ఎల్బీనగర్ : రంగారెడ్డి జిల్లాలోని రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్బీనగర్, నాగోలులోని బుధవారం ఓ రేషన్ దుకాణంపై ఆకస్మిక దాడులు చేశారు. రికార్డులను పరిశీలించి 101 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా 600 లీటర్ల కిరోసిన్ ను సీజ్ చేశారు. రేషన్ డీలర్ రవి, దుకాణం నిర్వాహకుడు సత్యనారాయణలపై కేసు నమోదు చేశారు. కాగా సత్యనారాయణ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు రేషన్ దుకాణాలపై దాడులు నిర్వహించారు.