- కొత్తగా 293 ఏర్పాటుకు ఆమోదం
- మండలాల వారీగా జారీకానున్న నోటిఫికేషన్
రేషన్‌షాపుల విభజన పూర్తి
Published Thu, Sep 15 2016 9:54 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
కాకినాడ సిటీ :
జిల్లాలో రేషన్‌షాపుల విభజన ప్రక్రియను రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు పూర్తిచేశారు. 64 మండలాల్లో ప్రస్తుతం 2,647 రేషన్‌షాపులు ఉండగా వీటి పరిధిలో 15,29,883 రేషన్‌కార్డులు ఉన్నాయి. అనేక మండలాలలోని పలు షాపులను పరిశీలిస్తే ఒక్కోషాపు పరిధిలో అత్యధికంగా 1200 కార్డుల వరకు ఉన్నాయి. దీంతో కార్డుదారుల సౌకర్యార్థం ఎక్కువ కార్డులు ఉన్న షాపుల విభజనకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో షాపునకు 400 కార్డుల నుంచి 450, పట్టణ ప్రాంతాల్లో 500 నుంచి 550 నగరాల్లో 600 నుంచి 650 కార్డులు ఉండేలా షాపుల విభజన ప్రక్రియను చేపట్టారు. దీని ప్రకారం క్షేత్రస్థాయి నుంచి జిల్లావ్యాప్తంగా 44 మండలాల్లో 293 కొత్త రేషన్‌షాపుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రాగా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆమోదముద్ర వేశారు. దీంతో జిల్లాలో రేషన్‌షాపుల సంఖ్య 2,940కు పెరగనుంది. డీలర్లు లేక ఖాళీగా ఉండి ఇన్‌చార్జిల పర్యవేక్షణలో ఉన్న 160 షాపులతో పాటు కొత్తగా ఆమోదముద్ర వేసిన 293 షాపులకు డీలర్ల భర్తీకి మండలాలవారీగా నోటిఫికేషన్‌జారీకి ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఆ ప్రకారం డివిజన్లవారీగా నోటిఫికేషన్ల జారీకి అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్తగా పెరగనున్న షాపుల సంఖ్య మండలాలవారీగా..... అమలాపురంలో 2, బిక్కవోలు 8, పెదపూడి 9, రంగంపేట 8, గండేపల్లి 6, గోకవరం 3, జగ్గంపేట 17, కిర్లంపూడి 7, కాకినాడ సిటీ 13, కాకినాడ రూరల్ 34, కరప 4, కొత్తపేట 2, ఆత్రేయపురం 4, ఆలమూరు 4, రావులపాలెం 7, కపిలేశ్వరపురం 10, మండపేట 21, రాయవరం 8, ఐ.పోలవరం 2, కాట్రేనికోన 5, ముమ్మిడివరం 1, తాళ్లరేవు 2, పెద్దాపురం 22, సామర్లకోట 11, పిఠాపురం 11, గొల్లప్రోలు 10, యు.కొత్తపల్లి 5, ప్రత్తిపాడు 4, ఏలేశ్వరం 5, రాజమహేంద్రవరం రూరల్ 2, కడియం 1, రాజానగరం 4, కోరుకొండ 2, సీతానగరం 1, కాజులూరు 5, కె.గంగవరం 5, రామచంద్రపురం 11, మలికిపురం 1, మామిడికుదురు 2, రాజోలు 3, సఖినేటిపల్లి 1, కోటనందూరు 2, తొండంగి 1, తుని 7
Advertisement
Advertisement