Ration Shops
-
కర్నూలు జిల్లా ఆందోనిలో టీడీపీ, జనసేన బాహాబాహీ
-
హమాలీల సమ్మెతో పేదలకు ప‘రేషన్’!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో రేషన్ బియ్యం కోసం పేదలు పడిగాపులు పడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇప్పటివరకు చాలా జిల్లాల్లో రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా కాలేదు. స్టేజ్–1 గోడౌన్ల నుంచి జిల్లాల్లోని మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు బియ్యం వచ్చినప్పటికీ ఎంఎల్ఎస్ పాయింట్లలో ఈ నెల ఒకటో తేదీ నుంచి హమాలీలు సమ్మె చేస్తున్న కారణంగా చాలా చోట్ల బియ్యం గ్రామాలకు చేరడం లేదు. రెండేళ్లకోసారి పెంచాల్సిన హమాలీ రేట్లను గడువు దాటి ఏడాదైనా పెంచకపోవడంతోపాటు ఇటీవల ఇచ్చిన హామీని కూడా పౌరసరఫరాల శాఖ కమిషనర్ పట్టించుకోకపోవడంతో సమ్మెలోకి వెళ్లినట్లు హమాలీలు చెబుతున్నారు. రేట్లు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని హమాలీలు తెగేసి చెబుతున్నారు. సమ్మె ఫలితంగా నాలుగు రోజులుగా చాలా గ్రామాల్లో రేషన్ దుకాణాలు తెరుచుకోవడంలేదు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించడం లేదు. హమాలీలు సమ్మె నోటీసు ఇచ్చినా.. రాష్ట్రంలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీల రేట్లను రెండేళ్లకోసారి పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా 2022 వరకు రేట్ల పెంపు ప్రక్రియ కొనసాగింది. ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యాన్ని దించడానికి, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు తరలించడానికి హమాలీలకు క్వింటాలుకు రూ. 26 లెక్కన కూలి చెల్లిస్తున్నారు. ఈ రేట్లను 2024లో సవరించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో కాలయాపన జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు గతేడాది అక్టోబర్ 4న పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ వద్ద జరిగిన సమావేశంలో కూలి రేట్లను రూ. 26 నుంచి రూ. 29కి పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అయితే అందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో డిసెంబర్ 18న హమాలీలు పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నెలాఖరులోగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కాకుంటే జనవరి 1 నుంచి సమ్మెలోకి వెళ్తామని నోటీసు కూడా ఇచ్చారు. అలాగే గతేడాది డిసెంబర్ 28న మరోసారి నోటీసు పంపారు. అయినప్పటికీ రేట్ల పెంపు ఉత్తర్వులు కొత్త ఏడాదిలోనూ విడుదల కాకపోవడంతో ఒకటో తేదీ నుంచి సమ్మెకు దిగినట్లు హమాలీ సంఘం (ఏఐటీయూసీ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. మునీశ్వర్, ఎస్. బాలరాజ్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా... రాష్ట్రంలో 187 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా సుమారు 3,600 మంది హమాలీలు పనిచేస్తున్నారు. వారంతా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, బీఆర్‌ఎస్‌కేయూ సంఘాల్లో సభ్యులుగా ఉండగా ఏఐటీయూసీ అనుబంధ హమాలీ సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. బీఆర్‌ఎస్‌కేయూ మినహా అన్ని సంఘాలు సమ్మెకు మద్దతిస్తున్నట్లు హమాలీ సంఘం నాయకులు చెప్పారు. రాష్ట్రంలో 17,335 దుకాణాలు ఉండగా అందులో శనివారం 9,319 దుకాణాలనే తెరిచారు. అంటే దాదాపు సగం దుకాణాలు ఇప్పటికీ తెరవలేదు. తెరిచిన చోట కూడా కోటా పూర్తిస్థాయిలో బియ్యం రాలేదని సమాచారం. -
రేషన్ కోసం పడిగాపులు
ధర్మవరం: రేషన్ దుకాణాల వద్ద కార్డుదారుల అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి క్యూలో నుంచోలేక నానా అవస్థలు పడుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవ రం పట్టణం కేతిరెడ్డి కాలనీలోని కార్డుదారులు శనివారం దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌక డిపో వద్దకు వచ్చారు. ఎండలో గంటల తరబడి క్యూలో నుంచో లేక సంచులు పెట్టి తమవంతు కోసం ఎదు రు చూస్తున్నారు. కూలి పనులు చేసుకునే పేదలు ఇలా రోజంతా రేషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారు జామున 3 గంటలకే ఇలా సంచులను క్యూలో పెట్టి.. ఆ పక్కనే తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. అయినా తమవంతు రాకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. రెండు రోజులు మాత్రమే రేషన్ ఇస్తున్నారని, ఆ తర్వాత వెళితే.. సరుకులు అయిపోయాయంటూ డీలర్ తమను వెనక్కి పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీఎస్‌డీటీ లక్ష్మీదేవి అక్కడికి చేరుకుని డీలర్‌తో మాట్లాడి త్వరితగతిన బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.కూటమి ప్రభుత్వం వచ్చినప్పట్నుంచీ ఇదే పరిస్థితి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విని యోగదారుల ఇళ్ల వద్దకే వచ్చి రేషన్ పంపిణీ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో రేషన్ వాహనాలు రాకపోవడంతో ప్రజలు రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి ఇలా అవస్థలు పడుతున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారానే సరుకుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేస్తున్న ప్రకటనలతో రేషన్ కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే రాష్ట్రం మొత్తం ఇలాంటి పరిస్థితే నెలకొంటుందని భయపడిపోతున్నారు. -
36.80 లక్షల ఎకరాల్లో సన్నరకాల సాగు
సాక్షి, హైదరాబాద్: వచ్చే జనవరి నుంచి రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇవ్వనున్న నేపథ్యంలో.. ఖరీఫ్‌లో రైతుల నుంచి సన్న వడ్లు కొనుగోలు చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులు ఎన్నడూ లేనివిధంగా 36.80 లక్షల ఎకరాల్లో సన్న వడ్లను సాగు చేశారని.. సుమారు 88.09 లక్షల టన్నుల సన్న వడ్ల దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చే సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో 2024–25 ఖరీఫ్ పంట కొనుగోళ్లపై జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సీజన్లో రాష్ట్రంలో 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ఉత్తమ్ చెప్పారు. సన్న, దొడ్డు వడ్లు కలిపి ఖరీఫ్‌లో 60.39 లక్షల ఎకరాల్లో సాగయ్యాయని, మొత్తంగా 1.46 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని వివరించారు. ఇందులో 91.28 లక్షల టన్నులు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సన్నాలు, దొడ్డు వడ్లను వేర్వేరు కేంద్రాల్లో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదుగతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ఇకపై ధాన్యం ఇచ్చేది లేదని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ తొలివారంలో మొదలయ్యే ధాన్యం కొనుగోళ్లు జనవరి చివరి వరకు కొనసాగుతాయన్నారు. మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల టన్నుల ధాన్యం నిల్వకు వీలుగా గోదాములను సిద్ధం చేసిందని చెప్పారు. ఖరీఫ్‌లో సేకరించిన సన్నాలను జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో అందిస్తామని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. -
రేషన్ షాపుల కోసం తన్నుకున్న టీడీపీ నేతలు
-
రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆటకట్టు
సాక్షి, అమరావతి: పేదల బియ్యాన్ని బొక్కే అక్రమార్కులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. పటిష్ట చర్యలతో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే నిత్యావసరాలను దారిమళ్లించడం, దుర్వినియోగానికి పాల్పడిన వారిపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తోంది. ఇప్పుడు దీర్ఘకాలికంగా బియ్యాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ, తరచూ పట్టుబడిన వ్యక్తులపై పీడీ యాక్టును ప్రయోగిస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో సత్ఫలితాలు గతంలో రేషన్ బియ్యం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగేది. వందల టన్నుల బియ్యం సరిహద్దులు దాటేసేది. మరోపక్క పేదలు తినే బియ్యంపై కొందరు అసత్య ప్రచారం చేసి, వాటిని తక్కువ రేటుకు కొని, తిరిగి పాలిష్ పట్టి మార్కెట్లోకి తెచ్చి అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. లారీలతో లోడ్లు తరలిపోతున్నా కేసులే నమోదయ్యేవి కావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి అక్రమార్కుల ఆట కట్టిస్తోంది. రేషన్ బియ్యం రవాణాపై నిఘాను పటిష్టం చేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దులు, మండల నిల్వ పాయింట్లు, చౌక దుకాణాలు, ఎండీయూ వాహనాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిరంతర నిఘా పెట్టడంతో చాలా వరకు అక్రమ రవాణా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు 743 మందిని అరెస్టు చేసింది. నిత్యావసర వస్తువుల చట్టం – 1955 సెక్షన్ 6ఏ ప్రకారం అక్రమ రవాణాలో పట్టుబడిన సరకులు, వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసులు నమోదు చేస్తోంది. ఈ కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొని, అక్రమార్కులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తోంది. పట్టుబడిన బియ్యాన్ని వెంటనే తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తెస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాల్లో బియ్యం అక్రమరవాణాలో పట్టుబడ్డ సరుకు నిల్వల విలువ రూ.50 లక్షల లోపు ఉంటే జేసీలు, అంతకు పైబడి ఉంటే కలెక్టర్లకు కేసుల పరిష్కార బాధ్యతలను అప్పగించింది. ఫలితంగా ఏళ్లు తరబడి సీజ్ చేసిన సరుకు ముక్కిపోయి, పురుగులు పట్టి పాడవకుండా బహిరంగ వేలం ద్వారా వెంటనే తిరిగి మార్కెట్లోకి తెస్తోంది. ఇలా గడిచిన నాలుగేళ్లలో 6ఏ కేసులు 8,696 నమోదు చేస్తే, వాటిల్లో 4,565 కేసులను పరిష్కరించింది. మొత్తం 4.70లక్షల క్వింటాళ్ల స్టాక్‌ను స్వాధీనం చేసుకోగా, 2.82 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్ టైం మానిటరింగ్ 6ఏ కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసింది. కేసు నమోదు చేసిన వెంటనే సీజ్ చేసిన స్టాక్ వివరాలను ఇందులో అప్లోడ్ చేస్తారు. జిల్లాలు, తేదీలు, నెలలవారీగా నమోదైన కేసులు, పరిష్కరించినవి, సీజ్ చేసిన స్టాకు, బయటకు విడుదల చేసిన స్టాక్ వివరాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించి, వాటిని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద చూపించడం, పాలిష్ పట్టి కొత్త ప్యాకింగ్‌లో మార్కెట్లో విక్రయించడాన్ని సంపూర్ణంగా నిరోధించే ప్రయత్నం చేస్తోంది. పటిష్ట నిఘాతో అక్రమ రవాణా కట్టడి ఇప్పటి వరకు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని సీజ్ చేసి పక్కన పెట్టేవారు. వాటిని పట్టించుకోకపోవడంతో తినడానికి పనికిరాకుండా పాడయ్యేవి. ఈ క్రమంలోనే మేము 6ఏ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాం. కేసులు వేగంగా పరిష్కారమయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. దీనికి తోడు బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే వారిని పీడీ యాక్టులో పెడుతున్నాం. పటిష్ట నిఘా ఉంది కాబట్టే కేసులు నమోదవుతున్నాయి. అంతేగానీ అక్రమ రవాణా జరిగిపోతున్నట్టు కాదు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
కేవైసీ కోసం క్యూ... రేషన్‌కు ఈ–కేవైసీ తప్పనిసరే!
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ దుకాణాల నుంచి బియ్యం, ఇతర సరుకులు తీసుకునేందుకు కేవైసీ (నో యువర్ కస్టమర్– మీ వినియోగదారుని తెలుసుకోండి) నమోదు తప్పనిసరి కాబోతుంది. రేషన్ దుకాణాల్లో అప్డేట్ చేసిన ఈపాస్ మిషన్ల ద్వారా కార్డులో నమోదైన వారందరి వేలి ముద్రలు తీసుకొని, వారి వివరాలు నమోదు చేసుకునే ప్రక్రియ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా ఈ కేవైసీకి ఈనెల 5వ తేదీ నుంచి శ్రీకారం చుట్టారు. వేలి ముద్రలు వేయకుంటే రేషన్ కార్డులో పేరుండదు అనే ప్రచారం నేపథ్యంలో జిల్లా కేంద్రాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా వచ్చి ఈ కేవైసీ కోసం రేషన్ దుకాణాల వద్ద బారులుతీరి మరీ పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కూడా కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈపాస్ మిషన్లను అప్‌గ్రేడ్ చేసి, కార్డుదారుల వేలి ముద్రలు తీసుకోవలసిందిగా అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో రేషన్ దుకాణాల్లో కార్డు దారుల వేలి ముద్రలు తీసుకుంటున్నారు. మంత్రి లేఖకు స్పందించని కేంద్రమంత్రి రేషన్‌కార్డులో పేర్లు ఉన్న వారంతా వేలిముద్రలు వేయాల్సిన నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉన్న వారు రాలేకపోతున్నారు. ఈ మేరకు ఈ కేవైసీ వల్ల తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇటీవల సుదీర్ఘ లేఖ రాసి, ప్రభుత్వ ప్రతినిధి ద్వారా ఢిల్లీలో అందజేశారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. కాగా ఈ విషయమై మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్‌కార్డుల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని , కార్డుదారుల పేర్లు ఎవరివీ తొలగించడం జరగదని స్పష్టం చేశారు. కేవైసీ విషయంలో మరోసారి సీఎంతో చర్చించి తమ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేస్తామని తెలిపారు. గడువు తేదీ ఏమీ లేదు: అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ఈ కేవైసీకి తుది గడువు అంటూ ఏమీ లేదని పౌరసరఫరాల సంస్థ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ‘సాక్షి’కి తెలిపారు . కేవైసీలో వివరాలు ఇవ్వని కార్డుదారుల పేర్ల విషయంలో ఎలాంటి ఆదేశాలు లేవని, దేశ వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే వేలి ముద్రలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్డుల నుంచి ఎవరి పేర్లు తొలగించబోమని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్!
కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో తీసుకుని రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ పథకం గడువుని పొడిచింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 2023 డిసెంబర్ వరకు ఉచిత రేషన్ అమలు కానుంది. దీంతో ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. మనిషికి 5 కిలోల వరకు అందజేయనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్ యోజనను జాతీయ ఆహార భద్రతా చట్టంలో డిసెంబర్ 2023 వరకు విలీనం చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని క్యాబినెట్ సమావేశం తర్వాత ఆహార మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుత పొడిగింపు నిర్ణయం అమలు తర్వాత, ఈ స్కీమ్ ప్రయోజనం NFSA (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద లబ్ధిదారులకు ప్రయెజనాలను అందివ్వనున్నారు. 2020 నుంచి ప్రత్యేక PMGKAY పథకం కింద ప్రజలకు లబ్ధిచేకూరేది. నివేదికల ప్రకారం, దీంతో 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. దీని వలన ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్రం ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది. ఇటీవల ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించగా.. తాజాగా మరో ఏడాదికి ప్రయోజనాన్ని పెంచింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
ఇంటింటికీ గిరిజన ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ దుకాణాలు, రేషన్ పంపిణీ వాహనాల (ఎండీయూ) ద్వారా గిరిజన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. నవంబర్ 1వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో ప్రారంభించనుంది. తొలి దశలో 290 రేషన్ వాహనాలు, 570 రేషన్ దుకాణాల్లో అమలు చేయనున్నారు. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ కల్పించడంతోపాటు ఎమ్మార్పీ కంటే తక్కువ రేట్లకే వినియోగదారులకు అందించనున్నారు. ఎండీయూలకు ఆర్థిక బలం చేకూర్చేలా.. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థలో 9,260 ఎండీయూ వాహనాలు సేవలందిస్తున్నాయి. రేషన్ డోర్ డెలివరీ నిమిత్తం ఎండీయూ ఆపరేటర్లకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.18 వేల రెమ్యునరేషన్ ఇస్తోంది. వారికి మరింత ఆర్థిక బలం చేకూర్చేందుకు ప్రభుత్వరంగ సంస్థలైన గిరిజన, ఆయిల్ ఫెడ్, మార్క్‌ఫెడ్ ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది. ఆయా సంస్థల నుంచి సబ్సిడీపై సరుకులను తీసుకునే ఆపరేటర్లు వాటిని ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు ప్రజలకు విక్రయించాల్సి ఉంటుంది. ప్రతినెలా పీడీఎస్ బియ్యం పంపిణీలో జాప్యం లేకుండా విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టింది. వినియోగదారులకు తెలిసేలా వస్తువుల ధరల పట్టికను ప్రదర్శించనున్నారు. విక్రయించే ఉత్పత్తులు.. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా తేనె, అరకు కాఫీ పొడి, వైశాఖి కాఫీ పొడి, త్రిఫల చూర్ణం, నన్నారి షర్బత్, ఆయుర్వేద సబ్బులు, చింతపండు, కుంకుడుకాయ పొడి, షికాకాయ పొడి, కారంపొడి, పసుపు, కుంకుమతోపాటు ఆయిల్‌ఫెడ్ నుంచి పామాయిల్, సన్‌ఫ్లవర్, రైస్‌బ్రాన్, వేరుశనగ నూనెలను అందుబాటులో ఉంచనున్నారు. గిరిజనులకు మేలు చేసేలా.. గిరిజనులకు మేలు చేసేలా ఎండీయూ వాహనాల ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. తొలుత విశాఖ, తిరుపతి జిల్లాల్లో స్పందనను బట్టి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. రేషన్ లబ్ధిదారులే కాకుండా ప్రజలందరూ ఈ ఉత్పత్తులను కొనుక్కోవచ్చు. బియ్యం ఇచ్చే సమయంలో వినియోగదారులపై ఎటువంటి ఒత్తిడి చేయకుండా విక్రయాలు చేసుకోవాలని ఎండీయూలకు సూచించాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
మనవాళ్లే లైట్ తీసుకున్నారు.. ఇక వాళ్లు ఫోటో పెడతారా?
మనవాళ్లే లైట్ తీసుకున్నారు.. ఇక వాళ్లు ఫోటో పెడతారా? -
‘రేషన్ షాపుల మూసివేతపై కొన్ని పత్రికలు అపోహలు సృష్టిస్తున్నాయి’
తాడేపల్లి: కరోనా సమయంలో రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్ కార్డులుంటే కేంద్రం 89 లక్షల కార్డులకు మాత్రమే బియ్యం ఇచ్చిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం ఇచ్చే 89 లక్షల కార్డులకి బియ్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 9 వెనుకబడ్డ జిల్లాలు, ఎస్సీ, ఎస్టీలు అందరికి ఇస్తామని, ఈ విషయాన్ని కేంద్రానికి కూడా తెలియజేశామని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఇచ్చే రేషన్‌కి అదనంగా కేంద్రం ఇచ్చే కార్డుల బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ షాపులను మూసేస్తామని వస్తున్న వాదనలు పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు తొలగించలేదన్నారు. కొత్తగా 7 లక్షల కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు. కోటీ 50 లక్షల మందికి అదనంగా ఇస్తున్నాం: మంత్రి బొత్స రాష్ట్రంలో 4 కోట్ల 23 లక్షల మందికి రేషన్ పంపిణీ చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రూపాయికే కిలో బియ్యం అందిస్తున్నామని, కరోనా వైపరీత్యం వచ్చినప్పుడు కేంద్రం పీఎంజీకేవై పథకం తీసుకొచ్చిందని గుర్తు చేశారు మంత్రి. 2 కోట్ల 68 లక్షల మందికి మాత్రమే ఆ పథకం అమలు చేసిందన్నారు. తాము కోటి 50 లక్షల మందికి అదనంగా అందించామని తెలిపారు. ‘ప్రస్తుతం కరోనా తగ్గింది కాబట్టి 3 నెలల నుంచి పునరాలోచన చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 86 శాతం మందికి లబ్ది చేస్తున్నది మన రాష్ట్రమే. దీనిపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించాం. కేంద్రం ఇచ్చే కార్డులకు అదనపు బియ్యాన్ని ప్రత్యేకంగా పంపిణీ చేస్తాం.’ అని మంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: వనరుల సమీకరణపై సీఎం జగన్ సమీక్ష -
ఇకపై రేషన్ షాపుల్లో పండ్లు, కూరగాయలు
సాక్షి, ముంబై: నిన్నమొన్నటి వరకు బియ్యం, చక్కెర, గోధుమలు తదితర వస్తువులు లభించిన రేషన్ షాపుల్లో ఇక నుంచి కూరగాయలు, పండ్లు కూడా లభించనున్నాయి. రేషన్ షాపుకు వచ్చిన కార్డుదారులు పండ్లు, కూరగాయలు కూడా చౌక ధరలతో కొనుగోలు చేయవచ్చు. గతంలో పుణేలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేయగా, ప్రస్తుతం ముంబై, థాణేలోనూ దీన్ని అమలు చేస్తున్నారు. ఆ తరువాత కొనుగోలుదారుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా నగరాల్లోకి ఈ పథకాన్ని విస్తరించనున్నారు. ఆహార, పౌర సరఫరాల శాఖ రేషన్ షాపుల్లో చౌక ధరకే పండ్లు, కూరగాయలు విక్రయించడానికి ఆరు నెలలపాటు రైతులు, ఉత్పత్తి కంపెనీలకు కొన్ని షరతులతో అనుమతినిచ్చింది. రేషన్ షాపుల్లో కార్డుదారులకు పప్పు దినుసులు, బియ్యం, గోధుమలు, చక్కెర ఇతర సరుకులతోపాటు పండ్లు, కూరగాయలు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల కిందట నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేసింది. చదవండి: (రైలు ప్రయాణంలో ఎక్కువ లగేజీ తీసుకురావొద్దు!) -
ఉచిత రేషన్ బియ్యానికి మంగళం
సాక్షి, హైదరాబాద్: కరోనా తొలివేవ్ నాటి నుంచి అమలవుతున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. ఈ నెల నుంచి రేషన్ దుకాణాల్లో రూపాయికి కిలో బియ్యం పథకం తిరిగి అమలుకానుంది. ఈ మేరకు పౌర సరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లుగా ప్రతి లబ్ధిదారుకు 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందగా.. ఇక నుంచి రూపాయికి కిలో చొప్పున ఆరు కిలోల బియ్యం మాత్రమే అందనుంది. అంత్యోదయ (ఏఎఫ్ఎస్సీ) లబ్ధిదారులకు ఒక్కో కార్డుపై రూపాయికి కిలో చొప్పున 35కిలోల బియ్యం ఇస్తారు. అన్నపూర్ణ కార్డు దారులకు మాత్రం కార్డుకు 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేస్తారు. కాగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ జరగనుంది. కేంద్రం సెప్టెంబర్ వరకు పొడిగించినా.. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్‌లో ఉచిత రేషన్ పంపిణీ పథకాన్ని ప్రా రంభించింది. అప్పటి నుంచి దశలవారీగా పొడిగిస్తూ వచ్చింది. తాజాగా గత మార్చి నెలాఖరులోనే మరో ఆరు నెలలు పొడిగించింది. సెప్టెంబర్ వరకు ఉచిత బి య్యం అందాలి. అయితే ఏప్రిల్‌లో పది కిలో ల చొప్పున ఉచిత బియ్యం ఇచ్చిన రాష్ట్ర స ర్కారు.. మే నుంచి రూపాయికి కిలో బియ్యా న్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
మరో 6 నెలలు.. నిరుపేదలకు ఉచితంగా రేషన్ బియ్యం
కాకినాడ సిటీ: కరోనా కష్టకాలంలో ఉచిత రేషన్ బియ్యాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు ఈ పథకాన్ని పొడిగించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో నిరుపేదలు దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లాక్డౌన్ లేనప్పటికీ అర్హులైన బియ్యం కార్డుదార్లు ఒక్కక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవిభక్త తూర్పు గోదావరి జిల్లాలోని 64 మండలాల్లో 6.81 లక్షల మంది రేషన్ కార్డుదార్లకు బియ్యం అందజేయడానికి కావల్సిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఈ నెల నుంచే కొనసాగింపు పేదలకు బియ్యాన్ని పంపిణీ చేయాలంటూ ఒక నెల ముందు నుంచే ఇండెంట్లను పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేయడంతో ఈ నెలలో ఉచితంగా 5 కిలోల బియ్యం లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఆ తర్వాత వచ్చే నెల నుంచి అక్టోబర్ వరకూ కూడా ఉచితంగా బియ్యం ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు తగిన ఇండెంట్లను ముందస్తుగా స్వీకరించే పనిని అధికారులు ఇప్పటికే చేపట్టారు. 16.81 లక్షల కార్డులు అవిభక్త తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 64 మండలాల్లో 2,659 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో రైస్‌కార్డు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిపి మొత్తం 16.81 లక్షలు ఉన్నాయి. ఒక్కో కార్డుదారుకు ప్రభుత్వం ఐదు కిలోల బియ్యం చొప్పున కేటాయించడంతో ఈ నెల నుంచి ఉచితంగా ఇవ్వనున్నారు. సేల్స్ డిపోల డీలర్ల వద్ద గతంలో నిల్వ ఉన్న బియ్యం పోగా మిగిలినవి అందిస్తారు. జిల్లాలోని గోదాముల నుంచి ఆయా రేషన్ డిపోల వారీగా బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందులో అంత్యోదయ కార్డుకు గతంలో 35 కిలోల బియ్యం అందించేవారు. ఇప్పుడు అదనంగా మరో 5 కిలోలు కలిపి మొత్తం 40 కిలోల బియ్యం అందిస్తారు. అలాగే అన్నపూర్ణ కార్డుదారుకు 5 కిలోల ఇచ్చేవారు. ఈ నెల నుంచి 15 కిలోలు పంపిణీ చేస్తారు. అలాగే ఒక్కో సాధారణ బియ్యం కార్డుదారుకు 5 కిలోల బియ్యం ఇస్తుండగా ఈ నెలలో గరీబ్ కల్యాణ్ అన్న యోజన (కరోనా బియ్యం) పథకం కింద 5 కిలోల చొప్పున ఉచితంగా అందించనున్నారు. మొత్తంగా అవిభక్త తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి నెలా 22,219 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందజేయనుంది. సంతోషంగా ఉంది మరో ఆరు నెలల పాటు ఉచితంగా బియ్యం ఇవ్వడం సంతోషంగా ఉంది. దీంతో పేదల కుటుంబ పోషణకు కొంత మేర ఊరట కలుగుతుంది. కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో ప్రభుత్వం ఉచిత బియ్యం ఇవ్వడం అభినందనీయం, కరోనా పూర్తి స్థాయిలో కనుమరుగయ్యే వరకూ బియ్యం ఉచితంగా ఇవ్వాలి. – దంగేటి అప్పయ్యమ్మ, కాకినాడ సక్రమంగా బియ్యం పంపిణీ చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని డీలర్లు సక్రమంగా పంపిణీ చేయాలి. రేషన్ ఇచ్చే సమయంలో కార్డుదారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఈ బియ్యం ఎంతో ఉపయోగపడుతాయి. – ఐవీ రమణ, కాకినాడ -
రేషన్ షాపుల్లో 5 కిలోల సిలిండర్
సాక్షి, హైదరాబాద్ : గృహ వినియోగదారులతో పాటు విద్యార్థులు, బ్యాచిలర్లు, వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా అయిదు కిలోల వంటగ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రధాన ఆయిల్ కంపెనిలన్నీ తమ డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకుల ద్వారా వీటిని విక్రయిస్తుండగా, త్వరలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా అందుబాటులో తెచ్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీల ద్వారా గృహాపయోగం కోసం 14.2 కిలోల, వాణిజ్య అవసరాల కోసం 19 కిలోల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. చిన్న సిలిండర్లు డోర్ డెలివరీ లేనప్పటికీ ఖాళీ సిలిండర్ తీసుకెళ్లి గ్యాస్ ఏజెన్సీలు, కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నుంచి రీఫిల్ చేసి తీసుకునే వెసులుబాటుంది. తాజాగా రేషన్ దుకాణాల్లోకి అందుబాటులోకి వస్తే అత్యవసరంగా గ్యాస్ సిలిండర్ అవసరం ఉన్న గృహ వినియోగదారులతో పాటు విద్యార్థులు బ్యాచిలర్స్‌కు, వలస కూలీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చమురు సంస్థల వంట గ్యాస్‌ను బట్టి చిన్న సిలిండర్ ధర ఉంటుంది. ప్రస్తుతం నగరంలో 5 కిలోల ఎల్పీజీ గ్యాస్‌తో కూడిన చిన్న సిలిండర్ రూ.528.32కు లభిస్తుందని సమాచారం. (క్లిక్: వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు..) -
చిరు వ్యాపారులకు కేంద్రం శుభవార్త..!..త్వరలోనే..!
Small Cylinders in Ration Shops:చిరు వ్యాపారులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. త్వరలో రేషన్ షాపుల్లో చిరు వ్యాపారులకోసం అందుబాటులోకి తెచ్చిన ముద్రాలోన్ సేవల్ని రేషన్ షాపుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోనుంది. బుధవారం అంతర్ మంత్రిత్వ, అంతర్ రాష్ట్ర వర్చువల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుధాన్షు పాండే మాట్లాడుతూ.. కేంద్రం త్వరలోనే రేషన్ షాపుల్లో ముద్రాలోన్లతో పాటు ఇతర ఆర్ధిక సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు తెచ్చినట్లు తెలిపారు. వీటితో పాటు రేషన్ షాపుల్లో 5 కేజీల ఎఫ్టీఎల్(Free trade LPG) గ్యాస్ అమ్మకాల్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇందు కోసం కేంద్రం..రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటుందని అన్నారు. 5.32 లక్షల రేషన్ షాపులు దేశ వ్యాప్తంగా 5.32 లక్షల రేషన్ షాపులు ఉన్నాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే 80 కోట్ల మంది లబ్ధిదారులకు సబ్సిడీ ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తుంది. అయితే త్వరలో కేంద్రం సిలిండర్ల రిటైల్ విక్రయాలతో పాటు రుణాలు,ఇతర ఆర్థిక సేవలను ప్రవేశపెట్టడం ద్వారా రేషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. కేంద్రం నిర్వహించిన అంతర్ మంత్రిత్వ, అంతర్ రాష్ట్ర వర్చువల్ మీటింగ్‌లో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖతో పాటు, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రతినిధులు హాజరయ్యారు. రేషన్ వ్యవస్థను మరింత పట్టిష్టంగా మార్చే దిశగా కేంద్ర తెచ్చిన ప్రతిపాదనల్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతిచ్చాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. తనఖా లేకుండా 10లక్షల వరకు రుణాలు సామాజిక, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు, అట్టడుగు వర్గాలకు ఆర్థిక సమగ్రత, సహాయాన్ని అందించేందుకు కేంద్రం 2015 ఏప్రిల్ 8న ప్రధాన్‌మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పీఎంఎంవై కింద ఎలాంటి తనఖా లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, చిన్న ఆర్థిక సంస్థలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు పొందవచ్చు. వ్యవసాయం అనుబంధ సంస్థలు, తయారీ, వాణిజ్యం, సేవల రంగాలలో ఆదాయం సృష్టించే చిన్న తరహా వ్యాపారాలకు ముద్ర రుణాలను మంజూరు చేస్తారు. చదవండి: బ్యాంకుల్లో బంపర్ ఆఫర్లు, లోన్ల కోసం అప్లయ్ చేస్తున్నారా? -
నెలలో అన్ని రోజులు రేషన్ షాపులు తెరవండి
సాక్షి, న్యూఢిల్లీ : నెలలో అన్ని రోజులు రేషన్ షాపులు తెరిచి ఉంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. రేషన్ షాపుల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రాలకు ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లు సరఫరా చేశామని వెల్లడించింది. రాష్ట్రాల వద్ద అందుబాటులో 1.84 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఉన్నాయని, మూడు రోజుల్లో రాష్ట్రాలకు మరో 51 లక్షల డోసులు పంపిణీ చేస్తామని తెలిపింది. -
ఇంటింటికీ బియ్యం.. వాహనాలు సైతం సిద్ధం
సాక్షి, అమరావతి: త్వరలో చేపట్టనున్న ‘ఇంటింటా నాణ్యమైన బియ్యం పంపిణీ’కి సంబంధించి రేషన్ షాపుల వారీగా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అవసరమైన మేరకు మరిన్ని చర్యలు తీసుకునేందుకు క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహిం చాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. పంపిణీకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకపోవడంతో పట్టణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఒకే సారి అధిక మొత్తంలో బియ్యం తీసుకువెళ్లేందుకు వీలుగా నాలుగు చక్రాల వాహనాలు వినియోగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 29,784 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 1,50,15,765 బియ్యం కార్డులు ఉన్నాయి. (పరిశ్రమలకు ఆధార్!) ►ఒక రేషన్ షాపులో ఎన్ని కార్డులు ఉన్నాయో గుర్తించి, వాటి ఆధారంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ►వివరాలను గ్రామాలు, పట్టణాల వారీగా విడివిడిగా తయారు చేశారు. ►ప్రతి రెండు వేల కార్డులకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల ఎదుటే తూకం వేసి బియ్యం పంపిణీ చేస్తారు. ►ప్రతి నెలా 1వ తేదీ నుండి 15వ తేదీలోగా పంపిణీ పూర్తి చేయాలి. ►నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే దిగ్విజయంగా అమలవుతోంది. ►లబ్దిదారులు బియ్యం తీసుకునేందుకు వీలుగా ఉచితంగా బ్యాగు అందించనున్నారు. ►మార్గమధ్యంలో బియ్యం కల్తీకి అవకాశం లేకుండా గోదాముల నుంచి వచ్చే ప్రతి బ్యాగుపై స్ట్రిప్ సీల్ వేయనున్నారు. ►ప్రతి బ్యాగుపై బార్ కోడ్ కూడా ఉంటుంది. నాలుగు చక్రాల వాహనంలోనే ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ ఉంటుంది. ►రాష్ట్రంలో 13 వేలకుపైగా వాహనాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. -
తొలి రోజు 15.22 లక్షల కుటుంబాలకు ఉచిత సరుకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 7వ విడత ఉచిత సరుకుల పంపిణీ శుక్రవారం ఉదయం 6 గంటలకే ప్రారంభమైంది. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. బియ్యం కార్డులో పేరున్న ఒక్కో సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా ఇచ్చారు. కరోనా కారణంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు గుమిగూడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాకే.. లబ్ధిదారుల నుంచి బయోమెట్రిక్ తీసుకున్నారు. ఇందుకు అవసరమైన శానిటైజర్‌ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఏడో విడత ఉచిత సరుకులను మొదటి రోజైన శుక్రవారం 15,22,822 కుటుంబాల వారు తీసుకున్నారు. -
ఏపీలో నాలుగో విడత రేషన్ పంపిణీ ప్రారంభం
సాక్షి, అమరావతి : ఏపీలో నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ శనివారం ప్రారంభమైంది. కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ శనగలు అందజేయనున్నారు. రాష్ట్రంలోని 28, 354 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపీణీ చేయనున్నారు. రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు అందజేయనున్నారు. కాగా కార్డుదారలకు బయో మెట్రిక్ తప్పనిసరి కావడంతో రేషన్ షాప్ కౌంటర్ల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. అయితే రేషన్ పోర్టబిలిటీ ఎక్కడ ఉంటే రేషన్ అక్కడే లభించనుంది. దీని ద్వారా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ఇందులో బియ్యంకార్డు ఉన్న కుటుంబాలు 1,47,24,017 ఉండగా, కొత్తగా దరఖాస్తు చేసుకున్న పేద కుటుంబాలు 81,862 ఉన్నాయి. -
బియ్యం, శనగపప్పు సిద్ధం
సాక్షి, అమరావతి : లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు రెండో విడతలో ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం బియ్యం, శనగపప్పు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో అర్హులైన 1.47 కోట్ల కుటుంబాలకు అవసరమైన సరుకులను ఈ నెల 13లోగా గోదాముల నుంచి రేషన్ షాపులకు తరలించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. మొదటి విడతలో భాగంగా గత నెల 29 నుంచి ఉచిత రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో ఇప్పటివరకు 1.13 కోట్ల కుటుంబాలు సరుకులు తీసుకున్నాయి. మిగిలిన లబ్ధిదారులు ఈ నెల 14 వరకు సరుకులు తీసుకోవచ్చు. కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున బియ్యం, ప్రతి కార్డుకు ఒక కిలో కంది పప్పును రేషన్ దుకాణాల్లో ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు. రెండో విడత కింద ఏప్రిల్ 15 నుంచి, మూడో విడత కింద ఏప్రిల్ 29 నుంచి సరుకులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పేదలకు ఆకలి బాధలు లేకుండా.. పంపిణీకి ప్రతినెలా 2.62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఇబ్బంది లేకుండా ఆహార ధాన్యాలను రాష్ట్రానికి పంపుతామని కేంద్రం ప్రకటించినప్పటికీ కేవలం 42 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సరఫరా చేసినట్లు సమాచారం. మిగిలిన 2.20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూ ర్చుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక భారం అయినప్పటికీ పేదలకు ఆకలి బాధలు లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉచిత సరుకుల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. రద్దీ నియంత్రణకు అదనపు కౌంటర్లు 15 నుంచి రెండో విడత పంపిణీ రేషన్ షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో విడత పంపిణీ నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా కూపన్లు జారీ చేయనున్నారు. కాగా, రెండో విడతలో కందిపప్పుకు బదులు శనగపప్పు ఇవ్వనున్నట్లు కోన శశిధర్ వెల్లడించారు. అలాగే, కరోనా నివారణలో భాగంగా రెడ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో లబ్ధిదారులకు సరుకులను ఇంటింటికీ పంపిణీ చేయాలని నిర్ణయించారు. -
సర్వర్ పరేషాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీకి సర్వర్ అనేక చిక్కులు తెచ్చిపెడుతోంది. వందల సంఖ్యలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యాన్ని తీసుకునేందుకు ఎగబడటంతో సాంకేతిక సమస్యలు తలెత్తి సర్వర్ మొరాయిస్తోంది. దీంతో రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు గుంపులుగా చేరడం, కొన్ని చోట్ల వాగ్వాదానికి దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని దుకాణాల వద్ద శనివారం సర్వర్ పనిచేయక లబ్ధిదారులు గంటల కొద్దీ బారులు తీరారు. పోర్టబిలిటీ పెరగడంతో.. రేషన్ పంపిణీ మొదలైన ఈ నెల ఒకటవ తేదీ నుంచి శుక్రవారం వరకు 22 లక్షల కుటుంబాలు 88 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నాయి. మొత్తం 87.59 లక్షల కుటుంబాల్లో మూడ్రోజుల్లోనే 25 శాతం తీసుకున్నారు. ఇక శనివారం ఉదయం 5 గంటల నుంచే రేషన్ దుకాణాల వద్ద జనాల రద్దీ కనిపించింది. మల్కాజ్గిరి, ఖైరతాబాద్, కుషాయిగూడ, నాగారం, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి వందల సంఖ్యల్లో కూపన్లు ఉన్నవారు, లేనివారు అంతా దుకాణాల వద్దకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పంపిణీ గంట సేపు సజావుగా సాగినా, ఆ తర్వాత సర్వర్ పనిచేయకపోవడంతో గందరగోళంగా మారింది. ఒక పది నిమిషాలు పనిచేస్తే, మరో పదిహేను నిమిషాలు సర్వర్ పనిచేయకపోవడంతో లబ్ధి దారులు డీలర్లతో గొడవకు దిగారు. చాటాచోట్ల వెంట తెచ్చుకున్న సరుకులను వరుసల్లో పెట్టేసి ఒకే దగ్గర గుమికూడారు. చాలా చోట్ల వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిల్చోలేక నీరసించిపోయారు. శనివారం మధ్యాహ్నానికి 4.50 లక్షల మంది బియ్యం తీసుకున్నట్లుగా తెలిసింది. అయితే ఎక్కువగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో సమస్య ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్‌లో 5.80 లక్షలు, రంగారెడ్డిలో 5.24 లక్షలు, మేడ్చల్‌లో 4.95 లక్షల మంది రేషన్ కార్డుదారులుండగా, వీటికి అదనంగా వివిధ ప్రాంతాల వలసదారులు ఇక్కడే రేషన్ పోర్టబిలిటీని వినియోగించుకోవడంతో సాంకేతిక సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో సర్వర్ పనిచేయక బియ్యం పంపిణీ నెమ్మదిగా సాగింది. ఖైరతాబాద్‌లోని ఓ దుకాణంలో సర్వర్ సమస్య కారణంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 15 మందికి మాత్రమే బియ్యం పంపిణీ చేయగలిగారు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపించడంతో అధికారులు స్టేట్ డేటా సెంటర్ వారితో మాట్లాడి సమస్యను కొంతవరకు పరిష్కరించారు. టోకెన్ ఉన్నవారే రావాలి: మారెడ్డి సర్వర్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. టోకెన్ తీసుకున్న లబ్ధిదారులు మాత్రమే బియ్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ బియ్యం పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. -
రేషన్ షాపుల వద్ద ఇబ్బందులు
-
ఇక రేషన్.. చికెన్!
సాక్షి, హైదరాబాద్: ‘పుష్టికర భారత్’నిర్మాణంలో భాగంగా నీతి ఆయోగ్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తోంది. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలతో పాటు ప్రొటీన్ సహిత ఆహారపదార్థాలను కూడా ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా దేశంలోని పేదలకు అందజేసే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలి స్తోంది. గుడ్లు, చికెన్, మాంసం, చేపలను ఈ జాబితా లో చేర్చింది. పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు పుష్టికర ఆహారాన్ని వీలైనంత తక్కువ ధరలకే పేదల కు అందజేయాలనే ఈ ప్రతిపాదనను తన 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్లో పెట్టే అవకాశాలున్నాయి. అమలు, పంపిణీపై అధ్యయనం పౌష్టికాహార లోపం సమస్యను నివారించడంలో భాగంగా గుడ్లు, చికెన్, మాంసం, చేపలు లాంటి ప్రొటీన్ సహిత ఆహార పదార్థాలను పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే వ్యవస్థను రూపొందించడంపై నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్‌చంద్ ఈ విషయమై మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న ఆదాయం ద్వారా పౌష్టికాహారం పొందాల్సింది పోయి దురదృష్టవశాత్తు ఎక్కువ మంది నూనె, చక్కెర, మసాల సహిత పదార్థాలపై ఖర్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలతో పాటు చట్టసభల సభ్యుల్లో కూడా అవగాహన కల్పించేలా విజన్ డాక్యుమెంట్లో ప్రస్తావిస్తామని వెల్లడించారు. ‘పీడీఎస్ ద్వారా ఇప్పటికే సబ్సిడీ ఆహార పదార్థాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నాయి. దీనికి తోడు మాంసాహారం పంపిణీ అమలు భారమయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటికే పంపిణీ చేస్తున్న పదార్థాల్లో కొన్నింటిని తగ్గించి మా ప్రతిపాదనల్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలను పంపిణీ చేస్తే బాగుంటుంది’అని సూచించారు. ఇప్పటికే మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.5లకు పైగా ఉండగా, కిలో మాంసం వందల్లో ఉంది. ఈ నేపథ్యంలో సబ్సిడీ ఎంత ఇవ్వాలి.. రేషన్ షాపుల ద్వారా వీటి పంపినీ ఎలా చేయాలన్న దానిపై కూడా నీతి ఆయోగ్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు కూడా చేయనుందని తెలిపారు. 43 శాతం బరువు తక్కువ చిన్నారులు యునిసెఫ్ లెక్కల ప్రకారం దేశంలోని 20 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికాహార లోపంతో బక్కచిక్కిపోతున్నారు. ప్రపంచంలోనే ఇలా బక్కచిక్కుతున్న చిన్నారుల్లో మూడోవంతు పిల్లలు మనదేశంలోనే ఉన్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో 43 శాతం మంది.. ఉండాల్సిన దాని కన్నా తక్కువ బరువున్నారు. అంటే ప్రతి 10 మందిలో కనీసం నలుగురు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. పౌష్టికాహార లోపం సమస్య పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోతోంది. ఏటా దేశంలో 7.4 మిలియన్ల బరువు తక్కువ చిన్నారులు ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలోనే జన్మిస్తున్నారు. 33 శాతం మంది చిన్నారులు మాత్రమే అంగన్వాడీ సేవలు పొందుతున్నారు. అందులో 25 శాతం మంది ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారణకు దేశంలోని పేదలకు ప్రోటీన్ సహిత పౌష్టికాహారాన్ని చవకగా పంపిణీ చేయడమే మార్గమనే ఆలోచనకు నీతి ఆయోగ్ వచ్చింది. అందుకే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్ రూపొందుతుందని అంచనా. అందులో పీడీఎస్ ద్వారా గుడ్లు, చికెన్, మాంసం, చేపలను పంపిణీ చేయాలనే ప్రతిపాదన చేస్తుందని భావిస్తున్నారు. -
రేషన్ దుకాణాల్లో టీవాలెట్
సాక్షి, వికారాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల్లో నూతనంగా టీ వాలెట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వినియోగంపై ఇప్పటికే జిల్లాలోని డీలర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ యాప్‌ను వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎనిమిది రకాల సేవలు అందించనున్నారు. డీలర్లకు కమీషన్ పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. జిల్లాలోని 18 మండలాల్లో 587 రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 2.34 లక్షల మంది కార్డుదారులకు ప్రతి నెల 5,356 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం జిలాల్లోని అన్ని దుకాణాల్లో టీవాలెట్‌ను అమలు చేయనున్నారు. కొన్ని గ్రామాల్లో సిగ్నల్ సమస్య ఉన్నప్పటికీ.. ప్రత్యామ్నాయ నెట్‌వర్క్‌ను వినియోగించి.. టీవాలెట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే డీలర్ల వద్దనున్న ఈ– పాస్ మిషన్లలో యాప్‌ను వేయించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 8రకాల సేవలు... టీవాలెట్ ద్వారా నూతనంగా ఎనిమిది సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ, ప్రైవేటు లావాదేవీలకు సంబంధించిన చెల్లింపులకు ఇది ఉపయోగపడుతుంది. మీ సేవ, విద్యుత్, ఆర్టీ, నగదు జమ, సెల్‌ఫోన్ రీచార్జ్, డీటీహెచ్ రిచార్జ్, ఇంటి పన్ను చెల్లింపు, బస్సు టికెట్ బుక్కింగ్‌లు వంటి సేవలు దీనిద్వారా పొందవచ్చు. బ్యాంకులతో అనుసంధానంగా లబ్ధిదారులకు ఈ సేవలు అందనున్నాయి. భవిష్యత్‌లో ఉపాధిహామీ, పెన్షన్ చెల్లింపులకు, ఈ యాప్పు వినియోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. టీవాలెట్‌తో బ్యాంకులకు నగదు బదిలీలు, స్వయంసహాయ సంఘాల రుణాల చెల్లింపులు జరిగేలా చూస్తారు. ప్రస్తుతం రేషన్ డీలర్లు 1వ తేదీ నుంచి 15 వరకు సరుకులు పంపిణీ చేస్తున్నారు. టీవాలెట్ అమలైతే నెల రోజుల పాటు వీరి సేవలు కొనసాగించనున్నారు. దీంతో డీలర్లకు ఆర్థిక చేయూత అందనుంది. కమీషన్ పెంచేందుకే... గత కొన్ని రోజులుగా రేషన్ డీలర్ల తమ కమీషన్ పెంచాలని లేదా వేతనాలు ఇవ్వాలని పలుమార్లు సమ్మెకు దిగే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ప్రతీసారి వీరిని బుజ్జగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో డీలర్లకు ఏవిధంగానైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో టీవాలెట్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పలు రకాల సేవలు అందుబాటులోకి రావడంతో పాటు రేషన్ డీలర్లకు ఆర్థిక చేయూతకల్పించినట్లు ఉంటుందని సర్కారు భావిస్తోంది. -
ఆధార్ కార్డు చూపిస్తే .. ఉల్లి గడ్డ
సాక్షి, మచిలీపట్నం : కేవలం నెలరోజుల వ్యవధిలో మూడింతలు పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పెనుభారంగా మారిని ఉల్లిపాయలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నేటి నుంచి రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉల్లి విక్రయాలకు శ్రీకారం చుట్టింది. ఉల్లి ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. కొయ్యకుండానే కన్నీళ్లు తెప్పిస్తు న్నాయి. నెలరోజుల కింద రైతుబజార్లలో కిలోరూ.16 నుంచి రూ.20లు పలికిన ఉల్లి ప్రస్తుతం జిల్లాలో కిలో రూ.55లు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో రూ.60లు కూడా డిమాండ్ చేస్తున్నారు. రైతు బజార్లలో ప్రస్తుతం కిలో ఉల్లి రూ.48లకు చేరింది.జిల్లాలో ప్రతిరోజు సగటున 70 టన్నులకు పైగా వినియోగం ఉంటుందని అంచనా.మన జిల్లా వాసులు ఎక్కువగా మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంత ఉల్లిపాయలనే వినియోగిస్తుంటారు. ఆ తర్వాత ఎక్కువగా షోలాపూర్, కర్నూల్ నుంచి వచ్చే ఉల్లిని వినియోగిస్తుంటారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో అధిక వర్షాలు కురవడంతో అక్కడ పంటలు పూర్తిగా దెబ్బతినడంతో జిల్లాకు సరుకు దిగుమతి గణనీయంగా తగ్గిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో సైతం వర్షాభావ పరిస్థితుల వల్ల ఉల్లి ఉత్పత్తి తగ్గింది. కర్నూల్ మార్కెట్లో క్వింటా గరిష్టంగా రూ.4200లు పలుకుతోంది. హైదరాబాద్, మహారాష్ట్రాలోనూ రూ.4వేలకు పైగా ఉంది. దిగుబడి తగ్గిపోవడంతో ఉన్న కొద్దిపాటి సరుకును డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు పెంచుకుంటూ పోతున్నారు. ఉల్లి ధరలు రోజురోజుకు పెరుగు తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణా చర్యలు చేపట్టింది. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై దాడులు నిర్వహిస్తూనే..మరొక వైపు నుంచి డిమాండ్ తగ్గ ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ప్రభుత్వాదేశాల మేరకు రైతు బజార్లలో ఉల్లి కౌంటర్లను ఏర్పాటు చేయాలని జిల్లా యం త్రాంగం నిర్ణయించింది.ప్రస్తుతానికి కర్నూల్ నుంచి ఉల్లిపాయలు దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కనీసం పదిరోజులకు సరిపడా లోడును రప్పించాలని నిర్ణయించింది.అప్పటికి దిగిరాకపోతే కర్నాటక నుంచి కూడా రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. కనీసం 10–15 టన్నుల ఉల్లి లోడులను కర్నూల్ నుంచి రప్పిస్తున్నారు. వీటిని రైతుబజార్లలో డ్వాక్రా సంఘాల ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. కిలో రూ.25ల కే విక్రయించనున్నారు. అయితే ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డులలో ఏదో ఒకటి చూపిస్తే కుటుంబానికి రోజుకు కిలో చొప్పున విక్రయిస్తారు. రైతు బజార్లలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల వద్ద అవసరమైన మేరకు ప్రత్యేక పోలీస్ బందో బస్తు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు జిల్లా వ్యాప్తంగా కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ఉల్లి వ్యాపారులపై ఎక్కడైనా నిల్వ చేసారేమో గుర్తించేందుకు విస్తృత తనిఖీలు నిర్వహించాలని నిర్ణయిం చారు. ఉల్లిధర అదుపులోకి వచ్చే వరకు రైతు బజార్లలో ఉల్లికౌంటర్లు కొనసాగుతాయని మార్కెటింగ్ శాఖ ఏడీ మురళీకృష్ణ సాక్షికి తెలిపారు. -
రేషన్‌షాపుల దగ్గరే ఈకేవైసీ నమోదు
సాక్షి, అమరావతి: రేషన్‌షాపుల దగ్గరే ఈకేవైసీ నమోదు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేవైసీ కోసం మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన పని లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు పైబడిన వాళ్లకు రేషన్ దుకాణం దగ్గరే ఈ కేవైసీ నమోదు చేస్తారు. ఐదేళ్లలోపు వయసున్న పిల్లలకు ఈకేవైసీ అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 15 ఏళ్ల లోపు వయసున్న వారు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కేవైసీ నమోదు చేసుకోవచ్చు. ఈ కేవైసీ నమోదు కాకపోతే రేషన్ అవ్వరన్నది కేవలం అపోహ మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక బృందాలను పంపిస్తుంది.. మరోవైపు ఆధార్ మరియు కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురైన ఘటనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఆధార్ అప్డేట్కోసం ప్రజలెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరంలేదని అన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా వాటిని అప్డేట్ చేయించుకోవచ్చుని, దానికి ప్రత్యేకంగా ఎటువంటి గడువు లేదని ఆయన స్పష్టం చేశారు.ఆధార్ నమోదు వ్యవహారం ప్రహసనంలా మారిన నేపథ్యంలో ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘స్కూలు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ తాజా వివరాల నమోదుకు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసుల వద్దకు వెళ్ళనవసరం లేదు. రానున్న రోజుల్లో స్కూలు పిల్లలు చదువుతున్న పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వమే ప్రత్యేక బృందాలను పంపిస్తుంది. అక్కడే ఆధార్ వివరాలు అప్డేట్ చేయించుకోవచ్చు. ఈకేవైసీ అప్డేట్ చేయనంత మాత్రాన రేషన్ సరుకులను తిరస్కరించడం అంటూ ఉండదు. ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో అక్కడ మాత్రమే ఈకేవైసీ చేసుకోవలెను. ఈకేవైసీ కొరకు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్ళ కూడదు’ అని పేర్కొన్నారు. గడువు పొడిగిస్తాం: మంత్రి నాని ఈకేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సూచించారు. కుటుంబంలో ఒకరిదైన వేలుముద్ర, లేదా ఐరిష్ నమోదు అయితే కుటుంబానికి ఈకేవైసి వర్తిస్తుంద మంత్రి తెలిపారు.సెప్టెంబర్ 5వరకు ఈకేవైసీ నమోదుకు గడువు ఉన్నా అవసరమైతే గడువు పొడిగిస్తామన్నారు. ఈకేవైసీ నమోదు కాకపోతే రేషన్ కార్డు తొలగిస్తామన్నా పుకార్లు ప్రజలు నమ్మవద్దుని అన్నారు. -
పౌరసరఫరాలపై నిఘానేత్రం
అవినీతికి నిలయంగా... అడ్డగోలు వ్యవహారాలకు చిరునామాగా మారిన పౌర సరఫరాల గోదాములపై నిఘా కన్ను పడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్ధలో జరుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ముందుగా పౌర సరఫరాల గోదాముల్లో నిఘా కెమెరాలను అమర్చుతున్నారు. 18 మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి జిల్లాలోని 2015 చౌకధరల దుకాణాలకు నిత్యావసర సరుకులు రవాణా చేస్తున్నారు. ప్రతి నెల సుమారు రూ.400 కోట్ల విలువైన సరుకులను ఈ గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. ఇక్కడ నుంచి సరఫరా జరిగేటప్పుడు అక్రమాలు చోటు చేసుకొంటున్నాయి. గోదాము రికార్డుల్లో ఉన్న సరుకు మొత్తాలకు.. వాస్తవంగా ఉన్న సరుకు నిల్వలకు భారీ వ్యత్యాసం ఉంటోంది. ఇక నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నిఘాను పటిష్టం చేసి అక్రమాలకు చెక్ పెట్టే ప్రక్రియకు పకడ్బందీగా శ్రీకారం చుట్టారు. సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో తొలి విడతగా రెండు ఎంఎల్ఎస్ పాయింట్లలో సీసీ కెమెరాలు అమర్చారు. తరువాత విడతల వారీగా అన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ముందుగా మెళియాపుట్టి, ఇచ్ఛాపురం ఎంఎల్ఎస్ పాయింట్లపై నిఘా పెట్టారు. జిల్లాలో 18 మండల స్థాయి స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఇంకా 16 ఎంఎల్ఎస్ పాయింట్లకు ఈ కెమెరాలు అమర్చాల్సి ఉంది. మండల స్థాయి గోదాముల పరిధిలో కెమెరాలను అమర్చి అక్కడ నిత్యం జరిగే లావాదేవీలను జిల్లా కేంద్ర స్థాయిలోనే పర్యవేక్షించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. మొదటిగా సీసీ కెమెరాలు అమర్చిన మెళియాపుట్టి, ఇచ్ఛాపురం ఎంఎల్ఎస్ పాయింట్ గోదాముల్లో 24 గంటలపాటు కెమెరాలు పనిచేస్తాయి. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయంలో ఈ పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. డీఎం నిత్యం ఇక్కడ నుంచి గోదాములు లావాదేవీలను పర్యవేక్షించాలి. గోదాముల స్థాయిలో పాయింట్ వద్ద ఏం జరుగుతోందో డీఎం పర్యవేక్షిస్తే.. డీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయం లావాదేవీ లన్నింటినీ ఎండీ కార్యాలయంలో పర్యవేక్షించే విధంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మోసాలు ఇక చెల్లవు జిల్లాలో 18 మండల స్థాయి స్టాక్ పాయింట్ గోదాముల నుంచి 8,31,927 తెల్ల కార్డులున్న లబ్ధిదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు, రాగులు, జొన్నలు సరఫరా చేస్తున్నారు. జిల్లాలో పలు గోదాముల్లో బియ్యం, కందిపప్పు మాయంపై కేసులు నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కొందరు ఉద్యోగులపై కేసులు, విచారణలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మండల స్థాయి గోదాముల నుంచి వచ్చే సరుకుల్లో తూకాల్లో మోసాలు కొనసాగుతున్నాయి. వీటిపై ఇక నుంచి నిఘా పెరగనుంది. మండల స్థాయిలో ఉన్న రికార్డుల పరిశీలన జరుగుతోంది. ఇప్పటి వరకు గోదాముల్లో జరిగిన తేడాలను బయటకు తీయనున్నారు. ఏ సమాచారం అవసరమైనా వెంటనే తీసుకొనే విధంగా మండల స్థాయి నుంచి డీఎం కార్యాలయానికి అనుసంధాన వ్యవస్థను మరింత పటిష్ట పరచనున్నారు. తూనికల్లో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టనున్నారు. అడ్డగోలుగా వ్యవహరించే అధికారులపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే చర్యలు తీసుకొనే విధంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిఘా అమలులో.. పౌర సరఫరాల ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నిఘా వ్యవస్థను పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చారు. ఇందుకోసం రెండు ఎంఎల్ఎస్ పాయింట్లలో కెమెరాల బిగింపు పూర్తయిందని డీఎం ఎ.కృష్ణారావు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అద్దె గోదాములున్న చోట సొంత గోదాముల నిర్మాణం జరుగుతోందని, అక్కడ కూడా కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. దశలవారీగా అన్ని చోట్లా కెమెరాలు తొలి విడతలో రెండు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. ఈ కేంద్రాలను జిల్లా మేనేజర్ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. దశలవారీగా అన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం. – ఎ.కృష్ణారావు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డీఎం, శ్రీకాకుళం -
ఐరిస్ ఆరంభమెప్పుడో..
మెదక్ అర్బన్: రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు పౌర సరఫరాల శాఖ బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ విధానంలో చాలా మంది వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరిస్ పద్ధతిలో రేషన్ సరుకులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ జిల్లాకు ఇప్పటి వరకు ఐరిస్ యంత్రాలు చేరకపోవడంతో ఈ వి«ధానం అమలుకు నోచుకోవడం లేదు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో మొత్తం 521 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా 2.11 లక్షలకు పైగా లబ్ధిదారులు ప్రతి నెలా రేషన్ బియ్యం, కిరోసిన్‌ను తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం బయోమెట్రిక్ విధానం ద్వా రా లబ్ధిదారుల వేలిముద్రలను తీసుకొని రేషన్ బియ్యం, కిరోసిన్, సరుకులు అందిస్తున్నారు. చాలా మంది వేలిముద్రలు పడకపోవడంతో సరుకుల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, కూలీల వేలిముద్రలు రావడం లేదు. దీంతో రెవెన్యూ సిబ్బంది వేలిముద్రల ఆధారంగా వారికి సరుకులను అందించాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఐరిస్ ద్వారా సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ విధానంపై ఆగస్టు నెలలోనే డీలర్లకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కానీ శిక్షణ ఇచ్చి ఆరునెలలు గడుస్తున్నా ఐరిష్ విధానాన్ని అమలు చేయడం లేదు. అక్రమాలకు అడ్డుకట్ట.. రేషన్ దుకాణాలలో జరుగుతున్న అక్రమాలను అ రికట్టడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుం టోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ పోర్టల్ అ స్సెన్స్ సర్వీసెస్ (ఈ–పాస్)ను ప్రవేశపెట్టింది. ఈ విధానంలో లబ్ధిదారుల వేలిముద్రలను తీసుకొని సరుకులను పంపిణీ చేస్తారు. ఈ విధానం అ మలులో లేనప్పుడు రేషన్ సరుకులు తీసుకోవడానికి లబ్ధిదారులు రాకపోయినా వచ్చినట్లు చూపి రేషన్ డీలర్లు సరుకులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. ఈ–పాస్ విధానంతో అక్రమాలకు చెక్ పడింది. ఈ విధానంలో వేలిముద్రల సమస్య ఏర్పడటంతో దీన్ని అధిగమించడానికి ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. తప్పని తిప్పలు.. ఐరిస్ విధానం అమలులో జరుగుతున్న జాప్యం తో వేలి ముద్రలు పడని వారికి ఇబ్బందులు తప్ప డం లేదు. వేలిముద్రలు పడని వారికి సరుకులు ఇ వ్వాలంటే వీఆర్వోల వేలిముద్రలు అవసరం. కా నీ పని ఒత్తిడి వల్ల వారు సకాలంలో రేషన్ దు కాణాలకు రాలేకపోతున్నారు. వేలిముద్రలు రాని వారు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోం ది. ఒక్కోసారి సరుకులను కోల్పోవాల్సి వస్తోం ది. ఉన్నతాధికారులు స్పందించి ఐరిష్ విధానాన్ని అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. బియ్యం ఇవ్వడం లేదు మిషన్‌లో వేలిముద్ర పడకపోవడంతో మాకు అందాల్సిన రేషన్ బియ్యం, కిరోసిన్, సరుకులను ఇవ్వడం లేదు. వేలి ముద్ర ద్వారా సరుకులు అందించేందుకు వీఆర్ఓ ఎప్పుడు వస్తారో..? మాకు తెలియడం లేదు. వారు వచ్చినప్పుడు సరుకులు ఇస్తున్నారు. దీంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అర్హులమైనా రేషన్ సరుకులు అందకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. సర్కారు వెంటనే ఏదైనా కొత్త విధానం ద్వారా రేషన్ సరుకులు అందించి ఆదుకోవాలి. – శిర్న గోదావరి, వృద్ధురాలు, మెదక్ -
కొత్త కార్డులెప్పుడో!
నార్నూర్(ఆసిఫాబాద్): పేదలు రేషన్ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు తీసుకునేందుకు ప్రభుత్వం కొత్తగా రేషన్‌కార్డులు జారీ చేయడం లేదు. రేషన్‌కార్డుల కోసం అర్హులు మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ చేసుకొని నెలలు గడుస్తున్నా కార్డులు జారీ చేయకపోవడంతో ప్రతీనెల రేషన్ షాపుల నుంచి బియ్యం తీసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లబ్ధిదారులు ప్రతీ నెల మీసేవ కేంద్రాలకు పరుగులు పెట్టి ఆహారభద్రత కార్డు జిరాక్స్ తీసుకువస్తేనే రేషన్ డీలర్లు సరుకులు ఇస్తున్నారు. జిల్లాలో 365 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రస్తుతం బీపీఎల్ కార్డులు 1,85,255 ఎఫ్ఎస్సీ కార్డులు 1,72,065 ఏఎఫ్ఎస్సీ కార్డులు 12,914 ఏఏపీ కార్డులు 570 కార్డులు ఉన్నాయి. రేషన్ షాపుల్లో ఈ–పాస్ విధానం అమలు చేయగా ప్రతీ లబ్ధిదారుడు తప్పనిసరిగా ఆహార భద్రత కార్డు ఉంటేనే దానిపై ఉన్న నంబర్‌ను ఈ–పాస్ మిషన్‌లో ఎంటర్ చేసి సదురు లబ్ధిదారుడి వేలిముద్ర వేస్తే గాని సరుకులు అందించే పరిస్థితి లేదు. ప్రభుత్వం గతంలో కొంతమందికి తాత్కాలికంగా ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసినా పూర్తిస్థాయిలో కార్డులు ఇవ్వకపోవడంతో ప్రతీ నెల లబ్ధిదారులు మీసేవ కేంద్రాలకు వెళ్లి ఆహార భద్రత కార్డుల జిరాక్స్ కాఫీలను తీసుకొచ్చి షాపుల్లో సరకులు తీసుకోనే దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు. 11,027 దరఖాస్తులు జిల్లాలో మొత్తం 365 రేషన్‌షాపుల పరిధిలో నూతన కార్డులు కోసం మీసేవ కేంద్రాల్లో 11,027 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వద్ద 3,226, తహశీల్దార్ కార్యాలయాల్లో 290, డీఎస్వో కార్యాలయంలో 544 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా జిల్లా వ్యాప్తంగా 4,060 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కార్డుల కోసం దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను జారీ చేయకపోవడంతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు తహశీల్ కార్యాలయంలోనే పెండింగ్‌లో ఉన్నాయి. నూతన రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేస్తున్నామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అర్హులందరికీ అందిస్తాం ఆహారభద్రత కార్డుల జారీ కోసం లబ్ధిదారులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వానికి ఆ¯న్‌లైన్ ఆప్‌లోడ్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కార్డుల జారీ చేస్తే తప్పనిసరిగా అర్హులందరికీ జారీ చేస్తాం. – సుదర్శనం, డీఎస్వో ఆదిలాబాద్ -
రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం రూరల్: మండలంలోని లక్కవరం గ్రామంలోని మూడు రేషన్ దుకాణాలపై గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ సీఐ భాస్కర్, రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీలు చేసి లోపాలను గుర్తించారు. షాపు నం.17లో 82 కేజీల బియ్యం తక్కువగా, షాపు నం.51లో 1,205 కేజీల బియ్యం తక్కువగా, షాపు నం.50లో 551 కేజీల బియ్యం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించినట్లు విజిలెన్స్ సీఐ భాస్కర్ తెలిపారు. ఆయా షాపులపై 6ఏ కేసులు నమోదు చేశామన్నారు. తహసీల్దార్ కార్యాలయ ఆర్ఐ సునీత, వీఆర్వోలు పాల్గొన్నారు. పొలమూరులో నిల్వల్లో వ్యత్యాసాలు పోడూరు: పెనుమంట్ర మండలం పొలమూరులో షాపు నం.20 రేషన్ డిపోపై గురువారం విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. షాపులోని రికార్డులను, సరుకుల నిల్వలను తనిఖీ చేయగా 353 కేజీల బియ్యం, 5.5 కేజీల పంచదార తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. సంబంధిత డీలర్ 32వ రేషన్ షాపునకు కూడా ఇన్చార్జిగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. సరుకుల నిల్వలో వ్యత్యాసాలు ఉండటంతో కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
ముద్ర పడితేనే ముద్ద!
సాక్షి, అమరావతి: ఈ–పాస్ విధానం అమల్లోకి వచ్చి నాలుగేళ్లయినా చౌక ధరల దుకాణాల్లో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. వివిధ కారణాలతో వేలి ముద్రలు సరిగా పడని కార్డుదారులకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా వీఆర్వో ధ్రువీకరణ ద్వారా సబ్సిడీ బియాన్ని ఇస్తున్నారు. అయితే ఈ నెల నుంచి ఈ–పాస్ మిషన్‌లో ఈ అవకాశాన్ని తొలగించారు. వేలి ముద్రల సమస్య ఉన్న కార్డుదారులకు రేషన్ ఎప్పుడు, ఎలా ఇవ్వాలనే అంశంపై ఈనెల 15వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పని చేయని ఐరిష్... రాష్ట్రంలో 1.44 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డులుండగా 48.62 లక్షల మంది లబ్ధిదారులకు వేలి ముద్రలు సరిగా పడటం లేదు. ఈ–పాస్ వీరిని అనుమతించడం లేదు. ఐరిష్ మిషన్లు ఏర్పాటు చేసినా ఆర్నెళ్ల నుంచి పని చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. 2015 సెప్టెంబర్ నుంచి అమలు చేస్తున్న ఈ–పాస్ విధానం వల్ల ఇప్పటివరకు రూ.1,850 కోట్ల విలువైన దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అయినట్లు అధికారులు చెబుతున్నారు. -
బతుకమ్మ చీరలొచ్చాయ్..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే పండగ బతుకమ్మ. పేద, ధనిక తారతమ్యం లేకుండా జరుపుకునే పండగ. ఆనందోత్సాహాల మధ్య పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని గత ఏడాది నిర్ణయించింది. ఈ మేరకు ముందస్తుగానే జిల్లాకు చీరలు చేరాయి. వీటిని సకాలంలో పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలోని 21 మండలాల్లో ఉన్న 18 ఏళ్లు పైబడిన యువతులతోపాటు మహిళలకు గత ఏడాది నుంచి చీరలు పంపిణీ చేస్తున్నారు. 669 రేషన్ దుకాణాల్లో గత ఏడాది 4,48,797 మంది లబ్ధిదారులకు చీరలను అందించగా.. ఈ ఏడాది సుమారు 10వేల వరకు లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 4.58 లక్షల మంది వరకు లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 669 రేషన్ దుకాణాల్లో 3,95,888 కార్డులున్నాయి. వీటిలో ఆహార భద్రత కార్డులు 3,69,305, అంత్యోదయ కార్డులు 26,581, అన్నపూర్ణ కార్డులు రెండు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండగను అధికంగా నిర్వహిస్తున్నా రు. ఈ పండగ మహిళలకు సంబంధించినది కావడంతో అందరికీ గుర్తుండిపోయేలా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. గతంలో ఇలా.. గత ఏడాది నుంచి దసరా పండగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పౌరసరఫరాల శాఖ ద్వారా 18 ఏళ్ల వయసు దాటిన వారందరి వివరాలు సేకరించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ.. జిల్లాలోని మహిళా లబ్ధిదారులకు అనుగుణంగా చీరలను పంపించి.. ఆయా గోడౌన్లలో సిద్ధం చేసింది. అనంతరం పండగకు ముందు చీరలను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఇలా.. గతేడాది సమాచారం ప్రభుత్వం వద్ద ఉండడంతో వాటికి అనుగుణంగా చీరలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. కొత్తగా రేషన్ కార్డులు కొద్ది మందికి రావడంతోపాటు 18 ఏళ్ల వయసు పైబడిన వారు కూడా ఈ ఏడాది ఉంటారనే అంచనాతో ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా వివరాలు సేకరిస్తూ.. మరో 10వేల చీరలను అధికంగా పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముందుగానే చీరలను సిద్ధం చేసి.. పండగ సమయానికి ఎటువంటి హడావుడి లేకుండా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో అధికారులున్నారు. జిల్లాకు చేరిన 96వేల చీరలు బతుకమ్మ పండగ సందర్భంగా పంపిణీ చేసే చీరలను వైరా, నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్ గోడౌన్లలో సిద్ధంగా ఉంచారు. ఇప్పటివరకు రెండు గోడౌన్లకు కలిపి 96వేల చీరలు వచ్చాయి. అయితే మహిళలకు నచ్చిన విధంగా డిజైన్, రంగులు ఉండాలనే ఉద్దేశంతో అధికారులు ప్రస్తుతం వచ్చిన చీరలపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. జిల్లాకు వచ్చిన బతుకమ్మ చీరల రంగులు, వాటి నాణ్యత, డిజైన్లు రోజూ వాడు తున్న మాదిరిగా ఉన్నాయా..?. ఇంకా ఏమైనా మార్పులు చేయాలా...? తదితర అంశాలపై ప్ర భుత్వం అభిప్రాయ సేకరణ(మహిళల నుంచి ఫీడ్ బ్యాక్) తీసుకుంటోంది. గతంలో చీరల పంపిణీ లో పలు సంఘటనలు ఎదుర్కొన్న అనుభవంతో భవిష్యత్‌లో మహిళలకు నచ్చేలా, మెచ్చేలా చీర లు పంపిణీ చేసేందుకు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మహిళల నుంచి బతుకమ్మ చీరలపై అభిప్రాయాలు తీసుకున్నారు. చీరలు వస్తున్నాయి.. జిల్లాకు బతుకమ్మ పండగ సందర్భంగా చీరలు వస్తున్నాయి. ఇప్పటివరకు 96వేలు వచ్చాయి. త్వరలో మిగతావి వస్తాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపిణీ కార్యక్రమం చేపడతాం.– మదన్‌గోపాల్, కలెక్టరేట్ ఏఓ, ఖమ్మం -
బయోమెట్రిక్‌కు బైబై..
నావంద్గికి చెందిన మాల సుభద్రమ్మకు ప్రభుత్వం అంత్యోదయ కార్డు మంజూరు చేసింది. ఈమెకు ప్రతినెలా 35 కిలోల బియ్యం వస్తాయి. సుభద్రమ్మ ఇద్దరు కొడుకులకు వారి కుటుంబ సభ్యులతో వేర్వేరు రేషన్ కార్డులు ఉండటంతో.. తన కార్డులో ఆమె పేరు మాత్రమే ఉంది. బియ్యం తీసుకునేందుకు షాపు వద్దకు వెళ్లి.. బయోమెట్రిక్ మిషన్‌లో వేలుపెడితే ఎప్పుడూ ముద్రలు వచ్చేవి కావు. దీంతో ఎనిమిది నెలలుగా స్థానిక వీఆర్ఏ వచ్చి వేలిముద్ర వేసి బియ్యం ఇప్పిస్తున్నారు. ఇలా ప్రతినెలా నావంద్గిలో ఐదుగురు లబ్ధిదారులు వీఆర్ఏ కోసం ఎదురు చూస్తుంటారు. బషీరాబాద్ రంగారెడ్డి : ప్రజాపంపిణీ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతను జోడించి లబ్ధిదారులకు సులభంగా నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేద ప్రజలు కడుపునిండా తినాలనే సంకల్పంతో సర్కారు అందజేస్తున్న రూపాయికి కిలో బియ్యం పథకంలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు మరో పకడ్బందీ చర్యను అమలు చేయనుంది. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ద్వారా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నా.. వృద్ధులు, రోజు పనులు చేసే కూలీలు, రక్తహీనత ఉన్నవారి వేలిముద్రలు బయోమెట్రిక్‌లో నమోదు కావడం లేదు. దీంతో వారు సరుకులు తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం బియ్యం పంపిణీని మరింత పారదర్శకంగా అమలు చేయడంతో పాటు, లబ్ధిదారులందరికీ ప్రయోజనం చేకూరేలా ఐరిస్ విధానాన్ని తీసుకువస్తోంది. డీలర్ల వినతుల నేపథ్యంలో రేషన్ లబ్ధిదారుల అవస్థలు తీరనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రేషన్ సరుకుల పంపిణీలో ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టిన సర్కారు ఐరిస్ విధానాన్ని అమలు చేయనుంది. దీనిద్వారా ఇప్పటివరకూ వేలిముద్రలు నమోదు కాకపోవడంతో సరుకులకు దూరమైన వారి కష్టాలు తొలగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ పద్ధతిని అమలు చేసేందుకు సివిల్ సప్లయ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 588 రేషన్ షాపుల పరిధిలో 2,31,271 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటిలో పేరున్న ప్రతిఒక్కరికీ ప్రభుత్వం నెలనెలా 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందజేస్తోంది. ఇందుకోసం ప్రతి నెలా జిల్లాకు 5,316 టన్నుల రేషన్ బియ్యం సరఫరాచేస్తుంది. ఇప్పటివరకు డీలర్లు బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఏ గ్రామంలోనైనా సరుకులు తీసుకునేలా పోర్టబులిటీ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే పలుమార్లు ఈ పాస్ బయోమెట్రిక్ మిషన్లు మొరాయించడం, నెట్వర్క్ పనిచేయకపోవడం వంటి కారణాలతో గడువులోపు పంపిణీ పూర్తికావడంలేదని డీలర్ల నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి. ముఖ్యంగా వేలిముద్రలు రాని వృద్ధులు, రోజువారీ కూలీ పనులు చేసుకునే వారికి, రక్తహీనత ఉన్నవారికి బయోమెట్రిక్‌లో రావడంలేదు. దీంతో అలాంటి వారికి గతంలో గ్రామ వీఆర్ఏల వేలిముద్రలను వేసి సరుకులు అందజేసేవారు. ఈ క్రమంలో పలు చోట్ల వీఆర్ఏలు, డీలర్లు కలిసి అక్రమాలకు పాల్పడిన సంఘటనలు వెలుగుచూడటంతో ఆస్థానంలో నుంచి వీఆర్ఏలను తొలగించి గిర్దవరి, డిప్యూటీ తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయిం చారు. ఇప్పటివరకు వేలిముద్రలు రాని వారికోసం వీఆర్ఓలు షాపుల వారీగా వెళ్లి ఫింగర్ ప్రింట్ వేస్తే తప్ప లబ్ధిదారులకు బియ్యం రాలేదు. ఇది ఓ ప్రహసనంలా మారడంతో ప్రభుత్వం ఐరిస్ విధానం అమలుకు సిద్ధమైంది. ఇందులో మొదట లబ్ధిదారుల కనుపాపలను ఐరిస్ యంత్రంలో నిక్షిప్తం చేస్తారు. ఆధార్ అనుసంధానంలా ఆన్లైన్లో కనుపాపలు సరిపోలితే వారికి రేషన్ సరుకులు అందజేస్తారు. ఇలా కుటుంబంలో ఎవరైనా రేషన్ షాపునకు వెళ్లి సరుకులు తీసుకోవచ్చు. ఇప్పటికే జిల్లాకు ఐరిస్ యంత్రాలు చేరుకున్నట్లు రెవెన్యూ అధికారి ఒకరు తెలిపారు. గడువు పెంచే అవకాశం.. ప్రస్తుతం బియ్యం పంపిణీ పదిహేను రోజుల పాటుసాగుతోంది. అయితే బఫర్ గోదాంల నుంచి డీలర్లకు నెలాఖరు వరకు బియ్యం రావడం లేదు. రవాణా, అధికారుల అలసత్వం వంటి కారణాలతో 5 నుంచి పది రోజుల జాప్యం జరుగుతోంది. ఈ కారణంగానే జిల్లాలో ఆగస్టు కోటాలో ఏకంగా 1,060 టన్నుల బియ్యం మిగులు కావడంతో ప్రభుత్వం మరో రెండు రోజుల పాటు ఆన్లైన్ గడువు పెంచింది. ఇలాంటి సమస్యల వలన గడువును 20వతేదీ వరకు పెంచేలా నిర్ణయం తీసుకోబోతుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఆదేశాలు వచ్చాయి బయోమెట్రిక్ స్థానంలో.. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఐరిస్ విధానం అమలు చేయాలని ప్రభుత్వ నుంచి ఆదేశాలు వచ్చాయి. అక్టోబరు మాసం నుంచి కొత్త పద్ధతి ద్వారానే లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తాం. జిల్లాలోని 588 రేషన్ దుకాణాల్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించాం. ఈ పద్ధతి ద్వారా వేలిముద్రలు స్కాన్ కాని వారి కష్టాలు దూరమవుతాయి. – పద్మజ, జిల్లా పౌర సరఫరాల అధికారి -
తీరనున్న ప‘రేషన్’
పెద్దశంకరంపేట(మెదక్) : ప్రభుత్వం నూతన పంచాయతీల ఏర్పాటుతో ప్రజలను పలు సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది. ఎన్నో ఏళ్లుగా తీరని సమస్యలు కొత్త పంచాయతీల రాకతో తీరేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం మంత్రుల సబ్‌కమిటీ సమావేశంలో కొత్త పంచాయతీల్లో రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. ఈ నిర్ణయంతో జిల్లాలో కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఇక కొత్త పంచాయితీల వద్దనే రేషన్ సరుకులను ప్రజలు అందుకునే అవకాశం ఉండనుంది. జిల్లాలో ప్రస్తుతం 2,07,643 కుటుంబాలు ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నారు. ఇందులో అంత్యోదయ 13,016, అన్నపూర్ణ 88 కార్డులున్నాయి. వీరికి ప్రతీ నెల రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరుకులను అందజేస్తుంది. ఇప్పటి వరకు మధిర గ్రామాలతో పాటు గిరిజన తాండాలకు చెందిన ప్రజలు రేషన్ సరుకులను పొందాలంటే వారు తప్పని సరిగా ఆటోలు, లేక కాలినడకన కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఈ విషయంపై ఇటీవల చర్చించడంతో పాటు నూతనంగా కొత్త పంచా యతీల్లో రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులను దూరం చేయాలని నిర్ణయిం చింది. అదిగాక దుకాణా నికి వెళ్లినప్పుడు ఈ – పాస్ మిషిన్లకు సిగ్నల్స్ సమస్య కూడా లబ్ధిదారులను వేధిస్తుంది. దీంతో ఒక రోజంతా రేషన్ సరుకులు తెచ్చుకోవడానికే సమయం వె చ్చిం చాల్సిన పరి స్థితి. ఇది వరకు జి ల్లా వ్యాప్తం గా 312 పంచాయతీలుండగా కొత్తగా 157 పంచా యతీలు ఏర్పాటయ్యా యి. పాత పంచాయతీల్లో రేషన్ దుకాణాలు ఉండగా ఇప్పుడు 157 కొత్త పంచాయతీల్లో రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ 500 మంది జనాభాకు అనుగుణంగా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలని నిబంధనలు చెబుతున్నా గతంలో పట్టించుకున్న పాపనలేదు. పెద్దశంకరంపేట మండలంలో గతంలో ఉన్న 22 పంచాయతీల పరిధిలో 27 రేషన్ దుకాణాలున్నాయి. నూతనంగా ఏర్పాటైన 5 పంచాయతీలతో కలిపి మండలంలో 27 పంచాయతీలయ్యాయి. ఆహారభద్రత కార్డుల సంఖ్య 11,034 ఇందులో అంత్యోదయ 764, అన్నపూర్ణ 20. వీటికి తోడు ఇటీవల వేలాది మంది కొత్తగా ఆహారభద్రత కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. వీరందరిని పరిగణలోనికి తీసుకొని కొత్తగా రేషన్ దుకాణాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులను దూరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం మండలంలో కొత్తగా రేషన్ దుకాణాల ఏర్పాటకు గతంలోనే ప్రతిపాదనలు పంపించాం. కొత్త పంచాయతీలలో రేషన్ దుకాణాల ఏర్పాటుపై ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేవు. కొత్త పంచాయతీల్లో రేషన్ దుకాణాల ఏర్పాటుపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. –నారాయణ, తహసీల్దార్, పెద్దశంకరంపేట ఇబ్బందులు తొలుగుతాయి.. కొత్తగా ఏర్పాటైన మా పంచాయతీ ఇసుకపాయలతాండాలో రేషన్‌దుకాణం ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలిగిపోతాయి. ఎన్నో ఏళ్లుగా రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ తెచ్చుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే రేషన్ దుకాణాం ఏర్పాటు చేయాలి. –దీప్‌సింగ్, ఇసుకపాయలతాండా, పెద్దశంకరంపేట -
కొత్త రేషన్‌షాపులపై ఆశలు
ఖమ్మం సహకారనగర్: ఇటీవల నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పడడంతో..కొత్తగా రేషన్ షాపులు కూడా సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇందుకవసరమైన కసరత్తు చేయాల్సిందిగా సూచించడంతో..ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పౌరసరఫరాల శాఖ ద్వారా అందించే రేషన్ సరుకులను మరింత చేరువ చేయాలని భావిస్తోంది. జిల్లాలో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖాధికారులు, రేషన్ దుకాణాలు, కార్డుల వివరాలపై సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 427 గ్రామ పంచాయతీల్లో 669 రేషన్ దుకాణాలున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 500జనాభా కంటే ఎక్కువ ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. దీంతో జిల్లాలో మరో 157కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. వాటిల్లోని ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు..గ్రామ పంచాయతీలు, దుకాణాల వివరాలతో పాటు స్థానికంగా ఉన్న కార్డుల వివరాలపై పరిశీలన చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలో 500కార్డుల కంటే అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో సైతం రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. జిల్లాలో కొత్తగా 80దుకాణాలు..? జిల్లాలో నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పడిన నేపథ్యంలో సుమారు 80రేషన్ దుకాణాలు ఏర్పాటయ్యే అవకాశముంది. గతంలో 427 గ్రామ పంచాయతీల్లో 669 దుకాణాలుండగా, పెరిగిన 157 గ్రామ పంచాయతీల్లో 80దుకాణాలు మాత్రమే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీనిపై పౌరసరఫరాలశాఖాధికారులు గ్రామాల్లో రేషన్ దుకాణాలు ఏమైనా అవసరం ఉంటాయా...? ఉంటే వాటి వివరాలు అందజేయాలని కోరారు. అధికార యంత్రాంగం మాత్రం సుమారు 60నుంచి 80రేషన్ దుకాణాలు అవసరం ఉండొచ్చని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కార్డుల సంఖ్య కనీసం 500 ఉండాలనే నిబంధన ఉంది. నూతనంగా ఏర్పాటైన కొన్ని గ్రామ పంచాయతీల్లో 200కుటుంబాలు కూడా ఉండట్లేదు. ఇక్కడ డీలర్‌కు నష్టం వాటిల్లే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 80దుకాణాల వరకే ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో కొత్తగా రేషన్‌దుకాణాల ఏర్పాటు, అక్కడి పరిస్థితులు, కొత్తగా ఏర్పడనున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. అనంతరం ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే శిరోధార్యం కానుంది. జిల్లాలో రేషన్‌కార్డుల వివరాలు ఇలా.. మొత్తం కార్డులు 3,95690 ఆహారభద్రత 3,69,087 అంత్యోదయ 26,575 అన్నపూర్ణకార్డులు 2 నివేదిక సమర్పిస్తాం.. జిల్లాలో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడడంతో..ఇందుకనుగుణంగా రేషన్ షాపులు కూడా అవసరమవుతాయి. అయితే జనాభా ఆధారంగా ఎన్ని కావాలనే విషయాలపై కసరత్తు చేస్తున్నాం. ఈ మేరకు తహసీల్దార్లను వివరాలు కోరాం. దీని ఆధారంగా..ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తాం. – సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఖమ్మం -
కొత్తమార్గంలో బియ్యం దందా!
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో రేషన్‌బియ్యం దందా దారి మళ్లింది. రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకత కోసం మార్చి నెల నుంచి ఈ–పాస్ యంత్రాలను వినియోగిస్తున్నారు. అయినా ఈ దందాకు అడ్డుకట్ట పడటంలేదు. గతంలో రేషన్‌షాపుల నుంచే బియ్యాన్ని దారి మళ్లించగా, ఇప్పుడు వ్యాపారులు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని రైస్‌మిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా అమ్మకాలు సాగిస్తున్నారు. వాహనాల్లో తరలిస్తుండటంతో రేషన్ బియ్యం పోలీసులకు తరుచూ పట్టుబడుతున్నాయి. గ్రామాల్లో సేకరణ గ్రామాల్లో కొందరు లబ్ధిదారులు దొడ్డుగా ఉన్న రేషన్ బియ్యం తినలేక చిన్న వ్యాపారులకు కిలోకు రూ.6 నుంచి రూ.10 చొప్పున అమ్ముకుంటున్నారు. వారు ఆయా ప్రాంతాల్లో బియ్యం దందా చేసే పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు అక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గంలో మహారాష్ట్ర, హైదరాబాద్ పరిసరాల్లోని కోళ్లఫారాలకు తరలిస్తున్నారు. అక్కడ మిల్లర్లకు కిలోకు రూ.22కు విక్రయిస్తున్నారు. అంటే దళారులు కిలోకు రూ.16 నుంచి రూ.12 వరకు లాభం పొందుతున్నారు. అయితే గ్రామాల్లో నుంచి మిలర్ల వద్దకు తరలించేందుకు వ్యాపారులు కొత్త మార్గాలనే అనుసరిస్తున్నారు. ఈ దందాలో రోజువారీ కూలీల నుంచి బడా వ్యాపారుల వరకు ఉన్నారు. రెండు మూడు క్వింటాళ్లు సేకరించి బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్నారు. రేషన్ బియ్యం అనేది గుర్తుపట్టకుండా బ్రాండెడ్ బ్యాగుల్లో నింపి రవాణా చేస్తున్నారు. లాభసాటి వ్యాపారం రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అమ్మడం అక్రమార్కులకు లాభసాటి వ్యాపారంగా మారింది. దొడ్డిదారిన కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఆగమేఘాల మీద ప్రభుత్వ సంచుల్లోకి మార్చేస్తున్నారు. తద్వారా మిల్లులో రికార్డులను తారుమారు చేస్తున్నారు. లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికే అమ్ముతున్నారు. ఒక్కప్పుడు 30శాతం మాత్రమే ఉన్న రీసైక్లింగ్ వ్యాపారులు నేడు రెట్టింపైనట్లు తెలుస్తోంది. అధికారుల మధ్య సమన్వయలోపం రేషన్ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకోవాల్సిన రైల్వే, పౌరసరఫరాల అధికారులు, పోలీసుశాఖల మధ్య సమన్వయం లేకపోవడం అక్రమార్కులకు కలిసివస్తోంది. ఈ మూడు శాఖల మధ్య సమన్వయం ఉంటే అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపవచ్చు. దాడులు ఉధృతం చేస్తున్నాం.. పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమో దు చేస్తున్నాం. జిల్లాలో ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమ రవా ణా చేస్తే ఎన్ఫోర్స్మెంట్ వారితో దాడులు చేయిస్తున్నాం. వీరికి అదనంగా గ్రామ స్థాయి నుంచి నుంచి డివిజన్ స్థాయి వరకు టీంలు ఏర్పాటు చేసి రేషన్ అక్రమ తరలింపు అరికడతాం. – నర్సింగరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
రేషన్‌షాపుల ద్వారా శానిటరీ నేప్కిన్స్ విక్రయం
లక్కవరపుకోట(శృంగవరపుకోట) : రేషన్ డిపోల ద్వారా త్వరలో మహిళలకోసం శానిటరీ నేప్కిన్స్ అమ్మకాలు చేపట్టనున్నామనీ... ఇందుకోసం రూ. 120కోట్లు కేటాయిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో సోమవారం గ్రామదర్శిని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వీధుల్లో పర్యటించి పింఛన్, రేషన్ సక్రమంగా అందుతున్నదీ లేనిదీ అడిగితెలుసుకున్నారు. తూనికల్లో తేడాలుంటున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో రావి, వేప మొక్కలను నాటారు. అనంతరం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రచ్చబండపై నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా త్వరలో ఆడవారికి సంబంధించిన నేప్కిన్స్ అందజేస్తాం అమ్మకాలు చేస్తావా అంటూ డీలర్‌ను ప్రశ్నించారు. చంద్రన్నబీమా, సాధికార మిత్ర, ఉపాధిహామీ పథకాల వివరాలపై చర్ఛించారు. సాధికార మిత్రలు ప్రభుత్వ పథకాలపై గ్రామంలో మరింతగా ప్రచారం చేయాలని సూచించారు. జమ్మాదేవిపేటకు వరాలు గ్రామంలో గల రామాలయం పునర్నిర్మాణానికి రూ. 50లక్షలు, కల్యాణ మండపానికి రూ. 50లక్షలు, దళిత వాడలో అంబేడ్కర్ భవనానికి రూ. 15లక్షలు, బీసీ కాలనీలో సామాజిక భవనానికి రూ. 10లక్షలు, నంది కళ్లాలవద్ద సామాజిక భవనం నిర్మాణానికి రూ. 10లక్షలు, రంగాపురం–జమ్మాదేవిపేట గ్రామాల అనుసంధానానికి బీటీ రోడ్డు, ఇంటింటికి తాగునీటి కుళాయిలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దళిత సర్పంచ్‌పై చిన్నచూపు కాగా ముఖ్యమంత్రి కార్యక్రమం మొత్తం వైస్ సర్పంచ్ కొట్యాడ ఈశ్వరరావు అధ్యక్షతనే నిర్వహించారు. వాస్తవానికి దళిత కులానికి చెందిన మెయ్యి కన్నయ్య సర్పంచ్ అయినా ఆయన్ను సీఎం పట్టించుకోలేదు. గ్రామ సభలోకి కూడా ఆహ్వానించలేదు. ఇక సీఎం గ్రామ సందర్శనలో అన్ని వీధుల్లోనూ పర్యటించి చివరిలో దళిత వాడలో మాత్రం పర్యటించలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభ స్వాతిరాణి, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, విజయనగరం ఎంపీ ఆశోక్‌గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ దుకాణాలపై సామాజిక తనిఖీ
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల్లో వినియోగదారులకు అందుతున్న సేవలపై సామాజిక తనిఖీ చేసేలా తాజా మార్గదర్శకాలు జారీచేస్తూ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రతీ ఆరు నెలలకోసారి గ్రామసభ పెట్టి రేషన్ దుకాణాల రికార్డులు, సరుకుల పంపిణీ తదితర అంశాలపై సామాజిక తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. తాజా మార్గదర్శకాల ప్రకారం..అర్బన్ ఏరియాలో గత ఆరు నెలల డాక్యుమెంట్లను సభల్లో ప్రవేశపెట్టాలి. గ్రామసభ ఎక్కడ పెట్టేది, ఏ తేదీన నిర్వహించేది తదితర వివరాలను వీఆర్వో విజిలెన్స్ కమిటీకి తెలియపరచాలి. ఆ గ్రామంతో పాటు, శివారు గ్రామ వినియోగదారులకూ తనిఖీ విషయం తెలిసేలా ప్రచారం చేయాలి. ఉదయం 8–10 మధ్య లేదా సాయంత్రం 4–6 గంటల మధ్య సామాజిక తనిఖీ జరిగేలా చూడాలి -
బినామీల బాగోతం
కలువాయి మండలం రాజుపాళెం చౌక దుకాణం ఓ మహిళ పేరుతో నిర్వహిస్తున్నారు. ఆమెకు వివాహమై సుమారు 7 సంవత్సరాలు గడిచింది. ఆమె నెల్లూరులో ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. రాజుపాళెంలోని చౌకదుకాణాన్ని ఆమె తండ్రి నిర్వహిస్తున్నాడు. నెల్లూరు నగరంలోని మూలాపేట, వెంకటేశ్వరపురం, కావలి, గూడూరు, నాయుడుపేట, ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి తదితర మండలాల్లో ఇలా బినామీలు రేషన్‌షాపులు నిర్వహిస్తుండడం కారణంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. నెల్లూరు(పొగతోట): చౌకదుకాణాల్లో ఏళ్ల తరబడి బినామీల బాగోతం నడుస్తోంది. రేషన్‌షాపు డీలర్ పక్క జిల్లాలో ఉన్నా బినామీ డీలర్ మాత్రం చౌకదుకాణాలను సంవత్సరాల తరబడి నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ఈ–పాస్ విధానంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పేద ప్రజలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. జిల్లాలో చాలా మంది డీలర్ల ఆధ్వర్యంలో మూడు నుంచి నాలుగు చౌకదుకాణాలు ఉన్నాయి. మూలాపేటకు చెందిన రెండు చౌకదుకాణాలకు సంబంధించిన డీలర్లు పక్క జిల్లాలో నివాసం ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. రేషన్‌షాపును మరొకరికి అద్దెకు ఇచ్చి రెండు వైపులా సంపాదిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో 300లకు పైగా చౌకదుకాణాలు బినామీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనేక ప్రాంతాల్లో మహిళల పేర్లతో రేషన్ షాపులు ఉన్నాయి. వాటి నిర్వహణ మాత్రం బినామీలు చేస్తున్నారు. వివాహమై దూర ప్రాంతాలకు వెళ్లిన వారు షాపులు వదులుకోకుండా బినామీల ఆధ్వరంలో నిర్వహిస్తున్నారు. మరణించినా కొనసాగుతున్న వైనం పలువురు డీలర్లు మరణించినా ఆ షాపులు కొనసాగుతున్నాయి. మరణించిన వారిలో అతి తక్కువ మందికి మాత్రమే వారి కుటుంబ సభ్యులకు కేటాయించారు. అధిక శాతం రేషన్ షాపులు బినామీల చేతుల్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని బినామీ డీలర్లు రేషన్ షాపునకు బోర్డులు కుడా ఏర్పాటు చేయకుండా వారి ఇళ్లలోనే నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో బినామీ డీలర్లు రూ.కోట్లు సంపాదించారు. జిల్లాలో 1896 చౌకదుకాణాలు ఉన్నాయి. 8.76 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా 14 వేల మెట్రిక్ టన్నుల బియ్యం చౌకదుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు. చౌకదుకాణాల డీలర్లు ప్రతి నెలా డీడీ తీసి కార్యాలయంలో అందజేయాల్సిఉంది. డీడీలు చెల్లించిన చౌకదుకాణాలకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ సరఫరా చేస్తారు. గత నెలలో ఉన్న నిల్వలను పరిశీలించి రేషన్ సరఫరా చేస్తారు. ఈ–పాస్ విధానం ప్రవేశ పెట్టక ముందు డీలర్లు 100, 95 శాతం పంపిణీ చేసినట్లు రికార్డులు చూపించేవారు. 50 నుంచి 60 శాతం మాత్రమే కార్డుదారులకు పంపిణీ చేసేవారు. మిగిలిన దానిని దొడ్డిదారిన పక్క రాష్ట్రాలకు తరలించే వారు. కొంతమంది డీలర్లు జిల్లాలో రైస్ మిల్లర్లకు విక్రయించేవారని సమాచారం. బియ్యం, చక్కర, కిరోసిన్ ద్వారా డీలర్లు లక్షల రూపాయలు వెనుకవేసుకునేవారు. అక్రమమార్గంలో సంపాదించిన దానిలో అసలు డీలర్లకు అద్దెతోపాటు 10 శాతం వాటా ఇచ్చేవారని తెలుస్తోంది. కొత్తదారులు వెదకి.. ఈ–పాస్ విధానం వచ్చిన తరువాత డీలర్ల చేతులు కొంతవరకు కట్టేశారు. డీలర్లు నూతన మార్గాలు అన్వేషించారు. బినామీలు నిర్వహించే రేషన్ షాపులకు బోగస్ ఏఏవై(అంత్యోదయ అన్న యోజన) కార్డులు సృష్టించారు. ప్రస్తుతం ఏఏవై కార్డుల ద్వారా బియ్యం స్వాహా చేస్తున్నారు. ఏఏవై కార్డుకు 35 కేజీలు బియ్యం పంపిణీ చేస్తారు. 100 బోగస్ ఏఏవై కార్డులు ఉన్న చౌకదుకాణం డీలర్ 3500 కిలోల బియ్యం(70 బస్తాలు) స్వాహా చేస్తున్నారు. 150 ఏఏవై కా>ర్డులు ఉన్న రేషన్ డీలర్లు 105 బస్తాల బియ్యం స్వాహా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎలక్ట్రానికల్ నో యువర్ కస్టమర్(ఈకేవైసీ) కార్యక్రమం జరుగుతోంది. ఈకేవైసీ ద్వారా చౌకదుకాణాల డీలర్ల పూర్తి సమాచారం ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఇప్పటి వరకు 17 మండలాల్లో మాత్రమే ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభమైంది. మిగిలిన 29 మండలాల్లో ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరణించిన రేషన్ షాపుల డీలర్ల సమాచారం వచ్చే అవకాశం లేదు. ఇతర జిల్లాల్లో నివసించే వారు, వివాహం అయిన మహిళల షాపులకు సంబంధించిన సమాచారం పూర్తిగా ఆన్లైన్లో నమోదు అయ్యే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారణ చేపడితే బినామీల రేషన్ డీలర్ల బండారం బయటపడే అవకాశం ఉంది. డీలర్ల సమాచారం సేకరిస్తున్నాం చౌకదుకాణాల డీలర్లకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నాం. ఈకేవైసీ ద్వారా డీలర్ల సమాచారం సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తాం. సమాచారం సేకరించే సమయంలో బినామీలు ఉంటే బయపడే అవకాశం ఉంది. అలాంటి షాపులకు సంబంధించిన వివరాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. అధికారుల అనుమతితో నోటిషికేషన్ ద్వారా షాపులను నూతన డీలర్లకు కేటాయిస్తాం. – శివప్రసాధ్, డీఎస్ఓ -
తెలుగుదేశం పార్టీ రేషన్ దుకాణం!
మార్కాపురం : పశ్చిమ ప్రకాశంలోని 12 మండలాల్లో ఉన్న రేషన్ దుకాణాల్లో బినామీ డీలర్లు హవా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండటంతో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న డీలర్లపై ప్రథకం ప్రకారం వేటు వేస్తూ వచ్చారు. అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రతిపక్ష పార్టీ మద్దతు డీలర్లు రాజీనామా బాట పట్టేలా చేశారు. డివిజన్లో మొత్తం 438 రేషన్ దుకాణాలు ఉండగా 1, 81, 232 రేషన్‌కార్డులు ఉన్నాయి. టీడీపీ నేతలు, అధికారుల ఒత్తిడి తట్టుకోలేక మొత్తం ఇప్పటి వరకు 70 మంది డీలర్లు రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేయాల్సిన అ«ధికారులు కాలక్షేపం చేస్తూ పొదుపు సంఘాల పేరుతో టీడీపీ నేతలకు షాపులు కట్టబెడుతున్నారు. వారు ఆడిందే ఆట..పాడిందే పాటలాగా.. రేషన్ ఇస్తేనే కార్డుదారులు నిత్యవసరాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల వేధింపులు ఎదుర్కొన్న వైఎస్సార్ సీపీ మద్దతుదారులు సుమారు 25 మంది డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసి టీడీపీ మద్దతుదారులకు రేషన్ షాపులు కట్టబెట్టారు. రికార్డుల్లో మాత్రం షాపులు పొదుపు సంఘాల మహిళలు నిర్వహిస్తున్నట్లు చూపుతున్నారు. వాస్తవంగా షాపులు నిర్వహించేది మాత్రం టీడీపీ మద్దతుదారులే కావడం గమనార్హం. ఇవిగో..అక్రమాలు దోర్నాల మండలం కటకానిపల్లె, కడపరాజుపల్లి, ఐనముక్కల, గంటవారిపల్లె, బోడెనాయక్ తండా, దోర్నాల 15, 16, 26 షాపులు, చింతల అగ్రహారం డీలర్లను భర్తీ చేయాల్సి ఉంది. పెద్దారవీడు మండలం ఎస్.కొత్తపల్లె, కలనూతల, గొబ్బూరు, బి.చెర్లోపల్లె, దేవరాజుగట్టుల్లో రేషన్‌షాపులు ఖాళీగా ఉన్నాయి. బేస్తవారిపేట మండలం పెంచికలపాడు, బేస్తవారిపేట, కంభం మండలం కందులాపురం, రావిపాడు, ఎర్రబాలెం, తురిమెళ్ల, నర్సిరెడ్డిపల్లె తదితర గ్రామాల్లో షాపులు ఖాళీగా ఉన్నాయి. గిద్దలూరు మండలం ముండ్లపాడు, సూరేపల్లె, సంజీవరావుపేట, కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లె, మార్కాపురంలో మార్కాపురం 21, మిట్టమీదపల్లె, గొట్టిపడియ, తిప్పాయపాలెం, జమ్మనపల్లి, కొండేపల్లి, గజ్జలకొండ 1, 2, బోడపాడు, నాయుడుపల్లె, పెద్దయాచవరం, భూపతిపల్లె 2లో ఖాళీలు ఉన్నాయి. పుల్లలచెరువు మండలం అక్కపాలెం, నాయుడుపాలెంలో 2, సిద్ధినపాలెం, ఐటీవరం, అయ్యవారిపల్లె, సింగుపల్లి, మానేపల్లి, నరజాముల తండాల్లో షాపులు ఖాళీగా ఉన్నాయి. త్రిపురాంతకం మండలం టి.చెర్లోపల్లె, గణపవరం, ఎండూరివారిపాలెం, జి.ఉమ్మడివరం, కంకణాలపల్లె, మిరియంపల్లి, రామసముద్రం, లేళ్లపల్లి, నడిగడ్డ డీలర్‌షిప్‌లు భర్తీ చేయాల్సి ఉంది. యర్రగొండపాలెం మండలం బోయలపల్లి, యర్రగొండపాలెం 5, 21, గోళ్లవీడిపి, సర్వాయపాలెం, గంజివారిపల్లె, గురిజేపల్లి, కొలుకుల, చిన్నబోయలపల్లె, గంగపాలెం, యర్రగొండపాలెం 22, 11 స్థానాల్లో ఖాళీలు ఉన్నాయి. మరికొంత మంది డీలర్లపై అధికారులు 6ఏ కేసులు నమోదు చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. వీరి స్థానంలో పొదుపు సంఘాల సభ్యులను ఇన్చార్జిలుగా నియమించారు. రాజీనామా చేసిన డీలర్లు 90 శాతం మంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక డీలర్‌షిప్‌లు వదులుకున్నారు. వీరిని ఎదిరించిన డీలర్లపై రెవెన్యూ అధికారులు 6ఏ కేసులు, మరీ లొంగకుంటే పోలీసు కేసులు కూడా పెట్టారు. బినామీ డీలర్లు కావడంతో అధికారులు గట్టిగా చెప్పలేకపోతున్నారు. వినియోగదారులకు రేషన్‌షాపుల ద్వారా సరఫరా చేసే బియ్యం, చక్కెర సక్రమంగా లభించడం లేదు. మొత్తం మీద పశ్చిమ ప్రకాశంలో బినామీ డీలర్ల హావా కొనసాగుతోంది. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖాధికారులు వీటిని భర్తీ చేస్తే ప్రజలకు సక్రమంగా నిత్యావసరాలు అందే అవకాశం ఉంది. ఇటీవల త్రిపురాంతకం మండలంలో కొన్ని ఖాళీలను భర్తీ చేశారు. -
సకాలంలో తెరుచుకోని రేషన్ షాపులు 27 వేలు
సాక్షి, అమరావతి : రేషన్ డీలర్లు 95 శాతం మందికి పైగా రేషన్ షాపులను నిర్ణయించిన సమయాల్లో తెరవడం లేదని ప్రభుత్వం గుర్తించింది. షాపుల నిర్వహణ, వాటి సమయ పాలనపై ప్రభుత్వం ఇటీవల సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో 28 వేలకుపైగా రేషన్ షాపులు ఉంటే వాటిలో దాదాపు 27 వేల షాపులు సరిగా తెరవడం లేదని సర్వేలో తేలింది. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుతున్నవి 1,177 షాపులు మాత్రమేనని అధికారులు తేల్చారు. మిగిలిన షాపులు ఎలాంటి సమయపాలన పాటించకపోవడంతో లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో పనివేళలు సరిగా పాటించని డీలర్లపై జరిమానా విధించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగా రోజంతా షాపు తెరవకపోతే డీలర్‌కు రూ.500 ఫైన్ వేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లను పౌరసరఫరాల శాఖ ఆదేశించింది. ప్రతి నెలా 1 నుంచి 15 వరకు లబ్ధిదారులకు సబ్సిడీ సరుకులు పంపిణీ చేయాలని, తప్పనిసరిగా పనివేళలు పాటించాలని రేషన్ డీలర్లకు అధికారులు స్పష్టం చేశారు. షాపులను తెరవలేదనే విషయం ఈ–పాస్ మిషన్ల ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో ఎప్పటికప్పుడు అలాంటి డీలర్లను గుర్తించి వారికిచ్చే కమీషన్లో పెనాల్టీ మొత్తాన్ని జమ చేసుకొని మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టు పట్టిసున్నారు. రేషన్ షాపులకు కేటాయించిన సరుకుల పంపిణీని 5వ తేదీకల్లా పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో డీలర్లు కూడా ఆ మేరకు పంపిణీ చేస్తున్నారు. డీలర్ పరిధిలోని లబ్ధిదారులందరికీ సరుకులు పంపిణీ చేసిన తర్వాత రేషన్ షాపును ఎందుకు తెరవాలి? ఇలాంటి విషయాలు గుర్తించకుండా డీలర్లు షాపులను తెరవలేదని అధికారులు చెప్పడం సరికాదు. డీలర్ల సమస్యలు పరిష్కరించాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోకుండా మాపైనే నెపం వేయడం ఎంతవరకు సమంజసం? – దివి లీలామాధవరావు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
హెల్ప్ మి
వారు ఒంటరివారు..రేషన్ డీలర్‌గా బతుకు బండి లాగుతున్నారు. సరుకుల పంపిణీ చేసేందుకు సహాయక (హెల్పర్)ని ప్రభుత్వం నియమించకపోవడంతో కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీలో ఆపసోపాలు పడుతున్నారు. నామినీగా భార్యాభర్తలో ఎవరో ఒకరిని పెట్టుకోవచ్చని ప్రభుత్వం ఆదేశించినా వచ్చే అంతంతమాత్రం ఆదాయానికి ఇద్దరు ఒకేచోట ఉండిపోతే పోషణ భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామినీ బదులుగా హెల్పర్లను నియమించాలని వేడుకొంటున్నారు. ఉయ్యూరులోని 0682020 నంబర్ రేషన్ దుకాణాన్ని ఒక మహిళా డీలర్ నిర్వహిస్తున్నారు. ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. బతుకుతెరువు కోసం రేషన్ డీలర్ గా ఉన్నారు. జీవిత భాగస్వామి లేకపోవడంతో నామినీని పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. హెల్పర్‌ను నియమించుకునే అవకాశం ఇవ్వమని కోరుతున్నా స్పందనలేదు. విజయవాడ సర్కిల్–2 కార్యాలయ పరిధిలో పి.వెంకటేశ్వరరావు( నంబర్ 0684263 ) రేషన్ డిపో నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య లేదు. ఒంటరిగా ఉండటంతో ప్రభుత్వం నిబంధనల ప్రకారం నామినీని నియమించుకునే అవకాశం లేదు. తాను ఒక్కడినే దుకాణం నడపుకోలేనని హెల్పర్ కావాలని కోరినా స్పందన శూన్యం. సాక్షి, విజయవాడ : జీవనోపాధి కోసం రేషన్ దుకాణం నడిపే డీలర్ల మెడపై ప్రభుత్వం ఆంక్షల కత్తి పెడుతోంది. దీంతో డీలర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తలాతోక లేకుండా తీసుకున్న నిర్ణయాలు కొంతమంది డీలర్లకు శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగి జీవిస్తూ, రేషన్ దుకాణం నడుపుకునే డీలర్లకు నామినీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నామినీలకు బదులుగా హెల్పర్లకు అవకాశం ఇవ్వమని డీలర్లు ముక్తకంఠంతో కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా వారికి చుక్కలు చూపిస్తోంది. నామినీలను తగ్గించడంతో ఇబ్బందులు రేషన్ దుకాణాన్ని ఒక డీలరే నడుపుకోలేరని గతంలో ఇద్దరు నామినీలను ఇచ్చేవారు. రేషన్ డీలర్ వేలిముద్రలతో పాటు మరో ఇద్దరి వేలిముద్రలు ఈపోస్ మిషన్‌లో నమోదు చేసే వారు. డీలర్ దుకాణంలో లేని సమయంలో మిగిలిన ఇద్దరిలో ఎవరైనా సరుకులు ఇచ్చే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఇద్దరు నామినీలను తీసి వేసి కేవలం భార్య లేదా భర్త మాత్రమే నామినీగా ఉండాలని వారే సరుకులు పంపిణీ చేయాలని నిబంధన విధించింది. భర్త పేరుతో రేషన్ దుకాణం ఉంటే భార్య, భార్య పేరుతో ఉంటే భర్త వేలిముద్రలు మాత్రమే ఈపోస్ మిషన్ తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. భార్య, భర్త మినహా ఇతరుల వేలిముద్రలు నమోదు చేయడానికి వీలు లేదు. రెండో నామినీని తొలగించారు. కొండనాలుకకు మందేస్తే... రేషన్ దుకాణాలు బినామీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని విమర్శలు రావడంతో బినామీలను అరికట్టేందుకు అధికారులు ఇద్దరు నామినీలను తొలగించి, జీవిత భాగస్వామిని మాత్రమే నామినీగా ఉంచారు. కొండనాలుకకు మందేస్తే.. ఉన్ననాలిక ఊడినట్లు ఇప్పుడు ఈ నిబంధన కొంతమంది డీలర్లకు శాపంగా మారింది. జిల్లాలో 2,147 రేషన్ దుకాణాలు ఉండగా అందులో 73 దుకాణాల డీలర్లకు జీవిత భాగస్వాములు లేరు. ఇప్పుడు వారికి నామినీని పెట్టుకునే అవకాశం లేకపోయింది. దీంతో డీలర్లు నానా అవస్థలు పడుతున్నారు. డీలర్లకు కష్టాలు ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప ఇతర సరుకులు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. దీంతో డీలర్లు కటుంబాలు గడవడం ఇబ్బందిగా మారింది. దీంతో జీవిత భాగస్వాములు కూడా వేరే పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు వారిని మాత్రమే నామినీగా నియమించడం వల్ల వాళ్లు మరో పనిచేసుకునే వీలులేకుండా పోయింది. హెల్పర్స్ను నియమించాలని మంత్రికి వినతి చౌకధరల దుకాణదారుల సంఘం రాష్ట్ర నాయకులు ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావును కలిసి నామినీకి బదులుగా హెల్పర్స్ను నియమించుకునేందుకు అవకాశం కల్పించమని కోరారు. హెల్పర్‌కు వేతనం కాని, కమీషన్ కాని ప్రభుత్వం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కేవలం రేషన్ దుకాణం నిర్వహిస్తే ఆదాయం సరిపోక నామినీలు కూడా వేరొక పనిచేసుకుంటున్నారని వివరించారు. నామినీకి బదులుగా హెల్పర్ వేలిముద్రను ఈపోస్ మిషన్‌లో తీసుకోవాలని కోరుతున్నారు. అయితే దీనిపట్ల మంత్రి సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. హెల్పర్స్ను అనుమతించం కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం డీలర్లు కోరిన విధంగా హెల్పర్స్‌ని నియమించడం సాధ్యపడదు. అయితే జీవిత భాగస్వామి లేని పక్షంలో డీలర్ రేషన్‌కార్డులో ఉన్న వారిలో ఒకరిని నామినీగా నియమిస్తాం. – డీఎస్వో నాగేశ్వరరావు హెల్పర్‌ను నియమించండి నామినీకి బదులుగా హెల్పర్‌ను ఇవ్వమని ఇప్పటికే మంత్రిని కలిసి విన్నవించాం. హెల్పర్‌ను ఇస్తే డీలర్లకు ఉపయుక్తంగా ఉంటుంది. డీలర్ల కుటుంబ సభ్యులు మరో పని చేసుకునే అవకాశం ఉంటుంది. – కె.కొండ(జేమ్స్), రేషన్‌డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
పేరొకరిది.. నిర్వహణ మరొకరిది..
సాక్షి ప్రతినిధి, కడప : జిల్లాలో 1,739 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 7.61 లక్షల మంది తెల్లకార్డు దారులకు సరుకులు సరఫరా అవుతున్నాయి. 659 దుకా ణాలకు డీలర్లు లేకపోగా.. ఇందులో 271 దుకాణాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కడప రెవెన్యూ డివిజన్లో 696 దుకాణాలు ఉన్నాయి. ఇందులో 392 ఖాళీలు. ఇటీవలే 240 దుకాణాలకు సంబంధించి రాత పరీక్షలు నిర్వహించి ఇంటర్వూ్యల ద్వారా డీలర్ల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగా యన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీ నేతల ఒత్తిడుల నేపథ్యం లో 40 మంది టీడీపీ నేతల అనుచరులను ఎంపిక చేశారని సమాచారం. రాజంపేట రెవెన్యూ డివి జన్‌లో 429 రేషన్ దుకాణాలు ఉండగా.. ఇందులో 51 ఖాళీలు ఉన్నాయి. 29 దుకాణాలు డీలర్లు కోర్టు మెట్లెక్కారు. ఇక జమ్మలమడుగు డివిజన్లో 614 రేషన్ దుకాణాలకు గానూ 216 ఖాళీలు ఉన్నాయి. 111 దుకాణాలపై కోర్టు కేసులు నడుస్తున్నాయి. అక్రమాలకు బాధ్యులెవరు! నిత్యావసర సరకుల పంపిణీలో అక్రమాలు జరిగితే బాధ్యులెవరనేదానికి స్పష్టమైన సమాధానం లభించడం లేదు. దుకాణం గతంలో కేటాయించిన వ్యక్తుల పేరుతోనే ఉంటున్నందున తప్పులు గుర్తిస్తే అతనిపైనే కేసు నమోదు చేయాలి. దుకాణం నిర్వహించకుండా వదిలేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేస్తే అధికారులు స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గుర్తించిన అధికారులు దుకాణాల తనిఖీలు చేయడం లేదు. తనిఖీలు చేస్తే 6ఏ కేసులు నమోదు చేసేందుకు కలిగే ఇబ్బందుల నేపథ్యంలో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల 6ఏ కేసుల నమోదు సంఖ్య గణనీయంగా తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. కన్నెత్తి చూస్తే ఒట్టు.. ఆర్ఐ, ఉప తహసీల్దార్, తహసీల్దార్ రేషను దుకాణాలను తనిఖీ చేసే అధికారం ఉంది. గతంలో ఉన్నతాధికారులు సమీక్ష సమావేశాల్లో తనిఖీల గురించి వివరాలు అడిగే వారు. ఇటీవల కాలంలో ఉన్నతాధికారులు నుంచి ఒత్తిడులు లేకపోవడంతో మండలస్థాయి అధికారులు కూడా తనిఖీలను గాలికొదిలేశారు. ఇళ్లకు రికార్డులు తెప్పించుకొని.. రేషన్ దుకాణాల పర్యవేక్షణ బాధ్యత ఆహార తనిఖీ అధికారులపై ఉంది. ఫిర్యాదులు అందినప్పుడో లేక ఒత్తిడులు వచ్చినప్పుడో మినహాయించి ఎఫ్ఐలు సైతం దుకాణాల తనిఖీల ఊసెత్తడం లేదు. కొందరు ఆహార తనిఖీ అధికారులైతే దుకాణాలకు సంబంధించిన రికార్డులను తమ ఇళ్లకు తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ డీటీల తనిఖీల జాడేది.. నాలుగైదు మండలాలకు ఒకరు చొప్పున ఎన్ఫోర్స్మెంట్ డీటీలను నియమించారు. ప్రతి నెలా చౌక దుకా ణాలను తనిఖీలు చేయాలి. నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్వహించకున్నా, పంపిణీలో తేడాలున్నా సంబంధిత డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసి సంయుక్త కలెక్టర్‌కు నివేదించాలి. పౌర సరఫరాల శాఖ అధికారులు రేషను దుకాణాలను ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. జిల్లాస్థాయి బృందాలు తనిఖీలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అధికారపార్టీ నేతల కనుసన్నల్లో.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలో టీడీపీ నేతలు రేషన్‌దుకాణాలపై కన్నేశారు. కొత్తగా డీలర్ల నియామకంలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిబంధనలు అధికారపార్టీ నేతలు గాలికొదిలేశారు. నయానో భయానో ఎంతో కాలం నుంచి షాపులను నిర్వహిస్తున్న డీలర్లు బెదిరించి వాటిని తమ బినామీల ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దుకాణాలు నిర్వహిస్తున్న వారిలో 40–45 శాతం బినామీలే ఉండటం గమనార్హం. గతంలో డీలర్లుగా పనిచేస్తున్న వారి పేరునే కొనసాగిస్తున్నా.. నిర్వహణ మాత్రం కొత్తవారు చేస్తున్నారు. దుకాణాల నిర్వహణకు సంబంధించి డీడీలు తీయడం, అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడం వంటి పనుల్లో బినామీల హవా కొనసాగుతోందన్నది బహిరంగ సత్యం. పక్కదారి పడుతున్నా.. జిల్లా నుంచి రేషను బియ్యం ఇతర జిల్లాలకు భారీ ఎత్తున తరలుతున్నాయనేది జగమెరిగిన సత్యం. ప్రజలకు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పట్టుబడుతున్న బియ్యంతో వెళుతున్న వాహనాలే ఇందుకు నిదర్శనం. ప్రతినెలా వందల టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నా నిలువరించేందుకు పటిష్ట చర్యలు కరువయ్యాయి. కొన్ని చోట్ల పౌరసరఫరాల గోదాములు, మరికొన్ని చోట్ల డీలర్లే పెద్ద ఎత్తున పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈపాస్ విధానం అమలు చేయడంతో అక్రమాలకు అలవాటుపడిన వ్యక్తులు కొత్త విధానం అమలు చేస్తున్నారు. కార్డుదారులతో వేలిముద్రలు తీసుకొని వారికి కొంత ముట్టజెప్పి బియ్యం డీలర్లే తీసుకుంటున్నారు. వీటిని అక్రమ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. -
కంది రాదు... కూరలేదు
ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు చందంగా మారింది నేడు నిరుపేదల పరిస్థితి. దీంతో వారు నిత్యావసర వస్తువులు సైతం కొనుగొలు చేయలేకపోతున్నారు. ఈ దశలో ప్రభుత్వం చౌకదుకాణాల్లో తెల్ల రేషన్ కార్డులున్న వారందరికీ మార్చి నుంచి కిలో కంది పప్పు ఇస్తామని ప్రకటించింది. కొంత ఊరట లభిస్తుందిలే అని కార్డుదారులు ఆశ పడ్డారు. తీరా రేషన్ షాపుకెళితే కంది రాలేదన్నారు. ఫలితంగా కూర లేక నిరుపేదలు ఇక్కట్లు పడుతున్నారు. చిత్తూరుకలెక్టరేట్: తెల్లరేషన్ కార్డుదారులందరికీ బియ్యంతోపాటు మార్చి నుంచి కందిపప్పు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. మార్చి నుంచి అందించాల్సిన కందిపప్పు కానరాలేదు. అలాగే గతంలో అమలు చేసిన రాగుల పంపిణీ పథకం రెండు నెలలకే అటకెక్కింది. ప్రజలు మాత్రం ఈ నెల నుంచి రాగులుతో పాటు కందిపప్పు కూడా అందుతుందని భావించారు. తీరా చౌకదుకాణానికి వెళితే ఆ ఊసే లేదు. జిల్లాలో మొత్తం 11, 07,911 కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులున్నాయి. అందులో అంత్యోదయ కార్డులు 86,811, అన్నపూర్ణ కార్డులు 926 ఉన్నాయి. వీరికి గత ప్రభుత్వ హయాంలో బియ్యంతోపాటు చక్కెర, కిరోసిన్, గోధుమలు, కందిపప్పు తదితరాల నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగేది. అయితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లుగా చౌకదుకాణాల ద్వారా ఇచ్చే నిత్యావసర సరుకులకు మంగళం పాడుతూ వచ్చింది. దీంతో ఆఖరుకు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేశారు. అయితే రెండు నెలలుగా బియ్యంతోపాటు ప్రతి కార్డు దారునికి రెండు కిలోల రాగులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాగులు తీసుకున్న కార్డు దారులకు కేటాయించిన బియ్యంలో కోత విధించింది. ఈ విధానంతో రెండు నెలలు మాత్రం లబ్ధిదారులకు రాగులను పంపిణీ చేసింది. దీంతోపాటు మార్చి నెల నుంచి కందిపప్పు కూడా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కిలో కందిపప్పు రూ.40 చొప్పున, ఒక్కొ కార్డుకు ఒక కిలో చొప్పున అందించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం జిల్లాకు మొత్తం 1,100 టన్నుల కందిపప్పును కూడా ఆయా చౌకదుకాణాలకు అందించినట్లు తెలియజేసింది. వచ్చే నెల నుంచి అందిస్తాం కందిపప్పు, రాగులు ఏప్రిల్ నుంచి అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. రాగులు స్టాక్ రానందున అందించలేకపోయాం. కందిపప్పు కూడా ఫిబ్రవరి 28వ తేదీ స్టాక్ వచ్చినందున ఏప్రిల్ నుంచి పంపిణీ చేస్తాం. కందిపప్పు 1,100 టన్నులు, రాగులు 500 టన్నుల మేరకు అందించేలా చర్యలు చేపడుతున్నాం. – జయరాములు, జీఎం, జిల్లా పౌరసరఫరాల శాఖ -
సాంకేతికతతో అక్రమాలకు అడ్డుకట్ట
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత వరకు ఉపయోగించుకుని పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర ఫలితాలే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖలో చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సాంకేతికత ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా, రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసిందన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న 21వ జాతీయ ఈ–గవర్నెన్స్ సదస్సులో మంగళవారం, సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను, సంస్కరణలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కమిషనర్ వివరించారు. జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు కేంద్రం ఒక్కో వ్యక్తికి నెలకు కిలో మూడు రూపాయలకు ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున కిలో ఒక్క రూపాయికే సరఫరా చేస్తుందన్నారు. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2.75 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారన్నారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరుకులు పక్క దారి పట్టకుండా అర్హులకు అందేలా సరఫరా నుండి పంపిణీ వరకు కంప్యూటరీకరణ, రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ మెషీన్లు, ఎలక్ట్రానిక్ తూకాలు, సరుకుల రవాణా వాహనాలకు జీపీఎస్, గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. -
రీసైక్లింగ్‌పై సీరియస్..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాపై ఉక్కుపాదం మోపేందుకు పౌరసరఫరాల శాఖ మరింత సీరియస్‌గా వ్యవహరిస్తోంది. అక్రమ వ్యాపారం చేస్తున్న రైసుమిల్లర్లపై పీడీ అస్త్రాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం నెలరోజులుగా తనిఖీలు చేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి రేషన్ బియ్యం సేకరించి రీసైక్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న కీలక సూత్రధారి, జగిత్యాల హనుమాన్ సాయి ట్రేడర్స్ యజమాని కొండా లక్ష్మణ్ (45)పై మూడురోజుల క్రితం పీడీ కేసు నమోదు చేశారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ వేసిన ప్రత్యేక బృందాల తనిఖీ నివేదికల ఆధారంగానే ఈ కేసును నమోదు చేశారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోనూ కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎంఆర్)లో అక్రమాలు, రేషన్ బియ్యం రీసైక్లింగ్‌పై టాస్క్‌ఫోర్స్ బృందాలు ఇంకా తనిఖీలు నిర్వహిస్తుండటంతో అక్రమ వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదికలపై గురువారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆగని ‘టాస్క్‌ఫోర్స్’ తనిఖీలు.. బయడపడుతున్న అక్రమాలు నిరుపేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై రేషన్‌షాపుల ద్వారా రూపాయికే కిలో చొప్పున పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమార్కులకు వరంగా మారాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లిలో ఈ దందా నిర్విరామంగా కొనసాగుతోందన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. దీంతో కొంతమంది రైసుమిల్లర్లు అవే బియ్యాన్ని తిరిగి పౌరసరఫరాల శాఖకే అమ్మిన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాణ్యత లేని సన్నబియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారన్న విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ నిబంధనల పరకారం 10 శాతానికి మించి బ్రోకెన్ (నూక) రైస్ ఉండకూడదు. కానీ ఇక్కడ 35 శాతం వరకు ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. ఒక్కో ఏసీకే (లారీ)లో 400 నుంచి 500 బస్తాలు పంపించే మిల్లర్లు, అందులో సగం వరకు రీసైక్లింగ్ బియ్యం కలిపినట్లు వెల్లడైంది. ఏసీకే నంబర్లు 131, 136, 137, 149, 163, 165లో 1080 బస్తాలు తేలాయి. ఇదే పద్ధతిలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సరఫరా చేసిన 11 వేల బస్తాల్లో 35 శాతం మేరకు బ్రోకెన్ రైస్ ఉందని వెల్లడి కాగా.. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. ఏళ్ల తరబడిగా రీసైక్లింగ్ దందా చేస్తున్న వ్యాపారులు, వారి సంస్థలపై నమోదైన 6ఏ కేసుల వారీగా జాబితాను తయారు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలు సీడబ్ల్యూసీ గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లు, రైసుమిల్లుల్లో పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జగిత్యాలకు చెందిన కొండా లక్ష్మణ్‌పై కేసు పీడీ కేసు నమోదు చేసిన అధికారులు మరికొందరిపై చర్యలకు సిద్ధం కావడం కలకలం రేపుతోంది. అక్రమాలకు నిలయాలు సీడబ్ల్యూసీ గోదాములు ప్రభుత్వం ప్రజాపంపిణీ అవసరాల దృష్ట్యా తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ఇక్కడ రేషన్‌బియ్యమే రంగు మారి గోదాములకు చేరుతుండగా.. ఈ గోదాములే అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. సరిపడా నిల్వలు లేక ప్రభుత్వం ఏటా మిల్లర్లనుంచి 6 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం, ప్రభుత్వ వసతిగృహాలు, మధ్యాహ్న భోజనం పథకం కోసం 1.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని మిల్లర్ల నుంచి కొనుగోలు చేస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ అవసరాన్ని ఆసరాగా చేసుకుని రేషన్‌బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ తరహా బాగో తం వెలుగుచూడగా.. సరఫరా అయిన 11 వేల బి య్యం బస్తాల స్థానంలో ప్రమాణాల ప్రకారం నాణ్య త కలిగిన బియ్యాన్ని ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించిన కమిషనర్, ఇకపై రైసుమిల్లర్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడినా ఏ మాత్రం ఉపేక్షించేది లేదనీ, చర్యలు కఠినంగా ఉంటాయనీ హెచ్చరించి వదిలేశారు. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన బియ్యం నిల్వలు ఉన్న సిడబ్ల్యూసీ, ఎస్‌డబ్లు్యసి తదితర అన్ని గోదాముల్లో నిఘా బృందాలు, సాంకేతిక సిబ్బందితో ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తుండటం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
రేషన్.. కేరాఫ్ కరప్షన్!
కర్నూలు(అగ్రికల్చర్)/ కల్లూరు రూరల్: పేదలకు తక్కువ ధరకు సరకులు అందించే రేషన్ దుకాణాలు అవినీతి, అక్రమాలకు మారుపేరుగా మారాయి. యాభై శాతం కార్డుదారులకు చక్కెర ఇవ్వకుండా బయటి మార్కెట్లో అమ్ముకుని డీలర్లు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ–పాస్ మిషన్‌లో బియ్యం, చక్కెరకు ఒకేసారి వేలిముద్ర వేయించుకొని బియ్యం మాత్రం ఇస్తూ చక్కెరను నొక్కేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. గట్టిగా అడిగిన వారికి మాత్రమే చక్కెర ఇస్తున్నట్లు డీలర్స్ అసోసియేషన్‌కు చెందిన ఓ నాయకుడే ఒప్పుకోవడం గమనార్హం. బియ్యం పంపిణీలో కూడా తక్కువ తూకాలు వేస్తూ కార్డుదారుల నోళ్లలో మట్టి కొడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పునఃపంపిణీ నుంచి.. ఏడాది క్రితం రేషన్‌కార్డులకు చక్కెర పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జనవరి నుంచి అన్ని కార్డులకు అరకిలో ప్రకారం పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలో 11,82,111 రేషన్‌కార్డులకు సంబంధించి 2,242 చౌక దుకాణాలున్నాయి. ఇందులో అంత్యోదయ అన్న యోజన కార్డులు 60వేల వరకున్నాయి. తెల్లకార్డులకు డిసెంబరు వరకు చక్కెర బంద్ చేసినప్పటికీ అంత్యోదయ కార్డులకు కిలో ప్రకారం ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జనవరి నుంచి తెల్ల కార్డులకు అర కిలో ప్రకారం ఇస్తున్నా రు. ఫిబ్రవరికి సంబంధించి అన్ని చౌకదుకాణాల డీలర్లు డీడీలు చెల్లించి చక్కెర లిఫ్ట్ చేసినట్లు స్పష్టమవుతోంది. గట్టిగా అడిగితేనే చక్కెర.. ఫిబ్రవరికి సంబంధించి బుధవారం సాయంత్రం వరకు 9,87,385 కార్డులకు సరుకులు పంపిణీ చేశారు. అంత్యోదయ కార్డులకు కిలో రూ.13.50, తెల్లకార్డులకు అరకిలో రూ.10 ప్రకారం చక్కెర పంపిణీ చేయాల్సి ఉంది. అయితే 50 శాతం కార్డులకు చక్కెర ఇచ్చిన దాఖలాలు లేవు. అడిగిన వారికి ఇస్తున్నామని డీలర్లే చెబుతుండడాన్ని బట్టి అక్రమాలు ఏస్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది. జిల్లా యంత్రాంగం మొత్తం కొలువైన కర్నూలులోనే పలువురు డీలర్లు చక్కెర ఇవ్వకపోవడం గమనార్హం. ఇలా మిగుల్చుకున్న చక్కెరను కిలో రూ.30 నుంచి రూ.35 ప్రకారం బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రసీదులు ఇవ్వరు.. ఈ–పాస్ మిషన్‌లో వేలిముద్ర వేయించుకొని బియ్యంతో పాటు చక్కెర కూడా ఇవ్వాల్సి ఉంది. పంపిణీ చేసిన సరుకులు, వాటి ధర వివరాలతో కార్డుదారులకు రసీదులు ఇవ్వాలి. అయితే తమ అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశ్యంతో డీలర్లు ఎక్కడా రసీదులు ఇవ్వడం లేదు. -
ఈ–పాస్‌తో కూపన్లకు బ్రేక్!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : రేషన్ సరఫరాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చేపట్టిన సంస్కరణలతో పౌరసరఫరాల శాఖకు మిగులుబాటు కనిపిస్తున్నా అర్హులైన లబ్ధిదారులకు కొత్త కార్డులు దక్కకుండా పోతున్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీకి ఎప్పుడో మంగళం పాడిన ప్రభుత్వం చివరకు ఆహార భద్రత కార్డులకూ ఎర్రజెండా చూపింది. ఫలితంగా.. రేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుల జారీ నిలిపివేసి పదినెలలు కావస్తోంది. రేషన్ దుకాణాలు కేంద్రాలుగా జరుగుతున్న అక్రమాలకు బ్రేక్ వేసే ఉద్దేశంతో ఈ–పాస్ (ఎలక్ట్రానికి పాయింట్ ఆఫ్ సేల్) విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో మొదట మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ–పాస్ అమలును మొదలు పెట్టిన సమయంలో అనూహ్యంగా పెరిగిన అదనపు కూపన్ల జారీని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌కార్డులు కానీ, కొత్త కూపన్లు జారీ చేయొద్దని నిర్ణయించారు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందకుండా అయ్యింది. మొత్త కార్డుల్లో ఇప్పుడున్న యూనిట్ల స్థానంలో కొత్తగా ఎవరినీ చేర్చడం, లేదా తొలగించడం వంటి మార్పులు చేర్పులనూ బంద్ చేశారు. నల్లగొండ జిల్లా పరిధిలోని 943 రేషన్‌షాపులు, సూర్యాపేట జిల్లాలో 605 షాపులు, యాదాద్రి జిల్లా పరిధిలో 461 రేషన్‌షాపుల్లో ఈ–పాస్ యంత్రాలు అమర్చ డం పూర్తయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయినా, కొత్త కార్డుల జా రీ, కార్డుల్లో మార్పులు చేర్పులు, కొత్త కూపన్ల జారీ వంటి అంశాలపై ఎలాంటి నిర్ణయమూ వెలువడకపోవడంతో అర్హులు సరుకులు పొందలేక పోతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా పెరగడం వల్లే ! జిల్లాలో ఆహార భద్రత కార్డుల సంఖ్య ఎప్పటికప్పటికీ పెరిగిపోవడం వల్లే అసలుకు ఎసరు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీ–సేవా కేంద్రాలనుం చి వెళ్లిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారణకు వచ్చాకే ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇక, తహసీల్దార్లు ఆమోదించిన దరఖాస్తులను సివిల్ సప్లయీస్ అధికారులు యధాతధంగా ఆమోదిస్తున్నారు. కొత్త కార్డులకు వస్తున్న దరఖాస్తులు, ఉన్న కార్డుల్లో కొత్తగా పేర్లు జత చేయడంలో రెవెన్యూ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు శాఖా కమిషనర్‌కు వెళ్లడంతోనే కూపన్ల జారీకి బ్రేక్ వేశారని చెబుతున్నారు. అక్రమాలకు చెక్ ఇలా.. లబ్ధిదారులు దుకాణాలకు వచ్చి వేలిముద్రలు వేస్తేనే, డీలర్లు వారికి సరుకులు పంపిణీ చేస్తారు. కార్డుపై ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరైన వేలిముద్రలు వేసి సరుకులు పొందే వీలుంది. ప్రస్తుతం కార్డుదారులు రేషన్‌షాప్‌కు రాకున్నా, సరుకులు తీసుకోకపోయినా వచ్చినట్లు జాబితాలో చూపించి డీలర్లు సరుకులు స్వాహా చేస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి అక్రమాలకు ఈ–పాస్ విధానంతో చెక్ పడుతుంది. బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, ఆహారభద్రత కార్డుతో కూడా రేషన్‌కార్డును అనుసంధానం చేస్తారు. దీనిల్ల సరుకులు తీసుకోని లబ్ధిదారులకు సంబంధించిన కోటా అంతా మిగులుగానే డీలర్ల దగ్గర ఉండిపోతుంది. మిగులును బట్టే మరుసటి నెలకు డీలర్లకు సరుకుల కోటాను నిర్ణయిస్తారు. ఇంకా...ఎదురుచూపులే! ఈ–పాస్ విధానం మొదట ప్రయోగాత్మకంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అమలు చేయడం ద్వారా సివిల్ సప్లయీస్ శాఖకు అయిన ఆదాను పరిగణనలోకి తీసుకుని జిల్లాలకు విస్తరించారు. గతేడాది ఏప్రిల్ నుంచి జిల్లాలో ఈ–పాస్ యం త్రాలను రేషన్ షాపుల్లో బిగిస్తున్నారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో 461 రేషన్ దుకాణల్లో ఈ–పాస్ అమల్లోకి వచ్చింది. ఆ జిల్లాలో ఉన్న 2లక్షల పైచిలు కు కార్డుల్లో జనవరిలో లక్షా 80వేల మంది కొనుగోళ్లు జరిపారు. ఒక్క నెలలో ఈ–పాస్ అమలు ద్వారా యాదాద్రి భువనగిరిలో రూ.93లక్షలు ఆదా అయ్యింద ని సమాచారం. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే నల్లగొండ, సూర్యాపేట జి ల్లాలో ఈ–పాస్ యంత్రాలను అమర్చడం పూర్తి చేశారు. ఫిబ్రవరి ఆఖరుకు ఈ జిల్లాలో జరిగే విక్రయాలను బట్టి ఎంత ఆదా అవుతుందో ఓ నిర్ణయానికి రానున్నారు. ఆ తర్వాతే కొత్త కార్డులు, మార్పులు చేర్పులు, కొత్త కూపన్ల జారీ చేస్తారని అంటున్నారు. దీంతో అర్హులై ఉండి కార్డులు, కూపన్లు లేని వారు మరికొన్ని నెలలు ఎదురుచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. -
23.89 లక్షల కార్డులకు రేషన్ బంద్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 23.89 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సబ్సిడీ సరుకులు అందే పరిస్థితి కనిపించటం లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే బహిరంగంగా ప్రకటించడంతో పేదల్లో ఆందోళన మొదలైంది. ‘ప్రజా సాధికార సర్వే (పల్స్)లో నమోదు చేసుకోని కార్డుదారులకు మార్చి నెల నుంచి రేషన్ నిలిపివేయబడుతుంది’ అని పలు రేషన్ దుకాణాల వద్ద నోటీసులు అతికించారు. పల్స్ సర్వేలో ఇప్పటివరకు వివరాలు నమోదు చేసుకోని తెల్లరేషన్ కార్డుదారులు ఈ నెలాఖరులోగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు వెళ్లి వివరాలు అందచేయాల్సి ఉంటుంది. లేదంటే వచ్చే నెల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సరుకులు ఇవ్వబోమని డీలర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో 1.42 కోట్ల తెల్ల రేషన్ కార్డులుండగా 23.89 లక్షల మంది కార్డుదారులు ప్రజా సాధికార సర్వేలో వివరాలను నమోదు చేసుకోలేదని గుర్తించారు. -
15రోజులే
సాక్షి, రంగారెడ్డి జిల్లా : చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు ఇకపై నెలలో 15 రోజులు మాత్రమే సరుకులు అందజేయనున్నారు. వచ్చేనెల నుంచి ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. అప్పటినుంచి ప్రతినెలా ఒకటి నుంచి 15వ తేదీలోపే కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీలర్లకు ఆదేశాలు అందాయి. జిల్లావ్యాప్తంగా 919 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులు కలిపి మొత్తం 5.18 లక్షల మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా సుమారు 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేస్తున్నారు. దీనికి తోడు ప్రతి కార్డుదారుడికి రెండు కిలోల గోధుమలు, ఒక లీటరు నీలి కిరోసిన్ చొప్పున పంపిణీ అవుతోంది. మొన్నటి వరకు ప్రతినెలా 25వ తేదీ వరకు చౌక ధరల దుకాణాలు తెరిచి ఉండేవి. తమ సౌలభ్యాన్ని బట్టి వీలైన రోజు కార్డుదారులు సరుకులను తీసుకెళ్లేవారు. తాజాగా రేషన్‌దుకాణాల పనిదినాలను కుదించడంతో కాస్త ఇబ్బంది కలగవచ్చు. పని వేళలను మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే వచ్చేనెల నుంచి కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచే ఉంటాయని అధికారులు పౌర సరఫరాల శాఖాధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈనెలలోనే ఒకటి నుంచి 15వ తేదీ వరకు నిత్యావసర వస్తువుల పంపిణీ అమలు కావాల్సి ఉంది. అయితే అధికంగా సెలవులు రావడంతో 17వ తేదీ వరకు సరుకులను పంపిణీ చేశారు. వచ్చేనెల పని దినాల్లో ఎలాంటి సడలింపు ఉండబోదని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. డీడీల చెల్లింపుల్లోనూ! రేషన్ దుకాణాల పని దినాలను కుదించిన ప్రభుత్వం.. డీలర్లు డీడీలు చెల్లించే రోజులను సైతం తగ్గింది. మొన్నటి వరకు ప్రతినెలా 27వ తేదీలోపు డీడీలు చెల్లించేవారు. ఆ నెలాఖరులోగా సరుకులు డీలర్ల వద్దకు చేరేవి. ఇకపై ఈ పరిస్థితి ఉండదు. ప్రతినెలా తప్పనిసరిగా 16 నుంచి 18వ తేదీలోపే డీడీలు చెల్లించాలని పౌర సరఫరాల శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చెల్లించినదాన్ని బట్టి స్టాక్ రిలీజ్ ఆర్డర్లను మండల స్థాయి స్టాక్ గోదాం (ఎంఎల్ఎస్)లకు పంపిస్తారు. అక్కడి నుంచి నెలాఖరులోగా డీలర్ల వద్దకు వస్తువులను పంపించాల్సి ఉంటుంది. తదుపరిగా వచ్చే ఒకటో తేదీ నుంచి విధిగా రేషన్ దుకాణాల ద్వారా డీలర్లు కార్డుదారులకు సరుకులను పంపిణీ చేస్తారు. వేతనం ఇవ్వాల్సి వస్తుందనే! రేషన్ దుకాణాల పనిదినాలను కుదించడం వెనుక కుట్ర ఉందని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రతి నెలలో 25 రోజులపాటు సరుకులు పంపిణీ చేసేవారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు మొదలు పెట్టడం డీలర్లకు కాస్త ఇబ్బందిగా మారింది. సరుకుల సంఖ్య కుదించడం, ఈ–పోస్ మిషన్లు తీసుకురావడం వల్ల తమకు ఏమీ మిగలడంలేదని డీలర్లు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా నెలంతా కష్టపడితే దుకాణాల అద్దె కూడా వెళ్లడంలేదని లబోదిబోమంటున్నారు. ప్రత్యామ్నాయంగా తమకు ప్రతినెలా వేతనాలను చెల్లించాలని డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సరుకుల అమ్మకం ద్వారా వచ్చే కమీషన్లు లేకున్నా.. వేతనం ఇస్తే చాలన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. దీన్ని సాధించుకునేందుకు నిరవధికంగా దుకాణాలను బంద్ చేయాలని కూడా నిర్ణయించారు. ఇలాంటి సమయంలో నెలలో 15 రోజులే దుకాణాలు పనిచేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. తమకు వేతనాలు అందించాలన్న డిమాండ్‌ను నీరుగార్చడంలో భాగంగానే ఈ చర్యలకు ఉపక్రమించారని విమర్శిస్తున్నారు. పనిదినాల కుదింపు వల్ల తమకు వచ్చే నష్టం ఏమీలేదని చెబుతున్నారు. -
రేషన్ దుకాణాల్లో విస్తృత తనిఖీలు
నల్లగొండ : రేషన్ దుకాణాల్లో సివిల్ సప్లయీస్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పండుగ సీజన్ కావడంతో దుకాణాల్లో బియ్యం పంపిణీ సక్రమంగా చేయడం లేదని స్థానికులు సివిల్ సప్లయీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డైరక్టరేట్నుంచి ఆదేశాలు రావడంతో గురువారం ఉదయం డీఎస్ఓ ఆధ్వర్యంలో ఆరుగురు డీటీలు నల్లగొండ పట్టణంలోని ఏడు రేషన్ దుకాణాలు, ఒక ఆయిల్ ఏజెన్సీని తనిఖీ చేశారు. అనుమతి లేకుండా బొట్టుగూడలో వం టనూనెల ఏజెన్సీ నిర్వహిస్తున్న దుకాణాన్ని డీఎస్ఓ సీజ్ చేశారు. దుకాణంలోని రూ.3.28 లక్షల విలువ చేసే స్టాక్‌ను సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండా ఏజెన్సీ ఏర్పాటు చేసినందున 6 ఏ కింద కేసు నమోదు చేశారు. దేవరకొండ, బొట్టుగూడలోని రేషన్ దుకాణాలు తనిఖీ చేసిన అధి కారులు బియ్యం నిల్వలో స్వల్ప తేడాలు ఉన్న ట్లు గుర్తించారు. రెండు దుకాణాల్లో బియ్యం నిల్వలు తేడాల్లో భారీ వ్యత్యాసం ఉండడంతో వాటిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఆర్డీఓకు రిపోర్ట్ రాశారు. ఈ తనిఖీల్లో డీఎస్ఓ ఉదయ్ కుమార్, డీటీలు సత్యనారాయణ, రఘు, స యీద్, సంఘమిత్ర, ఇంతియాజ్ పాల్గొన్నారు. -
ఇక 1వ తేదీ నుంచే రేషన్ సరుకులు
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి ప్రతి నెలా 1వ తేదీ నుంచే రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సరుకుల రవాణా తేదీలు, క్లోజింగ్ బ్యాలెన్స్ (సీబీ), రిలీజ్ ఆర్డర్ (ఆర్ఓ)లో మార్పులు చేసింది. ఈ–పాస్ అమలవుతున్న 25 జిల్లాల్లో ఈ విధానం తక్షణం ప్రారంభం అవుతుంది. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. 16వ తేదీన పౌరసరఫరాల శాఖ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లాలకు సరుకుల కేటాయింపులు చేపడతారు. అలాగే 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రేషన్ డీలర్లు మీసేవ కేంద్రాల్లో డీడీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తేదీల్లో డీడీలు కట్టిన డీలర్ల రిలీజ్ ఆర్డర్లను స్థానిక ఏసీఎస్ఓలు సంబంధిత మండల స్థాయి నిల్వ కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. రిలీజ్ ఆర్డర్లు అందుకున్న వెంటనే గోదాం ఇన్చార్జులు సరుకుల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తారు. కొత్త విధానంపై శ్రద్ధ తీసుకోవాలి: కమిషనర్ సీవీ ఆనంద్ నూతన విధానంపై జిల్లా జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. డీసీఎస్ఓ, ఏసీఎస్ఓ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, డిప్యూటీ తహసీల్దార్, పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, స్టేజ్–1, స్టేజ్–2 కాంట్రాక్టర్లు, ఆయా గోదాముల ఇన్చార్జులతో ప్రతీ నెల జాయింట్ కలెక్టర్లు çసమావేశాలు నిర్వహించాలి. -
చంద్రన్న విలేజ్ మాల్స్‌లో ధరల షాక్!
-
చంద్రన్న విలేజ్ మాల్స్‌లో ధరల షాక్!
సాక్షి, అమరావతి : చౌకధరల దుకాణాల స్థానంలో నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రారంభించిన ‘చంద్రన్న విలేజ్ మాల్స్’లో ధరలు షాక్ కొడుతుండడంతో ప్రజలు నిరసనాగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో లభిస్తున్న ధరలకన్నా ఈ మాల్స్‌లో ధరలు ఎక్కువ ఉండడం చూసి జనం అవాక్కవుతున్నారు. ధరల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుండడంతో చంద్రన్న మాల్స్‌లో అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం సబ్బులు, ఇతర సౌందర్యసాధనాలు మాత్రమే విక్రయిస్తున్నారు. అవి కూడా మార్కెట్ రేట్లకే కావడం విశేషం. ఒకటి రెండు రోజుల్లో సరుకులన్నీ వస్తాయని డీలర్లు చెబుతున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ రేషన్ షాపులను.. రిలయన్స్‌తో పాటు చంద్రబాబుకు వాటాలున్న ఫ్యూచర్ గ్రూప్‌లకు అప్పగించేస్తుండడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడుతుండగా అవే ఉత్పత్తుల ధరలు వినియోగదారుల వద్దకు వచ్చేసరికి దిమ్మతిరిగేలా షాక్ కొడుతున్నాయి. అందులోనూ చౌకధరల దుకాణాలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు తెచ్చిన చంద్రన్న మాల్స్‌లో ధరలు భారీగా ఉండడంపై వినియోగదారుల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. 40శాతం చౌక ధరలంటూ ప్రచారం.. రాష్ట్రంలో 29 వేల రేషన్‌షాపులు ఉన్నాయి. వీటిల్లో ఎంపిక చేసిన 6,500 దుకాణాల్లో చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడ, గుంటూరులోని రెండు దుకాణాలను ఎంపిక చేసింది. మిగిలిన దుకాణాలను వెంటనే ప్రారంభించనున్నామని, వీటిల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే 40 శాతం తక్కువకు అందుబాటులోకి తీసుకు వస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎంపిక చేసిన విలేజ్ మాల్స్ ఆకర్షణీయంగా ఉండే ఏర్పాట్లు కూడా చేసింది. దీంతో ఈ మాల్స్‌లోని నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నెల 12 వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ప్రారంభించారు. మొదటి రోజు ప్రారంభోత్సవ హడావుడి ఉండటంతో ఆ రోజు అమ్మకాలు పెద్దగా జరగలేదు. 13 వ తేదీన విజయవాడ భవానీపురంలోని విలేజ్‌మాల్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశారు. అయితే బయట మార్కెట్ కంటే అక్కడి నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. కొందరు కొనుగోలుదారులు ఇంటికి తీసుకువెళ్లిన వస్తువులను తిరిగి ఇచ్చేయడానికి ప్రయత్నించారు. అయితే దుకాణదారుడు వాటిని తిరిగి తీసుకునేందుకు అంగీకరించలేదు. ఆ రోజున దాదాపు రూ.6 వేల విలువైన నిత్యావసర వస్తువుల అమ్మకాలు జరిగాయి. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని కొందరు అధికారులు కొనుగోలుదారుల అభిప్రాయాలను తెలుసుకుని అదే రోజు సాయంత్రం నుంచి అమ్మకాలను నిలిపివేయాలని, అక్కడి నుంచి నిత్యావసర వస్తువులను తీసేయాలని ఆదేశించారు. 14వ తేదీ నుంచి ఆ దుకాణంలో నిత్యావసర వస్తువులు లేకపోవడంతో వచ్చిన కొనుగోలుదారులు తిరిగివెళ్లిపోయారు. వచ్చిన వారికి రెండు మూడు రోజుల్లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు ప్రారంభం అవుతాయని చెబుతూ, దుకాణంలోని మిగిలిన సబ్బులు, పేస్టుల ధరలు మార్కెట్ కంటే తక్కువగా ఇస్తున్నామని చెబుతున్నారు. రైతు నుంచి వినియోగదారుడి వరకూ... ఏ పరిశ్రమలోనైనా ఒక ఉత్పత్తి బైటకొస్తే యజమాని దాని ధర నిర్ణయించి అమ్ముకుంటాడు. కానీ అలాంటి అవకాశం లేని ఉత్పత్తిదారుడు బహుశా రైతు ఒక్కడేనేమో. పండించిన పంటకు ధరలు నిర్ణయించేది ప్రభుత్వమో.. దళారీలో.. వారు చెప్పిన ధర గిట్టుబాటు కాకపోయినా పంటను తెగనమ్ముకోవలసిందే. వేరుశనగ, మినుము, కందులు, పసుపు సహా ఏ పంటకూ ధర లేదు. రైతులు పంటలు బాగా పండించినపుడు పూర్తిగా రేటు లేకుండా పోతోంది. అయితే వినియోగదారుడి దగ్గరకు వచ్చే సరికి రేట్లు షాక్ కొడుతుంటాయి. ఇదెలా జరుగుతోందంటే దళారులు వచ్చి రైతుల దగ్గర నుంచి పంటను తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. ఆ తరువాత రేట్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అడ్డగోలుగా మోసం చేస్తున్నారు. వేరు శనగ పరిస్థితి అంతే.. రైతుల వద్ద క్వింటా రూ.3 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఇదే వేరు శనగ హెరిటేజ్ షాపుల్లో కేజీ రూ.150 పలుకుతోంది. రైతుల వద్ద శనగలు క్వింటా సగటున రూ. 3,500లకే కొంటున్నారు. అంటే కిలో రూ. 35 అన్నమాట. హెరిటేజ్ షాపులో మాత్రం కేజీ రూ.180లకు అమ్ముకుంటున్నారు. కందులను రైతుల దగ్గర క్వింటా రూ. 2,500లకు కొని, తన హెరిటేజ్‌లో మాత్రం కేజీ కందిపప్పును రూ. 80లకు అమ్ముకుంటున్నారు. రూ.25కు కొని రూ.80కి అమ్ముతారా? ఇంత అన్యాయమైతే రైతెలా బతుకుతాడు? మిర్చికి కూడా గిట్టుబాటు ధరలేక రైతు మండిపోతున్నాడు. క్వింటాలు రూ. 2,500 నుంచి రూ. 3 వేలు మాత్రమే ధర ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో అయితే... క్వింటా రూ. 8 వేలపైనే ఉంది. ఇపుడు కంది, మినుము, పెసర ధరలు క్వింటా సగటున రూ. 3 నుంచి 4 వేల మధ్యే ధర పలుకుతున్నాయి. వైఎస్సార్ హయాంలో రూ. 8 వేలకు తగ్గలేదు. ఇవాళ పసుపు ధర రూ. 4వేలు, రూ. 5 వేల మధ్య ఉంది. వైఎస్ పాలనలో రూ. 13 నుంచి రూ. 14 వేలుంది. అవికూడా మార్కెట్ ధరకే.. సబ్బులు, పేస్టులు వంటి వస్తువుల ఎంఆర్పీపై 8 నుంచి 12 శాతం వరకు రేటు తగ్గించి అమ్ముతున్నామని దుకాణదారులు చెబుతున్నారు. అయితే ఎంఆర్పీపై ఆ శాతం తగ్గించి వాటిని అమ్ముతున్నప్పటికీ మార్కెట్లోని మిగిలిన దుకాణాదారులు అదే ధరకు ఆ వస్తువులను విక్రయిస్తున్నారు. దీంతో సబ్బులు, పేస్టుల వంటి వస్తువుల ధరలు కూడా తక్కువగా ఏమీ లేవని కొనుగోలుదారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రచారానికి భిన్నంగా చంద్రన్న విలేజ్మాల్లోని ధరలు ఉండటంతో శని, ఆదివారాలు కూడా కొనుగోలుదారులు రాలేదు. దాంతో ఆ మాల్ వెలవెలబోయింది. ఆందోళనలో చౌకడిపోల డీలర్లు.. రాష్ట్రంలోని 6,500 చౌకధరల దుకాణాలను చంద్రన్న విలేజ్‌మాల్స్‌గా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల డీలర్లు ఆందోళన చెందుతున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన విజయవాడ, గుంటూరులోని మాల్స్‌లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు లేకపోవడంతో ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం మినహా ఇతర వస్తువులు విక్రయించే అవకాశం ఉండదనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్నమాల్స్గా చౌకధరల దుకాణాలను ఆధునీకరించేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఆ మొత్తాలకు నామమాత్రపు వడ్డీ కూడా వచ్చే అవకాశం లేదనే అభిప్రాయంలో ఉన్నారు. కొందరు చౌకధరల దుకాణదారులు తమ దుకాణాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యంతో పాటు ఇతర సరుకులను కూడా అమ్ముకుంటూ నెలకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు సంపాదించుకుంటున్నారు. చంద్రన్న విలేజ్‌మాల్‌గా ఆ దుకాణం మారితే మిగిలిన వస్తువులు అమ్ముకునే అవకాశం లేక నష్టపోతామనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏం కొంటాం..ఏం తింటాం రేషన్ షాపులను చంద్రన్న విలేజ్‌మాల్స్‌గా మారుస్తున్నారంటే దానిలోని అన్ని రకాలు సరుకులు తక్కువ ధరలకు దొరుకుతాయనుకున్నాం. ప్రారంభోత్సవం రోజున వెళ్లి చూస్తే పప్పు దినుసులన్నీ బయట మార్కెట్‌కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇంత రేట్లు ఉంటే ఇక్కడి వరకూ రావడం దేనికి. ఇంటికి దగ్గరలో ఉన్న పచారి షాపులోనే కొనుక్కుంటాం కదా. – షేక్ ఆషాబీ, కబేళా రోడ్, విజయవాడ పప్పులు లేకుండా విలేజ్ మాల్స్ ఏమిటి? కందిపప్పు, మినపపప్పు, శనగపప్పు వంటి నిత్యావసర సరుకులు లేకుండా విలేజ్ మాల్స్ ఏమిటో అర్ధం కావడం లేదు. షాపునకు వెళ్లి చూస్తే నిత్యావసరాలు కనబడ లేదు. నిర్వాహకులను అడిగితే త్వరలో వస్తాయని సమాధానం చెబుతున్నారు. ఈ రేషన్ షాపును పైలెట్ ప్రాజెక్ట్‌గా రెండు నెలల క్రితమే నిర్ణయించినప్పుడు ముందుగా అన్ని సరుకులు సిద్ధం చేయకపోవడం ఏమిటో? – చిమటా గోపి, విద్యాధరపురం, విజయవాడ -
చంద్రబాబుకు ఆ భయం పట్టుకుంది: రోజా
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేషన్ షాపులను చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఆమె మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో చంద్రబాబు ప్రజలను దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆమె విమర్శించారు. మళ్లీ ముఖ్యమంత్రి అవుతానో...లేదో అనే భయంతోనే 21 పథకాలకు చందన్న పేరు పెట్టించుకున్నారని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ఆహార భద్రత కల్పించేందుకే గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చౌక దుకాణాలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. పేదలపై ప్రేమతో నాడు ఎన్టీ రామారావు రూ.2 కిలో బియ్యం ఇచ్చారని, చంద్ర బాబు ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేట్ శక్తులకు, నోట్ల కట్టలకు పుట్టిన బిడ్డగా ఈ ప్రభుత్వ పాలన ఉందని ఆమె అభివర్ణించారు. చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో పేదల పొట్టి కొట్టి కార్పొరేట్ శక్తులకు పెడుతున్నారని ఆమె విమర్శించారు. చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటును ఆమె తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో రైతులకు గిట్టుబాటు ధర లేదని, సామాన్యులకు చౌకగా నిత్యావసర వస్తువులు అందడం లేదని రోజా విమర్శించారు. చంద్రబాబు పాలనలో ప్రజలు సర్వనాశనం అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. సీఎం పదవి అడ్డుపెట్టుకొని.. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం పదవిని అడ్డుపెట్టుకొని చిన్న చిన్న వ్యాపారుల పొట్టి కొట్టేందుకు చంద్రన్న విలేజ్ మాల్స్‌గా మార్చారని రోజా మండిపడ్డారు. ఈ మాల్స్ స్వయంగా చంద్రబాబు కుటుంబానికి వాటాలు ఉన్న ఫ్యూచర్ గ్రూప్‌కు, వాళ్లకు సన్నిహిత సంబంధాలు ఉన్న రిలయన్స్ గ్రూప్‌లకు కట్టబెట్టారన్నారు. దీని అర్థం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ మాల్స్ వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా అని నిలదీశారు. రేషన్‌షాపులో గతంలో 9 రకాల సరుకులు ఇచ్చేవారని, వాటన్నింటిని రద్దు చేసి, తీరా తన దోపిడీని విస్తరింపజేసేందుకు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టారన్నారు. 5 నుంచి 35 శాతం తగ్గించి ఇస్తామని ప్రభుత్వం చెబుతుందని, ఈ రోజు ఫ్యూచర్ గ్రూప్ సంస్థ తన సంస్థకు లాభాలు లేకుండా పేదలకు ఎందుకు చౌకగా ఇస్తుందని ప్రశ్నించారు. గతంలో రిలయన్స్, ఫ్యూచర్ సంస్థలు వంద నుంచి 200 శాతం ప్రజల నుంచి గుంజుకున్నదన్నారు. రేషన్ షాపులను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్‌షాపుల్లో ప్రభుత్వమే నిత్యావసరాలు ఇస్తే పేదలకు లాభం ఉంటుందని, చంద్రన్న మాల్స్ పేరుతో వేల కోట్లు దండుకోవాలన్నదే టీడీపీ ధ్యేయమన్నారు. మీకు పేదలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే బహిరంగ మార్కెట్లో రేట్లు తగ్గింవచ్చు అన్నారు. పేదవాళ్లు ఏమైతే నాకేంటి అన్నట్లుగా చంద్రబాబు తాను, తన కొడుకు బాగుంటే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారన్నారు. బాబు తన సీఎం పదవిని అడ్డుపెట్టుకొని దోచుకుంటున్నారన్నారు. 21 పథకాలకు చంద్రన్న పేర్లు చంద్రబాబును భవిష్యత్తులో మరిచిపోతారన్న భయం ఉందని, అందుకే ఈ నాలుగేళ్లలో 21 ప్రభుత్వ పథకాలకు చంద్రన్న పేరు పెట్టుకున్నారని రోజా విమర్శించారు. చంద్రబాబు తన తండ్రి ఖర్జురపు నాయుడు వాటా తీసుకొని వచ్చి ఇస్తున్నారా అని నిలదీశారు. అంతగా పేర్లు పెట్టుకోవాలంటే ప్రజలకు మేలు చేసిన ఎన్టీఆర్, ఇందిరాగాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్లు పెట్టుకోవాలి కానీ, ఇలా తన పేరు పెట్టుకోవడం ఎక్కడ చూడలేదన్నారు. భవిష్యత్తులో చంద్రబాబును పట్టించుకోరనే భయంతో ఇప్పుడే తన పేరుతో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. చంద్రన్న కానుకలో నెయ్యి ఇస్తామన్నారు. ఆ నెయ్యిని హెరిటేజ్ కంపెనీ నుంచి తెప్పించారన్నారు. చంద్రన్న చలివేంద్రాలకు హెరిటేజ్ నుంచి పెరుగు తెప్పించారన్నారు. భవిష్యత్తులో దోచుకోవడానికి అవకాశం ఉంటుందో? లేదో అన్న భయంతో చౌకదుకాణాలను రిలయన్స్ సంస్థకు ఇచ్చి దోచుకునే కుట్ర చేస్తున్నారన్నారు. తక్షణమే ఈ కార్పోరేట్ దోపిడీకి పుల్ స్టాఫ్పెట్టాలని, ప్రభుత్వమే గతంలో మాదిరిగా 10 రకాల సరుకులు రేషన్‌షాపుల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని రోజా హెచ్చరించారు. ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదు రాజకీయ అవగాహన లేని లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి ఆ తరువాత మంత్రిని చేశారో అప్పటి నుంచి ప్రతిది సూట్‌కేసు గురించే చంద్రబాబు పని చేస్తున్నారు తప్ప, ప్రజలకు మేలు చేయడం లేదని రోజా విమర్శించారు. రాజధాని భూముల పేరుతో లక్షల కోట్లు సంపాదించారన్నారు. పోలవరంలో అవినీతి నెలకొందని, పట్టిసీమలో రూ.350 కోట్లు దోచుకున్నారని కాగ్ రిపోర్టు ఇచ్చిందన్నారు. బొగ్గు, మట్టి, మద్యం, ఇసుక వ్యాపారాలతో వందల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపొటు పొడిచిన నీకు ప్రజలను మోసం చేయడం ఓ లేక్కా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి అన్న పేరు పెట్టి పేదలకు నీరు ఇవ్వలేకపోయావంటే మీ మామపై ఎంత ప్రేమ ఉందో ఇక్కడే తెలిసి పోయిందన్నారు. నీ లొసుగులన్ని బయట పెట్టి ప్రజల చేత తరిమికొట్టిస్తామని రోజా చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
చంద్రన్న విలేజ్ మాల్ ప్రారంభం
సాక్షి, అమరావతి: పేదలకు అన్ని రకాల సరుకులు తక్కువ ధరకే అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు వెల్ల డించారు. ఇందులో భాగంగానే చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ, గుంటూరులో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ‘చంద్రన్న విలేజ్ మాల్’ను మంగళవారం సచివాలయం నుంచి సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలోని రేషన్ షాపులను చంద్రన్న విలేజ్ మాల్స్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. వివిధ బ్రాండ్లకు చెందిన 500కు పైగా ఉత్పత్తులు ఎంఆర్పీ కంటే 4 శాతం నుంచి 35 శాతం తక్కువ ధరకు లభిస్తాయని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి రెండో తేదీ నుంచి పది రోజుల పాటు ‘జన్మభూమి–మాఊరు’ కార్య క్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. పది రోజులపాటు పది అంశాలపై ఈ కార్యక్రమం జరపాలని, ఆయా అంశాల్లో రాష్ట్రం, మండలం, ఆ గ్రామం ఎక్కడ ఉందో చర్చ జరగాలన్నారు. రాష్ట్రంలో పెన్షన్లు, రేషన్ కార్డులు కొత్తగా ఎంతమందికి అందివ్వాలన్నది త్వరలోనే నిర్ణ యిస్తామన్నారు. కలెక్టర్ల సదస్సుకు సన్నాహకంగా మంగళవారం సచి వాలయంలో మంత్రులు, కార్యదర్శులు, వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులతో సీఎం సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. అందుబాటులో ‘పోలవరం’సమాచారం నిర్ణీత వ్యవధిలోగా పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేసి, 2019 నాటికి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆన్లైన్లో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాలన్నారు. వెంటనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏర్పాటు చేయాలని సీఎం సీఎస్‌కు సూచించారు. విజయవాడ శివారులో చేపట్టిన ఎకనామిక్ సిటీ నిర్మాణాన్ని, ప్రస్తుతం సేకరించిన 235 ఎకరాల్లోనే చేపట్టాలని బాబు ఆదేశించారు. -
పెద్దలకు పేదల మాల్
పెద్దలను కొట్టి పేదలకు పెట్టిన రాబిన్ హుడ్ కథలు మనం చాలా చదువుకున్నాం. ఇపుడు రాష్ట్రంలో ‘రాబర్’ హుడ్ శకం నడుస్తోంది. పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే ఈ ‘రాబర్’ హుడ్ లక్ష్యం. నిరుపేదలు, చిరువ్యాపారులు, కిరాణావ్యాపారులే టార్గెట్. చిరు వ్యాపారుల పొట్టకొట్టి కార్పొరేట్ కంపెనీల ఖజానాలు నింపే ‘చంద్రన్న విలేజ్ మాల్స్’ కాన్సెప్ట్ ఇదే.. ఒక షాపు పెట్టి సక్సెస్ కావాలంటే చాలా కష్టపడాలి. నాణ్యమైన సరుకులు, తక్కువ ధరలతో ఎంతో కష్టపడి ఖాతాదారులను సంపాదించుకోవాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ప్రాపకం సంపాదించిన కార్పొరేట్ కంపెనీలకు ఇవేవీ అక్కర్లేదు. రాత్రికి రాత్రి సరుకులు, ఖాతాదారులు, లాభాలు రెడీ.. చిరువ్యాపారాలను ధ్వంసం చేసి.. ప్రజాపంపిణీ వ్యవస్థను నాశనం చేసి మరీ వాటికి రెడ్ కార్పెట్ పరుస్తారు.. సాక్షి, అమరావతి:‘చంద్రన్న విలేజ్ మాల్స్’ పేరుతో రాష్ట్రంలోని కిరాణా వ్యాపారాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే భారీ దోపీడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టి్టంది. లక్షలాది మందికి ఉపాధి కల్పించే కిరాణా వ్యాపారాన్ని దెబ్బతీస్తూ బడా కార్పొరేట్ సంస్థలను... ముఖ్యంగా ‘హెరిటేజ్’ రిటైల్ వ్యాపారానికి లబ్ధి చేకూర్చే సరికొత్త ఎత్తుగడకు ప్రభుత్వం తెరతీసింది. ‘చంద్రన్న విలేజ్ మాల్స్’ పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ.. అదే సమయంలో ఏటా రూ. 72.600 కోట్ల వ్యాపారాన్ని గంపగుత్త్తగా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పనుంది. రాష్ట్రంలో ఉన్న 29 వేల రేషన్ షాపులన్నీ దశల వారీగా రిలయన్స్, వాల్‌మార్ట్, 6+ప్యూచర్ రిటైల్ సంస్థలకు అప్ప చెప్పి తెల్ల రేషన్ కార్డున్న ప్రతి పేదవాడు కూడా భవిష్యత్తులో ఆ మాల్స్‌లోనే సరుకులు కొనుగోలు చేసేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఫ్యూచర్ రిటైల్ వ్యాపారంలో చంద్రబాబు కుటుంబ సంస్థ ‘హెరిటేజ్ రిటైల్’ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం ఒక్కటే పంపిణీ చేస్తుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తిపెరుగుతోంది. దీన్ని తగ్గించడం కోసం తక్కువ ధరలకే కిరాణా వస్తువులు అందిస్తున్నామంటూ ‘చంద్రన్న విలేజ్ మాల్స్’ను తెరమీదకు తీసుకొచ్చారు. ఈ మాల్స్‌లో కేవలం బియ్యం మాత్రమే కాకుండా అన్ని కిరాణా సరుకులను బయట మార్కెట్ కంటే 10 నుంచి 12 శాతం తక్కువ ధరకు అందించనున్నామంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదీ... దోపీడీ లెక్క.. విలేజ్ మాల్స్ పేరుతో పైకి డిస్కౌంట్ రేట్లకే సరుకులు అందిస్తామంటున్నా.... వేల కోట్ల కిరాణా వ్యాపారాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. రాష్ట్రంలో సుమారు 1.40 కోట్ల తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు కూడా ప్రతీ నెల బియ్యంతో పాటు అన్ని కిరాణా, ఫ్యాన్సీ సామాన్లు కొనాలంటే తక్కువలో తక్కువ రూ. 2,000 అవసరమవుతాయి. కేవలం ఈ తెల్ల రేషన్ కార్డుల వారు విలేజ్ మాల్స్ ద్వారా ప్రతీ నెలా కొనే సరుకుల విలువే... అక్షరాలా రూ. 2,800 కోట్లు. వీరు కాకుండా రాష్ట్రంలో మరో 60 లక్షల మధ్య తరగతి కుటుంబాలున్నాయి. వీరి నెలసరి బడ్జెట్ విలువ రూ. 5,000లుగా అంచనా వేస్తే మరో రూ. 3, 250 కోట్ల వ్యాపారం కార్పొరేట్ సంస్థల జేబుల్లోకి వెళ్లిపోతుంది. అంటే ప్రతీ నెలా రూ. 6,050 కోట్ల చొప్పున ఏటా రూ. 72,600 కోట్ల మార్కెట్‌ను ప్రభుత్వమే పళ్లెంలో పెట్టి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పబోతోందన్నమాట. కార్పొరేట్ సంస్థల దోపిడీ ఎలా ఉంటుందో మనమందరికీ అనుభవమే. తొలుత ఆకర్షించడానికి డిస్కౌంట్లు ప్రకటించి.. అలావాటయ్యాక ఆ సంస్థలన్నీ గుత్తాధిపత్యం కింద ధరలు పెంచుకుంటూ పోతాయి. ఇప్పుడు ఈ విలేజ్ మాల్స్‌లో కూడా తొలుత తక్కువ ధరకే వస్తువులు విక్రయించడంతో కొనుగోలుదారులు వాటికి పూర్తిగా అలవాటు పడి పోతారు. ఈలోగా గ్రామాల్లో చిరువ్యాపారులు, కిరాణా వ్యాపారుల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినిపోతాయి. ఆ∙తర్వాత విలేజ్ మాల్స్‌లో క్రమేణా ధరలు పెంచినా వినియోగదారులు చచ్చినట్లు ఆ మాల్స్‌లోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పిస్తారు. ఇదీ విలేజ్ మాల్స్ స్వరూపం.. కార్పొరేట్ సంస్థలకు లబ్దిచేకూర్చేలా రేషన్ షాపులన్నీ ఆధునీకరించి వారికి అప్పగించేందుకు అవసరమైన పనులన్నీ క్షేత్రస్థాయిలో చకచకా జరిగిపోతున్నాయి. ప్రస్తుత రేషన్ షాపులను రూ.5 లక్షలతో విలేజ్ మాల్స్‌గా ఆధునీకరించనున్నారు. ఇందులో రేషన్ డీలర్ వాటా రూ. 1.25 లక్షలు, ప్రభుత్వం రూ. 1.25 లక్షలు, మరో రూ. 2.50 లక్షలు కార్పొరేట్ సంస్థలు ఖర్చు చేసేలా ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలు తయారు చేసింది. రేషన్ డీలర్ వాటా రూ. 1.25 లక్షలు ముద్ర బ్యాంకు ద్వారా రుణం ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోనుంది. ఇందులో భాగంగా మొదటి దశ కింద సుమారు 6,000 మాల్స్‌ను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత జిల్లాల్లో ఎక్కడెక్కడ చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేయాలో రేషన్ షాపుల వివరాలు పంపాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. ఒక్కో జిల్లా నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద 500 తక్కువ కాకుండా పూర్తి వివరాలతో రేషన్ షాపుల జాబితా పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సరుకుల నాణ్యతపై బాధ్యత ఎవరిది? సరుకులన్నీ కూడా చంద్రన్న విలేజ్ మాల్స్‌లోనే కొనుగోలు చేసేలా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులున్న కుటుంబాలు 1.40 కోట్లు ఉంటే వీటిలో దాదాపు 80 శాతం కుటుంబాలు సబ్సిడీ బియ్యం తినడంలేదని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అందుకే బియ్యం వద్దనుకునే లబ్దిదారులకు వాటికయ్యే మొత్తాన్ని లెక్కకట్టి అదే మొత్తానికి చంద్రన్న మాల్స్‌లో సరుకులు తీసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రచారం చేస్తోంది. అంటే ఆ మేరకు మార్కెట్ అంతా ఆ మాల్స్‌కు తరలించబోతున్నారన్నమాట. కొత్తగా ప్రవేశపెట్టనున్న చంద్రన్న విలేజ్ మాల్స్‌లో నాణ్యమైన సరుకులు కాకుండా నాసిరకం విక్రయిస్తే ఎవరు చర్యలు తీసుకుంటారనేది అర్థంకాని సమస్య. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుండటంతో వారు ఎలాంటి సరుకులు విక్రయించినా అధికారులు పట్టించుకొనే పరిస్థితి కూడా ఉండదు. గత మూడేళ్లుగా సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు ఐదు రకాల వస్తువులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. నాణ్యత లేకపోతే వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్లు, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించినా ఇప్పటికీ చర్యలు లేవు. బెల్లం, గోధుమ పిండి నాసిరకంగా ఉందని కూడా చంద్రబాబు ఒప్పుకున్నారు. బాధ్యులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పినా ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రేషన్ షాపులను క్రమంగా నీరుగార్చారు.. రేషన్ షాపులను ఒక పథకం ప్రకారం ప్రభుత్వమే నీరుగార్చుతోందనే ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే రేషన్ షాపుల్లో ఇచ్చే సరుకులను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో బియ్యం, కిరోసిన్‌తో పాటు మరో తొమ్మిది రకాలైన సరుకులు కందిపప్పు(1 కిలో), పామాయిల్ (1 లీటర్), గోధుమపిండి(1 కిలో), గోధుమలు(1 కిలో), ఉప్పు(1 కిలో), చక్కెర(అర కిలో), చింతపండు(అర కిలో), కారం పొడి(250 గ్రాములు), పసుపు పొడి(100 గ్రాములు) ఒక బ్యాగులో ఉంచి ఒక్కో లబ్దిదారుడికి రూ.185లకు ఇచ్చేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ 9 రకాల సరుకులకు మంగళం పాడటమే కాకుండా కిరోసిన్‌ను కూడా రద్దు చేసింది. ప్రస్తుతం బియ్యం ఒక్కటే పేదలకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. పేదలకు నిత్యావసరాలను తక్కువ ధరలకు అందించాలన్న లక్ష్యంతో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తే ఆ తర్వాత అదే పార్టీ నుంచి సీఎం పీఠం మీద కూర్చొన్న చంద్రబాబు వాటిని నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకోవడం గమనార్హం. ఖర్చు మాపై వేస్తే ఎలా? : రేషన్ డీలర్ల ఆందోళన చంద్రన్న విలేజ్ మాల్స్ అలంకరణ కోసం ఒక్కో రేషన్ డీలర్‌పై రూ. 1.25 లక్షలు భారం మోపాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు పేర్కొన్నారు. మాల్స్ ఏర్పాటుపై ఇప్పటి వరకు రేషన్ డీలర్లతో ఎలాంటి చర్చలూ జరపకుండానే ముందుకెళ్లడం అన్యాయం. డీలర్లను అడకుండానే వారి పేరిట ముద్ర బ్యాంకు ద్వారా ఒక్కొక్కరి పేరిట రూ. 1.25 లక్షలు రుణం తీసుకొని ఖర్చు చేస్తే వాటిని తిరిగి తామెలా చెల్లిస్తామని ప్రశ్నించారు. చంద్రన్న విలేజ్ మాల్స్ నిర్వహణ రేషన్ డీలర్లకే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు చెందిన వ్యక్తులను కౌంటర్లో కూర్చోబెట్టి వారి చేత డబ్బులు వసూలు చేస్తే తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూర్చి వారి నుంచి ప్రతిఫలం పొందాలనేది ప్రభుత్వ పెద్దల ఆలోచన. అందుకే రేషన్ షాపులను వారికి అప్పగించి అందులో అన్ని సరుకులూ విక్రయించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కార్పొరేట్ చేతుల్లోకి అప్పజెప్పొద్దని డీలర్లు పదేపదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా స్పష్టమైన హామీ రాకపోవడంతో డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపులు మూసేసే ఎత్తుగడ చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో బడా రిటైల్ సంస్థలతో కలిసి రేషన్ షాపులను మూసే వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మార్కెట్ ధర కంటే 12 శాతం తక్కువ ధరకు సరుకులు ఎలా ఇవ్వగలరో ప్రభుత్వం వివరించాలి. చంద్రన్న మాల్స్ పేరుతో షాపులు తెరిస్తే కిరాణాషాపుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత తప్పదు. మల్టీ నేషనల్ కంపెనీలతో చేతులు కలిపి ఇటు రేషన్ దుకాణాలను, ఇటు కిరాణా షాపులను నిర్వీర్యం చేసే కార్యక్రమానికి ప్రభుత్వమే వత్తాసు పలకడం దారుణం. ఆతుకూరి ఆంజనేయులు, అధ్యక్షులు, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్. -
రేషన్ బదులు క్యాష్ బదిలీ!
-
రేషన్ బదులు క్యాష్ బదిలీ!
సాక్షి, హైదరాబాద్ : రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు బియ్యం అందించడం ఉత్తమమా లేక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) విధానంలో వారికి నేరుగా నగదు బదిలీ చేయడం ఉత్తమమా అనే అంశంపై ఆలోచించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలు, అక్రమాలను నిరోధించడంతోపాటు లబ్ధిదారులకు సంపూర్ణ ప్రయోజనం అందించడానికి అనువైన విధానం అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రేషన్ డీలర్లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘ఏటా రూ. 6,500 కోట్లు ఖర్చు పెట్టి పేదల కోసం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. ఇందుకోసం అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు ఎంతో మంది అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తలమునకలవుతోంది. అయినప్పటికీ ఆశించిన ఫలితం రావట్లేదు. లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం, ఇతర సరుకులు పక్కదారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాకు మాఫియానే ఏర్పడింది. ఉన్నతాధికారులను కూడా మేనేజ్ చేసే స్థాయికి అక్రమ దందా సాగించేవారు ఎదిగారు. ప్రతిరోజూ పత్రికల్లో అక్రమ రవాణా అవుతున్న రేషన్ బియ్యం పట్టివేత వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు, వెలుగు చూస్తున్న అక్రమాలు మనోవేదన కలిగిస్తున్నాయి. ఇంత ఖర్చు చేసినా, ఎంతో శ్రమించినా చెడ్డపేరు వస్తున్నదనే బాధ కలుగుతోంది. ఈ పరిస్థితి పోవాలి. పేదల కోసం పెడుతున్న ఖర్చు నూటికి నూరు శాతం పేదలకే ఉపయోగపడాలి. ఇందుకోసం ఓ మంచి విధానం అమలు చేయాలి’’ అని అధికారులకు సూచించారు. డీబీటీపై సీఎంకు వివరించిన అధికారులు... దేశంలోని వివిధ చోట్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అమలు విధానంలో మార్పులొచ్చాయని, ముఖ్యంగా రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి బదులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేసేందుకు డీబీటీ విధానం అమలవుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా హవేలి లాంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో పీడీఎస్ ద్వారా సబ్సిడీపై రేషన్ సరుకుల పంపిణీకి బదులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ చేస్తున్నారని నివేదించారు. ఈ తరహాలో నగదు బదిలీ విధానాన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని ప్రధాని మోదీ కూడా పిలుపునిచ్చారని తెలిపారు. 2013లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఆహార భద్రత చట్టంలోనూ సబ్సిడీల ద్వారా అందించే లబ్ధిని నగదు రూపంలో నేరుగా లబ్ధిదారులకు అందించాలనే సూచన ఉందని గుర్తుచేశారు. సరుకులకు బదులు నగదునే లబ్ధిదారులకు అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు. ప్రస్తుతం ఆహారం కోసం బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నామని, అదీ నిర్ణీత సమయంలో అందిస్తున్నామని చెప్పారు. బియ్యం కాకుండా నగదు అందిస్తే లబ్దిదారులు వారి ఆహార అలవాట్లకు అనుగుణంగా సరుకులు కొనుగోలు చేసుకుంటారని చెప్పారు. కాబట్టి రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులకు బదులుగా అంతే మొత్తం నగదును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని వారు సీఎంకు సూచించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి... రేషన్ షాపుల ద్వారా బియ్యం అందించడం ఉత్తమమా? నగదును లబ్దిదారులకు నేరుగా అందించడం ఉత్తమమా అనే విషయంపై ఆలోచించాలని కోరారు. సమావేశంలో మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పౌర సరఫరాల సంస్థ కమిషనర్ సీవీ ఆనంద్, సీనియర్ అధికారులు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, వాకాటి కరుణ, శాంత కుమారి, స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. డీలర్లు సమ్మె విరమించకుంటే లబ్ధిదారులకు నేరుగా నగదు... రేషన్ డీలర్లు సమ్మె నోటీసు ఇచ్చినందున లబ్ధిదారులకు ఇబ్బంది కలగని విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. డీలర్లు సమ్మె ఆలోచన విరమించుకోకుంటే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సాధ్యం కాదు కాబట్టి దానికి సంబంధించిన నగదును నేరుగా లబ్ధిదారులకే అందించే ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. -
చౌక దుకాణాలను నిర్వీర్యానికి సర్కారు కుట్ర
-
విలేజ్ మాల్స్‌గా రేషన్ షాపులు
-
కార్పొరేట్‌కు చౌకబేరం!
-
కార్పొరేట్‌కు చౌకబేరం!
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థను కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేషన్ దుకాణాల్లో పేదలకు సబ్సిడీపై పంపిణీ చేసే సరుకులను ఇప్పటికే ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇక ఆ బాధ్యత నుంచి కూడా తప్పుకుని ప్రైవేట్ కంపెనీలకు వదిలేయాలని నిర్ణయించింది. అది కూడా తన సొంత కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు చెందిన రూ.200 షేరును రూ.900 పెట్టి కొనుగోలు చేసిన ప్యూచర్ కంపెనీకి మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థను కట్టబెడుతుండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 29,000 చౌకధరల దుకాణాలను దశలవారీగా ‘అన్న విలేజ్ మాల్స్’గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన పౌరసరఫరాలశాఖ సమీక్ష సమావేశంలో తొలివిడతలో 6,500 ‘అన్న విలేజ్ మాల్స్’ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. తక్కువ ధరతో నాణ్యమైన నిత్యావసర వస్తువులను వినియోగదారులకు అందించడమే లక్ష్యం కావాలని సూచించారు. ‘ఫ్యూచర్’, ‘రిలయన్స్’ గ్రూపుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ‘అన్న విలేజ్ మాల్స్’ను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రత్యేకంగా లోగో రూపొందించాలని సూచించారు. ప్యూచర్ గ్రూప్‌లో సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీకి 3 శాతం వాటాలు ఇప్పటికీ ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించటానికి కేవలం ఒక్క రోజు ముందుగా హెరిటేజ్ తన షేర్లను ఒక్కసారిగా రూ. 900కి పెంచి ప్యూచర్ గ్రూప్‌నకు విక్రయించింది. అప్పట్లో ఈ ఒప్పందం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఖాళీగా ఉన్న 4,599 షాపులకు డీలర్ల నియామకం రేషన్ బియ్యం’ తమకు వద్దు అనుకునే తెల్లకార్డుదారులకు అంతే విలువైన నగదును ‘అన్న విలేజ్ మాల్స్’లో అవసరమైన సరుకులు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎవరైనా తమ ఉత్పత్తులను ‘అన్న విలేజ్ మాల్’లో విక్రయించుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఖాళీగా వున్న 4,599 చౌకధరల దుకాణాలకు వెంటనే డీలర్లను నియమించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రేషన్ సరుకుల పంపిణీలో లబ్ధిదారులకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేసినా తెల్ల రేషన్ కార్డుదారులకు మార్కెట్ ధర కన్నా 50% తక్కువకు నెలకు అర కిలో పంచదార పంపిణీ చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అందించే రేషన్‌లో పంచదారను జత చేయాలని చెప్పారు. ప్రత్యేక అవసరాలు కలిగిన కూరాకుల, రజక, మత్స్యకార తదితర సామాజికవర్గాల వారికి తెల్ల కిరోసిన్ ఇవ్వాలని అన్నారు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసినప్పుడు బోగస్‌వి జారీ కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఒక్కొక్కటిగా సరుకుల ఎత్తివేత గతంలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, కిరోసిన్‌తోపాటు అదనంగా కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి, గోధుమలు, ఉప్పు, చక్కెర, చింతపండు, కారం పొడి, పసుపు లాంటి తొమ్మిది రకాల సరుకులను సంచుల్లో ఒక్కో లబ్దిదారుడికి సబ్సిడీపై రూ. 185కే పంపిణీ చేసేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటికీ మంగళం పాడారు. కేవలం బియ్యం మాత్రమే సరఫరా జరుగుతోంది. ఇన్నాళ్లూ పేదలకు అండగా ఉన్న చౌక ధరల దుకాణాలను ఇప్పుడు మాల్స్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తే భవిష్యత్తులో ఏ సరుకులు కొనాలన్నా జనం వాటి గుప్పెట్లో నలిగిపోయే ప్రమాదం నెలకొంది. – ‘అన్న విలేజ్ మాల్స్’ కనీసం 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. – ‘అన్న విలేజ్ మాల్స్’కు అయ్యే వ్యయంలో 25% రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు మరో 25% ‘ముద్ర’ రుణాన్ని డీలర్‌కు ఇప్పిస్తారు. – డ్వాక్రా, మెప్మా, గిరిజన సహకార సమితి ఉత్పత్తులతో పాటు ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే వివిధ వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. – బందరు లడ్డు, కాకినాడ కాజా, పచ్చళ్లు లాంటివి కూడా లభిస్తాయని పేర్కొంది. రేషన్ షాపులను కొనసాగించాలి కార్పొరేట్ సంస్థల ద్వారా తక్కువ ధరకు సరుకులు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నా రేషన్ షాపులను నిర్వీర్యం చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో సబ్సిడీపై ఇస్తున్న తొమ్మిది రకాల సరుకులతోపాటు బియ్యం, చక్కెర, కిరోసిన్ కూడా సబ్సిడీపై సరఫరా చేసి పేదలను, రేషన్ డీలర్లను ఆదుకోవాలి. –దివి లీలామాధవరావు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్, కామన్‌లో ‘లీలామాధవరావు’ అనే ఫైల్నేంతో ఫోటో ఉంది -
అన్న విలేజ్ మాల్స్‌గా రేషన్ షాపులు
సాక్షి, అమరావతి: రేషన్ షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చాలంటూ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తొలి విడతలో 6,500 రేషన్ షాపులను ‘అన్న విలేజ్ మాల్స్’గా మార్చాలని సూచించారు. ఈ మేరకు తయారు చేసిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పౌరసరఫరాల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ మాల్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, ప్రత్యేక లోగో తయారుచేయాలని ఆదేశించారు. 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ‘అన్న విలేజ్ మాల్’ కోసమయ్యే వ్యయంలో 25 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మరో 25 శాతం వ్యయాన్ని ‘ముద్ర’ నుంచి డీలర్‌కు రుణంగా ఇప్పిస్తుంది. ఈ విలేజ్ మాల్స్‌లో డ్వాక్రా, మెప్మా, జీసీసీ ఉత్పత్తులతో పాటు రైతుల నుంచి కొనుగోలు చేసే వివిధ వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారు. అలాగే బందరు లడ్డు, కాకినాడ కాజా వంటి స్వీట్లతో పాటు పలురకాల పచ్చళ్లు కూడా లభిస్తాయి. విలేజ్ మాల్స్‌లో ఎవరైనా తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలనుకుంటే.. ఆ సౌలభ్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక రేషన్ బియ్యం వద్దనుకునే తెల్ల కార్డుదారులకు.. అంతే విలువైన ఆహార పదార్థాలను విలేజ్ మాల్స్ నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 4,599 రేషన్ షాపులకు వెంటనే డీలర్లను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. తెల్ల రేషన్ కార్డుదారులకు మార్కెట్ కన్నా 50 శాతం తక్కువ ధరకే అర కిలో పంచదార పంపిణీ చేయాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అందించే రేషన్‌లో పంచదారను కూడా జత చేయాలని చెప్పారు. అలాగే రజక, మత్స్యకార తదితర సామాజికవర్గాల వారికి వైట్ కిరోసిన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. -
ఇక కిరోసిన్ బంద్!
– జూన్‌లో రేషన్ డీలర్లకు కోటాలో 20 శాతం సరఫరా – ఈ నెల నుంచి పూర్తిగా ఎత్తేస్తున్న వైనం తెల్లకార్డులు– 11.92 లక్షలు గులాబీ కార్డులు– 80 వేలు మొత్తం కార్డులు– 12.72 లక్షలు గ్యాస్ కనెక్షన్లు– 11.37 లక్షలు గ్యాస్ కనెక్షన్ లేని వారు– 1.35 లక్షలు అనంతపురం అర్బన్ : రేషన్ కార్డులకు నీలి కిరోసిన్ పంపిణీని జూలై నుంచి ప్రభుత్వం బంద్ చేసింది. జూన్‌కు సంబంధించి డీలర్లకు కేటాయించిన కోటాలో కేవలం 20 శాతం మాత్రమే సరఫరా చేసినట్లు తెలిసింది. అదీ కూడా మేలో కిరోసిన్ హోల్‌సేల్ డీలర్ల వద్ద మిగులు సరుకును డీలర్లకు అధికారులు సర్దుబాటు చేసినట్లు తెలిసింది. ఈ కొద్ది సరుకును కార్డుదారులకు ఎలా పంపిణీ చేయాలో దిక్కుతోచక పలువురు డీలర్లు ఇబ్బంది పడ్డారు. కాగా చౌక దుకాణాల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేస్తున్న సరుకులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తున్న ప్రభుత్వం వైఖరిని గమనిస్తే ప్రజా పంపిణీ వ్యవస్థ బాధ్యతల నుంచి తప్పుకో చూస్తోందనేది స్పష్టమవుతోంది. ఒకొక్కటిగా కోత తెల్లకార్డుదారులకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు చౌక దుకాణాల నుంచి పంపిణీ చేస్తామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి రాగానే ఒక్కో సరుకునూ కోత పెడుతూ వస్తోంది. గతంలో బియ్యంతో పాటు పామాయిల్, చక్కెర, కందిపప్పుతో పాటుగా చింతపండు, ఉప్పు, కారం, పసుపు కూడా పంపిణీ చేసేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిగా పామాయిల్, అటు తరువాత చింతపండు, ఉప్పు, కారం, పసుపు పంపిణీ నిలిపివేసింది. ఆ తరువాత కందిపప్పు, గత నెలలో చక్కెర, ఈ నెలలో కిరోసిన్... ఇలా ఒక్కొక్కటిగా మూడేళ్లలో తొలగించింది. ప్రస్తుతం బియ్యం ఒక్కటే పంపిణీ చేస్తున్నారు. బియ్యానికి కూడా త్వరలో మంగళం పాడే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. గ్యాస్ కనెక్షన్ లేనివారి పరిస్థితి? కిరోసిన్ పంపిణీ బంద్ చేయడంతో గ్యాస్ కనెక్షన్ లేని పేదల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి వారు కట్టెల పొయ్యిపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. పొగరహిత జిల్లాగా మారుస్తామని చెబుతున్న అధికారులకు ఇదెలా సాధ్యమో తెలియాలి. జిల్లాలో గ్యాస్ లేని తెల్లకార్డుదారులకు దీపం పథకం కింద 1.50 లక్షల కనెక్షన్లు మంజూరు చేసి వంద శాతం లక్ష్యం పూర్తిచేశామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష మందికి గ్యాస్ కనెక్షన్ లేనట్లు సమాచారం. జిల్లాలో 11.92 లక్షలు తెల్ల కార్డులు ఉన్నాయి. పింక్ కార్డులు 80 వేలు ఉన్నాయి. అంటే జిల్లాలో మొత్తం 12.72 లక్షల కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో11,37,236 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సాధారణ కనెక్షన్లు 5,24,294, దీపం కనెక్షన్లు (కొత్తగా మంజూరు చేసిన వాటితో కలిపి) 5,31,067, సీఎస్ఆర్ (కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) 39,225, ఉజ్వల పథకం కనెక్షన్లు 2,650 ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 12.72 లక్షల కార్డులు ఉంటే గ్యాస్ కనెక్షన్లు 11.37 లక్షలు ఉన్నాయి. అంటే 1.35 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు లేవనేది స్పష్టమవుతోంది. -
బియ్యానికి ఎసరు..!
► ఇప్పటికే చక్కెర, కిరోసిన్‌కు మంగళం ► త్వరలో అమలుకు ప్రభుత్వం కసరత్తు ► ఏడు లక్షల మంది పేదలపై ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా అందించే సరుకుల సంఖ్యను పెంచే సంగతి పక్కన పెట్టి ఉన్న సరుకులకు మంగళం పాడుతూ వస్తోంది. పేద ప్రజల సంక్షేమం మరిచి ఏకపక్ష నిర్ణయాలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే కేంద్రం సబ్సిడీలకు కోత పెట్టిందని సాకు చూపుతూ జూన్ నుంచి చక్కెర, కిరోసిన్‌కు మంగళం పాడింది. త్వరలోనే బియ్యానికి కూడా ఎసరు పెట్టేందుకు టీడీపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. దీనిస్థానంలో నేరుగా సబ్సిడీని లబ్ధిదారులకు అందించాలనే ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపనుంది. ఇది సుమారు ఏడులక్షల మంది పేదలపై ప్రభావం చూపనుంది. సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం...సరుకుల సంఖ్యను పెంచుతామంటూ ప్రగల్బాలు పలికింది.అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కుతోంది. అంతకుముందు కాంగ్రెస్‌లోని కిరణ్ సర్కార్ అమ్మ హస్తం పేరుతో ఎనిమిది సరుకులను అందించేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పామోలిన్‌కు కేంద్ర సబ్సిడీ లేదని చెప్పి మొదట్లోనే సరఫరాను నిలిపి వేసింది. తర్వాత మూడు,నాలుగు వస్తువులను ఇస్తూ కాలం గడుపుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చక్కెర, కిరోసిన్‌కు సంబంధించి సబ్సిడీని ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని భరించి చక్కెర, కిరోసిన్ అందిస్తుందని ప్రజలు భావించినా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో జూన్ నెల నుంచి చక్కెర, కిరోసిన్ సరుకులను నిలిపి వేశారు. పేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా అందించే బియ్యానికి కూడా త్వరలో మంగళం పాడనున్నారు. ఒక్కో వ్యక్తికి నెల కు ఐదు కిలోల చొప్పున అందించే బియ్యానికి సంబంధించి నగదు రూపంలో లబ్ధి దారుని అకౌంట్లలో వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఐదు కేజీలకు రూ. 5తో పాటు కేంద్రం అందించే సబ్సిడీ రూ.45 కలుపుకొని రూ. 50 వేస్తే బాగుంటుందనే ఆలోచన ఉన్నత స్థాయిలో జరుగుతోంది. డీలర్లకు దెబ్బ: జిల్లాలో పేదలకు అందించే రేషన్‌డీలర్లకు దెబ్ద తగలనుంది. ఇప్పటికే పలుమార్లు సరుకులపై ఇచ్చే కమీషన్ చాలడం లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీలర్ల సంఘం ప్రతినిధులు చంద్రబాబును కలిసి మొర పెట్టుకున్నారు. సరుకులు తగ్గిస్తుండడంతో వాటిపై వచ్చే కమీషన్ కూడా రాకుండా పోతోంది. ఇప్పటికే చక్కెర, పామోలిన్, కిరోసిన్ నిలిపేశారు. బియ్యం కూడా ఆపేస్తే నష్టపోవాల్సి వస్తోందని డీలర్లు వాపోతున్నారు. జిల్లాకు సంబం«ధించి సమాచారం జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య – 7 లక్షలకు పైగానే జిల్లాలో చౌక దుకాణాల సంఖ్య – 1,738 అంత్యోదయ అన్న యోజన కార్డులు – 5,7000 -
రేషన్‌కోత..పేదలకు వెత
♦ నిత్యావసరాల్లో పంచదార, కిరోసిన్‌కు మంగళం ♦ చౌక దుకాణాల్లో సరఫరా నిలిపివేత ♦ దశల వారీగా ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం ♦ సామాన్యులకు తప్పని తిప్పలు మార్కెట్లో ధరల మోత.. ప్రభుత్వం రాయితీపై అందజేసే కిరోసిన్, చక్కెరలను నిలిపివేయడంతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. బహిరంగ మార్కెట్లో కిలో చక్కెర రూ.40 అమ్ముతుండగా, చౌక దుకాణాల్లో రూ. 13.50కే అందజే సేవారు. ఇంట్లో దీపం, కట్టెల పొయ్యి వెలిగించడానికి కిరోసిన్ ను వినియోగిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో నీలి కిరోసిన్ దొరకదు. మామూలు కిరోసిన్ లీటరు ధన రూ. 40 పలుకుతోంది. వీటిని కొనుగోలు చేయాలంటే పేద ప్రజలపై ఆర్థిక భారం పడక తప్పదు. పర్చూరు: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులపై అతి పెద్ద కోత విధించేందుకు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. తెల్లరేషన్ కార్డుదారులకు అందిస్తున్న రెండు నిత్యావసర వస్తువులు ఇక నుంచి పేదలకు దూరమయ్యాయి. గతంలో చౌక దుకాణాల్లో కందిపప్పు, నూనె, గోధుమపిండి, పసుపు, ఉప్పు, గోధుమలు కూడా అందిస్తుండగా కాలక్రమేణా వాటికి స్వస్తి పలికారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మరో రెండు నిత్యావసర వస్తువులను ఈ జాబితాలో చేర్చింది. ప్రస్తుత జూన్ నెల కోటాలో చక్కెర, కిరోసిన్ పంపిణీ చేయడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయం చౌక దుకాణాల సరుకులపైనే ఆధారపడుతున్న పేదలపై తీవ్రప్రభావం చూపనుంది. నిర్వీర్యమవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ... దారిద్రరేఖకు దిగువన ఉన్నవారికి రాయితీపై నిత్యావసర సరుకులు అందించాలన్నది చౌక దుకాణాల ఉద్దేశం. ఈ లక్ష్యం రోజు రోజుకు నీరుగారిపోతుండడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ప్రారంభంలో అందజేసిన సరుకుల్లో కోత విధిస్తోంది. చౌక దుకాణాల్లో అందించే గోధుమ పిండి, నూనెకు ఇప్పటికే మంగళం పాడిన ప్రభుత్వం జూన్ నెల నుంచి చక్కెర, కిరోసిన్‌లను కూడా నిలిపివేసింది. కిరోసిన్, చక్కెరపై తాము అందజేసే రాయితీ నిలిపివేస్తున్నామని, వాటి పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజా పంపిణీలో మారుతున్న నిర్ణయాలపై ప్రజల్లో ఆసంతృప్తి రెట్టింపవుతోంది. చౌక దుకాణాల దుస్థితి.. జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో 8,68,088 రేషన్‌కార్డులకు గాను 2151 చౌక దుకాణాలు ఉన్నాయి. -
రేషన్ షాపుల్లో ‘విజిలెన్స్’ తనిఖీలు
మిర్యాలగూడ : పట్టణంలోని రేషన్ దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. షాపుల్లోని రికార్డులకు, ఉన్న నిల్వలకు తేడాలు ఉన్నట్లు సమాచారం మేరకు దాడులు నిర్వహిం చారు. రేషన్ షాపుల్లో పక్కదారి పడుతున్న బియ్యం, సరుకులపై ‘బినామీ డీలర్లు’ శీర్షికన ఈ నెల 15వ తేదీన ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. స్పందించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టణంలోని బంగారుగడ్డలోని 37వ రేషన్‌షాపు, గాంధీనగర్‌లోని 3వ రేషన్‌షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ నర్సింహారావు మాట్లాడుతూ పట్టణంలోని బంగారుగడ్డలోని 37వ రేషన్ షాపు డీలర్ సుదర్శన్ వద్ద రికార్డుల్లో 23.12 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉండాల్సి ఉండగా 36.50 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయని పేర్కొన్నారు. షాపులో అదనంగా 13.38 క్వింటాళ్ల బియ్యం, చెక్కర 16.50 కిలోలు తక్కువగా ఉండడంతో పాటు 110 లీటర్ల కిరోసిన్ తక్కువగా ఉందని చెప్పారు. దీంతో డీలర్‌పై సివిల్ సప్లయీస్ యాక్డ్ 6 (ఏ) కేసు నమోదు చేసి షాపు సీజ్ చేసినట్లు తెలి పారు. గాంధీనగర్‌లోని షాపులో రికార్డుల్లో ఉన్న ప్రకారం ఉన్నాయని తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏఈ శివకృష్ణ, నర్సింహారెడ్డి, సివిల్ సప్లయీస్ డీటీ రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. -
నగదు రహిత రేషన్ కు రూ.లక్ష నజరానా
కాకినాడ సిటీ : రేషన్ షాపుల్లో నగదు రహిత సేవలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వం గత నెలలో నజరానాలు ప్రకటించిన నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించి విజయవాడలో పౌరసరఫరాల శాఖాధికారులు లాటరీ తీయగా జిల్లాకు సంబంధించి కాకినాడకు చెందిన మాగంటి జానకి రూ.లక్ష గెలుచుకుంది. ఈ మేరకు జిల్లా అధికారులకు శుక్రవారం రాత్రి సమాచారం అందించడంతో ఆమెను జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో అభినందించారు. త్వరలో విజయవాడలో జరిగే కార్యక్రమంలో గెలుచుకున్న నజరానా చెక్కును జానకికి ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేస్తారని జాయింట్ కలెక్టర్ తెలిపారు. కాకినాడ సాంబమూర్తినగర్ 3వ వీధిలో నివాసముంటున్న జానకి మార్చి 6వ తేదీన రేచర్లపేటలోని షాపు నంబర్ ఒకటిలో రూ.42.50 పైసలతో నగదు రహితంగా రేష¯ŒS తీసుకుందని తెలిపారు. గత నెలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా నగదు రహితంగా రేష¯ŒS సరుకులు తీసుకున్న 5లక్షల 82వేల మంది కార్డుదారులను కలిపి లాటరీ తీయగా జానకి నజరానాను గెలుచుకుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వి.రవికిరణ్, అర్బ¯ŒS తహసీల్దార్ జి.బాలసుబ్రహ్మణ్యం, పౌరసరఫరాలశాఖ ఏఎస్వో పి.సురేష్, డిప్యూటి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఎస్‌వో సూరిబాబు పాల్గొన్నారు. -
నో స్టాక్
► రేషన్ దుకాణాల్లో సరుకులు నిల్ ► కొన్ని చోట్ల అరకొర సరఫరా ► వినియోగదారుల ముట్టడి ► ప్రభుత్వానికి స్టాలిన్ హెచ్చరిక సాక్షి ప్రతినిధి, చెన్నై: చౌక ధర దుకాణాలపైనే ఆధార పడి బతికే బడుగు జీవులు రేషన్ సరుకుల కోసం బావురుమంటున్నారు. దుకాణా ల ముందు నోస్టాక్ బోర్డు పెట్టకుండానే సరుకులు లేవని తిప్పి పంపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరుకుల పంపిణీ తీరు వారంలోగా మెరుగుపడకుంటే రేషన్ దుకాణాల ముందు ఆందోళనలు చేపడతామని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రభుత్వాన్ని ఆదివారం హెచ్చరించారు. రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ సంతృప్తికరంగా సాగడంలేదు. రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉండాల్సిన అనేక నిత్యావసర సరుకులు వినియోగదారులకు చేరడంలేదు. ముఖ్యంగా పామాయిల్, పప్పు దినుసు ధాన్యాలు మూడు నాలుగు నెలలుగా అందడం లేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. బియ్యం, చక్కెర సరఫరా కూడా అంతంతమాత్రంగానే ఉంది. పొంగల్ పండుగ మాసమైన జనవరిలో కంటితుడుపుగా సరుకులను సరఫరా చేసిన ప్రభుత్వం ఆ తరువాత చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం కారణంగా పట్టించుకోవడం మానివేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడినా సరుకుల సరఫరా తీరు మెరుగుపడలేదు. రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా సరఫరా అయ్యే బియ్యమే ఎందరో పేదలకు ఆధారం. అలాగే పామాయిల్‌పై కూడా ప్రజలు ఎదురుచూస్తుంటారు. రేషన్ దుకాణదారులు ఎప్పటికప్పుడు ప్రజలను మభ్యపెట్టి పబ్బంగడుపుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా చెన్నై శివార్లు మనలిలోని రేషన్ షాపును వినియోగదారులు ఆదివారం ముట్టడించారు. మనలి మండలం 17వ వార్డులోని కొసాప్పూరు రేషన్ దుఖాణం నుంచి 800 మందికి సరుకులు అందాల్సి ఉండగా రెండు నెలలుగా పప్పుదినుసులు, పామాయిల్ వస్తువులు ఇవ్వడం లేదు. ఇదేమిటని నిలదీసిన ప్రజలతో నోస్టాక్ అని ముక్తసరిగా సమాధానం చెప్పి పంపుతున్నారు. దీంతో విసిగిపోయిన వినియోగదారులు ఆదివారం దుకాణాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు. స్టాలిన్ సందర్శన: రేషన్ దుకాణాల వ్యవస్థ చిన్నాభిన్నంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొలత్తూరు నియోజకవర్గంలో ఆదివారం పర్యటించారు. తన నియోజకవర్గ పరిధిలోని చింతామణి, అముదం స్టోర్సులలోకి వెళ్లి సరుకులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రేషన్ దుకాణాల తీరుపై ప్రజల నుంచి తనకు ఫిర్యాదులు రావడంతో పర్యటనకు వచ్చానని తెలిపారు. రేషన్ దుకాణాల పనితీరును పర్యవేక్షించాలి్సన ప్రజా పౌరసరఫరాల శాఖ మంత్రి కామరాజ్, సహకార శాఖా మంత్రి సెల్లూరురాజా పొంతనలేని సమాధానాలతో ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని అన్నారు. పామాయిల్‌ను డిసెంబర్లో మాత్రమే పూర్తిస్థాయిలో సరఫరా చేశారని, ఆ తరువాత నుంచి అరకొర స్టాకుతో సరిపెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. డీఎంకేకు చెందిన 89 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి వెళ్లి రేషన్ దుకాణాల పనితీరును పరిశీలించాలి్సందిగా ఆదేశించినట్లు తెలిపారు. రేషన్ దుకాణాల లోటుపాట్లను సరిదిద్ది పనీతీరును ప్రభుత్వం వారంలోగా మెరుగుపరచకుంటే అన్ని దుకాణాల ముందు ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. -
అందరి శత్రువయా!
⇒ బిగ్‌బాస్‌కు అందరితోనూ విభేదాలే.. ⇒ సాగనంపాలంటూ ప్రభుత్వానికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే లేఖ ⇒ జిల్లా సమీక్ష సమావేశంలో పలువురు ఎమ్మెల్యేల ఆగ్రహం ⇒ నగదు రహిత రేషన్ పంపిణీపైనా విమర్శలు ⇒ సార్ నిబంధనలపై ఉద్యోగ సంఘాలు సీరియస్ జిల్లాలో బిగ్‌బాస్‌గా వ్యవహరిస్తున్న ఆ అధికారికి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇలా అందరితో విభేదాలు తెచ్చుకోవడం సాధారణమైంది. ఆయన తీరుపై ఉద్యోగ సంఘాలే కాదు... అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. జిల్లా సమీక్ష సమావేశాల్లో బిగ్‌బాస్ తీరును ఆ ఎమ్మెల్యేలు ఎండగడుతున్నారు. అయితే చిన్నబాబు ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో జిల్లా ఇన్చార్జి మంత్రి, ఇతర మంత్రులు ఏమీ చేయలేక ఎమ్మెల్యేలకు సర్దిచెబుతున్నారు. సాక్షి, విజయవాడ : బిగ్‌బాస్ జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన తరువాత అధికార పార్టీ ఎమ్మెల్యేలను సైతం పూర్తిగా విస్మరించారు. చిన్నచిన్న పనులు కూడా చేయించుకోలేక అధికార పార్టీ ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ను జిల్లా నుంచి సాగనంపాలంటూ టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ప్రభుత్వానికి లేఖ రాశారు. అదే సమయంలో మరికొంత మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా బిగ్‌బాస్‌పై మంత్రుల వద్ద తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ► నగదు రహిత రేషన్‌ను రాష్ట్రంలోనే తొలిసారిగా కృష్ణాజిల్లాలో అమలు చేశారు. దీనివల్ల పేదలకు పూర్తిగా రేషన్ అందడం లేదు. మరోవైపు రేషన్ డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల నుంచి తీవ్ర వత్తిడి రావడంతో రేషన్ దుకాణల్లో డిజిటల్ విధానానికి స్వస్తి పలకాలంటూ గత నెల 28వ తేదీన జరిగిన జిల్లాసమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాలకు బదులుగా మద్యం షాపుల్లో ఈ విధానం పెట్టాలని సూచించారు. ► రాజధాని పేరుతో బిగ్‌బాస్ కొత్తకొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కువగా ఒక ఈవెంట్ మేనేజర్‌కే దక్కుతున్నాయి. ఆయనకు రూ.కోట్లలో బిల్లులు ఇస్తున్నారు. దీని వెనుక చిన్నబాబుకు, బిగ్బాబుకు వాటాలు అందుతున్నాయని అధికార పార్టీ ప్రజాప్రతినిధులే చర్చిం చుకుంటున్నారు. ► జిల్లాలో ఒక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భూములు కోల్పోతున్న పేదలు అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటున్నారు. భూసేకరణ సమాచారం తెలుసుకునేందుకు ఆ ఎమ్మెల్యే కీలక అధికారి అయిన బిగ్‌బాస్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో ఎమ్మెల్యే ఆ అధికారిపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ► విజయవాడలో అమరావతి ఫెస్టివల్ నిర్వహణకు అవసరమైన నగదు కోసం వాణిజ్య పన్నుల శాఖకు బిగ్‌బాస్ భారీగా టెండర్లు వేసి చందాలు వసూలు చేసి వ్యాపారులను వేధించారు. తాను నిర్వహించే ప్రతి సమావేశానికీ డెప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు రావాలని ఆదేశించే వారు. బిగ్బాబ్ వ్యవహారం వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు చేరింది. రాజధానిలో రెవెన్యూ పడిపోతే తాము బాధ్యత వహించబోమంటూ బిగ్‌బాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఘాటుగా లేఖ రాశారు. తమ శాఖను ఉపయోగించి వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేయొ ద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ► విజయవాడలోని ఇరిగేషన్ భవనాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చే పనులన్నింటినీ బిగ్‌బాసే పర్యవేక్షించారు. ఇందులో జరిగిన పనులకు ముందుగా అంచనాలు, టెండర్లు లేకపోవడంతో ఈఈ స్థాయి అధికారి బిల్లులు మంజూరు చేయబోమంటూ ఎదురు తిరిగారు. దీంతో బిగ్‌బాస్ జోక్యం చేసుకుని ఆ ఈఈని మార్చి మరో ఈఈకి బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా బిల్లులు ఇప్పించారు. ఆ బిల్లుల్లో బిగ్‌బాస్‌కు రూ.లక్షల్లో మిగిలిందని ఇరిగేషన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ► వాస్తవంగా ప్రభుత్వశాఖల్లో బదిలీలను ఆ యా శాఖల ముఖ్య అధికారులే చేయాలి. అయితే బిగ్‌బాస్ జోక్యం చేసుకుని తన ఇష్టానుసారంగా బది లీలు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్యోగ సంఘాలు స్పందించి బదిలీల్లో బిగ్‌బాస్ జోక్యంపై తీవ్ర ఆక్షేపణ తెలిపాయి. దీంతో ఆయన వెనక్కు తగ్గక తప్పలేదు. ► జిల్లాలో సిబ్బందికి ఐదేళ్లకు ఒకసారి జరిగే రివైజ్డ్ పే స్కేల్స్‌కు కొత్తగా ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ ఉపయోగించాలని బిగ్‌బాస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ సాఫ్ట్‌వేర్‌లో అనేక లోపాలు ఉండటంతో ముందుకు సాగలేదు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన 12 జిల్లాల అధికారులు పాత సాఫ్ట్వేర్ ప్రకారం ఉద్యోగుల పేస్కేల్ మార్చారు. అయితే కృష్ణాజిల్లాలో మారకపోవడంతో చివరకు ఉద్యోగసంఘాలు జోక్యం చేసుకుని నిరసనకు దిగుతామని హెచ్చరికలు జారీ చేయడంతో బిగ్‌బాస్ దిగి వచ్చారు. పాత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి రివైజ్డ్ పేస్కేల్స్ తయారు చేయడానికి అంగీకరించారు. ► వివిధ కారణాలు వల్ల సస్పెండ్ అయిన వీఆర్వోలకు తిరిగి పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఈ బిగ్‌బాస్ వేధిస్తున్నారు. సుమారు 70 మంది వీఆర్వోలను పక్కన పెట్టడంతో రెవెన్యూ శాఖలో పాలన కుంటుపడింది. ► విజయవాడ దుర్గగుడి సమీపంలోని అర్జున వీధి ప్రారంభంలో ఉన్న కేంద్ర జలభవ¯న్ను తొలగించ వద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పుష్కరాల సమయంలో బిగ్‌బాస్ ఆ ఉత్తర్వులను లెక్క చేయకుండా భవనాన్ని కూల్చివేశారు. అనంతరం కేంద్ర జలవనరుల శాఖకు ప్రత్యామ్నాయం చూపించలేదని అప్పటి ఇరిగేషన్ ఎస్ఈ, ఈఈలపై బిగ్‌బాస్ తోకతొక్కిన తాచులాగా చిందులు తొక్కడంతో ఇరిగేషన్ అధికారులు చిన్నబుచ్చుకున్నారు. ► వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించినప్పుడు వారు చిన్నచిన్న తప్పులు చేసినా యూజ్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో అంటూ తిట్టడం బిగ్‌బాస్‌కు సర్వసాధారణం. సమావేశానికి రాకపోయినా, కొద్దిగా ఆలస్యంగా వచ్చినా, ఆయన చెప్పినట్లు చేయకపోయినా వారిపై విరుచుకుపడతారు. -
సాంకేతికమక
చౌక దుకాణాల్లో ముందుకు సాగని నగదు రహిత రేషన్ పంపిణీ జిల్లాలో 3.94 లక్షల మంది రేష¯ŒS కార్డుదారులకు చేరని సరుకులు నాలుగు రోజులైనా 26 శాతానికి మించని వైనం తప్పని ప్రదక్షిణలు... కాకినాడ సిటీ : నగదు రహితంగానే చౌక దుకాణాల్లో రేష¯ŒS సరుకులు అందించాలనే ప్రభుత్వ, అధికారుల ఆదేశాలు కార్డుదారులను ముప్పు తిప్పలు పెట్టిస్తున్నాయి. నగదు రహితం లావాదేవీలంటూ విస్తృత ప్రచారం చేసి చౌక దుకాణాల్లో కార్డుదారుల నుంచి డిసెంబర్లో సొమ్ము తీసుకోకుండా సరుకులు ఇచ్చేశారు. రేష¯ŒS సరుకుల పంపిణీ ఆధార్ అనుసంధానంతో జరుగుతుండడంతో దానికి బ్యాంకుల డేటా అనుసంధానం చేయాల్సి ఉంది. దీంతో జనవరిలో నగదు రహిత సేవలు చౌక దుకాణాల్లో ముందుకు సాగలేదు. అయితే ఈ నెల ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు రహిత లావాదేవీలే జరపాలి, కార్డుదారుడు నుంచి సొమ్ము తీసుకుని సరుకు ఇవ్వడానికి లేదని డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ బ్యాంకు డేటా సీడింగ్ పరంగా నెలకొన్న సాంకేతిక సమస్యలు పరిష్కరించకపోవడంతో నెల ప్రారంభమై నాలుగు రోజులైనా రేష¯ŒS పంపిణీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఒక్కరోజు వంద మంది కార్డుదారులకు సరుకులు ఇచ్చే డీలర్ ఇప్పుడు రోజుకు 15 మందికి ఇవ్వడం గగనంగా మారింది. ఈ దశలో చౌక దుకాణాల వద్ద కార్డుదారులు పడిగాపులు పడుతూ, షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పలు చౌక దుకాణాల్లో సర్వర్ ఇబ్బందులు, ఇతర సాంకేతిక సమస్యలతో షాపులు మూసివేసి డీలర్లు మెషీన్లు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోపక్క కార్డుదారులు పదే పదే పనులు మానుకుని ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్ధితి జిల్లాలో నెలకొంది. సరుకులు పంపిణీ 26శాతం... జిల్లా వ్యాప్తంగా ఈ–పాస్ బయోమెట్రిక్ మిషన్లున్న 2,449 షాపుల పరిధిలో మూడు రోజులుగా 26 శాతం మాత్రమే సరుకులు పంపిణీ చేశారు. మొత్తం జిల్లాలో 16,08,711 కార్డులకుగాను ఏజెన్సీకి సంబంధించి సుమారు లక్ష కార్డులు తీసివేయగా మిగిలిన కార్డుల్లో శనివారం రాత్రి 7 గంటల వరకు తెలిసిన సమాచారం మేరకు కేవలం 3 లక్షల 94 వేల మంది కార్డుదారులకు సరుకులు పంపిణీ చేశారు. ఇందులో రెండు విధాలుగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. 2449 ఈ–పాస్ మిషన్లుండగా వీటిలో 480 ఎ¯ŒSలార్జిక్ కంపెనీ మెషీన్లున్నాయి. వీటికి బ్యాంకుల డేటా పూర్తిగా అనుసంధానం కాకపోవడంతో ఆ మిషన్లున్న చౌక దుకాణాల పరిధిలో కార్డుదారుల నుంచి సొమ్ము తీసుకుని సరుకులు ఇచ్చేస్తున్నారు. ఈ షాపుల్లోనే 3 లక్షల 16 వేల కార్డులకు రేష¯ŒS పంపిణీ చేశారు. ఇక మిగిలిన 1,969 మెషీన్లు విజ¯ŒSటెక్ కంపెనీవి . వీటిలో కేవలం నగదు రహితంగానే సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ షాపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులుతో కేవలం 77,766 కార్డులకు సరుకులు ఇవ్వగలిగారు. ప్రతి నెలా నాలుగు రోజుల్లో 7 లక్షల కార్డులకుపైగా సరుకులు పంపిణీ చేసేవారు. సమన్వయలోపం... ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు రహిత లావాదేవీలు అమలు జరపడంలో బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారుల మధ్య సమన్వయలోపం కనిపిస్తోంది. గడిచిన రెండు నెలలుగా నగదు రహితంపై ప్రచారం చేస్తున్న అధికారులు అసలు సమస్య పరిష్కరించకుండా కార్డుదారులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో కార్డుదారుల ఆధార్ బ్యాంకులో సీడింగ్ కాలేదని, అకౌంట్లో బ్యాలె¯Œ్స లేదని, అకౌంట్ ఇ¯ŒS ఆపరేట్‌లో ఉందనే అంశాలు ఎదురవుతున్నాయి. మరోపక్క పలు షాపుల కార్డుదారుల బ్యాంకు డేటా ఆయా షాపుల ఈ–పాస్ బయోమెట్రిక్ మెషీ¯ŒS అనుసంధానం కాకపోవడం వంటివి ఉన్నాయి. ఇవి గత రెండు నెలలుగా ఉన్నవే. వాటిని అధికారులు పరిష్కరించకుండా నగదు రహితంగానే సరుకులు ఇవ్వాలని డీలర్లను ఆదేశించడంపై సర్వత్రా కార్డుదారుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. -
అన్ని రేషన్ దుకాణాల్లో ఈ–పాస్
పౌరసరఫరాల శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ విధానాన్ని అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. దీనిపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు సత్ఫ లితాలు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైదరా బాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 1,545 రేషన్ దుకాణా ల్లో ఈ–పాస్ విధానంతో గతేడాది మార్చి నుంచి ఇప్పటి దాకా సుమారు రూ.130 కోట్లు ఆదా అయినట్లు శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణ యించారు. ఈ మేరకు ఈ–పాస్ యంత్రాల సరఫరా టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. గతంలో వినియోగిం చిన ఈ–పాస్ యంత్రాల్లో కేవలం వేలిముద్ర సౌకర్యం మాత్రమే ఉండగా... తాజాగా బహుళ ప్రయోజనకారిగా ఉండేందుకు ఐరిస్, ఈ–వేయింగ్ సౌకర్యం ఉండేలా తయారు చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ–పాస్ విధానంలో ప్రతి రాష్ట్రా నికి కొన్ని లక్ష్యాలు నిర్దే శించిందని.. నగదు రహిత లావాదేవీల కోసం ఈ చర్యలు తీసు కుందని చెబుతున్నారు. దీంతో ఆ దిశగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. నగదురహిత లావాదేవీల వైపు అన్ని శాఖలూ మళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల్లో భాగంగా కూడా రేషన్ దుకాణాలపై దృష్టి పెట్టారు. మినీ ఏటీఎంలుగా రేషన్ షాపులు! మారుమూల, బ్యాంకులు లేని గ్రామాల్లో సైతం రేషన్ షాపులున్నాయి.దీంతో భవిష్యత్తులో వీటినే మినీ ఏటీఎం లుగా చేయాలన్న ప్రణాళిక ఉందని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ముందు ముందు రేషన్ డీలర్లను ‘బిజినెస్ కరస్పాండెంట్లు’గా తయారు చేయడం ద్వారా మీ–సేవ కేంద్రాల్లో లభించే సేవలను అందించేలా ఈ–పాస్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. -
ఏపీలో నిలిచిన రేషన్ సరకుల పంపిణీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకులు, సంక్రాంతి కానుకల పంపిణీ నిలిచిపోయింది. ఈ-పాస్ యంత్రాలు సర్వర్లు నాలుగు రోజులుగా పనిచేయకపోవడంతో రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేయలేకపోయారు. కోటికిపైగా రేషన్ కార్డులకు సరుకులు అందలేదు. డబుల్ ఎంట్రీ విధానంలో సర్వర్లు మొరాయించాయి. సామర్థ్యం పెంచకుండా డబుల్ ఎంట్రీ విధానాన్ని తీసుకురావడంతో సమస్యలు తలెత్తాయి. నాలుగు రోజులుగా రేషన్ సరుకుల కోసం జనం అవస్థలు పడుతున్నారు. సర్వర్ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేషన్ డీలర్లు మొరపెట్టుకున్నారు. -
రేషన్ బియ్యం స్వచ్ఛందంగా వెనక్కు
కలెక్టర్‌కు అంగీకార పత్రాలను ఇచ్చిన 70 రైతు కుటుంబాలు సాక్షి, పెద్దపల్లి: ‘‘ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాయి.. మేము పండించిన బియ్యా న్ని మేమే తింటాం. ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఇస్తున్న బియ్యం సబ్సిడీ పక్కదారి పట్టకుండా మేమే ప్రభుత్వానికి అప్పగిస్తున్నాం’’ అంటూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊశన్నపల్లె గ్రామానికి చెందిన 70 మంది ముందుకు వచ్చారు. ఈ రైతు కుటుంబాలు రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ(ఐడీసీ) చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛందంగా జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చా రు. సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ అలగు వర్షిణికి ఈ మేరకు అంగీకార పత్రాలను అందజేశారు. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి స్వగ్రామం ఇది. పూర్తిగా రైతు గ్రామం కాగా, 571రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా 107 క్వింటాళ్ల బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా కిలోకు రూపాయి చొప్పు న పంపిణీ చేస్తున్నారు. ఈ యేడు వర్షాలు బాగా కురిశాయి, పంటలు సమృద్ధిగా పండాయి. రైతు కుటుంబాలన్నీ తాము పండించిన ధాన్యాన్నే బియ్యంగా తింటున్నా యి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యం పక్క దారి పట్టడంతోపాటు ప్రభుత్వంపై పడుతు న్న భారాన్ని శంకర్‌రెడ్డి రైతులకు వివరించారు. దీంతో 70 రైతు కుటుంబాలకు చెందిన 285 యూనిట్‌దారులు సబ్సిడీ బియ్యం అవసరం లేదని ముందుకు వచ్చారు. దీంతో గ్రామంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈద శంకర్‌రెడ్డి సమక్షంలో కలెక్టర్ వర్షిణికి బియ్యం వద్దని అంగీకార పత్రాలను అందజే శారు. రాష్ట్రంలోనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రైతు కుటుంబాలను చైర్మన్, కలెక్టర్ అభినందించారు. రాష్ట్రంలో సబ్సిడీ బియ్యం తీసుకోని కుటుంబాలన్నీ ఇలానే ముందుకు రావాలని, ప్రభుత్వంపై సబ్సిడీ భారాన్ని తగ్గించి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు నందించాలని పిలుపునిచ్చారు. గంగారం గ్రామంలో కూడా ఈ కార్యక్రమం మంగళ వారం కొనసాగనుంది. -
అవినీతి నిర్మూలన అందరి బాధ్యత
–అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కంకణబద్ధులు కావాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పిలుపునిచ్చారు. మానవ జీవితంలో పెనవేసుకున్న అవినీతి మహమ్మారిని కూకటివేళ్లతో నిర్మూలించకపోయినా పూర్తి స్థాయిలో నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రూపొందించిన చట్టాల పరిమితి నుంచే అవినీతి పుట్టుకొస్తుందని, చట్టాల పరిమితిని సడలిస్తే అవినీతి తగ్గే అవకాశం ఉందన్నారు. ఆధునాతన సంకేతిక పద్ధతులను అనుసరించడం ద్వారా అవినీతిని అంతమొందించవచ్చన్నారు. ఉదాహరణకు.. చౌకధరల దుకాణాల్లో ఈ–పాస్ యంత్రాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తుండటం వల్ల 2లక్షల కార్డుల రేషన్ ఆదా అవుతుందన్నారు. నగదు రహిత లవాదేవీల వల్ల కూడా అవినీతి తగ్గుతుందని వివరించారు. వివిధ ఉత్పత్తులపై విధించే అధిక పన్నుల వల్ల కూడా అవినీతి పెరుగుతోందని, పన్నులు తగ్గిస్తే అవినీతిని తగ్గించవచ్చన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలనపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు పాఠ్యాంశాల్లో అంశంగా చేర్చాలన్నారు. డెన్మార్క్‌లో అవినీతి తక్కువగాను, సోమాలియా, నార్త్ కొరియాల్లో ఎక్కువగా ఉందన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు ప్రతినబూనాలని వివరించారు. అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని.. విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలకు అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్బంగా అవినీతి నిర్మూలనకు జవాబుదారీతనంతో కృషి చేస్తామని అందరి చేత కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, హౌసింగ్ పీడీ హుసేన్‌సాహెబ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తూకంలో మోసం
- రేషన్ దుకాణాల్లో అధికారుల తనిఖీ - కిలో నుంచి రెండు కిలోల వరకు బియ్యం కాజేసీని డీలర్లు - ముగ్గురిపై కేసులు నమోదు కర్నూలు(అగ్రికల్చర్) : పౌరసరఫరాల, తూనికలు కొలతల శాఖల అధికారులు సోమవారం కర్నూలులోని వివిధ చౌక ధరల దుకాణాల్లో తూకాలను తనిఖీ చేశారు. దుర్గాంజలికి చెందిన 73వ షాపులో 1.035 కిలోలు, హనుమంతయ్యకు చెందిన 75వ షాపులో 1.015 కిలోలు, క్రాంతి కుమారికి చెందిన 84వ షాపులో 1.900 కిలోలు మోసం చేసినట్లు నిర్ధారన కావడంతో ముగ్గురు డీలర్లపై కేసులు నమోదు చేశారు. కాగా, చౌక దుకాణాల్లో తూకాలను తనిఖీలు చేస్తున్నారనే సమాచారం డీలర్లకు వెళ్లిపోవడంతో అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. 70, 71, 69, 67 షాపుల్లోనూ తనిఖీలు చేయగా తూకాలు సక్రమంగా ఉన్నట్లు తేలింది. తనిఖీల సమాచారం డీలర్లకు వెళ్లడంతో జాగ్రత్తపడడంతోనే తూకాలు సక్రమంగా ఉంచినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో ఏఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ మహ్మద్, సిబ్బంది జాఫర్ హుస్సేన్, ఖాజా హుస్సేన్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు తిరుమలరావు, సాయిబాబా పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీల్లో టాప్‌లో ఉండాలి
మచిలీపట్నం(చిలకలపూడి) : నగదు రహిత లావాదేవీల్లో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బాబు.ఎ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపుహాలులో సోమవారం మీకోసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలపై కౌన్సిల్ ఎష్యురెన్స్ కమిటీలను జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రెండు వేల లోపు జనాభా ఉన్న గ్రామాలు పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం రూ.10 వేలు, రెండు నుంచి ఐదు వేల జనాభా ఉండి పూర్తిస్థాయిలో నగదు రహితలావాదేవీలు నిర్వహిస్తే రూ.20 వేలు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. 5 నుంచి 10 వేలలోపు ఉన్న గ్రామాలు పూర్తిస్థాయిలో లావాదేవీలు నిర్వహిస్తే రూ.50 వేలు, 10 వేలు జనాభా దాటిన గ్రామాలు పూర్తిస్థాయిలో లక్ష రూపాయలు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఒక గ్రామాన్ని నగదు రహిత లావాదేవీల గ్రామంగా గురువారం నాటికి ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 41 వేల మంది వ్యాపారులకు ఈ పోస్ మిషన్లు అందజేసేందుకు 120 టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. నాలుగు రోజుల్లో రికార్డుస్థాయిలో రేషన్‌షాపుల ద్వారా 2.10 లక్షల నగదు రహిత లావాదేవీలను నిర్వహించినట్లు కలెక్టర్ చెప్పారు. సమావేశంలో సీపీవో కేవీకే రత్నబాబు, డీఎంహెచ్‌వో ఆర్.నాగమల్లేశ్వరి, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు, బీసీ సంక్షేమశాఖ డీడీ ఆర్ యుగంధర్, సాంఘిక సంక్షేమశాఖ జేడీ పీఎస్ఏ ప్రసాద్, డీసీవో ఆనందబాబు పాల్గొన్నారు. అర్జీలు ఇవే.. మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు, స్టాఫ్‌నర్సుల నిర్లక్ష్యంతో కుమార్తె కె.శివపార్వతి కొంత కాలం క్రితం చనిపోగా ఇంత వరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని, తగిన న్యాయం చేయాలని కోరుతూ మచిలీపట్నం బ్రహ్మపురానికి చెందిన అద్దంకి లక్ష్మణ అర్జీ ఇచ్చారు. గ్రంథాలయ పన్ను పంచాయతీలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. జిల్లాలోని 33 సీపీడబ్ల్యూఎస్ స్కీంల నిర్వాహకులకు జీతం బకాయిలు చెల్లించాలని కె.భూపతిరెడ్డి అర్జీ ఇచ్చారు. మచిలీపట్నంలోని అమృతపురం, ముస్తాఖాన్‌పేట, నారాయణపురం తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరుతూ వై.వెంకటేశ్వరరావు అర్జీ ఇచ్చారు. -
సరుకులు పక్కదారి పట్టకుండా జీపీఎస్ అమలు: ఆనంద్
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల సరుకులు పక్కదారి పట్టకుండా పౌర సరఫరాల శాఖ కట్టుదిట్టమైన చర్యలకు కసరత్తు చేస్తోంది. రవాణా కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేసింది. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లు, అక్కడ్నుంచి రేషన్ షాపులకు సరుకులు తరలించే వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం సరుకు రవాణా కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. రోజూ ఎక్కడో ఒకచోట రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, వాటిని అరికట్టడానికి ఇకపై సరుకు రవాణా సక్రమంగా జరిగేలా జీపీఎస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామని చెప్పారు. ఇప్పటికే రైస్‌మిల్లర్లు, రేషన్, కిరోసిన్ డీలర్లు, అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించామని, రవాణా చేసే వారి ప్రమేయం లేకుండా బియ్యం పక్కదారి పట్టే అవకాశం లేదని తేలిందని స్పష్టం చేశారు. సరుకు రవాణా పూర్తరుునప్పటికీ వాహనాలను అధికారుల అనుమతి లేకుండా జిల్లా పరిధి దాటకూడదని సూచించారు. జీపీఎస్‌తో కాంట్రాక్టర్ల తప్పులన్నీ రికార్డు అవుతున్నాయని, ప్రతి వాహనానికి శాశ్వతంగా ఒకే సెల్‌ఫోన్ నంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని, తమ వాహనాలు ఎక్కడ ఉన్నాయో కాంట్రాక్టర్లు తెలుసుకునేలా ప్రత్యేక ఐడీ, పాస్వర్డ్ ఇవ్వనున్నామని కమిషనర్ తెలిపారు. ఇకపై కాంట్రాక్టర్ల లావాదేవీలన్నింటినీ ఆన్లైన్లోనే చేస్తామని స్పష్టం చేశారు. తమ కాంట్రాక్ట్ గడువును గతంలో మాదిరిగా రెండేళ్లకు పెంచాలని కాంట్రాక్టర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తానని కమిషనర్ అన్నారు.