పెద్దగా సమాచారం రాబట్టలేకపోయారు. ఈ కుంభకోణంపై ఏసీబీ డీజీ శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా దృష్టిపెట్టి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఇది పైకి కనిపిస్తున్నంత చిన్న కుంభకోణం కాదని అధికారులు అంటున్నారు. ఈ సర్టిఫికెట్లను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగాలు, పన్ను రాయితీలు, పింఛన్లు, ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు పొందుతున్న విషయాన్ని విజిలెన్స్ గుర్తించింది. ఈ కుంభకోణంలో నిందితులను ఎవరినీ ఉపేక్షించేది లేదని ఓ ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. భారీ నష్టమే..నెలకు రూ.3000 పింఛనే కదా.. వాటివల్ల ఏం నష్టం అని ఈ కుంభకోణం గురించి చాలామంది అనుకుంటున్నారు. కానీ, ఇది చాలా లోతైన కుంభకోణం. ఉదాహరణకు ఇల్లందకుంట మండలంలో 1,086 వైకల్య ఆసరా పింఛన్లు ఉన్నాయి. వీరందరికీ నెలకు రూ.3000 చొప్పున పింఛన్ చెల్లిస్తే.. దాదాపు రూ. 32 లక్షల పైనే అవుతుంది. ఏడాదికి దాదాపు రూ.4 కోట్లు అవుతుంది. అలాగే బస్ పాసులు, బ్యాంకు రుణాలు, లైసెన్సులు, రిజర్వేషన్లు, ఐటీ పన్ను మినహాయింపు.. ఇలా నెలనెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు కోట్లలో చిల్లు పడుతోంది. చాలామంది వ్యాపా రులు దివ్యాంగులమని సర్టిఫికెట్లు తీసుకుని ఏటా రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఆదాయ పు పన్ను మినహాయింపు పొందుతున్నారు. ప్రభు త్వ ఉద్యోగులు బదిలీలు, పదోన్నతుల్లో వీటిని అడ్డం పెట్టుకుని కోరుకున్న చోట పోస్టింగులు పొందుతున్నారు. దీంతో ఎంతలేదన్నా.. ఒక్క నకిలీ సర్టిఫికెట్తో నెలనెలా సుమారు రూ.20 వేల వరకు లబ్ధి పొందవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న నకిలీ సదరం సర్టిఫికెట్లలోనూ అధికభాగం చెవిటి సమస్య ఉన్నవారే కావడం గమనార్హం. ఇతర వైకల్యాలైతే ఆ సమస్య ఉన్నట్లు బయటకు నటించాల్సి ఉంటుంది. చెవుడు సమస్య అయితే.. పెద్దగా నటించాల్సిన అవసరం ఉండదు. అందుకే చాలామంది వాటినే తీసుకొన్నారు. -
విజిలెన్స్ దాడుల్లో భారీగా పట్టుబడ్డ వంట నూనె
-
మాజీ మంత్రికి ఝలక్.. 69 చోట్ల విజిలెన్స్ సోదాలు
అన్నాడీఎంకే మాజీ మంత్రులపై డీఎంకే ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. ఇప్పటికే నలుగురు మాజీలపై అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన డీవీఏసీ తాజాగా తంగమణి లక్ష్యంగా సోదాలు చేపట్టింది. ఇందులో ఇప్పటివరకు రూ.2.37 కోట్లు లెక్కలోకి రాని నగదు, 40 కేజీల వెండి, 1.5 కేజీల బంగారం సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): మాజీ మంత్రి తంగమణిని బుధవారం డీవీఏసీ (డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్) టార్గెట్ చేసింది. తంగమణి, ఆయన కుటుంబం, సన్నిహితులకు సంబంధించిన సంస్థలు, ఇళ్లు, కార్యాలయాలు అంటూ 69 చోట్ల అధికారులు సోదాల్లో నిమగ్నమయ్యారు. ఈ చర్యల్ని అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించారు. కక్షసాధింపు ధోరణి తగదని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సిద్ధం చేసిన జాబితా మేరకు.. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు సాగిన అక్రమాలు, నిధుల దుర్వినియోగం, లంచగొండితనం తదితరుల వ్యవహారాలపై ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఓ జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. వీరిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. తాజాగా, తాము అధికారంలోకి వచ్చినానంతరం ఆ జాబితాలో ఉన్న అవినీతి రాయుళ్ల భరతం పట్టే దిశగా డీఎంకే ప్రభుత్వం దూకుడు పెంచింది. తొలుత రవాణశాఖ మాజీ మంత్రి ఎంఆర్ విజయ భాస్కర్‌ను టార్గెట్ చేసి సోదాలు విస్తృతం చేసి, ఆయన్ని విచారణ వలయంలోకి తెచ్చా రు. తదుపరి ఆరోగ్యశాఖ మాజీమంత్రి ఎంఆర్ విజ య భాస్కర్, రిజస్ట్రేషన్ల శాఖ మాజీ మంత్రి వీరమ ణిని టార్గెట్ చేశారు. ఇటీవల నగరాభివృద్ధి శాఖ మంత్రి, పళనిస్వామి సన్నిహితుడు ఎస్పీ వేలుమణిపై దృష్టి పెట్టారు. తాజాగా మరో సన్నిహితుడు, విద్యుత్‌శాఖ మాజీ మంత్రి తంగమణి లక్ష్యంగా డీవీఏసీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తు లు గడించినట్టు ఆయనపై కేసు నమోదు చేసింది. ఏక కాలంలో సోదాలు 2016–2021 మధ్య కాలంలో ఆదాయానికి మించి రూ.4.85 కోట్లు ఆస్తుల్ని తంగమణి గడించినట్టు ఆధారాలతో సహా తేల్చిన డీవీఏసీ వర్గాలు కేసు నమోదు చేశాయి. ఆయన భార్య శాంతి, కుమారు డు ధరణి ధరణ్‌ను సైతం ఈ కేసులో చేర్చారు. దీంతో బుధవారం ఉదయాన్నే పలు బృందాలుగా డీవీఏసీ అధికారులు రంగంలోకి దిగారు. ఏక కాలంలో తంగమణి ఆస్తులు, సన్నిహితుల ఇళ్లు, బినామీ సంస్థలపై దాడులకు దిగారు. చెన్నై, నామక్కల్, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్ తదితర తొమ్మిది జిల్లాలతో పాటుగా ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల్లోని నివాసాలు, కార్యాలయాల్లో అనేకచోట్ల పొద్దు పోయే వరకు సోదాలు జరిగాయి. నామక్కల్ జిల్లా ఆలపాళయంలోని తంగమణి ఇంట్లో సోదాలు సాగుతున్నాయి. ఈ సమయంలో అన్నాడీఎంకే వర్గాలు అక్కడికి తరలివచ్చి వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నైలో అరుంబాక్కం, షెనాయ్ నగర్‌తో పాటుగా 14 చోట్ల, సేలంలోని తంగమణి కుమారుడు ధరని ధరణ్ ఇంట్లోనూ సోదాలు సాగుతున్నాయి. పలు ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, బినామీ సంస్థలు, పలు చోట్ల పెట్టుబడులే కాకుండా క్రిష్టోకరెన్సీలోనూ పెట్టుబడులు పెట్టినట్టుగా ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల సోదాలు ముగిసినా, తంగమణి, ధరణి ధరణ్ నివాసాలు, టైల్స్ సంస్థలు, మాల్స్‌లలో ఇంకా సోదాలు సాగుతున్నాయి. కాగా ఇప్పటివరకు రూ.2.37 కోట్లు లెక్కలోకి రాని నగదు, 40 కేజీల వెండి, 1.5 కేజీల బంగారం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కక్ష సాధింపు తగదు డీవీఏసీని ఉసిగొలిపి డీఎంకే ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగుతోందని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో–కన్వీనర్ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సేలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికల వాగ్దానాల్ని విస్మరించిందని, వీటిని కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీ వర్గాల మీద కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా తాము నిరసనలకు పిలుపు నివ్వగానే కేసులు, దాడులు అంటూ ముందుకు సాగడం శోచనీయమన్నారు. ఈ విషయంపై నగరాభివృద్ధి శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ స్పందిస్తూ, 2011 తర్వాత తనతో పాటుగా డీఎంకే వర్గాల్ని అన్నాడీఎంకే సర్కారు పెద్దఎత్తున అరెస్టు చేయించిందని గుర్తు చేశారు. అది కక్షసాధింపు అయితే, ఇది కూడా అలాగే అనుకోనివ్వండి అని పేర్కొన్నారు. -
మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఇంట్లో సోదాలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణికి సంబంధించిన ఇళ్లు, సంస్థలే లక్ష్యంగా మంగళవారం తమిళనాడులో 60 చోట్ల డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీకరప్షన్ (డీవీఏసీ) సోదాలు నిర్వహించింది. ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ దాడులు జరిగాయి. వేలుమణితో సహా 17 మందిపై డీవీఏసీ కేసుల్ని నమోదు చేసింది. డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం గత నెల అన్నాడీఎంకేకు చెందిన రవాణాశాఖ మాజీ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్‌పై ఐటీ దాడులు జరిగాయి. ప్రస్తుతం నగరాభివృద్ధి శాఖ మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి టార్గెట్‌గా కోయంబత్తూరులో 42 చోట్ల, చెన్నైలో 16 చోట్ల, దిండుగల్, కాంచీపురంలలో తలా ఓ చోట డీవీఏసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో చెన్నై , కోయంబత్తూరు కార్పొరేషన్లలో రూ. 810 కోట్ల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు, మంత్రి , ఆయన సన్నిహితులు ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్లు దర్యాప్తులో స్పష్టం కావడంతో డీవీఏసీ ఈ దాడులు చేసింది. వేలుమణి, ఆయన సోదరుడు అన్భరసన్, సన్నిహితుడు చంద్రశేఖర్, గతంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన మధురాంతకీ, చెన్నై కార్పొరేషన్ ప్రధాన ఇంజినీరు నందకుమార్, మాజీ ఇంజినీరు పుగలేంది ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. కాగా దాడులను నిరసిస్తూ అన్నాడీఎంకే వర్గాలు పలుచోట్ల ఆందోళన నిర్వహించాయి. -
గ్రానైట్ అక్రమార్కులపై విజిలెన్స్ పంజా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ హయాంలో గ్రానైట్ అక్రమ రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయింది. అప్పట్లో ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ క్వారీల నిర్వాహకులు, వ్యాపారులు అక్రమాలకు తెరలేపగా.. టీడీపీ నాయకులు యథేచ్ఛగా అక్రమ దందా నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ గనులను అడ్డగోలుగా దోచేశారు. క్వారీల నిర్వాహకులు, లీజుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.కోట్లకొద్దీ రాయల్టీని ఎగ్గొట్టారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించటంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా అక్రమాలను వెలుగులోకి తీశారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. 155 క్వారీల్లో అక్రమాలు ఇప్పటివరకు జరిపిన విచారణలో 155 గ్రానైట్ క్వారీల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు తేలింది. వీటి నిర్వాహకులకు రూ.3,527 కోట్లు జరిమానా విధించేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు గ్రానైట్ ఫ్యాక్టరీలు, పాలిషింగ్ యూనిట్లపైనా విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. వీరినుంచి కూడా జీఎస్టీ, రాయల్టీ రూపంలో మరో రూ.2 వేల కోట్లు జరిమానా విధించేందుకు సన్నద్ధం కాగా.. గ్రానైట్ క్వారీ లీజుదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విజిలెన్స్ విచారణకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించిన వారిపై 100 పైగా కేసులు నమోదు చేయించి ఆట కట్టించారు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ఎగ్గొట్టడం వెనుక ప్రకాశం జిల్లాలోని భూగర్భ గనుల శాఖ (మైనింగ్) అధికారుల పాత్ర కూడా ఉంది. దాదాపు రాయల్టీ రూపంలో రూ.వెయ్యి కోట్లకు పైగా ఎగ్గొట్టినట్టు విజిలెన్స్ లెక్కలను బట్టి అర్థమవుతోంది. అక్రమాలకు చెక్ పెడతాం ఎవరైనా గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడితే సహించేది లేదు. క్వారీల్లోంచి బయటకు తీసిన ప్రతి రాయి రవాణా చేసేప్పుడు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ప్రభుత్వ ఆదాయానికి ఏ ఒక్కరైనా గండి కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. గ్రానైట్ రవాణాపై ఎప్పటికప్పుడు విజిలెన్స్ నిఘా ఉంటుంది. – కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, ఏఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చదవండి: గోదావరి డెల్టాలకు పోల‘వరం’ -
ఏపీలోని ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్స్ అధికారుల దాడులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కారణంగా రోగులు ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో పలు ఆస్పత్రుల పై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం 9 ప్రైవేట్ ఆస్పత్రులపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. రోగుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడమే గాక పేషెంట్ల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకుగాను ఏలూరులోని చైత్ర ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లాలో రోగుల వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తుండడంతో ఆశా ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. విశాఖ ఎస్ఆర్ హాస్పిటల్, అనిల్ నీరుకొండ కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఆస్పత్రులు అధిక ధరలు వసూలు, రెమిడెసివర్ దుర్వినియోగం చేస్తుండడంతో వాటిపై కేసులు నమోదయ్యాయి. పలువురు ఆస్పత్రిలపై కేసు నమోదు విశాఖలోని రమ్య ఆస్పత్రి యాజమాన్యం అనుమతులు లేకుండా కోవిడ్ వైద్యం చేస్తున్నారని కేసు నమోదు చేశారు. విజయవాడ శ్రీరామ్ ఆస్పత్రిపైన కేసు నమోదు అయ్యింది. గుంటూరు విశ్వాస్ హాస్పటల్ లో అనుమతి లేకుండా వైద్యం చేయడమే కాకుండా అధిక ఫీజు వసూలు చేస్తున్నారు. పీలేరు ప్రసాద్ హాస్పటల్ యాజమాన్యం అధిక ఫీజు వసూలు, ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడం లేదు. ఇలా పలు రకాల కారణంగా ఈ ఆస్పత్రులపై అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 37 ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. (చదవండి: అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం ) -
‘మెడాల్’ మాయ.. టెస్టులు పేరుతో దందా
ఒంగోలు: వైద్యో నారాయణో హరి.. అని ప్రపంచం మొత్తం కొనియాడుతున్న వేళ కొందరు అక్రమార్కుల చేష్టలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. ప్రపంచం మొత్తాన్ని కోవిడ్ వణికిస్తున్న వేళ కనిపించని శత్రువుపై జనం సామూహిక పోరాటం సాగిస్తున్న తరుణంలో కొన్ని ఆస్పత్రులు, ల్యాబ్‌ల నిర్వాహకులు కాసుల వేట ప్రారంభించారు. నాణ్యమైన వైద్యం అందించేందుకు రోగి వ్యాధి తీవ్రతను గుర్తించేందుకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి పలు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగాలు సంయుక్తంగా జిల్లా కేంద్రం ఒంగోలులోని మెడాల్ కేంద్రంపై దాడులు జరిపాయి. కేవలం ఒక్క సిటీ స్కాన్కే రూ.2,000 అదనంగా వసూలు చేస్తున్నట్లు తనిఖీల్లో స్పష్టమైంది. కోవిడ్ పరీక్షల పేరుతో అటు ఆసుపత్రులు, ఇటు ప్రైవేటు ల్యాబ్‌లు డబ్బులు దండుకుంటున్నాయన్న విమర్శలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. అయిన దానికి, కాని దానికి సిటీ స్కాన్ పేరుతో అనవసర పరీక్షలు చేయిస్తున్నారు. తద్వారా వ్యాధి నిర్థారణకే ప్రజలు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సిటీ స్కాన్‌కు ప్రభుత్వం రూ.2500 మాత్రమే వసూలు చేయాలని ఉత్తర్వులు జారీచేయగా కొన్ని ల్యాబ్‌లు రూ.4వేల నుంచి రూ.4500 వరకు వసూలు చేస్తున్నాయి. కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నవారు, ప్రైమరీ లేదా సెకండరీ కాంటాక్టులు ఉన్నవారు ప్రైవేటు ల్యాబ్‌లు, ఆసుపత్రులను ఆశ్రయిస్తుండటంతో నిర్ధారణ పరీక్షకు 1400లు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా అవసరాన్ని బట్టి అధిక దోపిడీ చేస్తున్నారు. ఇక రూ.800కు గతంలో చేసే రక్త పరీక్షలు ఇప్పుడు రూ.1500కు పెంచేశారు. ఇలా పలు విధాలుగా ప్రజానీకం దోపిడీకి గురవుతున్న వేళ మెడాల్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం సంచలనంగా మారింది. తనిఖీ ఇలా.. కోవిడ్‌తో బాధపడుతున్న ఒక పేషెంటుకు సిటీ స్కానింగ్ చేయించుకోవాల్సి వచ్చింది. అతను ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కన్నా అధిక మొత్తం వసూలు చేస్తున్నారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ కార్యాలయంలో రాత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో విజిలెన్స్ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి ఒక వైద్యుడు సంయుక్తంగా గురువారం మెడాల్ ల్యాబ్‌కు వెళ్లారు. ఫిర్యాదుదారు నుంచి సిటీ స్కాన్‌కు రూ.4500 వసూలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా గుర్తించారు. అనంతరం మెడాల్ కేంద్రంలోని పరీక్షల యంత్రాలను పరిశీలించారు. ఇన్స్ట్రుమెంటల్ సర్టిఫికేట్లు కావాలని కోరగా కొన్ని చూపించలేకపోయారు. రిసెప్షన్ కౌంటర్ వద్ద ఏయే పరీక్షకు ఎంతెంత వసూలు చేస్తున్నారో బోర్డు ప్రదర్శించాల్సి ఉన్నా అది కూడా లేనట్లు గుర్తించారు. దీంతో మెడాల్ ఒంగోలు బ్రాంచి మేనేజర్ సాయికిరణ్‌కు వారంరోజుల్లోగా అన్ని పత్రాలను సమర్పించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. హార్డ్డిస్్కలలో లభించే సమాచారం ఆధారంగా జిలా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు విజిలెన్స్ అధికారులు మెడాల్ ఒంగోలు కేంద్రంపై చర్యలకు సిఫార్సు చేయనున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. -
జేసీ ట్రావెల్స్ రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు
సాక్షి, విజయవాడ : దివాకర్ ట్రావెల్స్ పేరుతో జేసీ దివాకర్‌రెడ్డి అక్రమాలు బయటపడుతున్నాయి. రవాణాశాఖ జరుపుతున్న దర్యాప్తులో అనేక వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, నాగాలాండ్ రాష్ట్రాల్లో జేసీ ట్రావెల్స్ అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. అశోక్ లేలాండ్ వద్ద స్కాప్ లారీలను కొనుగోలు చేసిన జేసీ వాటిని బస్సులుగా మార్చినట్లు ఆయన తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో స్కాప్ లారీలను బస్సులుగా రిజిస్టర్ చేయించారని, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ పేరుతో 43 వాహనాలు, జఠాథర కంపెనీ పేరుతో 26 వాహనాలు కొన్నట్లు రికార్డులు సృష్టించారని వెల్లడించారు. ఆరు వాహనాలను తనిఖీలు చేసినప్పుడు అక్రమాలు వెలుగు చూశాయని ప్రసాద్‌రావు తెలిపారు. రవాణాశాఖ ప్రత్యేక బృందం నాగాలాండ్‌లో కూడా దర్యాప్తు జరుపుతుందని, నాగాలాండ్‌లో కొన్నట్లు చూపిన బస్సులో కూడా బోగస్ సర్టిఫికెట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఇచ్చే నో క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా బోగస్‌వే పెట్టారని తెలిపారు. ఇప్పటి వరకు 66 స్కాప్ లారీలను బస్సులుగా మర్చినట్లు గుర్తించారని, మరో 88 వాహనాలు కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. సుప్రీంకోర్టు చట్టాల ప్రకారం ఈ బస్సులకు అనుమతి లేదని, జేసీ ట్రావెల్స్‌లోని బస్సుల రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా సమాచారం ఇచ్చామని ,అక్కడ కూడా రిజిస్ట్రేషన్లు రద్దు అవుతాయన్నారు. తమ శాఖలో ఎవరి పాత్ర అయినా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేసీ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేశామని, బోగస్ సర్టిఫికెట్లు పెట్టినందుకు పోలీస్ శాఖ కూడా కేసు నమోదు చేసిందని తెలిపారు. కేవలం జేసీ ట్రావెల్స్పైనే తనిఖీలు చేయలేదని, గత ఏడాది కాలంలో 14వేల కేసులు నమోదు చేశామని వెల్లడించారు. రూ.4కోట్లకుపైగా ఫైన్ వసూలు చేశామని ప్రసాద్‌రావు తెలిపారు. -
నిత్యావసరాలపై విజిలెన్స్
ఉత్పత్తి, రవాణాలో అంతరాయాన్ని అదనుగా తీసుకుని వ్యాపారులు నిత్యావసరాలను బ్లాక్ చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో రేషన్ బియ్యం, పప్పు దినుసులతో పాటు ఉల్లిపాయలను పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రతి నిత్యావసర సరుకులను గోడౌన్లకు తరలించి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా బ్లాక్ మార్కెట్‌పై విజిలెన్స్ సీరియస్‌గా దృష్టి సారించింది. అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఉల్లి అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తోంది. మార్కెట్లో ధరలు దిగివచ్చి.. స్థిరీకరణ వచ్చే వరకు దాడులు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉల్లిపాయల నుంచి రేషన్ బియ్యం వరకు నిత్యావసర సరుకులన్నీ నల్లబజార్‌కు చేరిపోతున్నాయి. మార్కెట్లో బడా వ్యాపారులు నిత్యావసరాలకు కృత్రిమ కొరత సృష్టించి స్టాక్‌ను బ్లాక్ చేస్తున్నారు. ధరలు భారీగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో జిల్లాలోని కొందరు వ్యాపారులు భారీగా నిల్వలు చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌ను శాసిస్తూ ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ.. అటు ప్రభుత్వాదాయానికి గండికొడుతున్న అక్రమరవాణా, అనధికార నిల్వలపై విజిలెన్స్ దృష్టి సారించింది. రేషన్‌షాపుల డీలర్లు, వ్యాపారులు కుమ్మక్కై నిత్యావసరాలను బ్లాక్ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేస్తున్నట్లు గుర్తించారు. మరికొందరు పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. వంటకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయించడంతో పాటు వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. నిత్యావసరాల్లో పప్పు దినుసులు, ఉల్లిపాయలు తదితరాలను వ్యాపారులు అక్రమంగా నిల్వలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొద్ది కాలంగా జిల్లా వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేశారు. ఇదే అదనుగా నిత్యావసరాల వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఉల్లి ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి. ఉల్లి దిగుబడులు తగ్గడంతో.. ప్రధానంగా ఉల్లి పంట పండించే మహారాష్ట్రలోని నాసిక్‌లో వరదల వల్ల ఉల్లి పంట సాగు గణనీయంగా తగ్గిపోయింది. దీంతో రాష్ట్రానికి నాసిక్ నుంచి ఉల్లి దిగుమతి బాగా పడిపోయింది. నెలన్నర క్రితం వరకు రూ.30 పలికిన ఉల్లి ధర ప్రస్తుతం రూ.80లకు చేరింది. రెండు వారాల క్రితం అయితే కిలో రూ.104లకు అత్యధిక ధర పలికింది. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు బ్లాక్ మార్కెట్‌పై దృష్టి సారించారు. వరుస దాడులతో ధరలు కొంతమేర దిగి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 30 షాపుల్లో తనిఖీలు నిర్వహించి రూ.1,03,27,910 విలువ చేసే 224.80 టన్నుల ఉల్లిని స్వాధీనం చేసుకుని మార్కెట్ కమిటీ యార్డు అధికారులకు అప్పగించారు. భారీ అక్రమ నిల్వలు స్వాధీనం నెల్లూరు నగరంలోని స్టోన్‌హౌస్‌పేటలోని పలు ఉల్లిపాయల విక్రయ దుకాణాలపై దాడులు చేశారు. కొనుగోలు, విక్రయాలు, నిల్వలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేవని గుర్తించారు. ఆనంద్ ఆనియన్స్(12 టన్నులు), కామాక్షితాయి ఆనియన్స్ (15.75 టన్నులు), ఏవీఎస్ ఆనియన్స్(24.75 టన్నులు), కందె ఆనియన్స్ (19.75 టన్నులు) స్వాధీనం చేసుకుని దుకాణాలను సీజ్ చేశారు. కావలిలో శ్రీజయలక్ష్మి ఆనియన్ మర్చంట్స్ (9 టన్నులు), శ్రీకృష్ణ ఆనియన్స్ (17 టన్నులు) దుకాణాలను సీజ్ చేశారు. దుకాణాల్లోని కొనుగోలు, విక్రయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి తేడాలను గుర్తించారు. కేఆర్ఆర్ ఆనియన్స్ దుకాణంలో 9.30 టన్నులు, హైమావతి అసోసియేట్స్‌లో 14.2 టన్నుల ఉల్లిపాయలను సీజ్ చేసి మార్కెటింగ్ అధికారులకు అప్పగించారు. కావలిలో మొత్తంగా ఆరు దుకాణాల్లోని రూ.42,59,650 విలువ చేసే 98.25 టన్నుల ఉల్లిపాయలను సీజ్ చేసి మార్కెటింగ్ శాఖ అధికారులకు అప్పగించారు. గూడూరు, బచ్చిరెడ్డిపాళెం ప్రాంతాల్లోని ఐదు ఉల్లిపాయల దుకాణాలపై దాడులు చేసి రూ.2.60 లక్షలు విలువచేసే 8.3 టన్నుల ఉల్లిపాయలను సీజ్ చేశారు. రేషన్ బియ్యం పక్కదారిపైనా కేసులు శ్రీకాళహస్తి నుంచి 50 బస్తాల పీడీఎస్ బియ్యం నెల్లూరు వైపు వస్తున్న బొలేరో వాహనాన్ని విజిలెన్స్ అధికారులు ïసీజ్ చేశారు. జిల్లాలోని గూడూరు, కావలి, ఓజిలి, బుచ్చిరెడ్డిపాళెం ఆరు రేషన్ షాపుల్లో తనిఖీలు చేసి నిత్యావసరాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించడంతో పాటు, స్టాక్ల్లో భారీ వ్యత్యాసాలు ఉండడాన్ని గుర్తించారు. రూ.10.20 లక్షలు విలువ చేసే నిత్యావసరాలను సీజ్ చేసి డీలర్లపై 6ఏ కింద కేసులు నమోదు చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు చేశారు. ఒక రేషన్ దుకాణంలో 517 కిలోల బియ్యం, 59 కిలోల చక్కెర, 1.5 కిలోల రాగి పిండి, కంది పప్పు 12 కిలోలు తక్కువగా ఉండటంతో రేషన్ షాపు డీలరపై 6ఏ కింద కేసు నమోదు చేశారు. ఆటోలో తరలిస్తున్న 800 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధిక లోడ్‌తో వెళ్తున్న ఐదు గ్రానైట్ లారీలు, మూడు కంకర లారీలు, 7 ఇటుక ట్రాక్టర్లు, 21 వ్యవసాయ మార్కెటింగ్‌కు సంబంధించిన వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రవాణా శాఖ రూ.6,31,845, మైనింగ్‌శాఖ రూ.30 వేలు, మార్కెటింగ్‌శాఖ రూ. 2,51,158 మొత్తంగా రూ.9,13,003 నగదును జరిమానా కింద వసూలు చేశారు. పరిమితికి మించి అధిక లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ వాహనాలు, గ్రావెల్, బొగ్గు, గ్రానైట్ లారీలు, కంటైనర్లను తనిఖీచేసి వాహనదారుల నుంచి రూ. 17 లక్షల జరిమానా వసూలు చేశారు. ధరలు తగ్గే వరకు తనిఖీలు కొనసాగిస్తాం జిల్లాలో అక్రమాలను గుర్తించి వరుస కేసులు నమోదు చేస్తాం. ప్రధానంగా నిత్యావసరాల్ని బ్లాక్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై సీరియస్ ఫోకస్ కొనసాగుతుంది. గత నెలల్లో ఉల్లి, నిత్యావసరాలు, రేషన్ బియ్యం, ఓవర్ లోడింగ్, బిల్లులు లేకుండా జరిగే అక్రమ రవాణాపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశాం. ముఖ్యంగా మార్కెట్లో నిత్యావసరాలు, ప్రధానంగా ఉల్లి ధరలు తగ్గే వరకు మార్కెట్‌పై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. – వెంకట శ్రీధర్, జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ -
రైతుబజార్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు
సాక్షి, విజయవాడ : స్వరాజ్ మైదానంలోని రైతుబజార్లో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. ఆరు బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైతుబజార్లో ప్రభుత్వ గుర్తింపు కార్డు లేకుండా షాపులు నిర్వహిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని అధికారులు ఈ దాడులు చేపట్టినట్టు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులతో పాటు తూనికలు కొలతల శాఖ అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. రైతుబజార్లో అధిక రేట్లకు అమ్మకాలు జరుపుతున్న వ్యాపారులు.. ప్రభుత్వ గుర్తింపు కార్డు లేకుండా వ్యాపారం చేస్తున్న వారిపై, కూరగాయలను గ్రేడింగ్ చేసి బయట మార్కెట్‌కి పంపుతున్న వారిపై, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు సరిగా పనిచేయని షాప్ యాజమానులపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. -
ఇంద్రకీలాద్రిపై కలకలం
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి పై విజిలెన్స్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. అమ్మవారికి దుర్గగుడి లోని మహామంటపం ఆరో అంతస్తులో మహానివేదన తయారు చేస్తుంటారు. ఇక్కడి వంటశాలలో భారీగా ఉన్న బియ్యం, నెయ్యి, పప్పు ధాన్యాలను గుర్తించారు. అమ్మవారి ప్రసాదాల కోసం నిత్యం తీసుకుంటున్న సరుకులను పూర్తిగా వినియోగించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సదరు సరుకులు కొందరు ఆలయ ఉద్యోగులు గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నారనే ఫిర్యాదులు కూడా విజిలెన్స్ అధికారులకు అందాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ సీఐ వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అలాగే అన్నదానం కోసం వినియోగిస్తున్న సరుకులు, స్టోర్స్ రికార్డులను కూడా పరిశీలించారు. దుర్గగుడిలో ఒకవైపు నకిలీ ఉద్యోగుల కుంభకోణంలో పలువురు ఉద్యోగులు, ఉన్నతాధికారులు పోలీసుల నోటీసులు అందుకున్న నేపథ్యంలో తాజాగా విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఆలయ అధికారుల్లో ఆందోళన రేపుతున్నాయి. ఐఎఎస్ అధికారికి ఆలయ ఇవో బాధ్యతలు అప్పగిస్తే ఆలయం పాలన గాడిలో పడుతుందని భావిస్తే... అందుకు భిన్నంగా వరుస అవకతవకలు బయటపడుతుండటం భక్తుల్లో ఆవేదనకు కారణమవుతోంది. మరోవైపు విజిలెన్స్ అధికారులపై ఇప్పటికే పాత పరిచయాలను ఉపయోగించుకుని విషయం సీరియస్ కాకుండా చూసేందుకు కొందరు ఆలయ అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. -
కోల్డ్ స్టోరేజీలపై విజిలెన్స్ దాడులు
మధిర : ఖమ్మం జిల్లాలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మధిర మండలం ఇల్లందుపాడులో కోల్డ్‌స్టోరేజీలపై జరిపిన దాడుల్లో సుమారు 509 టన్నుల నకిలీ కారం బస్తాల నిల్వలను పట్టుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యుత్ చౌర్యంపై విజిలెన్స్ దాడులు
195 మందిపై చర్యలు, కేసుల నమోదు రూ.27.7 లక్షల జరిమానా నెల్లూరు (అర్బన్) : 8 జిల్లాల ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ ఎస్ఈ రవి ఆధ్వర్యంలో జిల్లాలో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై గుంటూరు, ప్రకాశం నుంచి వచ్చిన అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. కావలి, వింజమూరు, నెల్లూరు, గూడూరు డివిజన్ తదితర ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఆక్వా రంగం, పారిశ్రామిక ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నెల్లూరు బీవీనగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్ల కనెక్షన్లను తనిఖీ చేశారు. విద్యుత్ భవన్ అతిథి గృహంలో ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ ఎస్ఈ వి.రవి విలేకరులకు వివరాలు వెల్లడించారు. కావలి, కోట తదితర ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యం చేస్తున్న ఆక్వా రంగానికి చెందిన ఐదుగురిపై , వ్యాపార రంగానికి చెందిన ముగ్గురిపై కేసులు నమోదు చేశామన్నారు. గృహ విద్యుత్ కనెక్షన్ తీసుకుని వ్యాపార రంగానికి వినియోగిస్తున్న 30 మందిపై, అదనపు లోడ్‌తో విద్యుత్‌ను చౌర్యం చేస్తున్న 142 మందిని పట్టుకున్నామన్నారు. మొత్తం 195 మంది నుంచి రూ.27.7 లక్షలను జరిమానా విధించామన్నారు. తొలిసారిగా విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారిపై భారీగా జరిమానా విధిస్తున్నామన్నారు. రెండో సారి దొరికిన ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు కేసును అప్పగించామన్నారు. ఇతర జిల్లాల నుంచి ప్రత్యేకంగా విజిలెన్సు అధికారులు వచ్చి దాడులు చేసి ఇన్ని కేసులు నమోదు చేస్తుంటే స్థానిక అధికారులు ఒక్క దొంగ కేసును కూడా ఎందుకు పట్టుకోలేక పోయారని విలేకరులు ప్రశ్నించగా సమాధానాన్ని దాటవేశారు. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (అడిషనల్ఎస్పీ) ఎ.మనోహర్, డీఈ రమేష్, సిఐ ఎం.నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ఎఫెక్ట్ : విజిలెన్స్ దాడులు
శ్రీకాకుళం : పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఇసుక మాఫియాపై సాక్షి కథనాలతో శ్రీకాకుళం జిల్లా అధికారులు స్పందించారు. ఇసుక ర్యాంపులపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులకు దిగారు. కొత్తూరు మండలం మాతల పెనుగోటివాడ ఇసుక ర్యాంపులపై అధికారులు దాడులు చేశారు. రైతుల ముసుగులో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఎమ్మెల్యే అనుచరులను అధికారులు గుర్తించారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహరంపై గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్థానిక రెవెన్యూ సిబ్బందిపై విజిలెన్స్ అధికారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైసుమిల్లుపై విజిలెన్స్ దాడులు
62 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం వనంతోపు (పొదలకూరు) : మండలంలోని వనంతోపు సెంటర్లో ఉన్న శ్రీవెంకటేశ్వర రైసుమిల్లుపై శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి 62 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో దాడులు నిర్వహించామన్నారు. శుక్రవారం పొదలకూరుకు సమీపంలో 14 బస్తాల రేషన్ బియ్యంతో వెళ్తున్న ఆటోను పట్టుకున్నట్టు తెలిపారు. ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు వనంతోపు రైసుమిల్లుపై నిఘా పెట్టామన్నారు. ఈ రైసుమిల్లులో 2014లో 400 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్టు గుర్తు చేశారు. ఆటోలో తరలిస్తున్న 14 బస్తాల బియ్యం కూడా వెంకటేశ్వర రైసుమిల్లుకేనని డ్రైవర్ తన వాగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిపారు. మొత్తం 40 క్వింటాళ్ల బియ్యం రూ.92 వేలు విలువైనవిగా పేర్కొన్నారు. 6ఏ కేసును నమోదు చేయనున్నట్టు చెప్పారు. పొదలకూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని కిరాణామర్చంట్స్, రేషన్ షాపుల నుంచి రైసుమిల్లు యజమాని బియ్యాన్ని సేకరించి పాలిష్ పట్టించి సీఎంఆర్ బియ్యంలో కలిపి ప్రభుత్వ గోదాములకు పంపుతున్నట్టు వెల్లడించారు. వెంకటేశ్వర రైసుమిల్లుకు సీఎంఆర్ ధాన్యం సేకరించేందుకు ఈ ఏడాది అనుమతులు ఉన్నట్టు తెలిపారు. శుక్రవారం పొదలకూరు కిరాణా మర్చంట్స్‌లో 250 కిలోల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్టు తెలిపారు. రేషన్‌కార్డుహోల్డర్లు బియ్యంను అమ్మితే కార్డులను రద్దు చేస్తామన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్సై అళహరి వెంకటేశ్వర్లు, ఏఓ ధనుంజయరెడ్డి, పొదలకూరు సీఎస్‌డీటీ గిరి, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.15 కోట్ల విలువైన రేషన్ బియ్యం పట్టివేత
బిక్కవోలు: కాపవరం శివారు రైస్‌మిల్లులో జరిగిన విజిలెన్స్ దాడుల్లో సుమారు రూ.15 కోట్ల,73 లక్షల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్టు విజిలెన్స్ ఎస్పీ టి.రాంప్రసాదరావు శనివారం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బి.ప్రత్తిపాడు నుంచి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న మినీ వ్యాన్‌ను వెంబడించగా ఆ వ్యాన్ అదే మండలంలోని కాపవరం పంచాయతీ పరిధిలోని శ్రీరాజరాజేశ్వరి రైస్‌మిల్లుకు తరలించినట్టు గుర్తించామన్నారు. ఈ మేరకు మిల్లు యాజమాన్యాన్ని విచారించగా కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధించి ప్రభుత్వానికి సరఫరా చేయవలసిన బియ్యానికి బదులుగా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. మిల్లు యాజమాన్యం ఇంకా 12 వందల క్వింటాళ్ళ బియ్యాన్ని సివిల్ సప్లైస్‌కు సరఫరా చేయాల్సి ఉందని విజిలెన్స్ ఎస్పీ రాంప్రసాద్ తెలిపారు. తదుపరి తనిఖీలలో అనపర్తి మండలం దుప్పలపూడిలో వీరికి సంబంధించిన గోడౌన్లో, శ్రీధనలక్ష్మీ రైస్‌మిల్లుల్లో వారి సొంత ధాన్యంతోపాటు కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధించిన ప్రభుత్వ ధాన్యం కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు నిర్వహించిన ఈ దాడుల్లో రూ.15.72 కోట్ల విలువైన ధాన్యం, రేషన్ బియ్యంతోపాటు వాహనాలు, రైస్‌మిల్లు, గోడౌన్లు తదితరు ఆస్తులను సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ మేరకు వ్యాన్ డ్రైవర్ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించనున్నట్లు ఎస్పీ రాంప్రసాద్ తెలిపారు. -
కిరోసిన్ నిల్వలపై విజిలెన్స్ దాడి
250 లీటర్ల స్వాధీనం నెల్లూరు (క్రైమ్) : నీలికిరోసిన్ నిల్వలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బు«ధవారం దాడులు చేశారు. 250 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారుల సమాచారం మేరకు.. కుక్కలగుంట రాజేంద్రనగర్‌లో కె. వెంకయ్య చిల్లర సరుకులు, సిమెంట్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన కాలంగా వివిధ రేషన్‌షాపులు, వినియోగదారుల వద్ద నుంచి కిరోసిన్‌ను కొనుగోలు చేసి లీటరు రూ.30లకు బ్లాక్‌లో విక్రయిస్తున్నాడు. ఈ విషయమై బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ పి. వెంకటనాథ్రెడ్డికి ఫిర్యాదు అందింది. ఆయన ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్లు కట్టా శ్రీనివాసరావు, బీటీæనాయక్, ఏఓ ధనుంజయరెడ్డి తమ సిబ్బందితో కలిసి వెంకటయ్య దుకాణంపై దాyì lచేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 250 లీటర్ల నీలి కిరోసిన్‌ను స్వాధీనం చేసుకుని, అతనిపై 6ఏ కేసు నమోదు చేశారు. సమీపంలోని రేషన్‌డీలర్ అమీర్‌జాన్‌కు చెందిన 42వ రేషన్‌షాపును అధికారులు తనిఖీ చేశారు. అక్కడ కిరోసిన్ నిల్వలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అన్నీ పక్కాగా ఉండటంతో వెళ్లిపోయారు. -
రేషన్‌షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
తాడేపల్లిగూడెం: పలు రేషన్ షాపులపై విజిలెన్స్ అధికారులు శనివారం దాడి చేశారు. సరుకులను సీజ్ చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని షాపు నంబర్ 30, 57, 58, 79 ల్లో దాడులు చేశారు.రికార్డుల్లో భారీగా అవకతవకలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఆయా షాపుల వద్ద మొత్తం రూ.24,138 విలువైన సరుకులను స్వాధీనం చేసుకుని, పక్క షాపులకు అప్పగించినట్లు విజిలెన్స్ ఎస్ఐ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. -
రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు
బిట్రగుంట: బోగోలు మండలం చెంచులక్ష్మీపురంలోని శ్రీవెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్‌పై విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ముందస్తు సమాచారంతో దాడి తనిఖీ చేశారు. రైస్‌మిల్లులో 38 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రైస్‌మిల్లు యజమానిపై 6ఏ కింద కేసు నమోదు చేశారు. మిల్లు రికార్డులు పరిశీలించగా అవకతకవలను గుర్తించారు. కొనుగోలు కేంద్రం ద్వారా మిల్లుకు తరలించిన ధాన్యానికి రికార్డులు లేకపోవం, పరిమితికి మించి ధాన్యాన్ని నిల్వ ఉంచడాన్ని గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. రికార్డులు స్వాధీనం చేసుకుని సమగ్రంగా పరిశీలిస్తున్నారు. దాడుల్లో ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ధనుంజయరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఎనిమిది నెలల్లో రెండోసారి శ్రీవెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్‌పై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. రేషన్ డీలర్ల నుంచి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికే విక్రయించడం, దళారుల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రూ.లక్షలు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. గతేడాది సెప్టెంబర్ 21న విజిలెన్స్ అధికారులు మిల్లుపై దాడి చేసి రూ.10 లక్షలు విలువైన 659 క్వింటాళ్ల ధాన్యానికి రికార్డులు లేనట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని 6ఏ కింద కేసులు నమోదు చేశారు. తాజాగా మరో మారు దాడులు నిర్వహించి రేషన్ బియ్యంతో పాటు రికార్డులు లేని ధాన్యాన్ని గుర్తించారు. -
రూ.61 లక్షల విలువైన ధాన్యం సీజ్
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో భారీగా ధాన్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. రాజానగరంలోని విష్ణుగురుదత్త రైస్‌మిల్లులో అధికారులు సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకూ దాడులు జరిపారు. అధికారులు రాత్రంతా మిల్లులో రికార్డులు పరిశీలించారు. ధాన్యం, బియ్యం నిల్వలను సోదా చేశారు. 3,889 క్వింటాళ్ల ధాన్యం, 208 క్వింటాళ్ల బియ్యం, 76 క్వింటాళ్ల నూకలతో పాటు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తూ దానికి మరింత పాలిష్ పట్టి రీసైక్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. మిల్లు రికార్డుల్లో కూడా కొన్ని తప్పిదాలున్నట్టు గుర్తించి 6ఏ కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో తహసీల్దారు గోపాలరావు, రూరల్ ఏఎస్ఓ కేఎస్వీ ప్రసాద్, గ్రేడింగ్ అధికారి ప్రసాద్ పాల్గొన్నారు. -
నెల్లూరులో దుకాణాలపై విజిలెన్స్ దాడులు
నెల్లూరు టౌన్ : నెల్లూరు నగరంలోని పప్పుల వీధిలో ఉన్న రెండు దుకాణాలపై సోమవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. వీధిలోని శరాబ్ పెదవోగయ్య అండ్ సన్స్, హరినాయుడు కేడర్ దుకాణాలపై అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 63లక్షల 24వేలు విలువ చేసే పప్పు దాన్యాలను వారు గుర్తించారు. రెండు దుకాణాలపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
రేషన్ బియ్యం పట్టివేత
తాడిమర్రి : అనంతపురం జిల్లా తాడిమర్రి మండల కేంద్రంలోని ఓ వేరుశెనగ మిల్లులో విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 148 బ్యాగుల (ఒక్కోటీ 48 కిలోలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నాగరాజు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. -
13 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
బుచ్చిరెడ్డిపాలెం : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం సాయంత్రం ఓ ఇంటిపై దాడులు నిర్వహించారు. అక్రమనిల్వలపై అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ దాడులు చేశారు. కాగా గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 13 వంటగ్యాస్ సిలిండర్లు, 60 లీటర్ల నీలి కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమానురాలిపై నిత్యావసరాల చట్టం కింద కేసు నమోదు చేశారు. -
6,300 నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు స్వాధీనం
అనంతపురం : విజిలెన్స్ అధికారుల దాడుల్లో పెద్ద ఎత్తున నకిలీ పాస్‌పుస్తకాలు పట్టుబడ్డాయి. అనంతపురం పట్టణంలోని 3వ రోడ్డులో నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ గోదాముపై విజిలెన్స్ అధికారులు శనివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తమిళనాడులోని శివకాశి నుంచి వచ్చిన 6,300 నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి అనంతపురంకు చెందిన ఆనంద్‌కుమార్ అనే వ్యక్తి పేరుతో వచ్చినట్లు గుర్తించారు. సదరు వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. -
తిరుమలలో మూడు హోటళ్లు సీజ్
-
రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
ఎల్బీనగర్ : రంగారెడ్డి జిల్లాలోని రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్బీనగర్, నాగోలులోని బుధవారం ఓ రేషన్ దుకాణంపై ఆకస్మిక దాడులు చేశారు. రికార్డులను పరిశీలించి 101 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా 600 లీటర్ల కిరోసిన్ ను సీజ్ చేశారు. రేషన్ డీలర్ రవి, దుకాణం నిర్వాహకుడు సత్యనారాయణలపై కేసు నమోదు చేశారు. కాగా సత్యనారాయణ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు రేషన్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. -
‘తమ్ముళ్ల’ ఉపాధికి డిపోలు సిద్ధం!
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో 1989 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటిద్వారా 7.60 లక్షల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం నిత్యావసర సరకులను సరఫరా చేస్తోంది. ఇవి కాకుండా కొత్తగా మరిన్ని డిపోల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 500 రేషన్ కార్డుల కంటే అధికంగా ఉన్న డిపోలను రెండింటిగా మార్చి ఆ గ్రామంలో కొత్త డిపో ఏర్పాటకు సిద్ధమవుతోంది. అయితే దీని వెనుక పూర్తిగా అధికార పార్టీ రాజకీయ స్వార్థం దాగి ఉందని తెలుస్తోంది. అసలు తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేందుకే అదనంగా డిపోలు పెంచుతున్నట్లు విమర్శలు మొదలయ్యాయి. ఆదినుంచీ అంతే... వాస్తవానికి కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకులు తమ తొలి బాణాన్ని చౌకధరల డిపోల డీలర్లపైనే సంధించారు. కొంతమందిపై అయితే ఎలాంటి ఆరోపణలూ లేకున్నా 6ఎ కేసులు నమోదు చేయడం, విజిలెన్స్ దాడులు వంటివి చేశారు. ఇలా జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన ్ల పరిధిలో సుమారు 250మంది డీలర్లపై వివిధ రకాల కేసులను బనాయించి వారిని తొలగించేందుకు ప్రభుత్వం యత్నించింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు కూడా ఆరాటపడింది. అయితే కొంతమంది డీలర్లు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాలకుల పన్నాగాలు పారలేదు. దీంతో కేసులు ఉన్న డీలర్లు కూడా డిపోలు నిర్వహిస్తున్నారు. న్యాయస్థానం దెబ్బకు ఖంగుతిన్న పాలకులు ఆ డిపోలను విడదీసి పచ్చ చొక్కాలకు కూడా డీలర్ హోదాను కల్పించేందుకు కొత్త పన్నాగాన్ని తెరమీదకు తెస్తున్నారు. దీంట్లో భాగంగా 500 కార్డులు దాటిన డిపోలను రెండుగా చీల్చి కొత్త డిపోను పచ్చచొక్కా కార్యకర్తలకు కట్టబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న 500కార్డులు దాటిన డిపోల పేర్ల వివరాలు పాలకులు సేకరించారు. దీని ప్రకారం జిల్లాలో 446 రేషన్ డిపోలలో 500 రేషన్‌కార్డులు దాటినవి ఉన్నాయి. వీటి స్థానాల్లో కొత్త డిపోలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో నిత్యావసర సరకుల డిపోలు మొత్తం 1989 ఉన్నాయి. వీటిలో 500 కంటే తక్కువ రేషన్‌కార్డులు గల డిపోలు 1541 ఉన్నాయి. 500 నుంచి 750 రేషన్‌కార్డులు ఉన్న డిపోలు 396 ఉన్నాయి. 750 నుంచి 1000రేషన్ కార్డులు గల డిపోలు 45 ఉన్నాయి. 1000 నుంచి 1500 వరకూ గల కార్డులు ఉన్న డిపోలు 5 ఉన్నాయి. 1500 పైబడి కార్డులు గల డిపోలు రెండు ఉన్నాయి. వీటి ప్రకారం 446 డిపోలు ఏర్పాటు చేసేందుకు పాలకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
- నాలుగు షాపుల సీజ్ తడ: సరుకుల పంపిణీ సక్రమంగా జరగడంలేదనే ఆరోపణలు రావడంతో మండలంలోని నాలుగు రేషన్ దుకాణాలను విజిలెన్స్ డీఎస్పీ ఎస్ఎం రమేష్ ఆధ్వర్యంలో అధికారులు సోమవారం తనిఖీ చేశారు. రికార్డులకు, సరుకు నిల్వలకు తేడా ఉండటంతో నాలుగు దుకాణాలను సీజ్ చేశారు. విజిలెన్స్ ఏఓ ధనుంజయ్‌రెడ్డి కథనం మేరకు..పలు రేషన్ దుకాణాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల విజిలెన్స్ ఎస్పీ టి.రాంప్రసాదరావుకు ఫిర్యాదులొచ్చాయి. ఆయన ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు తడ, తడ కండ్రిగలోని 16, 17 నంబర్ల షాపులను, పూడికుప్పం, భీములవారిపాళేనికి చెందిన 37,26 నంబర్ల షాపులను పరిశీలించారు. ఒకే డీలర్ ఆధ్వర్యంలో నడుస్తున్న 16, 17 నంబర్ల దుకాణాల్లో 500 కిలోల బియ్యం ఎక్కువగా, 27 కిలోల చక్కెర తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పూడికుప్పంలో 180 కి లోల బియ్యం ఎక్కువగా, 3 కిలోల చక్కెర తక్కువగా, భీములవారిపాళెం దుకాణంలో 130 కిలోల బియ్యం ఎక్కువగా, 20 కిలోల చక్కెర తక్కువగా ఉన్నట్లు తేలింది. దుకాణాలు సీజ్ చేయడంతో పాటు సంబంధిత డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేశారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తామని, లబ్ధిదారులను మోసం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో సీఐ జి.సంఘమేశ్వరరావు, సీఎస్ డీటీ పెంచల కుమార్, తడ ఆర్ఐ తులసీమాల, వీఆర్ఓలు రామకృష్ణ, వెంకటయ్య, బాబు పాల్గొన్నారు. -
పయ్యావుల గోడౌన్లపై విజిలెన్స్ దాడులు
అనంతపురం : అనంతపురం జిల్లా ఉరవకొండలో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చెందిన గోడౌన్లలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.20 కోట్ల విలువైన శనగ, ధనియాలును సీజ్ చేశారు. నిల్వలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో విజిలెన్స్ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. -
విజిలెన్స్ దాడులు
గొల్లప్రోలు, న్యూస్‌లైన్ :హోల్‌సేల్ ఉల్లి వ్యాపారులపై విజిలెన్స్, ఎన్ఫోర్సమెంట్ అధికారులు మంగళవారం కొరడా ఝళిపించారు. గొల్లప్రోలులోని ఆరుగురు ఉల్లి ట్రేడర్లపై ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బి.నరసింహులు ఆధ్వర్యంలో రెండు బృందాలు దాడులు చేశాయి. గొల్లప్రోలులోని తాటిపర్తి రోడ్డు, మెయిన్ రోడ్డు, రాయవరం రోడ్డు వద్ద ఉన్న గోడౌన్లలో ఉల్లి నిల్వలను తనిఖీలు చేశారు. స్టాకు రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. క్రయ, విక్రయాలు, పన్ను చెల్లింపు పత్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 42 టన్నులు ఉల్లి నిల్వలను గుర్తించినట్టు ఎస్పీ నరసింహులు తెలిపారు. రికార్డులు సక్రమంగా లేకపోవడం, లెసైన్స్ లేకుండా వ్యాపారం చేస్తుండడం, మార్కెట్ సెస్ సక్రమంగా చెల్లించకపోవడంతో రూ.8.37 లక్షల విలువైన ఉల్లి అమ్మకాలు తక్షణం నిలిపివేయాలని ఆదేశించామన్నారు. మార్కెట్లో ఉల్లి ధరలను అరికట్టడమే లక్ష్యంగా తొలిసారిగా ఈ దాడులు చేశామన్నారు. ధరలు పెరగడాన్ని అవకాశంగా తీసుకుని హోల్‌సేల్ వ్యాపారులు బహిరంగ మార్కెట్లో ఉల్లిని అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. అక్రమ నిల్వలను గుర్తించేందుకు, అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఈ దాడులు చేశామన్నారు. వ్యాపారులు ఉల్లి కొనుగోలు, విక్రయ ధరల మధ్య తేడాను తగ్గించేందుకు ఈ తనిఖీలు దోహదం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ సెస్ రూ.10 వేలు వసూలు చేశారు. తనిఖీల్లో సీఐ చవాన్, ఏఓ జి.శ్రీనివాస్, ఏఎస్సై రాఘవ, మార్కెట్ కమిటీ సూపర్వైజర్లు భాస్కరరావు, జాన్‌బాషా పాల్గొన్నారు. రాజమండ్రిలో.. ఆల్కాట్‌తోట(రాజమండ్రి) : రాజమండ్రిలోని 19 హోల్‌సేల్ ఉల్లి దుకాణాలపై విజిలెన్స అధికారులు దాడి చేశారు. మార్కెటింగ్ శాఖకు ప్రతి నెలా కొనుగోలు రిటర్న్స్ ఇస్తున్నదీ లేనిదీ ఆరా తీశారు. స్టాకు రిజిస్టర్‌కు మించి ఉల్లిపాయలను అదనంగా ఉంచారా అన్న దానిపై సమాచారం సేకరించారు. వ్యాపారులు అదనంగా ఉల్లిపాయలను బ్లాక్ చేయలేదని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ తెలిపారు. ఈ దాడుల్లో డీసీటీఓ రత్నకుమార్, అటవీ అధికారి వల్లి, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.